Call Money
-
బెజవాడ సెంట్రల్లో కాల్కేయుడు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: టీడీపీ ప్రభుత్వ హయాంలో బెజవాడలో బొండా ఉమామహేశ్వరరావు ఆయన అనుచరుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. భూకబ్జాలు, దౌర్జన్యాలు, కాల్‌మనీ, సెక్స్ రాకెట్.. ఆయన చేయని దందా లేదు. ఫలితంగా 2019 ఎన్నికల్లో ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. ఇప్పుడు మళ్లీ ఓటర్లను మభ్యపెట్టి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అరాచకాలను సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ► 2014–19 మధ్య బెజవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమా ఏకంగా ఓ అవినీతి సామ్రాజ్యాన్నే నిర్మించారు. నియోజకవర్గం మొత్తాన్ని కనుసైగతో శాసించారు. భూకబ్జాలు, దందాలు, దౌర్జన్యాలతో పేట్రేగిపోయారు. అధికార యంత్రాంగం కూడా ఆయన అవినీతి దందాకు వంతపాడింది. నియోజకవర్గ వ్యాప్తంగా రూ.వందల కోట్లు విలువైన భూమిని బొండా కబ్జా చేశారు. సెటిల్మెంట్లతోపాటు ప్రభుత్వంలో జరగాల్సిన పనులకు కూడా కప్పం వసూలు చేశారు. ప్రజల నుంచి రూ.వందల కోట్లు కొల్లగొట్టారు. ► కాల్‌మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారాల్లో బొండాపై అనేక ఆరోపణలు వచ్చాయి. కాల్‌మనీ కింగ్‌గా ఉమా పేరొందారు. ఎందరో బాధితులు బొండా కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడారు. ► సత్యనారాయణపురంలోని భువనేశ్వరి పీఠానికి చెందిన సీతారామ కల్యాణ మండప కబ్జాకు బొండా వర్గీయులు యతి్నంచారు. ► న్యూ రాజరాజేశ్వరిపేటలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించి బొండా భంగపడ్డారు. ► రామకృష్ణాపురం బుడమేరులో బొండా ఉమా అనుచరులు, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు కలిసి వెంచర్ వేసి విక్రయించారు. స్థానిక టీడీపీ నేతలు కూడా బుడమేరు లోపలకు ఇళ్లు నిర్మించి విక్రయించారు. ► ముత్యాలంపాడులో ఇరిగేషన్ స్థలాన్ని టీడీపీ నేత కుమారుడి వ్యాయామశాలకు ధారాదత్తం చేశారు. ► అప్పటి 44వ డివిజన్ కార్పొరేటర్ రైల్వే, ప్రభుత్వ స్థలాలనూ విక్రయించారు. ► విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన రూ.30 కోట్లు భూదందాలో కూడా మాగంటి బాబు కీలక పాత్రధారి. ఈ వ్యవహారాన్ని అక్కడి ప్రజలు ఇప్పటికీ మరచిపోలేదు. ► కండ్రిక కాలనీలో జర్నలిస్టుల ఇళ్ల పేరిట ఎమ్మెల్యే అతని అనుచరులు కార్పొరేషన్‌కు చెందిన 1,720 గజాల స్థలాన్ని ఆక్రమించి, నిర్మాణాలు చేసేందుకు ప్రయతి్నంచారు. స్థానికుల ఆందోళనతో వెనక్కి తగ్గారు. ► పాయకాపురం బర్మాకాలనీ ప్రాంతంలో మూడు ఎకరాల వరకూ ఉన్న కాలనీ కామన్ సైట్‌ను తన అనుచరులతో ఆక్రమించి, వాటి కి ఇంటి పట్టాలను సృష్టించేందుకు తెగబడ్డారు. స్థానికులు అడ్డం తిరగడంతో తోకముడిచారు. గీతాంజలి కేసులో బొండా అనుచరుడి అరెస్ట్ ఇటీవల తెనాలికి చెందిన వివాహిత గీతాంజలి ఆత్మహత్య కేసులో బొండా అనుచరుడు పసుమర్తి రాంబాబు అరెస్టయ్యాడు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను ప్రశంసించిన గీతాంజలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాంబాబు ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ కామెంట్లు పెట్టాడు. అతడితో పాటు టీడీపీ కార్యకర్తల అనుచిత వ్యాఖ్యలకు మనస్తాపానికి గురైన గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొడుకులదీ అదే తీరు బొండా కుమారులు ఇద్దరూ దౌర్జన్యాలు చేయడంలో ఘనులే. బొండా కుమారుడు నిర్వహించిన కారు రేస్‌లో మనోరమ హోటల్లో పనిచేసే మేనేజర్ కుమారుడు మరణించాడు. అప్పట్లో ఈ విషయం సంచలనం సృష్టించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుక్క అడ్డురావడంతో కారు ప్రమాదం జరిగిందని కేసును తప్పుదారి పట్టించారు. తెనాలికి చెందిన రౌడీషిటర్ సుబ్బుతో బొండాకు సత్సంబంధాలున్నాయి. సుబ్బు హైదరాబాద్‌లో తుపాకీ కొనుగోలు చేస్తూ పట్టుబడి బొండా, మరికొందరి టీడీపీ నేతల పేర్లు బయటపెట్టాడు. ఆ తర్వాత విజయవాడలోని మాచవరంలో పట్టపగలే సుబ్బు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అధికార పార్టీ నేతల పేర్లు బయటకు రాకుండా పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు కేసును తారుమారు చేశారు. దుర్గాపురంలోని ఓ అపార్ట్మెంటులో క్యాన్సర్ బాధితురాలు మాదంశెట్టి సాయిశ్రీకి చెందిన ఫ్లాట్‌ను బొండా అనుచరులు కబ్జాకు యత్నించారు. ఆమె తన వైద్యం కోసం ఆ ఫ్లాట్ విక్రయానికి యత్నించగా జాలి లేకుండా బొండా అడ్డుకున్నారు. చివరకు వైద్యం అందక సాయిశ్రీ మరణించారు. బొండా ఉమాకు మాగంటి బాబు అత్యంత సన్నిహితుడు. అప్పట్లో స్వాతంత్య్ర సమరయోధుడి భూమిని తప్పుడు పత్రాలతో రిజి ్రస్టేషన్ చేసుకున్న వారిలో బొండా ఉమా భార్య సుజాతతోపాటు మాగంటి బాబు కూడా ఉన్నారు. బొండా ఉమా అక్రమ దందాలన్నింటిలో మాగంటి బాబు కీలకంగా వ్యవహరించారనేది బహిరంగ రహస్యం. అకృత్యాలెన్నున్నా కేసులు మూడే.. బొండా ఉమా మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. 2011 మార్చి1న సెక్షన్ 9, 9ఏఏ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం బొండాపై కేసు నమోదైంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్ఐఆర్ నంబర్ 462/2006పై సెక్షన్ 143 కేసు ఉంది. విజయవాడ 2వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సెక్షన్ 143 కింద కేసు ఉన్నట్టు బొండా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
అప్పు చెల్లించలేకపోవడంతో ఇంటిని ఖాళీ చేయించిన వ్యాపారి
-
కాల్‌మనీ: కీలక నిందితుడి లీలలెన్నో..
సాక్షి, అమరావతి బ్యూరో: కాల్‌మనీ పాపాల పుట్ట బద్ధలవుతోంది. తవ్వేకొద్దీ అనేక అక్రమాలూ బయటపడుతున్నా యి. అధిక వడ్డీలకు రుణాలు ఇవ్వడమే కాకుండా.. తీసు కున్న అప్పు చెల్లించిన తర్వాత కూడా బాకీ ఉన్నారంటూ వీఎంసీ విశ్రాంత, ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తోన్న ఉదంతాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫోర్జరీ సంతకాలు, ప్రామిసరీ నోట్లతో ఇతరుల పేరిట దావాలు వేసి మరీ డబ్బులు వసూలు చేస్తున్న ముఠా సభ్యుల ఆగడాలకు పోలీసులు బ్రేక్ వేశారు. బాధితుల నుంచి వివరాలు సేకరించి కాల్‌మనీ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా కాల్‌మనీ వ్యాపారులు ఇతరుల పేరిట కోర్టులో దావాలు వేసిన వైనంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. కోర్టులో దాఖలైన ప్రామిసరీ నోట్లను ఎవరు ఇచ్చారు? వారికి బాధితులకు ఉన్న సంబంధం ఏమిటి? అన్న వివరాలపై కూపీ లాగనున్నారు. విజయవాడ నగర పాలక సంస్థ (వీఎంసీ) ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తోన్న కాల్‌మనీ ముఠా సభ్యుల ఆగడాలపై నగర పోలీసు కమిషనర్ దృష్టి సారించారు. రంగంలోకి దిగిన నగర పోలీసులు కాల్‌మనీ ముఠా సభ్యులైన పాపారావు, శీరం వెంకటేశ్వరావు(పెదబాబు)లను అదుపులోకి తీసుకు ని విచారిస్తున్నారు. అదే సమయంలో బాధితుల నుంచి వాగ్మూలం సేకరించారు. తమ సంతకాలు ఫోర్జరీ చేసి.. అప్పు ఉన్నట్లు కోర్టుల్లో దావాలు వేశారని బాధితులు పోలీసుల వద్ద వాపోయినట్లు సమాచారం. దీంతో అప్పు చెల్లించినా మళ్లీ డబ్బులు బాకీ ఉన్నారంటూ కోర్టు నుంచి దావాలు వేసిన వారిని పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. కాల్‌మనీ వ్యాపారి పాపారావు, కోర్టులో దావా వేసిన వారు చెబుతున్న అంశాల్లో పొంతన లేదని సమాచారం. అమాయకుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు రాబట్టే యత్నంలోనే ఈ కుట్రకు కాల్‌మనీ వ్యాపారులు తెరలేపారని పోలీసులు భావిస్తున్నారు. కోర్టు సెలవులు ముగియగానే ప్రామిసరీ నోట్ల వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని ఓ పోలీసు ఉన్నతాధికారి చెబుతున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు బేరాలు? వీఎంసీ విశ్రాంత ఉద్యోగులను వేధింపులకు గురిచేయడమే కాకుండా.. వారి అకౌంట్లను అక్రమంగా సీజ్ చేయించిన కాల్‌మనీ వ్యాపారి పాపారావు గత ఏడేళ్లలోనే కోట్లకు పడగలెత్తినట్లు తెలుస్తోంది. ఇదే కాల్‌మనీ వ్యాపార నేరం కింద గతంలో ఇతనిపై పోలీసులు 8 కేసులు నమోదు చేశారు. అప్పట్లో కొంత కాలం వ్యాపారాలు మానేసినట్లు నటించిన పాపారావు ఆ తర్వాత మళ్లీ పాతబాటే పట్టారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అప్పట్లో రాజధానిపై పలు ఊహాగానాలు వెల్లడైన సమయంలో ఇతను నూజివీడు, అమరావతి పరిధిలో సుమారు 50 ఎకరాల వరకు భూములు కొనుగోలు చేసినట్లు సమాచారం.అలాగే వడ్లమానులో 3.5 ఎకరాలను ల్యాండ్‌పూలింగ్‌లో తీసుకోగా.. అందుకు గాను వారికి 3,500 గజాల స్థలం రాగా.. అందులో 500 గజాల స్థలాన్ని ఇస్తానంటూ ఓ పోలీసు అధికారితో బేరసారాలు అడుతున్నట్లు సన్నిహితులు పేర్కొనడం చర్చనీయాంశమైంది. డాక్యుమెంట్లపై విచారణ చేస్తున్నాం.. కాల్‌మనీ ముఠా ఆగడాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాం. ఇప్పటికే బాధితుల నుంచి వివరాలు సేకరించాం. బాధితుల ప్రమేయం లేకుండా వారి సంతకాలను ఫోర్జరీ చేసి కోర్టులో దాఖలు చేసిన డాక్యుమెంట్లపై విచారణ చేస్తున్నాం. అప్పు ఇచ్చిన వారు కాకుండా ఇతరులు ఎలా కోర్టులను ఆశ్రయించారనే దానిపైనా దర్యాప్తు చేస్తున్నాం. –విక్రాంత్ పాటిల్, డీసీపీ–2, విజయవాడ నగరం -
కాల్‌మనీ వాళ్ల జోలికి వస్తే పీక కోస్తా!
సాక్షి, తాడేపల్లిరూరల్ (మంగళగిరి): టీడీపీ నాయకుడు మీడియా ముసుగులో ‘కాల్‌మనీ గురించి విచారణ చేస్తే పీక కోస్తా’ అంటూ ఓ విలేకరిని బెదిరించాడు. దీనిపై బాధిత విలేకరి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశాడు. వివరాలు... ఉండవల్లిలో అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం చెయ్యడం, నూటికి వారానికి పది నుంచి పదిహేను రూపాయల వసూలు చేస్తున్నారని సమాచారం రావడంతో ఓ టీవీ చానల్ విలేకరి సాయి సందీప్ వివరాలు సేకరించేందుకు ప్రయత్నించాడు. దీంతో టీడీపీ ఉండవల్లి అధ్యక్షుడు గాదె శ్రీనివాసరావు చెప్పడానికి వీల్లేని విధంగా ఫోన్‌చేసి బూతులు తిట్టాడు. ‘కాల్‌మనీ వ్యాపారం చేస్తాను. చేసేవాళ్లకు కూడా అండగా ఉంటాను. అయితే ఏంటి? నువ్వు జోక్యం చేసుకుంటే అర్ధరూపాయి బ్లేడ్‌తో పీకకోస్తా ’ అంటూ బెదిరించడంతో బాధితుడు సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో కేసులో కాల్‌మనీ వ్యాపారుల అరెస్టు తాడేపల్లి పట్టణ పరిధిలో, విజయవాడలో కాల్‌మనీ వ్యాపారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలతో పాటు మరో ఇద్దరిని తాడేపల్లి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. నులకపేటకు చెందిన అర్చకుడు కృష్ణతేజ విజయవాడ ఒన్‌టౌన్‌కు చెందిన అన్నదమ్ములు దుక్కా వేణు, దుక్కా శ్రీను వద్ద రూ.2 లక్షలకు చిట్టీ వేసి ముందుగానే పాడుకున్నాడు. డబ్బులు చెల్లించకపోవడంతో అన్నదమ్ములు ఇద్దరూ రూ.5లక్షలు చెల్లించాలని కృష్ణతేజపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఖాళీచెక్కులు, ప్రామిసరీ నోటులు తీసుకున్నారు. వారి బాకీ తీర్చేందుకు నులకపేటకు చెందిన ఝాన్సీ దగ్గర కృష్ణతేజ రూ.75 వేలు, విజయవాడ ఒన్‌టౌన్‌కు చెందిన లక్ష్మి వద్ద కూడా అప్పుచేశారు. ఝాన్సీ, లక్ష్మి కూడా కృష్ణతేజ వద్ద ఖాళీ ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్‌లు తీసుకుని చెరో రూ.5 లక్షలు చెల్లించాలని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించి నలుగురు వడ్డీ వ్యాపారుల నుంచి ఆరు ఖాళీ ప్రామిసరీ నోట్లు, మరో నాలుగు ఖాళీ చెక్కులను పోలీసులు స్వాధీనం చేసుకుని, వారిని కోర్టుకు హాజరు పరిచినట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు. (చదవండి: పేద మహిళలను లక్షాధికారులను చేశారు) -
భర్త అప్పును భార్య చెల్లించినా..
సాక్షి, అమరావతిబ్యూరో/పటమట: విజయవాడ కొత్తపేట జోడు బొమ్మల సెంటర్‌కు చెందిన బవిడిశెట్టి రాము వీఎంసీలో ఓ చిరు ఉద్యోగి. పెదబాబు అనే వడ్డీ వ్యాపారి దగ్గర రూ. 50 వేలు అప్పు తీసుకున్నాడు. సకాలంలో చెల్లించకపోవడంతో పెదబాబు కోర్టు ద్వారా అతని పింఛన్ నుంచి నెలనెలా కొంత సొమ్ము జమ చేసుకుంటున్నాడు. అదే సమయంలో రాము వన్‌టౌన్‌కు చెందిన రాంప్లి పాపారావు వద్ద కూడా రూ.2 లక్షలు అప్పు తీసుకుని చెల్లించేశాడు. అయితే అతను పాపారావుకు ఇచ్చిన ప్రామిసరీ నోట్లు వెనక్కు తీసుకోలేదు. ఇప్పుడా ప్రామిసరీ నోట్ల ఆధారంగా పాపారావు కోర్టుకు వెళ్లి రూ.7 లక్షలకు దావా వేశాడు. పాపారావు వేధింపులు భరించలేక బవిడిశెట్టి రాము ఇటీవల మృతి చెందాడు. అయినా అప్పు చెల్లించాలంటూ అతని కుటుంబ సభ్యులను కాల్‌మనీ గ్యాంగ్ వేధిస్తోంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ)లో శానిటరీ విభాగంలో పనిచేస్తున్న సుమారు 450 మంది చిరు ఉద్యోగులు అప్పుల ఊబిలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. కాల్‌మనీ వ్యాపారులు రాబందుల్లా మారి ఉద్యోగులను పీక్కుతింటున్నారు. అవసరాల నిమిత్తం కాల్‌మనీ వ్యాపారుల వద్ద రూ.వేలల్లో అప్పు తీసుకున్న పాపానికి రూ.లక్షల్లో డబ్బులు చెల్లించినప్పటికీ వారి అప్పు తీరడం లేదు. పైగా రూ.లక్షల్లో అప్పు ఉన్నాడంటూ లీగల్ నోటీసులు రావడం.. పింఛన్లు, రిటైర్ బెనిఫిట్లు అటాచ్‌మెంట్‌కు గురవతుండటంతో వీఎంసీ ఉద్యోగుల్లో దిక్కుతోచని స్థితి నెలకొంది. మరికొందరు ఉద్యోగులకైతే ముక్కు మొహం తెలియని వారి నుంచి లీగల్ నోటీసులు రావడం గమనార్హం. కాల్‌మనీ వ్యాపారులు తెరవెనుక ఉండి ఇతరుల పేరిట లీగల్ నోటీసులు పంపుతూ వసూళ్లకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగమంతా వీఎంసీ అడ్డాగా జరుగుతోన్న ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇటీవల మరణించిన శానిటరీ ఇన్స్పెక్టర్ ముక్కంటి కూడా కాల్‌మనీ వ్యాపారుల వేధింపులకు గురైనట్లు సమాచారం. వీఎంసీలో కీలక స్థానంలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఓ ఉద్యోగి కాల్‌మనీ వ్యాపారులు కలిసి ఈ దందాను కొనేళ్లుగా సాగిస్తున్నట్లు సమాచారం. అతనికి చెందిన రూ.20 లక్షలకు పైగా డబ్బును కాల్‌మనీ వ్యాపారులు వడ్డీకి తిప్పుతున్నట్లు వీఎంసీ ఉద్యోగులు చెబుతున్నారు. ఉద్యోగులెవరైనా తీసుకున్న అప్పు చెల్లించకపోతే వారికి బ్యాంకు ద్వారా రుణం ఇప్పించే పనిని సైతం అప్పట్లో ఆ ఉద్యోగి చేసేవాడని.. ఇందుకు అకౌంట్స్ విభాగంలోని కొందరు సహకారం ఉన్నట్లు తెలుస్తోంది. భర్త అప్పును భార్య చెల్లించినా.. బండి చిన్న నూకమ్మ వీఎంసీలో శానిటరీ విభాగంలో పనిచేస్తూ ఈ ఏడాది జూన్‌లో రిటైరైంది. ఈమె భర్త వడ్డాది నాగరాజు ఆర్టీసీలో పనిచేస్తూ 2017లో చనిపోయాడు. ఇతను రాంపల్లి పాపారావు వద్ద రూ.2 లక్షలు అప్పు తీసుకున్నాడు. భర్త చెల్లించాల్సిన అప్పునకు గానూ పాపారావుకు నూకమ్మ ప్రామిసరీ నోటు రాసి ఇచ్చింది. ఆ తర్వాత వడ్డీతో సహా అప్పు చెల్లించేసింది. ఆ సమయంలో పాపారావు నుంచి తాను రాసిచ్చిన ప్రామిసరీ నోటు తీసుకోవడం మరిచింది. ఇప్పుడదే ఆమెకు శాపంగా మారింది. ఇటీవల ఆమెకు కోర్టు నుంచి రెండు లీగల్ నోటీసులు వచ్చాయి. అందులో ఒకటి రూ.7 లక్షలు చెల్లించాలంటూ మంగళగిరికి చెందిన పలతోటి మరియరాజు నుంచి కాగా.. మరొకటి గుణదలకు చెందిన జాదు రాజేశ్వరి అనే మహిళ నుంచి రూ.లక్షలు అప్పు చెల్లించాలని ఉంది. దీంతో ఆమెకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, పింఛను నిలిచిపోయింది. కాల్‌మనీ వ్యాపారుల వేధింపుల కారణంగా ఆమె అనారోగ్యంతో మంచం పట్టింది. మందులకు కూడా బ్యాంకు నుంచి డబ్బు తీసుకోలేని దుస్థితిలో ఉంది. -
ఆన్లైన్ కాల్‌మనీపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఆన్లైన్ కాల్ మనీ వ్యవహారాలపై పోలీస్‌శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. యాప్‌ల ద్వారా అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చిన వారిపై ఉక్కుపాదం మోపాలని జిల్లా ఎస్పీలకు, సీఐడీ, సైబర్ క్రైమ్ విభాగానికి డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. కాల్ మనీ వేధింపులకు పాల్పడితే ఉపేక్షించమని డీజీపీ హెచ్చరించారు. ఆన్లైన్ కాల్‌మనీ బాధితులకు పోలీస్‌శాఖ అండగా ఉంటుందని పేర్కొన్నారు. చట్టబద్ధత లేని యాప్‌ల ద్వారా రుణాలు స్వీకరించొద్దని సూచించారు. వేధింపులకు పాల్పడే యాప్‌లపై డయల్ 100, 112లకు ఫిర్యాదు చేయాలని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. -
వారిని ఉపేక్షించేది లేదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆన్లైన్ కాల్ మనీ వ్యవహారాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఆన్లైన్ కాల్ మనీ వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కాల్ మనీ వ్యవహారాలను ఉపేక్షించేది లేదని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. (చదవండి: ‘పల్లెల్లోకి వైద్యులు.. సరికొత్త వ్యవస్థ’) ఏపీవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు:డీజీపీ మొబైల్ లోన్ యాప్‌లపై ఏపీ వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు చేపడుతున్నట్లు డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. మైక్రో ఫైనాన్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. మొబైల్ లోన్ యాప్‌లు మహిళల్నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయని వెల్లడించారు. మొబైల్ లోన్ యాప్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు.(చదవండి: లోన్‌యాప్స్ కేసులో ఆసక్తికర విషయాలు) -
పండూ.. వాడు పోలీసుల్ని కూడా కొనేశాడు..
సాక్షి తాడేపల్లి : కాల్‌మనీ వేధింపులు తట్టుకోలేక బకింగ్‌హామ్‌కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న వేములపూడి ప్రేమ్ కుమార్ (30) మృతదేహం మంగళవారం తెనాలి మండలం కొలకలూరు రైల్వే బ్రిడ్జి వద్ద లభించింది. విజయవాడ పటమటలో నివసించే ప్రేమ్ కుమార్ గుంటూరు జిల్లా సీతానగరం సమీపంలోని కొండవీటివాగు హెడ్‌స్లూయిస్ వద్ద డిసెంబర్ 28న బకింగ్‌హామ్ కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆచూకీ కోసం గాలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మంగళవారం కొలకలూరు రైల్వే బ్రిడ్జి సమీపంలోని ముళ్ల పొదల్లో మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. అనంతరం తాడేపల్లి తహసీల్దార్ శ్రీనివాసులురెడ్డికి సమాచారం ఇవ్వడంతో ఆయన విజయవాడలోని ప్రేమ్‌కుమార్ భార్య దిశిదాకృష్ణ, బంధువులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పటమట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ తరలించారు. వడ్డీ వ్యాపారి బతకనివ్వట్లేదు! ‘పండూ.. వాడు పోలీసుల్ని కూడా కొనేశాడు. మనకిక న్యాయం జరగదు. బతకాలని ఉన్నా.. బతకనివ్వట్లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. నన్ను క్షమించు..’ అంటూ ఓ యువకుడు తన భార్యకు సెల్ఫీ వీడియో పంపించి బకింగ్‌హామ్ కెనాల్లో దూకిన ఘటన విజయవాడలో కలకలం రేపిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని పటమటకు చెందిన ప్రేమ్‌కుమార్, అతని సోదరి జ్యోతి కలిసి ఇద్దరి ఇళ్లను అదే ప్రాంతానికి చెందిన కాసుల వెంకట రంగారావు అనే వడ్డీ వ్యాపారి వద్ద తనఖా పెట్టి 2017వ సంవత్సరంలో రూ.6 లక్షలు అప్పుగా తీసుకున్నారు. మొదట్లో రూ.3 వడ్డీ అని చెప్పిన రంగారావు.. ఆ తర్వాత వడ్డీ రేటును రూ.10కి పెంచాడు. చదవండి: ప్రాణం తీసిన కాల్‌మనీ వ్యవహారం ప్రేమ్ కుమార్, జ్యోతి వడ్డీ మొత్తంతోపాటు అసలు మొత్తంలో రూ.5 లక్షలు చెల్లించేశారు. చివరకు రూ.లక్ష అప్పు ఉండగా.. దానిని కూడా త్వరలో చెల్లిస్తామని, ఈలోపు తమ ఇళ్లకు సంబంధించిన పత్రాలు తిరిగివ్వాలని రంగారావును కోరగా.. ఇంకా రూ.16 లక్షలు బకాయి ఉన్నారని, ఆ మొత్తం చెల్లిస్తేనే పత్రాలిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇదే విషయాన్ని ప్రేమ్‌కుమార్ ఈ నెల 16న స్పందన కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. స్పందించిన సీపీ ద్వారకా తిరుమలరావు ఆ ఫిర్యాదు పరిష్కరించాలని పటమట పోలీసులకు ఆదేశాలిచ్చారు. ఫలితం లేకపోవడంతో ప్రేమ్‌కుమార్ 23వ తేదీన మరోసారి స్పందనలో సీపీకి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత వడ్డీ వ్యాపారి ప్రేమ్‌కుమార్‌పై కిరాయి గుండాలతో దాడి చేయించాడు. ఈ విషయాన్ని కూడా స్థానిక పోలీసులకు చెప్పినా పట్టించుకోవట్లేదని ప్రేమ్‌కుమార్ కుటుంబ సభ్యులతో చెప్పాడు. ఇక ఎక్కడికి వెళ్లినా తనకు న్యాయం జరగదని ఆవేదన చెందిన అతడు ఈనెల 28న సాయంత్రం తన భార్యకు సెల్ఫీ వీడియో పంపించి బకింగ్‌హామ్ కెనాల్లో దూకేశాడు. చదవండి: కాల్‌మనీ.. ఇదో దారుణ కహానీ! -
కాల్‌మనీ.. ఇదో దారుణ కహానీ!
టీడీపీ పెద్దల పేరు చెప్పి కృష్ణాజిల్లాలో ఓ బడా వడ్డీ వ్యాపారి అరాచకం (సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ‘‘అసలు ఏమనుకుంటున్నావ్ మా గురించి.. మా వెనకాల ఎవరెవరు ఉన్నారో, మా పరపతి ఏంటో తెలుసుగా.. వాళ్లతో ఉన్న ఫొటోలు పంపాను.. చూశావుగా? ఇంతకూ ఆ డబ్బులు ఎవరివో నీకు అర్థమవుతోందా.. పెద్దవాళ్లకు ఒక్కసారి చెబితే మీ కుటుంబమంతా మటాష్ అయిపోతుంది.. మీ ఇంట్లోని ఆడవాళ్లు కటకటాల వెనకుంటారు. పిల్లల భవిష్యత్తు నాశనమవుతుంది. అందుకే నోర్మూసుకుని చెప్పింది చేయ్.. అడిగింది ఇచ్చేయ్’’.. .. ఇది బరితెగించిన ఓ బడా ‘కాల్’నాగు బాగోతం. ‘పచ్చ’కావరంతో పెచ్చుమీరిన దౌర్జన్యానికి పరాకాష్ట ఇది. అధికారం అండతో.. పెద్ద మనుషుల ముసుగులో జలగలా పీక్కుతింటున్న అప్పులోడి అరాచకం ఇది. ఇలా.. హద్దులు మీరి కొనసాగుతున్న హెచ్చరికలకు బెంబేలెత్తిపోయిన విజయవాడకు చెందిన ఓ రియల్టర్ తమ కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించాలని ఇటీవల ‘స్పందన’లో వేడుకున్నారు. ఈ దారుణమైన కాల్‌మనీ కహానీ వివరాలు ఏంటంటే.. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన వడ్డీ వ్యాపారి వర్లేపల్లి సీతారామమోహనరావు నుంచి భవన నిర్మాణం నిమిత్తం విజయవాడకు చెందిన రియల్టరు యార్లగడ్డ రవికిరణ్ కుటుంబం రూ.1.25 కోట్లను 2010 ఏప్రిల్‌లో అప్పుగా తీసుకుంది. చదవండి: ప్రాణం తీసిన కాల్‌మనీ వ్యవహారం ఇందుకుగాను సెక్యూరిటీ కింద కోల్‌కత–చెన్నై జాతీయ రహదారి–16ని ఆనుకుని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామ పరిధిలోని 81/2, 81/5, 81/7 సర్వే నెంబర్లలో ఉన్న ఏడు ఎకరాల స్థిరాస్తిని వడ్డీ వ్యాపారి తన భార్య అయిన లక్ష్మి, అమెరికాలో ఉంటున్న కుమారుడు శశికాంత్ వర్లేపల్లి, బంధువుల పేరిట జీపీఏ కమ్ సేల్ అగ్రిమెంట్‌ను ఏడు డాక్యుమెంట్లుగా చేయించుకున్నారు. దాంతోపాటు ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్, లెడ్జర్‌పై సంతకాలు, బ్యాలెన్స్ అమౌంట్ రిసిప్ట్లు కూడా ముందుగానే తీసుకున్నారు. 2012 నుంచి 2014 మధ్య కాలంలో అసలుతోపాటు వందకు రూ.20 చొప్పన వడ్డీ చెల్లించడంతో అగ్రిమెంట్ల క్యాన్సిలేషన్ డీడ్స్ చేశారని.. కానీ, రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేయకుండా రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని రవికిరణ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2014లో బాధ్యతలు చేపట్టాక కుంచనపల్లి వద్ద ఎన్‌హెచ్–16ను ఆనుకుని ఉన్న ఏడు ఎకరాలను డెవలప్మెంట్ కింద సినీనటుడు, నాటి తెలుగుదేశం ఎంపీ మురళీమోహన్‌కు చెందిన జయభేరి ప్రాపర్టీస్.. భూ యజమాని రవికిరణ్‌కు చెందిన బెస్ట్ ఫారŠూచ్యన్ సంస్థ మధ్య చర్చలు జరిగాయి. తన వ్యాపార ఒప్పందం కోసం అగ్రిమెంట్ల రిజిస్ట్రేషన్లను క్యాన్సిల్ చేయాలని వడ్డీ వ్యాపారిని రవికిరణ్ కోరగా.. తాను రూ.1.25 కోట్లు అప్పు ఇచ్చినందునే జయభేరి సంస్థతో ఒప్పంద అవకాశం వచ్చిందని, తనకూ వడ్డీతో పాటు మరింత లాభం చేకూర్చితేనే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్‌తో పాటు ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు, బ్యాలెన్స్ అమౌంట్ రిసిప్ట్లు తిరిగి ఇచ్చేస్తానంటూ సీతారామమోహన్‌రావు అడ్డం తిరిగారు. అదే సమయంలో చంద్రబాబు, లోకేశ్‌లతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ భారత్, అమెరికాలో వారి ఆర్థిక లావాదేవీలు చూస్తున్నందున తమనెవరూ ఏమీ చేయలేరని హెచ్చరించారు. అంతటితో ఆగక.. తాము తలచుకుంటే డెవలప్మెంట్ ఒప్పందం జరగకుండా కూడా అడ్డుకోగలమని హెచ్చరించారని రవికిరణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో చేసేదేంలేక ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండానే బెస్ట్ ఫారూచ్యన్లో మూడు శాతం వాటా ఇచ్చామని.. ఆ తరువాతే జయభేరి ప్రాపర్టీస్‌తో ఒప్పందం కుదిరిందని రవికిరణ్ అందులో వివరించారు. చదవండి: బాబుకే అప్పు ఇచ్చాం.. నన్ను ఏం చేయలేరు మొత్తం వాటా ఇవ్వాలని ఒత్తిడి ఒప్పందం ప్రకారం ఏడు ఎకరాలలో 9.30 లక్షల చదరపు అడుగుల నిర్మాణం జరగాలి. అందులో 40 శాతం కింద భూ యజమానికి 3.60 లక్షల చ.అ వస్తుంది. ఇందులో బెస్ట్ ఫారŠూచ్యన్ కంపెనీ వాటా 1.30 లక్షల చ.అ. ఒక చ.అ ధర రూ.5,500 చొప్పున ఈ కంపెనీకి రూ.71.50 కోట్లు సమకూరుతుంది. తనకు రాసిచ్చిన మూడు శాతం కాకుండా బెస్ట్ ఫారŠూచ్యన్ వాటా మొత్తం తనకే ఇవ్వాలని సీతారామమోహన్‌రావు గత సర్కారు పెద్దల అండతో బెదిరింపులకు పాల్పడుతున్నారని రవికిరణ్ ఆరోపించారు. అంతేకాదు.. శశికాంత్‌కు చంద్రబాబు, లోకేశ్‌లతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలియజెప్పేందుకు వారిద్దరితో శశికాంత్ ఉన్న ఫొటోలను తరచూ పంపేవారని తెలిపారు. అలాగే, భారత్, అమెరికాలో తాము వడ్డీలకు తిప్పుతున్న దాంట్లో ఎక్కువ మొత్తం లోకేశ్‌కు చెందినదేనని చెప్పేవారని రవికిరణ్ తన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. అప్పటి డీజీపీ ఠాకూర్‌తో పలు దఫాలు ఫోన్లో మాట్లాడించారని కూడా తెలిపారు. మరోవైపు.. తనకన్నా ముందు గోదావరి జిల్లాకు చెందిన విద్యా సంస్థల యాజమాని అయిన మాజీ ఎమ్మెల్సీ.. ప్రముఖ దర్శకుడు, విజయవాడకు చెందిన మరో ఇద్దరు రియల్టర్లు, గుడివాడలోని ఇంజనీరింగ్ కాలేజీ యజమానితో పాటు పలువురు తనలాగే మోసపోయారన్నారు. పోలీసు ఉన్నతాధికారుల తీరెలా ఉందంటే.. ఈనెల 16న సీఎం కార్యాలయం వద్ద స్పందనలో రవికిరణ్ ఫిర్యాదు చేయగా విజయవాడ సీపీకి రిఫర్ చేశారు. 20న పటమట పోలీసుల నుంచి రవికిరణ్‌కు ఫోన్ వచ్చింది. ఆరో టౌన్ స్టేషన్‌కు బదిలీ అయింది. ఆ తరువాత స్పందన లేదు. 23న తాము ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసుల చర్యలేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ దృష్టికి ఫిర్యాదిదారు తీసుకెళ్లారు. పరిశీలించాలని ఏఐజి రాజశేఖర్‌కు సూచనలు వెళ్లాయి. ఫిర్యాదు విచారణకు అర్హమైనదిగా నిర్ధారించారు. 26న గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణకు ఫిర్యాదును పంపి విచారించాలని డీజీపీ గౌతం సవాంగ్ ఆదేశించారు. తనపై రవికిరణ్ ఫిర్యాదు చేశారని తెలుసుకున్న సీతారామమోహన్‌రావు.. విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావును కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై పరిశీలించాలని టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వీఎస్ఎన్ వర్మకు ఆదేశాలు వెళ్లాయి. కాగా, ఈ ఫిర్యాదు విషయంలో చూసీచూడనట్లు వెళ్లాలని తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్దలు కొందరు రంగంలోకి దిగి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్లు సమాచారం. ఫిర్యాదులో పార్టీ పెద్దల పేర్లు కూడా ఉన్నందున తాము ఏదోలా సర్దుబాటు చేసుకుంటామని అంటున్నట్లు తెలియవచ్చింది. ఈ విషయమై డీజీపీ గౌతమ్ సవాంగ్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించామన్నారు. ఇదే విషయమై విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావును అడగ్గా తనకు ఫిర్యాదు అందిందని, వాస్తవాలను తెలుసుకుంటామన్నారు. -
బాబుకే అప్పు ఇచ్చాం.. నన్ను ఏం చేయలేరు
సాక్షి, తిరుపతి : పాకాలలోని ఓ టీడీపీ నేత కాల్‌మనీ తరహా వేధింపులకు పాల్పడుతున్నాడు. కొన్నేళ్లుగా పాకాల మండల కేంద్రంగా ఈ తంతు సాగుతోంది. ఈ వేధింపులకు తాళలేక బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగుతున్నారు. అసలేం జరిగిందంటే పాకాల కమ్మవీధికి చెందిన గోవర్దన్‌బాబు నాయుడు అలియాస్ గోపీనాయుడు కొన్నేళ్లుగా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. బాధితుల నుంచి బాండు, ఖాళీ చెక్కులు తీసుకుంటున్నాడు. వడ్డీ, తీసుకున్న సొమ్ము తిరిగి చెల్లించినా బాధితులకు అతడు బాండు, చెక్కు తిరిగి ఇవ్వడం లేదు. ఇదేమని అడిగితే వేధింపులకు దిగుతున్నాడు. ఆపై తిరిగి సొమ్ము వసూలు చేయడం తంతుగా పెట్టుకుంటున్నాడు. నలుగురు కలిసి నిలదీస్తే మా నాన్న చంద్రబాబు నాయుడికే అప్పు ఇచ్చాడురా..! నేను టీడీపీ వాడ్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు.. అంటూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు. డబ్బులిచ్చి పోలీసులను కూడా కొనేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. మహిళలకు సైతం అప్పులు ఇవ్వడం, ఇచ్చిన అప్పు తీర్చినా తన కోరిక తీర్చాలని వేధించడం రివాజుగా మారిందని పలువురు ఆరోపించారు. అరాచకాలు అరికట్టండి అప్పు పేరుతో అమాయకులపై దౌర్జన్యానికి పాల్పడుతూ మోసం చేస్తున్న గోవర్దన్‌బాబు నాయుడి అరాచకాలను అరికట్టాలని పూతపట్టు మండలం, ముత్తురేవుల గ్రామానికి చెందిన లోకేష్ డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. తన వ్యాపారం నిమిత్తం గోవర్దన్‌బాబు నాయుడు వద్ద రూ.70 వేలు అప్పుగా తీసుకున్నాని, ఇందుకు తన వద్ద రూ.70 వేలకు బాండు, ఖాళీ చెక్ తీసుకున్నాడని తెలిపారు. 2017 నవంబర్ 15న రూ.17,200 అతని ఆంధ్రాబ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేశానన్నారు. మిలిగిన సొమ్ము రూ.2,800 అతని చేతికి ఇచ్చానని తెలిపారు. ప్రతి నెలా రూ.6 వేలు వడ్డీ లెక్కన అతిని చేతికి చెల్లిస్తూ వచ్చానన్నారు. ఆపై అతినికి ఇవ్వాల్సిన రూ.50 వేలు 2018 ఫిబ్రవరి 3న తన ఐసీఐసీ అకౌంట్‌కు వేశానని. ఈ మొత్తం అతను డ్రా చేసుకున్నాడని తెలిపారు. అప్పు తీరిపోవడంతో తనకు బాండు ఇవ్వమని అడిగితే రెండు రోజుల తర్వాత ఇస్తానని చెప్పి దాట వేశాడని తెలిపారు. దీనిపై 2018 మార్చి 5న తిరుపతి అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అతనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. ఈ నేపథ్యంలో తనపై అతడు కక్షగట్టాడని వాపోయాడు. అతడి వద్ద ఉన్న బాండును 2019 జూలై 7న పాకాల కోర్టులో తనపై కేసు వేశాడని తెలిపారు. ఇలా చాలా మందిపై కేసులు వేసి వారిని ఇబ్బంది పెడుతున్నట్లు ఆరోపించారు. అప్పు తీర్చినా కేసులు వేసి భయభ్రాంతులకు గురిచేయడం అతనికి అలవాటుగా మారిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో బత్తల వినోద్‌కుమార్, హరిప్రసాద్, గిరియప్ప, త్యాగరాజుల నాయుడు, టి.నజీర్‌బాషా పాల్గొన్నారు. -
పేదలతో కాల్‌మనీ చెలగాటం
సాక్షి, పిడుగురాళ్ల(గుంటూరు) : రోజు వారీ కూలీలు, చిరు ఉద్యోగులు, రోజు వారీ వ్యాపారులు, తోపుడు బండ్ల వారు ఇలా పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఓ రూపాయి సంపాదించాలని పెట్టుబడి కోసం, లేదంటే వారి కుటుంబాల అవసరాల కోసం వారాల లెక్క వడ్డీకి డబ్బులు తీసుకుని అసలు, వడ్డీ చెల్లించలేక నానా అవస్థలు పడుతున్న వైనం పిడుగురాళ్ల పట్టణంలో జరుగుతుంది. పట్టణంలోని మాచర్ల బస్టాండ్ సెంటర్ వద్ద ఓ దివ్యాంగురాలు ప్రైవేటు పాఠశాలలో ఆయాగా, వంట మనిషిగా పని చేస్తుంది. కుమార్తెకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో వారాల లెక్కన రూ.10 వేలు తీసుకుంది. సగం డబ్బులు చెల్లించింది. మధ్యలో తనకు ఆరోగ్యం బాగోలేక రెండు నెలలు ఆలస్యం కావడంతో వారాల లెక్క వడ్డీకి డబ్బులు ఇచ్చిన వడ్డీ వ్యాపారులు ఇంటిపైకి వచ్చి గతంలో చెల్లించిన డబ్బులు వడ్డీకే సరిపోయాయని, తిరిగి మళ్లీ నోటు రాసి మొదటి నుంచి చెల్లించాలని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. అదే విధంగా పట్టణంలోని ఆదర్శ కాలనీకి చెందిన షేక్ ఖాశిం అనే వ్యక్తి సున్నం బట్టీల్లో కూలి పనులు చేస్తుంటాడు. కుటుంబ అవసరాల కోసం రూ.10 వేలు వారాల లెక్క వడ్డీకి తీసుకున్నాడు. ఇతను కూడా సగానికి పైగానే అప్పు చెల్లించాడు. మధ్యలో ఇతనికి అనారోగ్యం కారణంగా ఓ నెల చెల్లించలేకపోవడంతో సదరు వడ్డీ రాయుళ్లు అతని ఇంటిపైకి వెళ్లి అతని పట్ల అసభ్య పదజాలంతో దూషించి అతన్ని భయబ్రాంతులకు గురి చేయడంతో అతను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక బిక్కుబిక్కు మంటూ ఉన్నాడు. ఇలా పట్టణంలో వందల సంఖ్యలో పేద, నిరుపేద, చిరువ్యాపారులు వడ్డీకి డబ్బులు తీసుకుని అధిక వడ్డీలు చెల్లించలేక నరకయాతన పడుతున్నారు. వారాల లెక్క ఇలా... పట్టణంలోనే కాకుండా రాజమండ్రి, అనపర్తి, మండపేట ప్రాంతాల నుంచి కొంతమంది వడ్డీ వ్యాపారులు పిడుగురాళ్ల పట్టణంలో వారాల లెక్క వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరు ఒక్కొక్కరు 1000 మందికి రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు వారాల లెక్క వడ్డీలకు తిప్పుతున్నారు. వీరు రూ.5 వేలు తీసుకున్న వారికి రూ.4900 ఇస్తారు. కాని వారు 12 వారాల్లో రూ.6 వేలు చెల్లించాలి. రూ.10 వేలు తీసుకున్న వారికి రూ.9800 ఇస్తారు. 12 వారాల్లో రూ.12 వేలు చెల్లించాలి. సుమారు నూటికి రూ.8 వడ్డీ వసూలు చేస్తున్నారు. మధ్యలో ఎవరైనా రెండు, మూడు వారాలు చెల్లించకుంటే అదనంగా మరో రూ.4 వడ్డీ వేసి రూ.12 వడ్డీ వసూలు చేస్తున్నారు. ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు, వేలిముద్రలు తీసుకుని వీరు వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అన్నీ అనధికారమే... ఈ వడ్డీ వ్యాపారం చేసే వారు అన్నీ అనధికారికంగానే చేస్తున్నారు. ఎటువంటి లైసెన్సులు ఉండవు. ఓ చిన్న పుస్తకాన్ని వారి పేరుతో ప్రింట్ చేసి వారాల వివరాలు, వారానికి ఎంత కట్టాలి రాసి ఇస్తారు. అయితే వసూలు చేసే వ్యక్తులు చదువు రాని వారికి రాయకుండానే రాశామని చెప్పి మాయ చేస్తూ వారు పూర్తిగా చెల్లించినప్పటికీ ఇంకా చెల్లించాలంటూ వారి వద్ద నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. దీనిపై పేద, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాల్‌మనీ వ్యాపారులపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి బడుగు, బలహీన, చిరు వ్యాపారులను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈ విషయమై పిడుగురాళ్ల పట్టణ సీఐ ఎ.సురేంద్రబాబును ‘సాక్షి’ వివరణ కోరగా కాల్‌మనీకి సంబంధించిన ఫిర్యాదులు తన దృష్టికి రాలేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు ఇస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఖాళీ నోటుపై సంతకాలు పెట్టమంటున్నారు కుటుంబ అవసరాల కోసం వారాల వారి దగ్గర రూ.10 వేలు అప్పు తీసుకుంటే సగానికి పైగానే చెల్లించాను. మధ్యలో ఓ నెల ఆరోగ్యం బాగోలేక చెల్లించలేకపోయాను. దానికే చెల్లించిన నగదు వడ్డీకి సరిపోయిందని, మళ్లీ రూ.10 వేలు చెల్లించాలని, దానికి గాను ఖాళీ నోటుపై సంతకాలు పెట్టమని ఒత్తిడి చేస్తున్నారు. వై.కుమారి, పిడుగురాళ్ల, కాల్‌మనీ బాధితురాలు -
బెజవాడలో మళ్లీ కాల్‌నాగుల అరాచకాలు
-
విజయవాడలో మళ్లీ పడగ విప్పిన కాల్‌మనీ
-
‘వడ్డీ’కాసురులు
జిల్లా కేంద్రంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరుతున్నాయి. కొందరు వ్యాపారులు అడ్డగోలు వడ్డీతో ప్రజల నడ్డి విరుస్తున్నారు. అసలుకన్నా వడ్డీ ఎక్కువైనప్పుడు.. కట్టలేని పరిస్థితుల్లో అప్పు తీసుకున్నవారి ఇళ్లను, ప్లాట్లను, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. – సాక్షి, కామారెడ్డి సాక్షి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీకి చెందిన రాజయ్య (పేరు మార్చాం) అవసరానికి ఓ వడ్డీ వ్యాపారి వద్ద రూ. 2 లక్షలు అప్పు తీసుకున్నాడు. రాజయ్య వ్యాపారం దెబ్బతింది. తీసుకున్న అప్పు చెల్లించలేకపోయాడు. అప్పు తీర్చడానికి మరికొంత కాలం గడువు అడిగాడు. దీనికి సమ్మతించిన సదరు వడ్డీ వ్యాపారి.. 15 నెలలకు వడ్డీ లెక్కగట్టి అసలు, వడ్డీ మొత్తం రూ. 3.50 లక్షలు అయ్యిందని తేల్చాడు. ఇంత మొత్తం బాకీకి ఇంటికి సంబంధించిన కాగితాలు ఇవ్వాలనే షరతు పెట్టాడు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజయ్య ఇంటికాగితాలు చేతికిచ్చాడు. మరో ఏడాది గడిచింది. అప్పు వడ్డీలతో రూ. 5 లక్షలు దాటింది. ఇక లాభం లేదని ఇంటిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలని ఒత్తిడి తేవడంతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. వ్యాపారాల్లో నష్టాలే తప్ప లాభాలు రాకపోవడంతో అప్పు తీర్చలేకపోయాడు. సదరు వడ్డీ వ్యాపారి పది నెలల తర్వాత మళ్లీ అసలు, వడ్డీ లెక్కేశాడు. అప్పు రూ. 7 లక్షలు దాటిందని.. వారం రోజుల్లో మొత్తం అప్పు తీర్చకపోతే ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించాడు. వారం తర్వాత పదిహేను మందిని తీసుకుని వచ్చాడు. ఎంత బతిమాలినా కనికరించకపోవడంతో రాజయ్య సామాన్లు సర్దుకుని, వేరే ఇంటికి మారాడు. జిల్లా కేంద్రంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి అమ్ముతూ నాలుగు పైసలు సంపాదించాలన్న ఆశతో ఓ ఆంధ్రా మేస్త్రీ తన దగ్గర ఉన్న డబ్బులను పెట్టుబడిగా పెట్టాడు. అవి సరిపోకపోవడంతో ఓ వడ్డీ వ్యాపారిని ఆశ్రయించాడు. ఎంత కావాలన్నా ఇస్తాను కాని, ప్లాటును తన పేరిటే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలనే షరతు పెట్టాడు. దానికి సమ్మతించిన మేస్త్రీ.. రెండు ప్లాట్లను రిజస్ట్రేషన్ చేసి రూ. 5 లక్షల అప్పు తీసుకున్నాడు. ఇంటి నిర్మాణానికి డబ్బులు సరిపోకపోవడంతో మరో రూ. 5 లక్షల అప్పు అడిగాడు. ప్లాటు తన పేరిటే ఉండడంతో సదరు వ్యాపారి అప్పు ఇచ్చాడు. మేస్త్రీ ఆరు నెల ల్లో ఇంటి నిర్మాణాలను పూర్తి చేశాడు. మరో ఆరు నెలలైనా ఇళ్లను ఎవరూ కొనుగోలు చేయలేదు. తన సొంత డబ్బులుపోను రూ. 10 లక్షలు అప్పు గా తీసుకుని పెట్టిన పెట్టుబడికి సంబంధించి వడ్డీ లెక్కలు చూసుకున్నాడు. వడ్డీ వ్యాపారి డబ్బుల కోసం ఒత్తిళ్లు తేసాగాడు. ఓరోజు కూర్చోబెట్టి ‘‘నువ్వు తీసుకున్న అప్పుకు ఇప్పటికే రూ. 4 లక్షల మిత్తి అయ్యింది. అసలుతో కలిపి రూ.14 లక్షలు కట్టు’’ అని ఒత్తిడి తెచ్చాడు. ఇళ్లు అమ్ముడవకపోవడంతో మేస్త్రీ చేతులెత్తేశాడు. వ్యాపారి రెం డు ఇళ్లకు రూ. 18 లక్షలు లెక్కగట్టి.. తనకు రావాల్సిన రూ. 14 లక్షలు పోనూ మిగిలిన రూ. 4 లక్షలను మేస్త్రీ చేతిలో పెట్టాడు. తాను కష్టపడి దాచుకున్న సొమ్ము కూడా పోవడంతో ఆ మేస్త్రీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొంత కాలానికి ఆ వ్యాపారి ఒక్కో ఇంటిని రూ. 26 లక్షలకు అమ్ముకున్నాడు. కష్టపడ్డ మేస్త్రీకి మాత్రం కన్నీళ్లు మిగిలాయి. అవసరానికి అప్పు ఇస్తున్నామని చెప్పుకుంటూ కొందరు వడ్డీ వ్యాపారులు అప్పు తీసుకున్నవారి రక్తాన్ని పీల్చేస్తున్నారు. అడ్డగోలు వడ్డీలతో వారి నడ్డి విరుస్తున్నారు. ఇదే సమయంలో తమ దగ్గర తీసుకున్న అప్పును తీర్చలేని వారికి సంబంధించిన ఆస్తులను జబర్దస్తీగా స్వాధీనం చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో కొందరు వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరాయి. ఎలాంటి అనుమతులు, లెక్కా పత్రం లేకుండానే రూ. కోట్లల్లో వడ్డీల దందా నిర్వహిస్తున్నారు. అప్పుపై అడ్డగోలు వడ్డీలు వసూలు చేస్తున్నారు. అప్పు ఇచ్చే ముందు ఇంటి కాగితాలో, ప్లాటు కాగితాలనో తనఖా పెట్టుకోవడం, సకాలంలో అప్పు చెల్లించకుంటే ఆస్తులను ఆక్రమించుకోవడం పరిపాటిగా మారింది. అడ్డగోలు వడ్డీలు... వడ్డీ వ్యాపారం పేరుతో కొందరు చేస్తున్న దందా సామాన్యులను దివాలా తీయిస్తోంది. ప్రతి మని షికి ఏదో ఒక సందర్భంలో అప్పు చేయాల్సి వ స్తోంది. ప్రధానంగా పిల్లల చదువులకో, ఇళ్ల నిర్మా ణానికో, ప్లాటు కొనుగోలు కోసమో, పిల్లల పెళ్లి ళ్లు, ఫంక్షన్లు, ఏదైనా వ్యాపారంలో పెట్టుబడుల కోసమో.. ఇలా ప్రతిదానికి అప్పు చేయాల్సిందే. ఇలాంటి సందర్భంలో వడ్డీ వ్యాపారులు ‘కొంద రు’ అడ్డగోలు వడ్డీలతో నడ్డివిరుస్తున్నారు. నూటి కి నెలకు రూ. 3 నుంచి రూ. 5 వరకు వడ్డీ వసూ లు చేస్తున్నారు. కొందరైతే మూడు నెలలకోసారి, మరికొందరు ఆరు నెలలకోసారి వడ్డీ లెక్కలు గ డుతున్నారు. కొందరు వడ్డీ వ్యాపారులు ముందుగానే ఆరు నెలల వడ్డీని తీసుకుంటున్నారు. వడ్డీ, అసలు కలిపి మళ్లీ కొత్త లెక్క రాసుకోవడం మూ లంగా అప్పుభారం ఏడాదిన్నర, రెండేళ్లలో రెట్టింపవుతోంది. వాయిదా ప్రకారం డబ్బు చెల్లించకుం టే వడ్డీలపై వడ్డీలు వేసి ఇబ్బంది పెడుతున్నారు. తనఖా తప్పనిసరి కొందరు వడ్డీ వ్యాపారులు అప్పు ఇచ్చేటపుడు ఏదైనా తనఖా పెట్టాలన్న షరతు విధిస్తున్నారు. ప్రధానంగా ఇంటికి సంబంధిం చిన డాక్యుమెంట్లుగాని, ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు గాని వారి వద్ద తనఖా పెట్టుకున్న తరువాతనే అప్పులు ఇస్తున్నారు. అప్పులు చెల్లించని పక్షంలో వడ్డీ వ్యాపారులు తమ మనుషులను తీసుకెళ్లి ఇంటి ముందర నానా హంగామా చేయడం, అప్పుకట్టకుంటే ఆస్తులను స్వాధీనం చేసుకోవడం పరిపాటిగా మారింది. అప్పులు తీసుకున్నవారు చాలా మంది వడ్డీ వ్యాపారుల చేతిలో నలిగిపోతున్నారు. వడ్డీ వ్యాపారుల ఆగడాలకు కళ్లెం వేయాలని చిరువ్యాపారులు కోరుతున్నారు. -
విజయవాడలో మళ్లీ చెలరేగిన కాల్‌నాగులు
-
కాల్ మనీ వేధింపులు.. వివాహిత ఆత్మహత్యాయత్నం
సాక్షి, విజయవాడ : కాల్ మనీ ఆగడాలు మరోసారి పెచ్చుమీరాయి. కాల్ మనీ వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి విజయవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన పసుపులేటి పద్మ అనే వివాహిత నాలుగేళ్ల కిందట టీడీపీ నేత అనుచరుడి నుంచి 2లక్షల రుణం తీసుకుంది. కొన్ని నెలల క్రితమే తీసుకున్న బాకీ మొత్తం తీర్చేసింది. అయితే ఇంకా డబ్బులు బాకీ ఉన్నావంటూ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు దౌర్జన్యానికి దిగారు. తరుచూ ఆమెను వేధింపులకు గురిచేయటం మొదలుపెట్టారు. వేధింపులు తాళలేకపోయిన ఆమె మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేపట్టారు. -
కర్నూలులో కాల్‌మనీ కలకలం
-
కాల్ 'నాగులు'
ఏలూరు అమీనాపేటకు చెందిన వెంకట కృష్ణవేణిఒక వడ్డీ వ్యాపారి వద్ద 2014లో కుటుంబ అవసరాల నిమిత్తం రూ.30 వేలు అప్పుగా తీసుకుంది. భర్త చనిపోవటంతో కూలిపని చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది. బాకీని నెలనెలా కొంతమొత్తంగా చెల్లిస్తోంది. 2015 నాటికి బాకీ రూ.2 వేలు మిగిలింది. ఇదే సమయంలో కాల్‌మనీ వివాదంతో వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు కావటంతో సొమ్ము తీసుకునేందుకు ఆమె వద్దకు ఎవరూ రాలేదు. అనంతరం బాకీ విషయంలో సదరు వడ్డీ వ్యాపారి ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. తాజాగాఆమె తమకు రూ.2 లక్షలు బకాయి ఉందని, వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ చెక్కుల ఆధారంగా బినామీలతో కోర్టులో కేసు వేశాడు. ఇప్పటికేతీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెనువడ్డీ వ్యాపారి కోర్టు కేసు పేరుతో వేధిస్తూ..బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఏలూరు టౌన్ : జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. ఒక్క ఏలూరు నగరంలోనే ఇలా అధిక వడ్డీలు వసూలు చేసే వ్యాపారులు పదుల సంఖ్యలో ఉన్నారు. వీరు రూ.కోట్లలో వ్యాపారాలు సాగిస్తున్నారు. రోడ్ల మీద చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తుల నుంచి మధ్య తరగతి వర్గాల వరకూ వేలసంఖ్యలో వ్యక్తులకు అప్పులు ఇస్తూ ఉంటారు. ధర్మ వడ్డీకి అప్పు ఇచ్చే పరిస్థితులు పోయి.. చక్రవడ్డీలు, ఎస్టీడీ వడ్డీల పేరుతో జనాలను దోచేస్తున్నారు. రోజంతా కూలీనాలీ చేసుకునే పేద వర్గాలు, చిన్న ఉద్యోగాలు చేసుకునే వ్యక్తులు ఈ కాల్‌మనీ జలగల ఉచ్చులో పడి దోపిడీకి గురవుతున్నారు. ఏలూరు అశోక్‌నగర్‌లోనే ఇద్దరు, ముగ్గురు వడ్డీ వ్యాపారులు చేస్తున్న అరాచక దందాలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ‘కాల్‌మనీ’ కేటుగాళ్లు డబ్బు వాసన రుచిమరిగి పేట్రేగిపోతున్నారు. అవసరాల కోసం అప్పు తీసుకుంటున్న పేద, మధ్య తరగతి వర్గాల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మహిళలు, వితంతువులు, వృద్ధులు, పేదలు, ఆదరణలేని వ్యక్తులనే లక్ష్యంగా చేసుకుంటూ అప్పులు ఇస్తున్నారు. తీసుకున్న అప్పునకు ఎస్టీడీ వడ్డీ వేసి రెట్టింపు కట్టించుకున్నాక, వారితో గొడవలు పెట్టుకుంటున్నారు. రెండు, మూడేళ్లు ఆగిన అనంతరం అప్పు తీసుకున్న వ్యక్తుల చెక్కులతో కోర్టులో మరోసారి భారీ మొత్తానికి కేసులు వేస్తున్నారు. సెటిల్మెంట్ చేసుకునే వరకూ వేధింపులకు గురి చేస్తున్నారు. పోనీ పోలీస్స్టేషన్లకు వెళదామా అంటే అక్కడ తమ అనుచర వర్గాన్ని పెట్టి మరీ బెదిరింపులకు పాల్పడడం కాల్‌మనీ కేటుగాళ్ల స్టైల్. బినామీలతో చెక్కులను కోర్టుల్లో వేయిస్తూ నోటీసులు పంపిస్తారు. నగరంలో ఇదే తరహాలో వేధింపులకు గురవుతున్న బాధితులు తీవ్ర మానసిక వేదనతో నలిగిపోతున్నారు. హత్యానేరాల్లో నిందితులతో బలవంతపు వసూళ్లు ఏలూరు నగరానికి చాలా ఏళ్ల క్రితం ఉపాధి కోసం వచ్చి ఇక్కడే పాతుకుపోయిన కొందరు ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రూ.వేలల్లో సొమ్ములు ఇస్తూ.. రోజువారీ, వారం, పక్షం రోజులు, నెలరోజులు ఇలా వసూలు చేస్తుంటారు. రూ.వెయ్యి అప్పుగా ఇవ్వాలంటే ముందుగానే రూ.200 మినహాయించుకుని రూ.800 ఇస్తుంటారు. ఈ సొమ్మును వాయిదాల పద్ధతిలో చెప్పిన రోజుకు చెల్లించాలి. ఒక్కరోజు దాటితే అదనంగా పెనాల్టీ పడుతుంది. ఇక తీసుకున్న అప్పు వసూళ్ల బాధ్యతను నగరంలోని హత్యా నేరాల్లో నిందితులు, రౌడీషీటర్లకు అప్పగిస్తారు. ఈ వ్యక్తులు రాత్రి వేళల్లో, తెల్లవారుజామున ఇళ్లకు వెళ్లి డబ్బు వసూళ్లకు బెదిరింపులు చేస్తుంటారు. ఒక వేళ సొమ్ములు చెల్లించలేని పక్షంలో మహిళలను లైంగికం గానూ వేధింపులకు గురిచేస్తూ తమదైన శైలిలో వసూలు చేయటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. బాధితులు పోలీస్స్టేషన్లకు వెళ్లే అవకాశం లేకుండా స్టేషన్లలో సైతం తమ అనుచరులను ఏర్పాటు చేసుకుని బెదిరింపులకు పాల్పడుతుంటారు. ఏలూరు తంగెళ్లమూడికి చెందిన ఎస్కే రియాజుద్దీన్ ఓ వడ్డీ వ్యాపారి వద్ద రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. నెలనెలా వాయిదాల పద్ధతిలో వడ్డీతో కలిపి సొమ్ము చెల్లించేలా నిర్ణయించారు. తీసుకున్న రుణానికి మూడు రెట్లు రూ.1.50 లక్షలు ఎస్టీడీ (వందకు నెలకు రూ.10 నుంచి రూ.20 వరకు వసూలు చేస్తారు) వడ్డీతో వసూలు చేశారు. కానీ అంతటితో వ్యాపారి ఆగిపోలేదు. అదనంగా మరో రూ.50 వేలు చెల్లించాల్సిందేనంటూ వేధింపులకు దిగాడు. తన సొమ్ము ఇప్పించాలంటూ బినామీలతో రియాజుద్దీన్ ఇచ్చిన చెక్కులతో కోర్టులో కేసు వేశాడు. కుటుంబ పోషణే కష్టంగా మారిన ఆతను వడ్డీ వ్యాపారి వేధింపులకు తాళలేక 2017లో ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించాడు. వృద్ధులు, వితంతువులు, ఆదరణలేనివారే టార్గెట్ కుటుంబ అవసరాలో.. వ్యక్తిగత సమస్యలతోనో.. వడ్డీలకు అప్పులు తీసుకున్నారో ఇక అప్పు తీసుకున్న వ్యక్తుల జీవితాలు వారి చేతుల్లోకి వెళ్ళిపోయినట్లే. ఈ వ్యాపారులు ఎవరికి పడితే వారికి అప్పులు ఇవ్వరు. సమాజంలో ఆదరణలేనివారు, పేదవర్గాలు, బంధువర్గం లేనివాళ్ళు, మహిళలు, వృద్ధులు, వితంతువులు ఇలా కొన్ని వర్గాల ప్రజలను మాత్రమే వారు టార్గెట్‌గా చేసుకుంటారు. వ్యాపారుల కనుసన్నల్లో నడిచే వ్యక్తుల విశ్వసనీయ సమాచారం మేరకు భారీగా డబ్బులు అప్పులుగా ఇస్తుంటారు. వేధింపులకు గురిచేసినా ఎవరూ అండలేకుండా చేయటం, పోలీస్స్టేషన్లకు వెళ్ళలేని నిస్సహాయులను ఏరికోరి వారికే అప్పులు ఇవ్వటం వారి స్పెషల్. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చట్టాన్ని ఎవరైనా తమ చేతుల్లోకి తీసుకుంటూ వేధింపులకు పాల్పడితే సహించేదిలేదు. బలవంతంగా ఎవరితోనైనా సంతకాలు చేయించి, నిబంధనలు మీరితే చర్యలు తప్పవు. ఎవరైనా వడ్డీ వ్యాపారం పేరుతో వేధింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం. విచారణ చేపట్టి బాధితుల ఫిర్యాదు మేరకు కాల్‌మనీ కేసులు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. పేదలు, మహిళలు, వితంతువులు, ఇలా ఎవరిపైన అయినా దాడులు, వేధింపులు జరిగినట్లు నిర్ధారణ అయితే తప్పకుండా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. ఇలాంటి వారి పట్ల ప్రజలూ జాగ్రత్తలు పాటించాలి. – ఎం.రవిప్రకాష్, ఎస్పీ -
ప్రకాశం జిల్లాలో వడ్డీ వ్యాపారి ఆగడాలు
-
నెల్లూరులో ‘కాల్’కలం!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన విజయవాడ కాల్‌మనీ బాగోతం ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతోంది. వ్యాపారులు, రియల్టర్లను టార్గెట్ చేసుకుని రూ.లక్షల్లో అప్పులు ఇచ్చి రూ.కోట్లలో వసూలు చేసే ఓ కాల్‌మనీ వ్యాపారిపై ఇప్పుడు ఫిర్యాదుల పరంపర మొదలైంది. మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ ముఖ్య అనుచరుడిగా నగరంలో హవా సాగిస్తూ.. అప్పులు తీసుకున్న వారిని వేధించి ఆస్తులు రాయించుకుంటున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. అధికార పార్టీ నేత కావడంతో పోలీసులు కూడా ఇతనిపై వచ్చే ఫిర్యాదులను చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నారు. తాజాగా రెండు ఫిర్యాదులు వెలుగులోకి రావడం, అందులో ఒక ఫిర్యాదుకు సంబంధించి కేసు నమోదు కావడంతో ఈ కాల్‌మనీ దందా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లాకు చెందిన కోట గురుబ్రహ్మం నెల్లూరు నగరంలో స్థిరపడ్డాడు. సింహపురి పెయింట్స్ పేరిట వ్యాపార రంగంలోకి ప్రవేశించి వడ్డీ వ్యాపారం ద్వారా అనతి కాలంలోనే రూ.కోట్లు గడించాడు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు సన్నిహితుడు కావడంతో జిల్లాలో ఇష్టానుసారంగా దందా సాగిస్తున్నాడు. రూ.లక్షల్లో అప్పులిచ్చి కోట్లు వసూలు చేస్తూ కాల్‌మనీ వ్యాపారం చేస్తున్నాడు. ఇతనితోపాటు మరో ముగ్గురు అధికార పార్టీ చోటా నేతలు సిండికేటుగా ఏర్పడి పెద్ద మొత్తాలతో లావాదేవీలు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని గోమతీ ఎడ్యుకేషన్ సొసైటీ కరస్పాండెంట్ అరుణ.. 2012లో గూడూరుకు చెందిన వడ్డీ వ్యాపారి వాయుగుండ్ల వెంకట నరసింహారావు వద్ద మూడు రూపాయల వడ్డీకి రూ.15 లక్షలు అప్పు తీసుకున్నారు. ష్యూరిటీగా తన భర్త పేరుతో చెక్కులు, ప్రామిసరీ నోట్లను ఇచ్చారు. ఈ క్రమంలో నరసింహారావు ఆ అప్పును మంత్రి అనుచరుడు కోట గురుబ్రహ్మంకు బదలాయించి అప్పును అతనికి చెల్లించాలని సూచించి తిరిగి గురుబ్రహ్మం, అతని కుమారుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పేరుతో ప్రామిసరి నోట్లు, చెక్కులు తీసుకున్నారు. 2016లో అసలు, వడ్డీ చెల్లించారు. అయితే, ప్రామిసరీ నోట్లు, చెక్కులు కనిపించడంలేదని, కొద్ది రోజుల్లో తిరిగి ఇస్తానని చెప్పి అప్పు రద్దయినట్లు కాగితం రాసిచ్చారు. రెండు నెలల తర్వాత చెక్కులు బౌన్స్ చేశారు. దీంతో అరుణ కోర్టులో ప్రైవేటు కంప్లైంట్ వేయడంతో ఈనెల 16న 4వ నగర పోలీసుస్టేషన్లో గురుబ్రహ్మంపై కేసు నమోదైంది. దీంతో అతని నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఈ పరిణామాల క్రమంలో బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. మంత్రి అండతోనే దందా సాధారణ పెయింట్ వ్యాపారి అయిన గురుబ్రహ్మం ఒక దశలో మంత్రికే చేబదులుగా అప్పులిచ్చే స్థాయికి ఎదిగాడు. 15 ఏళ్ల క్రితం వరకు మంత్రికి అనేకసార్లు అప్పు ఇచ్చినట్లు సమాచారం. కోట గురుబ్రహ్మంతోపాటు మంత్రికి సన్నిహితంగా ఉండే ఏలూరు శీనయ్య, కృష్ణయ్య, ప్రసాద్ సిండికేట్‌గా ఏర్పడి కాల్‌మనీ నిర్వహిస్తుంటారు. కొన్ని సందర్భాలలో వీరితో నిమిత్తం లేకుండా గురుబ్రహ్మం అప్పులు ఇస్తుంటాడు. అలాగే, నగరంలోని ధనలక్ష్మీపురానికి చెందిన బత్తుల విజయభాస్కర్‌రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి 2010లో 131 అంకణాల స్థలాన్ని డెవలప్మెంట్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ జాగాలో అపార్టుమెంట్ నిర్మాణం కోసం మూడు రూపాయల వడ్డీకి గురుబ్రహ్మం వద్ద రూ.70 లక్షలు అప్పు తీసుకుని డెవలప్మెంట్ కోసం తీసుకున్న స్థలాన్ని ఆయన తల్లి శేషమ్మ పేరుతో అన్ రిజిస్టర్ చేశారు. ఈ క్రమంలో అపార్టుమెంట్లో రెండు ఫ్లోర్ల నిర్మాణం పూర్తిచేసి 12 మందికి విజయభాస్కర్‌రెడ్డి విక్రయించి ఆ డబ్బును బాకీ కింద జమ చేసుకోమని కోరగా కుదరదని చెప్పి అపార్టుమెంట్‌ను స్వాధీనం చేసుకున్నాడు. ఇదేమని ప్రశ్నిస్తే వడ్డీతో కలిపి రూ.కోటి 76 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసి తనకు మంత్రి అండ ఉందని, ఏమీ చేయలేవని బెదిరించి పంపాడు. ఇదే క్రమంలో గూడూరులో, సర్వేపల్లి, నగరంలో అనేకమంది గురుబ్రహ్మం బాధితులు ఉన్నారు. మరోవైపు.. గోమతి నిర్వాహకురాలు అరుణ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అలాగే, విజయభాస్కర్‌రెడ్డి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నగరంలో అనేకమంది వ్యాపారులు, అధికార పార్టీ నేతల సమీప బంధువులు కూడా ఇదే తరహాలో మోసం చేస్తున్నారు. మంత్రి నారాయణ ముఖ్య అనుచరుడు కావడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేయడంలేదు. 2013లో ముత్తుకూరు పోలీసుస్టేషన్లో ఇతనిపై కేసు నమోదైంది. కేసును విచారిస్తున్నాం కోర్టు ఆదేశాల మేరకు కోట గురుబ్రహ్మంపై కేసు నమోదు చేశాం. పూర్తిస్థాయిలో విచారిస్తున్నాం. నకిలీ డాక్యుమెంట్లు, చెక్కుల ఫోర్జరీ చేసిన అభియోగాలపై విచారణ సాగుతోంది. ఫోరెన్సిక్ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం. గురుబ్రహ్మం తన అనుచరుల ద్వారా బెదిరించినట్లు గోమతి విద్యా సంస్థల కరస్పాండెంట్ అరుణ ఫిర్యాదు చేశారు. దీనిపైనా విచారణ సాగుతోంది. – వి.సుధాకర్‌రెడ్డి, నెల్లూరు నాలుగో నగర సీఐ -
దర్శక, నిర్మాత ఆత్మహత్య వెనుక...
సాక్షి, చెన్నై: ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు తమిళనాడులోనూ ‘కాల్‌మనీ’ భూతం బుసలు కొడుతోంది. ఏపీలో ఇప్పటికే ఈ రక్కసి బారిన పడి ఎంతో మంది మానప్రాణాలు పోగొట్టుకోగా, తాజాగా పొరుగు రాష్ట్రానికి ఇది పాకింది. కాల్‌మనీ వ్యవహారం కోలీవుడ్ దర్శక నిర్మాత బి.అశోక్ కుమార్ బలవన్మరణానికి కారణమైంది. నటుడు శశికుమార్ సోదరుడైన ఆయన మంగళవారం చెన్నైలో ఆత్మహత్య చేసుకోవటం సినిమా వర్గాలను నివ్వెరపోయేలా చేసింది. ఫైనాన్షియర్లు, కాల్‌మనీ దారుల నుండి గత కొంతకాలంగా బెదిరింపులు వస్తుండటంతో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని సూసైడ్ లెటర్లో అశోక్ కుమార్ వివరించటం చిత్రసీమను దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో కోలీవుడ్ కాల్‌మనీ దందాకు వ్యతిరేకంగా కదంతొక్కింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేసింది. అశోక్ కుమార్‌ను బెదిరించిన వారిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్‌గా తీసుకోవడంతో కందువడ్డీ, కాల్‌మనీ వ్యవహారంలో ప్రమేయమున్న పైనాన్షియర్లపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. గతంలో కాల్‌మనీ వ్యవహారంలో ఓ కుటుంబం తిరునెల్వేలి కలెక్టర్ కార్యాలయం ముందు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విదారక ఉదంతాన్ని మరువక ముందే కాల్‌మనీకి సినీ నిర్మాత అశోక్ కుమార్ బలి కావడం తమిళనాట తీవ్ర కలకలం రేపింది. -
నల్లగొండలో కాల్‌మనీ కలకలం
నల్లగొండ : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన కాల్‌మనీ వ్యవహారం తాజాగా నల్లగొండ జిల్లాలో పడగ విప్పింది. నార్కెట్‌పల్లి మండలం, యల్లారెడ్డి గూడెంలో తాజాగా కాల్‌మనీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అనేకమంది బాధితులు కాల్‌మనీ బారిన పడినట్లు తెలిసింది. రూ.10వడ్డీతో పేదలనే లక్ష్యంగా చేసుకొని డబ్బులిస్తూ వసూలు చేసే క్రమంలో ఓ వ్యక్తి తీవ్ర అరాచకాలకు పాల్పడుతున్నాడు. పేదలు అని కూడా చూడకుండా వారిని ఇష్టం వచ్చినట్లు కొట్టడమే కాకుండా వారి ఇళ్లలోని మహిళలపై లైంగిక దాడి యత్నాలకు పాల్పడుతున్నాడు. ఆ గ్రామంలోని పెద్దలు కూడా అతడి తీరును సమర్థిస్తుండటం గమనార్హం. -
కాల్‌మనీ ఉచ్చులో ఎమ్మెల్యే పీలా
సీపీకి పెందుర్తి మండలానికి చెందిన ఓ కుటుంబం ఫిర్యాదు సాక్షి, విశాఖపట్నం/అల్లిపురం: నిన్న గాక మొన్న పొక్లె్లయిన్తో ప్రహరీని కూలగొట్టిన ఘటనలో పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఈయనపై కేసు నమోదైంది. ఇది మరవకముందే కాల్‌మనీ వ్యవహరంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వడ్డీవ్యాపారస్తులతో చేతులు కలిపి సెటిల్ మెంట్స్‌కు పాల్పడుతున్నారు. అప్పు తీర్చలేదనే అక్కసుతో పెందుర్తిలోని ఓ మైనార్టీ కుటుంబానికి చెందిన అరకోటికి పైగా విలువైన స్థిరాస్తిని కాజేసేందుకు ఏకంగా బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు అందింది. బాధితుల తెలిపిన వివరాల ప్రకారం .. పెందుర్తి మండలం రాతిచెరువుకు చెందిన షేక్ ఆదంబీ భర్త షేక్ మహ్మద్ఆలీతో కలిసి సర్వే నం.237/5బిలోని డోర్ నం.4–63/1లో నివసిస్తోంది. పెందుర్తి, విశాఖపట్నం మెయిన్‌రోడ్డులో వ్యాపారం చేసుకుంటున్న వీరు 2015 జూన్‌లో దేశపాత్రునిపాలేనికి చెందిన ఫైనాన్షియర్ రమణ నుంచి రూ.8 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఆ మొత్తానికి గతేడాది నవంబర్ వరకు వడ్డీతో కలిసి రూ.6 లక్షలు వరకు చెల్లించారు. నోట్ల రద్దు తర్వాత వడ్డీ చెల్లించలేకపోయారు. బాకీ చెల్లించాలని రమణ ఒత్తిడి తీసుకు వచ్చాడు. ఆర్థికభారం కావటంతో వారు ఉంటున్న ఇంటిని అమ్మకానికి పెట్టి వడ్డీతో కలిసి సింగిల్ పేమెంట్‌గా రూ.5లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారు. ఆ మేరకు మరొకరికి ఇంటిని అమ్మకానికి పెట్టి రూ.18 లక్షలు అడ్వాన్సు తీసుకున్నారు. ఆ మొత్తం నుంచి రూ.5 లక్షలు ఫైనాన్షియర్ రమణకు ఇచ్చేందుకు బాధిత కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. అమ్మకానికి పెట్టిన రాతిచెరువులోని బాధితుల ఇంటిని కబ్జా చేసే ఆలోచనతో ఫైనాన్షియర్ రమణ అనకాపల్లి ఎమ్మెల్యే ద్వారా బాధితులపై బెదిరింపులకు పాల్పడ్డారు. అప్పు తీసుకున్నప్పుడు ఖాళీ పేపర్లపై పెట్టిన సంతకాలను ఆసరాగా చేసుకుని సదరు వడ్డీ వ్యాపారి పత్రికల్లో బహిరంగ ప్రకటన ఇచ్చారు. ఆ ఇంటిని తమకు తనఖా పెట్టి సదరు వ్యక్తులు రుణం పొందారని, ఇంటిని ఎవరు కొనుగోలు.. అమ్మకాలు చేయడానికి వీల్లేదని సదరు ప్రకటన సారాంశం.అంతటితో ఆగకుండా సంతకాలు తీసుకున్న కాగితాలపై వంద రూపాయల స్టాంపులు అతికించి బాధితులు ఉంటున్న రాతిచెరువులోని ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. బాధితులు ప్రతిఘటించటంతో వడ్డీ వ్యాపారస్తుడు విషయాన్ని ఎమ్మెల్యే పీలా గోవింద్ దృష్టికి తీసుకెళ్లారు. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్‌సత్యనారాయణ రమ్మంటున్నారని ఫైనాన్సర్ రమణతోపాటు మరో పదిమంది వెళ్లి బాధితులను గురువారం సాయంత్రం 4గంటల సమయంలో ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లారు.అక్కడ సుమారు మూడు గంటల పాటు ఒక గదిలో బాధితురాలు షేక్ ఆదంబీ, ఆమె కుమార్తె షేక్ అఫ్రోజ్‌ల పట్ల కొంతమంది వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా నానా దుర్భాషలాడారు. మీ ఇంటిని మర్యాదగా అప్పగించండి లేకపోతే మీ అంతు చూస్తాం అంటూ ఎమ్మెల్యే పీలా గోవింద్, వడ్డీ వ్యాపారస్తుడు రమణలతో పాటు మరొక డాక్టర్ బెదిరించారని బాధితులు ఆరోపిస్తున్నారు. మీ ఇంటిని నేనే కబ్జా చేస్తాను ఏం చేస్తారో చూస్తాను అంటూ సాక్షాత్తు ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ తమను బెదిరించాడని బాధితులు సీపీకి ఫిర్యాదు చేసిన కాపీలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే గోవింద్ నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఆయన నుంచి తమకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని నగర పోలీస్ కమిషనర్ టి.యోగానంద్ను కలసి ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. కేసును జోన్–2, శాంతిభద్రతల డీసీపీ రవికుమార్ మూర్తికి అప్పగించినట్లు సీపీ యోగానంద్ తెలిపారు. -
పోలీస్ శక్తి
వాస్తవ ఘటనల ఆధారంగా కాల్‌మనీ నేపథ్యంలో రూపొందిన సినిమా ‘పోలీస్ పవర్’. శివ జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రానికి ఆయనే సంగీత దర్శకుడు. గుద్దేటి బసవప్ప మేరు మరో నిర్మాత. ఈ చిత్రం ఆడియో వేడుకలో వికలాంగులు, చిన్న పిల్లలకు సైకిల్స్ పంపిణీ చేశారు. ‘‘ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం’’ అని శివ జొన్నలగడ్డ అన్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: అవినాష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వసంత. -
కాల్‌మనీ వేధింపులు
– పురంలో కొనసాగుతున్న వడ్డీ వ్యాపారుల దందా హిందూపురం అర్బన్ : పట్టణంలో వడ్డీ వ్యాపారుల దందా కొనసాగుతోంది. కొంతకాలం క్రితం కాల్‌మనీ వ్యవహారంపై పోలీసులు తీవ్రంగా పరిగణించడంతో అఘ్నాతంలోకి వెళ్లిన వడ్డీ వ్యాపారులు తిరిగి వచ్చి దందా యథావిధిగా కొనసాగిస్తున్నారు. రోజు, వారం, నెలసరి పద్ధతిలో వడ్డీలు చెల్లింపులతో రోజుకు రూ.40 లక్షలకు పైగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. హిందూపురం పట్టణంలో వడ్డీ వ్యాపారులు సుమారు 40 మంది ఉన్నారు. వారు ప్రతిరోజు చిన్న వ్యాపారులు, కిరణాషాపుల వారికి పెద్దమొత్తాల్లో వడ్డీలకు అప్పు ఇచ్చి పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నారు. అవసరాలకు వడ్డీలు తీసుకున్న వ్యాపారులు కరువు పరిస్థితుల కారణంగా సరిగా వ్యాపారాలు జరగకపోవడంతో వడ్డీలు, అసలు చెల్లించలేకపోవడంతో వారి రుణాలు చక్రవడ్డీ రీతిలో పెరిగిపోతున్నాయి. వ్యాపారులే కాకుండా ఆర్టీసీ కార్మికులు, రైల్వే కార్మికులు కూడా కాల్‌మనీ ఉచ్చులో ఇరుక్కుపోయారు. ప్రతి నెలా వారికి వచ్చే వేతనాన్ని బ్యాంకుల్లో డ్రా చేసుకోలేకపోతున్నారు. వడ్డీ వ్యాపారులు వారి ఏటీఎం కార్డులు లాగేసుకుని ఆ నెల వడ్డీ, అసలు పట్టుకుని మిగిలిన మొత్తాన్ని వారికి ఇస్తున్నారు. చాలీచాలని మొత్తంతో ఇల్లు, పిల్లల చదువులు, ఇతర అవసరాలు తీర్చుకోలేక తిరిగి అప్పులు చేస్తూ కాల్‌మనీ చట్రంలో ఇరుక్కుపోయి వేధింపులకు గురవుతున్నారు. రోజువారి వడ్డీతో మొదలు వ్యాపారం రోజువారి వడ్డీతో మొదలవుతోంది. చిరు వ్యాపారులు, తోపుడుబండ్ల వారికి ఉదయం రూ.900 ఇస్తే సాయంత్రానికి రూ.వెయ్యి ఇవ్వాలి. ఇదే రీతిలో రూ.9 వేలు ఇస్తే రూ.10 వేలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా వడ్డీ వ్యాపారం జోరుగా సాగిపోతోంది. పట్టణంలో ఉన్న వారికి తోడు ఇటీవల గుంటూరు ప్రాంతం నుంచి కొందరు వ్యాపారులు వచ్చి వడ్డీ వ్యాపారానికి దిగారు. టింబర్, ఐరన్ వ్యాపారులకు భారీ మొత్తంలో అప్పు ఇచ్చి వడ్డీ రూపంలో వారి లాభాలను పిండేస్తున్నారు. -
కాల్నాగ్లు- మళ్లీ బుసలు కొడుతున్నాయ్
– జిల్లాలో మళ్లీ కాల్‌మనీ వేధింపులు – గుత్తిలో అప్పున్న ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఓ ప్రజాప్రతినిధి కుమారుడు – పోలీసుల జోక్యంతో క్షేమంగా ఇంటికి – కరువు దెబ్బతో జీవనోపాధికి అప్పులు చేస్తున్న రైతులు, కూలీలు – కాల్‌మనీ వేధింపులకు మూల సమస్య...రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవడమే – బయటపడేందుకు వడ్డీవ్యాపారులను ఆశ్రయిస్తున్న వైనం సాక్షిప్రతినిధి, అనంతపురం : జిల్లాలో మళ్లీ కాల్‌నాగులు బుసలు కొడుతున్నాయి. భారీ వడ్డీలకు అప్పులిచ్చి, వాటిని వసూలు చేసేందుకు వేధింపులకు దిగుతున్నారు. గతేడాది కృష్ణా జిల్లాలో తెరపైకి వచ్చిన 'కాల్‌మనీ' ఉదంతంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా జిల్లాలోనూ వడ్డీవ్యాపారుల నుంచి ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్యలతో కొద్దికాలంపాటు మౌనంగా వ్యవహారాలు చక్కబెట్టిన కాల్‌మనీ మాఫియా మళ్లీ విజృంభిస్తోంది. సోమవారం వెలుగులోకి వచ్చిన ఓ ఘటనతో మళ్లీ వేధింపులు ఉన్నాయనేది స్పష్టమవుతోంది. అనంతపురం నగర పాలక వర్గంలోని ఓ ప్రజాప్రతినిధి తనయుడు గుత్తిలోని ఓ వ్యక్తికి రూ.25లక్షల అప్పు ఇచ్చాడు. ఈ డబ్బు చెల్లించలేదని సోమవారం సదరు వ్యక్తిని గుత్తిలో కిడ్నాప్ చేసి 'అనంత'కు తీసుకువచ్చారు. ఈ వ్యవహారం పోలీసులకు తెలియడంతో జోక్యం చేసుకుని ఆ వ్యక్తిని తిరిగి పంపేశారు. జిల్లాలో అసలే కరువు పరిస్థితి. పంటల సాగుకు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు కూడా చెల్లించలేని పరిస్థితి. ఈ క్రమంలో పిల్లల చదువులు, జీవనోపాధికి అధికవడ్డీలతో ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తీసుకుంటున్నారు. సకాలంలో చెల్లించలేక వడ్డీవ్యాపారుల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారు. రైతులతో పాటు చిరువ్యాపారులు, ఉద్యోగులు..ఇలా అన్ని వర్గాల ప్రజలకు 'కాల్‌మనీ' కష్టాలు ఉన్నాయి. వసూళ్లు ఇలాఽ... ఉదాహరణకు మైనుద్దీన్ అనే వ్యక్తికి రూ.10వేలు అవసరం వచ్చింది. వడ్డీ వ్యాపారిని ఆశ్రయించాడు. రూ.10వేలు...పదివారాలకు చెల్లించేలా అప్పు ఇచ్చాడు. పదివారాలకు వెయ్యి రూపాయల వడ్డీ అని చెప్పి ఆ సొమ్మును ముందే పట్టుకున్నాడు. చేతికి రూ.9వేలు ఇచ్చాడు. అలాగే లక్ష్మి అనే మహిళకు రూ.10వేలు అవసరం కావడంతో వడ్డీవ్యాపారితో తీసుకుంది. వందకు రూ.10 చొప్పున పదివేలకు వారానికి రూ.వెయ్యి ఽవడ్డీ చెల్లించాలి. అసలు రెన్నెళ్లకు చెల్లిస్తారా, రెండేళ్లకు చెల్లిస్తారా అనేది వడ్డీవ్యాపారి పట్టించుకోడు. ప్రతివారం రూ.వెయ్యి వడ్డీ ఇస్తే అసలు ఎంతకాలమున్నా అడగడు. ఒకవేళ నాలుగువారాలు చెల్లించలేకపోతే ఈ నాలుగువేలు కూడా అసలులో జమ చేసుకుని వడ్డీసొమ్మును రూ.1400కు పెంచుతాడు. జిల్లాలో ఇలా పేదల నడ్డి విరిచేలా వడ్డీ వసూలు చేస్తున్నారు. 'అనంత'లో వసూల్ రాయుళ్లు అధికం అధిక వడ్డీలు వసూలు చేసే దందాకు కాల్‌మనీ మాఫియా పెట్టుకున్నపేరు 'ఫైనాన్స్'! ఈ దందా నడుపుతున్న వారిలో 'అనంత'లోని ద్వారకానగర్‌కు చెందిన ఓ నాయుడు, చౌదరి ఉన్నారు. రాంనగర్లో భారీమీసాలు, ఒంటిపై అరకిలో బంగారంతో దందా నడిపే వ్యక్తి, ఇదే ప్రాంతంలో మరో వ్యక్తి ఉన్నారు. ధర్మవరంలో 'సినిమా' థియేటర్ నడుపుతున్న ఓ వ్యక్తి కాల్మనీతోనే ఆర్థికంగా ఎదిగారు. ఇప్పుడు కూడా వడ్డీవ్యాపారాన్ని ధర్మవరంతో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరింపజేశారు. ఇదే మండలంలో ఓ వ్యక్తి ఇటీవల ఒకరిని కిడ్నాప్ చేసి రూ.11 లక్షల అప్పు ఉన్నట్లు బాండు రాయించుకున్నారు. అలాగే అనంతపురం సర్వజన ఆస్పత్రిలోని ఇద్దరు ఉద్యోగులు కూడా కాల్‌మనీ వ్యవహారం నడుపుతున్నారు.గుంతకల్లు, కదిరి, హిందూపురం, తాడిపత్రితో పాటు చాలా పట్టణాల్లో ఈ తరహా వేధింపులు అధికమవుతున్నాయి. అనంతపురంతో పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసుస్టేషన్లకు వచ్చే ప్రతి పది కేసుల్లో కనీసం నాలుగు 'కాల్‌మనీ' వ్యవహారాలే కావడం గమనార్హం. ఈ క్రమంలో పోలీసులు మరోసారి ప్రత్యేకదృష్టి సారించాల్సి ఉంది. బాధితుల్లో అధికశాతం డ్వాక్రా మహిళలే జిల్లా వ్యాప్తంగా 52 వేల డ్వాక్రా సంఘాలలో 5.40 లక్షలమంది సభ్యులు ఉన్నారు. వీరు 2014 ఎన్నికల నాటికి రూ.990 కోట్ల బకాయిలు ఉన్నారు. వీటన్నిటినీ మాఫీ చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఒక్కో సంఘం 4–7 నెలల వరకూ రుణాలు చెల్లించలేదు. సీఎం అయిన తర్వాత చంద్రబాబు మాట తప్పారు. మాఫీ ప్రకటనను అటకెక్కించారు. దీంతో బకాయిలు చెల్లించాలని బ్యాంకర్లు నోటీసులు పంపి ఒత్తిడి పెంచారు. తప్పని పరిస్థితుల్లో అధికవడ్డీలకు అప్పులు చేసి కాల్‌మనీ ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ అప్పులను సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీవ్యాపారులు వేధింపులకు దిగారు. దీంతో తిరిగి మరో వ్యక్తి వద్ద అప్పులు చేయాల్సి వస్తోంది. ఇలా తాత్కాలిక ఉపశమనం కోసం మరోచోట అప్పు చేయడం మినహా ఈ ఊబి నుంచి బయటపడలేకపోతున్నారు. ఇదే పరిస్థితిని చాలామంది రైతులు కూడా ఎదుర్కొంటున్నారు. -
కూకట్‌పల్లిలో కాల్‌మనీ కలకలం
అప్పిచ్చిన వారి వేధింపులు తాళలేక ఓ వ్యక్తి కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం చేశాడు. తన వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడబోయాడు. రౌడీలతో కలిసి గన్‌తో బెదిరించి ప్రాంసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులు తీసుకున్నారని బాధితుడు శ్రీనివాసరావు ఆరోపిస్తూ పురుగుల మందు తాగాడు. దీంతో పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీస్ పవర్
కాల్‌మనీ పేరుతో సమాజాన్ని పట్టి పీడిస్తున్న అరాచక శక్తులపై ఓ పోలీస్ సాగించిన పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘పోలీస్ పవర్’. స్వీయదర్శకత్వంలో శివ జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ, రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని బసవప్ప మేరు నిర్మించారు. నందినీ కపూర్, ధరణి కథానాయికలు. దర్శకుడు శివ మాట్లాడుతూ -‘‘ఈ సినిమాలోని పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఏడు ఫైట్స్‌లో మూడు పోరాట సన్నివేశాలను చిత్రీకరించాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: బీఎస్. కుమార్, ఫైట్స్: అవినాశ్. -
కాల్ నాగుల కాటు
► చాపకింద నీరులా వడ్డీ వ్యాపారం ► అనుమతి లేకుండానే కొనసాగింపు ► గుంటూరులో దంపతుల బలవన్మరణం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ కాల్‌మనీ వ్యవహారం మర్చిపోకముందే గుంటూరులో మరో విషాదం చోటుచేసుకుంది. కాలకూట విషపు నాగుల కాటుకు దంపతులు బలవన్మరణం చెందడం నగరవాసుల్లో విచారం నింపింది. అధికారం మాటున కొందరు వడ్డీ వ్యాపారులు అరాచకాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం కనీసంగా స్పందించకపోవడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.- పట్నంబజారు(గుంటూరు) పట్నంబజారు (గుంటూరు): గుంటూరు నగరం కాల్‌మనీ వ్యాపారానికి పెద్ద అడ్డాగా మారింది. మూడు పువ్వులు...ఆరు కాయలుగా ఈ వ్యాపారం యథేచ్ఛగా సాగిపోతోంది. ఏ విధమైన అనుమతులు లేకుండానే కొందరు వడ్డీ వ్యాపారులు జనానికి కోట్లాది రూపాయలు అప్పులిచ్చి అంతకంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేసుకుంటున్నారు. విజయవాడలో కాల్‌మనీ వ్యవహారం బయటకు వచ్చిన సమయంలో కొద్దిగా హడావుడి చేసిన పలు శాఖల అధికారులు ఆ తర్వాత మిన్నకుండిపోయారు. కొంతకాలం కిందట బ్రాడీపేటకు చెందిన చిరు వ్యాపారి శ్రీరామమూర్తి వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇదే క్రమంలో బుధవారం కొత్తపేటకు చెందిన గండి నాగభూషణం, యామిని దంపతులు కాల్‌మనీ వ్యాపారుల వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారని బంధువులు ఆరోపిస్తున్నారు. కొత్తపేటలోని చిన్న ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ఉండే నాగభూషణం (45) ఏలూరుబజారు, రైలుపేటల్లో జీడిపప్పు దుకాణాలు నిర్వహిస్తూ ఉండేవారు. వ్యాపారాభివృద్ధి కోసం అప్పులు చేశారు. వడ్డీలు అధికంగా వసూలుచేస్తున్నా కట్టుకుంటూ వస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు రావడం, వడ్డీల కోసం వ్యాపారుల వేధింపులు అధికమవడంతో దంపతులు మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు ముఖేష్ ఇంటర్మీడియెట్, కుమార్తె మేఘన పదో తరగతి చదువుతున్నారు. పోలీసులకు వడ్డీ వ్యాపారులపై ఫిర్యాదుల వెల్లువ... ఇటీవల కాలంలో అర్బన్, రూరల్ జిల్లాల ఉన్నతాధికారులకు వడ్డీ వ్యాపారుల వేధింపులపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ప్రతి సోమవారం నిర్వహించే పోలీసు గ్రీవెన్స్‌కు 80 శాతం ఫిర్యాదులు కేవలం వడ్డీ వ్యాపారుల బాధితుల నుంచే వస్తున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గుంటూరు, పరిసర ప్రాంతాల్లో రూ. 100కు రూ. 30 చొప్పున వడ్డీ వసూలు చేసే వ్యాపారులున్నారు. డొంకరోడ్డు, అరండల్‌పేట, బ్రాడీపేట, కొత్తపేట, పట్నంబజారు, లాలాపేట, ఆర్టీసీ బస్టాండ్, పరిసర ప్రాంతాలను కేంద్రాలుగా చేసుకుని అనుమతి లేని వడ్డీ వ్యాపార కార్యాలయాలు నిరాటంకంగా సాగుతున్నాయి. పోలీసులకు వీరి గురించి పూర్తిగా తెలిసినప్పటికీ పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో వడ్డీ వ్యాపారుల నివాసాలపై దాడులతో హడావుడి చేసిన అధికారులు ప్రస్తుతం మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపణలున్నాయి. అధికార పార్టీకి చెందిన వారే ఈ వడ్డీ వ్యాపారుల్లో ఎక్కువ మంది ఉన్నారు. ఆస్తుల తాకట్టు పెడితేనే.... ప్రజల అవసరమే వడ్డీ వ్యాపారుల ఆయుధం. కేవలం వడ్డీ చెల్లిస్తామంటే అప్పులివ్వరు. స్థలాలు, ఇళ్లు, బంగారు నగలు తాకట్టు పెట్టుకొని మరీ డబ్బులిస్తారు. దీనికి తోడు నెలనెలా భరించలేని వడ్డీ ఉంటుంది. నెలల వ్యవధిలోనే వడ్డీని అసలుతో కలిపేసి చెల్లించాల్సిన మొత్తాన్ని వ్యాపారులు పెంచేస్తారు. అప్పు పెరిగిపోయి కట్టలేక వందలాది మంది తాము తాకట్టు పెట్టిన ఆస్తులను వడ్డీ వ్యాపారులకు రాసిన సంఘటనలు నగరంలో కోకొల్లలుగా ఉన్నాయి. -
కాల్‌మనీ కోరలు పీకుదాం
అన్నీ మానవీయ కోణంతో ముడిపడిన కేసులే.. పోలీసులు, న్యాయవాదులు సమన్వయంతో ముందుకెళ్లాలి కాల్‌మనీ వర్క్‌షాపులో పలువురు వక్తలు సాంఘిక దురాచారంగా మారిన కాల్‌మనీ కోరలు పీకాలని విజయవాడ ఎ-కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం జరిగిన కాల్‌మనీ వర్క్‌షాప్‌లో పలువురు పేర్కొన్నారు. సామాజిక చైతన్యం, బ్యాంకర్ల పూర్తి సహకారం ఉన్నప్పుడే ఈ కేసులకు అడ్డుకట్ట పడుతుందన్నారు. పోలీసులు విస్తృత ప్రచారం చేయడంతోపాటు అవగాహన కల్పించడం మంచి పరిణామమన్నారు. -
మహిళకు కాల్‌మనీ వేధింపులు
రామచంద్రపురం(తూర్పుగోదావరి జిల్లా): అధిక వడ్డీలు వేసి, ఇచ్చిన అప్పు వెంటనే తీర్చాలని, లేకుంటే విలువైన స్థలం లాక్కుంటామని బెదిరించడమే కాకుండా, తనను లైంగిక వేధింపులకు గురి చేశారని ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు, రామచంద్రపురం పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణానికి చెందిన కృష్ణవేణి భర్త అప్పారావు ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల రీత్యా 2010లో కుతుకులూరుకు చెందిన నల్లమిల్లి వీర్రెడ్డి నుంచి రూ.2 లక్షల అప్పు తీసుకున్నారు. ఇందుకోసం కత్తిపూడిలో ఉన్న స్థలం అస్వాధీన తనఖా పెట్టాలని షరతు విధించడంతో, దానికి సమ్మతించారు. ఈ నేపథ్యంలో రామచంద్రపురంలోని ఆమె తండ్రి ఇంటికి వీర్రెడ్డి, సత్తి శ్రీనివాసరెడ్డి, పులగం వీఆర్జీ కృష్ణారెడ్డి, సత్యనారాయణరెడ్డి, నల్లమిల్లి జనార్దనరెడ్డి వచ్చి ఆమె, భర్త అప్పారావు, వారి బంధువుల వద్ద కలిపి మొత్తం 10 ఖాళీ చెక్కులు, 10 ఖాళీ ప్రామిసరీ నోట్లు, 10 కాంటస్సా పేపర్లపై సంతకాలు తీసుకున్నారు. స్థలం ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుని 2010 జూన్‌లో తుని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు అస్వాధీన తనఖా చేసుకునేందుకు పిలిపించారు. అయితే అస్వాధీన తనఖా కాకుండా కాగితాలను మార్చి పవర్ ఆఫ్ పట్టాగా రాయించుకున్నారని, దీనిపై అడగ్గా ఎటువంటి సమస్యా ఉండదని వీర్రెడ్డి నమ్మబలికారని కృష్ణవేణి చెప్పింది. నెలనెలా వడ్డీలు కడుతున్నా, రూ.40 లక్షలు వెంటనే కట్టాలని, లేకుంటే స్థలం స్వాధీనం చేసుకుని, వేరేవారికి అమ్ముతామంటూ బెదిరించారని వివరించింది. ఈ క్రమంలో నిందితులు అయిదుగురూ తన తండ్రిని, తనను దుర్భాషలాడి వేధించడం ప్రారంభించారన్నారు. తాము మోసపోయమని తెలుసుకుని వారి నుంచి బయటపడే ఉద్దేశ్యంతో విశాఖ జిల్లా గాజువాకలో ఉన్న ఇంటిపై అప్పు తీసుకుని రూ.17 లక్షల సెటిల్మెంట్కు వెళ్లగా రూ.12 లక్షలు తీసుకుని కొన్ని కాగితాలు మాత్రమే ఇచ్చారని, మిగిలినవి ఇవ్వలేదని, భూమి తనఖా రద్దు చేయలేదని కృష్ణవేణి చెప్పింది. మిగిలిన కాగితాలు ఇస్తామని చెప్పి సోమేశ్వరం గ్రామ శివార్లలోని లక్ష్మీగణపతి రైస్‌మిల్లు వద్దకు రమ్మని పిలిచి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడికి యత్నించటమే కాకుండా దానిని వీడియో తీశారని, యూట్యూబ్, సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరిస్తున్నారని ఆమె వాపోయింది. బలవంతంగా అక్కడి నుంచి బయటపడినా వీడియోలతో భయపెడుతున్నారని విలపించింది. అప్పటి నుంచీ లైంగిక వేధింపులకు గురి చేయటం మొదలెట్టారని చెప్పింది. ఈ మేరకు గత ఏడాది డిసెంబర్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, చివరకు హైకోర్టును ఆశ్రయించానని వివరించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారని తెలిపింది. పోలీసు ఉన్నతాధికారులు తనను కాపాడాలని, నిందితుల వద్ద ఉన్న వీడియోలు స్వాధీనం చేసుకోవాలని, అవి బయట పడితే తనకు చావు తప్ప వేరే శరణ్యం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై బాధితురాలి ఫిర్యాదు, కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు రామచంద్రపురం ఎస్సై ఎల్. శ్రీను నాయక్ తెలిపారు. -
వెనిగళ్ల శ్రీకాంత్ ఎక్కడ?
► కాల్‌మనీ కేసులో కీలక నిందితుడు ఆరు నెలలుగా పరారీలోనే ► అధికార పార్టీ నేతల సహకారంతో అజ్ఙాతంలో ► శ్రీకాంత్ వద్ద అధికార పార్టీ నేతల పెట్టుబడులు ► తరచూ నగరానికి వస్తున్న శ్రీకాంత్! ► రాజకీయ ఒత్తిళ్లతో పట్టించుకోని పోలీసులు ► ఆరు నెలలు గడిచినా పురోగతి లేని కేసు సాక్షి, విజయవాడ : రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ కేసు ప్రకంపనలు మళ్లీ నగరంలో మొదలయ్యాయి. కేసులో కీలక సూత్రధారి, ఏ-6 నిందితుడుగా ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్ మినహా మిగిలిన వారందరూ అరెస్టయ్యారు. కాల్‌మనీ వ్యవహారం వెలుగులోకి వచ్చి ఆరు నెలలు గడిచిపోయినా కీలక నిందితుడుగా ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసే దిశగా పోలీసులు కనీసం దృష్టి సారించకపోవటం గమన్హారం. ఈ క్రమంలో శ్రీకాంత్ పరారీలోనే ఉంటూ పాత వ్యవహారాలను చక్కబెట్టే పనుల్లో బిజీగా మారినట్లు సమాచారం. నాలుగేళ్ల కిత్రం రూ.20 లక్షల పెట్టుబడితో కాల్‌మనీ వ్యాపారం మొదలుపెట్టిన శ్రీకాంత్ కోట్ల రూపాయలకు ఎదగడం వెనుక కాల్‌మనీ దందాలు, దాడులతో పాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సహకారం, భారీ పెట్టుబడులు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఘటన... గత ఏడాది డిసెంబర్ 10న కాల్‌మనీ ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. మొగల్రాజపురానికి చెందిన ఓ బాధిత మహిళ నేరుగా నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయటంతో వీరి గుట్టు బట్టబయలైంది. 11న యలమంచలి రాము కార్యాలయంపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేసిన క్రమంలో 25 వరకు సీడీలు (మహిళల్ని లోబర్చుకున్న వీడియోలు), 3 బస్తాల డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్ల బయటపడ్డాయి. దీంతో 12 మందిపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశారు. దశలవారీగా నిందితుల అరెస్టులు జరిగాయి. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించటమే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్ర శాసనసభను కుదిపేసింది. ఆరో నిందితుడుగా ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్ తనకు స్నేహితుడు మాత్రమేనని, అతని లావాదేవీలతో సంబంధం లేదని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మీడియా సమావేశం పెట్టి మరీ వివరణ ఇచ్చుకోవటంతో పాటు అసెంబ్లీలోనూ దీనిపై వివరణ ఇచ్చుకున్నారు. ఈ పరిణామాల క్రమంలో కమిషనరేట్ పోలీసులు కేసును పూర్తిస్థాయిలో ఛేదించామనే రీతిలో హడావుడి చేశారు. ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి 1181 కాల్‌మనీ ఫిర్యాదులు తీసుకొని వాటిలో 1104 సెటిల్ చేసినట్లు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు కీలక కేసులో నిందితుడిని మాత్రం గుర్తించి అరెస్టు చేయకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. కాపాడుతున్నది అధికార పార్టీ నేతలే! సిండికేట్ టీమ్‌లో సభ్యులందరూ ఒక్కో ప్రజాప్రతినిధి వద్ద పరపతి బాగా పెంచుకొని హవా సాగించారు. శ్రీకాంత్ కొంత దూకుడుగా ఉండి కాల్‌మనీ వ్యవహారాల్లో అనేక మందిపై దాడులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాలుగేళ్ల కిత్రం రూ.20 లక్షల పెట్టుబడితో కాల్‌మనీ వ్యాపారం మొదలుపెట్టిన శ్రీకాంత్ అంచెలంచెలుగా ఎదిగాడు. దీని వెనుక అధికార పార్టీ నేతల పూర్తి సహకారం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా నగరానికి చెందిన ప్రజాప్రతినిధి, నగర సమీపంలోని నియోజకవర్గానికి చెందిన ఒక అధికార పార్టీ ప్రజాప్రతినిధి పెట్టుబడులు అతని వద్ద పెట్టినట్లు సమాచారం. వారి నగదు వ్యవహారం సెటిల్ అయ్యే వరకు శ్రీకాంత్‌ను దొరకకుండా కాపాడుతున్నారనే ఆరోపణ ఉంది. కాల్‌మనీ ముఠాకు రావాల్సిన బకాయిలు కూడా వసూలు చేసేందుకే అతన్ని పోలీసులు అరెస్టు చేయకుండా ప్రజాప్రతినిధులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. ఈ క్రమంలో పరారీలో ఉన్న శ్రీకాంత్ తరచూ విజయవాడ నగరానికి వస్తున్నట్లు తెలిసింది. గత వారంలో విజయవాడలో జరిగిన ఒక ఫంక్షన్‌కు కూడా శ్రీకాంత్ హాజరైనట్లు నిఘా వర్గాల కథనం. వివాదాలివీ... శ్రీకాంత్ పరారీ వెనుక అధికార పార్టీ ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కేసులో 12 మంది నిందితులకు గాను శ్రీకాంత్ మినహా మిగిలిన వారంతా అరెస్టయ్యారు. ఘటన జరి గిన రోజు నుంచే శ్రీకాంత్ పరారీలో ఉన్నాడు. పోరంకి గ్రామానికి చెందిన శ్రీకాంత్‌పై పటమట పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీటు ఉంది. గతంలో పటమట ప్రాంతానికి చెందిన ఒక డాక్టర్‌తో స్నేహంగా ఉంటూ చివరకు అతని తమ్ముడిపైనే దాడి చేశాడు. దీనిపై పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరడంతో ఉయ్యూరుకు చెందిన ఒక అధికార పార్టీ నేత, హైదరాబాద్‌లో హత్యకు గురైన రౌడీషీటర్ ద్వారా వివాదాన్ని సెటిల్ చేయించుకున్నాడు. దీంతో శ్రీకాంత్ అప్పట్లో ఒక టీడీపీ నేతకు అనుచరునిగా మారిపోయాడు. కాలక్రమంలో సదరు నేత ప్రజాప్రతినిధి కావటంతో శ్రీకాంత్ ఆగడాలు మొదలయ్యాయి. వెంటనే సిండికేట్ టీమ్‌లో కీలక వ్యక్తిగా మారాడు. ఈ క్రమంలోనే తాము బిల్డింగ్ అద్దెకు తీసుకున్న భవన యజమానిపై దాడి చేశాడు. -
కాల్‌నాగులు
► కాల్‌మనీ ఉచ్చులో భారీ బిల్డర్ ముఠా నుంచి పెరిగిన ఒత్తిళ్లు ► కానూరులో మహిళకు వేధింపులు ► రూ.26 లక్షల అసలుకు రూ.67 లక్షలు వసూలు ► అంతటితో ఆగకుండా రూ.5 కోట్ల విలువైన స్థలం స్వాధీనం ► మళ్లీ నగరంలో దందా షురూ సాక్షి, విజయవాడ : రాజధాని నగరంలో కాల్‌మనీ ప్రకంపనలు మళ్లీ మొదలయ్యాయి. కాల్‌మనీ ముఠా సభ్యులు నగరంలోని భారీ రియల్టర్‌కు ఆర్థిక అవసరాలకు అప్పు ఉచ్చి ఆస్తుల స్వాధీనానికి యత్నించారు. అంతటితో ఆగక వేధింపులు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఒక మహిళను కూడా ఈ ముఠా వేధించింది. అసలుకు రెండు రెట్లు వసూలు చేయటంతో పాటు కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఇంకా డబ్బు కట్టాలని వేధిస్తూ మహిళను మానసిక క్షోభకు గురిచేసింది. పర్యవసానంగా సదరు మహిళ ఆత్మహత్య చేసుకునే స్థితికి వెళ్లింది. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో విజయవాడ కమిషనరేట్ పోలీసుల్ని ఆశ్రయించింది. ఈ ఘటనతో మళ్లీ కాల్‌మనీ దందా కార్యకలాపాలు జోరుగా సాగుతున్నట్టు తేటతెల్లమైంది. ఇదిగాక వెలుగులోకి రాని ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా బీజేపీ నేతలు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ వ్యవహారాన్ని కదిలించారు. దీంతో మళ్లీ అనేక మంది కాల్‌మనీ ముఠా, బడా బాబుల ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళ ఫిర్యాదుతో మరోసారి వెలుగులోకి... విజయవాడ నగరంలో కాల్‌మనీ ముఠా ఆగడాలు మళ్లీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణగడంతో గతంలో అప్పులు ఇచ్చినవారు తిరిగి వేధింపులు సాగిస్తూ వసూళ్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది. శుక్రవారం కానూరుకు చెందిన మహిళ చలసాని నిర్మల కాల్‌మనీ ముఠాపై ఫిర్యాదు చేయటంతో ఈ వ్యవహారం వెలుగులోకొచ్చింది. నిర్మల ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం.. కానూరుకు చెందిన కాల్‌మనీ వ్యాపారి అన్నే శివనాగేశ్వరరావు వద్ద 2009లో అదే గ్రామంలో తనకున్న 2057 గజాల స్థలాన్ని తనఖా పెట్టి పిల్లల చదువు కోసం 26.90 లక్షలు అప్పుగా తీసుకున్నారు. దశలవారీగా 2014 సంవత్సరం కల్లా అసలు, వడ్డీ కలిపి రూ.67.88 లక్షలు చెల్లించారు. ఈ నేపథ్యంలో తాను తనఖా పెట్టిన స్థలం జీపీఏను రద్దు చేసి తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా కోరారు. అప్పటికే కాల్ ముఠా సభ్యుడు అన్నే శివనాగేశ్వరరావు ఆమెకు తెలియకుండా స్థలాన్ని వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశాడు. ప్రస్తుతం స్థలం బహిరంగ మార్కెట్ విలువ రూ.5 కోట్ల వరకు ఉంటుంది. ఈ విషయంపై గ్రామంలో పెద్ద మనుషుల వద్ద పంచాయితీ పెట్టినా న్యాయం జరగలేదు. దీంతో బాధితురాలైన నిర్మల కమిషనరేట్ పోలీసులను ఆశ్రయించారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేసును విచారిస్తున్నారు. కాల్ ఉచ్చులో మరో బడా బిల్డర్ కాల్‌మనీ ముఠా ఉచ్చులో మరో బడా బిల్డర్ చిక్కుకున్నట్లు సమాచారం. కానూరు ప్రాంతానికి చెందిన ఒక బిల్డర్ అనతికాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో బాగా గడించారు. తొలుత వ్యాపారానికి బయట నుంచి అప్పులు తెచ్చి విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లో పలు బహుళ అంతస్తుల సముదాయాలు పలు నిర్మించారు. ఈ క్రమంలో భారీగా సంపాదించినట్లు సమాచారం. ఒక దశలో ఆయనకు పెట్టుబడులు పెట్టేందుకు అనేకమంది ముందుకొచ్చారు. అదే క్రమంలో వ్యాపారంలో తాత్కాలిక సర్దుబాట్ల కోసం కాల్‌మనీ కేసు నిందితుల నుంచి గతంలో కొంత మొత్తం అప్పుగా తీసుకున్నారు. దీనికి నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న పలు ఆస్తుల్ని తనఖా పెట్టి జీపీఏ రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు బకాయిని అసలు కంటే నాలుగు రెట్లు పెంచి మొత్తం ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి కాల్‌మనీ ముఠా యత్నిస్తున్నట్లు తెలిసింది. వేధిస్తున్న ముఠా సభ్యులు గతంలో కాల్‌మనీ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తులని సమాచారం. దీనికోసం బౌన్సర్లను వినియోగించి బిల్డర్‌పై దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. మరోవైపు ఈ కేసులో కాల్‌మనీ కేసులో పరారీలో ఉన్న వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. పరారీలో ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్ ద్వారా ఈ అప్పులు తీసుకున్నట్లు తెలిసింది. వెనిగళ్ల శ్రీకాంత్ గతంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌తో కలిసి విదేశాలకు వెళ్లాడని విస్తృత ప్రచారం జరిగింది. పోలీసులు మాత్రం ఈ కీలక కేసులోని నిందితుడైన వెనిగళ్ల శ్రీకాంత్ ఆచూకీని మాత్రం ఇంతవరకు కనిపెట్టలేకపోయారు. రాజకీయంగా పరపతి ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్ పరారీ వెనుక అధికార పార్టీ నేతల కీలక సహకారం ఉందనేది బహిరంగ రహస్యం. -
డబ్బు అడిగితే.. అశ్లీల చిత్రాలు బయటపెడతా!
► విజయవాడలో కాల్‌మనీ వ్యాపారి రవికాంత్ ఆగడాలు ► మహిళల వద్ద అప్పు తీసుకుని ఎగ్గొడుతున్న వైనం ► తిరిగి చెల్లించాలని అడిగితే బెదిరింపులు.. టీడీపీ నేతల అండ ► కృష్ణలంకలో మహిళల ఆందోళన విజయవాడ: కృష్ణాజిల్లా విజయవాడలో మళ్లీ కాల్ మనీ వ్యవహారం కలకలం సృష్టించింది. ఓ మహిళను లైంగికంగా వేధిస్తున్న కేసులో టీడీపీకి చెందిన కాల్‌మనీ వ్యాపారి మండవ రవికాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రవికాంత్ ఆరాచకాలపై మహిళా సంఘాలు శనివారం ఆందోళన చేపట్టాయి. కృష్ణలంకలో రవికాంత్ ఇంటి ఎదుట ఆయనకు వ్యతిరేకంగా కొందరు మహిళలు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. రవికాంత్‌కు టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో తన పలుకుబడిని వాడి రెండు రూపాయల వడ్డీ చెల్లిస్తానని మహిళల వద్ద డబ్బులు వసూలు చేసేవాడు. ఇలా దాదాపు కోటి రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఆ డబ్బును కాల్‌మనీలో పెట్టుబడిగా పెట్టి వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. కాల్ మనీ కేసుకు సంబంధించిన కేసులో అరెస్టయ్యాడు. 10 మంది మహిళలను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలున్నట్లు పోలీసులు వెల్లడించారు. రవికాంత్ కు ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని అడిగిన మహిళలను బెదిరించేవాడు. డబ్బు అడిగితే వారి అశ్లీల చిత్రాలను పెన్ డ్రైవ్, డీవీడీలలో సేవ్ చేశానని, వాటిని బయటపెడతానని తరచుగా వేధింపులకు గురిచేసేవాడని మహిళలు తమ బాధను చెప్పుకొన్నారు. రవికాంత్ కు అండగా ఉన్న టీడీపీ ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
బ్లాక్‌మెయిలర్ల పంజా
► అడుగడుగునా నేరాలు ► మొన్న దేశాన్ని కుదిపేసిన కాల్‌మనీ వ్యవహారం ► నిన్న చర్చి ఫాదర్‌పై దందా ► నేడు వివాహితపై వెలుగుచూసిన అకృత్యాలు విజయవాడ కమిషనరేట్ పరిధిలో బ్లాక్మెయిల్ నేరాలు, అకృత్యాలు పెచ్చుమీరుతున్నాయి. కొంతమంది నగ్న చిత్రాలు, వీడియోలతో బెదిరించి లక్షలు, కోట్లలో నగదు వసూళ్లకు పాల్పడుతున్నారు. మరికొందరు.. మహిళలపై అకృత్యాలకు తెగబడుతున్నారు. ఇటీవలే వెలుగుచూసిన చర్చి ఫాదర్ బ్లాక్మెయిల్ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కాల్‌మనీ వ్యవహారాన్ని మరువకముందే.. సింగ్‌నగర్ పరిధిలోని రామలింగేశ్వనగర్‌లో మరో మహిళపై అకృత్యం ఉదంతం తాజాగా వెలుగులోకొచ్చింది. సాక్షి ప్రతినిధి, విజయవాడ/ సాక్షి, విజయవాడ : రాజధాని నగరంలో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. సంచలనం రేపిన కాల్‌మనీ వ్యవహారం నుంచి పేరెన్నికగన్న చర్చి ఫాదర్ వ్యవహారం వరకు నగరంలో నేరాలు రకారకాల తీరులో బయటపడుతున్నాయి. చర్చి ఫాదర్ ఘటనలో నగ్న చిత్రాలు, వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు ఇటీవల అరెస్టు చేసి కోర్టుకు పంపించారు. వారిపై ప్రత్యేక విచారణ కోసం కోర్టు పోలీసు కస్టడీకి ఇచ్చింది. ఈ ఘటనలో అనేక కోణాలు కూడా వెలుగు చూసిన విషయం తెలిసిందే. వివాహితపై టీడీపీ చోటా నేత లైంగిక దోపిడీ తాజాగా సింగ్‌నగర్ పరిధిలోని రామలింగేశ్వనగర్‌లో వెలుగుచూసిన ఘటన నగరంలో పెచ్చుమీరుతున్న నేరప్రవృత్తికి మరో ఉదాహరణ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భర్తతో విభేదాల నేపథ్యంలో ఒక వివాహిత రామలింగేశ్వనగర్‌లో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. పక్క ఇంట్లో మండవ రవికాంత్ అనే టీడీపీ చోటా నేత, రియల్టర్ తన రెండో భార్య శ్రీదేవితో కలిసి ఉంటున్నాడు. అతని మొదటి భార్య కృష్ణలంకలో నివసిస్తున్నారు. ఇంటి పక్కన నివసించే వివాహితపై కన్నేసిన రవికాంత్ ఆమెను లోబర్చుకునేందుకు తన రెండో భార్య సహకారం కోరాడు. తోటి స్త్రీ అన్న సంగతి మరచి ఆమె అతనికి సహకరించింది. వివాహితతో స్నేహం పెంచుకుని, బాత్రూమ్లో స్నానం చేస్తున్న నగ్న వీడియోలను మొబైల్లో చిత్రీకరించింది. వాటి ఆధారంగా బెదిరింపులకు దిగింది. లేని పక్షంలో వీడియో ఇంటర్నెట్లో పెట్టి కుటుంబం పరువు తీస్తానని, మీ కుటుంబ సభ్యుల్ని చంపి నాగాయలంకలో పడేస్తానని బెదిరించారు. ఈ నేపథ్యంలో నిందితుడు ఆమెను లొంగదీసుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగక ఆమెను నగ్నంగా చేసి మెడకు బెల్టు కట్టి మోకాళ్లపై నడిపించి పైశాచిక ఆనందం పొందేవారు. లక్షల్లో నగదు వసూలు... మరోపక్క లక్షల్లో నగదు కూడా వసూలు చేశారు. గత ఏడాది ఫిబ్రవరి 25న సదరు వివాహిత వద్ద 38 గ్రాముల ఆభరణాలు తీసుకున్నారు. అంతేగాక తన తండ్రి రిటైరైతే వచ్చిన రూ.6 లక్షల నగదు కూడా వడ్డీ పేరుతో తీసుకున్నారు. బయటికి చెబితే కుటుంబసభ్యులు, పిల్లలపై యాసిడ్ పోసి చంపుతామని బెదిరించి, కులదూషణకు పాల్పడ్డారు. అంతేగాక మరింత బరితెగించి ఆమెను వేరొకరికి అమ్మే ప్రయత్నం చేస్తుండగా తెలుసుకున్న వివాహిత ఇంటినుంచి పారిపోయి కొంతకాలం బంధువుల ఇంట్లో ఉంది. చివరికి వివాహిత తల్లిదండ్రులు ఆమెను వెతికి తెచ్చి అన్ని విషయాలు తెలుసుకుని రవికాంత్‌పై, అతని భార్య శ్రీదేవిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు విచారణ చేపట్టారు. ఏసీపీ సత్యానందం ఆధ్వర్యంలో నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. వారినుంచి వీడియోలు తీసిన మొబైల్, ట్యాబ్‌లను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. పోలీసులకు సవాలే... ఒకవైపు నగదు వసూళ్లు, మరోవైపు లైంగిక దాడులకు పాల్పడటం వంటి నేరాలకు పాల్పడే ముఠాలు నగరంలో పెరుగుతుండటం పోలీసులకు సవాలుగా మారింది. ఫాదర్‌ను బ్లాక్మెయిల్ చేసిన వారిలో ఇప్పటికే ఐదుగురు అరెస్ట్ కావడంతో ఇంకా ఎవరైనా ఈ ముఠాకు సంబంధించిన వారు నగరంలో ఉన్నారేమోననే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు సాగుతోంది. కాల్‌మనీ వ్యవహారంలోనూ వేల సంఖ్యలోనూ ఫిర్యాదులు నమోదైన విషయం తెలిసిందే. మరి ఇలాంటి నేరాలకు చెక్ పెట్టేందుకు నగర పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి -
కలెక్షన్ కింగ్
►నాకు అర్జెంట్ పని ఉంది. ఓ రూ.50 వేలు ఇవ్వు. మళ్లీ ఇస్తా! ► నువ్వు కాల్‌మనీ వ్యాపారం చేస్తున్నావంట.. ఒక్కసారి నా వద్దకు వచ్చిపో!! ►మీరిద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. కోర్టుల చుట్టూ ఎక్కడ తిరుగుతారు.. రండి హోటల్లో మాట్లాడుకుందాం!!! ► ఇదీ ఓ సీఐ వ్యవహారం సాక్షి ప్రతినిధి, కర్నూలు: స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదులు తీసుకోకపోవడం.. కేవలం సెటిల్మెంట్లతో వ్యవహారాలు చక్కబెట్టడం.. తన కింద పనిచేస్తున్న ఎస్ఐతో కలిసి ఇసుక దందాకు తెగబడటం.. ఆ సీఐ బాగోతం ఎంత చెప్పినా తక్కువే. అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్న కొద్ది మంది వ్యాపారులను పిలిపించి కాల్‌మనీ పేరుతో బెదిరించి సుమారు రూ.10లక్షల నుంచి రూ.12 లక్షలు వసూలు చేశారు. ఇదే డబ్బుతో కొద్దిరోజుల క్రితం కారు కొన్న సదరు సీఐ ఎంచక్కా షికారు చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తం మీద కర్నూలు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ఆ సీఐ వ్యవహారం కాస్తా ఇప్పుడు డిపార్టుమెంట్లో చర్చనీయాంశమయింది. కొద్ది రోజుల క్రితం అవినీతి ఆరోపణలతో ఏకంగా నలుగురు సీఐలపై వేటు పడింది. ఇదే కోవలో ఈయనను కూడా తప్పిస్తారా? లేదో తేలాల్సి ఉంది. బంగారు గొలుసు మాయం కొద్దిరోజుల క్రితం సదరు సీఐ స్టేషన్ పరిధిలో ఒక బంగారు గొలుసు చోరీ అయింది. దీనిపై కేసు కూడా నమోదయింది. ఈ బంగారు గొలుసును దొంగలించిన దొంగను పట్టుకున్నారు కూడా. అయితే.. ఇప్పటి వరకు రికవరీ అయినట్టు ఎక్కడా చూపలేదు. ఎక్కడికెళ్లిందోనని ఆరా తీస్తే.. సీఐ గారి ఇంట్లో ప్రత్యక్షమయిందని తెలిసింది. ఈ వ్యవహారం స్టేషన్లో ఉన్న పోలీసులందరికీ తెలిసినా ఎవ్వరూ కిక్కురుమనలేని పరిస్థితి. అంతేకాకుండా ఎప్పుడు ఎవ్వరి మీద విరుచుకుపడతారో తెలియని ఆందోళన పరిస్థితులల్లో కిందిస్థాయి సిబ్బంది కూడా ఇబ్బందిగా కాలం వెళ్లదీస్తున్నారు. తన కింద పనిచేసే ఒక ఎస్ఐతో కలిసి మొన్నటి వరకు ఇసుక దందాను ప్రోత్సహించారు. అయితే, ఇప్పుడు ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుండటంతో.. ఇసుక ట్రాక్టర్లపైన టార్పాలిన్లు కప్పలేదనే సాకుతో వేధింపులకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. -
కాల్‌మనీకి మరొకరి బలి
పురుగు మందు తాగి చిరువ్యాపారి ఆత్మహత్య గుంటూరు (పట్నంబజారు): కాల్‌మనీ కోరలకు మరో జీవితం బలైపోయింది. తీసుకున్న సొమ్ముకు నాలుగింతలు అధికంగా చెల్లించినా, వేధింపులు ఆగకపోవడంతో ఆఖరికి ఆత్మహత్యే శరణ్యమనుకున్నాడు. పట్టాభిపురం పోలీసులు, మృతుడి కుమారుడు నాగరాజకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నగరానికి చెందిన మద్ది శ్రీరామమూర్తి(62)కి చిన్న బడ్డీ కొట్టు జీవనాధారం.అతను ఏడాదిన్నర కిందట శ్యామల అనే మహిళ వద్ద రూ. లక్ష అప్పుగా తీసుకున్నాడు. రోజుకి రూ.వెయ్యి వడ్డీ కడుతున్నాడు. ఆమెతోపాటు మరో మహిళ నాగలక్ష్మి వద్ద కూడా రూ.1.30లక్షలు తీసుకోగా అధిక వడ్డీలు వేసి ఆయన పాడిన రూ. 2 లక్షల చీటీ డబ్బులు తీసుకుని ఇంకా రూ. 30 వేలు ఇవ్వాలని వే ధింపులకు దిగుతున్నారని బంధువులు తెలిపారు. వేధింపులు అధికమవడంతో శ్రీరామమూర్తి శుక్రవారం సాయంత్రం దుకాణంలోనే పురుగు మందు తాగాడు. స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శ్రీరామమూర్తి సూసైడ్ నోట్ శనివారం వెలుగులోకి తీసుకురావడంతో విషయం బయటకు పొక్కింది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శ్రీరామమూర్తి మృతి కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పట్టాభిపురం ఎస్‌హెచ్‌వో శేషగిరిరావు చెప్పారు. -
ఏం ఆశించి వెళ్లారో చెప్పాలి: రాఘవులు
హైదరాబాద్: ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీకి వెళ్లడం అనైతికమని, నేతలు ఏం ఆశించి అధికార పార్టీలోకి వెళ్లారో చెప్పాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని అధికార పార్టీ భావిస్తోందని ఆయన విమర్శించారు. అధికారంలో ఉన్న తరువాత ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడం చంద్రబాబుకు తగదని రాఘవులు హితవు పలికారు. ఓటుకు కోట్ల కేసు, కాల్‌మనీ కేసులు ఎందుకు మూత పడ్డాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాల్‌మనీ కేసులో టీడీపీ నేతలు దొంగల్లా దొరికారు కాబట్టి ప్రభుత్వం స్పందించాలన్నారు. రాష్ట్రంలో కరువు, ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. రాజధాని పేరుతో ఒకే దగ్గర నిధులు కెటాయించడం సరికాదని రాఘవులు తెలిపారు. -
వడ్డీ చెల్లించలేదని దాడి: ఇద్దరికి గాయాలు
హైదరాబాద్: వడ్డీ డబ్బులు చెల్లించలేదని చైతన్యపురిలోని ఓ ఇంటిపై కొంతమంది వ్యక్తులు దాడికి దిగారు. వివరాలు..దిల్సుఖ్నగర్ పరిధిలోని చైతన్యపురికి చెందిన కృష్ణ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న కిరణ్ అలియాస్ లడ్డూ నుంచి రూ.4 లక్షలు అప్పు తీసుకున్నాడు. దీనిపై చక్రవడ్డీ, బారువడ్డీ చేసి కిరణ్ సుమారు రూ.17 లక్షల వరకు చెక్కులు తీసుకున్నాడు. అప్పు తీసుకున్న కృష్ణ ఇళ్లు ఖాళీ చేసి వేరొక చోట ఉంటున్నారు. వడ్డీ కట్టలేదని కిరణ్ తన అనుచరులతో కలిసి శుక్రవారం, కృష్ణ సోదరుడు శ్రీనివాస్‌తో సహా కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో పార్వతి, బాలముని అనే ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. బాధితులు చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పత్తి కొను‘గోల్మాల్’!
♦ రైతుల పేరుతో బడా వ్యాపారుల దందా ♦ బ్యాంకు అకౌంట్లు.. రూ. కోట్లలో లావాదేవీలు ♦ ఐటీ నోటీసులతో లబోదిబోమంటున్న అన్నదాతలు తాండూరు: కాల్‌మనీ తరహాలో రంగారెడ్డి జిల్లా తాండూరులో పత్తి స్కాం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రైతుల పేరుతో కొందరు బడా వ్యాపారులు కోట్ల రూపాయలు ఆర్థిక లావాదేవీలు సాగించడం కలకలం రేపుతున్నది. ఇందుకు సంబంధించి ఆదాయపన్ను (ఐటీ) శాఖ నుంచి నోటీసులు జారీ అవుతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. రైతులను బురిడీ కొట్టించి సుమారు రూ.12 కోట్ల వరకు ‘పత్తి’ స్కాం కు పాల్పడినట్లు అంచనా. ఆదాయపన్ను ఎగవే సేందుకు వ్యాపారులు రైతులపేరుతో ఎవరికీ అనుమానం రాకుండా పత్తి కొనుగోలు చేపట్టారు. మార్కెటింగ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, రైతుల బలహీనతలు వ్యాపారుల దందాకు వరంగా మారాయి. 2.87 లక్షల పత్తి కొనుగోళ్లు గతేడాది సుమారు రూ.2.87 లక్షల క్వింటాళ్ల పత్తికొనుగోళ్లు జరిగాయి. ఇందులో సుమారు రూ.2.9 లక్షల క్వింటాళ్లు సీసీఐ సేకరించింది. మిగతా ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. క్వింటాలు ధర రూ.4,050 ఉంది. దళారులు ఇలా.. గ్రామాల్లో దళారులు రైతుల నుంచి రూ.3,500-రూ.3,600 ధర చొప్పున పత్తిని కొనుగోలు చేశారు. అక్కడి నుంచి బడా వ్యా పారులకు క్వింటాలుకు సుమారు రూ.100 వరకు గిట్టుబాటు చూసుకొని విక్రయిం చారు. వ్యాపారులుగా కూడా రైతుల నుంచి తక్కువ ధరకు నేరుగా కొనుగోళ్లు చేసి వ్యాపారులు తెలివిగా వ్యవహరించారు. మద్దతు ధరకు విక్రయం దళారులతోపాటు తాము నేరుగా కొనుగోలు చేసిన పత్తిని రైతుల పేరుతో మద్దతుధరకు విక్రయించారని సమాచారం. ఇందుకుగాను ఎవరికీ అనుమానం రాకుండా రైతుల పేరు తో తాండూరు, బషీరాబాద్ మండలాల్లో బ్యాంకు ఖాతాలు తెరిచారు. బ్యాంకు ఖాతా, చెక్‌బుక్‌లను వ్యాపారులు తమ వద్దనే పెట్టుకున్నారు. అడిగితే పంట పెట్టుబడులకు అప్పులు ఇవ్వరనే భయంతో రైతులు మిన్నకుండి పోయారని తెలుస్తోంది. దీనిని వ్యాపారలు ఆసరాగా చేసుకున్నారు. రైతు ఖాతాల నుంచి లావాదేవీలు? ఒక్కొక్క రైతు బ్యాంకు ఖాతా నుంచి రూ.40 లక్షల నుంచి రూ.కోటి వరకు దశలవారీగా ఆర్థిక లావాదేవీలు జరుగుతుండటంతో ఆదాయపన్ను శాఖ తాఖీదులు జారీ చేసింది. దీంతో వ్యాపారుల దందా వెలుగు చూసింది. ముందుకురాని రైతన్నలు.. వ్యాపారులు పరోక్షంగా రైతులకు హెచ్చరి కలు జారీ చేస్తుండడంతో నోటీసుల విషయాన్ని కూడా చెప్పడానికి రైతులు జంకుతున్నారు. మొదటి నుంచి వ్యాపారితో సంబంధాలు ఉన్నాయని, ఇప్పుడు ఏమైనా చెబితే సమస్య వచ్చినప్పుడు తమ వెంట ఎవరూ రారని రైతులు ఆందోళన చెందుతున్నారు. బషీరాబాద్ మండలంలోని ఐదు గ్రామాల్లో 40 మందికి పైగా రైతులకు ఐటీ నోటీసులు జారీ అయ్యాయి. తీగలాగితే డొంక కదిలి నట్టు ఐటీ నోటీసులతో పత్తి అక్రమ వ్యవహారాలు బయటపడుతున్నాయి. ఉన్నతస్థాయిలో పూర్తిస్థాయి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. అక్రమం సాగిందిలా.. ఉదాహరణకు ఒక రైతు నుంచి వ్యాపారి/దళారీ పత్తిని సేకరించాడు. నాణ్యతాప్రమాణాల సాకుతో క్వింటాలుకు సుమారు రూ.3,600 వరకు కొనుగోలు చేశారు. ఈ పత్తినే రూ.4,050 మద్దతు ధరకు వ్యాపారి రైతు పేరుతో విక్రయించాడు. బ్యాంకు ఖాతా, చెక్‌బుక్‌లు తనవద్దే పెట్టుకున్నందున ఆన్లైన్లో డబ్బు జమ కాగానే వ్యాపారులు డ్రా చేసుకుంటున్నారు. క్వింటాలుకు సుమారు రూ.450 వరకు వ్యాపారి సొమ్ము చేసుకున్నాడు. మిగులు రూ.200 వరకు వెన్నుదన్నుగా నిలిచిన అధికారులకు ముట్టచెప్పాడు. ఇటు రైతులను.. అటు ప్రభుత్వాదాయానికి బడా వ్యాపారులు ‘సక్రమంగా’ గండి పెట్టడం గమనార్హం. -
వీడని ‘విష వలయం’ కాల్‌మనీ!
ఇప్పటి వరకు 1,003 ఫిర్యాదులు ఇంకా వస్తూనే ఉన్న బాధితులు ఫిర్యాదుల ప్రత్యేక సెల్ కొనసాగింపు యోచన విజయవాడ సిటీ :‘కాల్’ మనీ విషయం విలయంలో ప్రజలు ఇంకా విలవిలలాడుతూనే ఉన్నారు. అవసరమో.. వ్యసనం కోసమో.. కారణమేదైనా ఒక్కసారి కాల్‌మనీ బారిన పడితే జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. కమిషనరేట్‌కు వస్తున్న బాధితులు చెపుతున్న కథనాలే ఇందుకు నిదర్శనం. ఏళ్ల తరబడి కడుతున్నా.. వడ్డీ జమవుతుందే తప్ప అసలు తీరడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ అక్రమ వడ్డీ వ్యాపారం కనిపించకుండా చేయాలనే అభిప్రాయంతో ఉన్న కమిషనరేట్ పెద్దలు ప్రత్యేక విభాగాన్ని(కాల్‌మనీ సెల్) కొనసాగించాలనుకుంటున్నారు. ఇదే సమయంలో పోలీసు స్టేషన్లలో కాల్‌మనీ వ్యాపారులకు అనుకూలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై దృష్టిసారించాలని నిర్ణయించారు. దశల వారీగా విస్తరణ నగరంలో కాల్‌మనీ వ్యాపారం దశలవారీగా విస్తరించింది. రెండున్నర దశాబ్దాల కిందట కొందరు స్నేహితులు, ఒకేచోట పని చేసే కార్మికుల మధ్య కాల్‌మనీ ఇచ్చిపుచ్చుకోవడం ఉండేది. కాలక్రమేణా దీనిపై కన్నేసిన వడ్డీ వ్యాపారులు అవసరమైన వారిని గుర్తించి అప్పులు ఇవ్వడం ప్రారంభించారు. విజయవాడలో రోజుకు రూ.50 కోట్ల మేర వ్యాపారం నిర్వహిస్తున్నారు. దీంతో ఆస్తుల తనఖా, వడ్డీ డబ్బుల కోసం చిట్టీలు కట్టించుకోవడం ప్రారంభమైంది. తనఖా ఆస్తులు రేటు పెరిగి విక్రయించుకుంటే, చిట్టీ సొమ్మును వడ్డీలకు మాత్రమే జమ చేసుకుంటున్నారు. దీంతో అప్పు అప్పుగానే ఉండగా ఆస్తులు మాత్రం హరించుకుపోతున్నాయి. వస్తూనే ఉన్న బాధితులు గత డిసెంబర్లో కాల్‌మనీ సెక్స్ రాకెట్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత కాల్‌మనీ వ్యాపారంపై తీవ్ర ఆగ్రహాలు వ్యక్తమవడంతో ప్రభుత్వం వ్యాపారులపై దాడులకు ఆదేశించింది. పోలీసులు కూడా దాడులు జరిపి కొందరిని అరెస్టు చేశారు. మరికొందరి నుంచి నోట్లు, చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ బాధితుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఏసీపీ కె.ప్రకాష్‌బాబు నేతృత్వంలో పలువురు ఇన్స్పెక్టర్లు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇరు వర్గాలను పిలిపించడం, విచారించడం, రాజీ చేయడం, కేసుల నమోదుకు సిఫారసు చర్యలను చేపడుతున్నారు. ఇప్పటి వరకు 1,003 ఫిర్యాదులు ప్రత్యేక విభాగానికి వచ్చినట్టు అధికారులు చెపుతున్నారు. పోలీసుల చేతివాటం కాల్‌మనీ వ్యాపారులతో సత్సంబంధాలు కలిగిన కొందరు పోలీసు స్టేషన్ల అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. ప్రత్యేక విభాగం నుంచి కేసు నమోదుకు వెళ్లినప్పుడు అధికారుల దృష్టి మరల్చేందుకు అరెస్టులు చేస్తున్నారు. ఆ తర్వాత వ్యాపారులకు బాధితులకు చెందిన చెక్కులు, నోట్లు కాల్‌మనీ వ్యాపారులకు ఇస్తున్నారనే విమర్శలు వినబడుతున్నాయి. పశ్చిమ జోన్ పరిధిలో ఇవి ఎక్కువగా చోటు చేసుకుంటున్నట్టు బాధితుల ఆరోపణ. దృష్టి పెడతాం కొందరు పోలీసు అధికారులు కాల్‌మనీ వ్యాపారుల పక్షం వహిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. పని ఒత్తిడి, ఇతరత్రా కారణాల వలన పెద్దగా పట్టించుకోలేదు. కొద్ది రోజుల్లోనే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై ఆరా తీసి తప్పు చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. ప్రత్యేక ఫిర్యాదుల సెల్‌ను మరికొద్ది రోజులు కొనసాగించాలని నిర్ణయించాం. డి.గౌతమ్ సవాంగ్, నగర పోలీసు కమిషనర్ -
‘కాల్‌మనీ’ కాటుకు బలి
అప్పుల బాధ తాళలేక వస్త్రవ్యాపారి ఆత్మహత్య రూ.6 లక్షలకు రూ.18 లక్షలు వడ్డీ కట్టానని సూసైడ్‌నోట్ ఇరగవరం/తణుకు/పెరవలి : కాల్‌మనీ కాటుకు మరో ప్రాణం బలైంది. అప్పులిచ్చిన వాళ్ల అధిక వడ్డీ వేధింపులు తాళలేక ఓ వస్త్ర వ్యాపారి మంగళవారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పూనుకున్నారు. తన కుటుంబానికి తీవ్ర విషాదం మిగిల్చారు. బాధితుని సూసైడ్‌నోట్, బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. ఇరగవరం మండలం సూరంపూడి గ్రామానికి చెందిన దొడ్డిపట్ల ధనరాజు (31) తణుకులో రెడీమేడ్ వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నారు. టైలరింగ్ చేస్తూనే ఆయన వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారం నిమిత ్తం తణుకు మండలం పైడిపర్రు గ్రామానికి చెందిన మారిశెట్టి వెంకట్రావు, మారిశెట్టి శేషగిరి వద్ద రూ.3 లక్షలు, ఇరగవరం మండలం ఏలేటిపాడు గ్రామానికి చెందిన మేడపాటి తాతిరెడ్డి వద్ద రూ. 3 లక్షలు అప్పు తీసుకున్నారు. మారిశెట్టి వెంకట్రావు, మారిశెట్టి శేషగిరిలకు వడ్డీ నిమిత్తం ఇప్పటివరకు రూ. 8 లక్షలు, మేడపాటి తాతిరెడ్డికి వడ్డీ నిమిత్తం రూ.10 లక్షలు చెల్లించారు. వ్యాపారం బాగా లేకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. కాల్‌మనీ వల్ల అధిక వడ్డీల భారం పడింది. ఈ నేపథ్యంలోనే అప్పులు ఇచ్చిన వారు తీవ్రంగా ఒత్తిడి చేస్తుండడంతో ధనరాజు మనస్థాపానికి గురయ్యారు. మంగళవారం ఉదయం ఇంటి వద్ద నుంచి తణుకు వచ్చిన ధనరాజు పురుగులమందు డబ్బా కొనుక్కుని పెరవలి మండలం తీపర్రు గోదావరి ఒడ్డుకు వెళ్లాడు. అక్కడ పురుగులమందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. దీనిని గమనించిన స్థానికులు అతని బంధువులకు సమాచారం అందించారు. బంధువులు వచ్చి ధనరాజును మోటారుసైకిల్‌పై తణుకు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ధనరాజు ప్రాణాలు వదిలారు. దీంతో స్వగ్రామం సూరంపూడికి తీసుకెళ్లారు. ధనరాజు పంచాయతీ వార్డు సభ్యునిగా కూడా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే.. ఎస్పీల పేరిట సూసైడ్ నోట్ ధనరాజు ఆత్మహత్యకు పాల్పడే ముందు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఎస్పీ భాస్కర్‌భూషణ్‌లకు ధనరాజు తన ఆవేదనను వెలిబుచ్చారు. తన భార్య నగలు అమ్మి అధిక వడ్డీలు కట్టానని, ఇకపై వడ్డీలు, అప్పు కట్టలేని పరిస్థితుల్లో అప్పు ఇచ్చిన వారి ఒత్తిళ్లు తాళలేకే తాను చనిపోతున్నట్టు వివరించారు. తాను చేసిన అప్పులకు తన కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధమూ లేదని, తాను చనిపోవడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. మృతుడు ధనరాజుకు భార్య చంద్రకళ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయిదేళ్ల క్రితం వివాహం చేసుకున్న ధనరాజు ప్రస్తుతం తణుకులో అనూషా డ్రస్ మెటీరియల్స్ పేరుతో వస్త్రదుకాణం నిర్వహిస్తూ ఇక్కడే ఫ్లాట్ అద్దెకు తీసుకుని కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు. దీనిపై పెరవలి ఎస్ఐ పి.నాగరాజు కేసునమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. -
కాల్‌మనీ బాధితుల ఆత్మహత్యాయత్నం
-వడ్డీవ్యాపారి ఇంటి వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకున్న బాధితులు - వడ్డీ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ - ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని మనస్తాపం - ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోబోయిన వైనం రేపల్లె(గుంటూరు జిల్లా): తీసుకున్న అప్పుకు ఓ వైపు వడ్డీలపై వడ్డీలు వసూలు చేస్తూ, మరో వైపు తనఖా పెట్టిన ఇంటి పట్టాను తన కూతురి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్న వడ్డీ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని పోలీసుస్టేషన్ చుట్టూ తిరిగి విసిగిపోయిన కాల్‌మనీ బాధితులు సోమవారం ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా రేపల్లెలో సోమవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఏకలవ్య కాలనీకి చెందిన దాసరి వెంకట నాగేశ్వరమ్మ నాలుగేళ్ల క్రితం 6వ వార్డుకు చెందిన పొదిలి సత్యనారాయణ వద్ద రూ.1.50 లక్షలు అప్పు తీసుకుంది. నెలకు రూ.7,500 చొప్పున క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తోంది. అయినా ఇంకా రూ.4లక్షలు చెల్లించాలంటూ సత్యనారాయణ ఒత్తిడి తెస్తున్నారు. మరో బాధితురాలు సజ్జా రజని అదే వ్యాపారి వద్ద మూడేళ్ల క్రితం రూ.లక్ష తీసుకుని నెలకు రూ.5,000 చొప్పున క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. అప్పు తీకుసున్న సమయంలో తనకున్న ఇంటిపట్టాను తాకట్టుపెట్టింది. తీరా చూస్తే తన స్థలాన్ని వడ్డీవ్యాపారి పొదిలి సత్యనారాయణ కుమార్తె పేర రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఉంది. అదేమని అడిగితే మీకు దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించాడు. విధిలేక వ్యాపారి ఇంటి ముందు పలుమార్లు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం వడ్డీవ్యాపారి కుమారులు బాధిత మహిళలపై దాడి చేయడంతో పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాళ్లరిగేలా స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు చొరవ చూపడం లేదని మనస్తాపం చెందిన బాధితులు సోమవారం ఉదయం వడ్డీవ్యాపారి ఇంటి ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశారు. గమనించిన వ్యాపారి కుటుంబసభ్యులు అడ్డుకొని, పోలీసులకు సమాచారం అందించారు. స్టేషన్‌కు తరలించిన తర్వాత కూడా మరోమారు బాధితులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేయడంతో పోలీసులు కంగుతిన్నారు. సీఐ మల్లికార్జునరావు బాధితులతో చర్చించి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
రూ.20 లక్షలు అప్పిచ్చి ఎకరం పొలం లాగేశారు
రూ.20 లక్షలు అప్పిచ్చి ఎకరం పొలం కాజేశారు కలర్ జిరాక్సులతో మోసం రియల్టర్ల మాయాజాలం ఆందోళనతో అనారోగ్యం పాలైన బాధితుడు విజయవాడ : విజయవాడ నగరంలో కాల్‌మనీ వ్యాపారుల మోసాలు రకరకాలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఈసారి రియల్టర్ల ముసుగులో ఈ మాయాజాలం చోటుచేసుకుంది. వారి మోసానికి బాధితుడు మానసిక రోగిగా మారి మాట్లాడలేని స్థితికి చేరాడు. బాధితుడి భార్య కథనం మేరకు వివరాలివీ.. భవానీపురం గాంధీబొమ్మ రోడ్డులో షేక్ శ్రీను, రసూల్‌బీ దంపతులు నివసిస్తున్నారు. శ్రీను పాల ఫ్యాక్టరీలో ముఠాకూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అనారోగ్యంతో ఉన్న తల్లికి వైద్యం చేయించేందుకు, చిన్నచిన్న అప్పులు తీర్చేందుకు తన పొలాన్ని తాకట్టు పెట్టాలనుకున్నాడు. భవానీపురం హౌసింగ్‌బోర్డ్ కాలనీలోని సాయి నిర్మాణ్ అపార్ట్మెంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆచంట రాజశేఖర్, చెల్లుబోయిన ఆంజనేయులును కలుసుకున్నారు. 2015 మే 28న పి.నైనవరంలోని తన ఎకరం పొలం తాలూకు డాక్యుమెంట్లను ఇచ్చాడు. దీంతో రాజశేఖర్ తన దగ్గర పనిచేసే చిట్టినగర్‌కు చెందిన నమ్మి శ్రీనివాసరావు పేరుమీద జీపీ (తనఖా రిజిస్ట్రేషన్) చేయించుకుని రూ.20 లక్షలు అప్పుగా ఇచ్చాడు. వడ్డీ పెరిగిపోతుందని భావించిన శ్రీను మూడు నెలల అనంతరం (ఆగస్టు) మరోచోట ఉన్న పొలం అమ్మి రాజశేఖర్‌కు అసలు, వడ్డీతో కలిపి బాకీ తీర్చేశాడు. అయితే రాజశేఖర్ అతనికి తనఖా పెట్టిన డాక్యుమెంట్లు ఇవ్వకుండా వాటి కలర్ జిరాక్సులు ఇచ్చి పంపించాడు. అవే ఒరిజినల్ డాక్యుమెంట్లు అనుకుని శ్రీను వాటిని తీసుకుని వెళ్లిపోయాడు. నెలన్నర తర్వాత గుర్తింపు... నెలన్నర తరువాత శ్రీను తన పొలం వద్దకు వెళ్లగా, నీ పొలం అమ్మేశావట గదా.. వాళ్లు ఈ మధ్యే వచ్చి వెళ్లారని చుట్టుపక్కలవాళ్లు అనటంతో కంగుతిన్నాడు. వెంటనే రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి ఈసీ తీయించగా జీపీ చేయించుకున్న తొమ్మిదో రోజునే చిట్టినగర్‌కు చెందిన కొర్రపాటి శ్యాంప్రసాద్ (చెల్లుబోయిన ఆంజనేయులు బినామీ) పేరుతో 60 సెంట్లు రిజిస్టర్ అయి ఉంది. సెప్టెంబర్ 19న గుంటూరుకు చెందిన కొప్పినేని కోటేశ్వరరావు (రాజశేఖర్ బినామీ) పేరు మీద 40 సెంట్లు రిజిస్టర్ అయి ఉంది. ఇదంతా చూసిన శ్రీను మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం పాలయ్యాడు. దీంతో భార్య ర సూల్బీ తన కుటుంబ సభ్యులతో కలిసి డిసెంబర్లో భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారినుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో ఈ ఏడాది జనవరి 12న నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్లాట్లుగా అమ్ముకునే యత్నాల్లో రియల్టర్లు... తమ బినామీల పేరుమీద రిజిస్టర్ చేయించుకున్న రాజశేఖర్, ఆంజనేయులు ఇప్పుడు ఆ పొలాన్ని ప్లాట్లుగా గానీ, ఏక మొత్తంగా గానీ అమ్ముకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ పొలం కోటి రూపాయలకుపైనే పలుకుతుందని సమాచారం. ఇదెక్కడి న్యాయమని రాజశేఖర్, ఆంజనేయులును ప్రశ్నిస్తే శ్రీను స్నేహితులపై, బంధువులపై కేసులు పెడుతున్నారని శ్రీను బావమరిది హుస్సేన్ తెలిపారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి తమను మోసగించిన వారిపై చర్యలు తీసుకుని తమ పొలం తిరిగి ఇప్పించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
రెచ్చిపోయిన కాల్ మనీ వ్యాపారులు
కర్నూలు: ఏపీలో కాల్ మనీ వ్యాపారుల ఆగడాలు శృతి మించుతున్నాయి. అప్పుతీసుకున్న వారి ప్రాణాలు తీస్తున్నాయి. మరికొందరిపై వడ్డీ వ్యాపారులు దాడులకు దిగుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా నంద్యాలలో శుక్రవారం కాల్ మనీ వ్యాపారులు రెచ్చిపోయారు. నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీకి చెందిన రాజేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి స్థానిక వడ్డీ వ్యాపారి చందు వద్ద రూ.10 వడ్డీకి రూ.4 లక్షలు రుణంగా తీసుకున్నాడు. అందుకు గాను దఫాలుగా డబ్బు చెల్లిస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు రెండుసార్లు రూ. లక్ష ఇచ్చాడు. మిగతా డబ్బును శుక్రవారం కల్లా చెల్లించాలంటూ తీవ్రంగా ఒత్తిడి తేవటంతో రాజేశ్వర్‌రెడ్డి నిస్సహాయత వ్యక్తం చేశాడు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చందూ అతడిని పిడిగుద్దులు గుద్దాడు. దీంతో కుడి భుజం కిందికి జారిపోయింది. కుటుంబసభ్యులు రాజేశ్వరరెడ్డిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని టూటౌన్ పోలీసులు తెలిపారు. -
జడ్చర్లలో కాల్‌మనీ నిందితులు!
జడ్చర్ల: సంచలనం సృష్టించిన కాల్‌మనీ కేసు వ్యవహారం గురువారం తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో కలకలం రేపింది. కాల్‌మనీతో సంబంధం ఉన్న నిందితులు కొన్ని రోజులుగా జడ్చర్ల మండల పరిధిలోని గోప్లాపూర్, తదితర గ్రామాలలో తలదాచుకున్నట్లు సమాచారం ఉండడంతో గురువారం వేకువజామునే గుంటూరు జిల్లా పోలీసులు జడ్చర్లకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రహస్య విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితులు తలదాచుకున్న గ్రామాన్ని పసిగట్టినట్లు తెలుస్తోంది. నిందితులు గోప్లాపూర్‌కు వచ్చి గుంటూరు ప్రాంతంతో సంబంధం కలిగి ఉన్న ఓ నాయకుడి దగ్గర ఆశ్రయం పొందినట్లు తెలిసింది. పక్కా సమాచారంతో పోలీసులు జడ్చర్లకు చేరుకుని నిందితుల అరెస్ట్‌కు ప్రయత్నించారు. అయితే పోలీసుల రాకను ముందే పసిగట్టిన నిందితులు తమ సెల్ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి ఇతర ప్రాంతాలకు పారిపోయినట్లుగా సమాచారం. అయితే అప్పటికే ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. జడ్చర్ల, మిడ్జిల్ మండలాల వాసులకు గుంటూరు జిల్లాతో సత్సంబంధాలు ఉండడంతో అక్కడి కాల్‌మనీ నిందితులు ఇక్కడ తలదాచుకునేందుకు దోహదపడిందని పోలీసులు భావిస్తున్నారు. -
కాల్‌మనీ వేధింపులు: మరొకరి ఆత్మహత్య
రేపల్లె: కాల్‌మనీ వేధింపులు మరో ప్రాణాన్ని బలిగొన్నాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా రేపల్లెలో గురువారం వేకువజామున చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన కదరవల్లి రాంబాబు(58) స్థానికంగా గరికపాటి రవి అనే వ్యాపారి నుంచి 8 ఏళ్ల క్రితం రూ.8 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ప్రస్తుతం ఆ రుణానికి సంబంధించి వడ్డీయే రూ. 24 లక్షలయింది. మరో వ్యక్తి వేమూరి శ్రీను దగ్గర రూ.1.50 లక్షలు అప్పు తీసుకోగా దానికి వడ్డీ రూ. 2లక్షలకు చేరుకుంది. అప్పుల వారి నుంచి వేధింపులు తీవ్రం కావటంతో ఈనెల 19వ తేదీన తమ స్వగ్రామం బొబ్బర్లంక వెళ్లి పొలంలోనే పురుగు మందు తాగి చనిపోయాడు. మరణ వార్త విని స్వగ్రామానికి చేరుకున్న కుమారుడు తండ్రి చొక్కా జేబులో ఉన్న సూసైడ్ నోట్‌ను గమనించి, ఆమేరకు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చౌడాయపాలెం ఇన్చార్జి ఎస్సై మహ్మద్ షఫీ దర్యాప్తు చేస్తున్నారు. రాంబాబు ఇద్దరు కుమారులు ఉన్నారు -
కాల్‌మనీ నిందితులకు బెయిల్ మంజూరు
విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కాల్ మనీ, సెక్స్ రాకెట్ నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. నిందితులు ఎలమంచిలి రాము, భవానీ శంకర్, దూడల రాజేష్‌లకు మంగళవారం విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. విజయవాడ కేంద్రంగా అధిక వడ్డీ రేట్లకు డబ్బులు అప్పుగా ఇవ్వడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన ఘటనలపై నిందితులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. -
జస్ట్ రూ. 4 లక్షలు అప్పుగా ఇచ్చి...
విజయవాడ : నగరంలోని వన్‌టౌన్‌లో కాల్‌మనీ వ్యాపారీ బుద్ధ భాస్కరరావు ఆగడాలు రోజురోజూకు పెరిగిపోతున్నాయి. విజయవాడలో నివసిస్తున్న వృద్ధ దంపతలుకు అత్యవసరంగా నగదు కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వారు వ్యాపారీ బుద్ధ భాస్కరరావును ఆశ్రయించారు. వృద్ధ దంపతులకు అప్పుగా రూ. 4 లక్షలు ఇచ్చాడు. అందుకు ప్రతిగా తుమ్మలపాలెం సెంటర్లోని సదరు దంపతులకు చెందిన భూమికి సంబంధించిన పత్రాలను తన వద్ద పెట్టుకున్నాడు. ఆ క్రమంలో వృద్ధ దంపతులకు చెందిన స్థలాన్ని బుద్ధ భాస్కరరావు కబ్జా చేశారు. దీంతో వృద్ధ దంపతులు నగర పోలీసులను ఆశ్రయించారు. -
కాల్‌మనీ వ్యాపారులకు ‘పండుగ’
నోట్లు, చెక్కులను తిరిగి ఇచ్చేస్తున్న పోలీసులు విజయవాడ (చిట్టినగర్) : పోలీసుల నుంచి కాల్‌మనీ వ్యాపారులకు ‘సంక్రాంతి పండుగ’ కానుక అందినట్లు సమాచారం. ఫైనాన్స్ వ్యాపారుల ఇళ్ల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న చెక్కులు, నోట్లను పోలీసులు రెండు రోజులుగా తిరిగి ఇచ్చేస్తున్నట్లు తెలిసింది. గత నెల 16 నుంచి కాల్‌మనీ వ్యాపారులపై పోలీసులు దాడులు చేసిన సంగతి విదితమే. వారం రోజుల పాటు నిర్వహించిన దాడుల్లో విజయవాడలోని చిట్టినగర్, కేఎల్‌రావునగర్, కొత్తపేటలోని పలువురు ఫైనాన్స్ వ్యాపారుల ఇళ్లపై దాడులు చేసిన పోలీసులు వారి నుంచి భారీగా చెక్కులు, నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే కేసులు నమోదు చేసి అరెస్టు చేయడంతోనే వీటికి ముగింపు పలికారు. మరో వైపు పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి రావడంతో కాల్‌మనీ వ్యవహారం ముగినట్లే అయింది. ఫైనాన్స్ వ్యాపారులు స్టేషన్ అధికారులను కలిసి తమ చెక్కులు , నోట్లు తిరిగి ఇచ్చేయాలని కోరడంతో ఇచ్చేసినట్లు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం కేఎల్‌రావునగర్‌కు చెందిన ఫైనాన్స్ వ్యాపారి కోటేశ్వరరావుకు చెక్కులు, నోట్లు తిరిగి ఇచ్చేయడంతో సదరు వ్యాపారి స్టేషన్‌కు సమీపంలోని ఓ మాజీ కార్పొరేటర్ ఇంటికి వెళ్లి పరిశీలించుకున్నట్లు సమాచారం. -
కాల్‌మనీ కేసులో కొత్త కోణాలు
-
తనఖా పేరిట అమ్మకం రిజిస్ట్రేషన్
కాల్‌మనీ కేసులో మరో మోసం ప్రజాప్రతినిధి బంధువుల నిర్వాకం విజయవాడ లీగల్ : తనఖా రిజిస్ట్రేషన్ అంటూ తన ఇంటిని కాల్‌మనీ వ్యాపారి అమ్మకం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఓ వృద్ధుడు ఆరోపించారు. నగరానికి చెందిన ప్రజాప్రతినిధి బంధువు ఈ మోసానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. తన న్యాయవాది ద్వారా కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. బాధితుడి కథనం మేరకు.. 83 ఏళ్ల రేలంగి హనుమంతరావు విద్యాధరపురంలోని రావిచెట్టు సెంటర్ రేలంగివారి వీధిలో నివసిస్తున్నారు. కుటుంబ అవసరాల నిమిత్తం నగరానికి చెందిన బుద్దా భాస్కరరావు వద్ద 2015 జూలై 31న రూ.4 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ప్రతినెలా వడ్డీ చెల్లిస్తున్నారు. నగదు ఇచ్చిన రోజు హనుమంతరావు నుంచి భాస్కరరావు రూ.100 స్టాంపు పేపరు, సంతకాలు చేసిన తెల్ల కాగితాలు నాలుగు, సంతకం చేసిన ఖాళీ ప్రాంసరీ నోట్లు, నాలుగు ఖాళీ చెక్కులు తీసుకున్నారు. రెండు నెలలు తర్వాత నూటికి ఆరు రూపాయలు చెల్లించాలని భాస్కరరావు పట్టుబట్టారు. అంతవడ్డీ చెల్లించలేనని హనుమంతరావు పేర్కొనడంతో ఇంటిని తనఖా చేస్తే వడ్డీ తగ్గిస్తానని చెప్పిన భాస్కరరావు రూ.70 లక్షల ఇంటిని తనఖా పెట్టుకున్నాడు. అయితే ఆ ఇంటిని రూ.4 లక్షలకు అమ్మినట్లుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ తరువాత రూ.6 వడ్డీ చెల్లించాల్సిందేనని పట్టుబట్టాడు. ఆ మేరకు వడ్డీ చెల్లించి తనఖా రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోరగా ఇంటిని తనకు అమ్మేశారుగా అంటూ హనుమంతరావును దూషించాడు. బాధితుడి అల్లుడు పలగాని మురళీ కృష్ణ ఇంటి కాగితాల కోసం వెళ్లగా భాస్కరరావు చేతనైంది చేసుకోండి, ఆ ఇంటి కాగితాలు ఓ వ్యక్తి వద్ద ఉన్నాయి అని చెప్పాడు. దీంతో బాధితులు ఆ వ్యక్తి వద్దకు వెళ్లగా తనకు సంబంధంలేదని, భాస్కరరావు వద్దే తేల్చుకోవాలని ఆ వ్యక్తి సూచించాడు. ఈ వ్యవహారాన్ని పరిష్కరిస్తానని చెప్పిన బుద్దా సత్యనారాయణ ఆ తరువాత ఇంటిని ఇచ్చే ప్రసక్తేలేదని, ఎంతో కొంత నగదు ఇప్పిస్తామని చెప్పాడు. బుద్దా వెంకన్న బంధువు భాస్కరరావు తనను మోసగించాడని పోలీసులకు, నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని హనుమంతరావు దంపతులు వాపోయారు. ముఖ్యమంత్రికి చెప్పుకుందామని వెళ్తే, ఆయన అందుబాటులో లేరని, తమ న్యాయవాది ద్వారా కోర్టులో ప్రయివేటు కేసు దాఖలు చేయనున్నామని పేర్కొన్నారు. -
అధికార పార్టీ ‘చిట్స్’ లీలలు
నూతన చిట్ వేడుకల్లో అసభ్యకర నృత్యాలు అడ్డుకున్న పోలీసులు ఒత్తిళ్లతో చర్యలకు వెనుకడుగు నరసరావుపేట టౌన్ : కాల్‌మనీ వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి, అతని సోదరుడు నూతన చిట్ వేడుకల్లో భాగంగా మందుపార్టీ, అసభ్యకర నృత్యాలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు కావడంతో చర్యలకు వెనుకడుగు వేశారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే. పట్టణంలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్, అతని సోదరుడు నూతన చిట్స్‌ను ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా వినుకొండ రోడ్డులోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం రాత్రి మందు పార్టీ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మహిళలతో అసభ్యకర డాన్స్‌లు చేయించారు. హాజరైన చీటీపాట సభ్యులు కార్యక్రమాలను ఫోన్లో చిత్రీకరించి ఇతరులకు వాట్స్ఆప్ ద్వారా పంపారు. కొందరు ఈ విషయాన్ని పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఈ వేడుకల్లో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారు. పోలీసుల రాకను గమనించిన వారు అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు. కార్యక్రమాన్ని నిలిపివేయాలని పోలీసులు సూచించినప్పటికీ కార్యక్రమాన్ని కొనసాగించడంతో నిర్వాహకులపై పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈలోగా పై అధికారుల నుంచి ఒత్తిళ్లు రావడంతో నిర్వాహకులను స్టేషన్‌కు రావాలని ఆదేశించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి సోమవారం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై డీఎస్పీ కె.నాగేశ్వరరావును వివరణ కోరగా పోలీసుశాఖ అనుమతి లేకుండా డాన్స్‌లు నిర్వహిస్తున్న కారణంగా కార్యక్రమాన్ని నిలిపివేశామన్నారు. -
నెల్లూరు జిల్లాలోనూ 'కాల్ మనీ' దందా
-
సీసీఎస్ ఎస్ఐపై కేసు నమోదు
అనంతపురం : కాల్‌మనీ వ్యవహారంలో బాధితుల ఫిర్యాదు మేరకు కర్నూలు సీసీఎస్ ఎస్ఐ సురేష్‌పై ఆదివారం కేసు నమోదు అయింది. కర్నూలు జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సురేష్ అనంతపురంలో వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. నగదు అప్పు తీసుకున్న వారి వద్ద నుంచి అధిక వడ్డీ డిమాండ్ చేస్తున్నట్లు సురేష్‌పై బాధితులు కర్నూలు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సురేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాల్‌మనీ వేధింపులపై కేసు నమోదు
అక్కయ్యపాలెం : కాల్‌మనీ వేధింపులపై ఫోర్త్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు అందింది. సీఐ కె.వి.బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న ఆర్.వి.రమణి(57) గతంలో దొండపర్తిలో నివశించేవారు. అదే ప్రాంతానికి చెందిన శ్రీలక్ష్మీ ఫైనాన్స్ నిర్వాహకుడు రెడ్డి వద్ద ఐదేళ్ల కిందట రూ.2లక్షలు అప్పుగా తీసుకున్నారు. అలాగే కె.వినయ్ వద్ద రూ.50వేలు, కె.వెంకటలక్ష్మి వద్ద రూ.50వేలు అప్పుగా తీసుకున్నారు. గత ఏడాది వడ్డీతో సహా అప్పులు చెల్లించానని, అయితే సంతకాలు చేసిన చెక్కులు, ప్రామిసరీ నోట్లు తిరిగి ఇవ్వకుండా ఇంకా డబ్బు చెల్లించాలని వేధిస్తున్నారని రమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూల్‌కి వెళ్లే దారిలో అడ్డుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పైకి స్టిక్కరింగ్..! లోపల కాల్‌మనీ!!
నవరంగ్ సెంటర్లో త్రిమూర్తుల దందా విజయవాడ సిటీ : పైకి స్టిక్కరింగ్ వ్యాపా రం. చేసేది కాల్‌మనీ వ్యాపారం. వడ్డీ చెల్లించలేని మహిళలకు లైంగిక వేధింపులు ఇక్కడ నిత్యకృత్యం. నవరంగ్ థియేటర్ సమీపంలో త్రిమూర్తులు కాల్‌మనీ దందా వికృత స్వరూపమిది. వీరి బెదిరింపులకు అనేక మంది మహిళలు బెంబేలెత్తుతున్నారు. వీరి పరపతికి వెరసి పైకి చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. ఓ మహిళ ధైర్యం చేసి సాక్షి కార్యాలయానికి లేఖ రూపంలో వీరి ఆగడాలను ఏకరువు పెట్టింది. ఆ లేఖలో ఆమె పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే వీరంటే ఎంతగా భయపడుతుందో స్పష్టమవుతోం ది. నవరంగ్ సెంటర్ అంటే వాహనాల నంబర్లకు స్టిక్కరింగ్ చేసే షాపుల కోలాహలం ఉంటుంది. ఇక్కడ తమ వాహనానికి స్టిక్కరింగ్ చేయించుకునేందుకు యువకులు ‘క్రేజీ’ చూపుతుంటారు. అలాంటి సెంటర్‌ను కేంద్రంగా చేసుకొని ఇద్దరు సోదరులు, వీరి స్నేహితుడు కలిసి కాల్‌మనీ వ్యాపారం చేస్తున్నారు. వీరి వద్ద ఎక్కువగా రూ.20వేల నుంచి రూ.50వేల వరకు కాల్‌మనీగా అప్పులు తీసుకునే వారే. ఒక్కసారి వీరి వద్ద కాల్‌మనీకి డబ్బులు తీసుకుంటే ఏళ్ల తరబడి వడ్డీలు కట్టడమే సరిపోతుంది తప్ప అసలు మాత్రం తీరదు. ఒకవేళ అసలు తీసుకొచ్చి ఎవరైనా ఇచ్చినా ముందుగా తీసుకున్న ఖాళీ నోట్లను చూపి కోర్టు కేసుల పేరిట బెదిరింపులకు దిగుతారు. ఆ నెపంతో మహిళలను లొంగదీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. తిరస్కరిస్తే కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనని బాధితురాలి ఆవేదన. వీరి వద్ద రూ.20 వేలు తీసుకున్న పాపానికి రూ.2 లక్షల వరకు వడ్డీగా కట్టినట్టు చెప్పింది. అసలు అలానే ఉందంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు పేర్కొంది. అదేమంటే రూ.2 లక్షలు ఇవ్వాలంటూ కోర్టులో కేసు వేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఆమె తెలిపింది. ఇక తాను కట్టలేనంటే తమతో గడపాలంటూ వేధిస్తున్నట్టు ఆమె వెల్లడించింది. ఏళ్ల తరబడి ఇదే సెంటర్‌ను కేంద్రంగా చేసుకొని కాల్‌మనీ దందా చేస్తున్న వీరికి రాజకీయ, పోలీసు సర్కిళ్లతో పరిచయాలు ఉన్నట్టు ఆమె వెల్లడించింది. అనేక మంది మహిళలు వీరి ఆగడాలను కిమ్మనకుండా భరిస్తున్నట్టు తెలిపింది. పోలీసు కమిషనర్ జోక్యం చేసుకుంటే తప్ప వీరి ఆగడాలకు అడ్డుకట్ట పడదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. -
సత్యానందం లొంగుబాటు
* కాల్‌మనీ కేసులో కోర్టులో లొంగిపోయిన నిందితుడు * మరో కేసులో అరెస్టు విజయవాడ సిటీ/ఇబ్రహీంపట్నం: కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ కేసులో నాలుగో నిందితుడైన విద్యుత్ శాఖ డీఇ ఎం.సత్యానందం గురువారం విజయవాడలో ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయాడు. మరో కేసులో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కాల్‌మనీ కేసులో సత్యానందంకు హైకోర్టు మంగళవారం షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఒకటో అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో సత్యానందం లొంగిపోయాడు. రూ.లక్ష పూచీకత్తు సమర్పించడంతోపాటు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో మాచవరం పోలీసుస్టేషన్లో హాజరై సంతకం చేయాలని సత్యానందంను హైకోర్టు ఆదేశించింది. సత్యానందం కోర్టుకు సమర్పించిన పూచీకత్తును ఇన్చార్జి న్యాయమూర్తి డి.సత్యప్రభాకరరావు పరిశీలించారు. కాగా రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు వార్షిక నేర సమీక్షను విలేకరుల కు విడుదల చేస్తున్న సమయంలోనే సత్యానందం లొంగుబాటు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇబ్రహీం పట్నం పోలీసులు మరో కేసులో అతడిని అదుపులోకి తీసుకొని తరలించారు. ఇది ఇలా ఉండగా విజయవాడ కోర్టు నుంచి బయటకు వచ్చిన అనంతరం సత్యానందం విలేకరులతో మాట్లాడాడు. కాల్‌మనీ కేసులో తాను నిర్దోషినని చెప్పుకున్నాడు. -
కోర్టులో లొంగిపోయిన విద్యుత్ శాఖ డీఈ సత్యానందం
విజయవాడ సిటీ:కాల్ మనీ- సెక్స్ రాకెట్ కేసులో నాలుగో నిందితుడైన విద్యుత్‌శాఖ డీఈ ఎం.సత్యానందం గురువారం ఒకటవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసులో సత్యానందంకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు మంగళవారం తీర్పుచెప్పిన విషయం విదితమే. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఇక్కడి 1వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో తన న్యాయవాదులు విష్ణువర్థన్‌రెడ్డి, సీహెచ్ మన్మథరావులతో కలిసి వచ్చి సత్యానందం లొంగిపోయాడు. రూ.లక్ష పూచీకత్తుతోపాటు ప్రతి రోజు ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో కేసు నమోదైన మాచవరం పోలీసుస్టేషన్లో హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ సంతకాలు చేయాలనేది హైకోర్టు ఆదేశం. సత్యానందం కోర్టుకు సమర్పించిన పూచీకత్తులను ఇన్చార్జి న్యాయమూర్తి డి.సత్యప్రభాకరరావు పరిశీలించారు. రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు, నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్, ఇతర పోలీసు అధికారులతో కలిసి వార్షిక నేర సమీక్షను విలేకరుల సమావేశంలో విడుదల చేస్తున్న సమయంలో సత్యానందం లొంగుబాటు విషయం తెలిసింది. కంగుతిన్న పోలీసు ఉన్నతాధికారులు మాచవరం ఇన్స్పెక్టర్ కె.ఉమామహేశ్వరరావు సహా ప్రత్యేక పోలీసు బృందాన్ని కోర్టు వద్దకు పంపింది. ఇదే సమయంలో సత్యానందంపై మరికొన్ని కేసులు కూడా ఉన్నాయంటూ డీజీపీ రాముడు చెపుతూ ఆయా కేసులపై కూడా తగు చర్యలు తీసుకుంటామన్నారు. మరో కేసుపై అరెస్టు చేయనున్నారనే సమాచారంతో సత్యానందం న్యాయవాదులతోపాటు కోర్టుకు భారీగా న్యాయవాదులు చేరుకున్నారు. కోర్టు ప్రొసీడింగ్స్ పూర్తి కాగానే న్యాయవాదులతో కలిసి బయటకు వచ్చిన సత్యానందం తన కారెక్కి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులను చూసి ఉద్వేగం చెందిన సత్యానందం అస్వస్థతకు లోనై సాయంత్రం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సకోసం చేరగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీపీ కార్యాలయానికి, ఆపై గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు. -
ఒక్క కేసులోనే సత్యానందంకి బెయిల్ : డీజీపీ
విజయవాడ : కాల్‌మనీ కేసుకి సంబంధించి ఓ కేసులో మాత్రమే డీఈ సత్యానందం బెయిల్ పొందాడని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి.రాముడు వెల్లడించారు. అతని మీద మరికొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో విచారణ కోసం సత్యానందంను అదుపులోకి తీసుకుంటామని రాముడు స్పష్టం చేశారు. గురువారం విజయవాడలో ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన నేరాల సంఖ్యపై జేవీ రాముడు మాట్లాడారు. ఈ ఏడాది 100 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. మరో 96 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణాలో 2,710 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. 2014తో పోలిస్తే ఈ ఏడు నేరాల సంఖ్య 4.23 శాతం తగ్గిందని డీజీపీ రాముడు విశ్లేషించారు. -
కాల్‌మనీ నిందితుడు సత్యానందంకు బెయిల్
-
కక్షలు కన్నీళ్లు
గుంటూరు జిల్లాలో ఘటనలు రాజధానిగా రూపాంతరం చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గతించిపోతున్న 2015 నేరపరంగా చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. రోడ్డు ప్రమాదాల్లో అనేకమంది మృతిచెందడం, సంవత్సరం మొదట్లోనే విజయవాడలోని భవానీపురంలో విద్యుత్ షాక్‌కు గురై ఐదుగురు మృతిచెందడం, కల్తీ మద్యం తాగి మరో ఐదుగురు ప్రాణాలొదలడం, కాల్‌మనీ ఉచ్చులో చిక్కుకుని ఎంతోమంది అష్టకష్టాలు పడటం, ఏఎన్‌యూలో ర్యాగింగ్ భూతానికి రిషితేశ్వరి బలి, పలుచోట్ల జరిగిన ప్రమాదాల్లో జిల్లావాసులు కన్నుమూయడం కన్నీటి జ్ఞాపకాలే. ఇక చోరీలు ఈ ఏడాది విచ్చలవిడిగా జరిగాయి. మన రాష్ర్ట దొంగలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ముఠాలు చెలరేగిపోయాయి. చైన్‌స్నాచింగ్‌లు ఊహకందనంత రీతిలో జరిగాయి. గ్రూపు తగాదాలు, ముఠా కక్షలు పెచ్చుమీరాయి. ఇక రాజధాని నేపథ్యంలో ఏర్పడిన భూతగాదాలు రక్త సంబంధీకుల మధ్య చిచ్చురేపి అన్నదమ్ములను కోర్టుకు లాగాయి. ెుుత్తంమీద 2015 సంవత్సరం కృష్ణా, గుంటూరు జిల్లాలపై రక్తచరిత్రనే లిఖించింది. గుంటూరు : గుంటూరు, కృష్ణాజిల్లాల్లో గత ఏడాదితో పోలిస్తే నేరాల సంఖ్య తక్కువగానే ఉన్నా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన నేరాలు అనేకం జరిగాయి. హత్యలు, ఆత్మహత్యలు, దాడులు, దోపిడీలు, దొంగతనాలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు, మోసాలు, మహిళలు, విద్యార్థినులపై లైంగిక వేధింపులు, నమ్మక ద్రోహాలు, భూ వివాదాలు, రోడ్డు ప్రమాదాలతో 2015లో రాజధాని రక్తసిక్తంగా మారింది. తుళ్లూరులో భూ కబ్జాలు పెరిగి వివాదాలు చెలరేగాయి. రక్తసంబంధాలు కూడా చూడకుండా దాడులకు దిగారు. గుంటూరు జిల్లాలో రిషితేశ్వరి, జీజీహెచ్‌లో ఎలుకల దాడిలో చిన్నారి మృతి వంటి సంఘటనలు, విజయవాడలో కల్తీ నెయ్యి, కల్తీ మద్యం, కాల్‌మనీ సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. దొంగల హల్చల్ గత రెండేళ్లతో పోలిస్తే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో దొంగల ముఠాలు స్వైర విహారం చేశాయి. చైన్‌స్నాచింగ్, ఇళ్లల్లో జరిగే దొంగతనాలకు లెక్కే లేకుండాపోయింది. ద్విచక్ర వాహనం రోడ్డు పక్కన పెట్టి పక్కకు వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. గుంటూరు, విజయవాడ కేంద్రాలుగా ఇరాని, పార్ధివ్, బిహారీ ముఠాలు సంచరిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ►చిలకలూరిపేటలో శంకర్ అనే విలేకరిపై మంత్రి అనుచరులు దాడిచేసి హతమార్చిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ►గుంటూరు జీజీహెచ్‌లోని శిశు శస్త్రచికిత్స విభాగంలో వైద్యం కోసం చేరిన పదిరోజుల పసికందును ఎలుకలు కొరికి చంపాయి. సూపరింటెండెంట్, ఆర్ఎంవో, వైద్య అధికారి, ఇద్దరు స్టాఫ్ నర్సులు, పారిశుధ్య కాంట్రాక్టర్లపై వేటు పడింది. ►తుళ్లూరులో చంద్రశేఖర్ అనే రైతుకు చెందిన చెరుకు పంటను గుర్తుతెలియని దుండగులు దగ్ధం చేశారు. ►లింగాయపాలెంలో రాజేష్ అనే రైతుకు చెందిన ఏడు ఎకరాల భూమిలో వేసిన అరటి తోటను సీఆర్డీఏ అధికారులు పొక్లెయిన్లతో ధ్వంసం చేశారు. ►మంగళగిరిలో రెండు వర్గాల ఘర్షణలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతిచెందగా, ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన సంచలనం కలిగించింది. ►మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి, మాచర్ల, వెల్దుర్తి మండలాల పరిధిలోని 15 గ్రామాల్లో మూడు నెలల వ్యవధిలో నాలుగు సార్లు మావోయిస్టుల పేరుతో వాల్ పోస్టర్లు వెలిసిన సంఘటన ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. ►ఏసీబీ అధికారులు జిల్లా పంచాయతీ అధికారి వీరయ్యచౌదరి ఇంటిపై దాడులు నిర్వహించి రూ.1.5 కోట్లకుపై అక్రమ ఆస్తులను గుర్తించి ఆయన్ను అరెస్టు చేసిన సంఘటన సంచలనం కలిగించింది. ► గుంటూరు నగరంలో ఒకేరోజు గంట వ్యవధిలో ఎనిమిది చైన్‌స్నాచింగ్‌లు జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ► గుంటూరు-విజయవాడల్లో సిమీ ఉగ్రవాదులు షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు సూర్యాపేట ఎన్కౌంటర్ ఉదంతంతో బయటకు రావడంతో అంతా హడలిపోయారు. ►గుంటూరు జీజీహెచ్‌లో సిబ్బంది అవినీతి వల్ల ఇద్దరు తల్లులు తనకు మగబిడ్డ పుట్టాడంటూ గొడవకు దిగి ఆడశిశువును పట్టించుకోకపోవడంతో మృతిచెందిన దారుణ సంఘటన సంచలనం కలిగించింది. ►బాపట్ల మండలం చుండూరుపల్లిలో సాంబశివరావు అనే ఎన్ఆర్ఐ ఇంట్లో చోరీ జరిగింది. సుమారు రూ.3.5 కోట్ల సొత్తు చోరీకి గురికావడం సంచలనం కలిగించింది. దొంగను పట్టుకుని చోరీ సొత్తును పోలీసులు వారం వ్యవధిలోనే రికవరీ చేయడం మరో సంచలనం. ఏఎన్‌యూలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంచలనం కలిగించింది. రిషితేశ్వరి సంఘటన జరిగిన నాలుగు రోజులకే వట్టిచెరుకూరు మండలంలో ఓ కళాశాలలో సునీత అనే విద్యార్థిని ర్యాగింగ్ విషయంలో తనపై చర్యలు తీసుకుంటారేమోననే భయంతో కళాశాల భవనం పై నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడింది. వెల్దుర్తి మండలానికి చెందిన తిరుపతమ్మ అనే విద్యార్థిని తనపై కొంతమంది విద్యార్థులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ సుసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు నగరంలోని మహిళా డిగ్రీ కళాశాల వద్ద వెంకటరమణ అనే విద్యార్థినిపై ఓ ఉన్మాది సుత్తితో దాడిచేసి తలపై కొట్టడంతో తీవ్రగాయాల పాలైంది. -
కాల్‌మనీ కేసులో సత్యానందంకు ముందస్తు బెయిల్
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా రేకెత్తించిన కాల్ మనీ, సెక్స్ రాకెట్ నిందితుడు, విద్యుత్ శాఖ డిఇ సత్యానందంకు ముందస్తు బెయిల్ లభించింది. పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని షరతు విధిస్తూ ఆయనకు హైకోర్టు మంగళవారం బెయిల్ ఇచ్చింది. ఈ కేసు వ్యవహారం వెలుగులోకి రాగానే సత్యానందం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన అరెస్ట్ తప్పదని గ్రహించిన సత్యానందం ముందస్తు బెయిల్ కోసం నేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో విచారించారు. కాల్‌మనీ-సెక్స్ రాకెట్ వ్యవహారంలో పిటిషనర్‌కు ఎటువంటి సంబంధం లేదని, వాస్తవాలను తెలుసుకోకుండా పోలీసులు పిటిషనర్‌ను నిందితునిగా చేరుస్తూ కేసు నమోదు చేశారని సత్యానందం తరఫు న్యాయవాది పి.విష్ణువర్థన్‌రెడ్డి తెలిపారు. ఫిర్యాదు ఇచ్చిన మహిళకు అసలు సత్యానందం ఎవరో కూడా తెలియదని, ఈ విషయం ఫిర్యాదును పరిశీలిస్తే అర్థమవుతోందన్నారు. తరువాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ, ఇవ్వరాదని కోరారు. కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ కేసులో సత్యానందం కీలక నిందితుల్లో ఒకరన్నారు. ఫిర్యాదుదారు మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో సత్యానందం తనను లైంగికంగా వేధించారని చెప్పారని, దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో పిటిషనర్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఈ కేసులో నిందితులపై చార్జ్‌షీట్ నమోదైంది. ప్రధాన నిందితులు యలమంచిలి రాము, భవానీ ప్రసాద్, సత్యానందం, చెన్నుపాటి శ్రీను, పెండ్యాల శ్రీకాంత్, వెనిగళ్ల శ్రీకాంత్, దూడల రాజేష్‌పై పోలీసులు చార్జిషీట్ నమోదు చేశారు. అయితే కేసు నమోదై మూడు వారాలవుతున్నా ఇంకా నిందితుల్ని పోలీసులు పట్టుకోలేదు. అలాగే ఈ కేసులో నిందితులైన పెండ్యాల శ్రీకాంత్,వెనిగళ్ల శ్రీకాంత్‌ల ఆచూకీ ఇంకా దొరకలేదు. -
కాల్‌మనీ నిందితులపై రౌడీషీటు
సంచలనం రేకెత్తించిన కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసులో నిందితులపై రౌడీషీట్ నమోదైంది. ప్రధాన నిందితులు యలమంచిలి రాము, భవానీ ప్రసాద్, సత్యానందం, చెన్నుపాటి శ్రీను, పెండ్యాల శ్రీకాంత్, వెనిగళ్ల శ్రీకాంత్, దూడల రాజేష్‌పై పోలీసులు రౌడీ షీట్ నమోదు చేశారు. అయితే కేసు నమోదై మూడు వారాలవుతున్నా ఇంకా నలుగురు నిందితుల్ని పోలీసులు పట్టుకోలేదు. కేసులో నిందితులుగా ఉన్న విద్యుత్ శాఖ డీఏ సత్యానందం ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఈ కేసులో నిందితులైన పెండ్యాల శ్రీకాంత్, వెనిగళ్ల శ్రీకాంత్‌ల ఆచూకీ ఇంకా దొరకలేదు. నిందితుల పరారీ వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయముందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడలో కాల్‌మనీ - సెక్స్‌రాకెట్ ముఠాలో పట్టుబడిన ముగ్గురు నిందితుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు వెల్లడవుతున్నాయి. ప్రత్యేక అనుమతితో ఈ ముఠాను విచారిస్తున్న పోలీసులు ఇప్పటికే కీలక సమాచారాన్ని సేకరించారు. కాల్‌మనీ ముఠా సభ్యుల సెల్‌ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. కాల్‌మనీ- సెక్స్ రాకెట్లో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో అధిక శాతం మహిళల నెంబర్లే దర్శనమిస్తున్నాయి. పెద్దసంఖ్యలో మహిళలతో ఈ ముఠా సభ్యులు సంభాషించారన్న ఆధారాలు లభ్యమవుతున్నాయి. అప్పులు ఇవ్వడం, మహిళల అసహాయతను ఆసరాగా తీసుకుని వారిని తమ లైంగిక వాంఛల కోసం దూర ప్రాంతాలకు తీసుకువెళ్లడం వీరు పరిపాటిగా చేసుకున్నట్లు కాల్ డెటా సమాచారం ద్వారా పోలీసులు విశ్లేషిస్తున్నారు. పోలీసులు విచారణలోనూ నిందితులు కొన్ని వాస్తవాలను కూడా వెల్లడించినట్లు సమాచారం. కాల్‌మనీ ముఠా నుంచి లభించిన డాక్యుమెంట్ల ద్వారా సుమారు 200 కోట్ల రూపాయల మేరకు కాల్‌మనీ పేరుతో అప్పులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అనధికారికంగా 500 కోట్లకు పైగా కాల్‌మనీ పేరుతో డబ్బును చెలామణి చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న యలమంచిలి రాము, దూడల రాజేష్, భవానీశంకర్‌ల ద్వారా కాల్‌మనీ వ్యవహారంపై మరిన్ని వివరాలను సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాల్‌మనీకి సంబంధించి ఆర్థిక వనరులు ఎలా వచ్చాయనే దానిపై నిందితుల నుంచి సరైన సమాదానం రాబట్టలేకపోయారు. అలాగే కాల్‌మనీలోని మిగిలిన నిందితుల ఆర్థిక మూలాలపై కూడా విచారణ జరిపిస్తామని నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ ప్రకటించినా, దానిపై ఇప్పటివరకు చర్యలేవీ మొదలు కాలేదు. ఇక ఈ కేసులో నాలుగో నిందితుడైన విద్యుత్ శాఖ డిఇ సత్యానందం తృటిలో పోలీసుల నుంచి తప్పించుకోవడం వెనుక కొందరు పెద్దల సహకారం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సత్యానందాన్ని అదుపులోకి తీసుకోవాలని నిర్ణయించిన కొద్దిసేపట్లోనే ఆయన విజయవాడ నుంచి పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు నగరానికి చెందిన ఓ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్, మరో ఎన్జీఓ నేత కూడా సహకరించనట్లు సమాచారం. వీరి వాహనాల్లోనే సత్యానందం రాష్ట్రం విడిచిపెట్టి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సత్యానందాన్ని ఈ కేసు నుంచి బయటపడేసేందుకు అమెరికాలోని తెలుగు సంఘాల్లో కీలకమైన ఓ ఎన్ఆర్ఐ అధికార పార్టీలోని ప్రముఖులపై ఒత్తిడి కూడా తీసుకువచ్చినట్లు సమాచారం. కాల్‌మనీ బాధితుల్లో ఓ యువతికి అమెరికాలో ఉపాధి కల్పిస్తానని మోసగించిన ఘటనలో ఎన్ఆర్ఐ పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐ పాత్రపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. ఇక మిగిలిన నిందితుల్లో వెనిగళ్ల శ్రీకాంత్‌కు పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అత్యంత సన్నిహితుడు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో కలిసి విదేశాలకు వెళ్లిన శ్రీకాంత్ ఈ కేసు బయటపడగానే హఠాత్తుగా మాయమయ్యాడు. విదేశాల్లోనే ఉన్నాడా... దేశంలోని మరో రాష్ట్రంలో తలదాచుకున్నాడా అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మరో టీడీపీ నేతకు సన్నిహితుడైన పెండ్యాల శ్రీకాంత్ కూడా వేరే రాష్ట్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయస్థానం ద్వారా ముందస్తు బెయిల్ తీసుకున్న తరువాతే వీరు రాష్ట్రానికి వస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నా.. వీరిని రప్పించేందుకు, ఆర్థిక మూలాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. -
కాల్‌మనీ నిందితులపై రౌడీ షీటు
-
పోలీసు వర్గాల్లో మావోల కలకలం
విజయవాడ : కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై నిందితులపై చర్యకు మావోయిస్టులు విడుదల చేసిన ప్రకటన పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. విజయవాడ కేంద్రంగా మావోయిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నుంచి అధికార ప్రతినిధి శ్యామ్ పేరుతో సోమవారం ప్రకటన వెలువడింది. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కాల్‌మనీ సెక్స్‌రాకెట్ కేసుతో సంబంధాలు ఉన్నాయని, వాళ్లను రక్షించాలని చూస్తే ప్రజాకోర్టులో శిక్ష తప్పదంటూ మావోయిస్టు పార్టీ పేరుతో హెచ్చరిక వెలువడడం అధికార తెలుగుదేశం వర్గాలను కూడా కలవరపాటుకు గురిచేసింది. మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా విజయవాడ ఉంటున్నదని, అయితే రాజధాని కావడంతో నేరుగా ఇక్కడి నుంచే ప్రకటన వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు. గుంటూరు, ఖమ్మం జిల్లాలను బేస్ చేసుకొని కార్యకలాపాలు సాగిస్తున్న మావోయిస్టులు నేరుగా విజయవాడలో ప్రకటన విడుదల చేయడంతో తెలుగుదేశం పార్టీవారు ఆలోచనలో పడ్డారు. ఇటీవల పలు సందర్భాల్లో రాష్ట్రంలో మావోయిస్టులు లేరన్నారు. అయితే సెక్స్‌రాకెట్‌పై సుదీర్ఘ ప్రకటన విడుదల చేయడంతో పాటు సీఎం చంద్రబాబునాయుడు కేసును తప్పుదోవ పట్టించేందుకు అంగన్వాడీ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని మావోయిస్టుల ప్రకటనలో ఆరోపించారు. టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు.. మావోయిస్టుల ప్రకటనతో తెలుగుదేశం నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసులో పెట్టుబడులు పెట్టిన వారు, దౌర్జన్యాలకు దిగిన వారు, మహిళలపై అనుచితంగా ప్రవర్తించినవారు వణికి పోతున్నారు. నగరంలో ఏమూలనైనా తమకు ఇబ్బందులు తప్పవనే ఆలోచనలో ఉన్నారు. కాల్‌మనీలో పెట్టుబడులు ఉన్న జాబితాలను ఇప్పటికే పోలీసులు తయారు చేసినట్లు సమాచారం. వీరి వివరాలు మావోయిస్టుల చేతుల్లో పడితే పరిస్థితి ఏమిటనేది కూడా తెలుగుదేశం పార్టీలో చర్చ సాగుతోంది. పైగా సోమవారం విడుదల చేసిన ప్రకటన ప్రభుత్వ అధిపతి సీఎం చంద్రబాబునాయుడు, పోలీసులను ఉద్దేశించే ఉంది. పోలీసులకు సవాల్.. కాల్‌మనీ సెక్స్‌రాకెట్ కేసు పోలీసులకు సవాల్‌గా మారిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీలో పలు హోదాల్లో ఉన్నవారు నిందితులుగా ఉండడంతో ఎలాగైనా ఈ కేసు నుంచి బయట పడేందుకు వారు చేయని వ్యవహారాలంటూ లేవు. ఈ విషయాలను పరిశీలించిన మావోయిస్టులు నేరుగా హెచ్చరికలు జారీచేశారు. జిల్లాలో మావోయిస్టులు.. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్న మావోయిస్టులు జిల్లాకు కూడా కార్యకలాపాలు విస్తరించారా? అనేది చర్చకు దారి తీసింది. పశ్చిమ కృష్ణాలో సమస్యలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో భూములు కోల్పోతున్న రైతుల సమస్యలపై పోరాడాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే రాజధాని బాధితుల తరుఫున మావోయిస్టులు కూడా పోరాటం నిర్వహించే అవకాశం ఉంది. ఇటీవల కొందరు హక్కుల సంఘాల వారు ఆ ప్రాంతంలో పర్యటించి ఒక రైతుపై పోలీసుల దుశ్చర్యను ఖండించారు. దీనిపై పోలీసులు మరింత దృష్టిపెట్టి అణచివేసేందుకు ప్రయత్నించారు. దీనిని హక్కుల సంఘాల వారు హైకోర్టులో సవాల్ చేయడంతో పోలీసులు వెనకడుగు వేశారు. -
కాల్‘కేటు’లపై ఉక్కుపాదం!
రౌడీషీట్లు తెరిచేందుకు పోలీసుల సమాయత్తం వివరాలు సేకరిస్తున్న నిఘా విభాగం విజయవాడ సిటీ : కాల్‌మనీ వ్యాపారుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీసు అధికారులు సిద్ధమవుతున్నారు. కాల్‌మనీ వ్యాపారం పేరిట దందాలు చేసేవారిని ఉక్కుపాదంతో అణచివేసేందుకు రౌడీషీట్ల మంత్రం ప్రయోగిస్తున్నారు. మాజీ రౌడీషీటర్లపై వెంటనే పాత రౌడీషీట్లను పునరుద్ధరించడంతో పాటు దందాలు చేసినట్టు సమాచారం ఉన్న వారిని కొత్తగా జాబితాలో చేర్చనున్నారు. నిఘా వర్గాల ద్వారా ఇప్పటికే పలువురి వివరాలు తెప్పించుకుంటున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే గన్మెన్లను వెంటేసుకొని వడ్డీ వ్యాపారం దందా నిర్వహిస్తున్న మాజీ రౌడీషీటర్ మాదంశెట్టి శివకుమార్‌పై తిరిగి రౌడీషీటు ప్రారంభించారు. గతంలో పలువురు మహిళలు శివకుమార్ ఆగడాలపై కృష్ణలంక పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల్లోని పలుకుబడితో అప్పటికప్పుడు శివకుమార్ బయటపడ్డాడు. కాల్‌మనీ బాధితులకు పోలీసు కమిషనర్ సవాంగ్ భరోసా ఇవ్వడంతో ఓ మహిళ అతని ఆగడాలపై పోలీసులను ఆశ్రయించారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
'కాల్ మనీ బాధితులు.. నేరుగా కలవొచ్చు'
కృష్ణా: 'కాల్‌మనీ బాధితులు నేరుగా నన్ను కలవొచ్చు' అని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తెలిపారు. కాల్‌మనీ వ్యవహారంలో ఎంతటి వారి పైనైనా చర్యలు తీసుకుంటామన్నారు. గన్నవరం నియోజకవర్గంలో కొందరికి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని తెలిపారు. కాల్‌మనీ వ్యవహారంపై ఏపీ సర్కార్ స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయనుందని పునరుద్ఘాటించారు. -
'కాల్ కీచకుల్ని శిక్షించాలి'
రాష్ట్ర వ్యాప్తంగా.. కలకలం రేపిన కాల్‌మనీ కేసులో.. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ.. కాల్‌మనీ పోరాట వేదిక ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. విజయవాడ బందర్ రోడ్డులో సోమవారం కాల్‌మనీ పోరాట వేధిక ఆధ్వర్యంలో బాధిత మహిళలు రోడ్డెక్కారు. మహిళలిన చెరబట్టిన కాల్ కీచకుల్ని కఠినంగా శిక్షించాలని.. సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ చేపట్టాలని కోరుతూ.. రాస్తారోకో నిర్వహించారు. -
గంటల తరబడి మహిళలతో ...
-
గంటల తరబడి మహిళలతో ఫోన్ సంభాషణలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని విపరీతంగా కుదిపేస్తున్న కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ముగ్గురు నిందితులను రెండు రోజులుగా టాస్క్‌ఫోర్స్ బృందం విచారిస్తోంది. సెక్స్ రాకెట్ కేసులో ఉన్న నిందితుల కాల్‌డేటాను విశ్లేషించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి. వాటిలో పెద్ద సంఖ్యలో మహిళల ఫోన్ నంబర్లను గుర్తించారు. గంటల తరబడి ఆ మహిళలతో నిందితులు సంభాషించినట్లు నిర్ధారించారు. ఎ-4 నిందితుడు సత్యానందం పరారు కావడానికి సహకరించినవారిపై దృష్టిపెట్టారు. ఓ కాలేజి ప్రిన్సిపాల్, ఏపీ ఎన్జీవో నేతల ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నారు. నిందితుడు సత్యానందానికి మద్దతుగా ఓ ఎన్నారై ప్రముఖుడు జోక్యం చేసుకుంటున్నారు. టీడీపీ నేతలతో ఆ ఎన్నారై మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ కేసులో నలుగురు కీలక నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా, పోలీసులు మాత్రం కాల్‌మనీ సెక్స్ రాకెట్ నిందితుల ఆస్తుల జోలికి వెళ్లడం లేదు. నిందితుల ఆర్థిక మూలాలపై దర్యాప్తు కూడా ఇంకా మొదలుకాలేదు. నిందితులు మహిళలను ఎలా బెదిరించారనే విషయాలు తేల్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు అధికారికంగా తేలిన లెక్కల ప్రకారమే.. దాదాపు రూ. 200 కోట్ల మేరకు చలామణి చేయించినట్లు తెలుస్తోంది. కొంతమంది పెద్దలకు చెందిన మరో 500 కోట్లను కూడా అనధికారికంగా తిప్పుతున్నట్లు సమాచారం. -
మరో 'కాల్ మనీ' వ్యాపారి అరెస్ట్
విజయవాడ : రైల్వే చిరుద్యోగులకు 'కాల్ మనీ' వడ్డీకి అప్పులు ఇచ్చి వేధింపులకు పాల్పడుతున్న గుడివాడకు చెందిన కొమ్మిరెడ్డి వెంకట సుబ్బారెడ్డిని విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 1469 ప్రామిసరీ నోట్లు, 911 ఖాళీ చెక్కులు, బ్యాంక్ పాస్ పుస్తకాలు 59, ఏటీఎం కార్డులు 83, ఆరు నాన్ జ్యుడీషియరీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్టు శనివారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాంతిభద్రతల విభాగం డీసీపీ ఎల్.కాళిదాస్ చెప్పారు. ఈ నెల 24న కార్పొరేషన్ చిరుద్యోగులను అధిక వడ్డీల పేరిట వేధింపులకు పాల్పడుతున్న రాంపిళ్ల పాపారావును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ శాఖల్లోని చిరుద్యోగులను అధిక వడ్డీల పేరిట వేధింపులకు పాల్పడుతున్నవారిని కమిషనరేట్ పోలీసులు అరెస్టులు చేయడం సంచలనం కలిగిస్తోంది. డీసీపీ కాళిదాస్ కథనం ప్రకారం.. సుబ్బారెడ్డి మొబైల్ ఫోన్ల వ్యాపారంతో పాటు విజయవాడ, గుడివాడ పట్టణాల్లో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. గత 20 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా రైల్వేలో పని చేసే చిరుద్యోగులకు అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్నాడు. ఇందుకోసం ఖాళీ నోట్లు, చెక్కులు, బ్యాంక్ పుస్తకాలు, ఏటీఎం కార్డులు తీసుకుంటాడు. ఆయా ఉద్యోగులు ఏళ్ల తరబడి వడ్డీలు చెల్లిస్తున్నారు. కనీసం తమకు జీతం ఎంత వస్తుందనే విషయం కూడా వారికి తెలియదు. ఫైనాన్స్ వ్యాపారి తన వడ్డీ పోను ఇచ్చింది తీసుకొని కుటుంబాన్ని గడుపుకోవడమే. ఒకవేళ పూర్తిగా అప్పులు చెల్లించినా వారికి ఇవ్వాల్సిన పత్రాలు, ఇతర ఆధారాలు ఇవ్వడు. గట్టిగా నిలదీస్తే అనుచరులతో కోర్టు కేసులు వేయించి వేధింపులకు పాల్పడుతుంటాడు. సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన పలువురు చిరుద్యోగులు తాము అప్పు చెల్లించినా వేధింపులకు గురి చేస్తున్నాడని పేర్కొంటూ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసు కమిషనర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం.సత్యనారాయణ రంగంలోకి దిగి నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి నోట్లు, చెక్కులు, పాస్‌పుస్తకాలు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. కొత్తపేట పోలీసులు కె.ఎల్.రావునగర్ కుండల మార్కెట్ ప్రాంతానికి చెందిన కానుళ్ల కోటేశ్వరరావు మెడికల్ షాపుపై దాడి చేసి పెద్ద మొత్తంలో ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులు, రోజువారీ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. -
ఫోటో హల్చల్!
-
వేధింపుల కేసులో టీడీపీ నాయకుడి అరెస్ట్.
-
వేధింపుల కేసులో టీడీపీ నాయకుడి అరెస్ట్
విశాఖపట్నం : విశాఖపట్నంలో కాల్ మనీ సెక్స్ రాకేట్ తరహా కేసులో నిందితుడు, టీడీపీ నాయకుడు గుడివాడ రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పులు తీసుకున్న మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న గుడివాడ రామకృష్ణపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు అరిలోవకు చెందిన ఓ మహిళ ఇటీవల విశాఖపట్టణంలోని పట్టణ నాలుగో పోలీస్ స్టేషన్లో గుడివాడ రామకృష్ణపై ఫిర్యాదు చేసింది. అందులోభాగంగా పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ విషయం గమనించిన రామకృష్ణ విశాఖ నుంచి పరారైయ్యారు. అతడి కోసం పోలీసుల గాలింపు తీవ్రతరం చేశారు. ఆ క్రమంలో అతడు చెన్నైలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో బుధవారం గుడివాడ రామకృష్ణను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. గురువారం విశాఖపట్నం నగరానికి తీసుకు వచ్చారు. గుడివాడ రామకృష్ణని జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించినట్లు విశాఖపట్నం డీసీపీ త్రివిక్రమ్ వర్మ వెల్లడించారు. అంతకుముందు గుడివాడ రామకృష్ణను త్రివిక్రమ వర్మ మీడియా ముందుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ... రామకృష్ణ వల్ల బాధితులుగా మారిన వారు ఎవరైనా తమ వద్దకు వచ్చి... ఫిర్యాదు ఇవ్వవచ్చని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. -
కాల్‌మనీని పక్కదారి పట్టించేందుకే రోజా సస్పెన్షన్
నరసరావుపేట రూరల్ : అసెంబ్లీ సమావేశాల్లో కాల్‌మనీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికే కుట్రపూరితంగా ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వరరావు విమర్శించారు. పీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ కాసు వెంకట కృష్ణారెడ్డి స్వగృహాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయవాడలో వెలుగుచూసిన కాల్‌మనీ వ్యవహారంలో నింధితులందరూ టీడీపీ వాళ్లేనని, వారిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదన్నారు. శాసనసభలో జరుగుతున్న పరిణామాలు బాధాకరమన్నారు. ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం సరికాదన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాసం పెట్టడం నరసరావుపేటకు మచ్చగా మిగులుతుందన్నారు. ముఖ్యమైన బిల్లులు, ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సి ఉండగా వాటి గురించి పట్టించుకోకుండా పరస్పరం ఆరోపణలు చేసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. పార్టీ నాయకులు పడాల చక్రారెడ్డి, కపలవాయి రమేష్, మంజూర్, దుర్గాబాబు, బాషా పాల్గొన్నారు. -
లొంగితే అమెరికాలో ఉద్యోగమిస్తాం!
విజయవాడ: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న కాల్‌మనీ-సెక్స్ రాకెట్లో ఒక ఎన్ఆర్ఐ పాత్ర కూడా ఉన్నట్లు తెలిసింది. అతడి ద్వారా అమెరికాలో ఉద్యోగాలిప్పిస్తామని ఆశపెట్టి చాలా మంది యువతులను లొంగదీసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఉద్యోగం ఇప్పించక పోగా ఎంతో కొంత డబ్బు ఇచ్చేస్తామని, తమతో సర్దుబాటు చేసుకోవాలని వారి కుటుంబాలపై ఒత్తిడి తెచ్చినట్లు పలువురు బాధితుల ద్వారా తెలిసింది. కాల్‌మనీలో సదరు ఎన్ఆర్ఐ భారీగా పెట్టుబడి పెట్టినట్లు చెబుతున్నారు. ఈ ముఠా దగ్గర అప్పు తీసుకున్న ఒక మహిళ వడ్డీ కట్టలేకపోవడంతో ఆమెను బలవంతంగా లోబరుచుకొని చాన్నాళ్లపాటు లైంగికంగా వేధించారు. అంతటితో ఆగకుండా ఆమె కుమార్తెపై కూడా కన్నేశారు. తాము చెప్పినట్లు వింటే అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తామని ఆ యువతిని వశపరచుకున్నారు. ముఠా సభ్యులంతా ఆమెపై లైంగిక దాడి చేయడంతోపాటు వేరే వ్యక్తుల వద్దకు కూడా పంపించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో విద్యుత్ శాఖ డీఈ సత్యానందం కీలకపాత్ర పోషించాడు. ఆ యువతిని అతడే తొలుత లోబరుచుకున్నాడని సమాచారం. అమెరికాలో తెలుగు వ్యవహారాలు చూసే ఓ ప్రముఖ సంస్థ మాజీ అధ్యక్షుడి ద్వారా అతని కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని వారు నమ్మబలికారు. గతంలోనూ చాలామందికి అలాగే ఉద్యోగాల ఎరవేసినట్లు సమాచారం. నమ్మినవారిని లైంగికంగా వేధించి, ఎన్ఆర్ఐ వద్దకు పంపుతారు. అలా పంపిన వారిలో చాలా కొద్ది మందికి ఉద్యోగాలు రాగా మిగిలిన వారిని వ్యభిచారంలోకి దింపారనే అనుమానాలు రేగుతున్నాయి. ప్రముఖ సంస్థ గెస్ట్‌హౌస్ వినియోగం కృష్ణానది కరకట్టపై సీఎం నివాసం ఉండడానికి గెస్ట్‌హౌస్ ఇచ్చిన సంస్థకే ఏఎన్‌యూ వద్ద మరో గెస్ట్‌హౌస్ ఉంది. అందులో కాల్‌మనీ ముఠా తమ లైంగిక ఆగడాలకు ఉపయోగించుకునేవారని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. వీరిపై ఫిర్యాదు చేసిన తల్లీకూతుళ్లను ఈ గెస్ట్హౌస్కే చాలాసార్లు తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. ఈ గెస్ట్‌హౌస్ యజమానులకు సీఎంతో సంబంధాలు ఉండడంతో పోలీసులు అటువైపు కన్నెత్తి చూసేవారు కాదు. -
‘కాల్‌మనీ’ వ్యవహారంపై పెదవి విప్పని డీఐజీ
కాకినాడ క్రైం (తూర్పుగోదావరి) : రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ వ్యవహారంపై అడిగిన ప్రశ్నలకు ఏలూరు రేంజ్ డీఐజీ పి.హరికుమార్ దాటవేత వైఖరి ప్రదర్శించారు. ‘ఎలా జరగాల్సింది అలాగే జరుగుతుంది.. నెక్ట్స్..’ అంటూ విలేకరులు అడిన ప్రశ్నకు మాట దాటవేశారు. జిల్లా పోలీసు కార్యాలయానికి వార్షిక తనిఖీ కోసం మంగళవారం కాకినాడ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కాల్‌మనీ వ్యవహారంపై అడిగిన ప్రశ్నలన్నింటినీ తోసిపుచ్చారు. -
పోరాడుతున్నందునే టార్గెట్ చేస్తున్నారు
* వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ఆవేదన * నన్ను రాజకీయంగా భూస్థాపితం చేయాలని చూస్తున్నారు... * టీడీపీలో ఉన్నపుడు నా భాష బాగుందా, ఇపుడు బాగా లేదా! * ఇరుపక్షాల క్లిప్పింగ్‌లు విడుదల చేస్తే వాస్తవాలు తెలుస్తాయి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బాధిత మహిళల తరపున, ప్రజల తరపున శాసనసభలో గట్టిగా పోరాడుతున్నందునే తనను రాజకీయంగా భూస్థాపితం చేయాలని, సర్వనాశనం చేయాలని టీడీపీ ప్రయత్నిస్తోందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ శాసనసభాపక్షం ఉపనేత ఉప్పులేటి కల్పన, ఎమ్మెల్యేలు వంతెల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరి, విశ్వాసరాయి కళావతితో కలిసి రోజా మంగళవారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాను అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళమెత్తినపుడల్లా సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ముందుకు తెస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తాను అసెంబ్లీలో లేకపోయినా, అంతకుముందు జరిగిన గొడవలో తానున్నానని, సభా హక్కుల తీర్మానంలో తన పేరును చేర్చారని ఆమె గుర్తు చేశారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసే ప్రకటనపై తొలి వక్తగా తానే మాట్లాడబోతున్నానని తెలిసి అడ్డుకునేందుకు ముందుగానే తనను సభకు రాకుండా ఏడాది పాటు సస్పెండ్ చేశార న్నారు. సస్పెన్షన్‌పై న్యాయపోరాటం చేస్తానన్నారు. మూడు రోజుల తరువాత టీడీపీ ఎమ్మెల్యే అనితతో కంట తడి పెట్టించి తానేదో దళితులను అవమానం చేసినట్లుగా సృష్టించడం సరికాదని, వాస్తవానికి అసెంబ్లీలో వాళ్లు (టీడీపీ) తనను తిట్టిన తిట్లకు తానెంతగానో బాధపడ్డానన్నారు. శాసనసభ కార్యక్రమాల్లో రెండు వైపులా (అధికార, ప్రతిపక్షాల వైపు) జరుగుతున్న దృశ్యాలన్నింటినీ బయటకు విడుదల చేస్తే వాస్తవాలేమిటో తెలుస్తాయని ఆమె అన్నారు. అసెంబ్లీ కార్యక్రమాలు జరుగుతున్నవి జరుగుతున్నట్లే చూపించాలని ఆమె డిమాండ్ చేశారు. ‘ప్రజా సమస్యలపై ప్రతిపక్షం చేసే పోరాటాన్ని చూపించరు. ప్రజా సమస్యలపై మేం ప్రదర్శించే ప్లకార్డులు చూపించరు. నినాదాలు చేస్తే వినిపించరు. సమస్యలపై మేం ప్రభుత్వాన్ని నిలదీస్తే చూపించరు’ అని ఆమె వివరించారు. కానీ వారు (టీడీపీ) ఉచ్చులో ఇరుక్కున్నపుడు మాత్రం తప్పించుకోవడానికి తమకు చెందిన రెండు, మూడు క్లిప్పింగ్‌లు చూపించి మా ప్రవర్తన బాగోలేదంటూ ప్రచారం చేస్తారని రోజా అన్నారు. మహిళలను, ఎస్సీ, ఎస్టీలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే స్థాయికి చంద్రబాబు దిగజారి పోయారన్నారు. అసెంబ్లీ కాదది ఎన్టీఆర్ భవన్ రాష్ట్ర శాసనసభ ఎన్టీఆర్ భవన్ (టీడీపీ కార్యాలయం) మాదిరిగా తయారైందని, ప్రజా సమస్యలు చర్చించే వేదికలాగా అది కనిపించడం లేదన్నారు. తమను కొత్తగా అసెంబ్లీకి వచ్చారంటూ ఎద్దేవా చేస్తున్న టీడీపీ నేతలు ఎలాంటి నీచమైన భాష వాడుతున్నారో ఇప్పటికి జరిగిన నాలుగు సమావేశాలను పరిశీలిస్తే తెలుస్తుందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ‘మిమ్మల్ని పాతేస్తాను’ అని నిందించారని, సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేలు చూపిస్తూ ‘మీ అంతు చూస్తాను. నాతో పెట్టుకున్న వారెవ్వరూ బతికి బట్ట కట్టలేదు...’ అని బెదిరించిన విషయాలను గుర్తు చేశారు. ‘నా భాష బాగోలేదని, నా హావభావాలు బాగో లేవని అంటున్నారే... పదేళ్లు మీ పార్టీ (టీడీపీ)లో పోరాటాలు చేసినపుడు, పనిచేసినపుడు ఇదే భాష, ఇవే హావభావాలున్నాయి. అపుడు బాగున్నవి, ఇపుడెందుకు బాగాలేవు’ అని రోజా ప్రశ్నించారు. అనిత కంట తడిపెట్టిందంటున్న వారికి కాల్‌మనీ-సెక్స్‌రాకెట్‌లో రుణాలు చెల్లించని మహిళలను బౌన్సర్లు లాక్కెళుతూ ఉంటే.. వారు ఏడుస్తూ ఉంటే ఆ కన్నీళ్లు కనిపించలేదా? నారాయణ విద్యాసంస్థల్లో పద్నాలుగు మంది విద్యార్థులను పోగొట్టుకున్న తల్లిదండ్రుల కన్నీళ్లు కనిపించలేదా? రిషితేశ్వరిని పోగొట్టుకున్న అమ్మానాన్నలు విలపించడం కనిపించలేదా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు. సభా సంప్రదాయాలను వల్లె వేసే టీడీపీ నేతలు ఎన్టీఆర్ వంటి మహానుభావుని కుర్చీని లాక్కుని ఆయనను కనీసం అసెంబ్లీలో మాట్లాడనీయకుండా చేయలేదా? ఆయన అవమాన భారంతో అసెంబ్లీ నుంచి ఏడుస్తూ వెళ్లి మానసిక క్షోభకు గురై చనిపోవడానికి కారకులు వీరు కాదా? అని ఆమె నిలదీశారు. కల్తీ మద్యం తాగి మరణించిన వారి భార్యలు పుస్తెలు తెగిపోయి విలపించడం గానీ, పుష్కరాల్లో చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగా మృతి చెందిన 25 మంది కుటుంబాలు విలపించడంగానీ కనిపించడం లేదా అని రోజా ప్రశ్నించారు. వీరందరి సమస్యలపై గళమెత్తుతున్నానని తనను ఆడ రౌడీ అనడం సబబేనా? అన్నారు. మహిళల మాన ప్రాణాలతో ఆడుకుంటూ చంద్రబాబు కాలకేయుడిలా వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు భార్య, కోడలికి తాను ఒక విజ్ఞప్తి చేస్తున్నానని, రాష్ట్రంలో మహిళల కన్నీళ్లు ఆ కుటుంబానికి మంచివి కావని, వారి ఉసురు ఆ కుటుంబానికి తగులుతుందని రోజా అన్నారు. -
కాల్‌మనీ దోషులకు ప్రభుత్వ అండ
ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఏసమ్మ గుంటూరు వెస్ట్ : కాల్‌మనీ వ్యవహారంలో దోషులకు సిఎం చంద్రబాబు ప్రభుత్వం అండగా ఉంటూ, వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నదని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి శీలం ఏసమ్మ ఆరోపించారు. కాల్‌మనీ వ్యవహారంలో దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు రూరల్ మండలం లాల్పురం పంచాయతీ పరిధిలోని లింగాయపాలెం అల్లూరిసీతారామరాజు కాలనీలో మంగళవారం సభ జరిగింది. సభలో ఏసమ్మ మాట్లాడుతూ ఈ వ్యవహారంపై నిస్పక్షపాతంగా న్యాయవిచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాల్‌మనీ మాఫియాకు పోలీసు వ్యవస్థ అండగా ఉండటం వల్ల దురాగాతాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో సంఘం డివిజన్ కార్యదర్శి డి.శివపార్వతి, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎన్.బ్రహ్మయ్య, అఖిల భారత రైతుకూలీ సంఘం నాయకులు నక్కా పోతురాజు తదితరులు పాల్గొన్నారు.