vizianaganram
-
మిమ్మల్ని మార్చలేకపోతున్నాను.. మన్నించండి.. గుంజీలు తీసిన హెడ్ మాస్టర్
ఒరేయ్ రామూగా.. నువ్వు చెప్పినపని చేయడం లేదు.. బుద్ధిగా ఉండడం లేదు.. అమ్మకు ఎదురుసమాధానం చెబుతున్నావు.. ఇలాగైతే స్కూల్లో మీ మాస్టారుకు చెప్పి బరిగెతో తొక్క తీయిస్తాను. నీకు మేం చెబితే వినవు.. మీ లెక్కల మాష్టారే కరెక్ట్ ఆయనైతేనే నీకు చర్మం వలిచేసి బుద్ధి చెబుతాడు.. -ఒక పిల్లాడికి తండ్రి వార్నింగ్ ...మాస్టర్ గారండీ.. ఆ శీనుగాడు మా గుంటడే .. బడి నుంచి వచ్చాక పుస్తకాలు సంచి ఇంట్లో పడేసి బావుల్లోనూ చెరువుల్లోనూ ఈతకని తిరుగుతున్నాడు తప్ప పుస్తకం తీయడం లేదు.. చదవడం లేదు.. మీరు వాణ్ని ఏమాత్రం వదలొద్దు... చేమడాలు వలిచేయండి.. నేనేం అనుకోను.. ముందు వాణ్ని దారిలో పెట్టండి-టీచర్‌తో ఒక తండ్రి వేడుకోలు..ఒరేయ్ ఇక ఆడింది చాలు.. ఆదివారం కూడా చదూకోమన్నాడు సైన్స్ మాస్టర్.. అయన ఇల్లు ఈ దారిలోనే .. మనం ఇంకా ఈ మామిడి తోటల్లో తిరిగి.. ఆయనకు దొరికిపోతే మాత్రం మనం అయిపోయినట్లే.. ఇక ఇదే ఆఖరాట వెళ్లిపోదాంరా.. నాకు భయమేస్తోంది..-పిల్ల గ్యాంగులో ఒకడి ఆందోళనఒరేయ్ బెల్లం తింటే పళ్ళు పుచ్చిపోతాయి. కడుపులో పాములు వస్తాయని ఎన్నిసార్లు చెప్పినా మా పిల్లాడు వినడం లేదు.. మీరైనా చెప్పండి టీచర్ గారు.. వీడికి మేమంటే భయం లేకపోతోంది.. మీరే వీడికి రెండు వేసి దారిలో పెట్టండి-మాష్టర్ వద్ద ఒక తల్లి విజ్ఞాపనపాతికేళ్ల క్రితం టీచర్ అంటే బడిలోనే కాదు.. ఊళ్ళో.. గుడిలో.. పెళ్ళిలో.. సంతలో.. మార్కెట్లో ఎక్కడ కనిపించినా టీచర్ గానే చూసేవాళ్ళు.. ఎక్కడ ఆయన ఎదురైనా పక్కకు తప్పుకోవడం.. కూడా లేచి నిలబడి గౌరవించడం.. ఇంట్లో భయం లేకపోతే నేరుగా తల్లిదండ్రులే స్కూలుకు వచ్చి టీచరుకు చెప్పి మరీ తమ బిడ్డల్ని దారిలో పెట్టించడం నాటి సమాజపు సంస్కృతి.. స్కూలు టైములోనే కాదు.. తమ జీవితంలో ఎప్పుడూ టీచర్ అంటే టీచర్ గానే గౌరవించి.. భయభక్తులతో ఉండేవాళ్ళు. కానీ కాలం మారింది.. టీచర్ అంటే జీతం తీసుకుని పని చేసే ఒక పనివాడు.. ఒక ఉద్యోగి.. అంతేతప్ప అయన తమకు ఇంకేం కాడు కాలేడు. అయినా మనను టీచర్ కొట్టడం ఏంది.. కొడితే ఊరుకుంటామా.. ఇదే దారిలో వెళ్తాడు కదా.. సాయంత్రం చూసుకుందాం లే .. అన్నట్లుగా పిల్లల తీరు ఉండగా.. ఏంది టీచర్ మా వాణ్ని కొట్టిర్రట.. వాణ్ని మేమె ఏనాడూ ఏమీ అనలేదు. మీరు కొడితే ఎట్లా .. చదువు చెబితే చెప్పండి.. లేకుంటే లేదు.. వాడికి చదువురాకున్నా ఫర్లేదు.. కొట్టుడు మాత్రం వద్దు.. ఈసారి కొడితే ఊరుకునేది లేదు.. అంటూ టీచర్లకే పేరెంట్స్ వార్నింగ్ ఇస్తున్న కాలం ఇది.అల్లరి చేసినా .. చెప్పినమాట వినకపోయినా చేతులు ఒళ్ళు వాచిపోయేలా టీచర్లు కొట్టినా ఏమీ అనని రోజులు పోయి.. మావాణ్ని కొడితే నీకు పడతాయి మాస్టర్ గారు ఎన్ని వార్నింగ్ ఇస్తున్న రోజులు వచ్చాయి.. పిల్లల్ని దండించడాన్ని అతిపెద్ద నేరంగా పరిగణిస్తూ వ్యూస్ పెంచుకునే మీడియా లైన్లోకి వస్తుంది.. పిల్లల హక్కుల సంఘాలు సంస్థలు కూడా యాగీ చేయడానికి ఎల్లపుడూ సిద్ధమే.. టీచర్ చేతిలో బెత్తం ఏనాడైతే మూలకు చేరిందో ఆనాడే పిల్లల్లో అల్లరి పెరిగింది.. భయం బాధ్యత స్థానంలో విచ్చలవిడితనం పెరిగిపోయింది.. టీనేజీలోనే దురలవాట్లు.. నేరాలకు సిద్ధం అవుతున్నారు..ఇలాంటి పరిస్థితులను కళ్లారా చూస్తూ.. వారిని ఏమీ నిందించలేక.. దండించలేక.. శిక్షించలేక.. అనలేక ఒక హెడ్ మాస్టర్ మనస్తాపంతో కుమిలిపోతూ.. మీరు మారరు.. మిమ్మల్ని నేను మార్చలేను.. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు' అంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జడ్పీ స్కూల్ హెచ్ఎం రమణ విద్యార్థుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం ప్రార్థన సమయంలో సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు. మేము ఎన్ని చెప్పినా మీరు వినడం లేదు.. మీకు భయం లేదు.. గౌరవం లేదు.. అయినా మాకు చేతనైనా వరకు మేం చేస్తున్నాం.. ఇకపై మీ ఇష్టం అంటూ గుంజిళ్ళు తీశారు.. ఇది అయన ఆవేదన కాదు.. సమాజంలో విద్యార్థులు.. తల్లిదండ్రుల పరిస్థితిని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ఆనాడు గురువు గురించి వేమన రాసిన పద్యాన్ని ఒకసారి గుర్తి చేసుకుందాం‘గురుని శిక్షలేక గురుతెట్లు కలుగునో అజునకైనా వాని యబ్బకైన తాళపుచెవి లేక తలుపెట్లు లూడునో విశ్వదాభిరామ వినురవేమ’గురువుతో శిక్ష అనుభవించకుండా చదువు ఎలా వస్తుంది అంటాడు వేమన.. కానీ ఇప్పుడు పిల్లల్ని కొట్టడం నేరం అంటున్నారు.. ఇప్పుడు దండించకపోతే వారు మున్ముందు మరింతగా రాటుదేలిపోతారన్నది వేమన ఉద్దేశ్యం.. అది నాడు.. నేడు.. ఏనాడైనా చెల్లుబాటు అవుతుంది. అని ప్రస్తుత సమాజాన్ని చూస్తే స్పష్టం అవుతోంది.-సిమ్మాదిరప్పన్న. -
AP: జాతరలో మహిళా ఎస్ఐపై దాడి.. జుట్టు పట్టుకుని తిట్టుకుంటూ..
సాక్షి, విజయనగరం: ఏపీలో కూటమి ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులకే భద్రత కరువైంది. విజయనగరంలో జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జాతరలో అధికార పార్టీకి చెందిన కొందరు యువకులు వీరంగం సృష్టించారు. అసభ్య నృత్యాలను అడ్డుకున్న మహిళా ఎస్ఐపై దాడి చేశారు. దీంతో, సదరు ఎస్ఐ.. ఈ ఘటనపై సీఐకి ఫిర్యాదు చేశారు.వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామంలో మంగళవారం రాత్రి శ్రీ వేణుగోపాల స్వామి తీర్థ మహోత్సవం జరిగింది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమంలో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. గుడివాడ మోహన్ సహా అతడి స్నేహితులు మద్యం మత్తులో హంగామా సృష్టించారు. వేదికపై నృత్యం చేస్తున్న యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించారు. అక్కడే విధుల్లో ఉన్న వల్లంపూడి ఎస్ఐ బి.దేవి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో మరింత రెచ్చిపోయిన యువకులు.. విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐపై దాడికి పాల్పడ్డారు. ఆమె జుట్టు పట్టుకొని కొట్టి, అత్యంత అసభ్యకరంగా దుర్భాషలాడారు. ఆమె ప్రాణభయంతో సమీపంలోని ఓ ఇంట్లోకి వెళ్లి తలదాచుకున్నారు. అయినా వెంటాడి అక్కడ రభస సృష్టించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఎస్ఐ సమాచారం ఇవ్వడంతో రూరల్ ఎస్సై అప్పలనాయుడు, ఎల్ కోట, కొత్తవలస పోలీస్ స్టేషన్ ఎస్‌ఐలుతో పాటు సుమారు 30 మంది సిబ్బంది వాహనాలపై రాత్రి ఆ గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో ఘర్షణలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎస్ఐ దేవీకి గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.ఇక, ఈ ఘటనపై ఎస్ఐ దేవీ.. సీఐకి ఫిర్యాదు చేశారు. ఈ దాడితో సంబంధం ఉన్న గుడివాడ మోహన్‌తో పాటు అతని స్నేహితులు గుడివాడ సంతోష్‌కుమార్, విష్ణుదుర్గ, హర్ష, ఎర్నిబాబు, గౌరినాయుడు తనపైకి వచ్చి దుర్భాషలాడారని, తనను కొట్టి, జట్టు పట్టుకొని లాగారని, తన విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనను వీడియో తీస్తుండగా తన సెల్‌ఫోన్ పట్టుకొని పారిపోయారని తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
మరేటి సేత్తామ్ .. పనుల్లేవు.. దేశం ఎలిపోదాం
పల్లకోయే లచ్చిమి.. ఏదో ఈ మూడోరాలు చేసిద్ధుమా.. వందో.. వెయ్యో పట్టుకొస్తే మెల్లగా రెండు నెలలు గడిచిపోతాయి... పల్లక ఇంట్లో కూకుంటే ఏటి వస్తాది చెప్పు... తిరిగి చేతి ఖర్చు కాకపోతే.. కష్టమో నష్టమో.. అటు వెళ్తే కాలం గడుస్తాది... పూట గడుస్తాది.. చెబుతోంది మంగ. అవునుగానీ పిల్లలిద్దరినీ అమ్మగారింట్లో ఒగ్గిసి రావడం మనసుకు కష్టంగానే ఉంది... కానీ చేతిలో పైసా లేదు.. పైగా ఖర్చులు చూస్తుంటే మరింత భయంగా ఉన్నది.. పిల్లల చదువులు. వారి బట్టలు.. పుస్తకాలూ.. ఇవన్నీ తల్చుకుంటే భయంగా ఉంది.. అందుకే నీతో వస్తన్నాను.. అప్పుడైతే జగన్ డబ్బులొచ్చేవి.. ఇప్పుడు అవి కూడా పైసా కానరావడంలేదు.. అవి వచ్చింటే చేతికి ఆధారమయ్యేది.. ఇప్పుడు అంతా మేమిద్దరమే పడాలి అంటూ చేతిలోని సమోసా ముక్క భర్త రామినాయుడికి ఇచ్చింది.. నాకొద్దే నువ్వు తిను అన్నాడు అయన..మీ మొగుడూ పెళ్ళాల ముచ్చట్లు ఆపర్రా... అంది మంగ.. అవును మంగొదినా... పిల్లల్ని వదిలేసి ఈయన్ను ఈ మనిషిని వెంటేసుకుని జిల్లాలకు జిల్లాలు మారిపోయి అక్కడ పెసరచెను తీతకు వెళ్లడం మనసుకు కష్టంగానే ఉంది కానీ.. ఇక్కడ పైసా లేదు.. అందుకే.. అంటూ పిల్లల్ని తలచుకుని మథనపడింది... పోన్లేవే... లచ్చిమి.. రోజుకు ఒకరికి ఏడొందలు.. మీ మొగుడూ పిల్లలకు పదిహేను వందలు.. ఇద్దరూ రెండు వారాలు చేస్తే ఎంతోకొంత చేతికి వస్తాది.. పైగా బియ్యం వాళ్లే ఇస్తారు.. పడుకోడానికి రూములు కూడా వాళ్ళవే అని మంగ చెబుతుంటే లక్ష్మి కళ్ళు భయం.. ఆందోళన స్థానే కాస్త ధైర్యం.. మెరుపు సంతరించుకున్నాయి.రాయగడ నుంచి గుంటూరు వెళ్లే ప్యాసింజర్ మహిళలు.. కూలీలతో కిక్కిరిసిపోయింది.. అడుగుతీసి అడుగేయలేని పరిస్థితి. అందరూ నెత్తిన మూటలు.. కొందరు పారలు.. గునపాలు సైతం పట్టుకుని ఎక్కేసారు.. దాదాపుగా అందరూ కిందనే కూర్చున్నారు. ఏమ్మా అక్కడికి అని అడిగితె గుంటూరు.. వెళ్తున్నాం బాబు అన్నారు.. ఎందుకూ అంటే అక్కడ పెసర.. మినపచేలు తీయడానికి వెళ్తున్నాం అన్నారు. అక్కడ కూలీలు దొరకడం లేదట.. పార్వతీపురం ప్రాంతంనుంచి మహిళలు.. పురుషులను ఆ చేను తీయడానికి తీసుకెళ్తున్నారు. ఒకొక్కరికి ఏడువందలు రోజుకూలీతోబాటు జంటకు రోజుకు రెండుకేజిల బియ్యం కూడా ఇస్తారు.చిన్న రూము.. షెడ్లు కూడా ఉంటాయి.. అక్కడే వండుకుని తిని ఇద్దరూ తెచ్చుకున్న డబ్బును జాగత్త చేసుకుని మూడు వారాల తరువాత మళ్ళీ సొంత ఊళ్లకు వెళ్తారు.. సీతానగరం.. పార్వతీపురం.. కురుపాం ... బాడంగి.. రామభద్రపురం మండలాల నుంచి కూలీలు ఇదే ట్రైన్లో వెళ్తారు.. వంటకు ఎలా మరి అని అడిగితే ఒసే.. పళ్లకుందో ... అప్పులు..పప్పులు.. వర్రగుండ .. పచ్చళ్ళు.. చింతపండు.. అన్నీ పట్టుకెళ్ళిపోతాం కదేటి .. అక్కడే కఱ్ఱలపొయ్యిమీద నాలుగు గింజలు ఉడకేసుకుని తినేసి పడుకుండిపోతాం అంటారు అందరూ కోరస్ గా.. పిల్లల్ని ముసలోళ్ల చెంత వదిలేసి వెళ్లడం బాధగానే ఉంది కానీ.. ఇద్దరం ఈ నాలుగురోజులు కష్టపడితే ఓ ఇరవైవేలు వస్తాయి.. జూన్‌లో పిల్లల చదువులు.. ఇతర ఖర్చులకు సరిపోతాయి.. అందుకే ఎంతదూరం అయినా వెళ్తామని... మనసు దిటవు చేసుకుని షార్ట్ టైం లేబర్ పేరిట కృష్ణ గుంటూరు జిల్లాలకు వెళ్తుంటారు..-సిమ్మాదిరప్పన్న -
వైఎస్ జగన్ గుర్ల పర్యటనలో భద్రతా వైఫల్యం
సాక్షి, విజయనగరం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించారు. అక్కడ డయేరియా సోకి మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.అయితే వైఎస్ జగన్ గుర్ల పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. వైఎస్ జగన్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరాగా.. వారిని అదుపు చేయడంలో పోలీసులు చేతులెత్తేశారు. జనాల తోపులాటలో షామియానాలు చిరిగిపోయాయి. జనాల తోపులాటతో వైఎస్ జగన్ మీడియా సమావేశానికి కొంత సేపు అంతరాయం ఏర్పడించింది. దీంతో పోలీసులు వైపల్యంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చిన జనాలను పోలీసులు కంట్రోల్ చేయలేకపోతే ఎలా అని మండిపడ్డారు. పోలీసుల నుంచి సహకారం లేదని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు మీడియాతో మాట్లాడుతుంటే.. కనీసం భద్రత కల్పించపోతే పోలీసులు ఎలా పనిచేస్తుస్తున్నారని ప్రశ్నించారు. చదవండి: కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేస్తారా?: వైఎస్ జగన్ -
గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
గుర్లలో వైఎస్ జగన్ పరామర్శ అప్డేట్స్.. 👉గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారిని ఓదార్చి.. ధైర్యం చెప్పారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 👉గుర్ల చేరుకున్న వైఎస్ జగన్👉రాష్ట్రంలో సెప్టెంబర్‌లోనే డయేరియా ప్రమాద ఘంటికలు మోగించించింది. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో, వ్యాధి బారినపడి 14 మంది చనిపోయారు. 👉ఈ సందర్బంగా వైఎస్ జగన్‌కు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్దకు భారీ సంఖ్యలో మద్దతుదారులు వైఎస్ జగన్ కోసం వచ్చారు. 👉వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా డయేరియా మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు.👉వైఎస్ జగన్ విజయనగరం బయలుదేరారుు. మరికాసేపట్లో గుర్ల చేరుకుంటారు. అక్కడ డయేరియా సోకి మృతి చెందిన వారి కుటుంబాలను, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.👉కాగా, కొద్దిరోజులుగా గుర్లలో డయేరియా కారణంగా పదుల సంఖ్యలో మరణాలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆసుపత్రుల్లో పలువురు చికిత్స పొందుతున్నారు. -
మినీ వ్యాన్‌ను ఢీకొన్న ఏపీ మంత్రి ఎస్కార్ట్ వాహనం.. పలువురికి గాయాలు
సాక్షి, విజయనగరం: ఏపీ మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనం మినీ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మినీ వ్యాన్ డ్రైవర్ సహా ముగ్గురు కానిస్టేబుల్స్ తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాలోని బుసాయవలస వద్ద ఏపీ మంత్రి సంధ్యా రాణి ఎస్కార్ట్‌లోని వాహనం ఎదురుగా వస్తున్న మీనీ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్యూటీలో ఉన్న ముగ్గురు కానిస్టేబుల్స్ సహా మినీ వ్యాన్ డ్రైవర్ గాయపడ్డారు. దీంతో, వారిని విజయనగరంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది కూడా చదవండి: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. -
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర.. 15వ రోజు షెడ్యూల్ ఇలా..
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర 15వ రోజుకు చేరుకుంది. సామాజిక సాధికార యాత్ర నేడు విజయనగరం, కోనసీమ జిల్లాలో జరుగనుంది. విజయనగరంలో ఎమ్మెల్యే కంభాల జోగులు ఆధ్వర్యంలో బస్సుయాత్ర ప్రారంభం కానుంది. అలాగే, కోనసీమ జిల్లా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర కొనసాగనుంది. విజయ నగరం రాజాంలో బస్సుయాత్ర ఇలా.. ►విజయనగరం జిల్లా రాజాంలో ఎమ్మెల్యే కంభాల జోగులు ఆధ్వర్యంలో బస్సుయాత్ర ►ఉదయం 11:30 గంటలకు బొద్దాంలో నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించనున్న వైఎస్సార్సీపీ నేతలు ►మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్సార్సీపీ నేతల ప్రెస్ మీట్ ►మధ్యాహ్నం 12.30 గంటలకు బైక్ ర్యాలీ ప్రారంభం ►భోజన విరామం అనంతరం పాలకొండ రోడ్డులోని జెజె ఇన్నోటెల్ వరకు ర్యాలీ, బస్సు యాత్ర. ►మధ్యాహ్నం మూడు గంటలకు రాజాంలో బహిరంగ సభ. కోనసీమ జిల్లా కొత్తపేటలో ఇలా.. ►కోనసీమ జిల్లా కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర ►మధ్యాహ్నం ఒంటి గంటకు రావులపాలెంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ►మధ్యాహ్నం రెండు గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుండి బైకు ర్యాలీ ప్రారంభం ►ఎనిమిది కిలోమీటర్లు జరుగనున్న బస్సు యాత్ర ►సాయంత్రం నాలుగు గంటలకు కొత్తపేట సెంటర్లో బహిరంగ సభ -
అరుపులు, కేకలు వినిపించాయి..క్షతగాత్రులు చెప్పిన ప్రమాద విషయాలు
-
విజయనగరం పర్యటనలో సీఎంను కలిసిన పలువురు బాధితులు
-
రేపు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
అంగరంగ వైభవంగా పైడితల్లమ్మ పండుగ
-
కనుల పండుగగా పైడితల్లి పండగ
-
నైపుణ్య విద్యను ప్రోత్సహించేలా...!
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)–2020 అమ లులోకి వచ్చి జూలై 29 నాటికి మూడేళ్లవుతోంది. మునుపటి విద్యా వ్యవస్థ లలోని భారీ అంతరాలను గుర్తించి నాణ్యమైన విద్యా వకాశాలు అందరికీ సమా నంగా అందించడం దీని ప్రధాన లక్ష్యం. ప్రీస్కూల్ విద్య నుండి ఆరో తర గతి వరకు మాతృభాష బోధనా మాధ్యమంగాఉండాలని ఎన్ఈపీ ఉద్దేశం. అదేవిధంగా, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల కోసం కరిక్యులం, క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ కింద చేసిన సవరణలు ఏకకాలంలో రెండు పూర్తికాల విద్యా కార్యక్రమాలను కొనసాగించడాన్ని అనుమతిస్తున్నాయి. భౌతిక, ఆన్లైన్ మోడ్‌తో సహా, 4–సంవత్సరాల అండర్ గ్రాడ్యు యేట్ పాఠ్యాంశాలను ప్రోత్సహించడం వంటివి ఉన్నత విద్యలోని ముఖ్యాంశాలు. ఎన్ఈపీ–2020 నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. అలానే తల్లిదండ్రులు, తోటివారి ఒత్తిడి నుండి విద్యార్థికి ఉపశమనం కలిగించడానికి కూడా ప్రాధాన్యం ఇస్తోంది. విద్యార్థులు ఒక సంస్థ నుండి మరొక సంస్థకు, ఒక కోర్సు నుండి మరొక దానికి మారడానికి అవకాశం కల్పిస్తోంది. నైపుణ్య విద్యను ప్రోత్సహించడంలో భాగంగా ఎన్ఈపీ నేరుగా విద్యా సంస్థలతో పరి శ్రమలకు సంబంధాలు ఏర్పరచి చదువుకునే సమయంలోనే సమాంతరంగా వారికి వివిధ వృత్తుల్లో శిక్షణ ఇచ్చి జీవితంలో స్థిరపడే అవకాశాలను కల్పిస్తోంది. వినూత్న బోధనా పద్ధతులపై శిక్షణ అందించడం, ఐసీటీ సాధనాల విస్తృత వినియోగం వంటివి కూడా ఎన్ఈపీలో ముఖ్యమైన అంశాలు. ఎన్ఈపీ అధునాతన పాఠ్యాంశాలు, బోధనపై దృష్టి కేంద్రీకరిస్తూనే విద్యార్థుల సంభావిత అవ గాహన, విమర్శనాత్మక ఆలోచనలనూ ప్రోత్సహి స్తోంది. యోగా, ఫిజికల్ ఎడ్యుకేషన్, పెర్ఫార్మింగ్, విజువల్ ఆర్ట్స్‌తో పాటు పాఠ్యాంశాలను పునరుద్ధ రించడం, సమగ్ర పరచడం, గిరిజన జీవనశైలిని అర్థం చేసుకోవడానికి గిరిజన గ్రామానికి వెళ్లి జీవించడం, ‘డూయీంగ్ వైల్ లెర్నింగ్’ వంటి విద్యార్థి–కేంద్రీకృత పాఠ్యాంశాలు ఇందుకు నిద ర్శనం. ఎన్ఈపీ–2020 కింద విద్యార్థుల అంతర్లీన అవసరాలను అభివృద్ధి చేయడానికి నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌హెచ్‌ఈక్యూఎఫ్) వంటి వివిధ ప్రోగ్రామ్‌లు ప్రారంభించబడ్డాయి. ఎన్ఈపీ–2020 ఈక్విటీ, ఇన్‌క్లూజన్ అలాగే భాగస్వామ్య పాలన సిద్ధాంతాలపై ఆధారపడింది. అందువల్ల దివ్యాంగులు, మహిళలు, ఎల్జీ బీటీక్యూలు, ఎస్సీ, ఎస్టీలు, పీవీటీజీలు, డీఎన్టీలు వంటి వారికి సాధికారత కల్పించడం, వారికి సమానమైన అవకాశాలను అందిస్తూ అందు బాటులో ఉండటం ఇందులోని చాలా ముఖ్యమైన అంశం. గిరిజనుల కోసం ‘ఏకలవ్య మోడల్ రెసిడె న్షియల్ పాఠశాల’లను బలోపేతం చేయడం, కొత్త ఉపాధ్యాయుల నియామకానికి ప్రాధాన్యత ఇవ్వ డం, కొత్త ఈఎమ్ఆర్ఎస్ ప్రారంభించడం, 10–15 చిన్న పాఠశాలలను కలుపుతూ ‘వన్ స్కూల్ కాంప్లెక్స్’ పునర్నిర్మాణం వంటివి ఇందు కోసం తీసుకున్న కొన్ని చర్యలు. అంతర్జాతీయీ కరణ, సహకారం, భాగస్వామ్య పద్ధతిలో పథకాలను బలోపేతం చేయడం, విదేశీ విశ్వ విద్యాలయాల ఆఫ్–షోర్ క్యాంపస్‌లను స్థాపించడానికి ఆహ్వానించడం, అలాగే దేశంలో డిజిటల్ ఈ–విశ్వవిద్యాలయాల స్థాపన... ఎన్ఈపీ అమలు ప్రారంభించిన తర్వాత తీసు కున్న మరికొన్ని కార్యక్రమాలు. ఎన్ఈపీ ‘ల్యాబ్ టు ల్యాండ్’, ‘ల్యాండ్ టు ల్యాబ్’ను ప్రమోట్ చేస్తుంది. మొత్తం మీద ఎన్ఈపీ–2020 గత మూడు సంవత్సరాల్లో అనేక స్పష్టమైన ఫలితాలను సాధించగలిగింది. బహుళ ప్రవేశ–నిష్క్రమణ విధానం ద్వారా ఇది విద్యార్థులకు నేర్చుకునే సౌకర్యవంత మైన మార్గాన్ని అందించింది. ఆ విధంగా ఎన్ఈపీ–2020 భారతీయ విద్యా వ్యవస్థ చరిత్రలో నిజమైన గేమ్ ఛేంజర్ అని చెప్పవచ్చు. వ్యాసకర్త వైస్ ఛాన్స్లర్, ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (ఎన్ఈపీ ప్రారంభమై మూడేళ్లు) -
ఆర్ఐ స్వర్ణలత జీవితంలో ఈ కోణం కూడా చూడాల్సిందే..
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో కలకలం రేపిన నోట్ల మార్పిడి కేసులో జనసేన నాయకుడి అనుచరుడు సూరి అరెస్ట్ అయ్యారు. రూ. 2వేల నోట్లు మార్పిడి కేసులో పోలీసులు ఇప్పటి వరకు నలుగురిపై కేసు నమోదు చేశారు. అయితే, ఈ ముఠాకు ఏఆర్ ఆర్ఐ స్వర్ణలత నాయకత్వం వహించినట్లు పోలీసులు తేల్చారు. దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. కాగా, స్వర్ణలత జీవితంలో మరో కోణం బయటకు వచ్చింది. వివరాల ప్రకారం.. స్వర్ణలత సొంత జిల్లా విజయనగరంలో ఆమె పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. స్వర్ణ ఫౌండేషన్(www.swarnafoundationgroup.com) పేరుతో పేద విద్యార్థులకు, మహిళలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అయితే, తాజాగా స్వర్ణలతపై ఆరోపణల నేపథ్యంలో ఆర్ఐ స్వర్ణలత ఫౌండేషన్ కార్యకలాపాలు బయటకు వచ్చాయి. కాగా, స్వర్ణ ఫౌండేషన్ సంస్థ గ్రామీణ ప్రాంతంలోని పేద ప్రజల ఆరోగ్యం, విద్య కోసం పనిచేస్తోంది. ఆరోగ్యం, విద్యకున్న ప్రాముఖ్యత గురించి అవగాహాన కల్పిస్తోంది. ఈ ఫౌండేషన్ అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలను ఆదుకోవడం, పిల్లల విద్య, ఆరోగ్య సమస్యల కోసం ఆర్థికంగా వెనుకబడిన ప్రజలను ఆదుకోవడం అనే ప్రాథమిక లక్ష్యంతో ఏర్పడింది. ఇది కూడా చదవండి: జీడిపై చీడ రాతలు! అప్పుడు కిమ్మనని రామోజీ ఇప్పుడు మాత్రం గుండెలు బాదుకుంటున్నాడు -
సారీ కవిత నా వల్ల మాటలు పడ్డావ్.. తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం
సాక్షి, విజయనగరం: జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తల్లీకొడుకుల సెల్పీ సూసైడ్‌యత్నం స్థానికంగా కలకలం సృష్టించింది. కాగా, వీరి ఆత్మహత్యకు కొడుకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వివరాల ప్రకారం.. యూసిన్ అనే యువకుడు పార్వతీపురానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. కొన్నాళ్లు బాగానే ఉన్నప్పటికీ తాజాగా వారి మధ్య విబేధాలు నెలకొన్నాయి. దీంతో, ఆమెతో దూరంగా ఉంటున్నాడు యాసిన్. అయితే, సదరు యువకుడిని ఆమె బంధువులు వేధింపులకు గురిచేయడంతో పాటుగా బెదిరించారు. అతనిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతూ ఘోరంగా అవమానించారు. తన తల్లి గురించి కూడా దారుణమైన కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో వారి బెదిరింపులు, వేధింపుల కారణంగా యాసిన్, అతడి తల్లి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అవమాన భారంతో ఆత్మహత్య చేసుకునేందుకు తల్లీ కొడుకు పురుగుల మందు తాగారు. ఈ సందర్బంగా తమ ఆత్మహత్యలకు సదరు యువతి కుటంబమే కారణమని సెల్ఫీ వీడియో తీసుకుంటూ సూసైడ్‌యత్నం చేశారు. విషయాన్ని చుట్టుపక్కల వారు గమనించడంతో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. అయితే వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: హాయ్ అంటూ దగ్గరయ్యాడు.. నమ్మకంతో ఆమె వీడియో కాల్స్ చేసి.. -
ఉత్తరాంధ్ర కల.. భోగాపురం ఎయిర్‌పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన (ఫొటోలు)
-
విజయనగరం భోగాపురం బహిరంగ సభకు భారీగా తరలి వస్తున్న జనం (ఫొటోలు)
-
అటు అదానీ డేటా సెంటర్.. ఇటు భోగాపురం ఎయిర్‌పోర్టు
పనులే ప్రారంభం కానప్పుడు.. అది ఉత్తుత్తి శంకుస్థాపనే అవుతుంది కదా. గతంలో చంద్రబాబు హయాంలో జరిగింది అదే. కానీ, కోర్టు కేసులు పరిష్కరించి.. అన్ని అనుమతులతో ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభిస్తోంది సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం. భూ సేకరణ, పర్యావరణ అనుమతులపై కేసుల పరిష్కారం తర్వాత.. కేంద్రం నుంచి ఎన్వోసీ తీసుకొచ్చిన సీఎం జగన్ ప్రభుత్వం నేడు ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చే క్రమంలో మొదటి అడుగు వేయబోతోంది. ఒకవైపు.. రూ. 4,592 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇవాళ అసలైన శంకుస్ధాపన జరగనుంది. సుమారు 2,203 ఎకరాల విస్తీర్ణంలో 36 నెలల్లో నిర్మాణం, ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణించేందుకు వీలు, పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఏడాదికి 1.8 కోట్ల మంది ప్రయాణించే విధంగా దశల వారీగా సౌకర్యాల విస్తరణను రాబోయే కాలానికి లక్ష్యంగా పెట్టుకుంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. ► పీపీపీ విధానంలో నిర్మించే విధంగా జీఎంఆర్ గ్రూపుతో ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఏడిసీఎల్) ఒప్పందం ► ప్రయాణీకుల సౌకర్యార్ధం అత్యంత ఆధునికంగా ట్రంపెట్ నిర్మాణం, ఇటు విశాఖ, అటు శ్రీకాకుళం నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా విమానాశ్రయ టెర్మినల్‌కు చేరుకునేలా అనుసంధానం ► అంతర్జాతీయ ఎగ్జిమ్ గేట్‌వే ఏర్పాటుకు వీలుగా కార్గో టెర్మినల్, లాజిస్టిక్స్ ఎకో సిస్టమ్, తొలి దశలో 5,000 చ.మీ విస్తీర్ణంలో దేశీయ, అంతర్జాతీయ కార్గో టెర్మినల్ అభివృద్ది ► అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రన్‌వే, కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ అప్రాన్, ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ అండ్ టెక్నికల్ బిల్డింగ్, కార్గో బిల్డింగ్, మురుగునీటి శుద్ది ప్లాంట్ ► 16 వ నెంబర్ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ రోడ్డు నిర్మాణం, కమర్షియల్ డెవలప్మెంట్ ఏరియా, కమర్షియల్ అప్రోచ్ రోడ్, సోలార్ ప్యానెల్స్ ఏరియా, ఏవియేషన్ అకాడమీ, మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్ హాలింగ్ సౌకర్యాలు ► విశాఖపట్నం–భోగాపురం మధ్య రూ. 6,300 కోట్లతో 55 కిలోమీటర్ల మేర 6 లేన్ల రహదారి నిర్మాణం, రెండువైపులా సర్వీసు రోడ్లు ► ఎయిర్‌పోర్టు నిర్మాణ సమయంలో 5 వేల మందికి, సేవలు ప్రారంభం అయిన తర్వాత 10 వేల మందికి ప్రత్యక్షంగా, 80 వేల మందికి పరోక్షంగా ఉపాధి, పర్యాటక అభివృద్ది, ఇతర పెట్టుబడుల ద్వారా మరో 5 లక్షల మందికి ఉపాధి. ఇదీ చదవండి: అల భోగాపురంలో... నాడు నా(రా)టకం.. నేడు జగ‘నిజం’ ఎయిర్‌పోర్టు నిర్వాసితులకు పునరావాసం విమానాశ్రయం కోసం స్వఛ్చందంగా ఇళ్ళను ఖాళీ చేసిన 4 గ్రామాల్లోని నిర్వాసిత కుటుంబాలకు రూ. 77 కోట్లతో పునరావాసం, వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే ఇళ్ళ నిర్మాణం పూర్తిచేసి వసతి కల్పించడం కూడా ఇప్పటికే జరిగింది. మరోవైపు.. ► అదానీ డేటా సెంటర్.. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చి, సమగ్రాభివృద్ధికి బాటలు వేసే విధంగా... రూ. 21,844 కోట్ల వ్యయంతో విశాఖపట్నంలో నిర్మిస్తున్న వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్ (అదానీ గ్రూప్) ఏర్పాటు కానుంది. ► అదానీ డేటా సెంటర్ ద్వారా.. డేటా హబ్‌తో గణనీయంగా పెరగనున్న డేటా స్పీడ్, సింగపూర్ నుండి విశాఖపట్నం వరకు సముద్ర సబ్ మెరైన్ కేబుల్ ఏర్పాటు, తద్వారా ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ 5 రెట్లు పెరిగి భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో మరిన్ని ఐటీ సంస్ధలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఏర్పడనుంది. ► విశాఖలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఐటీ, ఐటీ అనుబంధ సేవల వృద్ది, భారీ స్ధాయిలో హైటెక్ ఉద్యోగాల కల్పనకు సానుకూల వాతావరణం, విశ్వసనీయమైన డేటా భద్రత, సేవల ఖర్చులలో తగ్గుదల ► అధునాతన టెక్ కంపెనీలు విశాఖపట్నం ను ఎంచుకునే వీలు, తద్వారా ఐటీ రంగంలో పెరగనున్న ఆర్ధిక కార్యకలాపాలు ► డేటా సెంటర్‌కు అనుంబంధంగా ఏర్పాటు కానున్న స్కిల్ యూనివర్శిటీ, స్కిల్ సెంటర్ల ద్వారా యువతలో నైపుణ్యాల పెంపుకు మరింత ఊతం, బిజినెస్ పార్క్ రిక్రియేషన్ సెంటర్ల ద్వారా మారనున్న ఉద్యోగుల జీవన శైలి అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో రూ. 14,634 కోట్లతో మధురవాడలో 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ/బిజినెస్ పార్క్ ఏర్పాటు, త్వరలో రూ. 7,210 కోట్లతో కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ/బిజినెస్ పార్క్‌ల అభివృద్ది, తద్వారా 39,815 మందికి ప్రత్యక్షంగా, 10,610 మందికి పరోక్షంగా ఉపాధి కల్గనుంది. ఇదీ చదవండి: విశ్వనగరంలో వెలుగు రేఖలు -
విశాఖ ఐటీ పార్క్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
సీఎం జగన్ పర్యటన.. లైవ్ అప్డేట్స్ ► ఈ సెప్టెంబర్ నుంచి విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతుంది : సీఎం జగన్ ►విశాఖకు డేటా సెంటర్ రావడం ఆనందంగా ఉంది, డేటా సెంటర్‌తో ప్రగతి పథంలో విశాఖ దూసుకుపోతోంది, విశాఖకు ఇది గొప్ప ప్రోత్సాహకంగా నిలుస్తుంది ►విశాఖ వాసులకు డేటా సెంటర్ గొప్ప వరం, డేటా సెంటర్‌తో 39 వేల మందికి ఉద్యోగాలు ►దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖకు వస్తోంది, ఇంత పెద్ద డేటా సెంటర్ దేశంలో ఎక్కడా లేదు ►డేటా సెంటర్ ఏర్పాటు చేసినందుకు అదానీ గ్రూప్‌నకు కృతజ్ఞతలు ►డేటా సెంటర్‌తో ఇంటర్నెట్ డౌన్ లోడ్ స్పీడ్ పెరుగుతుంది, డేటా సెంటర్‌తో విశాఖ ఏ1 సిటీగా మారనుంది ► గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా చూడండి. మంచి జరిగిందని భావిస్తే నన్ను ఆశీర్వదించండి. ఇచ్చిన హామీలు నెరవేర్చాం కాబట్టే మీ ముందుకు వచ్చే అర్హత ఉంది. మరి చంద్రబాబు నాయుడికి అలా అడిగే దమ్ముందా?.. చేసింది చెప్పడానికి చంద్రబాబు నాయుడు దగ్గర ఏం లేదు. చంద్రబాబు ముఠా దోచుకో, పంచుకో, దాచుకో అనే రీతిలో రాష్ట్రాన్ని నాశనం చేసింది. ఏ మంచి చేయని చంద్రబాబుకు దత్త పుత్రుడు ఎందుకు సహకరిస్తున్నాడు. ► దేశ చరిత్రలో ఎక్కడా చూడని విధంగా ఈ 47 నెలల కాలంలో 2.10లక్షల కోట్ల రూపాయలు డీబీటీ చేశాం, గతానికి, ఇప్పటికీ తేడాను గమనించమని కోరుతున్నాం ► సీఎం జగన్ మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఇటీవలే మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేశాం. ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారనుంది. తారకరామ తీర్థ సాగర ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేయనున్నాం. ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జాబ్ హబ్‌గా మారనుంది. ► చింతపల్లిలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌ను ప్రారంభించాం. అదానీ డేటా సెంటర్‌తో ఉత్తరాంధ్ర ముఖచిత్రమే మారుతుంది. భోగాపురం ఎయిరోపోర్టును 2026లో మళ్లీ మీ బిడ్డే వచ్చి ప్రారంభిస్తాడు. ఎయిర్‌పోర్టు తీసుకురావడానికి చిత్తశుద్ధితో పనిచేశాం. ► కేవలం ఎన్నికలకు రెండు నెలల ముందే ఏ అనుమతులు లేకుండా శంకుస్థాపన చేశామని చెప్పుకున్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధిని అడ్డుకోలేరు. కోర్టులో కేసు వేసి అడ్డుకోవాలని చూశారు. 2026 నాటికి రెండు రన్‌వేలతో ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవుతుంది. ► మొదటి ఫేజ్‌లో 60 లక్షల మంది రవాణాకు సదుపాయాలు సమకూరుస్తాం. చివరి దశకు వచ్చే సరికి 4కోట్ల మంది ప్రయాణిస్తారు. ఏ380 డబుల్ డెక్కర్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే ఏర్పాట్లు చేస్తాం. ఉత్తరాంధ్ర అంటే మన్యం వీరుడి పౌరుషం గుర్తొస్తుంది. అందుకే ఉత్తరాంధ్రలోని కొత్త జిల్లాకు అల్లూరి పేరు పెట్టాం. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను ఆరు జిల్లాలుగా చేశాం. ► ఉద్ధానంలో కిడ్నీ రీసర్చ్ సెంటర్ పనులను పూర్తి చేశాం. జూన్ నెలలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను జాతికి అంకితం చేస్తాం. ► చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్. ► రూ. 23.73కోట్లతో చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం. ► భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ ► విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరపల్లి వద్ద భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ త్రీడీ మోడల్‌ను పరిశీలించిన సీఎం జగన్. కాసేపట్లో ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ► సీఎం జగన్ భోగాపురం చేరుకున్నారు.. మరికాసేపట్లో ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ► విజయనగరం భోగాపురం మండలం సవరవిల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. ► విశాఖ, విజయనగరం జిల్లాల పర్యటనలో భాగంగా.. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖకు బయల్దేరారు సీఎం వైఎస్ జగన్. ► విశాఖ పట్నంలో అదానీ డేటా సెంటర్, విజయనగరం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూమి పూజ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. ► ఉత్తరాంధ్రకే తలమానికమైన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం భూమి పూజ చేస్తారు. ► దాదాపు 2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో జీఎంఆర్ విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ దీన్ని నిర్మిస్తోంది. 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో పాటు దేశీయ, అంతర్జాతీయ రవాణాకు దోహదపడేలా కార్గో టెర్మినల్ ఇక్కడి ప్రత్యేకత. తొలి దశ నిర్మాణమే ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఉంటుంది. అనంతరం ఏటా 1.8 కోట్ల మంది ప్రయాణించే విధంగా దశలవారీగా సౌకర్యాలను విస్తరిస్తారు. విజయనగరం పర్యటనలో.. మరో రెండు కీలక ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు ► తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్.. జలయజ్ఞంలో భాగంగా విజయనగరం జిల్లాలో 24,710 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చంపావతి నదిపై 2005 సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నాంది పలికారు. ఆయన హఠాన్మరణంతో ఈ ప్రాజెక్టు పనులు మందగించాయి. పెండింగ్ పనులను రూ.194.90 కోట్లతో పూర్తి చేసేందుకు సీఎం జగన్ సంకల్పించారు. పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ మండలాల్లోని 49 గ్రామాల ప్రజలకు తాగునీరు, 24,710 ఎకరాలకు సాగునీటితో పాటు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన నీటిని అందించడం లక్ష్యంగా తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్ చేపట్టారు. 2024 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. ► చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్.. విజయనగరం జిల్లాలోని వేలాదిమంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేస్తూ పూసపాటిరేగ మండలం చింతపల్లి సముద్ర తీరంలో రూ.23.73 కోట్ల వ్యయంతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం కానుంది. అన్ని కాలాల్లో సముద్రంలో చేపలు వేటాడేందుకు వెసులుబాటు కలగనుంది. తుపాన్లు, విపత్తుల సమయాల్లో సురక్షితంగా ఒడ్డుకు చేరేందుకు, అలల తాకిడికి పడవలు దెబ్బ తినకుండా లంగర్ వేసే సదుపాయం ఉంటుంది. తద్వారా మత్స్యకారుల ఆదాయాన్ని పెంచేలా చర్యలు చేపట్టారు. ► విశాఖలో రూ.21,844 కోట్లతో అదానీ గ్రూప్ నిర్మించే వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్‌కు సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి అదానీ ఇండస్ట్రీస్ చైర్మన్ గౌతమ్ అదానీ హాజరు కానున్నారు. ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చి సమగ్రాభివృద్ధికి బాటలు వేసేలా వైజాగ్ టెక్ పార్కు రూపుదిద్దుకోనుంది. ► అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో రూ.14,634 కోట్లతో మధురవాడలో 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్ ఏర్పాటు కానుంది. త్వరలో రూ.7,210 కోట్లతో కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్‌లను అభివృద్ధి చేస్తారు. తద్వారా 39,815 మందికి ప్రత్యక్షంగా, మరో 10,610 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విజయనగరంలో విషాదం.. చందక గోవింద్ మృతి
సాక్షి, హైదరాబాద్: మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ శిక్షణా కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేవీ అధికారి చందక గోవింద్(31) మృతిచెందారు. దీంతో, గోవింద్ స్వగ్రామం విజయనగరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, పారాచ్యూట్ తెరుచుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు నేవీ అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో శిక్షణా కార్యక్రమం జరుగుతోంది. శిక్షణలో భాగంగా ఆయన ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి కిందకి దూకగా.. పారాచ్యూట్ పూర్తిగా తెరుచుకోలేదు. దీంతో తీవ్ర గాయాలై మృతి చెందారు. ఇక, బుర్ద్వాన్ జిల్లాలోని పనాగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో పారాట్రూపర్స్ ట్రైనింగ్ టీమ్‌లో కమాండో గోవింద్ విధులు నిర్వహిస్తున్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. తీవ్ర గాయాలతో ఉన్న కమాండో గోవింద్‌ను వెంటనే బార్జోరా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా.. పనాగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఉన్న వ్యూహాత్మక విమానాల్లో జవాన్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన స్పెషల్ ఫోర్సెస్ యూనిట్లు ఇక్కడ కసరత్తులలో పాల్గొంటాయి. పారాట్రూపర్ల బృందంలో సభ్యులైన గోవింద్.. C130J సూపర్ హెర్క్యులస్ విమానం నుంచి సాధారణ డ్రాప్ సమయంలో అదృశ్యమయ్యారని భారత వైమానిక దళం తెలిపింది. ఇక, ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు నేవీ అధికారులు తెలిపారు. కాగా, చందక గోవింద్ స్వగ్రామం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పర్ల గ్రామం. మరోవైపు.. రేపు స్వగ్రామానికి చందక గోవింద్ మృతదేహం చేరుకోనుంది. Adm R Hari Kumar #CNS & all personnel of #IndianNavy pay tribute to Chandaka Govind, Petty Officer who lost his life whilst undergoing training exercise at Panagarh on 05 Apr 23 and extend heartfelt condolences to the bereaved family. pic.twitter.com/FRLZ9k5018 — SpokespersonNavy (@indiannavy) April 5, 2023 -
Vizianagaram: అభాగ్యుల ఆకలి తీర్చుతున్న ఫుడ్‌బ్యాంకులు
అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ఆకలితో అలమటించేవారికి పట్టెడన్నం పెడితే వారిలో కలిగే సంతోషం వెలకట్టలేనిది. విజయనగరం పట్టణంలో ఏడాదిన్నరగా వేలాదిమంది పేదల ఆకలితీర్చే బృహత్క్రతువు నిరాటంకంగా కొనసాగుతోంది. స్వచ్ఛంద సంస్థలు, దాతలు, నాయకులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు, హోటళ్ల నిర్వాహకులు ఇలా.. మనసున్న ప్రతి ఒక్కరూ ఫుడ్‌బ్యాంకుల నిర్వహణను భుజానకెత్తుకున్నారు. నిర్భాగ్యులకు రుచికరమైన భోజనం వడ్డిస్తున్నారు. వృథాగా పారబోసే ప్రతి మెతుకుతో మరొకరి ఆకలి తీర్చాలన్న ప్రధాన ఆశయంతో ముందుకు సాగుతున్నారు. – పైడి చిన్నఅప్పలనాయుడు, విజయనగరం డెస్క్ ఫొటోలు: డి.సత్యనారాయణమూర్తి, సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం విజయనగరం పట్టణానికి వచ్చిన పేదలు... స్థానికంగా ఉంటున్న అభాగ్యులు, అనాథల ఆకలి తీర్చాలన్న ఆశయం నుంచి ఏర్పడినవే ఫుడ్ బ్యాంకులు. జిల్లా కేంద్రానికి ఏ దారిలో వచ్చిన వారికైనా ఫుడ్‌బ్యాంకులు తారసపడతాయి. ప్రస్తుతం నలువైపులా నాలుగు ఫుడ్ బ్యాంకులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలైతే చాలు... ఇక్కడ భోజనాల వడ్డింపు కార్యక్రమం ఆరంభమవుతుంది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు నిరాటంకంగా కొనసాగుతుంది. వివిధ పనులపై వచ్చేవారు, కూలీలు, ఆటోడ్రైవర్లు, యాచకులు, అనాథలు, వృద్ధులు ఇలా.. అన్నం కోసం ఎదురుచూసేవారందరికీ ఫుడ్‌బ్యాంకులు అన్నంకుండలా మారుతున్నాయి. వారి ఆకలి తీర్చుతున్నాయి. ఒక్కో ఫుడ్‌బ్యాంకులో రోజుకు 100 నుంచి 150 మందికి భోజనం వడ్డిస్తున్నారు. నడవలేని, లేవలేని కొందరు వృద్ధులకు క్యారేజీలతో అందిస్తున్నారు. వీటి నిర్వహణలో స్వచ్ఛంద సంస్థలు, ఆలయాలు, హోటళ్ల నిర్వాహకులు, నాయకులు, యువత, కార్పొరేషన్ ఉద్యోగులు భాగస్వాములయ్యారు. ఏ శుభ, అశుభ కార్యమైనా... ఇంటిలో ఎలాంటి శుభ, అశుభ కార్యం జరిగినా పేదలకు అన్నం పెట్టాలనుకునేవారు ఫుడ్‌బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. వారి స్థాయిని బట్టి అన్నదానం చేస్తున్నారు. కొందరు నాలుగు ఫుడ్‌బ్యాంకులలో ఒక రోజు వడ్డించేందుకు సరిపడా ఆహారపదార్థాలను సరఫరా చేస్తుండగా, మరికొందరు ఒక ఫుడ్‌బ్యాంకుకు సరిపడా ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. పేదలకు స్వయంగా వడ్డించి, వారి ఆకలితీర్చి ఆత్మ సంతృప్తిపొందుతున్నారు. ప్రస్తుతం విజయనగరంతో పాటు పరిసర గ్రామాల్లో పుట్టినరోజులు, జయంతి, వివాహాది శుభకార్యాలు, పండగల సమయంలో ముందుగా ఫుడ్ బ్యాంకులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. అందుకే... అన్నదాన ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. దాతల సాయంబట్టి రాత్రి పూట కూడా భోజనం వడ్డిస్తున్నామని పేర్కొంటున్నారు. ఫుడ్ బ్యాంకుల నిర్వహణ ఇలా... ► ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఫుడ్‌బ్యాంకు దాతలతో పాటు కన్యకాపరమేశ్వరి ఆలయం సహకారంతో కొనసాగుతోంది. ► కోటకూడలిలోని ఫుడ్‌బ్యాంకు హోటళ్ల నిర్వాహకులు, దాతలు సాయంతో సాగుతోంది. ► ఎన్సీఎస్ థియేటర్ ఎదురుగా ఉన్న అన్నదాన కేంద్రం దాతలు, కార్పొరేషన్, గౌరీ సేవాసంఘం సహకారంతో నడుస్తోంది. ► పోలీస్ బ్యారెక్స్ వద్ద ఉన్న కేంద్రం దాతలు, కార్పొరేషన్, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. వడ్డించే పదార్థాలు అన్నం, సాంబారు, ఒక కూర, పులిహోర, చక్రపొంగలి (దాతలు సమకూర్చితే అరటిపండు, స్వీటు, ఇతర పదార్థాలు) ఫుడ్‌బ్యాంకులలో అన్నదానం ఇలా... ► ప్రతిరోజు ఒక ఫుడ్‌బ్యాంకులో 100 నుంచి 150 మంది చొప్పున నాలుగు ఫుడ్‌బ్యాంకులలో 400 నుంచి 600 మందికి భోజనం వడ్డిస్తున్నారు. ► ఈ ప్రక్రియ ఆగస్టు 13, 2021 నుంచి నిరంతరాయంగా సాగుతోంది. నెలకు 12,000 నుంచి 18,000 మంది ఆకలిని ఫుడ్‌బ్యాంకులు తీర్చుతున్నాయి. కోట వద్ద ఉన్న ఫుడ్ బ్యాంకులో రాత్రి సమయంలో కూడా అన్నదానం చేస్తుండగా, మిగిలిన చోట్ల దాతల సాయం బట్టి రాత్రిపూట భోజనం వడ్డిస్తున్నారు. పేదవాని ఆకలి తీర్చడమే ధ్యేయం పేదవాడి ఆకలి తీర్చాలని, సామాన్యులకు మేలు చేయాలన్న మంచి సంకల్పంతో ప్రారంభించినవే ఫుడ్ బ్యాంకులు. విజయనగరంలో ఏర్పాటుచేసిన 4 ఫుడ్‌బ్యాంక్‌లు పేదలు, అనాథల ఆకలి తీర్చుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో అన్నా క్యాంటీన్ల పేరుతో రూ.5కే భోజనం పెట్టించామని గొప్పలు చెప్పుకునేవారు. తప్పుడు లెక్కలతో ఖజానా ఖాళీచేసేవారు. ఇప్పుడు కార్పొరేషన్ పరిధిలో నిర్వహిస్తున్న ఫుడ్‌బ్యాంకులకు దాతలే సహకరిస్తూ వేలాదిమంది కడుపునింపుతున్నారు. త్వరలో కొత్తపేట నీళ్ల ట్యాంకు వద్ద మరో ఫుడ్‌బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. – కోలగట్ల వీరభద్రస్వామి, శాసనసభ డిప్యూటీ స్పీకర్, విజయనగరం ఎమ్మెల్యే మంచి కార్యక్రమం ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలైతే చాలు.. అన్నం కోసం చాలామంది పేదలు ఇక్కడకు వస్తారు. దాతలు సమకూర్చిన అన్నం వృథా కాకుండా వడ్డిస్తున్నాం. కొన్నిసార్లు సంఖ్య పెరిగితే అప్పటికప్పుడు స్థానిక కార్పొరేటర్లు, దాతలు సహకరించి ఆహారపదార్థాలు సమకూర్చుతున్నారు. వివాహాది శుభకార్యాల సమయంలో మిగిలిన ఆహారపదార్థాలను అందిస్తే రాత్రి సమయంలోనూ పేదలకు వడ్డిస్తున్నాం. – రమణమూర్తి, ఫుడ్‌బ్యాంకు సూపర్వైజర్ మిగిలిపోయిన ఆహారం వృథా కాకుండా... వివాహాలు, వేడుకలు, విందుల సమయంలో మిగిలిపోయిన ఆహారపదార్థాలను ఫుడ్ బ్యాంకులకు చేర్చుతున్నారు. వీటిని ఫుడ్‌బ్యాంకులలో ఉన్న ఫ్రిజ్‌లలో నిర్వాహకులు భద్రపరుస్తున్నారు. పేదల కడుపు నింపుతున్నారు. దాతల భాగస్వామ్యంతో.. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఫుడ్ బ్యాంక్‌లు ఏర్పాటు చేశాం. వాటి ద్వారా ప్రతిరోజు వందలాది మంది నిరుపేదల ఆకలి తీరుస్తున్నాం. ఈ ప్రక్రియంలో దాతల భాగస్వామ్యం శుభపరిణామం. జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం ప్రతి రోజు వేలాది మంది వచ్చిపోతుంటారు. అందులో చాలా మంది ఆర్థిక స్థోమత లేక ఆకలితో ఇంటికి వెళ్తుంటారు. అటువంటి వారికి ఫుడ్‌బ్యాంక్‌ల సేవలు ఉపయుక్తంగా మారాయి. ప్రతి రోజు రుచి, శుచితో కూడిన భోజానాన్ని అందించగలుగుతున్నాం. – రెడ్డి శ్రీరాములనాయుడు, కమిషనర్, విజయనగరం కార్పొరేషన్ ఆనందంగా ఉంది ఫుడ్‌బ్యాంకుల నిర్వహణ నిరాటంకంగా సాగుతోంది. ఉద్యోగిగా ఫుడ్‌బ్యాంకు నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నా... ఆకలితో వచ్చే పేదలకు వడ్డించడంలో ఉన్న ఆనందమే వేరు. అన్నదానం చేసిన దాతలకు చేతులెత్తిదండం పెట్టాలి. వారి దయవల్లే పేదల ఆకలి తీరుతోంది. ఫుడ్‌బ్యాంకుల నిర్వహణ ఆలోచన గొప్పది. – జె.రవితేజ, ఫుడ్‌బ్యాంకు సూపర్వైజర్ క్యారేజీ అవసరంలేదు.. విజయనగరం పట్టణానికి చెట్లు కొట్టేందుకు వస్తాను. పట్టణ పరిధిలో ఎక్కడ పని ఉన్నా క్యారేజీ తెచ్చుకోను. ఫుడ్ బ్యాంకు వద్దకు వచ్చి భోజనం చేస్తాను. మా లాంటి కూలిపనివారికి కడుపునిండా భోజనం పెడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. – రీసు పైడితల్లి, గొట్లాం ఆకలితీర్చుతోందయ్యా.. నేను కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు ఏరుతూ జీవిస్తున్నాను. ఎక్కడ ఉన్నా పోలీస్ బ్యారెక్ వద్ద ఉన్న ఫుడ్‌బ్యాంకు వద్దకు సమయానికి చేరుకుంటాను. కడుపునిండా భోజనం చేస్తున్నారు. మాలాంటి పేదలకు అన్నంపెడుతున్న దాతలు నూరేళ్లపాటు చల్లగా ఉండాలి. – రాముపైడమ్మ, గాజులరేగ, విజయనగరం మంచి కార్యక్రమం ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలైతే చాలు.. అన్నం కోసం చాలామంది పేదలు ఇక్కడకు వస్తారు. దాతలు సమకూర్చిన అన్నం వృథా కాకుండా వడ్డిస్తున్నాం. కొన్నిసార్లు సంఖ్య పెరిగితే అప్పటికప్పుడు స్థానిక కార్పొరేటర్లు, దాతలు సహకరించి ఆహారపదార్థాలు సమకూర్చుతున్నారు. వివాహాది శుభకార్యాల సమయంలో మిగిలిన ఆహారపదార్థాలను అందిస్తే రాత్రి సమయంలోనూ పేదలకు వడ్డిస్తున్నాం. – రమణమూర్తి, ఫుడ్‌బ్యాంకు సూపర్వైజర్ -
విజయనగరంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
విజయనగరంలో మొదలైన సిరిమానోత్సవ సందడి
-
Vizianagaram: ఎలక్ట్రికల్ వాహనాల జోరు..
విజయనగరం: ఓ పక్క అందుకోలేని పెట్రోల్ ధరలు.. మరో పక్క నిర్వహణ భారం.. వెరసి ద్విచక్ర వాహనాలు నడపడానికే భయపడాల్సిన రోజులు.. దీంతో పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాల్సిన తరుణంలో ఎలక్ట్రికల్ వాహనాలు రంగప్రవేశం చేశాయి. శబ్ద, వాయు కాలుష్యం లేకపోవడంతో పాటు ఒకసారి చార్జ్ చేస్తే సుమారు 60,70 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉండడంతో పట్టణ ప్రజలు ఎలక్ట్రికల్ వాహనాల వినియోగంపై మక్కువ కనబరుస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో పదుల సంఖ్యలో ఎలక్ట్రికల్ వాహనాల ఏజెన్సీలు ఏర్పాటు కావడంతో ద్విచక్ర వాహనాలతో పాటు ఆటోల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. -
చంద్రబాబులాంటి పనికిమాలిన నేత ఉన్నారా ??
-
అందమైన కలలకు రూపం.. 'నగరవనం'
నెల్లిమర్ల: జిల్లా కేంద్రమైన విజయనగరానికి కూత వేటు దూరంలో చుట్టూ పచ్చని కొండలు..దగ్గర్లోనే నది..సమీపంలోనే వెయ్యేళ్ల క్రితం నిర్మించిన జైన దేవాలయం వీటి మధ్యలో 25 హెక్టార్ల సువిశాలమైన అటవీ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న నగరవనం సందర్శకుల అందమైన కలలకు మరో రూపం కానుంది. అందమైన నగరవనంలోకి త్వరలోనే సందర్శకులను అనుమతించడానికి సంబంధిత అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడ ఇప్పటికే రూ 42 లక్షలతో చిల్డ్రన్ పార్క్, వైల్డ్ లైఫ్ సెంటర్, వాకింగ్ ట్రాక్, రాశి వనం ఏర్పాటుచేశారు. సమీపంలో ఉన్న కొండపైకి ట్రెక్కింగ్ పాత్, సైకిల్ పార్క్, ఓపెన్ ఆడిటోరియం, కాలువ పార్క్ అందుబాటులోకి తీసుకురానున్నారు. నగర వనానికి ప్రహరీ నిర్మించి, రక్షణ కల్పించనున్నారు. నెల్లిమర్ల పట్టణానికి విచ్చేసే ప్రధాన రహదారి నుంచి నెల్లిమర్ల పారిశ్రామిక వాడకు వెళ్లే రహదారిలో సారిపల్లి సెంట్రల్ నర్సరీ ఉంది. ఈ నర్సరీలో నగర వనం ఏర్పాటు చేయాలని 2015లో అటవీశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయకపోవడంతో ఇప్పటికీ పనులు పూర్తికాక, ప్రారంభానికి నోచుకోని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చొరవ తీసుకుని నగర వనాన్ని ప్రారంభించాలని, సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించింది. దీని కొసం అవసరమైన చర్యలు చేపట్టాలని తాజాగా అటవీశాఖ అధికారులకు కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆదేశాలు జారీచేశారు. దీంతో డీఎఫ్ఓ శంబంగి వెంకటేష్ తాజాగా నగర వనాన్ని సందర్శించారు. ఇంకా అవసరమైన ఏర్పాట్లు, సౌకర్యాలను కల్పించి వచ్చే ఏడాది వేసవి ప్రారంభానికి సందర్శకులను అనుమతించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నగర వనం ద్వారా జిల్లా వాసులకు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యమని చెబుతున్నారు. వచ్చే ఏడాది అందుబాటులోకి సారిపల్లి సెంట్రల్ నర్సరీలో ఏర్పాటుచేస్తున్న నగర వనాన్ని వచ్చే ఏడాది సందర్శకులకు అందుబాటులోకి తీసుకొస్తాం. 25 హెక్టార్ల సువిశాలమైన ప్రదేశంలో ఇప్పటికే రూ.42 లక్షలతో పలు సౌకర్యాలు, ఏర్పాట్లు పూర్తిచేశాం. ప్రహరీ, ఆర్చ్ నిర్మిస్తాం. అలాగే ఓపెన్ ఆడిటోరియం, ట్రెక్కింగ్ పాత్, కాలువ, పార్క్ తదితరాలను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడతాం. సందర్శకులకు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం అందించడమే నగర వనం లక్ష్యం. శంబంగి వెంకటేష్, డీఎఫ్ఓ, విజయనగరం (చదవండి: డబుల్ ధమాకా ఆఫర్! 15 వేలు ఇస్తే ప్రమోషన్...కోరిన చోట పోస్టింగ్) -
మహానాడు కాదు.. ఏడుపునాడు
పార్వతీపురం టౌన్: తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తు న్నది మహానాడు కాదు.. ఏడుపు నాడు అని వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్రెడ్డి సాగిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మహానాడు పేరుతో ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారని ఆరోపించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రోజులు ఒంగోలులో టీడీపీ నిర్వహించిన మహానాడు ఆద్యంతం సీఎంను, ఆయన కుటుంబా న్ని దూషించడమే లక్ష్యంగా సాగిందన్నారు. చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని, బీసీలకు కల్పించిన ప్రయోజనాలను, భవిష్యత్తులో ఏమి చేస్తారో చెప్పకుండా ప్రభుత్వంపై బురదజల్లడ మే పనిగా పెట్టుకోవడం విచారకరమన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదివరకు ఎవరూ చేయని విధంగా మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకు 70 శాతం పదవులు కేటాయించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదని పేర్కొన్నారు. ఆయా వర్గాల్లోని లబ్ధిదారులకు 95 శాతం మేర సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్టు వివరించారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న సామాజిక న్యాయ భేరి బస్సుయాత్రకు ఆయా వర్గాల నుంచి వస్తున్న విశేష స్పందనను చూసి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడికి భయం పట్టుకుందన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలకు మానసిక స్థైర్యం కల్పించేందుకు నానా తంటాలు పడుతున్నారన్నారు. అదే ఆనాడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2017లో నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో తాము అధికారంలోకి వస్తే నవరత్నాల కార్యక్రమం కింద ఏమీ చేస్తామో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 95 శాతం చేసి చూపించారన్నారు. తమ నాయకుడికి, ప్రతిపక్ష నాయకుడికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ బి.గౌరీశ్వరి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: సమ్మర్ స్టడీస్.. ఇంట్లోనే చదవండి ఇలా!) -
అమ్మను చూడాలని..! నాన్నకు చెప్పకుండా బస్సెక్కి..
విజయనగరం క్రైమ్: నవమాసాలు మోసి భూమి మీదకు తీసుకువచ్చి ప్రపంచాన్ని పరిచయం చేసిన కన్నతల్లిని చూడాలని ఆ చిన్నారులు పరితపించారు. అమ్మను చూడాలనుకున్నదే తడవుగా నాన్నకు కూడా చెప్పాపెట్టకుండా బస్సెక్కి విజయనగరం పట్టణానికి వచ్చేశారు. తరువాత వారి దగ్గర డబ్బుల్లేకపోవడంతో ఏం చేయాలో తెలియక పట్టణంలోని గంటస్తంభం, బాలాజీ కూడలి ప్రాంతాల్లో సంచరిస్తుండగా రాత్రి గస్తీ నిర్వహిస్తున్న ఎస్సై దుర్గాప్రసాద్ గుర్తించి, ఆకలి తీర్చి కుటుంబ వివరాలు తెలుసుకుని చిన్నారులను వారి అమ్మమ్మకు అప్పగించారు. హృదయాలను కదిలించిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. నిండా పదేళ్లు లేని ఇద్దరు చిన్నారులు రాత్రివేళ రోడ్లపై ఆకలితో తిరుగుతున్నారు. పదినిమిషాల క్రితమే గంటస్తంభం నుంచి బాలాజీ కూడలి వైపు నడుచుకుంటూ వచ్చారని, ఎవరో తెలియదని స్థానికులు చెప్పడంతో రాత్రి గస్తీ నిర్వహిస్తున్న వన్‌టౌన్ ఎస్సై ఐ.దుర్గాప్రసాద్ చిన్నారులను గుర్తించి దగ్గరికి వెళ్లి ముందు వారి ఆకలి తీర్చారు. అనంతరం వివరాలు ఆరా తీయగా తమ పేర్లు ప్రేమ్ (9), రూప (8) అని, తల్లిదండ్రులు విడిపోయారని, తండ్రి కోటి తెర్లాం మండలం ఉద్దవోలులో ఉంటాడని, తల్లి వెంకటి విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం బుచ్చయ్యపేటలో ఉంటుందని ఏడుస్తూ చెప్పారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో పిల్లలు తండ్రివద్దనే ఉంటూ చదువుకుంటున్నారు. తల్లిని చూసి చాలా రోజులు కావడంతో ఇంట్లో చెప్పాపెట్టకుండా బస్సెక్కి వచ్చేశారు. మంగళవారం రాత్రి విజయనగరం వచ్చిన వారిద్దరూ పలుచోట్ల తిరుగుతూ బుధవారం రాత్రి ఎస్సై దృష్టిలో పడడంతో వివరాలు తెలుసుకుని జి.మాడుగుల మహిళా సంరక్షణ పోలీసులకు ఫోన్ చేసి తల్లి అడ్రస్ సేకరించి, చిన్నారుల అమ్మమ్మ ఈశ్వరమ్మకు సమాచారం అందించారు. దీంతో ఆమె గురువారం వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకోగా పిల్లలను అప్పగించారు. ఈ విషయంలో ఎస్సై, వన్‌టౌన్ సిబ్బంది చేసిన సేవలను పట్టణ ప్రజలు ప్రశంసించారు. (చదవండి: దారి చూపిన ప్రభుత్వం) -
విషాదం: ఆశల దీపాన్ని దేవుడు ఆర్పేశాడు..
కురుపాం/విజయనగరం ఫోర్ట్: రాత్రి 10 గంటల వరకు అందరూ ఒక్కచోటే కూర్చొని శ్రద్ధగా చదువుకున్నారు... 8వ తరగతికి చెందిన 12 మంది విద్యార్థులు ఒకే గదిలో నిద్రకు ఉపక్రమించారు.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.. కట్ల పాము రూపంలో మృత్యువు గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో వారి గదిలోకి ప్రవేశించింది. వరుసగా నిద్రపోతున్న విద్యార్థుల్లో ముగ్గురిని కాటేసింది. విద్యార్థులు వెంటనే మేల్కొన్నారు. పామును గమనించారు. కేకలు వేయడంతో మిగిలిన విద్యార్థులు కర్రతో దానిని హతమార్చారు. వసతిగృహ సిబ్బంది సహాయంతో వెంటనే ఆస్పత్రికి చేరుకున్నా ఒక విద్యార్థి మృత్యు ఒడికి చేరుకున్నాడు. మిగిలిన ఇద్దరు విద్యార్థులు విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వసతిగృహ సిబ్బంది, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం... కురుపాం మండల కేంద్రంలో ఉన్న మహా త్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదు వుతున్న కొమరాడ మండలం దళాయిపేటకు చెందిన మంతిని రంజిత్‌కుమార్, సాలూరు మండలం జీగిరాం గ్రామానికి చెందిన ఈదుబిల్లి వంశీ, సీతానగరం మండలం జగ్గునాయుడు పేటకు చెందిన వంగపండు నవీన్‌లతో పాటు మరో 9 మంది వసతిగృహం డార్మిటరీ గదిలో నిద్రపోతున్నారు. అర్ధారాత్రి తర్వాత కట్లపాము వరుసగా నిద్రపోతున్న రంజిత్‌కుమార్, వంశీ, నవీన్‌ల ముక్కు, కంటి, వీపుమీద కాటేసింది. వారు వసతిగృహంలో ఉన్న ప్రిన్సిపాల్ బిర్లంగి సీతరామ్, ఉపాధ్యాయ సిబ్బందికి తెలియజేశారు. వసతిగృహ సిబ్బంది వెంటనే ద్విచక్రవాహనంపై కురు పాం సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి, అక్కడ నుంచి విజయనగరంలోని తిరుమల ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రంజిత్‌కుమార్ (13) మృతి చెందాడు. మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆశల దీపాన్ని దేవుడు ఆర్పేశాడు.. మహాశివరాత్రికి ఇంటికి వచ్చావు.. అందరితో కలిసి సరదాగా గడిపావు.. పామునోట పడేందుకే వసతిగృహానికి వెళ్లావా అంటూ రంజిత్‌కుమార్ తల్లి సన్యాసమ్మ విలపిస్తున్న తీరు అక్కడివారిని కన్నీరుపెట్టించింది. నా ఆశలన్నీ కొడుకుపైనే పెట్టుకున్నాను.. నాకు దేవుడు అన్యాయం చేశాడు.. మంచి వాళ్లనే తీసుకుపోతాడంటూ బోరున విలపిస్తోంది. విద్యార్థి తండ్రి కృష్ణ ఆస్పత్రి వద్దే కుప్పకూలిపోయారు. రంజిత్ మృతితో వసతిగృహంతో పాటు స్వగ్రామం దళాయిపేటలో విషాదం అలముకుంది. విద్యార్థుల ఆరోగ్యంపై కలెక్టర్ ఆరా: కలెక్టర్ సూర్యకుమారి శుక్రవారం రాత్రి ఆస్పత్రిని సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు. కోలుకునేలా సేవలందించాలని వైద్యులకు సూచించారు. విద్యార్థి మృతి బాధాకరం పాముకాటుకు గురై తిరుమల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణితో పాటు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందజేయాలని వైద్యులకు సూచించారు. ఒక విద్యార్థి మృతిచెందడం బాధాకరమన్నారు. రంజిత్‌కుమార్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఘటనను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేస్తామని తెలిపారు. పాముకరిచిందని విద్యార్థులు తెలిపిన వెంటనే ప్రిన్సిపాల్ స్పందించారన్నారు. విద్యార్థులను కాపాడుకునేందుకు శక్తివంచన లేకుండా కృషిచేశారన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం బీసీ గురుకులాల ఏర్పాటుకు ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందని, వసతులు లేని అద్దె భవనాల్లో ఏర్పాటు చేసిందని, అందువల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని జెడ్పీ చైర్మన్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం విద్యాసంస్థలన్నింటికి సదుపాయాలతో కూడిన శాశ్వత వసతి కల్పించేందుకు కృషిచేస్తోందన్నారు. -
కోడిని కొనే నెపంతో ఇంట్లోకి ప్రవేశించి మైనర్ బాలికపై లైంగికదాడి
సాక్షి,శృంగవరపుకోట రూరల్(విజయనగరం): ఎస్.కోట మండలంలో కోడిని కొనే నెపంతో ఇంట్లో చొరబడిన ఓ దుండగుడు 10వ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి బుధవారం రాత్రి పాల్పడ్డాడు. దీంతో అదే రోజు రాత్రి గ్రామపెద్దలతో కలిసి బాలిక తల్లిదండ్రులు ఎస్.కోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంఘటనకు సంబంధించి గురువారం తెలిసిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఒక గ్రామానికి చెందిన రైతు దగ్గర ఓ వ్యక్తి రైతరికం కోసం చేరాడు. భార్య, 10వ తరగతి చదువుతున్న కూతురితో కలిసి ఉంటున్న ఆ వ్యక్తి కోళ్లను పెంచి అమ్ముతూ ఉంటాడు. అయితే రైతరికం చేస్తున్న వ్యక్తి..కుమార్తెను ఇంటి వద్దనే ఉంచి భార్యతో కలిసి పనిమీద శృంగవరపుకోట పట్టణానికి బుధవారం వచ్చారు. అదే సమయంలో గంట్యాడ మండలం, బోనంగి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కోళ్ల కోసం వచ్చి బేరమాడే పనిలో ఉంటూనే బాలికను మంచినీళ్లు ఇమ్మని అడిగాడు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న ఆ వ్యక్తి నీళ్లు తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లిన బాలికపై లైంగికదాడికి ఒడిగట్టాడు. ఆ సమయంలో బాలిక పెద్దగా కేకలు వేసినప్పటికీ వారిల్లు ఊరికి దూరంగా ఉండడంతో ఎవరికీ వినిపించలేదు. బాలికపై లైంగికదాడికి పాల్పడిన దుండగుడు అనంతరం పారిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక జరిగిన ఘోరం చెప్పగా గ్రామపెద్దలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని గురువారం వేకువజామున అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా ఈ కేసు విషయమై సీఐ సింహాద్రినాయుడితో మాట్లాడగా త్వరలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించనున్నట్లు స్పష్టం చేశారు. -
పంథా మార్చి.. పట్టుబడిన కిలేడీలు
విజయనగరం క్రైమ్: ఆటోలో ప్రయాణిస్తూ పక్కనే ఉన్న మహిళల బ్యాగ్‌ల నుంచి దొంగతనాలు చేసే మహిళలు.. ఇటీవలి కాలంలో తమ పంథా మార్చుకున్నారు. కత్తితో బెదిరించి ఆభరణాలు దొంగలించడం ప్రారంభించారు. అలాంటి ఇద్దరు పాత మహిళా నేరస్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 11.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ అనిల్ పులిపాటి నేరస్తుల వివరాలను మంగళవారం వెల్లడించారు. గంట్యాడ మండలానికి చెందిన కమ్మెల్ల రామలక్ష్మి ఈ నెల 2వ తేదీన విజయనగరం పట్టణంలోని బంగారుషాపులో 11.5 తులాల బరువున్న రెండు మొలగొలుసులను కొనుగోలు చేశారు. తిరుగు ప్రయాణంలో గంట్యాడకు ఆటోలో వెళ్తుండగా అదే ఆటోను అయ్యన్నపేట దాటిన తర్వాత ఇద్దరు పాత మహిళా నేరస్తులైన కొత్తవలస 202 కాలనీకి చెందిన గంటా కాళేశ్వరి, విశాఖ జిల్లా కె.కోటపాడు గ్రామానికి చెందిన రావుల ఎల్లారమ్మలు ఎక్కారు. రామలక్ష్మి ఇంటికి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చి ఒక మహిళా నేరస్తురాలు కత్తిచూపించి బెదిరించిగా, మరో నేరస్తురాలు బ్యాగ్‌లో ఉన్న బంగారు ఆభరణాలను లాక్కొని అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై గంట్యాడ పోలీసు స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదుచేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మంగళవారం గంట్యాడ మండలం తామరపల్లి కూడలి వద్ద ఆకస్మిక వాహన తనిఖీలు చేస్తుండగా ఎస్.కోట నుంచి గంట్యాడ వైపు వస్తున్న ఆటో తామరాపల్లి జంక్షన్ వద్దకు చేరుకునే సమయంలో ఆటో దిగి గాబరాగా వెళ్లిపోతున్న ఇద్దరు మహిళలను పోలీసులు అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించారు. దీంతో వారు పాతనేరస్తులమని, బంగారు ఆభరణాలను తస్కరించింది తామేనని అంగీకరించారు. ఆభరణాలను పోలీసులకు అప్పగించారు. వారిద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలిస్తున్నట్టు డీఎస్పీ వెల్లడించారు. వారిలో కాళేశ్వరిపైన 22 కేసులు, ఎల్లారమ్మపై 18 కేసులు గతంలో ఉన్నట్లు గుర్తించారు. కార్యక్రమంలో సీసీఎస్ సీఐ కాంతారావు, టి.సత్యమంగవేణి, ఎస్ఐ కిరణ్‌కుమార్ నాయుడు, ఏఎస్ఐలు గౌరీశంకర్, లక్ష్మి, కానిస్టేబుల్స్ శ్రీనివాసరావు, రామకృష్ణరావు, ప్రతాప్, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
విషాదం: జడ్పీ వైస్ చైర్మన్ అంబటి అనిల్ మృతి
సాక్షి, విజయనగరం : జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అంబటి అనిల్ గుండె పోటుతో మృతి చెందారు. జిల్లా పరిషత్‌లో అందరి కన్నా చిన్న వయస్సున్న జడ్పీటీసీగా గుర్తింపు పొందారు. అంబటి అనిల్.. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మేనల్లుడు. అనిల్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. అనిల్ సొంతూరు సొంతూరు సాలూరు మండలం సన్యాసిరాజుపేట. జడ్పీ వైస్ చైర్మన్ మృతితో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనిల్ మృతిపై వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఇల్లరికం అల్లుడు.. అత్తారింట్లో ఏం చేశాడంటే..! -
కన్నులపండువగా శ్రీ పైడితల్లమ్మ సిరిమానోత్సవం
-
స్నానానికి వెళ్లి.. శవమై తేలాడు
సాక్షి, విజయనగరం: ఇటీవల కురిసిన వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గెడ్డ ఓ గిరిజన బాలుడిని బలి తీసుకుంది. సీతంపేట పరిధిలోని బర్నగూడ గ్రామానికి చెందిన ఆరిక సుధీర్ కుమార్ (8) బుధవారం ఉదయం గ్రామానికి సమీపంలో ఉన్న గెడ్డలోకి స్నానానికి వెళ్లి అందులో మునిగి చనిపోయాడు. ఇటీవల కురిసిన వర్షాలకు మన్యంలోని గెడ్డలన్నీ పొంగిపొర్లుతున్నాయి. బర్నగూడకు సమీపంలో ఉన్న గెడ్డ కూడా పోటు మీద ఉంది. గ్రామంలోని చిన్నారులు స్నానం కోసం బుధవారం గెడ్డలోకి దిగారు. వారిలో సుధీర్ కాస్త లోపలకు వెళ్లడంతో ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకునిపోయాడు. దీంతో చిన్నారులంతా భయపడి ఊరిలోకి వచ్చి విషయం చెప్పారు. గిరిజనులు వెళ్లి వెతకగా అరకిలోమీటరు దూరంలో బాలుడు దొరికాడు. వెంటనే ఒడ్డుకు తీసుకువచ్చి సపర్యలు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. బాలుడి తండ్రి శీతంనాయుడు హైదరాబాద్ వలస వెళ్లి అక్కడే ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. తల్లి ఆరిక సంతోషమ్మ కూలి పనులు చేస్తుంటారు. సుధీర్ స్థానికంగా ఉన్న గిరిజన ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. చలాకీ ఉండే కుర్రాడు ఇలా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చదవండి: ఆరేళ్ల సహజీవనం చేసి.. ఆందోళనకు గురై జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య -
విజయనగరం : ముంపు ప్రాంతాలను నిరంతరం పర్యవేస్తున్నఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది
-
ఏమైందో? ఏమో?..మిస్టరీగా యువతి మృతి
శృంగవరపుకోట(విజయనగరం): ఎస్.కోట పట్టణంలోని ఎరుకలిపేటలో నేమాపు వాసవి (22) అనే యువతి మంగళవారం రాత్రి సుమారు 9గంటల సమయంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే తన కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లి ఆరోపిస్తోంది. మృతురాలికి తల్లి లక్ష్మీ, సోదరి రోజా ఉన్నారు. ముగ్గురూ కలిసి లక్ష్మి శ్రీ వేంకటేశ్వర థియేటర్ ఎదురుగా మెయిన్‌రోడ్డు పక్కన జ్యూస్, పండ్ల దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ సంఘటనపై మృతురాలి అక్క రోజా బుధవారం స్థానిక విలేకరులకు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోట పట్టణానికి చెందిన నాని అనే వ్యక్తి ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోకపోతే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని మీ చెల్లి వాసవి బెదిరిస్తోందని, వెంటనే ఇంటికి వెళ్లి ఆమె దగ్గర ఉండాలని చెప్పాడు. దీంతో వెంటనే ఇంటికి వెళ్లి చూడగా వాసవి కింద పడి ఉంది. ఎంత లేపినా చలనం లేవకపోవడంతో స్థానికుల సహకారంతో ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారని చెప్పింది. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మీ ప్రసన్నకుమార్ చెప్పారు. కాగా మృతురాలు వాసవి రాసినట్లు చెబుతున్న రెండు పేజీల లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు, చేతిరాతను నిర్ధారించే పనిలో ఉన్నట్లు సమాచారం. ముమ్మాటికీ హత్యే “వాసవి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. ఆమె పిరికిది కాదు. చాలా తెలివైనది. నేను దుకాణం వద్ద ఉండగా మంగళవారం రాత్రి ఇంటికి వచ్చి వంట చేసింది. ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉంటే ఎందుకు వంట చేస్తుంది. వైరు, తాడు, పెద్ద చున్నీ లేకుండా ఫ్యాన్‌కు ఎలా ఉరివేసుకోగలదు? వాసవిని ఎవరో చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని’ మృతురాలి తల్లి లక్ష్మి ఆరోపించింది. రాత్రి ఇంటి బయట ఒక వ్యక్తి చీకట్లో నిల్చుని ఉండగా వీధి మహిళ ఒకరు చూశారని, మరో వ్యక్తి మేడపైకి వెళ్లి హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తోంది. వాసవి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమవుతోంది. చదవండి: 8 మంది భర్తలను మోసగించి.. తొమ్మిదో పెళ్లికి రెడీ, ఎయిడ్స్ సోకడంతో.. -
Vizianagaram: ట్రైనింగ్‌కు వచ్చిన మహిళా ఎస్సై ఆత్మహత్య
విజయనగరం: విజయనగరం జిల్లా పీటీసీ ట్రైనింగ్ సెంటర్లో విషాదం చోటుచేసుకుంది. ట్రైనింగ్‌కు నిమిత్తం వచ్చిన ఒక మహిళా ఎస్సై ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.. భవానీ అనే ఎస్సై రాత్రి హస్టల్లో ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. తూర్పుగోదావరి జిల్లా సఖినేటి పీఎస్‌కు చెందిన భవానీ.. 2018లో పోలీసు ఉద్యోగంలో చేరింది. రాజోల్లో పోలీస్ ట్రైనింగ్ పూర్తిచేసుకుంది. ఆ తర్వాత సఖినేటిపల్లిలో పీఎస్‌లో మొదటి పోస్టింగ్‌లో చేరింది. భవానీ స్వస్థలం కృష్ణాజిల్లా కోడూరు మండంల పాలెం గ్రామంగా పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: శ్మశానంలో ‘డాక్టర్’ చదువు -
భారీ వర్షాలకు కాలువ రహదారిపై గండి
-
యువతిపై పెట్రోలు దాడి: దిశా యాప్‌తో బాధితురాలిని రక్షించాం
-
ఆరుబయట తాగితే అంతే
విజయనగరం: మందుబాబుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. బహిరంగ మద్యపానం, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై నిఘా పటిష్టం చేసింది. ఓ పక్క కోవిడ్ థర్డ్ వేవ్‌పై ప్రజలను అప్రమత్తం చేస్తూనే మరో పక్క ఎస్పీ దీపికా ఎం.పాటిల్ ఆదేశాలతో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారిపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకుని కేసులు నమోదుచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా కేవలం నెల రోజుల వ్యవధిలోనే 122 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదుచేసింది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన వారిపై కొరడా ఝుళిపించి 1,894 కేసులు నమోదుచేసింది. 185 మందిపైన ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. స్నిపర్, షాడోటీంమ్‌లతో పాటు స్పెషల్ టీమ్‌లు ఏర్పాటుచేసి కోడిపందాలు, పేకాట, మద్యం తాగి బైక్‌లు నడపడం, శివారు ప్రాంతాల్లో తగాదాలు, గ్రామాల్లో కొట్లాటలు వంటివి లేకుండా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో నాటుసారా, గంజాయి, నల్లబెల్లం ఊటలు, ఇసుకఅక్రమ తవ్వకాలపై ఎస్ఈబీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. అలాగే జిల్లా పోలీసుల సాయంతో ఆయా స్టేషన్ల పరిధిలో కోవిడ్ థర్డ్ వేవ్‌పై అప్రమత్తత అంశాలను, మరో పక్క దిశా యాప్‌పై విస్త్రత అవగాహన చేపడుతున్నారు. మహిళా సంరక్షణ పోలీసుల సాయంతో గ్రామాల్లోని వార్డుల్లో విస్త్రతంగా కోవిడ్ వ్యాక్సినేషన్‌పై అవగాహన కలి్పంచే దిశగా జిల్లా పోలీస్ శాఖ కృషిచేస్తోంది. కఠిన చర్యలు చేపడతాం రోడ్డుప్రమాదాల నివారణకు కృషిచేస్తున్నాం. చిన్న చిన్న తగాదాలు ఎక్కువగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్నాయి. బమిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కోవిడ్ థర్డ్ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉందని హితవు పలకారు. -దీపికా ఎం.పాటిల్, ఎస్పీ, విజయనగరం -
ఆ ఇంట మృత్యుఘోష, బీచ్‌కు వెళ్లి.. మృతదేహంగా ఒడ్డుకు
సాక్షి, కురుపాం( విజయనగరం): ఆ ఇంట మృత్యుఘోష వినిపిస్తోంది. తల్లి మరణించిన పది రోజులకే కుమారుడు తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కురుపాం మండల కేంద్రం శివ్వన్నపేటకు చెందిన సారిక సత్యవతి (60) అనారోగ్యంతో గత నెల 26న మృతి చెందింది. ఆమె పెద్దకర్మ శుక్రవారం జరగాలి. ఈ ఏర్పాట్లలో ఉంటుండగానే స్నేహితులతో కలిసి గురువారం భీమిలి బీచ్‌కు వెళ్లిన చిన్నకుమారుడు సారిక దేవీప్రసాద్ (32) గల్లంతయ్యాడు. మృతదేహంగా ఒడ్డుకు చేరాడు. ఒకే ఇంటిలో రోజుల వ్యవధిలో తల్లీకొడుకుల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మెకానిక్‌గా పనిచేస్తున్న దేవీప్రసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఒక్కగానొక్క బిడ్డ భవిష్యత్తులో బాగా చూసుకుంటాడని ఆశించారు.. కానీ
సాక్షి,బాడంగి( విజయనగరం): ఒక్కగానొక్క కొడుకు భవిష్యత్తులో బాగా చూసుకుంటాడని ఆశించిన తల్లిదండ్రులు హతాశులయ్యారు. రోడ్డుప్రమాదంలో కన్నపేగు దుర్మరణం పాలవడంతో దుఃఖసాగరంలో మునిగిపోయారు. వివరాలిలా ఉన్నాయి. బాడంగి మండలంలోని గొల్లాది గ్రామానికి చెందిన దాసరి దేవేంద్ర, రాధల కుమారుడు అజయ్‌కుమార్ (14) డొంకినవలస ఎత్తుకానాపై టీహబ్‌సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విజయనగరంలోని జమ్మునారాయణ పురం మహాత్మాగాంధీ జ్యోతి రావు పూలే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అజయ్‌కుమార్ పాఠశాలలు మూసివేయడంతో కొన్నినెలలుగా ఇంటివద్దనే ఉంటున్నాడు. మేనత్తకూతురు విజయనగరం నుంచి కామన్నవలస జంక్షన్ వద్ద బస్సు దిగుతుందని, బావ గిరడ భానుప్రసాద్‌తో కలిసి ద్విచక్రవాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న టాటాలేలాండ్ వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. భాను ప్రసాద్‌కు చిన్నపాటి గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. అజయ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. వ్యాన్‌డ్రైవర్ త్రినాథ్‌ను అదుఫులోకి తీసుకుని వ్యాన్ సీజ్ చేశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై ఎ.నరేష్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గర్భిణీ మహిళను డోలీలో మోసుకెళ్లిన వాలంటీర్లు : విజయనగరం
-
కరోనా తెచ్చిన మార్పు .. ఆన్లైన్లో ఆవులు, గేదెల ఫొటోలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: కరోనా మహమ్మారి వ్యాపారాలను ఛిన్నాభిన్నం చేసింది. ఈ పరిస్థితుల్లో కొందరు ఆధునిక సాంకేతికతను వినియోగించి గట్టెక్కుతున్నారు. పశువుల అమ్మకాలు, కొనుగోళ్లకు రైతులు, వ్యాపారులు సైతం ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. విజయనగరం జిల్లాలో పశువుల క్రయవిక్రయాలకు వారపు సంతలు జరిగేవి. ఈ సంతలకు ఎక్కువగా జెర్సీ, దేశవాళీ ఆవులు, ముర్రా గేదెలు, దేశవాళీ గేదెలు, దుక్కి పశువులు, దున్నపోతులు, ఒంగోలు గిత్తలు తదితర రకాలకు చెందిన పశువులు వస్తుంటాయి. జిల్లాలోని అన్ని సంతల్లో కలిపి నెలకు రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు పశువుల వ్యాపారం జరిగేది. కరోనా కారణంగా వారపు సంతలన్నీ మూతపడ్డాయి. ఈ పరిస్థితుల్లో రైతులు, వ్యాపారులు ఆన్లైన్ ద్వారా పశువుల క్రయవిక్రయాలు చేపట్టారు. ఈ విధానం ఈ మధ్యే ప్రారంభం కాగా.. జిల్లాలో నెలకు రూ.3 కోట్ల విలువైన పశువుల అమ్మకాలు ఆన్లైన్ ద్వారా జరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాలోని అలమండ, మానాపురం, పార్వతీపురం, అచ్యుతాపురం, బొద్దాం, సాలూరు, కూనేరు, కందివలసలో వారపు పశు సంతలు జరిగేవి. ఈ సంతల్లో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు, రైతులు వచ్చి పశువులు కొనుగోలు చేసేవారు. సంతలు మూతపడటంతో ఈ వ్యవహారాలన్నీ ఆన్లైన్లో సాగుతున్నాయి. ప్రతి సోమవారం జరిగే అలమండ పశువుల సంత ఆన్లైన్లో ఇలా.. ఔత్సాహికులైన కొందరు పశువుల కొనుగోలుదారులు, అమ్మకందారులు, రైతులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. రైతుల వద్ద ఉన్న పశువులను వీడియో, ఫొటోలు తీసి వాటి ధర, ఇతర వివరాలను ఆ గ్రూపుల్లో అప్లోడ్ చేస్తున్నారు. నచ్చిన వారు సంబంధిత రైతులు లేదా వ్యాపారులతో చాటింగ్ చేసి పశువుల్ని బేరమాడి కొంటున్నారు. కొందరైతే ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా విక్రయిస్తున్నారు. దళారులు సైతం పశువుల్ని విక్రయించే రైతుల వద్దకు వెళ్లి వారి వద్ద ఉన్న పశువును వీడియో, ఫొటోలు తీసి ఆ పశువు వివరాలు, ధరను వ్యాపారులకు వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు. ఇలా పశువును కొనుగోలు చేసిన వ్యాపారులు లేదా వ్యక్తులు నగదును ఫోన్ పే, గూగుల్ పే వంటి ఆన్లైన్ యాప్‌ల ద్వారా చెల్లిస్తున్నారు. పశువుల్ని కొనుగోలు చేసిన వారికి ట్రక్కులు, ఇతర రవాణా వాహనాల్లో వాటిని పంపిస్తున్నారు. ఆన్లైన్లో అమ్ముతున్నాం కరోనా వల్ల పశువుల సంతలు జరగడం లేదు. చాలా రోజులపాటు పశువుల అమ్మకాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఫోన్ల ద్వారా పశువుల అమ్మకాలు చేస్తున్నాం. రైతుల వద్ద ఉన్న పశువుల వివరాలు, ఫొటోలు, వీడియోలు తీసి గుంటూరు, ఒడిశా తదితర ప్రాంతాలకు చెందిన సంతల్లో పాత పరిచయాలు ఉన్న వారికి పంపిస్తున్నాం. వారు వీటిని చూసి నచ్చితే డబ్బులను ఆన్లైన్ ద్వారా రైతులకు చెల్లిస్తున్నారు. – కె.బలరాం, పశువుల వ్యాపారి కొట్టాల వద్దే అమ్మకాలు సంతలు జరక్కపోవడంతో కొట్టాల వద్దే పశువుల అమ్మకాలు చేస్తున్నాం. మాకు తెలిసిన మధ్యవర్తులు వచ్చి మా దగ్గర ఉన్న పశువును ఫోన్లో ఫొటో తీసి పంపిస్తారు. మాకు నచ్చిన ధర వస్తే అమ్ముతాం. కొనుగోలు చేసిన వారు ఫోన్ పే ద్వారా డబ్బులు పంపి పశువుల్ని తీసుకువెళ్తున్నారు. – బి.సూర్యనారాయణ, రైతు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాం ఆన్లైన్ ద్వారా పశువుల అమ్మకాలకు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాం. కొంతమందికి దీనిపై అవగాహన లేదు. అవగాహన ఉన్న వాళ్లు మాత్రం ఆన్లైన్ ద్వారా పశువుల అమ్మకాలు జరిపిస్తున్నారు. – పిల్లల సత్యం, పశువుల వ్యాపారి -
పేదలకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తోంది
-
విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న రెండో డోసు వ్యాక్సినేషన్
-
లాఠీ పక్కనపెట్టి.. పలుగు, పార చేతపట్టి
మక్కువ (సాలూరు): నేరస్తులు, వివిధ ఘర్షణలతో వచ్చిన నిందితులు, బాధితుల మధ్య ఎప్పుడూ బిజీబిజీగా పోలీసులు గడుపుతుంటారు. ఇక సామాజిక సేవల జోలికి పోవడానికి తీరికెక్కడుంటుందని అందరం అనుకుంటుంటాం. విజయనగరం జిల్లా మక్కువ పోలీసులు దీనికి భిన్నం. గిరిజన ప్రాంతంలో సమస్యలను గుర్తించి.. స్వయంగా తామే శ్రమదానానికి నడుం బిగించి శభాష్ అనిపించుకుంటున్నారు. ఓఎస్డీ సూర్యచంద్రరావు తన సిబ్బందితో ఇటీవల గిరిశిఖర గ్రామాలను సందర్శించారు. మక్కువ, సాలూరు మండలాలకు చెందిన పలు గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. ఎలాగైనా తమ వంతుగా కృషి చేసి, గిరిజన గ్రామాలకు రహదారి ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు పదునుపెట్టారు. మక్కువ మండలం ఎగువ మెండంగి గ్రామం నుంచి సాలూరు మండలం తాడిపుట్టి గ్రామం వరకు రహదారి ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. సుమారు 100 మంది పోలీసులతో ఓఎస్డీ సూర్యచంద్రరావు శుక్రవారం ఎగువమెండంగి గ్రామానికి చేరుకున్నారు. ఆయా గిరిజన గ్రామాలకు చెందిన గిరిజనులతో మమేకమై గిరిజన ‘బాట’ ఏర్పాటుకు నడుంబిగించారు. ఎగువమెండంగి గ్రామం నుంచి తాడిపుట్టి గ్రామాల మధ్యనున్న రాళ్లు, రప్పలు, తుప్పలు, డొంకలను తొలగించి సుమారు 800 మీటర్ల మేర రహదారిని ఏర్పాటు చేశారు. మండుతున్న ఎండలోనూ పోలీసులంతా రహదారి ఏర్పాటు పనుల్లో నిమగ్నమై ఓ రూపును తీసుకొచ్చారు. సాలూరు సీఐ ఎల్.అప్పలనాయుడు, ఎస్టీఫ్ ఆర్ఐ పి.నాగేశ్వరరరావు, మక్కువ ఎస్ఐ కె.రాజేశ్, పోలీస్ సిబ్బంది, గిరిజనులు పాల్గొన్నారు. రహదారి ఏర్పాటు చేస్తున్న పోలీసులు, గిరిజనులు -
‘ఎన్నిసార్లు మంత్రిగా ఉన్నామనేది ముఖ్యం కాదు’
సాక్షి, విజయనగరం : శ్రీరామతీర్థ సాగర్ ద్వారా విజయనగరానికి నీళ్లు తీసుకొస్తామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇప్పటికే పేదలందరికీ ఇళ్లు పట్టాలు ఇచ్చామని, మిగిలిన వాళ్లకి కూడా ఇస్తామని భరోసానిచ్చారు. అందరికి తమ దగ్గర ప్రాంతంలోనే ఇళ్ల పట్టాలు ఇస్తామని, ఆర్థికంగా సాయం అందిస్తామని తెలిపారు. జిల్లాలో మంత్రి శుక్రవారం మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం విజయనగరం జిల్లా అభివృద్ధి చెందాలని పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్ని సార్లు మంత్రి పదవి చేశామని కాదని, ప్రజలకు కావల్సిన పనులు చేయడం ముఖ్యమన్నారు. నగరంలో ఎమ్మెల్యే పూర్తిగా ఆ దిశగా పని చేస్తున్నారని తెలిపారు. శ్రీరామతీర్ధ సాగర్ నుంచి నీరు తీసుకురావాలని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నప్పుడే ప్రయత్నించామని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం కక్షతో ఆ ప్రాజెక్టుని నిలిపి వేసిందని విమర్శించారు. చదవండి: ‘అబద్ధాలు తప్ప.. ఆయన చేసిందేమీలేదు’ ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోమన్న మంత్రి.. ప్రజల నుంచి రావడం వల్ల వాళ్ల కష్టాలు తమకు తెలుసని అన్నారు. వృద్దులకు వాలంటీర్లు ద్వారా ఉదయాన్నే పెన్షన్ అందిస్తున్నారని తెలిపారు. మోసం, దగా లేకుండా పారదర్శకంగా అందిస్తున్నామన్నారు. అమ్మ ఒడి ద్వారా పండగకు ముందే వారి ఖాతాలో డబ్బులు జమచేశారని పేర్కొన్నారు. ఇలాంటి ఆలోచన చంద్రబాబుకి ఎప్పుడూ రాదని ఎద్దేవా చేశారు. పద్దెనిమిది నెలల కాలంలో మీరు ఎంత సంతోషంగా ఉన్నారో, గత అయిదేళ్ళలో ఎలాంటి ఇబ్బంది పడ్డారో ఆలోచన చేయాలని ప్రజలకు సూచించారు. కరోనా సమయంలో అధికారులతో సంప్రదించి ప్రజలు ఇబ్బంది పడకూడదని చెబుతూ వచ్చారన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి, దేవుడిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డ బొత్స.. అధికారంలో లేనప్పుడే టీడీపీకి దేవుళ్లు కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మా మంచి సారు.. నరేంద్ర..!
సాక్షి, విజయనగరం: మనిషి జీవితంలో తల్లితండ్రి తర్వాతి స్థానం గురువకే దక్కింది. అమ్మనాన్న మనకు జన్మనిస్తే.. గురువు జ్ఞానబోధ చేసి.. పుట్టుకకు సార్థకత చేకూర్చుకునేందుకు మార్గం చూపిస్తాడు. అలాంటి గురువు పట్ల ఎల్లప్పుడు భక్తిశ్రద్ధలు కనబర్చాలి. ప్రస్తుత కాలంలో గురువులను వేధించే పిల్లలు.. విద్యార్థుల పట్ల కీచకులుగా మారిన కొందరు గురువులను చూడాల్సి రావడం నిజంగా దురదృష్టం. అయితే మంచి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఎంత బాగా గౌరవిస్తారో ఈ సంఘటన చూస్తే తెలుస్తుంది. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం మల్లుగూడ గ్రామంలో మండల పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన నరేంద్రకు వేరే ఊరికి బదిలి అయ్యింది. మల్లుగూడ మండల ప్రాథమిక పాఠశాలలో పదేళ్లపాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి బదిలీపై వెళ్లిన నరేంద్రకు ఆ గ్రామ గిరిజనులు పెద్ద ఎత్తున వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయుడిని తమ భుజాలపై ఎత్తుకుని ఆనందోత్సాహాల నడుమ ఊరేగించారు. గతంలో ఇటువంటి సంఘటన ఈ చుట్టుపక్కల గిరిజన ప్రాంతాల్లో జరగలేదని అతడి తోటి ఉపాధ్యాయులు, మండల ప్రజలు అభినందించారు. (చదవండి: స్కూల్ టీచర్.. ఒక్కరోజులోనే సెలబ్రిటీగా) నరేంద్ర ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఈ పదేళ్ళకాలంలో క్రమశిక్షణతో మెలిగి రోజువారీ విధులకు హాజరై విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ప్రజల ఆదరణ పొందారు. దీంతో ఆయన సేవలను గుర్తించిన గ్రామస్తులు ఘనంగా సన్మానించి ఊరేగింపుగా తీసుకు వెళుతూ ఆనందోత్సవాల మధ్య వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. -
భూవివాదం: ఇద్దరిపై కత్తిపోట్లు
భూవివాదం ఇద్దరి ప్రాణం మీదకు తెచ్చింది. గతంలో కుదుర్చుకున్న ఒప్పందానికి భిన్నంగా ఇప్పుడు ఎక్కువ ధర రావడంతో విక్రయదారురాలు వేరొకరికి అమ్మకానికి చూపడంతో వివాదం మొదలైంది. చివరకు కత్తితో పొడిచి ప్రాణాపాయానికి తెచ్చేంత పరిస్థితి నెలకొంది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. భోగాపురం: పూసపాటిరేగ మండలం కోనాడకు చెందిన అరుణ, విజయనగరం కాణిపాక గ్రామానికి చెందిన పతివాడ ప్రవీణ్‌కుమార్‌పై కోనాడకు చెందిన బసవ ఉపేంద్ర కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకోవడంతో సంచలనం రేగింది. దీనికి సంబంధించి భోగాపురం సీఐ శ్రీధర్ తెలిపిన వివరాలు.. కోనాడ గ్రామానికి చెందిన రామగురువులు అనే మహిళ తనకున్న 1.90 ఎకరాల భూమిని వారి బంధువులైన బసవ అచ్చిబాబుకు గతంలో విక్రయించేందుకు సిద్ధపడి వారి నుంచి కొంత మొత్తం నగదు తీసుకుంది. ఇటీవల కాలంలో ఆ భూముల ధరలకు రెక్కలు రావడంతో డబ్బులకు ఆశపడి రామగురువులు అదే భూమిని అచ్చిబాబుకు తెలియకుండా విజయవాడలో ఉంటున్న శ్రీనివాసరెడ్డికి అమ్మేందుకు తన కూతురు అరుణతో కలిసి రామగురువులు శుక్రవారం భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చింది. దీంతో విషయం తెలుసుకున్న అచ్చిబాబు తన కుమారులు ఉపేంద్ర, వెంకటేష్, కె.అప్పలరెడ్డితో కలిసి భోగాపురం రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చాడు. రామగురువులును ప్రశ్నించాడు. గతంలో ఈ భూమిని తనకు విక్రయించేందుకు అడ్వాన్స్ తీసుకొని ఇప్పుడు తనకు తెలియకుండా వేరొకరికి ఎలా విక్రయిస్తావని ఇది ఎంత వరకు సమంజసమని అచ్చిబాబు రామగురువులును నిలదీశాడు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. అది కాస్త ఘర్షణకు దారితీసింది. దీంతో అచ్చిబాబుతో వచ్చిన కుమారుల్లో ఒకరైన బసవ ఉపేంద్ర కొపోద్రిక్తుడై తమ్ముడు వెంకటేష్, స్నేహితుడు అప్పలరెడ్డితో కలిసి రామగురువులు కుమార్తె అరుణపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఇంతలో కొనుగోలుదారులు తరఫున వచ్చిన కాణిపాకకు చెందిన ప్రవీణ్‌కుమార్ ఈ సంఘటనను తన సెల్ఫోన్లో చిత్రీకరించడంతో గమనించి ఉపేంద్ర ఆయనపై కూడా కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి ఎస్ఐ మహేష్ తన సిబ్బందితో చేరుకున్నాడు. అప్పటికే రక్తం మడుగులో ఉన్న అరుణ, ప్రవీణ్‌కుమార్‌ను వెంటనే విజయనగరంలోని తిరుమల ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఉపేంద్రపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీధర్ తెలిపారు. ఇదిలా ఉండగా ఈ సంఘటన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద జనం మధ్య జరగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందోనన్న భయాందోళనకు గురయ్యారు. -
పెరుగనున్న బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ (బుడా) పరిధి పెరగనుంది. బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి మరో 6 మండలాల్లోని 169 పంచాయతీలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బొబ్బిలి అర్బన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలతో పాటు విజయనగరం జిల్లాలోని 11 మండలాల్లోని 572 గ్రామాలు ఉన్నాయి. చదవండి: 'వైఎస్ఆర్ చేయూత' రెండో విడత ప్రారంభం కొత్తగా బుడా పరిధిలోకి తెర్లా, బలిజపేట, కురుపాం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి గ్రామాలు, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోని 833 చదరపు కిలో మీటర్ల ప్రాంతాన్ని కలుపుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తాజా ఉత్తర్వులతో 3080 చదరపు కిలో మీటర్లు బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి పెరగనుంది. మొత్తంగా 7.52లక్షల జనాభా పరిధిలో బుడా తన సేవలను ప్రారంభించాల్సి ఉంది. -
సడన్‌గా లేచి.. కాల్చండని కేకలు
ఆన్లైన్ మొబైల్ గేమ్స్ ఒక ప్రమాదకరమైన వ్యసనంలా మారాయి. ఆటల పేరుతో యువతను బానిసలుగా మార్చేసి, పిచ్చోళ్లను చేస్తూ కొన్ని కంపెనీలు రూ.కోట్లు దండుకుంటున్నాయి. ఆట మత్తులో హైస్కూల్ విద్యార్థుల నుంచి యువకుల వరకూ అంతా బానిసలై తల్లిదండ్రులకు తెలియకుండా రూ.వేలకు వేలు తగలేస్తున్నారు. అడిగిన వెంటనే సొమ్ములు ఇవ్వకుంటే తల్లిదండ్రులను బెదిరిస్తూ ఆత్మహత్యలకు సిద్ధమై, అలవోకగా ప్రాణాలు తీసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వాలు ఆన్లైన్ గేమ్స్‌పై నిషేధం విధించినా యువత లెక్క చేయడం లేదు. సాక్షి, శృంగవరపుకోట: క్రీడలు శారీరక ఆరోగ్యాన్ని, మానసిక వికాసాన్ని అందించేవిగా ఉండాలి. ఆరోగ్యం కోసం ఆటలాడాలంటూ పెద్దలు పిల్లల్ని ప్రోత్సహించేవారు. ఇప్పుడు క్రీడలు అంటే పిల్లలు ఏమైపోతారో అనే ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆన్లైన్ గేమ్స్‌కు సంబంధించి మొన్న పోక్‌మాన్, నిన్న బ్లూవేల్స్, ఇప్పడు పబ్జీ, ఫ్రీ ఫైర్ గేమ్స్ విద్యార్థులను, యువతను వెర్రెక్కించి, ప్రమాదంలోకి నెడుతున్నాయి. విద్యార్థులు, యువకులు గంటల పాటు ప్రమాదకరమైన ఆన్లైన్ గేమ్స్‌లో మునిగితేలుతున్నారు. ప్రభుత్వాలు కొన్ని గేమ్స్‌ను బ్యాన్ చేసినా, కొన్ని సర్వర్ల ద్వారా డౌన్లోడ్ చేసుకుని వేలాది మంది డేంజర్‌గేమ్స్‌లో భాగస్వాములు కావడం గమనార్హం. ఏమిటీ గేమ్స్.. పబ్జీ దక్షిణ కొరియాకు చెందిన ఓ వీడియో గేమింగ్ కంపెనీ తీసుకొచ్చిన ఆన్లైన్ మల్టీప్లేయన్ గేమింగ్ యాప్. ఇదే తరహాలో మరో ఆన్లైన్ గేమ్ ఫ్రీ ఫైర్. ఈ గేమ్స్‌ను ఆండ్రాయిడ్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని గేమ్‌లో ప్రవేశించాలి. గేమ్‌ను సింగిల్‌గా లేదా గ్రూప్‌గా ఆడొచ్చు. గేమ్‌లో 100 మంది వరకూ ఉంటారు. ఆడేవారు తప్ప మిగిలిన వారంతా శత్రువులు గానే లెక్క. గేమ్‌ని వార్ ఫీల్డ్లా భావించి ఎదురుపడ్డ పోటీదారులను చంపుకుంటూ పోవాలి. మిగిలిన వాడు విజేత. ఇందులో మనం ఎంచుకున్న ఆటగాడికి కావాల్సిన దుస్తులు, ఆయుధాలు, బాంబులు, బంకర్లు, మెడికల్ కిట్లు అన్నీ అమ్మకానికి ఉంటాయి. దీంతో తమ ఆటగాడికి కావాల్సిన సామగ్రి కొనాలంటే వెంటనే ఆన్లైన్లో పేమెంట్ చేయాలి. ఇలా తమను ఊహించుకుంటూ ఓడిన (చనిపోయిన) ప్రతిసారీ గెలవాలన్న కసితో వేల రూపాయలు తగలేస్తున్నారు. పట్టించుకోని ఉన్మాదం.. ప్రస్తుతం కరోనా ప్రభావంతో స్కూల్స్, కాలేజీలు మూతపడటం, ఆన్లైన్ క్లాసుల కోసం అని ఇంచుమించుగా ప్రతి విద్యార్థికి ఆండ్రాయిడ్ మొబైల్‌ని తల్లిదండ్రులు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఆన్లైన్ గేమ్స్ ఆడేవారి సంఖ్య మరింతగా పెరిగింది. ఆన్లైన్ గేమ్స్‌లో బానిసలుగా మారిన విద్యార్థులు, యువకులు చదువుల్లో పూర్తిగా వెనుకబడుతున్నారు. నిద్రలేమి, కంటి సమస్యలు, మానసిక ఒత్తిళ్లు, ఆందోళన, ఓటమిని భరించలేక పోవడం, సొమ్ము కోసం తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేయడం వంటి నేర ప్రవృత్తికి లోనవుతున్నారని, డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్యకు తెగిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. కొందరు బాధితులు.. ఎస్.కోటకు చెందిన విజయ్‌సాయి(పేరు మార్చాం) కొద్ది నెలల క్రితం పబ్జీ, ఫైర్ ఫ్రీ గేమ్స్ ఆడేందుకు అలవాటు పడ్డాడు. క్రమంగా గేమ్స్‌లో మునిగితేలాడు. ఆటలో మదుపు పెట్టేందుకు తండ్రికి తెలియకుండా రూ.వేలల్లో ఖర్చు పెట్టాడు. డబ్బులు పోయి, డబ్బులు ఖర్చులకు లేక వింత పోకడతో వ్యవహరించడంతో ఆ యువకుడి తల్లిదండ్రులు వైద్యుణ్ని సంప్రదించారు. సైక్రియాటిస్ట్ అతడిని గేమ్స్‌కు దూరంగా ఉంచాలని, ప్రస్తుతం ఏ విషయంపై ఒత్తిడి చేయవద్దని తల్లిదండ్రులకు సూచించారు. కొద్ది రోజులు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి మందులు ఇచ్చారు. ఎస్.కోటకు చెందిన ఓ 12 ఏళ్ల విద్యార్థి అభిజ్ఞకుమార్ (పేరు మార్చాం) ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డాడు. ఇప్పుడు రాత్రివేళ నిద్రలో సడన్‌గా లేచి పరుగెడుతున్నాడు.. ‘కాల్చండి.. కాల్చండి’ అంటూ కేకలు పెడుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి ఆన్లైన్ గేమ్స్ ఆడకుండా పిల్లలను నియంత్రించాలి. వారి భవిష్యత్ దెబ్బతినే పరిస్థితి రాకుండా గమనించాలి. అవసరం లేకుండా ఫోన్లు కొని ఇ వ్వకూడదు. గంటలకొద్దీ ఫోన్లతో గడిపేటప్పు డు వారి మానసికి స్థితిని గమనించాలి. ఆన్లైన్ గేమ్స్ వల్ల పిల్లలు, యువకుల్లో ఆరోగ్య, మానసిక సమస్యలు వస్తాయి. ఆత్మహత్యలకు సిద్ధమౌతున్నారు. – బి.శ్రీనివాసరావు, ఎస్.కోట సర్కిల్, సీఐ మానసికంగా బలహీనులౌతారు మొబైల్ గేమ్స్ ఆడడంతో ఒత్తిడికి గురై మానసికంగా బలహీనం అవుతారు. దృష్టిలోపం, ఆత్మన్యూనత, జ్ఞాపకశక్తి కోల్పోవడం, భయం, ఆందోళనకు గురవడం, కోపానికి గురికావడం, స్వీయ నియంత్రణ కోల్పోవడం జరుగుతాయి. వీలైనంత త్వరగా వారిని ఆ వ్యససం నుంచి బయటకు రప్పించేలా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. – డాక్టర్ జి.మృదుల, హోమియో వైద్యాధికారి, ఎస్.కోట ఆన్లైన్ గేమ్స్‌తో సమస్యలు ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ కదలకుండా ఒకే చోట ఎక్కువ సమయం గడపడం వల్ల కండరాల వృద్ధి ఆగిపోతుంది. నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి కోల్పోతారు. ఏకాగ్రత దెబ్బతింటుంది. కోపం, ఉద్రేకం అధికమౌతాయి. శారీరక, మానసిక రుగ్మతలకు గురౌతారు. వాళ్లని గమనించి ఆన్లైన్ గేమ్స్‌కు దూరంగా ఉంచాలి. – డాక్టర్ ఎస్.వి.సత్యశేఖర్, జనరల్ సర్జన్ -
ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ఫోటోలు
-
ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత
సాక్షి, విజయనగరం: ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు(77) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా పార్వతీపురం పెదబొందపల్లిలోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. 1972 జననాట్య మండలిని స్థాపించి.. తన జానపద గేయాలతో పల్లెకారులతో పాటు గిరిజనులను వంగపండు ఎంతగానో చైతన్యపరిచారు. తన జీవిత కాలంలో వందలాది ఉత్తరాంధ్ర జానపదాలకు వంగపండు గజ్జెకట్టాడు. ఏం పిల్లడో ఎల్దమొస్తవ పాటతో వంగపండు ప్రఖ్యాతి చెందారు. అర్థరాత్రి స్వతంత్య్రం సినిమాతో వంగపండు సినీ ప్రస్థానం మొదలైంది. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత కళారత్న పురస్కారం అందుకున్నారు. వంగపండు మరణంపై ప్రజాగాయకుడు, విప్లవకవి గద్దర్ స్పందిస్తూ.. వంగపండు పాట కాదు ప్రజల గుండె చప్పడు. అక్షరం ఉన్నంత వరకు వంగపండు ఉంటాడు. ఆయన పాటలు 10 భాషల్లోకి అనువదించబడ్డాయి. మూడు దశాబ్దాలలో 300కుపైగా పాటలు పాడారు. పాటను ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఘనత వంగపండుది అని పేర్కొన్నారు. వంగపండు మరణం ఉత్తరాంధ్ర కళాకారులకే కాకుండా జానపదానికే తీరనిలోటని ప్రజా గాయకుడు దేవిశ్రీ కన్నీటి పర్యంతమయ్యారు. వంగపండుతో తమ కుటుంబానికి ఎంతో సాన్నిహిత్యముందని.. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో తాను ఉద్యోగం వదిలి ప్రజా గాయకుడిగా రాణించానన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికపుడు స్పందిస్తూ ఉత్తరాంధ్ర జానపదానికి వన్నెతెచ్చిన మహానుభావుడు వంగపండు అని అన్నారు. ఉత్తరాంధ్ర జానపదం రాలిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి దగ్గర నుంచి వంగపండుతో తమకి ఎంతో సాన్నిహిత్యముందన్నారు. ఆయనది తమది పక్కపక్కనే ఊర్లని వంగపండు ప్రభావం తనలాంటి ఎందరో కళాకారులపై ఉందన్నారు. ఆయన మరణంపై వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి వ్యక్తం చేస్తున్నానన్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విజయనగరంలో కరోనా తొలి మరణం!
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో కరోనా వల్ల తొలి మరణం సంభవించింది. బలిజిపేట మండలం చిలకపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు కరోనా లక్షణాలతో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ నెల 4వ తేదీన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ విశాఖపట్నం కేజీహెచ్‌కు, అక్కడి నుంచి టీబీ ఆస్పత్రికి వెళ్లారు. ఆమెకు అక్కడ కోవిడ్ 19 నిర్థారణ పరీక్ష చేయగా పాజిటివ్‌గా వచ్చింది. ప్రస్తుతం విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్ లాల్ వెల్లడించారు. మొన్నటివరకూ రాష్ట్రంలోనే ఏకైక గ్రీన్ జోన్ జిల్లాగా ఉన్న విజయనగరంలో తొలి కరోనా కేసు బయటపడటం... రెండు రోజులకే తొలి మరణం చోటు చేసుకోవడంతో జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. చనిపోయిన మహిళకు నేరుగా 51 మంది, పరోక్షంగా 21 మందితో సంబంధాలు కలిగినట్లు అధికారులు ఇప్పటికే తేల్చారు. వీరందరినీ క్వా రంటైన్ సెంటర్లకు తరలించారు. గ్రామం చుట్టుపక్కల పది బఫర్ జోన్లలో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. కాగా శనివారం నాటికి విజయనగరం జిల్లాలో కరోనా పాజిటివ్ కలిగిన వారు ముగ్గురు ఉన్నారు. వీరికి మిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిబంధనలు మరింత కఠినం జిల్లాలో నిబంధనలు మరింత కఠినతరం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆదివారం నుంచి జిల్లాలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతినివ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కూరగాయలు విక్రయిస్తున్న వ్యాపారులందరికీ కోవిడ్ 19 నిర్థారణ పరీక్షలు చేయాలని అధికారులకు సూచించారు. మరోవైపు కరోనా వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా పారిశుద్ధ్య, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది నిరంతరం సహాయక చర్యలు ఆందిస్తున్నారు. కంటైన్మెంట్జోన్, చుట్టుపక్కల బఫర్‌జోన్‌లో ఉన్న 10 గ్రామాలకు రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. కంటైన్మెంట్జోన్లో ఉన్నవారిని ఇళ్లలోనుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. ఈ ప్రాంతానికి ఇతరుల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తూ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో 175 కుటుంబాలకు 5 కిలోల వంతున బియ్యం, పాలు ఇంటింటికి ఆందజేశారు. ఇంటింటా ముమ్మర సర్వే కరోనా వ్యాధి లక్షణాలైన దగ్గు, జ్వరం, జలుబు, గొంతునొప్పి తదితర సమస్యలతో బాధ పడుతున్న వారి వివరాలను వైద్యాధికారి నేతృత్వంలో ఆశ, ఏఎన్ఎం, వలంటీర్‌తో కూడిన 3 బృందాలు 160 ఇళ్లకు వెళ్లి సర్వే చేసి గ్రామస్తులకు తగిన సూచనలు అందిస్తున్నారు. ఇప్పటికే ఎస్పీ, బీసీ కాలనీల్లో సర్వే పూర్తి చేశారు. బఫర్ జోన్లో ఉన్న గ్రామాల్లో కూడా సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతీ ఇంటికీ వెళ్లి మాస్కులను పంపిణీ చేశారు. కరోనా ఒకరినుంచి ఒకరికి వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆ ప్రాంతంలో సబ్ కలెక్టర్ టి.ఎస్.చేతన్, పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, పంచాయతీ, వైద్య ఆరోగ్య, రెవెన్యూ శాఖల అధికారులు గ్రామంలో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ పలు సూచనలు చేస్తున్నారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. కంటైన్మెంట్ ప్రాంతంలో పూర్తిగా సోడియం హైపో క్లోరైట్ పిచికారీ చేశారు. -
వారికి ఆకులే మాస్క్‌లు
వీరంతా విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పద్మాపురంలోని గిరి శిఖరాన గల మాలమామిడి గ్రామంలో నివశిస్తున్న గిరిజనులు. జాతీయ రహదారికి కూతవేటు దూరంలో.. ఒడిశా రాష్ట్రానికి సమీపంలో ఉండే ఈ అడవి బిడ్డలు కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి అడవిలో లభించే చెట్ల ఆకులనే మాస్కులుగా ధరిస్తున్నారు. కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతున్నందున మాస్కులు వాడాలని గ్రామ వలంటీర్లు తమకు చెప్పారని వీరంతా తెలిపారు. తమ వద్ద మాస్కులు లేకపోవడంతో అడవిలో లభ్యమయ్యే ఔషధ గుణాలున్న ఆకులు, నారలతో మాస్కులు తయారు చేసుకుని ధరిస్తున్నామని చెప్పారు. అలాగే గిరిజనులు తమకు తాముగా భౌతిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. – సాక్షి ప్రతినిధి, విజయనగరం పేనాలు తీసే రోగమంట కదా పేనాలు తీసే అదేదో రోగమొచ్చిందని అందరూ అంటన్నారు. అంతా ఇంటికాడే ఉండాలంట గదా. బైటకొచ్చినా దూరం.. దూరంగా ఉండాలంటన్నారు. ముక్కు, నోరు కప్పుకోమం ట్నారు. అందుకే దూరంగా ఉంటూ, ఆకులతో ఇలా ముక్కు, నోరు కప్పుకుంట్నాం.– కొర్ర పొట్టమ్మ, గిరిజన మహిళ (8 వేలు దాటిన కరోనా కేసులు) గిరి‘జన చైతన్యం’ కరోనా వైరస్ వ్యాప్తి విశాఖ ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో లేదు. అయినా కరోనా నియంత్రణ చర్యలను అక్కడి గిరిజనులు చక్కగా పాటిస్తున్నారు. మైదాన ప్రాంతాలవారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ పిలుపు మేరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. మంచినీళ్ల కుళాయిల వద్దకు వచ్చినా, డీఆర్ డిపోల నుంచి నిత్యావసరాలు తీసుకునేందుకు వెళ్లినా కచ్చితంగా భౌతిక దూరం పాటిస్తున్నారు. మాస్కులు ధరిస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో ఇప్పటివరకూ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదుకాకపోవ డానికి గిరిజనుల చైతన్యమే కారణంగా చెబుతున్నారు. – సాక్షి, విశాఖపట్నం -
కరోనా: రియల్ హీరోలు
రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. మూడోది జరిగితే ప్రపంచం ఉండదట.. ఒకప్పుడు అంతా అనుకునేవారు. ఊహించినట్టే యుద్ధం వచ్చేసింది. కంటికి కనిపించని వైరస్‌తో ‘ప్రపంచ యుద్ధం’ సాగుతోంది. కోరలు చాచిన కరోనాతో ప్రపంచమంతా వణికిపోతోంది. వైరస్‌కి బలైపోతున్న నిండు ప్రాణాల సంఖ్య పెరిగిపోతోంది. కల్లోల కరోనాను తుదముట్టించేందుకు నిర్విరామ యుద్ధం సాగుతోంది. కబళిస్తున్న మహమ్మారిపై ముప్పేట దాడి సాగిస్తున్న వీరులెందరో. అసమాన ధైర్య సాహసాలతో ప్రాణాలు పణంగా పెట్టిన ధీరులెందరో. మనందరి కోసం.. అందరినీ వదిలి.. అత్యంత ప్రమాదకర యుద్ధం చేస్తున్న ఆ సైనికులు అక్షరాలా హీరోలే. ముక్కుపుటాలదిరిపోయే చెత్తాచెదారాన్ని తొలగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు.. విచ్చలవిడిగా దూసుకుపోయే జన ప్రవాహాన్ని అడ్డుకునే పోలీసులు.. రోగులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది.. దేశ సరిహద్దుల్లో సైనికులకు తీసిపోని వీరి సేవలు నిరుపమానం. ఏమిచ్చి తీర్చుకోగలం రుణం. నిస్వార్థ సేవలకు సలాం చేస్తోంది సమాజం. అడుగడుగునా కురుస్తోంది అభినందన చందనం. అందుకోండి కృతజ్ఞతాభివందనం. సాక్షి, విజయనగరం: జిల్లా కలెక్టర్ దగ్గర్నుంచి అన్ని విభాగాలకు చెందిన 55 మంది జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ కరోనా కట్టడికి పాటుపడుతున్నారు. దాదాపు 195 మంది డాక్టర్లు, 260 మంది నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి విధులకు హాజరవుతున్నారు. ఎస్పీతో పాటు ఇద్దరు ఏఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 24 మంది సీఐలు, ఆర్ఐలు, 96 మంది ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, 526 మంది ఏఎస్ఐలు, హెచ్‌సీలు, 1200 మంది కానిస్టేబుళ్లు, 450 మంది హోమ్‌గార్డులు, 300 మంది ఎస్టీఎఫ్లు, 200 మంది ఫారెస్ట్, లీగల్ మెట్రాలజీ, ఏసీబీ, సీఐడీ సిబ్బంది మొత్తం కలిపి దాదాపు 3 వేల మంది పోలీసు డిపార్ట్మెంట్ నుంచి రోడ్లమీదకు వచ్చి లాక్డౌన్ పటిష్టంగా అమలు జరిగేలా కాపలాకాస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న 10895 మంది వలంటీర్లు 4519 మంది ఉద్యోగులు, పట్టణాల్లోని వార్డు సచివాలయాల్లో 2017 మంది వలంటీర్లు, 846 మంది ఉద్యోగులు, 2588 మంది ఆశ వర్కర్లు, దాదాపు 600 మంది ఇంటింటి సర్వే చేపట్టి అనుమానిత లక్షణాలున్నవారిని గుర్తించి అధికారులకు సమాచారం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో కోవిడ్ 19 ఆరోగ్య సర్వే పూర్తికాగా మూడవ విడత సర్వే మొదలైంది. రెండు, మూడు రోజుల్లో అది కూడా పూర్తవుతుంది. ఇప్పటి వరకూ 2140 మంది అనుమానితులను గుర్తించారు. ఇక 1147 మంది పారిశుద్ధ్య కారి్మకులు పట్టణాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతున్నారు. వీరంతా రేయింబవళ్లు కష్టపడుతున్నారు. గ్రామాలను కూడా 3230 మంది పారిశుద్ధ్య కారి్మకులు స్వచ్ఛంగా ఉంచుతున్నారు. మరి వీరి గురించి వారి కుటుంబ సభ్యులేమంటున్నారో తెలుసా.... పోలీసులే రియల్ హీరోలు నా భర్త ఎస్.ఎన్.ఆదిత్య జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. పోలీస్ శాఖలో పనిచేయడమే గొప్ప వరం. విపత్కర పరిస్ధితుల్లో ప్రజల రక్షణకు మేమున్నాం అంటూ నిలవటం చాలా గొప్ప విషయం. దేశం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం అహరి్నశలూ శ్రమిస్తున్న పోలీసులు రియల్ హీరోలు. అందులో నా భర్త ఉండడం నా అదృష్టం. ఇంటికి వచ్చినప్పుడు కొంచెం భయంగా ఉన్నా... సేవ చేసి వచ్చిన ఆయనకు కుటుంబ సమేతంగా గౌరవిస్తాం. -పద్మకుమారి, విజయనగరం ఆయన సేవలు చిరస్మరణీయం కరోనా వైరస్ వ్యాపించకుండా చేపడుతున్న విధి నిర్వహణలో శృంగవరపుకోట సీఐగా నా భర్త శ్రీనివాసరావు పనిచేస్తుండటం నాకు గర్వంగా ఉంది. ఒకవైపు శాంతిభద్రతల పరిరక్షణ, మరోవైపు లాక్డౌన్ నిబంధనల అమలు, విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్లో ఉంటున్న వారిపై నిఘా వంటి పనుల్లో విరామం లేకుండా పనిచేస్తున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఆయన్ను చూస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. – సారిక మా నాన్నను చూస్తే గర్వంగా ఉంది మా నాన్న వేపాడ పీహెచ్సీలో సీహెచ్‌ఓగా పనిచేస్తున్నారు. కరోనా వైరస్ లాక్డౌన్లో అంతా ఇళ్లకే పరిమితమైనప్పటికీ వైద్యశాఖ సిబ్బంది గ్రామాల్లో సేవలందిస్తున్నారు. మా నాన్న ఈ మధ్యనే బైక్ ప్రమాదంలో గాయపడ్డారు. అయినా అత్యవసరవేళ విధులు నిర్వర్తిస్తున్న మా నాన్నను చూసి గర్వపడుతున్నాను. క్లిష్ట పరిస్దితుల్లో సేవలు అందించటం గొప్ప అదృష్టం. – ప్రసన్నకుమార్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ -
‘ప్రపంచాన్ని జయించే ఒకే ఆయుధం విద్య’
సాక్షి, విజయనగరం: అమ్మఒడి, నాడు-నేడు కార్యక్రమాల ద్వారా విద్యా వ్యవస్థలో సంచలన మార్పులు వస్తున్నాయని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. సోమవారం ‘జగనన్న వసతి దీవెన’ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టి ఆరునెలల్లో ఆంధ్రప్రదేశ్‌ను నాలుగో స్థానంలో నిలిపారని ఆయన అన్నారు. భవిష్యత్‌లో దేశ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం సాధిస్తుందని విశ్వరూప్పేర్కొన్నారు. (నిరుపేదల జీవితాలలో మార్పు రావాలి..) ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలు, ఆలోచనలు, పరిపాలనా తీరు చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. నెల్సన్ మండేలా చెప్పినట్టు ప్రపంచాన్ని జయించడానికి ఒకే ఆయుధం విద్య అని ఆమె అన్నారు. అటవంటి విద్యను సాధించేందుకు ఎదురయ్యే అడ్డంకులు తొలగించే విధంగా, విద్యపై ఆసక్తి కలిగేలా విద్య వ్యవస్థలో సీఎం వైఎస్ జగన్ మార్పులు తీసుకు వస్తున్నారని ఆమె తెలిపారు. సీఎం జగన్ పాదయాత్రలో విన్నారని.. ఈరోజు ప్రజలకు అండగా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. అనేక అవరోధాలు దాటి ప్రతి పేద విద్యార్థి ఉన్నత స్థాయికి చేరే విధంగా ప్రభుత్వం పథకాలను తీసుకొస్తుందన్నారు. (జగనన్న వసతి దీవెన: ప్రసంగంతో అదరగొట్టిన అభిమన్యు!) జిల్లాలో ఉపాధి అవకాశాల కోసం వలస వెళ్లినవారు, అక్కడ ప్రాణాపాయ స్థితుల్లో పనులు చేసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉందన్నారు. ఆ పరిస్థితులు అధిగమించేలా విశాఖ పరిపాలన రాజధాని రాబోతుందని పుష్పశ్రీవాణి అన్నారు. సీఎం జగన్ దేశంలోనే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి అని ఆమె కొనియాడారు. గిరిజన మహిళగా నేల మీద కూర్చుని విద్యను అభ్యసించి, ఉపాధ్యాయునిగా ఉన్న తనకు గొప్ప గౌరవం ఇచ్చిన సీఎం జగన్ అభిమానాన్ని మరచిపోలేనని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర నారాయణ మాట్లాడుతూ.. గతంలో చంద్రబబాబును ఇచ్చిన ప్రోత్సాహకాల కంటే ఎక్కువగా సీఎం వైఎస్ జగన్ ఇస్తున్నారని గుర్తు చేశారు. అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు తన మంది మార్భాలన్ని కాపాపడుకునేందుకు కులం రంగు పూస్తున్నారని మండిపడ్డారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని శంకర్ నారాయణ అన్నారు. -
ఇంటింటికీ రైస్‌కార్డులు
సాక్షి, విజయనగరం: రైస్‌కార్డులు పంపిణీ కార్యక్రమం జిల్లాలో ప్రారంభమైంది. నియోజకవర్గానికి ఒక సచివాలయంలో ముందుగా పంపిణీ చేస్తున్నారు. దశల వారీగా వారం పదిరోజుల్లో అన్ని సచివాలయాల్లో పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ఇప్పటికే కొన్ని కుటుంబాలను అర్హులుగా గుర్తించగా మరికొన్ని కుటుంబాలు పరిశీలనలో ఉన్నాయి. అన్ని అర్హత గల కుటుంబాలకు రైస్‌కార్డులు అందించే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. రేషన్‌కార్డే అన్ని పథకాలకు అర్హతగా గుర్తించడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ పథకాలు కూడా పక్కదారి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాలనలో ప్రక్షాళన, పారదర్శకత ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఏ పథకానికి సంబంధించి వారికి ఆ కార్డు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రేషన్‌డిపోల ద్వారా ఇంటింటికీ సరకుల పంపిణీకి రైస్‌కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. నవంబర్, డిసెంబర్ నెలలో జరిపిన సర్వేలో లబి్ధదారులను ఎంపిక చేశారు. ఈ మేరకు అర్హులుగా తేలిన వారికి ఈ నెల 15వ తేదీ నుంచి రైస్‌కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించి ఆమేరకు పనులు ప్రారంభించారు. ప్రారంభమైన కొత్త రేషన్‌కార్డులు పంపిణీ ప్రభుత్వం అనుకున్నట్లు శనివారం నుంచి రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. నవశకం సర్వేలో గుర్తించిన లబి్ధదారుల పేరున కొత్తగా కార్డులు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. సాంకేతిక కారణాల రీత్యా అన్ని సచివాలయాల్లో అన్ని కుటుంబాలకు కార్డులు ఒకేరోజు పంపిణీ చేయడం సాధ్యం కాకపోవడంతో దశలవారీగా అందజేస్తున్నారు. శనివారం నియోజకవర్గానికి ఒక సచివాలయంలో రేషన్‌డిపోలో ఈ కార్యక్రమం స్థానిక మంత్రి, ఎమ్మెల్యేలతో ప్రారంభించారు. వారు అందుబాటులో లేని చోట అధికారులు ప్రారంభించారు. కార్డులు కూడా జిల్లాకు వస్తున్నాయి. వాటిని కూడా సచివాలయాలకు పంపించి వలంటీర్ల ద్వారా అందజేసే ఏర్పాటు చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ కిశోర్‌కుమార్ అధికారికంగా ప్రకటించారు. అర్హత గల ప్రతి కుటుంబానికి కార్డులు జిల్లాలో అర్హతకలిగిన ప్రతి కుటుంబానికి రైస్‌కార్డు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకే ఈ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా మార్చి సచివాలయాల ద్వారా ఎప్పుడూ పంపిణీ చేసేలా కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది. జిల్లాలో ఇంతవరకు 7,10,554 రేషన్‌కార్డులు ఉన్నాయి. వాస్తవానికి వీరందరికీ రైస్‌కార్డులు అవసరం లేదు. కోటా బియ్యం తినే కుటుంబాలు ఇందులో చాలా వరకూ లేవు. కానీ విద్య, వైద్యం నిమిత్తం రేషన్‌కార్డులు పొందారు. ఇప్పుడు రైస్‌కార్డులు కేవలం సరుకులకు మాత్రమే ఉపయోగ పడనుండడంతో రైస్‌కార్డుల సంఖ్య తగ్గుతుంది. ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం జిల్లాలో 6,46,171 కుటుంబాలను సర్వేలో వలంటీర్లు అర్హులుగా గుర్తించారు. ప్రజాసాధికార సర్వేలో కూడా వీరు అర్హులుగా తేలారు. మరో 30,403 కుటుంబాలు అర్హులుగా వలంటీర్లు గుర్తించినా భూమి, విద్యుత్ వినియోగం, నాలుగు చక్రాల వాహనాలు, అధిక ఆదాయం కారణంగా వీరిని పక్కన పెట్టారు. ఇందులో కొందరు నిజమైన అర్హులని అధికారుల పరిశీలనలో తేలడంతో ప్రభుత్వం మళ్లీమళ్లీ విచారణ చేసి అర్హులందరికీ కార్డులు ఇవ్వాలని ఆదేశించింది. ఇలా విచారణ చేయగా 22వేల కుటుంబాలు అర్హులుగా తేలారు. వీరికి ఇవ్వాల్సిన రేషన్‌కార్డులు కూడా ముద్రిస్తున్నారు. ఈ నెల 22వ తేదీలోగా వీరందరికీ కార్డులు వచ్చేస్తాయి. అయితే మరో 33,980 వరకు కార్డులున్నా వారి నివాసాలపై స్పష్టత లేదు. కార్డులున్నా కుటుంబాలు ఎక్కడో నివాసం ఉంటున్నాయి. వీరి విషయంలో కూడా విచారణ చేసి అర్హతను గుర్తిస్తారు. ఇందులో అర్హులకు వారు ఎక్కడ కోరుకుంటే అక్కడ కార్డులు అందజేస్తారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
పద్నాలుగు నెలలు క్షణమొక యుగంలా...
చిమ్మచీకటి... గురువారం తెల్లవారుజాము 3 గంటలు... భోగాపురం మండలం తీర ప్రాంతంలో ఉన్న తిప్పలవలస గ్రామం సందడిగానే ఉంది. పాక్‌లో బందీలుగా చిక్కి విడుదలై క్షేమంగా వస్తున్న తమవారిని చూసేందుకు వారంతా రాత్రి నిద్ర లేకుండానే ఎదురు చూశారు. 14 నెలలుగా దూరమైన వారు రానే వచ్చారు. అంతే... బంధువుల కళ్లల్లో ఆనందంతో కూడిన రోదనలతో గ్రామం మార్మోగింది. ఒకరినొకరు హత్తుకుంటూ ముద్దాడుకుంటూ ఇంటి వరకు తీసుకెళ్లారు. సాక్షి, పూసపాటిరేగ: శత్రుదేశంలో చిక్కాం... పగలు ప్రతికారాలతో రగిలిపోతున్న దేశంలో బందీలుగా ఉన్నాం. దేవుడా జీవితం అంతేనా... అంటూ ఆశ చంపుకున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి గెలిచారనే విషయం జైల్లో మగ్గుతున్న ఆంధ్రా మత్స్యకారులకు సమాచారం వచ్చింది. పాదయాత్రలో మత్స్యకారులను తప్పకుండా విడుదల చేస్తామని ఇచ్చిన హామీ గుర్తుకు వచ్చి ఎలాగైనా తాము విడుదల అవుతామనే నమ్మకం పెరిగింది. జైలులో ఉన్నా జీవితంపై మళ్లీ ఆశ చిగురించింది. ఇంతలోనే జనవరి 6వ తేదీన విడుదల చేస్తామంటూ పాక్ ఉన్నత అధికారులునుంచి వర్తమానం అందడంతో మత్స్యకారులలో ఆనందానికి అవధులు లేవు. మాట ఇచ్చినట్టే విడిపించి సొంత ఊళ్లకు తరలించిన ముఖ్యమంత్రికి కన్నీటితోనే కృతజ్ఞతలు తెలుపుకున్నారు. పద్నాలుగు నెలల తరువాత విడుదల అయి స్వగ్రామం తిప్పలవలసలో బంధువులను కలుసుకున్నప్పుడు ఉద్విగ్న వాతావరణం గురువారం వేకువజామున స్వగ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ఎంపీలు విజయసాయిరెడ్డి, బెల్లాన చంద్రశేఖర్ కృషి ఫలితంగా దాయాదులకు బందీలుగా మారిన మత్స్యకారులు ఎట్టకేలకు విడుదలై గురువారం వేకువజామున స్వగ్రామమైన తిప్పలవలస చేరుకున్నారు. అంతే అప్పటివరకూ వారికోసం కళ్లుకాయలు కాసేలా నిరీక్షించిన ఆ కుటుంబ సభ్యులు ఉది్వగ్నవాతావరణంలో వారిని ఆలింగనం చేసుకున్నారు. కుమారుడు ధనరాజును ముద్దాడుతున్న పోలమ్మ కొడుకు, భర్తను చూసిన ఆనందంలో నక్క పోలమ్మ, కుమారుడిని కలుసుకున్న ఆనందంలో తల్లి నక్కానర్సయ్యమ్మ ఇళ్లల్లో పండగ వాతావరణం నెలకొంది. 14 నెలలు పాక్ జైలులో దుర్బర జీవితం గడిపామని, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి విదేశాంగ శాఖ ద్వారా విడుదలకు కృషి చేయడం వల్లనే శత్రుదేశం నుంచి బయటపడ్డామని వారంతా ఆనందబాష్పాలు రాల్చారు. క్షేమంగా ఇంటికి చేరినవారికి మిఠాయిలు తినిపిస్తున్న కుటుంబ సభ్యులు సీఎం జగన్మోహన్రెడ్డికి రుణపడి వుంటాం జీవితం ఉన్నంత వరకు సీఎం జగన్మోహన్రెడ్డికి రుణపడి వుంటాం. హుద్‌హుద్ తుఫాన్లో నష్టపోవడంతో గుజరాత్లో బోటులో కూలీలుగా పనిచేసేందుకు వలస వెళ్లాం. అనుకోని పరిస్థితిలో పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి వెళ్లి వారికి బందీలుగా చిక్కాం. పాక్ జైల్లోనే జీవితం ముగిసిపోతుందని అనుకున్నాం. విడుదలయ్యే అవకాశమే లేదని అనుకున్నాం. సీఎం చొరవతోనే మాకు మరో జన్మ కలిగినట్టయింది. – నక్కా అప్పన్న, నక్కా ధనరాజు, తిప్పలవలస మా జీవితాల్లో వెలుగులు నింపారు.. పాకిస్తాన్ జైలునుంచి విడుదల చేయించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపారు. 2018 నవంబర్ 27న పాక్ కోస్టుగార్డులకు చిక్కినప్పుడు ప్రాణం మీద ఆశపోయింది. ఆ తరువాత ఇండియాకు పాకిస్తాన్ మధ్య సరిహద్దు గొడవలతో యుద్ధ వాతావరణం నెలకొంది. బయటకు ఇక రాలేమని అనుకున్నాం. సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దయతో బయటపడ్డాం. బతికి వున్నంత కాలం ఆయన్ను మరవలేం. – నక్కా నరిసింగు, తిప్పలవలస పాకిస్తాన్ కష్టాలను బంధువులకు వివరిస్తున్న బర్రి బవిరీడు చావు నుంచి బయటపడ్డాం పాకిస్తాన్‌కు బందీలుగా చిక్కినప్పుడే ప్రాణం పోయిందనుకున్నాం. ఇప్పటివరకూ బందీలైనవారు బతికి బట్టకట్టిన దాఖలాల్లేవు. తప్పించుకుందాం అని సముద్రంలో వెళ్లిపోవడానికి ప్రయత్నించాం. పాకిస్తాన్ కోస్ట్‌గార్డులు గాలిలోకి కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. చేయి చేసుకున్నారు. కరాచీ జైల్లో వున్నప్పుడు నరకం చూశా. అక్కడ మట్టి తవ్వించడం, గడ్డి కోయించడంతో పాటు కష్టమైన పనులు చేయించేవారు. వాటి ద్వారా వచ్చిన డబ్బులతో ఆంధ్రా వంటలు చేసుకునే వాళ్లం. సీఎం జగన్మోహన్రెడ్డి భిక్షతో జైల్ నుంచి బయటపడ్డాం. – బర్రి బవిరీడు, తిప్పలవలస చదవండి: సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం: మత్స్యకారులు -
‘విజయనగరంలో కర్ఫ్యూ రావడానికి ఎవరు బాధ్యులు’
సాక్షి, విజయనగరం: వైఎస్సార్పీసీ ప్రభుత్వ లక్ష్యం.. అభివృద్ధి, సంక్షేమమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జిల్లాలో నిర్వహించిన ద్విశత శంకుస్థాపనల మహోత్సవంలో మంత్రి బోత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత అక్టోబర్‌లో వంద పనులకు రూ. 11 కోట్లతో శంఖుస్థాపనలు చేశామని ఆయన తెలిపారు. ఇప్పుడు రూ. 22 కోట్లతో రెండు వందల పనులకు శంఖుస్థాపనలు చేయడం ఆనందించదగ్గ విషయమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. త్వరలో రూ. 25 కోట్లతో అభివృద్ధి పనులు జరగుతాయని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న వనరులకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేస్తామని ఆయన అన్నారు. గతప్రభుత్వంలో పదవులు, నిధులు ఉన్నా అభివృద్ధి ఆలోచన వారికి లేదని బొత్స మండిపడ్డారు. గత పాలకులకు దోచుకోడమే తప్ప మరో లక్ష్యం లేదని ఆయన ధ్వజమెత్తారు. అందుకే ప్రజలు వారిని ఇంటికి పంపించారని ఆయన ఎద్దేవా చేశారు. ఉగాదికి పట్టణంలో ఇళ్ళు లేని వారికి ఇల్లు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. నిపుణుల కమిటీ సలహాలతో ముందుకు వెళ్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. కానీ చంద్రబాబు, అశోక్ గజపతి రాజు లాంటివారు ఓర్వలేకపోతున్నారని బొత్స మండిపడ్డారు. చంద్రబాబు, అశోక్ గజపతిరాజు వంటివారు అభివృద్ధి చేయలేక పోగా విమర్శలకు దిగడం సరికాదన్నారు. రాజధాని ఎక్కడ ఉన్నా మాకు ఇబ్బంది లేదు కానీ రాష్ట్ర పరిస్థితి అర్థం చేసుకోవాలన్నారు. లక్ష తొమ్మిది వేల కోట్లతో రాజధాని అభివృద్ధి సాధ్యం కాదన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని.. వాటిని అభివృద్ధి చేయలన్నది ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇప్పటికైనా టీడీపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని, ప్రజలు ఎందుకు టీడీపీని పక్కన పెట్టారో ఆలోచించాలన్నారు. ప్రభుత్వ లక్ష్యం సమసమాన అభివృద్ధి అని.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నది తమ బాధ్యతని ఆయన తెలిపారు. టీడీపీ నేతలు అభివృద్ధికి వ్యతిరేకమని ఆయన మండిపడ్డారు. 2014కి ముందు విజయనగరంలో కర్ఫ్యూ రావడానికి ఎవరు బాధ్యులు అని ఆయన ప్రశ్నించారు. రోశయ్య సీఎంగా అఖిలపక్షం సమావేశంలో టీడీపీ విభజనకి మద్దతు తెలిపిందా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. -
‘ఏసీబీకి చిక్కిన ఐసీడీఎస్ ఉద్యోగులు’
సాక్షి, విజయనగరం: అవినీతికి పాల్పపడిన ఐసీడీఎస్ ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డ ఘటన విజయనగరం జిల్లాలో చేటుచేసుకుంది. జిల్లాలోని కొత్తవలస ఐసీడీఎస్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో శిశు సంక్షేమశాఖ సీడీపీఓ మణమ్మ, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ ఎసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వివరాలు.. అంగన్వాడి సెంటర్లకు కిరాణా సరుకులు సరఫరా చేసే అడ్డూరి సురేష్ వద్ద నుంచి ఈ ఇద్దరు ఉద్యోగులు రూ.85 వేలు లంచం తీసుకుంటున్నారు. అదే సమయంలో దాడి చేసిన అధికారులు వారిని పట్టుకున్నారు. నవంబర్ నెల సరుకులు సరఫరాకి బిల్స్ చేసేందుకు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ మణమ్మ రూ.85 వేలు అడ్డూరి సురేష్ వద్ద లంచం అడిగినట్లు తెలుస్తోంది. -
అతివలకు సీఎం వైఎస్ జగన్ అభయం
సాక్షి, విజయనగరం: పసికందు నుంచి పండు ముసలమ్మ వరకు.. ఎక్కడో అక్కడ.. నిత్యం అఘాయిత్యాలకు బలవుతున్నారు. హత్యాచారాలతో ఎందరో స్త్రీమూర్తులు నేల రాలిపోతున్నారు. లైంగిక దాడులతో కీచక మూకలు చెలరేగిపోతున్నారు. చట్టాల్లో లొసుగుల్ని ఉపయోగించుకుంటున్నారు.. సత్వర న్యాయం జరగక.. బాధితులు నీరుగారిపోతుంటే.. నేరస్తులు మరింత పేట్రేగిపోతున్నారు. తెలంగాణాలో దిశ విషాదం యావద్దేశాన్ని కదిలించింది. నిందితులకు సత్వర శిక్ష పడాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. మృగాల గుండెల్లో వణుకు పుట్టించేందుకు కఠిన చట్టానికి రూపకల్పన చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఈ బిల్లుపై చర్చ జరిపి, ప్రతిపక్షం సలహాలు, సూచనలను ఆహ్వానించింది. శాసనసభలో బుధవారం బిల్లును ప్రవేశపెట్టనుంది. మహిళపై నేరాలకు పాల్పడే వారికి విధించే శిక్షల గురించి భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 354లో ఇప్పటికే ఎ,బి,సి,డి ఉండగా కొత్తగా ‘ఇ’ని చేర్చనున్నారు. దీని ప్రకారం మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడిన వారిని 21 రోజుల్లో చట్ట ప్రకారం ఉరి తీసేందుకు అవకాశం కలుగుతుంది. కేసు విచారణకు ప్రతిజిల్లాలోనూ ప్రత్యేక కోర్టులు ఏర్పాటవుతాయి. అతివల రక్షణకు అద్భుతమైన చట్టానికి రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అక్షరాలా ఇది చారిత్రాత్మక చట్టమని జిల్లాలోని వైఎస్సార్ సీపీ శాసనసభ్యుల అభిప్రాయపడ్డారు. మహిళల తరపున ధన్యవాదాలు మహిళలపై అరాచకత్వానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా బిల్లును ప్రవేశపెడుతున్నారు. ఆడపిల్లల తండ్రిగా, రాష్ట్ర మహిళలకు జీవితాంతం గుర్తుండిపోయే చట్టాన్ని రూపొందిస్తున్నారు. ఆడపిల్లలపై జరిగే ఘోరాలను దృష్టిలో పెట్టుకొని దోషులు తప్పించుకునే వెసులుబాటు లేకుండా ఉండేలా తయారు చేస్తున్నారు. అది కూడా సరైన సాక్ష్యాలతో 3వారాలలో కఠిన శిక్ష పడేలా ఉంటుంది. మంత్రిగా ముఖ్యమంత్రికి మహిళల తరపున ధన్యవాదాలు. – పాముల పుష్పశ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సాహసోపేతమైన నిర్ణయం మహిళల మాన, ప్రాణాల రక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాహసోపేతమైన చట్టం రూపొందిస్తుండటాన్ని స్వాగతిస్తున్నాం. మహిళలపై దాడులకు పాల్పడే వారిపై నేరం రుజువైన 21 రోజుల్లో శిక్ష పడేలా చట్టాన్ని తీసుకురావడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తుంటే.. ప్రతి పక్షాలు ఉల్లిపాయల లొల్లి చేయడం వారికి మహిళలపై ఉన్న గౌరవం ఏమిటో తెలుస్తోంది. తెలుగుదేశం తీరు చూసి రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రతి ఆలోచన ప్రజా హితం కోసమే. – అలజంగి జోగారావు, ఎమ్మెల్యే, పార్వతీపురం చారిత్రాత్మకం దారుణ నేరాలు చేసే వారికి సరైన శిక్షలు పడని వ్యవస్థలో..ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడే మృగాలకు కఠినమైన శిక్షలు పడేలా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. చిన్నారులు, మహిళలు బలవుతున్నా ప్రభుత్వాలు నామమాత్రంగానే స్పందిస్తున్న తరుణంలో చట్టాలున్నా, అమల్లో జాప్యం వల్ల బాధితులకు న్యాయం జరగటం లేదు. నిర్భయ కేసులో దోషులు నేటికీ బతికే ఉన్నారు. దిశ కేసుతో దేశ ప్రజలంతా విరక్తి చెందారు. ముఖ్యమంత్రి తనను నమ్మిన ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం అభినందనీయం, స్పష్టమైన ఆధారాలుంటే.. ఆరు వారాల్లో కఠిన శిక్ష అమలు చేసే చట్టానికి ఓటేస్తున్నందుకు గర్వపడుతున్నాను. – కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే, శృంగవరపుకోట వీరశివాజీలా నిలబడ్డారు భారతదేశంలో మహిళలకు అండగా నాడు వీర శివాజీ నిలబడ్డారు. ఇప్పుడా స్థానంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిచారు. భవిష్యత్‌లో ఏ మహిళకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో పగడ్బందీగా బిల్లు రూపొందిస్తున్నారు. బిల్లు రూపకల్పనలో భాగంగా ఇప్పటికే న్యాయ నిపుణులతో సైతం ముఖ్యమంత్రి సమాలోచనలు చేశారు. మహిళాబిల్లు రాకూడదనే ఉద్దేశంతో టీడీపీ నేతలు శాసన సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్ర మహిళలకు అండగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలుస్తున్నాయి. – పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే, సాలూరు సీఎం నిర్ణయం అద్భుతం మహిళల రక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అద్భుతం. అత్యాచారాలు, హత్యలకు పాల్పడేవారికి ఉరిశిక్ష వేయడమనే ప్రతిపాదన ఎంతో సముచితం. మద్యం తాగేవారే ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారన్నది జగమెరిగిన సత్యం. అందుకే ఆదాయం ఎక్కువ వస్తున్నా దీనిని పక్కన పెట్టేందుకు నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. ముఖ్యమంత్రి గారి ఆలోచనకు మేం కట్టుబడి ఉన్నాం. ఆయన ఆలోచనను స్వాగతిస్తున్నాం. – శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, ఎమ్మెల్యే, బొబ్బిలి రాద్ధాంతం చేస్తున్న టీడీపీ శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లు విషయంలో ప్రతిపక్ష టీడీపీ అర్థం లేని రాద్ధాంతం చేస్తోంది. బిల్లుపై చర్చలో ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యేలు లేనిపోని అపోహలతో కాలయాపన చేస్తున్నారు. శాసనసభలో రభస సృష్టిస్తున్నారు. ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నారు. బిల్లు చట్టంగా రూపొందితే రాష్ట్రంలోని మహిళలకు సంపూర్ణ భద్రత లభిస్తుంది. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే వారికి ఈ చట్టం సింహస్వప్నంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చట్టం అమలుతో లైంగిక దాడులకు పాల్పడేందుకు వెనకంజ వేస్తారని నిస్సందేహంగా చెప్పవచ్చు. – బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్యే, నెల్లిమర్ల మహిళలకు భరోసా గతంలో మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా భయం కలిగేది. ఇప్పుడు సరికొత్త చట్టం తెచ్చేందుకు సీఎం భరోసా ఇవ్వడంతో వారికి అండ దొరికింది. మహిళలకు తానున్నానంటూ ముఖ్యమంత్రి జగన్ భరోసా ఇచ్చారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని గొప్ప చట్టం రూపకల్పనకు హామీ ఇచ్చారు. ఆయన నిర్ణయంతో యావత్ మహిళాలోకం ఆనందంలో ఉంది. – బొత్స అప్పలనర్సయ్య, ఎమ్మెల్యే, గజపతిగరం -
‘పవిత్ర దేవాలయమన్నారు.. దోచుకున్నారు’
సాక్షి, విజయనగరం: రాజధానిని పవిత్ర దేవాలయంగా ప్రచారం చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లు ఏం చేశారని పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాజధానిని నిర్మించుకోవాలనే ధ్యాస టీడీపీ నేతలకు లేదంటూ మండిపడ్డారు. మంగళవారం జిల్లాలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్లలో అధికారాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని తీరని లోటులోకి నెట్టేశారని విమర్శించారు. 20 ఏళ్లు అయినా ఈ లోటు తీర్చలేమని అన్నారు. 4శాతం నిధులు మాత్రమే రాజధాని నిర్మాణానికి ఖర్చు చేశారని, తన స్వలాభం కోసం మాత్రమే చంద్రబాబు పాటుపడ్డారు తప్ప రాష్ట్రం కోసం ఏం చేయలేదని ఆయన మండిపడ్డారు. విద్యుత్ చార్జీలు తగ్గించమని ధర్నా చేస్తే రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుదని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో రాష్ట్రాన్ని అడ్రస్ లేకుండా చేశారని మంత్రి అన్నారు. చంద్రబాబు, లోకేష్, యనమల రామకృష్ణుడు మీడియా ముందుకు రాకుండా కొత్తరకంగా ట్విటర్లో ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తానేమి యనమలలా దోచుకోలేదని.. తనను ఎందుకు బర్తరఫ్ చేయాలని ప్రశ్నించారు. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకంమంతా పచ్చగా కనిపిస్తుందని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబు ఐదేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో వాటిని ఆధారాలతో సహ చూపిస్తామని అన్నారు. అలాగే తమపై కొన్ని పత్రికలు ఇస్టానుసారంగా కథనాలు రాస్తున్నాయని, ప్రజలు ఆ రాతలను నమ్మరని అన్నారు. అలాగే చంద్రబాబు రాజధాని పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని, కోట్లు అప్పు చేసి రాజధానిలో ఏ సంపద సృష్టించారని నిలదీశారు. గత ప్రభుత్వంలా నిధులను దుబారా చేయద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు సూచించారని తెలిపారు. తమ ప్రభుత్వం తాలుకా ఆలోచనలు ఇచ్చిన మాటని నిలబెట్టుకొని, హామీలన్నింటిని పూర్తి చేయడమే అని పేర్కొన్నారు. సింగపూర్ కన్సార్టియం వల్లన సంపద సృష్టించే అవకాశం లేకపోవడంతో కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయని, కొన్ని కంపెనీలతో చేసిన ఒప్పందాలు పూర్తిగా అస్పష్టమని మంత్రి వెల్లడించారు. నామినేటెడ్ పదవుల్లో 50శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా నేడు(నవంబర్ 26) జిల్లాలో మార్కెటింగ్ కమిటీలో అమలు చేశామని మంత్రి వెల్లడించారు. -
ఎస్.కోట ఎమ్మెల్యేకు అరుదైన అవకాశం
సాక్షి, విజయనగం(శృంగవరపుకోట) : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ చట్ట సభ్యులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కార్యాలయం నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. శాసనసభ సబార్డినేట్ చట్ట సభ్యులుగా మొత్తం 11 మంది శాసనసభ్యులతో ఈ కమిటీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఏకైక శాసనసభ సభ్యునిగా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు కమిటీలో చోటు దక్కడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవికి ఎంపిక చేసిన సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాంలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరింత చురుకుగా పనిచేసి ఎంపిక చేసిన పదవికి న్యాయం చేస్తానని, శృంగవరపుకోట నియోజకవర్గ అభివృద్ధికి అలుపెరుగని కృషి చేస్తానని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. -
చిన్న వయసులో చితికిపోతున్నయువత
పిల్లలు ఉదయాన్నే చక్కగా తయారై... భుజాన బ్యాగ్ వేసుకుని... మక్కువతో కొనిచ్చిన స్కూటీపై రయ్...రయ్... మంటూ కాలేజ్‌కు దూసుకుపోతున్న పిల్లల్ని చూస్తే ఏ తల్లిదండ్రికైనా సంబరమే. కానీ వారి ప్రవర్తనలో వస్తున్న మార్పులు గమనించకపోతే... ఆ ఆనందం ఎంతో కాలం నిలవదు. వారు నిజంగా కళాశాలకే వెళ్తున్నారా... అక్కడ వీరు ఎలాంటి పిల్లలతో స్నేహం చేస్తున్నారు... ఎన్నిగంటలకు ఇంటికి చేరుతున్నారు... ఎక్కడెక్కడకు తిరుగుతున్నారు... చదువులో ఏమేరకు రాణిస్తున్నారు... ఇలాంటివి తెలుసుకోలేకపోతే ఇక గర్భశోకం తప్పదు. యుక్తవయసులో పిల్లలు సాధారణంగా చెడు సహవాసాలతో తప్పటడుగులు వేసే ప్రమాదం ఉంది. వాటిజోలికి పోకుండా చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. సాక్షి, విజయనగరం ఫోర్ట్: అభం శుభం తెలియని వయసులో ఒకరి చేతిలో మోసపోయి తల్లులవుతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. చక్కగా చదువుకో వాల్సిన వయస్సులో ప్రేమ మోజులో పడి మోసపోతున్నారు. కొంతమంది ఆకర్షణకు లోనవుతుండగా...మరికొందరు చెడు సహ వాసాలతో మోసపోతున్నారు. యుక్తవయసు లో సాధారణంగా తలెత్తే సమస్యలు... ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... ప్రేమ, ఆకర్షణ వంటివాటివల్ల కలిగే స మస్యలేమిటో తెలియజేస్తున్నారు. అయినా అ మ్మాయిలు నిత్యం మోసపోతూనే ఉన్నారు. 15, 16 ఏళ్ల అమ్మాయిలే అధికం పదోతరగతి... ఇంటర్మీడియేట్... చదువుతున్నవారు అంటే 15, 16 సంవత్సరాల వయ సు కలిగినవారే ఎక్కువగా ప్రేమ, ఆకర్షణకు గురవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఫేస్బుక్, వాట్సప్, యూట్యూబ్ వంటి వాటి ప్రభావం వల్ల ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. స్మార్ట్ ప్రభావం కూడ అమ్మాయిలు, అబ్బాయిలపై ప్రభావం చూపుతుంది. పాఠశాలలకు, కళాశాలలకు స్మార్ట్ ఫోన్లు పట్టుకుని వెళ్తున్నారు. గంటల తరబడి చాటింగ్‌లు చేసుకుంటున్నారు. పెళ్లికాకుండానే తల్లులై... 16, 17 ఏళ్లకే ప్రేమ, ఆకర్షణ పేరుతో చిన్న వయస్సులో శారీరకంగా కలిసిపోతున్నారు. దీనివల్ల పెళ్లికాకుండానే గర్భం దాల్చుతున్నారు. పిల్లలకు జన్మనిస్తున్నారు. కొందరు ముందు జాగ్రత్తగా పిల్లల్ని కనవలసి వస్తోందని భ్రూణహత్యలకు పాల్పడుతుండగా... ఇంకొందరు పుట్టిన బిడ్డను చెత్తకుప్పల్లో పడేస్తున్నారు. తల్లిదండ్రులను ధిక్కరించి... కొందరు అమ్మాయిలు ఆకర్షణకులోనై తల్లిదండ్రులను ధిక్కరిస్తున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. ప్రేమించిన వాడితో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయి సహజీవనం చేస్తున్నారు. ఇలాంటి కేసులు ఇటీవల ఎక్కువ సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. చదువుకున్న అమ్మాయిలే ఎక్కువగా చేయడం గమనార్హం. వంచన... ఇంటినుంచి వెళ్లిపోవడం వంటివి గడచిన 11 నెలల్లో వందవరకూ నమోదయినట్టు పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. వీరంతా మైనర్లే కావడం విశేషం. వారి ప్రవర్తనపై అనుమానం వచ్చి తల్లిదండ్రులు నిఘా పెంచితే క్షణికావేశంలో ప్రాణాలు తీసేసుకుంటున్నారు. దీనికి భయపడి తల్లిదండ్రులు మిన్నకుండి పోతున్నారు. ⇔ గజపతినగరం మండలానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటర్మీడియట్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ ఆమెను ప్రేమ పేరుతో లోబరచుకున్నాడు. ఫలితంగా బాలిక గర్భవతి అయింది. మూడు రోజుల క్రితం మగ బిడ్డకు జన్మనిచ్చింది. ⇔ విజయనగరం పట్టణంలోని ఓ బాలిక 9వ తరగతి వరకు చదివి మానేసింది. అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలుడు ఆమెను గర్భవతిని చేశాడు. వీరికి రెండు రోజుల క్రితం పాప పుట్టి చనిపోయింది. పిల్లల ప్రవర్తనను గమనిస్తుండాలి పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వారు ఇంట్లో, బయట ఏవిధంగా ప్రవర్తిస్తున్నారో తెలుసుకుం టూండాలి. మంచివారితో స్నేహం చేసేలా చూడాలి. స్మార్ట్ ఫోన్లకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచడం మంచింది, చెడు అలవాట్లకు బానిస కాకుండా చూడాలి. – పి.సాయి విజయలక్ష్మి, ఆడ్మినిస్ట్రేటర్, వన్‌స్టాప్ సెంటర్(సఖి) అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఆకర్షణ, ప్రేమ వంటి వాటిపై కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది 181 అవగాహన సదస్సులు నిర్వహించాం. సోషల్ మీడియా ప్రభావం వల్ల ఎక్కువ మంది ప్రేమ, ఆకర్షణకు లోనవుతున్నారు. మంచి, చెడుల గురించి తల్లిదండ్రులు వారి పిల్లలకు తెలియజేయాలి. – కె.రమాదేవి, కౌన్సిలర్, వన్‌స్టాప్ సెంటర్ -
ఇలాంటి పెళ్లిళ్లే.. ఎంతో మేలు!
సాక్షి ప్రతినిధి విజయనగరం: కొబ్బరాకుల పందిరి..అరటి చెట్లతో అలంకారం.. వరి కంకులతో తీర్చిదిద్దిన కల్యాణ వేదిక, అక్కడక్కడా బంతి పూలు చుట్టుకున్న తాటాకు గొడుగులు.. ఎటుచూసినా పచ్చదనంతో అతిథులు అచ్చెరువొందేలా రూపొందించిన మంటప ప్రాంగణం.. విజయనగరంలో ఓ కుటుంబం పర్యావరణ హితంగా రూపొందించిన ఈ వివాహ వేదిక చూపరులను ఆకట్టుకుంది. కుమార్తె వివాహంలో ప్లాస్టిక్ వినియోగించకూడదని నిర్ణయించుకున్న తూనుగుంట్ల గుప్త,విజయ దంపతులు అందుబాటులో ఉన్న చెట్ల కొమ్మలు, ఆకులు, పువ్వులే అలంకారాలుగా తెలుగుదనం ఉట్టిపడేలా, సంప్రదాయబద్ధంగా పెళ్లి తంతు నిర్వహించారు. విందులోనూ మంచి నీళ్ల దగ్గర్నుంచి, కిళ్లీ వరకూ ఆరోగ్యానికి మేలు చేకూర్చే పదార్థాలనే వాడారు. విజయనగరంలోని మన్నార్ వేణుగోపాలస్వామి ఆలయంలో బుధవారం రాత్రి జరిగిన ఈ వివాహ వేడుకలో ఎక్కడా ప్లాస్టిక్ వాసనే లేదు. అతిథులకు మట్టి గ్లాసులో ఉసిరి, జీలకర్రతో చేసిన షర్బత్‌తో పాటు ఉడికించిన వేరుశనగ గుళ్లు, రాగి (చోడి) సున్నుండలు స్వాగతం పలికాయి. వధూవరుల పేర్లు సూచించే పట్టికను కూడా కొబ్బరి ఆకులతో అల్లిన తడిక మీద చేనేత వస్త్రంపై సహజ రంగులతో రాశారు. కేవలం అరటి, కొబ్బరి ఆకులతోనే మంటపాన్ని అలంకరించి, వరి కంకులను గుత్తులుగా వేలాడదీశారు. పెళ్లి పనులను సూచిస్తున్న లక్క బొమ్మలు.. వధూవరులు ఇది పెళ్లికుమార్తె కోరిక ప్రతిమనిషీ పర్యావరణ హితంగా ఉండాలనేది మా అమ్మాయి మౌనిక అభిప్రాయం. తన వివాహాన్ని ప్లాస్టిక్ రహితంగా జరిపించాలని కోరింది. మంచినీళ్లు కూడా వట్టివేరు, చిల్లగింజలు, దాల్చిన చెక్క, తుంగముస్టా, జీలకర్ర వేసి మరగబెట్టి చల్లార్చి వడకట్టి వినియోగించాం. నిజానికి మూడేళ్లుగా ప్లాస్టిక్ నిషేధించుకున్నాం. మా ఇంటికి వచ్చేవారు కూడా ప్లాస్టిక్ తీసుకురావద్దని, ఎవరైనా తీసుకువస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఇంటి బయట బోర్డు కూడా పెట్టాం. – తూనుగుంట్ల విజయ, వధువు తల్లి, విజయనగరం పూలు, తాటాకు గొడుగులతో అలంకరణ -
రామజోగయ్యశాస్త్రికి గురజాడ పురస్కారం
సాక్షి, విజయనగరం: సినీ గేయ రచయిత, సాహితీవేత్త రామజోగయ్యశాస్త్రి గురజాడ విశిష్ట పురస్కారానికి ఎంపికయ్యారు. విజయనగరం గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో గురజాడ 104వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల 30న సమాఖ్య సభ్యులు పురస్కారం అందజేయనున్నారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు పీవీ నరసింహరాజు, కాపుగంటి ప్రకాష్‌లు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. పురస్కార ప్రదానోత్సవంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, నటుడు, రచయిత తనికెళ్ల భరణి ప్రధాన వక్తగా పాల్గొంటారని చెప్పారు. సాయిఫౌండేషన్ అధ్యక్షుడు, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పురస్కార ప్రదాతగా వ్యవహరిస్తారన్నారు. -
ఆ టీచరే ఉండాలి... లేకుంటే బడిమానేస్తాం...
సాక్షి, విజయనగరం అర్బన్: ఉద్యోగమంటే అదో మొక్కుబడి బాధ్యతగా భావించేవారినే చూశాం. వెళ్లామా... కాలక్షేపం చేశామా... క్యారియర్ ఖాళీ చేశామా... వచ్చేశామా... అనుకునేవారే ఎక్కువ. కానీ ఆ ఉపాధ్యాయిని అలా చేయలేదు. తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పిల్లల్లో క్రమశిక్షణ అలవాటు చేశారు. అంతేనా... తన బోధనలతో పిల్లలను ఆకట్టుకున్నారు. 45మంది పిల్లలున్న ఆ బడిలో 95మంది పిల్లలను చేర్పించారు. అలాంటి ఉపాధ్యాయురాలు బదిలీ అయిపోతే ఎలాంటివారికైనా కాస్త ఆందోళన తప్పదు. ఇక బడిపిల్లలు, వారి తల్లిదండ్రుల సంగతైతే వేరే చెప్పనవసరం లేదు. అదే జరిగింది గంట్యాడ మండలం కొర్లాంలో. అక్కడి మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయిని వర్రి జ్యోతిలక్ష్మికి బదిలీ అయిందని తెలియగానే... ఊరు ఊరంతా కట్టకట్టుకుని జిల్లా కేంద్రానికి వచ్చారు. డీఈఓను కలసి తమకు ఆ టీచరే కావాలని పట్టుబట్టారు. లేదంటే బడిమానేస్తామని చెప్పారు. ఉపాధ్యాయిని ఇంటికెళ్లి తమ ఊరు వదిలి వెళ్లవద్దని వేడుకున్నారు. ఈ సంఘటన శనివారమే చోటు చేసుకుంది. ఈ సందర్భంగా జ్యోతిలక్ష్మి మాట్లాడుతూ నిజానికి పిల్లల్ని విడిచి వెళ్లడానికి తనకూ బాధగానే ఉందనీ, వృత్తి పరమైన అభ్యున్నతిని తిరస్కరించినట్లవుతుందని అన్నారు. ఇంతకీ ఆ టీచర్ ప్రత్యేకత ఏంటటే...? గంట్యాడ మండలం కొర్లాం ఎంపీపీ పాఠశాలలో 2017 ఆగస్టులో ఉపాధ్యాయినిగా బదిలీపై జ్యోతి లక్ష్మి వచ్చారు. అక్కడి విద్యార్థుల మనసులను హత్తుకునేలా బోధించారు. అప్పటికి కేవలం 45 మంది విద్యార్థులు మాత్రమే ఆ స్కూళ్లో ఉన్నారు. తరువాతి సంవత్సరం ఆనంద లహరి (అల) పథకం వర్తించడంతో భిన్న బోధనా నైపుణ్యాలు ఆ స్కూల్‌కు లభించాయి. వాటిని శతశాతం వినియోగిస్తూ గ్రామంలో ప్రైవేటు స్కూళ్లకు వెళ్లే విద్యార్థినులను ఆకట్టుకునేలా ఆమె బోధనలను అందించారు. తద్వారా విద్యార్ధుల నమోదు 95 మందికి పెంచారు. అంతే గాకుండా పాఠశాల ప్రాంగణాన్ని వినూత్నంగా తీర్చిదిద్దారు. అదే ఆమెపై అక్కడివారు పెంచుకున్న అభిమానానికి కారణమైంది. -
‘గిరిజనులతో మైత్రిని కొనసాగిస్తాను’
సాక్షి, విజయనగరం: గిరిజనుల జీవన విధానాన్ని తను వ్యక్తిగతంగా చూశానని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. వారితో మైత్రిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని పాచిపెంట మండలం అమ్మవలస ఆదివాసి గ్రామాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్సార్ రైతు భరోసా కింద లబ్ధి పొందిన గిరిజన రైతులతో మాట్లాడారు. వాళ్ల బ్యాంకు ఖాతాలకు ఎంత సొమ్ము జమ అవుతుందో ఆరా తీశారు. ఈ క్రమంలో అమ్మవలస ఆదివాసి గిరిజన రైతులు సాగుచేస్తున్న ఉద్యానవన పంటలను సందర్శించి గిరిజన రైతులతో ముచ్చటించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్న వరి , మొక్కజొన్న, అరటి, పత్తి, మామిడి, జీడిమామిడి తదితర పంటల సాగు వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అమ్మవలస ఆదివాసి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి, ఎమ్మెల్యే రాజన్న దొర కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ.. గిరిజనుల జీవన విధానాన్ని వ్యక్తిగతంగా చూసి, వారి సమస్యలు తెలుసుకున్నానని తెలిపారు. సమస్యల పరిష్కార చర్యలపై ప్రభుత్వానికి సూచిస్తానని పేర్కొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు వేల సంవత్సరాలు నుంచి వచ్చాయని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని కాపాడటం సవాలుతో కూడుకున్న పని అని అన్నారు. ప్రస్తుతం విద్య, ఆరోగ్యం రెండు ప్రధాన అంశాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని నిర్వహించే క్రమంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. గిరిజనులు విద్యకు ప్రాధ్యాన్యత ఇచ్చి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యానికి సంబంధించి ఏఎన్ఎం వ్యవస్థ, పీహెచ్‌సీలు ఏర్పాటు చేసినా భౌగోళికపరంగా సమస్యలు ఉన్నాయన్నారు. గిరిజన ప్రాంతాలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావడం.. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. గిరిజన యువత ఉపాధి కోసం కొత్త రంగాలను ఎంచుకొని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. పోటీ పరిక్షలకు సిద్ధం అవుతూ.. తమను తాము మార్చుకుని ప్రభుత్వం సహకారం పొందాలని వివరించారు. షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజన సమస్యలు తెలుసుకోవడంతో పాటు.. పరిష్కారం కోసం ఆ వివరాలను ప్రభుత్వానికి సూచించడం తన బాధ్యత అన్నారు. గిరిజనులతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని.. ఈ మైత్రి బంధాన్ని భవిష్యత్‌లో కూడా కొనసాగిస్తాని అన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు తన దృష్టికి వచ్చాయని.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. గిరిజనులకు ప్రభుత్వాభివృద్ధి ఫలాలు అందుతున్న తీరును పరిశీలించేందుకు గవర్నర్ రావడం శుభసూచకం అన్నారు. ప్రభుత్వం గిరిజనాభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. ఇంకా చాలా ప్రాంతాల్లో విద్య, వైద్యం అందాల్సి ఉందని గుర్తుచేశారు. పాడేరులో మెడికల్ కళాశాల, సాలూరులో గిరిజన విశ్వ విద్యాలయం రాబోతున్నాయని వెల్లడించారు. గిరిజన అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం అని శ్రీవాణి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కోటియా గ్రామాల సమస్యను ఎమ్మెల్యే రాజన్నదొర గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చారు. అనంతరం రాజన్న దొర మాట్లాడుతూ.. కోటియా గ్రామాల గిరిజనులు సరిహద్దు సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపారు. అభివృద్ధిలో ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పోటీతత్వం ఏర్పడుతోందని పేర్కొన్నారు. ప్రజలు రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోతున్నారని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించాలని గవర్నర్‌కి విన్నవించినట్టు తెలిపారు. -
సీఎం జగన్ నిర్ణయం ఆ యువకుడి జీవితాన్నే మార్చేసింది
సాక్షి, విజయనగరం: ఒక మంచి పని ఎందరో జీవితాలను నిలబెడుతుందనడానికి సజీవ సాక్ష్యం ఈ సంఘటన .. ముఖ్యమంత్రి అయిన వెంటనే వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల్లో గ్రామ,వార్డు వలంటీర్ల నియామకం ఒకటి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉన్న చోటనే ఉద్యోగం ఇచ్చారు. ప్రజలకు ప్రభుత్వ పధకాలను చేరువ చేయడంలో వీరు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇన్నాళ్లూ ఉద్యోగం సజ్జోగం లేదంటూ చులకనగా చూసిన ఈ సమాజం వారిని ఇప్పుడు గౌరవంగా చూస్తోంది.. ఇదంతా ఒకెత్తయితే చూపులేక, చేసేందుకు పని దొరక్క అవస్థలు పడుతున్న వారికి సైతం వలంటీర్ పోస్టులు లభించడంతో వారి జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. వారు ఇప్పుడు నిజమైన దీపావళి జరుపుకుంటున్నారు. వారిలో ఒకరు బొబ్బిలి మండలం గొల్లపల్లికి చెందిన గొల్లపల్లి శ్రీను. అతనికి కంటి చూపులేదని చిన్న చూపు చూడకుండా ప్రభుత్వం ఇచ్చిన ఉపాధి ఆ యువకుడి జీవితాన్నే మార్చేసింది. పట్టుదలతో ఎంతటి కష్టమైన పనినైనా చేస్తున్నప్పటికీ ఇన్నాళ్లూ లభించని గుర్తింపు అతనికి సీఎం జగన్ వల్ల ఇప్పుడు దొరికింది. ఇదో గొప్ప అనుభవం నేను బ్లైండ్‌ని.. ఈ రోజు నా లైఫ్‌లో వెరీ హ్యాపీ డే. ముందుగా వలంటీర్‌గా ఉద్యోగం కల్పించిన వైఎస్ జగన్ గారికి నా హదయ పూర్వక ధన్యవాదాలు. ఈ రోజు రైతు భరోసా అమౌంట్ పడిందని ఒక రైతు ఇంటికి వచ్చి స్వీట్ బాక్సు కూడా అభిమానంతో ఇచ్చాడు. తన సొంత అమౌంట్‌తో కొని మంచిగా ఉంటే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని ఈ రోజు తెలిసింది. ఇందుకు సహకరించిన అగ్రికల్చరల్ ఆఫీసర్, పీఈఓ మేడం, తోటి వలంటీర్స్‌కి స్పెషల్ ధ్యాంక్స్. – గొల్లపల్లి శ్రీను -
మిడ్డే మీల్స్ వివాదం.. పీఎస్‌లో పంచాయితీ..!
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సక్రమంగా వండి విద్యార్థులకు అందించాల్సిన వంట నిర్వాహకులు కొద్ది రోజులుగా అరకొరగా వంటలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులు పాల్జేస్తున్నారు. దీన్ని కొద్ది రోజులుగా గమనిస్తూ వస్తున్న తల్లిదండ్రుల కమిటీ సభ్యులు మంగళవారం నిర్వాహకులను నిలదీశారు. మాటమాట పెరిగి ఈ వివాదం కాస్త పోలీస్‌స్టేషన్‌కు చేరింది. సాక్షి, విజయనగరం అర్బన్: విజయనగరం మోడల్ స్కూల్ భోజన నిర్వాహకులపై పేరెంట్స్ కమిటీ సభ్యుల ఫిర్యాదు నేపథ్యంలో మంగళవారం వారి మధ్య వివాదం పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే... పట్టణ శివారుల్లోని ఏపీ మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజన నిర్వాహణ సక్రమంగా లేదని ఆ పాఠశాల తల్లిదండ్రుల కమిటీ కొద్దిరోజుల క్రితం గుర్తించింది. విద్యార్థుల సంఖ్యకు సరిపడా భోజనం వండటం లేదని ఈ విషయంపై గత కొద్ది రోజులుగా భోజన నిర్వాహకులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యుల మధ్య వాదనలు జరుగుతున్నాయి. మంగళవారం కూడా ఆ సందర్భంగానే వారి మధ్య మాటల వివాదం చోటుచేసుకంది. మధ్యాహ్నం భోజన వంటకాలు సరిపడక పోవడాన్ని కమిటీ సభ్యులు ప్రత్యక్షంగా చూశారు. కమిటీ ఆదేశాల మేరకు అప్పటికప్పుడు 2 గంటల సమయంలో భోజనం అందని విద్యార్థులకు తిరిగి వంట చేయించారు. ప్రతి రోజూ కనీసం పది కేజీల బియ్యాన్ని మిగిల్చడం వల్లే వంటకాలు చాలడం లేదని కమిటీ చైర్మన్ రాంబాబు, వైస్‌చైర్మన్ స్వాతి భోజన నిర్వాహకులను నిలదీశారు. కమిటీ ఆధిపత్యాన్ని జీర్జించుకోని భోజన నిర్వాకురాలు శ్యామల, స్రవంతి, భర్త సంతోష్ వారితో వాగి్వవాదానికి దిగారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ఉన్న పాఠశాల ప్రిన్సిపాల్ అప్పాజీ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన నిర్వాహకుల తీరుపై తల్లిదండ్రుల కమిటీ సభ్యులు ప్రతి రోజూ చెబుతున్నారని తెలిపారు. విద్యార్థులకు సరిపడినంత వంటకాలు వండకుండా బియ్యం, గుడ్లు మిగుల్చుతున్న విషయాన్ని గుర్తించామన్నారు. కమిటీ చెప్పిన మాటలు పట్టించుకోకుండా నిర్వాహకులు మంగళవారం కూడా విద్యార్థుల సంఖ్యకు సరిపడా వండకపోవడంతో కమిటీ సభ్యులు నిలదీశారని వివరించారు. మాటల యుద్ధంతో జరిగిన ఈ వివాదం ముదిరి టూ టౌన్ స్టేషన్ వరకు వెళ్లింది. ఇరువురి వాదన విన్న పోలీసులు సర్ది చెప్పారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా భోజనం ఒకే సారి వండి బోధన సమయానికి అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. -
అనుమతి లేకుండా టాలెంట్ టెస్ట్
సాక్షి, విజయనగరం క్రైమ్: విద్యాశాఖ నుంచి ఎటువంటి అనుమతుల్లేకుండా ఆకాష్, పిట్జీ వంటి కార్పొరేట్ విద్యాసంస్థలు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం గందరగోళానికి దారితీసింది. పరీక్ష రాసేందుకు ఒక్కో విద్యార్థి నుంచి 500 రూపాయలను ఆన్లైన్ ద్వారా వసూలు చేశారు. ఐదో నుంచి పదో తరగతి విద్యార్థులకు జిల్లా కేంద్రంలో ఆదివారం పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. విశాఖకు చెందిన ఈ కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యాహక్కు చట్టం, బాలల హక్కులను తుంగలో తొక్కి పరీక్షలు నిర్వహిస్తున్నాయన్న విషయం తెలుసుకున్న జాతీయ మానవ హక్కుల సంఘ ప్రతినిధులు సత్తి అచ్చిరెడ్డి, తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. అక్కడ నుంచి జిల్లా విద్యాశాఖాధికారులతో ఫోన్లో మాట్లాడగా...పరీక్షల నిర్వహణకు ఎటువంటి అనుమతుల్లేవని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు స్థానిక తోటపాలెంలో ఉన్న పరీక్ష కేంద్రమైన ఫోర్ ఎస్ డిగ్రీ కళాశాల వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. హాల్‌టికెట్ చూపిస్తున్న విద్యార్థి పరీక్ష నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్లను ప్రశ్నించగా వారి వద్ద నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఎస్ఎఫ్ఐ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మానవహక్కుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. అచ్చిరెడ్డి మాట్లాడుతూ, అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఇదే తంతు జరుగుతున్నా ఏ ఒక్కరూ దీనిపై దృష్టి సారించకపోవడం విచారకరమన్నారు. కార్పొరేట్ మాయాజాలంలో పడి విద్యార్థుల భవిష్యత్, స్వేచ్ఛను హరించవద్దని తల్లిదండ్రులకు సూచించారు. కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల మేరకే ఎంట్రన్స్, మోడల్ టెస్ట్‌లు వంటివి నిర్వహించుకోవాలే తప్ప అధిక రుసుం వసూలు చేయకూడదన్నారు. విద్యాశాఖ, పోలీస్, ఎస్ఎఫ్ఐ సహకారంతో పరీక్షను నిలిపివేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సింహాద్రిస్వామి, విద్యార్థులు పాల్గొన్నారు. -
సిద్ధమవుతున్న సచివాలయాలు
సాక్షి, విజయనగరం రూరల్: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి గ్రామ సచివాలయాల వ్యవస్థను రూపొందించారు. అంతేగాకుండా దానిని తక్షణమే ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అధికార వికేంద్రీకరణ చేయడం ద్వారా ప్రజలకు పాలన మరింత చేరువ కావాలన్న లక్ష్యంతో... ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కారం కావాలన్న ఆలోచనతో ఈ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జిల్లాలోని 664 గ్రామ సచివాలయాల్లో తొలిరోజు 33 గ్రామ సచివాలయాలను అధికారులు ప్రారంభించారు. అందుబాటులో ఉన్నవి 392 జిల్లాలో 664 గ్రామ సచివాలయాలకు 392 భవనాలు అందుబాటులో ఉండటంతో అధికారులు వాటిని సిద్ధం చేస్తున్నా రు. ఇప్పటికే జిల్లాలో 60 వరకు భవనాలు సిద్ధం చేసి వాటిని ప్రారంభించారు. మరో 272 సచివాలయాలకు భవనాలు భవనాలు సిద్ధంగా లేవని అధికారులు తెలిపారు. మొదలైన సచివాలయ వ్యవస్థ గ్రామ సచివాలయాల్లో ప్రజలకు సేవలందించడానికి ఇప్పటికే ఉద్యోగులను, గ్రామ వలంటీర్లను నియమించారు. 14 శాఖల్లో ఉద్యోగాలకు 5915 అవసరం కాగా వీరిలో అనేకమందిని ఇప్పటికే నియమించారు. అంతే గాకుండా బాధ్యతలు సైతం అప్పగించారు. అలాగే 10853 మందికి పైగా వలంటీర్లను నియమించగా వీరంతా వారికి కేటాయించిన కుటుంబాల వివరాలను సేకరించారు. ఇప్పటికే సచివాలయ ఉద్యోగులకు తాము చేపట్టబోయే విధులపై శిక్షణ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. -
‘గిట్టుబాటు ధరకు కృతనిశ్చయంతో ఉన్నాం’
సాక్షి, విజయనగరం: రైతుల కోసం వైఎస్సార్ ఒకడుగు ముందుకు వేస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రిని మించి రైతులకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మంగళవారం చీపురుపల్లి పరిధిలోని గుర్లలో వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలో 28వేల మంది రైతులకు రూ.34 కోట్ల పెట్టుబడి సాయం చెక్కులను రైతులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు నలుగురికి అన్నం పెట్టేవాడిగా వుండాలని కోరుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తుచేశారు. గతంలో వైఎస్సార్ రైతులకోసం ప్రవేశపెట్టిన పథకాలే ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని తెలిపారు. రైతులకు సాయం చేసే కార్యక్రమాలనే మేనిఫెస్టోలో పెట్టామన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ కంటే అధికంగా రైతులకు సహాయం అందిస్తున్న ఘనత సీఎం జగన్‌కి దక్కిందని ప్రశంసించారు. ఎన్నికల సమయంలో రైతులకు ప్రతి ఏటా రూ.12,500 పెట్టుబడి సహాయం చేస్తామని హామీ ఇచ్చాము. కానీ ఇప్పుడు ఆ మొత్తానికి రూ. వేయి పెంచుతూ రూ.13,500 చేశామని తెలిపారు. అదేవిధంగా నాలుగేళ్లకు బదులుగా ఐదేళ్లపాటు రైతుభరోసా సహాయం అందించాలని నిర్ణయించామని వెల్లడించారు. నవంబరు 15వ తేదీ వరకు ఈ పథకంలో రైతులు పేర్లు నమోదు చేసే అవకాశం వుందని.. రైతులు తమ పేర్లు నమోదు కాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆధార్ వివరాలు తప్పుగా నమోదైనా సరి చేస్తామన్నారు. ప్రతి ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకోవాలన్నదే సీఎం జగన్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా సమస్యలు వస్తే వాటిని సరిచేసి పథకాలు అందిస్తామని పేర్కొన్నారు. రైతుల పంటలకు మద్ధతు, గిట్టుబాటు ధరలు కల్పించాలని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని వెల్లడించారు. రైతులు పండించే పంటలకు .. వారు పంట వేసినప్పుడే మద్ధతు ధర ప్రకటించి భరోసా కల్పిస్తామన్నారు. పంటలు పండించే రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో గిట్టుబాటు ధరలకు.. మార్కెట్ కమిటీల ద్వారా పంటలు కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో పండించే ఇరవై పంటలకు ప్రభుత్వం మద్ధతు ధరలు ప్రకటించిందని.. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రయోజనం పొందాలని మంత్రి బొత్స పేర్కొన్నారు. -
తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు అండగా నిలుద్దాం
సాక్షి, విజయనగరం అర్బన్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటానికి అండగా నిలుద్దామని ఆర్టీసీ సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. స్థానిక డిపో కార్యాలయం ఎదుట ఆదివారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఆ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ నెల 19న తెలంగాణ బంద్ సందర్భంగా ఎర్ర బ్యాడ్జీలతో ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరై మద్దతు తెలపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సమ్మె 9వ రోజుకు చేరినా అక్కడి ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. వెంటనే తెలంగాణ జేఏసీ నాయకత్వంతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే రానున్న కాలంలో జేఏసీ రాష్ట్ర కమిటీ ఎలాంటి ఉద్యమానికి పిలుపునిచ్చినా సిద్ధంగా కార్మికులు ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణంరాజు, ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి పి.భానుమూర్తి, డిపో అధ్యక్ష, కార్యదర్శులు జీవీఎం రాజు, చవక శ్రీనివాసరావు, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు ఏ.చంద్రయ్య పాల్గొన్నారు. -
పుకార్లను నిజమని నమ్మించేందుకు ఆపసోపాలు..
బొబ్బిలి: ప్రతిపక్ష నేత చంద్రబాబే స్వయంగా పుకార్లను ప్రచారం చేస్తూ.. వాటిని నిజం చేసేందుకు ఆపసోపాలుపడుతున్న తీరు చూస్తుంటే నవ్వొస్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో వార్డు సచివాలయాన్ని ఆదివారం ప్రారంభించాక జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. అధికారంలోకొచ్చిన వంద రోజుల్లోనే లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయడాన్ని తట్టుకోలేని టీడీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించినవారిని వేదికపైకి పిలిచి వారితో మాట్లాడించారు. సీతానగరం మండల కేంద్రానికి చెందిన శాంతికుమారి మాట్లాడుతూ తాను గతంలో ఎన్నో ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా.. డబ్బులు ముట్టజెప్పలేకపోయినందున ఏ ఉద్యోగం రాలేదని, కానీ ఇప్పుడు ఎవరికీ డబ్బులు చెల్లించకుండానే సచివాలయ ఉద్యోగం వచ్చిందని ఆనందంగా చెప్పారు. తెర్లాం మండలం నందబలగకు చెందిన సత్యవతి మాట్లాడుతూ తాను ఎమ్మెస్సీ చదివానని.. గత ప్రభుత్వ హయాంలో డబ్బులు కట్టి ఉద్యోగాలు చేస్తున్న వైనాన్ని చూసి.. ఆ స్థోమత లేని తనకు ఈ జన్మకు ఉద్యోగం రాదనుకున్నానని, అయితే ప్రభుత్వం మారాక సచివాలయ ఉద్యోగానికి దరఖాస్తు చేసి దానిని సాధించానని ఉద్వేగంతో చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే శంబంగి వెంకటచిన అప్పలనాయుడు తదితరులున్నారు. -
పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు వద్దు: బొత్స
సాక్షి, విజయనగరం : నలభై ఏళ్ల క్రితం విజయనగరం జిల్లాగా ఏర్పడినప్పుడు ఎంతో అభివృద్ధి చేయాలనుకున్నాం కానీ మూడు దశాబ్దాలు ఎమ్మెల్యేగా ఉన్న ఒక వ్యక్తి అభివృద్దిపై దృష్టి సారించకపోవడం మన దురదృష్టమని ఆ జిల్లా నేత, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలో విలేకర్లతో మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల విజయనగరం అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం కార్పొరేషన్లను మున్సిపాలిటీలుగా మార్చినప్పుడు ఆనందపడ్డాం గానీ, తర్వాత వాటిని ఒక్క జీవోతో రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు పెరగడంతో పట్టణాల్లో జనసాంద్రత పెరుగుతోందని, దానికి తగ్గట్టు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలకు అత్యవసరమని భావించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న సంకల్పంతో శత పనుల శంఖుస్థాపన కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. పట్టణంలో 24 గంటల నీటి సరఫరాకు కృషి చేస్తున్నామన్నారు. వర్షం వల్ల రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. ఇసుక సమస్యను అధిగమించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. సోషల్ మీడియాలో రాతల గురించి ప్రభుత్వంపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అందరిళ్లల్లోనూ మహిళలు ఉంటారని వారిని కించపరుస్తూ మాట్లాడవద్దని హితవు పలికారు. పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలాడడం మానుకోవాలని చంద్రబాబుకు సూచించారు. -
ప్రతి ఇంటికీ శుద్ధజలం
సాక్షి, విజయనగరం : రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ శుద్ధజలం అందించాలన్న సంకల్పంతో ఉంది. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న సాగునీటి రిజర్వాయర్ల నుంచి నీటిని వినియోగించుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. జిల్లాలోని ప్రజలందరికీ సరిపడా తాగునీరు సరఫరా కావడం లేదు. మరోవైపు జిల్లాలో వేలాది క్యూసెక్కుల నీరు సముద్రంలో కలిసిపోతోంది. ఒక్క నాగావళి నది ద్వారా 16టీఎంసీల నీరు ఏటా ప్రవహిస్తుండగా అందులో 4టీఎంసీలు కూడా వినియోగించుకోలేకపోతున్నాం. చంపావతి, వేగావతి, గోస్తనీ... ఇలా ఏ నది చూసినా ఇలానే ఉంది. ఆ నదుల నీటిని వినియోగించుకునేందుకు వాటిపై జలాశయాలు ఉన్నా నీరంతా నిల్వ చేయకపోవడంతో కిందకు విడుదల చేస్తున్నారు. ఈ నీటిని జిల్లా ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఒక శాశ్వత ప్రాజెక్టు రూపకల్పన చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా శుద్ధి చేసిన నీరు మాత్రమే సరఫరా చేసేలా కసరత్తు చేయాలని సూచించింది. ప్రాజెక్టులున్నా... తాగునీటికి కటకటే.. ఇప్పటివరకు ప్రజలకు బోర్ల ద్వారానే తాగునీరు అందుతోంది. రక్షిత మంచినీటి పథకాలు కొన్ని చోట్ల, పైపులైన్ల ద్వారా మరికొన్ని చోట్ల నీటిని సరఫరా చేస్తున్నారు. కుళాయి కనెక్షన్ల ద్వారా నేరుగా ఇంటికే కొన్ని గ్రామాలు, పట్టణాల్లో నీటిసరఫరా జరుగుతుండగా కొన్నిచోట్ల మాత్రం పథకాల నుంచే జనం తెచ్చుకుంటున్నారు. బోర్లు పాడైనా, భూగర్భజలాలు ఇంకినా తాగునీటి సరఫరా అందడం కష్టంగా మారింది. వాస్తవానికి జిల్లాలో జలాశయాలున్నా వాటిని తాగునీటి అవసరాలకు వినియోగించే పథకాలు జిల్లాలో లేవు. తోటపల్లి నుంచి పార్వతీపురానికి, తారకరామతీర్థసాగర్ నుంచి విజయనగరానికి నీరందించే ప్రతిపాదనలు ఉన్నా అమలు కాలేదు. తాటిపూడి నీరు విశాఖ వాసుల గొంతు తడుపుతున్నా జిల్లాకు ఉపయోగపడటం లేదు. శుద్ధ జలం కోసం రూ.2600కోట్లుతో డీపీఆర్‌జిల్లాలో ప్రాజెక్టుల నుంచే తాగునీటి అవసరాలు తీర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రాజెక్టుల నుంచి గ్రావిటీ ద్వారానే నేరుగా నీరు పట్టణాలు, గ్రామాల్లో ఉన్న రక్షిత మంచినీటి పథకాలకు అందించడం, పైపులైన్ల ద్వారా సరఫరా తెచ్చి ఇంటింటికి కుళాయి ద్వారా అందించడం లక్ష్యంగా ప్రాజెక్టు రూపొందించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ విధంగా జిల్లాలో ప్రస్తుతం ఉన్న పీడబ్ల్యూ స్కీంలు, సీడబ్ల్యూ స్కీంలు, కేంద్ర ప్రభుత్వం సుజల పథకం, ఇతర తాగునీటి వనరులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, కొత్తగా చేపట్టాల్సిన పనుల కోసం డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను జిల్లా అధికారులు తయారు చేశారు. ఇందుకు మొత్తం రూ.2600కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ రిపోర్టుపై రెండురోజుల క్రితం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో చర్చించారు. ఆయన సూచన మేరకు చిన్నచిన్న మార్పులు చేసి రిపోర్టును ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి పంపిస్తున్నారు. సంక్షేమం ఒక వైపు... సమగ్రాభివృద్ధి మరోవైపు. ఇదీ రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో చేపడుతున్న కార్యక్రమాలు. ఒకవైపు వివిధ వర్గాల అభ్యున్నతికి పలు పథకాలను రూపొందించి అమలు చేస్తుండగా... ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటింటికీ శుద్ధ జలం అందించాలన్న లక్ష్యంతో ఓ బృహత్తర పథకానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనికోసం జిల్లాలోని నదీజలాలను సద్వినియోగించుకునేలా డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును అధికారులు రూపొందించారు. రిపోర్టు పంపిస్తున్నాం ప్రాజెక్టుల నుంచి శుద్ధ జలం ప్రాజెక్టుపై నివేదిక ఒక కొలిక్కి వచ్చింది. మంత్రి బొత్స సత్యనారాయణ సూచనల మేరకు కొంచెం మార్పులు చేసి శుక్రవారం పంపించాం. ప్రభుత్వం ఆమోదించిన తర్వాత నిధులు మంజూరైతే టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభిస్తాం. 2021 నాటికి పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కలెక్టర్ సూచన మేరకు సకాలంలో పక్రియ పూర్తి చేశాం. – రవికుమార్, ఇన్‌ఛార్జి ఎస్ఈ, విజయనగరం డీపీఆర్ ప్రకారం ప్రతిపాదనలు ఇలా... ⇔ తోటపల్లి నుంచి కురుపాం నియోజకవర్గంలోని ఐదు మండలాలు, పార్వతీపురంలో మూడు, సాలూరులో 1, గజపతినగరంలో 2, విజయనగరంలో 1, నెల్లిమర్లలో 4, బొబ్బిలిలో 3మండలాలు(మొత్తం 19 మండలాలు), అన్ని పురపాలక సంఘాలకు. ⇔ శ్రీకాకుళం జిల్లా సంకిలిలోని నాగావళి నుంచి చీపురుపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు. ⇔ మడ్డువలస నుంచి బలిజిపేట, తెర్లాం ⇔ పెద్దగెడ్డ నుంచి పాచిపెంట ⇔ వెంగళరాయసాగర్ నుంచి: సాలూరు రూరల్ ⇔ తాటిపూడి నుంచి ఎస్.కోట నియోజకవర్గంలో ఐదు మండలాలు, గజపతినగరం నియోజకవర్గంలో గంట్యాడ, బొండపల్లి మండలాలకు. -
జీఓ నంబర్ 279ను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
మాట తప్పని నైజం... మడమ తిప్పని నేపథ్యం... ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సొంతం. అందుకే ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నారు. అవసరం కోసం హామీలిచ్చి... అందలమెక్కాక వాటిని మరచిపోయే నాయకులను ఇన్నాళ్లూ చూసిన జనం... ఇప్పుడు మాటిచ్చి... నెరవేర్చే నాయకుడిని చూసి ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. పండగ చేసుకుంటున్నారు. పారిశుద్ధ్య కార్మికుల బతుకును ప్రశ్నార్థకం చేస్తూ గత ప్రభుత్వం విడుదల చేసిన జీఓ రద్దుకోసం ఎన్నాళ్లుగానో పోరాడుతున్నారు. అయినా నాడు స్పందన కరువైంది. పాదయాత్రగా వచ్చిన జననేత దాని రద్దుకు హామీ ఇచ్చారు. ఇప్పుడు దానిని ఆచరణలో చూపారు. సాక్షి, విజయనగరం: రాజకీయ నాయకులంటే అవసరానికి మాటలు చెప్పి ఆ తర్వాత ఇచ్చిన మాటనే మర్చిపోతారనే అపవాదు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అతీతుడిగా నిలుస్తున్నారు. ప్రజా సంకల్పయాత్ర జిల్లాలో చేసినపుడు తన వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకున్న ప్రతిఒక్కరికీ జగన్ మాటిచ్చారు. ‘మీ అందరి ఆశీస్సులతో.. భగవంతుని దయతో రేపొద్దున మనందరి ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చాక మీ అం దరి సమస్యలను తీరుస్తాను’ అంటూ కొండంత భరోసానిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే అనేక హామీలను నెరవేరుస్తున్నారు. ఆక్ర మంలో తాజాగా జీఓ నెం.279ను రద్దు చేశారు. మాటిచ్చారు.. నిలబెట్టుకున్నారు: 2016 డిసెంబర్ 31న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జీఓ నెం.279ను కార్మికుల మెడపై కత్తిలా ప్రవేశ పెట్టింది. ఈ జీఓను వ్యతిరేకిస్తూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తమ బతుకుల కోసం గత మూడేళ్లుగా పోరాడుతున్నారు. దానిని రద్దు చేయాలని అనేక ఆందోళనలు చేశారు. అయినా గత సీఎం చంద్రబాబు వారి వేదనను పట్టించుకోలేదు. ప్రజా సంకల్పయాత్రలో కార్మికుల మొరవిన్న జగన్ తాను సీఎం కాగానే న్యాయం చేస్తానని మాటిచ్చారు. ఒకానొక సందర్భంలో ‘పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు మొక్కినా తప్పులేదు’ అంటూ వారిపై తనకున్న గౌరవాన్ని జగన్ వ్యక్తీకరించారు. అధికారంలోకి రాగానే వారి కనీస వేతనాన్ని రూ.18వేలకు పెంచారు. తాజాగా 279 జీఓను రద్దు చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో జిల్లాలోని 735 మంది పారిశుద్ధ్య, విద్యుత్, తాగునీటి సరఫరా కార్మికులకు ప్రయోజనం చేకూరుతోంది. వారికి ఉద్యోగ భద్రత లభిస్తోంది. నాడు 70 రోజుల పాటు సమ్మె: జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ పారిశుద్ధ్య కార్మికులు తమ బతుకులను ప్రశ్నార్థకం చసే జీఓను రద్దు చేయాలని 70 రోజుల పాటు సమ్మె చేశారు. సమ్మెను కొనసాగిస్తూనే మున్సిపాలిటీల ఎదురుగా టెంట్ వేసి నిరసనలు వ్యక్తం చేశారు. ఆ సమయంలో జిల్లా అంతటా పారిశుద్ధ్య నిర్వహణకు ఇబ్బందులు తలెత్తినా అప్పటి టీడీపీ పాలకులు పట్టించుకోలేదు. జీఓను అమలు కాకుండా చూస్తానని అప్పటి రాష్ట్ర గనులశాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు చెప్పినా ఆ తర్వాత ముఖం చాటేశారు. తన సొంత నియోజకవర్గంలోనే కార్మికులను జైలుకు పంపించారు. 18 మంది జైలుకు పోరాటం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఎక్కడబడితే అక్కడ అణచివేసేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. నిరసనలు వ్యక్తం చేస్తున్న శిబిరాలను పోలీసులతో భగ్నం చేయించింది. పోరాటాలను అడ్డుకునేందుకు నాయకులపై నాన్‌బెయిలబుల్ కేసులను పెట్టింది. కేసులు పెడతామని బెదిరించింది. అంతే కాదు మొత్తంగా 18 మందిని సబ్‌జైలుకు పంపించింది. బొబ్బిలి మున్సిపాలిటీలోని పారిశుద్ధ్య వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్న ఉద్దాన లక్ష్మణరావు వాహనం మీదే గుండెపోటుతో చనిపోయాడు. ఆ జీఓ వల్ల తన ఉద్యోగం పోతుందనీ, తన భార్యా పిల్లలను ఎలా పోషిస్తాననీ పలు మార్లు ఇంటివద్ద చెప్పేవారు. ఆ గుబులుతోనే గుండెపోటుతో 2018 ఆగస్టు 18న డంపింగ్‌యార్డు వద్ద తనకు కేటాయించిన చెత్తను తరలించే వాహనాన్ని నడుపుతూనే తుదిశ్వాస విడిచాడు. గత ప్రభుత్వం కుట్రలు చేసింది జిల్లాలో పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం. మమ్మల్ని అణచివేసేందుకు గత ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈ జీఓను రద్దు చేయడం హర్షణీయం. అయితే టౌన్‌లెవెల్ ఫెడరేషన్లకు అప్పగించకుండా ట్రెజరీల ద్వారా వీరికి వేతనాలు ఇప్పిస్తే బాగుంటుంది. – పొట్నూరు శంకరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీ మున్సిపల్ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికుల సంఘం. సీఎంకు ధన్యవాదాలు మున్సిపల్ కార్మికులను ఇబ్బందిపెట్టే జీఓ నెం.279 రద్దు చేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మున్సిపల్ కార్మికుల జీతం రూ.12వేల నుంచి రూ.18వేలకు పెంచినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. పాదయాత్రలో మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీని పదవిలోకి వచ్చిన మూడు నెలల్లో అమలు చేయటం హర్షించదగ్గ విషయం. – టి.వి.రమణ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, విజయనగరం -
చారిత్రాత్మక తప్పిదాన్ని సరి చేస్తే విమర్శలా..!
సాక్షి, విజయనగరం : స్వాంతత్య్రం వచ్చిన తొలినాళ్లలో చేసిన చారిత్రాత్మక తప్పిదాన్ని సవరించి దేశాభివృద్ధి ఆటంకాలను తొలగిస్తే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు విమర్శిస్తున్నారని కేంద్ర పశుసంవర్ధకశాఖ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి ఆరోపించారు. కేంద్రం రద్దు చేసిన ఆర్టికల్ 370 రద్దు అంశంపై బీజేపీ దేశవ్యాప్తంగా చేపడుతున్న ‘జనజాగరణ’ సభల నిర్వహణలో భాగంగా పట్టణంలోని స్థానిక ఆనందగజపతి ఆడిటోరియంలో బుధవారం జరిగిన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కశ్మీరుపై 72 సంవత్సరాల క్రితం విధించిన చారిత్రాత్మక తప్పిదం 370, 35ఏ చట్టమని దాన్ని రద్దు చేస్తే అక్కడ ప్రాంతం పూర్తిగా దేశం పరిధిలోకి వస్తుందని గుర్తించి ప్రధాని మోదీ రద్దు చేసారని వివరించారు. ఈ చట్టం రద్దుతో సంపూర్ణ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లయిందని, అయితే దాన్ని విపక్షాలు జీర్ణించుకోవడం లేదని ఆరోపించారు. ఎంపీ బెల్లాన వినతి విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాలలో ఆదుకోవాలని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కోరారు. సభకు హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి సహాయన్ని కోరారు. ప్రత్యేక హోదా హక్కును అమలు చేయాలని కోరారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనకు జ్ఞాపికను అందజేశారు. అనంతరం సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ముగ్గురు ప్రముఖుల ఇళ్లకు కేంద్రమంత్రి వెళ్లి దేశ పరిస్థితులపై చర్చించారు. చెవికి సంబంధించిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మిషన్లను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి సూకల మధుకర్జీ, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పెద్దింటి జగన్మోహనరావు, ప్రధాన కార్యదర్శి సత్తి అచ్చిరెడ్డి, జిల్లా, నియోజకవర్గ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఒడిశా నుంచి ఇసుక రవాణా; పట్టుకున్న పోలీసులు
సాక్షి, విజయనగరం : ఒడిశాలోని కెరడ నుంచి విశాఖకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 15 లారీలను రెవెన్యూ అధికారులతో కలిసి పార్వతీపురం ఏఎస్పీ డాక్టర్ సుమిత్ గరుడ పట్టుకున్నారు. పట్టుకున్న ఇసుక సుమారు 375 టన్నులుంది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ మాట్లాడుతూ.. పక్కా సమాచారం ఆధారంగా లారీలను పట్టుకొని, పాత తేదీలతో ఉన్న బిల్లులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నిబంధనల ప్రకారం అంతర్రాష్ట్ర ఇసుక రవాణాకు అనుమతులు లేవని వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో ఇరు రాష్ట్రాల ఇసుక విధానానికి విరుద్ధంగా అక్రమ రవాణా జరుగుతుందని తేలిందన్నారు. పట్టుబడిన లారీలపై కేసులు నమోదు చేశామని, మరికొన్ని లారీలు సరిహద్దుల్లో నిలిచిపోవడం వల్ల వాటిని పట్టుకోవడం కుదర్లేదని స్పష్టం చేశారు. మరోవైపు పార్వతీపురం సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేశామని, సంబంధిత యజమానులు సరైన పత్రాలు ఉంటే వాటిని కమిటీకి అందజేయవచ్చని తెలియజేశారు. -
వాటి కోసం చెన్నై వెళ్లాల్సిన అవసరం లేదు
సాక్షి, విజయనగరం : కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో చేతల ప్రభుత్వం ఉందని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన భోగాపురం మండలంలోని రొయ్య పిల్లల ఉత్పత్తి పరిశ్రమ వైశాఖీ బయో రిసోర్సెస్‌ను సందర్శించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మత్స్య పరిశ్రమ ద్వారా ప్రస్తుతం 47 వేల కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయనీ, దీనిని లక్ష కోట్లకు పెంచేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు. అందుకోసం 25 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించామన్నారు. మత్స్య పరిశ్రమలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందంటూ, ఈ ఉత్పత్తుల్లో రసాయనాల వాడకం తగ్గించాలని సూచించారు. రాష్ట్రంలో సగటు రొయ్యల ఉత్పత్తి హెక్టారుకు మూడు టన్నులు కాగా, దీనిని 9 టన్నులకు పెంచాలని నిర్దేశించారు. రొయ్యలకు సర్టిఫికేషన్ కోసం చెన్నై వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఆ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలనే దృష్టితోనే వ్యవసాయ శాఖ నుంచి విడదీసి పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమలను వేరే శాఖగా ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి బాలాజీ, మత్స్య శాఖ కమిషనర్ రాం శంకర్ నాయక్ పాల్గొన్నారు. -
మా బంగారాన్ని తిరిగి ఇచ్చేయండి!
సాక్షి, విజయనగరం : జిల్లాలోని పూసపాటిరేగ మండలం కొప్పెర్ల బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గందరగోళం నెలకొంది. ఖాతాదారులు నకిలీ బంగారం పెట్టి రుణాలు తీసుకున్నారంటూ వదంతులు రావడంతో దుమారం చెలరేగింది. తాకట్టు పెట్టిన బంగారాన్ని ఒసారి తనిఖీ చేసుకోవాలంటూ ఖాతాదారులకు బ్యాంక్ అధికారులు నోటిసులు పంపించారు. దీంతో బ్యాంకు ఎదుట ఖాతాదారులు బారులు తీరారు. బంగారాన్ని మార్చేసి నకిలీ బంగారం పెట్టారేమోనని బ్యాంక్ యాజమాన్యంపై ఖాతాదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ బంగారం తమకు ఇచ్చేస్తే విడుపించుకుపోతామని బ్యాంకు ఎదుట క్యూ కడుతున్నారు. -
అమ్మో... గజరాజులు!
గజరాజుల గుంపు కురుపాం నియోజకవర్గంలోకి అడుగిడి వచ్చే నెల సెప్టెంబర్ తొమ్మిదో తేదీ నాటికి ఏడాది కానుంది. ఈ ఏడాది కాలంలో అటు శ్రీకాకుళం, ఇటు విజయనగరం జిల్లాల్లో ఎక్కడికక్కడే పంటలకు నష్టం కలగజేస్తూ అన్నదాతను తీవ్రంగా నష్టపరుస్తూనే ఉన్నాయి. తాజాగా బుధవారం మరోసారి కొమరాడ మండలంలోకి ఏనుగులు ప్రవేశించాయి. ఫలితంగా రైతులు జిల్లా నుంచి వీటి తరలింపు ఎప్పటికి జరుగుతుందోనన్న భయాందోళనల నడుమ జీవిస్తున్నారు. ఓ వైపు ప్రకృతి సహకరించక... మరోవైపు గజరాజుల సంచారంతో తమ బతుకులు ఛిద్రమవుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సాక్షి, కొమరాడ(విజయనగరం) : ఏనుగులు కురుపాం నియోజకవర్గంలోకి అడుగిడి ఏడాదవుతున్నా వీటిని తరలించే ప్రక్రియలో అధికారులు విఫలమయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కురుపాం నియోజకవర్గంలోకి వచ్చేటపుడు గుంపులో ఎనిమిది గజరాజులు ఉండగా రెండు మృత్యువాత పడగా మిగిలిన ఆరు ఏనుగులు ఈ ప్రాంతంలో సంచరిస్తూ అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల నెల రోజుల పాటు నాగావళి నదికి ఆవల వైపున్న ప్రాంతంలో సంచరించిన ఏనుగులు మంగళవారం రాత్రి నది దాటి కొమరాడ మండలం గుణానపురానికి వచ్చాయి. బుధవారం తెల్లవారిజామున ఆర్తాం వద్ద రైల్వేట్రాక్ దాటుకుంటూ అక్కడ అటవీ ప్రాంతంలోకి చొచ్చుకువెళ్లాయి. దీంతో ఈ ప్రాంత రైతాంగానికి పంటలకు ఎక్కడ నష్టం వాటిల్లుతుందోనన్న ఆందోళన నెలకొంది. కూరగాయల సాగే అధికం కొమరాడ మండలంలోని గుణాణపురం, కళ్లికోట, దుగ్గి, గంగారేగువలస, కుమ్మరిగుంట, కందివలస తదితర గ్రామాల్లో కూరగాయాలు సాగు జిల్లాలోనే మూడో స్థానంలో ఉంది. దీంతో ఈ ప్రాంత రైతులు ఎక్కడ పంటలకు నష్టం చేకూరుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా చిక్కుడు, కాకర, వంగ, ఆనప, బొప్పాయి, టమాట, జామ పంటలు సాగులో ఉన్నాయి. ఇక్కడ పండే కూరగాయలు ఒడిశా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వెళ్తాయి. మంచి సాగులో ప్రస్తుతం పంటలు ఉండగా ఏనుగులు ఇక్కడకు ప్రవేశించడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. పరిష్కారం దొరికేనా...! ఏనుగుల గుంపును తరలించేందుకు అటవీ శాఖ అధికారులు తమ వంతు ప్రయత్నాలు ఎప్పటి నుంచి చేస్తూనే ఉన్న సఫలీకృతం కావడం లేదు. పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీ పరిధిలోని జంతికొండ అటవీ ప్రాంతంలో 512 హెక్టార్ల పరిధిలో ఎలిఫెంట్ జోన్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు రావాల్సి ఉందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో ఎలిఫెంట్ జోన్ వద్దంటూ ప్రజా సంఘాలు, ప్రజలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. అయినా ఆ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఎలిఫెంట్ జోన్ వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. ఇందుకోసం అటవీ ప్రాంతమంతా ఓ ర్యాంపు తయారు చేసి లోపలికి ఎవరిని వెళ్లనీయకుండా ఏనుగులకు కావాల్సిన నీరు, ఆహారంతో పాటు కావాల్సిన వసతులు కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రజలకు ఎటువంటి నష్టం జరగదని, ఏనుగుల బెడద కూడా తప్పుతుందని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే..! -
అంతా మా ఇష్టం..!
సాక్షి, విజయనగరం(చీపురుపల్లి) : ఆయనో పెద్ద భూ స్వామి... పదుల ఎకరాల భూమి ఉంది... ఇంకా ఆయనకు భూ దాహం తీరలేదు. శ్రీకాకుళం జిల్లా నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో.. తన పొలం మధ్యలో ఉన్న గెడ్డలు, వాగులు..రస్తాలను కలిపేశారు. ఒకే పొలంగా మార్చేశారు... అందులో చక్కగా మొక్కజొన్న సాగు చేపట్టారు. చీపురుపల్లి మండలంలోని కర్లాం రెవెన్యూ పరిధిలో జరిగిన ఈ గెడ్డ ఆక్రమణ పుణ్యమా అని దాదాపు 300 ఎకరాల ఆయకట్టుకు నీరందడంలేదు. గెడ్డను విడిచిపెట్టాలని భూస్వామి రైతులు విన్నవించినా ఫలితం లేకపోవడంతో తహసీల్దార్‌కు గోడు వినిపించారు. 2.69 ఎకరాల ఆక్రమణ శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలంలోని లింగాలవలస, వెంకటాపురానికి చెందిన టీడీపీ నేతల సమీప బంధువు కర్లాం రెవెన్యూ పరిధిలో 18 ఎకరాలు జిరాయితీ పొలాన్నీ ఇటీవల కొనుగోలు చేశారు. ఆ జిరాయితీ పొలానికి చుట్టూ సర్వే నంబరు 302–1లో 2.41 ఎకరాల విస్తీర్ణంలోని గెడ్డ, 302–4 లో 0.28 సెంట్లు రస్తా ఉండేది. జిరాయితీ పొలం చుట్టూ ఉన్న ఈ గెడ్డ, రస్తాను భూస్వామి ఆక్రమించినట్టు గ్రామస్తులు,పెద్దలు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ గెడ్డ నుంచి వచ్చే నీరు పోలమ్మ చెరువుకు చేరుతుందని, ఆ చెరువు కింద 300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి నెలకొందని గ్రామ పెద్దల వాదన. అయితే, లావేరు మండలంలో ఉన్న టీడీపీ నాయకుడు తన దగ్గర నారాయణ మంత్రం ఉందని, అంతా తాను చూసుకుంటానని దగ్గరుండి కర్లాం రెవెన్యూ పరిధిలో భూములు కొనిపించి, ఆక్రమణకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. తహసీల్దార్‌కు ఫిర్యాదు కర్లాం రెవెన్యూ పరిధిలో వాగు, రస్తా ఆక్రమణకు గురైందని, దీనివల్ల పోలమ్మ చెరువుకు నీరు సరఫరా నిలిచిపోయిందని గ్రామ పెద్దలు తహసీల్దార్ శ్యామ్సుందర్కు ఫిర్యాదు చేశారు. దీనివల్ల 300 ఎకరాల ఆయకట్టులో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారిందని వివరించారు. సర్వేకు ఆదేశించాం ఇదే విషయంపై తహసీల్దార్ పి.వి.శ్యామ్‌సుందర్ మాట్లాడుతూ కర్లాంలో గెడ్డ, రస్తా ఆక్రమణలపై ఫిర్యాదు వచ్చిందన్నారు. దీనిపై మండల సర్వేయర్, ఆర్ఐలకు సర్వే చేసి వాస్తవ నివేదికలను ఇవ్వాలని ఆదేశించామన్నారు. ఆక్రమణలకు గురైనట్లు తేలితే స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. -
పిడుగుపాటుకు మహిళ మృతి
సాక్షి, విజయనగరం : పిడుగుపాటుకు ఓ మహిళ మృతి చెందడంతో పాటు మరో ఏడుగురు మహిళలకు తీవ్రగాయాలైన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాలు.. శృంగవరపుకోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన 8మంది మహిళలు సమీప గ్రామం సన్యాసయ్య పాలెంలో కూలీ పనులకు వెళ్లారు. వ్యవసాయ పనులు చేస్తుండగా వర్షం రావడంతో ఇళ్లకు బయలుదేరారు. దారి మధ్యలో ఈదురు గాలులు ఎక్కువ కావడంతో చెట్టు దగ్గర తలదాచుకున్నారు. అకస్మాత్తుగా చెట్టుపై పిడుగు పడటంతో అంకమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మిగతా ఏడుగురు మహిళలకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తక్షణమే 108కి సమాచారం అందించి గాయపడిన వారిని శృంగవరపుకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆరుగురు మహిళల పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. -
నాటి సమరంలో మనవారు సైతం...
సాక్షి, విజయనగరం : భారత దేశ స్వాతంత్య్ర సమరంలో విజయనగరానికి చెందిన యోధులు ఉన్నారు. ఆ ఉద్యమంలో జిల్లా పాత్రను ప్రస్ఫుటింపజేసిన గొప్ప వ్యక్తిగా కె.ఎస్.తిలక్ నిలుస్తారు. విజయనగరంలో పుట్టి పెరిగిన తిలక్ దేశంలో పలు ప్రాంతాల్లో జరిగిన పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు. యువతలో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిల్చారు. క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. బ్రిటిష్ వారి ఆగ్రహానికి గురై జైలు శిక్ష అనుభవించారు. పార్లమెంట్‌కు ఎన్నికైన తిలక్ బెస్ట్ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు దక్కించుకున్నారు. కాంగ్రెస్‌తో పాటు అనేక పార్టీలు రాజకీయాల్లోకి ఆహ్వానించినా పదవుల కోసం పార్టీలు మారకుండా అదే పార్టీలో కొనసాగి, తర్వాత రాజకీయాలకు దూరమైన నైతిక విలువలు కలిగిన నాయకుడాయన. చురుకైన నాయకుడు ఆదిరాజు జగన్నాథశర్మ స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మరో నాయకుడు ఆదిరాజు జగన్నాథశర్మ. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన అనేక పోరాటాల్లో ఆయన పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. చివరికి జైలు శిక్ష అనుభవించారు. విజయనగరం మహారాణిపేటలో నివసించిన శర్మ స్వాతంత్య్రం తర్వాత తెలుగు పండిట్‌గా వృత్తిని కొనసాగించారు. ఎటువంటి ప్రయోజనాలు ఆశించకుండా పోరాటంలో పాల్గొన్న నాయకుడు ఆయన. జొన్నవలసలో ఉద్యమ తేజం విజయనగరం మండలంలోని జొన్నవలసకు చెందిన మరో ఉద్యమ తేజం పూసపాటి బుచ్చిసీతారామ చంద్రరాజు. 1888లో జన్మించిన ఈయన సత్యాగ్రహ ఉద్యమ జిల్లా నాయకునిగా నామినేట్ అయి ఉద్యమాన్ని నడిపారు. 1930లో జైలుకు వెళ్లి కఠిన కారాగారశిక్ష అనుభవించారు. గాంధీ, ఇర్విన్ ఒడంబడిక ఫలితంగా 1931 మార్చి11న విడుదలయ్యారు. కాంగ్రెస్ పార్టీ కీలక పదవులు అధిరోహించిన ఆయన 1973లో కన్నుమూశారు. స్వతహాగా ఆస్తిపరులైనా, అన్నింటినీ విడిచిపెట్టి తెల్లదొరలను ఎదిరించిన నాయకునిగా గుర్తింపు పొందారు. స్వాతంత్య్రపోరులో చీపురుపల్లి యోధుడు స్వాతంత్య్ర సమరయోధుడు మొదలవలస అబ్బాయినాయుడు చీపురుపల్లి : దేశంలో ఎంతో మంది సమరయోధుల త్యాగఫలంలో స్వాతంత్య్రాన్ని సాధించుకుంటే అందులో చీపురుపల్లికి చెందిన వ్యక్తుల పాత్ర కూడా కాస్త ఉండడంతో ఎంతో గొప్ప విషయం. అందులో మొదలవలస అబ్బాయినాయుడును స్థానికంగా గుర్తు చేసుకుంటారు. 1914లో శ్రీకాకుళం జిల్లాలో ని షేర్‌మహమ్మద్‌పురంలో జన్మించిన అబ్బాయినాయుడు చీపురుపల్లిలో స్థిరపడ్డారు. ఆయన యవ్వనంలోనే స్వాతంత్య్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమానికి ఆకర్షితులయ్యారు. అందులో భాగంగానే అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే బ్రిటిష్ ప్రభుత్వాన్ని స్తంభింపజేయడానికి దేశ వ్యాప్తంగా రైళ్లను నిలిపివేయడం, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం చేయడం వంటి కార్యక్రమాలు జరుగుతుండగా అబ్బాయినా యుడు చౌదరి సత్యనారా యణ, గౌతు లచ్చన్నలను ఆదర్శంగా తీసుకుని చీపురుపల్లి నుంచి జి.సిగడాం, పొందూరు రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలు తప్పించి, రైల్వే టెలిఫోన్ తీగెలను తెంచేశారు. దీంతో ఆయన్ను పదిహేను రోజులు చీపురుపల్లి సబ్జైల్లో ఉంచారు. టంగుటూరి ప్రకాశం పం తులు, తెన్నేటి విశ్వనాథం, వి.వి.గిరి వంటి వారితో తనకు ఉన్న ఆత్మీయ సంబంధాన్ని అబ్బాయినాయుడు తన డైరీలో కూడా రాసుకున్నారు. 1981 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధునిగా గుర్తించి గౌర వ వేతనం మంజూరు చేసింది. 1991లో చీపురుపల్లిలో కన్నుమూశారు. -
ఏసీబీకి చిక్కిన అవినీతి ఆర్ఐ
సాక్షి, విజయనగరం : పార్వతీపురం మున్సిపాలిటీలో లంచం తీసుకుంటూ ఓ ఆర్ఐ.. ఏసీబీకీ పట్టుబడ్డాడు. దరఖాస్తు దారుని నుంచి లంచం తీసుకుంటూ ఆర్ఐ శంకరరావు అడ్డంగా దొరికిపోయాడు. పట్టణంలోని బహుళ అంతస్తు భవనానికి అసెస్మెంట్ ట్యాక్స్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి నుంచి 2.80 లక్షల భారీ మొత్తం డిమాండ్ చేశాడు. దీంతో ఆ వ్యక్తి ఏసీబీని ఆశ్రయించటంతో పక్కా ప్రణాళికతో నిఘా వేసిన ఏసీబీ.. మున్సిపల్ ఆర్ఐ శంకరరావును లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. -
తీరంలో అలజడి
సాక్షి, విజయనగరం : వాతావరణ మార్పులతో సంద్రంలో అలజడి నెలకొంది. అలలు ఉవ్వెత్తున ఎగసి తీరాన్ని తాకుతున్నాయి. చింతపల్లి తీరం ఆదివారం కోతకు గురికావడంతో మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. సముద్రంలో బలమైన గాలులు వీయడం.. కెరటాల తాకిడి పెరగడంతో వేటకు వెళ్లేందుకు వెనుకడుగువేస్తున్నారు. పూసపాటిరేగ తీరంలో సుమారు 400 వరకు బోట్లు ఉన్నా కేవలం 12 బోట్లతోనే వేట సాగించారు. చింతపల్లి రేవు నుంచి కేవలం 3 బోట్లు మాత్రమే వేటకు వెళ్లాయి. పతివాడబర్రిపేట, తిప్పలవలస, తమ్మయ్యపాలెం, కోనాడ, చింతపల్లి గ్రామాల మత్స్యకారులు వేటను వాయిదా వేసుకున్నారు. -
రైల్వే ప్రయాణికుడి వీరంగం
బొబ్బిలి: విశాఖ నుంచి బొబ్బిలి వైపు వస్తున్న బొకారో ఎక్స్‌ప్రెస్ బోగీ మీదకి మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు ఎక్కి కలకలం సృష్టించాడు. శనివారం సాయంత్రం బొకారో ట్రైన్‌ను విజయనగరంలో రన్నింగ్‌లో ఎక్కిన ఒడిశా వాసి పైన ఉండే విద్యుత్ తీగలను అం దుకోబోతుండటాన్ని గొట్లాం స్టేషన్ వద్ద గమనించిన లైన్‌మన్, టోకెన్ పోర్టర్లు స్టేషన్‌కు సమాచారమందించారు. వెంటనే స్టేషన్ సిబ్బం ది ∙బొకారో ట్రైన్ డ్రైవర్లక సమాచారమందించారు. దీంతో డ్రైవర్లు గరుగుబిల్లి వద్ద ట్రైన్‌ను నిలిపివేసి కిందికి దిగమని కేకలు వేశారు. అయినా మత్తు వీడని ప్రయాణికుడు చేతులు మీదికెత్తుతూ కాసేపు హల్చల్ చేశాడు. చివరకు కొందరు మీదికి ఎక్కి మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడ్ని కిందికి నెట్టేశారు. వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని బొబిŠబ్లి స్టేషన్‌కు తరలించారు. మద్యం మత్తులో ఉండడం వల్ల వివరాలు చెప్పలేకపోతున్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. -
విజయనగరానికి కార్పొరేషన్ హోదా
సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ : విజయ‘నగరానికి’ మహర్దశ కలగనుంది. కార్పొరేషన్ హోదా రావడంతో కేంద్రం నుంచి నిధుల మంజూరు శాతం రెట్టింపుకానుంది. మౌలిక వసతులు కలగనున్నాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయన్న ఆశలు పట్టణ వాసుల్లో చిగురిస్తున్నాయి. విజయనగరం మున్సిపాలిటీ 1888 ఏర్పడింది. 1998 నుంచి సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీకి చేరింది. 57.01 చదరపు కిలోమీటర్ల పరిధిలో మున్సిపాలిటీ విస్తరించి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం విజయనగరం పట్టణంలో 2,44,598 మంది జనాభా నివసిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీకి వస్తున్న ఆదాయం రూ.21 కోట్లు కాగా.. ఖర్చు రూ.15 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇవే ప్రామాణికాలతో విజయనగరానికి ప్రభుత్వం కార్పొరేషన్ హోదా కల్పించడం పట్టణవాసుల్లో ఆనందం నింపుతోంది. చిగురిస్తున్న ఆశలు... కార్పొరేషన్‌గా ఆవిర్భవించిన విజయనగరం పరిధిలోని సుమారు 300 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న డ్రైనేజీ వ్యవస్థ ఎంత వరకు గాడిన పడుతుందన్న భావన వ్యక్తమవుతోంది. విజయనగరంలో అన్ని ప్రధాన కాలువలతో పాటు చిన్నపాటి కాలువలు సైతం వందేళ్ల కిందట ఏర్పాటు చేసినవే. కాలక్రమంలో వాటిని మరమ్మతులు చేయడం మినహా ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పు చేయలేదు. గత పాలకవర్గాల హయాంలో ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపించినా మోక్షం కలగలేదు. దీనికి డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాలంటే రూ.300 కోట్ల మేర ఖర్చు కావడమేనన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వాలు సైతం నిధులు కేటాయింపునకు ముందుకు రాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముంపు సమస్యకు మోక్షం కలగలేదు. ముంపు ప్రాంతాలకు విముక్తి..! పట్టణంలోని పెద్దమార్కెట్, పుచ్చలవీధి, మేదరవీధి, కోలగట్లవారివీధి, న్యూపూర్ణా జంక్షన్, పాతబస్టాండ్ డ్రైనేజీల నుంచి వచ్చే మురుగు, వర్షపు నీటితో పెద్దచెరువు నిత్యం నిండుగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతున్న నేపథ్యంలో చెరువు కింద సాగుభూమి విస్తీర్ణంతో పాటు చెరువునీటి వినియోగం కూడా తగ్గుతోంది. అధిక వర్షాల కురిసే సమయంలో చెరువునీటి మదుముల తలుపులు తెరుస్తున్నారు. దీంతో పెద్దచెరువుకు దిగువ భాగంలోని సాగుభూమికి ఆనుకొని ఉన్న తోటపాలెం, సిద్ధార్థనగర్, సాయినగర్, భవానీనగర్, గాయత్రీనగర్ ప్రాంతాలు మురుగునీటితో మునిగిపోతాయి. మరోవైపు నిండిన చెరువులోని మురుగునీరు ఉత్తరాన ఊరు పైభా గంలో నిల్వ ఉండి∙న్యూపూర్ణా జంక్షన్ పెద్దమార్కెట్, మున్సిపల్ కార్యాలయం ప్రాంతంముంపునకు కారణమవుతోంది. ఈ సమస్యలకు పరిష్కారం లభించనుంది. తాగు నీటి సరఫరాపై అంచనాలు.. ప్రస్తుత అధికారిక లెక్కల ప్రకారం నగరంలో ఉన్న జనాభాకు ప్రతిరోజు నీటిని సరఫరా చేయాలంటే 36 ఎంఎల్డీ అవసరం. ప్రస్తుతం మధుపాడ రక్షిత మంచి నీటి పథకం నుంచి 2 ఎంఎల్డీ నీరు, నెల్లిమర్ల, రామతీర్థం రక్షిత మంచి నీటి పథకాల నుంచి మరో 12 ఎంఎల్డి నీరు మాత్రమే సరఫరా అవుతోంది. మరో 22 ఎంఎల్డీ నీరు కొరత కనిపిస్తోంది. వేసవిలో నెల్లిమర్ల మీదుగా ప్రవహించే చంపావతి నది ఎండిపోవటంతో భూగర్భజలాలు తగ్గిపోయి నీటి కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది తాటిపూడి జలాశయంలోనీరు అడుగంటి పోవటంతో తాగు నీటి కష్టాలు తీవ్ర రూపం దాల్చాయి. రామతీర్థసాగర్ ప్రాజెక్టు నుంచి దశాబ్దాల కిందట వేసిన పైప్‌లైన్, పథకాలకు మోటార్లు బిగించడం, జనరేటర్, ట్రాన్స్‌ఫార్లర్ల సదుపాయం కల్పించడం వంటి పనులు నత్తనడకన సాగుతున్నాయి. మొత్తం 313 కిలోమీటర్ల పైప్లైన్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఏడాది వ్యవధిలో కేవలం 200 కీలోమీటర్ల మేర పూర్తి చేయగలిగారు. ఈ పథకంలో రెండవ ప్యాకేజీ కింద చేపడుతున్న పనుల్లో పూల్‌బాగ్‌కాలనీ శివారుల్లో ఉన్న వ్యాసనారాయణమెట్ట ప్రాంతంలో రూ.96 లక్షల వ్యయంతో 5 లక్షల లీటర్ల నీటి సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తియితే ప్రజలకు తాగు నీటి కొరత తీరుతుంది. మరోవైపు 40 వార్డులుగా విస్తరించిన నగరంలో వీధి దీపాల నిర్ణహణపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. సిబ్బంది పెరిగితే చాలు... విజయనగరం పట్టణంలో పారిశుద్ధ్య సమస్యకు సిబ్బంది కొరతే కారణమన్న వాదన వినిపిస్తోంది. మున్సిపాలిటీగా ఉన్న సమయంలో 275 మంది రెగ్యులర్ సిబ్బంది, 275 ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కాలక్రమంలో పలువురు సిబ్బంది మరణించటంతో రెగ్యులర్ కార్మికుల సంఖ్య 230 తగ్గింది. తాజాగా కార్పొరేషన్ హోదా దక్కించుకోవడంతో సిబ్బంది సంఖ్య పెరిగితే పారిశుధ్యం మెరుగవుతుందన్న ఆశ వ్యక్తమవుతోంది. పార్కులకు కొత్త హంగులు...! కార్పొరేషన్ హోదాతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పార్కులు కొత్త హంగులు సంతరించుకునేందుకు అవకాశం ఉంది. 40 వార్డుల్లో 40 వరకు పార్కులుండగా వాటి నిర్వహణ గత 15 ఏళ్లలో పట్టించుకోలేదు. వాస్తవానికి ఇందులో కొన్ని ఉడా పరిధిలో ఉండగా.. మరికొన్ని మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి. కార్పొరేషన్ హోదాతో పార్కులను సుందరంగా అలకరించేందుకు ఆస్కారం ఉం టుంది. పక్కనేఉన్న జీవీఎంసీ తరహా పట్టణంలోని ప్రధాన కూడళ్లను పచ్చని నందన వనాల్లా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా పట్టణ రూపరేఖలు మారిపోనున్నాయి. -
మహిళలకు రక్షణ చక్రం
సాక్షి, విజయనగరం : గంట్యాడ మండలానికి చెందిన ఓ వివాహితను భర్త, అత్త, ఆడపడుచులు కొంతకాలంగా వేధిస్తున్నారు. వేధింపులు తాళలేక ఆమె గృహహింస నిరోధక విభాగాన్ని ఆశ్రయించింది. బొబ్బిలి మండలానికి ఓ వివాహిత తనను భర్త, అత్తమామలు వేధిస్తున్నారని గృహ హింస నిరోధక విభాగాన్ని ఆశ్రయించింది. ఈ ఇద్దరే కాదు.. నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలకు వేధింపులు ఎదురవుతున్నాయి. అలాంటి బాధితులకు గృహహింస చట్టం విభాగం అండగా నిలుస్తోంది. అత్తింటి వారి వేధింపులు భరించలేక ఇటీవల కాలంలో మహిళలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. భర్త వేధించాడనో, అత్త వేధిస్తోందనో మనస్థాపంతో చాలా మంది వివాహితలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనివల్ల వారి పిల్లలు దిక్కులేని వారిగా మిగులుతున్నారు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం 2005లో గృహహింస నిరోధక చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ చట్టం మహిళలకు కొండంత అండగా నిలుస్తోంది. భర్త, అత్త లేదా ఇతర కుటుంబ సభ్యుల వల్ల వేధింపులకు గురయ్యే వారు నేరుగా గృహహింస చట్టం సిబ్బందికి ఫిర్యాదు చేసినట్టయితే ఉచితంగా న్యాయ సహాయాన్ని అందిస్తారు. గృహహింస విభాగంతో పాటు అదనంగా వన్‌స్టాప్ క్రైసిస్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. న్యాయసహాయంతో పాటు అత్యాచారానికి గురైన మహిళలకు వైద్య సహాయం కూడా అందిస్తారు. గృహహింస అంటే.. శారీరకంగా.. లేదా మానసికంగా లేదా మాటల ద్వారా ఉద్వేగపరిచినా గృహహింస కిందకు వస్తుంది. ఆర్థిక, లైంగిక హింసలు, బెదిరించడం, భయపెట్టడం, దౌర్జనానికి పాల్పడటం, ఆరోగ్యాన్ని కుంటుపరిచే విధంగా వ్యవహరించే చర్యలన్నీ గృహహింస కిందకు వస్తాయి. ఈ చట్టం ప్రకారం బాధితురాలు, ప్రతివాది మధ్య సంబంధం భార్యభర్తల సంబంధమే కానవసరం లేదు. పుట్టుక ద్వారా లేదా పెళ్లి ద్వారా, దత్తత ద్వారా కలిసి ఉంటున్న వారైనా.. ఒకే ఇంట్లో ప్రస్తుతం లేదా గతంలో కలిసి నివసిస్తున్న స్త్రీ, పురుషులు ఈ చట్టపరిధిలోకి వస్తారు. గృహహింసకు గురైన మహిళ నేరుగా లేదా ఎవరితోనైనా హింస జరుగుతుందని, జరగబోతుందని రక్షణ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. బాధితులకు చట్టపరమైన సహాయం, ఉచిత న్యాయ సేవలు, ఆర్థిక సహాయం, పిల్లల సంరక్షణ తదితర బాధ్యతల విషయంలో రక్షణాధికారి చర్యలు తీసుకోవాలి. ఆశ్రయం అందించే సంస్థలు, వైద్య సహాయం సమాచారం బాధితురాలికి అందజేయాలి. గృహహింస నిరోధక కార్యాలయంలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ఒక లీగల్ కౌన్సిలర్, ఒక సోషల్ కౌన్సిలర్, ఇద్దరు హోంగార్డులు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నారు. మహిళల హక్కులు స్త్రీ తాను జీవితాంతం వివాహం చేసుకోకుండా ఉండాలని నిర్ణయించుకుంటే దాన్ని హక్కుగా గౌరవించాలి ఈ హక్కును కుటుంబంలోని అన్నదమ్ములు, తల్లిదండ్రులు అడ్డుకోలేరు. 18 ఏళ్లు నిండిన మహిళ తన ఇష్టం వచ్చిన పురుషుడిని వివాహం చేసుకోవచ్చు. భార్య ఉన్న పురుషుడిని వివాహం చేసుకోవడానికి వీల్లేదు. హిందూ మహిళ తనకు 18 ఏళ్లు నిండేవరకు వివాహం చేసుకోకుండా ఉండవచ్చు. ముస్లిం మహిళ తన 15 లేదా 18 ఏళ్లు నిండే లోపు జరిగిన వివాహాన్ని తిరస్కరించవచ్చు. ఈ హక్కును వాడుకోవాలనుకుంటే ఆమె తన భర్తతో లైంగిక సంబంధం కలిగి ఉండరాదు. మహిళను బలవంతంగా కాపురానికి తీసుకుని వెళ్లే హక్కు ఎవరికి లేదు. 18 ఏళ్లు నిండని బాలికను ప్రేమ పేరుతో తీసుకుని వెళ్లి వివాహం చేసుకుంటే.. సెక్షన్ 366 ప్రకారం యువకునికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించవచ్చు. ఏ స్త్రీ అయినా భర్త బతికి ఉండగా మరో వ్యక్తిని వివాహం చేసుకోవడానికి వీల్లేదు. అలా వివాహం చేసుకుంటే నేరం. ముస్లిం మహిళల విషయంలో ఈ నిబంధన చెల్లదు. వివాహమైన ఏ మతానికి చెందిన మహిళ అయినా భర్తతో కాక మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోరాదు. -
సీఎం సారూ.. మీకు రుణపడి ఉంటాం
సాక్షి, చీపురుపల్లి(విజయనగరం) : అసలే పేదరికం. ఆపై కేన్సర్‌తో సతమతం... ఆ కుటుంబం పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. ఇక పెట్టుబడి పెట్టలేక మరణమే శరణ్యమనుకుంటున్న వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారిని ఆదుకున్నారు. సీఎం సహాయ నిధినుంచి పెద్ద మొత్తం కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు వారికి కొండంత బలం చేకూరింది. మళ్లీ బతికి మామూలుగా తిరుగాడుతామన్న నమ్మకం కలిగింది. ఇదీ చీపురుపల్లి పట్టణంలో ఓ కుటుంబం దీన గాథ. చీపురుపల్లి పట్టణం కొద్దగవిడి వీధికి చెందిన రవికుమార్ ఓ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆయన తండ్రి సీతారామమూర్తి ఆర్ఈసీఎస్లో ఉద్యోగ విరమణ చేయగా ఆయనకు పింఛన్ సౌకర్యం కూడా లేదు. ఈ పరిస్థితుల్లో దాదాపు ఎనిమిది నెలల క్రితం రవికుమార్ భార్య ఉషారాణికి బ్లడ్ కేన్సర్ మహమ్మారి సోకింది. ఆస్పత్రుల్లో చూపిస్తే బోన్‌మేరో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలనీ, అందుకు రూ.16 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఆ స్థాయిలో వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ అప్పులు చేసి విజయవాడ ఆస్పత్రిలో చికిత్స ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకోగా కేవలం రూ.2 లక్షలు కేటాయిస్తున్నట్టు ప్రకటించినా ఆ నిధులు వచ్చేలోగానే ఎన్నికలు రావడం, గడువు ముగిసిపోవడంతో ఆ నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. వైఎస్సార్సీపీ నేతల అండతో... రవికుమార్, ఆయన తండ్రి సీతారామ్మూర్తి జూన్ నెలాఖరున మండల వైఎస్సార్సీపీ నాయకులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, ఇప్పిలి అనంతంలను ఆశ్రయించారు. వారు జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వకర్త మజ్జి శ్రీనివాసరావు దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఆయన ఎలాంటి జాప్యం చేయకుండా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణకు సమస్య వివరించారు. అంతే జూలై 1న అమరావతి చేరుకుని అక్కడ మంత్రి బొత్సను కలిసి, ఆయన లేఖతో బాటు బాధితురాలు ఉషారాణికి వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలతో పూర్తి నివేదిక అందించారు. జూలై 2న తేదీ సాయంత్రం సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఆ ఫైల్‌ను ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యాలయానికి సమర్పించారు. జూలై 4న బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎంతో రుణపడి ఉంటాం.. నా భార్యకు కేన్సర్‌సోకి చికిత్స చేయించేందుకు నానా అవస్థలు పడుతున్నాం. మా నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు, మంత్రి బొత్ససత్యనారాయణ చొరవ చూపడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రూ.5 లక్షలు మంజూరు చేశారు. ఇంత త్వరగా మా సమస్యపై ముఖ్యమంత్రి స్పందించడం చాలా గొప్ప విషయం. జగన్మోహన్రెడ్డి మాటల మనిషి కాదు చేతల మనిషి అని రుజువైంది. 48 గంటల్లో సహాయం అందించడం గతంలో ఎప్పుడూ వినలేదు. మాకు చాలా పెద్ద సహాయం ప్రభుత్వం నుంచి వచ్చింది. రూ.9 లక్షలు అవసరమని కోరగా అందులో యాభై శాతం కంటే ఎక్కువగా రూ.5 లక్షలు మంజూరు చేశారు. సిఎం జగన్మోహన్రెడ్డి చేసిన మేలు జీవితంలో మరిచిపోలేము. – రవికుమార్, ఉషారాణి దంపతులు -
మరపురాని మహానేత
ఆపదలో ఉన్నవారికి ఆయువుపోశారు. అన్నార్తుల ఆకలి తీర్చారు. జలయ జ్ఞంతో ప్రాజెక్టులను పరుగులెత్తించారు. పాడిపంటలకు జీవం పోసి రాష్ట్రాన్ని సుభిక్షం చేశారు. సంక్షేమాన్ని జనానికి చేరువచేశారు. మగ్రాభివృద్ధి అంటే ఏమిటో రుచిచూపించారు. అన్ని వర్గాలకూ ఆసరాగా నిలిచి అందరికీ దేవుడయ్యారు. ఖరీదైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించారు. పల్లెలకే ఆస్పత్రులు తరలివచ్చే ప్రక్రియను జయవంతం చేశారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువు ఉచితంగా అందించారు. ఆపదలో ఆదుకునేందుకు 108 ప్రవేశపెట్టారు. ఆయన పాలనా కాలం స్వర్ణయుగంగా మార్చారు. అంతేనా... దేశంలో అన్ని రాష్ట్రాలకూ ఆదర్శప్రాయుడిగా నిలిచారు. ఆయనే డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి. ఆయన భౌతికంగా దూరమై దశాబ్దం గడిచినా ఇంకా జనం మదిలోనే ఉన్నారు. సాక్షి , విజయనగరం : రామరాజ్యం అంటే వినడమే తప్ప చూసింది లేదు. కానీ రాజన్నరాజ్యాన్ని ఇప్పటితరంవారంతా చూశారు. ఆయన పాలనలో ఎంతో మంది లబ్ధి పొందారు. అన్ని వర్గాలవారికీ ఏదో రూపంలో సాయం అందించారు. ఆయన పాలనా కాలాన్ని ఇప్పటికీ స్వర్ణయుగంగానే భావిస్తుంటారు. అలాంటి గొప్ప పాలకుడు... మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని పావురాలగుట్ట మింగేసిందని తెలిసి జిల్లాలో 17 మంది తనువు చాలించారు. ఆనాడు ఉబికిన కన్నీటి ఉప్పెన తడి నేటికీ ఆరలేదు. తన తండ్రిపై అంతటి ప్రేమాభిమానాల ను పెంచుకున్న కుటుంబాలను వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి 2011, మార్చి, మే నెలాఖరులో ఓదార్పు యాత్ర నిర్వహించి ఓదా ర్చారు. నేడు సీఎం అయి తన తండ్రి వైఎస్ఆర్ ఆశయ సాధనకు జగన్ పాటుపడుతున్నారు. నేడు ఆ మహా నాయకుడి 70వ జయంతి. జిల్లాలో ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి చిరస్మరణీయం. ఆయన పథకాలతో లబ్ధిపొందినవారి జీవితాలు ఎందరికో సాక్షీభూతం. ప్రజాప్రస్థానంతో చేరువ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2003లో రాష్ట్రంలో చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర జిల్లాలో ఓ చరిత్ర సృష్టించింది. నాడు ఆయన జిల్లాలో పర్యటించి ప్రతి ఒక్కరిని పలకరించా రు. జనం గుండెతట్టి వారి బాధలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిగా తరతమ భేదాలు చూడకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించారు. అందుకే ఆయన్ను జనం తమ గుండెల్లో గుడి కట్టుకుని నేటికీ పూజిస్తున్నారు. ఆయన హయాంలో అడిగిన వారందరికీ ఫీజులు, స్కాలర్ షిప్పులూ అందజేశారు. అప్పట్లో ఎంత మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నా వారికి ఫీజులు చెల్లించేవారు. వారి పేరున కళాశాలల యాజామాన్యాల ఖాతాల కు ఆ డబ్బులు చేరేవి. అలా 2009 నుండి 2014 సంవత్సరాలకు సంబంధించి స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ పొందినవారు 2లక్షల98 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఇందుకోసం రూ.318 కోట్లను వైఎస్ ప్రభుత్వం వెచ్చించింది. విజయనగరంలో యూత్ హాస్టల్ ఆయన చలవే... విజయనగరం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ దగ్గరలోని కనపాకలో యూత్ హాస్టల్ భవనాన్ని వైఎస్ నిర్మించారు. పట్టణానికి శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరించి... నిరంతరం జనానికి నీరందించేందుకు వీలుగా నిర్మించతలపెట్టిన తారకరామతీర్థసాగర్‌కు బడ్జెట్ భారీగానే కేటాయించారు. 2004 నుంచి 2009 వరకు చీపురుపల్లి నియోజకవర్గంలో రూ. 84 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ, సుజలధార తాగునీటి పధకాన్ని నియోజకవర్గానికి మంజూరు చేశారు. చీపురుపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల, టీటీడీ కల్యాణ మండపాలు మంజూరయ్యాయి. వేపాడ మండలంలో విజయరామసాగర్‌ను మినీరిజర్వాయర్‌కు వైఎస్సార్ నిధులు మంజూరు చేశారు. సాలూరు నియోజకవర్గంలోని మెం టాడ, పాచిపెంట, సాలూరు మండలాల్లోని గ్రామాలకు రహదా రులు, వంతెనల నిర్మాణాలు జరిగాయి. ఆపదలో ఆదుకునే అపరసంజీవిని జిల్లాలో ఏ పల్లెలోనైనా ఆపద సంభవిస్తే వెంటనే అక్కడివారిని ఆస్పత్రికి ఉచితంగా తరలించేందుకు ప్రవేశపెట్టిన 108 వాహనాలను పెద్ద సంఖ్యలో సమకూర్చారు. నాడు ప్రతి రెండు మండలాలకు ఒక వాహనం ఉండటంతో ఫోన్ చేసిన క్షణంలోనే వాహనాలు ప్రత్యక్షమయ్యేవి. ఇకదీర్ఘకాలిక వ్యాధులకు ఉచితంగా తనిఖీలు నిర్వహించడమే గాకుండా మందులు కూడా అందించేందుకు వీలుగా పల్లెలకే 104 వాహనాలను పంపించే ఏర్పాటు చేశారు. దీనివల్ల లక్షలాదిమంది లబ్ధి పొందారు. నిరుపేదలు చిన్నపాటి రోగానికి వైద్యం పొందలేక మరణాన్ని ఆశ్రయిస్తుంటే ఆరోగ్యశ్రీతో ఆదుకుని లక్షల విలువైన కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించే ఏర్పాటు చేశా రు. దానివల్ల జిల్లాలో లక్షలాది మంది లబ్ధిపొంది ఈ రోజు సంపూ ర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నారు. అడగకుండానే అన్నీ ఇచ్చి... నాడు నష్టాల్లో కూరుకుపోయిన రైతాంగానికి రుణమాఫీ చేసిన ఘనత కూడా రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. ఆయన హయాంలో జిల్లాలోని వేలాదిమంది రైతులకు రుణమాఫీ జరిగి ప్రతి ఇంటా ఆనందాన్ని విరబూయించారు. కిలో రెండు రూపాయలకే బియ్యాన్ని అందించి పేదలకు మేలు చేశారు. కేవలం రూ. 75లు మాత్రమే ఉన్న సామాజిక పింఛన్‌ను రూ. 200కు పెంచిన అవసానదశలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు బతుకుపై భరోసా కల్పించారు. ఇవన్నీ జిల్లావాసులు మరచిపోలేదు. అందుకే ఆనాటి స్వర్ణయుగం మళ్లీ వైఎస్ తనయుడితో వస్తుందన్న నమ్మకంతో జగన్మోహన్రెడ్డి విజయానికి ఎంతగానో పాటుపడ్డారు. జిల్లాలోని తొమ్మిది శాసనసభ, ఎంపీ స్థానాన్ని వైఎస్సార్సీపీకి కట్టబెట్టారు. ఆయన సైతం తండ్రిబాటలో నడుస్తూ సంక్షేమానికి పాటుపడుతున్నారు. వైఎస్ జయంతిని రైతు దినోత్సవంగా జరపాలని నిర్ణయించారు. అంతేగాకుండా ఆయన పేరుతో వినూత్నంగా పింఛన్ పథకాన్ని ప్రారంభించనున్నారు. వైఎస్ ఆశయ సాధనకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నారు. అపరభగీరథుడు వైఎస్ మహానేత రాజశేఖరరెడ్డి జిల్లాలో అనేక సాగునీటి ప్రాజెక్టులు కట్టించి అపరభగీరథునిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా గరుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద నిర్మించిన ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసి ఆయన హయాంలోనే 90శాతం పనులు పూర్తి చేయించారు. అంతేగాకుండా... బొబ్బిలి, తెర్లాం, బాడంగి మండలాలను కలుపుకుంటూ తోటపల్లి సాగునీటి కాలువ ఏర్పాటైంది. గజపతినగరంలో తోటపల్లి చానల్ ద్వారా సుమారు 3వేల ఎకరాలకు పైలాన్ ప్రారంభోత్సవం చేశారు. కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద జంఝావతి ప్రాజెక్టు ఆస్ట్రియా సాంకేతిక పరిజ్ఞానంతో ఒడిశాతో ఉన్న సరిహద్దు వివాదంతో సంబంధం లేకుండా రబ్బర్ డ్యామ్‌ను రూ. 6 కోట్లతో నిర్మించి దేశంలోనే సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఆ డ్యామ్ వల్ల 3వేల ఎకరాలకు సాగునీటిని అందించారు. పార్వతీపురం మండలం అడారిగెడ్డ నిర్మాణానికి కూడా నిధులు కేటాయించారు. జలయజ్ఞంలో భాగంగానే పెద్దగెడ్డ రిజర్వాయర్ నిర్మించారు. తాటిపూడి జలాశయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. వెంగళరాయ సాగర్, ఆండ్ర రిజర్వాయర్ ఆధునికీకరణకు నిధులు విడుదల చేసి జిల్లాను సస్యశ్యామలంగా మార్చేందుకు తనవంతు కృషి చేశారు. మక్కువ మండలంలో సురాపాడు ప్రాజెక్టు నిర్మించార. నెల్లిమర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోగల పంట పొలాలకు సాగునీటిని అందించేందుకు తారకరామతీర్థసాగర్ సాగునీటి ప్రాజెక్టును మంజూరు చేశారు. దీని కోసం 2007లోనే సుమారు రూ. 187 కోట్లను విడుదల చేశారు. నెల్లిమర్ల పట్టణంతో పాటు గుర్ల, గరివిడి మండలాలకు తాగునీటిని అందించేందుకు రామతీర్థం మంచినీటి పధకాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. చక్కెర కర్మాగారానికి కొత్త ఊపిరి జిల్లాలోని భీమసింగిలో గల ఏకైక సహకార చక్కెర కర్మాగారం మూతపడటంతో దానిపై ఆధారపడిన వందలాది కార్మికుల బతుకులు దుర్భరంగా మారాయి. చెరకు పండించే రైతులకు భరోసా లేకుండా పోయింది. పాదయాత్రగా జిల్లాకు వచ్చిన మహానేత దాని పరిస్థితిని స్వయంగా పరిశీలించి దానిని తెరిపించేందుకు హామీ ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి ఆయన ముఖ్యమంత్రి కాగానే పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి కర్మాగారాన్ని తెరిపించి మళ్లీ కార్మికులు, రైతుల్లో ఆనందాన్ని నింపారు. -
గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టు
సాక్షి, విజయనగరం: గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టు అయింది. జిల్లాలోని పాచిపెంట మండలం.. ఆంధ్రా, ఒడిషా సరిహద్దులో భారీ ఎత్తున అక్రమ రవాణా చేస్తున్న గంజాయి బయటపడింది. మండల పోలీసులు.. గంజాయి స్మగ్లర్లపై ముందస్తు సమాచారంతో సరిహద్దులో ప్రాంతంలో వాహనాలను తనిఖీలు చేశారు. దీంతో పోలీసుల తనిఖీలను పసిగట్టిన స్మగ్లర్లు గంజాయి ఉన్న తమ వ్యాన్‌ను వేగంగా నడిపి ఓ చోట బోల్తా కొట్టించి పరారయ్యారు. పరారైన గంజాయి స్మగ్లర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బోల్తా పడిన వ్యాన్‌లో సుమారు వందకుపైగా బ్యాగుల్లో ఉన్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
వివక్షకు కేరాఫ్ ‘మాన్సాస్’
రాజరికాలు పోయినా... వారి సంస్థలో మాత్రం ఆ పోకడలు కొనసాగుతున్నాయి. అక్కడ వారి మాటే వేదం... వారు చెప్పిందే శాసనం. కాదని ఎవరైనా ఎదురు తిరిగితే వారి బతుకు బస్టాండే. ఏళ్ల తరబడి ఉద్యోగాలు చేస్తున్నా... దయనీయమైన వేతనాలే అందుతున్నాయి. ఇదేమని ప్రశ్నిస్తే... వారి విభాగానికి ఎసరు పెడుతున్నారు. ఉన్న ఉద్యోగం కాస్తా తీసేసి నడిరోడ్డుకు నెట్టేస్తున్నారు. దళితులకు ఎక్కడ కీలకపదవులు ఇవ్వాల్సి వస్తుందోనని వారి ఆధ్వర్యంలోని కోర్సును రద్దు చేసేస్తున్నారు. ప్రజల దృష్టిలో సేవ చేస్తున్నామని చెప్పుకోవడానికి... ప్రభుత్వానికి తమ ఆస్తులు అందనీయకుండా చేయడానికి... జయనగరం రాజులు నడుపుతున్న మాన్సాస్‌లో ఈ విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. సాక్షి , విజయనగరం : విజయనగరంలోని మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న అనేక విద్యాసంస్థల్లో మహారాజా పోస్టు గ్యాడ్యుయేట్ కళాశాల ఒకటి. దానిలో 14 విభాగాలు ఉన్నాయి. అందులో బోధన, బోధనేతర సిబ్బంది మొత్తం 50 మంది వరకు ఉన్నారు. మహారాజా పోస్టు గ్రాడ్యూయేట్ కళాశాల పేరుతో 1996 జూన్ 30న ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి మాన్సాస్ ట్రస్ట్ శాశ్వత అనుబంధ పత్రం పొందింది. దీని ప్రకారం యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం బోధన సిబ్బందికి వేతనాలు అమలు చేయాలి. అధ్యాపకేతర సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం జీతభత్యాలు చెల్లించాలి. కానీ వాటిని ఏమాత్రం పాటించకుండా 20 ఏళ్లుగా అన్యాయం చేస్తోంది. ఎన్ని సార్లు రాతపూర్వకంగా వినతులు సమర్పించినా... మాన్సాస్ ట్రస్ట్ పట్టించుకోవడం లేదు. అధ్యాపక అర్హతతో విధులు నిర్వర్తిస్తున్న వారికి యూజీసీ నిబంధనల ప్రకారం రూ.లక్ష నుంచి రూ.లక్షా యాభైవేల వరకు వేతనాలు ఇవ్వాల్సి ఉన్నా... 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్న సీనియర్ అధ్యాపకునికి ప్రస్తుతం కేవలం రూ.25 వేల వేతనం మాత్రమే ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వేతన నిబంధనల మేరకు బోధనేతర సిబ్బందికి రూ.18 వేల వేతనాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.5 నుంచి 10 వేల లోపు మాత్రమే ఇస్తున్నారు. పదవీ విరమణ ఉద్యోగులకు భోగాలు ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నవారికి పదోన్నతులు కల్పించాల్సి వస్తుందని... అప్పటికే తమకు నమ్మకంగా ఉండి పదవీ విరమణ చేసినవారిని ఉన్నత పదవుల్లో నిలబెట్టి రూ.85 వేల నుంచి రూ.లక్ష వరకు గౌరవ వేతనాలు ముట్టజెబుతోంది. ఓ వైపు ప్రభుత్వ పింఛన్ పొందుతున్న వారికి మరోవైపు సంస్థ భారీ వేతనాలు ఇవ్వడంపై అనేక అరోపణలు వస్తున్నా సంస్థ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కానీ యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల ప్రకారం జీతాలు చెల్లించమని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్న అధ్యాపకులపై కఠినంగా వ్యవహరిస్తోంది. నచ్చితే పనిచేయండి లేకపోతే మానేయండని హెచ్చరికలిస్తూ పరోక్షంగా భయపెడుతోంది. మొండిగా పోరాడే అధ్యాపకులను ఏమీ చేయలేక వారిని వదిలించుకోవడానికి సంబంధిత విభాగాన్ని రద్దు చేసి తమ వైఖరిని చాటుకుంటోంది. సీనియారిటీ ఉన్నా.. దళితులకు దక్కని పదవులు మరోవైపు సీనియార్టీ ప్రకారం ఉన్నత పదవులు దక్కాల్సిన దళిత అధ్యాపకులకు అన్యాయం జరుగుతోంది. విద్యార్థుల డిమాండ్ ఉన్నప్పటికీ ఆ విభాగాన్ని రద్దు చేసి పదవులకు అర్హత లేకుండా చేస్తోంది. ఉదాహరణకు కళాశాల స్థాపించినప్పటి నుంచి ఉన్న హిస్టరీ విభాగంలో డాక్టర్ అంబేడ్కర్ అశోక్ అనే అధ్యాపకుడు పనిచేస్తున్నారు. పలు విద్యాధిక అర్హతలతో ఉన్న ఆయన సీనియార్టీకి కళాశాల డైరెక్టర్ పదవి ఇవ్వాలి. ఆయన తన సీనియార్టీని గుర్తించి యూజీసీ వేతనం ఇవ్వాలని పలుమార్లు సంస్థను కోరారు. కానీ దళితుడైన ఆయనకు డైరెక్టర్ పదవి ఇవ్వడానికి ఇష్టం లేక చివరికి ఆయన పనిచేస్తున్న హిస్టరీ విభాగాన్ని గత ఏడాది రద్దు చేశారు. సోషల్ వర్క్ విభాగం కూడా అదేమాదిరిగా రద్దు చేశారు. నిజానికి ప్రతి ఏడాది విద్యార్థుల డిమాండ్ అధికంగా ఉన్న కోర్సుల్లో ఈ రెండూ నిలుస్తున్నా... కేవలం దళితులకు ఉన్నత పదవులు ఇవ్వడానికి ఇష్టం లేకే రద్దు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. దళితునికి డైరెక్టర్ ఇవ్వాల్సి వస్తుందనే... కళాశాలలో 20 ఏళ్ల సీనియార్టీతో హిస్టరీ విభాగంలో అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. ఇప్పటి వరకు రూ.25 వేలు వేతనం దాటడం లేదు. యూజీసీ వేతనాలు అమలు చేస్తే రూ.1.5 లక్షల నెలవారీ వేతనం వస్తుంది. కొన్నేళ్లుగా వేతనాలు ఇవ్వకుండా మాన్సాస్ సంస్థ దోచుకుంటోంది. సీనియార్టీ ప్రకారం నాకు డైరెక్టర్ పదవి రావాల్సి ఉంది. దళితుడినైన నాకు ఆ పదవి ఇవ్వడానికి ఇష్టం లేక హిస్టరీ విభాగాన్ని గత ఏడాది రద్దు చేశారు. – డాక్టర్ ఎస్.అంబేడ్కర్ అశోక్, కార్యదర్శి, మాన్సాస్ పీజీకాలేజీ టీచింగ్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్. -
ఏమిటీ శిక్ష?
సాక్షి, విజయనగరం: సర్వశిక్ష అభియాన్‌లో ఔట్ సోర్సింగ్ విధానంలో నాన్ టీచింగ్ స్టాఫ్‌గా ఎంపికైన యాభై ఎనిమిది మందికి నేటికీ నియామక పత్రాలు అందలేదు. గతంలో ప్రాజెక్టు ఆఫీసర్ చేపట్టిన నియామకాలపై అభ్యంతరాలున్నాయని ప్రస్తుత పీఓ అంటుంటే ... జిల్లా కలెక్టర్ అనుమతిచ్చినా ప్రాజెక్టు ఆఫీసర్ అడ్డుతగులుతున్నారని అభ్యర్థులు వాపోతున్నారు. నిజానికి సమాధానం చెప్పాల్సిన ఔట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు ముఖం చాటేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. చేసేది లేక అభ్యర్థులంతా సర్వశిక్ష అభియాన్ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నారు. జిల్లాలో సర్వశిక్షాభియాన్ ఆధ్వర్యంలోని కేజీబీవీ పరిధి వివిధ కేటగిరీలో ఉన్న నాన్ టీచింగ్ 134 పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీకి గతేడాది ఎంపిక ప్రక్రియ చేపట్టి, పూర్తి చేశారు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీ 58 మందిని వివిధ పోస్టులకు ఎంపిక చేసి జిల్లా కలెక్టర్‌కు అప్పగించింది. గతేడాది డిసెంబర్లో కలెక్టర్ ఆ జాబితా ను అనుమతించారు. ఈ మేరకు 58 మంది అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా అదే నెలలో విడుదల చేశారు. శాపంగా మారిన పాత పీఓ బదిలీ ఈ నియామక ప్రక్రియ జరిగిన సమయంలో ఎస్ఎస్ఏ పీఓగా ఉన్న బి.శ్రీనివాసరావు రాజకీయ కారణాలతో బదిలీ అయ్యారు. అప్పటి మంత్రులు గంటా శ్రీనివాసరా వు, కిమిడి కళావెంకటరావు మధ్య జరిగిన అంతర్యుద్ధ్ధం లో భాగంగా ప్రస్తుత పీఓ ఎం.కృష్ణమూర్తి నాయుడు ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఆయన వచ్చేనాటికే సిద్ధమైన 58 మంది జాబితాను విడుదల చేయకుండా రెండు నెలల పాటు తాత్సారం చేశారు. ఇంతలో ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ వెంటనే సాధారణ ఎన్నికల నోటిఫికేషన్లు వచ్చాయి. ఫలితంగా నియామక ఆదేశాలున్నప్పటికీ అభ్యర్థులకు పోస్టులు రాలేదు. ఇతర జిల్లాల్లో వీరితోపాటే ఎంపిక చేసిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చి నా... ఇక్కడే పెండింగ్‌లో ఉండిపోయింది. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ఎంపికైన అభ్యర్థులు పలుమార్లు కలెక్టర్‌ను కలిశారు. అప్పటి ఆదేశాల మేరకు పోస్టులను పీఓ ఇస్తారని ఆయన చెప్పడంతో అభ్యర్థులు పీఓ కృష్ణమూర్తి నాయుడు వద్దకు వెళ్లారు. కానీ అక్కడ వారికి ప్రతికూల సమాధానం వచ్చింది. తమకు న్యా యం చేయాలని వారంతా సర్వశిక్షాభియాన్ చుట్టూ తిరుగున్నారు. ఈ క్రమంలో ఈ నెల 30వ తేదీతో పాత ఏజెన్సీల కాలపరిమితి ముగుస్తుందని ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల ప్రకటించడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోసారి వారు కలెక్టరేట్ గురువారం వచ్చి కలెక్టర్‌ని కలిసి వేడుకున్నారు. కొత్తగా ఆదేశాలివ్వక్కర్లేదని అప్పటి ఆదేశాలతో పోస్టులను పీఓ ఇవ్వాలని అభ్యర్థులకు కలెక్టర్ హరిజవహర్‌లాల్ వివరించారు. వారు మళ్లీ పీఓ వద్దకు వెళ్లారు. అక్కడ వారికి పాతకథే ఎదురైంది. అయితే గత పీఓ చేపట్టిన నియామక ప్రక్రియలో అభ్యం తరాలున్నాయని ప్రస్తుత పీఓ కృష్ణమూర్తి చెబుతున్నారు. అభ్యర్థులు న్యాయం అడగాల్సింది ఔట్సోర్సింగ్ ఏజెన్సీని లేదా పాత అధికారినేగాని తనను కాదని ఈయన చెబుతున్నారు. మొత్తమ్మీద వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -
డివైడర్ లేక ప్రమాదాలు
సాక్షి, విజయనగరం రూరల్ : మండలంలోని చెల్లూరు–ముడిదాం గ్రామాల మీదుగా జాతీయ రహదారికి ఇరువైపులా డివైడర్లు లేక ప్రమాదాలకు నిలయంగా మారింది. మండలంలోని చెల్లూరు నుంచి ముడిదాం, రీమాపేట గ్రామాల మీదుగా వీటీ అగ్రహారం వరకు సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉన్న జాతీయ రహదారిపై రోడ్డు డివైడర్లు లేకపోవడంతో ఎప్పటికప్పుడు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముడిదాం, రీమాపేట, ప్రశాంతినగర్ గ్రామాలు జాతీయ రహదారికి ఆనుకోవడంతో ప్రజలు బెంబెలెత్తుతున్నారు. విశాఖపట్నం నుంచి విజయనగరం, సాలూరు, పార్వతీపురం ఒడిశాకు రోజూ వేలాది వాహనాలు ఇదే రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటాయి. ట్రాఫిక్ రద్దీ ఎక్కువ కావడం, భారీ వాహనాలు ప్రయాణిస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే జాతీయ రహదారి, పట్టణ శివారు కావడం రోడ్డు చిన్నదైనా వాహన చోదకులు మితిమీరిన వేగంతో ప్రయాణించడంతో గ్రామస్తులు ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు. కనీసం నెలకోసారైనా మూడు కిలోమీటర్ల రోడ్డులో ఎక్కడోచోట రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంటుందని గ్రామస్తులు తెలిపారు. ఉదయం ఏడు గంటల నుండే విద్యార్థులు పాఠశాలలకు సైకిళ్లు, ఆటోలపై రాకపోకలు సాగించడంతో తల్లిదండ్రులు భయం భయంగానే పిల్లలను పాఠశాలలకు సాగనంపుతున్నారు. పాలకులు, ఆర్ ఆండ్ బి అధికారులు స్పందించి రోడ్డు డివైడర్ మంజూరు చేసి నిర్మించాలని ముడిదాం, రీమాపేట, ప్రశాంతినగర్ ప్రజలు కోరుతున్నారు. భయమేస్తోంది రోడ్డు ఇరుగ్గా ఉండటం, భారీ వాహనాలు, కార్లు అతివేగంగా వెళ్లడంతో ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందోనని భయమేస్తోంది. రోడ్డు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవలసిందే. చిన్నపిల్లలు, విద్యార్థులు, వృద్ధులు రోడ్డు దాటాలంటే మనిషి తోటు ఉండాల్సిందే. – తుపాకుల అప్పలరాజు, ప్రశాంతినగర్ డివైడర్లు ఏర్పాటు చేయాలి ముడిదాం, రీమాపేట, ప్రశాంతినగర్ గ్రామాలు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్నాయి. ప్రశాంతినగర్ వద్ద భారీ వాహనాలు రోడ్డు పక్కనే నిలిపేస్తున్నారు. రోడ్డుకు ఇరుకుగా ఉండటం, వాహనాలు అతివేగంగా వెళ్లడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులు డివైడర్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు తగ్గుతాయి. – అలమండ అప్పలరాజు, మాజీ సర్పంచ్, ముడిదాం -
ప్రభుత్వ బడిలో ఉపాధ్యాయుల పిల్లలు
సాక్షి, దత్తిరాజేరు(విజయనగరం) : పేద, బడుగు, బలహీనవర్గాల వారే తమ పిల్లలను అప్పోసప్పో చేసి ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తున్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగులైతే... మరింత పేరున్న ప్రైవేట్ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఉపాధ్యాయుల్లో చాలామంది తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లోనే చదివిస్తుండడం గమనార్హం. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ‘అమ్మఒడి’ పథకం ప్రవేశపెట్టిన సందర్భంలో ఉపాధ్యాయులే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం లేదన్న అంశం తెరపైకి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో పలువురు ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపి తాము ఆదర్శ ఉపాధ్యాయులమని నిరూపించుకున్నారు. వింధ్యవాసి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వై. జగదీశ్వరరావు తమ కుమార్తె రిషితను గోభ్యాం ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో జాయిన్ చేశారు. విజయనగరంలో ఉన్న తమ నివాసాన్ని తన సొం త ఊరైన గొభ్యాంనకు మార్చి మరీ తమ బిడ్డను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అలాగే పోరలి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ముగండి రామారావు తన కుమార్తె ప్రియాంకను గోభ్యాం ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. బొండపల్లి మండలంలో పోస్టుమ్యాన్‌గా పనిచేస్తున్న ఒకరు తన కుమార్తె వైకుంఠం షర్మిలను కూడా గోభ్యాం ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. ఇలాగే మిగతా ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే ప్రభుత్వ విద్యారంగం బలోపేతమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదర్శంగా నిలవాలనే.. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాల వారందరికీ నాణ్యమైన బోధన అందించాలని కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ‘అమ్మఒడి’ అమలు చేస్తున్నారు. నేను నా కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించా.. మిగలిన వారికి ఆదర్శంగా నిలిస్తే వారు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేరుస్తారు. – వైకుంఠం జగదీశ్వరరావు,ప్రభుత్వ ఉపాధ్యాయుడు -
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, విజయనగరం : జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం నుంచి పార్వతిపురం వెళ్తొన్న ఆర్టీసీ బస్సును ఒడిషా నుంచి వస్తోన్న లారీ నెల్లివాడ బ్రిడ్జీపై ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో బొండపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌తో పాటు మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని విజయనగరం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు గాయపడిన వారికి సహయం అందించేలా చర్యలు చేపట్టారు. -
సేవ చేయడం అదృష్టం
సాక్షి, విజయనగరం టౌన్ : రైల్వే హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్థానిక రైల్వే ఇనిస్టిట్యూట్ ఆవరణలో ఆదివారం స్కూల్ బ్యాగ్‌లు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్ ఇతరత్రా వస్తువులను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్‌టౌన్ ఎస్ఐ కిల్లారి కిరణ్ కుమార్ నాయుడు హాజరై మాట్లాడారు. సమాజానికి సేవ చేసే అవకాశం రావడం చాలా గొప్ప అదృష్టమని, ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని, ఉద్యోగంతో పాటూ సేవా కార్యక్రమాలు చేపడుతున్న సభ్యులను అభినందించారు. రైల్వే అసిస్టెంట్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ సత్యనారాయణ, సంస్థ సభ్యులు వైశాఖ్, ఎం.కనకరాజు, నాగేశ్వరరావు, మురళీ, జైశంకర్, మారుతి తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి అక్రమ రవాణా చేస్తూ..
సాక్షి, విజయనగరం : తుమ్మికాపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. వివరాలు.. కారులో గంజాయిని అక్రమంగా తరలిస్తుండటంతో మితిమీరిన వేగంతో ప్రయాణించారు. ఈ సమయంలో విశాఖపట్నం నుంచి వస్తున్న లారీని, అరకు నుంచి వస్తున్న కారు డీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి మార్గమద్యలో మృతి చెందాడు. మరో వ్యక్తికి చికిత్సను అందిస్తున్నారు. కారులో రెండు బ్యాగుల్లో గంజాయి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గంజాయి లోడ్‌తో అతి వేగంగా కారును నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. -
విజయనగరంలో...ఓటెత్తిన జనం
ఎన్నికల క్రతువులో కీలకమైన పోలింగ్ ఘట్టం గురువారం ముగిసింది. ఓట్లు వేసేందుకు ఉదయం ఏడుగంటలనుంచే జనం బారులు తీరారు. గిరిజన ప్రాంతాలకు చెందిన వారైతే ముందురోజు రాత్రే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటింగ్‌కు సన్నద్ధం అయ్యారు. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించినా... అప్పటికప్పుడు వాటిని చక్కదిద్దడంతో పోలింగ్ కొనసాగింది. పలుచోట్ల అధికార పార్టీ కార్యకర్తల దౌర్జన్యాలు పెచ్చుమీరడంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది. విజయనగరం గంటస్తంభం: జిల్లాలో పోలింగ్ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 76.04 శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓట్లు వేసేం దుకు ఈ సారి ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మాక్ పోలింగ్ నుంచి సాయంత్రం వరకు చాలాచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగుకు అంతరాయం ఏర్పడింది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్ది పోలింగు జరిపారు. జిల్లా ఎన్నికల అధికారి హరి జవహర్లాల్ వెబ్కాస్టింగు ద్వారా మొత్తం పోలింగు పక్రియను పర్యవేక్షించగా జిల్లా ఎస్పీ దామోదర్ శాం తి భద్రతలను పర్యవేక్షించారు. జిల్లాలో విజయనగరం, అరకు, విశాఖపట్నం పార్లమెంటు స్థానా నికి, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి గురువారం పోలింగ్ నిర్వహించారు. ఉదయం 5.30గంటలకు అధికారులు మాక్పోలింగు నిర్వహించారు. అనంతరం 7గంటల నుంచి పోలింగు ప్రారంభమై ఓటర్లు ఓటు వేసే అవకాశం కల్పిం చారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో సాయంత్రం 5గంటల వరకు పోలింగు నిర్వహించగా బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం, ఎస్.కోట నియోజకవర్గాల్లో సాయంత్రం 6గంటల వరకు నిర్వహించారు. ఉదయం నుంచి బారులు తీరిన ఓటర్లు పోలింగు కేంద్రాల్లో ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరారు. ఓటు వినియోగంపై అధికారులు చేసిన విస్తృత ప్రచారం సత్ఫలితాలనిచ్చినట్టయింది. ఈసారి అన్ని వర్గాల ఓటర్లు వచ్చి ఓటుహక్కు వినియోంచుకున్నారు. గతంలో ఓటింగు కు యువత, వలస ఓటర్లు దూరంగా ఉండేవారు. ఈసారి వారు కూడా తరలిరావడం విశేషం. గతం కంటే తగ్గిన పోలింగ్ జిల్లాలో అధికారులకు సాయంత్రం 6గంటలకు అందిన సమాచారం మేరకు జిల్లాలో 76.04శాతం మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నట్లు అంచనా. పోలింగు కేంద్రాల వారీగా పూర్తిగా పోలింగు ముగిసిన తర్వాత పీఓలు ఇచ్చే సమాచారం మేరకు పూర్తి వివరాలు వెల్లడవుతాయని అధికారులు చెబుతున్నారు. ఆ వివరాలు వచ్చిన తర్వాత ప్రస్తుతం పోలింగు శాతంలో కొంతవరకు మార్పు ఉండవచ్చు. రాత్రి వరకు అందిన సమాచారం ప్రకారం పోలింగు శాతం చూస్తే మాత్రం 2014 సార్వత్రిక ఎన్నికల కంటే తగ్గిందని చెప్పాలి. అప్పట్లో 79.5శాతం నమోదైంది. ఏదైనా పూర్తి వివరాలు శుక్రవారం వెల్లడి కానున్నాయి. మొరాయించిన ఈవీఎంలు జిల్లాలో పోలింగు ప్రక్రియకు పలు కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పలు మార్లు అంతరాయం ఏర్పడింది. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు మాక్ పోలింగు సమయంలోనే కొన్ని మొరాయించగా పోలింగు ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి ఎదురైంది. అధికారిక సమాచారం ప్రకారం మా క్ పోలింగు సమయంలో 9అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 40 బ్యాలెట్ యూనిట్లు, 38 కంట్రోల్ యూనిట్లు, 71 వీవీ ప్యాట్లు పని చేయకపోవడంతో మార్చారు. విజయనగరం పార్లమెంటు స్థానానికి సంబం«ధించి 31 బ్యాలెట్ యూనిట్లు, 38 కంట్రోల్ యూనిట్లు, 70 వీవీ ప్యాట్లు మొరాయించడంతో మార్చారు. పోలింగు ప్రారంభమైన తర్వాత 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 51 బ్యాలెట్ యూనిట్లు, 57 కంట్రోల్ యూనిట్లు, 109 వీవీ ప్యాట్లు పని చేయలేదు. పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 62 బ్యాలెట్ యూనిట్లు, 63 కంట్రోల్ యూనిట్లు, 108 వీవీ ప్యాట్లు మొరాయించాయి. వీటన్నింటినీ అధికారులు మార్చారు. ఎప్పటికప్పుడు సాంకేతిక సమస్యలు ఏర్పడ్డంతో అనేక చోట్ల ఈవీఎంలు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈవీఎంలు మొరాయిం చడం వల్ల జిల్లాలో 60కు పైగా పోలింగు కేంద్రాల్లో గంట నుంచి 2గంటల ఆలస్యంగా పోలింగు ప్రారంభమైంది. 100కుపైగా పోలింగు కేంద్రాల్లో పోలింగు నిలిచిపోయింది. దీంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలింగు పక్రియను పరిశీలించిన కలెక్టర్ జిల్లాలో పోలింగు పక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షించారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మానిటరింగ్ సెల్ నుంచి పరిస్థితిని వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. ఈవీఎంలు మొరాయించిన చోట వాటిని రీప్లేస్ చేయడం, సరి చేయడం వంటి విషయాలపై మార్గదర్శకం చేశారు. అదేవిధంగా ప్రతి గంటగంటకు పోలింగు తీరును పరిశీలిస్తూ పోలింగు శాతం తెలుసుకున్నారు. జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. మధ్యలో కలెక్టర్ విజయనగరం నియోజకవర్గంలో ఉన్న చెల్లూరు పోలింగు కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్‌తో కలిసి పరిశీలించారు. పోలింగును పర్యవేక్షించిన నేతలు పార్టీ నాయకులు కూడా పోలింగు తీరును నిరంతరం పర్యవేక్షించికుని ఎప్పటికప్పుడు ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకున్నారు. వైఎస్సార్సీపీ జిల్లా ముఖ్యనాయకులు బొత్స సత్యనారాయణ చీపురుపల్లితోపాటు పలు నియోజకవర్గాల్లో పరిస్థితిని సమీక్షించారు. జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు కూడా పలు నియోజకవర్గాలకు సంబంధించి పరిస్థితిని పరిశీలించారు. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. మిగతా అభ్యర్ధులు తమతమ నియోజకవర్గాల పరిధిలో పోలింగు తీరును తెలుసుకున్నారు. తెలుగుదేశంపార్టీ ఎంపీ అభ్యర్ధి ఆశోక్‌గజపతిరాజు పలు నియోజకవర్గాల్లో పర్యటించగా మిగతా అభ్యర్థులు వారివారి నియోజకవర్గాల్లో వారు ఉన్నారు. ఓటు వినియోగించుకున్న ప్రముఖులు పోలింగు సందర్భంగా పలువురు ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. జిల్లా ఎన్ని కల అధికారి, కలెక్టర్ హరి జవహర్లాల్ దంపతలు, ఎస్పీ దామోదర్ దంపతులు విజయనగరంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇతర ముఖ్య అధికారులు కూడా జిల్లా కేంద్రంలోనే ఓటు వేశారు. వైఎస్సార్సీపీ జిల్లా ముఖ్యనాయకులు, చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి విజయనగరం ఎం.ఆర్.కాలేజీలో ఓటు వేయగా మిగతా అభ్యర్ధులు ఎవరి నియోజకవర్గాల్లో వారు వేశారు. ఎస్.కోట అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు గజపతినగరం నియోజకవర్గంలో ఓటు వినియోగించుకున్నారు. తెలుగుదేశం నాయకులు తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు.. ఒకే ఓటరు!
ఒకే వ్యక్తికి రెండుచోట్ల ఓటు ఉండకూడదు. అలా ఉంటే ఏదో ఒకచోట ఉంచి మరోచోట తీసేస్తారు. కానీ ఆంధ్రా–ఒడిస్సా సరిహద్దుల్లో ఉన్న దాదాపు 34 గ్రామాల్లో ఇప్పటికీ సుమారు 2,934 ఓట్లు రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. ఉదయం ఒడిస్సాలో ఓటేసిన వ్యక్తి, సాయంత్రం ఆంధ్రా ఎన్నికల్లో ఓటేస్తాడు. వినడానికి చిత్రంగా అనిపిస్తున్నా, ఇది ముమ్మాటికీ నిజం. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, ఒడిస్సాలోని కోరాపుట్ జిల్లాల మధ్య, రెండు జిల్లాల పరిధిలో కొఠియా పంచాయతీలో ఉన్న గ్రామాలనే కొఠియా గ్రూపు గ్రామాలుగా పిలుస్తున్నారు. కొఠియా గిరిశిఖర గ్రామాల్లో దాదాపు 7 వేల మంది ఓటర్లున్నారు. వీరిలో 3,813 మంది ఓటర్లు ఆంధ్రాలో, ఒడిస్సాలోనూ ఓటు వేస్తున్నారు. నేటికీ తేలని వివాదం 1936లో ఒడిస్సా ఏర్పడినప్పుడు గానీ ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పుడు గానీ ఈ గ్రామాల్లో సర్వే జరగలేదు. ఏ రాష్ట్రంలోనూ వీటిని కలుపలేదు. ఈ గ్రామాలను తమవంటే తమవని ఇరు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. దీంతో 1968లో ఇరు రాష్ట్రాలూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ వివాదాన్ని పార్లమెంటులో తేల్చుకోవాల్సిందిగా 2006లో న్యాయస్థానం సూచించింది. అయినా పరిష్కారం లభించలేదు. కొంతకాలం క్రితం ఓ న్యాయమూర్తి అధ్యక్షతన నిజనిర్ధారణ కమిటీ ఏర్పడింది. చాలాకాలంగా ఆ కమిటీ అధ్యయనం చేస్తోంది. ప్రయాణం..ప్రమాదం విజయనగరం పట్టణం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాలూరు ప్రాంతానికి చేరుకుని అక్కడి నుంచి 40 కిలోమీటర్లు అడవులు, కొండల నడుమ అత్యంత ప్రమాదకర మార్గాల్లో ప్రయాణిస్తే కొఠియా ప్రాంతాలకు చేరుకోవచ్చు. దాదాపు 14 కిలోమీటర్లు మేర రహదారి అనేదే ఉండదు. రాళ్లురప్పల్లో నడిచి వెళ్లాల్సిందే. అతికష్టం మీద కొంత దూరం వరకూ జీపులో వెళ్లినా పక్కనే వందల అడుగుల లోతున్న లోయల్లో మృత్యువు పొంచి ఉంటుంది. దీంతో ఇక్కడికి ఆంధ్రా ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు చేరడం లేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇక్కడ సంక్షేమ, అభివృద్ధి పథకాలు చురుగ్గానే మంజూరయ్యేవి. రేషన్ కార్డులు కూడా మంజూరయ్యాయి. దీంతో గిరిజనులు ఆంధ్రా ప్రాంతం వైపే మొగ్గు చూపేవారు. ఆంధ్రా–ఒడిస్సా సరిహద్దులోని కొఠియా ప్రాంతం ఆంధ్రా–ఒడిస్సా పోలింగ్ బూత్‌లు ఆంధ్రా–ఒడిస్సా రేషన్ కార్డులతో గిరిజన మహిళ ఆంధ్రా–ఒడిస్సా వివాదాస్పద సరిహద్దు కొఠియా గ్రూపు గ్రామాల్లో ఆంధ్ర రాష్ట్రానికి పట్టుచెన్నేరు పంచాయతీలో 12, పగులు చెన్నేరు పంచాయతీలో 4, గంజాయిభద్రలో 13, సారికలో 2, కురుకూటిలో 2, తోణాంలో ఒకటి చొప్పున మొత్తం 34 గ్రామాలున్నాయి. ఆంధ్రా ఎన్నికల కోసం నేరెళ్లవలస, శిఖపరువు, డి. వెలగవలస, కురుకూటిలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఒడిస్సా ఎన్నికల కోసం కొఠియా, రణసింగి, గంజాయిభద్ర, పగులుచెన్నేరులో పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఉదయం ఒడిస్సాలో ఓట్లు వేసిన తర్వాత మధ్యాహ్నం ఆంధ్రా రాష్ట్ర ఎన్నికల పోలింగ్‌లో ఓట్లు వేయడానికి వస్తారు. – బోణం గణేశ్, సాక్షి ప్రతినిధి, విజయనగర -
అంతా ప్రచార ఆర్భాటమే...
సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ : వెనుకబడిన జిల్లాల అభివృద్ధిలో విజయనగరం ముందున్నట్లు ప్రభుత్వం చేస్తున్న ప్రచారం అంతా భూటకమే. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. పైగా జూట్, ఫెర్రో అల్లాయీస్ పరిశ్రమలు మూతబడి నాలుగు న్నరేళ్లయినా తెరుచుకోలేదు. దీంతో జిల్లాలో వేలాది కార్మికులు రోడ్డున పడగా, గ్రామీణ ప్రాంతాల్లో వలసల జోరు పెరిగింది. సహజ, మానవ వనరులు పుష్కలంగా ఉన్న జిల్లా ఇది. కానీ పారిశ్రామిక అభివృద్ధిలో ఎప్పుడూ అట్టడుగు స్థానంలోనే ఉంటోంది. జిల్లాలో సుమారుగా 24 లక్షల జనాభా ఉండగా.. గ్రామీణ ప్రాంతంలో 19 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 5 లక్షల జనాభా ఉన్నారు. జిల్లాలో 43 భారీ, మధ్య తరగతి పరిశ్రలుండగా అందులో 24,025 మంది వరకు ఉపాధి పొందుతున్నారు. వీటిలో స్టీల్, ఫెర్రో అల్లాయీస్, ఫార్మా, సుగర్ కేన్, కెమికల్, జీడి వంటి పరిశ్రమలున్నాయి. అలాగే చిన్న, చిన్న పరిశ్రమలు జిల్లాలో 4,288 వరకు ఉన్నాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీతో వీటిలో 40 శాతం పరిశ్రమలు మూతబడ్డాయి. వీటితో పాటు జూట్ పరిశ్రమలు మూతబడి సుమారు 20 వేల మంది వరకు ఉపాధి కోల్పోయారు. నడుస్తున్న పరిశ్రమల్లో కూడా కార్మికులు, ఉద్యోగుల సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో ఉపాధి కోసం విశాఖ, హైదరాబాద్, విజయవాడ, చెన్నై వంటి ప్రాంతాలకు వలసలు పోతున్నారు. ఒప్పందాలన్నీ కాగితాల్లోనే.. ఐదేళ్లుగా విశాఖలో పారిశ్రామిక సదస్సులు జరుగుతున్నాయి. 2016లో జిల్లాలో 8 పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం కుదరగా, రూ.11,932 కోట్లు పెట్టుబడులు వస్తాయని, 20,350 మందికి ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. అలాగే 2017 జనవరి 27, 28 తేదీల్లో మరో 15 పారిశ్రామిక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఒప్పందాలు జరిగాయి. ఈసారి రూ.11 వేల కోట్లతో 4,527 మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. 2018 లోనూ 11 పరిశ్రమలు ఏర్పాటవుతాయని ప్రకటించారు. ఇవేవీ ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. కంపెనీల పేరిట దళిత, గిరిజనుల డి–పట్టా భూములు లాక్కుంటున్నారే తప్ప, గడిచిన ఐదేళ్లలో ఒక్క పరిశ్రమా ఏర్పాటు కాలేదు. పరిశ్రమల పేరిట భూసేకరణ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటు పేరుతో 735.96 ఎకరాల భూమి సేకరించారు. గజపతినగరం మండలం మరుపల్లి, పూసపాటిరేగ మండలం కందివలస, కొత్తవలస మండలం బలిఘట్టాం వద్ద భూములు తీసుకున్నారు. ల్యాండ్ బ్యాంక్ కింద 1,315.18 ఎకరాలు సేకరించారు. ఈ భూమంతా భోగాపురం మండలం కొంగవానిపాలెం, కొత్తవలస మండలం కంటకాపల్లి, చినరావుపల్లి, పెద్దరావుపల్లి, రామభద్రపురం మండలం కొట్టక్కి, ఎస్.కోట మండలం ముసిడిపల్లి, నెల్లిమర్ల మండలం టెక్కలి, గజపతినగరం మండలం మరుపల్లి ప్రాంతాల్లో ఉంది. వీటితో పాటు పతంజలి అయుర్వేద కంపెనీకి 172.84 ఎకరాలు కొత్తవలస మండలంలోని చిన్నరావుపల్లి వద్ద భూసేకరణ చేపట్టారు. వీటన్నింటికీ వచ్చే 2020 పారిశ్రామిక అభివృద్ధి పాలసీ కింద ప్రభుత్వ రాయితీలు, పన్నుల మినహాయింపు, విద్యుత్ సదుపాయాలు వంటి అనేక సదుపాయాలు కల్పిస్తామంటూ మభ్యపెట్టడం మినహా ప్రయోజనం మాత్రం కనిపించడం లేదు. తీరని అన్యాయం ఐదేళ్ల చంద్రబాబు పాలనలో కార్మిక రంగానికి తీరని అన్యాయం జరిగింది. జిల్లా కేంద్రంలో ఉన్న రెండు జూట్ మిల్లులు మూతపడగా.. వాటి గురించి పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. గతేడాది జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి యాజమన్యంతో చర్చలు జరిపించి జూట్‌మిల్లులు తెరిపిస్తామని ఇచ్చిన హమీ అమలుకు నోచుకోలేదు. ఇలాంటి బూటకపు పాలన ఎప్పుడూ చూడలేదు. కార్మికలోకం ఉసురు తగలక మానదు. –ఎం.రాంబాబు, జూట్‌మిల్లు కార్మికుడు, విజయనగరం. -
విజేత నిర్ణయంలో..మహిళామణులు
సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ: సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే రాజకీయపార్టీలు అధికారికంగా కాకపోయినా అభ్యర్థులను దాదాపు ఖరారు చేసేశాయి. విజయనగరం నియోజకవర్గలో మహిళా ఓటర్లే అధికం. ఈ నేపథ్యంలో అతివలను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారు. కళలకు కాణాచిగా, విద్యలకు నిలయంగా, సాంస్కృతిక రాజధానిగా జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న విజయనగరం నియోజకవర్గాన్ని ఎవరు కైవసం చేసుకుంటారో మహిళలే నిర్ణయిస్తారు.నియోజకవర్గంలో బ్రాహ్మణ ఓటర్లు ప్రభావం చూపుతుంటారు. జనాభా వివరాలు.. పట్టణ జనాభా 2,83,550 పురుషులు 1,39,900 మహిళలు 1,43,650 ఎస్సీ జనాభా పట్టణం 27,087 పురుషులు 13,193 మహిళలు 13,894 ఎస్టీ జనాభా పట్టణం 2773 పురుషులు 12220 మహిళలు 1553 మండలం.. మండల జనాభా 41,709 పురుషులు 21,190 మహిళలు 20,519 ఎస్సీ జనాభా మండలం 3351 పురుషులు 1718 మహిళలు 1633 ఎస్టీ జనాభా మండలం 726 పురుషులు 381 మహిళలు 345 విజయనగరం నియోజకవర్గంలో మొత్తంఓటర్లు.. ప్రాంతం పోలింగ్ కేంద్రాలు పురుషులు మహిళలు ఇతరులు విజయనగరం మున్సిపాలిటీ 219 88,553 91,785 25 విజయనగరం మండలం 41 15,116 15,241 2 మొత్తం 260 1,03,669 1,07,026 27 -
బరితెగించిన తెలుగు తమ్ముళ్లు
-
సర్వేల పేరుతో కలకలం..!
సాక్షి, విజయనగరం : జిల్లాలో కొంతమంది యువకులు ప్రభుత్వానికి అనుకూలంగా సర్వేలు చేయడం కలకలం రేపుతోంది. పూసపాటిరేగ మండలం కుమిలి, రెల్లివలసలో ముగ్గురు యువకులు సర్వేలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పిన వారి వివరాలు నమోదు చేసుకోవడమే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ట్యాబ్స్‌లో ఓటర్ల జాబితా పెట్టుకుని మరీ ఇలా సర్వే చేయడం ఒక్కసారిగా అలజడి రేగింది. దీనిని గుర్తించిన వైఎస్సార్సీపీ నాయకులు సదరు యువకులను పోలీసులకు అప్పగించారు. ట్యాబ్స్‌లో ఓటర్ల లిస్ట్ పెట్టుకుని సర్వేలు చేయటం విరుద్దమని, ఇలా చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పనితీరు, పథకాల మీద అభిప్రాయం కోరుతూ వస్తున్న ఫోన్ల ఆధారంగా ఈ సర్వేలు సాగుతున్నట్లు విపక్ష నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పిన ట్యాబ్స్‌లో నమోదు చేసుకోవడంతో స్థానిక వైఎస్సార్సీపీ నేతలకు అనుమానం వచ్చింది. దాంతో వారిపై పోలీసులకు సమాచారం అందించారు. వారి వద్ద నుంచి పోలీసులు ట్యాబ్‌లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎన్నికల సంఘంతో పాటు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్సార్సీపీ నేతలు సమాయత్తమవుతున్నారు. -
డీఎస్సీకి కొత్త చిక్కులు
తెర్లాం మండలం నందిగాం గ్రామానికి చెందిన ఈయన పేరు గొట్టాపు సతీష్. ఈయన సోషల్ స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లిష్ పోస్టులు రెండింటికీ అర్హత కలిగి ఉంటంతోరెండు పరీక్షలకూ దరఖాస్తు చేసుకున్నారు. రెండింటికి జిల్లా కేంద్రాన్ని వెబ్ ఆప్షన్స్గాపెట్టారు. అయితే ఉదయం పూట జరిగే సోషల్ పోస్టుకు శ్రీకాకుళం, అదే రోజు మధ్యాహ్నం పూట జరిగే ఇంగ్లిష్ పోస్టుకు విజయనగరం పరీక్ష కేంద్రాన్ని ఎలాట్ చేశారు. ఇప్పుడు రెండు పరీక్షలు ఎలా రాయాలో తెలీయక ఒక పరీక్ష మాత్రమే రాయగలుగుతాననీ, రెండో అవకాశం కోల్పోతున్నాననీ, రెండూ ఒకే పట్టణంలో రాసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. విజయనగరం అర్బన్: ఉపాధ్యాయ నిరుద్యోగులకు డీఎస్సీ కష్టాలు కొనసాగుతున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకున్న సమయంలో వచ్చిన సమస్యలు ఇప్పుడిప్పుడే ముగిశాయి. తాజాగా పరీక్ష కేంద్రాలకు ఎంపిక ఆప్షన్ కష్టాలు మొదలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ఎస్జీటీ అభ్యర్థుల ఈ–ఎంపిక వెబ్ సైట్ ఆప్షన్ ద్వారా సోమవారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు జరగాలి. ఇందుకోసం ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల పోర్టల్ సోమవారం ప్రారంభం అవ్వాలి. అయి తే సోమవారం సాయంత్రం వరకు ఎస్జీటీల ఆప్షన్ కాలమ్ తెరచుకోలేదు. ఇటీవల ముగిసిన స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టుల పరీక్ష కేంద్రాల వెబ్ ఆప్షన్ ప్రక్రియలో విభిన్న సమస్యలను అభ్యర్థులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఆప్షన్ పరిధి రాష్ట్రస్థాయిలో ఉండడం వల్ల కోరుకున్న పరీక్ష కేంద్రాన్ని దక్కించుకోలేకపోతున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న శిక్షణా కేంద్రంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థులు ఇక్కడి పరీక్ష కేంద్రాలనే ఎంచుకోవడంతో ఆలస్యంగా వెబ్ ఆప్షన్ ఇచ్చిన వారికి పక్క జిల్లాల కేంద్రాలనుకేటాయిస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ టీచర్ల పరీక్ష కేంద్రాలకు ఎదురైన ఈ సమస్య తెలుసుకున్న ఎస్జీటీ అభ్యర్థులు తొలిరోజే ఆప్షన్స్ పెట్టుకోవాలని తొందరపడ్డారు. ఈ నేపథ్యంలో సోమవారం పలు నెట్ సెంటర్లకు పరుగులు తీశారు. వెబ్ ఆప్షన్ పోర్టల్‌లో కనిపించకపోవడం చూసి ప్రభుత్వ కాల్ సెంటర్ 1100కి కాల్ చేసారు. ఈ నెల 16 నుంచి వెబ్ ఆప్షన్ ఓపెన్ అవుతాయని ఓరల్‌గా సమాధానం వచ్చింది. కానీ ఇదే సమాచారాన్ని అధికారికంగా వెబ్సైట్లో పెట్టి తెలియజేయజేస్తారని ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17నుంచి హాల్ టిక్కెట్లు విడుదల చేయాల్సి ఉంది. అయితే కాల్ సెంటర్ నుంచి వచ్చిన సమాధానం దీనికి విభిన్నంగా ఉండడంతె అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు. పోర్టల్‌లో కనిపించని పరీక్షల పొడిగింపు తేదీలు డీఎస్సీ పరీక్షల తేదీల షెడ్యూల్‌ను పొడిగిస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. అయితే ఆ తేదీలను డీఎస్సీ పోర్టల్‌లో ఇప్పటికీ పెట్టలేదు. ఇటీవల ముగిసిన స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టుల అభ్యర్థుల పరీక్ష కేంద్రాల ఆప్షన్స్ గుర్తింపు కార్డులు పాత తేదీలతోనే విడుదలయ్యాయి. అసలు పరీక్షల తేదీలు పొడింగించారో లేదోనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అభ్యర్ధులు కంగారు పడుతున్నారు. ఒకే రోజు వేర్వేరు జిల్లాల్లో రెండు పరీక్షలు ఆన్లైన్ పరీక్షల నిర్వహణ వల్ల పరీక్ష కేంద్రాల ఆప్షన్స్ ఏ జిల్లానైనా ఎంపిక చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. వివిధ కేటగిరీ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు వేర్వేరుగా పరీక్ష రాయవచ్చు. ఉదయం, మధ్యాహ్నం వేర్వేరు పోస్టులకు పరీక్ష ఉంటుంది. అయితే ఆ రెండు పరీక్షలు రాసే అభ్యర్థికి పరీక్ష కేంద్రాలు అందుబాటులో కేటాయించకపోవడం వల్ల అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట పరీక్షకు పక్కజిల్లాలో, మధ్యాహ్నం పూట జిల్లా కేంద్రంలో పరీక్ష కేంద్రాలను కేటాయించడంవల్ల అనేక మంది ఒక్క పరీక్షకే పరిమితం కావాల్సి ఉంటుంది. -
మినుము సాగుకు అదును ఇదే..
విజయనగరం ఫోర్ట్: మినుము పంట సాగుకు అదును ఇదేనని విజయనగరం మండల వ్యవసాయ అధికారి గాలి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మినుము సాగు విధానం, అధిక దిగుబడుల సాధనపై పలు సూచనలిచ్చారు. ఆయన మాటల్లోనే... సాగుకు అనువైన నేలలు.. మాగాణి, మెట్ట భూములు మినుము పంటకు అనుకూలం. వరి మాగాణుల్లో నవంబర్, డిసెంబర్ నేలల్లో మినుము పంటను వేసుకోవాలి. విత్తడం ఇలా.. మరి మాగాణాల్లో అయితే వరి కోయటానికి 4, 5 రోజుల ముందు విత్తనాలను వెదజల్లుకోవాలి. ఈ పద్ధతిలో భూమిని దుక్కి చేయడం, ఎరువులు వేయడం వంటివి చేయరాదు. అధిక మోతాదులో విత్తనాన్ని వాడాలి. మెట్ట భూముల్లో అయితే తేమను నిలుపుకోగలిగి మురుగునీరు పోయేనేలలు మినుముకు అనుకూలం. భూమిని బాగా దుక్కిచేయాలి. విత్తనం దుక్కిలో 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు వేసి భూమిలో కలియదున్నాలి. వరి మాగాణాల్లో అయితే విత్తనాలను వెదజల్లాలి. మెట్ట భూముల్లో అయితే వరుసల మ«ధ్య 30 సెంటీ మీటర్లు, మొక్కలు మధ్య 10 సెం.మీ అంతరంతో గొర్రుతో గాని సీడ్ డ్రిల్‌తో గాని విత్తాలి. రకాలు... ఎల్ఐజీ–645: ఈ రకం పంట కాలం 85 నుంచి 90 రోజులు. హెక్టారుకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. లావుపాటి పాలిసీ రకం. ఎండు తెగులను తట్టుకుట్టుంది. ఎల్.బి.జి –402: ఈ రకం పంట కాలం 90 నుంచి 95 రోజులు. గింజలు లావుగా సాదాగా ఉంటాయి. హెక్టారుకు 8 నుంచి 9 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎండు తెగులును తట్టుకుంటుంది. ఎత్తుగా పెరిగి కలుపును అణిచి వేస్తుంది. చౌడును కొంత వరకు తట్టుకుట్టుంది. ఎల్బీజీ 22: ఈ పంట రకం 85 రోజులు. హెక్టారుకు 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎండు తెగులును తట్టుకుంటుంది. ఆలస్యంగా విత్తేందుకు అనుకూలం. ఎల్బీజీ–17: ఈ రకం పంట కాలం 80 నుంచి 85 రోజులు. బూడిద తెగులను తట్టుకుంటుంది. కొమ్మలు విస్తరించి పెరుగుతాయి. ఎల్బీజీ– 752: ఈ రకం పంటకాలం 75 నుంచి 80 రోజులు. పల్లాకు, ఎండు తెగులను తట్టుకుంటుంది. విత్తన మోతాదు: వరి మాగాణాల్లో అయితే ఎకరాకు 16 కేజీలు, మెట్ట భూముల్లో అయితే ఎకరాకు 10 కిలోల విత్తనం అవసం అవుతుంది. కిలో విత్తనానికి 30 గ్రాముల కార్పోసల్ఫాన్, 2.5 థైరమ్ లేదా కాప్టాన్ మందును వాడి విత్తన శుద్ధి చేయాలి. నీటి యాజమాన్యం: వర్షాభావ పరిస్థితి ఎర్పడినప్పుడు ఒకటి రెండు నీటి తడులు పెట్టాలి. వరి మాగాణుల్లో నీటి తడి ఇవ్వవచ్చు. ఒకటి రెండు తేలిక తడులు, 30 రోజులకు, 55 రోజుల తర్వాత ఇస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. కలుపు నివారణ: పెండి మిథాలిన్ ద్రావణం ఎకరాకు లీటరు నుంచి లీటరన్నర ఎకరాకు విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారీ చేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేయాలి. సస్యరక్షణ: మరకా మచ్చల పురుగు: ఈ పురుగు మొగ్గ, పూత, పిందె దశల్లో ఆశించి ఎక్కువ నష్టం కలుగజేస్తుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు కాయలను దగ్గరగా చేర్చి గూడుగా కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినడం వల్ల పంటకు ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. దీని నివారణకు క్లోరిఫైరిపాస్ 2.5 మి.లీ లీటరు నీటిలో కలిపి ఎకరాకు 200 లీటర్లు పిచికారీ చేయాలి. ఎండు తెగులు: ఈ తెగులు ఆశించిన మొక్కలు వడిలి, ఎండిపోతాయి. పంటకు అధిక నష్టం కలుగుతుంది. ఈ తెగులు భూమిలో ఉన్న శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. పైరుపై మందులను వాడి నివారించడం లాభసాటి కాదు. తెగులను తట్టుకునే రకాలు వేసుకోవాలి. పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పల్లాకు తెగులు: ఇది జెమిని వైరస్ జాతి వల్ల వచ్చే తెగులు. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు, కాయల మీద పసుపుపచ్చ మచ్చలు ఏర్పడతాయి. తొలిదశలో ఈ వైరస్ తెగులు ఆశించినట్టయితే పైరు గిడసబారిపోయి , పూతపూయక ఎండిపోతుంది. ఈ వైరస్ తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని నివారణకు పొలంలో పల్లాకు తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. మోనోక్రోటోపాస్ 1.6 మి.లీ లీటరు నీటిలో కలిపి ఎకరాకు 200 లీటర్ల నీటిని పిచికారీ చేయాలి. -
టీడీపీ పాలనలో.. అన్నింటా అవినీతే
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి కాసులు కురిపించాలి..పింఛన్ మంజూరు కావాలంటే అధికారపార్టీ నేతల చేయి తడపాలి. ఇళ్లు, మరుగుదొడ్ల బిల్లుల్లో వాటాలు ఇవ్వాలి.. రోడ్లు, కాలువ పనులు తదితర అభివృద్ధి పనుల్లో పర్సంటేజీలు చెల్లించాలి.. చివరకు పారిశుద్ధ్య కార్మికుల నియామకంలోనూ అవినీతే.. ప్రజాధనంతో అమలుచేసే ప్రతీ పథకం, చేసిన ప్రతీ పనిలోనూ పర్సంటేజీలు వసూలు చేస్తున్నారంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. తాజాగా హౌస్ ఫర్ ఆల్ పథకంలో అక్రమాలు జరిగాయంటూ సామాజిక తనిఖీ అధికారులు బట్టబయలు చేశారు. అనర్హుల పేర్లుతో సహా వెల్లడించడంతో టీడీపీ పాలనలో సాగుతున్న అవినీతి తంతును చూసి జిల్లా వాసులు విస్తుపోతున్నారు. విజయనగరం మున్సిపాలిటీ: ఇందుగలడందు లేడని సందేహం వలదు.. ఎందెందు వెతికినా.. అందందే తమ అవినీతి గలదన్న చందంగా మారింది ప్రస్తుత టీడీపీ పాలన. ఏ పనిచేయాలన్నా, ఏ పథకం మంజూరు కావాలన్నా చేయి తడపాల్సిందేనన్నది జనం నుంచి వినిపిస్తున్న మాట. అభివృద్ధి పనుల్లో పర్సంటేజీల పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న పాలకులు... సంక్షేమ పథకాల మంజూరులో చేస్తోన్న అవినీతి పరకాష్టకు చేరుకుంది. దీనికి పట్టణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలకు ఇళ్ల మంజూరు చేసేందుకు అమలు చేస్తోన్న హౌస్‌ఫర్ ఆల్ పథకం వేదికగా నిలిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తోన్న హౌస్‌ఫర్ ఆల్ పథకం అక్రమాలకు నిలయంగా మారింది. నిబంధనలకు పాతరేసి స్థానికేతరులకు ఇళ్లు కేటాయింపులు చేశారంటూ సామాజిక తనిఖీల్లో వెలుగుచేసింది. బృంద సభ్యులు బహిరంగంగానే అనర్హుల పేర్లుతో సహా వెల్ల ్లడించడం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 279 ప్రకారం విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికుల నియామకంలోనూ ఒక్కో కౌన్సిలర్ నూతన నియామకానికి రూ.30 వేల నుంచి రూ.50 వేలు వసూలు చేసినట్టు సమాచారం. 2014 అనంతరంటీడీపీ పాలకవర్గం మున్సిపల్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కౌన్సిల్ ఆమోదించిన సుమారు 450 అభివృద్ధి పనుల్లో ప్రతీ పనికి పర్సెంటీజీల చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నార్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి అవినీతి మయమే... హౌస్‌ఫర్ ఆల్ పథకం కింద స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకునేందుకు విజయనగరం మున్సిపాలిటీలో 3,090 యూనిట్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణ ప్రక్రియ తుది దశకు చేరుకోగా... స్థానిక పాలకవర్గాలు లబ్ధిదారులకు ఇళ్లు కేటాయింపులు ప్రక్రియను చేపట్టేశారు. ఇదిలా ఉండగా ఒక్కో యూనిట్ నిర్మాణానికి రూ.3.50 లక్షలు మంజూ రు చేయనుండగా.. అందులో రూ.2.50 లక్షలు సబ్సీడీ మొత్తాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తుంది. మిగిలిన రూ.లక్షలో రూ.75 వేలు బ్యాంకులోను ద్వారా చెల్లించాల్సి ఉండగా.. మరో రూ.25 వేలు మొత్తం లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, సబ్సీడీకింద వచ్చే రూ.2.50 లక్షల మొత్తం మంజూరు చేసేందుకు పర్సంటేజీల పేరిట వేధింపులు వస్తున్నాయి. రూ.లక్ష మొత్తం మంజూరుకు రూ.15 వేలు, రూ.2.50 లక్షల మంజూరుకు రూ.37 వేల వరకు వసూలు చేస్తున్నారంటూ లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నా రు. ఇదే పథకంలో పూర్తిగా ఇళ్లులేని వారి కోసం సారిపల్లి ప్రాంతంలో 2,880 ఇళ్లు నిర్మించి ఇచ్చేం దుకు నిర్ణయించగా.. అందుకు అవసరమైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ ఏడాది ఆగస్టుతో పూర్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయ, సహకారాలతో జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారుడు వాటా కింద కొంత మొత్తాన్ని ముందుగా డీడీల రూపంలో చెల్లించాలని సూచించారు. ఈ మేరకు 300 స్వే్కర్ఫీట్, 365 స్క్వేర్ ఫీట్, 430 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో చేపడుతున్న యూనిట్ల నిర్మాణానికి ముందుగా రూ.500, రూ.10వేలు, రూ.25వేలు చొప్పున చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే, ఇలా రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారి వద్ద నుంచి స్థానిక కౌన్సిలర్లు ఒక్కోయూనిట్‌కు రూ.30వేలు నుంచి రూ.50వేలు వసూలు చేశారన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఇదంతా మున్సిపల్ పాలకులే నిర్వహించారన్నది బహిరంగ సత్యం. తాజా గా ఈ పథకం అమలులో పారదర్శకతపై సామాజిక తనిఖీ బృందం నిర్వహించిన తనిఖీల్లో అదే విషయం బట్టబయలు కావడం గమనార్హం. అన్నింటా రాజకీయ హస్తం.. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున నిరుపేదలకు ఈ పథకం ద్వారా ఇళ్లు మంజూరు చేసేందుకు 2015 సంవత్సరంలో నిర్ణయించగా... మూడేళ్ల అనంతరం ఇళ్ల కేటాయింపులు పూర్తి చేసిన ప్రక్రియపై అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. శనివారం మధ్యాహ్నం మున్సిపల్ కార్యాలయం వేదికగా నిర్వహించిన సోషల్ ఆడిట్లో ఇదే విషయాన్ని సామాజిక తనిఖీ బృందం ప్రస్తావించిం ది. వారం రోజుల పాటు విజయనగరం మున్సి పాలిటీలో నిశిత తనిఖీలు నిర్వహించిన వారు జరిగిన అక్రమాలపై పక్కా నివేదికను రూపొం దించారు. ఎక్కడా పారదర్శకత లేకుండా కేటా యింపులు చేయటాన్ని వారు పేర్లతో సహా బయటపెట్టారు. ఇదే సామాజిక తనిఖీ ప్రొగ్రాం మేనేజర్ వి.వరలక్ష్మి సవివివరంగా నివేదికలో పొందుపరిచారు. విజయనగరంలో చేసిన ఇళ్ల కేటాయిం పుల్లో పక్క జిల్లాలకు చెందిన వారిని, ఇతర మండలాల వారికి ప్రాధాన్యం ఇచ్చినట్టు గుర్తిం చారు. స్థానికేతరులకు ఇళ్లు కేటాయించడం, అర్హులు కాని వారిని లబ్ధిదారులుగా పేర్కొన్నట్లు తనిఖీల్లో తేల్చారు. రాష్ట్ర పర్యవేక్షణ కమిటీ ద్వారా వచ్చిన నిబంధనల మేరకు పారదర్శకంగా ఇళ్ల కేటాయింపులు జరగలేదని పేర్కొన్నారు. 15,620 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా... ఇప్పటి వరకు 2,730 మందికి ఇళ్లు కేటాయిం చారని, ప్రధాని మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇవ్వాల్సిన ఇళ్లకు మహిళలే అర్హులని, ఆ విధంగా 74 శాతం మంది మహిళలు మాత్రమే వారి పేరును దరఖాస్తు చేసుకోగా... మిగిలిన 26 శాతం కూడా పురుషులు దరఖాస్తులు చేసుకోవ డం వెనుక నిబంధనలకు విరుద్ధంగా జరిగిన పథకం అమల్లో స్థానిక ప్రజాప్రతినిధులు ఎంత మేర జోక్యం చేసుకున్నారో చెప్పనక్కర్లేదు. సారిపల్లిలో ఇప్పటి వరకు జనరల్‌లో 1614 మందికి, బీసీలకు 351 మందికి, ఎస్సీలు 15 మందికి, ఎస్టీ ఒకరికి కేటాయించగా... మిగిలిన 1159 మందికి కులంతో సంబంధం లేకుండా కేటాయించినట్లు గుర్తించారు. మరోవైపు ఆన్లైన్ ద్వారా చేసుకో వాల్సిన దరఖాస్తులను ఆఫ్‌లైన్ ద్వారా చేశారని, ఇక్కడ ప్రజాప్రతినిధుల హస్తం స్పష్టంగా కనిపిం చడంలో అసలు బండారం బట్టబయలైంది. కౌన్సిలర్ల ద్వారా ఈ దరఖాస్తులు ఆఫ్‌లైన్‌లో పంపించి ఇళ్ల కేటాయింపులకు పాల్పడినట్లు బృంద సభ్యులే వెల్లడించడం గమనార్హం. ఇచ్చిన ఇళ్లలో కూడా ఒక్కోరేషన్ కార్డుకు రెండేసి ఇళ్లను కేటాయించగా, గజపతినగరం ప్రాంతంలో నివసిస్తున్న వారికి విజయనగరం పట్టణంలో ఇంటిని మంజూరు చేయడం కొసమెరుపు. ఇదే విషయాన్ని సామాజిక తనిఖీ బృంద సభ్యులు ప్రభుత్వానికి నివేదించనున్నట్టు తెలుస్తోంది. హౌస్ ఫర్ సే(ఆ)ల్... అవినీతిని సహించం.. అక్రమార్కులను వదిలిపె ట్టేది లేదంటూ ఆర్భాటపు ప్రకటనలు చేసే టీడీపీ ప్రజాప్రతినిధులు అవినీతి ఊబిలో చిక్కుకున్నారు. ఇదే విషయం హౌస్‌ఫర్ ఆల్ పథకంలో బట్టబయలు కావడంతో విజయనగరం మున్సి పాలిటీలో సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. శనివారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన సామాజిక తనిఖీ, ప్రజావేదిక కార్యక్రమానికి కేవలం మున్సిపల్ కౌన్సిలర్లు పం పించిన లబ్ధిదారులు హాజరుకాగా... ఈ సమావేశంలో వారందరిలో ఏ ఒక్కరు అవినీతిపై పెదవి విప్పకపోగా... తనిఖీకి వచ్చిన బృంద సభ్యులు వెల్లడించిన వాస్తవాలతో వారుసైతం అవాక్కవడం గమనార్హం. ఆధారాలు ఉన్న వారికే ఇళ్లు కేటాయించాం అన్ని ఆధారాలతో దరఖాస్తులు చేసుకున్న వారికే హౌస్ ఫర్ ఆల్ పథకంలో ఇళ్లు కేటాయించాం. స్థానికేతరులకు ఇళ్లు కేటా యింపులు జరగలేదు. కొంతమంది వలసలు వచ్చి విజయనగరంలో జీవిస్తుండంతో వారికి రేషన్‌కార్డు స్థానికంగా ఉండడంతోనే స్థానికత ఆధారంగా ఇళ్ల కేటాయింపులు చేశాం. మరో 52 కేసుల్లో పిన్‌కోడ్ సమస్య తలెత్తడంతో వాటిని కూడా సరిచేశాం. అన్నింటా పారదర్శకత పాటిస్తూ వచ్చాం. – టి.వేణుగోపాల్, కమిషనర్, విజయనగరం మున్సిపాలిటీ -
ఆశ వర్కర్లకు షరతులు వర్తిస్తాయి!
ఎన్నో పోరాటాలు చేశారు. పోలీసు దెబ్బలు తిన్నారు. అవమానాలు చవిచూశారు. ఏమైతేనేం అనుకున్నది సాధించామని సంతోషించారు. ఇచ్చింది స్వల్పమైనా అనంతానందం పొందారు. కృతజ్ఞతతో సన్మానాలు చేశారు. చిత్రాలకు పాలాభిషేకం చేశారు. ఇంతలోనే వారి ‘ఆశ’లపై నీళ్లు చల్లుతూ కొత్త ఉత్తర్వులు వెలుడ్డాయి. ఇదీ ఆశ వర్కర్లపై సర్కారు అనుసరించిన వైఖరి. ముఖ్యమంత్రి తమ కోర్కెలు తీర్చేశారని సంబరపడితే... కొత్తగా పెట్టిన కండిషన్లతో వారంతా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. బొబ్బిలి: అరవ చాకిరీ చేయించుకుంటూ కూడా ఆశ వర్కర్లకు వేతనం పెంచామని సన్మానాలు, సత్కారాలు, పాలాభిషేకాలు చేయించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలు స్వరూపం మరోసారి బహిర్గతమైంది. ఆశ వర్కర్ల వేతనం పెంపు వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని నిరూపించారు. పెంచిన వేతనం రూ.5,600 అందా లంటే ప్రతీ ఆశ వర్కర్ నెలకు నలుగురు గర్భిణులను నమోదు చేసి, నాలుగు డెలివరీలు చేయించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. వేతనాల కోసం ఏటా ఎదురు చూస్తున్న ఆశ వర్కర్లకు నెలకు రూ.3 వేలు, పారితోషకంగా మరో మూడు వేలుఇస్తామన్న రాష్ట్ర సర్కారు ఇప్పుడు రూ.5,600ను ప్రకటించింది. ఆ డబ్బులు కూడా లక్ష్యాన్ని సాధిస్తేనే ఇస్తామని చెప్పడంతో ఇప్పుడు ఆశ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా సేవలు వినియోగించుకుని ఇలా లక్ష్యాలను విధించడం అన్యాయమని వారు వాపోతున్నారు. పోరాటంతో దిగొచ్చిన సర్కారు జిల్లాలో 5,600 మంది ఆశ వర్కర్లున్నారు. వీరిని సబ్ సెంటర్ల వారీగా ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. వివిధ సర్వేలు, పల్స్‌పోలియో, చిన్నారులకు టీకాలు వంటి కార్యక్రమాలకు ఇంటింటికీ తిరుగుతూ ఒళ్లు హూనం చేసుకుంటున్నా... వారికి నెలకు ఇచ్చేది మూడు వేలే. ఈ సొమ్మును మరో మూడు వేలు పెంచి ఆరు వేలు చేస్తున్నామని కొద్ది నెలల క్రితం ప్రకటించారు. కానీ దానిని అమలు చేయలేదు. ఇక అందరి మాదిరి వారూ ఆందోళనలకు దిగారు. పోలీసులచేత ఈడ్చివేతలు... అధికారులతో ఛీత్కారాలు తిన్నారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలు కాదని, రూ.5,600 ఇస్తామని ప్రకటించారు. తాజాగా పెట్టిన మెలికలు వెయ్యి జనాభా నుంచి రెండు వేల జనాభా ఉన్న సబ్ సెంటర్ల వారీగా లక్ష్యాలు విధించారు. ఒక్కొక్కరూ నలుగురు గర్భిణులను నమోదు చేయాలి, నాలుగు డెలివరీలు చేయించాలి. వీటితో పాటు నలుగురు బిడ్డలకు మీజిల్స్ వేయించాలి. మరో నాలుగు బూస్టర్ డోసులు వేయించాలి. ఇలా రోజూ వారు గర్భిణుల కోసం, బాలింతల కోసం వెతకాల్సిందే. ఒక వేళ ఆ ప్రాంతంలో గర్భిణులు లేకపోతే వీరికి వేతనం లేనట్టేనని చెబుతున్నారని ఆశా వర్కర్లు వాపోతున్నారు. బర్త్సర్టిఫికెట్లు అంగన్వాడీలకు అప్పగించాలి ఆశ వర్కర్లు తాము పనిచేస్తున్నట్టు రుజువు చేసేందుకు సవాలక్ష నిబంధనలు విధించింది ప్రభుత్వం. బిడ్డలు పుట్టినట్టు ఆస్పత్రిలో ఇచ్చే సర్టిఫికెట్లను జత చేయాల్సి ఉంది. అలాగే పుట్టిన బిడ్డ అత్తవారు, కన్నవారింటికి మారినప్పుడు అక్కడి అంగన్వాడీ సెంటర్‌కు అప్పగించే బాధ్యత కూడా ఆశ వర్కర్లదే. దీంతో తాము చేసిన పనులు ఏమన్నా తక్కువ చేస్తున్నామా? పనికి తగిన వేతనం ఇస్తున్నారా? మాకెందుకీ లక్ష్యాలని వాపోతున్నారు. వర్కర్లతో విరివిగా సమావేశాలు ఆశ వర్కర్లకు వేతనం పెంచినట్టే పెంచి లక్ష్యాలను బారెడు చేసిన ప్రభుత్వం వారి కోసం విడుదల చేసిన లక్ష్యాలు, నిబంధనలపై రిపోర్టులు తీసుకుంటోంది. ఇందుకోసం ఏఎన్ఎంల ఆధ్వర్యంలో ఆశ వర్కర్లకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమావేశాల్లో మీరు చేయాల్సిన పనులివీ అని వారికి వివరిస్తున్నారు. పెరిగిన వేతనం అందుకోవాలంటే ఈ మాత్రం చేయకతప్పదని వారికి సుద్దులు చెబుతున్నారు. దీంతో ఆశ వర్కర్లు మరింత ఆవేదన చెందుతున్నారు. బర్త్ సర్టిఫికేట్లు అప్పగిస్తేనే వేతనమట మాకు లక్ష్యాలు ఇచ్చి వాటి ప్రకారం గర్భిణులు, బాలింతలను నమోదు చేయాలంటున్నా రు. బిడ్డ పుట్టిన తరువాత వారిని అంగన్వాడీలకు అప్పగించాలని ఆదేశించారు. లేకుంటే వేతనం లేదని, కట్ అవుతుందని ముందుగానే మాకు స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫారంలో అన్ని కాలమ్స్‌ను మాచేత నింపిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం. జీతం పెంపు అంటే ఇదేనా? – ఎల్ శాంతి, అధ్యక్షురాలు, ఆశ వర్కర్ల అసోసియేషన్. -
నెత్తిపై మృత్యు దేవత
పెంకులు పడిపోతుంటాయి. నెత్తిన బొప్పి కడుతుంటాయి. పైకప్పులోంచి చువ్వలు కనిపిస్తుంటాయి. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని భయం.. ఎప్పుడే ప్రాణం పోతుందోనని కలవరం. శిధిలమవుతున్న ప్రభుత్వ భవనాలు మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. కూలిపోయే స్థితిలో ఉన్న గదుల్లో పాఠశాలలు సాగుతున్నాయి. పాచిపెంటలో ప్రభుత్వ పాఠశాల మరుగుదొడ్డి గోడ కూలి ఓ విద్యార్థి నిండు ప్రాణం రాలిపోయింది. నెత్తిపైనే మృత్యుదేవత తాండవిస్తోంది. సాక్షి,విజయనగరం: సీతానగరం పీహెచ్సీ సిబ్బంది నివాసాలు శిధిలమయ్యాయి. పెదంకలాం పీహెచ్సీ భవనం శిధిలమై పాములకు నివాసంగా మారింది. గుమ్మిడివరంలో ఎంపీఈ స్కూల్ అదనపు భవనం కూడా కూలిపోయే స్థితికి చేరుకుంది. – సీతానగరం (పార్వతీపురం) మండలంలోని భోజరాజపురంలో పాఠశాల భవనం పూర్తిగా పాడైనా అందులోనే తరగతులు నిర్వహిస్తున్నారు. గోపాలరాయుడిపేట ఎంపీపీ పాఠశాల భవనంలో తరగతి గది పైకప్పు పెచ్చులూడిపోయింది. – బొబ్బిలి రూరల్ నెల్లిమర్ల మండల పరిషత్ భవనం శిథిలమై ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో ఉంది. ఈ భవనాన్ని 1998లో మిమ్స్ ఆస్పత్రి సేవలకు అప్పగించగా 2002లో ఖాళీ చేసినా తొలగించలేదు. – నెల్లిమర్ల చీపురుపల్లి ఆర్ అండ్ బి సహాయ ఇంజనీర్ అధికారి కార్యాలయం శిధిలం కావడంతో సిబ్బంది ఖాళీ చేశారు. కొన్నాళ్లకు భవనం కొంత కూలిపోయినా ఇంతవరకు తొలగించలేదు. జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి అంతస్తులోని పలు భవనాలు కూడా శిధిలావస్థకు చేరుకున్నాయి. – చీపురుపల్లి మెరకముడిదాంలో రెండేళ్ల క్రితం ఎస్సీ బాలుర వసతిగృహాన్ని ఎత్తివేశారు. అప్పటి నుంచి భవనం వృధాగా పడి ఉండటంతో శిధిలావస్థకు చేరింది. – మెరకముడిదాం (చీపురుపల్లి) వేపాడ మండలంలో శిధిలమైన భవనాల్లోనే చదువులు సాగుతున్నాయి. ఆకులసీతంపేట, సోంపురం, గుడివాడ, కుమ్మపల్లి, జగ్గయ్యపేట, ఎస్.కోట సీతారాంపురం, వేపాడ తదితర ప్రాథమిక పాఠశాలలు ఏ క్షణాన్నయినా కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. – వేపాడ (శృంగవరపుకోట) -
గొల్లుమన్న మత్స్యకార పల్లెలు
పూసపాటిరేగ/భోగాపురం: సముద్రమే వారికి సర్వస్వం. వేటే జీవనాధారం. దానికోసం ఎన్నికష్టాలైనా ఎదురీదుతారు. ఎంత దూరానికైనా పొట్టపోషణకోసం వెళ్లిపోతారు. అలా వెళ్లిన జిల్లాకు చెందిన ఐదుగురు మత్స్యకారులు పాకిస్తాన్ సరిహద్దులోకి వెళ్లిపోవడంతో అక్కడి కోస్టుగార్డులకు చిక్కి బందీలుగా మారారు. విషయం తెలుసుకున్న ఇక్కడి కుటుంబ సభ్యులు ఇప్పుడు గొల్లుమంటున్నారు. ఇక్కడ వేటసాగక.. పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని తీరప్రాంతంలో వేట సరిగ్గా సాగడం లేదు. ఏడాదిలో దాదాపు రెండు నెలలు నిషేధం... మిగిలిన కాలంలో కొన్నాళ్లు రకరకాల తుఫాన్లు, అల్పపీడనాలు తదితర సమయాల్లో నెలల తరబడి వేట సాగడం లేదు. దీంతో జీవనాధారం లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి ఎంతోమంది మత్స్యకారులు బతుకు తెరువు కోసం గుజరాత్‌లోని హీరావల్ వెళ్లి అక్కడ కొందరివద్ద వేటపనికి కుదిరి ఇక్కడి కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. ఇలా వెళ్లినవారు అక్కడ వేటకోసం సముద్రంలోకి వెళ్లి రకరకాల చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు. ఇక్కడ సక్రమంగా వేట సాగితే ఇక్కడినుంచి వెళ్తే పరిస్థితి ఉండదని స్థానికులు చెబుతున్నారు. అదే విధంగా పూసపాటిరేగ తిప్పలవలస, భోగాపురం మండలం ముక్కాం గ్రామాలకు చెందిన ఐదుగురు ఇప్పుడు పాకిస్తాన్ సరిహద్దులోకి అనుకోకుండా వెళ్లి అక్కడి రక్షక దళాలకు చిక్కారు. రెండు గ్రామాల్లో కలవరం పూసపాటిరేగ మండలం తిప్పలవలస, భోగాపురం మండలం ముక్కాంనకు చెందిన పలువురు మత్స్యకారులు ఆగస్టు 15వ తేదీన గుజరాత్ రాష్ట్రం హీరావల్‌వెళ్లి చేపలవేట నిమిత్తం బోట్లులో కూలీలుగా పనిచేయడానికి కుదిరారు. అక్కడి నుంచి 10 రోజుల క్రితం ఇంజిన్ వున్న స్టేయింగ్ బోటులో సముద్రంలో వేటకు వెళ్లారు. నిబంధనలపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో పాకిస్తాన్ జలాల్లోకి వేటచేస్తూ ప్రవేశించారు. బోర్డర్లో వున్న పాకిస్తాన్ రక్షణ దళాలు మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో తిప్పలవలసకు చెందిన నక్కా అప్పన్న, నక్కా ధనరాజు, నక్కా నరిసింగు, బర్రి బవిరీడు, భోగాపురం మండలం ముక్కాంనకు చెందిన మైలపల్లి గురువులు ఉన్నారు. ఇందులో నక్కా అప్పన్న, నక్కా ధనరాజు తండ్రీకొడుకులు, నక్కా నరిసింగు(18) అప్పన్నకు బంధువు. విడుదలకు కృషి చేయాలి పాకిస్తాన్లో బందీలుగా ఉన్న మత్స్యకారులను తక్షణమే విడుదల చేయడానికి కేంద్రప్రభుత్వం చొరవ చూపాలని బాధిత కటుంబాలు వేడుకొంటున్నాయి. గతంలో పాకిస్తాన్లో చిక్కిన వారిని సంవత్సరాలపాటు జైలులో ఉంచేవారని, బందీలుగా వున్న వారికి భోజన సౌకర్యం కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడిన రోజులు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయన్నారు. జిల్లా కలెక్టర్ హరివహర్‌లాల్ స్పందించి ప్రభుత్వానికి నివేదించాలని మత్స్యకారులు కోరుతున్నారు. అయితే మత్స్యకారులు చిక్కుకుని 24 గంటలు గడిచినా స్థానిక అధికారులు కనీసం స్పందించడం లేదని వాపోతున్నారు. చింతపల్లి మెరైన్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు తిప్పలవలసలో బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి సమాచారం మాత్రం సేకరించారు. మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులు మాత్రం ఎక్కడా ఆచూకిలేదు. నా పెనిమిటి ఇంటికి వస్తాడా... మైలపల్లి గురువులకు భార్య దానయ్యమ్మ, కొడుకు దాసు, కుమార్తె సత్య ఉన్నారు. ఇద్దరు పిల్లలకీ వివాహాలు అయిపోయాయి. కొడుకు కర్ణాటక రాష్ట్రం మంగుళూరు వద్ద ఉంటూ వేట చేసుకుని జీవిస్తున్నాడు. భార్య గ్రామంలో చేపలు అమ్ముతూ జీవిస్తుంది. గురువులు ఇతర బోట్లలో వేట పనిచేస్తూంటాడు. సమాచారం తెలుసుకున్న గురువులు భార్య కన్నీటి పర్యంతమవుతోంది. తన భర్తకు 64 సంవత్సరాలుంటాయని, వేరే ఆధారం లేక అంత దూరం వెళ్లాల్సి వచ్చిందనీ, ‘నా పెనిమిటిని వేరే దేశపోళ్ళు తీసుకెళ్ళిపోయారంట... నా పరిస్థితి ఏంటి.. నా భర్త సేమంగా తిరిగొస్తాడా బాబూ.. సెప్పండి బాబూ’ అని కనబడినోళ్ళని అడగడం చూస్తే కడుపు తరుక్కుపోయింది. -
నీరాజనం.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు అడుగడుగునా బ్రహ్మరథం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర జన జాతరలా సాగింది. అడుగడుగునా ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. కష్టాలు చెప్పుకున్నారు. బహిరంగ సభలకు గిరిపుత్రులు భారీగా తరలివచ్చి బ్రహ్మరథం పట్టారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో ఎదురైన కష్టాలను ఏకరువుపెట్టారు. జననేతకు వస్తున్న ఆదరణకు జడిసి ఏకంగా ఆయనపై హత్యాయత్నం చేయడం చూసి విలవిల్లాడిపోయారు. ‘ఎవరెన్ని కుట్రలు పన్నినా మీకేం కాదు.. మీతోనే మంచి రోజులు వస్తున్నాయని నమ్ముతున్నాం.. మళ్లీ రాజన్న పాలన మీతోనే సాధ్యం.. ఎన్ని కష్టాలెదురైనా మేమంతా మీ బాటలోనే నడుస్తాం’ అని స్పష్టీకరించారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి విజయనగరం జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జిల్లాలో సెప్టెంబర్ 24న ప్రవేశించిన పాదయాత్ర నేటితో ముగియనుంది. అభిమానుల జయ జయ ధ్వానాల నడుమ 36 రోజుల పాటు 311.5 కిలోమీటర్ల మేర సాగిన యాత్రలో జననేత వేసిన ఒక్కో అడుగు ఒక చరిత్రగా నిలిచింది. తొలిరోజు ఎస్‌కోట నియోజకవర్గంలోని కొత్తవలస మండలంలో 3000 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించింది. ఇందుకు గుర్తుగా దేశపాత్రునిపాలెంలో జననేత ప్రత్యేక పైలాన్‌ను ఆవిష్కరించారు. అదే రోజున కొత్తవలసలో నిర్వహించిన బహిరంగ సభకు జనం వెల్లువలా తరలివచ్చారు. విజయనగరంలో జనం కనుచూపు మేర జననేత అడుగులో అడుగు వేశారు. పైడితల్లమ్మవారి రెండు జాతరలు ఒకేసారి వచ్చినట్లుగా భారీ సంఖ్యలో జననేత సభకు హాజరయ్యారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు, ఆ పార్టీ మహిళా మోర్చా నాయకురాలు రమణితో పాటు 200 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీ సభ్యత్వం స్వీకరించారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం శాసససభకు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామిని అక్కడి సభలోనే అధినేత ప్రకటించారు. నెల్లిమర్ల మండల కేంద్రంలోని మొయిద జంక్షన్ వద్ద సభ జరుగుతుండగా ఓ ఆటో వచ్చింది. అందులో గర్భిణి ఉండటాన్ని గమనించిన జగన్.. తన ప్రసంగాన్ని నిలిపివేసి ఆటోకు దారివ్వాలని కార్యకర్తలు, ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో ఆమె సకాలంలో ఆస్పత్రికి చేరగలిగింది. పార్వతీపురంలో పోటెత్తిన ప్రజాభిమానం పార్వతీపురం నియోజకవర్గంలో ఇసుక వేస్తే రాలనంతగా జనం పాదయాత్రకు పోటెత్తడంతో పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ కిటకిటలాడాయి. పార్వతీపురంలో జరిగిన బహిరంగ సభకు ఒడిశా ప్రాంతం నుంచి కూడా అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడం విశేషం. కురుపాం నియోజకవర్గంలో ప్రవేశించిన రోజు పాదయాత్ర 300 రోజులు పూర్తి చేసుకుంది. పాదయాత్రలో భాగంగా సుమారు నాలుగు కిలోమీటర్ల మేర తోటపల్లి ప్రాజెక్టు కుడి ప్రధాన కట్టపై జననేత నడక సాగించారు. -
మన్యంలో మగ్గిపోతున్నామయ్యా..
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘అయ్యా.. మావి గిరిజన గ్రామాలు.. కనీస వసతులు లేక కునారిల్లుతున్నాం.. గొంతు తడుపుకుందామంటే మంచి నీటికి కూడా కరువే.. కలుషిత నీరే మాకు దిక్కు.. రాకపోకలకు రహదారులూ సక్రమంగా లేవు.. రోగమొస్తే దైవాధీనం.. సమస్యల గురించి పాలక పార్టీ నేతలు అసలు పట్టించుకోవడం లేదు. అధికారులూ శ్రద్ధ చూపడం లేదు’ అని వివిధ గ్రామాల గిరిజనులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం 304వ రోజు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కురుపాం నియోజకవర్గంలోని జియమ్మవలస మండల గ్రామాల్లో పాదయాత్ర సాగించారు. ఈ క్రమంలో తురకనాయుడు వలస వద్ద 3,300 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించారు. శిఖబడి క్రాస్ నుంచి ప్రారంభమైన యాత్ర గెడ్డతిరువాడ, ఇటిక, కుందరతిరువాడ క్రాస్, చిన్నకుడమ క్రాస్, తురకనాయుడువలస వరకు సాగింది. ఆద్యంతం మన్నెం ప్రజలు ఆయనకు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. తాము ఎదుర్కొంటున్న అసంఖ్యాకమైన సమస్యలను జననేత దృష్టికి తెచ్చారు. అంకువరం, చిన్న బుడ్డివరం గ్రామ మహిళలు జగన్‌ను కలిసి తమకు తాగునీరు అందడం లేదని మొర పెట్టుకున్నారు. గెడ్డకు వెళ్లి కలుషిత నీరు తెచ్చుకుని తాగాల్సిన దుస్థితిలో ఉన్నామని వాపోయారు. ఈ నీటి వల్ల తరచూ అనారోగ్యం పాలు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలన్నీ వారికేనట.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తమ గ్రామాల కోసం ఒక ఫిల్టర్ బావిని ఏర్పాటు చేసినా, ఈ పాలకులు అక్కడి నుంచి పైపులు, కొళాయిలు వేసిన పాపాన పోలేదని ప్రజలు జగన్ ఎదుట వాపోయారు. అధికార పార్టీ నాయకులకు ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. అలమండ, కొండ చిలకాం, టీకే జమ్ము, పెద్ద తోలుమండ గ్రామాల్లో కనీస వసతులు లేవని, అనేక సమస్యలున్నాయని తూర్పు ముఠా గ్రామాల గిరిజనులు వివరించారు. రావాడ రామభద్రాపురం వద్ద 2004లో వైఎస్ గిరిజన పాఠశాలను మంజూరు చేశారని, గిరిజన రైతులు అందుకోసం పొలం ఇచ్చినా ఆ తర్వాత దాని అతీగతీ లేదన్నారు. రావాడ రామభ్రద్రాపురంలో ఉన్న పీహెచ్సీ, సీహెచ్‌సీలో పరిస్థితులు మెరుగు పరిచేలా చూడాలని విన్నవించారు. జియమ్మవలస గ్రామానికి వట్టి గెడ్డ రిజర్వాయరుకు ఎత్తిపోతల పథకం ద్వారా నీరు ఇవ్వాలని పలువురు కోరారు. ఆధార్‌తో అనుసంధానం చేయలేదని కొద్ది నెలలుగా తనకు రేషన్ బియ్యం ఇవ్వడం లేదని శిఖబడి గ్రామం వద్ద ఓ మహిళ ఫిర్యాదు చేసింది. టీడీపీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు, రుణాలను ఇస్తున్నారని అర్హులైన తమకు మంజూరు చేయడం లేదని పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. జన్మభూమి కమిటీల ఇష్టానుసారం పనులు జరుగుతున్నాయని మండిపడ్డారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను జగన్ వద్దకు తీసుకు వచ్చి వారి అనారోగ్య సమస్యలను చెప్పుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వ వైభవం వచ్చేలా చూడాలని కోరారు. తురకనాయుడు వలస వద్ద 3,300 కి.మీ అధిగమించిన పాదయాత్ర, మొక్క నాటుతున్న వైఎస్ జగన్ తిత్లీ బాధితులను ఆదుకోలేదు.. తాము తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని శివాడ గ్రామానికి చెందిన తిత్లీ తుపాను బాధితులైన పలువురు రైతులు జగన్‌ను కలుసుకుని విన్నవించారు. తమకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు న్యాయం చేస్తారన్న నమ్మకం పోయిందని అగ్రిగోల్డ్ బాధితులు పలువురు జననేత వద్ద కష్టాలు ఏకరువుపెట్టారు. మీరు అధికారంలోకి రాగానే ఆదుకోవాలని కోరారు. కాగా, ఆదివారం శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించనున్న జగన్ పాదయాత్ర జిల్లాలో 350 కిలోమీటర్ల మేర సాగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. -
‘కట్టే కాలేవరకు వైఎస్సార్ సీపీలోనే’
సాక్షి, కురుపాం: జీవితాంతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు. జగనన్న వెంట నడుస్తానని తెలిపారు. కురుపాం గడ్డ.. వైఎస్సార్ కుటుంబానికి అడ్డ అని పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా కురుపాంలో మంగళవారం సాయంత్రం జరిగిన బహిరంగసభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ... ‘వైఎస్సార్ అభిమానులు ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు. కట్టె కాలే వరకు వైఎస్సార్ కుటుంబంతోనే ఉంటామని అంటుంటారు. అధికార పార్టీ నన్ను ప్రలోభాలకు గురిచేయాలని ప్రయత్నించింది. నా చేతిపై వైఎస్సార్ పచ్చబొట్టు పొడిపించుకున్నాను. ఎప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. కురుపాం నియోజకవర్గంలో చాలా సమస్యలున్నాయి. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే మన సమస్యలు జగనన్న పరిష్కరిస్తారు. కురుపాం ప్రజలు, కార్యకర్తలు, జిల్లా పెద్దల ఆశీస్సులు, జగన్ ఆశీస్సులు మాకు మెండుగా ఉన్నాయి. జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం మేము దేనికైనా రెడీ’ అని పుష్పశ్రీవాణి అన్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురించి లొంగకుండా ఉన్న పుష్పశ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్ రాజుకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైఎస్ జగన్‌తోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంట్ సమన్వయకర్త మాధవి అన్నారు. విజయనగరం జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిందేమి లేదని విమర్శించారు.. -
300వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, విజయనగరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 300వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం జననేత పార్వతీ పురం నియోజకవర్గంలోని కోటవాని వలస నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బంతువాణి వలస, అడ్డపుశీల క్రాస్, బచి జంక్షన్, సీతాపురం క్రాస్ మీదుగా కురుపమ్ నియోజక వర్గంలోకి ప్రవేశిస్తారు. ఉల్లిభద్ర, గరుగుబిలి క్రాస్, కే రామినాయుడు వలసక్రాస్, తోట పల్లి రిజర్వాయర్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. -
299వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, విజయనగరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 299వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం జననేత విజయనగరం నియోజకవర్గంలోని సురమ్మపేట నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నర్సీపురం, వసుంధర నగర్, ఎర్రా క్రిష్ణా కాలనీ, పార్వతీ పురం వరకు పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం పార్వతీ పురంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద జరిగే బహిరంగ సభలో జననేత వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మేరకు వైఎస్సార్సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. -
వైఎస్ జగన్ పాదయాత్ర పున:ప్రారంభం
-
వైఎస్ జగన్ పాదయాత్ర పున:ప్రారంభం
సంకల్పమే ఆయన ఊపిరి... ప్రజల మధ్య ఉండాలని, వారి బాగోగులు తెలుసుకోవాలి...రాజన్న రాజ్యం తీసుకొచ్చి.... ప్రజాసమస్యలన్నీ పరిష్కరించాలి... ఇదే ఆయన ధ్యేయం, ఆయన లక్ష్యం... ఈ లక్ష్యసాధనలో ఎదురవుతున్న అవరోధాలను దాటుకుంటూ, కుట్ర రాజకీయాలను ఛేదిస్తూ... సంకల్పసూరీడై ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్. తనపై హత్యాయత్నం జరిగినా అదరక, బెదరక... మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి.. పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మృత్యుంజయుడై తమ వద్దకు వస్తున్న రాజన్న బిడ్డను ప్రజలు ఎంతో ప్రేమగా అక్కున చేర్చుకుంటున్నారు. ఆయన్ను కలవాలని... ఎలా ఉన్నారో ఒక్కసారి కళ్లారా చూడాలని తరలి వస్తున్నారు. సాక్షి, విజయనగరం : అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పున:ప్రారంభమైంది. గత నెల 25న విశాఖ ఎయిర్ పోర్ట్‌లో ఆయనపై హత్యాయత్నం జరగడం.. చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో జననేత పాదయాత్రకు స్వల్ప విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. 17 రోజుల విశ్రాంతి అనంతరం వైఎస్ జగన్ తన 295వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం సాలూరు నియోజకవర్గం, పాయకపాడులో పున: ప్రారంభించారు. వజ్రసంకల్పమే ఊపిరిగా ముందుకుసాగుతున్న జననేత వైఎస్ జగన్‌ను కలిసేందుకు పాయకపాడుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. జననేతకు తమ సమస్యలు విన్నవించేందుకు, తమ కష్టాలు చెప్పేందుకు మహిళలు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. అడుగడుగునా ప్రజలను పలుకరిస్తూ.. జనంతో మమేకమవుతూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. పాయకపాడు నుంచి మేలపువలస, మక్కువ క్రాస్ రోడ్డు, ములక్కాయవలస మీదుగా కాశీపట్నం క్రాస్ రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగుతోంది. అక్కడ జననేత భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పాపయ్యవలస మీదుగా కొయ్యనపేట వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. 11 జిల్లాలో పాదయాత్ర పూర్తి.. వైఎస్ జగన్ ఇప్పటి వరకు వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్టణం జిల్లాల్లో ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేశారు. అనంతరం విజయనగరం జిల్లా శృంగవరపుకోట, విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేసి సాలూరు నియోజకవర్గంలోకి ప్రవేశించారు. ఈ జిల్లాలో ఇంకా పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలు మిగిలి ఉన్నాయి. ఇవి పూర్తయ్యాక చివరి జిల్లాగా శ్రీకాకుళంలో ప్రవేశిస్తారు. ఏడాదిగా మొత్తం మీద ఇప్పటి వరకు జగన్ 3,211.5 కిలోమీటర్ల దూరం నడిచారు. -
ఈవీఎంలు తరలిస్తుండగా..ఏకే47 మిస్సింగ్
సాక్షి, విజయనగరం : ఈవీఎంలు తరలిస్తున్న భద్రతాసిబ్బందికి చెందిన ఏకే47 తుపాకిని గుర్తు తెలియని దుండగులు అపహరించిన ఘటన విజయనగరంలో కలకలం సృష్టిస్తోంది. ఎన్నికల నిమిత్తమై ఒడిశాకి ఈవీఎంలను లారీలో తరలిస్తున్నారు. శనివారం వేకువజామున నాతవలస టోల్గేట్ వద్దకి లారీ చేరుకుంది. భద్రతాసిబ్బంది విశ్రాంతి కోసమని టోల్గేట్ దాటి కొంచెం ముందుకు వెళ్లి హైవే పక్కన లారిని ఆపారు. సిబ్బంది విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు వచ్చి ఏకే 47 తుపాకిని దొంగిలించారు. ఆ తుపాకి అభిమన్యు సహూ అనే భద్రతా సిబ్బందిదిగా గుర్తించారు. దీంతో భద్రతా దళాలు బోగాపురం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఏఎస్సీ ఆధ్యర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. -
282వ రోజు ప్రజాసంకల్పయాత్ర
-
282వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
-
282వరోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, చీపురుపల్లి : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగుతోంది. మంగళవారం ఉదయం జననేత 282వ రోజు పాదయాత్రను గుర్ల మండలం గరికవలస నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి గజపతి నగరం నియోజకవర్గంలోని కెంగువ, ముచ్చెర్ల, కొండపేట క్రాస్ మీదుగా జిన్నం వరకూ ప్రజాసంకల్ప యాత్ర కొనసాగనుంది. జననేత వైఎస్ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ఇక ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. వారి సమస్యలను విన్న వైఎస్ జగన్, వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. -
‘గజపతి’ నియోజకవర్గంలోకి వైఎస్ జగన్.. ఘన స్వాగతం
సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్ర ఎస్.కోట నియోజకవర్గంలో విజయవంతంగా పూర్తి చేసుకొని గజపతినగరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. జననేతకు ఆ పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, అప్పలనర్సయ్య, నియోజకవర్గ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. దీంతో కొత్త వలస-విజయనగరం రోడ్డు జనసంద్రంతో నిండిపోయింది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గొడికొమ్ము గ్రామ మహిళలు కలిసి జననేతను కలిశారు. డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో చంద్రబాబు నాయుడు మోసం చేశారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా వడ్డీలేని రుణాలు ఇవ్వటం లేదని, దీంతో తీసుకున్న రుణానికి ప్రతీ నెలా వడ్డీల రూపంలో రూ.3వేలు వసూలు చేస్తున్నారని రాజన్న తనయుడికి తమ ఆవేదన వక్యం చేశారు. పలు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో గెలిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందటంలేదని, సాయం అందిస్తే మరిన్ని విజయాలు సాధిస్తానని దివ్యాంగురాలు, వెయిట్ లిఫ్టర్ రాజేశ్వరి వైఎస్ జగన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించింది. (జగన్‌ను కలిసిన సాహసవీరుడు) అంతకముందు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఎలాంటి అభివృద్ది చేయటం లేదని, నియోజకవర్గ సమస్యలు అస్సలు పట్టించుకోవడంలేదని ఎస్.కోట నియోజకవర్గ ప్రజలు జననేతకు చెప్పుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని, స్థానిక సమస్యలను ఎమ్మెల్యే లలిత కుమరి పట్టించుకోవడం లేదని జామి మండల మైనారిటీలు జననేత దృష్టికి తీసుకెళ్లారు. తమను అక్రమంగా తొలగించారిన జామి మండల ఫీల్డ్ అసిస్టెంట్లు వైఎస్ జగన్‌కు పిర్యాదు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఫీల్డ్ అసిస్టెంట్లు జననేతకు వినతి పత్రం సమర్చించారు. (జగన్‌తో నడిచిన ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి) జననేతను కలిసిన జిందాల్ నిర్వాసితులు దివంగత నేత వైఎస్సార్ తర్వాత తమను పట్టించుకునేవారే లేరని జిందాల్ ఫ్యాక్టరీ నిర్వాసితులు వైఎస్ జగన్ ముందు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా రాజన్న తనయుడిని జిందాల్ ఫ్యాక్టరీ నిర్వాసితులు, రైతులు టీడీపీ దుర్మార్గపు పాలనలో ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఫ్యాక్టరీ పెట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, జిందాల్ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని రైతుల వైఎస్ జగన్‌ను కోరారు. ప్రజల సమస్యలను ఓపిగ్గా విన్న జననేత వారికి భరోసానిస్తూ ముందుకు కదిలారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు మండుటెండను సైతం లెక్క చేయకుండా జననేత వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. (చారిత్రాత్మక పైలాన్ ఆవిష్కరణ) చదవండి: నడిచేది నేనైనా.. నడిపించేది మీ అభిమానమే చరిత్రాత్మక ఘట్టం: ప్రజాసంకల్పయాత్ర @3000 కి.మీ. -
‘టీడీపీ హయాంలో కరెంటు, నీటి కష్టాలు’
సాక్షి, ఎస్.కోట(విజయనగరం): ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 272వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం ఎస్.కోట నియోజకవర్గంలోని లక్కవరపుకోట మండలం కోట్యాడ నుంచి ప్రారంభించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కిర్ల గ్రామానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున జననేతను కలిసారు. గ్రామానికి సంబంధించిన సమస్యలను రాజన్న బిడ్డ దృష్టికి తీసుకెళ్లారు. అధికార టీడీపీ దుర్మార్గ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కుటుంబం ఎస్.కోట నియోజకవర్గం నుంచి సుదీర్ఘ కాలం ప్రాతినిథ్యం వహిస్తున్నా.. తమ గ్రామాల్లో ఒక రోజు మంచి నీరు వస్తే నాలుగు రోజులు రావని, కరెంట్ సౌకర్యం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని జాగారం గ్రామ మహిళలు వైఎస్ జగన్‌కు దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు తీరుస్తానని వైఎస్ జగన్ వారికి భరోసానిస్తూ ముందుకు కదిలారు. అభిమాన నాయకున్ని కలవటానికి, సమస్యలు విన్నవించుకోవటానికి జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు. రాజన్న తనయుడితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడగా... వారందరితో జననేత ఆత్మీయంగా చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీలు దిగారు. -
వైఎస్ జగన్ చెప్పిన బల్ల కథ
సాక్షి, కొత్తవలస(విజయనగరం) : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కొత్తవలస బహిరంగ సభలో ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన బల్ల ఆట కథ ఆకట్టుకుంది. ‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన పాలనను చూస్తుంటే స్కూళ్లో పిల్లలు ఆడుకునే ఓ ఆట గుర్తుకొస్తుంది. ఈ ఆటలో ఓ బల్ల ఉంటుంది. ఒకవైపు ఒకరు మరోవైపు మరొకరు కూర్చుని ఆడుతుంటారు. ఈ ఆటలో బల్లపై ఒకవైపు బరువు ఉన్న వ్యక్తి కూర్చుంటే.. మరో వైపు బరువు లేని పిల్లవాడు లేస్తాడు. ఇలానే బరువున్న చంద్రబాబు తన మామ దివంగత ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి బల్లపై కూర్చున్నారు. దీంతో బల్లపై మరోవైపు ఉన్న సబ్సిడీలు, సంక్షేమ పథకాలు, రాజకీయ విలువలు, ధర్మం అన్ని ఎగిరిపోయాయి. ఆయన సీఎం బల్లపై కూర్చున్నాడు మధ్య నిషేదం గోవిందా.. రెండు రూపాయల బియ్యం గోవిందా.. ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వరంగ ఉద్యోగాలు గోవిందా.. వ్యవసాయం, వర్షాలు, గిట్టుబాటు ధరలు అన్నీ గోవిందా.. రాజకీయ విలువలు కూడా గోవిందా గోవిందా.. దీంతో ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి దించేశారు. ప్రజలంతా ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆదరించారు. ఆయన వచ్చి ఆ బల్లమీద కూర్చున్నాడు. దీంతో రైతులకు ఉచితంగా కరెంట్ వచ్చింది. కరెంట్ బకాయిలు మాఫీ అయ్యాయి. ఫీజు రీయింబెర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ, కుయ్‌కుయ్ అంటూ 108, 104లు వచ్చాయి. దేశం మొత్తం 48 లక్షల ఇళ్లు కడితే ఆ దివంగత నేత ఒక్కడే ఉమ్మడి రాష్ట్రంలో 48 లక్షల ఇళ్లు కట్టించాడు. జలయజ్ఞంతో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తిచేసే ప్రయత్నం చేశాడు. కరెంట్ చార్జీలు పెంచని పాలనంటే ఆయనదే. రెండు రూపాయలకు బియ్యం తీసుకొచ్చాడు. పెన్షన్లు వచ్చాయి. పేదలందిరికి భూపంపిణీ జరిగింది. మళ్లీ ఇవాళ చంద్రబాబు వచ్చారు. మళ్లీ బరువు ఎక్కువైంది. రైతుల సంక్షేమం పేరుతో రుణమాఫీలు అని మోసం చేశాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంకా రాలేదు. గిట్టుబాటు ధరలేదు. వ్యవసాయం భారంగా మారి రైతులు ఆత్మహత్య చేస్తుకుంటున్నారు.’ అని బల్ల ఆట కథతో చంద్రబాబు పాలనను వైఎస్ జగన్ వివరించారు. -
ఈ నెల 16న విజయనగరంలోకి ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. ఈ నెల 16న విజయనగరంలోకి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశించనుంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, తదితర అంశాలపై చర్చించేందుకు పలు సంఘాలు, న్యాయవాదులు, పార్టీ కార్యకర్తలతో వైఎస్ జగన్ భేటి ఉంటుందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 10న సిరిపురం విజ్ఞాన్ గ్రౌండ్లో బ్రాహ్మణులతో ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని వివరించారు. అదే విధంగా వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ నెల11న వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు సమావేశం ఉంటుందని.. ఈ సమావేశానికి 175 అసెంబ్లీ, 25 పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, కో ఆర్డినేటర్లు హాజరవుతారన్నారు. ఈ నెల 12న అరిలోవ బీఆర్టీఎస్ రోడ్డులో ముస్లింలతో వైఎస్ జగన్ ఆత్మీయ సమవాశం ఉంటుదన్నారు. అదేవిధంగా ఈ నెల 15న న్యాయవాదులు వైఎస్ జగన్‌ను కలవనున్నారని వివరించారు. -
రిసెప్షన్ రోజే నవవరుడు ఆత్మహత్య
సాక్షి, విజయనగరం : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వివాహమైన రెండో రోజే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని బాబామెట్ట పాంత్రంలో జరిగింది. బాబామెట్ట ప్రాంతానికి చెందిన మోహన్ చీపురుపల్లి వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 2న(ఆదివారం) ఆయన వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవారం సాయంత్రం జరగనున్న రిసెప్షన్ పనుల్లో కుటుంబీకులు బిజీగా ఉండగా.. ఏమైందో ఏమో కానీ మోహన్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహమైన అయిన రెండో రోజే నవవరుడు ఆత్మహత్య చేసుకోవడంతో పెళ్లింట విషాదం నెలకొంది. మోహన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
చదువుకావాలంటే... ఇలా వెళ్లాలి మరి!
కురుపాం విజయనగరం : ఇక్కడ నీటిలో వెళ్తున్న వీరంతా చదువుకోసం ఎంత కష్టపడుతున్నారో చూడండి. కురుపాం మండలం గొటివాడ పంచాయతీ బోరి గిరిజన గ్రామానికి చెందిన 15మంది వరకు గిరిజన చిన్నారులు ప్రాధమిక విద్యనభ్యసించేందుకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న గొటివాడ మండల పరిషత్ పాఠశాలకు కాలినడకన వెళుతుంటారు. మామూలు రోజుల్లోనైతే ఫర్వాలేదు గానీ... వర్షాకాలం వస్తే మాత్రం ఇదిగో ఇలా దారిలోని వట్టిగెడ్డ వాగు దాటాలి. సోమవారం వారు పాఠశాలకు వెళ్తుండగా వట్టిగెడ్డలోకి నీరు చేరడంతో ఇలా ఒకరి చేయి ఒకరు పట్టుకొని గెడ్డను దాటే ప్రయత్నం చేస్తున్నారు. పొరపాటున జరగరానిదేమైనా జరిగితే ఆ కన్నవారి కడుపుకోత తీర్చేదెవరు? నష్టం జరిగాక పరిహారం ఇచ్చి చేతులు దులుపుకునే అలవాటున్న సర్కారుకు ఇక్కడ ఓ కాజ్వే నిర్మించాలన్న ఆలోచన రాకపోవడమే దురదృష్టకరం. -
ఆన్లైన్లో ఇంటిపన్ను వివరాలు
రామభద్రపురం(బొబ్బిలి): జిల్లాలో ఇప్పటివరకూ చేపట్టిన ఇంటిపన్ను వసూళ్ల వివరాలను తక్షణమే ఆన్లైన్లో పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) బి సత్యనారాయణ కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రూ.15 కోట్లు ఇంటి పన్ను డిమాండ్ ఉండగా రూ.12 కోట్లు వసూలైందన్నారు. ఇందులో రూ.5 కోట్లు ఆన్లైన్లో పెట్టారని, మిగతా రూ.7 కోట్లు ఆన్లైన్లో పెట్టాల్సి ఉందన్నారు. ఈనెలాఖరు లోగా ఆన్లైన్లో పెట్టని కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో మొత్తం 3,86,000 ఇళ్లు ఉన్నాయని తెలిపారు. జిల్లాలో 1510 కిలోమీటర్ల కాలువల్లో పూడికలు తొలగించామన్నారు. ఇందులో 175 కిలోమీటర్లు మాత్రమే ఆన్లైన్ చేశారని తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైనందున కాలువల్లో మురుగు నీల్వ ఉండకుండా పూర్తిగా తొలగించాలని డీపీఓ ఆదేశించారు. ప్రజలు రోగాలకు గురైతే కార్యదర్శులదే బాధ్యతని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను పరిశీలించాల్సిన బాధ్యత ఈఓపీఆర్డీలదేనన్నారు. పంచాయతీ ఖర్చులనకు సాఫ్ట్‌వేర్‌లో పొందుపరచాలని, చంద్రన్న పెళ్లికానుకకు కావాల్సిన వివాహ ధ్రువీకరణ పత్రాలు సకాలంలో ఇవ్వాలని సూచించారు. జిల్లాల్లో 669 చెత్తశుద్ధి కేంద్రాల నిర్మాణాలు ప్రారంభించగా వాటిలో 129 పూర్తి చేశామన్నారు. 50 కేంద్రాల్లో వర్మీకంపోస్టు తయారు చేస్తున్నట్లు డీపీఓ తెలిపారు. -
కిచ్చాడలో జ్వరాల పంజా
కురుపాం : మండలంలోని కిచ్చాడ గ్రామంలో జ్వరాలు పంజా విసిరాయి. గ్రామంలోని పలువురు మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో మంచమెక్కారు. ఇంటికొక్కరు, ఇద్దరు చొప్పున జ్వరంతో బాధపడుతున్నారు. వారం రోజులుగా మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో పాటు విష జ్వరాల బారిన పడ్డారు. ప్రస్తుతం గ్రామంలో గవర రాజ్యలక్ష్మి, బాలాజీ, గవర హేమంత్, జి.హర్షవర్ధన్, వరుణ్‌తేజ్, శారద, బెవర రమణ, ఎట్టి గంగ, పామల సోములు, టి.సింహాచలం, పి.చైతన్య, ఎ.సాయితో పాటు మరో పది మంది మలేరియా, విష జ్వరాల బారిన పడి బాధపడుతున్నారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో పలువురు ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. పేదలు అందుబాటులో ఉన్న సంచి వైద్యులను ఆశ్రయించి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ఇద్దరికి డెంగీ... గ్రామంలో వారం రోజుల కిందట ఒకరికి తీవ్ర జ్వరం రాగా మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం తీసుకువెళ్లగా డెంగీ అని వైద్యులు గుర్తించినట్టు తెలిసింది. మరో మహిళ డి.సునీత తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఎప్పటికీ తగ్గుముఖం పట్టకపోవడంతో పాటు ప్లేట్లెట్స్ స్థాయి తగ్గిపోవడంతో వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించగా ఆమెకు కూడా డెంగీ ఉన్నట్టు వైద్యాధికారులు గుర్తించారని కుటుంబ సభ్యులు తెలిపారు. మలేరియా వచ్చిందా.... ఇదిలా ఉండగా వారం రోజులుగా కిచ్చాడ గ్రామంలో పలువురు వ్యక్తులు మలేరియా జ్వరాల బారిన పడి జియ్యమ్మవలస మండలం పెదమేరంగి కూడలిలో ఉన్న ఓ ప్రైవేటు వైద్యుడును ఆశ్రయించగా ఆ మలేరియా జ్వరం వస్తే చాలు నయం చేయటానికి రూ.3000 వసూలు చేస్తున్నట్టు ఇదివరలో చికిత్స పొందిన బాధితులు చెబుతున్నారు. అసలే పేదరికంతో ఉన్న వీరు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇదిలా ఉండగా వైద్యాధికారులు తక్షణమే స్పందించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచే చర్యలు వెంటనే చేపట్టాలని వారు కోరుతున్నారు. లేకుంటే మరింత మంది జ్వరాల బారిన పడడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు. -
లంచాలకు ఎవరైనా రసీదులు ఇస్తారా : పవన్
సాక్షి, విజయనగరం : అవినీతిని నిరూపించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటుంటారు.. లంచాలకు ఎవరైనా రసీదులు ఇస్తారా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. జిల్లాలోని సాలూరులో శుక్రవారం పవన్ మాట్లాడుతూ.. తెలుగుదేశం నాయకులు చివరకు అంగన్వాడీ పోస్టులకు లక్షలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. బాక్సైట్ మైనింగ్ కోసం కొండలు అక్రమంగా తవ్వేస్తున్నారు.. ఇది అవినీతి కాదా అని జనసేత అధినేత నిలదీశారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం భూసేకరణ చేయకపోతే జన సైనికులు అడ్డుపడుతారని హెచ్చరించారు. ‘ మద్యంషాపులను ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి మహిళలను భయాందోళనకు గురి చేస్తున్నారు. అంతేకాక సాలూరులో టూరిజం ఏర్పాటు చేయాలి. ఆర్పీ బంజ్‌దేవ్ గిరిజనుడు కానప్పటికీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియమించి చంద్రబాబు సర్టిఫికెట్ ఇచ్చారు. సాలూరు తొలి ఎమ్మెల్యే ఎంఎల్ఏ కునిశెట్టి వెంకట దొర విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. అంతేకాక సాలూరులో వంద పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైంది’ అని పవన్ ప్రశ్నించారు. యువతను మోసం చేసే పథకాలను చంద్రబాబు ప్రవేశ పెడుతున్నారని విమర్శలు గుప్పించారు. నిరుద్యోగ భృతి నెలకు వెయ్యి, అది కూడా డిగ్రీ చదివిన వారికి మాత్రమే అట, మిగతా వారు యువకులు కాదా అని జనసేన అధినేత నిలదీశారు. అంతేకాక జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యగోగులకు జనసేన అండగా ఉంటుందని పవన్ హామీ ఇచ్చారు. జనసేన అధికారంలోకి వస్తే కేంద్రంపై వత్తిడి తెచ్చి రద్దు చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన కేంద్రం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా 17 వేల కిలోమీటర్లు రోడ్లు వేశామని చెప్పారు.. సాలూరుకు బైపాస్ వేశారా అని నిలదీశారు. సాలూరులో వేలమంది కార్మికులు ఉన్నారు. ఆటో నగర్ ఉంటే అభివృద్ది చెందేదన్నారు. ఉద్దానం సమస్యను ప్రపంచం దృష్టికి ఎలాగా తీసుకు వెళ్లానో అదే విధంగా సాలూరు సమస్యలను తీసుకెళ్తామని పేర్కొన్నారు. జిల్లాలో 5వేల చెరువులు ఉన్నా ఫలితం లేదు. స్థానిక తెలుగు దేశం ఇంచార్జ్ బంజదేవ్ పెద్ద గెడ్డ రిజార్వాయర్ నుంచి నీటిని రొయ్యల చెరువుకు అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. కలుషిత నీటిని ప్రజలకు పంపించడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని పవన్ మండిపడ్డారు. -
రైతు ఆదాయాన్ని పెంచండి
విజయనగరం ఫోర్ట్ : రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ కమిషన్‌రేట్ జాయింట్ డైరెక్టర్ రామరాజు, విశ్రాంత అడిషనల్ డైరెక్టర్ నారాయణ చౌదరి అన్నారు. స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో గురువారం వ్యవసాయ శాఖ అధికారులతో వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల ఆదాయం రెట్టింపు అయ్యే విధంగా కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. వర్షాధార భూములు కాబట్టి చెరువులను అభివృద్ధి చేయించాలన్నారు. వ్యవసాయ శాఖ జేడీ జి.ఎస్.ఎన్.లీలావతి, డీడీ పి.అప్పలస్వామి పాల్గొన్నారు. -
విజయనగరం జిల్లాలో పిడుగుల బీభత్సం
భోగాపురం : విజయనగరం జిల్లాలో మంగళవారం పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఒకే రోజు పిడుగులు పడి వేర్వేరు చోట్ల నలుగురు మృతిచెందారు. మరొకరికి గాయాలు అయ్యాయి. భోగాపురం మండలం రాజుపులోవలో పిడుగు పడి దుక్క రాములమ్మ, ఆమె మనవరాలు శ్రావణి మృతిచెందారు. పూసపాటిరేగ మండలం రెళ్లివలసలో పొలాల్లో పశువులు కాస్తోన్న రౌతు గౌరునాయుడనే యువకుడు పిడుగుపాటుకు మృతిచెందాడు. తెర్లాం మండలం సుందరాడలో పొలంలో పనిచేస్తోన్న ఆదినారాయణ అనే యువకుడు కూడా పిడుగుపాటుకు బలయ్యాడు. నందబలగలో మరో వ్యక్తి పిడుగుపాటుకు తీవ్రగాయాలపాలయ్యాడు. -
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చుట్టూ టీడీపీ నేతలు
సాలూరు (విజయనగరం) : తనను టీడీపీలో చేరాలంటూ ఆ పార్టీ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర తెలిపారు. ఆదివారం తన స్వగృహంలో పలువురు పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇదివరకు కొంత మంది ఎమ్మెల్యేలను కొన్న టీడీపీ నాయకులు తనను కూడా కొనుగోలు చేయాలని నెలరోజులుగా తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని వెల్లడించారు. గత రాత్రి కూడా తనను సంప్రదించారని చెప్పారు. నేను చెప్పింది అవాస్తవమని టీడీపీ నాయకులు ఖండిస్తే బోసుబొమ్మ జంక్షన్లో బహిరంగంగా విషయాలన్నింటినీ వెల్లడిస్తానని స్పష్టం చేశారు. టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంలో తప్పేముందని ఎమ్మెల్సీ సంధ్యారాణి వ్యాఖ్యానించడాన్ని రాజన్నదొర తప్పుబట్టారు. భారత రాజ్యాంగంపై అవగాహన లేకుండా, ప్రజాప్రాతినిథ్య చట్టం గురించి తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. -
తప్పెవరిది..?
విజయనగరం ఫోర్ట్ : కవల పిల్లలు పుడతారని వైద్యులు చెప్పగానే రామలక్ష్మణులే పుడతారన్న సంతోష పడ్డారామె. వారిని పెంచి పెద్ద చేసేందుకు లెక్కకు మిక్కిలి కలలు కన్నారు. జీవితాంతం పిల్లలతో ఆనందంగా గడపాలనుకున్నారు. ఇంతలోనే విధి మృత్యువు రూపంలో కాటేసింది. ఈ హృదయ విదారక ఘటన జిల్లా కేంద్రంలోని ఘోషాస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పూసపాటిరేగ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన కొమర అప్పయ్యమ్మ (23) అనే గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. ఆది వారం సాయంత్రం బంధువులు ఆమెను ఘోషాస్పత్రిలో చేర్పించారు. అంతకు ముందు నిర్వహించిన ఆల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో గర్భంలో కవలలు ఉన్నట్లు గుర్తించారు. సోమవారం ఉదయం అప్పయ్యమ్మకు సాధారణ ప్రసవమైంది. మగ శిశువు జన్మించాడు. కానీ కవల పిల్లలు అని ముందే తెలిసిన వైద్యులు రెండో బిడ్డ కోసం ఆపరేషన్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితిలో ఆమె మృతి చెందారు. గర్భంలోని ఆడశిశువు కూడా మృతి చెందింది. పట్టించుకోలేదు.. మా చెల్లిని ఆదివారం ఘోషాస్పత్రిలో చేర్పించాం. ముందు సాధారణ ప్రసవమైంది. మగ బిడ్డ పుట్టాడని చెప్పారు. ఆ తర్వాత సుమారు గంట వరకు వైద్యులు ఆమెను పట్టించుకోలేదు. ఏం జరుగుతుందో తెలియలేదు. గంట తర్వాత ఆపరేషన్ చేయాలి, సీరియస్‌గా ఉందని చెప్పారు. అలా చెప్పిన కొద్ది సేపటికే మీ చెల్లి చనిపోయిందన్నారు. వారు సకాలంలో పట్టించుకుని ఉంటే మా చెల్లి బతికేది. – బర్రి అప్పన్న, మృతురాలి అన్నయ్య. వైద్యుల నిర్లక్ష్యం లేదు.. అప్పయ్యమ్మ మృతి విషయంలో వైద్యుల నిర్లక్ష్యం లేదు. తొలుత సాధారణ ప్రసవమైంది. మగబిడ్డ జన్మించాడు. రెండో బిడ్డను తీసేందుకు సిజేరియన్ చేసేందుకు వైద్యులు ఏర్పాటు చేశారు. ఈ లోగా ఆమె ఊపిరితిత్తుల్లోకి ఉమ్మినీరు వెళ్లిపోవడంతో శ్వాస ఇబ్బందిగా మారి మరణించింది. ఆమెను బతికించడానికి వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు. లక్ష మందిలో ఒకరికి ఇలా జరుగుతుంది. –జి.ఉషశ్రీ,జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి. ఇది బంధువుల వాదన.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తల్లి,బిడ్డ చనిపోయారని మృతిరాలి బంధువులు ఆరోపిస్తున్నారు. సాధారణ ప్రసవమైన తర్వాత అప్పయ్యమ్మను పట్టించుకోకుం డా వదిలేశారని వారు చెబుతున్నారు. సకా లంలో సిజేరియన్ చేసి ఉంటే తల్లి, బిడ్డ ఇద్దరు బతికేవారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వైద్యులను సంప్రదిస్తే అలాంటిదేమి లేదని పేర్కొంటున్నారు. -
మృగాళ్ల కావరం
ఐదేళ్ల క్రితం నిర్భయ దృష్టాంతం ఇంకా జనం మనోఫలకం నుంచి తొలగిపోలేదు. రెండు రోజుల క్రితం ఎనిమిదేళ్ల చిన్నారిపై గ్యాంగ్‌రేప్ సంఘటన ఇంకా దేశాన్ని కుదిపేస్తోంది. ఇంతలోనే మరో ఘటన. అదెక్కడో కాదు. మన జిల్లాలోనే. సరిగ్గా నడవలేని దివ్యాంగురాలని కూడా చూడకుండా... ఇద్దరు ప్రబుద్ధులు మద్యం మత్తులో కూరుకుపోయి... కామంతో కళ్లు మూసుకుపోయి... దారుణంగా లైంగికదాడి చేసిన సంఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలోని ఓ దివ్యాంగురాలిపై ఇద్దరు కామాంధులు దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. నిజానికి జిల్లాలో ఇలాంటి సంఘటనలు కొత్త కాదు. ఏటా ఎన్నో జరుగుతున్నా... వెలుగులోకి రానివెన్నో. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అమాయక మహిళలపై అఘాయిత్యాలుసర్వసాధారణమైనప్పటికీ ఏ ఒక్కటీ పోలీస్ స్టేషన్ వరకూ రాదు. స్థానిక పెద్దలే పంచాయతీ చేసి, ఆమె శీలానికి వెలకట్టేస్తుంటారు. పోలీస్ రికార్డుల ప్రకారం జిల్లాలో గతేడాది మూడు, 2016లో ఐదు లైంగిక దాడి ఘటనలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దారుణాలు 2016లో 33 నమోదైతే గతేడాది 46, ఈ ఏడాది ఇప్పటి వరకూ 6 కేసులు రికార్డయ్యాయి. ఈ పరిస్థితులపై ప్రజా, మహిళా సంఘాలు, వైద్యులు, న్యాయ నిపుణులు మండి పడుతున్నారు. సభ్య సమాజం సిగ్గుపడే సంఘటనలు రోజూ ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నా... చట్టాల్లో మార్పులు, ప్రజల్లో చైతన్యం రావాల్సిన అనివార్య పరిస్థితులు వచ్చాయని మేధావులు నినదిస్తున్నారు. నిర్భయ చట్టాన్ని అమలు చేయాలి మానవత్వం మరణించిన వేళ చిన్నపిల్లలను, దివ్యాంగులను కూడా విడవని దుర్మార్గులు ఉన్న ఈ ప్రపంచంలో ఏడు సంవత్సరాల బాలికలకైనా... 70ఏళ్ల అవ్వకైనా రక్షణ లేదు. స్వచ్చభారత్ అన్న మోదీగారు ఆడవాళ్ల ఆత్మగౌరవం కోసం ఏం చేస్తున్నారు. ఆడవాళ్లకోసం ఇచ్చిన చట్టాలు ఏమయ్యా యి. తప్పుడు భావంతో అమ్మాయిని చూడాలంటే మృగాళ్లు భయపడేలాంటి చట్టం మాకు కావాలి. నిర్భయ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలి. – తుమ్మి లక్ష్మీరాజ్, మహిళా సమాఖ్య జిల్లా సహాయకార్యదర్శి, విజయనగరం. పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యమే కారణం పోలీస్ వ్యవస్థ బాగుంటే అంతా బాగుం టుంది. ముఖ్యంగా శాఖాపరమైన నిర్లక్ష్యం వల్లే అత్యాచారాలు ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వాలు మహిళా చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాయి. అభం, శుభం తెలియని అమాయకుల జీవితాలను నాశనం చేసే కామాం ధుల్ని ఉరితీయాలి. రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గడం వల్ల నేరాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. – పాలూరి రమణమ్మ, ఐద్వా జిల్లా సహాయకార్యదర్శి, విజయనగరం ఎన్నో కారణాలు... మరెన్నో బాధలు తల్లిలేదా తండ్రి లేని వారు, ఉన్నప్పటికీ వారి ప్రేమ, భయం, పర్యవేక్షణ లేనివారు ఎక్కువగా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. సెల్ఫోన్లలో ఆశ్లీల దృశ్యాలను ఎక్కువగా చూసేవారు తాము అలా చేయాలని కోరుకుంటారు. స్నేహితుల ప్రభావం కూడా ఉంటుంది. ఇక గ్యాంగ్‌రేప్‌కు గురైన యువతులు భయభ్రాంతులకు లోనవుతారు. ఒక్కోసారి తల్లిదండ్రులను కూడ దగ్గరకు రానివ్వరు. అలాంటి వారికి వెంటనే వైద్యం అందించాలి. రెండు రోజుల పాటు వారి దగ్గరకు ఎవరూ వెళ్లకూడదు. సహాయకులుగా ఒక్కరే ఉండాలి. అదీ మహిళలై ఉండాలి. రెండు మూడు రోజులు తర్వాత సైకాలజిస్టు తో కౌన్సెలింగ్ ఇప్పించాలి. –ఎస్.వి.రమణ, సైకాలజిస్టు, విజయనగరం చట్టాల పటిష్టంగా అమలైతే చాలు మహిళల రక్షణ దిశగా రూపొందించిన చట్టాలు అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని రూపొందించాలి. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి. నిర్థిష్ట సమయంలో విచారణ చేపడితేనే ఇలాంటి దారుణాలు తగ్గుతాయి. మహిళల రక్షణ కోసం గృహ హింస నిరోధకచట్టం, దీనినే నిర్భయ చట్టంగా పిలుస్తున్న ఫోక్సో(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్ట్రన్ ఫ్రం సెక్సవల్ అఫైన్‌సెస్) చట్టం రూపొందించారు. విచారణకు ప్రత్యేక కోర్టులు లేకపోవడం వల్ల కేసుల్లో జాప్యం జరుగుతోంది. -కె.ఆర్.దాశరధి, సీనియర్ న్యాయవాది, విజయనగరం. -
పంది దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు
విజయనగరం మున్సిపాలిటీ : పందుల నియంత్రణ చర్యల్లో అధికారుల నిర్లక్ష్య వైఖరి ఓ బాలుడి నిండు ప్రాణాల మీదకు తెచ్చింది. జిల్లా కేంద్రమైన విజయనగరం మున్సిపాలిటీలో ఆదివారం పట్టణ శివారు ప్రాంతమైన సింగపూర్ సిటీ ప్రాంగణంలో జరిగిన సంఘటనతో ప్రజలంతా ఉలిక్కిపడ్డారు. అదే ప్రాంతానికి టి.సాయి (9) నిత్యావసరాల కోసం దుకాణానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో పిల్లల పంది అనూహ్యంగా దాడి చేసింది. సమీపంలో ఎవ్వరు లేకపోవడంతో సాయిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దీంతో సాయి ముఖంతో పాటు కడుపు, రెండు చేతులు, తొడ భాగంపై తీవ్ర గాయలపాలయ్యాయి. విషయం తెలుసుకుని తల్లిదండ్రులు, స్థానికులు సాయిని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించి 40 కుట్లు వేశారు. మెరుగైన శస్త్ర చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఉలిక్కిపడిన సింగపూర్ కాలనీ వాసులు.. బాలుడిపై పంది దాడి చేయడంతో సింగపూర్ సిటీ ప్రాంతంలో నివసిస్తున్న వారంతా ఉలిక్కిపడ్డారు. నిత్యం వందలాది మంది చిన్నారులు ఈ ప్రాంతంలో పాఠశాలలకు వస్తుంటారు. అయితే ఆదివారం జరిగిన సంఘటనతో పిల్లలను బడికి పంపించేందుకు కూడా భయపడాల్సి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిపై పంది తీవ్ర స్థాయిలో దాడి చేసినా మున్సిపల్ యంత్రాంగం స్పందించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం చేశారు. పందులు, కుక్కల దాడిలో నిత్యం ఎవరో ఒకరు గాయపడుతున్నా మున్సిపల్ పాలకవర్గం, యంత్రాంగం పట్టించుకోకపోవడం పట్ల దారుణమంటూ పట్టణవాసులు మండిపడుతున్నారు. -
అన్యాయంగా చంపేశారు..
భోగాపురం: భర్త, అత్త,మామల వేధింపుల వల్లే మండల కేంద్రానికి చెందిన అడపా శ్రావణి ఆత్మహత్య చేసుకుందని, వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం సాయంత్రం శ్రావణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఎస్పీ ఏవీ రమణ, సీఐ రఘువీర్ విష్ణు ఆదివారం గ్రామానికి చేరుకుని విచారణ చేపడుతుండగా, మహిళా సంఘ సభ్యులు ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రావణి ఏడు మాసాల గర్భవతిగా ఉన్నప్పటినుంచి భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించేవారన్నారు. దీనిపై రెండు సార్లు తాము కౌన్సెలింగ్ కూడా ఇచ్చామని డీఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. వివాహ సమయంలో శ్రావణికి ఇస్తానన్న 1.50 ఎకరాల భూమిని తన పేరుమీద రాయాలని భర్త వేధించేవాడని, ఇందుకు సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పుంగులు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. డీఎస్పీని కలిసిన వారిలో ఎస్సీ,ఎస్టీ మైనారిటీ ఐక్యవేదిక విశాఖ జిల్లా మహిళా కన్వీనర్ కె. జియారాణి, విశాఖ మహిళా వేదిక జాయింట్ సెక్రటరీ చిన్ని, మృతురాలి తల్లి రామలక్ష్మి, తదితరులున్నారు. -
నగరంలో భూచోళ్లు...!
రియల్ ఎస్టేట్ ముసుగులో ప్రభుత్వ భూముల్ని ఆక్రమించేస్తున్నారు.కొంతమొత్తంలో ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా కలిపేసుకుంటున్నారు. వీరికి అధికార పార్టీ నాయకులు వత్తాసు పలుకుతున్నారు. వారిపై చర్యలు తీసుకోలేక అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. అడ్డుకునేందుకు ఎవరైనా స్థానికులు యత్నిస్తే వారికి హెచ్చరికలు సైతం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ఈ తరహా అక్రమాలు జరుగుతుండటం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. విజయనగరం మున్సిపాలిటీ: విజయనగరం పట్టణ శివారు ప్రాంతం బొబ్బాదిపేట దశాబ్దం క్రితం వరకూ మండల పరిధిలో ఉన్న సమయంలో సర్వే నంబర్ 4/3లోని ఐదు ఎకరాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా లే అవుట్ వేశారు. ఈ ప్రాంతం విజయనగరం మున్సిపాలిటీలో విలీనం కాగా... ప్రస్తుతం 26వ వార్డు పరిధిలో ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో గజం స్థలం ధర రూ. 10 వేల నుంచి రూ. 15వేల వరకు పలుకుతోంది. ఇప్పటికీ లే అవుట్‌ను క్రమబద్ధీకరించుకోని స్థల యజమానులు అడ్డదారిలో అమ్మకాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం అధికార బలం ఉన్న స్థానిక కౌన్సిలర్‌తో బేరం కుదుర్చుకున్నారు. దశాబ్దం అనంతరం ఆ అనధికారిక లే అవుట్లో పనులు మరల ప్రారంభమయ్యాయి. లే అవుట్‌ను ఆనుకుని 75 సెంట్ల రామ్మూర్తి బందను ఆక్రమించేశారు. లే అవుట్ పక్కనుంచి వెళ్లే 60 అడుగుల ఎర్రవాని చెరువు కాలువలో సింహభాగం ఆక్రమించేశారు. అంతటితో ఆగకుండా రెవెన్యూ యంత్రాంగం, మున్సిపాలిటీ అనుమతులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా లే అవుట్‌కు వెళ్లివచ్చేందుకు రెండు రహదారులను నిర్మించేస్తున్నారు. ఇందుకోసం లే అవుట్ దిగువన ఉన్న ఎర్రవాని చెరువు కాలువలో చిన్నపాటి గొట్టాలు వేసి మట్టి రోడ్లు వేసేస్తున్నారు. ఇదంతా చూసిన ఎర్రవాని చెరువు ఆయకుట్టు రైతులు ప్రతిఘటించటంతో స్థానిక కౌన్సిలర్ రంగంలోకి దిగి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇది మున్సిపాలిటీ స్థలం ఏం చేసుకుంటే మీకెందుకంటూ ఎదురుదాడికి దిగారని స్థానికులు చెబుతున్నారు. ఇదే విషయమై స్థానికులు కలెక్టరేట్ గ్రీవెన్స్‌సెల్‌లో పిర్యాదు చేస్తే రెవెన్యూ యంత్రాంగం వచ్చి లే అవుట్‌కు సరిహద్దులు వేసి వెళ్లగా వాటినీ అక్రమార్కులు చక్కగా మార్చేసి విక్రయాలకు సిద్ధమవుతున్నారు. రాత్రి వేళల్లో రోడ్ల పనులు ఇప్పటికీ అనుమతులు లేవని స్థానికులు చెబుతున్న ఈ లే అవుట్‌కు వెళ్లాలంటే బొబ్బాదిపేట శివారుకు వెళ్లి తిరిగి రావాలి. లే అవుట్‌కు పట్టణానికి దూరం పెరిగితే మంచి ధర పలకదన్న భావనతో సర్వే నంబర్ 6/77లో గల ఎర్రవాని చెరువు కాలువపై నుంచి మహాలక్ష్మీనగర్ వైపు రోడ్లు వేసేందుకు అక్రమార్కులు రంగం సిద్ధం చేసుకున్నారు. స్థానిక కౌన్సిలర్‌తో ఒప్పందం కుదుర్చుకుని కాలువ మార్గంలో చిన్నపాటి గొట్టా లు వేసి మట్టి రోడ్డు నిర్మించేందుకు యత్నించారు. ఇదంతా గమనించిన స్థానికులు, చెరువు ఆయకట్టు రైతులు అడ్డుకోవటంతో ఇటీవల రాత్రి వేళల్లో యంత్రాలతో పనులు చేపట్టేశారు. ప్రశ్నార్థకంగా చెరువు ఆయకట్టు భూమి ఈ లేఅవుట్‌కు వేస్తున్న రోడ్లు వేసేందుకు రెవెన్యూ రికార్డుల ప్రకారం 60 అడుగుల వెడల్పు గల కాలువను కబ్జా చేయటంతో ఎర్రవాని చెరువు కింద 100 ఎకరాల భూమి సాగు ప్రశ్నార్థకంగా మారింది. 8.50 ఎకరాల విస్తీర్ణం గల ఎర్రవాని చెరువులోనే జిల్లా కేంద్రాసుపత్రి ప్రాంతం నుంచి సాలిపేట మీదుగా ప్రవహించే వాడుక నీరంతా కలుస్తోంది. భారీ వర్షాలు కరిసే సమయంలో ఈ కాలువ గుండా వచ్చే నీరు సంవత్సరమంతా రైతుకు ఉపయోగపడుతోంది. 60 అడుగుల గల ఈ కాలువ స్థలంలో సుమారు 50 అడుగులు ఇప్పటికే ఆక్రమించేశారు. మిగిలిన పది అడుగుల కాలువలో చిన్నపాటి పైప్‌లైన్ వేసి రోడ్డు నిర్మించటంతో గతంలో మాదిరి చెరువులోకి నీరు వచ్చే అ వకాశం లేదని స్థానిక రైతులు ఆవేదన. వచ్చే ఏడాది నుంచి పంట సాగు చేసేందుకు నీటి సమ స్య ఉత్పన్నమవుతుందని వారు చెబుతున్నారు అధికారులు వేసిన రాళ్లనూ పీకేశారు సర్వే నంబర్ 4/3లో గల అనధికారిక లే అవుట్ అక్రమాలపై గతంలోనే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. అప్పటి వీఆర్వో రవికుమార్ వచ్చి లే అవుట్లో అక్రమాలను గుర్తించి రాళ్లను సరి చేసి వెళ్లారు. కొద్ది రోజుల వ్యవధిలోనే చెరువు కాలువను ఆక్రమించి సాగుభూములకు నీరివ్వకండా చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి – తుమ్మగంటి నాగేశ్వరరావు, ఆయకట్టు రైతు మళ్లీ పరిశీలించి చర్యలు తీసుకుంటాం బొబ్బాదిపేటలోని లే అవుట్లో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారంటూ గతంలో ఒక సారి మా దృష్టికి వచ్చింది. స్థానికులు ఫిర్యాదు చేశారు. అప్పట్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేసి కేసు నమోదు చేశాం. మరో మారు పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – ప్రభాకర్, హెచ్‌డీటీ, విజయనగరం ఎలా బతకాలి 1958 నుంచి ఎర్రవాని చెరువు కింద పంట సాగు చేసుకుంటున్నాం. మాకు రెండెకరాల భూమి ఉంది. ఇప్పుడు రాజకీయ నాయకుల బలంతో కాలువలు కప్పేసి లే అవుట్లకు రోడ్లేస్తున్నారు. ఇలా ప్రభుత్వ భూముల్ని ఆక్రమించేసుకుని డబ్బు జేసుకుంటే అధికారులకు ఎందుకు కనబడటం లేదు. – తుమ్మగంటి లక్ష్మి, ఆయకట్టు రైతు -
అమ్మ గుర్తొస్తే చిన్నపిల్లాడే...
– సాక్షి ప్రతినిధి, విజయనగరం గుబురు మీసాలతో పులిలా కనిపించే ఆయనకు అమ్మపై ఎనలేనంత ప్రేమ ఉంది. ఆమెను తలచుకుంటే చాలు కన్నీటి పర్యంతమయ్యేంత అనురాగం ఉంది. ఎంతటి కష్టాన్నైనా ఎదిరించి పోరాడగల సత్తా ఉంది. చేపట్టిన పనుల్లో తన ముద్ర కనిపించాలనే తపన ఉంది. యాభై ఎనిమిదేళ్ల వయసులోనూ ఎవరికీ వెరవని తెగువ ఉంది. ఇప్పటికీ విజయనగరం నుంచి విశాఖపట్నం వరకూ 50 కిలోమీటర్లు అలవోకగా పరిగెత్తగల సత్తా ఉంది. పోలీసుశాఖలో అడుగుపెట్టేవారెందరినో తీర్చిదిద్దగల అసమాన ప్రతిభ ఉంది. ఆయనే విజయనగరం జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం ప్రిన్సిపల్ (పీటీసీపీ) కె.రాజశిఖామణి. విభిన్న మలుపులు, ఎన్నో విశేషాలతో నిండిన ఆయన వ్యక్తి గత జీవితాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసింది ‘సాక్షి’. ఆ విశేషాలు మీ కోసం.. సాక్షి: మీ స్వస్తలం, చదువు గురించి? పీటీసీపీ: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరిపాడు మండలం లేమళ్లపాడు మా స్వగ్రామం. ఆ ఊళ్లో అప్పట్లో చదువుకున్నది ఇద్దరే ఇద్దరు. వారిలో ఒకరు మా నాన్న కాకుమాని కోటయ్య, మరొకరు మా చిన్నాయన ప్రసాద్. ఇద్దరూ బీఏ చదివారు. నాన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసేవారు. పెళ్లి తర్వాత ఒంగోలుకు బదిలీ అయ్యారు. నేను, తమ్ముడు రాజశేఖర్ అక్కడే పుట్టాం. ఇద్దరం ఫుట్‌బాల్ బాగా ఆడేవాళ్లం. అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ(ఏబీఎం) హైస్కూల్లో చదువుకున్నాం. ముఫ్పై ఎకరాల్లో ఉండే ఆ హైస్కూల్లో మూడు ఫుట్‌బాల్ కోర్టులు, బాస్కెట్ బాల్, బేస్‌బాల్ కోర్టులుండేవి. అందువల్ల వాటన్నిటిలోనూ ప్రావీణ్యం తెచ్చుకున్నాను. డిగ్రీ వరకూ ఫుట్‌బాల్ ఆడేవాడ్ని, తర్వాత అథ్లెటిక్స్ వైపు వెళ్లాను. తొలి ప్రయత్నంలోనే 1977లో ఇంటర్ కాలేజియేట్ స్పోర్ట్స్‌లో నాలుగు బంగారు పతకాలు సాధించి యూనివర్శిటీ చాంపియన్‌గా నిలిచాను. సాక్షి: పోలీస్ డిపార్ట్మెంట్లో అడుగుపెట్టడానికి కారణం? పీటీసీపీ: అమ్మ నన్ను డాక్టర్‌గా చూడాలనుకునేవారు. కానీ వారికి చెప్పకుండానే పోలీస్ అయిపోయాను. చిన్నప్పుడు ఎన్టీఆర్, కృష్ణ సినిమాలు ఇంట్లో తెలియకుండా బాగా చూసేవాడిని. ఎక్కడైనా ఏదైనా జరిగితే వెంటనే వెళ్లి సాయం చేయడం అనేది ఆ సినిమాల ప్రభావమే. నాకు ఏడో తరగతి నుంచే పోలీస్ అవ్వాలనుండేది. స్కౌట్స్‌లో చేరాను. మొద ట్లో ఆర్మీలో చేరాలనుకునేవాణ్ని. దాని కోసం బీఎస్సీ నుంచి ఎకనామిక్స్లోకి మార్చమని ప్రిన్సిపల్‌ను అడిగాను, కుదరదంటే చదువు మానేస్తానన్నాను. అలా కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాను. డిగ్రీలో ఉండగా ఎన్సీసీ ద్వారా రిపబ్లిక్ డే పరేడ్స్లో పాల్గొన్నాను. మిల్కా సింగ్ స్టోరీ చదివి నేనూ అలా అయిపోవాలని ఆర్మీలో వంటవాడి పోస్టుకు దరఖాస్తు చేసేశాను. ఎంపికయ్యాను కానీ వద్దని అందరూ వారించడంతో చేరలేదు. తర్వాత పోలీస్ సెలక్షన్స్‌కు వెళ్లాను. 2.50 నిమిషాల్లో 800 మీటర్లు పరిగెత్తమంటే 2 నిమిషాల్లోనే పరుగెత్తి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాను. ఇంటర్వూ్యకు కూడా గెడ్డం, మీసాలతో వెళ్లాను. సెలక్టర్లు అడిగితే ఉద్యోగం వస్తే తీస్తానని సమాధానం చెప్పాను. నువ్ ఏం చేస్తావ్ అని అడిగితే ఏదైనా చేస్తానన్నాను. సర్టిఫికెట్లు కూడా చూడకుండా ఉద్యోగం ఇచ్చారు. సాక్షి: ఇంటెలిజెన్స్ వైపు ఎందుకెళ్లారు? పీటీసీపీ: పోలీస్ శిక్షణ కోసం 1981లో అనంతపురంలో అడుగుపెట్టాను. వెళ్లగానే గుండు చేసేశారు. అక్కడ శిక్షణ సరిపోయేది కాదు. అదనంగా మరో పదికిలోమీటర్లు పరిగెత్తేసేవాడిని, ఐదొందల పుషప్స్ తీసేసేవాడిని. తర్వాత తొలిపోస్టింగ్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్గా వచ్చింది. అది నాకు నచ్చలేదు. ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి ఇంటెలిజెన్స్‌కు పంపించమని అడిగాను. సెలక్షన్ పెడితే ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా రెండవ స్థానం సాధించాను. ఉన్నతాధికారి రత్నారెడ్డి నన్ను ఎంపిక చేశారు. తర్వాత శిక్షణ కోసం ఎల్బీ స్టేడియానికి వెళితే అక్కడ కోచ్ నన్ను ‘పనికిరావు పో’ అన్నారు. రెండు నెలలు అతని కోచింగ్ చూసి నోట్స్ రాసుకుని, దానికి రెండింతలు చేసేశాను. తర్వాత కాకినాడ మూడవ బెటాలియన్‌కు శిక్షణ కోసం ఉత్తర్వులు వచ్చాయి. అక్కడికి వెళ్లాక జీతం అంతా తిండికే ఖర్చుచేసి, నాన్నకు ఫోన్ చేసి నెల నెలా రూ.1500 పంపమనేవాడ్ని. రోజుకు ఎనిమిది గంటలు ప్రాక్టీస్ చేసేవాడ్ని. 1982లో 1500 మీటర్లు 4 నిమిషాల్లో పరిగెత్తాను. ఇంత వరకూ ఈ రికార్డ్‌ను ఎవరూ క్రాస్ చేయలేదు. సాక్షి: కమాండోగా ఎలా మారారు: పీటీసీపీ: ఇంటెలిజెన్స్‌లో ఉండగా ఒకసారి హెవీ వెయిట్ ఎత్తడంతో ఎముకకు దెబ్బతగిలి రెండు నెలలు బెడ్ రెస్ట్ తీసుకున్నాను. కోలుకున్నాక స్టాండర్డ్ ట్రైనింగ్ కోసం కమాండో ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నాను. ఎన్ఎస్జీకి వెళ్లిపోయాను. తొలి బ్యాచ్‌లో అన్ని రాష్ట్రాల నుంచి 140 మంది ఉంటే వారిలో నేనే ఫస్ట్ వచ్చాను. సాక్షి: పదవీ విరమణ తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? పీటీసీపీ: నా భార్య ప్రశాంతి గృహిణి. మా అబ్బాయి రాజ్‌భరత్ ఇంజినీర్. కుమార్తె అంకిత్‌రాజ్ బాడ్మింటన్ క్రీడాకారిణి. మా అమ్మాయి పేరుమీదనే అంకిత్ స్పోర్ట్స్ అకాడమీని ఐదేళ్ల క్రితం స్థాపించాం. ఎంతో మంది ఐపీఎస్‌లకు పరీక్షలు నిర్వహించిన అనుభవం నాది. ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నాను. ఉద్యోగ విరమణ తర్వాత సొంతూరుకు వెళ్లి అకాడమీ బాగోగులు చూసుకుంటాను. సాక్షి: పీఎం, సీఎంల వద్ద పనిచేసిన అనుభవం? పీటీసీపీ: 1985 నుంచి 1989 వరకూ ఎన్‌టి రామారావు వద్ద, అంతకుముందు చెన్నారెడ్డి వద్ద కొంతకాలం చేశాను. ఆ తర్వాత రాజీవ్‌గాంధీ ఎప్పుడు రాష్ట్రానికి వచ్చినా ఆయన రక్షణ బాధ్యత నాదే. నన్ను ఆయన పేరుపెట్టి పిలిచేవారు. మైసూరా రెడ్డి దగ్గర చాలా కాలం పని చేశాను. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌తో సహా ఏడుగురు ఐఏఎస్‌లను దారగడ్డలో మావోయిస్టులు కిడ్నాప్ చేసినప్పుడు వారితో చర్చలు జరపడానికి హైదరాబాద్ నుంచి ఆరుగురు కమాండోలతో పాటు నేను ఎలాంటి ఆయుధం లేకుండా వెళ్లాను. మావోయిస్టులకు వెళ్లి రెవెన్యూ అధికారిగా పరిచయం చేసుకుని వారితో చర్చలు జరిపాను. గతేడాది విజయనగరం పోలీస్ శిక్షణా కేంద్రానికి బదిలీపై వచ్చాను. ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులకు తోడు నా శ్రమను జోడించి రూ.కోట్ల విలువైన పనులు చేయించాను. ఇప్పుడు నా దగ్గర 620 మంది శిక్షణ తీసుకుంటున్నారు. సాక్షి: మీ అమ్మగారంటే మీకు చాలా ఇష్టం అని విన్నాను? పీటీసీపీ: మా ఇంటికి బాస్ మా అమ్మే. ఆమె పేరు విమల. చాలా స్ట్రిక్ట్. నాన్నయినా, నేనయినా ఎవరైనా అమ్మ చెబితే ఎస్ బాస్ అనాల్సిందే. బీఎస్సీ నర్శింగ్ చదివిన ఆమె మా ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ తీసుకునేవారు. మేం ఎప్పుడూ ఆస్పత్రికి పోలేదు. ఏం వచ్చినా అమ్మచేతిలోనే తగ్గిపోయేది. సాయంత్రం 6 గంటలు దాటే సరికి ఇంటికి వచ్చేయాల్సిందే. ఏడు గంటలకే పడుకోవడం, తెల్లవారుజామున 4గంటలకే నిద్ర లేవడం ఆమెవల్లే అలవాటైంది. ఆహార అలవాట్లు, విశ్రాంతి తీసుకోవడం నా ఆరోగ్య రహస్యం. 68 ఏళ్ల వయసులో అమ్మ అనారోగ్యం పాలైనప్పుడు ఏడుపొచ్చేసింది. ఇప్పుడు కూడా తలచుకుంటుంటే...(ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ) చాలా బాధగా ఉంటుంది. ఎక్కడ ఉన్నా నాకేదైనా అనారోగ్యంగా ఉన్నా, మనసు బాగోలేకపోయినా వెంటనే ఊరు నుంచి అమ్మను పిలిపించుకునేవాడిని. అమ్మంటే అంత ఇష్టం. అనారోగ్యమే అమ్మను మా నుంచి దూరం చేసింది. కానీ ఆమె జ్ఞాపకాలు నాతోనే ఎప్పుడూ ఉంటాయి. ఆఫీస్‌లో నా కళ్లెదురుగా ఉన్న మా అమ్మ ఫొటోను చూస్తున్నప్పుడల్లా ఆమె ఒడిలో ఉన్నట్టే అనిపిస్తుంటుంది. నా వరకూ చివరి రోజుల్లో అమ్మా, నాన్నలను కష్టపెట్టకుండా బాగా చూసుకున్నాను. నేనే కాదు ఎవరైనా అలానే చూసుకోవాలి. వారి తర్వాతే కదా ఏదైనా, ఎవరైనా.! -
కొవ్వాడలో ఉద్రిక్తత ; 144 సెక్షన్
సాక్షి, విజయనగరం : జిల్లాలోని పూసపాటిరేగ మండలం కొవ్వాడలో ఆదివారం మరోసారి ఉద్రిక్తత నెలకొంది. అధికార పార్టీకి చెందిన నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడుకు చెందిన ఎస్వీఎల్ లైఫ్ సైన్స్ కంపెనీ భూములను తమకి అప్పగించాలని పోరాడుతున్న దళితులు ఇవాళ మరోసారి భూముల్లోకి చొచ్చుకెళ్ళే ప్రయత్నం చేశారు. దీంతో కొవ్వాడలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చినందునే తాము భూముల్లో వస్తున్నామని రైతులు చెబుతుండగా.. పోలీసులు మాత్రం వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. రైతులకు మద్దతుగా నిలిచిన కొంతమంది వామపక్ష నేతలను సైతం పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడుకు చెందిన భూముల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొవ్వాడ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. -
కొవ్వాడలో ఉద్రిక్తత ; 144 సెక్షన్
-
భార్య ఉండగానే ప్రియురాలితో భర్త!
విజయనగరం టౌన్: అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య ప్రసవానికి పుట్టింటికి వెళ్లగా ఎంచక్కా ప్రియురాలితో సహజీవనం సాగిస్తున్న ఓ ప్రబుద్ధుడి బండారం భార్య బయటపెట్టిన సంఘటన ఇది. విజయనగరంలో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలివి. పట్టణంలోని ధర్మపురి వసంత్‌విహార్ ఎఫ్ బ్లాక్‌లో నివాసముంటున్న వినోద్ విశాఖలోని ఓ బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం సునీత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో రూ. 30 లక్షల కట్నం, 25 తులాల బంగారం తీసుకున్నాడు. వారిద్దరికి ఓ పాప పుట్టింది. సునీత డెలివరీకి పుట్టింటికి వెళ్లగా వినోద్ తన ప్రియురాలు, సహోద్యోగి అయిన యువతితో సహజీవనం చేయసాగారు. బిడ్డ పుట్టినా పెద్దగా పట్టించుకోకపోవడంతో అనుమానం వచ్చిన భార్య విచారించగా అసలు విషయం తెలిసింది. వెంటనే ఈ విషయాన్ని అత్తమామలు, ఆడపడుచుకు చెప్పినా వారు స్పందించలేదు. భర్త ప్రియురాలితో విశాఖలో సహజీవనం చేస్తున్న విషయం తెలుసుకుని సునీత ఈ ఏడాది మే నెలలో అక్కడి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు వినోద్‌కు కౌన్సెలింగ్ ఇచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు. అనంతరం ఇటీవల తన భర్త వినోద్, ప్రియురాలితో కలసి విజయనగరంలోని స్వగృహంలో ఉన్నట్లు తెలుసుకున్న మహిళా సంఘ సభ్యులతో కలిసి వెళ్లి ఇద్దరినీ రెడ్‌హ్యాండడ్‌గా పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న మహిళా పోలీస్‌స్టేషన్ ఎస్సై వెంకటరావు వినోద్‌ను ప్రియురాలితోసహా స్టేషన్‌కు తరలించారు. మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ కె.కుమారస్వామి మాట్లాడుతూ వినోద్‌కు కౌన్సెలింగ్ నిర్వహించి బాధితురాలికి న్యాయం చేస్తామని చెప్పారు. -
‘పోలీస్ దాదా’పై విచారణకు ఆదేశం
సాక్షిప్రతినిధి, విజయనగరం: ఎస్.కోట సర్కిల్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీస్ అధికారి ఏడాదిన్నర కాలంగా సాగిస్తున్న అవినీతి దందాపై ‘పోలీస్ దాదా, తవ్వేకొద్దీ వెలుగులోకి, మూర్తీ భవించిన అవినీతి’ శీర్షికలతో ‘సాక్షి’లో ప్రచురించిన వరుస కథనాలు జిల్లా పోలీస్ శాఖను కుదిపేశాయి. అధికారి దందాలపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. సాక్ష్యాధారాలతో పాటు బాధితుల వాంగ్మూలతో సహా బయటపెట్టడంతో ఉన్నతాధికారులు చలిం చారు. విచారణ నివేదిక రూపొందించి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. పత్రికలో వచ్చిన కథనాలు ఆధారంగా మరిన్ని వివరాలు సేకరించాల్సిందిగా అడిషనల్ ఎస్పీ అట్టాడ వెంకటరమణను ఆదేశించినట్టు ఎస్పీ పాలరాజు స్వయంగా ‘సాక్షి’కి వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో పూర్తి నివేదిక తయారు చేసి ఆ అధికారిపై చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే అవినీతి ఆరోపణల కారణంగా కొందరు సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. ఎస్.కోట సర్కిల్లో దందాలపై ‘సాక్షి’ చెప్పింది అక్షరాల వాస్తవమని ఎస్పీ అన్నారు. ఇప్పటికే ఈ సర్కిల్లో అవినీతి ఆరోపణల కారణంగా ఎస్ఐను హెడ్‌క్వార్టర్‌కు పిలిపించగా, ముగ్గురు కానిస్టేబుళ్లను ఆర్మ్డ్ రిజర్వ్‌కు అటాచ్ చేశామని వివరించారు. తాజాగా సర్కిల్ అధికారిపై ఆరోపణలు రావడంతో అతనిపై బహిరంగ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ‘సాక్షి’ కథనాలతో ఎస్.కోట సర్కిల్ పోలీసులో కదలిక కనిపించింది. ఎన్ని అక్రమ వ్యాపా రాలు సాగుతున్నా కేసుల నమోదుకు ముందుకు రాని వారు ఆదివారం పశు అక్రమ రవాణాపై నిఘా పెంచారు. కేసులు నమోదుచేసి పనిచేస్తున్నామ నిపించారు. -
సోషల్ మీడియాలో పోస్టులు.. తట్టుకోలేకపోయిన ఎమ్మెల్యే!
సాక్షి, విజయనగరం: హామీల అమలు విషయంలో ప్రభుత్వ తీరును విమర్శిస్తూ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టింగులను ప్రభుత్వ పెద్ద చంద్రబాబే కాదు.. టీడీపీ ప్రజాప్రతినిధులు కూడా సహించలేకపోతున్నారు. మాపైనే రాతలా అంటూ అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారు. తాజాగా విజయనగరం జిల్లా గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడు నెటిజన్లపై తన అక్కసును వెల్లగక్కారు. ప్రజలకిచ్చిన హామీలను ఎమ్మెల్యే నిలబెట్టుకోలేదంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగులు హల్చల్ చేస్తున్నాయి. వాటిని ఎమ్మెల్యే తట్టుకోలేకపోయారు. వెంటనే తన అనుచరులతో వచ్చి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కొందరు యువకులను స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. ఇప్పటికే 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమానికి వెళ్తున్న తెలుగు తమ్ముళ్లను ప్రజలు నిలదీస్తుండగా సోషల్ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తుతుండడంతో అధికార పార్టీ నేతలు మరింత అసహనానికి గురవుతున్నారు. -
అక్రమంగా మద్యంబాటిళ్ల తరలింపు
గుమ్మలక్ష్మీపురం (విజయనగరం) : అక్రమంగా ఏజెన్సీ ప్రాంతాలకు తరలిస్తున్న 700 మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. కురుపం నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు ఆటోలో మద్యం బాటిళ్లు తరలిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు మాటువేసి వారిని పట్టుకున్నారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని జంక్షన్ వద్ద మంగళవారం జరిగింది. ఆటోలో ఉన్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.