న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో తన పనితీరును గణనీయంగా మెరుగుపరుచుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం భారీగా పెరిగి రూ.1,551 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.561 కోట్లుగా ఉండడం గమనార్హం.
మొత్తం ఆదాయం సైతం రూ.11,124 కోట్ల నుంచి రూ.15,821 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం రూ.14,359 కోట్లుగా ఉంది. స్థూల మొండి బకాయిలు జూన్ చివరికి 6.67%కి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 1.65%కి తగ్గాయి. ఎన్‌పీఏలకు కేటాయింపులు తాజాగా ముగిసిన త్రైమాసికంలో ఇవి రూ.777 కోట్లకు పరిమితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment