Micro Finance
-
రుణ మార్గదర్శకాలు కఠినతరం
మైక్రో ఫైనాన్స్ సంస్థలకు ‘రుణ పూచీకత్తు’ మార్గదర్శకాలను కఠినతరం చేసినట్లు స్వీయ నియంత్రణ సంస్థ–మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ (ఎంఫిన్) ప్రకటించింది. మైక్రో ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పు తీసుకునేవారికి భారం పెరిగిపోతోందని, దీనితో తీసుకున్న రుణాలను వారు తిరిగి చెల్లించలేకపోతున్నారన్న ఆందోళనల నేపథ్యంలో ఎంఫిన్ తాజా నిర్ణయం తీసుకుంది. రుణాల్లో నెలకొన్న ప్రస్తుత సవాళ్ల పరిష్కారానికి తాజా చర్య దోహదపడుతుందని ఎంఫిన్ తెలిపింది. బుల్లెట్ రీపేమెంట్ (రుణ వ్యవధిలో అప్పటికి చెల్లింపులు జరిపింది పోగా మిగిలిన మొత్తాన్ని ఒకేసారి చెల్లిచడం), చెల్లించని ఈఎంఐల గురించి ప్రస్తుతం మైక్రో ఫైనాన్స్ సంస్థల వద్ద తగిన సమాచారం అందడంలేదని ఎంఫిన్ తెలిపింది. ఆయా సమస్యల పరిష్కారానికి ప్రస్తుత మార్గదర్శకాలు దోహపదడతాయని ప్రకటన వివరించింది. అయితే మార్గదర్శకాలు ఏమిటన్నది నిర్ధిష్టంగా తెలియరాలేదు.ఇదీ చదవండి: తగ్గిద్దామా? వద్దా?ఇక ఒకే రుణగ్రహీత ఐదేసి రుణాలను తీసుకున్న పలు సందర్భాలూ వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి వ్యవహారాలు ఆందోళనను సృష్టిస్తున్నాయి. ఒక రుణ గ్రహీత నెలవారీ సంపాదన ఎంత? చెల్లింపుల సామర్థ్యం ఏమిటి? అనే అంశాలపైనా మైక్రో ఫైనాన్స్ సంస్థలకు తగిన సమాచారం లేకపోవడం సమస్యకు మరో కారణం. ఆయా అంశాలు మైక్రో ఫైనాన్స్ సంస్థల రుణ నాణ్యతపై ప్రభావం చూపుతున్నాయి. సంబంధిత వర్గాల నుంచి ఆరు నెలలకు పైగా అందిన సమాచారం మేరకు 12 కోట్ల రుణ రికార్డులను విశ్లేషించిన తర్వాత కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే మార్గదర్శకాలపై త్వరలో పూర్తి సమాచారం వెలువడనుంది. -
చిన్న రుణాలకు మళ్లీ గిరాకీ.. బ్యాంకులను అధిగమించి, 40 శాతం వాటాతో
ముంబై: సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐలు) లాభదాయకత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.7–3 శాతానికి మెరుగుపడుతుందని ఇక్రా రేటింగ్స్ పేర్కొంది. మెరుగైన వసూళ్లు, తక్కువ రుణ వ్యయాలు, కొత్త రుణాలపై అధిక రేట్లు ఇవన్నీ లాభదాయకత పెరగడానికి అనుకూలతలుగా తెలిపింది. ఎంఎఫ్ఐలు కరోనా మహమ్మారి రాకతో కుదేలు కాగా, ఆ తర్వాత వేగంగా కోలుకుని సూక్ష్మ రుణాల్లో బ్యాంకులను అధిగమించి, 40 శాతం వాటాతో మొదటి స్థానానికి చేరుకోవడం గమనార్హం. 2021–22 నాటికి ఉన్న 34 శాతంతో పోలిస్తే 6 శాతం మార్కెట్ వాటాను గత ఆర్థిక సంవత్సరంలో పెంచుకున్నాయి. సూక్ష్మ రుణాల్లో బ్యాంకుల వాటా 40 శాతం నుంచి 34 శాతానికి తగ్గింది. ఈ మేరకు ఒక నివేదికను ఇక్రా విడుదల చేసింది. రుణాల్లో మెరుగైన వృద్ధి ఎంఎఫ్ఐలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాల పరంగా 24–26 శాతం వృద్ధిని నమోదు చేస్తాయని ఇక్రా రేటింగ్స్ నివేదిక అంచనా వేసింది. అంతేకాదు వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25)నూ 23–25 శాతం మేర రుణ వితరణలో వృద్ధిని సాధిస్తాయని తెలిపింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎంఎఫ్‌ఐల లాభదాయకత 3.2–3.5 శాతానికి పెరుగుతుందని అంచనా వ్యక్తీకరించింది. 2022–23 చివరికి నాటికి ఎంఎఫ్‌ఐల లాభదాయకత 2.1 శాతంగా ఉంది. ‘‘ఇక మీదట మంజూరు చేసే రుణాలు అధిక ధరపై ఉండడం, రుణ రేట్ల పరంగా ఆర్బీఐ వెసులుబాటు కల్పించడం నికర వడ్డీ మార్జిన్లను పెంచుతుంది. దీంతో ఎంఎఫ్‌ఐల లాభదాయకత పెరుగుతుంది’’ అని ఇక్రా తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన వ్యయాల్లో అధిక భాగాన్ని గత ఆర్థిక సంవత్సరంలో ఇవి సర్దుబాటు చేసుకున్నట్టు వివరించింది. అలాగే, కరోనా మహమ్మారి ముందు నాటి స్థాయికి రుణ వసూళ్లు మెరుగుపడినట్టు వెల్లడించింది. ఆస్తుల్లోనూ బలమైన వృద్ధి.. ఎంఎఫ్ఐలు గత ఆర్థిక సంవత్సరంలో తమ నిర్వహణ ఆస్తులను (రుణాల పోర్ట్‌ఫోలియో) 38 శాతం పెంచుకున్నాయి. బ్యాంకులతో పోలిస్తే ఎంఎఫ్ఐలు తమ ఆస్తులను అధికంగా విస్తరించుకున్నట్టు ఇక్రా రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ సచిన్ సచ్దేవ తెలిపారు. ఒక రుణగ్రహీతకు సంబంధించి సగటు ఖాతాలు కూడా పెరిగాయి. దీన్ని బట్టి చూస్తుంటే ఒకే రుణ గ్రహీత వెంట ఒకటికి మించిన సంస్థలు వెంటబడుతున్నట్టు తెలుస్తోందని ఇక్రా పేర్కొంది. ఇది రుణ గ్రహీతల రుణ భారాన్ని కూడా పెంచుతున్నట్టు తెలిపింది. కరోనా మహమ్మారి ప్రభావం సమసిపోవడంతో, రుణ బకాయిలు పేరుకుపోవడం తగ్గుతున్నట్టు వివరించింది. 90 రోజులకు పైగా చెల్లింపులు చేయని రుణ ఖాతాలు 2021–22 మొదటి ఆరు నెలల్లో 6.2 శాతానికి పెరగ్గా, 2023 మార్చి నాటికి 2.5 శాతానికి తగ్టినట్టు పేర్కొంది. 2023–24లో వసూలు కాని రుణాలు మరో 0.4–06 శాతం క్షీణించొచ్చని అంచనా వేసింది. ఎంఎఫ్‌ఐల లిక్విడిటీ పరిస్థితులు కూడా మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. -
మైక్రోఫైనాన్స్ రంగానికి మంచి రోజులు
ముంబై: సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐ) కరోనా సమయంలో తగిలిన గట్టి ఎదురుదెబ్బ నుంచి బయటకు వచ్చాయని, ఈ ఆర్థిక సంవత్సరం చివరికి క్రెడిట్ వ్యయాలు తక్కువ స్థాయికి చేరుకుంటాయని, ప్రస్తుతం ఇవి మంచి వృద్ధిని చూస్తున్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తన తాజా నివేదికలో తెలిపింది. మైక్రోఫైనాన్స్ రంగానికి అవుట్‌లుక్‌ను తటస్థం నుంచి ‘మెరుగుపడుతున్నట్టు’గా మార్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24) స్థిరమైన రేటింగ్ ఇచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ రుణ పరిశ్రమ 20–30 శాతం మధ్య వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది. కరోనా మహమ్మారి సమసిపోవడంతో మరింత మంది రుణాల కోసం ముందుకు వస్తున్నట్టు తెలిపింది. రుణ వసూళ్లు మెరుగుపడడం, రుణ వితరణలు పెరగడం, క్రెడిట్ వ్యయాలు 15–5 శాతం నుంచి 1–3 శాతానికి దిగి రావడం అనుకూలించే అంశాలుగా పేర్కొంది. సూక్ష్మ రుణ సంస్థలు కరోనా మహమ్మారికి సంబంధించి ప్రతికూలతలను దాదాపుగా డిసెంబర్ త్రైమాసికానికి సర్దుబాటు చేసుకున్నట్టు వివరించింది. రుణ వితరణలు పెరుగుతుండడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో మెరుగైన వృద్ధి నమోదు కావచ్చని తెలిపింది. రెండు రిస్క్‌లు వచ్చే 12–18 నెలల కాలంలో సూక్ష్మ రుణ పరిశ్రమ ముందు రెండు కీలక రిస్క్‌లు ఉన్నట్టు ఇండియా రేటింగ్స్ నివేదిక తెలిపింది. ద్రవ్యోల్బణం, ఎన్నికలను ప్రస్తావించింది. ఈ రెండు అంశాలు 2023–24తోపాటు, 2024–25 మొదటి ఆరు నెలలు రుణ గ్రహీతల ఆదాయంపై ప్రభావం చూపించొచ్చని అంచనా వేసింది. రుణాల ఎగవేతలు, క్రెడిట్ వ్యయాలు సాధారణ స్థాయికి వస్తా యని తెలిపింది. ప్రస్తుతం ఈ సంస్థల రుణాల్లో అధిక శాతం కరోనా మహమ్మారి తర్వాత జారీ అయినవేనని, వసూళ్లు మెరుగ్గా ఉన్నాయని వివరించింది. మొత్తం మీద క్రెడిట్ వ్యయాలు 2022– 23లో 1.5–5 శాతం మధ్య ఉంటే, 2023–24లో 1–3 శాతానికి తగ్గుతాయని పేర్కొంది. ముఖ్యంగా ఎంఎఫ్‌ఐల రుణ గ్రహీతల్లో 65 శాతం నిత్యావసర వస్తువులు, సేవల్లోనే ఉపాధి పొందుతున్నందున, వీరిపై ద్రవ్యోల్బణం ప్రభావం అధికంగా పడుతుందని, వారి ఆదాయం, వ్యయాలను గణనీయంగా ప్రభావితం చేస్తుందని పేర్కొంది. -
ముత్తూట్ మైక్రోఫిన్ ఐపీవో బాట.. రూ.1800 కోట్లు టార్గెట్!
ముంబై: ప్రయివేట్ రంగ కంపెనీ ముత్తూట్ మైక్రోఫిన్ పబ్లిక్ ఇష్యూ యోచనలో ఉంది. ముత్తూట్ ఫిన్‌కార్ప్ ప్రమోట్ చేసిన కంపెనీ 2023 చివరి క్వార్టర్‌కల్లా క్యాపిటల్ మార్కెట్లను ఆశ్రయించే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది. ఐపీవో ద్వారా రూ. 1,500–1,800 కోట్లను సమీకరించాలని భావిస్తున్నట్లు కంపెనీ ఎండీ థామస్ ముత్తూట్ తెలియజేశారు. దీంతో మైక్రోఫైనాన్స్ పరిశ్రమ(ఎంఎఫ్ఐ)లోనే అతిపెద్ద ఐపీవోగా నిలవనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా లిస్టింగ్కల్లా రూ.10,000 కోట్ల నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎం) కలిగిన తొలి ఎంఎఫ్ఐగా రికార్డ్ సాధించే వీలున్నట్లు తెలియజేశారు. కంపెనీలో ముత్తూట్ ఫిన్‌కార్ప్, ముత్తూట్ కుటుంబానికి 71 శాతం వాటా ఉన్నట్లు వెల్లడించారు. పీఈ సంస్థ జీపీసీ 16.6 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. చదవండి: ఐటీలో ఫేక్ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే! -
రూ. 2.85 లక్షల కోట్లకు మైక్రోఫైనాన్స్ రుణాలు
ముంబై: దశాబ్దం క్రితం రూ. 16 వేల కోట్లుగా ఉన్న సూక్ష్మ రుణాల వ్యాపార పరిమాణం గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 2.85 లక్షల కోట్లకు చేరింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్-ఎంఎఫ్ఐలు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, బ్యాంకులు మొదలైన దాదాపు 100 సంస్థలు ఈ రుణాలు ఇస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ఈ మార్కెట్ పరిమాణం రూ. 17 లక్షల కోట్లకు చేరగలదని పరిశ్రమ వర్గాలు రూపొందించిన నివేదికలో వెల్లడైంది. మైక్రోఫైనాన్స్ సంస్థల నెట్వర్క్ (ఎంఎఫ్ఐఎన్) సీఈవో అలోక్ మిశ్రా ఈ విషయాలు తెలిపారు. సగటు రుణ పరిమాణం, కాల వ్యవధులు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం నాలుగింట మూడొంతుల రుణాల కాల వ్యవధి 18 నెలలకు పైగా ఉంటోందన్నారు. ఈ రంగం దాదాపు 1.6 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తోందని మిశ్రా వివరించారు. ఎక్కువగా రుణ కార్యకలాపాలు టాప్ 300 జిల్లాలకు మాత్రమే పరిమితమవుతున్నాయని, వీటిని మరింతగా విస్తరించాల్సి ఉందని చెప్పారు. మరోవైపు, రెండేళ్ల కోవిడ్ దెబ్బతో మైక్రోఫైనాన్స్ సంస్థలు 5–10 శాతం వరకూ నష్ట పోయాయని పేర్కొన్నారు. అయితే, కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో మొండిబాకీల రికవరీ క్రమంగా మెరుగుపడుతోందని మిశ్రా చెప్పారు. 30 రోజులకు పైబడిన బకాయిలు .. సెకండ్ వేవ్ కారణంగా గతేడాది మధ్యలో 22 శాతానికి ఎగియగా ఈ ఏడాది జూలైలో 10-11 శాతానికి దిగివచ్చాయని వివరించారు. -
రూ. 2.85 లక్షల కోట్లకు మైక్రోఫైనాన్స్ రుణాలు
దశాబ్దం క్రితం రూ. 16,000 కోట్లుగా ఉన్న సూక్ష్మ రుణాల వ్యాపార పరిమాణం గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 2.85 లక్షల కోట్లకు చేరింది. నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్–ఎంఎఫ్ఐలు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, బ్యాంకులు మొదలైన దాదాపు 100 సంస్థలు ఈ రుణాలు ఇస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ఈ మార్కెట్ పరిమాణం రూ. 17 లక్షల కోట్లకు చేరగలదని పరిశ్రమవర్గాలు రూపొందించిన నివేదికలో వెల్లడైంది. మైక్రోఫైనాన్స్ సంస్థల నెట్వర్క్ (ఎంఎఫ్ఐఎన్) సీఈవో అలోక్ మిశ్రా ఈ విషయాలు తెలిపారు. సగటు రుణ పరిమాణం, కాల వ్యవధులు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం నాలుగింట మూడొంతుల రుణాల కాల వ్యవధి 18 నెలలకు పైగా ఉంటోందన్నారు. ఈ రంగం దాదాపు 1.6 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తోందని మిశ్రా వివరించారు. ఎక్కువగా రుణ కార్యకలాపాలు టాప్ 300 జిల్లాలకు మాత్రమే పరిమితమవుతున్నాయని, వీటిని మరింతగా విస్తరించాల్సి ఉందని చెప్పారు. మరోవైపు, రెండేళ్ల కోవిడ్ దెబ్బతో మైక్రోఫైనాన్స్ సంస్థలు 5–10 శాతం వరకూ నష్టపోయాయని పేర్కొన్నారు. అయితే, కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో మొండిబాకీల రికవరీ క్రమంగా మెరుగుపడుతోందని మిశ్రా చెప్పారు. 30 రోజులకు పైబడిన బకాయిలు .. సెకండ్ వేవ్ కారణంగా గతేడాది మధ్యలో 22 శాతానికి ఎగియగా ఈ ఏడాది జూలైలో 10–11 శాతానికి దిగివచ్చాయని వివరించారు. చదవండి: ‘వెనక ఇంత జరిగిందా’.. ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన ప్రముఖ ఐటీ కంపెనీ! -
రూ.2.85 లక్షల కోట్లకు మైక్రో ఫైనాన్స్ రుణాలు
ముంబై: సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐ) రుణ పరిమాణం జూన్ త్రైమాసికం ముగిసే నాటికి రూ.2.85 లక్షల కోట్లని సీఆర్ఐఎఫ్ హై మార్క్ నివేదిక ఒకటి తెలిపింది. మార్చి త్రైమాసికంతో పోల్చితే ఈ మొత్తాలు స్వల్పంగా 0.2 శాతం తగ్గినట్లు ఈ క్రెడిట్ సమాచార సేవల సంస్థ వివరించింది. అయితే రుణ నాణ్యత పెరిగినట్లు పేర్కొంది. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► వార్షికంగా పోల్చితే (గత ఏడాది జూన్ త్రైమాసికంతో పోల్చితే) సూక్ష్మ రుణ పుస్తక విలువ 18 శాతం పెరిగింది. అప్పట్లో కోవిడ్–19 సెకండ్‌వేవ్ ఈ విభాగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. ► జూన్ త్రైమాసికంలో రుణ పంపిణీ రూ.49,788 కోట్లు. మార్చి త్రైమాసికంతో పోల్చితే ఇది 39.2% తక్కువ. అయితే గత ఏడాది ఇదే కా లంతో పోల్చితే మాత్రం 88.9 శాతం అధికం. ► జూన్ త్రైమాసికం ముగిసే సమయానికి 90 రోజులకు పైగా ఉన్న రుణ బకాయిల విలువ మార్చి త్రైమాసికంతో పోల్చితే 0.5 శాతం తగ్గి 2.2 శాతంగా ఉంది. క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈ రేటు భారీగా 1.1 శాతం తగ్గింది. ► ఒక్కో ప్రత్యేక రుణగ్రహీత సగటు బ్యాలెన్స్ మార్చి త్రైమాసికంతో పోల్చితే 1.1 శాతం తగ్గి రూ. 46,400కి చేరింది. కాగా, ఒక్కో ఖాతా సగటు బ్యాలెన్స్ 2.1 శాతం క్షీణించింది. ► సూక్ష రుణ సంస్థల రుణాలు జూన్ త్రైమాసికంలో పట్టణాల్లో 0.8 శాతం క్షీణిస్తే, గ్రామీణ మార్కెట్లలో ఈ తగ్గుదల 0.2 శాతంగా ఉంది. ► దేశ వ్యాప్తంగా చూస్తే, జూన్ 2022 త్రైమాసిక మొత్తం రుణాల్లో తొలి 10 టాప్ మార్కెట్లు 84 శాతం వాటా కలిగి ఉన్నాయి. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్ అత్యధిక వృద్ధి గణాంకాలను నమోదు చేశాయి. ► పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, నదియా జిల్లాలు ఎంఎఫ్ఐ రుణాల విషయంలో చివరి వరుసలో ఉన్నాయి. ► ఇక సూక్ష్మ రుణాల విషయంలో బ్యాంకులు 35.6 శాతం పోర్ట్‌ఫోలియో వాటాతో (జూన్ త్రైమాసికంలో) మార్కెట్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే మార్చి త్రైమాసికంతో పోల్చితే పోర్ట్‌ఫోలియోలో 5.6 శాతం క్షీణత నమోదయ్యింది. -
సూక్ష్మ రుణాలు రూ.2.93 లక్షల కోట్లు
ముంబై: సూక్ష్మ రుణ సంస్థల స్థూల రుణ పోర్ట్‌ఫోలియో జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 23.5 శాతం వృద్ధి చెంది (అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే) రూ.2,93,154 కోట్లకు చేరుకుంది. ఇక ఈ ఏడాది మార్చి త్రైమాసికం చివరికి ఉన్న రూ.2.85 లక్షల కోట్ల రుణాలతో పోల్చి చూస్తే కనుక.. 2.7 శాతం పెరిగాయి. సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐలు) స్వీయ నియంత్రణ సంస్థ ‘మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ నెట్వర్క్’ (ఎంఎఫ్ఐఎన్) ఓ నివేదిక విడుదల చేసింది. రానున్న త్రైమాసికాల్లో రుణాల పోర్ట్‌ఫోలియో మరింత వృద్ధి చెందుతుందని ఎంఎఫ్ఐఎన్ సీఈవో అలోక్ మిశ్రా తెలిపారు. నియంత్రణ పరమైన, నిర్వహణపరమైన సానుకూల వాతావరణం ఉన్నట్టు చెప్పారు. కరోనా తర్వాత జారీ చేసిన రుణాల్లో నాణ్యత 95 శాతానికి పైగా (వసూళ్లు) ఉన్నట్టు ఎంఎఫ్ఐఎన్ చైర్మన్ దేవేశ్ సచ్దేవ్ పేర్కొన్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలంలో శాఖల బలమైన విస్తరణకుతోడు గతంలో నిలిచిన డిమాండ్ తోడు కావడం, సానుకూల విధానాలతో ఎంఎఫ్ఐ రంగం మంచి వృద్ధిని నమోదు చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
దేశంలో భారీగా పెరిగిపోతున్న మైక్రో ఫైనాన్స్ రుణాలు!
ముంబై: సూక్ష్మ రుణ పోర్ట్‌ఫోలియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్థిక సంవత్సరం (2022–23) మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) భారీగా 24 శాతం పెరిగింది. 2021–22 రూ.2,22,307 కోట్లుగా ఉన్న రుణ పోర్ట్‌ఫోలియో తాజా సమీక్షా కాలంలో రూ.2,75,750 కోట్లకు ఎగసింది. 2022 మార్చి ముగిసే నాటికి అన్ని రుణ సంస్థల పోర్ట్‌ఫోలియో రూ.2,62,599 కోట్లుగా ఉన్నట్లు మైక్రోఫైనాన్స్ సంస్థలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గుర్తింపు కలిగిన– సెల్ప్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ (ఎస్ఆర్ఓ) నివేదిక వివరించింది. నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► బ్యాంకులు మినహా అన్ని రుణ సంస్థల పోర్ట్‌ఫోలియో రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. బ్యాంకుల మైక్రోక్రెడిట్ పోర్ట్‌ఫోలియో మాత్రం 9.23 శాతం పెరిగి రూ.1,04,762 కోట్లకు చేరుకుంది. ►నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) విషయంలో మాత్రం భారీగా 54.62 శాతం సూక్ష్మ రుణ వృద్ధి జరిగింది. విలువలో ఇది రూ.24,870 కోట్లు. ►ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ఎఫ్బీ) నాట్–ఫర్–ప్రాఫిట్ ఎంఎఫ్ఐలు (ఎన్‌ఎఫ్‌పీ) వరుసగా 35.18 శాతం, 27.66 శాతం, 20.71 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ►ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో రుణ సంస్థల మొత్తం రుణ పంపిణీ రూ. 57,842 కోట్లు. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ విలువ రూ. 27,328 కోట్లు. ►కాగా, గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (2022 జనవరి–మార్చి)తో పోల్చితే ఏప్రిల్–జూన్ మధ్య రుణ పంపిణీ 35 శాతం పడిపోయింది. కొత్త నిబంధనలకు అనుగుణంగా రుణదాతలు తమ రుణ పంపిణీ విధానంలో మార్పులు తీసుకురావడం దీనికి కారణం. ►ఇక 2022 జనవరి–మార్చిలతో పోల్చితే, ఏప్రిల్–జూన్ మధ్య ఈ రంగంలో రికవరీగా కూడా భారీగా మెరుగుపడింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ మెరుగుదల దాదాపు 99 శాతంగా కూడా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎంతో తక్కువగా కూడా ఉంది. ఉదాహరణకు అస్సోంను తీసుకుంటే, రికవరీ రేటు 50 శాతం నుంచి 55 శాతంగా ఉంది. ►ఇక జూన్ చివరినాటికి సూక్ష్మ రుణ రంగంలో మొండి బకాయిలు (ఎన్పీఏ) దాదాపు 12 శాతం. ఎన్బీఎఫ్సీ– ఎంఎఫ్‌ఐల పరిమాణం సంబంధించి ఎన్పీఏలు కొంత తక్కువగా 9 శాతంగా ఉంది. ►2022 జూన్ 30 నాటికి ‘పోర్ట్‌ఫోలియో ఎట్ రిస్క్’ (పీఏఆర్) 30+ (30 రోజులలోపు రుణాలు) 5.07 శాతానికి మెరుగుపడ్డాయి. 2022 జనవరి–మార్చిలో ఈ రేటు 5.27 శాతం. ►ఇక ‘పోర్ట్‌ఫోలియో ఎట్ రిస్క్’ (పీఏఆర్) 60+ (60 రోజులలోపు రుణాలు) మాత్రం ఇదే కాలంలో 3.55 శాతం నుంచి 5.60 శాతానికి క్షీణించాయి. ►పీఏఆర్ 30+ స్థాయిలకు సంబంధించి ఎన్పీఏలు.. జాతీయ సగటు 5.07 శాతం కంటే ఎక్కువగా ఉన్న ప్రధాన రాష్ట్రాల్లో అస్సోం, పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర, ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి. ఇబ్బందులను అధిగమించింది... సూక్ష్మ రుణ రంగం మహమ్మారి కరోనా ప్రేరిత ఇబ్బందులను అధిగమించింది. పురోగతి బాటన పయనిస్తోంది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఆర్బీఐ కొత్త నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ, ఈ రంగం చక్కటి వృద్ధి తీరును సాధించింది. – జీజీ మామెన్,సా–ధన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ -
చిన్న వయసు.. పెద్ద ఆలోచన
చిన్న హృదయంలో తట్టిన ఆలోచన ఎందరో మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. సేవా దృక్పథంతో 42 మంది విద్యార్థులు ఏకమై ఓ సంస్థను నెలకొల్పారు. సింహపురి చిన్నోడి మదిలో మెదిలిన ఆలోచన దేశ, విదేశాలల్లోని విద్యార్థులను కదిలించగా.. వారి దన్నుతో ఆర్థిక సంక్షోభంలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు ‘స్విఫ్ట్’ సంస్థ వెలిసింది. రెండేళ్లుగా వడ్డీలేని సూక్ష్మ రుణాలను అందిస్తూ.. లండన్ ప్రిన్స్ విలియమ్స్ మనసు గెలుచుకుని.. ‘ప్రిన్స్ డయానా’ అవార్డు దక్కించుకున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరంలోని రాంజీనగర్‌కు చెందిన కొరిశపాటి గోభాను శశాంకర్ అనే విద్యార్థికి పట్టుమని పదిహేడేళ్లు కూడా లేవు. మస్కట్‌లోని ఇంటర్నేషనల్ స్కూల్లో 11వ తరగతి చదువుతున్నాడు. మైక్రో ఫైనాన్స్‌పై ఆసక్తి పెంచుకుని వినూత్న సేవపై దృష్టి సారించాడు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న మహిళలను ఆదుకోవడం కోసం 2019 డిసెంబరులో ‘సస్టెయినింగ్ ఉమన్ ఇన్ మైక్రో ఫైనాన్స్ టర్మేయిల్’ (స్విఫ్ట్) పేరిట సూక్ష్మ రుణ సంస్థను ప్రారంభించాడు. దీనికి 42 మంది తోటి విద్యార్థుల మద్దతు లభించింది. వారంతా కలిసికట్టుగా పని చేస్తామని ధ్రువీకరిస్తూ విధి విధానాలను షేర్ చేసుకున్నారు. అలా ప్రారంభమైన స్విఫ్ట్ సంస్థ దినదినాభివృద్ధి చెందుతోంది. ఆన్లైన్ ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలందించాలనే లక్ష్యం మేరకు నిరాటంకంగా రుణాలందిస్తున్నారు. రెండేళ్లలో వ్యక్తిగత, గ్రూపులతో కలిసి 1,450 రుణాలను మంజూరు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలకు రూ.60 లక్షలను ఆన్లైన్ ద్వారా అందించారు. రూ.25 లక్షలతో ప్రారంభం విద్యార్థులతో ఏర్పాటైన ఈ సంస్థ రూ.25 లక్షలతో మైక్రో ఫైనాన్స్ కార్యకలాపాలను మొదలుపెట్టింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న మహిళలకు ఆ సంస్థ ఓ ప్రశ్నావళిని (క్వశ్చనీర్) ఆన్లైన్లోనే అందుబాటులో ఉంచుతోంది. రుణం అవసరమైన వారు దానిని నింపితే.. వారి బ్యాంక్ ఖాతాకు రుణం జమ అవుతోంది. ఇలా రుణం పొందిన మహిళలు వారు తీసుకున్న మొత్తం ఆధారంగా వాయిదాల రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంది. ఒక్కొక్కరికీ రూ.2,500 నుంచి రూ.40 వేల వరకు రుణం అందించారు. వారిలో గ్రూపులుగా ఏర్పడి రుణాలు పొందిన వారూ ఉన్నారు. స్విఫ్ట్ సంస్థకు రుణగ్రహీతల నుంచి కూడా మంచి సహకారం దక్కుతోంది. 98 శాతం మంది రుణాలు తిరిగి చెల్లిస్తున్నారు. ఇలా ప్రస్తుతం రూ.60 లక్షలను వివిధ వృత్తులు, వ్యాపారాల్లో ఉన్న మహిళలకు రుణాలుగా అందించారు. ప్రిన్స్ డయానా అవార్డుకు ఎంపిక సామాజిక దృక్పథం, మానవీయ విలువలు ఉన్న వారికి దివంగత లండన్ రాణి డయానా అవార్డును ప్రిన్స్ విలియమ్స్ ఏటా అందిస్తారు. విద్యార్థులతో ఏర్పాటైన స్విఫ్ట్ సంస్థ ఈసారి ప్రిన్స్ విలియమ్స్ మనసు గెల్చుకుంది. చిన్న వయసులో సామాజిక దృక్పథంతో.. లాభాపేక్ష లేకుండా సోషల్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా మహిళలకు అండగా నిలుస్తున్న స్విఫ్ట్ సంస్థను డయానా అవార్డుకు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని స్విఫ్ట్ సంస్థకు ఈ–మెయిల్ ద్వారా తెలియజేశారు. మరింత బాధ్యత పెరిగింది ప్రిన్స్ డయానా అవార్డు దక్కడం సంతోషంగా ఉంది. మహిళలకు దన్నుగా నిలవాలనే దృక్పథంతో ఆర్థికంగా చేయూత అందిస్తూ వడ్డీ లేని సూక్ష్మ రుణాలు ఇస్తున్నాం. నా తోటి 42 మంది విద్యార్థులతో స్విఫ్ట్ సంస్థను ఏర్పాటు చేశాం. swiftmfi.org వెబ్సైట్ ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాం. – గోభాను శశాంకర్, స్విఫ్ట్ ఫౌండర్ -
ఎంఎఫ్‌ఐల సెక్యూరిటైజేషన్ రూ.3,500 కోట్లు
ముంబై: సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐలు) సెక్యూరిటైజేషన్ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.3,500 కోట్లుగా ఉందని ఇక్రా రేటింగ్స్ తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఎంఎఫ్‌ఐల సెక్యూరిటైజేషన్ పరిమాణం రూ.1,460 కోట్లుగానే ఉంది. ఎంఎఫ్ఐలు తమ రుణాలను కొంత మేర సెక్యూరిటీలుగా (బాండ్లు, తదితర) మార్చి నిధుల అవసరాలను తీర్చుకోవడమే సెక్యూరిటైజేషన్. 2022 మొదటి ఆరు నెలల్లో ఎంఎఫ్‌ఐల రుణ ఆస్తుల సెక్యూరిటైజేషన్ బలంగా పుంజుకున్నట్ట ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. సెక్యూరిటీటైజేషన్ అన్నది ఎంఎఫ్‌ఐల నిధుల మార్గాల్లో ఒకటి. ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలకు ఇది కీలక నిధుల మార్గంగా ఉండడం గమనార్హం. చదవండి: 5G Spectrum Auction: కంపెనీలు తగ్గేదేలే.. రికార్డ్ బ్రేక్, తొలి రోజు రూ.1.45లక్షల కోట్లు! -
ఒక్క లోను పొందాలంటే వంద తిప్పలు.. అందుకే ‘నావి’ వచ్చింది
Sachin Bansal Biography: ఫ్లిప్‌కార్ట్, ఇండియాలో ఇ కామర్స్‌కి రాచబాటలు వేసిన స్టార్టప్. సచిన్బన్సాల్, బిన్ని బన్సాల్ అనే ఇద్దరు యువ ఇంజనీర్లు స్థాపించిన ఇ కామర్స్ కంపెనీ మన దగ్గర రికార్డులు సృష్టించింది. 2007లో నాలుగు లక్షలతో ప్రారంభిస్తే 2018లో ఆ కంపెనీలో వాటా అమ్మినందుకు ప్రతిఫలంగా సచిన్ బన్సా్ల్కి వన్ బిలియన్ డాలర్లు ప్రతిఫలంగా దక్కాయి. మన కరెన్సీలో అయితే ఏకంగా 73 వేల కోట్ల రూపాయల పైమాటే. అయితే ఫ్లిప్‌కార్ట్‌ని అమ్మేసిన తర్వాత సచిన్ బన్సాల్ ఏం చేస్తున్నారు? అక్కడ వచ్చని సొమ్మును ఎలా వెచ్చిస్తున్నారు? సమస్య నుంచే పుట్టిందే ఫ్లిప్‌కార్ట్ ఢిల్లీ ఐఐటీలో ఇంజనీరింగ్ చదివేప్పుడు అవసమైర పుస్తకాల కోసం బుక్‌స్టోర్స్ గాలించే వాడు సచిన్ బన్సాల్, ఒక్కో పుస్తకం ఒక్కో షాపులో దొరికేది. కొన్ని పుస్లకాల కోసం నగరంలోని మార్కెట్లను జల్లెడ పట్టాల్సి వచ్చేది. అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌ని అడిగి పక్క ఊరి నుంచి కూడా పుస్తకాలు తెప్పించుకునే వాడు. తాను పడ్డ ఇబ్బందులకు పరిష్కార మార్గం ఆలోచించే పనిలో పుట్టిందే ఫ్లిప్‌కార్ట్. పుస్తకాల కోసం ఎక్కడెక్కడో తిరగకుండా ఒకే చోట అన్ని లభించేలా ఆన్లైన్ బుక్‌స్టోర్‌గా ఫ్లిప్‌కార్ట్ ప్రారంభమైంది. నాలుగు లక్షల పెట్టుబడి ఇండియా ఐటీ సెక్టార్ క్యాపిటల్ బెంగళూరు కేంద్రంగా కేవలం రూ. 4,00,000 పెట్టుబడితో 2007లో ప్రారంభించారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతీ స్మార్ట్‌ఫోన్‌లో ఓ తప్పనిసరి యాప్‌గా ఫ్లిప్‌కార్ట్ మారింది. మెట్రో నగరాల నుంచి జిల్లా కేంద్రాలు, చిన్న మున్సిపాలిటీల వరకు ఫ్లిప్‌కార్ట్ సేవలు విస్తరించాయి. చివరకు 2018లో వాల్‌మార్ట్ సంస్థ 16 బిలియన్ డాలర్లకు ఈ కంపెనీని కొనుగోలు చేసింది. అప్పుడే ఫ్లిప్‌కార్ట్ నుంచి బయటకు వచ్చారు సచిన్ బన్సాల్. బ్యాంకులు ఇలా పని చేస్తాయా ! ఫ్లిప్‌కార్ట్ ఫౌండర్‌గా ఉంటూ టెక్నోక్రాట్‌గా ఎంట్రప్యూనర్‌గా అంత వరకు గడిపిన లైఫ్ ఒకటైతే ఆ తర్వాత మరో లైఫ్ గడపాల్సి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ అమ్మగా వచ్చిన బోలెడంత డబ్బు చేతిలో ఉంది. అప్పటి వరకు తన ఆర్థిక వ్యవహారాలు నిర్వహించేందుకు సచిన్ బన్సాల్ ఓ పెద్ద బ్యాంక్‌కి చెందిన యాప్‌ని వినియోగించేవాడు. ఆ సమయంలో ఆ యాప్ క్రాష్ అయ్యింది. నాలుగు రోజుల పాటు పని చేయలేదు. ఆర్థిక లావాదేవీలన్నీ నాలుగు రోజుల పాటు నిలిచి పోయాయి. అప్పడే బ్యాంకులు, వాటి పనితీరు, వాటి నిర్వహాణ పద్దతుల మీద సచిన్‌లో ఆలోచన మొదలైంది. ఆరు నెలల పాటు.. ఫ్లిప్‌కార్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరు నెలల పాటు బ్యాంకులు కష్టమర్ల ఎంపిక, లోన్లు ఇచ్చే తీరు, వసూలు చేసే పద్దతిలను జాగ్రత్తగా గమనించాడు. దాదాపుగా అన్ని బ్యాంకులు ఒకే పద్దతిని అనుసరిస్తూ లోన్లు ఇచ్చేప్పుడు విపరీతమైన ఆలస్యం చేస్తున్నాయనే అభిప్రాయానికి వచ్చాడు. అంతేకాదు అర్హత కలిగిన ఎంతో మందికి బ్యాంకుల ద్వారా లోన్లు పొందడం కష్టంగా ఉందనే విషయం అర్థమైంది. ఇక బ్యాంకుల డిజిటల్ లావాదేవీలు జటిలంగా ఉండటానికి గమనించాడు. నావికి రూపకల్పన సామాన్యుల నుంచి బిజినెస్ టైకూన్ల వరకు అందరి ఆర్థిక వ్యవహరాలు నిర్వర్తించడానికి వీలుగా ఉండేలా నావి పేరుతో డిజిటల్ ఫైనాన్సియల సర్వీసెస్ యాప్‌ని సచిన్ బన్సాల్ రూపకల్పన చేశారు. నావిగేటర్ అనే పదం నుంచి నావిని తీసుకున్నారు. హోం లోన్లు, పర్సనల్ లోన్లతో పాటు హెల్త్ ఇన్సురెన్స్ సేవలను అందివ్వడం నావి ప్రత్యేకత. 20 నిమిషాల్లోనే నావి ద్వారా లోన్లు పొందేందుకు బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ, వందల కొద్ది సంతకాలు, పదుల కొద్ది డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. ఐదు నుంచి 20 నిమిషాల లోపే అన్ని పనులు నావి యాప్ ద్వారా చేసేయోచ్చని ఆ వెంటనే లోన్ పొందవచ్చని సచిన్ చెబుతున్నారు. తమ యాప్‌లోని ఆర్టిఫీషియల ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ సాయంతో పని త్వరగా పూర్తి అవుతుందని హామీ ఇస్తున్నారు. రికవరీ కూడా అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. వంద కోట్ల మందికి వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి నావి డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ద్వారా రూ. 4200 కోట్లు రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ సంస్థ ద్వారా రూ. 900 కోట్లు రుణాలు ఇచ్చారు. కేవలం మైక్రోఫైనాన్స్లకే రూ.1500 కోట్లు ఇవ్వాలని లక్క్ష్యంగా పెట్టుకున్నారు. త్వరలోనే నావి బ్యాంకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ బ్యాంకులు ప్రధానంగా ఆన్లైన్ వేదికగానే ఎక్కువ పనులు చక్కబెడతాయి. వంద కోట్ల మందికి సేవలు అందివ్వాలన్నదే లక్క్ష్యంగా నావి ముందుకు పోతుంది. భవిష్యత్తు డిజిటల్‌దే ఒకప్పుడు మన దగ్గర ఒక వస్తువు కొనేప్పుడు దాన్ని ముట్టుకుని, గట్టిగా పట్టుకుని సంతృప్తి చెందితేనే కొనే అలావాటు ఉండేది. అలాంటిది ఫ్లిప్‌కార్ట్ రాకతో నెట్లో చూసి నమ్మకంతో వేల రూపాయల వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. పదేళ్లలో బిలియన్ డాలర్ల కంపెనీగా తీర్చిదిద్దారు. అదే తీరులో నావి కూడా భవిష్యత్తులో ప్రతీ ఒక్కరికి చేరువ అవుతుందనే నమ్మకంతో సచిన్ ఉన్నారు. ఎందుకంటే 5జీ రాకతో డిజిటల్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని సచిన్ అంటున్నారు. మనీకంట్రోల్ సౌజన్యంతో చదవండి: Alibaba: అత్యాచార బాధితురాలికి అండగా పోస్టులు.. పది మంది ఎంప్లాయిస్ డిస్మిస్ -
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క క్లిక్‌తో మీ సొంతం
సాక్షి, హైదరాబాద్: కాలేజీ విద్యార్థుల సరదాలు తీర్చేందుకు స్వల్పకాలిక ఈజీ లోన్స్(తేలికగా రుణం) ఇచ్చేందుకు కొన్ని సూక్ష్మ రుణ సంస్థలు ముందుకొచ్చాయి. విద్యార్థులు ల్యాప్‌టాప్, పర్సనల్ కంప్యూటర్, బైక్, స్మార్ట్‌ఫోన్ తదితర వస్తువుల కొనుగోలుకు రూ.3 వేల నుంచి 80 వేల వరకు రుణం మంజూరు చేసే సంస్థలను ఆశ్రయిస్తున్న గ్రేటర్ విద్యార్థుల సంఖ్య సిటీలో వేలల్లోకి చేరుకుంది. ఇదే అదనుగా నకిలీ ఐడెంటిటీ కార్డులతో రుణం పొంది ఎగవేస్తున్న విద్యార్థులు సైతం ఉండడంతో ఆయా సంస్థలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ పరిణామం శ్రుతి మించితే రుణ చెల్లింపుల విషయంలో తల్లిదండ్రులకు తలనొప్పులు తప్పవంటున్నారు విద్యావేత్తలు. ఈజీ లోన్స్ ఇలా.. ► ప్రతి అంశాన్నీ ఒక్క క్లిక్‌తో తెలుసుకునే గ్రేటర్ స్టూడెంట్స్ తాజాగా స్వల్పకాలిక తేలికపాటి రుణాలు పొందేందుకు పలు ఆన్లైన్ క్రెడిట్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ►మహానగరం పరిధిలో సుమారు 300 ఇంజినీరింగ్, ఫార్మసీ, మెడికల్, మేనేజ్మెంట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు వీటిని ఆశ్రయిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ► ప్రధానంగా క్రెడిట్ 24, క్వికర్‌లోన్, ఎం పాకెట్ తదితర సంస్థలు ఈ విషయంలో ముందున్నాయి. ► ఇక ఆన్లైన్లో రుణం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థినీ విద్యార్థుల వద్దకే ఆయా సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు తరలివస్తున్నారు. తొలుత ర.3 వేల నుంచి ర.5 వేల వరకు స్వల్పకాలిక సూక్ష్మ రుణాలు అందజేస్తున్నారు. ► ఈ చిన్నపాటి రుణాలను సకాలంలో తీర్చినవారికి గరిష్టంగా రూ.80 వేల వరకు రుణాలు మంజూరు చేస్తున్నాయి. రుణగ్రహీత సౌలభ్యాన్ని బట్టి నెలవారీగా కొంత మొత్తాన్ని వాయిదాగా చెల్లించే అవకాశం కల్పిస్తున్నాయి. ► ఇక రుణం జారీ చేయాలంటే విద్యార్థుల కళాశాల ఐడెంటిటీ కార్డు, ఇంటి చిరునామ ధ్రువపత్రం, ఆధార్‌కార్డు జిరాక్స్ ప్రతులను పూచీకత్తుగా స్వీకరిస్తున్నాయి. ► ముందుజాగ్రత్తగా వారి నుంచి రుణం జారీ షరతులకు సంబంధించి రెండు పేజీల నిబంధనల పత్రాలపై సంతకాలు తీసుకుంటుండడం గమనార్హం. ఎగవేతదారులూ షరామామూలే.. విద్యార్థులు చిన్నపాటి అవసరాలు, సరదాలను తీర్చేందుకు ఈజీ లోన్స్ బాగానే ఉన్నా..ఇదే అదనుగా తమ మిత్రులు, తెలిసినవారి కళాశాలల ఐడెంటిటీ కార్డులు, జిరాక్స్ ప్రతులను సేకరిం ఆన్లైన్లో రుణం కోసం దరఖాస్తు చేసుకుంటున్న అక్రమార్కులూ ఉన్నట్లు ఆయా రుణజారీ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. తీరా రుణం మంజూరు చేశాక ఆరా తీస్తే సదరు విద్యార్థి ఆ కళాశాలలో చదవడం లేదన్న నిజాలు వెలుగుచూస్తుండడంతో ఆయా సంస్థలకు ముచ్చెమటలు పట్టిస్తుండడం గమనార్హం. ఇక కొన్ని రుణజారీ సంస్థలు రుణ వాయిదాల వసూళ్ల కోసం తల్లిదండ్రులకు నేరుగా ఫోన్లు చేస్తుండడం, వారి ఇళ్లకు వస్తుండడంతో తల్లిదండ్రులు సైతం ఆందోళనకు గురవుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. జాగ్రత్తలూ అవసరమే.. ► విద్యార్థుల అవసరాలకు ఈజీలోన్స్ ఒక పరిమితికి మించి అవసరమే కానీ..శృతి మించితే అనర్థాలు తప్పవని విద్యావేత్తలు, కళాశాలల Ķæజవన్యాలు స్పష్టం చేస్తున్నాయి. విద్యార్థుల జీవనశైలిలో వస్తున్న మార్పులను తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలని సచిస్తున్నారు. అప్పులు చేసి గొప్పలకు పోతే విద్యార్థుల జీవితాలు ప్రవదంలో పడినట్టేనని హెచ్చరిస్తున్నారు. ఇక రుణం తీసుకునే సమయంలో గుడ్డిగా సంతకాలు చేయకుండా జాగ్రత్తగా షరతులతో కూడిన నిబంధనలను అమూలాగ్రం చదివి సంతకం చేయాలని సచిస్తున్నారు. పరీక్ష, ట్యూషన్, కోచింగ్‌లు, పుస్తకాల కొనుగోలు, నూతన కోర్సులు నేర్చుకునేందుకు రుణం పొందితే ఫర్వా లేదని.. విలాసవంతమైన జీవనశైలి గడిపేందుకు రుణం తీసుకుంటే చిక్కులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
అకౌంట్స్ డీ–ఫ్రీజ్ కేసు: ఎట్టకేలకు అనిల్ చిక్కాడు!
సాక్షి, హైదరాబాద్: అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ వ్యవహారాలకు పాల్పడిన లోన్ యాప్స్ కేసుల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాలను అడ్డదారిలో డీ–ఫ్రీజ్ చేయించి, రూ.1.18 కోట్లు దారి మళ్లించిన కేసులో సూత్రధారి అనిల్ ఎట్టకేలకు చిక్కాడు. 15 రోజుల పాటు గాలించిన ప్రత్యేక బృందం ఎట్టకేలకు కోల్‌కతాలో పట్టుకుంది. అక్కడి కోర్టులో హాజరుపరిచిన అధికారులు ట్రాన్సిట్ వారెంట్‌పై సోమవారం సిటీకి తీసుకొచ్చారని సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి వెల్లడించారు. సైబర్ క్రైమ్ ఎస్ఐగా అవతారమెత్తి... గతేడాది నమోదు చేసిన లోన్ యాప్స్ కేసుల్లో సైబ ర్ క్రైమ్ పోలీసులు దాదాపు 1100 బ్యాంకు ఖా తాలను ఫ్రీజ్ చేశారు. వీటిలో నాలుగు కంపెనీలకు చెందిన ఆరింటిని డీ–ఫ్రీజ్ చేయించడానికి కోల్‌కతాకు చెందిన ఉత్తమ్ చౌదరి కొందరితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ బాధ్యతను 5 శాతం కమీషన్ ఇస్తానని ఎరవేసి నల్లమోతు అనిల్‌కుమార్‌కు అప్పగించాడు. గుంటూరుకు చెందిన అనిల్ బీటెక్ పూర్తి చేసి ముంబైలో ఉంటున్నాడు. ఆరేళ్ల క్రితం ఓ సైబర్ నేరంలో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు. బ్యాంకు ఖాతాలను డీ–ఫ్రీజ్ చేయించడానికి రంగంలోకి దిగిన ఇతను కోల్‌కతాకు చెందిన సైబర్ క్రైమ్ ఎస్సైగా అవతారమొత్తాడు. గత నెలలో విషయంలో వెలుగులోకి... గత నెలలో గచ్చిబౌలి ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు రీజినల్ మేనేజర్ ఈ విషయం గుర్తించి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన అధికారులు ఈ నెల 2న ఆనంద్‌ను అరెస్టు చేశారు. ఇతడి విచారణలో అనిల్ వ్యవహారం వెలుగులోకి రావడంతో అతడి కోసం ముంబై, పశ్చిమబెంగాల్‌ల్లో గాలించారు. ఎట్టకేలకు కోల్‌కతాలో పట్టుకుని అతని వద్ద నుంచి రూ.2 లక్షలతో పాటు 8 డెబిట్ కార్డులు, మూడు చెక్ బుక్స్, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకొన్నారు. తనకు అందిన డబ్బును ఉత్తమ్ ఏం చేశాడనే దానిపై పోలీసుల ఆరా తీస్తున్నారు. అతడు చిక్కితేనే ఈ అంశంలో స్పష్టత వస్తుందని చెప్తున్నారు. నకిలీ పత్రాలతో... కోల్‌కతాలోని ఐసీఐసీఐ బ్యాంకులో ఫ్రీజ్ అయిన ఖాతాలను డీఫ్రీజ్ చేయాలంటూ నకిలీ పత్రాలతో ఆ బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించాడు. దీంతో పాటు ఢిల్లీ, గుర్గావ్ల్లో ఉన్న మరో ఐదు ఖాతాలను డీ–ఫ్రీజ్ చేయించాడు. అలా మొత్తం రూ.1.18 కోట్లు బేగంపేటకు చెందిన ఆనంద్ జన్ను అనే వ్యక్తి ఖాతాలోకి మళ్లించి, ఆపై తన ఖాతాల్లోకి మార్చుకున్నాడు. ఈ డబ్బును డ్రా చేయడంతో పాటు తన కమీషన్ మినహాయించుకుని మిగిలింది ఉత్తమ్ చౌదరికి అందించాడు. చదవండి: ప్లాన్ ఐఎస్ఐది... ఫైనాన్స్ చైనాది! -
ఫోన్లో అసభ్య పదజాలంతో దూషిస్తూ..
సాక్షి, విజయవాడ : అవసరం కోసం అప్పుచేసి మైక్రో ఫైనాన్స్ ఉచ్చులో చిక్కుకొన్న బాధితులు ఒకరొకరుగా బయటకొస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు పిర్యాదు చేస్తున్నారు. యాభై వేలు లోన్ తీసుకొని 2 లక్షల 80 వేలు కట్టినా వేధింపులు ఆపలేదంటూ నాగరాజు అనే బాధితుడు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆన్లైన్ లోన్ యాప్‌ల ఉచ్చులో చిక్కుకొన్న తనను కాపాడి రుణ విముక్తి కలిగించాలని వేడుకున్నాడు. అనంతరం నాగరాజు సాక్షి టీవీతో మాట్లాడాడు. ఫేస్బుక్లో ప్రకటన చూసి తొలుత నాలుగు యాప్‌లలో 20వేల రూపాయల లోన్ తీసుకున్నానని తెలిపాడు. కమిషన్ తీసుకొని తన అకౌంట్లో పదకొండు వేలు వేసినట్లు తెలిపాడు. చదవండి: వారిని ఉపేక్షించేది లేదు: సీఎం జగన్ ‘వారం లోపే లోన్ తిరిగి చెల్లించాలి. రొటేషన్ కోసం చాలా యాప్‌లలో లోన్ తీసుకొని డ్యూలు కట్టాను. 50 వేలకి 2 లక్షల ఎనభై వేలు చెల్లించినా అప్పు తీరలేదని వేధిస్తున్నారు. ఫోన్లో అసభ్య పదజాలంతో దూషిస్తూ క్షోభ పెడుతున్నారు. ఫోన్ కాంటాక్ట్ నంబర్లకు మెసెజ్‌లు పెట్టి పరువు తీస్తామని బెదిరిస్తున్నారు. నలభై శాతం వడ్డీ వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. అవసరానికి అప్పుచేసి వాళ్ళ ఉచ్చులో ఇరుక్కున్నాను. ప్రభుత్వ భరోసాతో పోలీసులను ఆశ్రయించి పిర్యాదు చేశాను. నాలాగు చాలామంది మైక్రో ఫైనాన్స్ తీసుకొని మానసిక క్షోభ అనుభవిస్తున్నారు’. అని నాగారాజు ఆవేదన వ్యక్తం చేశారు. -
వారిని ఉపేక్షించేది లేదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆన్లైన్ కాల్ మనీ వ్యవహారాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఆన్లైన్ కాల్ మనీ వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కాల్ మనీ వ్యవహారాలను ఉపేక్షించేది లేదని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. (చదవండి: ‘పల్లెల్లోకి వైద్యులు.. సరికొత్త వ్యవస్థ’) ఏపీవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు:డీజీపీ మొబైల్ లోన్ యాప్‌లపై ఏపీ వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు చేపడుతున్నట్లు డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. మైక్రో ఫైనాన్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. మొబైల్ లోన్ యాప్‌లు మహిళల్నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయని వెల్లడించారు. మొబైల్ లోన్ యాప్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు.(చదవండి: లోన్‌యాప్స్ కేసులో ఆసక్తికర విషయాలు) -
పుష్కర కాలం క్రితం మైక్రో ఫైనాన్స్ ఉచ్చులో మహిళలు
తాజాగా కోరలు చాచిన కాల్‌మనీ రుణమాఫీ చేయకపోవడం.. రుణాలు ఇవ్వకపోవడమే కారణం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించింది రైతులు, డ్వాక్రా మహిళలే జిల్లాలో 14 వేల డ్వాక్రా గ్రూపుల్ని డిఫాల్టర్లుగా మార్చిన సర్కారు ‘రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తా. ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా అండగా నిలబడతా. డ్వాక్రా మహిళలూ.. మీరు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు కట్టకండి. అధికారంలోకి రాగానే మొత్తం రుణాలు మాఫీ చేస్తా’ ఎన్నికల ముందు జిల్లాలో పర్యటించిన చంద్రబాబునాయుడు రైతులకు, మహిళలకు ఇచ్చిన వాగ్దానాలివి. 1995-2004 సంవత్సరాల మధ్య ఇదే చంద్రబాబు అధికారంలో ఉండగా, మైక్రోఫైనాన్స్ సంస్థల ఉచ్చులోపడి డ్వాక్రా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అవమానాల పాలయ్యారు. కొందరైతే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అప్పటి దారుణాలను మరువని డ్వాక్రా మహిళలు 2014 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీలను తొలుత నమ్మలేదు. అయితే.. ‘నేను గతం నాటి చంద్రబాబును కాను. పూర్తిగా మారాను. నన్ను నమ్మండి. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ప్రతి హామీ నెరవేరుస్తా’నని నమ్మబలికారు. నిజమనుకున్న ప్రజలు ఆయనను నమ్మి ఓటేశారు. ఫలితంగా తెలుగుదేశం పార్టీ నుంచి పుట్టుకొచ్చిన కాల్‌మనీ, సెక్స్ రాకెట్, నకిలీ మద్యం వంటి ముఠాలు పడగ విప్పాయి. జనాన్ని కాటేస్తున్నాయి. ఏలూరు (మెట్రో) : ప్రైవేటు అప్పులు చేసి వడ్డీలు కట్టినా బ్యాంకుల్లో తీసుకున్న అసలు అప్పు తీరక జిల్లాలోని డ్వాక్రా మహిళలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకులు కొత్త రుణాలివ్వలేదు. దీంతో అన్నదాతలు బంగారు నగలు కుదువబెట్టి పంట కోసం అప్పులు తీసుకున్నారు. పెట్టుబడులకు ఆ సొమ్ములు సరిపోలేదు. దిక్కులేని పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించారు. వడ్డీలు కడుతున్నా అసలు తీరడం లేదు. ఏంచేయాలో తెలీని స్థితిలో కొందరు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా 62 వేల డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. వీటిలో 58 వేల గ్రూపులకు గత ప్రభుత్వ హయాంలో రూ.1,100 కోట్లను వివిధ బ్యాం కులు రుణాలుగా ఇచ్చాయి. ఈ రుణాలు మొత్తం మాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించడంతో డ్వాక్రా మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. పాలనాపగ్గాలు చేపట్టిన తరువాత చంద్రబాబు మాట మార్చారు. డ్వాక్రా మహిళలను ఏమార్చి రుణాలు మాఫీ చేయడం లేదంటూ ప్రకటించి షాక్ ఇచ్చారు. మూలనిధిగా గ్రూపునకు రూ.లక్ష చొప్పున రుణం ఇస్తానని ప్రకటించారు. ఆ విధంగా చూసినా రూ.580 కోట్ల రుణాలు మాఫీ అవుతాయని ఆశించినప్పటికీ, ఒక్కొక్క సభ్యురాలికి రూ.3వేల చొప్పు న కేవలం రూ.155 కోట్లను మాఫీ చేస్తున్నట్టు ప్రకటిం చారు. ఆ సొమ్ము కూడా పాత బకాయిలకు జమ చేయకుండా, కేవలం మూలనిధిగా ఉంటుందని ప్రకటించారు. దీంతో డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదు. కొత్త రుణాల మాట దేవుడెరుగు.. పాత రుణాలను తక్షణమే చెల్లించాలంటూ బ్యాంకులు తాఖీదులు జారీ చేశాయి. ఫలితంగా గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బుసలుకొట్టిన మైక్రోఫైనాన్స్ సంస్థల కంటే దారుణంగా కాల్‌మనీ, సెక్స్ రాకెట్ ముఠాలు పడగ విప్పాయి. ప్రజలను కాటేస్తున్నాయి. డిఫాల్టర్లుగా 14 వేల గ్రూపులు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వకుండా.. పాత బకాయిలను తక్షణమే చెల్లించాలని ఒత్తిడి చేయడంతో డ్వాక్రా మహిళలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రుణమాఫీ హామీపై ఆశ పెట్టుకున్న మహిళలు ఏడాదిపాటు బ్యాంకులకు వాయిదాలు చెల్లించలేదు. దీంతో ఆ రుణాలపై వడ్డీలు పెరిగిపోయాయి. బ్యాంకుల నుంచి తాఖీ దులు రావడంతో జిల్లాలో 44వేల గ్రూపులకు చెందిన మహిళలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. అందిన కాడికి అప్పులు తెచ్చి బ్యాంకు బకాయిలు చెల్లించి ఉపశమనం పొందినా.. ప్రస్తుతం వడ్డీ వ్యాపారులకు సొమ్ము చెల్లించలేక సతమతం అవుతున్నారు. బయటినుంచి అప్పులు తెచ్చి బకాయిలు కట్టలేని 14 వేల గ్రూపులను డిఫాల్టర్లుగా బ్యాంకులు గుర్తించాయి. వీరికి భవిష్యత్‌లోనూ రుణాలు ఇచ్చేది లేదని ఆయా గ్రూపులకు బ్యాంకుల అధికారులు నోటీసులు జారీచేశారు. రైతన్నలదీ అదే పరిస్థితి జిల్లాలో 8.50 లక్షల రైతులు వివిధ బ్యాంకుల నుంచి రూ.7,245 కోట్లను పంట రుణాలుగా తీసుకున్నారు. వాటిని మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించడంతో వారంతా బ్యాంకులకు బకాయిలు చెల్లించలేదు. రుణమాఫీ ప్రకటన పుణ్యమా అని చెల్లింపులు జాప్యం కావ డంతో వడ్డీలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. మొదటి విడతగా రూ.369 కోట్లు, రెండో విడతగా రూ.119 కోట్లు, మూడో విడతగా రూ.123 కోట్ల రుణాలను మాఫీ చేసినట్టు చంద్రబాబు ప్రకటించారు. వాస్తవానికి చంద్రబాబు విధించిన అన్ని నిబంధనలు దాటుకుని వెళ్లిన రైతులకు రూ.1,100 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. కేవలం ఇప్పటివరకూ రూ.611 కోట్లను మాత్రమే నిధులు విడుదల చేసిన ప్రభుత్వం చేతులు దులుపుకుంది. వడ్డీలు పెరిగిపోయి.. రుణమాఫీ కోసం రైతులంతా ఎదురు చూడటంతో బ్యాం కుల్లో బకాయిలు గడువు మీరాయి. గతంలో రూ.లక్ష లోపు రుణం తీసుకున్న రైతులు ఆ మొత్తాన్ని ఏడాదిలోపు తిరిగి చెల్లిస్తే వడ్డీ ఉండేది కాదు. రుణమాఫీ ప్రకటన వల్ల బకాయిలు చెల్లించలేకపోవడంతో వడ్డీలపై వడ్డీలు పడి రైతులపై మోయలేని భారమయ్యాయి. బ్యాంకులకు వడ్డీ చెల్లించేందుకు రైతులు సైతం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి అందిన కాడికి, తోచిన వడ్డీలకు అప్పులు తీసుకొచ్చారు. ప్రస్తుతం అటు బ్యాంకు రుణాలు తీరక, వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకున్న అప్పులు తీర్చలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా చంద్రబాబు దయవల్లే తాము అటు బ్యాంకుకు, ఇటు వడ్డీ వ్యాపారులకు బకాయిలు పడ్డామని రైతులు, డ్వాక్రా మహిళలు వాపోతున్నారు. మాఫీ చేస్తారని బ్యాంకు బాకీ కట్టలేదు చంద్రబాబునాయుడు డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పడంతో బ్యాంకుకు బాకీ కట్టలేదు. దీంతో వడ్డీ భారీగా పెరిగింది. ఆ తరువాత సంఘానికి రూ.10 వేలు ఇస్తామన్నారు. తొలి విడతగా వేసిన రూ.3 వేలు బాకీలోకి కాకుండా మూలధనంలో వేశారు. దీనివల్ల మేం అప్పుల పాలయ్యాం. - కె.ధనలక్ష్మి, డ్వాక్రా మహిళ, ధర్మాజీగూడెం రుణమాఫీ హామీతో నిండా మునిగాం రుణమాఫీ హామీ వల్ల నిండా మునిగిపోయాం. చంద్రబాబునాయుడు చెప్పిన ప్రకారం రుణమాఫీ చేయకపోవటంతో బ్యాంక్‌లో వడ్డీలకు వడ్డీలు పెరిగిపోయాయి. వీటిని కట్టకపోవటంతో బ్యాంక్ వారు తిరిగి రుణాలు ఇవ్వ డం లేదు. ప్రైవేటు వ్యాపారస్తుల నుంచి అప్పు లు తెచ్చి పంటలకు పెట్టుబడులు పెట్టాం. అటు బ్యాంకు అప్పు, ఇటు ప్రైవేటు అప్పు తీర్చలేని దుస్థితి ఏర్పడింది. - బి.సుధాకర్, రైతు, కలరాయనగూడెం విజయవాడ కేసును వదిలేసి.. సామాన్యులకు ఇబ్బందులు వచ్చినప్పుడు న్యాయమైన వడ్డీకి అప్పు ఇచ్చేవారు ఎక్కడ.. కాల్‌మనీ కేసు ఎక్కడ.. అసలు నిందితులను అరెస్ట్ చేయకుండా చిన్నపాటి వడ్డీ వ్యాపారులపై దాడులు సరికాదు. విజయవాడ కాల్‌మనీ కేసులో నిందితుల్ని శిక్షించి.. తప్పు చేసినవారు ఎవరైనా శిక్ష తప్పదనేలా ప్రభుత్వ విధానం ఉండాలి. సామాన్యుల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు. - వర్రే పైడియ్య, రైతు, పాములపర్రు తిమింగలాల్ని వదిలేసి.. విజయవాడ కాల్‌మనీ, సెక్స్ రాకెట్ ఆగడాలను అరికట్టాలి. అంతేకానీ మాలాంటి వారికి అప్పులు ఇచ్చే చిన్నాచితకా వడ్డీ వ్యాపారులను వేధించడం తగదు. ప్రభుత్వ తీరువల్ల అప్పులిచ్చే వారు భయపడుతున్నారు. మాకు బ్యాంకులు అప్పులు ఇవ్వవు. చిన్నపాటి వడ్డీ వ్యాపారులే మాకు దిక్కు. - చినిమిల్లి వెంకటేశ్వరరావు, కూల్ డ్రింక్ షాపు, నరసాపురం -
సాగు దూరమై.. బతుకు భారమై...
మెదక్ జిల్లాలో సగటున మూడు రోజులకో రైతు ఆత్మహత్య అదును మీద అప్పులిచ్చిన షావుకార్లంతా పట్టణాలకు వలస సరిగా రుణాలు ఇవ్వని బ్యాంకులు... చీటీలు, ఫైనాన్స్‌లలో అప్పులు చేస్తున్న అన్నదాతలు ఆ వాయిదాలు కట్టడం కోసం మైక్రో ఫైనాన్స్‌లో రుణాలు వీటి వాయిదాల కోసం పశువులను అమ్ముకుంటున్న దుస్థితి కనీసం కూలీకూడా దొరకని పరిస్థితి అప్పుల ఆవేదనతో బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతులు సంగారెడ్డి: సాగుకు తెచ్చిన అప్పులు.. బ్యాంకులు రుణాలివ్వక తెచ్చిన ఫైనాన్స్ బాకీలు.. వాటి వాయిదాలు కట్టడానికి మైక్రోఫైనాన్స్ రుణాలు.. ఎదిగిన ఆడపిల్లల పెళ్లిళ్ల ఖర్చులు.. అన్నింటికీ తోడుగా మద్యం మహమ్మారి... ఇలా అన్నీ ఒకదానికొకటి పురివేసుకొని అన్నదాత గొంతుకు ఉరి వేస్తున్నాయి. ఇంతకాలం అదును మీద అప్పిచ్చిన ఊరి షావుకార్లు పల్లెలను వదిలేసి పట్టణాలకు వెళ్లి రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడులు పెడుతున్నారు. బ్యాంకులు సరిగా రుణాలివ్వక రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసం చిట్టీలు ఎత్తి డబ్బు తీసుకుంటున్నారు. వీటి వాయిదాలు కట్టడం కోసం పట్టణ ఫైనాన్సియర్ల వద్ద పొలం తాకట్టు పెడుతున్నారు. ఈ ఫైనాన్స్ వడ్డీలు కట్టడం కోసం సూక్ష్మ రుణా (మైక్రో ఫైనాన్స్)లను తీసుకొంటున్నారు. ఇలా ఒకదానిపై ఒకటి... అప్పుపై అప్పు పేరుకుపోతోంది. అటు పంటలు పోయి, ఇటు అప్పులు పెరిగిపోయి రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మెదక్ జిల్లాలో సగటున మూడు రోజులకో రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. మెతుకు సీమ వ్యవసాయ కుటుంబాల్లో సగటున ప్రతి 100 మంది మహిళల్లో ఇద్దరు వితంతువులుగా మారుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ జిల్లాలో ఇప్పటివరకు 145 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ‘సాక్షి’ పరిశీలనలో తేలిన నగ్న సత్యమిది. అప్పులిచ్చేదెవరు? మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం ఎల్కల్ గ్రామంలోని పెద్దపెద్ద షావుకార్లు ఇక్కడ స్థానికంగా గిట్టుబాటు కావడం లేదని పట్నం బాట పట్టారు. వారిలో ఒకాయన రైతులకు అప్పులు ఇచ్చి... పంట చేతికి రాగానే తిరిగి వసూలు చేసుకోవడం చేసే వ్యక్తి. రైతులపై కనీసం రూ.20 లక్షలు పెట్టుబడి పెట్టగల సత్తా ఉన్నవ్యక్తి. అలాంటి షావుకార్లు ఎల్కల్ గ్రామంలో ఐదుగురు ఉండేవారు. పక్క గ్రామాల రైతులు కూడా వీరి వద్దకు వచ్చేవారు. అయితే ఐదేళ్ల నుంచి కాలం కలసిరాక రైతుల పంటలు ఇంటికి చేరడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నలుగురిలో నిలుచోబెట్టి దబాయించి మరీ అప్పులు కట్టాలని షావుకార్లు నిలదీస్తుండడంతో... ఆ అవమానం భరించలేక రైతులు ఆత్మహత్యలే దిక్కనుకుంటున్నారు. ఈ ఐదేళ్లలో ఎల్కల్ చుట్టు పక్కల పల్లెల్లో కలిపి దాదాపు 70 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ గొడవలన్నీ ఎందుకనో, రైతుల మీద పెట్టుబడి పెట్టి నష్టపోవడం ఎందుకనో... ఈ షావుకార్లంతా గజ్వేల్‌కు వెళ్లిపోయారు. అక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. అటు ప్రభుత్వమూ ఆదుకోక, బ్యాంకుల నుంచి అప్పులూ సకాలంలో రాక, ఇటు ఊర్లో షావుకార్లూ లేక... రైతులు దిక్కుతోచక పస్తులుంటున్నారు. మైక్రో ఫైనాన్స్ వల రైతులు చీటీ వాయిదా డబ్బులు కూడా చెల్లించే మార్గాలు లేవు. కూలీ పనులు కూడా దొరకని పరిస్థితి. ఇదే అదునుగా పల్లెల్లో మళ్లీ మైక్రో ఫైనాన్స్ (సూక్ష్మ రుణ) సంస్థలు వల విసురుతున్నాయి. మహిళా సంఘాల గ్రూపులను చేరదీసి... సభ్యులను ఒకరికి మరొకరుగా జమానతు పెట్టుకొని రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు రుణాలు అందిస్తున్నాయి. అయితే రైతులు అంతకుముందు చేసిన అప్పులకు వడ్డీ కట్టడం కోసం ఈ మైక్రోఫైనాన్స్‌ల వద్ద అప్పులు చేస్తున్నారు. తాము చేసిన అప్పుకు వడ్డీ కట్టడం కోసం ఎల్కల్ గ్రామం వెంకటేశ్వర మహిళా సంఘం సభ్యురాలు దొనపల్లి ముత్యాలు రెండు నెలల కింద మైక్రో ఫైనాన్స్ సంస్థను రూ.10 వేలు అప్పు ఇవ్వాల్సిందిగా కోరింది. కానీ సంస్థ వాళ్లు రూ.8,000 మాత్రమే చేతికిచ్చి వారానికి రూ.800 చొప్పున 12 వారాల్లో బాకీ తీర్చాలనే నిబంధన పెట్టారు. కూలీ పనులు కూడా దొరకని ఈ రోజుల్లో వారానికి రూ.800 వాయిదా కట్టడం ఎలా సాధ్యమో తెలియదు. ‘స్వశక్తి’ సాయం లేదు మహిళా స్వశక్తి సంఘాలకు ప్రభుత్వం అందించే రుణాలు ఈ ఏడాది సరిగా అందలేదు. నిర్దేశించుకున్న ప్రాజెక్టుకు కాకుండా మహిళలు ఇతర అవసరాలకు రుణ నిధులను వాడుకుంటున్నారని ప్రభుత్వం భావించింది. ఇలాగైతే మహిళా సాధికారత సాధ్యం కాదనే ఆలోచనతో సమగ్ర సర్వే చేసేంత వరకు స్వశక్తి సంఘాలకు నిధులు నిలిపివేయాలని నిర్ణయించింది. సాధారణంగా స్వశక్తి సంఘాల రుణాల సొమ్మును ఎక్కువ మంది మహిళలు వ్యవసాయంపైనే పెట్టుబడిగా పెట్టారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతుకు డబ్బు సాయం అందే ఈ దారి కూడా మూసుకుపోయింది. దీంతో ఆర్థిక వెసులుబాటు కోసం 20 నుంచి 30 మంది రైతులు కలసి చీటీలు వేసుకుంటున్నారు. దౌల్తాబాద్ మండలంలోని ఒక గ్రామంలో రూ.2లక్షల చీటీని ఒక రైతు కేవలం రూ.65 వేలకు పాడుకున్నారు. అదే గ్రామంలో రూ.లక్ష చీటీని మరో రైతు రూ.25 వేలకే తీసుకున్నాడు. ప్రతి రైతుది ఇలాంటి దీన పరిస్థితే. ఇంతా చేసి తెచ్చిన డబ్బును వ్యవసాయంలో పెట్టుబడిగా పెట్టిన రైతును కాలం వెక్కిరించింది. పత్తి, మొక్కజొన్న పంటలు వాడిపోయాయి. ఇప్పటికిప్పుడు వర్షాలు కురిసినా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. పంట చేతికందినా.. సంగుపల్లెకు చెందిన చినపులి బీరప్ప నాలుగెకరాల్లో బూడిద గుమ్మడి పాదులు పెట్టారు. కుటుంబ సభ్యులంతా కలసి ప్రతికూల పరిస్థితుల్లోనూ పోటీపడి పాదులను పోతం చేసుకున్నారు. పంట కోతకొచ్చే సమయానికి మార్కెట్లో గుమ్మడికాయ ధర పడిపోయింది. ఏం చేయాలో తోచక బీరప్ప గుమ్మడికాయలను కోసి పొలంలోనే రాశులుగా పోశాడు. 20 రోజులుగా అవి ఎండకు ఎండి వానకు తడిసి కుళ్లిపోతున్నాయి. పశువులు, పక్షులు తినిపోతున్నాయి. రైతులు పంటను దాచుకునే అవకాశం లేదు. దీంతో వచ్చిందే చాలు అనుకొని దిగుబడి చేతికి అందగానే దళారులకు అమ్ముకుంటున్నారు. ధాన్యం అమ్మకానికి అనుకూల పరిస్థితులు లేనప్పుడు మద్ధతు ధర వచ్చేంత వరకు పంట దాచుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వసతులు కల్పించాలి. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచనలు చేయడం లేదు. రైతులకు చెయ్యిచ్చి.. బ్యాంకులు రైతులకు చెయ్యిచ్చి మైక్రోఫైనాన్స్ సంస్థలకు మాత్రం చేయూతనిస్తున్నాయి. పట్టాదారు పుస్తకాలు, పాసుబుక్కులు పట్టుకొని రైతులు రోజుల తరబడి తిరిగినా అప్పులివ్వని బ్యాంకర్లు... మైక్రో ఫైనాన్స్ సంస్థలకు మాత్రం ఉదారంగా రుణాలిచ్చేస్తున్నారు. ఈ డబ్బుకు బ్యాంకర్లు రూపాయి వడ్డీ తీసుకుంటున్నారు. రైతులు తీసుకుంటున్న పంట రుణాల్లో బ్యాంకర్లు ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బును మినహాయించుకుంటున్నారు. ఈ మొత్తాన్ని ఇన్సూరెన్స్ విభాగంలో జమ చేయకుండా దారి మళ్లించి మైక్రోఫైనాన్స్ సంస్థల చేతిలో పెడుతున్నారు. 2014లో మెదక్ జిల్లాలో రూ.1,400 కోట్లు పంట రుణాలు తీసుకున్నారు. ఇందులో ప్రతి రూపాయికి ఇన్సూరెన్స్ ప్రీమియం మినహాయించుకున్నారు. కానీ రూ.400 కోట్ల రుణాలకు చెందిన ప్రీమియాన్నే బ్యాంకర్లు ఇన్సూరెన్స్ విభాగంలో జమ చేశారు. రూ.1,000 కోట్ల రుణాల ప్రీమియం డబ్బు ఎటుపోయిందో రికార్డులు లేవు. ఈ సొమ్మునే మైక్రోఫైనాన్స్ సంస్థలకు ఇస్తున్నట్లు సమాచారం. మైక్రోఫైనాన్స్ సంస్థలు ఇలా తీసుకున్న సొమ్మును మహిళా సంఘాలకు రూ.10 వడ్డీకి ఇస్తున్నాయి. దానికితోడు రుణం తీసుకున్న మహిళ పేరిట బీమా అంటూ... ఇచ్చిన అప్పులో కొంత ప్రీమియంగా మినహాయించుకుంటున్నాయి. ఊళ్లు వదిలి పోతుండ్రు ‘‘నేను చిన్నప్పటి నుంచి ఎవుసాయం జేత్తన్న. అదును మీద సర్కారు సాయం ఎన్నడూ అందలే. ఎప్పుడైనా పంటకు పెట్టుబడి అంటే కిష్టపురం, శేవర్తి షావుకార్లే అప్పులిచ్చేటోళ్లు. మళ్ల పంటల మీద తీసుకునేటోళ్లు. ఇప్పుడు రైతుకు అప్పు పుట్టడం మా కట్టంగా ఉంది..’’ - ఎంబరి మల్లయ్య(75), రైతు, నర్సన్నపేట వారాల చిట్టి తీసుకున్న ‘‘పిలగాడు సైకిల్ మోటర్ మీద నుంచి పడ్డడు. భూమి తాకట్టు పెట్టి ఫైనాన్స్‌ల రూ.30 వేలు తెచ్చిన, కూలికి పోదామన్నా పని దొరుకుత లేదు. ఫైనాన్సోళ్లు మిత్తిగట్టమని బలవంతం జేస్తే వారాల చిట్టిలొళ్ల దగ్గర 10 వేలు తీసుకుంటే ఇన్ని పైసలు వడ్డీ కట్టిన, ఇన్ని పైసలు మేం తింటిమి. వారానికి రూ.800 కట్టాలంటే నా పాణం పోతంది..’’ - దొనపల్లి ముత్యాలు, ఎల్కల్ ఒక్కింట్లెనే 5 మంది పోయిరి ‘‘మా ఒక్క ఇంట్లెనే ఐదు మంది పురుగుల మందు తాగి సచ్చిపోయిండ్రు. అర ఎకరం భూమిలో బోరేస్తే పడలే. అప్పులైనయి అని నా మొగడు సామి రెండు నెలల కింద మందు తాగి పాణం దీసుకుండు. అంతకు ముందు ఐదేండ్ల కింద మా మామ నర్సయ్య, మా సినమామలు మల్లయ్య, కిష్టయ్య, చంద్రయ్య, మా మరిది సామి అప్పుల బాధ పడలేక పురుగుల మందు తాగి సచ్చిపోయిండ్రు. మా చిన్న పిలగాని కోసం నేను బతుకుతున్న. బతికిన దాంట్లే ఏం ఫయిదా లేదయ్యా..’’ - సింగరాతి లక్ష్మి, ఎల్కల్ ప్రాణమొక్కటే మిగిలింది.. ‘‘రూ.2లక్షల చీటీ ఎత్తితే రూ.65 వేలు వచ్చినయి. తీసుకున్న పైసలన్నీ పత్తి చేనుకే పెట్టిన. వానలు లేక పత్తి గూడేసింది. పువ్వు రాలిపోతంది. చీటీ వాయిదా రానే వచ్చింది. నలుగుట్లె పడితె ఇజ్జతుండదని మా ఇంటామే వారాల చీటీల దగ్గర రూ.20 వేలు తెచ్చి కడితిమి. వారం వాయిదా కడతానికి గొర్రెపిల్ల ఉంటే అమ్మితిని. ఇంకేం మిగిలింది సారు. నా పాణమే ఉంది..’’ - పులి రాజయ్య, రైతు, సంగుపల్లె -
మళ్లీ ‘మైక్రో’ కోరలు
కొత్తగూడెం: మైక్రోఫైనాన్స్ సంస్థలు మళ్లీ కోరలు చాస్తున్నాయి. రెండేళ్లుగా స్తబ్దుగా ఉన్న సంస్థలు పల్లెలను పట్టిపీడించేందుకు సిద్ధమవుతున్నాయి. మైక్రోఫైనాన్స్ ముసుగులో అధిక వడ్డీలు, అనేక రకాల స్కీములతో పల్లె ప్రజలను వంచించిన ఇవి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేందుకు అడుగులు వేస్తున్నాయి. ‘మైక్రో’ ప్రతినిధులు గతంలో ఆ సంస్థల వద్ద రుణాలు తీసుకున్న వారి ఇళ్లకు వెళ్లి మళ్లీ అప్పు ఇస్తామంటూ మభ్యపెడుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా చాలామంది రుణాలు తీసుకునేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నా ఆ సంస్థల ప్రతినిధులు అలుపెరగకుండా ఇళ్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గత రుణాలు రద్దు చేశాం...కొత్త రుణాలు తీసుకోడంటూ మభ్యపెడుతున్నారు. ఐదేళ్ల క్రితం... ఐదేళ్ల క్రితం సుమారు పది వరకు మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఉండేవి. ఇవి గ్రామీణ మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తామని..రుణాలు ఇస్తామని గ్రామాల్లో సంచరిస్తుండేవి. మహిళలను గ్రూప్‌లుగా తయారు చేసి రుణాల పేరుతో అక్రమంగా రూ.కోట్లు వసూలు చేసేవి. తొలుత ఒక్కొక్కరికి రూ.5,000 రుణం ఇచ్చేవి. డాక్యుమెంటేషన్ చార్జీ పేరుతో దీనిలో రూ.500 కోత విధించేవి. ప్రతివారం పొదుపు పేరుతో సభ్యుల నుంచి అదనంగా కొంతమొత్తం వసూలు చేసేవి. గ్రూప్ సభ్యురాళ్లలో ఎవరైనా ఓ వారం వాయిదా చెల్లించకపోతే మిగిలిన వారిని కూడా అక్కడే కూర్చోబెట్టి ఫైనాన్స్ సంస్థల ప్రతి నిధులు వేధింపులకు పాల్పడేవారు. ఇలా పొదుపులు, ఇన్సూరెన్స్ పేరుతో కోట్లు దండుకున్నారు. ఈ దోపిడీని భరించలేక మహిళలు మైక్రోఫైనాన్స్ సంస్థల ప్రతినిధులపై తిరగబడ్డారు. మైక్రో సంస్థల ఆగడాలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడంతో అవి తోక ముడిచాయి. పాత బకాయిల వసూళ్ల కోసమేనా..? గతంలో మైక్రోఫైనాన్స్ నిర్వహించిన పలు సంస్థల ప్రతినిధులపై పోలీసుల దాడులు చేశారు. ఆయా సంస్థలను మూసివేయించారు. ఆ క్రమంలో లక్షలాది రూపాయలు ఫైనాన్స్ రూపంలో తీసుకున్న ప్రజలవద్ద ఉండిపోయాయి. ఆ పాత బకాయిలను మాఫీ చేసేశాం...కొత్త రుణాలు తీసుకోడంటూ ఆ సంస్థల ప్రతినిధులు కొత్త పల్లవి ఎత్తుకున్నారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఏదో ఒక రకంగా పాత రుణాలను వసూలు చేయాలనే లక్ష్యంతో ఓ పథకం ప్రకారం పల్లెల్లో సంచరిస్తున్నట్లు సమాచారం. కొత్త రుణాలు తీసుకునేందుకు ప్రజలు అయిష్టత వ్యక్తం చేస్తున్నా సంస్థ ప్రతినిధులు మాత్రం వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కావడం, పెట్టుబడులకు డబ్బు అవసరం ఉండటంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ ఫైనాన్స్ సంస్థలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు సమాచారం. ఈ మైక్రో ఏజెంట్ల ఉచ్చులో పడి కొందరు గ్రామీణులు ఇప్పటికీ మోసపోతున్నట్లు తెలుస్తోంది. -
అప్పుల ఉచ్చులో అన్నదాత
ప్రైవేటు వడ్డీ వ్యాపారుల ఉచ్చులో అన్నదాత విలవిలలాడుతున్నాడు. సాగు మదుపు కోసం అడిగినంత వడ్డీకి అప్పు తీసుకుంటున్నాడు. దీనంతటికి కారణం ప్రభుత్వ నిర్వాకమే! ఎన్నికల హామీ మేరకు రుణమాఫీ చేయకపోవడం, రీషెడ్యూల్ లేని కారణంగా బ్యాంకులు రుణం ఇవ్వకపోవడంతో పంటకు పెట్టుబడి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఇంట్లోని చిన్నా చితకా ఆభరణాలు తాకట్టుపెట్టి మరీ ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : అన్నం పెట్టే అన్నదాత అష్టకష్టాలు పడుతున్నాడు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. కానీ సర్కార్ ఏమాత్రం కనికరించడం లేదు. అమలుకు నోచుకోని రుణమాఫీ ప్రకటనతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ చివరి దశకొచ్చేసినా సాగు చేసుకోవడానికి మదుపు లేక దిక్కులు చూస్తున్నాడు. కొన్నేళ్లుగా కరువుతో సతమతమవుతున్న రైతులకు ఎక్కడా పరపతి పుట్టని పరిస్థితి నెలకొంది. బ్యాంకులు తప్ప మరో ఆధారం లేదు. అయితే ఆ బ్యాంకులు ఇప్పుడు ముఖం చాటేశాయి. దాదాపు 3.5లక్షల మంది రైతులకు సంబంధించి రూ.1036కోట్ల బకాయిలు ఉన్నాయి. వాటిని తీర్చితేనే కొత్తగా రుణాలు ఇస్తామని బ్యాంకులు మొండికేస్తున్నాయి. సర్కార్ రుణమాఫీ చేసి ఉంటే బకాయిలన్నీ తీరిపోయి కొత్తగా ఇచ్చేవారమని, ఆ ప్రక్రియ ఇంతవరకు జరగకపోవడంతో తామేమి చేయలేమని, రీషెడ్యూల్ కూడా చేయలేమంటూ చెప్పడమే కాకుండా గతంలో తీసుకున్న రుణాలు చెల్లించాలంటూ నోటీసులిస్తున్నాయి. దీంతో రైతుల పరిస్థితి పుండుపై కారం చల్లినట్టుగా తయారైంది. బ్యాంకులకు వెళ్తే వాళ్లిచ్చే నోటీసులు అందుకోవడం తప్ప రుణం వచ్చేది లేదని వాటి జోలికే పోవడం లేదు. దీంతో గత ఏడాది ఖరీఫ్‌లో దాదాపు లక్షా 11వేల 856 మందికి సుమారు రూ.850 కోట్లు రుణమిచ్చిన బ్యాంకులు ఈ ఏడాది రూ. 160కోట్లకే పరిమితమయ్యాయి.దాదాపు 18 వేల మందికి మాత్రమే రుణాలందాయి. వీరంతా దాదాపు కొత్తవారే. మిగతా లక్ష మంది రైతులు దిక్కులేని పరిస్థితిలో వడ్డీ వ్యాపారస్తులను, మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. రూ.3 నుంచి 10 వరకు వడ్డీ కింద రుణాలు తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి మునుపెన్నడూ లేని విధంగా ప్రైవేటు వ్యక్తుల బారిన పడి అప్పుల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఇంత చేసినా పంట దక్కుతుందా అంటే అదీ లేదు. ప్రకృతి దయ చూపితే తిండి గింజలు ఇంటికొస్తాయి. లేదంటే పరిస్థితి దయనీయమే. ప్రస్తుతం ఎకరాకు రూ.20 వేల వరకు అప్పులు చేసి మదుపు పెడుతున్నారు. ఆలస్యంగా వర్షాలు కురవడం, ఎరువుల కొరత ఉండటం, పట్టి పీడిస్తున్న తెగుళ్లతో దిగుబడిని అంచనా వేయలేని పరిస్థితి కన్పిస్తోంది. ఎదొకలా నెట్టుకొచ్చినా చివరిలో ప్రకృతి కనికరించకపోతే అసలకే నష్టపోవాల్సి వస్తోంది. కానీ ప్రభుత్వం చోద్యం చూస్తోంది. మాఫీ పేరుతో కాలయాపన చేస్తూ రైతులను ఆదుకోకుండా రకరకాల కబుర్లు చెబుతూ తప్పించుకుంటోంది. వడ్డీ వ్యాపారే దిక్కయ్యారు.. మాది గంట్యాడ మండలం పెదవేమలి గ్రామం. నాకు రెండెకరాల పొలం ఉంది. గంట్యాడలో ఉన్న గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో నాకు రూ.20 వేలు రుణం ఉంది. ప్రతీ ఏటా డబ్బులు కట్టి తిరిగి తీసుకుంటూ ఉంటాను. గత ఏడాది పంట దెబ్బతిన్న కారణంగా రుణం కట్టలేకపోయాను. చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పడంతో రుణం మాఫీ అవుతుందని ఎంతో ఆశపెట్టుకున్నాను. కాని మాఫీ అవ్వలేదు. బ్యాంకుకు వెళ్తే పాత రుణం కట్టి కొత్త రుణం తీసుకోవాలని తెలిపారు. పాత రుణం కట్టే పరిస్థితి లేకపోవడంతో వడ్డీ వ్యాపారి వద్ద రూ. 3 వడ్డీకి రూ.20 వేలు అప్పు తీసుకున్నాను. - సిరపురపు ఎర్నాయుడు, రైతు రుణమాఫీ ప్రకటనే మిగిలింది... ఒకప్పుడు సేద్యం దండగ అన్న చంద్రబాబు ఎన్నికల ముందు రైతు రుణమాఫీ అన్నాడు. రకరకాల ప్రకటనలతో చంద్రబాబు మోసం చేశాడు. వ్యవసాయం చేయడానికి అప్పు పుట్టక నానా ఇబ్బంది పడ్డాం. బ్యాంకులలో రీషెడ్యూల్ అన్నారు. లక్షా 50వేల రూపాయల మాఫీ అన్నారు. ఇంతవరకు ఏదీ వర్తించలేదు సరికదా... అప్పు పుట్టక ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టి ఈ ఏడాది వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టాం. మా చెల్లి పెళ్లికి ప్రైవేటుగా అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. -అల్లు కిషోర్‌కుమార్, రైతు, రాజుపేట, బొబ్బిలి మండలం కన్నెత్తి చూడని బాబు... చంద్రబాబు పాలనలో ఒకనాడు ఎంతో కరువు, కాటకం వచ్చిం ది. రైతుల పక్క కనీసం కన్నెత్తి చూడని చంద్రబాబు ఇప్పుడు తాను రైతు పక్షపాతినని, రైతురాజ్యం తనతోనే వస్తుందంటున్నాడు. రుణమాఫీ అమలు ప్రకటనకే మూడు నెలలు తిన్న బాబు అది అమలు ఎప్పుడు చేస్తాడో ఆయనకే తెలియాలి. ఉన్న అప్పులు తీర్చలేక.. కొత్త అప్పు పుట్టక రైతు లోకం ఎంతో ఇబ్బంది పడుతోంది. బ్యాంకర్లు రుణాలు చెల్లించాలని నోటీసులు పంపారు. ఈ ప్రాంతంలో నెలకు 5 రూపాయలు, 10 రూపాయల వడ్డీకి అప్పులు చేసి మేం ఇబ్బంది పడుతున్నాం. - పెంట ఇసుమునాయుడు, రైతు, రాజుపేట, బొబ్బిలి మండలం రైతుకు ఆర్థిక ఇబ్బంది వచ్చింది... చంద్రబాబు రుణమాఫీ ప్రకటనతో ముందు ధైర్యం వచ్చిన రైతులు రాను రాను పాతరుణం తీరక, కొత్త రుణం పుట్టక ఆర్థిక ఇబ్బంది పడే దుస్థితి వచ్చింది. ఈ ప్రాంతంలో చెరుకు బకాయిలు అదనం. మేం బంగారాన్ని ప్రైవేటు వ్యాపారుల వద్ద తాకట్టు పెట్టి వ్యవసాయం చేయాల్సిన దుస్థితి తీసుకువచ్చారు. చిన్న రైతులు అయితే వ్యవసాయం చేయలేక కౌలుకు ఇవ్వడం, ఇతర ప్రాంతాలకు వలసలు పోవడం చేస్తున్నారు. మాకు అలవాటైంది కాబట్టి వ్యవసాయాన్ని వదలలేక పిల్లల కోసం అప్పులు చేసి వ్యవసాయం చేయాల్సి వస్తోంది. -చింతల రామారావు, రైతు, దిబ్బగుడ్డివలస -
స్త్రీనిధి రుణంపై వడ్డీ కట్టాల్సిందే!
‘ఏరు దాటాక తెప్ప తగలేయడమంటే...’ మనకు తెలిసింది సామెత మాత్రమే. కానీ దీనికి ఆచరణ రూపమిచ్చి చంద్రబాబు ప్రభుత్వం చూపిస్తోంది. ఎన్నికల వేళ అమలు కాని హామీలిచ్చి అధికారం చేపట్టిన తరువాత ఒకొక్కరి భరతం పడుతున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు మహిళా సంఘాలను నిర్వీర్యం చేసేం దుకు సిద్ధపడింది. మహిళల ఆర్థికాభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ అనుచరులు ఆచరణలో అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. విజయనగరం అర్బన్ :ఎన్నికల హామీ మేరకు రుణా లు ఎప్పుడు మాఫీ చేస్తారా.. అని ఎదురు చూస్తోన్న పొదుపు మహిళా సంఘాలకు ప్రభుత్వం మరో ఝలక్ ఇచ్చింది. మైక్రో ఫైనాన్స్ సంస్థల దోపిడీ నుంచి పొదుపు మహిళా సంఘాలను రక్షించాలనే లక్ష్యంతో ఇప్పటి వరకు వడ్డీ లేకుండా పొదుపు సంఘాలకు ఇస్తున్న స్త్రీనిధి బ్యాంకు రుణాలపై వడ్డీ చెల్లించాలనిచంద్రబాబునాయుడు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను డీఆర్డీఏకు పంపింది. జూలై ఒకటి నుంచి వసూలు చేసిన రుణ వాయిదాల నుంచి ఈ ఆదేశాలు అమలవుతాయని పేర్కొంది. స్త్రీనిధి ద్వారా పొదుపు మహిళా సంఘాలకు మంజూరు చేసే రుణంపై గతంలో ప్రభుత్వం వడ్డీ బ్యాంకులకు చెల్లించేది. ఇప్పుడు అలా కుదర దని, రుణంతో పాటు జూలై నుంచి వడ్డీ కట్టాల్సిందేనని... తరువాత ఎప్పుడో ఆ వడ్డీని సంఘాల ఖాతాలకు ప్రభుత్వం జమ చేస్తుందని పేర్కొంది. దీంతో మహిళా సంఘాలు రుణంతో పాటు వడ్డీ కట్టాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. దీంతో మహిళలు డీలా పడ్డారు. రుణం ఎప్పుడు మాఫీ అవుతుంద ని ఎదురు చూస్తున్న వారికి ఇది పిడుగులా తాకింది. ప్రభుత్వ ఆలోచన చూస్తుంటే భవిష్యత్‌లో స్త్రీనిధి లక్ష్యా ల నుంచి ప్రభుత్వం తప్పించుకునేటట్టు ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్యానికి దూరంగా... ప్రభుత్వ నిర్ణయంతో స్త్రీనిధి లక్ష్యం నీరుగారే పరిస్థితి కనిపిస్తుంది. మైక్రో ఫైనాన్స్ సంస్థల బారి నుంచి కాపాడేందుకు వడ్డీ లేని రుణం ద్వారా మహిళలను ఆదుకునేందుకు 2011 నవంబరులో స్త్రీనిధి బ్యాంకును ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందు కోసం ప్రారంభంలో మండల సమాఖ్యల నుంచి రూ.100 కోట్లు సమీకరించగా, మరో రూ.120 కోట్లు ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటుగా సమకూర్చింది. గడిచిన మూడేళ్లలో ఈ బ్యాంకు ద్వారా జిల్లాలో రూ.50 కోట్ల వరకు రుణాలు అందజేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి దుపు సంఘాలు గ్రామైక్య సంఘం ద్వారా మొబైల్ రిక్వెస్ట్ పంపితే 48 గంటల్లో ఒకొక్క సభ్యురాలికి రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు రుణం సంబంధిత సంఘం అకౌంట్లో జమయ్యేది. ఇలా ఒక్కో సంఘం నుంచి ఆరుగురికి తక్కువ కాకుండా రుణ సదుపాయం పొందే అవకాశం కల్పించారు. గ్రామాఖ్య సంఘాల నిర్వహణ, లావాదేవీల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకొని ఏ, బీ, సీ, డీ గ్రేడ్లుగా విభజించి గ్రేడ్ల వారీగా రుణ పరిధిని నిర్ణరుుంచారు. అర్హత గల గ్రామాఖ్య సంఘాలకు మూడేళ్లలో రూ.50 కోట్లు రుణం మంజూరు చేస్తే ఇటీవల ఎన్నికల వరకు రికవరీ కూడా అదే స్థాయిలో 98 శాతం జిల్లాలో ఉండేది. రుణ మాఫీ హామీ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత వాయి వసూళ్లు 80 శాతానికి పడిపోయింది. స్త్రీనిధి రుణాలకు మాఫీ ఉండదనే విషయూన్ని అధికారులు క్షేత్ర స్థాయిమహిళలకు అవగాహన పెంచడంతో తిరిగి చెల్లింపులు తాజాగా 97 శాతానికి చేరుకున్నాయని స్త్రీనిధి జిల్లా అధికారులు చెబుతున్నారు. తాజాగా రుణంపై వడ్డీని కూడా సంఘాలే కట్టాలని తరువాత ప్రభుత్వం ఆయూ సంఘాలకు జమ చేస్తుందని ఆదేశాలు రావడంతో మహిళలు డీలా పడ్డారు. ఎప్పుడు వడ్డీ కడుతుందో... అసలు కడుతుందన్న నమ్మకమేంటని పలువురు మహిళలు ప్రశ్నిస్తున్నారు. 14 శాతం వడ్డీ చెల్లించాల్సిందే.. రుణంపై బ్యాంకులు వసూలు చేసే 14 శాతం వడ్డీని జూలై నుంచి పొదుపు మహిళా సంఘాల రుణాలపై కూడా వసూలు చేయాలని నిర్ణయించింది. స్త్రీనిధి బ్యాంక్ బోర్డు నిర్ణయం మేరకే వడ్డీ వసూలు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వాదేశాల మేరకే బోర్డులో తీర్మానం చేశారని చెబుతున్నారు. వడ్డీలేని రుణ పథకం నుంచి తప్పించుకునేందుకే తొలి ప్రయత్నంగా స్త్రీనిధి రుణాలపై ప్రభుత్వం వడ్డీ వసూలు చేయాలని నిర్ణయించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డు నిర్ణయం మేరకే వడ్డీ వసూలు స్త్రీనిధి బ్యాంకు బోర్డు సమావేశంలో గత నెల తీసుకున్న నిర్ణయం మేరకు జూలై ఒకటి నుంచి రుణ వాయిదాల కు 14 శాతం వడ్డీని కలుపుకొని వసూలు చేస్తున్నామని జిల్లా స్త్రీనిధి బ్యాంకు ఏజీఎం సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. స్త్రీనిధి రుణాలు కూడా వడ్డీలేని రుణంగానే మంజూరవుతాయని, అయితే వాయిదాతో పాటు కట్టిన వడ్డీ మొత్తాన్ని బ్యాంకు లింకేజి మొత్తంగా ప్రభుత్వం తిరిగి సంఘాలకు మంజూరు చేస్తుందని తెలిపారు. సక్రమంగా చెల్లించిన మహిళల అకౌంట్లలో ఆ మొత్తం తిరిగి జమవుతుందని వివరించారు. -
ఫైనాన్స్ వ్యాపారి దుర్మార్గం:దంపతులపై కత్తితో దాడి
గుంటూరు: నాగరిక సమాజంలో అనైతిక దాడులు రోజురోజుకు శృతిమించుతూనే ఉన్నాయి. అప్పులు ఇవ్వడం, తిరిగి వారివద్ద నుంచి వడ్డీల రూపంలో భారీగా గుంజటం మనకు తెలిసిందే. మైక్రో ఫైనాన్స్ సంస్థలపై ఆంక్షలు ఉన్నా ఫైనాన్సియర్ల నైజంలో ఏమాత్రం మార్పు రావడంలేదు. అప్పు తీర్చలేదని ఓ దంపతులపై కత్తితో దాడి చేసిన ఘటన జిల్లాలోని బాపట్లలో కలకలం సృష్టించింది. ఒక ఫైనాన్స్ సంస్థలో అప్పు రూపంలో తీసుకున్న డబ్బును ఆ దంపతులు తిరిగిచెల్లించకపోవడంతో ఫైనాన్షియర్ విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఈ ఘటనలో భార్యకు తీవ్రగాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
స్త్రీ నిధిపైచిన్న చూపు
స్త్రీ నిధిపైచిన్న చూపు మార్కాపురం, న్యూస్‌లైన్: స్వయం సహాయక బృందాల్లోని మహిళలకు అత్యవసర సమయాల్లో నిధులు ఇవ్వడంతో పాటు మైక్రోఫైనాన్స్ వారి బారిన పడకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ నిధి పథకాన్ని అమల్లోకి తెచ్చింది. మహిళలు స్వయంశక్తితో ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తోంది. బ్యాంక్‌లు ఇచ్చే రుణం ద్వారా వారి ఇళ్ల వద్దే వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా స్వశక్తితో అభివృద్ధి చెందవచ్చు. జిల్లాలో 5 వేల స్వయం సహాయక గ్రూపులకు స్త్రీ నిధి కింద రుణాలిచ్చారు. గ్రేడ్ల ఆధారంగా రుణాలు మంజూరు చేస్తారు. ఒక గ్రామ సమైక్య సంఘానికి రూ 10 లక్షల నుంచి లక్ష రూపాయల వరకు రుణం ఇస్తారు. సంఘం పనితీరు ఆధారంగా, గతంలో తీసుకున్న రుణాల రికవరీ, సంఘం ఆడిట్‌ను పరిశీలించి ర్యాంకర్లను ఇస్తారు. ఏ గ్రేడ్‌లో ఉన్న సంఘానికి రూ 10 లక్షలు, బీ గ్రేడ్ అయితే రూ7 లక్షలు, సీ గ్రేడ్‌కు రూ 3 లక్షలు, డీ గ్రేడ్ కు లక్ష రూపాయలు ఇస్తారు. ఆడిట్ చేయించుకునేందుకు అవసరమయ్యే పుస్తకాలను జిల్లా వాటర్‌షెడ్ సంస్థ అధికారులు సమైక్య సంఘాలకు ఇవ్వాల్సి ఉండగా, కొన్ని మండలాల్లో ఇవ్వకపోవడంతో ఆడిట్ కాక రుణాలకు అనర్హత సాధించలేకపోయారు. బేస్తవారిపేట, దొనకొండ, త్రిపురాంతకం, యర్రగొండపాలెం తదితర మండలాల్లో పలు సమైక్యసంఘాలు ఆడిట్ కాలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో 70 కోట్ల 94 లక్షల 54 వేల 223 రూపాయల రుణాలలివ్వగా, ఇప్పటి వరకు రూ25,90,05,537 మాత్రమే జమ చేశారు. తాము నిర్ణయించుకున్న సమయం లోపు తీసుకున్న రుణాలను ఆయా గ్రూపుల వారు బ్యాంక్‌లకు చెల్లిస్తే వారు తీసుకున్న రుణానికి వడ్డీ ఉండదు. కాగా, పథకంపై అవగాహన లేకపోవడంతో గత ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రుణాల బకాయిలు తిరిగి కట్టలేకపోయారు. దీంతో చిన్న మొత్తాల్లో కట్టాల్సిన గ్రూపులకు బ్యాంక్ అధికారులు వడ్డీ విధిస్తున్నారు. ఐకేపీ సిబ్బంది, బ్యాంక్ అధికారులు వడ్డీ లేని రుణ పథకంపై అవగాహన కల్పిస్తే పథకం వర్తించేది. జిల్లాలోని చినగంజాం మండలంలోని ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు రూ3 కోట్ల రుణాలివ్వగా, రూ 20 లక్షల బకాయిలు ఉన్నారు. చీరాల మండలంలో రూ 2.31 కోట్ల రుణాలుగా ఇవ్వగా, రూ11,11,222 చెల్లించాల్సి ఉంది. సింగరాయకొండ మండలంలో రూ2.35 కోట్ల రుణాలివ్వగా రూ 13 లక్షల బకాయిలు చెల్లించాలి. దోర్నాల మండలంలో రూ1.41 కోట్లు ఇవ్వగా రూ9.29 లక్షలు, పెద్దారవీడులో రూ51 లక్షలకు గానూ రూ7.43 లక్షలు, వేటపాలెంలో రూ1.76 కోట్లకు గాను రూ10.47 లక్షలు, పుల్లలచెరువులో రూ 36 లక్షలకు గాను రూ 6 లక్షలు ఇలా జిల్లా వ్యాప్తంగా పలు స్వయం సహాయక సంఘాలు కొద్ది మొత్తంలో రుణాలను బ్యాంక్‌లకు చెల్లించాల్సి ఉంది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు కొన్ని నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో వీరిపై వడ్డీ భారం పడుతోంది. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో 20 నుంచి 30 గ్రూపుల వరకు పథకంపై అవగాహన లేక కొద్ది మొత్తంలో బ్యాంక్‌లకు బకాయి ఉండటంతో వడ్డీ లేని రుణ పథకానికి అనర్హులయ్యారు. ఐకేపీ సిబ్బంది, మహిళా గ్రూపులతో సమావేశం ఏర్పాటు చేసి వారు కట్టాల్సిన బకాయిల గురించి వివరిస్తే ఆయా గ్రూపులపై రుణభారం తగ్గుతుంది. సకాలంలో చెల్లిస్తేనే వడ్డీ రాయితీ ధర్మేంద్ర, స్త్రీ నిధి జిల్లా మేనేజర్ జిల్లా వ్యాప్తంగా స్వయం సహాయక బృందాలు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించకపోవడంతో బకాయిలు ఎక్కువగా ఉన్నాయి. 60 రోజులు చెల్లించకుండా ఉన్న సంఘాలపై ప్రత్యేక దృష్టి పెట్టి రికవరీ కోసం బృందాలను ఏర్పాటు చేశాం. నిర్ణీత సమయంలో తీసుకున్న రుణాన్ని చెల్లించకపోతే వడ్డీ రాయితీ వర్తించదు. ప్రతి నెలా సంబంధిత గ్రామ సమైక్య సంఘం సమావేశం రోజున చెల్లించాల్సిన రుణాన్ని బ్యాంక్‌లో జమ చేయాలి. -
శిక్షణతో పాటే సూక్ష్మ రుణాలు
ఇంటర్వ్యూ: ‘సాక్షి’తో హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎండీ ఆదిత్యపురి ఆంధ్రప్రదేశ్‌లో అలా ఇవ్వలేదు కనకే ఆత్మహత్యలు రుణ గ్రహీతలకు శిక్షణ ఏ బ్యాంకూ ఇవ్వటం లేదు ఆంధ్రప్రదేశ్‌లో మా సూక్ష్మ రుణాలు పెరగాల్సి ఉంది ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఇవ్వటం మాకిష్టం లేదు దీనిపైనే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం అన్నీ చూసుకుంటే 26 శాతం వడ్డీ పెద్ద ఎక్కువేమీ కాదు వచ్చే ఐదేళ్లలో గ్రామీణ వాటా 50 శాతానికి తీసుకెళతాం కోటి మంది మహిళలకు సూక్ష్మ రుణాలివ్వాలన్నది లక్ష్యం ఈ ఏడాది రుణాల్లో వృద్ధి 15 శాతం ఉండొచ్చు డిపాజిట్లు కూడా 13 శాతం వరకూ పెరిగే అవకాశముంది ఆదిత్యపురి. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీకి ఎండీ. బ్యాంకు సేవల్ని గ్రామాల దిశగా తీసుకెళుతున్న వ్యక్తి. సస్టెయినబుల్ లైవ్లీహుడ్ ఇనీషియేటివ్ (ఎస్ఎల్ఐ) కింద 20 లక్షల మంది గ్రామీణ మహిళలకు సూక్ష్మ రుణాలిచ్చి... ఈ సందర్భంగా జైపూర్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ సాక్షి బిజినెస్ ఎడిటర్ ఎం.రమణమూర్తితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ రుణాల తీరుతెన్నులపై సాగిన ఈ ఇంటర్య్వూ... సస్టెయినబుల్ లైవ్లీహుడ్ ఇనీషియేటివ్... పూర్తిగా మైక్రోఫైనాన్స్ మోడల్లోనే ఉందిగా? మేమిస్తున్నది సూక్ష్మ రుణాలే. కానీ దీన్లో కొత్తదనమేంటంటే శిక్షణ. వేరెవ్వరూ రుణాలిస్తూ... రుణగ్రహీతలకు శిక్షణ ఇవ్వటం లేదు. మేం దీన్ని బిజినెస్‌తోపాటు బాధ్యతగా కూడా భావిస్తున్నాం. రుణం కావాల్సిన గ్రామాలను గుర్తించటం, అక్కడి మహిళలతో మాట్లాడి స్వయం సహాయక గ్రూపుల్ని ఏర్పాటు చేయటం... వారికి రుణాలిచ్చేటపుడు కౌన్సెలింగ్ చేయటం, అవసరమైన అంశాల్లో వారికి శిక్షణనివ్వటం... ఇదంతా మా సిబ్బందే చేస్తారు. అంటే దీన్లో స్థానిక నాయకులు, ప్రభుత్వ గ్రూపుల ప్రమేయం ఉండదా? ఉండదు. ఎందుకంటే 3,500 మంది సిబ్బంది దీనికోసమే ప్రత్యేకంగా పనిచేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరాంతానికి ఈ సంఖ్యను మరో 50 శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ సూక్ష్మ రుణాలకు వసూలు చేసే వడ్డీ ఎంత? దాదాపు 26 శాతం. కాకుంటే దీన్లో శిక్షణ వంటివి కూడా ఉంటాయి. వాటికి ఎలాంటి చార్జీలూ వసూలు చేయటం లేదు. మేమే స్థానికంగా ఉన్న శిక్షకులకు పారితోషికం చెల్లించి గ్రామాల్లో పదేసి రోజుల శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ శిక్షణకు మా దగ్గర సూక్ష్మరుణాలు తీసుకున్న మహిళలతో పాటు స్థానికంగా ఆసక్తి ఉన్నవారు కూడా హాజరవుతున్నారు. వారి నుంచి కూడా ఎలాంటి చార్జీలూ వసూలు చేయటం లేదు. శిక్షణకయ్యే ఖర్చు వగైరా కూడా కలిసి ఉంటాయి కనక మొత్తం 26 శాతాన్నీ వడ్డీగా భావించలేం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో వడ్డీపై పరిమితి విధిస్తూ ఆర్డినెన్స్ ఉంది కదా? మా రుణాలపై వసూలు చేస్తున్న వడ్డీ ఈ ఆర్డినెన్స్ నిర్దేశించిన పరిమితిలోపే ఉంది. అంతకన్నా ఎక్కువ వసూలు చేస్తున్నామని నేననుకోవటం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికి 4 క్లస్టర్లలోనే సేవలందిస్తున్నట్లు చెప్పారు? విస్తరణ ఆగిందేం? అలాంటిదేమీ లేదు. అక్కడి చాలా జిల్లాల్లో రుణాల ఆవశ్యకత ఉంది. అక్కడ స్వయం సహాయక బృందాలు కూడా చాలా పటిష్టంగా ఉన్నాయి. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏ సూక్ష్మ రుణాలనైనా అక్కడి ‘సెర్ప్’ వంటి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారానే ఇవ్వాలంటోంది. మేం స్వతంత్రంగానే ఇస్తామంటున్నాం. ఈ విషయంపై ఇరువురి మధ్యా చర్చలు జరుగుతున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే ప్రభుత్వం అలా... కావచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగిందో ఇక్కడ చెప్పాలి. అక్కడ మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఉత్పాదకతను దృష్టిలో పెట్టుకుని రుణాలివ్వలేదు. రుణమనేది ఏ వ్యాపారానికో, స్వయం ఉపాధికో ఇస్తే ఆ రుణం ద్వారా సంపాదించి వారు తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. కానీ టీవీలు, ఫ్రిజ్‌ల వంటి వినియోగ వస్తువులకు కూడా వారు సూక్ష్మ రుణాలిచ్చేశారు. దీనివల్ల రుణాలు తీసుకున్న వారు తిరిగి చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. ఒక సంస్థ రుణం తీర్చడానికి వేరే సంస్థ దగ్గర సూక్ష్మ రుణం తీసుకునేవారు. ఇలా వారు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. చివరికి ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. కానీ మేం ఉపాధితో ముడిపడ్డ కార్యకలాపాలకే రుణాలిస్తున్నాం. దీన్లోనే పొదుపును కూడా ప్రోత్సహిస్తున్నాం. వారు సంపాదించిన దాంట్లో కొంత వాయిదాకు పోగా... కొంత పొదుపు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నాం. ఆ పొదుపుతో వారు వినియోగ వస్తువులు కొనుక్కున్నా పర్వాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంఎఫ్ఐలు మరీ అత్యాశకు పోయాయంటున్నారు కదా? ఏ సంస్థలవి? అందరికీ తెలిసిందే. నేను వాటి పేర్లు ప్రస్తావించటం బాగుండదు. ఎస్ఎల్ఐకి సంబంధించి మీ లక్ష్యాలేంటి? బ్యాంకింగ్ వ్యవస్థ ఎక్కువగా నగరాలు, పట్టణాలకే పరిమితమవుతోంది. దాన్ని గ్రామాలకు తీసుకెళ్లడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మా బ్యాంకింగ్‌ను చూసినా మా శాఖల్లో 56 శాతం సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ వాటి నుంచి వచ్చే ఆదాయం మాత్రం 15 శాతమే. అందుకే వచ్చే ఐదేళ్లలో ఈ సెగ్మెంట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని 50 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గడిచిన మూడేళ్లలో 7వేల గ్రామాల్లో 20 లక్షల మందికి 2,500 కోట్ల రుణాల్ని ఎస్ఎల్ఐ కింద మంజూరు చేశాం. 24 రాష్ట్రాల్లో ఈ సేవలందిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరాంతానికి కోటి కుటుంబాలకు ఈ రుణాలివ్వాలన్నదే లక్ష్యం. దీన్నెందుకు మహిళలకే పరిమితం చేశారు? మహిళలకు ఆర్థిక శక్తి వస్తే వారు శక్తిమంతంగా మారతారు. మహిళ శక్తిమంతంగా మారితే కుటుంబం... తద్వారా సమాజం కూడా బలోపేతమవుతాయి. ఈ ఉద్దేశంతోనే ఎస్‌ఎల్‌ఐని మహిళలకే పరిమితం చేశాం. ఈ ఏడాది రుణాల్లో, డిపాజిట్లలో ఏ స్థాయి వృద్ధిని ఆశిస్తున్నారు? పరిస్థితులు నిరాశాజనకంగా ఉన్నాయి కదా? అలాంటిదేమీ లేదు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా మంచి వర్షాలు పడ్డాయి. పంటలు బావుంటే వ్యవస్థలో నగదు ప్రవాహం పెరుగుతుంది. లిక్విడిటీ మెరుగుపడితే రుణాలు, డిపాజిట్లు రెండూ పెరుగుతాయి. రుణాల్లో 15-16 శాతం వృద్ధి ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. ఆస్తులకన్నా డిపాజిట్ల బేస్ ఎక్కువ కాబట్టి 15 శాతం రుణాల వృద్ధిని తట్టుకోవటానికి డిపాజిట్లు 13 శాతం పెరిగితే చాలు. అది సాధ్యమవుతుందనే మా అంచనా.