నైపుణ్య విద్యను ప్రోత్సహించేలా...! | Andhrapradesh Traibal University completes three years | Sakshi
Sakshi News home page

నైపుణ్య విద్యను ప్రోత్సహించేలా...!

Published Sat, Jul 29 2023 3:47 AM | Last Updated on Sat, Jul 29 2023 8:39 AM

Andhrapradesh Traibal University completes three years - Sakshi

జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)–2020 అమ లులోకి వచ్చి జూలై 29 నాటికి మూడేళ్లవుతోంది. మునుపటి విద్యా వ్యవస్థ లలోని భారీ అంతరాలను గుర్తించి నాణ్యమైన విద్యా వకాశాలు అందరికీ సమా నంగా అందించడం దీని ప్రధాన లక్ష్యం. ప్రీస్కూల్‌ విద్య నుండి ఆరో తర గతి వరకు మాతృభాష బోధనా మాధ్యమంగాఉండాలని ఎన్‌ఈపీ ఉద్దేశం. అదేవిధంగా, అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ల కోసం కరిక్యులం, క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్‌ కింద చేసిన సవరణలు ఏకకాలంలో రెండు పూర్తికాల విద్యా కార్యక్రమాలను కొనసాగించడాన్ని అనుమతిస్తున్నాయి. భౌతిక, ఆన్‌లైన్‌ మోడ్‌తో సహా, 4–సంవత్సరాల అండర్‌ గ్రాడ్యు యేట్‌ పాఠ్యాంశాలను ప్రోత్సహించడం వంటివి ఉన్నత విద్యలోని ముఖ్యాంశాలు.

ఎన్‌ఈపీ–2020 నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. అలానే తల్లిదండ్రులు, తోటివారి ఒత్తిడి నుండి విద్యార్థికి ఉపశమనం కలిగించడానికి కూడా ప్రాధాన్యం ఇస్తోంది. విద్యార్థులు ఒక సంస్థ నుండి మరొక సంస్థకు, ఒక కోర్సు నుండి మరొక దానికి మారడానికి అవకాశం కల్పిస్తోంది. నైపుణ్య విద్యను ప్రోత్సహించడంలో భాగంగా ఎన్‌ఈపీ నేరుగా విద్యా సంస్థలతో పరి శ్రమలకు సంబంధాలు ఏర్పరచి చదువుకునే సమయంలోనే సమాంతరంగా వారికి వివిధ వృత్తుల్లో శిక్షణ ఇచ్చి జీవితంలో స్థిరపడే అవకాశాలను కల్పిస్తోంది.

 వినూత్న బోధనా పద్ధతులపై శిక్షణ అందించడం, ఐసీటీ సాధనాల విస్తృత వినియోగం వంటివి కూడా ఎన్‌ఈపీలో ముఖ్యమైన అంశాలు. ఎన్‌ఈపీ అధునాతన పాఠ్యాంశాలు, బోధనపై దృష్టి కేంద్రీకరిస్తూనే విద్యార్థుల సంభావిత అవ గాహన, విమర్శనాత్మక ఆలోచనలనూ ప్రోత్సహి స్తోంది. యోగా, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, పెర్ఫార్మింగ్, విజువల్‌ ఆర్ట్స్‌తో పాటు పాఠ్యాంశాలను పునరుద్ధ రించడం, సమగ్ర పరచడం, గిరిజన జీవనశైలిని అర్థం చేసుకోవడానికి గిరిజన గ్రామానికి వెళ్లి జీవించడం, ‘డూయీంగ్‌ వైల్‌ లెర్నింగ్‌’ వంటి విద్యార్థి–కేంద్రీకృత పాఠ్యాంశాలు ఇందుకు నిద ర్శనం. ఎన్‌ఈపీ–2020 కింద విద్యార్థుల అంతర్లీన అవసరాలను అభివృద్ధి చేయడానికి నేషనల్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ క్వాలిఫికేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌హెచ్‌ఈక్యూఎఫ్‌) వంటి వివిధ ప్రోగ్రామ్‌లు ప్రారంభించబడ్డాయి. 

ఎన్‌ఈపీ–2020 ఈక్విటీ, ఇన్‌క్లూజన్‌ అలాగే భాగస్వామ్య పాలన సిద్ధాంతాలపై ఆధారపడింది. అందువల్ల దివ్యాంగులు, మహిళలు, ఎల్‌జీ బీటీక్యూలు, ఎస్సీ, ఎస్టీలు, పీవీటీజీలు, డీఎన్‌టీలు వంటి వారికి సాధికారత కల్పించడం, వారికి సమానమైన అవకాశాలను అందిస్తూ అందు బాటులో ఉండటం ఇందులోని చాలా ముఖ్యమైన అంశం. గిరిజనుల కోసం ‘ఏకలవ్య మోడల్‌ రెసిడె న్షియల్‌ పాఠశాల’లను బలోపేతం చేయడం, కొత్త ఉపాధ్యాయుల నియామకానికి ప్రాధాన్యత ఇవ్వ డం, కొత్త ఈఎమ్‌ఆర్‌ఎస్‌ ప్రారంభించడం, 10–15 చిన్న పాఠశాలలను కలుపుతూ ‘వన్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌’ పునర్నిర్మాణం వంటివి ఇందు కోసం తీసుకున్న కొన్ని చర్యలు.

అంతర్జాతీయీ కరణ, సహకారం, భాగస్వామ్య పద్ధతిలో పథకాలను బలోపేతం చేయడం, విదేశీ విశ్వ విద్యాలయాల ఆఫ్‌–షోర్‌ క్యాంపస్‌లను స్థాపించడానికి ఆహ్వానించడం, అలాగే దేశంలో డిజిటల్‌ ఈ–విశ్వవిద్యాలయాల స్థాపన... ఎన్‌ఈపీ అమలు ప్రారంభించిన తర్వాత తీసు కున్న మరికొన్ని కార్యక్రమాలు. ఎన్‌ఈపీ ‘ల్యాబ్‌ టు ల్యాండ్‌’, ‘ల్యాండ్‌ టు ల్యాబ్‌’ను ప్రమోట్‌ చేస్తుంది.  మొత్తం మీద ఎన్‌ఈపీ–2020 గత మూడు సంవత్సరాల్లో అనేక స్పష్టమైన ఫలితాలను సాధించగలిగింది. బహుళ ప్రవేశ–నిష్క్రమణ విధానం ద్వారా ఇది విద్యార్థులకు నేర్చుకునే సౌకర్యవంత మైన మార్గాన్ని అందించింది. ఆ విధంగా ఎన్‌ఈపీ–2020 భారతీయ విద్యా వ్యవస్థ చరిత్రలో నిజమైన గేమ్‌ ఛేంజర్‌ అని చెప్పవచ్చు.

వ్యాసకర్త వైస్‌ ఛాన్స్‌లర్, ఆంధ్రప్రదేశ్‌
కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (ఎన్‌ఈపీ ప్రారంభమై మూడేళ్లు) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement