సాక్షి, మహబూబ్‌నగర్: ప్రధాని మోదీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు పలు వరాలను ప్రకటించారు. తెలంగాణలో పసుపు బోర్డు, సమక్క సారక్క పేరుతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్టు స్పష్టం చేశారు.
కాగా, ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నా కుటుంబ సభ్యులారా చాలా సంతోషంగా ఉంది అని తెలుగులో మాట్లాడారు. పలుమార్లు నా కుటుంబ సభ్యులారా అని ప్రసంగించారు. ఈ క్రమంలోనే కీలక ప్రకటనలు చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. పాలమూరు సభ సాక్షిగా రాష్ట్రంలో పసుపు రైతుల కోసం నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డు చేస్తున్నామన్నారు. తెలంగాణలో పసుపు పంట విస్తృతంగా పండుతోంది. పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది.
ఇదే సమయంలో ములుగు జిల్లాలో సమక్క సారక్క పేరుతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. రూ.900 కోట్లతో సమ్మక-సారలమ్మ పేరుతో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ అని పేర్కొన్నారు. ఈ సందర్బంగా పాలుమూరు సభలో రాజకీయాల గురించి మాట్లాడతానని హింట్ ఇచ్చారు.
తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. నేడు అనేక రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్‌లు ప్రారంభించుకున్నాం. రోడ్డు, రైలు కనెక్టివిటీతోనే అభివృద్ధి ముడిపడి ఉంది. ర్లమెంట్‌లో మహిళా బిల్లు ఆమోదించుకున్నాం. పార్లమెంట్‌లో నారీ శక్తి బిల్లును ఆమోదించుకున్నాం. దేశంలో పండుగల సీజన్ నడుస్తోంది. నవరాత్రికి ముందే శక్తి పూజలు ప్రారంభించుకున్నాం. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ ప్రాజెక్ట్‌ల ద్వారా అభివృద్ధి జరుగుతుంది. రవాణా సదుపాయాలు మెరుగవుతాయి అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment