Tribal university
-
ట్రైబల్ వర్సిటీలో చేరేందుకు అనాసక్తి
సాక్షిప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లాకేంద్రంలో సమ్మక్క–సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ (ఎస్ఎస్సీటీయూ)లో చేరేందుకు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అడ్మిషన్లకు చివరి రోజు వరకు ముగ్గురే చేరగా.. స్పాట్ అడ్మిషన్ రోజున 10 మంది అర్హత సాధించారు. మొత్తం 13 మందికి గాను ఐదుగురు బీఏ ఎకనామిక్స్‌లో, ఎనిమిది మంది బీఏ ఇంగ్లిష్‌లో సీట్లు పొందారు. 2024–25 విద్యా సంవత్సరం నుంచి ఎస్ఎస్సీటీయూ తన కార్యకలాపాలను ప్రారంభించింది. సెప్టెంబర్ 20న బీఏ (హానర్స్) ఇంగ్లిష్, బీఏ (హానర్స్) ఎకనామిక్స్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 1న అడ్మిషన్ కౌన్సెలింగ్ ముగియగా, కేవలం మూడు సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. గురువారం స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ చేపట్టారు. రెండు కోర్సులలో 47 సీట్లకుగాను 13 సీట్లే భర్తీ అయ్యాయని, దీంతో అడ్మిషన్ల గడువు ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగుతుందని ఎస్ఎస్సీటీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పోరిక తుకారాం చెప్పారు. 14వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభిస్తామని తెలిపారు. -
ఆగస్టు నుంచి ట్రైబల్ వర్సిటీలో క్లాసులు
ములుగు, రాయదుర్గం: సమ్మక్క–సారక్క ట్రైబల్ యూనివర్సిటీలో తొలి ఏడాది బీఏ (ఇంగ్లిష్), బీఏ (సోషల్ సైన్స్) కోర్సులను ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ములుగు జిల్లా జాకారం సమీపంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపు కార్యాలయాన్ని శుక్రవారం ఆయన.. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి సీతక్క, ఎంపీ మాలోత్ కవితతో కలిసి ప్రారంభించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, అటవీశాఖ అభ్యంతరాలతో మధ్యలోనే నిలిచిన 50 ఎకరాల స్థలాన్ని త్వరితగతిన అప్పగించినట్లయితే పీఎం మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా గిరిజన యూనివర్సిటీకి భూమి పూజ చేసుకుందామని అన్నారు. ఇప్పటివరకు వివిధ కారణాలతో ఆ లస్యమైనప్పటికీ 337 ఎకరాలను రాష్ట్రం కేటాయించిందని చెప్పారు. అన్ని రకాల క్లియరెన్స్ వస్తే కాంపౌండ్ వాల్, డీపీఆర్, టెండర్ ప్రక్రియలను ప్రారంభిస్తామని తెలిపారు. ట్రైబల్ యూనివర్సిటీ గిరిజన యువతలో గేమ్ చేంజర్‌గా మారనుందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. యూనివర్సిటీలో 33 శాతం రిజర్వేషన్లను గిరిజనులకే కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. గిరిజన ఆచారాలు, సంస్కృతి, వైద్యపరమైన మూలికలు, అడవి జీవన విధానాలు రీసెర్చ్‌లో భాగంగా ఉంటాయని తెలిపారు. ఈ యూనివర్సిటీకి మెంటార్ యూనివర్సిటీగా గచ్చి బౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహరిస్తుందని తెలిపారు. యూజీసీ అ«దీనంలోని వెళ్లేంతవరకు హెచ్‌సీయూ అసోసియే ట్ ప్రొఫెసర్ వంశీ కృష్ణారెడ్డిని ఓఎస్డీగా నియమించినట్టు వివరించారు. అనంతరం వెంకటాపురం(ఎం) మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని కేంద్ర మంత్రి సందర్శించి రామలింగేశ్వరుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ పథకంలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో గిరిజన శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శరత్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, కంట్రోలర్ ఎగ్జామినేషన్ పోరిక తుకారాం తదితరులు పాల్గొన్నారు. వేయిస్తంభాల గుడిలో కల్యాణ మండపాన్ని ప్రారంభించిన కిషన్‌రెడ్డి హనుమకొండ కల్చరల్: పవిత్రమైన మహాశివరాత్రి రోజున వేయిస్తంభాల కల్యాణ మండపాన్ని మహాశివుడికి అంకితం చేస్తున్నామని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వరంగల్ నగరంలోని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో కల్యాణమండపాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు ఆయన కుటుంబ సమేతంగా శ్రీరుద్రేశ్వరశివలింగానికి అభిõÙకం నిర్వ హించారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మ న్ బండా ప్రకాశ్, ఎంపీ పసునూరి దయాకర్, హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
వచ్చే ఏడాది గిరిజన వర్సిటీ షురూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ప్రారంభానికి మార్గం సుగమమైంది. సమ్మక్క –సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లును తాజాగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటులో ప్రవేశపెట్టగా.. ఇందుకు సంబంధించిన గెజిట్‌ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ నేపథ్యంలో అవసరమైన అనుమతులు, ఇతర ఏర్పాట్లన్నీ వేగంగా పూర్తయితే వచ్చే విద్యా సంవత్సరం (2023–24) నుంచే వర్సిటీ అందుబా టులోకి రానుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చట్టంలోనే గిరిజన యూని వర్సిటీ ఏర్పాటును నిర్దేశించినప్పటికీ వివిధ కారణాలతో పదేళ్లుగా జాప్యం అవుతూ వచ్చింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4 సంవత్సరాల క్రితమే భూ కేటాయింపులు పూర్తి చేసి గిరిజన సంక్షేమ శాఖకు స్వాధీనం చేసింది. తాత్కాలిక అవస రాల కోసం భవనాలను కూడా కేటాయించింది. అనంతరం నిర్వహణ బాధ్యతలను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి (హెచ్‌సీయూ) అప్పగించారు. కానీ కేబినెట్ అనుమతులు, పార్ల మెంటులో బిల్లు ఆమోదం కాకపోవడంతో యూని వర్సిటీ కార్యకలాపాలు ముందుకు సాగలేదు. హెచ్‌సీయూ పర్యవేక్షణ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి గెజిట్ జారీ కావడంతో కేంద్ర విద్యా శాఖ అధికారుల బృందం అతి త్వరలో రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. వర్సిటీకి అవసరమైన మౌలిక వసతులు తదితరాలను పూర్తిస్థాయిలో పరిశీలించనుంది. ఇది పూర్తయిన తర్వాత సంబంధిత అనుమతులన్నీ వేగంగా జారీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ వర్సిటీని హెచ్‌సీయూ పర్యవేక్షించనుంది. ఇప్పటికే కోర్సులు, ఇతరత్రా కార్యక్రమాలకు సంబంధించిన నివేదికను రూపొందించింది. అనుమతులు వచ్చిన వెంటనే 2023–24 విద్యా సంవత్సరంలో తరగతులు సైతం ప్రారంభించేలా చర్యలు వేగవంతం చేస్తోంది. రూ.10 కోట్ల నిధులు..498 ఎకరాల భూమి రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 2016–17 వార్షిక బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించింది. ఈ మేరకు చర్యలకు ఉపక్రమించిన రాష్ట్ర ప్రభుత్వం ములుగు మండలం జాకారంలో 498 ఎకరాల భూమిని వర్సిటీ ఏర్పాటు కోసం గుర్తించి గిరిజన సంక్షేమ శాఖకు అప్పగించింది. ఇందులో 285 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, మిగతా 213 ఎకరాలు అటవీ శాఖకు చెందింది. ఈ భూసేకరణ కోసం అటవీ శాఖకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం భూమిని చూపించింది. కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు సమీపంలో ఉన్న యూత్ ట్రైనింగ్ సెంటర్(వైటీసీ)ను కేటాయించింది. వర్సిటీ ఏర్పాటుపై హెచ్‌సీయూ లోతైన పరిశీలన జరిపి, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను సమర్పించాలని ఆదేశించడంతో, ఆ మేరకు ప్రక్రియ పూర్తి చేసిన హెచ్‌సీయూ.. మూడేళ్ల క్రితమే కేంద్రానికి డీపీఆర్ సమర్పించింది. -
గిరిజన వర్సిటీ మాస్టర్ ప్లాన్ రెడీ
విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లోని 562 ఎకరాల విస్తీర్ణంలో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో యూనివర్సిటీ నిర్వహణకు అవసరమైన.. విస్తరణకు అనువుగా భవనాల నిర్మాణ ప్రతిపాదనలను ఉన్నతాధికారుల అనుమతి కోసం యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి పంపించారు. తొలివిడతగా కేటాయించిన రూ.300.50 కోట్ల వ్యయంతో యూనివర్సిటీకి ప్రాథమికంగా అవసరమైన నిర్మాణాలు చేపట్టనున్నారు. వర్సిటీలో ప్రస్తుతం నిర్వహిస్తున్న వివిధ కోర్సులకు చెందిన 20 విభాగాల్లో ప్రతి ఐదింటికి 10 చొప్పున 40 తరగతి గదులు నిర్మిస్తారు. విద్యార్థులు, విద్యార్థినులకు వేర్వేరుగా 500 మందికి సరిపడేలా వసతి గృహాలు, వెయ్యి మందికి సరిపడే ఆడిటోరియం, 300 మంది సామర్థ్యం గల మరో ఆడిటోరియం, అడ్మినిస్ట్రేషన్ భవనం, సెంట్రల్ లైబ్రరీ, స్కిల్ సెంటర్, ఇండోర్, అవుట్డోర్ స్టేడియాలు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నివాస భవనాలు 100 చొప్పున నిర్మించేందుకు వీసీ ప్రతిపాదనలు పంపించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త భవనాల్లో తరగతులు నిర్వహించేలా యుద్ధప్రాతిపదికన భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. కొత్త భవనాల్లోనే తరగతులు వచ్చే విద్యా సంవత్సరం కొత్తగా నిర్మించే భవనాల్లోనే తరగతులు నిర్వహించాలన్నది లక్ష్యం. ప్రస్తుతం యూనివర్సిటీలో 8 పీజీ, 6 అండర్ పీజీ కోర్సులు నడుస్తున్నాయి. మరో రెండు కోర్సులను వచ్చే విద్యా సంవత్సరానికి కొత్తగా తీసుకొస్తాం. ఇందుకోసం 77 మంది బోధన, 89 మంది బోధనేతర సిబ్బంది అవసరం. ప్రస్తుతం బోధన సిబ్బంది 18 మంది, బోధనేతర సిబ్బంది 12 మంది వరకు ఉన్నారు. మిగిలిన పోస్టుల నియామకానికి ప్రతిపాదనలు పంపించాం. – ప్రొఫెసర్ టీవీ కట్టిమణి, కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ వీసీ -
బీజేపీతోనే అవినీతిరహిత పాలన సాధ్యం
ఆదిలాబాద్: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే అవినీతి రహిత పాలన సాధ్యమవుతుందని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జనగర్జన సభ ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని విమర్శించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజలను సీఎం కేసీఆర్ పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కుటుంబ అభివృద్ధికి మాత్రమే సీఎం కృషి చేశారని, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మరోవైపు ప్రధాన మోదీ నాయకత్వంలో కేంద్రంలో నీతిమంతమైన పాలన సాగుతుందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలోని గిరిజనులు విద్య, ఉద్యోగ పరంగా మరింత ముందుకు వెళ్లేందుకు స్వయంగా ప్రధాని మోదీ గిరిజన వర్సిటీ ప్రకటించారన్నారు. జిల్లాలో బీజేపీకి ఎంతో ప్రజాదరణ ఉందని, ఇక్కడి నుంచి పార్లమెంట్ స్థానాన్ని గెలవడంతో పాటు గతంలో పలు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సానుకూల ఫలితాలు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదిలాబాద్ నుంచి పూరించనున్నట్లు వెల్లడించారు. ఈ బహిరంగ సభకు ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అంతకు ముందు సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఆయన వెంట స్థానిక నాయకులు ఉన్నారు. -
పసుపుబోర్డు, గిరిజన వర్సిటీకి కేంద్ర కేబినెట్ ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు సంబంధించి మూడు కీలక అంశాలపై బుధవారం కేంద్ర కేబి నెట్ నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో జాతీయ పసుపు బోర్డు, సమ్మక్క–సారక్క కేంద్రీయ గిరి జన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. సమ్మక్క సారక్క వర్సిటీకి రూ. 889.07 కోట్లు నిధులు కేటాయించింది. ఇక తె లంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని, ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయించాలని కృష్ణా వాటర్ డిస్ప్యూ ట్స్ (బ్రిజేశ్) ట్రిబ్యునల్–2ను కేబినెట్ ఆదేశించింది. ఎంతోకాలం నుంచి కొనసాగుతున్న జల వివాదాలకు ఇది ఒక పరిష్కారం చూపే అవకా శం ఉంది. తెలంగాణలో వారం రోజుల్లో ప్రధా ని వరుసగా రెండోసారి పర్యటించిన మరునాడే కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. భేటీ అనంతరం కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, అనురాగ్‌సింగ్ ఠాకూర్, ఎల్.మురుగ న్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. సమ్మక్క–సారక్క గిరిజన వర్సిటీకి రూ.889.07 కోట్లు ఏపీ పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన గిరిజన యూనివర్సిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర విశ్వవిద్యాలయాలు చట్టం–2009ను సవరిస్తూ పార్లమెంటులో కేంద్ర విశ్వవిద్యాలయాలు (సవరణ) బిల్లు–2023ను ప్రవేశపెట్టాలని తీర్మానించింది. గిరిజన యూని వర్సిటీ కోసం కేంద్రం రూ.889.07 కోట్లు నిధు లు కేటాయించింది. ఈ వర్సిటీ రాష్ట్రంలో విద్యా భివృద్ధి, నాణ్యతను మెరుగుపర్చడంతోపాటు గిరిజనుల ప్రయోజనాలు, గిరిజన కళలు, సంస్కృతి, సంప్రదాయ విజ్ఞాన వ్యవస్థ బోధన, పరిశోధనలను అందిస్తుందని.. ఉన్నత విద్య, ఆధునిక విజ్ఞానానికి సంబంధించిన మార్గాలను ప్రోత్సహిస్తుందని తెలిపింది. ప్రాంతీయ అసమతుల్యతను తొలగించడానికి తోడ్పడుతుందని వెల్లడించింది. భారీ ఎగుమతులే లక్ష్యంగా.. దేశీయంగా పసుపు పంట, పసుపు ఉత్పత్తుల అభివృద్ధి కోసం జాతీయ పసుపు బోర్డును తెలంగాణలో ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పసుపు వినియోగం పెంచడానికి, అంతర్జాతీయంగా మార్కెట్ అభివృద్ధికి ఈ చర్య తోడ్పడుతుందని తెలిపింది. దేశంలో 2022–23లో 3.24 లక్షల హెక్టార్లలో పసుపు సాగు చేయగా.. 11.61 లక్షల టన్నులు ఉత్పత్తి అయిందని తెలిపింది. బంగ్లాదేశ్, యూఏఈ, అమెరికా, మలేసి యాల్లో భారత పసుపునకు డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొంది. జాతీయ పసుపు బోర్డుతో 2030 నాటికల్లా రూ.8,400 కోట్ల (బిలియన్ డాలర్ల) విలువైన పసుపు ఎగుమతులను సాధించాలన్నది లక్ష్యమని వెల్లడించింది. ఈ బోర్డుకు చైర్మన్‌ను కేంద్రం నియమిస్తుంది. ఆయుష్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, వాణిజ్య, పరిశ్రమల శాఖల నుంచి రొటేషన్ పద్ధతిలో రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, పరిశోధనల్లో భాగస్వామయ్యే సంస్థలు, పసుపు రైతులు, ఎగుమతిదారుల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. బోర్డుకు కార్యదర్శిని కేంద్ర వాణిజ్య శాఖ నియమిస్తుంది. -
పసుపు బోర్డు..గిరిజన వర్సిటీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రానికి పలు వరాలు ప్రకటించారు. రాష్ట్ర రైతులు ఎంతో కాలం నుంచి డిమాండ్ చేస్తున్న జాతీయ పసుపు బోర్డును, ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో ఆదివారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో.. రూ.13,545 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంబొత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో పసుపు పంట విస్తృతంగా పండుతుంది. దేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేయడంతోపాటు వినియోగించేది, ఎగుమతి చేసేది ఈ పంటే. కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి తెలిసింది. దీనిపై పరిశోధనలు పెరిగాయి. పాలమూరు సభ సాక్షిగా ఇక్కడి పసుపు రైతుల సంక్షేమం కోసం తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు (నేషనల్ టర్మరిక్ బోర్డు)ను ఏర్పాటు చేస్తాం. ములుగులో ట్రైబల్ వర్సిటీ.. ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రూ.900 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ యూనివర్సిటీకి సమ్మక్క–సారలమ్మ పేరు పెడుతున్నాం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో వివిధ భవనాలను ప్రారంభించాం. హెచ్సీయూకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ హోదా కలి్పంచి, ప్రత్యేక నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే. నారీశక్తి వందన్ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించడం ద్వారా నవరాత్రులకు ముందే శక్తి పూజ స్ఫూర్తిని నెలకొల్పాం. వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమ రంగాలకు ప్రయోజనం తెలంగాణ ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చేలా అనేక రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంబొత్సవాలు చేయడం సంతోషంగా ఉంది. నాగ్‌పూర్–విజయవాడ కారిడార్ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయి. ఈ మూడు రాష్ట్రాల్లో వాణిజ్యం, పర్యాటకం, పారిశ్రామిక రంగాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ కారిడార్‌లో కొన్ని ముఖ్యమైన ఆర్థిక కేంద్రాలను కూడా గుర్తించాం. ఇందులో ఎనిమిది ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఐదు మెగా ఫుడ్ పార్కులు, నాలుగు ఫిషింగ్ సీఫుడ్ క్లస్టర్లు, మూడు ఫార్మా అండ్ మెడికల్ క్లస్టర్లు, ఒక టెక్స్టైల్ క్లస్టర్ ఉన్నాయి. దేశంలో నిర్మిస్తున్న ఐదు టెక్స్టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం. హన్మకొండలో నిర్మించే ఈ పార్క్‌తో వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వేలాది మందికి ఉపాధి ఇచ్చేలా.. ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, ఇంధన భద్రతపై చర్చ జరుగుతోంది. కేవలం పరిశ్రమలకే కాకుండా ప్రజలకు కూడా ఇంధన శక్తిని అందిస్తున్నాం. దేశంలో 2014లో 14 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉంటే 2023 నాటికి 32 కోట్లకు పెరిగాయి. ఇటీవల గ్యాస్ సిలిండర్ల ధరలను కూడా తగ్గించాం. దేశంలో ఎల్పీజీ వినియోగాన్ని పెంచడంలో భాగంగా పంపిణీకి సంబంధించి నెట్‌వర్క్‌ను విస్తరించాల్సి ఉంది. ఇందులో భాగంగా హసన్–చర్లపల్లి ఎల్పీజీ పైప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఇది ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో దోహదపడుతుంది. కృష్ణపట్నం–హైదరాబాద్ మధ్య మల్టీ ప్రొడక్ట్ పైప్‌లైన్ వల్ల తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది..’’అని ప్రధాని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపనలు ఇవీ.. రూ.3,397 కోట్లతో మూడు ప్యాకేజీలుగా వరంగల్ నుంచి ఖమ్మం వరకు చేపట్టనున్న ఎన్‌హెచ్–163 పనులు రూ.3,007 కోట్లతో మూడు ప్యాకేజీలుగా ఖమ్మం నుంచి విజయవాడ వరకు నిర్మించే ఎన్‌హెచ్–163జీ పనులు కృష్ణపట్నం నుంచి హైదరాబాద్ వరకు రూ.1,932 కోట్లతో చేపట్టే మల్టీ ప్రొడక్ట్ పైపులైన్ నిర్మాణ పనులు ప్రారంభించినవి ఇవీ.. సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు రూ.2,457 కోట్లతో నిర్మించిన నాలుగు లేన్ల 365 బీబీ నంబర్ జాతీయ రహదారి మునీరాబాద్–మహబూబ్‌నగర్ రైల్వేలైన్‌లో భాగంగా జక్లేర్ నుంచి కృష్ణా వరకు రూ.505 కోట్లతో పూర్తి చేసిన కొత్త లైన్ రూ.81.27 కోట్లతో హెచ్‌సీయూలో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ భవనాలు రూ.2,166 కోట్లతో హసన్ (కర్ణాటక) నుంచి చర్లపల్లి వరకు నిర్మించిన ఎల్పీజీ పైప్‌లైన్ జాతికి అంకితం నారాయణపేట జిల్లాలోని కృష్ణా స్టేషన్ నుంచి కాచిగూడ–రాయచూర్– కాచిగూడ డీజిల్, ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ (డెమూ) రైలు సర్విస్ ప్రారంభం -
Tribal University: తొమ్మిదేళ్ల కల తీరేలా..!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించడంతో సుమారు తొమ్మిదేళ్ల్ల నిరీక్షణకు తెరపడింది. ఉమ్మడి ఏపీ విభజన సమయంలోనే.. ఏపీ, తెలంగాణలలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏపీలోని విజయనగరం జిల్లా మర్రివలసలో 2019లోనే సెంట్రల్ ట్రైబల్ వర్సిటీని స్థాపించారు. రాష్ట్రంలో మాత్రం వర్సిటీకి స్థలం విషయంలో పేచీతో ఇన్నాళ్లూ జాప్యం జరిగింది. ఇప్పటికైనా ఈ అంశంపై స్పష్టత రావడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ ఏర్పాటయ్యే పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, గిరిజనులకు విద్యావకాశాలు పెరుగుతాయని అంటున్నారు. ఇన్నాళ్లూ లేఖలతోనే.. గిరిజన వర్సిటీ నిర్మాణానికి 500 ఎకరాల స్థలం కావాలని, అనుకూలమైన స్థలం ఉంటే వచ్చి పరిశీలిస్తామని 2016లోనే కేంద్ర ఉన్నత విద్యామండలి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో రాష్ట్ర రెవెన్యూ, అటవీశాఖ అధికారులు ఉమ్మడి సర్వే నిర్వహించి.. ములుగు జిల్లాలోని బండాకెపల్లి శివార్లలో 335.4 ఎకరాలను సేకరించారు. 2017 ఫిబ్రవరిలో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర అధికారులకు ఆ స్థలాన్ని చూపించారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2018 జనవరిలో సమగ్ర నివేదిక (డీపీఆర్) సిద్ధం చేసి కేంద్ర మానవ వనరుల శాఖకి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కు అందించింది. తరగతులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. హెచ్‌సీయూ 2019లో రాష్ట్ర ఉన్నత విద్యామండలిని సంప్రదించగా.. తాత్కాలికంగా తరగతుల ప్రారంభం కోసం ములుగు మండలంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ)లో ఏర్పాట్లు చేస్తామని చెప్పింది. ఒకేచోట 500 ఎకరాల స్థలం సమకూర్చే వీలు లేకపోవడంతో ములుగు–జాకారం ప్రాంతంలోని మేడారం జాతర సమీపంలో గట్టమ్మ గుట్ట వద్ద 335 ఎకరాలను, పసర వద్ద 165 ఎకరాలను ఇస్తామని చెప్పింది. కానీ తరగతులు ప్రారంభించడానికి కనీసం 50 ఎకరాల స్థలంలో నిర్మాణాలు ఉండాలని.. అంతేగాకుండా వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమి మొత్తాన్ని ఒకేచోట కేటాయించాలని స్పష్టం చేసింది. ఈ అంశాలపైనే కేంద్రం–రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇన్నాళ్లూ పేచీ కొనసాగింది. అయితే ఇప్పుడు వర్సిటీని మంజూరు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించడంతో.. సదరు స్థలంలో అవసరమైన విద్యుత్, రోడ్లు, నీళ్లు వంటి మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సి ఉండనుంది. గిరిజనులకు రిజర్వేషన్లు ఎంతశాతం? దేశవ్యాప్తంగా గిరిజనులకు 7.5శాతం రిజర్వేషన్ అమల్లో ఉండగా.. తెలంగాణలో 10శాతంగా ఉంది. మరి గిరిజన వర్సిటీలో గిరిజనులకు ఎంత మేర రిజర్వేషన్ ఇస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. సూపర్ న్యూమరరీ విధానంలో సీట్లు పెంచి అయినా గిరిజన విద్యార్థులకే ఎక్కువ సీట్లు కేటాయించాలన్న డిమాండ్ ఉంది. ఏపీలో ఉన్నట్టుగానే..! ఏపీలో ఇప్పటికే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నడుస్తున్న నేపథ్యంలో.. అక్కడ అమలు చేస్తున్న కోర్సులనే ములుగు వర్సిటీలోనూ అమలు చేసే అవకాశం ఉందని యూజీసీకి చెందిన ఓ ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు. సాధారణ కోర్సుల తోపాటు ప్రత్యేకంగా గిరిజన కళలు, సంస్కృతిపైనా కోర్సులను అందుబాటులోకి తీసుకురావొచ్చని పేర్కొన్నారు. గిరిజనులకు ఎక్కువ సీట్లు ఇస్తేనే ప్రయోజనం ఇన్నాళ్లకైనా గిరిజన వర్సిటీ ఇవ్వడం సంతోషకరం. కానీ దీనివల్ల గిరిజనులకు ఒరిగేదేమీ లేదు. గిరిజనుల పేరిట యూనివర్సిటీ పెట్టి వారికి కేవలం ఏడున్నర శాతం రిజర్వేషన్ ఇవ్వడమేంటి? అదేం గిరిజన యూనివర్సిటీ? ఇదేమిటని కేంద్రాన్ని అడిగితే యూజీసీ నిబంధనలు అంటున్నారు. అలాంటప్పుడు జనరల్ యూనివర్సిటీ పెట్టుకోండి అని చెప్పా.. గిరిజనులకు అత్యధికంగా సీట్లు ఇచ్చినప్పుడే అది గిరిజన వర్సిటీ అవుతుంది. దీనిపై కేంద్రమంత్రికి మళ్లీ లేఖరాస్తా. – అజ్మీరా సీతారాం నాయక్, మాజీ ఎంపీ, కేయూసీ రిటైర్డు ప్రొఫెసర్ -
తెలంగాణకు మోదీ వరాలు.. పసుపు బోర్డు, సమ్మక్క యూనివర్సిటీ
సాక్షి, మహబూబ్‌నగర్: ప్రధాని మోదీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు పలు వరాలను ప్రకటించారు. తెలంగాణలో పసుపు బోర్డు, సమక్క సారక్క పేరుతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. కాగా, ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నా కుటుంబ సభ్యులారా చాలా సంతోషంగా ఉంది అని తెలుగులో మాట్లాడారు. పలుమార్లు నా కుటుంబ సభ్యులారా అని ప్రసంగించారు. ఈ క్రమంలోనే కీలక ప్రకటనలు చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. పాలమూరు సభ సాక్షిగా రాష్ట్రంలో పసుపు రైతుల కోసం నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డు చేస్తున్నామన్నారు. తెలంగాణలో పసుపు పంట విస్తృతంగా పండుతోంది. పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది. ఇదే సమయంలో ములుగు జిల్లాలో సమక్క సారక్క పేరుతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. రూ.900 కోట్లతో సమ్మక-సారలమ్మ పేరుతో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ అని పేర్కొన్నారు. ఈ సందర్బంగా పాలుమూరు సభలో రాజకీయాల గురించి మాట్లాడతానని హింట్ ఇచ్చారు. తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. నేడు అనేక రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్‌లు ప్రారంభించుకున్నాం. రోడ్డు, రైలు కనెక్టివిటీతోనే అభివృద్ధి ముడిపడి ఉంది. ర్లమెంట్‌లో మహిళా బిల్లు ఆమోదించుకున్నాం. పార్లమెంట్లో నారీ శక్తి బిల్లును ఆమోదించుకున్నాం. దేశంలో పండుగల సీజన్ నడుస్తోంది. నవరాత్రికి ముందే శక్తి పూజలు ప్రారంభించుకున్నాం. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ ప్రాజెక్ట్‌ల ద్వారా అభివృద్ధి జరుగుతుంది. రవాణా సదుపాయాలు మెరుగవుతాయి అని తెలిపారు. -
గిరిజనుల జీవితాల్లో విద్యా కుసుమాలు
-
ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఈ ఘనత మోదీ, జగన్‌లదే
కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ఘనత ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్‌లకే దక్కుతుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసించారు. శుక్రవారం వర్సిటీ ఏర్పాటుకు సీఎం జగన్‌తో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ఘనత ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిలకే దక్కుతుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసించారు. శుక్రవారం వర్సిటీ ఏర్పాటుకు సీఎం జగన్‌తో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన ఈ ప్రాంతానికి రావడం పట్ల గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. విజయవంతమైన చంద్రయాన్–3 ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వేదిక కావడం సంతోషకరం అన్నారు. ఇలాంటి రాష్ట్రంలో గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అభినందనీయం అని చెప్పారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమష్టి కృషితో రూ.800 కోట్లతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం సాకారమవుతోందన్నారు. 561 ఎకరాల భూమి, విద్యుత్తు, రోడ్డు, నీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం జగన్ చొరవ తీసుకొని ముందుకు వచ్చారని తెలిపారు. 21వ శతాబ్దానికి ఆధునిక దేవాలయమైన ఈ విశ్వ విద్యాలయం సాలూరు గిరిజన ప్రాంతంలో ఏర్పాటవ్వడం వల్ల పొరుగునున్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్టాల్లోని గిరిజనులతో సామాజిక అనుబంధం ఏర్పడుతుందన్నారు. గిరిజనుల ప్రగతికి దోహదం ఇక్కడ ప్రసిద్ధి గాంచిన అరకు కాఫీ, నల్ల మిరియాలు, తేనె, పనస, పైనాపిల్ తదితర అటవీ పంటలపై పరిశోధనకు ఈ వర్సిటీ ద్వారా అవకాశం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి చెప్పారు. క్రీడా సామర్థ్యాలు, నైపుణ్యాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు దోహదం చేస్తుందన్నారు. ఒడిశాలో ఉన్న యూనివర్సిటీతో ఈ వర్సిటీ భాగస్వామ్యమైతే దేశంలో గిరిజనుల ప్రగతిని ఎంతో ముందుకు తీసుకెళ్లవచ్చని ఆకాంక్షించారు. ఛత్తీస్‌గఢ్, రాయ్‌పూర్ నుంచి ఒడిశా మీదుగా విశాఖ, గంగవరం పోర్టులను కలిపే గ్రీన్‌ఫీల్డ్ హైవే, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోనే ట్రైబల్ వర్సిటీ ఉండటం కలిసొచ్చే అంశమన్నారు. రాష్ట్రంలో ఆంగ్ల భాష ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ, స్థానికంగా ప్రజల మాతృభాషనూ ప్రోత్సహిస్తూ బోధనలో బైలింగ్వల్ టెక్ట్స్ బుక్స్‌ను ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. కళ్లెదుటే అభివృద్ధి ► భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి గిరిజన ప్రాంతంలోకి వెళ్తుంటే మనం గిరిజనుల కోసం ఏం చేశామో కళ్లెదుటే కనిపిస్తోంది. గిరిజనులకు ప్రత్యేక జిల్లా, ప్రత్యేక యూనివర్సిటీ, వైద్య, ఇంజినీరింగ్ కాలేజీ ఇస్తామని హామీ ఇచ్చాం. దాన్ని నిలబెట్టుకుంటూ ఒకటి కాదు.. రెండు జిల్లాలు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం ఏర్పాటు చేశాం. ఇవాళ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశాం. ► రూ.వెయ్యి కోట్లతో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మెడికల్ కాలేజీ కడుతున్నాం. మన్యం జిల్లా పార్వతీపురంలో మరో మెడికల్ కాలేజీ వేగంగా నిర్మాణమవుతోంది. గిరిజన ప్రాంతానికి గేట్వేగా ఉన్న నర్సీపట్నంలో ఇంకో కాలేజీ కడుతున్నాం. ► కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణం మన కళ్ల ముందే కనిపిస్తోంది. గిరిజన తండాలో జనాభా 500 ఉంటే గ్రామ పంచాయతీగా మార్పు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుంటూ.. ఇప్పటికే 165 గిరిజన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశాం. ప్రతి ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని మాట ఇచ్చాం. ఆ ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, ప్రకాశం జిల్లా దోర్నాలలో రూ.250 కోట్లు ఖర్చుతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మాణంలో ఉన్నాయి. ► ఎస్సీ, ఎస్టీల నుంచి సేకరించిన అసైన్మెంట్ భూములకు, ఇతర పట్టా భూముల కంటే 10 శాతం ఎక్కువ పరిహారం ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటూ 2021 మే 19న జీవో 109 జారీ చేశాం. ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేశాం. -
గిరిజనుల్లో విద్యా కాంతులు
గిరిజనులు స్వచ్ఛమైన మనసు కలిగిన కల్మషం లేని మనుషులు. తరతరాలుగా వారిని పేదరికం వెంటాడుతోంది. ఇప్పటికీ మిగతా ప్రపంచంతో సమం కాని జీవన ప్రమాణాలు వారివి. వారి జీవితాలను మార్చే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో బాహ్య ప్రపంచంతో అడుగులు వేసే విషయంలో ఇంకా వెనుకబడే ఉన్నారు. ఈ నాలుగేళ్ల పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో పాటు, సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా వారిని గుండెల్లో పెట్టుకుని అడుగులు వేశాం. నాలుగేళ్లలో 58.39 లక్షల గిరిజన కుటుంబాలకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.16,805 కోట్ల లబ్ధి చేకూర్చామని చెప్పడానికి గర్వపడుతున్నాను. సాక్షి ప్రతినిధి, విజయనగరం : కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం స్థాపన ద్వారా గిరిజనుల జీవితాల్లో గొప్ప మార్పునకు నాంది పలికామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. గిరిజనుల్లో విద్యాకాంతులు నింపే ఈ ప్రాజెక్టును రూ.830 కోట్ల ఖర్చుతో మూడేళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం చినమేడపల్లిలో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శాశ్వత భవనాల నిర్మాణానికి, ఇతర మౌలిక వసతుల కల్పనకు శుక్రవారం ఆయన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అందుకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. అంతకు ముందు విశాఖపట్నం విమానాశ్రయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ముఖ్యమంత్రి ఘనంగా స్వాగతం పలికి, ఆయనతో కలిసి నేరుగా చినమేడపల్లికి హెలికాప్టర్లో చేరుకున్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని మరడాం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఈ విశ్వవిద్యాలయం వచ్చిందని, రాష్ట్రంలో రెండవ సెంట్రల్ వర్సిటీ అని చెప్పారు. గిరిపుత్రుల జీవితాల్లో ఉన్నత విద్యాకాంతులు నింపడానికి రాబోయే రోజుల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గిరిజన మిత్రుడిగా, గిరిజన పక్షపాతిగా మన గిరిజనులు ప్రపంచంతో పోటీపడేలా గొప్ప అడుగుకు బీజం పడబోతోందని చెప్పారు. తనను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న గిరిజన జాతికి మీ తమ్ముడిగా, అన్నగా, బిడ్డగా రుణపడి ఉంటానన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నాలుగేళ్లుగా గుండెల్లో పెట్టుకున్నాం ► ఈ నాలుగేళ్లలో గిరిజనుల అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేశాం. వారిని గుండెల్లో పెట్టుకున్నాం. అన్ని విధాలా అండగా నిలబడ్డాం. వారిని తోటి ప్రపంచంలో నిలబెట్టే సంకల్పంతో అడుగులు ముందుకు వేశాం. ► తరతరాలుగా నిర్లక్ష్యానికి గురైన నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరుల కోసం ప్రాథమిక విద్య మొదలు ఉన్నత విద్య వరకు అన్ని దశల్లోనూ అండగా నిలుస్తున్నాం. మీడియం నుంచి మౌలిక సదుపాయాల వరకు అన్నింటిలోనూ ఈ నాలుగేళ్లలో విప్లవాత్మక మార్పులతో అడుగులు ముందుకు వేశాం. ► గిరిపుత్రుల అభివృద్ధి పట్ల మనందరి ప్రభుత్వం ఎంతో బాధ్యతగా, దూరదృష్టితో వ్యవహరిస్తోంది. వారి విద్యా సాధికారత కోసం, తోటి పోటీ ప్రపంచంలో గెలవాలని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ అనే కాన్సెప్ట్ అమలవుతోంది. నాడు–నేడుతో వారు చదువుతున్న స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మారాయి. విద్యాకానుకతో బడిపిల్లల రూపాన్ని, బైలింగువల్ విధానంతో వారి టెక్టŠస్ బుక్స్‌నూ మార్చగలిగాం. ► ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్‌ను డిజిటలైజ్ చేస్తున్నాం. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ)లను ఏర్పాటు చేస్తున్నాం. 8వ తరగతి పిల్లలందరికీ ట్యాబ్స్ ఇచ్చే కార్యక్రమం ఒక్క మన రాష్ట్రంలోనే జరుగుతోంది. కల్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాలను చదువును ప్రోత్సహించేలా తీసుకొచ్చాం. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత విద్యలో విద్యా దీవెన, వసతి దీవెన తీసుకొచ్చాం. ► మెరుగైన చదువులు, కరిక్యులమ్‌లో మార్పులతో పిల్లలకు విద్యను అందుబాటులోకి తెచి్చన ఘనత ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే దక్కుతుంది. విదేశీ విద్యా దీవెనలో భాగంగా ప్రపంచంలోని టాప్ 50 వర్సిటీల్లోని 21 ఫ్యాకలీ్టలకు వర్తింపజేస్తున్నాం. మొత్తంగా 350 కాలేజీల్లో సీటు సంపాదించుకుంటే చాలు రూ.1.25 కోట్ల వరకు మన పిల్లలకు అండగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. రాజకీయంగానూ పెద్దపీట ► నా ఎస్టీలు.. అనే పదానికి అర్థం చెబుతూ గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వనంతగా గిరిజనులకు రాజకీయ పదవులిచ్చి నా పక్కనే పెట్టుకున్నాను. ఏ నామినేటెడ్ పదవి, ఏ నామినేటెడ్ కాంట్రాక్టు తీసుకున్నా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం కేటాయించేలా చట్టం చేసి అమలు చేస్తున్నాం. మొట్టమొదట గిరిజన చెల్లెమ్మకు, తర్వాత గిరిజన అన్నకు కేబినెట్లో డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చి నా పక్కన కూర్చోబెట్టుకున్నాను. గత ప్రభుత్వానికి భిన్నంగా.. రాజ్యాంగబద్ధమైన ట్రైబల్ అడ్వైజరీ కమిటీని కూడా నియమించాం. ► నా ఎస్టీల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన మనిíÙగా వారికి మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి హామీని మనసా వాచా కర్మణా త్రికరణశుద్ధితో అమలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గిరిజన తండాల్లో నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇలా ఇప్పటి వరకు 4.58 లక్షల గిరిజన కుటుంబాల ప్రయోజనం కోసం రూ.410 కోట్లు ఖర్చు చేశాం. ఆరోగ్య పరిరక్షణలోనూ శ్రద్ధ ► గిరిజన ప్రాంతంలో చిన్నపిల్లల దగ్గర నుంచి బాలింతలు, గర్భవతుల వరకు ఆరోగ్య పరిరక్షణలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాం. సంపూర్ణ పోషణ ప్లస్, చిన్న పిల్లలకు గోరుముద్ద స్కీమ్‌లతో వారు తీసుకునే ఆహారంలో మార్పులు తీసుకురాగలిగాం. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యం అందడం లేదన్న పరిస్థితిని పూర్తిగా మార్చేశాం. ప్రతి గిరిజన గ్రామంలో విలేజ్ క్లినిక్‌లు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కార్యక్రమం అమలు జరుగుతోంది. ప్రతి అడుగూ గిరిజనుల బాగు కోసమే ► గిరిజనుల కోసం ఇంతగా తపించిన ప్రభుత్వం ఏదీ లేదు. 1,53,820 కుటుంబాలకు మేలు చేస్తూ 3,22,538 ఎకరాలను ఆర్వోఎఫ్ఆర్ డీకేటీ పట్టాలు వారి చేతికి అందించింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. పెట్టుబడి ఖర్చుల కోసం రైతు భరోసా సొమ్ము కూడా మీ బిడ్డ ప్రభుత్వమే ఇస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మన పిల్లలు 1.30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులుగా కనిపిస్తున్నారు. ఇందులో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే ఏకంగా 84 శాతం కనిపిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని 497 సచివాలయాల్లో పని చేస్తున్న 100 శాతం ఉద్యోగులు నా గిరిజన తమ్ముళ్లూ, చెల్లెమ్మలే. ► నవరత్నాల్లోని ప్రతి పథకాన్నీ నా గిరిజనులకు వర్తింపజేసేలా అడుగులు వేశాం. అవినీతి, వివక్షకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో అమలు చేస్తున్నాం. మీ బిడ్డ బటన్ నొక్కుతుంటే నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోతున్నాయి. నాలుగేళ్ల పాలనలో 36.12 లక్షల గిరిజన కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తూ రూ.11,548 కోట్లు డీబీటీ ద్వారా ఇచ్చాం. నాన్ డీబీటీ అంటే ట్యాబ్‌లు, ఇళ్ల పట్టాలు, విద్యా కానుక, సంపూర్ణ పోషణ, గోరుముద్ద వంటివి కలుపుకుంటే 22.26 లక్షల కుటుంబాలకు మరో రూ.5,257 కోట్ల మేలు కలిగింది. మొత్తంగా డీబీటీ, నాన్ డీబీటీ కలుపుకుంటే 58.39 లక్షల గిరిజన కుటుంబాలకు రూ.16,805 కోట్ల లబ్ధి చేకూరింది. ► సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వల్ల గొప్ప మార్పు జరగబోతోంది. దీన్ని మన ప్రాంతానికి మంజూరు చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు అభినందనలు. -
గిరిపుత్రుల కోసం విప్లవాత్మక మార్పులు తెచ్చాం : సీఎం జగన్
సాక్షి, విజయనగరం: సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం మరడాంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. నన్ను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న గిరిజన జాతికి కృతజ్ఞతలు. గిరిజన వర్సిటీ మంజూరు చేసినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో గిరిజనులు ప్రపంచంతో పోటీపడతారు. గిరిజనులు స్వచ్చమైన మనసు కలిగినవారు. తరతరాలుగా గిరిజనులు అభివృద్ధికి దూరంగా ఉన్నారు. నాలుగేళ్ల పాలనలో మీ బిడ్డ విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చాం. దోపిడీ నుంచి గిరిజనులను రక్షించేందుకు కృషి చేశాం. ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను గిరిజనులకు అందిస్తున్నాం. సీఎం జగన్ కామెంట్స్ చిక్కటి చిరునవ్వుల మధ్య, చెరగని ఆప్యాయతల మధ్య ఈరోజు దేవుడి ఆశీస్సులతో మరో మంచి కార్యక్రమం ఇక్కడ నుంచి జరుగుతోంది. ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర విద్యా మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఈ వేదికపై నుంచి అభినందనలు తెలియజేస్తున్నా. నన్ను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న నా గిరిజన జాతికి మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ బిడ్డగా మీ జగన్ ఎప్పటికీ రుణపడి ఉంటాడు. ఈ సభకు వచ్చిన ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి సోదరుడికీ, ప్రతిస్నేహితుడికీ, నిండు మనసుతో రెండు చేతులూ జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ► ఈరోజు ఇక్కడ ఈ గిరిజన ప్రాంతంలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ శాశ్వత భవనాలకు పునాదులు వేస్తున్నాం. దాదాపు 830 కోట్ల ప్రాజెక్టు. మరో మూడు సంవత్సరాలకు ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయబోయే గొప్ప ప్రాజెక్టు. మంజూరు చేసినందుకు ఈ వేదికపై నుంచి మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనం ఇక్కడ శంకుస్థాపన చేసిన ఈ కార్యక్రమం 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం మనకు వచ్చిన విశ్వవిద్యాలయం ఇది. మరీ ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ గిరి పుత్రుల జిల్లాలో వారి జీవితాల్లో ఉన్నత విద్యా కాంతులు నింపడానికి ఈ యూనివర్సిటీ రాబోయే రోజుల్లో ఎంతగానో ఉపయోగపడుతుంది. ► రాబోయే రోజుల్లో మన గిరిజనులు ప్రపంచంతో పోటీ పడే గొప్ప అడుగు ఇక్కడి నుంచి బీజం పడబోతోంది. మామూలుగా కూడా నా మనసులో ఎప్పుడూ ఉండేది. గిరిజనులు స్వచ్చమైన మనసు కలిగిన వారు. కల్మషం లేని మనసులు కలిగిన వారు. తరతరాలుగా వారిని వెంటాడుతున్న పేదరికం.. ఇప్పటికీ మిగతా ప్రపంచంతో సమం కాని వారి జీవన ప్రమాణాలు. ప్రత్యేకించి వారి జీవితాలను మార్చే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఇప్పటికీ కూడా ఇంకా భావి ప్రపంచంతో అడుగులు వేసే క్రమంలో వెనకాలే ఉన్నారు. ఈనాలుగు సంవత్సరాల పరిపాలనలో విద్యా పరంగా కానీ, వైద్య పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, జెండర్ పరంగా కానీ గిరిజనులను గుండెల్లో పెట్టుకొని అడుగులు వేశామని గర్వంగా చెప్పలగుతా. ప్రపంచంలో వారిని నిలబెట్టే విద్యను వారికి అందించాలి. ► తరతరలాలుగా నిర్లక్షానికి గురైన నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ సోదరుల కోసం ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఉన్నత విద్య వరకు అన్ని దశల్లోనూ విప్లవాత్మక మార్పులతో అడుగులు ముందుకు వేశాం. ఈరోజు గిరిపుత్రులకు అభివృద్ధిపట్ల మనందరి ప్రభుత్వం బాధ్యతగా, దూరదృష్టితో వ్యవహరిస్తోందో నాలుగు మాటల్లో పంచుకుంటా. విద్య, సాధికారత కోసం, ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి రావాలని, మన పిల్లలు గెలవాలని, వారు చదువుకొనే మీడియంలో మార్పులు తీసుకొచ్చాం. గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేసే పరిస్థితి ఉందని మన రాష్ట్రంలో ఉందని గర్వంగా చెబుతున్నా. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ అమలవుతోంది. నాడు-నేడుతో వారు చదువుతున్న స్కూళ్ల రూపురేఖలు మార్చబడుతూ కనిపిస్తున్నాయి. ► విద్యాకానుకతో బడి పిల్లల రూపాన్ని బైలింగువల్ టెక్స్ట్ బుక్కులతో మార్చగలుగుతున్నాం. ప్రతి గవర్నమెంట్ బడిలో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూము డిజిటలైజ్ తెస్తూ, ఐఎఫ్పీలను ఏర్పాటు చేస్తున్నాం. గవర్నమెంట్ బడుల్లో చదువుతున్న పిల్లలు 8వ తరగతికి వస్తే ఆ పిల్లలందరికీ వారి చేతిలో ట్యాబ్స్ ఉంచే కార్యక్రమం ఒక్క మన రాష్ట్రంలోనే జరుగుతోంది. చదువులను ప్రోత్సహిస్తూ కల్యాణమస్తు, షాదీ తోఫా అనే కార్యక్రమాలను తీసుకొచ్చాం. దేశంలో ఎక్కడా జరగని విధంగా, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత విద్యలో విద్యా దీవెన, వసతి దీవెన తెచ్చాం. మెరుగైన చదువులు, కరిక్యులమ్ లో మార్పులు తెచ్చి పిల్లలకు అందుబాటులోకి తెచ్చిన చరిత్ర ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే. ► ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి మంచి చేస్తూ 3 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఉంది. పాడేరులో మరో మెడికల్ కాలేజీ, పార్వతీపురంలో మూడో మెడికల్ కాలేజీ కట్టబడుతోంది. ట్రైబల్ యూనివర్సిటీకి దగ్గర నుంచి కాస్త దూరం కురుపాంలో ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ కట్టబడుతోంది. ఈ ప్రాంతానికి ఎంత మంచి జరుగుతోందో చెప్పడానికి ఆలోచన చేయమని కోరుతున్నా. ఈ ప్రాంతానికి అత్యంత సమీపంలో కడుతున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కనిపిస్తుంది. అక్కడ నుంచి కాస్త దూరంలో పాడేరులో మెడికల్ కాలేజీ కడుతున్నది మన కళ్ల ఎదుట కనిపిస్తోంది. ► మరికాస్త దూరంలో సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశాం. మరో నాలుగు అడుగులు ముందుకు వెళ్లి చూస్తే కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ మనకు కనిపిస్తోంది. ఒక్క గిరిజన ప్రాంతలోనే రెండు మెడికల్ కాలేజీలు, ట్రైబల్ యూనివర్సిటీ ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, నాడు-నేడుతో మొదలు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు గిరిజనులకు కనీవినీ ఎరుగని విధంగా అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. మనందరి ప్రభుత్వం 50 నెలల పాలనలో గిరిజనులకు ఏం చేసిందో మీ అందరితో నాలుగు మాటలు పంచుకుంటా. నా ఎస్టీలు అనే పదానికి అర్థం చెబుతూ రాజకీయంగా పదవుల్లో వారికి గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా గిరిజనులకు నా పక్కనే పెట్టుకున్నా. ఏ నామినేటెడ్ పదవి, కాంట్రాక్టు తీసుకున్నా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ వర్గాలకు కచ్చితంగా 50 శాతం కేటాయించేట్లుగా ఏకంగా చట్టం చేసి కార్యరూపం చేస్తున్నాం. ఇంకా ఏమన్నారంటే.. ► మొట్ట మొదట గిరిజన చెల్లెమ్మకు, నా గిరిజన అన్నకు కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా నా పక్కన కూర్చోబెట్టుకున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగ బద్ధంగా ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని నియమించిన చరిత్ర మీ బిడ్డ ప్రభుత్వంలోనే. నా ఎస్టీల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన మనిషిగా మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి ఒక్క హామీ కూడా మనసా, వాచా, కర్మణా, త్రికరణశుద్ధిగా అమలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గిరిజన తండాల్లో నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చాం. 2019 జూలై నుంచి 4.58 లక్షల గిరిజన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా సరఫరా చేస్తున్నాం. ఇందుకోసం 410 కోట్లు ఖర్చు చేశామని సవినయంగా తెలియజేస్తున్నా. గిరిజనులకు ప్రత్యేక జిల్లా, ప్రత్యేక యూనివర్సిటీ, వైద్య, ఇంజనీరింగ్ కాలేజీ ఇస్తామని హామీ ఇచ్చాం. దాన్ని నిలబెట్టుకుంటూ ఒక జిల్లా కాదు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తున్నాం. ► రూ.1000 కోట్లతో అల్లూరి జిల్లా పాడేరులో మెడికల్ కాలేజీ కడుతున్నాం. మన్యం జిల్లాలో పార్వతీపురంలో మరో మెడికల్ కాలేజీ వేగంగా నిర్మాణం అవుతోంది. కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తాం అని చెబితే మన కళ్ల ఎదుటే నిర్మాణం కనిపిస్తోంది. గిరిజన తండాల జనాభా 500 ఉంటే పంచాయతీలుగా మార్పు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుంటూ 165 గిరిజన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశాం. ప్రతి ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్ నిర్మాస్తామని మాట ఇచ్చాం. మన్యం జిల్లా సీతంపేట, పార్వతీపురంలో, అల్లూరి జిల్లా రంపచోడవం, ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, ప్రకారం జిల్లా దోర్నాలలో 250 కోట్లు ఖర్చు చేస్తూ మల్టీ స్పెషాల్టీ హాస్పిటళ్లు నిర్మాణంలో ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యం అందడం లేదన్న పరిస్థితిని పూర్తిగా మార్పు చేస్తూ ప్రతి గిరిజన గ్రామంలో విలేజ్ క్లినిక్ లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లు కనిపించే కార్యక్రమం జరుగుతోంది. ► ఎస్సీ, ఎస్టీల నుంచి సేకరించిన భూములకు, ఇతర పట్టా భూముల కంటే 10 శాతం ఎక్కువ పరిహారం ఇస్తామని మాట ఇచ్చాం. ఆ మాట నిలబెట్టుకుంటూ 2021 మే 19న జీవో 109 జారీ చేశామని తెలియజేస్తున్నా. ఐదుగురు సభ్యులుండే ప్రత్యేక ఎస్సీ కమిషన్ ను తీసుకొచ్చింది కూడా మీ బిడ్డ పరిపాలనలోనే. గిరిజనుల కోసం ఇంతగా తపించిన ప్రభుత్వం ఏదీ లేదు. వారి బాగోగుల కోసం 153820 గిరిజన కుటుంబాలకు మేలు చేస్తూ, 322538 ఎకరాలను ఆర్వోఎఫ్ ఆర్ డీకేటీ పట్టాలు వారి చేతికి అందించింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే.పెట్టుబడి ఖర్చుల కోసం రైతు భరోసా సొమ్ము కూడా ఇస్తోంది మీ బిడ్డ ప్రభుత్వమే. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో మన పిల్లలు 1.30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులుగా కనిపిస్తున్నారు. ఇందులో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ వర్గాల వారు ఏకంగా 84 శాతం ఉద్యోగాలు వాళ్లే చేస్తూ అక్కడే కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 497 గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్న 100 శాతం ఉద్యోగులు నా గిరిజన తమ్ములు, చెల్లెమ్మలే అని చెప్పడానికి గర్వ పడుతున్నా. నవరత్నాల్లోని ప్రతి పథకాన్నీ నా గిరిజనులకు వర్తింపజేసేలా అడుగులు వేశాం. ► అవినీతి, వివక్షకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో అమలు చేస్తున్నాం. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోతున్నాయి. గిరిజనుల వరకు మాత్రమే చూస్తే 50 నెలల పాలనలో 36.12 లక్షల గిరిజన కుటుంబాలకు 11548 కోట్లు డీబీటీ ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పోతోంది. నాన్ డీబీటీ కూడా కలుపుకుంటే 22.26 లక్షల కుటుంబాలకు రూ.5,257 కోట్లు మేలు కలిగింది. మొత్తంగా డీబీటీ, నాన్ డీబీటీ కలుపుకుంటే అక్షరాలా 58.39 లక్షల గిరిజన కుటుంబాలకు రూ.16,805 కోట్లు నేరుగా వాళ్లకు వెళ్లాయి. ఈ ప్రాంతంలో మీకు జరిగిన మార్పును మీకు తెలియజేసేందుకు ఇవన్నీ చెబుతున్నా. ఈ యూనివర్సిటీ వల్ల గొప్పమార్పు జరగబోతోంది. రాబోయే రోజుల్లో తరతరాలు గుర్తుండిపోయేలా ఉండిపోతుందని తెలియజేస్తున్నా. దేవుడి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ పట్ల, ఈ ప్రభుత్వం పట్ల ఉండాలని, కేంద్ర ప్రభుత్వ సహకారం మరింతగా రావాలని ఆకాంక్షిస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను గిరిజనులకు అందిస్తున్నాం: సీఎం జగన్
Updates.. ►ఈ సందర్భంగా మరడాం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. నన్ను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న గిరిజన జాతికి కృతజ్ఞతలు. గిరిజన వర్సిటీ మంజూరు చేసినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో గిరిజనులు ప్రపంచంతో పోటీపడతారు. గిరిజనులు స్వచ్చమైన మనసు కలిగినవారు. తరతరాలుగా గిరిజనులు అభివృద్ధికి దూరంగా ఉన్నారు. ► నాలుగేళ్ల పాలనలో మీ బిద్ద విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చాం. దోపిడీ నుంచి గిరిజనులను రక్షించేందుకు కృషి చేశాం. ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను గిరిజనులకు అందిస్తున్నాం. ► మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అమలు చేస్తున్నాం. ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు అందిస్తున్నాం. చదువులను ప్రొత్సహిస్తూ కళ్యాణమస్తు, షాదీతోఫా కార్యక్రమాలు తీసుకువచ్చాం. పూర్తి ఫీజు రీయింజర్స్‌మెంట్‌తో విద్యాదీవెన, వసతిదీవెనను తీసుకువచ్చాం. ► కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ రాబోతోంది. పాడేరులో మెడికల్ కాలేజీ రాబోతోంది. బోగాపురంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటవుతోంది. సాలూరులో గిరిజన వర్సిటీ వచ్చేస్తోంది. గిరిజన విద్య, సాధికారతకు ప్రభుత్వం బాటలు వేస్తోంది. ► రాజకీయ పదవుల్లో గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చాం. గిరిజన ఎమ్మెల్యేను డిప్యూటీ సీఎంను చేశాం. 4లక్షల 58వేల గిరిజన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల విద్యుత్ ఇస్తున్నాం. గిరిజనులకు అల్లూరి, మన్యం జిల్లాలు ఏర్పాటు చేశాం. గిరిజన ప్రాంతంలో మల్లీ సెష్పాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నాం. ► కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం జగన్ చొరవతో గిరిజన వర్సిటీ సాధ్యమైంది. రూ. 2వేల కోట్లతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటవుతోంది. గిరిజన ప్రాంతంలోనే వర్సిటీ పెట్టాలని సీఎం జగన్ తలచారు. రాయ్‌పూర్ నుంచి విశాఖ వరకు ఆరులైన్ల రోడ్డు ఏర్పాటవుతోంది. పేదల గృహాల కోసం కేంద్రం రూ.లక్షా 20వేల కోట్లు ఖర్చు చేస్తోంది. మా పార్టీలు వేరైనా అభివృద్ధి విషయంలో కలిసి పనిచేస్తున్నాం. మాతృ భాషలకు కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఏపీలో ద్విభాషా పాఠ్యపుస్తకాలు తీసుకురావడం అభినందనీయం. అల్లూరి సీతారామరాజు నడిచిన పవిత్ర నేల ఇది. ఏపీ ప్రభుత్వం ఇంగ్లీష్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. గిరిజన వర్సిటీతో పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు. ఏపీలో అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. ఇక్కడ అంతర్జాతీయ కోర్సులు ప్రవేశపెడతాం. ► కేంద్ర గిరిజన వర్సిటీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ► ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు. ► మన్యం జిల్లా చినమేడపల్లి చేరుకున్న సీఎం జగన్ ► కాసేపట్లో కేంద్ర గిరిజన వర్సిటీకి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ► గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విశాఖపట్నం బయల్దేరిన సీఎం జగన్. ► రాష్ట్రంలోని గిరిజనుల జీవితాల్లో విద్యా కుసుమాలు విరబూసేలా విజయనగరం జిల్లా సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ► విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారు. ► విభజన హామీల్లో ఒకటైన ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటును గత చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నారు. గిరిజన ప్రాంతంలోనే యూనివర్సిటీ గిరిజన విశ్వవిద్యాలయం గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే సత్సంకల్పంతో దత్తిరాజేరు మండలం మర్రివలస, మెంటాడ మండలం చినమేడపల్లి పరిధిలోని ప్రభుత్వ,ప్రైవేటు భూమి సేకరించారు. విశాఖపట్నం–రాయగడ జాతీయ రహదారికి సమీపంలో, భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లకు అందుబాటులో ఉండేలా స్థలాన్ని ఎంపిక చేశారు. ఇందుకోసం భూములిచ్చిన రైతులకు రూ.29.97 కోట్ల పరిహారం చెల్లించారు. మౌలిక వసతుల కల్పనకు మరో రూ. 28.49 కోట్లు ఖర్చు చేశారు. అందించే కోర్సులు ఈ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లిష్, సోషియాలజీ, ట్రైబల్ స్టడీస్, బయోటెక్నాలజీ, కెమెస్ట్రీ, జర్నలిజం, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, డిగ్రీ స్థాయిలో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, బి.కామ్‌లో ఒకేషనల్ తదితర 14 కోర్సులను అందిస్తారు. ► వీటితో పాటు స్కిల్ డెవలప్మెంట్, ఒకేషనల్, జాబ్ ఓరియెంటెడ్ షార్ట్ టర్మ్ కోర్సులను కూడా అందిస్తారు. గిరిజన తెగల వ్యక్తిగత, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధిని ఈ యూనివర్సిటీ ద్వారా ప్రోత్సహిస్తారు. ఇప్పటికే విజయనగరం జిల్లా కొండకరకంలోని ఆంధ్రా యూనివర్సిటీ పాత పీజీ క్యాంపస్ భవనాల్లో నిర్వహిస్తున్న వర్సిటీ తరగతుల్లో 385 మంది విద్యార్థులున్నారు. -
మరడాంలో రేపు సీఎం జగన్ బహిరంగ సభ
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(ఆగష్టు 25) విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం(సీటీయూఏపీ) భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని.. ఆ తర్వాత మరడాం వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇప్పటికే సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సంబంధిత మంత్రులు, అధికారులు పర్యవేక్షించారు. జగన్ సర్కార్ అడుగుతో.. ఆహ్లాదకరమైన వాతావరణంలో, సువిశాల భవనాల్లో ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం సాకారం కానుంది. భవన శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా హాజరుకానున్నారు. షెడ్యూల్ ఇలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు. తొలుత విజయనగరం జిల్లా మెంటాడ మండలం చినమేడపల్లికి చేరుకుంటారు. అక్కడ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శంకుస్ధాపన కార్యక్రమంలో కేంద్రమంత్రితో కలిసి పాల్గొంటారు. ఆపై బయలుదేరి దత్తిరాజేరు మండలంలోని మరడాం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లికి బయల్దేరతారు. -
25న విజయనగరంలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, గుంటూరు: విద్యా రంగం కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తొమ్మిదేళ్ల విజయనగరం కల తీర్చనున్నారు. ఆగష్టు 25వ తేదీన విజయనగరం జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్ధాపన కార్యక్రమం జరగనుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. అందులో భాగంగా ఈ నెల 25వ తేదీన మెంటాడలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన జరగనుంది. ఇక విభజన హామీ మేరకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి.. త్వరగతిన నిర్మాణాలు పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. విజయనగరం యూనివర్సిటీలో 17 కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్న కోర్సులతో పాటు పరిశోధనల కోసం కూడా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత అధికారలు తెలిపారు. -
నైపుణ్య విద్యను ప్రోత్సహించేలా...!
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)–2020 అమ లులోకి వచ్చి జూలై 29 నాటికి మూడేళ్లవుతోంది. మునుపటి విద్యా వ్యవస్థ లలోని భారీ అంతరాలను గుర్తించి నాణ్యమైన విద్యా వకాశాలు అందరికీ సమా నంగా అందించడం దీని ప్రధాన లక్ష్యం. ప్రీస్కూల్ విద్య నుండి ఆరో తర గతి వరకు మాతృభాష బోధనా మాధ్యమంగాఉండాలని ఎన్ఈపీ ఉద్దేశం. అదేవిధంగా, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల కోసం కరిక్యులం, క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ కింద చేసిన సవరణలు ఏకకాలంలో రెండు పూర్తికాల విద్యా కార్యక్రమాలను కొనసాగించడాన్ని అనుమతిస్తున్నాయి. భౌతిక, ఆన్లైన్ మోడ్‌తో సహా, 4–సంవత్సరాల అండర్ గ్రాడ్యు యేట్ పాఠ్యాంశాలను ప్రోత్సహించడం వంటివి ఉన్నత విద్యలోని ముఖ్యాంశాలు. ఎన్ఈపీ–2020 నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. అలానే తల్లిదండ్రులు, తోటివారి ఒత్తిడి నుండి విద్యార్థికి ఉపశమనం కలిగించడానికి కూడా ప్రాధాన్యం ఇస్తోంది. విద్యార్థులు ఒక సంస్థ నుండి మరొక సంస్థకు, ఒక కోర్సు నుండి మరొక దానికి మారడానికి అవకాశం కల్పిస్తోంది. నైపుణ్య విద్యను ప్రోత్సహించడంలో భాగంగా ఎన్ఈపీ నేరుగా విద్యా సంస్థలతో పరి శ్రమలకు సంబంధాలు ఏర్పరచి చదువుకునే సమయంలోనే సమాంతరంగా వారికి వివిధ వృత్తుల్లో శిక్షణ ఇచ్చి జీవితంలో స్థిరపడే అవకాశాలను కల్పిస్తోంది. వినూత్న బోధనా పద్ధతులపై శిక్షణ అందించడం, ఐసీటీ సాధనాల విస్తృత వినియోగం వంటివి కూడా ఎన్ఈపీలో ముఖ్యమైన అంశాలు. ఎన్ఈపీ అధునాతన పాఠ్యాంశాలు, బోధనపై దృష్టి కేంద్రీకరిస్తూనే విద్యార్థుల సంభావిత అవ గాహన, విమర్శనాత్మక ఆలోచనలనూ ప్రోత్సహి స్తోంది. యోగా, ఫిజికల్ ఎడ్యుకేషన్, పెర్ఫార్మింగ్, విజువల్ ఆర్ట్స్‌తో పాటు పాఠ్యాంశాలను పునరుద్ధ రించడం, సమగ్ర పరచడం, గిరిజన జీవనశైలిని అర్థం చేసుకోవడానికి గిరిజన గ్రామానికి వెళ్లి జీవించడం, ‘డూయీంగ్ వైల్ లెర్నింగ్’ వంటి విద్యార్థి–కేంద్రీకృత పాఠ్యాంశాలు ఇందుకు నిద ర్శనం. ఎన్ఈపీ–2020 కింద విద్యార్థుల అంతర్లీన అవసరాలను అభివృద్ధి చేయడానికి నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌హెచ్‌ఈక్యూఎఫ్) వంటి వివిధ ప్రోగ్రామ్‌లు ప్రారంభించబడ్డాయి. ఎన్ఈపీ–2020 ఈక్విటీ, ఇన్‌క్లూజన్ అలాగే భాగస్వామ్య పాలన సిద్ధాంతాలపై ఆధారపడింది. అందువల్ల దివ్యాంగులు, మహిళలు, ఎల్జీ బీటీక్యూలు, ఎస్సీ, ఎస్టీలు, పీవీటీజీలు, డీఎన్టీలు వంటి వారికి సాధికారత కల్పించడం, వారికి సమానమైన అవకాశాలను అందిస్తూ అందు బాటులో ఉండటం ఇందులోని చాలా ముఖ్యమైన అంశం. గిరిజనుల కోసం ‘ఏకలవ్య మోడల్ రెసిడె న్షియల్ పాఠశాల’లను బలోపేతం చేయడం, కొత్త ఉపాధ్యాయుల నియామకానికి ప్రాధాన్యత ఇవ్వ డం, కొత్త ఈఎమ్ఆర్ఎస్ ప్రారంభించడం, 10–15 చిన్న పాఠశాలలను కలుపుతూ ‘వన్ స్కూల్ కాంప్లెక్స్’ పునర్నిర్మాణం వంటివి ఇందు కోసం తీసుకున్న కొన్ని చర్యలు. అంతర్జాతీయీ కరణ, సహకారం, భాగస్వామ్య పద్ధతిలో పథకాలను బలోపేతం చేయడం, విదేశీ విశ్వ విద్యాలయాల ఆఫ్–షోర్ క్యాంపస్‌లను స్థాపించడానికి ఆహ్వానించడం, అలాగే దేశంలో డిజిటల్ ఈ–విశ్వవిద్యాలయాల స్థాపన... ఎన్ఈపీ అమలు ప్రారంభించిన తర్వాత తీసు కున్న మరికొన్ని కార్యక్రమాలు. ఎన్ఈపీ ‘ల్యాబ్ టు ల్యాండ్’, ‘ల్యాండ్ టు ల్యాబ్’ను ప్రమోట్ చేస్తుంది. మొత్తం మీద ఎన్ఈపీ–2020 గత మూడు సంవత్సరాల్లో అనేక స్పష్టమైన ఫలితాలను సాధించగలిగింది. బహుళ ప్రవేశ–నిష్క్రమణ విధానం ద్వారా ఇది విద్యార్థులకు నేర్చుకునే సౌకర్యవంత మైన మార్గాన్ని అందించింది. ఆ విధంగా ఎన్ఈపీ–2020 భారతీయ విద్యా వ్యవస్థ చరిత్రలో నిజమైన గేమ్ ఛేంజర్ అని చెప్పవచ్చు. వ్యాసకర్త వైస్ ఛాన్స్లర్, ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (ఎన్ఈపీ ప్రారంభమై మూడేళ్లు) -
కేంద్రంలో ఉన్నది ప్రభుత్వమా.. ప్రైవేటు కంపెనీనా?: మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన ధాన్యం మొత్తం కేంద్రం కొనాల్సిందేనని మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల మనోభావాలను దెబ్బతీసిందని మండిపడ్డారు. ఎస్టీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిందని తెలిపారు. కేంద్రంలో ఉన్నది ప్రభుత్వమా.. ప్రైవేటు కంపెనీనా? అని సూటిగా ప్రశ్నించారు. ఎస్టీ రిజర్వేషన్లు ఎప్పుడిస్తారని ఉత్తమ్ కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రాలేదనడం పచ్చి అబద్ధమని అన్నారు. బీజేపీ భారతీయ జూటా పార్టీగా మారిందని మండిపడ్డారు. తెలంగాణలో 9.08 శాతం తగ్గకుండా గిరిజన రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని గుర్తుచేశారు. పార్లమెంట్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని దుయ్యబట్టారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు కోసం సీఎం కేసీఆర్.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా కలిశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ లేఖలకు కేంద్రం నుంచి సమాధానం కూడా వచ్చిందని వెల్లడించారు. బీజేపీ వాట్సప్‌లోనే కాదు.. పార్లమెంట్లో కూడా పచ్చి అబద్ధాలు ఆడుతుందని మండిపడ్డారు. బీజేపీ గిరిజనుల గొంతు కోస్తుందని, బీజేపీ చేతగానితనానికి ఇది నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. సభకు తప్పుడు సమాచారం ఇచ్చిన కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రేపు(బుధవారం) పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. గిరిజన రిజర్వేషన్ల బిల్లు ఆమోదించేదాక ప్రతీ గిరిజన తాండాలో నిరసనలు కొనసాగుతాయని తెలిపారు. -
గిరిజన వర్సిటీ కావాలని..
ఆదిలాబాద్‌టౌన్: గిరిజన విశ్వవిద్యాలయాన్ని జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాలు ఆదిలాబాద్‌లో సోమవారం చేపట్టిన మహాధర్నాలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ధర్నాలో భాగంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వాహనాన్ని విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. పోలీసులు నచ్చజెప్పినా విద్యార్థి నేతలు మాట వినకపోవడంతో లాఠీచార్జికి దిగారు. అప్పటికే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో విషయం తెలుసుకున్న ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నా రు. ఆయన ఆదేశాల మేరకు ఆందోళనకారులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. -
జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా అభివృద్ధికి చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా అభివృద్ధి కోసం ఇస్రో మాజీ చీఫ్ కస్తూరి రంగన్ నేతృత్వంలో జాతీయ స్టీరింగ్ కమిటీని కేంద్ర విద్యాశాఖ మంగళవారం ఏర్పాటు చేసింది. ఆయన గతంలో జాతీయ విద్యా విధానం–2020 డ్రాఫ్టింగ్ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు. కాగా మూడేళ్ళ కాలపరిమితితో నిర్ణయించిన ఈ నూతన కమిటీ జాతీయ విద్యావిధానం 2020 దృక్పథాల ప్రకారం నాలుగు జాతీయ పాఠ్యాంశాల ముసాయిదాలను అభివృద్ధి చేస్తుంది. పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా, ప్రారంభ బాల్య సంరక్షణ, విద్య కోసం జాతీయ పాఠ్యాంశాలు, ఉపాధ్యాయ విద్య కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక, వయోజన విద్య కోసం జాతీయ పాఠ్యాంశాల ముసాయిదాలను ఈ కమిటీలోని మొత్తం 12మంది సభ్యులు సిద్ధం చేయనున్నారు. ప్రతిపాదనలు.. సలహాలు.. ఎన్ఈపీ–2020 అన్ని సిఫార్సులను పాఠశాల విద్య, ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ), టీచర్ ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్‌కు సం బంధించిన పాఠ్యాంశాల సంస్కరణలను ఈ కమి టీ ప్రతిపాదిస్తుంది. జాతీయ పాఠ్యాంశాల ముసా యిదా కోసం టెక్ ప్లాట్‌ఫారమ్‌లో అందుకున్న రాష్ట్ర పాఠ్యాంశాల ముసాయిదా నుంచి కమిటీ ఇన్పుట్లను తీసుకుంటుంది. అంతేగాక జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా తయారీలో వాటాదారులైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అందుకున్న సలహాలతో పాటు ఎన్సీఈఆరీ్టకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ, జనరల్ బాడీ, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ సమా వేశాల్లో సూచనలను చేర్చిన తర్వాత కమిటీ జాతీ య పాఠ్యాంశాల ఫ్రేమ్‌వర్క్‌లను ఖరారు చేస్తుంది. పలువురు సభ్యులు.. జాతీయ స్టీరింగ్ కమిటీకి భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త కె.కస్తూరిరంగన్ నేతృత్వం వహిస్తుండగా, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్తుత ఛాన్సలర్ మహేష్ చంద్ర పంత్, నేషనల్ బుక్ ట్రస్ట్ ఛైర్మన్ గోవింద్ ప్రసాద్ శర్మ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ నజ్మా అక్తర్, సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి వైస్–ఛాన్సలర్ టి వి కత్తిమణి, పద్మశ్రీ మిచెల్ డానినో, జమ్మూ ఐఐఎం చైర్పర్సన్ మిలింద్ కాంబ్లే, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జగ్బీర్ సింగ్, భారతీయ సంతతికి చెందిన అమెరికన్ గణిత శాస్త్రవేత్త మంజుల్ భార్గవ, ఎన్ఈపీ–2020 డ్రాఫ్ట్ కమిటీ సభ్యుడు ఎంకె శ్రీధర్, మాజీ ఐఏఎస్ అధికారి ధీర్ జింగ్రాన్, ఏక్ స్టెప్ ఫౌండేషన్ సీఈఓ శంకర్ మరువాడలు సభ్యులుగా వ్యవహరించనున్నారు. -
ఏపీలో గిరిజన వర్సిటీ స్థాపనకు చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన విశ్వవిద్యాలయ స్థాపనకు చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రదాన్ చెప్పారు. లద్దాఖ్ ప్రాంతంలో సిందూ కేంద్రీయ విశ్వవిద్యాలయ స్థాపనకు ఉద్దేశించి సెంట్రల్ వర్సిటీస్ (సవరణ) బిల్లు–2021పై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఉన్నతవిద్యలో ప్రాంతీయ అసమతుల్యతను తగ్గించేందుకు లద్దాఖ్‌లో సెంట్రల్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఇదేతరహాలో ప్రాంతీయ అసమానతను ఏపీ ఎదుర్కొంటోంది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ఏపీకి గిరిజన విశ్వవిద్యాలయ స్థాపనకు హామీ ఇచ్చింది. ఈ వర్సిటీ గిరిజనులకు మరింత సమీపంలో ఉండేందుకు వీలుగా రెల్లి గ్రా మం నుంచి సాలూరు ప్రాంతానికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. పార్వతీపురం సమీకృత గిరిజన అభివృద్ధిసంస్థ పరిధిలో ఈ ప్రాంతం ఉం ది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు మద్దతు ఇ చ్చి త్వరితగతిన వర్సిటీ ఏర్పాటుచేయాలి. అలాగే ఏపీలో 13 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాని కోరాం. రాష్ట్ర విభజన అనంతరం టైర్–1 నగరాలు కోల్పోయి వైద్యరంగంలో సూపర్ స్పెషాలిటీ వసతుల లేమి ఏర్పడింది. అందువల్ల ఆరోగ్యరంగంలో మానవ వనరుల అభివృద్ధికి వీలుగా కేంద్ర సాయంతో 13 వైద్య కళాశాలలు స్థాపనకు సహకరించాలని కోరుతున్నాం..’ అని పేర్కొన్నారు. దీనికి మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సమాధానం ఇస్తూ ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ స్థాపనకు హామీ ఇచ్చింది. అయితే యూనివర్సిటీ స్థలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక సూచన వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆత్మీయ మిత్రుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాకు ఈ విషయమై లేఖ రాశారు. నాకు సంతోషకరమైన విషయమేంటంటే ఈ యూనివర్సిటీ ఒడిశాకు దగ్గరగా ఏర్పాటవుతోంది. సాలూరుకు సమీపంలో ఏర్పాటవుతున్న ఈ వర్సిటీ వల్ల ఒడిశా విద్యార్థులకు కూడా మేలు చేకూరుతుంది. ఈ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాల్సి ఉంది. ముఖ్యమంత్రి ఈ విషయంలో హామీ ఇచ్చారు. యూనివర్సిటీ రహదారులు, విద్యుత్తు తదితర మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తప్పనిసరిగా ఏపీలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని మోదీ సర్కారు స్థాపిస్తుంది..’ అని చెప్పారు. -
కొంచెం ఖేదం.. కొంచెం మోదం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రీయ విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం, పెట్రోలియం వర్సిటీ మినహా, విభజన హామీలకు సంబంధించి కేంద్ర తాజా బడ్జెట్లో పెద్దగా ప్రస్తావన లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ వర్సిటీకి రూ. 60.35 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.26.90 కోట్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(ఐఐపీఈ)కి రూ.95 కోట్లు కేటాయించారు. ఇక ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ, ఐఐఎస్ఈఆర్, ఐఐఐటీ, తదితర జాతీయ విద్యా సంస్థలకు విద్యా సంస్థల వారీగా నిర్దిష్ట కేటాయింపులు చేయలేదు. దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐఎస్ఈఆర్లకు రూ.946 కోట్లు కేటాయించింది. ఐఐఎంలకు రూ.476 కోట్లు, ఎన్ఐటీలు–ఐఐఈఎస్టీలకు రూ.3,935 కోట్లు, ఐఐటీలకు రూ.7,536 కోట్లు కేటాయించింది. మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాల ప్రస్తావన లేదు. దేశ వ్యాప్తంగా కొచ్చి మెట్రో రైల్ నెట్వర్క్, చెన్నై మెట్రో రైల్ నెట్వర్క్, బెంగళూరు, నాగ్‌పూర్, నాసిక్ మెట్రో రైలు ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల ఊసే లేకుండా పోయింది. రాజధాని నిధుల గ్రాంట్లు, పోలవరం ప్రాజెక్టుకు రీయింబర్స్మెంట్, పునరావాస నిధుల కేటాయింపు, దుగరాజపట్నం పోర్టుకు యోగ్యత లేని పక్షంలో ప్రత్యామ్నాయంగా రామాయపట్నం పోర్టు అభివృద్ధి, కడపలో స్టీలు ప్లాంటు నిర్మాణానికి నిధులు, విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం, ఎయిమ్స్‌కు నిర్దిష్ట కేటాయింపులు లేవు. ఐదు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ సంస్థలకు రూ.133.17 కోట్లు కేటాయించగా.. ఇందులో ఏపీకి చెందిన సంస్థ కూడా ఉంది. విశాఖపట్నం–రాయపూర్ మధ్య 464 కి.మీ.మేర రహదారి అభివృద్ధి పనులు 2021–22లో ప్రారంభిస్తామని చెప్పారు. సరుకు రవాణా కారిడార్ల అభివృద్ధి రైల్వే శాఖకు సంబంధించి ఈస్ట్ కోస్ట్ కారిడార్ పేరిట ఖరగ్‌పూర్ నుంచి విజయవాడ, నార్త్ సౌత్ కారిడార్ పేరిట ఇటార్సి నుంచి విజయవాడ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్టులకు సంబంధించి వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు తొలిదశలో చేపడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు. రూ.1.03 లక్షల కోట్లతో తమిళనాడులో జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా చిత్తూరు నుంచి తట్చూర్కు జాతీయ రహదారి అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఐఈబీఆర్ కింద నాబార్డుకు రూ.5,130 కోట్లు ఇంటర్నల్, ఎక్స్ట్రా బడ్జెటరీ రిసోర్సెస్ (ఐఈబీఆర్) కింద నాబార్డుకు రూ.5,130 కోట్లు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా నిధులు సమకూర్చనున్నట్టు కేంద్రం తెలిపింది. సొసైటీ ఫర్ అప్లయిడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, రీసెర్చి (సమీర్) కేంద్రాలకు రూ.120 కోట్ల మేర నిధులు కేటాయించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ గుర్తింపు పొందిన సైంటిఫిక్ సొసైటీ.. మైక్రోవేవ్స్, మిల్లీమీటర్ వేవ్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్స్ సాంకేతిక రంగాల్లో పని చేస్తుంది. ఈ సాంకేతికత అనువర్తనాలు అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో విశాఖపట్నం, ముంబై, చెన్నై, కోల్‌కతా, గువాహటిల్లో ఐదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. విశాఖలో ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొంది. మొత్తం ఐదు మేజర్ ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసులు, ప్రజలకు మధ్య వారధిగా పని చేయడానికి, బాధలో ఉన్న మహిళలను ఓదార్చడానికి వారికి సౌకర్యాలు కల్పించడంలో భాగంగా మహిళా పోలీసు వలంటీర్ల నియామకానికి కేంద్రం అనుమతించింది. ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో వీటి ఏర్పాటుకు అనుమతించినా, నిధులు కేటాయించలేదు. ఈఏపీ ప్రాజెక్టులకు విదేశీ రుణాలు ఏపీలో మొత్తం పది ప్రాజెక్టులకు విదేశీ రుణాల కింద రూ.15,518.76 కోట్లు రానున్నాయి. ఈ మేరకు కేంద్రం పూచీకత్తు ఇవ్వనుంది. ఆయా ప్రాజెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి. ► విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రాజెక్టు–1 ఏడీబీ నుంచి రూ.1,160.77 కోట్లు. ► 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ప్రాజెక్టుకు ఏఐఐడీ నుంచి రూ.159 కోట్లు. ► 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ప్రాజెక్టుకు ఐబీఆర్డీ నుంచి రూ.367.10 కోట్లు. ► గ్రామీణ రోడ్ల ప్రాజెక్టుకు ఏఐఐబీ నుంచి రూ.1,160 కోట్లు. ► ఏపీ అర్బన్ వాటర్ సప్లై సేఫ్టీ మేనేజ్మెంట్ ఇంఫ్రూవ్‌మెంట్ ప్రాజెక్టుకు ఏఐఐబీ నుంచి రూ.2,056.75 కోట్లు. ► గ్రీన్ ఎనర్జీ కారిడార్–ఇంట్రా స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్‌కు డెన్మార్క్ ప్రభుత్వం నుంచి రూ.363.99 కోట్లు. ► ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంఫ్రూవ్‌మెంట్ ప్రాజెక్టు (ఫేజ్–2)కు జపాన్ ప్రభుత్వం నుంచి రూ.200 కోట్లు. ► ఆరోగ్య వ్యవస్థ బలోపేతం ప్రాజెక్టుకు ఐబీఆర్ నుంచి రూ.9,772.15 కోట్లు. ► డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టుకు ఐడీఏ నుంచి రూ.139 కోట్లు. ► ఏపీ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుకు ఐబీఆర్డీ నుంచి రూ.140 కోట్లు. -
అడవి బిడ్డల చెంతకే చదువులమ్మ
సాక్షి, అమరావతి: ఇంతవరకు పట్టణ ప్రాంతాలకే పరిమితం అయిన ఇంజనీరింగ్, మెడికల్ విద్య ఇక నుంచి గిరిజనులకు కూడా అందుబాటులోకి రానుంది. విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కళాశాల, విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ట్రైబల్ మెడికల్ కాలేజీ ఏర్పాటు కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విజయనగరం జిల్లా సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీని మంజూరు చేసింది. ఈ కళాశాలల నిర్మాణాలకు సంబంధించి పనులు ప్రారంభించేందుకు గాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఆన్లైన్ ద్వారా శంకుస్థాపన చేశారు. ‘విజయ’గిరుల్లో విశ్వవిద్యాలయం విద్యా ప్రమాణాల మెరుగు కోసం, ఎందరో గిరిజనుల బతుకుల్లో విద్యా సౌరభాలు నింపడానికి గిరిజన విశ్వవిద్యాలయం విజయనగరం జిల్లాలో ఏర్పాటైంది. సాలూరు నియోజకవర్గంలోని పాచిపెంట, రామభద్రాపురం మండలం కోటక్కి మధ్య సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ నిర్మాణం జరగనుంది. సాలూరు, బొబ్బిలి నియోజకవర్గాలను కలుపుతూ ఈ వర్సిటీ ఉంటుంది. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. యూనివర్సిటీ రెండు సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. ప్రస్తుతం విజయనగరంలోని ఆంధ్రా యూనివర్సిటీ పీజీ సెంటర్లో దీన్ని నిర్వహిస్తున్నారు. భవనాల నిర్మాణాలు పూర్తి కాగానే కొత్త భవనాల్లోకి విద్యార్థులు ప్రవేశిస్తారు. ఇక్కడ మొత్తం ఏడు కోర్సులు ఉన్నాయి. ప్రతి కోర్సులో 20 సీట్లు ఉన్నాయి. మొత్తం 140 సీట్లు యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయి. కోర్సుల వివరాలివీ... ఎమ్మెస్సీ కెమిస్ట్రీ (మెడిసినల్ కెమిస్ట్రీ), మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ (ఎంపీసీ) + ఎమ్మెస్సీ కెమిస్ట్రీ (స్పెషలైజేషన్ మెడిసినల్ కెమిస్ట్రీ), ఇంటిగ్రేటెడ్ బీబీఏ+ ఎంబీఏ (ట్రావెల్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్), బీఎస్సీ + ఎమ్మెస్సీ జియాలజీ, పీజీ డిప్లొమా ఇన్ ట్రావెల్ టూరిజం, అండ్ హాస్పటాలిటీ మేనేజ్మెంట్. యూనివర్సిటీలో చదువుకునేందుకు గిరిజనులు, గిరిజనేతరులు దరఖాస్తు చేసుకోవచ్చు. సెంట్రల్ యూనివర్సిటీ మాదిరిగానే రిజర్వేషన్లు అమలు చేస్తారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించి వర్సిటీ ప్రవేశాలు కల్పించింది. కొత్త భవనాలు వచ్చి పూర్తి సౌకర్యాలు ఏర్పాటైన తరువాత ఇందులో రీసెర్చ్ కోర్స్‌లు కూడా ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ట్రైబల్ యూనివర్సిటీకి విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) మెంటార్‌గా వ్యవహరిస్తోంది. గిరిజన విశ్వవిద్యాలయానికి కావలసిన మౌలిక సదుపాయాలు, అకడమిక్ వ్యవహారాల్లో ఏయూ తన సహాయ సహకారాన్ని అందిస్తోంది. అలాగే, విజయనగరం జిల్లా కురుపాం మండలం తేకరఖండి గ్రామంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనికి 105.32 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకుంది. రూ.153 కోట్లతో నిర్మించనున్న ఈ ఇంజనీరింగ్ కాలేజీ 2021-22 విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి రానుంది. ఇందులో ఈసీఈ, సీఎస్ఈ, సివిల్, మెకానికల్, ఈఈఈ బ్రాంచిలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ కళాశాల జేఎన్టీయూ- కాకినాడకు అనుబంధంగా ఉంటుంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఈ ప్రాంతం నుంచి బయటకు వచ్చి..శ్రీకాకుళం జిల్లా దాటి విశాఖ జిల్లాకు వెళుతున్నారు. ఈ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం పూర్తి అయితే ఇక నుంచి ఆ సమస్య కూడా తీరిపోతుంది. మన్యంలోనే మెడికల్ విద్య.. విశాఖ జిల్లాలోని మన్యం విద్యార్థులు మెడికల్ విద్యను తమ ముంగిట్లోనే చదువుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన పాడేరులో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ట్రైబల్ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తోంది. ఈ కాలేజీ నిర్మాణానికి ఇప్పటికే రూ.500 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. మొత్తం 35.01 ఎకరాల్లో 17 భవనాలు నిర్మిస్తున్నారు. ఈ మెడికల్ కళాశాల భవన నిర్మాణాలు మూడేళ్లలో పూర్తి కానున్నాయి. భవన నిర్మాణాలను పరిశీలించి కేంద్రం అనుమతి ఇస్తుంది. అంటే మూడేళ్లలో ఈ కళాశాల అందుబాటులోకి రానుంది. 8 గిరిజన జూనియర్ బాలికల కాలేజీల ఏర్పాటు గిరిజన సంక్షేమ శాఖ ఎనిమిది జూనియర్ కాలేజీలను నిర్మించడానికి ప్రతిపాదనలు తయారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఒక్కో కాలేజీలో మొదటి సంవత్సరంలో 160 మంది, రెండో సంవత్సరంలో 160 మందిని చేర్చుకుంటారు. ఇవన్నీ బాలికల కాలేజీలు కావడం విశేషం. కాలేజీలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారంటే... 1. శ్రీకాకుళం జిల్లా భామిని, మెలియాపుట్టి 2. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మర్రిపాలెం, చింతపల్లి మండలం లోతుగెడ్డ 3. తూర్పు గోదావరి జిల్లా చింతూరు 4. పశ్చిమ గోదావరి జిల్లా ముక్కునూరు 5. గుంటూరు జిల్లా బొల్లాపల్లి 6. నెల్లూరు జిల్లా ఓజిలి గ్రామాల్లో కాలేజీలు నెలకొల్పనున్నారు. రూపుమారిన గిరిజన గురుకులాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక గురుకుల విద్యాసంస్థల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఈ విద్యాసంస్థల్లో అత్యాధునికమైన వర్చువల్ తరగతి గదుల వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో పాటుగా విద్యాసంస్థల కేంద్రీకృత పర్యవేక్షణ కోసం కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని, సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి గిరిజన విద్యలో విప్లవాత్మకమైన మార్పులను ప్రభుత్వం తెచ్చింది. అలాగే, విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణంలో వంటలు చేసి వడ్డించాలన్న లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన గురుకులాల్లో వంటగదుల యాంత్రీకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టింది. -
‘విజయ’గిరుల్లో విశ్వవిద్యాలయం
గిరిజన వర్సిటీ పేరు సార్థకం కానుంది. అడవిబిడ్డల చెంతకే చదువులమ్మ చేరనుంది. సాలూరు నియోజకవర్గంలోనే ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇందుకోసం ఇప్పటికే పాచిపెంట మండలంలో స్థల పరిశీలన కూడా పూర్తయింది. ఇప్పటివరకూ వర్సిటీ ఏర్పాటు విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. తొలుత కొత్తవలస మండలంలో దీనిని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం భావించినా... అక్కడ ఏర్పాటువల్ల కలిగే సమస్యలను గుర్తించి... నిజమైన గిరిజన ప్రాంతాన్ని ఏర్పాటు చేయడంలో సర్కారు సఫలీకృతమైంది. సాక్షి, విజయనగరం : సాలూరు నియోజకవర్గంలోని అచ్చమైన గిరిజన ప్రాంతంలోనే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. పాచిపెంట మండలం వేటగానివలస పంచాయతీ పరిధి లోని చాపరాయివలస గ్రామంలో సుమారు 411 ఎకరాల్లో యూనివర్శిటీ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ వెంకటరమణారెడ్డి స్థల పరిశీలన చేశా రు. గిరిజన యూనివర్సిటీ నిర్మాణ శంకుస్థాపనకు సెప్టెంబర్‌లో సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి రానున్నట్లు ఆయన ప్రకటించారు. వెనుకబడ్డ జిల్లాలో విద్యా ప్రమాణాల మెరుగు కో సం, ఎందరో గిరిజనుల బతుకుల్లో విద్యా సౌరభాలు నింపడానికి గిరిజన విశ్వ విద్యాలయం కల సాకారం కాబోతోంది. ఈ ఏడాది గిరిజన యూనివర్సిటీ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఏడు కోర్సుల్లో 150 మంది విద్యార్ధులు చేరారు. గిరిజన యూనివర్శిటీకి మెంటార్‌గా ఆంధ్ర విశ్వవిద్యాలయం వ్యవహరిస్తోంది. దీంతో విజయనగరంలోని ఆంధ్రాయూనివర్సిటీ పీజీ సెంటర్లోనే మంగళవారం నుంచి తరగతులు మొదలయ్యాయి. విభజన హామీల అమలులో గత ప్రభుత్వం విఫలం విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం చేత అమలు చేయించడంలో గత టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ అనేక ఉద్యమాలు, వినతుల ద్వారా యూ నివర్శిటీ ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వానికి తెలి యజెప్పింది. దానిని పరిగణనలోకి తీసుకుని కేంద్రం రూ.420 కోట్లు మంజూరు చేసింది. తొలుత ఈ యూనివర్శిటీని కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూ పరిధిలోని అప్పన్నదొరపాలెం పంచాయతీ తమ్మన్న మెరకల వద్ద ఏర్పా టు చేయాలనుకున్నారు. సర్వేనంబరు 1/8లో 526.24 ఎకరాలను అప్పటి ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రహరీ నిర్మాణానికి రూ.5 కోట్లను, మౌలిక సదుపాయాల కోసం బడ్జెట్లో మరో రూ.5 కోట్లను కేటాయించింది. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కారణంగా ఆ భూముల్లో 178 కుటుంబాలు నిర్వాసితులుగా మారుతున్నట్లు గుర్తించారు. వీరికి భూమికి భూమి అప్పగించేందుకు దారపైడితల్లమ్మ గుడికి సమీపంలో భూసేకరణ కూడా చేశారు. కానీ ఇది పూర్తిగా అటవీ ప్రాంతం కావటంతో చదునుచేసి ఇస్తామని అప్పటి గనులశాఖ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు హామీ ఇచ్చారు. కానీ ఆ నిధులు రాలేదు. ఏ ఒక్కరికీ భూములు అప్పగించలేదు. ప్రహరీ నిర్మాణం కాంట్రాక్టు కూడా టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువుకే కట్టబెట్టారనే ఆరోపణలు వచ్చాయి. గిరిజన ప్రాంతంలోనే వర్సిటీ... గిరిజన యూనివర్శిటీని గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం సాలూరు ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. విజయనగరం జిల్లాలో వైఎస్సార్సీపీకి తిరుగులేని ఆదరణ ఉంది. ముఖ్యంగా గిరిజనం మొదటి నుంచీ ఆ పార్టీతోనే ఉన్నారు. గిరిజన ప్రజాప్రతినిధులైన పాముల పుష్పశ్రీవాణి, పీడిక రాజన్నదొర గతంలోనూ, ఇప్పుడూ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. గిరిజన ఆడబిడ్డ పుష్పశ్రీవాణి ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా దక్కించుకుని గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. ఈ విధంగా గిరిజనులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. అక్కడితో ఆగకుండా గిరిజన యూనివర్శిటీని గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేసేందుకు ఆయనే స్వయంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్రం, జిల్లా ప్రజాప్రతినిధుల చొరవతో వచ్చే నెలలోనే గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. -
గిరిజన వర్సిటీ ప్రవేశాలు లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: గిరిజన యూనివర్సిటీ ఈ ఏడాది కూడా అందుబాటులోకి వచ్చేలా లేదు. వాస్తవానికి 2019–20 విద్యా సంవత్సరం నుంచి మహబూబాబాద్ జిల్లాలో ఈ వర్సిటీని ప్రారంభించాలని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. ఈమేరకు చర్యలు చేపట్టాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి సూచనలు సైతం చేశారు. నిర్దేశిత యూజీ, పీజీ కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించి అడ్మిషన్లు చేపట్టాలి. ఈక్రమంలో హెచ్‌సీయూ ద్వారా విడుదలయ్యే నోటిఫికేషన్ ద్వారా గిరిజన యూనివర్సిటీ ప్రవేశాలు జరుగుతాయని భావించారు. ఇటీవల హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పలు పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఇందులో గిరిజన యూనివర్సిటీకి సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. స్థలం కేటాయింపు... భవనాల అప్పగింత గిరిజన వర్సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం 483 ఎకరాల భూమిని కేటాయించగా, ఇప్పటికే మెజార్టీ భూమిని రెవెన్యూ అధికారులు గిరిజన సంక్షేమ శాఖకు అప్పగించారు. తక్షణమే తరగతులు నిర్వహించుకునేందుకు వీలుగా యూత్ ట్రైనింగ్ సెంటర్ కోసం కేటాయించిన భవనాన్ని వర్సిటీకి గిరిజన సంక్షేమ శాఖ అప్పగించింది. దీంతో ఇప్పటికిప్పుడు తరగతులు మొదలుపెట్టే వీలుంది. అయితే డిగ్రీ, పీజీ కేటగిరీల్లో నిర్దేశిత కోర్సుల్లో ప్రవేశాలు, బోధన తదితర బాధ్యతలన్నీ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి అప్పగించింది. అయితే, ఇప్పటికీ గిరిజన వర్సిటీ ఊసే ఎక్కడా కనిపించడం లేదు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఇటీవల తెలంగాణ ఉన్నత విద్యామండలి పలు నోటిఫికేషన్లు జారీ చేయగా, చాలావాటికి దరఖాస్తుల స్వీకరణ గడువు సైతం ముంచుకొస్తోంది. గిరిజన యూనివర్సిటీ ప్రవేశ బాధ్యతలు ప్రభుత్వం హెచ్సీయూకు అప్పగించిన నేపథ్యంలో హెచ్‌సీయూ నోటిఫికేషన్ ద్వారా ప్రవేశాలు జరుగుతాయని అంతా భావించారు. ఇటీవల హెచ్‌సీయూ నోటిఫికేషన్లో గిరిజన వర్సిటీ ప్రవేశాల సమాచారం లేకపోవడంతో ఈ ఏడాది కూడా గిరిజన వర్సిటీ అందుబాటులోకి రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు కోర్సులకు అవకాశం ఉన్నా... 2019–20 విద్యా సంవత్సరంలో గిరిజన యూనివర్సిటీ అందుబాటులోకి వస్తే తొలుత ఆరు కోర్సులను ప్రారంభించాలి. ఇందులో డిగ్రీ, పీజీ కోర్సులున్నాయి. డిగ్రీలో బీఏ (హోటల్ మేనేజ్మెంట్), బీసీఏ, బీబీఏ, పీజీ కేటగిరీలో ఎంసీఏ, ఎంబీఏ (మార్కెటింగ్, ప్యాకేజింగ్), ఎంఏ (గిరిజన సంస్కృతి, జానపద కళలు) కోర్సులను ప్రారంభిస్తారు. మరిన్ని పీజీ, పీహెచ్డీ కోర్సులను దశలవారీగా అందుబాటులోకి తెస్తారు. తొలిఏడాది ప్రారం భించే కోర్సుల్లో మొత్తంగా 180 మందికి ప్రవేశా లు కల్పిస్తారు. ఏటా తరగతులు పెరుగుతూ, కొత్త కోర్సుల్లో ప్రవేశాలతో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. గిరిజనుల నేపథ్యంలో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ కావడంతో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రవేశాల్లో 30 శాతం సీట్లు వారికి కేటాయించనుంది. కానీ ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్లే విడుదల కాకపోవడంతో గందరగోళం నెలకొంది. -
గడప దాటని గిరిజన వర్సిటీ!
సాక్షి, హైదరాబాద్: గిరిజన యూనివర్సిటీకి చిక్కుముళ్లు వీడటంలేదు. స్థల కేటాయింపులతో పాటు నిధులు విడుదలైనప్పటికీ వర్సిటీ కార్యకలాపాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. తెలంగాణ ఏర్పాటులో భాగంగా విభజన చట్టంలో రాష్ట్రానికి గిరిజన వర్సిటీని కేంద్రం మంజూరు చేసింది. దీనికోసం భూసమీకరణ చేపట్టాలని కేంద్రం సూచించడంతో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 400 ఎకరాలను గుర్తించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు మండలం జాకారం సమీపంలో దాదాపు 200 ఎకరాలను గిరిజన సంక్షేమ శాఖకు అప్పగించింది. మరోవైపు జాకారం గ్రామం సమీపంలో ఉన్న వైటీసీ (యూత్ ట్రైనింగ్ సెంటర్)కోసం నిర్మించిన అత్యాధునిక భవనాన్ని కూడా వర్సిటీ కోసం కేటాయించింది. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ఆ భవనంలో కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చనే ఉద్దేశంతో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఈమేరకు నిర్ణయించింది. భూముల అప్పగింతతో పాటు భవనాన్ని సైతం అప్పగించినా, అనుమతులు తదితర ప్రక్రియ కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉండిపోయింది. హెచ్ఆర్డీ వద్ద పెండింగ్... యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన అనుమతులను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇవ్వాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో సంబంధిత నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. ఇందులో భాగంగా రెండుసార్లు హెచ్ఆర్డీ అధికారులు పర్యవేక్షణ సైతం చేపట్టినప్పటికీ అనుమతుల ప్రక్రియ పూర్తికాలేదు. తాజాగా సోమవారం హెచ్ఆర్డీ అధికారులు వర్సిటీ ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించారు. పార్లమెంటులో బిల్లుతోనే... యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనుమతితో పాటు వర్సిటీ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలలోనే వర్సిటీ బిల్లుకు ఆమోదం లభిస్తే 2019–20 విద్యా సంవత్సరం ప్రారంభించ వచ్చని ఉన్నాతాధికారలు అంటున్నారు. -
గిరిజన వర్సిటీ చేజారింది
ఉట్నూర్(ఖానాపూర్): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు అవుతుందనే ఆశ ఇక కలగానే మిగిలిపోనుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జయశంకర్‌భూపాల్‌పల్లి జిల్లా ములుగు మండలం జాకారంలో వచ్చే జూన్‌లో గిరిజన యూనివర్సిటీ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని గత గురువారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్సిటీ కోసం అవసరమైన భూమిని సేకరించినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు లేఖ రాయాలనీ అధికారులకు సూచించారు. 2008లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అదే సంవత్సరం నవంబర్ 17న జీవో నంబరు 797 విడుదల చేసింది. అప్పట్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంగిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు 2011 ఆగస్టు 27న జీవో నంబరు 783 జారీ చేసింది. దీంతో జిల్లా, ఐటీడీఏ అధికార యంత్రాంగం ఆదివాసీలకు కేంద్ర స్థానమైన ఉట్నూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలవెనుకాల ప్రభుత్వ భూమి 470 ఎకరాల్లో పరంపోగు భూమి 300 ఎకరాలు గుర్తించింది. 7వ నంబరు జాతీయ రహదారికి 34 కిలోమీటర్ల దూరంలో రవాణా, హైటెన్షన్ విద్యుత్‌తోపాటు ఇతర సౌకర్యాలు=ఉన్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు పంపించింది. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడంతో యూనివర్సిటీ ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వాలు పక్కన పెట్టాయి. కేంద్రంలోని యూపీఏప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తూ కేంద్రమంత్రి వర్గం ఆమోదించిన బిల్లు పదకొండో అంశంలో తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుప్రస్తావన ఉంది. అప్పటికే జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు జారీ చేయడంతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ కేంద్రంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు అవుతుందని అంతా ఆశించారు. ప్రారంభానికి ఏర్పాట్లు గిరిజన యూనివర్సిటీ పాత వరంగల్ జిల్లా(ప్రస్తుతం జయశంకర్ భూపాల్పల్లి జిల్లా)లో ఏర్పాటుకు గత ప్రభుత్వాల హయాంలోనే బీజం పడింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కిశోర్ చంద్రదేవ్, కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రిగా, పాత వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గానికి చెందిన బలరాంనాయక్ ఉండడంతో యూనివర్సిటీని ఆ జిల్లాకు తరలించేలా ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. అదే సమయంలో రెండు రాష్ట్రాల్లో గిరిజన యూనివర్సిటీల ఏర్పాటుకు సూత్రపాయ అనుమతులు లభించాయి. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు ఎక్కువగా ఉన్న పాత ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో అనువైన ప్రాంతంలో ఏర్పాటుకు నిర్ణయించారు. మొదట ఖమ్మం జిల్లా భద్రాచలం కేంద్రంగా ప్రయత్నాలు జరిగినా.. పోలవరం ముంపు ప్రాంతాలైన ఎనిమిది మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలుపడంతో అక్కడ సాధ్యం కాలేదు. అదే జిల్లాలోని ఇల్లందులో ఏర్పాటుకు అనుకున్నా.. అక్కడ బొగ్గు గనులు అడ్డంకిగా మారాయి. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూర్‌లో ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగినా.. పరిస్థితులు ఆశాజనకంగా లేవని నిర్ధారించడంతో మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ నియోజకవర్గం ములుగులో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం యూనివర్సిటీ ఏర్పాటుకు అవకాశాలు సర్వే చేయాలని అప్పట్లో ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. గతంలో అనుకున్నట్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ములుగు మండలం జాకారంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల ఆశలపై ప్రభుత్వం పూర్తిగా నీళ్లు చల్లినట్లయింది. అనువైన పరిస్థితులు ఉన్నా.. ఉమ్మడి జిల్లా ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూర్‌లో యూనివర్సిటీ ఏర్పాటుకు అనువైన అవకాశాలు ఉన్నా.. రాజకీయ కారణాలు, ఒత్తిళ్లతోనే జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2008లోనే ఉట్నూర్‌లో అవసరమైన ప్రభుత్వ పరంపోగు భూమిని అధికారులు గుర్తించారు. 4,95,794 గిరిజన జనాభాతో వివిధ గిరిజన తెగలకు అనువైన ప్రాంతంగా ఉందని, ఇతర సౌకర్యాల కల్పనకు పూర్తి స్థాయిలో అవకాశాలు ఉన్నాయని నివేదికలు ప్రభుత్వాలకు పంపించినా ఫలితం లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు యూనివర్సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలం కావడంతోనే మొండి చేయి చూపిందని గిరిజనులు ఆరోపిస్తున్నారు. తాము యూనివర్సిటీ కోసం ఎన్ని పోరాటాలు చేసినా ప్రజాప్రతినిధుల సహకారం లేకపోవడంతో యూనివర్సిటీ వేరే జిల్లాకు తరలివెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జాకారానికే జై..
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ సిగలో మరో విద్యా కుసుమం విరబూయనుంది. ఎడ్యుకేషన్ హబ్‌గా వర్ధిల్లుతున్న ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ కొలువుదీరనుంది. జయశంకర్ జిల్లా ములుగు మండలం జాకారం గ్రామ పరిధిలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి యూనివర్సిటీ కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదేశించారు. అలాగే మామునూరు వెటర్నిటీ కాలేజీకి సంబంధించి వచ్చే జూన్ నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని మంత్రి చెప్పారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులతో సచివాలయంలో బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ములుగులోనే.. యూపీఏ ప్రభుత్వ హయాం నుంచి గిరిజన యూనివర్సిటీ ప్రతిపాదనలు ఉన్నాయి. మహబూబాబాద్ లేదా ములుగులో నెలకొల్పాలని తొలుత ప్రయత్నించారు. ఈ మేరకు ములుగు మండలం జాకారం గ్రామ పరిధిలో వర్సిటీ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించారు. రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఉట్నూరు, ఖమ్మం జిల్లా భద్రాచలంలో గిరిజన వర్సిటీ నెలకొల్పాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. దీంతో వర్సిటీ ఏర్పాటు ఎక్కడ అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌ను ఎడ్యుకేషనల్ హబ్‌గా మారుస్తామని ప్రకటించి.. ఆ మేరకు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఒక్కొక్కటిగా వరంగల్‌లో నెలకొల్పుతున్నా.. గిరిజన వర్సిటీపై ఉన్న సందేహాలు తొలగిపోలేదు. ఇటీవల మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్జవదేకర్ ఆధ్వర్యంలో జరిగిన సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ సమావేశంలో తెలంగాణలోని గిరిజన విశ్వవిద్యాలయం అంశంపై జరిగిన చర్చతో మళ్లీ కదలిక వచ్చింది. రాష్ట్ర గిరిజన శాఖ కార్యదర్శి మహేష్‌దత్ ఎక్కా గిరిజన యూనివర్సిటీ కోసం ములుగు జాకారంలో 169 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒకే సర్వే నంబర్లో సేకరించామని వివరించారు. అదేవిధంగా 213 ఎకరాల భూమి ఫారెస్ట్ ల్యాండ్ సమీపంలో ఉందని, దీన్ని సైతం వర్సిటీ కోసం కేటాయించేందుకు ఫారెస్టు అధికారులతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కేంద్ర ప్రభుత్వం సంతృప్తి చెంది, వర్సిటీ కోసం ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించేందుకు ఫిబ్రవరిలో కేంద్ర అధికారుల బృందాన్ని క్షేత్రస్థాయి పర్యటనకు పంపేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో గిరిజన విశ్వవిద్యాలయం పనులను పర్యవేక్షించేందుకు ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించనున్నారు. జబల్పూర్ గిరిజన వర్సిటీ తరహాలో ములుగులో వర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మేరకు జబల్పూర్కు ప్రత్యేక బృందాన్ని పంపనున్నారు. వెటర్నరీ కాలేజీలో అడ్మిషన్లు మామునూరులోని పీవీ నర్సింహారావు వెటర్నరీ కాలేజీలో రాబోయే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ రాశారు. ఇప్పటికే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులు కూడా మామునూరు వెటర్నరీ కాలేజీని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు వెటర్నరీ కాలేజీకి అవసరమైన భవనాలు, మౌలిక వసతులు, ల్యాబ్‌ల నిర్మాణం కోసం రూ.109.69 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులకు ఇటీవల శంకుస్థాపన జరిగింది. వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభించే అవకాశం ఉన్నందున భవనాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదేశాలు జారీ చేశారు. -
జూన్‌లో గిరిజన వర్సిటీ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: జూన్ నుంచి ములుగు మండలం జాకారంలో గిరిజన వర్సిటీ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. వర్సిటీతోపాటు వరంగల్ మామునూరులో వెటర్నరీ కాలేజీని ప్రారంభించే విషయమై బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. కాలేజీ కోసం ప్రభుత్వం గతేడాది రూ.109.69 కోట్లు మంజూరు చేసిందని కడియం చెప్పారు. కాలేజీలో ప్రవేశాలకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి కోసం లేఖ రాశామని అధికారులు కడియం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల ఢిల్లీలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గిరిజన వర్సిటీ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లానని కడియం చెప్పారు. వర్సిటీ కోసం భూమిని సేకరించినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు లేఖ రాయాలని అధికారులకు సూచించారు. -
తెలంగాణలో త్వరలోనే గిరిజన వర్శిటీ!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట ప్రకారం తెలంగాణలో ఏర్పాటు కావాల్సిన గిరిజన వర్శిటీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. గిరిజన వర్శిటీ ఏర్పాటుకు భూమి సమస్య తీరడంతో వర్శిటీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. త్వరలో ఈ బిల్లు కేంద్ర క్యాబినెట్ ముందుకు వచ్చేలా చూడాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కోరినట్టు ఆయన తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం రూసా కింద ఖర్చు పెట్టిన రూ. 49.47 కోట్ల నిధులను త్వరలోనే విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. త్వరలో గిరిజన, సెంట్రల్ వర్సిటీల బిల్లు! ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట ప్రకారం ఏపీలో గిరిజన, సెంట్రల్ వర్శిటీల ఏర్పాటుపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సూత్రప్రాయంగా అంగీకకరించారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ విషయమై కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు సంబంధిత కేంద్ర మంత్రి జవదేకర్ తో చర్చించారు. గిరిజన, సెంట్రల్ వర్శిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీనిపై స్పందించిన జవదేకర్ సంబంధిత అధికారులను పిలిపించి మాట్లాడారు. వర్శిటీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు కృషి చేస్తామని జవదేకర్ హామీ ఇచ్చినట్టు వెంకయ్య తెలిపారు. -
పాడేరులో కొనసాగుతున్న బంద్
పాడేరు(విశాఖ): పాడేరులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘం పిలుపు మేరకు శుక్రవారం ఏజెన్సీ బంద్ నిర్వహిస్తున్నారు. బంద్ నేపథ్యంలో గిరిజన నాయకులు బస్సులను కదలనివ్వకుండా ఎక్కడికక్కడే ఆపేయడంతో ప్రజారవాణా స్తంభించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులను మొహరించారు. -
ములుగులో గిరిజన వర్సిటీ
మూడు ప్రదేశాలపై ప్రతిపాదనలు ప్రభుత్వానికి వరంగల్ అధికారుల నివేదిక సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈ ఏడాది జనవరిలో వరంగల్ జిల్లా పర్యటకు వచ్చినప్పుడు గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేశారు. వరంగల్ జిల్లాను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా గిరిజన విశ్వవిద్యాలయాన్ని సైతం ఈ జిల్లాలోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం అనువైన ప్రదేశంపై ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ వరంగల్ జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారులు పలు స్థలాలను గుర్తించారు. గిరిజన సంక్షేమ మంత్రి ఆజ్మీరా చందులాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలోని ములుగు మండలంలో మూడు ప్రదేశాలు అనువైనవిగా అధికారులు ప్రతిపాదించారు. వరంగల్ జిల్లా కేంద్రానికి 50 కిలో మీటర్ల పరిధిలోనే ఈ మూడు స్థలాలు ఉన్నాయని పేర్కొన్నారు. ములుగు మండలం మాధవరావుపల్లిలో 160 ఎకరాల ప్రభుత్వ భూమిని, రాంచంద్రపురం శివారులో అటవీ శాఖకు చెందిన 550 ఎకరాలు, జాకారం పరిధిలోని అటవీ శాఖకు చెందిన 150 ఎకరాలను రెవెన్యూ అధికారులు గుర్తించారు. మూడు ప్రదేశాల వివరాలు పంపాం సీహెచ్.మహేందర్‌జీ, ములుగు ఆర్డీవో గిరిజన విశ్వవిద్యాలం ఏర్పాటు కోసం మూడు చోట్ల స్థలాలను పరిశీలించాము. ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించాం. ఎక్కడ ఏర్పాటు చేసే విషయంపై ప్రభుత్వం నిర్ణయిస్తుంది. -
గిరిజన వర్శిటీకి మోక్షం కరువు?
గిరిజన వర్శిటీ వచ్చేసిందనీ... ఇక నిధులు కూడా విడుదలయ్యాయనీ... భవనాలు వచ్చే ఏడాదికి సిద్ధమవుతాయని... నేతలు చేసిన ప్రకటనలు జిల్లా యువతలో ఆశలు రేకెత్తించాయి. ఇతర జిల్లాకు వెళ్లాల్సిన అవసరం ఉండదనీ... ఇక్కడే ఉండి చదువుకోవచ్చనీ... ఇంకా ఇతర జిల్లాలవారే ఇక్కడకు వచ్చి చదువుకుంటారనీ... ఇలా ఎన్నో కలలు కన్నారు. కానీ నేతల హామీలు అమలుకు నోచుకోలేదు. ఈ ఏడాది సైతం వర్శిటీ ఏర్పాటు కలగానే మిగిలింది. విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో గిరిజన వర్శిటీ ఏర్పాటు చేస్తామని సర్కారు చేసిన ప్రకటన ఇక్కడివారినందరినీ ఆనందంలో ముంచెత్తింది. భవనాలు వచ్చే ఏడాదికి మొదలవుతాయనీ... అందాక తరగతులు ఏయూ ప్రాంగణంలో ప్రారంభిస్తామని చెప్పగా నిజమేనని నమ్మారు. కానీ ఆ మాటలు కార్యరూపం దాల్చలేదు. జిల్లాకు మంజూరయిన గిరిజన యూనివర్శిటీ కోసం స్థలపరిశీలనకు కేంద్రబృందం వచ్చింది. అంతకు ముందుకేంద్ర మంత్రి పి.అశోక్ తదితరులతో పాచిపెంటలో పరిశీలించారు. కొత్తవలస మండలం రెల్లిలో స్థల పరిశీలన గతేడాది ఫిబ్రవరి 17న జిల్లాలోని బొండపల్లి మండలం గుంకలాం, కొత్తవలస మండలం రెల్లి గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటించి స్థల పరిశీలన చేసింది. ప్రారంభంలో గుంకలాంలో స్థలం బాగుంటుందని భావించినా కొన్ని కారణాల వల్ల కొత్తవలస మండలం రెల్లిలోనే గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక్కడ 347.47 ఎకరాల మైదాన ప్రాంతం, మరో 178.77 ఎకరాల కొండ గుట్టలను గుర్తించారు. మొత్తం గిరిజన యూనివర్శిటీకి ఇచ్చేందుకు 526.24 ఎకరాల భూములను గుర్తించారు. వాటిని కేంద్ర బృందం పరిశీలించి ఓకే చేసేసింది. కేంద్ర మానవ వనరుల శాఖ జాయింట్ సెక్రటరీ సుఖ్బీర్ సింగ్ ఆధ్వర్యంలోని కేంద్రప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్, రాష్ట్ర మంత్రులు స్థలపరిశీలన చేసిన తరువాత ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభిస్తామన్నారు. ఇందుకోసం తాత్కాలికంగా తరగతులు ప్రారంభించేందుకు ఏయూ క్యాంపస్ అధికారులతో కూడా మాట్లాడారు. త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇక్కడి అధికారులను కూడా ఆదేశించారు. దీంతో జిల్లా అధికారులు రూ.12.5 కోట్లతో ప్రతిపాదనలు కూడా తయారు చేసి పంపించారు. ప్రహరీకి నిధులు మంజూరు కొండలు, గుట్టలు ఉండటంతో పాటు ఈ స్థలం మీదుగా హెచ్‌టీ లైన్ కూడా ఉంది. గుట్టలు, కొండలను చదును చేసేందుకు, హెచ్‌టీ లైన్‌ను పక్కకు తప్పించేందుకు నిధుల కోసం ప్రతిపాదనలు పంపారు. చదునుకు రూ.4.5 కోట్లు, 526 ఎకరాల చుట్టూ ప్రహరీ నిర్మాణానికి రూ. 5కోట్లు, హెచ్‌టీ లైన్‌ను పక్కకు తరలించేందుకు రూ. 3 కోట్లు మొత్తం రూ. 12.5కోట్లు అవసరం అవుతాయని ప్రతిపాదనలు చేస్తే కేవలం ప్రహరీ కోసం రూ. 5కోట్లు మంజూరు చేశారు. కానీ ఇప్పటికీ ఆ నిధులు వినియోగించలేదు. చట్టం చేయకపోవడం వల్లే... అసలు ఈ యూనివర్శిటీకి సంబంధించి చట్టం చేయాల్సి ఉన్నందునే ఈ కార్యక్రమం నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ప్రాధమిక స్థాయిలో చేయాల్సిన పనులు కూడా ప్రారంభించకపోవడం, మరో పక్క తాత్కాలిక తరగతులు కూడా ప్రారంభించకపోవడంతో జిల్లా ప్రజానీకం, ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఎదురు చూడటమే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని హడావుడిగా స్థల పరిశీలన చేసి తాత్కాలిక తరగతులు ప్రారంభిస్తామని ప్రకటనలు గుప్పించేసిన ప్రజా ప్రతినిధుల ఆచూకీ ఇప్పుడు కనిపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. చిత్తూరు, తాడేపల్లి గూడెం తదితర ప్రాంతాల్లో యూనివర్శిటీలు ప్రారంభమయ్యాయనీ విజయనగరంలో ప్రారంభించేందుకు నాయకులు ఎందుకు ప్రయత్నించడం లేదని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. -
ఇది తగునా..?
సాక్షి ప్రతినిధి, విజయనగరం : గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు విషయంలో రాష్ర్ట ప్రభుత్వమే జాప్యం చేస్తోందా?.. కేంద్రం ముందుకొచ్చినా మన సర్కార్ సిద్ధం కాలేకపోతుందా? .. వర్శిటీ ఏర్పాటుకు కేంద్రం సంసిద్ధంగా ఉన్నా మన పాలకులు చొరవ చూపడం లేదా?.. నిధుల విడుదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ మే తాత్సారం చేస్తుందా?.. తరగతుల ప్రారంభం కో సం మరికొంత కాలం వేచి చూడక తప్పదా?.. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనుమానాలు రేకెత్తుతున్నాయి. గిరిజన యూనివర్శిటీని జిల్లాలోనే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. దీంతో జిల్లాలో వేర్వేరు చోట్ల స్థలాలను చూసి నా చివరికీ కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూ గ్రామం లో ఉన్న స్థలంపైనే కేంద్రబృందం ఆసక్తి చూపింది. అక్కడే గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 526.24 ఎకరాలను జిల్లా అధికారులు గుర్తించారు. దీన్ని చదును చేయడంతో పాటు స్థలంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు, స్తంభాలను తొలగించి ప్రహరీ నిర్మించి ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. దీంతో జిల్లా అధికారులు తగిన ప్రణాళికలు కూడా రూపొందిం చారు. రూ. 12 కోట్లు అవసరం .. ఎత్తుపల్లంగా ఉన్న భూములను చదును చేసేందుకు రూ. 4 కోట్లు, ప్రహరీ నిర్మాణానికి రూ. 5 కోట్లు, హైటెన్షన్ విద్యుత్ వైర్లు, స్తంభాలను మరో ప్రాంతానికి మార్చడానికి రూ. 3 కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి పంపించారు. వాస్తవానికైతే హైటెన్షన్ వైర్లను అండర్ గ్రౌండ్లో పంపించాలని తొలుత భావించారు. కాకపోతే దానికయ్యే ఖర్చు రూ. 11కోట్లు వరకు ఉంటుందని చెప్పడంతో ప్రభుత్వ మే వెనక్కి తగ్గింది. అండర్ గ్రౌండ్ అవసరం లేదని, వేరే ప్రాంతానికి తరలించాలని చెప్పడంతో ట్రాన్స్‌కో అధికారులు రూ. 3 కోట్ల ప్రతిపాదన చేశారు. రూ. ఐదు కోట్లు విడుదల పనులకు రూ. 12 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాధనలు పంపించగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఐదు కోట్లు మాత్రమే విడుదల చేసింది. చదును, విద్యుత్ లైన్ల మార్పు విషయాన్ని పక్కనబెట్టి కేవలం ప్రహరీ కోసం మాత్రమే నిధులు మంజూరయ్యూయి. అయితే పనులన్నీ పూర్తయితేనే వర్శిటీ ఏర్పాటుకు కేంద్రం ముందుకు వస్తుంది. ఇదిలా ఉంటే ప్రహరీ నిర్మాణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వేల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సొసైటీకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో సంబంధిత అధికారులే నేరుగా పనులు చేపట్టాల్సి ఉంది. కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పెద్దలు వర్శిటీ ఏర్పాటుపై పలు ప్రకటనలు చేస్తున్నా అందుకు తగ్గ అడుగులు పడకపోవడంపై అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. -
‘కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి’
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపించారుు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిస విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు భాస్కర్ మాట్లాడారు. మాట తప్పిన కేసీఆర్ జిల్లాకు వచ్చేందుకు జంకుతున్నారన్నారు. ఉట్నూర్‌లో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజుల నుంచి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి యూనివర్సిటీ ఏర్పాటు చేయూలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. పీడీఎస్‌యూ వెంకటేశ్, ఏఐఎస్‌బీజే రాహుల్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నో ఆశలు... ఆకాంక్షలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆర్థిక బడ్జెట్‌పై జిల్లా గంపెడాశలు పెట్టుకుంది. వెనుకబడిన జిల్లాగా గుర్తించి ఆర్థికంగా ఆదుకోవాలని విభజన దగ్గరి నుంచి కోరుతున్న ప్రజానీకం ఆశలు ఏమేరకు నెరవేరుతాయోనని ఎదురుచూస్తోంది. రెండేళ్లుగా గిరిజన యూనివర్సిటీ కోసం ప్రకటనలు చేయడమే తప్ప మంజూరుపై ఇంతవరకు స్పష్టత లేదు. గత బడ్జెట్లో యూనివర్సిటీ కోసం రూ. 2కోట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. కానీ ఇంతవరకు దానిపై అతీగతి లేదు. ఎక్కడ, ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పడం లేదు. పాచిపెంట, బొండపల్లి, కొత్తవలస మండలాల్లో స్థలాలను పరిశీలించారు. కొత్తవలసకే పరిశీలకులు మొగ్గు చూపారు. కానీ దాని అడుగులు ఇంతవరకు పడలేదు. ఈ బడ్జెట్లోనైనా దానికొక స్పష్టత వస్తుందేమోనని జిల్లా ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల డిమాండ్ కూడా పెండింగ్‌లోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటు వైద్య కళాశాలతో సరిపెట్టేద్దామని యోచిస్తున్నా జిల్లాలోని ఏజెన్సీ, మైదాన ప్రజలకు మెరుగైన వైద్యం అందాలంటే ప్రభుత్వ వైద్య కళాశాల అవసరం ఎంతైనా ఉంది. రుణ వితరణ పెరగాలి : జిల్లాలో దాదాపుగా ఉన్నది సామాన్య, మధ్య తరగతి రైతులే. బ్యాంకులు రుణమిస్తే తప్ప వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి వారిది. బ్యాం కులు రుణాలిచ్చేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. గత బకాయిలు రాకపోవడం, రాష్ర్ట ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయకపోవడం వంటి కారణాలతో బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్నాయి. జిల్లాలో 4.29లక్షల మంది రైతులు ఉన్నారు. ఖరీఫ్ సీజన్లో రూ. 1008కోట్ల లక్ష్యం పెట్టినప్పటికీ బ్యాంకులు కొత్తగా రూ. కోటి వరకు రుణాలిచ్చాయి. మరో రూ. 629కోట్ల మేర లక్షా 40వేల మంది రైతుల రుణాలు రీషెడ్యూల్ చేశాయి. దీనివల్ల ప్రయోజనం ఆశించినంతగా లేదు. బ్యాంకులు రుణ లక్ష్యం, వితరణ పెంచేలా బడ్జెట్లో చర్యలు తీసుకోవాలని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహం అవసరం : జిల్లాలో 2,830చిన్న, మధ్య తరహా పరిశ్రమలుండగా, 35భారీ పరిశ్రమలు ఉన్నాయి. వీటితో జిల్లాలో నిరుద్యోగం తీరడం లేదు. ఉత్పత్తి సామర్ధ్యం పెరగడం లేదు. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తేనే సమస్య పరిష్కారమయ్యేది. ఇప్పుడు పరిశ్రమలకు అనుమతులు, బ్యాంకు రుణాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత బడ్జెట్లో ప్రకటించిన పారిశ్రామిక విధానంతో జిల్లాకు ఎటువంటి మేలు జరగలేదు. ఈసారైనా స్థానిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని పారిశ్రామిక విధానాలను రూ పకల్పన చేయాల్సిన అవసరం ఉంది. మేకిన్ ఇండియా లో భాగంగా యువత కొత్త ఆవిష్కరణలు, పరిశోధనల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇళ్లకు మోక్షం కలగదా : గత బడ్జెట్లో పట్టణాల్లో ఇళ్లు నిర్మించి తీరుతామని పేర్కొన్నారు. కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. గ్రామాల్లో పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. జిల్లాకు మరో 3లక్షల వరకు ఇళ్లు మంజూరు కావల్సిన అవసరం ఉంది. గత బడ్జెట్లో జిల్లాలోని స్మార్ట్ విలేజ్‌లన్నింట్లోనూ వైఫై సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. ఇంతవరకు ఒక్క పంచాయతీలో కూడా ఏర్పాటు చేయలేదు. ఈ- పంచాయతీ పాలన నత్తనడకన సాగుతోంది. జిల్లాలో 490క్లస్టర్లుండగా గత బడ్జెట్లో 203 క్లస్టర్లలో గల పంచాయతీలను ఈ పంచాయతీలుగా మార్చుతామని వెల్లడించారు. ఇంతవరకు 91క్లస్టర్లలో మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేశారు. మిగతా వాటిపై అతీగతీ లేదు. వాటికి ఇప్పుడు కేటాయింపులు చేయడంతో పాటు గత బడ్జెట్లో పేర్కొన్న 483క్లస్టర్లపై కూడా నిర్ణయం తీసుకోవల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. -
నాగోబా దర్బార్‌లో నిరసన సెగ
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు విద్యార్థి, ఆదివాసీ సంఘాల డిమాండ్ సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: నాగోబా జాతరను పురస్కరించుకుని బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నిర్వహించిన గిరిజన దర్బార్ నిరసనలు, ఆందోళనల మధ్య సాగింది. గిరిజన యూనివర్సిటీ తరలింపుపై విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి, ఆదివాసీ సం ఘాల నాయకులు నిరసనకు దిగారు. దర్బార్‌కు వస్తున్న మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డిలను అడ్డుకున్నారు. దర్బార్‌లో కూడా వీరి ప్రసంగాలకు అడ్డు తగి లారు. నిరసన వ్యక్తం చేసినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గిరిజన యూనివర్సిటీని వరంగల్‌కు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉట్నూర్‌లో ఏర్పాటు చేయాల్సిన ఈ వర్సిటీని వరంగల్ జిల్లాకు తరలిస్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం వద్ద ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. సమక్క-సారక్క జాతరకు రూ.100 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తిం చిన నాగోబా జాతరకు రూ.10లక్షలతో సరిపెట్టడం ఎంతవరకు సబ బని ప్రశ్నించారు. గిరిజనవర్సిటీని జిల్లాలోనే స్థాపించేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి జోగు రామన్న అన్నారు. తమపై దండయాత్రలు చేస్తే సహించేది లేదని ఇంద్రకరణ్‌రెడ్డి మండిపడ్డారు. -
సబ్‌కలెక్టర్ కార్యాలయం ముట్టడి, ఉద్రిక్తం
ఆసిఫాబాద్: అదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. గిరిజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సబ్‌కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఆసిఫాబాద్‌లోని సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అడ్డగించేందుకు ప్రయత్నించడంతో.. పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
వరంగల్‌కు మరో వరం
జిల్లాలోనే గిరిజన వర్సిటీ ప్రకటించిన సీఎం కేసీఆర్ టెక్స్టైల్ పార్క్‌పైనా స్పష్టత వరంగల్ : మన జిల్లాకు ఇప్పటికే విద్యా కేంద్రంగా పేరుంది. దీనికి తోడు మరో యూనివర్సిటీ కూడా వస్తుండడంతో ఆ పేరు మరింత సుస్థిరం కానుంది. గిరిజన విశ్వవిద్యాలయాన్ని మన జిల్లాలోనే ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. వరంగల్ నగర శివారులో లేదా ములుగులో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మన జిల్లాకు ఉన్న ప్రత్యేకతను మరోసారి చెప్పారు. టెక్స్టైల్ పార్కు ఏర్పాటుపై కూడా స్పష్టత ఇచ్చారు. భారతదేశంలోనే అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్కును త్వరలోనే వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. వరంగల్-ఆలేరు జాతీయ రహదారి(163) విస్తరణ పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి మడికొండలో శంకుస్థాపన చేశారు. 99 కిలో మీటర్ల పొడవైన ఈ రహదారి పనులను రూ.1905 కోట్లతో పూర్తి చేయనున్నారు. ఇదే కార్యక్రమంలో... ఏటూరునాగారం ము ల్లకట్ట, ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం పూసూరు మధ్య గోదావరి నదిపై రూ.340 కోట్లతో నిర్మించిన భారీ వంతెనను ప్రారంభించారు. ఈ సం దర్భంగా మడికొండలో జరిగిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద నగరం. వరంగల్ జిల్లాలో ఇప్పటికే ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉంది. సైనిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కాబోతున్నా యి. త్వరలో గిరిజన యూనివర్సిటీ రాబోతోంది. భా రతదేశంలోనే అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పా ర్కు ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో వరంగల్ జిల్లా అభివృద్ధి చెందుతుంది’ అని అన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఆజ్మీరా చందులాల్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జి.పద్మ, ఎంపీలు పి.దయాకర్, ఎ.సీతారాంనాయక్, బి.నర్సయ్యగౌడ్, జి.సుధారాణి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, టి.రాజయ్య, డి.వినయ్‌భాస్కర్, కొండా సురేఖ, ఎం.యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, డీ.ఎస్.రెడ్యానాయక్, బి.శంకర్‌నాయక్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, బి.వెంకటేశ్వర్లు, కొండా మురళీధర్‌రావు, బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాగా, మడికొండ బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పది నిమిషాలలోపే తన ప్రసంగాన్ని ముగించడంపై టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, సభకు వచ్చిన ప్రజలు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాపై ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా అభివృద్ధిపై ప్ర త్యేక దృష్టి పెట్టారు. గత ఏడాది జనవరిలో జిల్లాలో నాలుగు రోజులు పర్యటించిన సమయంలో ఇచ్చిన హామీల అమలుపై అధికారులతో బుధవారం ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అలా గే, జిల్లాకు సంబంధించి కొత్తగా పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న గ్రేటర్ వరంగల్ మేయర్ స్థానాన్ని గెలుచుకోవడమే లక్ష్యంగా నగరాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ మరి కొన్ని వరాలు ప్రకటించనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. -
గిరిజన వర్సిటీ ఎప్పుడు?
అదిగో గిరిజన వర్సిటీ వచ్చేసింది. మేం సాధించేశామని ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు ప్రకటనలు గుప్పించారు. హడావుడిగా స్థలపరిశీలన జరిపారు. ప్రతిపాదనలు పంపించారు. ఆ తరువాత దాని గురించి పట్టించుకోవడం మానేసినట్టున్నారు. ఇంతవరకూ కనీసస్థాయిలో కూడా పనులు...మరో పక్క తాత్కాలిక తరగతులు కూడా ప్రారంభం కాలేదు. దీంతో జిల్లా వాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, భవన నిర్మాణం పూర్తయ్యే వరకూ ఇక్కడి జేఎన్టీయూ ప్రాంగణంలో ఈ ఏడాది నుంచే తరగతులు కూడా ప్రారంభిస్తామని ప్రకటించిన ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు కిమ్మనడంలేదు. ఈ వర్సిటీ ఏర్పాటుకు జనవరి నుంచి పలు ప్రాంతాలను హడావుడిగా పరిశీలించిన నేతలు, అధికారులు ఇప్పుడేమీ మాట్లాడంలేదు. ఫిబ్రవరి 17న స్థల పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం, జిల్లా ప్రజా ప్రతినిధులు త్వరలోనే జీఓ విడుదలవుతుం ద ని, వెనువెంటనే నిధు లు మంజూరవుతాయ ని, ప్రతిపాదనలు త్వరగా సిద్ధం చేయాలని ఆదేశాలు, ప్రకటనలు గుప్పించారు. ఉన్నతాధికారులు, నేతలు చెప్పిన విధంగా ప్రాథమికంగా అవసరమైన నిధుల కోసం ఇక్కడి అధికారులు ప్రతిపాదించారు. అయితే ఇప్పటివరకూ జీఓ రాలేదు. ప్రాథమిక పనులకు నిధులు కూడా రాలేదు. దీంతో ఈ ఏడాది సరే..! వచ్చే ఏడాదికైనా గిరిజన యూనివర్సిటీ పనులు ప్రారంభమవుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు మండలాల్లో స్థలపరిశీలన: కేంద్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన ఈ వర్సిటీ నిర్మాణానికి తొలుత పాచిపెంటలో పరిశీలన చేశారు. ఫిబ్రవరిలో కేంద్ర మానవ వనరుల శాఖ జాయింట్ సెక్రటరీ సుక్బీర్ సింగ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు, కలెక్టర్, రాష్ట్ర మంత్రులు కలసి బొండపల్లి మండలం గుంకలాం, కొత్తవలస మండలం రెల్లి గ్రామాల్లోని భూములను పరిశీలించారు. అయితే అప్పుడు గుంకలాంలో నిర్మించే అవకాశం ఉందని ప్రజా ప్రతినిధులు, రా్రష్ట్ర మంత్రులు ప్రకటించారు. అయితే కొద్ది రోజుల అనంతరం గిరిజన యూనివర్సిటీని గుంకలాం కాకుండా కొత్తవలస మండలం రెల్లిలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.ఈ నేపథ్యంలో అక్కడ 347.47 ఎకరాల మైదాన ప్రాంతం, మరో 178.77 ఎకరాల కొండ, గుట్టల ప్రాంతాలను గుర్తించారు. మొత్తం 526.24 ఎకరాలను కేంద్ర బృందం పరిశీలించింది. అయితే ఇక్కడ భవన నిర్మాణానికి ముందుగా స్థలం చదును చేసి, ప్రహరీ నిర్మించాల్సి ఉంది. కొండపక్కగా వెళ్తున్న హెచ్‌టీ విద్యుత్ టవర్ లైన్‌ను పక్కకు తరలించాల్సి ఉంది. ఇందుకోసం నిధులు అవసరం ఉంది. కొండలు గుట్టలు ఉన్న ప్రాంతంలోని మొక్కలు తొలగించేందుకు లోతట్టు ప్రాంతాలను ఎత్తు చేసి చదును చేసేందుకు రూ.4.5 కోట్లు ఖర్చు అవుతాయని ప్రతిపాదనలు చేశారు. అలాగే 526 ఎకరాల చుట్టూ ప్రహరీ నిర్మించేందుకు మరో రూ.5 కోట్లతో,హెచ్‌టీలైన్ మార్చేందుకు రూ.3 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపారు. వీటికి సంబంధించి నిధులు ఇంత వరకూ మంజూరు కాలేదు. గుర్తించిన స్థలాన్ని ఓకే చేస్తూ కూడా విడుదల కాలేదు. ప్రాథమికంగా చేయవలసిన పనులే ఇంకా ప్రారంభం కాలేదు. కనీసస్థాయిలో కూడా కదలిక లేకపోవడంతో వర్సిటీని ఎప్పుడు ప్రారింభిస్తారన్న అనుమానాలను జిల్లా వాసులు వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక తరగతుల సంగతేంటి ? కేంద్ర బృందం, రాష్ట్ర మంత్రులు చెప్పినట్టు జేఎన్టీయూలో తాత్కాలిక తరగతులైనా ప్రారంభిస్తే ఎటువంటి అనుమానాలకూ తావుండేదికాదు. తాత్కాలిక తరగతుల విషయమై కేంద్ర బృందం, మంత్రులు జేఎన్టీయూ అధికారులతో మాట్లాడటం వారు సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. అయినా దీనిపై ఎటువంటి ముందడుగు పడడంలేదు. -
'ఖమ్మం జిల్లాలో గిరిజన వర్సిటీ నెలకొల్పాలి'
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అత్యధికంగా గిరిజన జనాభా నివసిస్తున్న ఖమ్మం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం నెలకొల్పాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన లోక్‌సభలో 377వ నిబంధన కింద ప్రత్యేకంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. గిరిజన జిల్లాగా పేరుగాంచిన ఖమ్మంలో గిరిజన వర్సిటీ నెలకొల్పాల్సిన ఆవశ్యకతను వివరించారు. ‘వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు చాలా బలహీనంగా ఉన్నాయి. ఇందుకు కారణం వారికి ఉన్నత, సాంకేతిక విద్య అందుబాటులో లేకపోవడమే. 2001 గణాంకాల ప్రకారం ఖమ్మం జిల్లాలో గిరిజన జనాభా 7.43 లక్షలు. ఇది జిల్లా జనాభాలో 27.24 శాతం. జిల్లాలో మొత్తం 41 మండలాలుంటే అందులో 24 గిరిజన మండలాలే. అత్యధికులు ఆర్థిక స్థితి సరిగా లేక ఉన్నత చదువులు అందుకోలేకపోతున్నారు. అందువల్ల ఖమ్మం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరుతున్నా..’ అని పొంగులేటి పేర్కొన్నారు. -
గుంకలాంకే ఛాన్స్!
విజయనగరం కంటోన్మెంట్ / విజయనగరం రూరల్ : జిల్లాలోనే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. స్థల పరిశీలన కోసం జిల్లాకొచ్చిన బృందం దాదాపు సానుకూలత చూపించింది. విజయనగరం మండలం గుంకలాంలోని స్థలం పట్ల బృందం మొగ్గు చూపింది. కేంద్రం ఆమోదిస్తే ఇక్కడ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. గతం లో పాచిపెంట మండలంలో స్థలాన్ని పరిశీలించి అనుకూలంగా లేదని తేల్చేశారు. దీంతో గిరిజన వర్సిటీ పక్కజిల్లా విశాఖకు తరలిపోనుందని అందరూ భావించారు. తాజాగా కొత్తవలస మండలం రెల్లి, విజయనగరం మండలం గుంకలాంలలో స్థలాన్ని పరిశీలించిన కేంద్రకమిటీ గుంకలాంవైపే మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. కేంద్రం నిధులిస్తే జేఎన్టీయూలో తాత్కాలికంగా గిరిజనవర్సిటీని ఏర్పాటు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మున్సిపల్ మంత్రి నారాయణ ప్రకటించడం మరింత నమ్మకం కలిగిస్తోంది. గిరిజన యూనివర్సిటీ స్థల పరిశీలన కోసం కేంద్ర మానవ వనరుల శాఖ సంయుక్త కార్యదర్శి సుక్బీర్ సింగ్ సందు ఆధ్వర్యంలోని కేంద్ర బృందం మంగళవారం జిల్లాలో పర్యటించింది. ఆయనతో పాటు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దావ్రా జిల్లాకు రాగా వారికి రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి పి నారాయణ, కలెక్టర్ ఎంఎం నాయక్‌లు జిల్లాలోని స్థలాలను చూపిస్తూ అక్కడి పరిస్థితులు వివరించారు. తొలుత కొత్తవలస మండలం రెల్లిలో ఉన్న స్థలాలను పరిశీలించగా, మధ్యాహ్నం విజయనగరం మండలం గుంకలాం గ్రామ పరిధిలో ఉన్న స్థలాలను పరిశీలించారు. అనువైన స్థలం విషయమై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. వారి తీరును చూస్తుంటే రెల్లి గ్రామం కన్నా గుంకలాంపైనే మక్కువ చూపుతున్నట్టు స్పష్టమవుతోంది. తొలుత కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో గిరిజన యూనివర్సిటీకి సరిపడా స్థలం ఉందని చూపించగా, దానిని పరిశీలించారు. ఇక్కడ 347.47 ఎకరాల మైదాన ప్రాంతముంది. 178.77 ఎకరాలు గుట్టలతో నిండిఉంది. మొత్తం 526.24 ఎకరాలను బృందం పరిశీలించింది. అనంతరం విజయనగరం మండలంలోని గుంకలాం గ్రామ పరిసరాల్లో ఉన్న 347.63 ఎకరాల డి పట్టా భూములు, 163.78 ఎకరాల కొండపోరంబోకు, 29.33ఎకరాల బంజరు భూమి,4.23 ఎకరాల రస్తా భూములతో కలిపి 504.97 ఎకరాలను బృందం పరిశీలించింది. మొత్తం ఐదుగురు సభ్యులున్న ఈ కమిటీ తన పరిశీలన నివేదికను కేంద్రానికి అందించనుంది. జిల్లాలోని రెండు ప్రాంతాల్లో పరిశీలనలు చేసిన కేంద్ర బృందం ఎక్కువగా గుంకలాంకు ప్రాధాన్యం ఇనిచ్చినట్టు స్పష్టమవు తోంది. కొత్తవలసలోని రెల్లిలో భూముల కన్నా గుంకలాంలోని భూములు గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నట్టు బృందం గుర్తించింది. కొత్తవలసలో ఉన్న భూములు ఎక్కువగా గుట్టలతో పాటు ఎక్కువగా ఏటవాలుగా ఉన్నాయి. అలాగే అక్కడి భూముల్లో నిర్మాణాలకు కోర్టు అనుమతులు కూడా అవసరముంది. దీనికి తోడు ఇక్కడ స్థలం ఎక్కువగా కొండ ప్రాంతం నిండిఉందని కేంద్ర బృందం వ్యాఖ్యానించినట్టు మంత్రి నారాయణ విలేకరులకు తెలిపారు. అలాగే గుంకలాం భూములు పరిశీలించిన ఈ ఐదుగురు సభ్యులున్న కమిటీ సంతృప్తిగా ఉన్నట్టు తెలిపారు. అలాగే ఇక్కడున్న భూముల్లో గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలూ లేకపోవడంతో పాటు జిల్లా కేంద్రానికి దగ్గరలోనే ఉండటాన్ని కూడా సానుకూలంగా తీసుకున్నారు. దీంతో ఇక్కడ గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదమే తరువాయి అన్న భావన అందరిలో కలుగుతోంది. మరో వైపు మంత్రి నారాయణ విలేకర్లతో మాట్లాడినప్పుడు గుంకలాంకే ప్రాధాన్యతనిచ్చారు. జేఎన్టీయూలో తాత్కాలికంగా తరగతులు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు అన్ని అంశాలూ సానుకూలంగా ఉండడంతో కేంద్రానికి నివేదించాక ఆమోదం లభించి నిధులు విడుదలైతే వచ్చే ఏడాది నుంచే గిరిజన యూనివర్సిటీ తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. యూనివర్సిటీకి భవన సముదాయం నిర్మంచే వరకూ విజయనగరం పట్టణానికి సమీపంలో ఉన్న జేఎన్టీయూలో తాత్కాలికంగా తరగతులు నిర్వహించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దీనిపై మంత్రి నారాయణ మాట్లాడుతూ కేంద్ర ఆమోదం లభిస్తే జేఎన్టీయూలో తాత్కాలికంగా యూనివర్సిటీని ప్రారంభించడానికి ప్రయత్నిస్తామన్నారు ఈ విష యమై కూడా బృందం సభ్యులు జేఎన్టీయూ అధికారులను అడిగినట్టు చెబుతున్నారు. జేఎన్టీయూ అధికారులు కూడా తాత్కాలికంగా భవనాన్ని ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేశారని సమాచారం. -
చివురిస్తున్న ఆశలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం:పాచిపెంటలో సరైన స్థలం, మౌలిక సౌకర్యాల్లేవన్న కారణంతో వెనక్కి మళ్లిన గిరిజన యూనివర్సిటీ మళ్లీ జిల్లాకొచ్చే అవకాశం కనబడుతోంది. తరలిపోతుందన్న వార్తలతో ఆందోళనకు లోనై జిల్లా వాసులు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు, ప్రతిపక్ష నేతల ఆందోళనలకు సర్కార్ తలొగ్గింది. మళ్లీ విజయనగరం జిల్లాలోనే ఏర్పాటు చేసేందుకు పునరాలోచన చేసింది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కొత్తవలస మండలంలో గాని, బొండపల్లి మండలంలో గాని ఏర్పాటు చేసే ఆలోచనతో ముందుకు కదులుతోంది. ఈమేరకు హెచ్ఆర్డీ జాయింట్ సెక్రటరీ, ఏపీ ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ, వీపీడబ్ల్యూడీ సీఈతో కూడిన బృందం ఈనెల 17న జిల్లాకొస్తోంది. ఆ రోజు స్థల పరిశీలన చేసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తొలుత పాచిపెంట మండలంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు దాదాపు రంగం సిద్ధమయ్యింది. ఆ మేరకు కేంద్రబృందం జిల్లాకొచ్చి పరిశీలన కూడా చేసింది. ఆ సమయంలో యూనివర్సిటీ ఏర్పాటుకు దాదాపు అంగీకారాన్ని తెలిపింది. కానీ, వెళ్లిన కొన్ని రోజుల తర్వాత పాచిపెంట స్థలం సరైనది కాదని, మౌలిక సౌకర్యాల్లేన్న కారణం చూపి విశాఖ జిల్లా సబ్బవరంలో ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేస్తున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. దీంతో జిల్లా వాసులు ఉలిక్కి పడ్డారు. విద్య, ఉద్యోగ, గిరిజన సంఘాలు తీవ్ర నిరాశకు లోనై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వచ్చిన అవకాశాలను పొగొడుతున్నారని టీడీపీ నేతలపై ఆగ్రహం వెలిబుచ్చారు. దీంతో జిల్లాలోని టీడీపీ ప్రజాప్రతినిధులు స్పం దిస్తూ గిరిజన యూనివర్సిటీ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయిం చుకున్నారు. ఆ మేరకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల నుంచి మద్దతు లేఖలను తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందజేశారు. అటు నిరసన, ఇటు లేఖల నేపథ్యంలో సర్కార్‌కు తలొగ్గక తప్పలేదు. విజయనగరం జిల్లాలో కాకుండా మరో చోట ఏర్పాటు చేస్తే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయాన్ని గ్రహించి పాచిపెంట కాకుండా మరో చోట ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. దీంతో కొత్తవలస, బొండపల్లి మండలాల్లో రెండు స్థలాలను గుర్తించి, ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలు వెళ్లిన పిమ్మట కేంద్రం స్పందిస్తూ విజయనగరం జిల్లాలోనే ఏర్పాటు చేసేందుకు సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో స్థల పరిశీలన కోసం ఈనెల 17న ఒక బృందం జిల్లాకు రానుంది. ఈమేరకు అటు విద్యా శాఖామంత్రి గంటా శ్రీనివాసరావుకు, ఇటు జిల్లా అధికారులకు సమాచారం కూడా వచ్చింది. ప్రతిపాదిత రెండు స్థలాలను పరిశీలించాక సదరు బృందం తుది నిర్ణయం తీసుకోనుంది. -
హాట్ హాట్ ...
జెడ్పీ సమావేశంలో అధికారులపై మండిపడ్డ అధికార, ప్రతిప్రక్ష ప్రజాప్రతినిధులు అజెండాలో 51 అంశాలకు గాను ఆరు అంశాలను చర్చించిన వైనం గిరిజన యూనివర్సిటీ, ప్రభుత్వ మెడికల్ కళాశాల కోసం వైఎస్సార్ సీపీ నేతల ప్లకార్డుల ప్రదర్శన జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలంటూ ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేస్తున్న బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు, సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర తదితరులు విజయనగరం ఫోర్ట్: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం హాట్ హాట్‌గా జరిగింది. పాలన సరిగాలేదంటూ అధికారులపై అధి కార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. సమావేశాలకు వచ్చినప్పుడు అధికారులు తలాడించడమే తప్ప ఆ తర్వాత అడిగిన దానికి సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి సమాచారం లేనప్పుడు సమావేశానికి ఎందుకు వస్తారని మండి పడ్డారు. ఎమ్మెల్యేలతో పాటు, జెడ్పీటీసీలు కూడా అధికారుల తీరును ఎండగట్టారు. ఏ అధికారినీ విడిచిపెట్టలేదు. సమావేశం ప్రారంభంలోనే సొసైటీల్లో బినామీ రుణాలు, డీసీసీబీలో కుంభకోణం అంశాలపై గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు ప్రస్తావించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌పై సమీక్ష జరిగినప్పుడు అధికారుల్ని ఉక్కిర్కిబిక్కిరి చేస్తూ అటు వైఎస్సార్ సీపీ, ఇటు టీడీపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపించారు. విద్యాశాఖపై చర్చకొచ్చిన సందర్భంలో డీఈఓపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐసీడీఎస్‌పై చర్చ జరిగిన సందర్భంలో పీడీ రాబర్ట్స్‌పై అగ్రహం వ్యక్తం చేశారు. ఆర్వీఎంపై చర్చ జరిగినప్పుడు నిధులు దుర్వినియోగమయ్యాయని, వాటాలేసుకుని పంచేసుకున్నారని సంబంధిత అధికారులపై పలువురు ప్రజాప్రతినిధులు దుమ్మెత్తిపోశారు. డీఆర్డీఏ పింఛన్లు, ఇసుకపై జరిగిన చర్చలో పీడీ పెద్దిరాజుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు విషయంలో సివిల్ సప్లైస్ అధికారుల్ని, డిప్యూటేషన్లపై జిల్లా పరిషత్ సీఈఓను నిలదీశారు. తుపాను పరిహారం విషయంలో వ్యవసాయ శాఖ జేడీపై పలువురు నేతలు మండిపడ్డారు. మొత్తానికి అధికారులపై మూకుమ్మడి దాడి చేశారు. దీంతో అధికారులంతా ఉక్కిరిబిక్కిరయ్యారు. సభలో ప్రస్తావించిన అంశాలపై 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని, ఎమ్మెల్యేలకు, జెడ్పీటీసీలకు ప్రతీ సమాచారం వెళ్లాలని, అధికారులను జెడ్పీ చైర్పర్సన్ శోభ స్వాతి రాణి ఆదేశించారు. వివరాలతో రాకపోతే ఉండిపోండని,ఈ విషయంలో సహించేది లేదని ఆమె అధికారులపై మండిపడ్డారు. -
మంత్రి కోర్టులో నిధుల బంతి !
తెలుగుదేశం ప్రజాప్రతినిధుల మధ్య ఉన్న విభేదాలు ఇప్పట్లో సమసిపోయేటట్టు కనిపించడం లేదు. అదును చూసుకుని ఒక వర్గం మరో వర్గాన్ని దెబ్బతీస్తోంది. ఇప్పుడు బంతి మంత్రి కోర్టుకు వచ్చింది. నిన్నమొన్నటి వరకూ మంత్రిని ఖాతరు చేయని కొందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆమెను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో మంత్రి ఎలా స్పందిస్తారోనని ఆ పార్టీకి చెందిన నేతలు ఎదురుచూస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : పై ఫొటో చూశారా?... గిరిజన యూనివర్సిటీని జిల్లాకే కేటాయించాలని విశాఖలో చంద్రబాబును కలిసి టీడీపీ నేతలు కోరుతున్న దృశ్యమిది. కానీ ఆ ఫొటో మంత్రి మృణాళిని ముం దెక్కడా కనిపించరు. అసలామె కలిశారా ? అనే సందేహం రాక మానదు. వాస్తవానికైతే అందరితో పాటే సీఎంను మంత్రి కలిశారు. ఫొటోను పరిశీలించి చూస్తే నేతలందరి వెనుక ఆమె కనిపిస్తారు. చూసిన ప్రతి ఒక్కరకూ ఆమె స్థానమదా? అని ఆశ్చర్యపోక తప్పదు. మంత్రై ఉండి వెనక నిలబడటమేంటని ఎవరికైనా సందేహం రాకమానదు. కొందరు టీడీపీ నేతల్ని కదిపితే మాత్రం ఆమె తీరే దానికి కారణమని చెబుతారు. ‘ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదు. ఇతర ప్రజాప్రతినిధుల్ని లెక్క చేయడం లేదు. మమ్మల్ని గౌరవించని వ్యక్తికి మేమెందుకు ప్రాధాన్యం ఇవ్వాలి’ అంటూ ఆ ఫొటో సంగతి వివరిస్తున్నా రు. అందరికీ ముందు నిలబడి గిరిజన యూనివర్సిటీ కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సిన మంత్రి ఇలా వెనుక ఉండటమేంటని మరికొంతమంది నేతలను ఆరాతీస్తే ఎవరికి తోచిన విధంగా వారు చెప్పుకొస్తున్నారు. తమను పట్టించుకోకపోవడం వల్లే తాము అదే ధోరణితో వ్యవహరించామని కొంద రు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సైతం గిరిజన యూనివర్సిటీ కోసం మద్దతు లేఖలిస్తే మంత్రిగా ఆ స్థాయి చొరవ చూపలేదని కొందరు చెబుతున్నారు. కారణమేదైనా మంత్రికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇచ్చిన గౌరవమేంటో అర్థం చేసుకోవచ్చు. వారి మధ్య ఎంత అంతరం ఉందో ఇట్టే గ్రహించవచ్చు. బంతి మంత్రి కోర్టులో.... ఇలా ఎడమొహం, పెడమొహం రాజకీయాలు చేస్తున్న ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు ఊహించని పరిణామం ఎదురు కాబోతోంది. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్డీఎఫ్), నియోజకవర్గ అభివృద్ధి నిధి(సీడీపీ) సొమ్మును వినియోగించుకోవాలంటే మంత్రి ఆమోదం ఉండాలి. ఆమె చేతనే మంజూరు చేయించుకోవాలి. అంటే నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం మెట్టు దిగాల్సిందే...ఆ పనులు దక్కించుకోవడానికి మంత్రిని ఆశ్రయించాల్సిందే. ఇప్పుడిదే ఆ అసమ్మతి నేతల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్డీఎఫ్) కింద మంజూరైన సొమ్ములో రూ.9.28కోట్లు ఖర్చు కాలేదు. వాటికి సంబంధించిన 333 పనులు ప్రారంభం కాలేదు. అలాగే గత ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధి నిధి(సీడీపీ) కింద మంజూరు చేసిన సొమ్ములో సుమారు రూ.నాలుగు కోట్లు ఖర్చు కాలేదు. వాటికి సంబంధించిన 305 పనులు ప్రారంభం కాలేదు. అధికారంలోకి వచ్చేసరికి ఈ పనులు ప్రారంభం కాకపోవడంతో టీడీపీ సర్కార్ ఎక్కడివక్కడ ఆపేసింది. తాజాగా వాటిని రద్దు చేసి కొత్త పనులు ప్రాతిపాదించాలని నిర్ణయం తీసుకుంది. వాటి మంజూరు అధికారం మంత్రికే ఉందని పరోక్షంగా తెలియజేసింది. దీంతో అసమ్మతి వాదుల్లో గుబులు రేగింది. ఈ నిర్ణయం వారికి మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలో పెండింగ్ నిధుల పనులైనా దక్కించుకోకపోతే వచ్చిన అవకాశాకాలు చేజారిపోతాయని పలువురు నేతలు ఇప్పటికే అంత్మధనంలో పడ్డారు. అధినేత నిర్ణయం తీసుకున్న నిర్ణయంపై కాసింత అసహనంతో ఉన్నారు. వారికే సర్వాధికారాలైతే తమకే ఇబ్బందులే అన్న అభిప్రాయానికొచ్చారు. మంత్రి కూడా అటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నారని, ఎలా రారో వేచి చూద్దామని ధోరణితో ఉన్నట్టు తెలుస్తోంది. పంతం, ప్రతిష్ట అని కూర్చొంటే కష్టమేనని, అనుచరులు అసమ్మతి నేతలకు నూరి పోస్తున్నారు. దీంతో పనుల కోసం మంత్రిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి గతాన్ని గుర్తు చేసుకుంటారో లేదంటే బదిలీల మాదిరిగా తనదైన శైలీలో వెళ్తారో చూడాలి. -
సీఎంకు లేఖ రాసిన ఎమ్మెల్యే రాజన్నదొర
సాక్షి ప్రతినిధి, విజయనగరం : గిరిజన విశ్వవిద్యాలయం తరలింపుపై జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు లేఖోద్యమాన్ని చేపట్టారు. జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు జిల్లాకు ఎంతో అవసరం కూడా!. ఇటీవల జిల్లాకు పది వరాలు ప్రకటించిన చంద్రబాబు దీన్ని మంజూరు చేయించినట్టే చేయించి పొరుగు జిల్లాకు తరలించ డంలో కీలకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వేడెక్కుతున్నాయి. గిరిజన విశ్వవిద్యాలయం తరలిపోతుండడంపై అటు ప్రజలు, ఇటు నాయకులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల పలు ఎస్సీ, ఎస్టీ సంఘాలు, నాయకులు గిరిజన విశ్వవిద్యాలయాన్ని జిల్లాలోనే ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. మరోవైపు మాజీ ఎంపీ డీవీజీ శంకరరావు కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. యూనివర్శిటీని ఇక్కడే ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎంకు లేఖ కూడారాశారు. గిరిజన విశ్వవిద్యాలయం ఉండాల్సింది జిల్లా కేంద్రానికి అందుబాటులో కాదని, గిరిజనులకు అందుబాటులో ఉం డాలనీ ఆయన చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇలా విశ్వవిద్యాలయం తరలింపు పట్ల వస్తున్న విమర్శల వాన ఇప్పుడు మరింత జోరు అందుకుంది. సీఎంకు లేఖ రాసిన సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. జిల్లాకు ప్రకటించిన పది వరాల్లో గిరిజన యూని వర్శిటీ కూడా ఉండడంతో ఎంతో ఆనందించామని కానీ దీన్ని ఇతర ప్రాంతానికి తరలించడం గిరిజనులను మోసం చేయడమేనన్నారు. 2015-16 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని చెప్పిన కొద్ది రోజులకే ఇలా తరలింపు వార్తలు వినాల్సి వచ్చిందని పేర్కొన్నారు. గిరిజన యూనివర్సిటీ రాకపోతే జిల్లాలో పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు, బంద్‌లు చేపట్టాల్సి వస్త్తుందని హెచ్చరించారు. గిరిజనులు, గిరిజనేతరులు కూడా ఈ నిరసనల్లో పాల్గొనే పరిస్థితి నెలకొంటుందన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు కూడా పలు సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని లేఖలో స్పష్టం చేశారు. ఈ అంశం తీవ్ర సమస్యగా మారే ప్రమాదం ఉందని గుర్తించాలన్నారు. పాచిపెంట మండలం పెదకంచేరులో ఉన్న మూడు వేల ఎకరాల ఉచిత స్థలం కాకుండా ఇంకెక్కడ నిర్మిస్తారని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులంతా దీని పట్ల తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారని తెలిపారు. విశాఖ జిల్లా అరకు ప్రాంతానికి, విజయనగరం జిల్లాకు మధ్య ఉన్న స్థలం ఎంతో అనువైనదన్నారు. విశాఖ నుంచి చత్తీస్‌ఘడ్‌లో ఉన్న రాయ్‌పూర్ వెళ్లే ఎన్‌హెచ్ -26 కూడా పెదకంచేరుకు దగ్గరలోనే ఉందన్నారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఆంధ్ర, ఒడిశా, చత్తీస్ఘడ్, ఎంపీ రాష్ట్రాలకు ఎంతో అనువుగా ఉంటుం దని పేర్కొన్నారు. ఒడిశా రాష్ట్రం చాలా దగ్గరగా ఉండడంతో ఆ ప్రాంత గిరిజనులకు యూనివర్శిటీ ఎంతో అనువుగా ఉంటుందన్నారు. ఎన్టీ రామారావు పరిపాలన ఉన్నప్పుడు కూడా విజయనగరం మహారాజా పివిజి రాజు కూడా గిరిజన విశ్వవిద్యాలయానికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కూడా పాచిపెంటలోని స్థలాన్ని జూలై 4వ తేదీన సందర్శించి గిరిజనులకు కూడా తమ మాన్సాస్ సంస్థకు చెందిన భూమిని తమ తండ్రి స్మృత్యర్ధం విరాళంగా ఇవ్వనున్నామని ప్రకటించారన్నారు. వెనుకబడిన జిల్లాగా, ఈ ప్రాంత గిరిజనుల అవసరాన్ని దృష్టిలో ఉం చుకుని గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇక్కడే నిర్మించాలని కోరారు. గిరిజన విశ్వవిద్యాలయం పట్ల జిల్లాలో నానాటికీ పెరుగుతున్న నిరసనల పట్ల బాబు ఎలా స్పందిస్తారోనని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ విధంగా రాజకీయాలకు అతీతంగా అటు టీడీపీ, ఇటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో పాటు ఇతర నాయకులు తమ మద్దతును తెలియజేస్తూ గిరిజన యూనివర్సిటీ కోసం లేఖలిస్తున్నారు. మరి సర్కార్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. . యూనివర్సిటీని తరలిస్తే ఊరుకొనేది లేదు జియ్యమ్మవలస : జిల్లా నుంచి గిరిజన యూనివర్సిటీని తరలిస్తే సహించేది లేదని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర హెచ్చరించారు. గురువారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. 2006 సంవత్సరం నుంచి జిల్లాలో గిరిజన యూనివర్సిటీ కోసం ప్రయత్నిస్తున్నామని, తెలిపారు. టీడీపీ ప్రభుత్వం యూనివర్సిటీ ఏర్పాటుకు తొలుత హామీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు మాట తప్పడం సరికాదన్నారు. దీనిపై దశల వారీగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆయనతో పాటు జిల్లా గిరిజనాభ్యుదయ సంఘం అధ్యక్షుడు ఆరిక సింహాచలం ఉన్నారు. -
గిరిజన విశ్వవిద్యాలయం ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి నాలుగురోడ్ల కూడలిలో నిలబడినట్లుంది. ఏ దిశగా, ఏ వేగంతో వెళ్లాలన్నది త్వరితంగా నిర్ణయించుకోవాల్సిన విషయం. అడ్డగోలు విభజన పరిణామాల్ని దిగమింగుకుని భవిష్య త్తుపై దృష్టిసారించాల్సిన సమయమిది. ముఖ్యంగా పాలకులు దూర దృష్టితో, విశాల దృక్పథంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడాలి తప్ప ఇతరేతర ఒత్తిడులకు తావివ్వరాదు. అన్ని ప్రాంతాలవారూ అభివృద్ధిలో తమకూ సమప్రాధాన్యత దక్కిన ట్లు భావించినప్పుడే ఒక జాతిగా ముందడుగు వెయ్యగలం. ఆ భావన ఆదినుండే పాదుకునేలా కృషి చేయాల్సిన బాధ్యత ప్రభు త్వంపై ఉంది. గత శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళికను వెల్లడి చేశారు. విద్యాసంస్థల ఏర్పాటు, పరిశ్రమల ఏర్పాటు తదితర విషయాల్ని వివరంగా ప్రజల ముందుంచారు. అందులో విజయనగరం జిల్లాలో కేంద్ర గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయడమన్నది ఒకటి. జిల్లా ప్రజలకు ఈ హామీ ఎంతో భరోసానిచ్చింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో అలాంటి ఉన్నత విద్యాకేంద్రం అవసరమన్నది నాలుగు దశాబ్దాల కల. ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా అందుబాటులో ఉండే ఈ వర్సిటీ ఏర్పాటు వల్ల పున రావాస సమస్యలూ తక్కువే. ఆరోగ్య, జీవన ప్రమాణాల స్థాయిని తెలిపే సూచీల్లో అట్టడుగున ఉన్న విజయనగరం జిల్లాకి ఈ విశ్వవిద్యా లయం ఏర్పాటు ఎంతో కొంత అభివృద్ధికి తోడ్పాటునందిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖమంత్రి గిరిజన విశ్వవిద్యాలయం విజయనగరంలో ఏర్పాటు కాకపోవచ్చని, విశాఖ జిల్లాలో సబ్బవరం మైదాన ప్రాంతంలో దాని ఏర్పాటుకు అవకాశం ఉందని పత్రికలకు తెలియజేశారు. ప్రభుత్వం అన్ని రకాలా అనువైన ప్రాంతాన్ని, ఆదివాసులకు అందుబాటులో ఉన్న స్థలాన్ని, పైగా ప్రభుత్వ ప్రణాళికలో భాగమైన హామీని ఉపేక్షించి, వేరే ఆలోచన చెయ్యడం విజయనగర జిల్లా వాసుల్ని నిరాశపర్చింది. గిరిజన సంఘాలూ ప్రజాప్రతినిధులూ, వివిధ సంస్థలు తమ తీవ్ర వ్యతిరేకతను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరహా వ్యతిరేక భావనల్ని ప్రభుత్వం చేజేతులా కొని తెచ్చుకోరాదు. ఏ ప్రాంత ప్రజలకూ తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామన్న భావం కలుగకుండా పాలకులే శ్రద్ధ వహించాలి. ఎలాంటి ఒత్తిడులకూ లోబడని దృఢవైఖరితోనే రాష్ట్ర సంక్షేమ సమగ్ర అభివృద్ధి సాధ్యం. డా. డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం, విజయనగరం జిల్లా -
కేంద్రమంత్రి అశోక్ దిష్టిబొమ్మ దహనం
గుర్ల: గిరిజన విశ్వ విద్యాలయం కోసం స్థలం సేకరించి తీరా నిర్మిస్తున్నారని అనుకున్నప్పుడు దాన్ని పక్క జిల్లాకు తరలించడం అన్యాయమని ఉత్తరాంధ్ర విద్యార్థి సేన వ్యవస్థాపకుడు డాక్టర్ సుంకరి రమణమూర్తి అన్నారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని కచ్చితంగా మన జిల్లాలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గుర్లలో సోమవారం విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం రమణమూర్తి మాట్లాడారు. దళితుల ఉన్నత వి ద్యాభివృద్ధి కోసం పాటు పడాల్సిన నేతలు కేంద్ర, రాష్ట్రమంత్రులు దళారులు, పెత్తందారుల చేతుల్లో కీలు బొమ్మలుగా మారి జి ల్లాను, జిల్లా ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.గిరిజన విశ్వ విద్యాలయం వేరే జిల్లాకు తరలిపోతున్నా కేంద్ర మంత్రి పట్టించుకోవడం లేదని అన్నారు. కార్యక్రమంలో మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు తోట తిరుపతిరావు, విద్యార్ధిన సేనా నాయకులు సుంకరి నారాయణరావు, సంచాన శ్రీనివాసరావు, గౌరునాయుడు, స్వామి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. -
గిరిజన వర్సిటీ కోసం సీఎంను కలిసిన టీడీపీ ప్రజాప్రతినిధులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : గిరిజన యూనివర్సిటీ కోసం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎట్టకేలకు స్పందించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల మద్దతు లేఖలతో సీఎం చంద్రబాబునాయుడ్ని సోమవారం కలిసి, గిరిజన వర్సిటీని జిల్లాలోనే ఏర్పాటు చేయాలని కోరారు. వెనకబడిన ప్రాంతంగా, నాలుగైదు రాష్ట్రాలతో అనుసంధానంగా ఉన్న విజయనగరం జిల్లాలోనే ఏర్పాటు చేసి, గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు చంద్రబాబునాయుడికి విజ్ఞాపన పత్రం అందజేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ పాచిపెంట మండలంలోని స్థలం సానుకూలంగా లేదని, జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మరికొన్ని స్థలాలను గుర్తించి ప్రతిపాదిస్తే ప్రయత్నిస్తానని హామీ ఇచ్చినట్టు ఆ పార్టీ నాయకులు చెప్పారు. రోజురోజుకూ వెల్లువెత్తుతున్న నిరసనల దృష్ట్యా టీడీపీ ప్రజాప్రతినిధులు స్పందించారు. జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సోమవారం విశాఖపట్నం వచ్చిన సీఎం చంద్రబాబునాయుడ్ని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల మద్దతు లేఖలతో కలిశారు. కైలాసగిరి వద్ద జరిగిన వనమహోత్సవం సందర్భంగా అపాయింట్మెంట్ తీసుకుని గిరిజన యూనివర్సిటీ తరలింపు విషయాన్ని ప్రస్తావించారు. తమకే దక్కాలని, వచ్చిన అవకాశాన్ని దూరం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. సీఎం కలిసిన వారిలో మంత్రి మృణాళిని, జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, ఎమ్మెల్యేలు కె.ఎ.నాయుడు, బొబ్బిలి చిరంజీవులు, మీసాల గీత, కోళ్ల లలితకుమారి, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, సాలూరు, బొబ్బిలి మున్సిపల్ చైర్పర్సన్లు, మాజీ ఎమ్మెల్యేలు ఆర్.పి.భంజ్‌దేవ్, శోభా హైమావతి, టీడీపీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ద్వారపురెడ్డి జగదీష్, ఐవీపీరాజు, సాలూరు టీడీపీ నేత గుమ్మడి సంధ్యారాణి తదితరులు ఉన్నారు. వీరి విజ్ఞప్తి మేరకు సీఎం స్పందిస్తూ పాచిపెంటలో కాకుండా జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న స్థలాలను ప్రతిపాదిస్తే పరిశీలించి, ప్రయత్నిస్తానని హామీ ఇచ్చినట్టు టీడీపీ నేతలు చెప్పారు. -
డిఫెన్స్‌లో పడ్డ అశోక్ గజపతిరాజు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాకు మంజూరవుతుందని గంపెడాశలు పెట్టుకున్న గిరిజన యూనివర్సిటీ పక్క జిల్లాకు తరలిపోవడంపై గిరిజన ప్రజలు ఆగ్రహోదగ్రులవుతున్నారు. విద్యార్థి, ప్రజా సంఘాలు, విపక్షాలన్నీ ధ్వజమెత్తుతూ మంత్రుల తీరును దుయ్యబడుతున్నాయి. తప్పని పరిస్థితుల్లో అధికార పార్టీ నాయకులు గొంతు విప్పుతున్నారు. జిల్లాకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోజురోజుకూ టీడీపీ సర్కార్‌పై వ్యతిరేకత పెల్లుబుకుతోంది. పరిస్థితిని గమనించిన కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు స్పందించారు. అన్నీ పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతుతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే యోచనకొచ్చారు. కట్టలు తెగిన ఆగ్రహం జిల్లాకొచ్చిన అరుదైన అవకాశం చేతికంది జారిపోయినట్లయిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు గాలిలో కలిసిపోతున్నాయని, జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వైఫల్యం చెందారని, నేతల స్వార్థ ప్రయోజనాలకు జిల్లా బలవుతోదంటూ ఈనెల 14వ తేదీన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ’చేజారిన గిరిజన యూనివర్సిటీ’ కథనంపై అటు విద్యార్థి సంఘాలు, ఇటు ప్రజా సంఘాలు స్పందించాయి. విపక్షాలు సైతం గొంతెక్కుపెట్టాయి. ఆ కథనంలో పేర్కొన్నట్టుగా నాడు ప్రభుత్వ వైద్యకళాశాల, నేడు గిరిజన యూనివర్సిటీ దూరమైందని, నేతల చేతగానితనంతో ఒక్కొక్కటీ చేజారిపోతున్నాయని, ఇవే జిల్లాకు రానప్పుడు చంద్రబాబు ప్రకటించిన కష్టసాధ్యమైన ప్రాజెక్టులు వచ్చేదెలా అని ప్రశ్నిస్తున్నాయి. ధర్నాలు, రాస్తారోకోలు, సమావేశాలతో నిరసన తెలియజేస్తున్నారు. పాచిపెంట మండలంలోని భూములతో పాటు మరికొన్ని చోట్ల ఉన్న భూములను ప్రతిపాదించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని మండి పడుతున్నారు. ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి గిరిజన యూనివర్సిటీతో పాటు ప్రభుత్వ వైద్య కళాశాల జిల్లాకొచ్చేలా ప్రయత్నించాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక వ్యతిరేకత నేపథ్యంలో అధికార పక్ష నాయకులు కూడా గొంతుకలుపుతున్నారు. జిల్లాకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిఫెన్స్‌లో పడ్డ అశోక్ గజపతిరాజు అటు ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు కాకపోవడం, ఇటు గిరిజన యూనివర్సిటీ జిల్లాకు దూరమవడంతో కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు డిఫెన్స్‌లో పడ్డారు.కేంద్రమంత్రై ఉండి జిల్లాకు అదనపు ప్రయోజనాల్ని కల్పిస్తారనుకుంటే అవేవీ జరగకపోగా ప్రకటించిన ప్రాజెక్టులు వెనక్కి వెళ్లిపోవడంతో తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. జిల్లాపై ఆయనకున్న మమకారం ఇదేనా? లేదంటే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించుకోలేకపోతున్నారా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇవేవీ కాకుండా లోపాయికారీ ఎజెండా ఏదైనా ఉందా అనే సందేహం కలుగుతోంది. బయటికి వ్యక్తం కాకపోయినా ప్రభుత్వ వైద్యకళాశాలకు బదులు ప్రైవేటు వైద్య కళాశాల జిల్లాకు మంజూరు చేసి, దాన్ని మాన్సాస్‌కు అప్పగించడానికి అందుకు ప్రత్యుపకారంగా పాచిపెంట మం డలలోని మాన్సాస్ భూములను గిరిజన యూనివర్సిటీకి అప్పగించేందుకు లోపాయికారీ ఒప్పందం జరిగిందన్న వాదనలున్నాయి. అది వాస్తవమా? కాదా అన్నది పక్కన పెడితే ప్రైవేటు వైద్య కళాశాల మాన్సాస్‌కు అప్పగించడం ఖాయమైంది. కానీ గిరిజన యూనివర్సిటీ మాత్రం ప్రతిపాదిత స్థలం సానుకూలంగా లేదని తరలిపోయింది. స్పందించిన అశోక్ గిరిజన యూనివర్సిటీ తరలిపోయిందన్న వార్తతో, వెల్లువెత్తుతున్న గిరిజనాగ్రహంపై కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు స్పందించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ విషయంలో కాస్త అంతర్మథనం చెందారని, ఈ క్రమంలో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని సర్కార్ వద్దకు వెళ్లి గిరిజన యూనివర్సిటీ జిల్లాకొచ్చేలా ఒత్తిడి చేసే యోచన కొచ్చినట్టు తెలిసింది. ఆమేరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో మాట్లాడి, వారి మద్దతును తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణికి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆమె నాయకత్వం వహిస్తే బాగుంటుందన్న ఆలోచనతో మద్దతు కూడగట్టే బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది. ఈక్రమంలో స్వాతిరాణి అందరితో ఎమ్మెల్యేలతో మాట్లాడి మద్దతు తీసుకునే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం. -
గిరిజన వర్సిటీ తరలింపు బాధాకరం
జియ్యమ్మవలస:జిల్లాకు మంజూరైన గిరిజన యూనివర్సిటీని పక్కజిల్లాకు తరలించడం బాధాకరమని కురుపా ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. మం డలంలోని చినమేరంగి గ్రామంలో తన స్వగృహంలో ఆమె శనివారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారని, ప్రస్తుతం మాట తప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వెనుకబడిన జిల్లాలో విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తామంటే ఈప్రాంత ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని ప్రస్తుతం తరలించడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. జిల్లా నుంచి ఎక్కువ మంది అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారని వారంతా పట్టించుకోక పోవడం వింతగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చడం లేదని మాటలే తప్ప చేతలు లేవన్నారు. ఇప్పటికైనా ఎన్నికల హమీలను నెరవేర్చి గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఈ జిల్లాలోనే స్థాపించాలని డిమాండ్ చేశారు. అందుకు అధికార పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని హితవు పలికారు. నాయకులకు బుద్ధి చెబుతాం: గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు విజయనగరం కంటోన్మెంట్: జిల్లాకు మంజూరైన గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడంలో నిర్లక్ష్యం వహించిన నాయకులకు గట్టిగా బుద్ధి చెబుతామని ఏపీ గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్ సురేష్, కె నాగేశ్వరరావులు ఒక ప్రకటనలో హెచ్చరించారు. గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి విశాఖకు తరలించే ప్రయత్నాలు చేయడం అన్యాయమని వాపోయారు. ఎంతో వెనుకబడ్డ ఈ జిల్లా గిరిజన యూనివర్సిటీ రాకతో అభివృద్ధి చెందుతుందని ఆశించిన వారికి తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని తరగతులకు చెందిన విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో చదువుతుంటే గిరిజనులు మాత్రం ప్రాథమిక విద్యకు కూడా నోచుకోకుండా ఇక్కడే గిరిగీసినట్టుండిపోతున్నారని ఆందోళన వెలిబుచ్చారు. గిరిజనులు సొంత కాళ్ల మీద నిలబడడానికి ఉన్నత విద్యలు అవసరమని, అందుకు ఈ గిరిజన విశ్వవిద్యాలయం వస్తే ఎంతో అనుకూలంగా ఉండేదన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం తరలింపును జీర్ణించుకోలేకపోతున్నామని అందుకోసం ఎన్ని పోరాటాలైనా చేస్తామని స్పష్టం చేశారు. వర్సిటీ తరలింపు ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోకపోతే విశాల ప్రజా ఉద్యమాన్ని చేపడతామని పేర్కొన్నారు. ఇందుకోసం త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తామన్నారు. -
జిల్లాకు అన్యాయం
* గిరిజన వర్సిటీ తరలిపోతున్నా పట్టించుకోని కేంద్ర మంత్రి * వైఎస్ఆర్సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సుజయ్ బొబ్బిలి(విజయనగరం): ‘‘ఉత్తరాంధ్రలో అత్యంత వెనుకబడిన జిల్లా విజయనగరం, ప్రతీ కమిటీ ఇదే నివేదిక ఇస్తోంది, రాష్ట్ర విభజనలో ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు...అయితే ఇక్కడకు కేటాయించిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని పక్క జిల్లాకు తరలిస్తున్నారు ఇదేనా అభివృద్ధి చేయడమంటే ’’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుజయ్‌కృష్ణ రంగారావు ప్రశ్నించారు. బొబ్బిలిలో శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించినా ఇప్పటివరకూ ఒక్కటి కూడా అమలులోకి రాలేదన్నారు. పార్వతీపురం డివిజన్లో గిరిజనులు ఎక్కువగా ఉండడంతో సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు పరిశీలించారని, దీంతో జిల్లా వాసులంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. మాన్సాస్ భూములు ఇస్తుండడంతో ఎంతో సంతోషపడ్డారని చెప్పారు. అయితే ఇప్పుడు విశాఖపట్నానికి గిరిజన విశ్వవిద్యాలయాన్ని తరలించడం అన్యాయమన్నారు. ఇదేనా వెనుకబడిన జిల్లాను అభివృద్ధి చేయడం అని ఆయన ప్రశ్నించారు. సొంత జిల్లాకి అన్యాయం జరుగుతుంటే కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు చూస్తూ ఊరుకోవడం సబబుగా లేదన్నారు. -
కేంద్ర మంత్రి నిద్రపోతున్నారా ?
* గిరిజన యూనివర్సిటీ తరలిపోవడంపై మండిపాటు * ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా విజయనగరం క్రైం : జిల్లాలో నెలకొల్పాల్సిన గిరిజన యూనివర్సిటీ విశాఖపట్నం తరలిపోతుంటే కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు నిద్రపోతున్నారా అని ఎస్ఎఫ్ఐ విజయనగరం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు జె. రామయ్య, కె. సురేష్ ప్రశ్నించారు. యూనివర్సిటీ తరలింపును నిరసిస్తూ శుక్రవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చంద్రబాబు జిల్లాకు ప్రకటించిన పది వరాల్లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ఒకటన్నారు. యూనివర్శిటీని పక్క జిల్లాకు తరలించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. జిల్లాకు చెందిన శాసనసభ్యుడు, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు తక్షణమే స్పందించి గిరిజన విశ్వవిద్యాలయం తరలింపును అడ్డుకోవాలన్నారు. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అనువైన స్థలం లేదనే కారణం సరికాదన్నారు. ఇప్పటికే సాలూరు, నెల్లిమర్ల, బొండపల్లి, గుర్ల, గంట్యాడ, మెరకముడిదాం, తదితర ప్రాంతాలో అనువైన స్థలాలు ఉన్నట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించారన్నారు. ఇప్పటికే పార్వతీపురంలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాల, జీఎల్.పురంలో ఉన్న పాలిటెక్నికల్ కళాశాలను విశాఖపట్నానికి తరలించారని, ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ కూడా తరలించడం అన్యాయమన్నారు. తక్షణమే ప్రజా ప్రతినిధులు స్పందించి యూనివర్సిటీ తరలింపును అడ్డుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, మణికంఠ, జిల్లా కమిటీ సభ్యుడు గణేష్, అప్పన్న పాల్గొన్నారు. యునివర్శిటీ నిర్మించాల్సిందే.. సాలూరు రూరల్ : జిల్లా విద్యార్థులకు మేలు జరగాలంటే సాలూరు నియోజకవర్గంలో గిరిజన విశ్వవిద్యాలయం నిర్మించాల్సిందేనని టీడీపీ నాయకురాలు, అరుకు పార్లమెంట్ ఇన్చార్జి సం ధ్యారాణి అభిప్రాయపడ్డారు. తన నివాసగృహంలో విలేకరులతో మాట్లాడు తూ, జిల్లాకు మంజురైన యునివర్శిటీ వైజాగ్ వెళ్లిపోతుందనే వార్తలు పత్రికల్లో రావడం చూసి తనకు చాలా బాధగా ఉందన్నారు. పాచిపెంట మండలం చాపరాయివలస గ్రామం సమీపంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారని, అందుకు గాను కేంద్రమంత్రి పి. అశోక్ గజపతిరాజు మాన్సాస్ నుంచి 3200 ఎకరాల స్థలం కేటాయించారని తెలిపారు. అయితే ఇప్పుడెందుకు యూనివర్శిటీని తరలిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పాచిపెంటలో యూనివర్శిటీ ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్రకు న్యాయం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయకుమారి, చిన్నిదొర, నిమ్మాది పాల్గొన్నారు. -
చేజారిన గిరిజన వర్సిటీ !
సాక్షి ప్రతినిధి, విజయనగరం : నవ్యాంధ్రప్రదేశ్ శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు ప్రకటించిన పది హామీల్లో ఒక్కొక్కటి చే జారిపోతున్నాయి.నేతల చేతగాని తనం, పలువురి స్వార్థ ప్రయోజనాలకు జిల్లాకొచ్చే అరుదైన అవకాశాలు దూరమవుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రభుత్వ వైద్య కళాశాల....ఈ రోజు గిరిజన యూనివర్సిటీ జిల్లాకు దక్కని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలయ్యేంతవరకు ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేస్తామన్న చంద్రబాబునాయుడు ప్రైవేటు వైద్య కళాశాలతో సరిపుచ్చారు. జిల్లా ప్రజల ఏళ్ల నాటి గిరిజన యూనివర్సిటీ కలను సాకారం చేస్తామని గొప్పగా చెప్పిన టీడీపీ సర్కార్ ఇప్పుడేమో ప్రతిపాదిత స్థలం సానుకూలంగా లేదని పొరుగు జిల్లాకు తరలించనుంది. దీనికి స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధుల వైఫల్యమే కారణంగా తెలుస్తోంది. శాసనసభలో చంద్రబాబు ప్రకటించిన వరాలు జిల్లాకు అందకుండా పోతున్నాయి. ఇప్పటికే రెండు చేజారిపోగా మిగతా ఎనిమిదిపై నీలి నీడలు కమ్ముకున్నాయి. చేతిలోకి వచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాల, గిరిజన యూనివర్సిటీయే చేజారిపోయిందంటే కష్టసాధ్యమైన స్మార్ట్ సిటీ, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఫుడ్ పార్క్, పారిశ్రామి నగరం, నౌకాశ్రయం, లలిత కళల అకాడమీ ఏర్పాటు అంత సులువా అనే సంశయం అందరిలో ఏర్పడింది. సర్కార్ చిన్నచూపు ఒకటైతే, మన నేతల వైఫల్యం మరో కారణంగా నిలిచింది. ఒక ట్రస్టుకు కట్టబెట్టేందుకు గాను ప్రభుత్వ వైద్య కళాశాల బదులు ప్రైవేటు కళాశాలను కేటాయించగా, మాన్సాస్ స్థలంలోనే ఏర్పాటు చేయాలన్న ఏకైక లక్ష్యం, మరో ప్రత్యామ్నాయ ప్రతిపాదన చేయకపోవడంతో గిరిజన యూనివర్సిటీ జిల్లాకు దూరమైన దుస్థితి చోటు చేసుకుంది. దేశంలోనే ప్రతిష్టాత్మక గిరిజన యూనివర్సిటీని జిల్లాలో ఏర్పాటు చేస్తున్నామని, దక్షిణ భారతదేశంలోనే గిరిజన విద్యార్థుల కోసం నిర్మిస్తున్న తొలి విశ్వవిద్యాలయంగా గొప్పలు పలికారు. ఆ మేరకు పాచిపెంట మండలం వేటగానివలస సమీపంలో గల కన్నయ్యవలస, చాపరాయివలస మధ్యలో ఉన్న మాన్సాస్ ట్రస్టు భూముల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇక్కడ సుమారు 3,370 ఎకరాల భూమి ఉండగా, అందులో 500 ఎకరాల వరకు కేటాయించడానికి సుముఖత చూపారు. ఆమేరకు ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీన కేంద్ర బృందం వచ్చి పరిశీలన కూడా చేసింది. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్.పి.సిసోడియా, నీలం సహాని,రామ బ్రహ్మం బృందం పూర్తిగా పరిశీలించాక గిరిజన యూనిర్సిటీ ఏర్పాటుకు అనుకూల ప్రాంతంగా తమ అభిప్రాయాన్ని కూడా ఆ సందర్భంలో వ్యక్తం చేసింది. దీంతో గిరిజన యూనివర్సిటీ జిల్లాకే దక్కుతుందని సంతోషించారు. అయితే, ఆ ఆశ అడియాసైంది. పరిశీలించిన వెళ్లిన కేంద్రబృందం తమ అభిప్రాయం మార్చుకుంది. ఇక్కడి స్థలం గిరిజన యూనివర్సిటీకి సానుకూలం కాదని తేల్చి చెప్పేసింది. ఇదే విషయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం జరిగిన ఒక సమావేశంలో వెల్లడించారు. అంతటితో ఆగకుండా విశాఖ జిల్లాలోని సబ్బవరంలో ఉన్న స్థలాన్ని ప్రతిపాదిస్తున్నట్టు తెలియజేశారు. పాచిపెంట మండలంలో ప్రతిపాదించిన స్థలానికి కనెక్టవిటీ లేదని, జిల్లా కేంద్రానికి దూరంగా ఉందని, అన్నీ రకాలుగా సానుకూలమైనది కాదని కేంద్రం స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు జల్లినట్టుయింది. దీనికీ మన ప్రజాప్రతినిధుల ప్రయత్నం, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేయకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఆరోజే మరో కొన్ని ప్రతిపాదనలు చేసి ఉంటే ఒకటి కాకపోతే మరొకటైనా పరిశీలనలోకి తీసుకునేది. వాస్తవానికైతే, బొండపల్లి, గుర్ల, నెల్లిమర్ల మండలాల్లో అనుకూల స్థలాలున్నా వాటిని ప్రతిపాదించకుండా కేవలం పాచిపెంట మండలంలో ఉన్న మాన్సాస్ భూములను చూపించి చేతులు దులుపుకొన్నారు. ఇప్పుడిదే కొంప ముంచింది. ఆ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించడమే కాకుండా మరో ప్రతిపాదన పంపించే వెసులుబాటును కూడా ఇవ్వలేదు. ఈ సమయంలోనైనా మన కేంద్ర, రాష్ట్ర మంత్రులు , ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్ తదితరులంతా గట్టిగా ఒత్తిడి చేసి ఉంటే ప్రత్యామ్నాయ ప్రతిపాదనకు అవకాశం ఇచ్చేది. దీంతో జిల్లాలో ఉన్న వేలాది మంది గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్య దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా మన పాలకులు మేల్కొని మరో ప్రతిపాదనకు అవకాశం ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి చేయాల్సి ఉంది. -
కొత్త సీసాలో.. పాత సారాలా ఉంది: తాటి వెంకటేశ్వర్లు
బడ్జెట్లో అంకెలగారడీ తప్ప మరేమీ లేదు. కొత్తసీసాలో పాత సారా మాదిరిగా ఉంది. లక్ష కోట్ల బడ్జెట్ చూపాలనే తపన తప్ప విశ్వసనీయత, స్పష్టత లేదు. ప్రణాళిక వ్యయాన్ని 10 నెలలకే రూ.48,648 కోట్లు చూపారు. ఇది ఉమ్మడిరాష్ట్రంలో కంటే ఎక్కువ. ఇంత పెద్ద బడ్జెట్ అసాధ్యం. గిరిజన విశ్వవిద్యాలయం ఊసే లేదు. తెలంగాణ ఉద్యమంలో 1,200 మంది అమరులు కాగా, 459 కుటుంబాలకే రూ.10 లక్షల చొప్పున పరిహారమిస్తామంటున్నారు. బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగాల ప్రస్తావనే లేదు. ఖమ్మం జిల్లా బయ్యారం స్టీల్‌ప్లాంట్ గురించి పేర్కొనలేదు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో 108, 104 సర్వీసులను ఘనంగా నడిపినా.. వాటి గురించి పేర్కొనలేదు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. దళితులతోపాటు మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు. వీటిని గురించిన ప్రస్తావనలేదు. వివిధ మార్గాల్లో ప్రభుత్వ ఆదాయం ఎంత వస్తుంది, ఎందులో ఎంత ఉంది, ఆదాయాన్ని ఎలా పెంచుకుంటారో చెప్పనేలేదు. గోరంతను కొండంత చేసి చూపించారు. సాధారణ స్థాయికి మించి భారీగా భూముల అమ్మకం ద్వారా, కేంద్రం ద్వారా డబ్బు వస్తుందని చెబుతున్నారు. వచ్చే 4 నెలల్లో భూముల అమ్మకం, రిజిస్ట్రేషన్ల ద్వారా అంతస్థాయిలో ఆదాయాన్ని సాధించే పరిస్థితి లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగక కొనుగోళ్లు తగ్గాయి. వైఎస్సార్ హయాంలోనే రియల్ ఎస్టేట్ బూమ్ ఉండగానే రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే.. రూ.4 వేల కోట్లే వచ్చింది. తెలంగాణకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు వచ్చే అవకాశమే లేదు. ఛత్తీస్‌గఢ్‌నుంచి విద్యుత్ ఎలా వస్తుందనేది తెలియదు. విద్యుత్ సమస్య కారణంగా 400 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే.. ప్రభుత్వానికి హైదరాబాద్‌పై దృష్టి తప్ప గ్రామీణప్రాంతాలపై ధ్యాసే లేదు. విద్యుత్ సమస్యను ఎలా అధిగమిస్తారో చెప్పలేదు. భూమి కొనుగోలుకు వెయ్యి కోట్లు కేటాయించారు. ఒక ఎకరం కూడా భూమిలేనివారు పది లక్షలమంది ఉన్నారు. వారికి భూమి కొనాలంటే 10 లక్షల ఎకరాలకు రూ. 50 వేల కోట్లు కావాలి. వారందరికీ ఇవ్వాలంటే 50 ఏళ్లు పడుతుంది. బడ్జెట్లో మొక్కుబడి కేటాయింపులు తప్ప వాస్తవికత లేదు. లక్ష కోట్లకు పైబడిన బడ్జెట్లో ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం నిధుల సేకరణ విషయంలో వాస్తవికత లేదు. ఖమ్మం జిల్లాలోని 7 పోలవరం ముంపు మండలాలకు (ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినవి) ఉదారంగా కరెంట్ ఇస్తున్నామని చెబుతున్నారు. వారంతా తెలంగాణవాళ్లే. నా సొంత గ్రామం కూడా అక్కడే ఉంది. అక్కడి వారు తెలంగాణకే, తనకే ఓటువేశారు. ఆ మండలాల్లోని ఉద్యోగులు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారినీ తెలంగాణకు తీసుకురావాలి.’ మంత్రి హరీశ్‌రావు స్పందన.. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు కలుగజేసుకుని 7 మండలాలు తెలంగాణలోనే ఉండాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో లేఖ రాయించాలని అన్నారు. ఈ అంశంపై మీ పార్టీ విధానం ఏమిటో చెప్పాలన్నారు. జగన్, చంద్రబాబు, అందరూ కలిసి ఈ మండలాలను అక్కడ కలిపారని, ఎందుకు కలపమన్నారో జగన్‌ను అడగాలని ప్రశ్నిం చగా.. ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు స్పందిస్తూ సభలో లేని వ్యక్తి గురించిమాట్లాడడడం సరికాదన్నారు. అంతకు ముందు వైఎస్సార్ పాలన ప్రస్తావన తెచ్చి తాటి మాట్లాడుతున్నపుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కలుగజేసుకుని వైఎస్సార్ పేరు ఎత్తే నైతికహక్కు లేదంటూ వ్యాఖ్యానించారు. -
హామీలు కాదు.. నిధులు కేటాయించాలి
మంచిర్యాల సిటీ : ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పనులు విరివిగా చేపడతానంటూ బహిరంగ సభల్లో హామీలు గుప్పించడం మానుకొని ఆయా పనులకు ముందుగా నిధులు కేటాయించాలని, అప్పుడే ఆయనను ప్రజలు నమ్ముతారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోనె శ్యాంసుందర్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన నాయకులతో కలిసి మంచిర్యాలలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వాలూ కేసీఆర్ మాదిరిగానే గిరిజనులకు అనేక హామీలిచ్చి విస్మరించాయని పేర్కొన్నారు. ఉట్నూర్‌లో వంద పడకల ఆస్పత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చి మరిచాయని ఆరోపించారు. గిరిజన యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటుచేస్తారో స్పష్టం చేయకపోవడంతో గిరిజనుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. యూనివర్సిటీని ఆదిలాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి నివేదికలే తయారు కాలేదని, అప్పుడే జిల్లాకు కొమురం భీమ్ పేరు పెడతామని ప్రకటించడం సరికాదని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాకే భీమ్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆహారం, అనారోగ్యం, కలుషితనీరు తదితర కారణాలతో మృతిచెందిన గిరిజనుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలన్నారు. మంత్రివర్గ విస్తరణలో గిరిజన శాఖ మంత్రి పదవిని ఈ జిల్లాకు చెందిన నాయకుడికే ఇవ్వాలని కోరారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మున్నారాజ్ సిసోధ్య, పట్టణ అధ్యక్షుడు అమరశెట్టి మల్లేశ్, నాయకులు సతీశ్‌రావు, గందం రమేశ్ పాల్గొన్నారు. -
ఆంతర్యం ఏంటో?
యూనివర్సిటీ ఏర్పాటుపై సరైన హామీ ఇవ్వని కేసీఆర్ ‘తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఖాయం. ఏర్పాటు చేసే యూనివర్సిటీకి కొమురం భీమ్ గిరిజన యూనివర్సిటీగా పేరు పెడుతాం.’ - ఇవీ బుధవారం జోడేఘాట్‌లో కొమురం భీమ్ వర్ధంతిలో పాల్గొన్న సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు. ఉట్నూర్ : కొమురం భీమ్ వర్ధంతి వేడుకల నిర్వహణకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌లో నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశంలో ఆదిలాబాద్ జిల్లాలోనే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆ సమయంలో గిరిజనుల్లో ఆశలు చిగురించాయి. అయితే.. బుధవారం భీమ్ వర్ధంతిలో పాల్గొన్న సీఎం ఆ విషయంపై స్పష్టత ఇష్టారని అందరూ భావించినా.. కానీ, ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీనికితోడు తెలంగాణలో ఏర్పాటు చేసే గిరిజన యూనివర్సిటీకి కొమురం భీమ్ పేరు పెడుతామంటూ ప్రకటన చేయడంతో అందరిలోనూ అయోమయం నెలకొంది. జిల్లా అంతగా చర్చ మొదలైంది. వెంటనే ప్రభుత్వం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుపై స్పష్టత ప్రకటన చేయాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. యూనివర్సిటీ ఏర్పాటుతో అభివృద్ధి జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 4,95,794 ఆదివాసీ గిరిజన జనాభా ఉంది. జిల్లావ్యాప్తంగా తొమ్మిదికి పైగా గిరిజన తెగలు జీవిస్తున్నారు. గోండులు 2,63,515, లంబాడాలు 1,12,793, కోలాంలు 38,176, పర్దాన్లు 26,029, మన్నెవార్లు 15,370, నాయక్‌పోడ్‌లు 5,206, తోటీలు 2,231, కోయ 1,735, ఇతర తెగలు 30,739 చొప్పున ఉన్నారు. గిరిజన యూనివర్సిటీ జిల్లాలో ఏర్పాటు అయితే అందరూ విద్యాభివృద్ధి సాధించే అవకాశం లేకపోలేదు. అంతేగాకుండా మరికొందరికి ఉద్యోగ అవకాశాలూ లభిస్తాయి. -
గిరిజన యూనివర్సిటీ స్థల పరిశీలన
చాపరాయి వలస(పాచిపెంట): మండలంలోని వేటగానివలస సమీపంలో చాపరాయివలస వద్ద ఏర్పాటు చేయనున్న గిరిజన యూనివర్సిటీకి సంబంధించిన స్థలాన్ని కేంద్ర బృందం ఆదివారం పరిశీలించింది. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్.పి.సిసోడియా, నీలం సహాని, రామ బ్రహ్మంతో కూడిన బృందం ఆదివారం ఈ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాజకీయాలుకు అతీతంగా గిరిజన ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ఇక్కడ గిరిజన యూనివ ర్సిటీ నిర్మాణం తప్పనిసరని స్థానికులు కమిటీకి వివరించారు. నాలుగు రాష్ట్రాలకు మధ్యలో ఉన్న పాచిపెంటకు అరుకు రహదారి సౌకర్యం కూడా ఉన్నందున గిరిజన యూనివర్సిటీకి అనుకూలమని గిరిజన ప్రజాప్రతినిధులు తెలిపారు. అనంత రం సబ్ కలెక్టర్ శ్వేతామహంతి స్థలానికి సంబంధించిన మ్యాప్‌తో బృందానికి వివరించారు. ఈ ప్రాంతం అన్ని విధాలా గిరిజన యూనివర్సిటీకి అనుకూలమని కేంద్రం బృందం నిర్ధారణకొచ్చినట్లు తెలిసింది. ఇక్కడ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటైతే ఎంతోమంది గిరిజనుల ఉన్నత చదువులకు అవకాశముం టుందని మాజీ ఎంపీ డీవీజీ శంకరరావు, మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్ కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం భూమి వివరాలపై అధికారులు ఆరా తీశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పిన్నింటి ప్రసాద్‌బాబు, టీడీపీ నాయకులు ముఖీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గిరిజనులను ఆదుకోవాలి ఈ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు అభినందనీయమని, ఇక్కడ తరతరాలుగా జీవనోపాధి పొందుతున్న గిరిజన రైతులను ఆదుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి కోరాడ ఈశ్వరరావు కోరారు. ఈ మేరకు కేంద్రకమిటీకి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల సర్వే చేయక పట్టాలు మంజూరు కాలేదని చెప్పారు. దీంతో ఈ ప్రాంతం అన్ సర్వేడ్ భూమిగానే మిగిలిపోయిందని అన్నారు. ఈయనతో పాటు డివిజన్ కార్యదర్శి జి.శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యులు కాడాపు జోగులు, పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
వినియోగంలోకి తెస్తే ప్రతిష్టాత్మకమే..
కాగజ్‌నగర్ రూరల్ : కాగజ్‌నగర్ మండలం గన్నారం గ్రామ సమీపంలో 21వ శతాబ్ది గురులకు విద్యాలయం కోసం నిర్మించిన అధునాతన భవనాలు నాలుగేళ్లుగా నిరుపయోగంగా మారాయి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథాగా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 12 కోట్లతో నిర్మించిన అధునాన భవనాలు నాలుగేళ్లుగా నిరూపయోగంగా ఉండి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఇంటర్ విద్యను పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్తోపాటూ ఇతర సాంకేతిక విద్యను అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 21వ శతాబ్ధి గురుకులాలను మంజూరు చేసింది. ఎంసెట్‌లో సీటు రాని విద్యార్థులకు ప్రత్యామ్నాయంగా ఇంజనీరింగ్ విద్య అందించాలనే లక్ష్యంతో ఐదేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైస్ రాజశేఖర్‌రెడ్డి 21వ శతాబ్ధి గురుకులాలకు రూపకల్పన చేశారు. వీటి నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర సాంకేతిక విద్యా మండలికి అప్పగించారు. ఇందులో భాగంగా జిల్లాలోని కాాగజ్నగర్ మండలం గన్నారంలో గురుకుల భవనాలు నిర్మించారు. గ్రామ సమీపంలోని 50 ఎకరాల భూమి కేటాయించి రూ. 12 కోట్లు విడుదల చేశారు. 12 కోట్లతో భనవ నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఎనిమిది బ్లాకులు, 384 గదులతో అధునాతన సౌకర్యాలతో భవనాల నిర్మాణం చేపట్టారు. ఒక్కో బ్లాక్‌కు మూడు అంతస్తులు, ప్రతీ అంతస్తుకు 16 చొప్పున మొత్తం 384 గదులను నిర్మించారు. 2010 సంవత్సరం నాటికే ఈ భవనాల నిర్మాణం పూర్తయ్యింది. సుమారు ఐదు వేల మంది విద్యార్థులకు వసతీసౌకర్యం కల్పించేలా అధునాతన ఏర్పాట్లు చేపట్టారు. కానీ అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి మృతి చెందడంతో అనంతర కాలంలో ఈ గురుకులాల గురించి పట్టించుకునేవారు లేకపోవడంతో ఈ భవనాలు నిరూపయోగంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వమైనా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ భవనాలను పట్టించుకుని వినియోగంలోకి తేవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. 50 ఎకరాల విశాల స్థలంలో అధునాతన భవనాలు నిర్మించి ఉండడంతో ఇక్కడ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు పూర్తి అనుకూల వాతావరణ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇక్కడ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తేనే భవనాలు వినియోగంలోకి రావడమే కాకుండా ఈ ప్రాంతంకూడా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. ఇప్పటికే సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు ఈ భవనాలను వినియోగంలోకి తెచ్చే విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించారు. ఈ భవనాలను గిరిజన యూనివర్శిటీకి కేటాయించాలని కోరుతూ సీఎం చంద్రశేఖర్‌రావుకు వివరించడం జరిగిందని, అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విద్యార్థులకు ఈ భవనాలను ఉపయోగంలోకి తీసుకువచ్చేందుకు సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఈ భవనాలను వినియోగంలోకి తీసుకువస్తే జిల్లాకే తలమానికం కానున్నాయి. -
గిరిజన యూనివర్సిటీపై గిల్లికజ్జాలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోని పక్షంలో గిరిజన విశ్వ విద్యాలయం ఇతర జిల్లాకు తరలిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈ యూనివర్సిటీని ముందుగా ఉట్నూర్‌లో ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం భావించింది. తాజాగా దీన్ని వరంగల్ జిల్లాకు తరలించేందుకు ప్రస్తుత సర్కారు సమాయత్తమవుతుండటం ఇక్కడి విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. గోండు, కొలాం, తోటి, మన్నేవార్.. వంటి గిరిజన తెగలున్న జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఆదివాసీల సంసృ్కతి, సంప్రదాయాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. ముఖ్యంగా అటవినే నమ్ముకుని జీవ నం కొనసాగిస్తున్న ఈ గిరిజన తెగలకు చెందిన యువతకు ఉన్నత విద్యావకాశాలు చేరువవుతాయి. ఈ ప్రత్యేక యూనివర్సిటీ జిల్లాకు తలమానికం కానుంది. ఉట్నూర్‌లో స్థలం గుర్తింపు.. గత యూపీఏ సర్కారు రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ మంజూరు చేసింది. ఈ యూనివర్సిటీని ఉట్నూర్‌లో ఏ ర్పాటు చేయాలనే డిమాండ్ గతంలో వెల్లువెత్తింది. గిరిజ న సంఘాలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమిం చాయి. ఓ గిరిజన సంఘం నేత ఉట్నూర్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి, గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. దీంతో ఈ యూనివర్సిటీని ఉట్నూర్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిం చింది. దీని ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం రెండేళ్ల కిత్రం జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మేరకు అధికారులు ఉట్నూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో సుమారు 300 ఎకరాల సర్కారు భూమిని గుర్తించారు. ఇందులో యూనివర్సిటీ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని తేల్చా రు. 44వ నెంబర్ జాతీయ రహదారికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని అప్పటి కలెక్టర్ అశోక్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. గత యూపీఏ ప్రభుత్వం లో మంత్రిగా బలరాం నాయక్ దీన్ని వరంగల్ జిల్లాకు తరలించేందుకు ప్రయత్నాలు చేశారు. తాజాగా తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కారు కూడా దీన్ని వరంగల్ జిల్లాకు తరలించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ యూని వర్సిటీ ఏర్పాటుకు సాధ్య అసాధ్యాలు పరిశీలించాలని వరంగల్ జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలందడంతో జిల్లా వాసుల ఆశలపై నీళ్లు చల్లినట్లవుతోంది. అభివృద్ధికి నోచుకోని జిల్లా.. ఇక్కడి ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా జిల్లా ఎంతో కాలంగా వెనుకబడిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సరైన ప్రాతినిథ్యం దక్కకపోవడం.. తదితర కారణాలతో జిల్లా అభివృద్ధికి బాటలు పడలేదు. ఇప్పుడు తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కారులో జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి కీలకంగా మారారు. ఈ ప్రజాప్రతినిధులు ప్రతిష్టాత్మకమైన ఈ విశ్వవిద్యాలయాన్ని జిల్లాలోనే నెలకొల్పేలా చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
గిరిజన వర్సిటీ ఏర్పాటుపై ఆశలు గల్లంతు
ఉట్నూర్ : జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ఆశలు గల్లంతు అవుతున్నాయి. తాజాగా ప్రభుత్వం వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు గల అవకాశాలు పరిశీలించాలని ఆ జిల్లా యంత్రాగానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు సర్వే పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా గిరిజన యూనివర్సిటీ జిల్లాలోనే ఏర్పాటు అవుతుందన్న ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఇప్పటికైన మన జిల్లా ప్రజాప్రతినిధులు యూనివర్సిటీ కోసం పోరాడాలని గిరిజనులు కోరుతున్నారు. ఆశల పల్లకిలో ఆరేళ్లు.. 2008లో అప్పటి యూపీఏ సర్కారు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. 2008 నవంబర్ 17న జీవో నంబర్ 797, 2011 ఆగస్టు 27న జీవో నంబర్ 783ను విడుదల చేసింది. దీంతో జిల్లా, ఐటీడీ ఏ అధికారులు ఉట్నూర్‌లోని ప్రభుత్వ జూనియ ర్ కళాశాల వెనకాల ప్రభుత్వానికి చెందిన 470 ఎకరాల పరంపోగు భూమిలో 300 ఎకరాలు గుర్తించింది. అలాగే 7వ నంబరు జాతీయ రహదారికి 34 కి.మీ. దూరంలో రవాణా సౌకర్యం, హైటెన్షన్ విద్యుత్తు తదితర సౌకర్యాలు ఉన్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు పంపించారు. యూపీఏ సర్కార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదించిన తెలంగాణ బిల్లు పదకొండో అంశంలో తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ప్రస్తావన కూడా ఉంది. దీంతో అందరూ యూనివర్సిటీ ఏర్పాటవుతుందని భావించారు. ఇప్పుడేమో వరంగల్‌కు తరలుతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో గిరిజనులు నిరాశకు గురవుతున్నారు. ప్రజాప్రతినిధులపైనే భారం జిల్లాలోని ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూర్‌లో గిరిజ న యూనివర్సిటీ ఏర్పాటుకు అనువైన అవకాశాలున్నా రాజకీయ కారణాల వల్ల వరంగల్‌లో ని ములుగుకు తరలుతున్నట్లు తెలుస్తోంది. ప్ర స్తుతం జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు జరగాలంటే ప్రజాప్రతినిధులే కీలకమని అడవి బిడ్డలు భావిస్తున్నారు. జిల్లాలో అధికార ప్రభుత్వానికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉండటం, ఒక మంత్రి పదవి, ఇద్దరు ఎంపీలు టీఆర్ఎస్ వాళ్లే ఉన్నారు. ఇందులో ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు గిరిజన తెగకు చెందిన వారు ఉన్నారు. వీరంత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏజెన్సీ కేంద్రంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు జరిగేలా చూడాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. మన జిల్లాలో కాకుండా వేరే జిల్లాకు యూనివర్సిటీ తరలిపోతే అది ప్రజాప్రతినిధుల వైఫల్యమే అవుతుంది. -
విశాఖపట్నంలో ఐఐఎం, ఐఐటీ
హైదరాబాద్: జాతీయస్థాయి విద్యాసంస్థలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ఐఐఎం, ఐఐటీ, ట్రైబల్ యూనివర్సిటీ పెట్రోలియం యూనివర్సిటీలను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విజయవాడ - గుంటూరు మధ్య ఎయిమ్స్, నిట్, అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఎన్డీఎంఏ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. తిరుపతిలో సెంట్రల్ యూనివర్శిటీ, ఐఐటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. జాతీయ విద్యా సంస్థల కోసం ఒక్కో జిల్లాలో 1000 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించినట్టు మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి. నారాయణ, కామినేని శ్రీనివాసరావు తెలిపారు. -
ప్రజాప్రతినిధులదే భారం
గిరిజన యూనివర్సిటీపై చిగురిస్తున్న ఆశలు ఉట్నూర్, న్యూస్‌లైన్ : జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడటం, సీఎం కేసీఆర్ ప్రధానికి విన్నవించిన వాటిలో గిరిజన యూనివర్సిటీ అంశం ఉండటంతో మళ్లీ ఈ విషయం తెరమీదికి వచ్చింది. 2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం 2008 నవంబర్ 17న జీవో నంబర్ 797ను విడుదల చేసింది. దీనికి అనుగుణంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2011 ఆగస్టు 27న జిల్లాలో గిరిజన యునివర్సిటీ ఏర్పాటుకు జీవో నంబర్ 783ను విడుదల చేసింది. జిల్లా, ఐటీడీఏ అధికార యంత్రాగం ఉట్నూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనకాల ప్రభుత్వానికి చెందిన 470 ఎకరాల పరం పోగు భూమిలో 300 ఎకరాలు గుర్తించింది. అలాగే 7వ నంబరు జాతీయ రహదారికి 34 కి.మీల దూరంలో రవాణా సౌకర్యం, హైటెన్షన్ విద్యుత్తు తదితర సౌకర్యాలు ఉన్నట్లు ఐటీడీఏ, జిల్లా అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపించా రు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో యూనివర్సిటీ అంశం మరుగున పడింది. అయితే గత జనవరిలో రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్(రూసా) కింద రాష్ట్రంలో 12 కొత్త యూనివర్సిటీల ఏర్పాటు కోసం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనల్లో జిల్లాలోని నిర్మల్ లో యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రతిపాదనలు పంపింది. దీంతో అడవి బిడ్డలకు కేంద్రంగా గిరిజన యునివర్సిటీ ఏర్పాటు జరుగుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లా ప్రజాప్రతినిధులదే భారం జిల్లాలో గిరిజన యునివర్సిటీ ఏర్పాటు జరుగాలంటే మన జిల్లా ప్రజాప్రతినిధులే కీలకమని అడవిబిడ్డలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండటం, జిల్ల్లా ఏడు అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకొవడం, బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేలు చేరడం, ఇద్దరు ఎంపీలు కూడా టీఆర్ఎస్ వాళ్లే కావడం, జిల్లాకు మంత్రి పదవి దక్కడంతో ప్రజాప్రతినిధులు ప్రభుతవపై ఒత్తిడి తెస్తే సులువవుతుందని గిరిజనులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మన జిల్లాలో కాకుండా వేరే జిల్లాకు యూనివర్సిటీ తరలిపోతే మన జిల్లా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే అవుతుంది. యునివర్సిటీ ఏర్పాటుకు మనవారు ప్రభుత్వంపై ఎంతవరకు ఒత్తిడి తెస్తారో చూడాలి. -
నోచందా..దందా..ప్రజాసేవే పరమావధి
కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా.. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌గా.. పల్లెలు, గిరిజనతండాలు తిరిగాను.. సామాజిక రుగ్మతలపై ప్రజలకు అవగాహన కల్పించాను.. తండాల్లోని సమస్యలపై అధ్యయనం చేశాను.. తెలంగాణ ఉద్యమ సమయంలో జాక్ స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశాను.. తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడిన క్రమంలో ఇప్పుడు ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను.. ఎంపీగా విజయం సాధించాను.. తనను గెలిపించిన ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తాను.. చందా.. దందా.. పర్సంటేజీలు తీసుకోకుండా ప్రజా సేవకే అంకితమవుతా.. అని అంటున్నారు మాను కోట ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్. ‘న్యూస్‌లైన్’ అడిగిన పలు ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. న్యూస్‌లైన్, కేయూ క్యాంపస్: హబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో గిరిజనులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. గుడుంబాను కుటీర పరిశ్రమగా ఎంచుకుని దానికే బానిసలవుతున్నారు. యుక్త వయసులోనే అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. గుడుంబా విక్రయిస్తున్న వారిపై ఇప్పటివరకు నాలుగు లక్షల కేసులున్నాయి. గుడుంబా తయారీ నుంచి వారికి విముక్తి కల్పించడానికి ప్రత్యామ్నాయంగా ఉపాధి మార్గం చూపించాలి. గిరిజన, గిరిజనేతరుల్లో డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు లభించడం లేదు. కొందరు గిరిజనులు పేదరికంతో పసిపిల్లలను అమ్ముకునే దుస్థితి నెలకొంది. ప్రస్తుతం గిరిజనులకు ఉన్న 6 శాతం రిజర్వేషన్ సరిపోవడం లేదు. దానిని కనీసం 12 శాతం చేయాల్సిన అవసరం ఉంది. తాను ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్‌గా ఉన్నప్పుడు యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలను తిరిగినప్పుడు అనేక సమస్యలపై అధ్యయనం చేశాను. దీనిపై ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించాను. గిరిజనుల సమస్యలపై చట్టసభల్లో అంతగా ప్రస్తావనకు రాలేదు. గిరిజనేతరుల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తాను. రాజకీయాల్లోకి రావడం వల్ల కొన్ని సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది. పుష్కలంగా సహజ వనరులు పార్లమెంట్ పరిధిలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఖమ్మం జిల్లా బయ్యారంలో లక్షల ఎకరాల్లో ఐరన్‌ఓర్ నిక్షేపాలు ఉన్నాయి. రాబోయే టీఆర్ఎస్ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టేలా తనవంతు కృషి చేస్తాను. ఇక్కడ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తే గిరిజన, గిరిజనేతర యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఇక్కడ ఏర్పాటు చేస్తే రెండు జిల్లాల్లోని ఎంతోమంది గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యను అందించడమే కాకుండా సంస్కృతిని కూడా పెంపొందించే విధంగా ఉంటుంది. పాకాల, రామప్ప, లక్నవరం లాంటి సరస్సులు ఉన్నాయి. వీటిని కూడా ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను జాతీయ ఫెస్టివల్‌గా గుర్తించేలా కృషి చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడానికి కృషి చేస్తాను. కేయూను సెంట్రల్ యూనివర్సిటీగా చేస్తా.. కేయూను సెంట్రల్ యూనివర్సిటీగా చేయాలనే డిమాండ్ ఉంది. దీనికోసం తనవంతు కృషి చేస్తాను. కేయూలో టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. కొత్త పాలక మండలిని ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఉద్యమ ప్రస్థానం.. సామాజిక సేవ వెంకటాపూర్ మండలం మల్లయ్యపెల్లితండా(నారాయణపూర్)కు చెందిన అజ్మీరా లక్ష్మణ్, మంగమ్మ దంపతులకు సీతారాంనాయక్ జన్మించారు. కిలోమీటరున్నర దూరంలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లి చదువుకున్నారు. 6 నుంచి 9వ తరగతి వరకు ములుగుఘనపూర్‌లో చదువుకున్నారు. పదో తరగతి హన్మకొండలోని లష్కర్ బజార్ స్కూల్లో, హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, కేడీసీలో బీఎస్సీ చదువుకున్నారు. కేయూ 1979-1981లో ఎమ్మెస్సీ(బాటనీ) పూర్తి చేశారు. ఏపీపీఎస్సీ ద్వారా డిగ్రీ కళాశాల లెక్చరర్‌గా ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1984లో నియమాకమయ్యారు. 1994లో పీహెచ్డీ పూర్తి చేశారు. అప్పట్లో లంబాడీ గిరిజన తెగ నుంచి సైన్స్ విభాగంలో పీహెచ్డీ పొందిన వారిలో మొదటివారు. 1995 వరకు అక్కడే పనిచేసిన ఆయన హన్మకొండ కేడీసీకి బదిలీ అయ్యారు. ఆ తరువాత కేయూలో 2002 నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరి ప్రస్తుతం ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్‌గా, కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. దీని ద్వారానే సమాజంలోని అనేక సమస్యలను కూడా తెలుసుకునే అవకాశం కలిగింది. మూఢ నమ్మకాలు, ఎయిడ్స్ లాంటి సామాజిక రుగ్మతలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. కేయూ పాలక మండలి సభ్యుడిగా కీలక పాత్ర పోషించారు. కేయూ ఎగ్జామినేషన్ రీఫార్మేషన్ కమిటీ సభ్యుడిగా, పీజీ కళాశాలల స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేశారు. కేయూ అడ్మిషన్ల డెరైక్టర్‌గా, ఫైనాన్స్ కమిటీ సభ్యుడిగా, ఎస్డీఎల్సీఈ సలహా మండల సభ్యుడిగా, పీజీ అడ్మిషన్ల జాయింట్ డెరైక్టర్‌గా పనిచేశారు. కర్ణాటకలోని గుల్బార్గా యూనివర్సిటీ, బీహార్‌లోని లలిత్ నారాయణ్ మిథిలా విశ్వవిద్యాలయంతోపాటు అమెరికా, నేపాల్, థాయ్‌లాండ్ లలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొని పరిశోధనా పత్రాలను సమర్పించారు. రాష్ట్రంలోని 35 తెగలకు సంబంధించిన గిరిజనులపై, ముఖ్యంగా అధిక శాతం ఉన్న లంబాడీల మరణాలు, పసిపిల్లల అమ్మకాలపై పరిశోధన చేశారు. పలు పదవులు బాటనీ ప్రొఫెసర్‌గా పనిచేస్తూనే తెలంగాణ ఐక్య కార్యాచరణ సభ్యులు(టీజాక్)గా, తెలంగాణ యూనివర్సిటీ ట్రైబల్ ప్రొఫెసర్స్ అధ్యక్షుడిగా, ఆలిండియా బంజార సేవాసంగ్ కౌన్సిల్ సభ్యులుగా పనిచేశారు. రైల్వే లైన్‌కు కృషి ఖమ్మం జిల్లా మణుగూరు వరకు రైల్వే లైను ఉంది. ఇల్లెందు వరకు కొంత, భద్రాచలం వరకు కూడా రైల్వే లైను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీనిని పూర్తి చేయించేందుకు కృషి చేస్తాను. మహబూబాబాద్, డోర్నకల్ రైల్వేస్టేషన్లలోని సమస్యలు, పలు రైళ్ల నిలుపుదల కోసం ప్రయత్నిస్తాను. -
ఐఐటీకి స్థలాన్వేషణ
జిల్లాకు ఐఐఎం, ఐఐటీ, ట్రైబల్ యూనివర్సిటీ! స్థలాలు గుర్తించాలని ఉన్నత విద్యాశాఖ నుంచి ఆదేశాలు నివేదిక తయారీలో అధికారులు నిమగ్నం విశాఖ రూరల్, న్యూస్‌లైన్: విశాఖకు మహర్దశ పట్టనుంది. రాష్ర్ట విభజనతో జిల్లాకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రానున్నాయి. పర్యాటక, పారిశ్రామిక కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విశాఖ మున్ముందు విద్యారంగంలో హైదరాబాద్‌కు దీటుగా తయారుకానుంది. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) విశాఖకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితో పాటు గిరిజన విశ్వవిద్యాలయం కూడా జిల్లాలో ఏర్పాటయ్యే సూచనలున్నాయి. జిల్లాలో ఇందుకు అనువైన స్థలాలను గుర్తించి నివేదిక పంపించాలని ఉన్నత విద్యా శాఖ నుంచి సోమవారం కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్‌కు ఆదేశాలు అందాయి. గిరిజన యూనివర్సిటీ కోసమని స్పష్టంగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నా జాతీయ విద్యా సంస్థల విషయంలో ఐఐటీ, ఐఐఎంలా? లేదా ఇతర విద్యా సంస్థలా?.. ఎన్ని?.. అవేమిటి? ..అనే విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. దీర్ఘకాల డిమాండ్ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంతటి స్థాయిలో విశాఖ అభివృద్ధి దిశగా పయనిస్తోంది. కానీ విద్యారంగంలో మాత్రం ప్రతిష్టాత్మక, జాతీయ స్థాయి విద్యా సంస్థలు లేకపోవడం లోటుగా పరిణమించింది. ఫలితంగా ఉన్నత విద్యతో పాటు ఉద్యోగావకాశాల కోసం యువత హైదరాబాద్ లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచపటంలో గుర్తింపు పొందిన విశాఖలో ఐఐటీ, ఐఐఎంలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా దీర్ఘకాలంగా ఉంది. కనీసం విశాఖలో ఘన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సెంట్రల్ యూనివర్సిటీగా మార్చాలన్న ప్రతిపాదనలు ముందుకు సాగలేదు. వీటిపై జిల్లా నుంచి కేంద్రమంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా ప్రాతినిథ్యం వహించిన వారంతా సిఫార్పులు చేసినా ఫలితం లేకపోయింది. తాజాగా జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుకు స్థలాన్వేషణ చేయాలంటూ ఉన్నత విద్యా శాఖ నుంచి ఉత్తర్వులు రావడంతో విశాఖ వాసుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రెండు రోజుల్లో నివేదిక ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వుల ప్రకారం.. జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడున్నాయో రెవెన్యూ అధికారులు గుర్తించి వాటికి ప్రహరీలు కూడా నిర్మించారు. వాటి రికార్డుల ఆధారంగా జాతీయ విద్యా సంస్థలకు అనువైన స్థలాలను రెండు రోజుల్లో గుర్తించి నివేదిక తయారు చేయనున్నారు. ఐఐటీ, ఐఐఎం విద్యా సంస్థలకు 400 నుంచి 500 ఎకరాల స్థలం అవసరముంటుంది. అదే గిరిజన యూనివర్సిటీకి 30 నుంచి 50 ఎకరాల స్థలం సరిపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ యూనివర్సిటీకి స్థలం ఏజెన్సీకి దగ్గరలో ఉండలా? లేదా గ్రామీణ ప్రాంతంలో చూడాలా? అన్న విషయంపై అధికారులు ఆలోచనలో పడ్డారు. దీని కోసం రెండు ప్రాంతాల్లో స్థలాలను గుర్తించి నివేదిక తయారు చేయాలని భావిస్తున్నారు. తుది నిర్ణయం ఉన్నత విద్యా శాఖ తీసుకుంటుందన్న ఆలోచనలో ఉన్నారు. జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఎన్ని? అవేమిటన్న విషయాన్ని స్పష్టం చెప్పకపోవడంతో నాలుగైదు ప్రాజెక్టులకు అవసరమయ్యే అనువైన స్థలాలను గుర్తించి నివేదికలు తయారుచేసి ఈ వారంలోనే ఉన్నత విద్యాశాఖకు పంపించనున్నట్టు కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు. దీర్ఘకాల డిమాండ్ కావడం, రాష్ట్ర విభజన జరగడం, కేంద్ర ప్రభుత్వం హామీల నేపథ్యంలో తప్పకుండా ఐఐటీ లేదా ఐఐఎంలలో ఏదో ఒకటి త్వరలోనే జిల్లాకు మంజూరవుతుందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. విశాఖలో ఐఐఎం, విజయవాడలో ఐఐటీ విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. -
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి
అందరి కృషి వల్లే ‘నాగోబా’ విజయవంతం శివాలయం నిర్మాణానికి కృషి వచ్చే యేడు నాగోబా జాతర తెలంగాణలోనే.. జిల్లా ఇన్చార్జి మంత్రి సారయ్య ఉట్నూర్/ఇంద్రవెల్లి, న్యూస్‌లైన్ : కేస్లాపూర్లో కొలువైన నాగోబా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున ఇచ్చిన హామీలు నెరవేర్చామని, అందరూ కలిసి కట్టుగా కృషి చేయ డం వల్లే నాగోబా జాతర విజయవం తం అయిందని జిల్లా ఇన్చార్జి మంత్రి బసవరాజు సారయ్య అన్నా రు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో జరుగుతున్న నాగోబా జాతరను పురస్కరించుకుని ప్రభుత్వం గిరిజన దర్బార్ నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సోమవారం నిర్వహించిన దర్బార్‌కు జిల్లా ఇన్చార్జి మంత్రి బస్వరాజు సారయ్య హాజరై మాట్లాడారు. నాగోబా సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ స్టాల్స్‌ను పరిశీలించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వేదికపై వివిధ ఆవిష్కరణలు చేశారు. నాగోబా ఆలయ అభివృద్ధికి నిధులు వెచ్చించాం.. : మంత్రి సారయ్య నాగోబా ఆలయంఅభివృద్ధి పనుల్లో భాగంగా దాదాపు రూ.59 లక్షలు వెచ్చించి పనులు పూర్తి చేశామన్నారు. ముత్తునూర్ నుంచి కేస్లాపూర్ వరకు రోడ్డు నిర్మాణానికి మరో రూ.35 లక్షలు వెచ్చిస్తున్నామని త్వరలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయ సమీపంలో శివాలయం నిర్మించాలని ఆదివాసీలు కోరుతున్నారని, ఆలయ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. శివాలయం నిర్మాణంలో నాగోబా భక్తుడిగా తన నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతంతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కావాల్సి మౌలిక వసతులు ఏజెన్సీలో పుష్కలంగా ఉన్నాయన్నారు. అటవీ హక్కుల కల్పనలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్టంలో ఏ జిల్లాలోలేని విధంగా దాదాపు 37 వేలకు పైగా గిరిజనులకు సుమారు 4 లక్షలకు పైగా ఎకరాల అటవీ భూములపై హక్కులు కల్పించామన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీల పరిస్థితిని గమనించిన ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు శ్రీకారం చుట్టిందన్నారు. సబ్‌ప్లాన్ రావడానికి జిల్లా ప్రేరణ అన్నారు. అనంతరం జాతర సందర్భంగా నిర్వహించిన క్రీడాపోటీల్లో గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. సమస్యలు పరిష్కారం కావడం లేదు.. : ఆదివాసీ సంఘాల నాయకులు ప్రభుత్వాలు ఎన్ని మారిన ఆదివాసీలు అభివృద్ధి చెందడం లేదని ఆదివాసీ సంఘాల నాయకులు మండిపడ్డారు. రాజ్యాంగంలో ఆదివాసీల మనుగడకు రూపొందించిన చట్టాలు సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో ప్రభుత్వ ఉద్యోగాలకు అధికారులు ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు తీసుకురమంటున్నారని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు ఆత్రం తిరుపతి అన్నారు. 1950 కంటే ముందు ఏజెన్సీలో బతుకుతున్నా ఆదివాసీలకు ఏజెన్సీ ధ్రువీకరణ ప్రతాలు అధికారులు ఇవ్వడం లేదు. కానీ 1976-77 ప్రాంతంలో గిరిజనులుగా గుర్తించబడ్డ లంబాడాలకు 1950 నుంచి ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు ఏలా ఇస్తారంటూ ప్రశ్నించారు. ఆదివాసీలకు ఓటరు లిస్టు ఆధారంగా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలన్నారు. దర్బార్‌లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు తీర్మాణం చేయాలని ప్రధాన్ పురోహిత్ సంఘం జిల్లా అధ్యక్షుడు అర్క కమ్ము డిమాండ్ చేశారు. కేస్లాపూర్లో గిరిజన బాలికల జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. కేస్లాపూర్ సర్పంచ్ నాగ్నాథ్ మాట్లాడుతూ నాగోబా ఆలయం సమీపంలోని వడమర వద్ద రూ. 50 లక్షలతో షెడ్లు నిర్మించడం ద్వారా మెస్రం వంశీయుల విడిదికి సౌకర్యంగా ఉంటుందన్నారు. ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు బోజ్జు మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పాఠశాలల పిల్లలను ఆశ్రమాలకు తరలించడం వల్ల ఆయా పాఠశాలలు పూర్తిగా మూత పడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశపెద్దలు ఆర్డీవో రాంచంద్రయ్య, ఏవో భీమ్, ఈఈటీడబ్ల్యూ శంకరయ్య, ఏజెన్సీ డీఈవో సనత్‌కుమార్, జీసీడీవో ఇందిరా, ఏఎస్పీ జోయల్ డెవీస్, పీఈటీసీ ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, గుంజాల లిపి అధ్యయన వేదిక కన్వీనర్ జయదీర్ తిరుమల్‌రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు రవీందర్ రావు, నాయకులు రేఖ శ్యాం నాయక్, హరినాయక్, భరత్ చౌహన్, నరేష్, మర్సకోల తిరుపతి, కనక యాదవ్ రావు, తిరుపతి, జమునానాయక్, తుకారం, చంద్రయ్య, మచ్చ శంకరయ్య, రాజేశ్వర్ పాల్గొన్నారు. రాష్ట్ర పండుగగా గుర్తింపు తేవడానికి కృషి చేశాం జిల్లాలో ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా జాతరకు జల్.. జంగల్.. జమీన్ నినాదంలో అడవి బిడ్డల హక్కుల కోసం పోరాడిన కొమురం భీమ్ వర్ధంతి వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తింపు తేవడానికి జిల్లా యంత్రాంగం కృషి చేసి విజయం సాధించిందని కలెక్టర్ అహ్మద్ బాబు అన్నారు. గిరిజన యూనివర్సిటీ కోసం రాష్ట్ర గవర్నర్‌కు మరో సారి ప్రతిపాదనలు పంపించామన్నారు. కొమురం భీమ్ ప్రాజెక్టు ద్వారా ఏజెన్సీలోని నార్నూర్, కెరమెరి, సిర్పూర్(యు), జైనూర్ మండలాలకు శాశ్వత తాగునీటి వసతుల కల్పనకు రూ.68 కోట్లతో పనులు చేస్తున్నామన్నారు. రెండో విడతలో భాగంగా మరో రూ.10 కోట్లు వెచ్చించి ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాలకు తాగునీరు అందించేందుకు పనులు చేపట్టడం జరిగిందన్నారు. గుంజాల గ్రామంలో బయట పడ్డ గోండు లిపి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాన్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో వాచకంను ప్రవేశపెడుతామన్నారు. జిల్లా వ్యాప్తంగా గిరిజన యువతీయువకులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వడానికి ఐదు యూత్ ట్రెయినింగ్ సెంటర్ల ద్వారా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇంద్రవెల్లి మండలంలో రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని, ముత్తునూర్ నుంచి కేస్లాపూర్ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.35 లక్షలు ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు వివరించారు. ఉద్యోగాల భర్తీకోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలో ఉపాధి పథకంలో భాగంగా వంద పని దినాలకు బదులు 150 పని దినాలు గిరిజనులకు కల్పిస్తామన్నారు. - కలెక్టర్ అహ్మద్‌బాబు లోటుపాట్లు ఉంటే మన్నించండి.. నాగోబా జాతర ఏర్పాట్లలో ఏమైన లోటుపాట్లు ఉంటే మన్నించాలని ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్ స్పష్టం చేశారు. జాతరకు రోజుకు 70 వేల మంది భక్తులు వచ్చారన్నారు. గతంలో ఇక్కడ గిరిజన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం డీఎడ్ కళాశాల ఉండేదని, మళ్లీ ఆ కళాశాలను తిరిగి ప్రారంభించేలా ఐటీడీఏ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. - జనార్దన్ నివాస్, ఐటీడీఏ పీవో సమస్యలపై అధికారులు స్పందించడం లేదు.. గిరిజన సమస్యలపై కలెక్టర్, ఐటీడీఏ పీవో స్పందించడం లేదు. ఓ ప్రజాప్రతినిధిగా గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని ఎన్నిమార్లు చెప్పినా పరిష్కరించడం లేదని మండిపడ్డారు. ఏటా గిరిజనులు మృత్యువాత పడుతుంటే పట్టించుకోవడం లేదన్నారు. ఉట్నూర్ కేంద్రంగా ఏరియా ఆస్పత్రిని ఏర్పాటు చేసి గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలి. ఎంతమంది కలెక్టర్లు, పీవోలు వచ్చినా గిరిజనాభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. - సుమన్ రాథోడ్, ఖానాపూర్ ఎమ్మెల్యే ఆదివాసీ దేవుళ్ల రక్షణకు కమిటీ వేయాలి.. ఆదివాసీ సంస్కృతి సంరక్షణకు, ఆదివాసీ దేవుళ్ల రక్షణకు ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా ప్రత్యేక కమిటీ వేయాలి. జిల్లావ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీ దేవుళ్ల భూములు అన్యాక్రాంతం అయ్యాయి. ఏజెన్సీలో గిరిజన యూనివర్సిటీ కోసం తనవంతుగా కృషి చేస్తానన్నారు. - ఆత్రం సక్కు, ఎమ్మెల్యే -
ఆ పాపం ప్రజాప్రతినిధులదే!
జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటును పట్టించుకోని వైనం విద్యార్థుల ఆందోళనల ఫలితం శూన్యం ఇప్పటికైనా స్పందిస్తే మేలు.. ఆందోళనలు ఒకరివి.. ఫలితం మరొకరిది.. అన్న చందంగా తయారైంది జిల్లా గిరిజన విద్యార్థులది. గిరిజన యూనివర్సిటీ కోసం ఉట్నూర్‌లో స్థలం సేకరించగా ఆనంద పడిన విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. నిర్మల్‌లో ఓ యూనివర్సిటీ ఏర్పాటు కానుండడంతో ఇక జిల్లా గిరిజన యూనివర్సిటీ కలగానే మారింది. ఇన్నాళ్లు యూనివర్సిటీ కోసం గిరిజనులు చేసిన ఆందోళనలు వృథా అయ్యాయి. ఉట్నూర్‌లో విశ్వవిద్యాలయం ఏర్పాటైతే ఉద్యోగ, ఉపాధి రంగాల్లో గిరిజనుల అభివృద్ధి సాధ్యమయ్యేది. ఇదంతా జిల్లా ప్రజాప్రతినిధుల వైఫల్యమేనంటూ గిరిజన విద్యార్థిలోకం ముక్తకంఠంతో ఖండిస్తోంది. వారు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరించడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా మరోమారు ప్రయత్నాలు కొనసాగించాలని కోరుతున్నారు. - న్యూస్‌లైన్, ఉట్నూర్ ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో తెలంగాణ రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు అనివార్యమని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అంతేకాకుండా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదించగా.. తెలంగాణ బిల్లులోని పదకొండో అంశంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదన కూడా ఉంది. అయితే.. ఈ యూనివర్సిటీ జిల్లాలోనే ఏర్పాటవుతుందని గిరిజనులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. అంతేగాకుండా తెలంగాణ ఏర్పాటుతో జిల్లా విస్తీర్ణం పెద్దదిగా ఉండడంతో కొత్తగా మంచిర్యాల జిల్లా ఏర్పాటు తప్పదు. దీంతోపాటు జిల్లాలో దాదాపు 70 శాతం మంది గిరిజనులు నివాసం ఉంటున్నారు. 2008లో ప్రకటించినా.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు 2008లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే ఏడాది నవంబర్ 17న జీవో 797 కూ డా విడుదల చేసింది. కేంద్రం నిర్ణయానికి కట్టుబడు తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా 2011 ఆగస్టు 27న జిల్లా లో వర్సిటీ ఏర్పాటుకు జీవో 783 విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనతో జిల్లా, ఐటీడీఏ అధికార యంత్రాంగం ఆదివాసీలకు కేంద్ర స్థానమైన ఉట్నూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనకాల 300 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించింది. అలాగే.. ఏడో నంబరు జాతీయ రహదారికి 34 కిలోమీటర్ల దూరంలో రవాణా సౌకర్యం, హైటెన్షన్ విద్యుత్ సౌకర్యం, తదితర వసతులు ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. గిరిజన ప్రజాప్రతినిధుల పట్టింపేది..? గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై మొదటి నుంచీ గిరిజన ప్రజాప్రతినిధులు పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో మూడు శాసనసభ స్థానాలతోపాటు, ఎంపీ స్థానం నుంచి గిరిజన అభ్యర్థులు పదవుల్లో కొనసాగుతున్నారు. వీరిలో అధికార పార్టీ నుంచి గిరిజన అభ్యర్థి శాసన సభ సభ్యుడిగా ఉండడం కలిసి వచ్చే అంశం. వీరంతా ఏకమై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం తెలిపే అవకాశం లేకపోలేదు. కానీ.. నిర్మల్‌లో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఉన్నత విద్యామండలి మానవ వనరుల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపడం వారి వైఫల్యానికి అద్దంగా నిలుస్తోంది. అయితే.. మంత్రిత్వశాఖకు కేవలం ప్రతిపాదనలు పంపించగా.. ఏర్పాటు చర్యలు వేగవంతం కాకముందే గిరిజన ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మన గిరిజన ప్రజాప్రతినిధులు తమ ప్రయత్నాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలోనే గిరిజనుల సంఖ్య ఎక్కువ.. తెలంగాణ ఏరియాలో జిల్లాలోనే గిరిజనుల సంఖ్య ఎక్కువగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 4,95,794 ఆదివాసీ గిరిజన జనాభా ఉంది. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది తెగలకు పైగా ఆదివాసీ గిరిజనులు జీవిస్తున్నారు. గోండులు 2,63,515, లంబాడీలు 1,12,793, కోలాంలు 38,176, పర్ధాన్లు 26,029, మన్నెవార్లు 15,370, నాయక్‌పోడ్‌లు 5,206, తోటిలు 2,231, ఎరుకల 1,735, కోయా, ఇతర తెగలు 30,739 చొప్పున ఉన్నారు. జిల్లాలో వర్సిటీ ఏర్పాటైతే గిరిజనుల్లో ఉన్నత విద్యా ప్రమాణాలు పెరిగి జాతీయ, ప్రపంచ స్థాయిలో రాణించేందుకు అవకాశం ఉంటుంది. -
గిరిజన యూనివర్సిటీ కలేనా?
ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఉట్నూర్ కేంద్రంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటవుతుందని ఆశించిన గిరిజనుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. నిర్మల్‌లో యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించడంతో గిరిజన యూనివర్సిటీపై నీలినీడలు కమ్ముకున్నాయి. కేంద్ర కేబినెట్ ఆమోదించిన తెలంగాణ బిల్లు పదకొండో అంశంలో గిరిజన యూనివర్సిటీ అంశం ఉంది. ఉట్నూర్‌లో గిరిజనులు అధికంగా ఉండటంతో ఇక్కడే ఏర్పాటు చేస్తారని అడవిబిడ్డలు ఆశలు పెంచుకున్నారు. ప్రస్తుతం నిర్మల్‌లో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన విశ్వవిద్యాలయం కోసం ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరిస్తున్నారు. 2008 నుంచి యూనివర్సిటీ ప్రస్తావన కేంద్ర ప్రభుత్వం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు 2008 నవంబర్ 17న జీవో నంబర్ 797ను విడుదల చేసింది. కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 2011 ఆగస్టు 27న జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుకు జీవో నంబర్ 783ను జారీ చేసింది. ఇలా కేంద్ర, రాష్ట్రాల ప్రకటనతో ఏజెన్సీ కేంద్రంగా యూనివర్సిటీ ఏర్పాటవుతుందని భావించిన జిల్లా, ఐటీడీఏ అధికార యంత్రాంగం ఉట్నూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనకాల 470 ఎకరాల ప్రభుత్వ పరం పోగు భూమిలో 300 ఎకరాలు గుర్తించారు. అలాగే ఏడో నంబరు జాతీయ రహదారికి 34 కి.మీ.ల దూరంలో రవాణా సౌకర్యం, హైటెన్షన్ విద్యుత్తు సౌకర్యాలు ఉన్నట్లు ఐటీడీఏ, జిల్లా అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. దీనికి తోడు యూనివర్సిటీని ఏజెన్సీ కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ 2008 నుంచి గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుతో ఏజెన్సీలో యూనివర్సిటీ ఏర్పాటవుతుందని గిరిజనులు అనుకుంటున్న తరుణంలో ప్రభుత్వం నిర్మల్‌లో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపడంతో గిరిజనులు మండి పడుతున్నారు. జిల్లా ఒక్క యూనివర్సిటీ ఏర్పాటు జరిగిందంటే ఏజెన్సీ కేంద్రంలో మరో యూనివర్సిటీ ఏర్పాటు సాధ్యం కాకపోవచ్చని పరిశీలకులు పేర్కొంటున్నారు. దీంతో యూనివర్సిటీ ఏర్పాటు కలగా మారుతుందని గిరిజనులు అవేదన వ్యక్తం చెస్తూన్నారు. -
మైనింగ్ విశ్వవిద్యాలయంపైనా నీలినీడలు
ఖమ్మం, న్యూస్‌లైన్ : రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్(రూసా) ప్రతిపాదనల్లో ఖమ్మం పేరు లేకపోవడం జిల్లావాసులను నిరాశకు గురిచేసింది. గిరిజనులు అధికంగా ఉన్న జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కలగానే మిగలనుంది. జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ఉన్నత విద్యామండలి విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు పైనా నీలినీడలు అలుముకున్నాయి. అటు గిరిజన విశ్వవిద్యాలయం, ఇటు మైనింగ్ యూనివర్సిటీ రెండూ జిల్లాకు వచ్చే అవకాశాలు లేకపోవడంతో విద్యార్థి సంఘాల నాయకులు ఉద్యమబాట పడుతున్నారు. యూనివర్సిటీ ఏర్పాటుకు అన్ని విధాలా అర్హత కలిగిన జిల్లాలో కాకుండా ఇతర ప్రాంతాలకు తరలించడంపై జిల్లా ప్రజాప్రతినిధులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదవాడికి పెద్ద చదువులు భారం కాకూడదని, అందరికీ అందుబాటులో విద్య ఉండాలనే ఆలోచనతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రతి జిల్లాకు యూనివర్సిటీ నెలకొల్పాలని భావించడంతో పాటు పలు జిల్లాల్లో ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలో 46 మండలాలకు గాను 29 మండలాలు ఏజెన్సీ ప్రాంతంలో ఉండగా 8 లక్షల మందికి పైగా గిరిజనులు ఉన్నారు. గిరిజన జనాభా అధికంగా ఉన్నందున జిల్లాలో గిరిజన యూనివర్సిటీ, అపారమైన ఖనిజ సంపద ఉండటంతో మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని భావించారు. దీనిని సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లాలోని భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాల్లో యూనివర్సిటీ ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని పరిశీలించి, జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ ప్రభుత్వానికి నివేదిక అందించారు. దీనిపై సంతృప్తి చెందిన ఉన్నత విద్యామండలి అధికారులు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు అంగీకరించారు. మహానేత మరణానంతరం ఈ విషయం మరుగున పడిపోయింది. ఆ తర్వాత కేంద్ర మంత్రి పురంధేశ్వరి గిరిజన యూనివర్సిటీని విశాఖపట్నంలో నెలకొల్పేందుకు ప్రయత్నించారు. ఆ దిశగా ఢిల్లీలో పావులు కదిపారు. దీంతో ఈ విషయంపై ముఖ్యమంత్రికి, ఇతర అధికారులకు జిల్లాలోని విద్యార్థి, గిరిజన సంఘాల నాయకులు వినతిపత్రాలు అందజేశారు. యూనివర్సిటీని జిల్లాలోనే నెలకొల్పాలని వేడుకున్నారు. రూసా ప్రతిపాదనలో కనిపించని జిల్లా పేరు... రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్(రూసా) పథకం కింద రాష్ట్రంలో రానున్న మూడు సంవత్సరాల్లో తొమ్మిది కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇటీవల ఉప కులపతులతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఇందులో గిరిజన యూనివర్సిటీల ఏర్పాటుకు అదిలాబాద్ జిల్లా ఉట్నూర్, విశాఖపట్నం జిల్లా పాడేరును ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా జిల్లాలోని కొత్తగూడెం లేదా ఒంగోలులోని ఏదో ఒక ప్రాంతంలో నెలకొల్పాలని అభిప్రాయపడ్డారు. దీంతో జిల్లాకు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు హుళక్కేనని, మైనింగ్ యూనివర్సిటీపై కూడా నీలినీడలు అలుముకున్నాయని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. యూనివర్సిటీల ఏర్పాటు జిల్లా అనువైనది... మైనింగ్, గిరిజన యూనివర్సిటీల ఏర్పాటుకు ఖమ్మం జిల్లానే అనువైనదని విద్యావేత్తలు అంటున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా 8 లక్షల మంది గిరిజనులు జిల్లాలో నివసిస్తున్నారు. అదే అదిలాబాద్‌లో 5 లక్షల మంది కూడా గిరిజనులు లేరు. జిల్లాలోని ఇల్లెందు ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే అటు వంరగల్ జిల్లా గిరిజనులకు కూడా అనుకూలంగా ఉంటుందని వారంటున్నారు. మైనింగ్ వర్సిటీ ఏర్పాటుకు కూడా ఒంగోలుతో పోలిస్తే మన జిల్లానే శ్రేయస్కరమని మైనింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కొత్తగూడెంలో మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాల ఉంది. 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కళాశాలలో మైనింగ్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ఐటీ కోర్సులు బోధిస్తున్నారు. దీంతోపాటు ఈ ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపద, వీటి ఆధారంగా సింగరేణి, కేటీపీఎస్, హెవీవాటర్ ప్లాంట్, ఐటీసీ, ఇతర పరిశ్రమలు ఉన్నాయి. గ్రానైట్, ఐరన్‌ఓర్, అబ్రకం, పాలరాయి. బాక్సైట్, డోలమైట్ మొదలగు ఖనిజాలు జిల్లాలో ఉన్నాయి. వీటితో మైనింగ్ విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆందోళన బాటలో విద్యార్థి సంఘాలు... జిల్లాలో మైనింగ్, గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని, వీటిని ఇతర ప్రాంతాలకు తరలించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని పలు విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పడుతున్నాయి. యూనివర్సిటీల ఏర్పాటుకు అన్ని అర్హతలున్న ఈ జిల్లాలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఏర్పాటుకు కుట్ర పన్నుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రాజకీయ లబ్ధికోసం విద్యార్థులకు నష్టం కలిగించవద్దని కోరుతున్నారు. -
గిరిజన యూనివర్సిటీపై ఆశలు
ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం 2008 నవంబర్ 17న జీవో నంబర్ 797ను విడుదల చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 2011 ఆగస్టు 27న జిల్లాలో యూనివర్సిటీ కోసం జీవో నంబర్ 783ను విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్రాల ప్రకటనతో జిల్లా, ఐటీడీఏ అధికార యంత్రాంగం ఉట్నూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనకాల 470 ఎకరాల పరం పోగు భూమిలో 300 ఎకరాలు గుర్తించింది. అలాగే ఏడో నంబర్ జాతీయ రహదారికి 34 కిలోమీటర్ల దూరంలో రవాణ సౌకర్యం, హైటెన్షన్ విద్యుత్తు తదితర సౌకర్యాలు ఉన్నట్లు అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ఆదిలోనే అడ్డుకట్ట జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వాలు ప్రకటించడంతో ఇతర జిల్లాలోని ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో యూనివర్సిటీ జిల్లాలో కాకుండా ఖమ్మం జిల్లా భద్రాచలం, విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. జిల్లాలోనే గిరిజన యునివర్సిటీ ఏర్పాటు చేయాలని అప్పట్లో అందోళనలు జరిగాయి. వర్సిటీ ఏర్పాటు కోరుతూ హైదరాబాద్ వరకు ప్రస్తుత ఉట్నూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆశారెడ్డి తన పదెళ్ల కుమారుడు సాయికుమార్‌తో కలిసి 340 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమం తీవ్రం కావడంతో యూనివర్సిటీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదన అటకెక్కిందని అంతా భావించారు. తాజాగా కేంద్రం పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం.. కేంద్ర కేబినెట్ నోట్లోని పదకొండో అంశంలో విద్యాపరమైన అంశాల్లో తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదన ఉండటంతో జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు ఖాయంగా కనిపిస్తుంది. గిరిజనులు అత్యధికంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో కొత్త రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, ఖమ్మం జిల్లా భద్రాచలం, వరంగల్ జిల్లా ఎటురునాగారం, మహబూబ్‌నగర్ జిల్లా సుండిపేటలో ఐటీడీఏలు ఉన్నాయి. ఈ జిల్లాలన్నింటిలో ఆదివాసీ గిరిజనులు అధికంగా ఉన్న జిల్లా ఆదిలాబాద్ జిల్లాలనే. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 4,95,794 ఆదివాసీ గిరిజనులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా తొమ్మిదికి పైగా ఆదివాసీ గిరిజన తెగలు జీవిస్తున్నాయి. ఇతర జిల్లాల్లో మనకంటే తక్కువగా గిరిజనులు ఉన్నారు. జిల్లాలో గోండులు 2,63,515, లంబాడాలు 1,12,793, కోలాంలు 38,176, పర్దాన్లు 26,029, మన్నెవార్లు 15,370, నాయక్‌పోడ్‌లు 5,206, తోటీలు 2,231, ఎరుకల 1,735, ఇతర తెగలు 30,739 చొప్పున జనాభా నివసిస్తున్నారు. గిరిజన యూనివర్సిటీ జిల్లాలో ఏర్పాటు కావడం వల్ల గిరిజనులు అన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. గిరిజనులకే కాకుండా గిరిజనేతరులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వర్సిటీ వల్ల గిరిజనుల్లో ఉన్నత విద్యా ప్రమాణాలు పెరిగి జాతీయ, ప్రపంచస్థాయిలో గిరిజనులు వివిధ రంగాల్లో రాణించే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులపైనే భారం జిల్లాకు గిరిజన యూనివర్సిటీ రావాలంటే జిల్లా ప్రజాప్రతినిధులే కీలకమని అడవిబిడ్డలు భావిస్తున్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయాలను పక్కన బెట్టి జిల్లాలో ఉన్న పది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఏకతాటిపైకి వచ్చి ప్రయత్నిస్తే యూనివర్సిటీ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. అన్ని సౌకర్యాలున్న ఆదిలాబాద్ జిల్లాలో కాకుండా వేరే జిల్లాకు యూనివర్సిటీ తరలిపోతే అది మన జిల్లా ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యమే అవుతుంది. యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఏ విధమైన ఒత్తిడి తెస్తారో చూడాలి. -
గిరిజన యూనివర్సిటీపై ఆశలు
ఉట్నూర్, న్యూస్‌లైన్ :ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం 2008 నవంబర్ 17న జీవో నంబర్ 797ను విడుదల చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 2011 ఆగస్టు 27న జిల్లాలో యూనివర్సిటీ కోసం జీవో నంబర్ 783ను విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్రాల ప్రకటనతో జిల్లా, ఐటీడీఏ అధికార యంత్రాంగం ఉట్నూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనకాల 470 ఎకరాల పరం పోగు భూమిలో 300 ఎకరాలు గుర్తించింది. అలాగే ఏడో నంబర్ జాతీయ రహదారికి 34 కిలోమీటర్ల దూరంలో రవాణ సౌకర్యం, హైటెన్షన్ విద్యుత్తు తదితర సౌకర్యాలు ఉన్నట్లు అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ఆదిలోనే అడ్డుకట్ట జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వాలు ప్రకటించడంతో ఇతర జిల్లాలోని ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో యూనివర్సిటీ జిల్లాలో కాకుండా ఖమ్మం జిల్లా భద్రాచలం, విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. జిల్లాలోనే గిరిజన యునివర్సిటీ ఏర్పాటు చేయాలని అప్పట్లో అందోళనలు జరిగాయి. వర్సిటీ ఏర్పాటు కోరుతూ హైదరాబాద్ వరకు ప్రస్తుత ఉట్నూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆశారెడ్డి తన పదెళ్ల కుమారుడు సాయికుమార్‌తో కలిసి 340 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమం తీవ్రం కావడంతో యూనివర్సిటీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదన అటకెక్కిందని అంతా భావించారు. తాజాగా కేంద్రం పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం.. కేంద్ర కేబినెట్ నోట్లోని పదకొండో అంశంలో విద్యాపరమైన అంశాల్లో తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదన ఉండటంతో జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు ఖాయంగా కనిపిస్తుంది. గిరిజనులు అత్యధికంగా ఉన్న ప్రాంతం ఆదిలాబాద్ జిల్లానే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో కొత్త రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, ఖమ్మం జిల్లా భద్రాచలం, వరంగల్ జిల్లా ఎటురునాగారం, మహబూబ్‌నగర్ జిల్లా సుండిపేటలో ఐటీడీఏలు ఉన్నాయి. ఈ జిల్లాలన్నింటిలో ఆదివాసీ గిరిజనులు అధికంగా ఉన్న జిల్లా ఆదిలాబాద్ జిల్లాలనే. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 4,95,794 ఆదివాసీ గిరిజనులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా తొమ్మిదికి పైగా ఆదివాసీ గిరిజన తెగలు జీవిస్తున్నాయి. ఇతర జిల్లాల్లో మనకంటే తక్కువగా గిరిజనులు ఉన్నారు. జిల్లాలో గోండులు 2,63,515, లంబాడాలు 1,12,793, కోలాంలు 38,176, పర్దాన్లు 26,029, మన్నెవార్లు 15,370, నాయక్‌పోడ్‌లు 5,206, తోటీలు 2,231, ఎరుకల 1,735, ఇతర తెగలు 30,739 చొప్పున జనాభా నివసిస్తున్నారు. గిరిజన యూనివర్సిటీ జిల్లాలో ఏర్పాటు కావడం వల్ల గిరిజనులు అన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. గిరిజనులకే కాకుండా గిరిజనేతరులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వర్సిటీ వల్ల గిరిజనుల్లో ఉన్నత విద్యా ప్రమాణాలు పెరిగి జాతీయ, ప్రపంచస్థాయిలో గిరిజనులు వివిధ రంగాల్లో రాణించే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులపైనే భారం జిల్లాకు గిరిజన యూనివర్సిటీ రావాలంటే జిల్లా ప్రజాప్రతినిధులే కీలకమని అడవిబిడ్డలు భావిస్తున్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయాలను పక్కన బెట్టి జిల్లాలో ఉన్న పది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఏకతాటిపైకి వచ్చి ప్రయత్నిస్తే యూనివర్సిటీ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. అన్ని సౌకర్యాలున్న ఆదిలాబాద్ జిల్లాలో కాకుండా వేరే జిల్లాకు యూనివర్సిటీ తరలిపోతే అది మన జిల్లా ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యమే అవుతుంది. యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఏ విధమైన ఒత్తిడి తెస్తారో చూడాలి. యూనివర్సిటీ కోసం ఉద్యమిస్తాం.. గిరిజన యునివర్సిటీ ఏర్పాటు ద్వారా జిల్లా గిరిజనులే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉండే గిరిజనులకు మేలు జరుగుతుంది. ఆదివాసీ గిరిజనులు అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుంది. విద్యా ప్రమాణాలు మెరుగు పడుతాయి. ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు విడుదల చేయడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. జిల్లాలోనే వర్సిటీ ఏర్పాటు కోసం అవసరమైతే ఉద్యమిస్తాం. - వెడ్మా బోజ్జు, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు