మహబూబ్‌నగర్ న్యూటౌన్: బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో పాలమూరు జిల్లాలో పారుతున్న కృష్ణానదిని పట్టించుకోలేదని.. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రాష్ట్రాన్ని కుదువపెట్టారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్ర మార్క ఆరోపించారు. రైతు పండుగ సభలో ఆయన మాట్లాడా రు. కృష్ణా నీళ్లను పాల మూరుతో పాటు పక్కనున్న రంగారెడ్డి, నల్ల గొండ జిల్లాలకు ఇవ్వాలని ఆలో చన చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమేని చెప్పారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలేదు. అప్పుడే బీఆర్‌ఎస్ నాయకు లు ప్రజల వద్దకు వెళ్తాం. ఉద్యమాలు చేస్తాం, నిల దీస్తామని చెప్పడం చూస్తే నవ్వు వస్తోంది. పకడ్బందీగా ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టి వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తుంటే.. ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఒకాయన అంటాడు.
ఇంకో ఆయన వచ్చి ఉద్యమం చేస్తానని చెప్తాడు. ఇది సిగ్గు చేటు. ఇది దొరల ప్రభుత్వం కాదు. ప్రజల కోసం పనిచేసే ప్రజా ప్రభుత్వం. ఇచ్చిన హామీ మేరకు ఎన్ని కష్టాలు వచ్చినా పథకాలు అమలు చేసి తీరుతాం’’ అని భట్టి పేర్కొన్నారు. తాము రు ణమాఫీ చేయడం మాత్రమే కా కుండా... పంట నష్టపోయిన రైతు లకు పరిహారం కింద రూ. 100 కోట్లు విడుదల చేశామని తెలిపా రు. పంటల బీమా కింద ప్రభు త్వమే రాష్ట్రంలోని 50 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 1,433 కోట్ల ప్రీమియం చెల్లించిందని భట్టి తెలిపారు. బడ్జెట్‌లో రూ.73 వేల కోట్లు కేటాయించి వ్యవసాయాన్ని పండుగలా చేసిన ఘ నత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. మహిళలను కోటీశ్వరులను చేసేందుకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
రూ.2,747 కోట్లు రుణమాఫీ సొమ్ము విడుదల
రైతు పండుగ ముగింపు సందర్భంగా నాలుగో విడత రుణమాఫీ కింద రూ.2,747 కోట్లు విడుదల చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. అదేవిధంగా 255 స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ చెక్కును అందజేశారు. సమావేశంలో మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు.
రైతు సంక్షేమం మొదలైంది వైఎస్సార్ హయాం నుంచే..
రైతు పండుగ సభలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకోసం కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను గుర్తు చేసుకు న్నారు. మొదట రైతులకు రుణమాఫీ చేసినది, ఉచిత కరెంట్ ఇచ్చినది వైఎస్సార్ హయాంలోనేనని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎనిమిది లక్షల ఎకరాలకు నీరందించేలా ప్రాజెక్టులు రూపొందించారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మొదటిసారిగా రైతు రుణమాఫీ చేసినది వైఎస్ అని మంత్రి దామోదర రాజనర్సింహ గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ రైతుల ప్రభుత్వమని, వైఎస్సార్ హయాం నుంచీ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment