మా బంగారాన్ని తిరిగి ఇచ్చేయండి! | Bank Of India Gave Notices To Gold Loan Holders In Vizianagaram | Sakshi
Sakshi News home page

మా బంగారాన్ని తిరిగి ఇచ్చేయండి!

Published Fri, Aug 30 2019 8:37 PM | Last Updated on Fri, Aug 30 2019 9:05 PM

Bank Of India Gave Notices To Gold Loan Holders In Vizianagaram - Sakshi

సాక్షి, విజయనగరం : జిల్లాలోని పూసపాటిరేగ మండలం కొప్పెర్ల బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో గందరగోళం నెలకొంది. ఖాతాదారులు నకిలీ బంగారం పెట్టి రుణాలు తీసుకున్నారంటూ వదంతులు రావడంతో దుమారం చెలరేగింది. తాకట్టు పెట్టిన బంగారాన్ని ఒసారి తనిఖీ చేసుకోవాలంటూ ఖాతాదారులకు బ్యాంక్‌ అధికారులు నోటిసులు పంపించారు. దీంతో బ్యాంకు ఎదుట ఖాతాదారులు బారులు తీరారు. బంగారాన్ని మార్చేసి నకిలీ బంగారం పెట్టారేమోనని బ్యాంక్‌ యాజమాన్యంపై ఖాతాదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ బంగారం తమకు ఇచ్చేస్తే విడుపించుకుపోతామని బ్యాంకు ఎదుట క్యూ కడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement