
సాక్షి, అమరావతి: ఆన్‌లైన్ కాల్ మనీ వ్యవహారాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆన్‌లైన్ కాల్ మనీ వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కాల్ మనీ వ్యవహారాలను ఉపేక్షించేది లేదని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. (చదవండి: ‘పల్లెల్లోకి వైద్యులు.. సరికొత్త వ్యవస్థ’)
ఏపీవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు:డీజీపీ
మొబైల్ లోన్ యాప్‌లపై ఏపీ వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు చేపడుతున్నట్లు డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. మైక్రో ఫైనాన్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. మొబైల్ లోన్ యాప్‌లు మహిళల్నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయని వెల్లడించారు. మొబైల్ లోన్ యాప్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు.(చదవండి: లోన్‌యాప్స్ కేసులో ఆసక్తికర విషయాలు)
Comments
Please login to add a commentAdd a comment