Bank of India
-
బీవోఐలో రూ. 227 కోట్ల ఫ్రాడ్
న్యూఢిల్లీ: గుప్తా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థ రూ. 227 కోట్ల మేర రుణం తీసుకుని, మోసం చేసినట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) వెల్లడించింది. ఈ ఖాతాను మొండిపద్దుగా (ఎన్పీఏ) వర్గీకరించి, రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించింది. రూ. 227 కోట్లకు గాను రూ. 213 కోట్లు ప్రొవిజనింగ్ చేసినట్లు బ్యాంకు తెలిపింది. ఒరిస్సాకు చెందిన గుప్తా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటు పంజాబ్ నేషనల్ బ్యాంకులో (పీఎన్బీ) కూడా రూ. 271 కోట్ల ఫ్రాడ్‌కి పాల్పడింది. పీఎన్బీ కూడా దీన్ని ఎన్పీఏగా వర్గీకరించి, ప్రొవిజనింగ్ చేసి, రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో బీవోఐ నికర లాభం 35% పెరిగి రూ. 1,870 కోట్ల నుంచి రూ. 2,517 కోట్లకు చేరగా, ఆదాయం రూ.16,411 కోట్ల నుంచి రూ.19,957 కోట్లకు ఎగసింది. -
వీళ్లు మామూలోళ్లు కాదు.. నకిలీ బంగారం కుదువపెట్టి లోన్లు
సాక్షి, హైదరాబాద్: బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖైరతాబాద్ బ్రాంచ్‌లో ‘పసిడి కుంభకోణం’ చోటుచేసుకుంది. నకిలీ బంగారాన్ని కుదువపెట్టి 27 మంది గోల్డ్ లోన్లు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో బ్యాంకు అధికారిక అప్రైజర్‌తో పాటు ఇద్దరు ఉద్యోగులు సహకరించారు. బ్యాంక్ ఉన్నతాధికారులు శనివారం సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.. దరఖాస్తుదారులతో కలిసి పథక రచన.. అంబర్‌పేట గోల్నాక ప్రాంతానికి చెందిన డి.భానుచందర్ ఖైరతాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కు అధికారిక అప్రైజర్‌గా పని చేస్తున్నారు. కుదువపెట్టడానికి వచి్చన బంగారాన్ని పరిశీలించే ఈయన దాని నాణ్యత, బరువు తదితరాలను నిర్ధారిస్తారు. వీటి ఆధారంగానే బ్యాంకు అధికారులు దరఖాస్తుదారుకు రుణం మంజూరు చేస్తారు. తార్నాకకు చెందిన మహ్మద్ కలీం బేగ్, అలీజాపూర్కు చెందిన ఆరిఫ్ అహ్మద్ సయీద్ ఇదే బ్యాంకులో రుణాల మంజూరు ఉద్యోగులుగా పని చేస్తున్నారు. ఈ ముగ్గురూ సూత్రధారులుగా కొందరు కస్టమర్లు, గోల్డ్‌లోన్ దరఖాస్తుదారులతో కలిసి భారీ స్కెచ్ వేశారు. నకిలీ బంగారు ఆభరణాలు కుదువపెట్టి రుణాలు తీసుకున్నారు. బంగారం నాణ్యతను భానుచందర్ ధ్రువీకరించగా.. మిగిలిన ఇద్దరూ ఆ లోన్లు ప్రాసెస్ చేశారు. ఇలా ఈ ఏడాది ఏప్రిల్–ఆగస్టు మధ్య మొత్తం 27 మంది 44 గోల్డ్‌లోన్స్ తీసుకున్నారు. ఇది ప్రస్తుతం అసలు–వడ్డీతో కలిపి రూ.4.51 కోట్లకు చేరింది. ఈ ఏడాది జూలై 26న కలీం బేగ్ ఖైరతాబాద్‌లోని క్రెడిట్ డిపార్ట్మెంట్ నుంచి సిద్దిపేట బ్రాంచ్‌కు మేనేజర్‌గా బదిలీ అయ్యారు. అక్కడ ఆగస్టు 14–20 తేదీల మధ్యలో వహీదాభాను, హమీద్ సయీద్, సయ్యద్ ఖాదర్, షేక్ రేష్మా పేర్లతో అయిదు గోల్డ్లోన్లు మంజూరు చేశారు. వీరు కుదువపెట్టిన బంగారం నాణ్యత, బరువులను భానుచందర్ ధ్రువీకరించారు. అప్పు తీసుకున్న వాళ్లు, బంగారం నాణ్యతను ఖరారు చేసిన అప్రైజర్ హైదరాబాద్‌కు చెందిన వాళ్లు కావడం, సిద్దిపేట వరకు వచ్చి రుణం తీసుకోవడం, గతంలో కలీం బేగ్ హైదరాబాద్‌లో పని చేసి ఉండటం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న బ్యాంకు ఉన్నతాధికారులు అనుమానించారు. వెలుగు చూసిందిలా.. అదే బ్యాంక్‌నకు చెందిన మరో అప్రైజర్‌తో అయిదు లోన్ ఖాతాలకు సంబంధించిన బంగారానికి పరీక్షలు చేయించారు. ఈ నేపథ్యంలో అది నకిలీ బంగారంగా బయటపడింది. ఈ విషయం వెలుగులోకి రావడంతోనే కలీం బేగ్ రుణాలు చెల్లించి, లోన్ ఖాతాలు క్లోజ్ చేయడంతో బ్యాంకునకు ఎలాంటి ఆర్థిక నష్టం రాలేదు. భానుచందర్‌తో పాటు కలీం బేగ్ వ్యవహారాలను అనుమానించిన అధికారులు ఖైరతాబాద్ బ్రాంచ్ నుంచి ఇటీవల కాలంలో మంజూరైన గోల్డ్లోన్లపై దృష్టి పెట్టారు. వేరే అప్రైజర్లతో తనిఖీలు చేయించగా... 44 గోల్డ్‌లోన్లకు సంబంధించి 27 మంది ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం నకిలీదిగా తేలింది. ఖైరతాబాద్, బషీర్‌బాగ్ బ్రాంచ్‌ల నుంచి వీళ్లు తీసుకున్న రుణం, దాని వడ్డీ రూ.4.51 కోట్లుగా లెక్కతేలింది. ఖైరతాబాద్ బ్రాంచ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కె.బాలగోపాలన్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. -
‘స్టార్ ధన్ వృద్ధి’.. బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త స్కీమ్
బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ (FD) స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఇటీవల రూ. 3 కోట్లలోపు డిపాజిట్లపై ఎఫ్డీ వడ్డీ రేట్లను సవరించిన బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అందులో భాగంగా అధిక రాబడిని అందించే ‘స్టార్ ధన్ వృద్ధి’అనే పేరుతో కొత్త ప్రత్యేక ఎఫ్డీ పథకాన్ని ప్రవేశపెట్టింది.బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించిన ఎఫ్డీ వడ్డీ రేట్లు సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వచ్చాయి. మార్పుల తర్వాత, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 7 రోజుల నుండి 10 సంవత్సరాల కాలవ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 7.25 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ రేట్లు సాధారణ ప్రజలకు రూ.3 కోట్ల లోపు డిపాజిట్లకు వర్తిస్తాయి.‘స్టార్ ధన్ వృద్ధి’ గురించి..స్టార్ ధన్ వృద్ధి పథకం అనేది పరిమిత-సమయ ఎఫ్డీ స్కీమ్. ఇది 333 రోజుల స్థిర కాలవ్యవధికి 7.25 శాతం ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు అయితే ఈ పథకం కింద మరింత మెరుగైన రాబడి లభిస్తుంది.ఈ స్కీమ్ కింద సాధారణ పౌరులకు 7.25 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు (వయస్సు 60-80 ఏళ్లు ) 7.75%, సూపర్ సీనియర్ సిటిజన్లు ( వయస్సు 80 ఏళ్లకు పైబడి) 7.90 శాతం వడ్డీని బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తుంది. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎఫ్డీ.. వడ్డీ ఎంతంటే?
బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కొత్త ఫిక్స్డ్ డిపాజిట్‌ను ప్రకటించింది. 666 రోజుల ఎఫ్డీని ప్రారంభించింది. ఇది రూ .2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ మొత్తాలపై సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.95 శాతం వరకు వడ్డీని అందిస్తుంది.666 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై సూపర్ సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.95 శాతం ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తాయి. 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు వ్యక్తులను సూపర్ సీనియర్ సిటిజన్లుగా వ్యవహరిస్తారు.ఈ 666 రోజుల ఎఫ్డీపై సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం, సాధారణ కస్టమర్లకు 7.30 శాతం వడ్డీ లభిస్తుంది. సవరించిన వడ్డీ రేట్లు దేశీయ, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ రూపాయి టర్మ్ డిపాజిట్లకు వర్తిస్తాయి. ఇవి జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్‌పై రుణం పొందే సౌలభ్యం, ప్రీమెచ్యూర్ విత్‌డ్రా సదుపాయం అందుబాటులో ఉంది.కస్టమర్లు, సాధారణ ప్రజలందరూ ఈ పెట్టుబడి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏ బ్రాంచిలోనైనా ఈ ఎఫ్డీని తెరవచ్చు. అలాగే బీఓఐ ఓమ్ని నియో యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ ఎఫ్డీని తెరిచే అవకాశం ఉంది. -
ఈఎమ్ఐ కట్టే వారికి బిగ్ షాక్! ఆ మూడు బ్యాంకుల్లో..
ప్రముఖ దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ 'ఐసీఐసీఐ'తో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులైన పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కీలకమైన కొత్త నిర్ణయాలు తీసుకున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, మూడు బ్యాంకులు తమ 'మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్ల'ను (MCLR) సవరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇది బహుశా కష్టమర్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ రూల్స్ ఇప్పటికే (2023 ఆగష్టు 01) అమలులోకి వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్లు బ్యాంకులు ఇచ్చే లోన్ మీద అమలు చేసే ఒక ప్రామాణిక వడ్డీ. ఒక వేలా ఎంసీఎల్ఆర్ రేట్లు పెరిగితే దీనికి అనుబంధంగా ఉండే వెహికల్, పర్సనల్, హోమ్ లోన్ వంటి అన్ని ఈఎమ్ఐలు ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) కొత్త నిబంధనల ప్రకారం ఐసీఐసీఐ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్లను 5 బేసిస్ పాయింట్ల వరకు పెంచినట్లు తెలుస్తోంది. అన్ని కాలవ్యవధులకు ఇది వర్తిస్తుందని సమాచారం. ఈ కారణంగా ఒక నెల ఎంసీఎల్ఆర్ రేట్లు 8.35 శాతం నుంచి 8.40 శాతానికి పెరిగింది. అదే సమయంలో 3 & 6 నెలల కాలానికి వరుసగా 8. 41 శాతం, 8.80 శాతానికి చేరాయి. ఇదీ చదవండి: నెలకు రూ. 1 లక్ష.. 25 ఏళ్ళు రావాలంటే? ఇలా చేయండి! పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank) ఇప్పటికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఎంసీఎల్ఆర్ రేట్లు యధాతధంగా ఉన్నట్లు సమాచారం. కావున బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఇప్పుడు ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8.10 శాతంగా ఉంది. ఇక ఒక నెల, మూడు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ వరుసగా 8.20 శాతం, 8.30 శాతం, 8.50 శాతంగా ఉన్నాయి. ఇదీ చదవండి: ఇండియన్ మార్కెట్లోని టాప్ 5 హైబ్రిడ్ కార్లు - వివరాలు బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank Of India) ఇక చివరగా బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే.. ఇది కూడా కొత్త నిర్ణయాలను అమలు చేసినట్లు తెలుస్తోంది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ రేట్లు 7.95 శాతం ఉండగా.. ఒక నెల, మూడు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లు వరుసగా 8.15 శాతం, 8.30 శాతం, 8.50 శాతంగా ఉంది. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా మెరుగైన పనితీరు.. భారీగా పెరిగిన లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో తన పనితీరును గణనీయంగా మెరుగుపరుచుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం భారీగా పెరిగి రూ.1,551 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.561 కోట్లుగా ఉండడం గమనార్హం. మొత్తం ఆదాయం సైతం రూ.11,124 కోట్ల నుంచి రూ.15,821 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం రూ.14,359 కోట్లుగా ఉంది. స్థూల మొండి బకాయిలు జూన్ చివరికి 6.67%కి తగ్గాయి. నికర ఎన్పీఏలు 1.65%కి తగ్గాయి. ఎన్పీఏలకు కేటాయింపులు తాజాగా ముగిసిన త్రైమాసికంలో ఇవి రూ.777 కోట్లకు పరిమితమయ్యాయి. -
ప్రభుత్వానికి బీవోఐ డివిడెండ్ రూ. 668 కోట్లు చెల్లింపు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి(2022–23)గాను పీఎస్‌యూ.. బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లించింది. షేరుకి రూ. 2 చొప్పున ప్రభుత్వానికి రూ. 668 కోట్లకుపైగా అందించింది. బ్యాంక్ ఎండీ రజనీష్ కర్ణాటక్ ఆర్థిక సర్వీసుల కార్యదర్శి వివేక్ జోషి సమక్షంలో డివిడెండ్ చెక్కును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేశారు. 2023 మే 30న బ్యాంకు డైరెక్టర్ల బోర్డు షేరుకి 20 శాతం చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు అంగీకరించింది. గతేడాది బీవోఐ నికర లాభం 18 శాతంపైగా బలపడి రూ. 4,023 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22)లో రూ. 3,405 కోట్లు మాత్రమే ఆర్జించింది. మార్చితో ముగిసిన గతేడాది బ్యాంక్ నిర్వహణ లాభం 34 శాతం జంప్‌చేసి రూ. 9,988 కోట్లకు చేరింది. -
ఎఫ్డీ రేట్ల పెంపు.. అత్యధికంగా 7.65 శాతం వడ్డీ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడాది కాల ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీలు) రేట్లను పెంచింది. రూ.2 కోట్ల వరకు డిపాజిట్లు చేసే రిటైల్ ఇన్వెస్టర్లకు ఏడాది కాల డిపాజిట్‌పై 7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇది ఇంతకుముందు 6 శాతం ఉండేది. అంటే 100 బేసిస్ పాయింట్లను బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది. అదే 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఏడాది కాల ఎఫ్డీపై 7.50 శాతం, 80 ఏళ్లు నిండిన వారికి 7.65 శాతం ఇస్తున్నట్టు బ్యాంక్ ప్రకటించింది. తాజా రేట్ల సవరణ తర్వాత ఏడు రోజుల నుంచి పదేళ్ల కాలం వరకు డిపాజిట్లపై రేట్లు 3–7 శాతం మధ్య ఉన్నాయి. కొత్త వడ్డీ రేట్లు దేశీయ, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ డిపాజిట్లకు వర్తిస్తాయి. -
వృద్ధుల కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషల్ డిపాజిట్ స్కీమ్!
ముంబై: వృద్ధులకు ఆర్థికంగా మరింత రక్షణ అవసరం కావడంతో, దీన్ని దృష్టిలో పెట్టుకుని ‘శుభ్ ఆరంభ్ డిపాజిట్’ స్కీమ్‌ను బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 60 ఏళ్లు నిండిన వృద్ధుల కోసం తీసుకొచ్చిన ఈ డిపాజిట్ పథకంలో అదనంగా 0.50 శాతం రేటును ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. 80 ఏళ్లు నిండిన వారికి 0.65 శాతం అదనంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. 501 రోజుల ఈ డిపాజిట్ స్కీమ్‌లో 60 ఏళ్లు నిండిన వారికి వడ్డీ రేటు 7.65 శాతం, 80 ఏళ్లు నిండిన వారికి 7.80 శాతం లభిస్తుంది. ఇక 7 - 10 ఏళ్ల కాల వ్యవధుల డిపాజిట్లపైనా ఆకర్షణీయమైన వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. -
హెచ్డీఎఫ్సీ, పీఎన్బీ, బీవోఐ రుణ రేట్ల పెంపు
న్యూఢిల్లీ: గృహ రుణాల ప్రముఖ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీతోపాటు, ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) రుణాల రేట్లను పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించాయి. సవరించిన రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపాయి. కనీస రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును హెచ్డీఎఫ్సీ 0.25 శాతం పెంచి 9.20 శాతానికి చేర్చింది. అయితే, 760 కంటే మించి క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి 8.70 శాతానికే గృహ రుణాన్ని ఆఫర్ చేస్తోంది. పీఎన్బీ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.10% పెంచింది. దీంతో పీఎన్బీ ఏడాది కాల ఎంసీఎల్ఆర్ రేటు 8.5%కి చేరింది. ఆటో, వ్యక్తిగత, గృహ రుణాలను ఈ రేటు ఆధారంగానే బ్యాంకు జారీ చేస్తుంటుంది. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎంసీఆర్ఎల్ రేటును 0.10% పెంచుతున్నట్టు ప్రకటించింది. ఆర్బీఐ ఎంపీసీ ఫిబ్రవరి సమీక్షలో రెపో రేటును 0.25 శాతం పెంచడం తెలిసిందే. ఇక గతేడాది మే నెల నుంచి చూసుకుంటే మొత్తం పెంపు 2.50 శాతంగా ఉంది. -
బ్యాంకింగ్ బాదుడు.. రెడీగా ఉండండి, ఈ భారం కస్టమర్లదే!
రెపోరేట్ల పెంపుతో బ్యాంకులు ఖాతాదారులకు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లు పెంచుతున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ, ప్రభుత్వ రంగం బ్యాంక్ ‘బ్యాంక్ ఆఫ్ ఇండియా’ రుణ రేట్లను పెంచాయి. అయితే తాజాగా మరో ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’(బీవోబీ) ఎంసీఎల్ఆర్ రేటును 30 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. నవంబర్ నెలలో బీవోబీ ఎంసీఎల్ఆర్ రేటును పెంచింది. అప్పుడు రేట్ల పెంపు 15 బేసిస్ పాయింట్లుగా ఉంది. ఈ రుణ రేటు పెంపు నిర్ణయం డిసెంబర్ 12 నుంచి అమల్లోకి రానుంది. బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు పెరగడం వల్ల హౌసింగ్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్, ఎంఎస్ఈ (Small Medium Enterprises) లోన్స్ వంటివి భారం కానున్నాయి. ఇప్పటికే లోన్ తీసుకున్న వారు రీసెట్ డేట్ నుంచి అధిక వడ్డీ చెల్లించుకోవాల్సి వస్తుంది. దీంతో బ్యాంకులకు కట్టే నెలవారీ ఈఎంఐ పెరుగుతుంది. బీవోబీలో ఎంసీఎల్ రేట్లు ఇక బీవోబీ ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో వడ్డీ రేటు 8.3 శాతానికి చేరింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 7.75 శాతం నుంచి 8.05 శాతానికి చేరింది. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 7.25 శాతం నుంచి 7.5 శాతానికి ఎగసింది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.9 శాతం నుంచి 8.15 శాతానికి పెరిగింది. -
6,432 పీఓ పోస్ట్‌లకు నోటిఫికేషన్.. ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం..
బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారా.. బ్యాంకు కొలువులో చేరాలనుకుంటున్నారా.. అయితే.. మీకు ఓ చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది! ఏడు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో) హోదాలో.. అడుగుపెట్టే అవకాశం మీ ముంగిట నిలిచింది! అదే.. ఐబీపీఎస్.. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్మెంట్ ట్రైనీ నోటిఫికేషన్. సంక్షిప్తంగా ఐబీపీఎస్ సీఆర్పీ ఫర్ పీఓ/ఎంటీ!! మూడు దశల్లో ఉండే ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవచ్చు! 2023–24 సంవత్సరానికి ఐబీపీఎస్ సీఆర్పీ ఫర్ పీఓ/ఎంటీ నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం.. దేశంలో ఎస్బీఐ మినహా మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొలువుల భర్తీ కోసం ఏర్పాటైన సంస్థ.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్). ప్రతి ఏటా క్రమం తప్పకుండా క్లర్క్, పీఓ, స్పెషలిస్ట్ ఆఫీసర్స్.. పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. తాజాగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆయా బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్మెంట్ ట్రైనీ నియామక ప్రక్రియ ప్రారంభించింది. ఇందుకోసం సీఆర్పీ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ పీఓ / ఎంటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడు బ్యాంకులు.. 6,432 పోస్ట్‌లు ►ఐబీపీఎస్ సీఆర్పీ ఫర్ పీఓ/ఎంటీ (12)–2023–24 ద్వారా మొత్తం ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,432 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా 535, కెనరా బ్యాంక్ 2500, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 500, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ 253, యూకో బ్యాంక్ 550, యూనియన్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా 2094. ►వీటితోపాటు.. ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే నాటికి బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌ల నుంచి కూడా ఇండెంట్ వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో పోస్ట్‌ల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. అర్హతలు ►ఆగస్ట్ 22, 2022 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ►వయోపరిమితి: ఆగస్ట్ 1, 2022 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ (నాన్ క్రీమీ లేయర్) అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. మూడంచెల ఎంపిక ప్రక్రియ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పీఓ/ఎంటీ రిక్రూట్మెంట్ ప్రక్రియను ఐబీపీఎస్ మూడంచెల విధానంలో నిర్వహిస్తుంది. అవి.. ప్రిలిమినరీ; మెయిన్; పర్సనల్ ఇంటర్వ్యూ. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ టెస్ట్‌లు ఉంటాయి. ఈ ఆన్లైన్ పరీక్షల్లో నిర్దిష్ట కటాఫ్ మార్కులు సాధించిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులోనూ విజయం సాధించి తుది జాబితాలో నిలిస్తే ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అందజేస్తారు. ప్రిలిమినరీ రాత పరీక్ష.. ఇలా ►పీఓ/ఎంటీ ఎంపిక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ రాత పరీక్షను మూడు విభాగాల్లో వంద మార్కులకు నిర్వహిస్తారు. అవి.. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు–30 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 35 ప్రశ్నలు–35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి విభాగానికి పరీక్ష సమయం 20 నిమిషాలు. ►ప్రతి సెక్షన్‌లోనూ ఐబీపీఎస్ నిర్దిష్ట కటాఫ్ మార్కులను నిర్ణయిస్తుంది. ఆ కటాఫ్ మార్కుల జాబితాలో నిలిచిన వారికి మెయిన్ ఎగ్జామినేషన్‌కు అర్హత లభిస్తుంది. ►ప్రిలిమినరీలో నిర్దిష్ట కటాఫ్ మార్కుల ఆధారంగా.. ఒక్కో ΄ోస్ట్కు పది మంది చొప్పున (1:10 నిష్పత్తిలో)..మెయిన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్ 4 విభాగాలు.. 200 మార్కులు మెయిన్ ఎగ్జామినేషన్‌ను నాలుగు విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. రీజనింగ్ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 45 ప్రశ్నలు–60 మార్కులు, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్నెస్ 40 ప్రశ్నలు–40 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 35 ప్రశ్నలు–40 మార్కులు, డేటా అనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ 35 ప్రశ్నలు–60 మార్కులు.. ఇలా మొత్తం 155 ప్రశ్నలు–200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం మూడు గంటలు. ఇంగ్లిష్ లాంగ్వేజ్.. డిస్క్రిప్టివ్ టెస్ట్ మెయిన్ ఎగ్జామ్‌లో పేర్కొన్న ఆబ్జెక్టివ్ విభాగాలతోపాటు అదనంగా..ఇంగ్లిష్ డిస్క్రిప్టివ్ టెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు. ఈ విభాగంలో అభ్యర్థులు ఒక ఎస్సే, ఒక లెటర్ రైటింగ్ రాయాల్సి ఉంటుంది. దీనికి కేటాయించిన మార్కులు 25. సమయం 30 నిమిషాలు. దీని ద్వారా అభ్యర్థుల ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. మెయిన్‌తో΄ాటే అదే రోజు ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు. నెగెటివ్ నిబంధన ఆన్లైన్ విధానంలో..ఆబ్జెక్టివ్ టెస్ట్‌లుగా నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు పరీక్షల్లోనూ నెగెటివ్ మార్కింగ్ నిబంధన అమలవుతోంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. చివరగా.. ఇంటర్వ్యూ మెయిన్‌లో పొందిన మార్కుల ఆధారంగా.. సెక్షన్ వారీ కటాఫ్,ఓవరాల్ కటాఫ్‌లను నిర్దేశించి.. ఆ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు కేటాయించిన మార్కులు 100. అభ్యర్థులు తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు పొందాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 35శాతం మార్కులు సాధించాలి. ఈ అర్హత మార్కులు ΄÷ందిన వారినే ఇంటర్వ్యూ మెరిట్ జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ఇంటర్వ్యూలను.. ΄ోస్ట్లు భర్తీ చేస్తున్న బ్యాంకులు లేదా ఏదైనా ఒక బ్యాంక్ నోడల్ బ్యాంక్‌గా వ్యవహరించి వాటి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. 80:20 వెయిటేజీ విధానం అభ్యర్థుల తుది జాబితా రూపకల్పనలో వెయిటేజీ విధానాన్ని అమలు చేస్తున్నారు. మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనల్ ఇంటర్వ్యూలకు నిర్దేశిత వెయిటేజీలు పేర్కొన్నారు. మెయిన్‌కు 80 శాతం వెయిటేజీ, పర్సనల్ ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీని నిర్దేశించారు. అంటే.. మొత్తం వంద మార్కులకు సాధించిన మార్కుల ఆధారంగా తుది జాబితాను సిద్ధం చేస్తారు. ఈ జాబితాలో నిలిచిన అభ్యర్థులను ఆయా బ్యాంకుల్లో 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏర్పడే ఖాళీల్లో నియమిస్తారు. ముఖ్య సమాచారం ►దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. ►ఆన్లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు తేదీలు: ఆగస్ట్ 2 – ఆగస్ట్ 22,2022 ►ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆన్లైన్): అక్టోబర్‌లో ►మెయిన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ : నవంబర్‌లో ►పర్సనల్ ఇంటర్వ్యూలు: 2023 జనవరి/ఫిబ్రవరి నెలల్లో ►ప్రొవిజినల్ అలాట్మెంట్: 2023 ఏప్రిల్ నెలలో ►పూర్తి వివరాలకు వెబ్సైట్: www.ibps.in -
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ లాభాల బాట
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) వంటి బ్యాంకింగ్ దిగ్గజాలు బలహీన పనితీరు కనబరిచినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. 2022 ఇదే కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.14,013 కోట్లు. ఇందుకు సంబంధించి గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► మొత్తం 12 బ్యాంకుల్లో ఎస్బీఐ, పీఎన్బీ, బీఓఐ లాభాలు 7–70 శాతంమేర క్షీణించాయి. ఈ రుణదాతల లాభాల క్షీణతకు బాండ్ ఈల్డ్, మార్క్–టు–మార్కెట్ (ఎంటీఎం) నష్టాల కారణం. కొనుగోలు ధర కంటే తక్కువ ధరకు మార్కెట్ ద్వారా ఆర్థిక ఆస్తుల విలువను నిర్ణయించినప్పుడు (లెక్కగట్టినప్పుడు) ఎంటీఎం నష్టాలు సంభవిస్తాయి. ► పైన పేర్కొన్న మూడు బ్యాంకులను మినహాయిస్తే, మిగిలిన తొమ్మిది బ్యాంకుల లాభాలు 3 నుంచి 117 శాతం వరకూ మొదటి త్రైమాసికంలో పెరిగాయి. ► పుణేకు చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధిక శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ బ్యాంక్ అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 208 కోట్ల లాభాన్ని నమోదుచేస్తే, తాజా సమీక్షా కాలంలో రూ. 452 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ► తరువాత 79 శాతం పెరిగిన లాభాలతో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నిలిచింది. బీఓబీ లాభాలు రూ.1,209 కోట్ల నుంచి రూ.2,168 కోట్లకు ఎగశాయి. ► లాభంలో పడిపోయినప్పటికీ, బ్యాంకుల ఉమ్మడి లాభంలో ఎస్బీఐ రూ. 6,068 కోట్లతో అత్యధిక స్థాయిలో నిలిచింది. మొత్తం లాభంలో 40 శాతం వాటాను ఎస్బీఐ మాత్రమే అందించింది. ఆ తర్వాత రూ.2,168 కోట్లతో బ్యాంక్ ఆఫ్ బరోడా నిలిచింది. 2021–22లో ఇలా... 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (రూ.31,816 కోట్లు) ఈ పరిమాణం రెట్టింపునకుపైగా పెరిగింది. 2020–21లో కేవలం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు (సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్) భారీ నష్టాలను నమోదుచేసుకున్నాయి. దీనితో మొత్తం ఉమ్మడి లాభం తక్కువగా నమోదయ్యింది. పలు ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ను కూడా ప్రకటించాయి. ఎస్బీఐ సహా తొమ్మిది బ్యాంకులు వాటాదారులకు 7,867 కోట్ల రూపాయల డివిడెండ్లను ప్రకటించాయి. 2020–21 యూటర్న్! నిజానికి బ్యాంకింగ్‌కు 2020–21 చక్కటి యూ టర్న్ అనే భావించాలి. 2015–16 నుంచి 2019–20 వరకూ వరుసగా ఐదు సంవత్సరాలలో బ్యాంకింగ్ మొత్తంగా నష్టాలను నమోదుచేసుకుంది. 2017–18లో అత్యధికంగా రూ.85,370 కోట్ల నష్టం చోటుచేసుకుంది. తరువాతి స్థానాల్లోకి వెళితే, 2018–19లో రూ.66,636 కోట్లు, 2019–20లో రూ.25,941 కోట్లు, 2015–16లో రూ.17,993 కోట్లు, 2016–17లో రూ.11,389 కోట్లు బ్యాంకింగ్ నష్టాల బాట నడిచింది. -
బీవోఐ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 22 శాతం క్షీణించి రూ. 561 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 720 కోట్లు ఆర్జించింది. మొండి రుణాలు తగ్గినప్పటికీ అధిక వ్యయాలు ప్రభావం చూపాయి. మొత్తం ఆదాయం సైతం రూ. 11,641 కోట్ల నుంచి రూ. 11,124 కోట్లకు స్వల్పంగా బలహీనపడింది. అయితే వడ్డీ ఆదాయం 7 శాతం పుంజుకుని రూ. 9,973 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం మాత్రం 50 శాతం క్షీణించి రూ. 1,152 కోట్లకు పరిమితమైంది. నిర్వహణా వ్యయాలు 12 శాతం పెరిగి రూ. 3,041 కోట్లను తాకాయి. తగ్గిన ఎన్పీఏలు ప్రస్తుత సమీక్షా కాలంలో బీవోఐ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 13.51 శాతం నుంచి 9.30 శాతానికి వెనకడుగు వేశాయి. నికర ఎన్పీఏలు సైతం 3.35 శాతం నుంచి 2.21 శాతానికి దిగివచ్చాయి. ఇక కన్సాలిడేటెడ్ నికర లాభం 11 శాతం వెనకడుగుతో రూ. 658 కోట్లకు పరిమితంకాగా.. మొత్తం ఆదాయం రూ. 11,710 కోట్ల నుంచి రూ. 11,208 కోట్లకు తగ్గింది. ఫలితాల నేపథ్యంలో బీవోఐ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం పుంజుకుని రూ. 50 వద్ద ముగిసింది. -
బ్యాంక్‌తో పనిలేదు,మొబైల్ నుంచే ఎన్పీఎస్ అకౌంట్ ఓపెన్ చేయోచ్చు!
న్యూఢిల్లీ: బ్యాంకు ఆఫ్ ఇండియా (బీవోఐ), పింఛను నిధి నియంత్రణ సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) సంయుక్తంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాయి. కే–ఫిన్‌టెక్ సాయంతో నూతన ఎన్పీఎస్ చందాదారుల చేరిక కోసం దీన్ని తీసుకొచ్చాయి. బ్యాంకు ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవో ఏకే దాస్ సమక్షంలో పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ సుప్రతిమ్ బందోపాధ్యాయ దీన్ని ప్రారంభించారు. దీంతో మొబైల్ ఫోన్ నుంచే ఎన్పీఎస్ ఖాతా (స్వచ్ఛంద పింఛను ఖాతా) తెరవొచ్చు. ఎటువంటి పేపర్లు అవసరం లేకుండా, మొబైల్ ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఎన్పీఎస్ ఖాతాను తెరవొచ్చని పీఎఫ్ఆర్డీఏ, బీవోఐ ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి. ఎంతో సులభంగా, వేగంగా కేవలం కొన్ని క్లిక్‌లతో ఖాతా ప్రారంభించొచ్చని ప్రకటించాయి. ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. అది వెబ్ పేజీకి తీసుకెళుతుంది. అక్కడి డిజిటల్ దరఖాస్తును వివరాలతో పూర్తి చేయాలి. ఆధార్ నంబర్ ఇవ్వాలి. దీంతో డిజీలాకర్ సాయంతో ఫొటో, ఇతర వివరాలను ప్లాట్‌ఫామ్ తీసుకుని ప్రక్రియను పూర్తి చేస్తుంది. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా,ఫెడరల్ బ్యాంకుకు ఆర్బీఐ షాక్!
ముంబై: నియంత్రణపరమైన నిబంధనల అమలులో లోపాలు ఉన్నట్టు గుర్తించిన ఆర్బీఐ ఫెడరల్బ్యాంక్కు రూ.5.72 కోట్ల జరిమానా విధించింది. అలాగే, కేవైసీ నిబంధనలు కొన్ని పాటించనందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.70 లక్షల జరిమానాను విధిస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. బీమా బ్రోకింగ్, కార్పొరేట్ ఏజెన్సీ సర్వీసెస్ కోసం ఉద్యోగులకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వకుండా నిబంధనలను అమలు చేయడంలో ఫెడరల్ బ్యాంక్ విఫలమైనట్టు ఆర్బీఐ తెలిపింది. కేవైసీ నిబంధనలను అమలు చేయనందుకు గురుగ్రామ్‌కు చెందిన ధనిలోన్స్ అండ్ సర్వీసెస్‌కు సైతం ఆర్బీఐ 7.6 లక్షల జరిమానా విధించింది. -
బీవోఐ హైజంప్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో స్టాండెలోన్ నికర లాభం 142 శాతంపైగా జంప్ చేసి రూ. 606 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 250 కోట్లు ఆర్జించింది. అధిక వడ్డీ ఆదాయం, రుణాల నాణ్యత మెరుగుపడటం ఇందుకు సహకరించింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 58 శాతం ఎగసి రూ. 3,405 కోట్లను తాకింది. 2020–21లో రూ. 2,160 కోట్లు మాత్రమే ఆర్జించింది. వాటాదారులకు షేరుకి రూ.2 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. సీఆర్ఏఆర్ 17 శాతాన్ని అధిగమించగా.. ఈ ఏడాది(2022–23) రూ. 2,500 కోట్ల పెట్టుబడులను సమీకరించనున్నట్లు బ్యాంక్ తెలియజేసింది. మార్జిన్లు ప్లస్ ప్రస్తుత సమీక్షా కాలం(క్యూ4)లో బీవోఐ నికర వడ్డీ ఆదాయం 36 శాతం పుంజుకుని రూ. 3,986 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 2.01 శాతం నుంచి 2.58 శాతానికి మెరుగుపడ్డాయి. మార్చికల్లా స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 13.77 శాతం నుంచి 9.98 శాతానికి భారీగా తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 3.35 శాతం నుంచి 2.34 శాతానికి నీరసించాయి. కాగా.. రూ. 1,045 కోట్ల ఫ్యూచర్ గ్రూప్ రుణాలకు 100 శాతం కేటాయింపులు చేపట్టినట్లు బ్యాంక్ వెల్లడించింది. ఈ బాటలో రూ. 963 కోట్ల శ్రేఈ గ్రూప్ రుణాలకుగాను 50% ప్రొవిజన్లు చేపట్టినట్లు పేర్కొంది. -
ఫ్యూచర్ రిటైల్‌పై బీవోఐ దివాలా అస్త్రం
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఫ్యూచర్ రిటైల్‌పై బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) దివాలా అస్త్రం ప్రయోగించింది. దివాలా చర్యలు ప్రారంభించాలని కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో పిటిషన్ దాఖలు చేసింది. విజయ్ కుమార్ వీ అయ్యర్‌ను ఫ్యూచర్ రిటైల్ సంస్థ ఐఆర్పీ (మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్/లిక్విడేటర్)గా నియమించాలని ఎన్సీఎల్టీని బ్యాంక్ ఆఫ్ ఇండియా అభ్యర్థించింది. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో కొనసాగుతున్న వ్యాజ్యాలు, సంబంధిత ఇతర సమస్యల కారణం గా ఈ నెల ప్రారంభంలో ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్‌ఎల్‌ఆర్) తన రుణదాతలకు రూ. 5,322.32 కోట్లు చెల్లించడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో దివాలా కోడ్, 2016లోని 7వ సెక్షన్ కింద రుణ దాతల కన్షార్షియంకు నేతృత్వం వహిస్తున్న బీవోఐ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. తాను పిటిషన్ కాపీని అందుకున్నానని, న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటామని ఫ్యూచర్ గ్రూప్ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. వార్తా పత్రికల్లో ఇప్పటికే నోటీసులు.. బీవోఐ గత నెల వార్తా పత్రికలలో ఒక పబ్లిక్ నోటీసు జారీ చేస్తూ, ఫ్యూచర్ రిటైల్ ఆస్తులపై తన క్లెయిమ్‌ను ప్రకటించింది. కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ సంస్థ ఆస్తులతో లావాదేవీలు జరపరాదని ఈ ప్రకటన ద్వారా హెచ్చరించింది. 2020 ఆగస్టులో ఫ్యూచర్ గ్రూప్ ప్రకటించిన రూ.24,713 కోట్ల డీల్‌లో ఫ్యూచర్ రిటైల్ ఒక భాగం. ఈ డీల్‌లో భాగంగా రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 19 కంపెనీలను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్)కు విక్రయిస్తున్నట్లు గ్రూప్ ప్రకటించింది. ఈ ఒప్పంద ప్రతిపాదన ప్రకారం, 19 కంపెనీలు అన్నీ కలిసి ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక్క ఒక్క కంపెనీగా విలీనమై తదుపరి ఆర్ఆర్వీఎల్లకు బదిలీ అవుతాయి. 20 నుంచి సమావేశాలపై ఉత్కంఠ కాగా, రిలయన్స్‌తో డీల్ ఆమోదం కోసం 2022 ఏప్రిల్ 20–23 తేదీల మధ్య ఫ్యూచర్ గ్రూప్ కంపెనీలు తమ సంబంధిత వాటాదారులు రుణదాతలతో సమావేశాలను నిర్వహిస్తుండడం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. ఈ డీల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెజాన్ ఈ సమావేశాల నిర్వహణను తీవ్రంగా తప్పు బడుతుండడమే దీనికి కారణం. -
బీవోఐ జూమ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పీఎస్‌యూ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 90 శాతం జంప్‌చేసి రూ. 1,027 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 541 కోట్లు మాత్రమే ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 12,311 కోట్ల నుంచి రూ. 11,211 కోట్లకు క్షీణించింది. నికర వడ్డీ ఆదాయం సైతం రూ. 3,739 కోట్ల నుంచి రూ. 3,408 కోట్లకు బలహీనపడింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 13.25 శాతం నుంచి 10.46 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు మాత్రం 2.46 శాతం నుంచి 2.66 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 1,810 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 335 కోట్లకు పరిమితమయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 16.66 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో బీవోఐ షేరు ఎన్ఎస్ఈలో 3.5 శాతం పతనమై రూ. 56.4 వద్ద ముగిసింది. -
గృహ, వాహన రుణాలను తీసుకోనే వారికి గుడ్‌న్యూస్..!
గృహ, వాహన రుణాలను తీసుకోనే వారికి బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ అందించింది. గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లను వరుసగా 35 బేసిక్ పాయింట్స్, 50 బేసిక్ పాయింట్స్ మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గృహ రుణాలపై 6.50 శాతం, వాహన రుణాలపై 6.85 శాతం వడ్డీరేట్లకే రుణాలను బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించనుంది. ఈ వడ్డీరేట్లు అక్టోబర్ 18 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. చదవండి: స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌ట్యాప్స్‌పై డిస్కౌంట్లు వడ్డీరేట్ల తగ్గింపు డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉండనుంది. అంతకుముందు బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై 6.85 శాతం మేర, వాహన రుణాలపై 7.35 శాతం మేర వడ్డీ రేట్లు ఉండేవి. పండుగ సీజన్ సందర్భంగా పలు బ్యాంకింగ్ సంస్థలు వడ్డీరేట్లను తగ్గించాయి. పండుగ సీజన్ సందర్భంగా కొద్దిరోజుల క్రితం హోమ్లోన్స్, వెహికల్ లోన్స్‌పై పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా వడ్డీరేట్లను తగ్గించింది. చదవండి: సరికొత్త ఆఫర్...మనీ యాడ్ చేస్తే...20 శాతం బోనస్..! -
ఉద్యోగులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే శుభవార్త!
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) అదిరిపోయే శుభవార్త తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల కోసం "శాలరీ ప్లస్ అకౌంట్ స్కీమ్" పేరుతో ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఉద్యోగులు ఉచితంగా కోటి రూపాయల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. బ్యాంక్ ఆఫ్ ఇండియా తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ఈ సమాచారాన్ని షేర్ చేసింది. శాలరీ ప్లస్ అకౌంట్ స్కీమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) తన వెబ్ సైట్లో పేర్కొన్న సమాచారం ప్రకారం.. బీఓఐ శాలరీ ప్లస్ అకౌంట్ స్కీం కింద మూడు రకాల వేతన ఖాతాలు ఉన్నాయి. ఉద్యోగులు కేవలం కేవలం శాలరీ అకౌంట్ కింద మాత్రమే ఖాతా తెరిచే అవకాశం ఉంది.(చదవండి: పెట్రోల్-డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురాబోతున్నారా?) పారా మిలటరీ ఫోర్స్ ఉద్యోగులకు శాలరీ అకౌంట్ కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్వవిద్యాలయం, కళాశాల, ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులకు శాలరీ అకౌంట్ ప్రైవేట్ రంగ ఉద్యోగులకు శాలరీ అకౌంట్ రూ.కోటి వరకు ఉచిత యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ బీఓఐ శాలరీ ప్లస్ అకౌంట్ స్కీం కస్టమర్లకు ఎంతో సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ పథకం కింద, బ్యాంకు వేతన ఖాతాదారులకు రూ.30 లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ అందిస్తుంది. బ్యాంకు షేర్ చేసిన ట్వీట్ ప్రకారం వేతన ఖాతాదారుడికి రూ.కోటి ఉచిత ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కూడా అందిస్తుంది. A custom-made scheme specially crafted for Government employees! BOI presents Salary Plus Account Scheme For details, contact us on 1800 103 1906 or Visit https://t.co/hjQfbXn3I4 pic.twitter.com/M9z76cmigB — Bank of India (@BankofIndia_IN) September 11, 2021 వేతన ఖాతాదారులకు రూ. 2 లక్షల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం. ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కింద బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ లేనప్పటికీ రూ.2 లక్షల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఉచితంగా గోల్డ్ ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు(గోల్డ్ ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు) ఇస్తోంది. ఏడాదికి 100 చెక్స్ లీవ్స్ గల బుక్ ఉచితంగానే అందిస్తారు. డీమ్యాట్ ఖాతాల(డీమ్యాట్ అకౌంట్స్)పై ఎఎంసి ఛార్జ్ విధించరు. లోన్ల విషయంలో ఖాతాదారులకు 0.25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుంది. ప్రయివేట్ సెక్టార్ శాలరీ అకౌంట్ ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులు కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ ప్లస్ అకౌంట్ స్కీమ్ కింద ఖాతా ఓపెన్ చేయవచ్చు. నెలకు రూ.10,000 సంపాదించే వారు ఈ పథకం కింద వేతన ఖాతాలను తెరవవచ్చు. దీనికి మిమినాన్ బ్యాలెన్స్ అవసరం లేదు. వేతన ఖాతాదారుడు రూ.5 లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ అందిస్తుంది. అలాగే ఉచితంగా గ్లోబల్ డెబిట్ కార్డు పొందుతారు. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.3,000 కోట్ల క్యూఐపీ
న్యూఢిల్లీ: బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.3,000 కోట్ల నిధుల సమీకరణ కోసం క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ/సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ) ప్రారంభించాలని బుధవారం నిర్ణయం తీసుకుంది. వ్యాపార వృద్ధికి, నియంత్రణపరమైన కనీస అవసరాలను చేరుకునేందుకు నిధుల సమీకరణ చేపట్టనుంది. క్యూఐపీ ఫ్లోర్‌ప్రైస్‌గా (షేరు ధర) రూ.66.19 నిర్ణయించింది. క్యూఐపీ కోసం ఈ నెల 10–23 మధ్య బ్యాంక్ ఆఫ్ ఇండియా రోడ్‌షో కూడా నిర్వహించింది. యస్ బ్యాంకు, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ ట్రెజరీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఎడెల్వీజ్, ఎస్బీఐ లైఫ్, మిరే, కోటక్ లైఫ్, ఫెడరల్ బ్యాంకు తదితర ఇన్వెస్టర్లు ఇందులో పాల్గొన్నారు. ఫ్లోర్ ప్రైస్‌పై గరిష్టంగా 5 శాతం మించకుండా తగ్గింపును ఇచ్చే అవకాశం ఉందని బ్యాంకు తెలిపింది. క్యూఐపీ కింద షేరు కేటాయింపు ధర (తుది)పై ఈ నెల 30న క్యాపిటల్ ఇష్యూ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. బ్యాంకులో ప్రమోటర్‌గా ఉన్న కేంద్ర సర్కారుకు ప్రస్తుతం 90 శాతానికిపైనే వాటా ఉంది. తాజా క్యూఐపీ అనంతరం ప్రభుత్వ వాటా చెప్పుకోతగ్గంత దిగిరానుంది. దీంతో కనీస ప్రజల వాటా విషయంలో నిబంధనలను పాటించేందుకు మార్గం సుగమం అవుతుంది. -
బీఓఐ, పీఎన్బీలకు రూ.6 కోట్ల జరిమానా
ముంబై: బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం మొత్తం రూ.6 కోట్ల జరిమానా విధించింది. ఇందులో బీఓఐకి విధించిన జరిమానా రూ.4 కోట్లుకాగా, పీఎన్బీ విషయంలో ఈ మొత్తం రూ.2 కోట్లు. బ్యాంకింగ్ మోసాలకు సంబంధించిన నివేదికను ఆర్బీఐకి ఆలస్యంగా సమర్పించడం, అన్క్లైమ్డ్ బ్యాలెన్స్‌ను డీఈఏ (డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్) ఫండ్‌కు బదలాయించడంలో తాత్సారం వంటి అంశాలకు సంబంధించి నిబంధనలను పాటించకపోవడం దీనికి కారణమని రెండు వేర్వేరు ప్రకటనల్లో ఆర్బీఐ పేర్కొంది. చదవండి: ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు సెబీ షాక్.. భారీ జరిమానా -
బ్యాంక్ ఆఫ్ ఇండియా టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతేడాది(2020–21) చివరి క్వార్టర్లో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 250 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 3,571 కోట్లకుపైగా నికర నష్టాలు ప్రకటించింది. స్టాండెలోన్ ఫలితాలివి. అయితే మొత్తం ఆదాయం రూ. 12,216 కోట్ల నుంచి రూ. 11,380 కోట్లకు క్షీణించింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం లాభాల్లోకి ప్రవేశించింది. రూ. 2,160 కోట్ల స్టాండెలోన్ లాభం ఆర్జించింది. 2019–20లో రూ. 2,957 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 49,066 కోట్ల నుంచి రూ. 48,041 కోట్లకు వెనకడుగు వేసింది. క్యూ4లో తాజా స్లిప్పేజెస్ రూ. 7,368 కోట్లను తాకగా.. మొత్తం ప్రొవిజన్లు 70 శాతం తక్కువగా రూ. 1,844 కోట్లకు పరిమితమయ్యాయి. మార్జిన్లు డీలా మార్చికల్లా బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) 14.78 శాతం నుంచి 13.77 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 3.88 శాతం నుంచి 3.35 శాతానికి దిగివచ్చినట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో ఏకే దాస్ పేర్కొన్నారు. ఈ ఏడాది స్థూల ఎన్పీఏలను 2.5 శాతంవరకూ తగ్గించుకోనున్నట్లు చెప్పారు. అయితే దేశీయంగా నికర వడ్డీ మార్జిన్లు 3.18 శాతం నుంచి 2.16 శాతానికి నీరసించాయి. ఈ ఏడాది మార్జిన్లను 2.5 శాతానికి మెరుగుపరచుకోనున్నట్లు దాస్ తెలియజేశారు. కనీస మూలధన పెట్టుబడుల నిష్పత్తి(సీఏఆర్) 13.1 శాతం నుంచి 14.93 శాతానికి బలపడింది. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 3 శాతం జంప్‌చేసి రూ. 82.3 వద్ద ముగిసింది. ఈ కౌంటర్లో రెండు ఎక్సే్చంజీలలోనూ కలిపి దాదాపు 5 కోట్ల షేర్లు చేతులు మారడం గమనార్హం! -
నాలుగు బ్యాంకుల ప్రైవేటీకరణ!!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం నాలుగు మధ్య స్థాయి బ్యాంకులను ఎంపిక చేసినట్లు సమాచారం. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌తో మొదలయ్యే 2021–2022 ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకుల్లో రెండింటిని ప్రైవేటీకరించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. సంఖ్యాపరంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో సిబ్బంది ఒక మోస్తరుగానే ఉన్నందున ముందుగా ఆ బ్యాంకుతోనే ప్రైవేటీకరణ ప్రారంభం కావచ్చన్న అంచనా లు ఉన్నాయి. అలాగే ఐవోబీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటంతో దానిపై విధించిన ఆంక్షలను రిజర్వ్ బ్యాంక్ ఎత్తివేయొచ్చని, దీంతో అందులోనూ వాటాల విక్రయం సజావుగా జరగవచ్చని ఆశిస్తోంది. ప్రైవేటీకరణ ప్రక్రియ వాస్తవంగా ప్రారంభం కావడానికి 5–6 నెలలు పట్టేయొచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, ఉద్యోగుల సంఖ్య, ట్రేడ్ యూనియన్ల ఒత్తిళ్లు, రాజకీయపరమైన పరిణామాలు మొదలైనవి తుది నిర్ణ యంపై ప్రభావం చూపవచ్చని వివరించాయి. దీనివల్ల ఆయా బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయం ఆఖ రు నిమిషంలో కూడా మారవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఒకేసారి నాలుగింటినీ అనుకున్నా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే నాలుగు బ్యాంకులనూ ప్రైవేటీకరించాలని సర్కారు ముందుగా భావించినప్పటికీ ఉద్యోగుల యూనియన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు హెచ్చరించడంతో ప్రణాళికలు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటీకరణ పరిస్థితులపై ఒక అంచనాకు వచ్చేందుకు ఈ విడతలో మధ్య స్థాయి, చిన్న స్థాయి బ్యాంకులనే ఎంపిక చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వివరించాయి. రాబోయే రోజుల్లో పెద్ద బ్యాంకులపైనా దృష్టి పెట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అయితే, గ్రామీణ ప్రాంతాల వారికి రుణ లభ్యత పెంచడం తదితర లక్ష్యాల సాధన కోసం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో మాత్రం మెజారిటీ వాటాలను కొనసాగించవచ్చని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. పెద్ద బ్యాంకులను పరిశీలించాలి: ఎన్పీఏలతో కుదేలవుతున్న బలహీన, చిన్న బ్యాంకులను తీసుకునేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చని కొందరు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. పైగా వీటిని విక్రయించడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక వనరులు కూడా భారీగా సమకూరే అవకాశం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పీఎన్బీ లేదా బీఓబీ వంటి పెద్ద బ్యాంకులను ప్రైవేటీకరించే అంశాన్ని పరిశీలించాలంటున్నారు. ప్రక్షాళనకు చర్యలు.. బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రభుత్వ రంగ బ్యాంకులదే సింహ భాగం వాటా ఉంటోంది. అలాగే మొండిబాకీల (ఎన్పీఏ) విషయంలోనూ వీటిపై గణనీయంగా భారం పడుతోంది. కరోనా వైరస్ పరిణామాల కారణంగా కొన్ని పద్దులను మొండిబాకీలుగా వర్గీకరించడంపై ప్రస్తుతం ఆంక్షలు ఉన్నప్పటికీ .. ఇవి తొలగిన మరుక్షణం ఎన్పీఏలు భారీగా పెరిగిపోయే ముప్పు ఉందన్న భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొండిబాకీలు పేరుకుపోయి కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. కానీ పీఎస్బీల్లో వేల సంఖ్యలో ఉద్యోగులు ఉండటంతో ప్రైవేటీకరణ ప్రక్రియపై ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఉదాహరణకు.. యూనియన్ల గణాంకాల ప్రకారం బీవోఐలో 50,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 33,000 మంది, ఐవోబీలో 26,000 మంది, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 13,000 మంది దాకా సిబ్బంది ఉన్నారు. ఎకాయెకిన పీఎస్‌బీలను భారీ యెత్తున ప్రైవేటీకరిస్తే ఇటు ఉద్యోగులపరంగా అటు రాజకీయంగా రిస్కీ వ్యవహారం అయినప్పటికీ ఎక్కడో ఒక దగ్గర ఈ ప్రక్రియనైతే మొదలుపెట్టాలని మోదీ ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం మూడింతలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(2020–21, క్యూ1)లో రూ.844 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.243 కోట్లతో పోలిస్తే మూడు రెట్లకు పైగా ఎగబాకింది. ప్రధానంగా మొండిబకాయిల(ఎన్పీఏ)కు సంబంధించి ఒత్తిళ్లు! తగ్గుముఖం పట్టడం లాభాల జోరుకు దోహదం చేసింది. కాగా, క్యూ1లో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.11,527 కోట్ల నుంచి రూ.11,942 కోట్లకు వృద్ధి చెందింది. స్థూల ఎన్పీఏలు ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 13.91 శాతానికి దిగొచ్చాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 16.5 శాతంగా ఉన్నాయి. నికర ఎన్పీఏలు సైతం 5.79 శాతం నుంచి 3.58 శాతానికి తగ్గుముఖం పట్టాయి. దీంతో ఎన్పీఏలకు సంబంధించిన కేటాయింపులు క్యూ1లో రూ.767 కోట్లకు పరిమితం అయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ కేటాయింపులు రూ.1,873 కోట్లుగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో బీఓఐ షేరు ధర సోమవారం బీఎస్ఈలో ఒకానొక దశలో 6.5 శాతం ఎగబాకి రూ.50.15 స్థాయిని తాకింది. చివరకు 2 శాతం లాభంతో రూ.48 వద్ద స్థిరపడింది. -
ఐవోఎల్ దూకుడు- బీవోఐ జారుడు
గత మూడు నెలలుగా ర్యాలీ బాటలో సాగుతున్న హెల్త్‌కేర్ రంగ కంపెనీ ఐవోఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్..గత 8 రోజులుగా మరింత జోరందుకుంది. ప్రమోటర్ గ్రూప్ సంస్థకు షేర్ల కేటాయించిన తదుపరి ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో గత 8 సెషన్లలో 32 శాతం ఎగసింది. ఈ బాటలో ఆటుపోట్ల మార్కెట్లోనూ ఈ కౌంటర్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో తాజాగా సరికొత్త గరిష్టాన్ని తాకింది. తొలుత ఎన్ఎస్ఈలో ఐవోఎల్ కెమికల్స్ షేరు దాదాపు 10 శాతం దూసుకెళ్లి రూ. 474కు చేరువైంది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం 8 శాతం వృద్ధితో రూ. 468 వద్ద ట్రేడవుతోంది. గత 3 రోజుల్లోనే ఈ కౌంటర్ 20 శాతం లాభపడటం గమనార్హం. ఈ నెల 17న ప్రమోటర్ సంస్థ ఎన్సీవీఐ ఎంటర్‌ప్రైజెస్‌కు షేరుకి రూ. 205 ధరలో 7.18 లక్షల షేర్లను కంపెనీ కేటాయించింది. వీటికి మూడేళ్ల లాకిన్ అమలుకానుంది. యాంటీడయాబెటిస్, కొలెస్ట్రాల్, యాంటీకన్వల్సెంట్స్ తదితర తయారీ ఐవోఎల్ కెమ్ గత నెలలో వాణిజ్య శాఖ నుంచి త్రీస్టార్ ఎక్స్పోర్ట్ హౌస్‌ను పొందింది. ఈ షేరు గత మూడు నెలల్లో 180 శాతం దూసుకెళ్లడం విశేషం! బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో పీఎస్‌యూ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 3571 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది క్యూ4(జనవరి-మార్చి)లో రూ. 252 కోట్ల నికర లాభం ఆర్జించింది. తాజా క్వార్టర్లో అధిక ప్రొవిజన్లు, పన్నుల రైట్‌బ్యాక్ లాభాలను దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం 6 శాతం క్షీణించి రూ. 3793 కోట్లకు పరిమితంకాగా.. నికర వడ్డీ మార్జిన్లు 2.9 శాతంగా నమోదయ్యాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రెట్టింపై రూ. 8142 కోట్లను తాకాయి. ఆరు ఎన్పీఏ ఖాతాలకుగాను అదనంగా రూ. 3941 కోట్లను కేటాయించినట్లు బ్యాంక్ తెలియజేసింది. ఈ నేపథ్యంలో బీవోఐ షేరు ఎన్ఎస్ఈలో 8.3 శాతం పతనమై రూ. 50.5 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 48 వరకూ బలహీనపడింది. -
దారి మళ్లించిన నిధులతో దర్జా!
సాక్షి, అమరావతి: కేంద్ర మాజీ మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి, ఆయన సోదరుడు జతిన్‌కుమార్ ‘సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్’ విస్తరణకు తీసుకున్న రూ.322.03 కోట్ల రుణాన్ని దారి మళ్లించి సీఆర్డీఏ పరిధిలో కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్‌కు వినియోగించారని బ్యాంక్ ఆఫ్ ఇండియా సీబీఐకి ఫిర్యాదు చేసింది. రుణాన్ని తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా స్పందించకుండా మోసం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. వడ్డీతో కలిపి రుణం రూ.400.84 కోట్లకు చేరుకుందని, దీన్ని రికవరీ చేసేందుకు తనఖా ఆస్తులను మార్చి 23న ఈ–ఆక్షన్ విధానంలో వేలం వేస్తున్నామని తెలిపింది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రుణాన్ని దారి మళ్లించిన సుజనా చౌదరి, జతిన్‌కుమార్ తదితరులపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. గతంలోనే మరో బ్యాంకు ఫిర్యాదు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రెండు నెలల క్రితం ఇదే తరహాలో సుజానా చౌదరిపై ఫిర్యాదు చేసింది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజ్జెక్ట్ లిమిటెడ్ పేరుతో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రూ.304 కోట్ల రుణం తీసుకుని మోసగించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ఫిర్యాదుపై సీబీఐ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపేందుకు సీబీఐ సిద్ధమైంది. విచారణలో పలు కేసులు.. చంద్రబాబుకు సన్నిహితుడైన సుజనా చౌదరి తప్పుడు పత్రాలతో జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు టోపీ పెట్టి రూ.8 వేల కోట్లకుపైగా రుణాలు తీసుకున్నారు. ఇందులో అధిక శాతం నిధులను 2004 నుంచి 2014 వరకు టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబుకు అందజేసినట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. సుజనా ఆర్థిక నేరాలపై పలు కేసులు విచారణలో ఉన్నాయి. ఆర్థిక నేరగాడైన సుజనా చౌదరిని చంద్రబాబు రాజ్యసభకు పంపడంతోపాటు 2014లో కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కేలా చేశారు. బ్యాంకును బురిడీ కొట్టించిన నిధులతో.. రాజధాని ప్రాంతంపై చంద్రబాబు నుంచి ముందే సమాచారం అందుకున్న సుజానా చౌదరి తన కంపెనీలు, సోదరుడు జతిన్‌కుమార్, కుటుంబ సభ్యుల పేర్లతో చౌకగా వేలాది ఎకరాలను సొంతం చేసుకున్నారు. అధిక శాతం భూములకు అడ్వాన్సులు ఇచ్చి అగ్రిమెంట్లు చేయించుకుని రాజధాని ప్రకటన వెలువడిన తర్వాత 2016, 2017, 2018లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తాను కేంద్ర సహాయ మంత్రిగా ఉండటంతో బ్యాంకు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి షెల్ కంపెనీల పేర్లతో భారీగా రుణాలు తీసుకున్నారు. 13.95 శాతం వడ్డీపై అక్టోబర్ 26, 2018న బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.322.03 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ డబ్బులతో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను విస్తరిస్తానని బ్యాంక్‌కు హామీ ఇచ్చారు. రుణానికి జతిన్‌కుమార్, స్నేహితుడు గొట్టిముక్కుల శ్రీనివాసరాజు, షెల్ కంపెనీలతో గ్యారంటీ ఇప్పించారు. అయితే ఈ డబ్బులను కంపెనీ విస్తరణకు కాకుండా రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోలుకు వినియోగించుకున్నారు. ఆధారాలతో సీబీఐకి బ్యాంకు ఫిర్యాదు.. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లలో సుజనా చౌదరి ఏర్పాటు చేసిన 120 కంపెనీల్లో ఒకటైన శివసత్య పిగ్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సర్వే నెంబర్లు 432–1, 403–5, 433, 434, 402–1ఏ, 429, 428, 412, 410–2, 427–2, 413, 415, 416, 431, 437, 399–7, 404–11, 407–4లలో 110.6 ఎకరాల భూమిని రాజధాని ప్రకటన వెలువడక ముందే తక్కువ ధరకు కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేసుకున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద తీసుకున్న రుణాన్ని మళ్లించి 2018 నవంబర్ 13న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సీఆర్డీఏ పరిధిలో 623.12 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా ఈ నిధులను మళ్లించినట్లు గుర్తించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధారాలతో సీబీఐకి ఫిర్యాదు చేసింది. -
వేలానికి సుజనా చౌదరి ఆస్తులు
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సన్నిహితుడు, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆస్తుల వేలానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. ఆ బ్యాంక్ నుంచి 2018 అక్టోబర్ 26వతేదీన రూ.322.03 కోట్లను 13.95 శాతం వడ్డీపై తీసుకున్న యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి సంస్థ సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రుణాన్ని తిరిగి చెల్లించకుండా మొండికేస్తోంది. అసలు, వడ్డీ కలిపి ఈ ఏడాది ఫిబ్రవరి 20 నాటికి రుణం రూ.400.84 కోట్లకు చేరింది. తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా సుజనా చౌదరి స్పందించకపోవడంతో తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకు గురువారం నోటీసు జారీ చేసింది. ఆన్లైన్లో బిడ్ల దాఖలుకు తుది గడువు మార్చి 21గా పేర్కొంది. ఈ–ఆక్షన్ విధానంలో ఆస్తులను మార్చి 23న 11.30 నుంచి 12.30 గంటల మధ్య వేలం వేస్తామని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించడంతో సుజానా అక్రమాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. (తాతా.. గిఫ్ట్ ఎలా ఇచ్చావు?) సుజనా చౌదరి ప్రత్యక్షంగా, పరోక్షంగా నిర్వహిస్తున్న వాటిలో సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్, సుజనా మెటల్ ప్రొడక్ట్, సుజనా టవర్స్ లాంటి లిస్టెడ్ కంపెనీలతోపాటు మరో 102 ఇతర కంపెనీలున్నాయి. సుజనా పరోక్షంగా నడిపించే బార్ర్‌టోనిక్స్ కూడా లిస్టెడ్ కంపెనీయే. మరో 4 కంపెనీలు (విజయ్ హోం అప్లయన్సెస్, మెడ్‌సిటీ, లక్ష్మీగాయత్రి, బెస్ట్ అండ్ కాంప్ట్రాన్) మినహా మిగిలినవన్నీ షెల్ కంపెనీలే. ఇవి సర్క్యులర్ ట్రేడింగ్, బుక్ బిల్డింగ్, మనీ ల్యాండరింగ్, పన్ను ఎగవేత కార్యకలాపాలలో దిట్ట. సుజనా గ్రూపు సంస్థలు వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.8,000 కోట్లకుపైగా రుణాలు తీసుకున్నాయి. అయితే సుజనా సంస్థల ఆస్తుల విలువ రూ.132 కోట్లకు మించదని చెబుతున్నారు. (మా కుటుంబ నికర ఆస్తులు రూ.102.48కోట్లు) బ్యాంకులను కొల్లగొట్టడంలో ఘనుడు.. ⇒సుజనా గ్రూప్ ప్రధాన కంపెనీలు రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల (సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా)కు రూ.920 కోట్ల మేర రుణాలు ఎగవేశాయి. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ హెస్టియా లిమిటెడ్, నువాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్థలు మారిషస్ కమర్షియల్ బ్యాంకుల నుంచి రూ.107 కోట్ల రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా బోర్డు తిప్పేశాయి. ఈ రుణానికి సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చింది. ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో మారిషస్ కమర్షియల్ బ్యాంకు పిటిషన్ దాఖలు చేసింది. (సుజనా చౌదరి నివాసంలో సీబీఐ సోదాలు) ⇒బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పేరుతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.304 కోట్ల రుణం పొందేందుకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సమర్పించడంపై సుజానా గ్రూపుపై సీబీఐకి బ్యాంకు తాజాగా ఫిర్యాదు చేసింది. ⇒సుజానా గ్రూపు సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, ఐటీ రూపంలో రూ.962 కోట్లను ఎగ్గొట్టడంపై కేసుల విచారణ వివిధ దశల్లో ఉంది. ⇒ఇవన్నీ పరిశీలిస్తే సుజానా గ్రూపు బ్యాంకు రుణాలను భారీగా ఎగ్గొట్టి మనీ ల్యాండరింగ్‌తో కొత్త సంస్థలను ఏర్పాటు చేసుకుని నిధులను దారిమళ్లించినట్లు స్పష్టమవుతోంది. దోచేసిన సొమ్ముతో భూ దందా ⇒చంద్రబాబుకు సన్నిహితుడైన సుజనా చౌదరి 2014లో రాజధానిపై ప్రకటన వెలువడక ముందే ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా సీఆర్డీఏ పరిధిలో భారీగా భూములు కొనుగోలు చేశారు. బ్యాంకులను దోచేసిన సొమ్ముతోనే సుజనా ఆస్తులను పోగేసుకున్నారనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. ⇒సీఆర్డీఏ పరిధిలోని చందర్లపాడు మండలం గుడిమెట్లలో సుజనా చౌదరి ఏర్పాటు చేసిన 120 కంపెనీల్లో ఒకటైన శివసత్య పిగ్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 110.6 ఎకరాలను రాజధాని ప్రకటన వెలువడక ముందే రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ అగ్రిమెంట్ చేసుకున్నారు. 2018లో తన సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ⇒సుజనా సోదరుడు యలమంచిలి జతిన్ కుమార్ ఏర్పాటు చేసిన శివజ్యోతి ఫ్లైకాన్ బ్లాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 11.56 ఎకరాలను రాజధాని ప్రకటన వెలువడక ముందే కొనుగోలు చేశారు. ⇒కుటుంబ సభ్యులు, షెల్ కంపెనీల పేర్లతో రాజధాని ప్రాంతంలో సుజనా 623.12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు ఈడీ నిగ్గు తేల్చడం గమనార్హం. -
సుజనాకు మరో భారీ షాక్
సాక్షి, అమరావతి : చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరికి మరోసారి భారీ షాక్ తగిలింది. ఆయన పవర్ ఆఫ్ అటార్నీగా ఉన్న పలు ఆస్తులను వేలం వేయనున్నట్టు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మార్చి 23, 2020న ఈ వేలం పాట జరగనుంది. మార్చి 20న సుజనా ఆస్తులను తనిఖీ చేసుకోవచ్చన్న బ్యాంకు.. మొత్తం రూ.400 కోట్ల 84లక్షల 35వేల బకాయి ఉన్నట్టు తెలిపింది. తీసుకున్న రుణ బకాయిలు చెల్లించకపోవడంతో.. ఆ సంస్థ తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేయనున్నట్లు బ్యాంక్ నోటీసుల్లో తెలిపింది. రుణం జమానతు ఇచ్చిన వ్యక్తులు, సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు బ్యాంక్ చెబుతోంది. బ్యాంకు ఆఫ్ ఇండియాలో సుజనా యునివర్సల్ ఇండస్ట్రీస్ కంపెనీ పేరుతో 320 కోట్ల మొత్తం రుణం తీసుకున్నారు. రుణానికి గ్యారంటీ దారులుగా సుజనా చౌదరి, మరో 11మంది ఉన్నారు. సుజనా క్యాపిటల్ సర్వీసెస్, సుజనా పంప్స్&మోటార్స్, స్ల్పెండెడ్ మెటల్ ప్రొడక్ట్స్, న్యూకాన్ టవర్స్ తదితర కంపెనీలు గ్యారంటీగా ఉన్నాయి. బ్యాంకును మోసగించిన కేసులో 2018లో మూడు కేసులు నమోదు కాగా.. ఇప్పటికే నాగార్జునహిల్స్‌లోని సుజనా కార్యాలయాలపై సీబీఐ దాడులు జరిగాయి. సీబీఐతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉమ్మడి సోదాలు జరిగాయి. మొత్తమ్మీద రూ.5700 కోట్ల మేర బ్యాంకులకు సుజనా కంపెనీలు టోపీ పెట్టినట్టు గుర్తించాయి. ఆ సోదాల్లో ఏకంగా 126 షెల్ కంపెనీలు గుర్తించారు. ఫెరారీ, బెంజ్, రేంజ్ రోవర్ కార్లను కూడా అప్పట్లో అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. వేలం పాట కింద సుజనా ఆస్తుల విలువలను బ్యాంక్ పేర్కొంది. తమిళనాడులో వై.శివలింగప్రసాద్ పేరుతో 6300 చదరపు అడుగుల భూమి, శ్రీపెరంబూదూరులో ఎస్.టి.ప్రసాద్ పేరుతో 7560 చదరపు అడుగుల భూమి, శ్రీపెరంబూదూరులో శివరామకృష్ణ పేరుతో 7700 చదరపు అడుగుల భూమి, కొలుత్తువంచెర్రీ గ్రామంలో వైఎస్ చౌదరి పేరుతో 7700చదరపు అడుగుల భూములను వేలం వేస్తామని బ్యాంకు ప్రకటించింది. అన్ని ఆస్తులకు పవర్ ఆఫ్ అటార్నీగా సుజనా చౌదరి ఒక్కరే ఉండడం గమనార్హం. -
సుజనాకు షాక్ : ఆస్తులను వేలం
-
ఖాతాదారులూ! కాస్త జాగ్రత్త!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు బ్యాంకులు, నియంత్రణ సంస్థ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఖాతాదారులు కూడా తమ వంతుగా పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉందని బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జి.పద్మనాభన్ అభిప్రాయపడ్డారు. డిజిటల్ లావాదేవీలకు సంబంధించి అసలైన పోర్టల్స్, యాప్స్ అప్డేటెడ్ వెర్షన్లను ఉపయోగించడంతో పాటు పిన్ నంబర్లు లాంటివి ఎవరికీ వెల్లడించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే, సైబర్ సెక్యూరిటీ అనేది ఏ ఒక్క సంస్థ బాధ్యతో కాదని.. ఈ విషయంలో ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు, వివిధ ఏజెన్సీలు కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. బుధవారమిక్కడ ఐడీఆర్బీటీలో.. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సెక్యూరిటీపై 15వ అంతర్జాతీయ సదస్సు (ఐసీఐఎస్‌ఎస్) ప్రారంభించిన సందర్భంగా పద్మనాభన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సు 20 దాకా జరగనుంది. అత్యధికంగా సైబర్ దాడులకు గురయ్యే దేశాల్లో అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉందని పద్మనాభన్ చెప్పారు. ‘‘కానీ సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండే విషయంలో మాత్రం 47వ స్థానంలో ఉన్నాం. ఆర్థిక సేవలను సులభంగా అందించేందుకు, లావాదేవీల ఖర్చు భారీగా తగ్గించేందుకు సైబర్ టెక్నాలజీ ఉపయోగపడుతోంది. సాధారణంగా నెట్‌వర్క్‌లోకి చొరబడిన వైరస్ తీవ్రత 220 రోజులకు గానీ బయటపడటం లేదు. దీన్ని మరింత ముందుగా గుర్తించగలిగితే సైబర్ దాడులను కొంతైనా నియంత్రించవచ్చు’’ అని ఆయన వివరించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ(ఐడీఆర్‌బీటీ) దీనికి తగు టెక్నాలజీని రూపొందించడంపై దృష్టి పెట్టా లన్నారు. బ్యాంకింగ్ టెక్నాలజీకి సంబంధిం చి ఫిన్‌టెక్ ఎక్సే్చంజీ, 5జీ యూజ్ కేస్ ల్యాబ్ మొదలైనవి ఏర్పాటు వంటి అంశాలను ఐడీఆర్‌బీటీ డైరెక్టర్ ఏఎస్ రామశాస్త్రి వివరించారు. -
ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొత్త సీఈఓలు
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు కొత్తగా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను (ఎండీ–సీఈఓ) బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) బుధవారం సిఫారసు చేసింది. ఈ మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులకూ వరుసగా సంజీవ్ చద్దా, ఎల్.వి.ప్రభాకర్, అతనూ కుమార్ దాస్ పేర్లను సూచించింది. మంగళవారం జరిగిన ఇంటర్వ్యూల్లో వీరి పేర్లను ఖరారు చేశామని, ప్రతిభ ఆధారంగా తుది జాబితాను రూపొందించామని వెల్లడించింది. చద్దా ప్రస్తుతం ఎస్బీఐ కాపిటల్ మార్కెట్స్ ఎండీ – సీఈఓగా ఉండగా.. ప్రభాకర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈడీగా, దాస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీగా ఉన్నారు. ఇక రిజర్వ్ జాబితాలో.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు ఎండీ–సీఈఓగా ఎ.ఎస్.రాజీవ్, కరూర్ వైశ్య బ్యాంక్‌కు పీ ఆర్ శేషాద్రి పేర్లను ప్రకటించింది. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం 266 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.266 కోట్ల నికర లాభం సాధించింది. కేటాయింపులు తగ్గడం, నికర వడ్డీ ఆదాయం బాగా ఉండటం, ఇతర ఆదాయం పెరగడంతో ఈ స్థాయి లాభం నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్లో రూ.1,156 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఆదాయం రూ.10,800 కోట్ల నుంచి రూ.11,986 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ 2.27% నుంచి 2.99%కి పెరిగింది. ఇది 18 క్వార్టర్ల గరిష్ట స్థాయి. గత క్యూ2లో 16.36%గా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 16.31%కి తగ్గాయి. నికర మొండి బకాయిలు 7.64% నుంచి 5.77%కి చేరాయి. -
మా బంగారాన్ని తిరిగి ఇచ్చేయండి!
సాక్షి, విజయనగరం : జిల్లాలోని పూసపాటిరేగ మండలం కొప్పెర్ల బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గందరగోళం నెలకొంది. ఖాతాదారులు నకిలీ బంగారం పెట్టి రుణాలు తీసుకున్నారంటూ వదంతులు రావడంతో దుమారం చెలరేగింది. తాకట్టు పెట్టిన బంగారాన్ని ఒసారి తనిఖీ చేసుకోవాలంటూ ఖాతాదారులకు బ్యాంక్ అధికారులు నోటిసులు పంపించారు. దీంతో బ్యాంకు ఎదుట ఖాతాదారులు బారులు తీరారు. బంగారాన్ని మార్చేసి నకిలీ బంగారం పెట్టారేమోనని బ్యాంక్ యాజమాన్యంపై ఖాతాదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ బంగారం తమకు ఇచ్చేస్తే విడుపించుకుపోతామని బ్యాంకు ఎదుట క్యూ కడుతున్నారు. -
బ్యాంకు కుంభకోణం : ఆరుగురికి జీవిత ఖైదు
సాక్షి, ముంబై: దాదాపు 20 ఏళ్ల నాటి కేసులో ముంబై స్పెషల్ కోర్టుసంచలన తీర్పును వెలువరించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ మాజీ అధికారితోపాటు మరో ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. అంతేకాదు ఈ కేసులో న్యాయవాదికి మూడేళ్ల జైలు శిక్షను విధించిందని గురువారం విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటన తెలిపింది. 2000 బీఓఐలో చోటు చేసుకున్న 2.91కోట్ల కుంభకోణానికి సంబంధించి కోర్టు ఈ తీర్పును వెలువరించింది. సీబీఐ అందించిన సమాచారం ప్రకారం, 2000లో స్విఫ్ట్ సేవల కింద బ్రాంచ్ అధికారులతో కుమ్మక్కై, నకిలీ పత్రాలతో ఆహుజా అతని భాగస్వాములు కలిసి 2.50 కోట్ల రూపాయల మేర లోన్ తీసుకున్నారు. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో 2004 ప్రారంభంలో ఎన్పీఏగా ప్రకటించబడింది. దీంతో బ్యాంకు నష్టం మొత్తం రూ. 2.91 కోట్లకు చేరింది. 2004లో కేసు నమోదు చేసిన సీబీఐ విచారణ అనంతరం నవంబరు 2005లో చార్జిషీట్ దాఖలు చేసింది. బ్యాంకుకు చెందిన అప్పటి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ భగవాన్జీ డి.జోషి, బ్యాంకులో రుణం తీసుకున్న 5గురు వ్యాపారవేత్తలు - మనోహర్‌లాల్ ఆహుజా, అతని కుమారుడు అమిత్ ఆహుజా, మహేష్ బోరా, సందేష్ రామచంద్ర నాగే, జి.కె.శర్మ, శాంతిలాల్ చౌహాన్ తోపాటు న్యాయవాది యూనస్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసింది. దీనిపై ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టులో విచారణ అనంతరం ఈ తీర్పునిచ్చింది. ఈ తీర్పు చాలా అరుదైనది. ఒక మైలురాయిలాంటిదని అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు ఆహుజా తండ్రీకొడుకులిద్దరికి చెరి రూ. 50 లక్షలు, బొహ్రా రూ. 3లక్షలు, నాగే రూ. 60వేల, చౌహాన్ రూ .50వేలు జోషి రూ. లక్ష, న్యాయవాదికి రూ .3 వేల జరిమానా విధించడం గమనార్హం. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన శర్మ ఆగస్టు ,2008 లో చనిపోయారు. -
బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రొవిజనింగ్ సెగ
ముంబై: మొండిబాకీలకు కేటాయింపులు రెట్టింపు కావడంతో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) నష్టాలు మూడో త్రైమాసికంలో ఏకంగా రూ. 4,738 కోట్లకు ఎగిశాయి. 40 భారీ మొండి పద్దులపై దివాలా చట్టం కింద విచారణ జరుగుతుండటం, కొత్తగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం రూపంలో మొండిబాకీలు మరింతగా పెరగడం ఇందుకు కారణం. భారీ మొండిబాకీల కారణంగా ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ)పరమైన ఆంక్షలు ఎదుర్కొంటున్న బీవోఐ.. 2017 డిసెంబర్ క్వార్టర్లో రూ. 2,341 కోట్ల నష్టాలు నమోదు చేసింది. తాజాగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌నకు ఇచ్చిన రూ. 3,400 కోట్ల మేర రుణాలు మొండిబాకీల కింద వర్గీకరించాల్సి వచ్చింది. ముందుజాగ్రత్తగా కొన్ని మొండిపద్దులకు పూర్తి స్థాయిలో ప్రొవిజనింగ్ చేయడంతో కేటాయింపులు రూ. 4,373 కోట్ల నుంచి రూ. 9,179 కోట్లకు ఎగిశాయని బీవోఐ ఎండీ దీనబంధు మహాపాత్ర తెలిపారు. మరోవైపు, క్యూ3లో వడ్డీ ఆదాయం 33.23 శాతం పెరిగి రూ. 3,332 కోట్లకు చేరిందని చెప్పారు. స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) పరిమాణం 16.93 శాతం నుంచి 16.31 శాతానికి, నికర ఎన్పీఏలు 10.29 శాతం నుంచి 5.87 శాతానికి తగ్గాయి. సోమవారం బీఎస్ఈలో బ్యాంక్ షేరు 4 శాతం క్షీణించి రూ. 90.60 వద్ద క్లోజయ్యింది. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా నష్టాలు రూ.1,156 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో భారీ నష్టాలను చవిచూసింది. మొండి బకాయిలకు కేటాయింపులు పెరగడంతో ఈ క్యూ2లో రూ.1,156 కోట్ల నికర నష్టాలు వచ్చాయని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.179 కోట్లు, ఈ క్యూ1లో రూ.95 కోట్లు చొప్పున నికర లాభాలు వచ్చాయని పేర్కొంది. గత క్యూ2లో రూ.11,600 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.10,800 కోట్లకు తగ్గిందని తెలిపింది. తగ్గిన రుణ నాణ్యత... గత క్యూ2లో రూ.49,307 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.61,561 కోట్లకు పెరిగాయని బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. నికర మొండి బకాయిలు రూ.23,566 కోట్ల నుంచి రూ.25,994 కోట్లకు పెరిగాయని తెలిపింది. ఇక శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 12.62 శాతం నుంచి 16.36 శాతానికి, అలాగే నికర మొండి బకాయిలు 6.47 శాతం నుంచి 7.64 శాతానికి పెరిగాయని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అయితే ఈ క్యూ1లో స్థూల మొండి బకాయిలు 16.66 శాతంగా, నికర మొండి బకాయిలు 8.45 శాతంగా ఉన్నాయని, సీక్వెన్షియల్‌గా చూస్తే, స్థూల, నికర మొండి బకాయిలు తగ్గాయని వివరించింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.1,867 కోట్ల నుంచి రూ.2,828 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఈ క్యూ2లో నికర నష్టాలు భారీగా రావడంతో బీఎస్ఈలో బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ 4.8 శాతం నష్టంతో రూ.87 వద్ద ముగిసింది. -
పీఎస్బీలకు నిర్వహణ స్వేచ్ఛ ఉండాలి
న్యూఢిల్లీ: ప్రైవేట్ బ్యాంకుల స్థాయిలోనే ప్రభుత్వ రంగ బ్యాంకులకూ (పీఎస్బీ) నిర్వహణాపరమైన స్వేచ్ఛ ఉండాలని బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జి. పద్మనాభన్ చెప్పారు. అప్పుడే మొండిబాకీలు సహా పలు సమస్యలను పీఎస్‌బీలు వాటంతట అవే పరిష్కరించుకోగలవని ఆయన తెలిపారు. సెంటర్ ఫర్ ఎకనమిక్ పాలసీ రీసెర్చ్ (సీఈపీఆర్) నిర్వహించిన బ్యాంకింగ్ సదస్సులో శుక్రవారం పాల్గొన్న సందర్భంగా పద్మనాభన్ ఈ విషయాలు చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా మొండిబాకీలు పేరుకుపోయిన నేపథ్యంలో పద్మనాభన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బ్యాంకింగ్ రంగంలో చాలా మటుకు సమస్యలు నిర్వహణపరమైన అంశాలే తప్ప యాజమాన్యపరమైనవి కావని ఆయన పేర్కొన్నారు. ‘యాజమాన్య అధికారాలపరంగా పీఎస్బీలకు కొన్ని పరిమితులు ఉన్నాయి.. అయితే వీటిని సులువుగానే పరిష్కరించుకోవచ్చు. అయితే, నిర్వహణ విషయంలో స్వేచ్ఛగా వ్యవహరించేందుకు ప్రైవేట్ రంగ బ్యాంకుల స్థాయిలోనే ప్రభుత్వ రంగ బ్యాంకులకు కూడా వెసులుబాటు ఉండాలి‘ అని పద్మనాభన్ చెప్పారు. బీవోఐ విషయానికొస్తే తమ మొండిబాకీల్లో చాలా మటుకు రుణాలు ఇన్ఫ్రా రంగం నుంచి రావాల్సినవేనని ఆయన తెలిపారు. తమది లీడ్ బ్యాంక్ కాకపోయినా.. ఇవన్నీ కన్సార్షియంలో భాగంగా ఇచ్చిన రుణాలేనని, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నాయని చెప్పారు. గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి బ్యాంకింగ్ రంగంలో మొండిబాకీలు రూ. 8.31 లక్షల కోట్లకు పెరిగిన సంగతి తెలిసిందే. 2017–18 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 21 పీఎస్బీల్లో రెండు మినహా.. 19 బ్యాంకులు ఏకంగా రూ. 87,357 కోట్ల నష్టాలను ప్రకటించాయి. విజయా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ మాత్రమే లాభాలు నమోదు చేశాయి. -
8% పెరిగిన బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.95 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం (రూ.88 కోట్లు)తో పోల్చితే 8% వృద్ధి సాధించామని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అంతకు ముందటి క్వార్టర్(గత ఆర్థిక సంవత్సరం క్యూ4)లో రూ.3,969 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వివరించింది. క్యూ1లో ఈ బ్యాంక్‌కు రూ.1,000 కోట్ల మేర నష్టాలు వస్తాయని విశ్లేషకులు అంచనా వేశారు. నికర వడ్డీ ఆదాయం రూ.2,533 కోట్ల నుంచి 32% వృద్ధితో రూ.3,354 కోట్లకు పెరిగిందని తెలిపింది. తగ్గిన మొత్తం ఆదాయం గత క్యూ1లో రూ.11,107 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో 2 శాతం తగ్గి రూ.10,843 కోట్లకు చేరిందని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. తగ్గిన రుణనాణ్యత..: బ్యాంక్ రుణ నాణ్యత మరింతగా క్షీణించింది. గత క్యూ1లో రూ.51,019 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో రూ.60,604 కోట్లకు ఎగిశాయని బ్యాంక్ తెలిపింది. నికర మొండి బకాయిలు రూ.24,407 కోట్ల నుంచి రూ.27,932 కోట్లకు పెరిగాయని పేర్కొంది. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 13.05% నుంచి 16.66%కి, నికర మొండి బకాయిలు 6.70% నుంచి 8.45 శాతానికి పెరిగాయని వివరించింది. మొండి పద్దులు పెరగడంతో కేటాయింపులు పెరిగాయని పేర్కొంది. గత క్యూ1లో రూ.2,156 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు ఈ క్యూ1లో రూ.2,260 కోట్లకు పెరిగాయని తెలిపింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ షేర్ 9% పతనమై రూ.94 వద్ద ముగిసింది. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారుల దౌర్జన్యం
-
బీవోఐ అధికారులు ఇద్దరు అరెస్ట్
న్యూఢిల్లీ: డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐఎల్)కి రూ. 2,654 కోట్ల రుణాల కుంభకోణంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ)కి చెందిన ఇద్దరు సీనియర్ రిటైర్డ్ అధికారులను సీబీఐ శుక్రవారం అరెస్ట్ చేసింది. బీవోఐ వదోదర శాఖలో రిటైరయిన జీఎం వీవీ అగ్నిహోత్రి, డీజీఎం పి.కె. శ్రీవాస్తవ వీరిలో ఉన్నారు. రుణ పరిమితులను పెంచడంలో కంపెనీకి అనుచిత లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారంటూ వీరిపై అభియోగాలు ఉన్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఈ ఇద్దరిని అహ్మదాబాద్‌లోని స్పెషల్ కోర్టులో శనివారం హాజరుపర్చనున్నట్లు వివరించాయి. డీపీఐఎల్ ప్రమోటర్లు.. ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్టయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన 11 బ్యాంకుల కన్సార్షియం 2008 నుంచి డీపీఐఎల్ మోసపూరితంగా రుణాలు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా 2016 జూన్ 29 నాటికి కంపెనీ మొత్తం రూ. 2,654 కోట్ల మేర బాకీపడింది. 2016–17లో ఈ మొత్తాన్ని బ్యాంకులు మొండిబాకీగా వర్గీకరించాయి. -
కన్నం వేయకుండానే 32 కేజీల బంగారం చోరీ
తిరువళ్లూరు: లాకర్లు బద్దలుకొట్టకుండా, కనీసం గోడకు కన్నం కూడా వేయకుండా ఓ బ్యాంకు లాకర్లలో దాచిన 32 కేజీల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరులో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) బ్రాంచ్‌లో చోటు చేసుకుంది. బ్రాంచ్ మేనేజర్ శేఖర్, అసిస్టెంట్ మేనేజర్లు భాను, రంజన్, కీ మెయింటైనర్ విశ్వనా థన్‌లు శుక్రవారం విధులు ముగించుకుని బ్యాంకుకు తాళంవేసి ఇంటికి వెళ్లారు. వరుసగా రెండ్రోజులు సెలవు కావడంతో సోమవారం మేనేజర్ శేఖర్ బ్యాంకు వద్దకు వచ్చారు. అప్పటికే బ్యాంకు తెరిచి ఉండటంతో లోపలకు వెళ్లగా.. నగలు భద్రపరిచే లాకర్ తెరిచిఉంది. దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రూ.8 కోట్లు విలువచేసే 32.77 కేజీల బంగారం చోరీకి గురైందని నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల్ని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. -
35 విదేశీ శాఖల మూసివేత
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) విదేశీ కార్యకలాపాల క్రమబద్ధీకరణపై దృష్టి సారించాయి. లాభసాటిగా లేని 35 శాఖలు, రిప్రజెంటేటివ్ కార్యాలయాలను మూసివేశాయి. స్వచ్ఛమైన, బాధ్యతాయుతమైన బ్యాంకింగ్ విధానాల అమల్లో భాగంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా మొత్తం 216 విదేశీ శాఖలు, రెమిటెన్స్ సెంటర్లు మొదలైన వాటన్నింటినీ సమీక్షించి, క్రమబద్ధీకరించుకోవాలంటూ గతేడాది నవంబర్‌లో నిర్వహించిన పీఎస్బీ మంథన్‌లో బ్యాంకర్లు నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే తాజాగా బ్యాంకులు చర్యలు ప్రారంభించాయి. ఈ ఏడాది జనవరి 31 నాటికి.. పీఎస్బీలకు అనుబంధ సంస్థలు, జాయింట్ వెంచర్లు, ప్రాతినిధ్య కార్యాలయాలు కాకుండా 165 పైచిలుకు విదేశీ శాఖలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కి అత్యధికంగా 52 శాఖలు ఉండగా, బ్యాంక్ ఆఫ్ బరోడాకు 50, బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 29 ఉన్నాయి. పీఎస్బీ శాఖలు ఎక్కువగా బ్రిటన్ (32), హాంకాంగ్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (చెరి 13), సింగపూర్‌లో (12) ఉన్నాయి. ఆంధ్రా బ్యాంక్ దుబాయ్ ఆఫీసు మూసివేత.. విదేశీ శాఖల క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా ఆంధ్రా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్.. దుబాయ్‌లో తమ తమ కార్యకలాపాలు నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే పీఎన్బీ, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .. షాంఘై ఆఫీసులు మూసివేశాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా అటు యాంగాన్, బోట్స్వానా కార్యకలాపాలు కూడా నిలిపివేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సైతం.. హాంకాంగ్ శాఖను మూసివేశాయి. -
బీఓఐ నష్టం రూ.2,341 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.2,341 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. మొండి బకాయిలకు కేటాయింపులు రెట్టింపునకు పైగా మించడంతో పాటు, నికర వడ్డీ, ఇతర, నిర్వహణ ఆదాయాలు తగ్గడంతో ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.102 కోట్ల నికర లాభం సాధించామని పేర్కొంది. గత క్యూ3లో రూ.11,594 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 10,376 కోట్లకు తగ్గిందని తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.2,546 కోట్ల నుంచి రూ.4,373 కోట్లకు పెరిగాయని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం తగ్గి రూ.2,501 కోట్లకు, ఇతర ఆదాయం 70 శాతం క్షీణించి రూ.1,041 కోట్లకు, నిర్వహణ లాభం 82 శాతం క్షీణించి రూ.1,354 కోట్లకు తగ్గాయని తెలిపింది. పెరిగిన మొండి బకాయిలు స్థూల మొండి బకాయిలు 13.38 శాతం నుంచి 16.93 శాతానికి, నికర మొండి బకాయిలు 7.09 శాతం నుంచి 10.29 శాతానికి ఎగిశాయని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. సీక్వెన్షియల్‌గా చూస్తే, స్థూల మొండి బకాయిలు 30 శాతం వృద్ధితో రూ.64,249 కోట్లకు, నికర మొండి బకాయిలు 53 శాతం వృద్ధితో రూ.36,117 కోట్లకు పెరిగాయని వివరించింది. గత ఆర్థిక సంవత్సరానికి అవకతవకలు(డైవర్జెన్స్–ఆర్బీఐ మదింపు, బ్యాంక్ వెల్లడించిన వాటికి మధ్య గల తేడా) స్థూల మొండి బకాయిల్లో రూ.14,000 కోట్లు, నికర మొండి బకాయిల్లో రూ.9,707 కోట్లు, కేటాయింపుల్లో రూ.4,350 కోట్ల మేర ఉన్నాయని వివరించింది. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 56.96 శాతంగా ఉందని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ 1.6 శాతం లాభంతో రూ.145 వద్ద ముగిసింది. -
పాస్‌బుక్ అప్డేట్కు ఛార్జీలు
మీరు బ్యాంకు బ్రాంచు వద్ద పాస్‌బుక్‌ను అప్డేట్ చేయించుకుంటున్నారా? అయితే ఇక నుంచి దానికోసం కూడా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా పాస్‌బుక్ అప్డేటింగ్కు ఛార్జీలు విధించాలని ప్లాన్ చేసింది. ఒక్కోసారి పాస్‌బుక్ అప్డేషన్కు 10 రూపాయల ఛార్జీలు విధించాలని తన వెబ్సైట్లో ఓ నోటీసులో తెలిపింది. తాము ప్రతిపాదించిన ఈ ఛార్జీలు 2018 జనవరి 20 నుంచి అమల్లోకి వస్తాయని కూడా తెలిపింది. ఏ బ్యాంకు కూడా పాస్‌బుక్ అప్డేషన్కు ఛార్జీలు విధించడం లేదు. బ్యాంకు ఆఫ్ ఇండియానే ఈ ఛార్జీలనే అమల్లోకి తీసుకొస్తుంది. ఉచితంగా లభించే పలు బ్యాంకు సర్వీసులకు ఛార్జీలను విధించనున్నట్టు బ్యాంకు తన నోటీసులో పేర్కొంది. ఈ సర్వీసుల్లో పాస్‌బుక్ అప్డేషన్ కూడా ఉన్నట్టు తెలిపింది. ఒక్కోసారి అప్డేషన్కు రూ.10 ఛార్జీలను విధించనున్నామని, ఈ ఛార్జీలను ఆటోమేటిక్‌గా అకౌంట్ హోల్డర్స్ అకౌంట్‌ను డెబిట్ చేసుకోనున్నట్టు నోటీసులో పేర్కొంది. అంతేకాక ఛార్జీలు విధించబోతున్న సర్వీసుల్లో నగదు విత్‌డ్రా, నగదు డిపాజిట్, బ్యాలెన్స్ స్టేట్మెంట్, కైవేసీ అప్డేట్, సంతకం, ఫోటో వెరిఫికేషన్, చెక్ డిపాజిట్, వడ్డీ సర్టిఫికేట్ పొందడం, ఇంటర్నెట్ లేదా మొబైల్ పాస్‌వర్డ్‌ను అన్‌బ్లాక్ చేసే అభ్యర్థనలు కూడా ఉన్నాయి. ఈ ఛార్జీలన్నీ జనవరి 20 నుంచి అమల్లోకి వస్తున్నాయని బ్యాంకు తెలిపింది. ప్రతిపాదనల్లో కేవలం రెండు సర్వీసులు మాత్రమే ఉచితంగా లభించనున్నాయి. అవి చెల్లింపులు ఆపడం, సూచనల అభ్యర్థనలు. ఆసక్తికరంగా ఈ ఛార్జీలు, బేస్ బ్రాంచు విధిస్తున్న సర్వీసు ఛార్జీలు కన్నా అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం విధిస్తున్న ఛార్జీల సర్వీసులు, అంతకముందు ఉచితంగా లభ్యమయ్యేవి కావడం గమనార్హం. -
బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఆర్బీఐ కొరడా
న్యూఢిల్లీ: మొండి బకాయిలు బాగా పెరిగిపోవడంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ)పై ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. బీఓఐ తాజాగా రుణాలు జారీ చేయరాదని, డివిడెండ్‌ను పంపిణీ చేయకూడదని ఆంక్షలు విధించింది. సత్వర దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆర్బీఐ ఈ చర్యలు తీసుకుంది. వరుసగా రెండేళ్ల పాటు నికర మొండి బకాయిలు అధికంగా ఉండటం, సెట్ వన్ మూలధనం తగినంతగా లేకపోవడం, ఆస్తులపై రాబడి (రిటర్న్ ఆన్ అసెట్) రుణాత్మకంగా ఉండటం వంటి కారణాల వల్ల ఆర్బీఐ తాజాగా ఈ ఆంక్షలు విధించిందని బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ ఎక్సే్చంజ్‌లకు నివేదించింది. ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ 4 శాతం తగ్గి రూ.174 వద్ద ముగిసింది.మరోవైపు నికర మొండి బకాయిలు అధికంగా ఉండటంతో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఆర్బీఐ అదనపు ఆంక్షలను విధించింది. అయితే డిపాజిట్ల సమీకరణ, రుణ మంజూరు, ట్రెజరీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం లేదని ఈ బ్యాంక్ స్టాక్ ఎక్సే్చంజ్‌లకు తెలిపింది. మెరుగుపడిన బీఓఐ రుణ నాణ్యత: గత ఏడాది మార్చి చివరి నాటికి 13.07%గా ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 13.22%కి పెరగ్గా, నికర మొండి బకాయిలు మాత్రం 7.79% నుంచి 6.90%కి తగ్గాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో ఈ బ్యాంక్ రుణ నాణ్యత ఒకింత మెరుగుపడింది. స్థూల మొండి బకాయిలు 13.45% నుంచి 12.62%కి, నికర మొండి బకాయిలు 7.56% నుంచి 6.47%కి తగ్గాయి. -
బ్యాంక్ మెసెంజర్ చేతివాటం.. నగదు విత్ డ్రా ..!
సాక్షి, రాజమండ్రి: బ్యాంక్ ఆఫ్ ఇండియా మెసెంజర్ చేతివాటం ప్రదర్శించాడు. ఖాతదారుల ఫోర్జరీ సంతకాలతో నగదు విత్ డ్రా అయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కొత్తపేట మండలంలోని వానపల్లిలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న బ్యాంక్అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కోత
న్యూఢిల్లీ: సేవింగ్స్ వడ్డీరేట్లపై కోత పెట్టిన బ్యాంకుల జాబితాలోకి తాజాగా మరో బ్యాంక్ కూడా చేరింది. ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా పొదుపు నగదు నిల్వల వడ్డీరేటుపై 50 బేసిస్ పాయింట్ల కోత విధించింది. పొదుపు ఖాతాల్లో రూ. 50లక్షల కంటే తక్కువ ఉన్న నిల్వలపై వడ్డీరేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో వడ్డీరేడు 3.5శాతంగా ఉండనుంది. ‘పొదుపు ఖాతాలపై బ్యాంక్ రెండంచెల విధానాన్ని అమలుచేయనుంది. దీని ప్రకారం రూ. 50 లక్షల లోపు 3.5శాతంగానూ, రూ. 50లక్షలు అంతకంటే ఎక్కువ ఉంటే.. యధావిధిగా 4శాతం వడ్డీరేటు ఉంటుంది’ అని బీఎస్ఈ ఫైలింగ్ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. నేటి నుంచే ఈ వడ్డీరేట్లు అమల్లోకి రానున్నాయని చెప్పింది. కాగా జూలై 31 న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లను కోతపెడుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులు ఇదే బాటలను అనుసరించాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కర్ణాటక బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. -
లాభాల్లోకి బ్యాంక్ ఆఫ్ ఇండియా
జూన్ క్వార్టర్లో రూ.88 కోట్లు ముంబై: జూన్ క్వార్టర్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరిగి లాభాల్లోకి అడుగు పెట్టింది. రూ.88 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఆస్తుల నాణ్యత మెరుగుపడడంతో మొండి బాకాయిలకు చేసిన కేటాయింపులు తగ్గాయి. గతేడాది ఇదే కాలంలో బ్యాంకు రూ.741 కోట్ల నష్టాన్ని ఎదుర్కోవడం గమనార్హం. మొండి బకాయిలను మరింత మెరుగ్గా వసూలు చేయడంతోపాటు, ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారకుండా తీసుకున్న చర్యలు ఫలించినట్టు బీవోఐ ఎండీ, సీఈవో దీనబంధు మొహపాత్ర తెలిపారు. గతేడాది ఇదే త్రైమాసిక కాలంలో మొండి బకాయిల వసూళ్లు రూ.970 కోట్లు ఉంటే, తాజాగా రూ.1,360 కోట్లకు పెరిగాయి. స్థూల ఎన్పీఏలు 13.38 శాతం నుంచి 13.05 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏలు సైతం 7.78 శాతం నుంచి 6.7 శాతానికి దిగొచ్చాయి. -
నిధుల సేకరణలో పీఎస్‌యూ బ్యాంకులు
12 బ్యాంకుల ప్రణాళిక ∙వీటికి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇంద్రధనుష్ రోడ్‌మ్యాప్ ప్రకారం బాసెల్–3 నిబంధనల మేరకు 2019 మార్చి నాటికి ప్రభుత్వరంగ బ్యాంకులు మార్కెట్ల నుంచి వివిధ రూపాల్లో రూ.1.10 లక్షల కోట్లను సమీకరించాల్సి ఉంటుంది. అదే సమయంలో పీఎస్‌యూ బ్యాంకులకు ప్రభుత్వం నుంచి రూ.70,000 కోట్ల సాయం అందనుంది. ఇందులో రూ.50,000 కోట్లను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ (పీఎస్‌యూ) బ్యాంకులు నిధుల వేటలో పడ్డాయి. 12 బ్యాంకులు మార్కెట్ల నుంచి నిధులు సమీకరించనున్నాయి. వీటిలో పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు కూడా ఉన్నాయి. బాసెల్–3 మూలధన అవసరాలను చేరుకునేందుకు బ్యాంకులకు నిధుల అవసరం ఉంది. ఆంధ్రా బ్యాంకు సహా మొత్తం మీద ఆరు నుంచి ఏడు పీఎస్‌యూ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నిధుల సమీకరణను పూర్తి చేయనున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మిగిలిన బ్యాంకులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో), అర్హత గల సంస్థాగత మదుపరులకు షేర్ల కేటాయింపు (క్యూఐపీ) ద్వారా నిధులు సమీకరించనున్నట్టు వెల్లడించాయి. పలు అవకాశాలు... అలహాబాద్ బ్యాంకు,ఆంధ్రా బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, దేనా బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకులు క్యూఐపీ లేదా ఎఫ్‌పీవో లేదా ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ విధానంలో నిధులు సేకరించేందుకు ఇప్పటికే ప్రభుత్వ ఆమోదం కూడా పొందాయి. సిండికేట్ బ్యాంకు, యూకో బ్యాంకు, యునైటెడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, విజయా బ్యాంకులకు సైతం ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇక అలçహాబాద్ బ్యాంకు రూ.2,000 కోట్ల నిధుల సమీకరణకు వాటాదారులు కూడా ఆమోదం తెలిపారు. పీఎన్బీ బోర్డు రూ.3,000 కోట్ల నిధుల సమీకరణకు అంగీకారం తెలిపింది. దేనా బ్యాంకు రూ.1,800 కోట్ల సమీకరణకూ వాటాదారులు ఆమోదం తెలియజేశారు. ఎస్బీఐ క్యూఐపీ ద్వారా రూ.15,000 కోట్ల సమీకరణను ఇటీవలే పూర్తి చేసిన విషయం తెలిసిందే. -
టీఎస్ఐఐసీకి బీవోఐ రుణ సదుపాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఎస్ఐఐసీ చేపడుతున్న ప్రాజెక్టులకు, పారిశ్రామిక వాడల అభివృద్ధికి రుణ సదుపాయం కల్పించడానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) ముందుకొచ్చింది. టీఎస్ఐఐసీ ద్వారా పరిశ్రమలను స్థాపిస్తున్న కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు కూడా రుణాలివ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎండీ ఈవీ నర్సింహారెడ్డితో బుధవారం పరిశ్రమ భవన్లో బీవోఐ (నేషనల్ బ్యాకింగ్ గ్రూప్, సౌత్) వినియోగదారుల సంబంధాల కార్య నిర్వహణాధికారి వినయ్దీప్ మట్టా, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జేఎస్వీ సూర్యనారాయణరాజు భేటీ అయ్యారు. టీఎస్ఐఐసీ ప్రాజెక్టులకు, కొత్త ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి రుణ సదుపాయం కల్పించనున్నట్టు వారు తెలిపారు. భూముల కొనుగోళ్లకు మినహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు రుణ సదుపాయం అందిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, నిరుద్యోగులకు విరివిగా రుణాలను అందించాలని బీవోఐ అధికారులకు బాలమల్లు సూచించారు. -
మళ్లీ నష్టాల్లోకి బ్యాంక్ ఆఫ్ ఇండియా
న్యూఢిల్లీ: వరుసగా రెండు క్వార్టర్లలో లాభాల్ని కనపర్చి, టర్న్ ఎరౌండ్ అయిన ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్లీ నష్టాల్లోకి జారిపోయింది. 2017 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో రూ. 1,045 కోట్ల నికరనష్టాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో కనపర్చిన రూ. 3,587 కోట్ల నికరనష్టంతో పోలిస్తే తాజాగా ముగిసిన త్రైమాసికంలో నష్టాలు తగ్గినప్పటికీ, అంతక్రితం వరుసగా రెండు త్రైమాసికాల్లో (2016 సెప్టెంబర్, డిసెంబర్ క్వార్టర్లు) ఈ బ్యాంకు లాభాల్ని ఆర్జించగలిగింది. కానీ 2017 మార్చి త్రైమాసికంలో ఎన్పీఏలు రూ. 7,000 కోట్ల మేర పెరగ్గా, రూ. 3,983 కోట్ల బకాయిల్ని బ్యాంకు రైటాఫ్చేసింది. 2016 డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే మొండి బకాయిలు మూడు రెట్లు పెరిగాయి. దాంతో మార్చి క్వార్టర్లో నష్టాలు తప్పలేదు. 2016–17 ఆర్థిక సంవత్సరానికి లాభాలేవీ లేనందున, సోమవారం సమావేశమైన బ్యాంకు డైరెక్టర్ల బోర్డు ఎటువంటి డివిడెండునూ సిఫార్సుచేయలేదు. పూర్తి ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రూ. 1,558 కోట్ల నికరనష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఈ నష్టం రూ. 6,089 కోట్లు. స్థూల ఎన్పీఏలు 13.22 శాతం... మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్పీఏల శాతం 13.07 నుంచి 13.22కు పెరిగింది. నికర ఎన్పీఏలు మాత్రం 2016 మార్చి క్వార్టర్‌తో పోలిస్తే 7.79 శాతం నుంచి 6.90 శాతానికి తగ్గాయి. నికర వడ్డీ ఆదాయం 8.8 శాతం పెరిగి రూ. 3,187 కోట్ల నుంచి రూ. 3,469 కోట్లకు పెరిగింది. బ్యాంకు ఇతర ఆదాయం రూ. 884 కోట్ల నుంచి భారీగా రూ. 1,754 కోట్లకు పెరిగింది. ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు జాయింట్ వెంచర్ అయిన స్టార్ యూనియన్ దైచీ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 18 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ. 495 కోట్ల లాభం సంపాదించడం, సిబిల్లో వాటాను రూ. 188 కోట్లకు విక్రయించడం వంటి అంశాల కారణంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇతర ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు నష్టాల్ని పరిమితం చేసుకోగలిగింది. ఫలితాల నేపథ్యంలో ఈ షేరు 10 శాతంపైగా పతనమై రూ. 158 వద్ద ముగిసింది. 2015 ఆగస్టు తర్వాత ఈ షేరు ఒకే రోజులో ఇంతగా క్షీణించడం ఇదే ప్రధమం. -
బ్యాంకు ఆఫ్ ఇండియా మళ్లీ కుదేలు
ముంబై : దేశంలోనే ఆరో అతిపెద్ద రుణదాత బ్యాంకు ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరోసారి భారీ నష్టాలను నమోదుచేసింది. మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్ లో ఈ బ్యాంకు నికర నష్టాలు 1,046 కోట్లగా ఫైల్ చేసింది. బ్యాడ్ లోన్స్ శాతం తగ్గకుండా అలానే అత్యధికంగా ఉండటంతో బ్యాంకుకు మరోసారి భారీ నష్టాలే నమోదయ్యాయి. అయితే ముందటి ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఏడాది కొంత నష్టాలను బ్యాంకు ఆఫ్ ఇండియా తగ్గించుకుంది. గతేడాది ఈ బ్యాంకు నష్టాలు రూ.3,587 కోట్లు. డిసెంబర్ క్వార్టర్ లో బ్యాంకు రూ.102 కోట్ల నికర లాభాలను నమోదుచేసింది. గత క్వార్టర్ కంటే ఆస్తుల నాణ్యత క్షీణించిందని బ్యాంకు ఆఫ్ ఇండియా సోమవారం బీఎస్ఈ ఫైలింగ్ లో పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం బ్యాంకుకు 9 శాతం పెరిగి రూ.3469 కోట్లగా నమోదయ్యాయని తెలిపింది. ముందటి ఆర్థిక సంవత్సరం ఈ వడ్డీ ఆదాయాలు రూ.3187 కోట్లు. బ్యాంకు ఆస్తుల నాణ్యత క్షీణించడానికి ప్రధాన కారణం స్థూల నిరర్థక ఆస్తులు పెరగడమేనని తెలిసింది. డిసెంబర్ క్వార్టర్ లో రూ.51,781 కోట్లగా ఉన్న ఈ స్థూల నిరర్థక ఆస్తులు, ఈ క్వార్టర్ లో రూ.52,044 కోట్లకు పెరిగాయి. ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్ లో ఇవి రూ.49,879 కోట్లు. మొత్తం రుణాల్లో బ్యాడ్ లోన్స్ అలానే అత్యధికంగా 13.22 శాతంగా ఉన్నాయి. గత క్వార్టర్ లో ఇవి 13.38 శాతం. ఫలితాల ప్రకటనాంతరం బ్యాంకు ఆఫ్ ఇండియా షేర్లు 7 శాతం మేర నష్టపోయి, రూ.166 వద్ద నమోదవుతున్నాయి. -
‘భగీరథ’ పనులు సకాలంలో పూర్తి చేయాలి
ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎస్ ఎస్పీ సింగ్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: నల్లా ద్వారా ఇంటింటికీ తాగు నీరందించే మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశించారు. భగీరథ పనులపై అన్ని జిల్లాల సూపరింటెండింగ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో శనివారం గ్రామీణ నీటి సరఫరా ప్రధాన కార్యాలయంలో ఆయన సమీక్షించారు. భగీరథ ద్వారా మంచినీటి సరఫరాను ఆయా గ్రామాల్లోని షెడ్యూల్ కులాలు, తెగల ప్రజలు ఉండే కాలనీల నుంచే ప్రారంభించాలని సూచించారు. పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజలను సమన్వయ పరిచాకే ఆయా గ్రామాల్లో అంతర్గత పైప్ లైన్ పనులను ప్రారంభించాలన్నారు. వేగంగా భగీరథ పనులు: ప్రశాంత్‌రెడ్డి మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులు జరుగుతున్నంత వేగంగా దేశంలో ఇంతకుముందెన్నడూ జరగలేదని తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కేంద్రం కూడా భగీరథ పనుల వేగం, నాణ్యతను వివిధ వేదికలపై ప్రశంసిస్తోందని తెలిపారు. ఇంటేక్‌వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, బ్యాలెన్సిం గ్ రిజర్వాయర్లు, ఇంట్రా విలేజ్ పైప్ లైన్ పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రూ.1,816 కోట్ల రుణం మంజూరు చేసేందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకారం తెలిపింది. శ్రీశైలం– వికారాబాద్– చేవేళ్ల– తాండూరు–పరిగి, శ్రీశైలం–గుడిపల్లి సెగ్మెంట్ పనులకు బ్యాంక్ ఆఫ్ ఇండియాతో తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ ఎంవోయూ కుదుర్చుకుంది. ఎంవోయూ పత్రాలపై సీఎస్ ఎస్పీ సింగ్, బ్యాంక్ ప్రతినిధులు సంతకాలు చేశారు. -
అందుకోండి మొబైల్‌క్యాష్..
పీవోఎస్ పాయింట్లతో డబ్బులు చెల్లింపు ► ఎస్బీఐ ఆధ్వర్యంలో సేవలు ► ఖాతాదారులకు ఆసరాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా కరీంనగర్ బిజినెస్ : పెద్దనోట్లు రద్దయినప్పటి నుంచి బ్యాంకుల ఎదుట బారెడు క్యూలైన్లు.. ఏటీఎంలలో గంటల్లోనే డబ్బులు నిండుకోవడంతో జనం పాట్లు అన్నీ ఇన్నీ కా వు. గంటల తరబడి క్యూలైన్లలో ఎదురుచూసి మన వంతు వచ్చేసరికి నగదు ఖాళీ అరుుతే ఆ బాధ వర్ణనాతీతం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో డబ్బులు తీసుకుని బ్యాంకులు మన దగ్గరికే వస్తే ఎలా ఉం టుంది..! ఎడారిలో ఒయాసిస్ కనిపించి నంత సంబరం చేసుకుంటాం!! ప్రజల నగ దు కష్టాలను కొంతైనా తీర్చేందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొబైల్‌క్యాష్ ఎట్ పీవోఎస్ పారుుంట్లు ఏర్పాటు చేశారు. స్టేబ్ బ్యాంక్ ఏటీఎం కార్డుదారులకు రూ.వెరుు్య అందిస్తున్నారు. ఆరు రోజులుగా పీవోఎస్ మిషన్ల ద్వారా నగరంలో సేవలు అందిస్తున్నారు. కరీంనగర్‌తోపాటు జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఐదు కేంద్రాల ఈ సేవలందిస్తున్నట్లు ఎస్బీఐ ఆర్ఎం శోభ తెలిపారు. ఈ సేవలందుకున్న వినియోగదారుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. అవసరాలు తీర్చుతున్నాయి.. బ్యాంకులు, ఏటీఎంలలో డబ్బులు దొరక్క చాలా ఇబ్బందవుతుంది. నేను పనిమీద కరీంనగర్ వచ్చాను. ఎక్కడా పెద్దనోట్లు చెల్లడం లేదు. ఎస్బీఐ అందిస్తున్న ఈ సేవలు చాలా బాగున్నాయి. రద్దీగా ఉండే బస్టాండ్‌లో ఏర్పాటు చేయడంతో ప్రజలు అవసరాలు తీర్చుతున్నాయి. - విష్ణు, సిరిసిల్ల ఏటీఎంలు ఖాళీ... చిల్లర లేక చాలా ఇబ్బందులు పడుతున్నం. ఖాతాల్లో నగదు డ్రా చేసుకుందామని అన్ని ఏటీఎంలు తిరిగినా ఎక్కడ డబ్బులు లేవు. చివరికి బస్టాండ్ వద్దకు రాగానే ఇది కనిపించింది. ఏంటని తెలుసుకుంటే డబ్బులు ఇస్తున్నామన్నారు. ఎక్కడ తిరిగినా డబ్బులు దొరకని పరిస్థితిలో మన వద్దకే ఇలా రావడం ఆశ్చర్యం కలిగించింది. - ఎండీ ఇలియాస్, కరీంనగర్ ఎస్బీఐ సేవలు అద్భుతం మా ఊరు నుంచి కరీంనగర్‌కు పనిమీద వచ్చిన. కరీంనగర్ మొత్తం తిరిగినా ఏటీఎంలు ఎక్కడా పనిచేస్తలేవు. చివరికి బస్టాండ్‌కి వచ్చేసరికి ఎస్బీఐ వినియోగదారులకు డబ్బులిస్తున్నారు. పీవోఎస్ మిషన్‌తో ఏటీంఎం కార్డు ద్వారా రూ.వెరుు్య ఇచ్చారు . - అంజయ్య, గన్నేరువరం ఖాతాదారులకు అండగా.. ఖాతాదారుల ఇబ్బందులు తొలగించి కొంతవరకు అండగా నిల్చేందుకే ఈ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. నగరంలో అక్కడక్కడ మొబైల్ క్యాష్ ఎట్ పీవోఎస్ పారుుంట్ల తో ఏటీఎం కార్డు ద్వారా రూ.వెరుు్య నగదు చెల్లిస్తున్నాం. చా లా మంది వినియోగదారులు వినియోగించుకుంటున్నారు. - ఎం.శ్రీనివాసమూర్తి, మేనేజర్, ఎస్బీఐ (ఆర్బీవో, సీఎస్ అండ్ సీఎం) -
బ్యాంకులది ఒడిదుడుకుల బాటే!
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నివేదిక వాషింగ్టన్: భారత్ బ్యాంకులది ఒడిదుడుకుల బాటేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. లాభాలు తగ్గడం, మొండిబకాయిల బరువు దీనికి కారణంగా వివరించింది. ‘గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ’ పేరుతో ఐఎంఎఫ్ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. మొండిబకాయిల గురించి ప్రత్యేక, అదనపు, సకాల చర్యలు అవసరమని సూచించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌యూ) రుణాల్లో స్థూల మొండిబకాయిలు 2014-15లో 5.32% (రూ.2.67 లక్షల కోట్ల) ఉంటే ఈ పరిమాణం 2015-16లో 9.32%కి (రూ.4.76 లక్షల కోట్లు) పెరగడం ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. గత 12 నెలల్లో 39 లిస్టెడ్ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 96% పెరిగాయి. 2016 జూన్ నాటికి రూ.6.3 లక్షల కోట్ల స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్ భారత్ బ్యాం కింగ్‌కు సంబంధించి సంస్థ విడుదల చేసిన నివేదికలో ముఖ్యాంశాలు... ⇔ ఎన్పీఏలతో ఇందుకు సంబంధించి అదనపు ప్రొవిజనింగ్ (కేటాయింపులు) బ్యాంకింగ్‌కు భారంగా మారతాయి. దీనితో వ్యవస్థకు మరింత అధిక మొత్తంలో మూలధనం అవసరం అవుతుంది. ⇔ సమస్య పరిష్కార దిశలో కార్పొరేట్ దివాలా చట్టాల సంస్కరణల పటిష్ట అమలు అవసరం. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్, ఈక్విటీకి రుణ మార్పిడి, సమగ్ర, పారదర్శక నియమ నిబంధనల అమలు ముఖ్యం. ⇔ కార్పొరేట్ రుణ ఒత్తిడులను ఎదుర్కొనే ఒక ప్రత్యేక యంత్రాంగమూ మొండిబకాయిల సమస్య పరిష్కారంలో కీలకం. ⇔ భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు వర్ధమాన దేశాల్లోనూ మొండిబకాయిల సమస్య ఉంది. ఆయా దేశాల్లో బ్యాంకింగ్ పర్యవేక్షణ పటిష్టత అవసరం. అలాగే ప్రపంచవ్యాప్తంగా సమస్య తీవ్రమవకుండా నిరోధించే క్రమంలో వ్యవస్థలు, సెంట్రల్ బ్యాంకుల మధ్య సమన్వయ అవసరం ఎంతో ఉంది. ⇔ స్థిరమైన రాజకీయ వాతావారణ పరిస్థితి భారత్‌కు లాభిస్తున్న అంశాల్లో కీలకమైనది. ⇔ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి సమస్య పరిష్కారంలో కీలకం. -
ఎస్యూడీలో వాటా విక్రయించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా
18 శాతం వాటా రూ.540 కోట్లకు అమ్మకం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. తన జాయింట్ వెంచర్ జీవిత బీమా కంపెనీ, ఎస్యూడీలో 18% వాటాను ఆ జేవీ విదేశీ భాగస్వామికి విక్రయించింది. స్టార్ యూనియన్ దై-చి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ(ఎస్‌యూడీ)లో 18 % వాటాను జపాన్‌కు చెందిన దై-చి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ(డీఐఎల్ఐసీ)కు రూ.540 కోట్లకు విక్రయించామని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ వాటా విక్రయం కారణంగా ఈ జేవీలో దైచీ వాటా 26 శాతం నుంచి 44%కి పెరగ్గా, బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటా 48% నుంచి 30%కి తగ్గింది. మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్‌కు మిగిలిన 26% వాటా ఉంది. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా నష్టం రూ.3,587 కోట్లు
ముంబై: ప్రభుత్వం రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ)కు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నికర నష్టాలు భారీగా పెరిగాయి. 2014-15 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.56 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.3,587 కోట్లకు పెరిగాయని బీఓఐ తెలిపింది. మొండి బకాయిలు బాగా పెరగడమే దీనికి కారణమని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.12,287 కోట్ల నుంచి రూ.11,385 కోట్లకు తగ్గింది. స్థూల మొండి బకాయిలు 5.39 శాతం (రూ.22,193 కోట్లు) నుంచి 13%కి (రూ.49,879 కోట్లకు), నికర మొండి బకాయిలు 3.36 శాతం(రూ.13,518 కోట్ల) నుంచి 7.79 శాతానికి(రూ.27,776 కోట్లకు) పెరిగాయని పేర్కొంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం. మొండి బకాయిలు, ఇతర అంశాలకు కేటాయింపులు భారీగా పెంచాల్సి వచ్చిందని వివరించింది. ఈ కేటాయింపులు రూ.2,255 కోట్ల నుంచి రూ.5,470 కోట్లకు పెరిగాయి. ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2014-15లో రూ.1,709 కోట్ల నికర లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.6,089 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. మొత్తం ఆదాయం రూ.47,663 కోట్ల నుంచి రూ.45,449 కోట్లకు పడిపోయింది. భారీ నష్టాల కారణంగా డివిడెండ్‌ను ఇవ్వలేకుపోతున్నామని బ్యాంక్ పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయి(రూ.79)ని తాకిన ఈ షేర్ చివరకు స్వల్ప నష్టంతో రూ.80 వద్ద ముగిసింది. -
సుద్ లైఫ్ నుంచి గ్యారెంటెడ్ పెన్షన్ ప్లాన్
హైదరాబాద్: బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జపాన్‌కు చెందిన దై-చి లైఫ్‌ల జాయింట్ వెంచర్ ‘స్టార్ యూనియన్ దై-చి లైఫ్ ఇన్సూరెన్స్’ (సుద్ లైఫ్) తాజాగా ‘సుద్ లైఫ్ గ్యారెంటెడ్ పెన్షన్ ప్లాన్’ను మార్కెట్లోకి తీసుకువ చ్చింది. రిటైర్మెంట్ తర్వాతి జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఈ పాలసీ ఉపయుక్తంగా ఉంటుందని సుద్ లైఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. పాలసీలో ఎలాంటి మెడికల్ చెకప్‌లు ఉండవని పేర్కొంది. వయసు ఆధారంగా పాలసీ టర్మ్, ప్రీమియం చెల్లింపును ఎంపిక చేసుకోవచ్చని వివరించింది. పాలసీలో తీసుకోవాలనుకుంటున్న వ్యక్తి వయసు 35-65 ఏళ్ల మధ్యలో ఉండాలని తెలిపింది. పదవీ విరమణ సమయంలో పాలసీ మొత్తాన్ని ఒకేసారి తీసుకోవచ్చని పేర్కొంది. -
బ్యాంకుల రేటింగ్లలో కోత
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) రేటింగ్ అంచనాలను స్థిర స్థాయి నుంచి నెగెటివ్ స్థాయికి తగ్గించినట్లు ఎస్అండ్పీ రేటింగ్స్ సంస్థ తెలిపింది. రాబోయే ఏడాదిన్నర కాలంలో మొండి బకాయిల భారం మరింత పెరగొచ్చన్న అంచనాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే కొంత పటిష్టమైన, ప్రభుత్వం నుంచి మద్దతు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్న బ్యాంకుగా సూచిస్తూ.. స్వల్పకాలికంగా ‘ఏ-3’, దీర్ఘకాలికంగా ‘బీబీబీ మైనస్’ రేటింగ్‌ను ఇస్తున్నట్లు ఎస్అండ్పీ క్రెడిట్ అనలిస్టు అమిత్ పాండే చెప్పారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ను(ఐవోబీ) కూడా ప్రతికూల అంచనాలతో.. ప్రత్యేకంగా గమనించాల్సిన విభాగంలోకి(క్రెడిట్వాచ్) ఎస్అండ్పీ చేర్చింది. ఎన్పీఏలతో నష్టాలు మరింత పెరగొచ్చన్న అంచనాలు దీనికి కారణం. ఐవోబీకి దీర్ఘకాలికంగా ‘బిబిప్లస్’, స్వల్పకాలికంగా ‘బి’ రేటింగ్ ఉంది. ఐడీబీఐ బ్యాంకునకు బిబిప్లస్ దీర్ఘకాలిక రేటింగ్‌ను ఇస్తున్నట్లు ఎస్అండ్పీ తెలిపింది. -
షట్టర్ మూసితిరి.. తాళం మరిచితిరి!
బ్యాంక్ సిబ్బంది నిర్వాకం స్థానికుల చొరవతో వెలుగులోకి... నాచారం: బ్యాంక్ ఆఫ్ ఇండియా నాచారం శాఖ కార్యాలయంలోని ఓ షట్టర్‌కు తాళం వేయకుండా సిబ్బంది వెళ్లిపోయిన ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పక్కనే ఉన్న టెకీ మోటార్స్ నిర్వాహకుడు రాజశేఖర్ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఇది గమనించి... స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు బ్యాంక్ మేనేజర్ సుందరికి ఫోన్ చేసి విషయం తెలిపారు. అయితే తాను సెలవులో ఉన్నానని... పొరపాటున సిబ్బంది తాళం వేయడం మరిచిపోయి ఉంటారని ఆమె సమాధానమిచ్చారు. ఆ తర్వాత ఇన్చార్జి మేనేజర్ తేజస్విని, సెక్యూరిటీ గార్డు మూర్తితో కలసి రాత్రి 10.30 గంటల సమయంలో అక్కడికి వచ్చి తాళం వేశారు. బ్యాంక్ కార్యాలయానికి మూడు షట్టర్లు ఉంటే... రెండింటికి వేసిన సిబ్బంది... మరొక షట్టర్‌కు తాళం వేయడం మరిచిపోయారు. అక్కడే ఉన్న బీవోఐ ఏటీఎంకు సెక్యూరిటీ కూడా లేకపోవడం గమనార్హం. -
బ్యాంకులకు మొండి బకాయిల బండ
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకులకు మొండి బకాయిలు ఇంకా ఇంకా గుదిబండగా మారుతున్నాయి. మంగళవారం ఫలితాలు ప్రకటించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌లకు ఫలితాలపై మొండి బకాయిలు తీవ్రమైన ప్రభావాన్నే చూపించాయి. ఆ వివరాలివీ... పీఎన్బీ లాభం సగం... న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మొండి బకాయిల కేటాయింపులు దెబ్బతీశాయి. ఈ కేటాయింపుల కారణంగా బ్యాంక్ నికర లాభం సగానికి పైగా తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు రూ.721 కోట్ల నికర లాభం ఆర్జించామని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ.1,405 కోట్లు)తో పోల్చితే 49 శాతం క్షీణించిందని వివరించింది. గత క్యూ1లో రూ.19,603 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో రూ.25,397 కోట్లకు పెరిగాయని పేర్కొంది. శాతాల్లో చెపితే ఇది 5.48 శాతం నుంచి 6.47 శాతానికి పెరిగిందని వివరించింది. కేటాయింపులు రూ.928 కోట్ల నుంచి రూ.1,811 కోట్లకు పెరిగాయని పేర్కొంది.ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఈ బ్యాంక్ షేర్లు 5 శాతం వృద్ధితో రూ.142 వద్ద ముగిశాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం 84% డౌన్ జూన్ క్వార్టర్‌కు బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.130 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు సాధించిన నికర లాభంతో (రూ.806 కోట్లు) పోలిస్తే ఏకంగా 84 శాతం క్షీణత నమోదైంది. గతేడాది క్యూ1లో రూ.893 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ1లో రూ.1,515 కోట్లకు పెరిగాయని, లాభం తగ్గడానికి ఇదే ప్రధాన కారణమని తెలియజేసింది. స్థూల నిరర్థక ఆస్తులు 3.2 శాతం (రూ.12,532 కోట్లు) నుంచి 6.8 శాతానికి (రూ.26,889 కోట్లు) ఎగబాకాయి. యూనియన్ బ్యాంక్ కేటాయింపులు రెట్టింపు యూనియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి రూ.519 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం నికర లాభం (రూ.664 కోట్లు)తో పోల్చితే 22 శాతం క్షీణత నమోదైంది. మొత్తం ఆదాయం రూ.8,548 కోట్ల నుంచి రూ.9,043 కోట్లకు పెరిగింది. మొండి బకాయిలకు కేటాయింపులు దాదాపు రెట్టింపయ్యాయని, రూ.393 కోట్ల నుంచి రూ.642 కోట్లకు పెరిగాయని తెలియజేసింది. స్థూల మొండి బకాయిలు 4.27 శాతం (రూ.10,232కోట్లు) నుంచి 5.53 శాతానికి (రూ.14,144 కోట్లకు), నికర మొండి బకాయిలు 2.71 శాతం నుంచి 3.08 శాతానికి ఎగిశాయని తెలిపింది. నికర వడ్డీ ఆదాయం రూ.2,117 కోట్ల నుంచి రూ.2,130 కోట్లకు, వడ్డీయేతర ఆదాయం 13 శాతం వృద్ధితో రూ.783 కోట్లకు పెరిగాయని వివరించింది. అయితే మొండి బకాయిలను నియంత్రిస్తామని బ్యాంక్ సీఎండీ అరుణ్ తివారీ ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ బ్యాంక్ షేర్ బీఎస్ఈలో 2 శాతం వృద్ధితో రూ.157 వద్ద ముగిసింది. సిండికేట్ బ్యాంక్ లాభం రూ.302 కోట్లు సిండికేట్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు రూ.302 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం(రూ.485 కోట్లు)తో పోల్చితే 38 శాతం క్షీణత నమోదైంది. మొత్తం ఆదాయం రూ.5,523 కోట్ల నుంచి రూ.6,323 కోట్లకు పెరిగిందని బ్యాంకు పేర్కొంది. స్థూల మొండి బకాయిలు 2.97 శాతం నుంచి 3.72 శాతానికి, వడ్డీ ఆదాయం రూ.5,067 కోట్ల నుంచి రూ.5,823 కోట్లకు పెరిగిందని వివరించింది. ఫలితాల నేపధ్యంలో బీఎస్ఈలో ఈ బ్యాంక్ షేర్ 9 శాతం క్షీణించి రూ.90 వద్ద ముగిసింది. -
బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మొండి బకాయిల భారం
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.56 కోట్ల నికర నష్టం పొందింది. మొండి బకాయిలకు అధిక కేటాయింపులు, అన్ని సెగ్మెంట్లలో పేలవమైన పనితీరు కారణంగా నష్టాలు వచ్చాయని బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయ లక్ష్మి అయ్యర్ చెప్పారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో జనవరి-మార్చి క్వార్టర్లో రూ.558 కోట్ల నికర లాభం పొందామని వివరించారు. స్థూల మొండి బకాయిలు 3.15 శాతం నుంచి 5.39 శాతానికి, మొండి బకాయిలకు కేటాయింపులు రూ.1,547 కోట్ల నుంచి 97 శాతం వృద్ధితో రూ.2,255 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. మొత్తం ఆదాయం రూ.11,274 కోట్ల నుంచి రూ.12,287 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి వస్తే, 2013-14లో రూ.2,729 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15లో 37 శాతం క్షీణించి రూ.1,709 కోట్లకు తగ్గిందని అయ్యర్ పేర్కొన్నారు. మొత్తం ఆదాయం రూ.42,202 కోట్ల నుంచి రూ.47,663 కోట్లకు పెరిగిందని వివరించారు.. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఈ కంపెనీ షేర్ 6.6 శాతం క్షీణించి రూ.191 వద్ద ముగిసింది. సీఎండీగా రెండేళ్లు పదవీ బాధ్యతలు నిర్వర్తించిన లక్ష్మీ అయ్యర్ ఈ వారంలో పదవీ విరమణ చేయనున్నారు. -
బ్యాంకుల చైర్మన్ నియామక ప్రక్రియ షురూ!
న్యూఢిల్లీ: పలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్లను ఎంపికచేసే ప్రక్రియను ఆర్థిక మంత్రిత్వశాఖ చేపట్టింది. ఇందుకోసం పదవీ విరమణ చేసిన బ్యూరోక్రాట్స్, బ్యాంకర్లను గుర్తించే ప్రయత్నం ప్రారంభమైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ పోస్ట్‌ను విభజించాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిండికేట్ బ్యాంక్‌సహా ఎనిమిది బ్యాంకులకు ఈ నియామకాల అవసరం ఏర్పడిందని అధికార వర్గాలు తెలిపాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్‌కు కూడా చైర్మన్ నియామకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల బ్యాంకుల్లో మాజీ బ్యాంకర్లు లేదా, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ నియామకాల సందర్భాల్లో ఎటువంటి ఇంటర్వ్యూలూ నిర్వహించడం జరగదని సమాచారం. ఐదు ప్రభుత్వ రంగ సీఈఓ, మేనేజింగ్ డెరైక్టర్ల నియామకాలకు అర్హులైన అభ్యర్థుల కోసం మంత్రిత్వశాఖ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించింది. మంగళవారంతో ఇందుకు సంబంధించి గడువు ముగుస్తుంది. -
బీఓఐ రుణ రేటు పావుశాతం కోత..
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) కనీస రుణ రేటును (బేస్‌రేట్) 25 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీంతో ఈ రేటు ప్రస్తుత 10.20 శాతం నుంచి 9.95 శాతానికి తగ్గుతుంది. ఈ నిర్ణయం వల్ల బ్యాంక్ ఆటో, గృహ ఇతర రుణ రేట్లు తగ్గే అవకాశం ఏర్పడింది. మే 4వ తేదీ నుంచి కొత్త రేటు అమల్లోకి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.5 శాతం) తగ్గించి రుణ రేటు తగ్గింపునకు సంకేతాలు ఇచ్చినా... బ్యాంకింగ్ ఈ మేరకు నిర్ణయం తీసుకోకపోవడం ‘నాన్సెస్’ అంటూ గవర్నర్ రఘురామ్ రాజన్ ఏప్రిల్ 7 పాలసీ సమావేశం సందర్భంగా ఆగ్రహించిన నేపథ్యంలో పలు బ్యాంకులు రుణ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి. ఈ దిశలో ఇప్పటికే బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ, ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌సహా పలు బ్యాంకులు రుణ రేటును 0.15 శాతం నుంచి 0.25 శాతం వరకూ తగ్గించాయి. -
70 శాతం తగ్గిన బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 70 శాతం క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.586 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.173 కోట్లకు తగ్గిందని బ్యాంక్ సీఎండీ విజయలక్ష్మి అయ్యర్ చెప్పారు. కేటాయింపులు అధికంగా ఉండడం, మొండి బకాయిలు పెరగడం, వడ్డీ ఆదాయం స్వల్పంగానే వృద్ది చెందడం వల్ల నికర లాభం భారీగా తగ్గిందని పేర్కొన్నారు. గత క్యూ3లో 2.8 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 4.07 శాతానికి, నికర మొండి బకాయిలు 1.75 శాతం నుంచి 2.5 శాతానికి పెరిగాయని వివరించారు. ఆదాయపు పన్ను మినహా కేటాయింపులు రూ.1,404 కోట్ల నుంచి రూ.1,581 కోట్లకు పెరిగాయని, వడ్డీ ఆదాయం రూ.9,769 కోట్ల నుంచి రూ.11,947 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. మొండి బకాయిలకు కేటాయింపులు 25 శాతం నుంచి40 శాతానికి పెరిగాయని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో బ్యాంక్ షేర్ 5.7 శాతం తగ్గి రూ.227 వద్ద ముగిసింది. -
డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించిన ఆంధ్రాబ్యాంక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దీర్ఘకాలిక డిపాజిట్లపై వడ్డీరేట్లను ఆంధ్రాబ్యాంక్ తగ్గించింది. రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలపరిమితి గల డిపాజిట్లపై పావు శాతం నుంచి అరశాతం వరకు వడ్డీరేట్లను తగ్గించింది. 2-3 ఏళ్ల కాలపరిమితి గల కోటి రూపాయల లోపు డిపాజిట్లపై వడ్డీరేట్లను 9 నుంచి 8.75 శాతానికి తగ్గించింది. ఇదే కాలపరిమితి గల కోటి నుంచి రూ. 10 కోట్ల డిపాజిట్లపై వడ్డీరేట్లును 8.75 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గాయి. మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితి గల కోటి రూపాయల లోపు డిపాజిట్లపై వడ్డీరేట్లును 8.75 శాతం నుంచి 8.5 శాతానికి, అదే కోటి నుంచి రూ. 10 కోట్ల డిపాజిట్లపై రేట్లను 8.75 శాతం నుంచి 8.25 శాతానికి తగ్గించింది. 6వ తేదీ నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయి. అలహాబాద్ బ్యాంక్ కూడా... అలహాబాద్ బ్యాంక్ రిటైల్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 0.15 శాతం వరకూ తగ్గించింది. ఏడాది నుంచి ఐదేళ్ల కాల శ్రేణిలో డిపాజిట్లపై 0.15 శాతం రేటు తగ్గించింది. దీని ప్రకారం ఈ రేటు 8.90 శాతానికి తగ్గుతుంది. 10వ తేదీ నుంచీ కొత్త రేటు అమల్లోకి వస్తుంది. -
6 మెట్రో నగరాల్లో...ఇక ఏటీఎం చార్జీల మోత
ముంబై: మెట్రోపాలిటన్ నగరాల్లో ఏటీఎంల వినియోగంపై చార్జీల మోత మోగనుంది. హైదరాబాద్ సహా ఆరు మెట్రోపాలిటన్ నగరాల్లో నవంబర్ నుంచి ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిని కుదించాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి ఇకపై నెలకు 5 లావాదేవీలు మాత్రమే ఉచితం. అదే మరో బ్యాంకు ఏటీఎంలోనైతే ఈ పరిమితిని ప్రస్తుతమున్న 5 నుంచి 3కు తగ్గించనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. నగదు విత్‌డ్రాయల్స్ మొదలుకుని బ్యాలెన్స్ స్టేట్మెంట్ల లావాదేవీల దాకా అన్నీ ఈ పరిమితికి లోబడే ఉండాలి. ఒకవేళ దాటితే ప్రతి లావాదేవీకి గరిష్టంగా రూ. 20 మేర చార్జీలు పడతాయి. అయితే, చెక్‌బుక్కులు తదితర అదనపు సర్వీసులు ఉండని బేసిక్ సేవింగ్స్ ఖాతాలకు వీటి నుంచి మినహాయింపు ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. మిగిలిన చోట్ల ఇతర ఏటీఎంల వాడకంపై ప్రస్తుతమున్న ఐదు లావాదేవీల పరిమితి యథాప్రకారం కొనసాగుతుంది. ఈ ఏడాది మార్చి దాకా అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 1.6 లక్షల ఏటీఎంలు ఉన్నాయి. అయితే ఏటీఎంల ఏర్పాటు, ఉచిత లావాదేవీల వల్ల నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగిపోతున్నాయని బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయాన్ని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్.. త న దృష్టికి తీసుకురావడంతో ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. నిర్దేశిత పరిమితులను, కొత్త చార్జీలను గురించి ఖాతాదారులకు పారదర్శకంగా తెలియజేయాలని బ్యాంకులకు సూచిం చింది. అలాగే, ఈ విషయంలో ఖాతాదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండాను, ఫిర్యాదులు తలెత్తకుండా చూసేందుకు వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఖాతాదారుల సౌలభ్యం కోసం వారు వినియోగిస్తున్న ఏటీఎం మెట్రో పరిధిలో ఉందా లేక నాన్-మెట్రో పరిధిలో ఉందా అన్నది స్పష్టంగా తెలిసేలా తగిన ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. అలా గే వినియోగించుకున్న ఉచిత లావాదేవీల సంఖ్యను విధించబోయే చార్జీలను కస్టమర్లకు తెలియచేయాలి. -
బీఓఐ లాభం 26% డౌన్
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) నికర లాభం జనవరి-మార్చి(క్యూ4) కాలంలో 26% క్షీణించి రూ. 557 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో రూ. 756 కోట్లను ఆర్జించింది. ఇదే కాలానికి బ్యాంక్ ఆదాయం మాత్రం రూ. 9,266 కోట్ల నుంచి రూ. 11,274 కోట్లకు ఎగసింది. ఇక పూర్తి ఏడాదికి(2013-14) బ్యాంక్ నికర లాభంరూ. 2,749 కోట్ల నుంచి నామమాత్రంగా రూ. 2,729 కోట్లకు తగ్గింది. అయితే మొత్తం ఆదాయం రూ. 35,675 కోట్ల నుంచి రూ. 42,202 కోట్లకు పుంజుకుంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం రూ. 2,819 కోట్ల నుంచి రూ. 2,987 కోట్లకు పెరిగింది. ఈ బాటలో ఆదాయం సైతం రూ. 35,880 కోట్ల నుంచి రూ. 42,444 కోట్లకు ఎగ సింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ షేరు 3.4% నష్టపోయి రూ. 263 వద్ద ముగిసింది. -
కార్డు లేకుండానే నగదు తీసుకోవచ్చు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎటువంటి కార్డు, బ్యాంకు ఖాతా లేకుండానే నగదును తీసుకునే సౌకర్యాన్ని బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు దగ్గర్లో ఉన్న ఏటీఎంకి వెళ్ళి నగదును తీసుకోవచ్చు. ఐఎంటీగా పిలుచుకునే ఈ తక్షణ నగదు బదిలీ (ఇనిస్టంట్ మనీ ట్రాన్స్ఫర్ ) సౌకర్యాన్ని ప్రవేశపెట్టిన తొలి ప్రభుత్వరంగ బ్యాంకుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా రికార్డులకు ఎక్కింది. మా బ్యాంకు ఖాతాదారులు ఎదుటవారికి ఎటువంటి కార్డులు, బ్యాంకు అకౌంట్ లేకపోయినా నగదును పంపించుకోవచ్చని బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ అండ్ ఎండీ వి.ఆర్.అయ్యర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఐఎంటీ సేవలను లాంఛనంగా ప్రారంభిస్తున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగదు తీసుకునే వారి మొబైల్‌కి రహస్య నెంబర్లు వస్తాయని, వీటిని దగ్గర్లోని ఐఎంటీ ఆథారిత ఏటీఎంలోకి వెళ్ళి ఆ నంబరును ఎంటర్చేయడం ద్వారా నగదు తీసుకోవచ్చన్నారు. రోజు కు గరిష్టంగా రూ.10,000, మించకుండా, నెలలో రూ.25,000 వరకు ఈ ఐఎంటీ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ సేవలను అందుకున్నందుకు గాను రూ.25 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. -
ఎస్బీఐ 1,456 కోట్ల ముందస్తు పన్ను
ముంబై: మార్చి క్వార్టర్‌కు దేశ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.1,456 కోట్ల ముందస్తు పన్ను చెల్లించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో బ్యాంక్ చెల్లింపులు రూ.1,450 కోట్లతో పోల్చితే ఇది తక్కువ. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించి బ్యాంక్ మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. స్థూలంగా చూస్తే- బ్యాంకులు, సిమెంట్ కంపెనీలు అడ్వాన్స్ పన్ను చెల్లింపు అంశంలో వెనుకడుగు వేయగా, ఐటీ సంస్థలు మాత్రం ముందున్నాయి. ఈ అంశాలు ఆర్థిక మందగమన స్థితికి అద్దం పడుతున్నాయని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరికొన్ని సంస్థల తీరు... ఎస్బీఐ సహా ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 14 సంస్థల ముందస్తు పన్ను చెల్లింపులు 13.6 శాతం పెరిగాయి. కొన్ని ముఖ్య సంస్థలను చూస్తే- భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఏటీ చెల్లింపు రూ.230 కోట్ల నుంచి రూ.705 కోట్లకు చేరింది. బ్యాంక్ ఆఫ్ బరోడా విషయంలో ఈ మొత్తం రూ. 350 కోట్ల నుంచి రూ.360 కోట్లకు పెరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీ చెల్లింపులు రూ.790 కోట్ల నుంచి రూ.500 కోట్లకు తగ్గాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చెల్లింపులు రూ.600 కోట్ల నుంచి రూ.1,130 కోట్లకు ఎగిశాయి. ఏసీసీ లిమిటెడ్ ఏటీ చెల్లింపులు గణనీయంగా రూ.220 కోట్ల నుంచి రూ. 110 కోట్లకు పడిపోయాయి. అంబుజా సిమెంట్ విషయంలోనూ ఇదే రీతిలో చెల్లింపులు రూ. 280 కోట్ల నుంచి రూ. 170 కోట్లకు తగ్గాయి. యస్‌బ్యాంక్ రూ.200 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించింది. గత ఏడాది ఇదే కాలం తో పోల్చితే ఇది 20% (రూ.167 కోట్లు) అధికం. నేడు చివరి తేదీ...: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముందస్తు పన్ను చెల్లింపులకు మార్చి 18 చివరి తేదీ. దేశంలోని మొత్తం పన్ను వసూళ్లలో ముంబై వాటా 33 శాతం. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ముంబై సర్కిల్లో ఆదాయపు పన్ను శాఖ మొత్తం పన్ను లక్ష్యం రూ.2.04 లక్షల కోట్లు. మార్చి 17 నాటికి ఈ వసూళ్లు రూ.1.63 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో ఈ వసూళ్ల మొత్తం రూ.1.56 లక్షల కోట్లు. -
స్వల్ప నష్టాలతో సరి...
అంచనాలను తలకి ందులు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్... ద్రవ్యోల్బణంపై వడ్డీ బాణాన్ని ఎక్కుపెట్టారు. రెపో రేటును 0.25% పెంచడం ద్వారా మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి లోను చేశారు. దీంతో తొలుత లాభాలతో కదిలిన స్టాక్ మార్కెట్లు ఉన్నట్టుండి నష్టాలలోకి మళ్లాయి. వెరసి ఉదయం 11 ప్రాంతంలో 20,795 వద్ద ఉన్న సెన్సెక్స్ పాలసీ ప్రకటన వెలువడ్డ వెంటనే 20,554కు పతనమైంది. అయితే చివరికి స్వల్ప నష్టాలతో బయటపడింది. మరోసారి వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చన్న రఘురామ్ వ్యాఖ్యలు ఇందుకు దోహదం చే శాయి. ఫలితంగా ట్రేడింగ్ ముగిసేసరికి 24 పాయింట్ల నష్టంతో 20,683 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ కూడా 9 పాయింట్లు క్షీణించి 6,126 వద్ద స్థిరపడింది. మూడు రోజుల వరుస నష్టాలతో సెన్సెక్స్ 690 పాయింట్లు కోల్పోయింది. జారి‘పడ్డ’ మారుతీ: సెన్సెక్స్ దిగ్గజాలలో క్యూ3 ఫలితాలు ప్రకటించిన మారుతీ అత్యధికంగా 8% దిగజారింది. ఈ బాటలో యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ 3.3-1.5% మధ్య నష్టపోయాయి. మరోవైపు మెటల్ దిగ్గజాలు టాటా స్టీల్, హిందాల్కో, సెసాస్టెరిలైట్ 3.5-2.5% మధ్య లాభపడ్డాయి. వీటితోపాటు టాటా మోటార్స్, బజాజ్ ఆటో, భెల్, ఐసీఐసీఐ సైతం 2.5-1% మధ్య బలపడ్డాయి. కాగా, సోమవారం రూ. 1,334 కోట్ల విలువైన షేర్లను విక్రయించిన ఎఫ్ఐఐలు తాజాగా మరో రూ. 1,267 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. రూపాయి బలపడటానికితోడు, షార్ట్ కవరింగ్ జరగడంతో మార్కెట్లు భారీ నష్టాల నుంచి కోలుకున్నాయని నిపుణులు పేర్కొన్నారు. -
BANKING AWARENESS
1. The first Indian bank to open a branch outside India in London in 1946? a) SBI b) PNB c) BOB d) Canara Bank e) BOI 2. Coins are minted at ? a) Mumbai b) Hyderabad c) Noida d) Kolkatta e) All of these 3. Which of the following is not a function of commercial bank? a) Providing project finance b) Selling mutual funds c) Deciding policy rates like CRR, Repo rates/SLR etc. d) Settlement of payments on behalf of the customers e) Providing services such as locker facilities, remittances etc.. 4. The New Capital Adequacy Frame work prescribed for the banks is commonly known as? a) KYC norms b) Credit Policy c) Basel accord d) Fiscal Policy e) None of these 5. Expand the term FRBM? a) Financial Responsibility and Business management b) Fiscal Responsibility and Business management c) Financial Responsibility and Budget Management d) Fiscal Responsibility and Budget Management e) Formal Responsibility and Business Management 6. What is an Indian Depository Receipt? a) A deposit account with a Public Sector Bank b) A depository account with any of depositories c) An instrument in the form of depository receipt created by an Indian depository against underlying equity shares of the issuing company d) An instrument in the form of deposit receipt issued by Indian depositories e) None of these 7. Land Development Banks form a part of the? a) Commercial Banks b) Industrial Development Bank of India c) Food Corporation of India d) Co-operative Credit Structure e) None of these 8. Which of the following cannot be called as a value Added Service offered by bank? a) Special Accounts for poor sections of society b) Accident Insurance Cover c) Instant credit of outstations cheques d) free cheque books e) All of these 9. The minimum number of women required for formation of women groups under Development of women and children in Rural Areas Programme is? a) 20 b) 15 c) 10 d) 05 e) None of these 10. What is the full form of 'FINO', a term we see frequently in financial newspapers? a) Financial Investment Network and Operations b) Farmer's Investment in National Organization c) Farmers Inclusion News and Operations d) Financial Inclusion Network and Operations e) None of these 11. With an aim to provide better services to the debit card holders, the Reserve Bank of India (RBI) has directed all commercial and public sector banks to introduce new Automated Teller Machines (ATM) that can deliver lower denomination notes such as? a) Rs 10 b) 20 c) 50. d) None of the above e) All the above 12. Which of the following banks is limited to the needs of agriculture and rural finance? a) RBI b) SBI c) IFC d) NABARD e) Axis Bank 13. Open-market operations of Reserve Bank Of India refer to? a) Trading in securities b) Auctioning c) Transaction in gold d) All of these e) None of these 14. Which of the following has introduced a new tool named Data Warehousing and Business Intelligence System for speedy analysis of data and identifica-tion of violations? a) IRDA b) SBI c) RBI d) TRAI e) None of these 15. The Reserve Bank hiked the limit for foreign investment in Asset Reconstruction Companies (ARCs) from the earlier cap of 49 percent to? a) 74 % b) 47 % c) 57 % d) 72 % e) None of the above 16. Which of the following is NOT the part of the scheduled banking structure in india? a) Money Lenders b) Public Sector Banks c) Private Sector Banks d) Regional Rural Banks e) State Co-operative Banks 17. Who is the chairman of the committee constituted by RBI to study issues and concerns in the Micro Finance Institutions sector? a) Y.H. Malegam b) Dr K.C.Chakraborty c) C.Rangarajan d) M.Damodaran e) Smt Usha Thorat 18. An instrument of qualitative credit control in india is? a) Open market operations b) Credit rationing c) Change in reverse ratio d) Bank rate policy e) None of these 19. Which of the following is the full form of the term SLR as used in the banking sector? a) Social Lending Ratio b) Statutory Liquidity Ratio c) Scheduled Liquidity Rate d) Separate Lending Rate e) None of these 20. World Bank Headquarters is in? a) India b) USA c) Switzerland d) Japan e) UK Answers 1) e; 2) e; 3) c;4) c; 5) d; 6) c; 7) d; 8) d; 9) c; 10) a; 11) e; 12) d; 13) a; 14) b; 15) a; 16) a; 17) a; 18) b; 19) b: 20) b. -
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సబ్ స్టాఫ్ కేడర్ పోస్టులు
ఉద్యోగాలు 1) బీఓఐలో సబ్ స్టాఫ్ కేడర్ పోస్టులు బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ)..సబ్‌స్టాఫ్ కేడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. పోస్టుల వివరాలు.. సబ్ స్టాఫ్ కేడర్ పోస్టుల సంఖ్య: 170 అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. వయోపరిమితి: 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఎంపిక: అకడెమిక్ మెరిట్ ఆధారంగా దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తి చేసి పంపాలి. చివరి తేది: ఆగస్టు 24 వెబ్సైట్: www.bankofindia.co.in 2) ‘బార్క్’లో స్టయిపెండరీ ట్రైనీలు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్).. వివిధ విభాగాల్లో స్టయిపెండరీ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. పోస్టుల సంఖ్య: 279 అర్హతలు: భౌతిక, రసాయన, గణితశాస్త్రం సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ ఉండాలి. వయోపరిమితి: 18 నుంచి 22 ఏళ్ల మధ్య శారీరక ప్రమాణాలు: ఎత్తు 160 సెంటీమీటర్లు ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు: ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా చివరి తేది: సెప్టెంబర్ 10 వెబ్సైట్: www.barcrecruit.gov.in 3) సెక్యూరిటీ పేపర్ మిల్లో సూపర్వైజర్లు మధ్యప్రదేశ్ రాష్ట్రం హోషంగాబాద్‌లోని సెక్యూరిటీ పేపర్ మిల్(ఎస్పీఎం).. పలు విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 1. సూపర్వైజర్లు: 39 అర్హత: సంబంధిత విభాగంలో మొదటిశ్రేణి డిప్లొమా ఉండాలి. వయోపరిమితి: 30 ఏళ్లకు మించకూడదు 2. జూనియర్ డేటా ఎంట్రీ ఆపరేటర్:10 అర్హతలు: 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. వయోపరిమితి: 28 ఏళ్లకు మించకూడదు 3. వర్క్‌మెన్: 42 అర్హతలు: పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ ఉండాలి. వయోపరిమితి: 25 ఏళ్లకు మించకూడదు ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసు కున్న దరఖాస్తులను పూర్తి చేసి పంపాలి. చివరి తేది: సెప్టెంబర్ 30 వెబ్సైట్: www.spmhoshangabad.spmcil.com -
సెన్సెక్స్ 18 పాయింట్లు ప్లస్
ఎట్టకేలకు 8 రోజుల నష్టాలకు అడ్డుకట్ట పడింది. సెన్సెక్స్ 18 పాయింట్లు కూడగట్టుకుని 19,182 వద్ద ముగిసింది. అయితే రోజు మొత్తం హెచ్చుతగ్గులకు లోనైంది. గరిష్టంగా 19,306, కనిష్టంగా 19,141 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. గత 8 రోజుల్లో 1,138 పాయింట్లను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక నిఫ్టీ కూడా స్వల్పంగా 7 పాయింట్లు బలపడి 5,685 వద్ద నిలిచింది. కాగా, బీఎస్ఈలో క్యాపిటల్ గూడ్స్ అత్యధికంగా 3.6% పతనంకాగా, మెటల్ ఇండెక్స్ 2.7% పుంజుకుంది. ఎఫ్ఐఐలు కేవలం రూ. 33 కోట్లను ఇన్వెస్ట్ చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 303 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్)లో కాంట్రాక్ట్‌ల సమస్య పరిష్కారానికి స్వతంత్ర కమిటీని వేయనున్న వార్తలతో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు 31% దూసుకెళ్లింది. రూ. 198 వద్ద ముగిసింది. కొత్త కాంట్రాక్ట్‌లను నిలిపివేసిన వార్తలతో గత రెండు రోజుల్లో ఈ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లలో లేని విధంగా జూలై నెలలో ప్రైవేట్ రంగ కార్యకలాపాలు మందగించినట్లు హెచ్ఎస్బీసీ ఇండియా సర్వే పేర్కొనడంతో కొంతమేర సెంటిమెంట్ బలహీనపడిందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఏడాది కనిష్టానికి భెల్ శనివారం ప్రకటించిన ఆర్థిక ఫలితాలు నిరుత్సాహపరచడంతో విద్యుత్‌రంగ దిగ్గజం భెల్ ఏకంగా 19% పతనమైంది. ఏడాది కనిష్టమైన రూ. 121 వద్ద ముగిసింది. నికర లాభం సగానికి పడిపోగా, ఆర్డర్‌బుక్ సైతం బలహీనపడటంతో ఈ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి కంపెనీ మార్కెట్ విలువలో రూ. 6,976 కోట్లు ఆవిరైంది. మార్కెట్ క్యాప్ రూ. 29,591 కోట్లకు పరిమితమైంది. ఇక మిగిలిన దిగ్గజాలలో భారతీ, టాటా మోటార్స్, ఎల్అండ్టీ 2% స్థాయిలో క్షీణించగా, జిందాల్ స్టీల్ అత్యధికంగా 7.7% జంప్ చేసింది. ఈ బాటలో స్టెరిలైట్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, హీరో మోటో, టాటా స్టీల్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్ 4-2% మధ్య లాభపడ్డాయి.