Q1 results
-
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు నిరాశ
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మొదటి త్రైమాసికంలో నిరాశజనక ఫలితాలను నమోదు చేసింది. 2024 జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికం ఫలితాలను కంపెనీ సోమవారం (జూలై 15) వెల్లడించింది.గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 6% క్షీణించి రూ.312.63 కోట్లకు చేరుకుంది. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలోని రూ.414 కోట్లతో పోలిస్తే కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం 9% పెరిగి రూ.417.8 కోట్లకు చేరుకుంది.మార్కెట్ సమయం ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ షేర్లు బీఎస్ఈలో రూ.4.90 లేదా 1.40% పెరిగి రూ.355.25 వద్ద ముగిశాయి. -
దశ తిరిగిన కాఫీడే! ఎట్టకేలకు లాభాల్లోకి..
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడిన కాఫీడే (కేఫ్ కాఫీ డే గ్లోబల్ లిమిటెడ్- సీడీజీఎల్) దశ తిరిగిట్టు కనిపిస్తోంది. నష్టాల ఊబి నుంచి బయటపడి ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.24.57 కోట్ల నికర లాభం వచ్చినట్లు ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.11.73 కోట్ల నష్టాన్ని కాఫీడే చవిచూసింది. మొత్తంగా ఏడాది క్రితం తొలి త్రైమాసికంలో రూ.189.63 కోట్లుగా ఉన్న కంపెనీ ఆపరేషన్స్ ఆదాయం ఈ ఏడాది రూ.223.20 కోట్లకు చేరుకున్నట్లు క్యూ1 ఫలితాల వెల్లడి సందర్భంగా కాఫీ డే పేర్కొంది. సీడీజీఎల్ అన్‌లిస్టెడ్ కంపెనీ కావడంతో దాని మాతృ సంస్థ కాఫీడే ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ (సీడీఈఎల్) ప్రతి త్రైమాసికం ఫలితాలను వెల్లడిస్తుంది. కాగా ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 250 కోట్లు. మరోవైపు ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో కాఫీ డే దేశవ్యాప్తంగా ఉన్న తమ అవుట్లెట్ల సంఖ్యను సీక్వెన్షియల్ ప్రాతిపదికన 467కి తగ్గించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 493 అవుట్లెట్లు ఉండేవి. కానీ, వెండింగ్ యంత్రాలను మాత్రం 46,603 నుంచి 50,870కి పెంచుకుంది. ఒక్కో అవుట్‌లెట్‌లో సరాసరి రోజువారీ ఆదాయం రూ.19,537 నుంచి రూ.20,824కి పెరిగినట్లు కాఫీడే కంపెనీ వెల్లడించింది. క్యూ1 ఫలితాల నేపథ్యంలో కాఫీడే షేర్లు ఆగస్ట్ 16న లాభాల బాటలో పయనించాయి. ఇదీ చదవండి: Vietnam Richest man: అదృష్టం కాదిది.. అంతకు మించి! ఒక్క రోజులో రూ. 3.2 లక్షల కోట్ల సంపద.. -
అయ్యో వొడాఫోన్ ఐడియా! పాపం భారీ నష్టాలు
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్ (క్యూ1)లో నికర నష్టం మరింత పెరిగి రూ. 7,840 కోట్లను తాకింది. అధిక వ్యయాలు ప్రభావం చూపాయి. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 7,296 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం 2 శాతం స్వల్ప వృద్ధితో రూ. 10,656 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 10,407 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 128 నుంచి రూ. 139కు మెరుగుపడింది. -
లాభాల్లోకి స్పైస్‌జెట్.. నష్టాలను వీడిన తక్కువ ధరల ఎయిర్‌లైన్స్!
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 205 కోట్ల నికర లాభం ఆర్జించింది. దేశీయంగా విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరగడం ఇందుకు సహకరించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 789 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం నిర్వహణ ఆదాయం మాత్రం రూ. 2,457 కోట్ల నుంచి రూ. 2,002 కోట్లకు నీరసించింది. నిర్వహణ వ్యయాలు సైతం రూ. 2,072 కోట్ల నుంచి రూ. 1,291 కోట్లకు భారీగా తగ్గాయి. పలు సవాళ్ల నేపథ్యంలోనూ లాభాలు ఆర్జించగలిగినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ అజయ్ సింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాము చేపట్టిన రూ. 500 కోట్ల పెట్టుబడులు కంపెనీ వృద్ధికి తోడ్పాటునిచ్చినట్లు తెలియజేశారు. ఈ కాలంలో లాజిస్టిక్స్ సంస్థ స్పైస్‌ఎక్స్‌ప్రెస్ అండ్ లాజిస్టిక్స్ ప్రయివేట్ లిమిటెడ్‌ను విడదీయడంతో స్పైస్‌జెట్ నెట్‌వర్త్ మెరుగుపడినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో స్పైస్‌జెట్ షేరు బీఎస్ఈలో 7% జంప్‌చేసి దాదాపు రూ. 34 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ రికార్డ్‌లు.. నికర లాభం 178 శాతం దూసుకెళ్లి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 178 శాతం దూసుకెళ్లి రూ. 16,884 కోట్లను తాకింది. ఒక త్రైమాసికంలో ఇది అత్యధికంకాగా.. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 6,068 కోట్లు ఆర్జించింది. ఇందుకు మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం దోహదపడ్డాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సైతం నికర లాభం రూ. 7,325 కోట్ల నుంచి రూ. 18,537 కోట్లకు దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం రూ. 94,524 కోట్ల నుంచి రూ. 1,32,333 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.91 శాతం నుంచి 2.76 శాతానికి, ఎన్పీఏలు 1 శాతం నుంచి 0.71 శాతానికి తగ్గాయి. నికర వడ్డీ మార్జిన్లు 0.24 శాతం మెరుగై 3.47 శాతంగా నమోదయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి 1.13 శాతం పుంజుకుని 14.56 శాతాన్ని తాకింది. వడ్డీ ఆదాయం ప్లస్ క్యూ1లో ఎస్బీఐ మొత్తం ఆదాయం(స్టాండెలోన్) సైతం రూ. 74,989 కోట్ల నుంచి రూ. 1,08,039 కోట్లకు జంప్ చేసింది. వడ్డీ ఆదాయం రూ. 72,676 కోట్ల నుంచి రూ. 95,975 కోట్లకు బలపడింది. అయితే నికర వడ్డీ ఆదాయం 25 శాతం ఎగసి రూ. 38,905 కోట్లను తాకింది. పొదుపు ఖాతాల్లో 63 శాతం, రిటైల్ ఆస్తులలో 35 శాతం యోనో(డిజిటల్) ద్వారా పొందినట్లు బ్యాంక్ చైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌లో దాదాపు రూ. 490 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అయితే సంస్థ ఐపీవో ప్రణాళికలను పునరుద్ధరించే యోచనలో లేనట్లు స్పష్టం చేశారు. రుణ నష్టాలకు ప్రొవిజన్లు 38 శాతం తగ్గి రూ. 2,652 కోట్లకు చేరాయి. గతేడాది క్యూ4(జనవరి–మార్చి)లో నమోదైన రూ. 1,278 కోట్లతో పోలిస్తే 107 శాతం అధికమయ్యాయి. -
ఎయిర్టెల్ లాభం ఫ్లాట్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం దాదాపు యథాతథంగా రూ. 1,612 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,607 కోట్లు ఆర్జించింది. అయితే సర్దుబాటుకు ముందు నికర లాభం 91 శాతం జంప్‌చేసి రూ. 2,902 కోట్లుగా నమోదైంది. ఇక మొత్తం ఆదాయం 14 శాతం ఎగసి రూ. 37,440 కోట్లకు చేరింది. దేశీ మొబైల్ సరీ్వసుల ఆదాయం 13 శాతంపైగా పుంజుకుని రూ. 26,375 కోట్లను తాకినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కాలంలో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 183 నుంచి రూ. 200కు బలపడింది. రూ. 19,746 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించగా.. 52.7 శాతం ఇబిటా మార్జిన్లను సాధించింది. 4జీ యూజర్లు అప్ తాజా సమీక్షా కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 56 లక్షల మంది 4జీ వినియోగదారులను జత చేసుకున్నట్లు భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ పేర్కొన్నారు. నాణ్యమైన కస్టమర్లపై దృష్టి సారించడం ద్వారా 0.8 మిలియన్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులను జత కలుపుకున్నట్లు తెలియజేశారు. దీంతో వీరి సంఖ్య దాదాపు 2.05 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. ఇక మొబైల్ డేటా వినియోగం 22 శాతం ఎగసి ఒక్కో కస్టమర్‌పై నెలకు 21.1 జీబీకి చేరినట్లు వివరించారు. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు బీఎస్ఈలో 0.7 శాతం క్షీణించి రూ. 872 వద్ద ముగిసింది. -
అదరగొట్టిన ఎస్బీఐ: లాభాలు హై జంప్
State Bank of India Q1 results: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త క్యూ1 ఫలితాల్లో అదరగొట్టింది. శుక్రవారం ప్రకటించిన జూన్ త్రైమాసిక ఫలితాలలో అంచనాలకు మించి రాణించింది. అంతేకాదు వరుసగా నాలుగో త్రైమాసికంలో రికార్డు లాభాలను నమోదు చేయడం విశేషం.ఆస్తుల నాణ్యత మెరుగుదల నికర వడ్డీ ఆదాయం వృద్ధి, లాభాలకు దారి తీసింది. (యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్...ఇక పండగే!) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఎస్బీఐ రూ.16,884.29 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్లోని రూ.6,068.08 కోట్ల లాభాలతో పోలిస్తే ఇది ఏకంగా 178.24 శాతం అధికం. మార్కెట్ విశ్లేషకులు అంచనా 12.-160 శాతం కంటే ఎక్కువ. నికర వడ్డీ ఆదాయం 24.71 శాతం ఎగిసి రూ.38,905 కోట్లుగా నమోదైంది. డిపాజిట్లు, ఇతర హైలైట్స్ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం డిపాజిట్లు ఏడాదికి 12 శాతం పెరిగి రూ.45.31 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.40.46 లక్షల కోట్లుగా ఉంది. విదేశీ కార్యాలయాల డిపాజిట్లు ఏడాదికి 22.74 శాతం పెరిగి రూ.1.79 లక్షల కోట్లకు చేరుకోగా, దేశీయ డిపాజిట్లు 11.60 శాతం పెరిగి రూ.43.52 లక్షల కోట్లకు చేరుకున్నాయి. CASA డిపాజిట్ సంవత్సరానికి 5.57 శాతం పెరిగింది. అయితే CASA నిష్పత్తి జూన్ 30 నాటికి 42.88 శాతంగా ఉంది. నికర వడ్డీ మార్జిన్లు గత ఏడాది త్రైమాసికంలో 3.23 శాతం నుంచి జూన్ త్రైమాసికంలో 24 బేసిస్ పాయింట్లు పెరిగి 3.47 శాతానికి ఎగిసింది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 2.76 శాతంగా ఉంది. అలాగే ప్రభుత్వరంగ బ్యాంకు ఈ త్రైమాసికానికి రూ.2,501.31 కోట్ల విలువైన కేటాయింపులు చేసింది. జూన్ 30, 2022 నాటికి రూ.29,00,636 కోట్లతో పోలిస్తే స్థూల అడ్వాన్సులు 13.90 శాతం పెరిగి రూ.33,03,731 కోట్లకు చేరాయని బ్యాంక్ నివేదించింది. అలాగే డిపాజిట్లు రూ.45,31,237 కోట్ల నుంచి రూ.45,31,237 కోట్లకు పెరిగాయి. క్రెడిట్ ఖర్చు 0.32 శాతం ఉండగా.. గత ఏడాది ఇదే సమయంలో 0.61 శాతంగా నమోదైంది. -
అదానీ ఎంటర్ప్రైజెస్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 44 శాతంపైగా జంప్‌చేసింది. రూ. 677 కోట్లను తాకింది. వ్యయాలు తగ్గడం ఇందుకు సహకరించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 469 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 41,066 కోట్ల నుంచి రూ. 25,810 కోట్లకు క్షీణించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 40,434 కోట్ల నుంచి రూ. 24,731 కోట్లకు వెనకడుగు వేశాయి. ఈ కాలంలో అదానీ ఎయిర్‌పోర్ట్స్ 2.13 కోట్లమంది ప్రయాణికులను హ్యాండిల్ చేసింది. 27 శాతం వృద్ధి ఇది. అదానీ న్యూ ఇండస్ట్రీ ఎకోసిస్టమ్ నుంచి మాడ్యూల్స్ విక్రయాలు 87 శాతం జంప్‌చేసి 614 మెగావాట్లకు చేరాయి. డేటా సెంటర్ పనులు.. విభిన్న బిజినెస్‌లు పటిష్ట వృద్ధిని సాధించడంతోపాటు కొత్త విభాగాలు సైతం పురోగతిలో ఉన్నట్లు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు. అదానీ కానెక్స్(చెన్నై డేటా సెంటర్ రెండో దశ) పనులు 74 శాతం పూర్తికాగా.. నోయిడా సెంటర్లో 51 శాతం, హైదరాబాద్‌లో 46 శాతం పూర్తయినట్లు వెల్లడించారు. కచ్ కాపర్, నవీ ముంబై ఎయిర్పోర్ట్, 5 మెగావాట్ల ఆన్‌షోర్ విండ్ టర్బయిన్ సరి్టఫికేషన్ తదితర భారీస్థాయి ప్రాజెక్టులను పూర్తిచేయడం ద్వారా మౌలిక రంగంలో కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్స్, న్యూ ఇండస్ట్రీస్, డేటా సెంటర్, రోడ్స్ తదితర కొత్త బిజినెస్‌లను పటిష్టరీతిలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు బీఎస్ఈలో 2.4 శాతం ఎగసి రూ. 2,532 వద్ద ముగిసింది. -
పీవీఆర్ ఐనాక్స్కు నష్టాలు
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 82 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 53 కోట్ల నికర లాభం ఆర్జించింది. కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ. 981 కోట్ల నుంచి రూ. 1,305 కోట్లకు ఎగసింది. మొత్తం టర్నోవర్ రూ. 1,330 కోట్లను తాకగా.. మొత్తం వ్యయాలు రూ. 1,438 కోట్లకు చేరాయి. అయితే పీవీఆర్, ఐనాక్స్ విలీనం నేపథ్యంలో గతేడాది క్యూ1తో ఫలితాలను పోల్చతగదని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత సమీక్షా కాలంలో 3.39 కోట్లమంది సినిమా హాళ్లను సందర్శించగా.. సగటు టికెట్ ధర రూ. 246గా నమోదైంది. సగటున ఆహారం, పానీయాలపై రూ. 130 చొప్పున వెచి్చంచినట్లు కంపెనీ వెల్లడించింది. కొత్తగా 31 స్క్రీన్లను ప్రారంభించడంతో వీటి సంఖ్య 1,707కు చేరినట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో పీవీఆర్ ఐనాక్స్ షేరు బీఎస్ఈలో 0.6 శాతం లాభపడి రూ. 1,566 వద్ద ముగిసింది. -
ఎన్టీపీసీ లాభం రూ.4,907 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.4,907 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,978 కోట్లతో పోలిస్తే 23 శాతం వృద్ధి చెందింది. ఆదాయం మాత్రం రూ.43,561 కోట్ల నుంచి రూ.43,390 కోట్లకు తగ్గింది. జూన్ క్వార్టర్లో 103.98 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉత్పత్తి 104.42 బిలియన్ యూనిట్లుగా ఉంది. కోల్ ప్లాంట్లలో లోడ్ ఫ్యాక్టర్ 77.43 శాతంగా ఉంది. -
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టర్న్అరౌండ్.. దశాబ్ద కాలంలోనే అత్యధిక లాభం
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 13,750 కోట్ల నికర లాభం(స్టాండెలోన్) ఆర్జించింది. ఇది గత దశాబ్ద కాలంలోనే అత్యధికంకాగా.. పెట్రోల్, డీజిల్‌పై లాభదాయకత(మార్జిన్లు) మెరుగుపడటం లాభాలకు కారణమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,993 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ4(జనవరి–మార్చి)లో నమోదైన రూ. 10,059 కోట్లతో పోల్చినా తాజా లాభం 37 శాతం జంప్‌చేసింది. వెరసి ఇంతక్రితం 2021–22లో ఆర్జించిన రికార్డ్ వార్షిక లాభం రూ. 24,184 కోట్లలో సగానికిపైగా క్యూ1లో సాధించింది. కాగా.. గతంలో అంటే 2012–13 క్యూ4లో అధిక ఇంధన సబ్సిడీని అందుకోవడం ద్వారా రూ. 14,153 కోట్ల నికర లాభం నమోదైంది. గతేడాది క్యూ1లో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను నిలిపిఉంచడంతో ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజాలు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సైతం నష్టాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం 2 శాతం నీరసించి రూ. 2.21 లక్షల కోట్లకు పరిమితమైంది. ప్రతీ బ్యారల్ చమురుపై స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 8.34 డాలర్లకు చేరాయి. ఇంధన అమ్మకాలు 0.6 మిలియన్ టన్నులు పెరిగి 21.8 ఎంటీని తాకాయి. ఈ కాలంలో 18.26 ఎంటీ చమురును ప్రాసెస్ చేసింది. ఫలితాల నేపథ్యంలో ఐవోసీ షేరు బీఎస్ఈలో 0.5 శాతం క్షీణించి రూ. 95 వద్ద ముగిసింది. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా మెరుగైన పనితీరు.. భారీగా పెరిగిన లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో తన పనితీరును గణనీయంగా మెరుగుపరుచుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం భారీగా పెరిగి రూ.1,551 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.561 కోట్లుగా ఉండడం గమనార్హం. మొత్తం ఆదాయం సైతం రూ.11,124 కోట్ల నుంచి రూ.15,821 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం రూ.14,359 కోట్లుగా ఉంది. స్థూల మొండి బకాయిలు జూన్ చివరికి 6.67%కి తగ్గాయి. నికర ఎన్పీఏలు 1.65%కి తగ్గాయి. ఎన్పీఏలకు కేటాయింపులు తాజాగా ముగిసిన త్రైమాసికంలో ఇవి రూ.777 కోట్లకు పరిమితమయ్యాయి. -
లాభాల్లోకి టాటా మోటార్స్.. షేర్ల ధరకు రెక్కలు
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 3,301 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 4,951 కోట్ల నికర నష్టం ప్రకటించింది. లగ్జరీకార్ల బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్)తోపాటు వాణిజ్య వాహన బిజినెస్ పుంజుకోవడం కంపెనీ పటిష్ట పనితీరుకు దోహదపడ్డాయి. ఇక మొత్తం ఆదాయం సైతం రూ. 71,228 కోట్ల నుంచి రూ. 1,01,528 కోట్లకు జంప్‌చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 77,784 కోట్ల నుంచి రూ. 98,267 కోట్లకు ఎగశాయి. ఈ కాలంలో టాటా మోటార్స్ స్టాండెలోన్ నష్టం రూ. 181 కోట్ల నుంచి రూ. 64 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం రూ. 14,793 కోట్ల నుంచి రూ. 15,733 కోట్లకు బలపడింది. జేఎల్ఆర్ జూమ్... ప్రస్తుత సమీక్షా కాలంలో జేఎల్ఆర్ ఆదాయం 57 శాతం జంప్‌చేసి 6.9 బిలియన్ పౌండ్లను తాకగా.. 43.5 కోట్ల పౌండ్ల పన్నుకు ముందు లాభం ఆర్జించింది. కొత్త ఏడాదిని పటిష్టంగా ప్రారంభించినట్లు జేఎల్ఆర్ కొత్త సీఈవో అడ్రియన్ మార్డెల్ పేర్కొన్నారు. క్యూ1లో రికార్డ్ క్యాష్‌ఫ్లోను సాధించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం క్యూ1 స్థాయి పనితీరు చూపగలమని విశ్వసిస్తున్నట్లు గ్రూప్ సీఎఫ్‌వో పీబీ బాలాజీ పేర్కొన్నారు. ఇదీ చదవండి ➤ SEBI Notices To Yes Bank Ex CEO: యస్ బ్యాంక్ రాణా కపూర్‌కు సెబీ నోటీసు.. రూ. 2.22 కోట్లు కట్టాలి కాగా.. వాణిజ్య వాహన విభాగం ఆదాయం 4.4 శాతం పుంజుకుని రూ. 17,000 కోట్లను తాకింది. దేశీయంగా హోల్‌సేల్ అమ్మకాలు 14 శాతం క్షీణించి 82,400 యూనిట్లకు చేరగా.. రిటైల్ విక్రయాలు ఇదే స్థాయిలో నీరసించి 77,600 యూనిట్లకు పరిమితమయ్యాయి. ప్రయాణికుల వాహన విభాగం ఆదాయం 11 శాతం ఎగసి రూ. 12,800 కోట్లను తాకినట్లు కంపెనీ ఈడీ గిరీష్ వాగ్ తెలియజేశారు. అమ్మకాలు 8 శాతం వృద్ధితో 1,40,400 యూనిట్లకు చేరినట్లు వెల్లడించారు. బలమైన జూన్ త్రైమాసిక ఆదాయాలతో బుధవారం (జులై 26) ట్రేడింగ్‌లో ఎన్ఎస్ఈలో టాటా మోటార్స్ షేర్లు 4 శాతానికి పైగా జంప్ చేసి 52 వారాల గరిష్ట స్థాయి రూ.665.40కి చేరుకున్నాయి. -
Infosys Q1 Results: అంచనాలు మిస్, రెవెన్యూ గైడెన్స్ కోత
Infosys Q1 results: దేశీయ రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ త్రైమాసికం ఫలితాల్లో అంచనాలను అందుకోలేకపోయింది. జూన్ 30తో ముగిసిన క్వార్టర్లో నికర లాభం 11 శాతం పెరిగి రూ.5,945 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.5,360 కోట్లతో పోలిస్తే లాభాలు 10.9 ఎగిసాయి. అయితే, రూ. 6,141 కోట్ల లాభం సాధిస్తుందన్న ఎనలిస్టుల అంచనాలనుమిస్ చేసింది. (లగ్జరీ కార్ల పిచ్చి! సూపర్ స్పోర్ట్స్‌కారు కొన్న బాలీవుడ్ యాక్టర్, వీడియో) స్థిరమైన కరెన్సీ (CC) పరంగా, కంపెనీ ఆదాయం సంవత్సరానికి 4.2 శాతం పెరిగి రూ. 37,933 కోట్లకు చేరుకుంది. అయితే ఈ త్రైమాసికంలో నిర్వహణ మార్జిన్ 20.8 శాతం వద్ద స్థిరంగా ఉంది. త్రైమాసికంలో దీని అట్రిషన్ 17.3 శాతానికి తగ్గింది. ప్రస్తుత ఏడాది కంపెనీ ఆదాయ మార్గదర్శకాన్ని 1 శాతం- 3.5 శాతానికి సవరించింది. ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్ 20-22 శాతంగా ఉంచింది. (మరో వివాదంలో ఓలా ఎలక్ట్రిక్: సోషల్ మీడియాలో ఫోటో వైరల్) క్యాస్ట్ ఆప్టిమైజేషన్‌పై తమ దృష్టి నేపథ్యంలో అనిశ్చిత స్థూల వాతావరణంలో క్యూ1లో ఆపరేటింగ్ మార్జిన్లు నిలకడగా ఉన్నాయని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిలంజన్ రాయ్ అన్నారు. 4.2 శాతం పటిష్టమైన Q1 వృద్ధిపట్ట ఇన్ఫోసిస్ సీఎండీ సలీల్ పరేఖ్ సంతృప్తిని వ్యక్తం చేశారు . భారీ ఒప్పందాల ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ ఇదే భవిష్యత్ వృద్ధికి బలమైన పునాదిని వేస్తుందన్నారు. (కాగ్నిజెంట్ సీఈవో కీలక నిర్ణయం: ఉద్యోగుల్లో ఉత్సాహం) ఇదీ చదవండి: సినిమాలకు బ్రేక్: సమంతకు ఆర్థికంగా అన్ని కోట్లు నష్టమా? -
ఇండస్ఇండ్ బ్యాంక్ లాభం జూమ్.. భారీగా పెరిగిన ఆదాయం
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం వార్షికంగా 30 శాతం జంప్‌చేసి రూ. 2,124 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,631 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇందుకు మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం సహకరించాయి. మొత్తం ఆదాయం రూ. 10,113 కోట్ల నుంచి రూ. 12,939 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం పుంజుకుని రూ. 4,867 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు నామమాత్రంగా మెరుగుపడి 4.29 శాతానికి చేరాయి. ఇతర ఆదాయం 14 శాతం వృద్ధితో రూ. 2,210 కోట్లుగా నమోదైంది. ప్రొవిజన్లు రూ. 1,251 కోట్ల నుంచి రూ. 991 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.35 శాతం నుంచి 1.94 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు 0.67 శాతం నుంచి 0.58 శాతానికి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో ఇండస్ఇండ్ షేరు నామ మాత్రంగా తగ్గి రూ. 1,390 వద్ద క్లోజైంది. -
క్యూ1లో పేటీఎమ్ జోరు: జీఎంవీ 37 శాతం జూమ్
న్యూఢిల్లీ: పేటీఎమ్ బ్రాండు ఫిన్‌టెక్ దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహక పనితీరు ప్రదర్శించింది. ఏప్రిల్-జూన్(క్యూ1)లో స్థూల వాణిజ్య విలువ(జీఎంవీ) 37 శాతం జంప్‌చేసి రూ. 4.05 లక్షల కోట్లకు చేరినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది (2022-23) క్యూ1లో రూ. 2.96 లక్షల కోట్లుగా నమోదైంది. కంపెనీ ప్లాట్‌ఫామ్ ద్వారా వ్యాపారస్తుల(మర్చంట్స్)కు జరిగిన చెల్లింపుల విలువను జీఎంవీగా పేర్కొనే సంగతి తెలిసిందే. (రియల్ ఎస్టేట్ దిగ్గజం రామ్కీ దూకుడు: ఈసారి రూ. 2 వేల కోట్ల బుకింగ్స్) కాగా.. పేటీఎమ్ ద్వారా పంపిణీ అయిన రుణాలు 2.5 రెట్లు ఎగసి రూ. 14,845 కోట్లను తాకినట్లు కంపెనీ వెల్లడించింది. గతేడాది క్యూ1లో రూ. 5,554 కోట్ల రుణాలు పంపిణీకాగా.. వీటి పరిమాణం సైతం 85 లక్షల నుంచి 51 శాతం జంప్‌చేసి 1.28 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. మరిన్ని బిజినెస్ వార్తలు అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
ఓయోకు నిర్వహణ లాభాలు
న్యూఢిల్లీ: ఆతిథ్యం, ప్రయాణ సేవల(ట్రావెల్ టెక్) కంపెనీ ఓయో ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో మొత్తం ఆదాయం రూ. 1,459 కోట్లను అధిగమించింది. రూ. 7.27 కోట్ల సర్దుబాటు తదుపరి నిర్వహణా(ఇబిటా) లాభం ఆర్జించింది. మార్చితో ముగిసిన గతేడాది (2021–22) ఆదాయం రూ. 4,781 కోట్లను తాకగా.. అంతక్రితం ఏడాది(2020–21) దాదాపు రూ. 3,962 కోట్ల టర్నోవర్ సాధించింది. గతేడాది దాదాపు రూ. 472 కోట్ల నిర్వహణా(ఇబిటా) నష్టం ప్రకటించింది. ఇక తాజా క్యూ1లో రూ. 414 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది రూ. 1,940 కోట్లమేర నికర నష్టం నమోదైంది. కాగా.. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా కంపెనీ గతేడాది అక్టోబర్‌లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను సమర్పించిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా ఆర్థిక ఫలితాలను సెబీకి దాఖలు చేసింది. చదవండి: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు: కొనే ముందు ఇవి గుర్తుపెట్టుకోండి, లేదంటే బేబుకి చిల్లే! -
క్యూ1లో ముడివ్యయాల ఎఫెక్ట్
ముంబై: దేశీ కార్పొరేట్లకు ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ముడివ్యయాలు భారంగా పరిణమించినట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదిక పేర్కొంది. దీంతో ఏప్రిల్–జూన్(క్యూ1)లో నిర్వహణా లాభ మార్జిన్లు సగటున 2.13 శాతంమేర క్షీణించినట్లు తెలియజేసింది. వెరసి క్యూ1లో ఆదాయం 39 శాతం జంప్‌చేసినప్పటికీ ముడివ్యయాల ద్రవ్యోల్బణ ప్రభావంతో ఇబిటా మార్జిన్లు 17.7 శాతానికి పరిమితమైనట్లు వివరించింది. కమోడిటీ, ఇంధన ధరల పెరుగుదలను కంపెనీలు వినియోగదారులకు బదిలీ చేయడంతో ఆదాయంలో వృద్ధి నమోదైనట్లు తెలియజేసింది. అయితే వీటి కారణంగా లాభదాయకత నీరసించినట్లు తెలియజేసింది. ఫైనాన్షియల్ రంగ సంస్థలను మినహాయించి 620 లిస్టెడ్ కంపెనీలను నివేదికకు ఇక్రా పరిగణించింది. నివేదిక ప్రకారం..యుద్ధం ప్రభావం రష్యా– ఉక్రెయిన్ యుద్ధంతో ఎదురైన సరఫరా సవాళ్లు సైతం మార్జిన్లు మందగించేందుకు కారణమయ్యాయి. అయితే ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి మార్జిన్లు పుంజుకునే వీలుంది. గతేడాది(2021–22) తొలి క్వార్టర్లో కరోనా మహామ్మారి రెండో వేవ్ కారణంగా అమ్మకాలు దెబ్బతినడం.. ఈ ఏడాది క్యూ1 అమ్మకాల్లో వృద్ధికి దోహదం చేసింది. పలు రంగాలలో ప్రొడక్టుల ధరల పెంపు సైతం దీనికి జత కలిసింది. కాగా.. గ్రామీణ ప్రాంతాల నుంచి కొన్ని రంగాలకు డిమాండ్ తగ్గింది. ఇది ఇటు అమ్మకాలు, అటు లాభదాయకతకు కొంతమేర చెక్ పెట్టాయి. ఇక రంగాలవారీగా చూస్తే.. హోటళ్లు, విద్యుత్, రిటైల్, చమురు– గ్యాస్ విభాగాలు క్యూ1లో ఊపందుకోగా.. ఎయిర్‌లైన్స్, నిర్మాణం, క్యాపిటల్ గూడ్స్, ఐరన్ అండ్ స్టీల్ వెనకడుగు వేశాయి. పలు ప్రొడక్టులకు ధరల పెంపు చేపట్టిన ఎఫ్ఎంసీజీ రంగంలో ఓ మాదిరి వృద్ధి నమోదైంది. -
విప్రో ఉద్యోగులకు శుభవార్త!
సెప్టెంబర్ 1నుంచి ఉద్యోగుల జీతాల పెంపు, హైక్స్‌పై ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో స్పందించింది. ఉద్యోగుల జీత భత్యాల విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది. ఇప్పటికే తాము తీసుకున్న నిర్ణయంపైనే కట్టుబడి ఉన్నామని తెలిపింది. దేశంలో ఐటీ రంగం రోజురోజుకి వృద్ధి చెందుతుంది. దీంతో అవకాశాలు పెరిగిపోయాయి. అందుకే అట్రిషన్ రేటును నియంత్రించడం, కొత్త టాలెంట్‌ను గుర్తించి వారికి అవకాశాలు కల్పించేలా విప్రో తన ఉద్యోగులకు బోనస్‌లు, ఇంక్రిమెంట్లు భారీగా పెంచే అవకాశం ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదే సమయంలో ద్రవ్యోల్బణం ప్రభావం ఉద్యోగుల జీతాలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటూ మరికొన్ని నివేదికలు హైలెట్ చేశారు. ఈ నేపథ్యంలో జీతాల పెంపులో ఎలాంటి మార్పులు లేవని, సెప్టెంబర్ నుంచి శాలరీ హైక్ అమల్లోకి వస్తాయని విప్రో ప్రకటించింది. జూలై నుండి విప్రో ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వడం ప్రారంభించింది. ఇందులో భాగంగా కంపెనీ తన టాప్ పెర్ఫార్మర్లకు, మిడ్ నేజ్మెంట్ స్థాయి వరకు ప్రమోషన్లను అందించాలని నిర్ణయించుకుంది. సెప్టెంబర్‌లో ఆ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది' అని విప్రో తెలిపింది. -
2022-23 క్యూ1 ఫలితాలు: టాటా కన్జూమర్ లాభం, ఎంతంటే?
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 38 శాతం జంప్‌చేసి రూ. 277 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 200 కోట్లు మాత్రమే ఆర్జించింది. వ్యయ నియంత్రణలు, ధరల పెంపు లాభాలు పుంజుకునేందుకు దోహదం చేసింది. మొత్తం ఆదాయం సైతం 11 శాతం ఎగసి రూ. 3,327 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 3,008 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఆదాయంలో దేశీ వాటా 9 శాతం వృద్ధితో రూ. 2,145 కోట్లను తాకగా.. అంతర్జాతీయ బిజినెస్ సైతం 9 శాతం పుంజుకుని రూ. 837 కోట్లకు చేరింది. నాన్‌బ్రాండెడ్ బిజినెస్ రూ. 278 కోట్ల నుంచి రూ. 352 కోట్లకు బలపడింది. ఈ ఫలితాల నేపథ్యంలో టాటా కన్జూమర్షేరు బీఎస్ఈలో 0.25 శాతం లాభపడి రూ. 790 వద్ద ముగిసింది. -
అంచనాలకు మించి.. భారీ లాభాల్లో ప్రభుత్వ రంగ సంస్థ!
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం కోల్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం రెండు రెట్లుపైగా ఎగసి రూ. 8,834 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 3,174 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 39 శాతం ఎగసి రూ. 32,498 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 23,293 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఇక మొత్తం వ్యయాలు రూ. 21,626 కోట్ల నుంచి రూ. 23,985 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో బొగ్గు ఉత్పత్తి 124 మిలియన్ టన్నుల నుంచి దాదాపు 160 ఎంటీకి పెరిగింది. దేశీ బొగ్గు ఉత్పత్తిలో కంపెనీ 80 శాతం వాటాను ఆక్రమిస్తున్న విషయం విదితమే. థర్మల్ విద్యుత్ రంగం నుంచి భారీ డిమాండ్ నెలకొనడంతో 15.4 కోట్ల టన్నుల బొగ్గును విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. మొత్తం 17.75 ఎంటీ బొగ్గును విక్రయించినట్లు తెలియజేసింది. ఇంధన సరఫరా కాంట్రాక్టుల(ఎఫ్ఎస్ఏ) మార్గంలో టన్నుకి రూ. 1,442 చొప్పున ధర లభించినట్లు పేర్కొంది. వచ్చే ఏడాది(2023–24)కల్లా బిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది 70 కోట్ల టన్నుల ఉత్పత్తిని సాధించనున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో కోల్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో 2% వృద్ధితో రూ. 220 వద్ద ముగిసింది. -
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ లాభాల బాట
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) వంటి బ్యాంకింగ్ దిగ్గజాలు బలహీన పనితీరు కనబరిచినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. 2022 ఇదే కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.14,013 కోట్లు. ఇందుకు సంబంధించి గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► మొత్తం 12 బ్యాంకుల్లో ఎస్బీఐ, పీఎన్బీ, బీఓఐ లాభాలు 7–70 శాతంమేర క్షీణించాయి. ఈ రుణదాతల లాభాల క్షీణతకు బాండ్ ఈల్డ్, మార్క్–టు–మార్కెట్ (ఎంటీఎం) నష్టాల కారణం. కొనుగోలు ధర కంటే తక్కువ ధరకు మార్కెట్ ద్వారా ఆర్థిక ఆస్తుల విలువను నిర్ణయించినప్పుడు (లెక్కగట్టినప్పుడు) ఎంటీఎం నష్టాలు సంభవిస్తాయి. ► పైన పేర్కొన్న మూడు బ్యాంకులను మినహాయిస్తే, మిగిలిన తొమ్మిది బ్యాంకుల లాభాలు 3 నుంచి 117 శాతం వరకూ మొదటి త్రైమాసికంలో పెరిగాయి. ► పుణేకు చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధిక శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ బ్యాంక్ అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 208 కోట్ల లాభాన్ని నమోదుచేస్తే, తాజా సమీక్షా కాలంలో రూ. 452 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ► తరువాత 79 శాతం పెరిగిన లాభాలతో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నిలిచింది. బీఓబీ లాభాలు రూ.1,209 కోట్ల నుంచి రూ.2,168 కోట్లకు ఎగశాయి. ► లాభంలో పడిపోయినప్పటికీ, బ్యాంకుల ఉమ్మడి లాభంలో ఎస్బీఐ రూ. 6,068 కోట్లతో అత్యధిక స్థాయిలో నిలిచింది. మొత్తం లాభంలో 40 శాతం వాటాను ఎస్బీఐ మాత్రమే అందించింది. ఆ తర్వాత రూ.2,168 కోట్లతో బ్యాంక్ ఆఫ్ బరోడా నిలిచింది. 2021–22లో ఇలా... 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (రూ.31,816 కోట్లు) ఈ పరిమాణం రెట్టింపునకుపైగా పెరిగింది. 2020–21లో కేవలం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు (సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్) భారీ నష్టాలను నమోదుచేసుకున్నాయి. దీనితో మొత్తం ఉమ్మడి లాభం తక్కువగా నమోదయ్యింది. పలు ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ను కూడా ప్రకటించాయి. ఎస్బీఐ సహా తొమ్మిది బ్యాంకులు వాటాదారులకు 7,867 కోట్ల రూపాయల డివిడెండ్లను ప్రకటించాయి. 2020–21 యూటర్న్! నిజానికి బ్యాంకింగ్‌కు 2020–21 చక్కటి యూ టర్న్ అనే భావించాలి. 2015–16 నుంచి 2019–20 వరకూ వరుసగా ఐదు సంవత్సరాలలో బ్యాంకింగ్ మొత్తంగా నష్టాలను నమోదుచేసుకుంది. 2017–18లో అత్యధికంగా రూ.85,370 కోట్ల నష్టం చోటుచేసుకుంది. తరువాతి స్థానాల్లోకి వెళితే, 2018–19లో రూ.66,636 కోట్లు, 2019–20లో రూ.25,941 కోట్లు, 2015–16లో రూ.17,993 కోట్లు, 2016–17లో రూ.11,389 కోట్లు బ్యాంకింగ్ నష్టాల బాట నడిచింది. -
పేటీఎం నష్టాలు పెరిగాయ్! కానీ..
సాక్షి ముంబై: డిజిటల్ పేమెంట్స్ సంస్థ, వన్ 97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) కన్సాలిడేటెడ్ నష్టాలు జూన్ త్రైమాసికంలో మరింత పెరిగి రూ.644 కోట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ నష్టాలు రూ.380 కోట్లుగా ఉన్నాయి. ఆదాయం 89 శాతం పెరిగి రూ.1,680 కోట్లుగా నమోదైంది. గ్రాస్ మర్చండైజ్ వ్యాల్యూ రెట్టింపై రూ.3లక్షలకు చేరింది. నెలవారీ లావాదేవీలు నిర్వహించే యాక్టివ్ యూజర్ల సంఖ్య 49 శాతం పెరిగి 7.48 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. (ఇది చదవండి: ఝన్‌ఝన్‌వాలా జాక్‌పాట్:టైటన్ మెరిసెన్) పోస్ట్‌పెయిడ్ లోన్లు సంవత్సరానికి 486 శాతం పెరిగగా, పంపిణీ చేసిన రుణాల విలువ ఏడాది క్రితం రూ.447 కోట్లతో పోలిస్తే 656 శాతం పెరిగి రూ.3,383 కోట్లకు చేరుకుంది. ముఖ్యంగా వ్యక్తిగత రుణాల వ్యాపారం బాగా పెరిగిందని Paytm తెలిపింది. జూన్ త్రైమాసికంలో పేటీఎం రూ.5,554 కోట్ల రుణాలను మంజూరు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ పంపిణీ చేసిన రుణాలు రూ.632 కోట్లతో పోలిస్తే రుణ వ్యాపారం ఎన్నో రెట్లు పెరిగింది. వార్షికంగా చూస్తే రుణాల పంపిణీ రూ.24,000 కోట్లుగా ఉంటుందని పేటీఎం పేర్కొంది. చదవండి: కోవిడ్‌సెగ: రోడ్డెక్కని 2 లక్షల బస్సులు -
గెయిల్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ యుటిలిటీ దిగ్గజం గెయిల్ ఇండియా ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్-జూన్(క్యూ1)లో నికర లాభం 51 శాతం జంప్‌చేసి రూ. 3,251 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో కేవలం రూ. 2,157 కోట్లు ఆర్జించింది. నేచురల్ గ్యాస్ మార్కెటింగ్ మార్జిన్లు భారీగా మెరుగుపడటం ఇందుకు సహకరించింది. మొత్తం ఆదాయం రెట్టింపై రూ. 38,033 కోట్లను తాకింది. గత క్యూ1లో రూ. 17,702 కోట్ల టర్నోవర్ అందుకుంది. పన్నుకుముందు లాభం ఐదు రెట్లు ఎగసి రూ. 2,318 కోట్లకు చేరింది. గత క్యూ1లో ఇది రూ. 450 కోట్లు మాత్రమే. ప్రస్తుత సమీక్షా కాలంలో గెయిల్ స్టాండెలోన్ నికర లాభం 91 శాతం దూసుకెళ్లి రూ. 2,915 కోట్లయ్యింది. ఈ కాలంలో పైపులైన్లు, పెట్రోకెమికల్స్, భాగస్వామ్య సంస్థ ఈక్విటీ పెట్టుబడులకుగాను రూ. 1,975 కోట్లు వెచ్చించింది. ఫలితాల నేపథ్యంలో గెయిల్ షేరు గురువారం 0.6 శాతం నీరసించింది. శుక్రవారం కూడా అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ ఏకంగా 4 శాతం పతనమైంది. -
అదానీ టోటల్: ఆసక్తికర ఫలితాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) తొలి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ కంపెనీ అదానీ టోటల్ గ్యాస్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్-జూన్(క్యూ1)లో నికర లాభం దాదాపు యథాతథంగా రూ. 138 కోట్లకు చేరింది. ఆటోమొబైల్స్‌కు సీఎన్జీ విక్రయాలు 61 శాతం జంప్‌చేసి 109 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్లను తాకాయి. పైప్డ్ వంట గ్యాస్ అమ్మకాలు 3 శాతం పుంజుకుని 74 ఎంఎంఎస్సీఎంకు చేరాయి. అయితే సీఎన్జీ, వంటగ్యాస్ తయారీకి కొనుగోలు చేసిన సహజవాయు ధరలు మూడు రెట్లు ఎగసి రూ. 785 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. ఈ కాలంలో మొత్తం ఆదాయం రెట్టింపై రూ. 1,110 కోట్లను తాకింది. నిర్వహణా లాభం 6 శాతం బలపడి రూ. 228 కోట్లుగా నమోదైంది. చదవండి : OnePlus10T 5G: వన్‌ప్లస్ 10 టీ వచ్చేసింది..ఆఫర్ అదిరింది!