
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికంలో డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 33 శాతం ఎగసి రూ. 4,462 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 3,343 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 39 శాతం జంప్‌చేసి రూ. 19,831 కోట్లను దాటింది. గత క్యూ1లో రూ. 14,241 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment