ముంబై: సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్‌ఐలు) సెక్యూరిటైజేషన్ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.3,500 కోట్లుగా ఉందని ఇక్రా రేటింగ్స్ తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఎంఎఫ్‌ఐల సెక్యూరిటైజేషన్ పరిమాణం రూ.1,460 కోట్లుగానే ఉంది. ఎంఎఫ్‌ఐలు తమ రుణాలను కొంత మేర సెక్యూరిటీలుగా (బాండ్లు, తదితర) మార్చి నిధుల అవసరాలను తీర్చుకోవడమే సెక్యూరిటైజేషన్.
2022 మొదటి ఆరు నెలల్లో ఎంఎఫ్‌ఐల రుణ ఆస్తుల సెక్యూరిటైజేషన్ బలంగా పుంజుకున్నట్ట ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. సెక్యూరిటీటైజేషన్ అన్నది ఎంఎఫ్‌ఐల నిధుల మార్గాల్లో ఒకటి. ఎన్‌బీఎఫ్‌సీ–ఎంఎఫ్‌ఐలకు ఇది కీలక నిధుల మార్గంగా ఉండడం గమనార్హం.
చదవండి: 5G Spectrum Auction: కంపెనీలు తగ్గేదేలే.. రికార్డ్ బ్రేక్, తొలి రోజు రూ.1.45లక్షల కోట్లు!
Comments
Please login to add a commentAdd a comment