Bhatti Vikramarka Mallu
-
ఎల్ఆర్ఎస్కు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న లేఅవుట్ల క్రమబధ్దీకరణ పథకానికి (ఎల్ఆర్ఎస్)కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. బుధవారం సచివాలయంలో ఎల్ఆర్ఎస్ అంశంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఉన్నతస్థాయిలో సమీక్షించారు. ఎల్ఆర్ఎస్ పథకం అమలును వేగవంతం చేయాలని నిర్ణయించారు. 2021లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకొన్నవారిలో.. 2020 ఆగస్టు 28కు ముందు నాటి అక్రమ లేఅవుట్లనే క్రమబధ్దీకరించనున్నారు. మార్చి 31వ తేదీలోపు పూర్తిగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించినవారికి 25శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకోని వారికి, లేఅవుట్లలో పెద్ద సంఖ్యలో విక్రయం కాకుండా ఉన్న ప్లాట్ల క్రమబధ్దీకరణకు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక లేఅవుట్లో 10శాతం ప్లాట్లు రిజిస్టరై.. 90శాతం ప్లాట్లు మిగిలిపోయినా ఎల్ఆర్ఎస్ పథకంలో రెగ్యులరైజేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్లాట్లు కొనుగోలు చేసి సేల్‌డీడ్ రిజి్రస్టేషన్ కలిగిన వారికి కూడా క్రమబధ్దీకరణ చాన్స్ ఇచ్చారు. ఈ కేటగిరీల వారికి కూడా మార్చి 31లోగా ఎల్ఆర్ఎస్ చేసుకుంటే, ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని రోజు వారీగా సమీక్షించాలని కూడా నిర్ణయానికి వచ్చారు. పేదల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రులు విజ్ఞప్తి చేశారు. నిషేధిత భూముల జాబితా పట్ల అప్రమత్తం ఎల్ఆర్ఎస్కు సంబంధించి నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో జాగ్రత్త వహించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. సాధారణ ప్రజలు ఇబ్బంది పడకుండా ఎల్ఆర్ఎస్ పథకాన్ని సులభతరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ కోసం జనం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా.. సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్దనే చెల్లింపులు చేసి ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, దాన కిషోర్, నవీన్ మిట్టల్, జయేశ్ రంజన్, స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్స్ కమిషనర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి, హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. రూ.20 వేల కోట్ల రాబడి అంచనా రాష్ట్రంలో 2021లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకానికి శ్రీకారం చుట్టింది. దానికి రాష్ట్రవ్యాప్తంగా 25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కానీ కోర్టు కేసుల కారణంగా ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసింది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎల్ఆర్ఎస్పై దృష్టి పెట్టింది. అప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు తగిన ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబధ్దీకరించుకొనేందుకు చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయం అమల్లోకి రావడానికి ఆలస్యమైంది. తాజాగా బుధవారం మంత్రులు సమావేశమై ఎల్ఆర్ఎస్కు ఆమోదం తెలిపారు. మార్చి 31వ తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా రాష్ట్ర ఖజానాకు సుమారు రూ.20 వేల కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక వేగంగా దరఖాస్తుల పరిశీలన రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులు సుమారు 25.67 లక్షలు. ఇందులో 13,844 దరఖాస్తులకు సంబంధించి రూ.107.01 కోట్లు చెల్లింపు కూడా పూర్తయింది. మరో 9.21 లక్షల దరఖాస్తులను పరిశీలించి ఎల్ఆర్ఎస్కు ఆమోదయోగ్యమైనవిగా గుర్తించారు. ఫీజు చెల్లించాలని నోటీసులు కూడా జారీ చేశారు. ఇంకా ఆయా నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, గ్రామ పంచాయతీల పరిధిలో వచ్చిన మిగతా సుమారు 16 లక్షల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఇకపై వేగవంగా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. -
ఆ జిల్లాల్లో ఇందిరమ్మ నిర్మాణాలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వర్తించని ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో వెంటనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్లు భాగమైనందున ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇళ్లు నిర్మించే పనులకు శ్రీకారం చుట్టాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌తోపాటు రంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభించాలని ఆదేశించారు. శనివారం సచివాలయంలో రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై ఆయన సమీక్షించారు. బడ్జెట్ ప్రతిపాదనలను వాస్తవిక అంచనాల మేరకు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమా లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బడ్జెట్ రూపొందించాలని సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ ఐజీ జ్యోతి బుద్ధప్రకాశ్, గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్, సమాచార శాఖ కమిషనర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు. భూములపై నిరంతర పర్యవేక్షణ రెవెన్యూ శాఖ సమీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ ప్రభుత్వ భూములపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. కోట్ల రూపాయల విలువైన భూములు ప్రభుత్వం చేజారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కోర్టు కేసుల్లో ఉన్న భూములను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని కోరారు. సినిమా రంగాన్ని ప్రోత్సహించడంతోపాటు సమాజ వికాసానికి దోహదపడే విధంగా లఘుచిత్రాలను తీసుకువచ్చేందుకు నిధులు కేటాయిస్తామని చెప్పారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ల చుట్టూ పేద, మధ్య తరగతి ప్రజల కోసం శాటిలైట్ టౌన్షిప్ నిర్మాణాలపై హౌజింగ్ శాఖ దృష్టి సారించాలన్నారు. హైదరాబాద్‌లోని మధ్య తరగతి ప్రజల సొంతింటి కల సాకారం చేసేందుకు ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ ఇళ్ల నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించి, రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు పంపడం ద్వారా భూసేకరణ చేసుకోవాలని సూచించారు. ఇక, రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వేకు సంబంధించి అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, అద్దె భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ కార్యాలయాల జాబితాను సేకరించాలని, ప్రతి నెలా ఈ అద్దెలను చెల్లించేలా ఆర్థిక శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహకాల్లో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ విద్యుత్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. -
ఆర్డీఎస్ఎస్ పథకంలో చేరతాం: భట్టి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్)లో రాష్ట్రం చేరనుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం రాత్రి ప్రజాభవన్‌లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యుత్ శాఖ తీసుకుంటున్న చర్యలను, సాధించిన పురోగతిని వివరించారు.కేంద్రం 2021 ఆగస్టు 17న ప్రవేశపెట్టిన ఆర్డీఎస్ఎస్ పథకంలో రాష్ట్రం చేరినా, కేంద్రం పెట్టే షరతుల్లో భాగంగా వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగించే ప్రసక్తే లేదన్నారు. రామగుండంలో తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలోనే 800 మెగావాట్ల కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తామని తెలిపారు. గతంలో తాము పేర్కొన్నట్టు ఇందులో సింగరేణి సంస్థ భాగస్వామ్యం ఉండదన్నారు. ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 16,877 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేశామని, రాష్ట్రం 21,398 మెగావాట్ల గరిష్ట విద్యుత్ సరఫరా సామరŠాధ్యన్ని కలిగి ఉండడంతో ఇబ్బంది ఉండదన్నారు.రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ 2030 నాటికి 24 వేల మెగావాట్లు, 2035 నాటికి 31,809 మెగావాట్లకు పెరగనుందని అంచనా వేశామని చెప్పారు. భవిష్యత్తు విద్యుత్ అవసరాలను తీర్చేందుకుగాను ఇటీవల న్యూ ఎనర్జీ పాలసీని ప్రకటించామన్నారు. 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. విద్యుత్ సబ్సిడీల కింద గతేడాది డిస్కంలకు 18,615 కోట్లను చెల్లించినట్టు భట్టి వెల్లడించారు. -
ఆర్ఆర్ఆర్కి నిధుల కొరత లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌ను వచ్చేనెల ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రీ బడ్జెట్ సమావేశాలను చేపట్టారు. గురువారం సచివాలయంలో ఆయా శాఖలకు కేటాయింపులకు సంబంధించి రహదారు లు – భవనాలు, బీసీ సంక్షేమ శాఖల మంత్రులు, అధికారు లతో సమావేశమయ్యారు, ఆర్‌అండ్‌బీకి సంబంధించి ఆర్ఆర్ఆర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని భట్టి, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికా రులను ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డు సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) 3డి డిజైన్లు వంటి పనులను సత్వరం పూర్తిచేయాలని, ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం చేశా రు.ఎంత వేగంగా పనులు చేపడితే అంత వేగంగా నిధులు మంజూరు చేస్తామని భట్టి అధికారులకు భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్అండ్బీ శాఖకు ఉన్న ఆస్తులపై నివేదిక రూపొందించాలని, విలువైన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి వచ్చే రహదారులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం మేరకు రోడ్లు, భవనాల శాఖ అధికారులు పనులు చేపట్టి నిధులు సద్వినియోగం చేయాలని ఆదేశించారు.కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఆర్అండ్బీ శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఏవియేషన్ రంగానికి తగిన ప్రోత్సాహం అందిస్తామని మంత్రులు తెలిపారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, వికాస్‌రాజ్, డిప్యూటీ సీ ఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, సెక్రటరీ దాసరి హరిచందన, ఆర్థిక శాఖ సెక్రటరీ హరిత తదితరులు పాల్గొన్నారు.హాస్టళ్ల, గురుకులాల బకాయిలు చెల్లిస్తాం..అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ హాస్టళ్ల, గురుకులాల అద్దె బకాయిలు వెంటనే చెల్లిస్తామని అందుకు, ప్రతిపాదనలు తీసుకురావాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ప్రీబడ్జెట్ సమావేశం నిర్వహించారు. బీసీ స్టడీ సెంటర్లు ఉద్యోగ కల్పన కేంద్రాలుగా ఉండాలని భట్టి అధికారులను ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ క్యాలెండర్‌ను అనుసరించి స్టడీ సెంటర్లలో కోచింగ్ నిర్వహించాలని కోరారు.డీఎస్సీ, బ్యాంకింగ్ వంటి పరీక్షలపైన దృష్టి సారించాలని ఆదేశించారు. ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలు.. వాటి నిర్వహణకు అవసరమైన చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై కూడా సమావేశంలో చర్చించారు. ఆర్టీసీ ఆస్తులు, నిర్వహణ, ఆదాయ వనరులపై మంత్రులు అధికారులను అడిగారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.32,024 కోట్లు వెంటనే ఇవ్వండి: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రూ.32,024 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ నివాసంలో నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిధుల వివరాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ మార్గాల్లో రావాల్సిన నిధులకు సంబంధించి గతంలో రాసిన లేఖలను సైతం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం సహాయం చేసే పథకాలతోపాటు ప్రాయోజిత పథకాలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి గ్రాంటు, షెడ్యూల్ 9 క్రింద ఉన్న సంస్థల నిర్వహణ కోసం అయ్యే ఖర్చు, విద్యుత్ కొనుగోళ్ల కోసం ఖర్చు చేసిన నిధులు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద తీసుకున్న నిధులు అన్ని కలిపి రూ.32,024 కోట్లను ఇవ్వాలని కోరారు. ఏపీ నుంచి బకాయిలు ఇప్పించండి హైదరాబాద్‌లోని పలు రాజ్యాంగ సంస్థల భవనాల నిర్వహణ ఖర్చుల కింద ఏపీ ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.408 కోట్లను వెంటనే ఇప్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని భట్టి కోరారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం– 2014లోని సెక్షన్ 56 (2) ప్రకారం రావాల్సిన రూ.208.24 కోట్లను కూడా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా భట్టి వెంట ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్‌రెడ్డి, బలరాం నాయక్, అధికారులు ఉన్నారు. -
కేంద్ర మంత్రిని కలిసిన భట్టి విక్రమార్క
ఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. శనివారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ను సఫ్దర్ జంగ్ రోడ్డులోని ఆమె అధికారిక నివాసంలో కలిసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క .. రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ అంశాల్లో రావలసిన ఆర్థిక వనరులకు సంబంధించి విజ్ఞప్తి చేశారు. గతంలో ఈ అంశాలకు సంబంధించి రాసిన లేఖలను సైతం ఆమెకు అందజేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంట.. డిప్యూటీ సీఎం వెంట స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఎంపీలు మల్లు రవి,చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్ తదితరులు ఉన్నారు1.వివిధ కార్పొరేషన్లు/SPVల రుణ పునర్వవ్యవస్థీకరణ (Restructuring of Debt) – ఆర్థిక సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.2. తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. 4,08,48,54,461 తిరిగి చెల్లింపును వేగవంతం చేయాలని కోరారు.3. ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యవస్థీకరణ చట్టం, 2014 కింద, విభాగం 94(2) ప్రకారం, తెలంగాణకు రావలసిన వెనుకబాటుగా ఉన్న జిల్లాల కోసం ప్రత్యేక సహాయ నిధి విడుదల చేయాలని కోరారు.4.2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రంగా ప్రయోజిత పథకాల నిధుల విడుదలలో జరిగిన కేటాయింపు పొరపాటు సరిచేయాలని విజ్ఞప్తి చేశారు.5.ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యవస్థీకరణచట్టం, 2014 లోని విభాగం 56(2) ప్రకారం రూ. 208.24 కోట్లు తిరిగి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. 6.ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయించిన అదనపు బాద్యత (Excess Liability) మేరకు అందుకోవలసిన మొత్తానికి సంబంధించిన అంశం పైన చర్చించారు.7. ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యవస్థీకరణ చట్టం, 2014 కింద నిధుల బదిలీ (Transfer of Funds) కోరుతూ విజ్ఞప్తి చేశారు.8.ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పవర్ యుటిలిటీల మధ్య పెండింగ్‌లో ఉన్న బకాయిల పరిష్కారం చేయాలని కోరారు. -
ఎలా ఎదుర్కొందాం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పలు పాలనా అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) మంత్రులందరితో సమావేశమ య్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్కలు శనివారం ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 7:45 నిమిషాల వరకు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. దాదాపు 9గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో అధికారులు, సిబ్బందిని దూరంగా ఉంచిన మంత్రులు అనేక అంశాలపై మనసు విప్పి మాట్లాడుకున్నట్టు సమాచారం. ఈ నెల5న అసెంబ్లీ భేటీ...? బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు, ఇటీవల రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కులగణన గురించి సీఎం, మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. ⇒ బీసీ రిజర్వేషన్ల విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేలా ముందుకెళ్లాలని, ఇటీవల చేపట్టిన కులగణన రిపోర్టును కోర్టు ముందుంచి బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఎలాంటి అడ్డంకి లేకుండా చూడాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈనెల 5వ తేదీన అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచి స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతానికి తగ్గకుండా రిజర్వేషన్లు కల్పించేలా కేంద్రం చొరవ తీసుకోవాలని తీర్మానం చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ⇒ ఎస్సీల వర్గీకరణ అంశంపై కూడా మంత్రులతో సీఎం చర్చించారని, రాజకీయంగా విమర్శలు రాకుండా వీలున్నంత త్వరగా రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణను అమలు చేయాలని, ఎన్నికల కోడ్ ముగిశాక ఈ విషయంలో ప్రభుత్వ విధానాన్ని స్పష్టంగా మరోమారు⇒ త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా మంత్రులు చర్చించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి గెలుపొందే ప్రణాళికలు రూపొందించే బాధ్యతలు మంత్రులు దామోదర, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్లకు అప్పగించారు. ⇒ తాజాగా వివాదాస్పదమైన పార్టీ ఎమ్మెల్యే డిన్నర్ అంశం కూడా చర్చకు వచ్చిందని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేలకు ఇబ్బంది కలగకుండా మంత్రులు వ్యవహరించాల్సిన తీరు గురించి సీఎం దిశానిర్దేశం చేశారని, మంత్రులంతా సమష్టిగా పనిచేయాలని, ఒక్కటే మాట.. ఒక్కటే పంథా రీతిలో ఇక ముందు పనిచేయాలనే చర్చ కూడా వచ్చినట్టు సమాచారం. అధిష్టానం జోక్యం? ఇటీవల సోషల్‌మీడియా వేదికగా జరిగిన ఓ వ్యవహారంపై సీఎం, మంత్రులు ప్రత్యేకంగా చర్చించినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ అధికారిక హ్యాండిల్లో నిర్వహించిన ఓ పోల్‌లో బీఆర్ఎస్కు అనుకూలంగా ఫలితం రావడం, ఈ హ్యాండిల్ స్క్రీన్‌షాట్‌కు బీఆర్ఎస్ సోషల్‌మీడియా విస్తృతంగా ప్రచారం కల్పించిన నేపథ్యంలో సోషల్ మీడియా విషయంలో అటు పార్టీ, ఇటు ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యవహారంపై మంత్రులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.అయితే, ఈ అంశం పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లిందని, మరోమారు ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఢిల్లీ పెద్దలు రాష్ట్ర పార్టీని ఆదేశించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్‌మీడియా, కాంగ్రెస్ వ్యతిరేక సోషల్‌మీడియాలు చేస్తున్న దు్రష్పచారాన్ని అడ్డుకునేలా కాంగ్రెస్ పార్టీ సోషల్‌మీడియాను తయారు చేయాలని, ప్రతి చిన్న అంశంపై చేస్తున్న రాద్ధాంతాన్ని సమర్థవంతంగా అడ్డుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది. మీడియాతో మంత్రులు ఏం చెప్పారంటే..సమావేశానంతరం, కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద మీడియాతో మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులు మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రెండు గంటల్లోనే ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ప్రకటన చేశామని, వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని దామోదర రాజనర్సింహ చెప్పారు.కేబినెట్ సబ్‌కమిటీ సూచన మేరకు వన్ మ్యాన్ కమిషన్‌ను నియమించామని, ఈ కమిషన్ త్వరలో రిపోర్ట్ ఇస్తుందని, ఆ రిపోర్ట్‌పై కేబినెట్లో చర్చించి, అసెంబ్లీలో ప్రవేశపెడుతామని వెల్లడించారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కులగణన కార్యరూపం దాల్చడానికి సంబంధించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచర మంత్రులు చర్చించామన్నారు. ఈనెల 5వ తేదీన సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ ముందు పెడతామని, తర్వాత సభలో చర్చకు పెట్టడం ద్వారా ప్రజాస్వామిక విధానాన్ని ముందుకు తీసుకుపోతామన్నారు. -
గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం పండగలా నిర్వహిస్తాం: భట్టి
సాక్షి, హైదరాబాద్: చిత్రపరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రకటించిన గద్దర్ అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. గద్దర్ అవార్డు కమిటీసభ్యులతో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం భేటీ అయ్యారు. అక్టోబర్ 14న కమిటీ సభ్యులతో భేటీ అయిన భట్టి తాజాగా మరోసారి సమావేశమయ్యారు. గద్దర్ అవార్డు లోగో, విధివిధానాలు, నియమ నిబంధనలపై కమిటీ సభ్యులు చేసిన ప్రతిపాదనలు, సూచనలపై చర్చించారు. గద్దర్ అవార్డుల ప్రధానోత్సవాన్ని పెద్ద పండుగలా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భట్టి పేర్కొన్నారు. కల్చరల్ ఐకాన్ గద్దర్ ప్రతిష్ట పెంచేలా అవార్డుల లోగోలు రూపొందించాలని సూచించారు. ఫీచర్ ఫిలింస్, బాలల చిత్రాలు, తెలుగు సినిమాపై పుస్తకాలు వంటి వివిధ విభాగాల కింద అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి వాటిని ప్రశంసించేలా అవార్డులు ఉండాలన్నారు. అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, మానవతా విలువలతో కూడిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యం దిశగా అవార్డుల ప్రదానం ఉండాలని చెప్పారు. కమిటీ సభ్యుల సూచనలను సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని భట్టి తెలిపారు. కాగా నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే! -
‘ఈనెల 9న న్యూ ఎనర్జీ పాలసీ ప్రకటన’
హైదరాబాద్: దేశ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఈనెల 9వ తేదీన న్యూ ఎనర్జీ పాలసీని ప్రవేశపెడుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయం ఎదురుగా రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద ఈరోజు(సోమవారం) జెన్ కో ఏఈలకు ఉద్యోగ నియామక పత్రాలను భట్టి విక్రమార్క అందజేశారు. దీనిలో భాగంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.‘దేశ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించడానికి ఈ పాలసీ(New Energy Policy) దోహదం చేస్తుంది. మిగులు విద్యుత్‌తో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది. గత పది సంవత్సరాలుగా న్యూ ఎనర్జీ పాలసీని గత సర్కార్ విస్మరించింది. 20 వేల మెగా వాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించాం. ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టే న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొస్తున్నాం. ఒడిస్సా నైనీ కోల్ బ్లాక్ వద్ద థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నాం,. రామగుండంలో జెన్ కో- సింగరేణి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర జీఎస్డీపీలో ప్రధాన పాత్ర ఎనర్జీదే. దీనిపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్(BRS Party) దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరు’ అని తెలిపారు.కేలండర్ ప్రకారమే ఉద్యోగాలురాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ కేలండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. 14 ఏళ్లుగా గ్రూప్–1 పరీక్ష నిర్వహించలేదని.. తాము అన్ని అడ్డంకులను, కుట్రలను అధిగమించి 563 గ్రూప్–1 పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. మార్చి 31లోగా ఈ పోస్టుల భర్తీని పూర్తి చేస్తామని చెప్పారు. సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు ఎంపికైన 20 మంది తెలంగాణ అభ్యర్థులకు రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద ఆదివారం ప్రజాభవన్‌లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి రూ.లక్ష చొప్పున చెక్కులను సీఎం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేక నిరుద్యోగులు ఎంతో నష్టపోయారని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దేశంలో ఎక్కడా లేనివిధంగా 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని తెలిపారు. సివిల్స్‌లో తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో అభ్యర్థులు ఎంపిక కావాలన్న లక్ష్యంతోనే రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం బిహార్ నుంచి ఎక్కువ మంది సివిల్స్‌కు ఎంపికవుతున్నారని తెలిపారు. దేశంలో అత్యధికంగా తెలంగాణ నుంచి సివిల్స్‌కు ఎంపికవుతారని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకోవాలని అన్నారు. రూ.లక్ష సాయాన్ని ప్రభుత్వ ప్రోత్సాహకంగా భావించాలని కోరారు. ఇంటర్వ్యూలకు వెళ్లే ప్రతి అభ్యర్థి సివిల్స్‌కు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. -
కేలండర్ ప్రకారమే ఉద్యోగాలు!: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ కేలండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. 14 ఏళ్లుగా గ్రూప్–1 పరీక్ష నిర్వహించలేదని.. తాము అన్ని అడ్డంకులను, కుట్రలను అధిగమించి 563 గ్రూప్–1 పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. మార్చి 31లోగా ఈ పోస్టుల భర్తీని పూర్తి చేస్తామని చెప్పారు. సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు ఎంపికైన 20 మంది తెలంగాణ అభ్యర్థులకు రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద ఆదివారం ప్రజాభవన్‌లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి రూ.లక్ష చొప్పున చెక్కులను సీఎం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేక నిరుద్యోగులు ఎంతో నష్టపోయారని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దేశంలో ఎక్కడా లేనివిధంగా 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని తెలిపారు. సివిల్స్‌లో సత్తా చాటండి సివిల్స్‌లో తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో అభ్యర్థులు ఎంపిక కావాలన్న లక్ష్యంతోనే రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం బిహార్ నుంచి ఎక్కువ మంది సివిల్స్‌కు ఎంపికవుతున్నారని తెలిపారు. దేశంలో అత్యధికంగా తెలంగాణ నుంచి సివిల్స్‌కు ఎంపికవుతారని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకోవాలని అన్నారు. రూ.లక్ష సాయాన్ని ప్రభుత్వ ప్రోత్సాహకంగా భావించాలని కోరారు. ఇంటర్వ్యూలకు వెళ్లే ప్రతి అభ్యర్థి సివిల్స్‌కు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఢిల్లీలో సివిల్స్ అభ్యర్థులకు ఉచిత బస: భట్టి విక్రమార్క సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు ఢిల్లీలో ఉచిత వసతి కల్పిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సివిల్స్ వైపు రాష్ట్ర యువతను మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ పక్షాన ఆర్థిక సహాయం అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టిందని చెప్పారు. ఇంటర్వ్యూకు ఎంపికైన 20 మంది సివిల్స్ తుది పరీక్షలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి, వారి పిల్లల చదువులకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. సింగరేణిలో తవ్వి వదిలేసిన గనులు, ఇతర ఖాళీ స్థలాల్లో సోలార్, పంప్డ్ స్టోరేజ్ ద్వారా గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. సింగరేణి సంస్థ సుస్థిర మనుగడ కోసం దేశవ్యాప్తంగా లిథియం, గ్రాఫైట్ వంటి మైనింగ్ రంగాల్లో విస్తరించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. సింగరేణి పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నామని వివరించారు. ఈ కార్రక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సింగరేణి సీఎండీ బలరాం పాల్గొన్నారు. -
ఏంటా రహస్యం?.. అసెంబ్లీలో మల్లు సోదరుల గుసగుసలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క.. ఆయన సోదరుడు, నాగర్‌కర్నూల్ లోక్‌సభ సభ్యుడు మల్లు రవి గుసగుసలాడుకున్నారు. అసెంబ్లీ లాబీల్లోని భట్టి చాంబర్‌కు మల్లురవి రాగా, ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు ఇతరులు భట్టి చాంబర్లోనే ఉన్నారు. దీంతో తన సోదరుడితో రహస్యంగా మాట్లాడి మల్లు రవి వెళ్లిపోయారు.అయితే, అసెంబ్లీలో ఈ అన్నదమ్ములు ఎందుకు గుసగుసలాడారా అన్న విషయంపై ‘సాక్షి’ ఆరా తీయగా, రహస్యమేమీ లేదని ఎంపీ మల్లురవి చెప్పారు. అసెంబ్లీ ఆమోదం పొందిన మన్మోహన్సింగ్ సంతాప తీర్మానం ఇప్పించాలని, దానిపై తెలంగాణ ఎంపీల సంతకాలు పెట్టించి రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి ఇస్తానని భట్టికి చెప్పానని ఆయన వెల్లడించారు.ఇదీ చదవండి: హుస్సేన్ సాగర్ చుట్టూ నో ఎంట్రీ... హద్దు మీరితే అంతే -
ధరణి ముసుగులో వేలాది ఎకరాలు అన్యాక్రాంతం
సాక్షి, హైదరాబాద్: ధరణి ముసుగులో విలువైన ప్రభుత్వ, ఇనాం, పడావు, ఎవాక్యుయీ భూములు వేలాది ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని ప్రభుత్వం గుర్తించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. అన్యాక్రాంతమైన ఈ భూములను ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దాదాపు పదిహేను వేల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని, చేతులు మారాయని తేలిందని.. కనిష్టంగా ఒక ఎకరా రూ.10 కోట్లు అని అనుకున్నా వీటి విలువ దాదాపు రూ.1.5 లక్షల కోట్లు ఉంటుందని చెప్పారు. బుధవారం శాసనసభలోని తన కార్యాలయంలో భట్టి మీడియాతో ముచ్చటించారు. 10 వేల ఎకరాలు ధారాదత్తం చేశారు ‘అన్యాక్రాంతమైన భూములే కాకుండా అస్సైన్డ్ భూములను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే.. మళ్లీ ప్రభుత్వ అవసరాల కోసమే వినియోగించాలి. కానీ ఇబ్రహీంపట్నం మండలంలో పది వేల ఎకరాలను ధారాదత్తం చేశారు. గతంలో భూముల రిజి్రస్టేషన్ అనంతరం రెవెన్యూ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ భూముల మ్యుటేషన్ జరిగి పట్టాదార్ పాస్ పుస్తకాలు వచ్చేవి. కానీ ధరణి వచి్చన తర్వాత రిజి్రస్టేషన్ కాగానే వెంటనే మ్యుటేషన్ అవడం, ధరణి పోర్టల్‌లో వేలిముద్రలు, ఫోటో రాగానే.. అక్కడికక్కడే ఇతరులకు విక్రయించడం వల్ల అసలు ఆ భూముల చరిత్ర తెలియకుండానే క్రయ విక్రయాలు, మ్యుటేషన్లు జరిగిపోయాయి.ఇనాం, పడావు, ఎవాక్యుయీ ప్రాపర్టీ, ప్రభుత్వ భూములను ధరణిలో ఎంట్రీ చేసే సమయంలోనే పేర్లు మారిపోయాయి. ఒకసారి ధరిణిలో ఎంటర్ అయ్యాక వాటిని మార్చే అవకాశం లేకుండా పోయింది. కొన్నింటిని కావాలనే పార్ట్ ‘బీ’లో చేర్చారు. దీనిని అడ్డు పెట్టుకుని పెద్ద ఎత్తున భూములు చేతులు మారాయి. ధరణిలో ఒక్క భూ యజమాని పేరు మినహా కాస్తుదారులు/ అనుభవదారుల కాలమ్ లేకపోవడంతో ఇష్టానుసారం భూములు చేతులు మారాయి..’అని డిప్యూటీ సీఎం చెప్పారు. పార్ట్ ‘బీ’భూముల్లోనే పెద్దయెత్తున దందా ‘ధరణికి ముందున్న రికార్డులను, ధరణిలోకి వచ్చిన తరువాత మారిన భూముల వివరాలను పరిశీలిస్తాం. పూర్తిస్థాయిలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. భూములు మూడు, నాలుగు చేతులు మారినా..అవి ఫ్రభుత్వానికి చెందిన భూములు అని తేలితే స్వాధీనం చేసుకుంటాం. ప్రధానంగా పార్ట్ ‘బీ’కింద పెట్టిన భూముల్లోనే ఈ దందా పెద్ద ఎత్తున సాగింది..’అని భట్టి అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన ప్రతి పైసా తెస్తాంమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన నిధులు ప్రతి పైసా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. కేంద్రం రాష్ట్రాల వారీగా నిధులు కేటాయించదని, పథకాల వారీగా చేయాల్సిన ఖర్చునకు అనుగుణంగా కేటాయింపులు జరుపుతుందని అన్నారు. బుధవారం శా సనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు కవిత, దయానంద్ తదితరులు లేవనెత్తిన ప్రశ్నలకు భట్టి సమాధానం చెప్పారు.గత పదేళ్ల నుంచి కేంద్ర ప్ర భుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, ఏడా ది కాలంగా వచి్చన నిధులకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం సభముందు ఉంచామని తెలిపారు. కేవలం ఏడాదిలో పదేళ్లలో సాధించిన దానికంటే మించి పురోగతి సాధించామని భట్టి పేర్కొన్నా రు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రత్యేకంగా పథకాలు రూపొందించాల్సిందిగా సంబంధిత కార్పొరేషన్‌ను ఆదేశించామన్నారు. 2026 డిసెంబర్ నాటికి ‘పాలమూరు’ పూర్తి: మంత్రి ఉత్తమ్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని, ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయిస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాజెక్టు నత్తనడకన సాగిందని, దీనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. కొడంగల్–నారాయణపేట ప్రాజెక్టు కొత్తదేమీ కాదని, ఉమ్మడి రాష్ట్రంలోనే జీవోలు వచ్చాయని వెల్లడించారు.అర్చకుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. ధూపదీప నైవేద్యం కోసం నెల కు రూ.4 వేలు, గౌరవ వేతనం కింద రూ.6 వేలు చొప్పున మొత్తం రూ.10 వే లు ఇస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ పరిషత్‌ను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసు కొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామ న్నారు. యాదగిరిగుట్టలో టీటీడీ స్థాయి లో పాలకమండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. పలు బిల్లులకు ఆమోదం మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ) పేరు పెడుతూ మండలిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బిల్లు ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు. ది యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ బిల్లుతో పాటు తెలంగాణ యూనివర్సిటీల సవరణ బిల్లు, తెలంగాణ గూడ్స్ అండ్ సరీ్వస్ ట్యాక్స్ సవరణ బిల్లులను సంబంధిత మంత్రులు ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. -
అప్పుల లెక్కలు.. అన్నీ అబద్ధాలే
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో చేసిన అప్పులు.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో చేసిన అప్పులు.. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని వేడెక్కించాయి. ఆరోపణలు.. ప్రత్యారోపణలు, సవాళ్లు.. ప్రతి సవాళ్లతో స భ అట్టుడికింది. ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూ టీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్‌రావుల మధ్య వాడివేడి వాదనలు కొనసాగాయి. అసత్యాలతో ప్రజలను త ప్పుదోవ పట్టిస్తున్నారని పరస్పరం విమర్శించుకుంటూ వారివారి లెక్కలను సభ ముందుంచారు. ప్రివిలేజ్ మోషన్‌పై మాట మార్చారు: భట్టి ‘రాజకీయాలు చేయటమే లక్ష్యంగా వ్యవహరించే హరీశ్‌రావు సభలో అన్నీ అబద్ధాలే చెబుతారు. ఏడాదిలో మేం చేసిన అప్పులపై ఆయన చెప్పే లెక్కలు సరికాదు. పదేళ్ల వారి పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని చక్కదిద్దేందుకు కొంత అప్పు చేయక తప్పలేదు. ఇక పదేళ్ల వారి హయాంలో చేసిన అప్పుల లెక్కల్లోనూ ఆయనది ప్రజలను తప్పుదారి పట్టించే పద్ధతే. అందుకే మేం అధికారంలోకి రాగానే శ్వేతపత్రం రూపంలో వాస్తవాలను ప్రజల ముందుంచాం. మళ్లీ చర్చ పెడితే నిరూపించేందుకు సిద్ధం. బీఆర్ఎస్ నేతలు 10 సంవత్సరాల పాలనలో తప్పులు చేసినందుకు గత డిసెంబర్లో జనం శిక్షించారు.ఆరు నెలల్లో పార్లమెంటు ఎన్నికలప్పుడు డిపాజిట్ దక్కకుండా వారికి మతిపోయేలా చేశారు. అయినా వారిలో మార్పు రాలేదు. ఆ పార్టీది భూస్వామ్య మనస్తత్వం. భూమిలేని నిరుపేదలకు ఆర్థిక సాయం చేయరా? అని ఖమ్మంలో ఓ విలేకరి అడిగినప్పుడు, వారికి ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పా. దాని ఆధారంగా ప్రివిలేజ్ మోషన్ ఇచ్చి, ఇప్పుడు అప్పుల మీద అవాస్తవాలు మాట్లాడితే ఇచ్చామంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వారికి అనుకూలంగా సభ నియమాలు రూపొందించుకున్నారు.వారి నిబంధనల్లోనే సభలోకి ప్లకార్డులు తీసుకురావద్దని ఉంది..కానీ నిన్న తీసుకొచ్చారు. వీరా నామీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేది? వారి హయాంలో స్పీకర్ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నప్పుడు బీఏసీలో పాటించిన పద్ధతినే మేం ఇప్పుడు అనుసరిస్తున్నాం. ఇప్పుడు ప్రసాద్‌కుమార్ స్పీకర్‌గా ఉన్నారు. వ్యక్తి మారారు తప్ప స్పీకర్ స్థానం అదే. ఆ స్థానాన్ని గౌరవించాలి కదా.. నిన్న బీఏసీలో కాగితాలు విసిరి బయటకొచ్చి ఏవేవో మాట్లాడుతున్నారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.లక్ష కోట్లు అప్పు చేసిందని విపక్షాలు చేసే ప్రచారంలో వాస్తవం లేదు. ఎఫ్ఆర్బీఎం కింద మేము రూ.51,277 కోట్లు మాత్రమే అప్పు చేశాం. గ్యారంటీల కింద రూ.61,991 కోట్లు, గ్యారంటీ లేని రుణా లు రూ.10,999 కోట్లు సమీకరించాం. మీ హయాంలో చేసిన అప్పుపై వడ్డీ రూపేణ రూ.66 వేల కోట్లు చెల్లించాం. మీరు పెట్టిపోయిన పెండింగు బిల్లులు రూ.40 వేల కోట్లలో ఇప్పటికి రూ.14 వేల కోట్లు చెల్లించాం.ప్రజల ఆస్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ఔటర్ రింగురోడ్డును ఆ ప్రభుత్వం 30 ఏళ్ల లీజు పేరుతో అమ్ముకుంది. అదే పద్ధతిలో మేం వచ్చే 30 ఏళ్ల కాలానికి జీఎస్టీ లాంటి ఆదాయ వ్యవహారాలను ఏ అదానికో, అంబానికో లీజుకిస్తే రాష్ట్ర పరిస్థితి ఏం కావాలి?..’అని భట్టి నిలదీశారు. పరిమితంగానే మా అప్పులు: హరీశ్‌రావు ‘మా ప్రభుత్వం పరిమితంగా చేసిన అప్పును తప్పుడు లెక్కలతో పెంచి భూతద్దంలో చూపి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అబద్ధపు అప్పుల బూచి చూపి ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ ఆటలు సాగనివ్వం. మేం చెప్పే లెక్కలే సరైనవని నిరూపించేందుకు సిద్ధం. సభలో ప్రత్యేక చర్చ పెట్టండి, ఆడిటర్లను, ఆర్థిక నిపుణులను పిలిపించుకోండి.. నేను చెప్పేవే సరైన లెక్కలని నిరూపిస్తాను.ఇది నా ఛాలెంజ్. ఆర్బీఐ నేటి లెక్కల ప్రకారం గత ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు రూ.1,27,208 కోట్లు. ఐదేళ్లలో చేయబోయే అప్పు దాదాపు రూ.6,36,400 కోట్లు. కానీ మా ప్రభుత్వం పదేళ్ల కాలంలో తెచి్చన అప్పులు కేవలం రూ.4,17,496 కోట్లు మాత్రమే. ‘ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాలను ఆయన ఉటంకించారు) కరోనా కారణంగా కేంద్రం అదనంగా 1.75 శాతం అప్పు తీసుకోవాలని సూచించడంతో తీసుకున్నాం. లేకపోతే అంతకూడా అప్పు అయ్యేది కాదు.దీనిపై నేను సవాల్ విసురుతున్నా.. చర్చకు సిద్ధం. మేం రూ.6,71,757 కోట్లు అప్పు తీసుకున్నామని ఒకసారి, రూ.7 లక్షల కోట్లు అని మరోసారి, సభలో రూ.7,11,911 కోట్ల అప్పులంటూ నోటికొచి్చనట్లు అబద్ధాలు చెబుతున్నారు. ప్రత్యేక చర్చ పెడితే వాస్తవాలు నిరూపిస్తా. ఏడాది పూర్తవుతున్నా ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా, గత ప్రభుత్వం చేసిన అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఏసీతో సంబంధం లేకుండా సభలో బిల్లులు ప్రవేశపెట్టడం వింతగా ఉంది. గత సభలో అప్పుల గురించి తప్పుడు లెక్కలు చూపినందుకే భట్టి విక్రమార్కపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. కానీ మరో అంశంపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నారు. చర్చ పెడితే వాస్తవాలు నిరూపిస్తాం..’అని హరీశ్‌రావు సవాల్ చేశారు. -
Telangana: ఏం చేశాం.. ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: ఏడాది పాలనలో ఏం చేశాం..భవిష్యత్తులో ఏం చేద్దాం. ఆరు గ్యారంటీల అమల్లో ముందుకెళ్లేదెలా? ఏడాది పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? విజయోత్సవాలు ఆశించిన ఫలితాన్నిచ్చాయా? వచ్చే ఏడాది కాలంలో ఏయే అంశాల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడిపించాలి? అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం ఏమిటి? తదితర కీలక అంశాలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఈ ఇద్దరు నేతలు ముఖాముఖి భేటీ అయ్యారు. గత సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును సమీక్షించడంతో పాటు ఏడాది పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు..భవిష్యత్తులో చేయాల్సిందేమిటి? తదితర అంశాలపై కూడా సమాలోచనలు జరిపినట్టు తెలిసింది. ఆరు గ్యారంటీలకు తోడు మరోమూడు అంశాలు! కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలు సానుకూల భావనతోనే ఉన్నారనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైనట్టు సమాచారం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మొదలు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు వరకు పలు అంశాల విషయంలో ప్రజల్లో సంతృప్తి వ్యక్తం అవుతోందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఆరు గ్యారంటీల అమలు విషయంలో మరింత పకడ్బందీగా ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఆరు గ్యారంటీలకు తోడు మూడు అంశాల ప్రాతిపదికన వచ్చే ఏడాది రోడ్‌మ్యాప్ ఖరారు చేసుకున్నారని సమాచారం. ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలల నిర్మాణం పూర్తి చేయడంతో పాటు రాష్ట్రంలో భూమి లేని నిరుపేదల సంక్షేమమే ఎజెండాగా పథకాలకు రూపకల్పన చేయాలని, ఉద్యోగాల కల్పన విషయంలో తొలి ఏడాది తరహాలోనే ముందుకెళ్లాలని భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది పాలనలో ప్రభుత్వ శాఖల వారీగా జరిగిన పురోగతిని ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలని కూడా వారు నిర్ణయించినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. బీఆర్ఎస్, బీజేపీలపై ఇక దూకుడుగానే..! ఏడాది ప్రజాపాలన విజయోత్సవాలు జరిగిన తీరుపై కూడా నేతలు సమీక్షించారు. గత పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు ఘనంగా జరిగాయని, సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించగలిగామని రేవంత్, భట్టి సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం ఏ పని చేపట్టినా విమర్శిస్తోన్న బీఆర్ఎస్, ఉనికి కోసం అప్పుడప్పుడూ బీజేపీ చేస్తున్న రాజకీయ ఆరోపణలను తిప్పికొట్టడంలో కొంతమేర దూకుడుగా వెళ్లాలనే అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు సందర్భంగా బీఆర్ఎస్ చేసిన గొడవ, సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్న అభిప్రాయాలు, పార్టీ అభిప్రాయం, ప్రభుత్వ ఉద్దేశం ప్రజల్లోకి వెళ్లిన తీరుపై వారు సమీక్షించారు. రాష్ట్రంలోని రాజకీయ స్థితిగతులు, ఈనెల 11, 12 తేదీల్లో కొత్త ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహించనున్న శిక్షణా తరగతులపై కూడా చర్చించారు. అసెంబ్లీ ఎజెండా ఏంటి? ఈనెల 16వ తేదీన మళ్లీ ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, మూసీ ప్రక్షాళన, హైడ్రా కూలి్చవేతలు తదితర అంశాలపై ఇవ్వాల్సిన వివరణలు, ఆర్వోఆర్ కొత్త చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గల అనుకూలత, రైతు భరోసాపై సబ్ కమిటీ నివేదిక, కులగణన రిపోర్టు విషయంలో అసెంబ్లీలో వెల్లడించాల్సిన అంశాలపై కూడా ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారని తెలుస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాలు చాలా కీలకమైనవని, ప్రభుత్వాన్ని బద్నామ్ చేయాలని చూస్తున్న ప్రతిపక్షాలకు ఈ సభా వేదికగానే తగిన జవాబు చెప్పాలని నిర్ణయించినట్టు సమాచారం. మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? లేదా?సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం రాజస్తాన్‌లోని జైపూర్ వెళ్లనున్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యుల వివాహ కార్యక్రమానికి హాజరైన తర్వాత ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలోనే రెండురోజులు ఉంటారన్న వార్తల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ కూడా హస్తిన పెద్దలతో భేటీ అయితేనే విస్తరణ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు రేవంత్ మినహా మిగతా నేతల ఢిల్లీ పర్యటన ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై చర్చ ఉంటుందా లేదా? అన్న దానిపై స్పష్టత లేదు. ఇలావుండగా రేవంత్ ఢిల్లీలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దల అపాయింట్మెంట్ లభించే అవకాశాన్ని బట్టి డిప్యూటీ సీఎం భట్టి కూడా హస్తిన పయనమవుతారని సమాచారం. -
ఎన్ని కష్టాలు వచ్చినా హామీలు నెరవేర్చి తీరుతాం: భట్టి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పాలమూరు జిల్లాలో పారుతున్న కృష్ణానదిని పట్టించుకోలేదని.. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రాష్ట్రాన్ని కుదువపెట్టారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్ర మార్క ఆరోపించారు. రైతు పండుగ సభలో ఆయన మాట్లాడా రు. కృష్ణా నీళ్లను పాల మూరుతో పాటు పక్కనున్న రంగారెడ్డి, నల్ల గొండ జిల్లాలకు ఇవ్వాలని ఆలో చన చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమేని చెప్పారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలేదు. అప్పుడే బీఆర్ఎస్ నాయకు లు ప్రజల వద్దకు వెళ్తాం. ఉద్యమాలు చేస్తాం, నిల దీస్తామని చెప్పడం చూస్తే నవ్వు వస్తోంది. పకడ్బందీగా ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టి వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తుంటే.. ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఒకాయన అంటాడు.ఇంకో ఆయన వచ్చి ఉద్యమం చేస్తానని చెప్తాడు. ఇది సిగ్గు చేటు. ఇది దొరల ప్రభుత్వం కాదు. ప్రజల కోసం పనిచేసే ప్రజా ప్రభుత్వం. ఇచ్చిన హామీ మేరకు ఎన్ని కష్టాలు వచ్చినా పథకాలు అమలు చేసి తీరుతాం’’ అని భట్టి పేర్కొన్నారు. తాము రు ణమాఫీ చేయడం మాత్రమే కా కుండా... పంట నష్టపోయిన రైతు లకు పరిహారం కింద రూ. 100 కోట్లు విడుదల చేశామని తెలిపా రు. పంటల బీమా కింద ప్రభు త్వమే రాష్ట్రంలోని 50 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 1,433 కోట్ల ప్రీమియం చెల్లించిందని భట్టి తెలిపారు. బడ్జెట్లో రూ.73 వేల కోట్లు కేటాయించి వ్యవసాయాన్ని పండుగలా చేసిన ఘ నత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. మహిళలను కోటీశ్వరులను చేసేందుకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.రూ.2,747 కోట్లు రుణమాఫీ సొమ్ము విడుదలరైతు పండుగ ముగింపు సందర్భంగా నాలుగో విడత రుణమాఫీ కింద రూ.2,747 కోట్లు విడుదల చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. అదేవిధంగా 255 స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ చెక్కును అందజేశారు. సమావేశంలో మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు.రైతు సంక్షేమం మొదలైంది వైఎస్సార్ హయాం నుంచే..రైతు పండుగ సభలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకోసం కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను గుర్తు చేసుకు న్నారు. మొదట రైతులకు రుణమాఫీ చేసినది, ఉచిత కరెంట్ ఇచ్చినది వైఎస్సార్ హయాంలోనేనని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎనిమిది లక్షల ఎకరాలకు నీరందించేలా ప్రాజెక్టులు రూపొందించారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మొదటిసారిగా రైతు రుణమాఫీ చేసినది వైఎస్ అని మంత్రి దామోదర రాజనర్సింహ గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ రైతుల ప్రభుత్వమని, వైఎస్సార్ హయాం నుంచీ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. -
పొరపాట్లకు తావివ్వకండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న సామా జిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహ రించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఈ దశలో డేటా ఎంట్రీ చాలా ముఖ్యమైనదని, ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని సంబంధిత అధికారులను ఆదేశించారు.జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ఉన్న ఆయన అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సర్వే స్థితిగతులను అడిగి తెలుసుకోవడంతో పాటు మిగిలిన ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. సర్వే జరిగిన క్రమంలో పట్టణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల డోర్‌లాక్ ఉండటం, ఇంటివద్ద అందుబాటులో లేకపోవడం లాంటి సమస్యలు వచ్చాయని, వారి వివరాలను ఫోన్ ద్వారా.. లేదంటే నేరుగా కలిసి సేకరించాలని కోరారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు వెళ్లిన వారి వివరాలను కూడా జాగ్రత్తగా క్రమబద్ధీకరించాలని సూచించారు. -
జార్ఖండ్‌లో భట్టి బిజీబిజీ
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాల నేప థ్యంలో ఏఐసీసీ పరిశీలకు ని హోదాలో రాంచీలో మ కాం వేసిన తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదివారమంతా బిజీబిజీగా గడిపారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో జార్ఖండ్ పీసీసీ కార్యాలయంలో ఆయన భేటీ అయ్యారు. జేపీసీసీ అధ్యక్షుడు కేశవ్ మహతో కమలేశ్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపిన భట్టి.. కొత్త ప్రభుత్వ ఏర్పాటు క్రమంలో పార్టీ వ్యూహాలను ఎమ్మెల్యేలకు వివరించారు.ఆ తర్వాత ఇండియా కూటమి ఎమ్మెల్యేలతో కలిసి జార్ఖండ్ గవర్నర్ సంతోశ్ గంగ్వార్‌ను కలిశారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో పాటు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐఎంఎల్ పార్టీల ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. కాగా, జార్ఖండ్ ఎన్నికల ప్రక్రియలో కీలకపాత్ర పోషించిన భట్టి ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పు తదితర అంశాల్లో కాంగ్రెస్ పక్షాన కీలకంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఎన్నుకున్న ప్రజల కోసం కష్టపడి పనిచేయండి దేశాన్ని ఓ వికృత పార్టీ పాలిస్తోందని, ఆ పార్టీని కాదని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నందున వారి కోసం కష్టపడి పనిచేయాలని జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు భట్టి దిశానిర్దేశం చేశారు. రాంచీలోని హోటల్ చాణక్యలో జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీలో ఆయన మాట్లాడారు. ‘ఇక్కడ కూర్చున్న వాళ్లు అదృష్టవంతులు. ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయాలనుకున్నారు. కానీ అందరికీ టికెట్లు దక్కలేదు. కాంగ్రెస్ పారీ్టలో పనిచేయడం అదృష్టం’ అని వ్యాఖ్యానించారు.తెలంగాణ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పార్టీ పక్షాన కొత్త ఎమ్మెల్యేలను అభినందించిన భట్టి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన రాష్ట్రానికి రావాలని కోరుతూ జార్ఖండ్ ఎమ్మెల్యేలకు సాదర ఆహా్వనం పలికారు. ఈ సమావేశంలో జార్ఖండ్ పార్టీ ఇన్చార్జి సిరివెళ్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
జార్ఖండ్ ప్రజలు విశ్వసించి పట్టం కట్టారు
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు సమష్టి విజయమని, అక్కడి ప్రజలు తమను విశ్వసించి పట్టం కట్టారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం, జార్ఖండ్ వనరుల పరిరక్షణ గురించి తాము ప్రజలకు చేసిన విజ్ఞప్తిని మన్నించారని, అందుకే ఇండియా కూటమికి ఘన విజయం చేకూర్చారని అన్నారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీనియర్ పరిశీలకుడి హోదాలో శనివారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన రాంచీకి వెళ్లారు. అక్కడ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంతో పాటు జేఎంఎం నేత హేమంత్ సోరెన్ నివాసంలో జరిగిన విజయోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ జేఎంఎం నేతృత్వంలో కూటమి గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడంతోపాటు అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పగలిగామని, అందుకే భారీ విజయం సాధ్యమైందన్నారు. జార్ఖండ్ ప్రజలకు బీజేపీపై భ్రమలు లేవని, అందుకే ఇండియా కూటమి వైపు నిలిచారని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ప్రజలిచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెడతామని భట్టి స్పష్టం చేశారు. కాగా, జార్ఖండ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భట్టి కీలకపాత్ర పోషించారు. ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటు, పార్టీ మేనిఫెస్టో తయారీ, వ్యూహాల రూపకల్పనలో భాగస్వాములయ్యారు. పలు దఫాలుగా ప్రచారానికి వెళ్లారు. -
గడపగడపకూ ‘ఏడాది విజయోత్సవాలు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలో అమలు చేసిన విప్లవాత్మక పథకాలు, సంక్షేమ కార్యక్రమాల వివరాలను గడపగడపకూ చేర్చాలని ప్రజాపాలన విజయోత్సవాల మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ విజయోత్సవాల్లో అన్ని శాఖలు భాగస్వాములు కావాలని అధికారులను ఆదేశించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ భేటీలో ఉపసంఘం సభ్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖల కార్యదర్శులు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. వచ్చే నెల 9వ తేదీ వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేసింది. అన్ని మాధ్యమాల ద్వారా ప్రచారం: భట్టి డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ వివిధ శాఖల పరిధిలో అమలైన పథకాలు, కార్యక్రమాల గురించి ఆయా శాఖలు ప్రజలకు వివరించాలని సూచించారు. ఇందుకోసం సోషల్ మీడియా సహా అన్ని మాధ్యమాలను ఉపయోగించుకోవాలని కోరారు. విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్‌నగర్‌లో రైతు దినోత్సవంతోపాటు సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ వేదికగా లేజర్ షో, కార్నివాల్తోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. మహిళలను చైతన్యవంతులను చేయాలి: మంత్రి ఉత్తమ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మహిళల అభ్యున్నతి కోసం చేపట్టిన 70 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు సున్నా వడ్డీ పథకం, బ్యాంకు లింకేజీల కల్పన, సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ తదితర పథకాల గురించి మహిళలందరికీ తెలియజేయాలని మంత్రి ఉత్తమ్ అధికారులకు సూచించారు.మంత్రి పొంగులేటి మాట్లాడుతూ అన్ని ఆర్టీసీ బస్సులపై ప్రజా ప్రభుత్వ పాలన విజయాలను తెలియజేసేలా ప్రకటనలు తయారు చేయాలన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, ఇందిరమ్మ ఇళ్లు, ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థల ఏర్పాటుపై పాఠశాల స్థాయి విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. సీఎం చేతుల మీదుగా ఆరు పాలసీల విడుదలకు ఏర్పాట్లు: సీఎస్ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నర్సింగ్, పారా మెడికల్ కళాశాలలు, 200 విద్యుత్ సబ్స్టేషన్లు ప్రారంభిస్తున్నామని.. 9,007 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని సీఎస్ శాంతికుమారి తెలిపారు. అలాగే సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆరు ప్రధాన పాలసీలను విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. -
మహిళల కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు
సాక్షి ప్రతినిధి, వరంగల్: మహిళల కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. మంగళవారం వరంగల్‌లో నిర్వహించిన ‘ప్రజా పాలన–ప్రజా విజయోత్సవ సభ’లో ఆయన మాట్లాడారు. మహిళల అభివృద్ధితోనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. రూ.6వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఇది మహిళలు ఏది కావాలంటే అది అమలు చేసే ప్రభుత్వమని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరతాం: పొంగులేటి ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం నూటికి నూరు శాతం నెరవేరుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా 22 ఇందిరా మహిళా శక్తి భవనాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన తెలంగాణకో వరం: కోమటిరెడ్డి మూసీ ప్రక్షాళన తెలంగాణకు గొప్ప వరమని, ప్రధానంగా ఫ్లోరైడ్‌తో బాధపడుతున్న నల్లగొండతో పాటు పలు ప్రాంతాలకు చెందిన లక్షలాది మందికి మేలు జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. రూ.7 లక్షల కోట్ల అప్పు చేసిన గత పాలకు లు మూసీ కోసం రూ.7 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. వైఎస్ స్ఫూర్తితో ముందుకు: సీతక్క, కొండా సురేఖ నాడు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మహిళా సమాఖ్యలకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చి ఆర్థిక పరిపుష్టిని కల్పిస్తే, నేడు వడ్డీలేని రుణాతోపాటు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ధనసరి సీతక్క చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత అంత గొప్ప దయగల నేత, సీఎం రేవంత్‌రెడ్డి అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతికి సీఎం కృషి: టీపీసీసీ చీఫ్ వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.6,000 కోట్లు కేటాయించడం చరిత్రలో రికార్డని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. సభలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, కె.కేశవరావు, సలహాదారు శ్రీనివాసరాజు, ఎంపీలు బలరాం నాయక్, డాక్టర్ కావ్య, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, మధుసూదనాచారి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నయా పెట్టుబడిదారుల నుంచి జార్ఖండ్‌ను రక్షించాలి
సాక్షి, హైదరాబాద్: అదానీ, అంబానీ లాంటి నయా పెట్టుబడిదారుల నుంచి జార్ఖండ్ రాష్ట్రానికి విముక్తి కల్పించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జార్ఖండ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాని ఆయన ప్రజలను కోరారు. ఆదివారం భట్టి జార్ఖండ్‌లోని రాంఘర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశం, చిత్తార్పూర్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో మాట్లాడుతూ, కొద్ది మంది పెట్టుబడిదారుల చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, చైతన్యంగల కాంగ్రెస్ కార్యకర్తలు జార్ఖండ్ రాష్ట్రాన్ని, వనరులను దోపిడీదారుల నుంచి కాపాడాలని పిలుపునిచ్చారు.భారత్ జోడో యాత్రలో భాగంగా దేశంలో విద్వేషం ఉండకూడదని, సంపద అందరికీ సమానంగా పంచాలని రాహుల్ గాంధీ ఇచి్చన సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని కోరారు. అన్ని స్థాయిల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించాలని, ఇండియా కూటమి హామీలను, మేనిపెస్టోను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఏఐసీసీ నేతలు గులాం అహ్మద్మీర్, సిరివెళ్ల ప్రసాద్, జార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశవ్ కమలేశ్ మహతో, మైనార్టీ సెల్ అధ్యక్షుడు తారిఖ్ అన్వర్లతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
అందరితో చర్చించాకే నూతన విద్యుత్ పాలసీ
మిర్యాలగూడ/గరిడేపల్లి: రాష్ట్రంలో త్వరలో నూతన ఎనర్జీ పాలసీని ప్రవేశపెట్టబోతున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న విద్యుత్ నిష్ణాతులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలందరి ప్రజాభిప్రాయాలు తీసుకొని అసెంబ్లీలో చర్చిస్తామన్నా రు. ఆదివారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలిసి యూనిట్–1 సింక్రనైజేషన్ కార్యక్రమాన్ని భట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విలేకరులతో మాట్లాడారు.2025 మే నాటికి యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ ద్వారా పూర్తిస్థాయి లో 4వేల మెగావాట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామన్నారు. 2028–29 నాటికి రాష్ట్రవ్యా ప్తంగా 22,488 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండొచ్చని అంచనాలను రూపొందించామని చెప్పారు. ఇది 2034–35 నాటికి 31,809 మెగావాట్లకు పెరిగే అవకాశముందని అంచనా వేసినట్టు తెలిపారు. రాష్ట్ర పురోభివృద్ధి, వ్యవసాయ, పరిశ్రమ, గృహ అవసరాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఏ రంగంలోనూ విద్యుత్ సమస్య రాకుండా పక్కా ప్రణాళికలతో ముందుకుపోతున్నామన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీని ప్రవేశ పెట్టనున్నామని, ఇందుకు తగ్గట్టుగా విద్యుదుత్పాదన చేపట్టి రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచుతామని చెప్పారు. అంతకుముందు దామరచర్ల వద్ద యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు బొగ్గు అందించే ర్యాకుల రైల్వే వ్యాగన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, వైటీపీఎస్ చైర్మన్ సందీప్‌కుమార్ సుల్తానియా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్రపవార్, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్‌రెడ్డి, వైటీపీఎస్ టెక్నికల్ డైరెక్టర్ అజయ్, ప్రాజెక్టు డైరెక్టర్ సచ్చిదానంద, చీఫ్ ఇంజనీర్ సమ్మయ్య, టీపీసీ సీఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.సంక్రాంతి తర్వాత రేషన్‌కార్డులకు సన్నబియ్యం: ఉత్తమ్కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం అందించనున్నట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో దేశంలో ఉన్నతమైన పదవులు చేపట్టి భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఉత్తమ్ ఆకాంక్షించారు.రూ.7లక్షల కోట్ల అప్పు చేసిన కేసీఆర్: కోమటిరెడ్డిరాష్ట్రంలో రూ.7లక్షల కోట్లు అప్పు చేసి మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకుంటే 24గంటలు అందుబాటులో ఉంటూ సీఎం, మంత్రులు తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తు న్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతిపక్ష నాయకుడిగా ఐదుగురు ఎమ్మెల్యేలతో పోరాడి పాద యాత్ర చేసి తెలంగాణ ప్రజల కష్టాలను తెలుసుకున్న వ్యక్తి అన్నారు. నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల పరిశీలనసూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని ఫణిగిరి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి పరిశీలించారు.రూ.5వేల కోట్లతో రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణంరాష్ట్రవ్యాప్తంగా రూ.5వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం చేపడుతున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లిలో రూ. 200 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలతో కలిసి జరిగిన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ప్రపంచ స్థాయి విధానాలతో అన్ని రకాల సౌకర్యాలు విద్యా విధానాలు అందుబాటులో ఉండేలా వీటి నిర్మాణాలు చేపడుతున్నట్టు తెలిపారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ విద్యార్థులందరూ కూడా ఈ పాఠశాలలో చదువుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఉపాధ్యాయులకు కూడా ఈ పాఠశాలలోనే క్వార్టర్స్ నిర్మిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ సొరంగాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. తాను మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలతో కలిసి ఎస్ఎల్బీసీ దగ్గర సమీక్ష చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
‘భద్రాద్రి.. యాదాద్రి’పై సర్కారుకు నివేదిక
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు చోటు చేసుకున్నట్టు వచ్చి న ఆరోపణలపై విచారణ నిర్వహించిన జస్టిస్ మదన్ బి.లోకూర్ కమిషన్.. గడువు చివరి తేదీ అయిన గత నెల 28న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచింది. ప్రస్తుతం రాష్ట్ర ఇంధన శాఖ వద్ద ఈ నివేదిక ఉంది. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దీనిపై సమీక్ష నిర్వహించడంతో పాటు కేబినెట్ భేటీలో చర్చించి తదుపరి కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర శాసనసభలో కూడా నివేదికను ప్రవేశపెట్టి చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తదుపరి చర్యలకు సిఫార్సు టెండర్లు లేకుండా నామినేషన్ ప్రాతిపదికన యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని బీహెచ్ఈఎల్కు అప్పగించడం, టెండర్లకు వెళ్లకుండా ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకోవడంలో చోటు చేసుకున్న విధానపరమైన అవకతవకతలు, వీటితో రాష్ట్ర ఖజానాకు జరిగిన నస్టాన్ని కమిషన్ లెక్కగట్టినట్లు తెలిసింది. వీటికి సంబంధించిన నిర్ణయాలన్నీ నాటి సీఎం కేసీఆర్ తీసుకున్నారని కమిషన్ నిర్ధారణకు వచ్చి నట్టు సమాచారం.ఆయనతో పాటు గత ప్రభుత్వంలోని ఇతర మాజీ ప్రజా ప్రతినిధులు, అధికారులూ బాధ్యులని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ విషయంలో తదుపరి దర్యాప్తు కోసం తీసుకోవాల్సిన చర్యలను కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కాగా దీని ఆధారంగా ప్రభుత్వం కేసీఆర్‌తోపాటు ఇతరులపై కేసు నమోదు చేసి తదుపరి విచారణకు ఆదేశించాలని భావిస్తున్నట్టు తెలిసింది. కేసీఆర్‌ను విచారించకుండానే నివేదిక! తొలుత జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ కమిషన్ ఏర్పాటు కాగా, ఆయన గత ప్రభుత్వంలోని మాజీ ప్రజాప్రతినిధులు, విద్యుత్ సంస్థల సీఎండీలు, ఇతర అధికారులు, ప్రస్తుత రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఇతర సాక్షుల అభిప్రాయ సేకరణ ప్రక్రియను పూర్తి చేశారు. పలువురికి క్రాస్ ఎగ్జామినేషన్ సైతం నిర్వహించారు. రాతపూర్వకంగా లేదా వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయగా, ఆయన్నుంచి రాత పూర్వక సమాధానం అందింది.నిర్ణయాలను తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూనే..విచారణ కమిషన్ బాధ్యతల నుంచి వైదొలగాల్సిందిగా జస్టిస్ నరసింహారెడ్డిని అప్పట్లో కేసీఆర్ కోరారు. కాగా విలేకరుల సమావేశంలో కేసీఆర్‌పై జస్టిస్ నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు..విచారణ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందిగా జస్టిస్ నరసింహారెడ్డిని ఆదేశించింది. ఆయన స్థానంలో నియమితులైన జస్టిస్ లోకూర్..సాక్ష్యాలు, నివేదికల పరిశీలన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచారు. కేసీఆర్ ఇచ్చి న జవాబును ఆయన పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. సీఎం రేవంత్ సమీక్ష గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ నిర్ణయాలకు సంబంధించి అందిన నివేదికపై సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం రాత్రి ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. నివేదికలోని అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. -
జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమి గెలుపు ఖాయం
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్‌లో జరగ నున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలుపు ఖాయమని ఉపముఖ్యమంత్రి, జార్ఖండ్ ఎన్నికల ఇన్చార్జి, స్టార్ క్యాంపెయినర్ మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిని గెలిపించుకోవాలనే ఉత్సాహం అటు ప్రజల్లోనూ, ఇటు పార్టీ కేడర్‌లోనూ కనిపిస్తోందన్నారు. ఎన్నికల ఇన్చార్జిగా జార్ఖండ్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన భట్టి శుక్రవారం రాంచీలో జరిగిన రాష్ట్ర పీసీసీ నేతలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జీల సమావేశానికి హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ...అసెంబ్లీ ఇన్చార్జీలు, జిల్లా కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్ నేతలెవరూ ఎన్నికలు పూర్తయ్యేవరకు తమకు కేటాయించిన నియోజకవర్గాలను వదిలిపెట్టవద్దని సూచించారు. కూటమిలో అసంతృప్తితో ఉన్న నేతలతో చర్చించి వారు ప్రచారంలో పాల్గొనేలా చేయాలన్నారు. ప్రచారాన్ని నిర్వహించాలని, సోషల్‌మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. అనంతరం అసెంబ్లీ ఎన్ని కల్లో అనుసరించాల్సిన వ్యూహం, మేనిఫెస్టో తయారీపై అభిప్రాయాలను తెలిపారు. సమావేశంలో కేసీ వేణుగో పాల్, కేశవ్మహతో కమలేశ్, గులాం అహ్మద్ మీర్‌సాబ్, బి.కె.హరి ప్రసాద్, రామేశ్వరరావు పాల్గొన్నారు. -
రానున్నది గ్రీన్ పవర్ యుగం
అశ్వారావుపేట: ప్రపంచంలో రానున్నది గ్రీన్ పవర్ యుగమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో రూ.36.50 కోట్లతో నిర్మించిన 2.5 కేవీ బయోమాస్ పవర్‌ప్లాంట్‌ను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కలసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బొగ్గు, వంట చెరుకును మండించకుండా జలవిద్యుత్, పవన విద్యుత్‌తోపాటు గ్రీన్ పవర్ యుగం రాబోతోందని చెప్పారు.కాలుష్యం లేకుండా ప్రకృతిలోని వనరుల సహకారంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, ఇందుకోసం రాష్ట్రంలో కొన్ని గ్రామాలను ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టుల కింద సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని భట్టి తెలిపారు. పైలట్ ప్రాజెక్టు పరిధిలోని రైతులకు సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తామని, రాబోయే ఆరేళ్లలో 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు ప్రాధాన్యం కలి్పస్తూ రూ.73 వేల కోట్లను వ్యవసాయ రంగానికి కేటాయించామని చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో పామాయిల్ ఫ్యాక్టరీని అమ్మేందుకు కుట్ర జరిగిందని, ఆ చర్యలను తిప్పికొట్టి రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్‌పామ్ సాగు విస్తరించామని తెలిపారు.పామాయిల్ గెలల ధర పెంచేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామని, టన్నుకు రూ.20 వేలకు పైగా రైతులకు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రత్యేక చొరవతో దేశంలోనే ఆయిల్‌పామ్ రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతమైన అశ్వారావుపేట పామాయిల్ తోటలతో పచ్చగా మారడం హర్షణీయమని అన్నారు. రాష్ట్రంలోని రైతులు లాభసాటి పంటలపై దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
11న సమీకృత గురుకులాలకు శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రాజెక్టు’కు ఈనెల 11వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. దసరా పండుగకు ముందురోజున రాష్ట్రవ్యాప్తంగా 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సమీకృత గురుకుల పాఠశా లల నిర్మాణ పనులకు భూమిపూజ జరుగుతుందని తెలిపారు. ఏడాదిలో వాటి నిర్మాణ పనులు పూర్తి చేసి, అందుబాటులోకి తేవాల ని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఆదివారం సచివా లయంలో సమీకృత గురుకుల పాఠశాలల నిర్మాణ పనులపై మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి భట్టి మీడి యాతో మాట్లాడారు.‘‘సమీకృత గురుకుల విద్యాసంస్థల నిర్మాణాల కోసం 2024–25 బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించాం. ఇది చారిత్రాత్మక నిర్ణయం. తెలంగాణ మానవ వనరులు ప్రపంచంతో పోటీపడేలా కావాల్సిన నిధులు కేటాయించి విద్యాభివృద్ధికి చర్యలు చేపట్టాం. ఒక్కో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను 20 నుంచి 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలన్నీ ఒకే ప్రాంగణంలోకి వస్తాయి. ఐదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు విద్యార్థులు ఉంటారు.ప్రస్తుతం రాష్ట్రంలో చాలా గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు లేవు. 1,023 గురుకుల స్కూళ్లు ఉంటే అందులో 662 స్కూళ్లు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. పక్కా భవనం లేనప్పుడు బోధన, అభ్యసన కార్యక్రమాల అమలు ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే బడుగు, బలహీనవర్గాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి చదువు చెప్పించే లక్ష్యంతో సమీకృత గురుకులాలను తీసుకొస్తున్నాం..’’ అని భట్టి తెలిపారు.తొలుత 19 నియోజకవర్గాల్లో..ఇప్పటివరకు 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి కావాల్సిన భూమి, ఇతర అంశాలకు సంబంధించి ప్రతిపాదనలు వచ్చాయని భట్టి తెలిపారు. అందులో ఈ నెల 11న 19 చోట్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నామని.. మిగతా నియోజ కవర్గాల్లో పూర్తిస్థాయి సమాచారం అధారంగా పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మా ణాన్ని స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నిర్మించా లని నిర్ణయించామని.. విద్యార్థులకే కాకుండా బోధన, బోధనేతర సిబ్బందికి అక్కడే క్వార్టర్స్ ఉంటాయని చెప్పారు. ఈ పాఠశా లల్లో చదువుల పేరిట ఒత్తిడి సృష్టించే వాతావరణం కాకుండా క్రీడలు, వినోదం వంటివి కూడా విద్యార్థులకు అందిస్తామన్నారు.ఒకరోజు ముందే దసరా పండుగ: మంత్రి వెంకట్రెడ్డిరాష్ట్ర ప్రభుత్వం ఒకేరోజు 19 సమీకృత గురుకుల పాఠశాలల పనుల కు శంకుస్థాపన చేయడం శుభపరిణామమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురుకుల పిల్లలకు ఒకరోజు ముందే దసరా పండుగ వచ్చినట్టేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న గురుకులాల్లో సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు మంచి భవిష్యత్తు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే కొందరు ప్రతిపక్ష పార్టీ నేతలు అనవసర వివాదాలు రేపుతున్నారని మండిపడ్డారు.అన్ని నియోజకవర్గాల్లో సమీకృత గురుకులాలు: మంత్రి పొన్నంరాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీకృత గురుకుల పాఠశాలలు నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే రూ.1,100 కోట్లు ఖర్చు పెట్టి అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట స్కూళ్ల మరమ్మతులు పూర్తిచేశామన్నారు. గురుకుల విద్యాసంస్థల్లో కొత్త నియామకాలు పూర్తి చేశామని.. ప్రభుత్వ స్కూళ్లలో బదిలీలు, పదోన్నతులు చేపట్టామని చెప్పారు.11న శంకుస్థాపన చేయనున్న సమీకృత గురుకులాలు ఇవే..కొడంగల్, మధిర, మంథని, హుస్నాబాద్, నల్లగొండ, హుజూర్నగర్, ములుగు, ఖమ్మం, కొల్లాపూర్, చాంద్రాయణ్‌గుట్ట, మంచిర్యాల, అచ్చంపేట, తిరుమలగిరి, పాలేరు, వరంగల్, ఆందోల్, భూపాలపల్లి, స్టేషన్ ఘన్పూర్, తుంగతుర్తి. -
పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: ఐటీ, రెన్యూవబుల్ ఎనర్జీ, వస్తు సేవల ఉత్పత్తి రంగాల్లో పురోగమిస్తున్న తెలంగాణ..అమెరికన్ కంపెనీల భాగస్వామ్యాన్ని సహకారాన్ని కోరుతోందని, గ్లోబల్ సిటీ అయిన హైదరాబాద్‌కు పెట్టుబడులతో తరలిరావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు. అమెరికాలోని లాస్వేగాస్లో జరుగుతున్న మైన్స్ ఎక్స్పో– 2024 సదస్సులో గురువారం ఆయన ప్రముఖ అమెరికన్ కంపెనీలతో సమావేశమయ్యారు. భారత ఆర్థిక పురోగతిలో అమెరికన్ కంపెనీలు కీలక పాత్ర పోషించాయని, దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, ఆపిల్ సంస్థలు హైదరాబాద్‌ను తమ స్వస్థలంగా భావిస్తూ.. వ్యా పారాలు నిర్వహిస్తున్నాయని, తద్వారా హైదరాబాద్ గ్లోబల్ ఐటీ కేంద్రంగా, ఇన్నోవేషన్ హబ్‌గా రూపుదిద్దుకున్నదని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ వ్యాపార అనుకూల విధానాలు, నైపుణ్యం గల మానవ వనరులు, చక్కని మౌలిక సదుపా యాలు గల హైదరాబాద్ సిటీ పెట్టుబడులకు స్వర్గధామం అని అన్నారు. హైదరాబాద్ టెక్నాలజీ హబ్‌గానే కాకుండా ఫార్మాసిటీ రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఉంటుందన్నారు. కరోనా విపత్కర సమయంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, అరబిందో ఫార్మా, బయోలాజికల్–ఈ, భారత్ బయోటెక్ వంటి కంపెనీల ఆవిష్కరణలతో ‘వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్’గా నగరం ఖ్యాతి గడించిందని చెప్పారు.ఐటీ అభివృద్ధిలో, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ ఆవిష్కరణ జరుగుతోందని, ఇక్కడ ఏఐతో నిర్వహించే పరిశ్రమలు, ఏఐ అభివృద్ధి, స్మార్ట్ ఇన్ఫ్రాస్టక్చర్, గ్రీన్ ఎనర్జీ ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తున్నామని, ఈ విభాగాల్లో ఆసక్తి, అనుభవం ఉన్న కంపెనీలకు తెలంగాణ స్వాగతం పలుకుతుందన్నారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఇంధన, పారిశ్రామిక విధానాలు రూపొందించామని, కొత్త ఆవిష్కరణలకు, ఆర్థికాభివృద్ధికి, పునరుత్పాదక విద్యుత్ అభివృద్ధికి ఎక్కువ అవకాశాలుంటాయన్నారు.ఫ్యూచర్ సిటీలో నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీని వృద్ధి చేయడానికి ఎక్కువ అవకాశాలున్నాయని తెలి పారు. సదస్సులో ఆ్రస్టేలియాకు చెందిన డోపల్ మేర్ కంపెనీ స్టాల్‌ను సందర్శించారు. ఈ కంపెనీ రూపొందించిన అత్యాధునిక బొగ్గు, ఓవర్ బర్డెన్ రవాణా బెల్టులు, వాటి పనితీరును పరిశీలించారు. సౌత్ ఆఫ్రికా, స్విజర్లాండ్ వంటి దేశాలలో తమ కంపెనీ బెల్టులతో జరుగుతున్న రవాణా ప్రక్రియను స్టాల్ నిర్వాహకులు వివరించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్, స్పెషల్ సెక్రటరీ కృష్ణభాస్కర్ పాల్గొన్నారు. -
నష్టపోయిన అందరినీ ఆదుకుంటాం: డిప్యూటీ సీఎం భట్టి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘వరదతో నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం..ఎంత ఖర్చయినా పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మాది ప్రజా ప్రభుత్వం... ప్రజల కోసం పనిచేస్తుంది’అని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. శని, ఆదివారాల్లో ఆయన ఖమ్మం నగరం, మధిర నియోజకవర్గాల్లో పర్యటించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ముంపు బాధితులతో మాట్లాడుతూ ప్రభుత్వపరంగా సౌకర్యాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. పలు ప్రాంతాల్లో వరదలతో నష్టపోయిన బాధితులను పరామర్శించడంతోపాటు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భారీ వర్షాలు ఇంకా ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అర్ధరాత్రి ఖమ్మం చేరుకొని.. ఆకేరు, మున్నేరు వరద మళ్లీ పెరుగుతోందన్న సమాచారంతో డిప్యూటీ సీఎం భట్టి శనివారం అర్ధరాత్రి ఖమ్మం చేరుకున్నారు. కాల్వొడ్డు వద్ద ప్రజలతో మాట్లాడి వరదలు వచ్చే అవకాశం ఉన్నందున పునరావాస కేంద్రాలకు వెళ్లాలని చెప్పారు. ఆ తర్వాత కాల్వొడ్డులో మున్నేరు బ్రిడ్జి వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. అక్కడి నుంచి స్వర్ణభారతి కల్యాణ మండపం, మహిళా డిగ్రీ కళాశాల, ఖమ్మం అర్బన్ మండలం ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించిన భట్టి.. బాధితులతో మాట్లాడి తాగునీరు, ఆహా రం, వైద్యం, మందులు అందుతున్నాయా, లేదా అని ఆరా తీశారు. ఎక్కడా సౌకర్యాల కల్పనకు వెనక్కి తగ్గొద్దని, బా«ధితులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆయన వెంట వచ్చిన కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, సీపీ సునీల్‌దత్‌ను ఆదేశించారు. మధిర నియోజకవర్గంలో పర్యటన మధిర నియోజకవర్గంలోని ముదిగొండ, చింతకాని, బోనకల్, మధిర మండలాల్లో డిప్యూటీ సీఎం భట్టి పర్యటించారు. వరదతో దెబ్బతిన్న పంటపొలాలు, రోడ్లు, కట్టలు తెగిన చెరువులు, కూలిన ఇళ్లను పరిశీలించి, బాధితులను పరామర్శించి ఓదార్చారు. గండ్లు పడిన చెరువులు, దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల పునర్నిర్మాణానికి అంచనాలు వెంటనే రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆరుగురు మృతి చెందగా, వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెక్కులు అందజేశారు. దెబ్బతిన్న పాఠశాలల్లో బురద తొలగించి త్వరగా పున:ప్రారంభం అయ్యేలా చూడాలని చెప్పారు. -
6,000 పోస్టులతో మరో డీఎస్సీ: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: మరో ఆరు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో డీఎస్సీ వేయబోతున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను రూపొందిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 17,862 ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్‌ను అందించేందుకు జీవో జారీ చేసినట్టు వెల్లడించారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని గురువారం రవీంద్రభారతిలో గురుపూజ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భట్టి మాట్లాడుతూ, ప్రగతిశీల సమాజ నిర్మాణంలో టీచర్లది కీలకపాత్ర అని కొనియాడారు. 2007లో ఆంగ్ల మాధ్యమ బోధనపై విమర్శలు వచ్చినా, టీచర్లు సహకరించారని భట్టి గుర్తు చేశారు. ప్రపంచంతో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు. విద్యారంగానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఫలితాలను మరో పదిరోజుల్లో వెల్లడించనున్నట్టు తెలిపారు. రూ.667 కోట్లతో ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, వాటి నిర్వహణ బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించామణి చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించడానికి నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామని, 63 ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని భట్టి తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.300 కోట్లు వెచ్చించామని, ఉస్మానియా వర్సిటీకి రూ.వంద కోట్లు కేటాయించామని వివరించారు. విద్యారంగంలో సమూల మార్పుకే విద్యా కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు పూర్తి రీయింబర్స్మెంట్.. ప్రభుత్వ స్కూళ్లలో చదివిన విద్యార్థులకు విదేశీ విద్య, ఉన్నత విద్యకు సంబంధించి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేందుకు ఆలోచిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని, టీచర్లు కూడా స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు కృషిచేయాలని సూచించారు. అలాగే విద్యారంగంలో తీసుకు వస్తున్న సంస్కరణలకు సహకారం అందించాలని కోరారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, అణగారిన వర్గాల కొత్తతరం ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లకు వస్తోందని, వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత టీచర్లపై ఉందని అన్నారు. మారుతున్న కాలంతో పాటు ఉపాధ్యాయులూ ఆప్‌గ్రేడ్ కావాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, పాఠశాల విద్య డైరెక్టర్ నర్సింహారెడ్డి, ఇంటర్‌బోర్డ్ కార్యదర్శి శృతి ఓజా, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, ప్రొఫెసర్ వెంకటరమణ, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ఎమ్మెల్సీలు కూర రఘోత్తమ్‌రెడ్డి, ఎ.నర్సిరెడ్డి, ఎ.వెంకటనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందించిన 150 మంది అధ్యాపకులను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు. -
TG: ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇక.. ఇవాల్టీ నుంచే విద్యాసంస్థలో ఉచిక విద్యుత్ అమలులోకి వస్తుందని, జీవో కూడా విడుదల చేశామని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోని 27,862 విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అందనుంది.గురువారం రవీంద్ర భారతిలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ‘విద్యా సంస్థలకు ఉచితంగా ఇచ్చే విద్యుత్తు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. విద్యతో పాటు గురువులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. గత పది సంవత్సరాల్లో ఇబ్బందులు పడ్డ ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు నిర్వహించింది మా ప్రభుత్వమే. 11,062 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ వేసి పరీక్షలు నిర్వహించాం, మరో 6వేల పోస్టులకు నోటిఫికేషన్ వేస్తాం. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. యూనివర్సిటీల మౌలిక వసతులకై రూ.300 కోట్లు కేటాయించాం. ప్రభుత్వ బడుల మౌలిక వసతుల కల్పనకు రూ.667 కోట్లు వెచ్చించాం. శానిటేషన్ వర్క్స్ ఏర్పాటుకు రూ. 136 కోట్లు విడుదల చేశాం. ప్రగతిశీల తెలంగాణ రాష్ట్రం నిర్మాణం కావడానికి ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో భట్టితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. -
Heavy Rains: వరద విధ్వంసం
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: మూడు రోజుల పాటు కురిసిన కుండపోత వానలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాయి. వందల గ్రామాలకు వెళ్లే రహదారులు కొట్టుకుపోయాయి. అనేక చోట్ల చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి. లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఏకబిగిన కురిసిన వానలతో జనావాసాల్లోకి వరదలు పోటెత్తడంతో వేలాది ఇళ్లు నీటమునిగాయి. సామగ్రి, నిత్యావసరాలు పాడైపోయాయి. ద్విచక్రవాహనాలు, కార్లు దెబ్బతిన్నాయి. సోమవారం మధ్యాహ్నం సమయానికి వర్షాలు తగ్గుముఖం పట్టినా.. వరదలు ఇంకా తగ్గలేదు. ఈ క్రమంలో పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఖమ్మం జిల్లాలో తొలిసారిగా డ్రోన్ల సాయంతో వరదలో చిక్కుకున్న ప్రజలకు ఆహార పొట్లాలను అందించారు. భారీ వర్షాలతో ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో ఎక్కువ నష్టం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కలసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లాల ఇన్చార్జి మంత్రులు తమ జిల్లాల్లో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 110 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి.. 4వేల మందిని వాటిలోకి తరలించారు. ఖమ్మం సర్వం మున్నేరార్పణం భారీ వరదలతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు పరీవాహక ప్రాంతం అల్లకల్లోలమైంది. వరద తాకిడితో పదులకొద్దీ ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వందలాది ఇళ్ల పైకప్పులు, గోడలు కూలిపోయాయి. ఇళ్లలో ఉన్న వస్తువులతోపాటు ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా కొట్టుకుపోయాయి. ఒక్కసారిగా వచ్చిన వరదతో లోతట్టు ప్రాంత ప్రజలు కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు చేరారు. ఖమ్మం నగరంతోపాటు పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మంరూరల్ మండల పరిధిలో ఇళ్లు దెబ్బతిన్నాయి. ఫ్రిడ్జ్‌లు, టీవీలు, ఇతర ఎల్రక్టానిక్ సామాగ్రి తడిసి దెబ్బతిన్నాయి. ఖమ్మంలోని మోతీనగర్‌లో ఓ కుటుంబం దాచుకున్న బంగారం, డబ్బులు వరదనీటిలో కొట్టుకుపోయాయి. ఎఫ్‌సీఐ గోడౌన్ వద్ద 250కిపైగా లారీలు నీట మునిగిపోయాయి. ఒక్కో లారీ మరమ్మతుకు రూ.లక్షకుపైగా ఖర్చవుతుందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలోని ఆకేరు వాగు పొంగి తిరుమలాయపాలెం మండలాన్ని ముంచెత్తింది. పాలేరు వరదతో కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఖమ్మం నగరంలో రామన్నపేట, వెంకటేశ్వరనగర్, పద్మావతినగర్, సారథినగర్, మామిళ్లగూడెం, బొక్కలగడ్డ, కాల్వొడ్డు, నయాబజార్, మంచికంటి నగర్, మోతీనగర్, పెద్దమ్మతల్లిగుడి రోడ్డు, ప్రకాశ్‌నగర్, దంసలాపురం కాలనీ.. ఖమ్మంరూరల్ మండలంలోని పోలేపల్లి, సాయిగణే‹Ùనగర్, కరుణగిరి, పెద్దతండా ప్రాంతాలు, చింతకాని, ముదిగొండ, మదిర, ఎర్రుపాలెం మండలాల్లోని పలు గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగింది. మున్నేరు వరద తగ్గడంతో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రోడ్లపై ఉన్న బురదను తొలగిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులు ఇళ్లకు చేరుకొని అన్నీ శుభ్రం చేసుకుంటున్నారు. యంత్రాంగం విఫలమవడంతోనే.. మున్నేరు వరద విషయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది కూడా జూలై 26 అర్ధరాత్రి నుంచి రెండు రోజుల పాటు మున్నేరు పరీవాహక ప్రాంతాన్ని వరద ముంచింది. ఆ సమయంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ, పునరావాస కేంద్రాలకు తరలించారు. కానీ ఈసారి అదే తరహాలో మున్నేరుకు భారీ వరద వస్తున్నా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారని స్థానికులు మండిపడుతున్నారు. జల విలయంలోనే మహబూబాబాద్! భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో, అందులోనూ మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విధ్వంసం జరిగింది. నెల్లికుదురు మండలం రావిరాల మొదలుకొని వందలాది గ్రామాలు నీట మునిగాయి. చాలా గ్రామాల చుట్టూ ఇంకా వరద కొనసాగుతుండటంతో జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి. ప్రజలు ఇళ్లలో తడిసిపోయిన సామగ్రిని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేరుకొని తొగరాయ్రి, కూచిపూడి గ్రామాలు సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో అంతర గంగ వరదతో కకావికలమైన తొగర్రాయి, కూచిపూడి గ్రామాలు సోమవారం కూడా తేరుకోలేదు. ఆ రెండు గ్రామాలు 70శాతానికిపైగా మునగడంతో.. ప్రజలు నిత్యవసర వస్తువులతోపాటు పంట పొలాలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారు. తొగýర్రాయి, కూచిపూడి, గణపవరంలలో వెయ్యికి పైగా వ్యవసాయ మోటార్లు కొట్టుకుపోయినట్టు రైతులు వాపోతున్నారు. కోదాడ మండలంలో తీవ్రంగా నష్టపోయిన తొగర్రాయి, కూచిపూడి గ్రామాలను ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి సోమవారం సందర్శించారు. ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. మిగిలింది కట్టుబట్టలే! ఈ ఫొటోలో కనిపిస్తున్నది సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం నారాయణపురం చెరువు పక్కన ఉన్న మోహనరావు ఇల్లు. ఇంటి ముందు ఎయిర్ కంప్రెషర్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. శనివారం సాయంత్రం భారీ వర్షాలతో చెరువు కట్ట తెగడంతో నీరంతా ఒక్కసారిగా ముంచెత్తింది. మోహన్‌రావు, ఆయన భార్య, ఇద్దరు కుమారులు దూరంగా పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ ఇల్లు దెబ్బతిన్నది, సామగ్రి అంతా కొట్టుకుపోయింది. తమకు కట్టుబట్టలే మిగిలాయని మోహనరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ఇల్లు చూసినా ఇదే దుస్థితి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో వరద బీభత్సానికి అన్ని ఇళ్లలో బియ్యం, నిత్యావసరాలు, ఇతర సామగ్రి అంతా తడిసి పాడైపోయాయి. ‘‘తినడానికి తిండి గింజలు లేకుండా పోయి బతకలేని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఆదుకుని నిరుపేద కుటుంబాలను చేరదీయాలి’’ అని గ్రామానికి చెందిన రాస యాకన్న ఆవేదన కోరుతున్నాడు. తడిసిపోయిన బియ్యాన్ని బయటపడేస్తూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఫారంలో ఒక్క కోడీ మిగల్లేదు.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో బెజ్జం సమ్మయ్య, ఎస్కే అమీర్ కలిసి కోళ్లఫారం నడుపుతున్నారు. ఆదివారం భారీ వర్షంతో ఫారంలోకి వరద ముంచెత్తింది. ఒక్కటీ మిగలకుండా రెండున్నర వేల కోళ్లు మృతి చెందాయి. ‘‘ఒక్కో కోడి కేజీన్నర బరువుదాకా పెరిగింది. నాలుగైదు రోజుల్లో కంపెనీ వారికి అప్పగించాల్సి ఉంది. అలాంటిది నోటిదాకా వచ్చిన కూడును వరద లాగేసింది..’’ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పొలాల నిండా.. కంకర, ఇసుక మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరి రోడ్డుకు సమీపంలోని వరిచేన్లలో వేసిన కంకర, ఇసుక మేటలివి. ఇటీవల ఇక్కడ రోడ్డు పనులు ప్రారంభించారు. దానికోసం తెచ్చిన కంకర, ఇసుక అంతా వరదకు కొట్టుకొచ్చి పొలాల్లో చేరింది. తిరిగి పొలాన్ని బాగు చేసుకోవాలంటే చాలా ఖర్చవుతుందని రైతులు వాపోతున్నారు. -
సహాయక చర్యల్లో ఆ మంత్రులు విఫలం
సాక్షి, హైదరాబాద్, చేగుంట(తూప్రాన్): ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వరదల్లో చిక్కుకున్న 9 మందిని కూడా కాపాడలేకపోయారని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. సోమవారం మెదక్ జిల్లా చేగుంటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వాతావరణశాఖ హెచ్చరికలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే అనేక మంది మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు.వర్షాలతో 16 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం చెబుతున్నా.. తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం 31 మంది మృతి చెందారని తెలిపారు. ఖమ్మంలో కాపాడమని కోరుతున్న వరద బాధితులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దారుణమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు సహాయక చర్యలు చేపట్టడం మానేసి బీఆర్ఎస్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని నిందించారు. ప్రతీ ఎకరాకు రూ.10వేల పరిహారమివ్వాలి ఓ వైపు ప్రజలు ఆపదలో ఉంటే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాజకీయాలు మాట్లాడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. ప్రజల కన్నీళ్లు తుడవకుండా ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తున్నారని ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ ఎకరాకు రూ.10వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, శాసన మండలి మాజీ సభ్యులు, ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై సోషల్ మీడియా వేదికగా బీజేపీ చేస్తున్న దాడిని హరీశ్‌రావు ఖండించారు. -
సోషల్ మీడియాలో బతికేస్తున్న కేటీఆర్, హరీశ్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రతిపక్షాలు ప్రజాప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు పనికిమాలినవని.. వాళ్లు చేసిన పాపాలపై నిలదీస్తారనే భయంతో ప్రజల్లోకి వచ్చే ధైర్యం లేక ట్విటర్, ఫేస్బుక్, వాట్సాప్ వేదికగా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు రాజకీయంగా బతికేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. అనుకోని విధంగా వచి్చన ఈ విపత్తును ఎదుర్కొనేలా రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్‌గా ఉన్నందునే రాష్ట్రంలో ఎక్కడా ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు.వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులరి్పంచాక డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలకు పని లేదని.. వారు చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గత బీఆర్ఎస్ పాలకుల మాదిరిగా తాము గడీల్లో పడుకోలేదని, ప్రజల మధ్యే ఉండి సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో కొద్దిపాటి వర్షం పడితే జంట నగరాలు మునిగిపోయాయని, కానీ ఇంత పెద్ద విపత్తు వచ్చినా హైదరాబాద్ నేడు సురక్షితంగా ఉందంటే తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఫలితమేనని భట్టి తెలిపారు. భారీ వర్షాలు, వరదతో నిరాశ్రయులైన వారికి తక్షణమే నిత్యావసర సరుకులను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. -
కేసీఆర్.. ఏ ముఖం పెట్టుకొని వస్తావ్?: భట్టి విక్రమార్క
సాక్షి, పెద్దపల్లి: రూ.లక్ష రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇచ్చిన హామీ మేరకు నెలరోజుల్లోనే రూ.2లక్షల లోపు రుణాలను మాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోయిన మీరు.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇళ్లు ఇవ్వాలని బడ్జెట్ కేటాయిస్తే.. మీ మాదిరిగా వాటిని ఎగ్గొట్టాలని చెప్పడానికి వస్తారా? జాబ్ కేలెండర్ ప్రకటించి ఉద్యోగాలు ఇస్తుంటే అవి తప్పు అని చెప్పడానికి వస్తారా? దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ అని చెప్పి ఇవ్వలేదని చెప్పడానికి వస్తారా? .. అని కేసీఆర్‌ను నిలదీశారు. ‘నీవు, నీ కొడుకు పదేళ్లు తెలంగాణను దోచుకొని విదేశాల్లో దాచుకున్నారు’ అని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రులు శ్రీధర్‌బాబు, పోన్నం ప్రభాకర్‌తో కలిసి భట్టి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి వాట్సప్ గ్రూప్‌ల ద్వారా తప్పుడు ప్రచారం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి, ఉద్యోగల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతోపాటు, ప్రతీ నియోజకవర్గంలో యువతకు పోటీ పరీక్షలకు తరీ్ఫదు ఇచ్చేందుకు అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జెన్కో, సింగరేణి ఆధ్వర్యంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ రామగుండం థర్మల్ బీ పవర్ ప్లాంట్‌ను పరిశీలించిన మంత్రులు, అక్కడ అధికారులతో వివిధ పనులపై సమీక్షించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పాత ఆర్టీఎస్–బీ ప్లాంట్ స్థలంలోనే 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్‌ప్లాంట్‌ను జెన్కో, సింగరేణి సంయుక్త సహకారంతో స్థాపిస్తామని వెల్లడించారు. ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన భూమి, ఇతర సౌకర్యాల కల్పనకు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించి, త్వరగా ప్రతిపాదనలు పంపిస్తే పవర్‌ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 2031నాటికి గరిష్టంగా తెలంగాణకి 27,059 మెగావాట్ల విద్యుత్, 2034–35 నాటికి 31,809 మెగావాట్లకుపైగా విద్యుత్ డిమాండ్ ఉంటుందని అంచనా వేశామని వివరించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పీఎం కుసుమ్ పథకం కింద రాష్ట్రంలో మరో 4వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇందులో ప్రత్యేకంగా మహిళా సంఘాలకు ప్రాధన్యత కల్పిస్తామని భట్టి చెప్పారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మక్కాన్‌సింగ్, విజయరమణారావు, గడ్డం వివేక్, వినోద్, ప్రేమ్‌సాగర్‌రావు, సింగరేణి సీఎండీ ఎన్.బలరాం, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు పాల్గొన్నారు. -
N కన్వెన్షన్ కూల్చివేతపై భట్టివిక్రమార్క సంచలన కామెంట్స్
-
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి స్పందన..
ఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. ఎన్ కన్వెన్షన్‌కు నోటీసులు ఇచ్చిన తర్వాతనే కూల్చివేతలు చేసినట్లు మల్లు తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం చట్టబద్ధంగానే వ్యవహరించిందని ఆయన స్పష్టం చేశారు.2014కు ముందు హైదరాబాద్‌లో ఉన్న చెరువులు ఎన్ని ఉన్నాయో.. ఇప్పుడు ఉన్న చెరువు ఎన్నో చూస్తే ఆక్రమణలు బయటపడతాయన్నారు. రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ మ్యాపులతో అన్ని లెక్కలు బయటపెడతామన్నారు. కబ్జా అయిన చెరువులను కాపాడవద్దని అంటారా? అని మీడియా సమావేశంలో విలేకర్లను ఎదురు ప్రశ్నించారు డిప్యూటీ సీఎం భట్టి. ‘హైదరాబాద్ నగరం అంటేనే లేక్స్ అండ్ రాక్స్. వీటిని కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. చెరువులు ఏవీ ఆక్రమణకు గురికాకుండా పరిరక్షించడం కోసం ఏర్పాటు చేసిందే హైడ్రా. దీన్ని ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు. ప్రతి పనికి నోటీసులు ఇచ్చి ఆపై చర్యలు తీసుకుంటున్నారు. బఫర్ జోన్ లో కాదు, నేరుగా చెరువులోనే కఠిన నిర్మాణాలను కూల్చేస్తున్నారు. సాటిలైట్ ఫోటోల ద్వారా విభజనకు ముందు, విభజన తర్వాత ఈ 10 ఏళ్లలో చెరువులు ఎంత మేర ఆక్రమణకు గురయ్యాయి తెలుసుకుంటున్నాం. రిమోట్ సెన్సింగ్ సాటిలైట్ ఫోటోలను తీసి, అంతకుముందు ఎన్ని చెరువులు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అన్నది ప్రజల ముందు పెడతాం.చట్ట ప్రకారం, చట్టానికి లోబడి మాత్రమే చర్యలు చేపడతున్నాం. అన్నీ లెక్కలతో సహా ప్రజల ముందు పెడతాం. ప్రజల ఆస్తులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత’ అని ఆయన పేర్కొన్నారు. -
120 సమీకృత గురుకులాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సమీకృత గురుకులాల నిర్మాణానికి వెంటనే ఆయా నియోజకవర్గాల్లో స్థలాలు సేకరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5 వేల కోట్లతో 30 ప్రాంతాల్లో 120 సమీకృత గురుకులాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని సాధ్యమైనంత త్వరగా స్థలాల సేకరణతో పాటు, భవనాల నమూనాలు (డిజైన్లు) పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 15 నుంచి 25 ఎకరాల్లో, పట్టణ ప్రాంతాల్లో 10 నుంచి 15 ఎకరాల్లో సమీకృత గురుకుల పాఠశాలల ఏర్పాటు కోసం స్థల సేకరణ చేయాలని చెప్పారు. రాబోయే ఎడెనిమిది నెలల్లో ఈ భవనాలను పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సోమవారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని, అందుకు తగ్గట్టుగా అధికారుల పనితీరు ఉండాలని సూచించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో విద్యార్థుల ప్రవేశాలు వందశాతం పూర్తి చేయాలని చెప్పారు. ప్రతి విద్యార్థి మంచం పైనే పడుకోవాలి ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి మంచం పైనే పడుకునేలా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని భట్టి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 1,029 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు ఇప్పటివరకు మంచాలు, పరుపులు, దుప్పట్లు ఎన్ని ఉన్నాయి? ఇంకా ఎంతమందికి ఇవి కావాలి అనే దానిపై వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గురుకుల పాఠశాలలతో పాటు ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు తప్పనిసరిగా మరుగుదొడ్లు, స్నానాల గదులు, నీటి సరఫరా, విద్యుత్ సదుపాయం ఉండేలా చూడాలని, వసతి గదులకు తలుపులు, కిటికీలు, దోమలు రాకుండా వాటికి మెష్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యార్థులకు సౌకర్యాల కల్పనపై చెక్ లిస్టు రూపొందించి ఈనెల 29వ తేదీలోగా సమర్పించాలని ఆదేశించారు. చెక్ లిస్టును ప్రతి హాస్టల్లో ప్రదర్శించాలన్నారు. ఓవర్సీస్ స్కాలర్షిప్లు మంజూరు చేస్తాం విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలంటూ మంత్రి పొన్నం చేసిన విజ్ఞప్తిపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలో పెండింగ్‌లో ఉన్న ఓవర్సీస్ స్కాలర్íÙప్ బకాయిల జాబితాను అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 800 మంది బీసీ విద్యార్థులకు, 500 మంది చొప్పున ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. పెద్దాపూర్ పాఠశాలపై సమీక్ష జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను తాము సందర్శించిన తర్వాత అక్కడ తీసుకున్న చర్యలపై గురుకులాల కార్యదర్శి రమణకుమార్‌ను డిప్యూటీ సీఎం ఆరా తీశారు. విద్యార్థులకు మంచాలు, పరుపులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాఠశాల మైదానం చదును చేయాలని, నూతన భవనాల నిర్మాణం కోసం కావాల్సిన ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
ఇంత సోమరితనమా?
సాక్షి, హైదరాబాద్: ‘జలవిద్యుత్ కేంద్రాలకు మరమ్మతుల నిర్వహణలో ఎందుకంత కాలయాపన చేశారు? ఇంత సోమరిగా ఉంటే.. మిమ్మల్ని కొనసాగించాల్సిన అవసరం ప్రభు త్వానికి లేదు’అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి పరీవాహకంలోని జలాశయాలకు ఉధృతంగా వరదలు కొనసాగుతున్నా, జలవిద్యుత్ కేంద్రాల్లో పూర్తి సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేసుకోలేకపోతున్నామని మండిపడ్డారు.జలవి ద్యుత్ కేంద్రాలకు సత్వరం మరమ్మతులు నిర్వ హించి, వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయి లో పునరుద్ధరించాలని ఆదేశించారు. ‘జలకళ ఉన్నా హై‘డల్’’అనే శీర్షికతో ఈ నెల 7న సాక్షిలో ప్రచురించిన కథనంపై స్పందిస్తూ శనివారం ఆయన ప్రజాభవన్‌లో జెన్కో డైరెక్టర్లు, సీఈలతో సమీక్ష నిర్వహించారు. ఎగువ జూరాల, దిగువ జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ తదితర జలవిద్యుత్ కేంద్రాలకు మరమ్మతులు నిర్వహించకపోవడంతో.. వరదల సమయంలో పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేసుకొనే అవకాశం చేజారిపోయిందనే అంశాన్ని ఈ కథనం ఎత్తిచూపింది. మనసుపెట్టి పనిచేయండి.. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని సమీక్షలో ప్రస్తావిస్తూ.. జెన్కో ఉన్నతాధికారుల పనితీరుపై ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వృత్తిపట్ల నిబద్ధతతో, మనసుపెట్టి పనిచేయాలని, నిర్లక్ష్యానికి, అలసత్వానికి తావు ఉండరాదని హెచ్చరించారు. శ్రీశైలం, జూరాల తదితర జలవిద్యుత్ కేంద్రాలకు మర మ్మతుల విషయంలో గతంలో సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడంతో, వరదలు వస్తున్నా పూర్తి సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేసుకోలేక పోతున్నా మని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇకపై నిర్ణయాలు తీసుకోవడంలో ఇలాంటి జాప్యం పునరావృతం కారాదని ఆదేశించారు. విద్యుదు త్పత్తి కేంద్రాల పనితీరు, ఉత్పాదకతపై వారాని కోసారి తనకు నివేదికలను సమర్పించాలని ఆదే శించారు. విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి సమస్య లు ఏర్పడినా తక్షణమే ఇంధన శాఖ ముఖ్య కార్య దర్శి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని కోరా రు. విద్యుత్ కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహి ంచే చీఫ్ ఇంజనీర్ల నుంచి రాతపూర్వకంగా వివర ణ తీసుకుని, తగిన చర్యలు తీసుకోవాలని ఆదే శించారు. విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి అంతరా యం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ‘విద్యుత్’ అంటే నిరంతరం పనిచేయాల్సిన శాఖ.. విద్యుత్ శాఖలో ఉద్యోగమంటే నిరంతరం పని చేయాల్సిన అత్యవసర శాఖలో విధులు నిర్వర్తి స్తున్నామనే అంశాన్ని అన్ని స్థాయిల్లోని అధికా రులు, ఉద్యోగులు గుర్తు పెట్టుకోవాలని భట్టి అన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా నని భరోసా ఇచ్చారు. అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కనీసం 17 రోజుల విద్యుదుత్పత్తికి సరిప డా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండేలా చర్య లు తీసుకోవాలన్నారు. ఇంధన శాఖ ఇన్చార్జి ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, జెన్కో డైరెక్టర్లు అజయ్, వెంకటరాజం, లక్ష్మయ్య తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. -
సుంకిశాల పాపం గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే: భట్టి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎస్పీడీసీఎల్ అధికారులకు అదేశించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ఆయన గురువారం మింట్ కాంపౌండ్‌లో మాట్లాడారు. ‘‘అంతర్జాతీయ పెట్టుబడులను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సరఫరాపై దిశానిర్దేశం చేశాము. ఎస్పీడీసీఎల్లో అంతర్గత బదిలీలు, ప్రమోషన్లపై కూడా ఆదేశాలు జారి చేశాం. విద్యుత్ సరఫరాకు ఏదైనా ఇబ్బంది అయితే 1912 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ప్రజల కోసమే నిరంతరం ఎస్పీడీసీఎల్ పనిచేస్తోంది అని మర్చిపోవద్దు’’ అని అన్నారు.సుంకిశాలపై తప్పడు ప్రచారం.. సుంకిశాలపై వార్తల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని భట్టి విక్రమార్క్ అన్నారు. ‘మేడిగడ్డ గోదావరి నదిపై మాత్రమే కాదు.. కృష్ణానదిని కూడా గత ప్రభుత్వం వదిలిపెట్టలేదు. సుంకిశాల నిర్మాణం బీఆర్ఎస్ హయంలోనే నిర్మాణం జరిగింది. డిజైన్ లోపం వల్ల సుంకిశాల కూలింది. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. సుంకిశాల కట్టింది మేము కాదు.. గత ప్రభుత్వం కట్టిందే. గోదావరి మెడిగడ్డతో పాటు సుంకుశాల పాపం బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. 2021లో మొదలు 2023 జులైలో సుంకిశాలను గత ప్రభుత్వం ప్రారంభించింది. గత ప్రభుత్వ పాపాలను మాపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. పాపాలను భరించలేక ఇప్పటికే ప్రజలు గత ప్రభుత్వనికి బుద్ధి చెప్పారు’ అని అన్నారు. -
20 ఏళ్లూ కాంగ్రెస్ పాలనే
సాక్షి, ఆదిలాబాద్: ‘అధికారం అందివచ్చిందని అనుభవించాలని అనుకోలేదు.. ఒక బాధ్యతగా నడుచుకుంటున్నాం. ఆర్థిక ఇబ్బందులున్నా, హామీలు అమలు చేస్తాం. 20 ఏళ్లు కాంగ్రెస్సే పాలిస్తుంది’అని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పీప్రీ గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికలకు ముందు ఏఐసీసీ ఆదేశాల మేరకు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించాను. సీఎలీ్పనేతగా నేను ఓ వైపు.. నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోవైపు ఆదిలాబాద్ జిల్లా నుంచే యాత్రలు ప్రారంభించాం.ఆ పాదయాత్రలో ప్రజల గుండెచప్పుడు విన్నాం. చెప్పిన సమస్యల పరిష్కారానికి కంకణబద్ధులమై ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చాం. ఇప్పటివరకు అనేక హామీలు అమలు చేశాం. మొదటి సంవత్సరంలోనే ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. రూ.5లక్షలు ఖర్చు చేసి రెండు పడకలతో ఇల్లు నిర్మిస్తాం. ఎస్సీ, ఎస్టీలకు అదనంగా రూ.లక్ష జత చేసి ఇస్తాం. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. మరో 35వేల ఉద్యోగాల నియామక ప్రక్రియ చివరిదశకు చేరుకుంది. త్వరలోనే వారికి నియామక పత్రాలు అందజేస్తాం’అని భట్టి వివరించారు. గత పదేళ్లలో ఐటీడీఏ నిర్వీర్యం గత పదేళ్లు పాలించినవారు ఐటీడీఏలను నిరీ్వర్యం చేశారని డిప్యూటీ సీఎం భట్టి ఆరోపించారు. ‘పాదయాత్రలో గిరిజనులు నాకు ఈ విషయం చెప్పారు. ఐటీడీఏల కోసం తాజా బడ్జెట్లో రూ.17వేల కోట్లు కేటాయించాం. గిరిజన యువతకు చదువు చెప్పించడం, నైపుణ్యం కల్పించడం, డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు కృషి చేస్తాం. తుమ్మిడిహెట్టి ఆగిపోయింది. ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందడం లేదు.నాటి సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ పనులను పున:ప్రారంభించి ఈ జిల్లాకు నీళ్లు ఇస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయించాం’అని భట్టి చెప్పారు. సభలో ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్‌రావు, వెడ్మ బొజ్జు పటేల్, అనిల్‌జాదవ్, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీఓ ఖుష్బూగుప్తా తదితరులు పాల్గొన్నారు. -
భట్టికి నోబెల్ ప్రైజ్ ఇవ్వొచ్చు: ప్రశాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నిన్నటి(శుక్రవారం) వరకు జరిగినవి బడ్జెట్ సమావేశాలు కావు, అవి బుల్డోస్ చేసే వాటిలా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన శనివారం మీడయాతో మాట్లాడారు. ‘‘అసెంబ్లీలో జీరో ఆవర్ మొత్తానికే రద్దు చేశారు. కేవలం 6 రోజులే సమావేశాలు సాగాయి. 16 మంది మంత్రులు మాట్లాడాల్సిన అంశంపై చర్చనే జరగలేదు. నాకు అవకాశమే ఇవ్వలేదు. అన్యాయంగా నేను మాట్లాడకుండా నా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. ఏరోజు ఏ ఒక్క విప్ కూడా ప్రతిపక్షాలతో మాట్లాడలేదు. ప్రజా సమస్యల మీద మాట్లాడుదాం అంటే మైక్ కట్ చేశారు. మార్షల్స్‌ను పెట్టి ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయటికి పంపించారు. .. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష, ఆయన తీరు, హావభావాలు మొత్తం చూసి నాకు బాధేసింది. అసెంబ్లీ నడిచిన తీరు, ప్రభుత్వంలో ఉన్న నాయకులు మాట్లాడిన భాషను సైతం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. సబ్జెక్ట్ మంచిగా మాట్లాడుతున్నారని, ప్రతిపక్షాలది పైచేయి అవుతుంటే మమ్మల్ని ఆపే ప్రయత్నం చేసి, చర్చను మరుగున పడేశారు. ఈ సభ మొత్తం జరిగింది మాజీ సీఎం కేసీఆర్‌ణు తిట్టడం, గత ప్రభుత్వాన్ని నిందించటం, మమ్మల్ని బెదిరించటంతోనే సరిపోయింది... నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. జాబ్ క్యాలండర్లో స్పష్టత లేదు. రైతు భరోసా నిధుల మాటే లేదు. జాబ్ క్యాలండర్‌కు చట్టబద్దత ఏది? రుణమాఫీ అంశం క్లారిటీ లేదు. మైక్ ఇవ్వరు, అడిగితే మార్షల్స్‌ను పెట్టి ఎత్తిపడేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేంద్ర ఇరిగేషన్ మంత్రిత్వ శాఖ ఇవ్వాలని ప్రధాని మోదీని కోరుతున్నా. రూ. 75 కోట్లతో 1.50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని ఆయన అంటున్నారు. భట్టికి నోబెల్ ప్రైజ్ ఇవ్వొచ్చు. అసెంబ్లీ లో మహిళ ఎమ్మెల్యేలు కంట తడి పెట్టుకున్నారు. ఏం మొహం పెట్టుకొని అసెంబ్లీకి వచ్చారని డిప్యూటీ సీఎం అన్నారు. మా కర్మకాలి అసెంబ్లీకి వచ్చానని సబితా ఇంద్రారెడ్డి బాధపడుతూ చెప్పారు’’ అని ప్రశాంత్ రెడ్డి అన్నారు. -
విపక్ష నేతగా నిలబెట్టాల్సింది పోయి మోసం చేశారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తనకు 2018లో సీఎల్పీ నేతగా, ప్రతిపక్ష నేతగా అవకాశం కల్పించిందని, ఒక దళితుడికి సీఎల్పీగా అవకాశం లభించడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్‌లో దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి తన వెనక ఉండి ప్రతిపక్ష నేతగా నిలబెట్టాల్సింది పోయి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది నేతలతో కలిసి ఆమె ఇంటికి వెళ్లి పార్టీ విడిచి వెళ్లవద్దని, మీరు వెళ్తే సభ్యుల సంఖ్య తగ్గి ప్రతిపక్ష నేత హోదాను కోల్పోతానని, కాంగ్రెస్ పరువుపోతుందని ఆవేదన పడినా ప్రయోజనం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు.శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మధ్య జరిగిన వాగ్వాదానికి స్పందిస్తూ ఆయన మాట్లాడారు. ‘అధికారం, స్వార్థం కోసం కాంగ్రెస్ వదిలి టీఆర్ఎస్లో చేరిన మీరు బాధపడుతూ మాట్లాడుతున్నా అంటున్నారు. అసలు బాధ పడాల్సింది నేనా? కాంగ్రెస్ పార్టీనా? మీరా? ఇంకా ఏం ముఖం పెట్టుకుని సీఎం రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడతా రు? పార్టీలు మారి పరువు తీసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు’ అని భట్టి విక్రమార్క తీవ్ర స్వరంతో మాట్లాడారు. వేరే పార్టీలో ఉన్న సబితను 2004లో కాంగ్రెస్‌లో చేర్చుకుని టికెట్ ఇచ్చి ఐదేళ్లు మంత్రిగా చేసినట్టు గుర్తు చేశారు. 2009లో మళ్లీ టికెట్ ఇచ్చి మళ్లీ ఆమెను మంత్రిని చేసి అత్యంత ముఖ్యమైన శాఖలు అప్పగించారన్నారు. 2014లో పార్టీ ఆమెకు టికెట్ ఇచ్చిందని, వాళ్ల అబ్బాయికి కూడా ఎంపీ టికెట్ ఇచ్చిందని భట్టి చెప్పారు.మోసం చేశారు: మంత్రి సీతక్క కాంగ్రెస్‌లో చేరిన (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ.. కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేయించారని బీఆర్ఎస్పై మంత్రి సీతక్క మండిపడ్డారు. వారితో రాజీనామా చేయించి బీఆర్ఎస్లోకి తీసుకున్నారా? సబితతో రాజీనామా చేయించారా? అని నిలదీశారు. మీతో వస్తామని చెప్పి ఒకరిద్దరు మహిళలు ఏం చేశారో తనకు తెలుసని, ఆ బాధను సీఎం అనుభవించారని చెప్పారు.(కాంగ్రెస్‌లో చేరేందుకు) ఢిల్లీకి వస్తున్నామని వారు చెప్పడంతో సీఎం రేవంత్.. రాహుల్ గాంధీ వద్ద సమయాన్ని తీసుకున్నారని, ఆ తర్వాత రాకుండా మోసం చేశారన్నారు. ఆ బాధ అనుభవించిండు కాబట్టే కేటీఆర్‌కు సీఎం సూచన చేశారన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆమెను ఉద్దేశించి నీకేం తెలియదు అనగా, నీ దురహంకారాన్ని బంద్ చేసుకో అని సీతక్క తీవ్ర స్వరంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వారికి ఎంతో చేసిందని, అదే కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వారిద్దరు చప్పట్లు కొట్టడం సబబేనా? అని సబిత, సునీతా లక్ష్మారెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. ఆసక్తి లేకుంటే వెళ్లిపోవచ్చు: మంత్రి శ్రీధర్‌బాబు సభా నాయకుడు సీఎం మాట్లాడుతున్నప్పుడు సభ్యులందరూ సభలో కూర్చొని ఉండాలనే సంప్రదాయం ఉందని, కూర్చునే ఆసక్తి లేని వాళ్లు వెళ్లిపోవచ్చని శాసనసభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ మాట్లాడుతున్నప్పుడు బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ వెల్ వద్ద చేరి ఆందోళన చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. శాసనసభ వ్యవహారాల మంత్రిగా తనకున్న అధికారాలను సైతం ప్రశ్నిస్తూ కొత్త సంప్రదాయానికి తెరలేపారని మండిపడ్డారు. తీరు మారకపోతే సభలో (సస్పెన్షన్ తరహా) తీర్మానం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
రుణమాఫీ సాధ్యమా అన్నారుగా..! విమర్శకులకు భట్టి కౌంటర్
-
వైభవంగా లాల్‌దర్వాజా బోనాలు
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్): చారిత్రక నేపథ్యం కలిగిన లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి 116వ బోనాల జాతర ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలను తీసుకురాగా.. యువకులు పోతరాజు వేషధారణలో భక్తులను విశేషంగా అలరించారు. శివసత్తుల నాట్యాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. జోగినీలు మెట్ల బోనాలతో నృత్యాలు చేస్తూ ముందుకు కదిలారు. తెల్లవారుజామున 3 గంటలకు జల్లి కడువా, 4 గంటలకు బలిహరణ కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం ఉదయం 5.30 గంటలకు మాజీ మంత్రి టి.దేవేందర్‌గౌడ్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అమ్మవారికి దేవీ మహాభిషేకాన్ని నిర్వహించి మొదటి బోనం సమరి్పంచారు. ఉదయం 7 నుంచి ప్రారంభమైన బోనాల సమర్పణ సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగింది. కాగా, ఉదయం 10 గంటల అనంతరం అమ్మవారి ఆలయానికి వీఐపీల తాకిడి ప్రారంభమైంది. వీరి రాక అధికం కావడంతో బోనం ఎత్తుకున్న మహిళలు కాస్త అసౌకర్యానికి గురవ్వాల్సి వచి్చంది.ఇక సాధారణ భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో ఎదురు చూడాల్సి వచి్చంది. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీ సమేతంగా వచ్చి అమ్మవారికి పట్టు వ్రస్తాలు సమరి్పంచారు. జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బంగారు బోనం సమరి్పంచారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు అనిల్‌కుమార్ యాదవ్, కె.లక్ష్మణ్, ఎంపీలు ఈటల రాజేందర్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, వెంకటరమణారెడ్డి, రాజ్‌ఠాకూర్, లక్ష్మణ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్షి్మ, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలిమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిభాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టు వ్రస్తాలు సమరి్పంచిన మంత్రిచార్మినార్ (హైదరాబాద్): భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉంటున్నారని.. రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు. ఆషాడ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆయన ప్రభుత్వం తరఫున చారి్మనార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారికి కుటుంబ సభ్యులతో కలసి పట్టు వ్రస్తాలు సమరి్పంచారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత ఏడాది వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడ్డారని, ఈసారి అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు పడాలని, పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. కాగా, అఖిలపక్ష నిర్ణయానికి అనుగుణంగా పాత డెజైన్‌తో కొత్తగా ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తామన్నారు. పాత బస్తీ స్థితిగతులను మార్చేందుకు మెట్రోను విస్తరిస్తున్నామ న్నారు. మేడిగడ్డ బరాజ్ కుంగడంలో కుట్ర ఉందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, మేడిగడ్డ కుంగినప్పుడు అధికారంలో ఉన్నది కేటీఆరేనని గుర్తు చేశారు. -
నేడు వార్షిక బడ్జెట్‌పై చర్చ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు శాసనమండలి, శాసనసభలో వార్షిక బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది.శాసన సభ ప్రారంభమైన వెంటనే నేరుగా బడ్జెట్ ప్రతిపాదనలపై కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులు ప్రసంగిస్తారు. అనంతరం బడ్జెట్‌పై జరిగిన చర్చకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమా ధానం ఇస్తారు. శాసనమండలిలోనూ బడ్జెట్‌పై జరిగే చర్చకు భట్టి సమాధానం ఇస్తారు. -
Telangana Budget: మాది సంకల్ప బలం
గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, వైఫల్యాలను గుర్తించిన ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుని కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారు. మేం ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలనే ఉద్దేశంతో హామీలివ్వలేదు. ప్రజల గుండె చప్పుళ్లకు స్పందించి హామీలను ప్రజల ముందుంచాం. అవి అలవికానివంటూ ప్రతిపక్షాలు పదేపదే విమర్శిస్తున్నాయి. కానీ సంకల్పబలం, చిత్తశుద్ధి, సమర్థత, నిజాయతీలే పునాదులుగా నిర్మితమైన మా ప్రభుత్వానికి అలవికాని హామీలంటూ లేవని తొలి అడుగుతోనే నిరూపించాం.– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసాక్షి, హైదరాబాద్: ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తామిచ్చిన హామీలను అమలు చేసి చూపాలన్న పట్టుదలతో ఉన్నామని.. ఆ దిశగానే రాష్ట్ర బడ్జెట్‌కు రూపకల్పన చేశామని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని రుణమాఫీ అమలుతో మరొక్కసారి రుజువైందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, అర్హులకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్, నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చే ఇందిరమ్మ ఇళ్ల పథకం, అర్హులకు ఉచితంగా నెలకు 200 యూనిట్ల విద్యుత్ సరఫరా వంటి హామీలను ప్రభుత్వం ఏర్పడిన కొన్నిరోజుల్లోనే అమల్లోకి తెచ్చామని చెప్పారు. త్వరలోనే మిగతావీ చేసి చూపిస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను భట్టి విక్రమార్క గురువారం ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,91,159 కోట్ల అంచనాతో ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ, గత ప్రభుత్వ తీరును విమర్శిస్తూ, శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులను వివరిస్తూ సుదీర్ఘంగా గంటా 45 నిమిషాల పాటు ప్రసంగించారు. భట్టి బడ్జెట్ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ మహాకవి దాశరథి వరి్ణంచిన తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన సోనియాగాంధీ ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వ తొలి పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నందుకు సంతోషిస్తున్నాను. పదేళ్ల అస్తవ్యస్త పాలనకు విజ్ఞతతో చరమగీతం పాడిన తెలంగాణ ప్రజానీకానికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు. వామనావతారంలా పెరిగిన అప్పులు.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత దశాబ్దకాలంలో రాష్ట్ర పురోభివృద్ధి ఆశించిన మేరకు జరగలేదు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని వట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వ పాలకులు.. అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమయ్యారు. ప్రజల సంక్షేమం సన్నగిల్లింది, అభివృద్ధి అడుగంటింది, రాష్ట్రం అప్పుల పాలైంది. రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న రూ.75,577 కోట్ల అప్పు.. 2023 డిసెంబర్ నాటికి వామనావతారంలా పెరిగి పెరిగి రూ.6,71,757 కోట్లకు చేరింది. సాగునీటి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. నీళ్లను ఏ కాలువల ద్వారా పారించాలన్న ధ్యేయంతో కాకుండా.. అవినీతి సొమ్మును ఏ కాలువల ద్వారా ప్రవహింపచేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసింది. ఓ వైపు అప్పులు, మరోవైపు పేరుకుపోయిన బిల్లులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుంది. ఇప్పుడు మా ప్రభుత్వం తగిన దిద్దుబాటు చర్యలను చేపట్టడంతోపాటు మరింత మేలైన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలనే కృత నిశ్చయంతో ఉంది. తలకు మించిన రుణభారం ఉన్నప్పటికీ దుబారా ఖర్చులు కట్టడి చేసి, ఆర్థిక క్రమశిక్షణతో పాలన ప్రారంభించాం. ఈ సంవత్సరం మార్చి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు క్రమం తప్పకుండా ప్రతి నెలా ఒకటో తారీఖున జీతాలు/పెన్షన్లు చెల్లించేలా చర్యలు తీసుకున్నాం. బడ్జెట్ సమగ్ర స్వరూపం (రూ.కోట్లలో) అప్పులు తీరుస్తూ.. సంక్షేమం పాటిస్తూ.. రాష్ట్రానికి డిసెంబర్ నాటికి రూ.6,71,757 కోట్లు అప్పులు ఉన్నట్టు తేలింది. మా ప్రభుత్వం వచ్చాక రూ.35,118 కోట్ల రుణాలు తీసుకోగా.. గత ప్రభుత్వం తాలూకు రూ.42,892 కోట్ల రుణాలు, వడ్డీలు చెల్లించాం. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం. ఇదే సమయంలో సంక్షేమాన్ని విస్మరించలేదు. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు రూ.34,579 కోట్లను వివిధ పథకాలపై ఖర్చు చేశాం. మూలధన వ్యయానికి అదనంగా రూ.19,456 కోట్లు ఖర్చు చేశాం. గత దశాబ్దకాలంలో ఉద్యోగ నియామకాలు సరిగా జరగక నిరుద్యోగ యువత కలలు కల్లలయ్యాయి. అక్రమాలు, పేపర్ లీకేజీలు, అసమర్థ పరీక్ష నిర్వహణతో యువతకు ఉద్యోగాలు అందని పరిస్థితి ఏర్పడింది. దాన్ని సరిదిద్ది నియామక ప్రక్రియలో పారదర్శకత తీసుకొచ్చే చర్యలను మా ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే 31,768 ఉద్యోగ నియామక పత్రాలను అందజేశాం. జాతీయ వృద్ధిరేటుకన్నా వెనుకబడ్డాం.. 2023–24లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2 శాతం వృద్ధి చెందితే.. మన దేశ ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం, తెలంగాణ 7.4 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అంటే గత ఏడాది జాతీయ వృద్ధిరేటు కన్నా తెలంగాణ వృద్ధిరేటు తక్కువ. 2023–24లో తెలంగాణ జీఎస్డీపీ ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కిస్తే రూ.14,63,963 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే 11.9 శాతం వృద్ధి నమోదైంది. జాతీయ స్థాయిలో ఈ వృద్ధి రేటు 9.1 శాతం. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వృద్ధితో పోల్చినప్పుడు ఖర్చుల కోసం రుణాలపై భారీగా ఆధారపడిందన్న విషయం స్పష్టమవుతోంది. ఇటువంటి పరిస్థితి ఆర్థిక సుస్థిరతకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. ఆదాయాన్ని మించి రుణం నిరంతరంగా పెరుగుతూ వచ్చింది. కఠిన ఆర్థిక సంస్కరణలు తీసుకురాని పక్షంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో పడుతుంది. జిల్లాల మధ్య ఆదాయ అంతరాలు.. 2023–24లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,47,299. జాతీయ తలసరి ఆదాయం రూ.1,83,236తో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,64,063 ఎక్కువ. అదే సమయంలో తలసరి ఆదాయ స్థాయిల్లో జిల్లాల మధ్య తీవ్రమైన అంతరం ఉంది. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ.9,46,862 అయితే.. వికారాబాద్ జిల్లా తలసరి ఆదాయం రూ.1,80,241 మాత్రమే. అంటే జిల్లాల మధ్య ఆర్థికాభివృద్ధి సమాన స్థాయిలో లేదని స్పష్టమవుతోంది..’’ అని భట్టి పేర్కొన్నారు. అనంతరం వివిధ శాఖలు, పథకాల వారీగా బడ్జెట్ కేటాయింపులను వెల్లడించారు. అతి త్వరలో రూ.2లక్షల వరకు రుణమాఫీ ‘‘గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని రైతులను అప్పుల్లోకి నెట్టిందే తప్ప నిజంగా ఎలాంటి మేలు చేయలేదు. మేం రైతులకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో ఏకకాలంలో రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేయాలని నిర్ణయించి అమలు ప్రారంభించాం. జూలై 18న రూ.లక్ష వరకు రుణమున్న 11.34 లక్షల మంది రైతులకు రూ.6,035 కోట్ల రుణమాఫీ మొత్తాన్ని ఖాతాల్లో ఒకేసారి జమచేశాం. రూ.రెండు లక్షల వరకు రుణం ఉన్న మిగతా రైతులకు కూడా అతిత్వరలో రుణమాఫీ జరుగుతుంది. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని రుణమాఫీ అమలుతో మరొక్కసారి రుజువైంది.’’ధరణికి శాశ్వత పరిష్కారం చూపిస్తాంబడ్జెట్ ప్రసంగంలో వివిధ ప్రభుత్వ శాఖలు, పథకాల వారీగా చేసిన నిధుల కేటాయింపులను డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. పలు అంశాలకు సంబంధించిన విధానాలను, చేపట్టబోయే చర్యలనూ తెలిపారు. ⇒ ‘రైతు భరోసా’ కింద అర్హులైన రైతులకు ఏటా ఎకరానికి రూ.15,000 చెల్లించాలన్నది మా సంకల్పం. అందుకే ప్రజలతో చర్చించి ఎలా చేయాలన్న దానిపై కసరత్తు చేస్తున్నాం. ⇒ భూమిలేని రైతు కూలీల ఆర్థిక, జీవన స్థితిగతులు మెరుగుపర్చడానికి వారికి ఏటా రూ.12,000 అందించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నాం. ⇒ మా ప్రభుత్వం రైతుకు ఆర్థిక భద్రత కలిగించేందుకు పంట బీమా పథకాన్ని అమలు చేయడానికి ఈ సంవత్సరం నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాము. ఈ పథకం క్రింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ⇒ సన్నరకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి 33 రకాల వరిని గుర్తించి, వాటికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లించాలని నిర్ణయించాం. ⇒ ధరణి పోర్టల్ సమస్యలు, పరిష్కారాల పురోగతిపై ఎప్పటికప్పుడు కలెక్టర్లతో సమీక్షిస్తున్నాం. ధరణి కమిటీ పూర్తి అధ్యయనం తర్వాత శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటాం. ⇒ ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతీ నియోజకవర్గంలో కనీసం 3,500 చొప్పున మొత్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నాం. ఇంటి విస్తీర్ణం కనీసం 400 చదరపు అడుగులతో ఉంటుంది. ⇒ ఒకే ప్రాంతంలో వేర్వేరుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల పాఠశాలలను 20 ఎకరాల స్థలంలో ఒకేచోట నిర్మిస్తాం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అన్నిరకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. మహనీయుల మాటలను ఉటంకిస్తూ..భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో పలువురు మహనీయుల మాటలను ఉటంకించారు. ‘‘సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం లేనిదే రాజకీయ ప్రజాస్వామ్యం సఫలం కాజాలదు. ఆ రెండూ కూడా రాజకీయ ప్రజాస్వామ్యానికి పునాది రాళ్లు. పునాది ఎంత బలంగా ఉంటే.. ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా ఉంటుంది’’ అన్న బీఆర్ అంబేడ్కర్ మాటలను గుర్తు చేశారు. వ్యవసాయానికి కేటాయింపులను వెల్లడిస్తున్న సమయంలో.. ‘‘ఏ పని అయినా ఆగవచ్చు.. కానీ వ్యవసాయం ఆగదు’’ అని జవహర్లాల్ నెహ్రూ చెప్పారని భట్టి పేర్కొన్నారు. ఇక ‘‘ఏదైనా పని జరిగే వరకు అది అసాధ్యంగా గోచరిస్తుంది’’ అని నెల్సన్ మండేలా చెప్పారని.. తాము ఇచ్చిన రుణమాఫీ హామీకి ఇది వర్తిస్తుందని భట్టి చెప్పారు. తాము రుణమాఫీ అమలుతో మండేలా మాటలను నిజం చేసి చూపామన్నారు. కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్న సమయంలో ‘‘ప్రజాస్వామ్యం అనేది బలవంతులకు, బలహీనులకు సమాన అవకాశాలు కల్పించేది’’ అని మహాత్మాగాంధీ చెప్పారని గుర్తుచేశారు.అసెంబ్లీలో షేమ్ షేమ్.. ఫాల్స్ ఫాల్స్!ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం కొనసాగుతుండగా శాసనసభలో షేమ్ షేమ్.. ఫాల్స్ ఫాల్స్.. అన్న నినాదాలు హోరెత్తాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను భట్టి విక్రమార్క విమర్శిస్తున్నప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు ‘షేమ్.. షేమ్..’ అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో భట్టి చెప్తున్న మాటలు ‘ఫాల్స్.. ఫాల్స్..’ అంటూ బీఆర్ఎస్ సభ్యులు ప్రతిగా నినాదాలు చేశారు. -
500 కోట్లతో విద్యావ్యవస్థలో కీలక మార్పులు
-
పఠాన్ చెరువుకు మెట్రో విస్తరణ..
-
ఓఆర్ఆర్కు రూ.200 కోట్లు.
-
వరి రైతులకు శుభవార్త
-
పాతబస్తీ మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు..
-
బీఆర్ఎస్ పాలనలో వామనావతారంలాగా అప్పులు: భట్టి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో బీఆర్ఎస్ పాలనను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క తీవ్రంగా తప్పుబట్టారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, తాము మాత్రం జనరంజకమైన బడ్జెట్ ద్వారా ప్రజల ముందుకు వస్తున్నామని అన్నారాయన. ‘‘గత ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు పది రేట్లు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉద్యోగాలు, నీళ్లు దక్కలేదు. బంగారు తెలంగాణ చేస్తామని ఉత్తరకుమార ప్రగల్బాలు పలికారు. కానీ, బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైంది. వామనావతారం లెక్క అప్పులు పెరిగాయి. ఒంటెద్దు పోకడలతో ఆర్ధిక వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అప్పులు పెరగడంతో పాటుగా బిల్లులు బకాయిలు భారీగా పెరిగిపోయాయి. కొత్త ఉద్యోగాలు సృష్టించడం కాదు.. ఉన్న ఉద్యోగాలే ఇవ్వలేదు. దశాబ్ద కాలంలో తెలంగాణ పురోగమించలేదు. జీతాలు, పెన్షన్లు చెల్లింపులు కూడా చేయలేని పరిస్థితి. ఆర్థిక క్రమ శిక్షణ పాటించకుండా తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు. పదేళ్ల అస్తవ్యస్త పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. దుబారా ఖర్చు ఆపేసి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం. రాష్ట్రంలో ఏర్పడిన పదేళ్ల తర్వాత వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టాం. త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తాం. ఏదో విధంగా ఎన్నికల్లో గెలవాలిని మేము హామీలు ఇవ్వలేదు. ప్రజల గుండె చప్పుళ్లకు స్పందించే హామీలు ఇచ్చాం. మేం అధికారంలోకి వచ్చాక 31,768 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. డిసెంబర్ నుంచి పథకాల కోసం రూ.34,579 కోట్లు ఖర్చు చేశాం. ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. ఆరోగ్యశ్రీని రూ. 10 లక్షలకు పెంచాం. నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఎన్నో ఏళ్లు ప్రజలు ఉద్యమం చేశారు అని భట్టి అన్నారు. ఒకానొక దశలో బడ్జెట్ ప్రసంగానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు నినాదాలు చేశారు. అయినా భట్టి తన ప్రసంగం కొనసాగించారు.2024-25 బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ... ‘ఆయిల్ పామ్ సాగుకు రైతులకు అవసరమైన సాయం అందిస్తాం. రాష్ట్రంలో లక్ష ఎకరాల ఆయిల్ పామ్ సాగును లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు, పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను విస్తరిస్తాం. మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు మెట్రోను విస్తరిస్తాం. ఉచిత బస్సులు పథకం రాష్ట్ర అభివృద్ధి సాయపడుతోంది’ అని తెలిపారు. -
అప్పుల కుప్పగా తెలంగాణ
-
తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నేడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. శాసన సభలో బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగించారు. ఇక, 2024-25 గాను తెలంగాణ బడ్జెట్: రెండు లక్షల 91వేల 191 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం రూ.2.20,945 కోట్లు. మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ఉంది. బడ్జెట్ కేటాయింపులు ఇలా..సాగునీటి పారుదల శాఖకు రూ.26వేల కోట్లు.విద్యాశాఖకు రూ.21,292 కోట్లు.ప్రజాపంపిణీకి రూ.3836 కోట్లుఆరోగ్యశ్రీని రూ.10లక్షలకు పెంచాం.సంక్షేమానికి రూ.40వేల కోట్లు.రోడ్లు, భవనాలకు రూ.5790 కోట్లు.ఐటీ శాఖకు రూ.774 కోట్లు.హార్టీకల్చర్కు రూ.737 కోట్లు.పరిశ్రమల శాఖకు రూ.2762 కోట్లు.ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు.గృహజ్యోతికి రూ.2418 కోట్లు.500 రూపాయల గ్యాస్ సిలిండర్‌కు రూ.723 కోట్లు.అడవులు, పర్యావరణ శాఖకు రూ.1064 కోట్లు.ఎస్టీ సంక్షేమానికి రూ.17056 కోట్లు.ట్రిపుల్ ఆర్ఆర్ఆర్కు రూ.1525 కోట్లు.ఎస్సీ సంక్షేమానికి రూ.33.124 కోట్లుట్రాన్స్కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు.వైదారోగ్య శాఖకు రూ.11468 కోట్లు.ఓఆర్ఆర్కు రూ.200 కోట్లు.ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు.హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌కు రూ.500 కోట్లు.హెచ్ఎండీఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు.హోంశాఖకు రూ.9564 కోట్లు.పంచాయతీరాజ్ శాఖకు రూ.29,816 కోట్లు.బీసీ సంక్షేమానికి రూ.9200 కోట్లు.మైనార్టీ శాఖకు రూ.3003 కోట్లు.మెట్రోవాటర్ వర్క్స్ కోసం రూ.3385 కోట్లు.కొత్త ఏర్పాటు చేసిన హైడ్రాకు రూ.200 కోట్లు.మొత్తం హైదరాబాద్ అభివృద్ధికి రూ.10వేల కోట్లు. పశుసంవర్థక శాఖకు రూ.1980 కోట్లు.విద్యాశాఖకు రూ.21,292 కోట్లు.స్త్రీ శిశు సంక్షేమశాఖకు రూ.2736 కోట్లు.ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు.అడవులు, పర్యావరణ శాఖకు రూ.1064 కోట్లు.విద్యుత్ శాఖకు రూ.16,410 కోట్లు.రూ.2లక్షల రుణమాఫీ కోసం రూ.31వేల కోట్లు.ఇందిరా మహిళా శక్తి పథకానికి రూ.50.41 కోట్లు. మహాలక్ష్మి ఉచిత రవాణాకు రూ.723కోట్లు.మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌కు రూ.1500 కోట్లు.ఎస్సీ, ఎస్టీ గృహ లబ్ధిదారులకు రూ.6 లక్షల సాయం. మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్‌పోర్టు సిస్టంకు రూ.50 కోట్లు. మంత్రి భట్టి విక్రమార్క ప్రసంగిస్తూ.. పదేళ్ల అస్తవ్యస్త పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు పది రేట్లు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉద్యోగాలు, నీళ్లు దక్కలేదు. బంగారు తెలంగాణ చేస్తామని ఉత్తరకుమార ప్రగల్బాలు పలికారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైంది. వామనావతారం లెక్క అప్పలు పెరిగాయి. గత ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. కొత్త ఉద్యోగాలు..గత ప్రభుత్వం మాదిరిగా దుబారా ఖర్చు ఆపేసి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం. ఒంటెద్దు పోకడలతో ఆర్ధిక వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అప్పులు పెరగడంతో పాటుగా బిల్లులు బకాయిలు భారీగా పెరిగిపోయాయి. కొత్త ఉద్యోగాలు సృష్టించడం కాదు.. ఉన్న ఉద్యోగాలే ఇవ్వలేదు. దశాబ్ద కాలంలో తెలంగాణ పురోగమించలేదు. జీతాలు, పెన్షన్లు చెల్లింపులు కూడా చేయలేని పరిస్థితి. రాష్ట్రంలో ఏర్పడిన పదేళ్ల తర్వాత వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టాం. నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఎన్నో ఏళ్లు ప్రజలు ఉద్యమం చేశారు.రైతులకు మేలు..ఆయిల్ పామ్ సాగుకు రైతులకు అవసరమైన సాయం అందిస్తాం. రాష్ట్రంలో లక్ష ఎకరాల ఆయిల్ పామ్ సాగును లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు, పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను విస్తరిస్తాం. మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు మెట్రోను విస్తరిస్తాం. ఉచిత బస్సులు పథకం రాష్ట్ర అభివృద్ధి సాయపడుతోంది. అప్పులకు వడ్డీల కోసం రూ.17,729 కోట్లు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా అభివృద్ధిని ఆపలేదు. ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రీమియం అంతా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకు ఇది ఎంతోగానో ఉపయోగపడుతుంది. రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది.ఇందిరమ్మ ఇళ్లు..త్వరలో భూమిలేని రైతు కూలీలకు ఏటా రూ.12వేలు అందిస్తాం. ఏదో గెలవాలని మేం ఎన్నికల హామీలు ఇవ్వలేదు. ఈ ఏడాది మార్చి వరకు 2,26,740 ధరణి అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా మరో 1,22,774 ధరణి దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు 1,79,143 దరఖాస్తులను పరిష్కరించాం. రూ.2లక్షల వరకు రుణం ఉన్న రైతులకు త్వరలో రుణమాఫీ. రైతు భరోసా పథకం కింద ఎకరాకి రూ.15వేలు ఇవ్వాలన్నది మా సంకల్పం. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదలకు రూ.5లక్షల సాయం. ఎస్సీ, ఎస్టీ గృహ లబ్దిదారులకు రూ.6 లక్షల సాయం. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు. రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల 50వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు.డ్వాక్రా మహిళలకు జీవిత బీమాస్వయం సహాయక సంఘాల్లోని 63.86 కోట్ల మంది మహిళా సభ్యులకు జీవిత బీమా. వీరికి రూ.10 లక్షల జీవిత బీమా. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు. గత ఆరు నెల్లలో బకాయిపడిన కస్టమ్ మిల్లర్స్ నుంచి రూ.450 కోట్లు వసూలు చేశాం.గత ప్రభుత్వం రైతుబంధుకు రూ.80వేల కోట్లు ఖర్చు చేసింది. రైతుబంధు ద్వారా అనర్హులకే అధికారంగా లబ్ధి చేకూరింది.తలసరి ఆదాయం ఇలా..తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,47,299. జాతీయ తలసరి ఆదాయంలో పోల్చితే లక్షా 64వేలు అధికం. అత్యధికంగా రంగారెడ్డి తలసరి ఆదాయం రూ.9,46,862. అత్యల్పంగా వికారాబాద్ తలసరి ఆదాయం రూ.1,80,241. తెలంగాణ జీఎస్డీపీ రూ.14,63,963 కోట్లు. గతేదాడితో పోల్చితే 11.9 శాతం జీఎస్డీపీ వృద్ధిరేటు. 2023-24 తెలంగాణ వృద్ధిరేటు 7.4 శాతం. ఇదే సమయంలో జాతీయ వృద్ధి రేటు 7.6 శాతం. హైదరాబాద్‌పై స్పెషల్ ఫోకస్..ఓఆర్ఆర్ పరిధిలో కొత్త వ్యవస్థ ఏర్పాటు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(TCUR) ఏర్పాటు. టీసీయూఆర్ పరిధిలో జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు ఉంటాయి. హైదరాబాద్‌లో విపత్తుల నివారణ, ఆస్తుల పరిరక్షణకు హైడ్రా. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు అధిక ప్రాధాన్యత. మూసీ చుట్టూ రిక్రియేషన్ జోన్లు, పీపుల్స్ ప్లాజాలు, చిల్డ్రన్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ జోన్లు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతాం. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మారుస్తాం. డ్రగ్స్ నిర్మూలనకు అవగాహన సదస్సులు. హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లు. టౌన్‌షిప్‌లు అన్ని సౌకర్యాలు ఉండేలా ప్రణాళికలు. వారికి వేల్ఫేర్ బోర్డులు..ఈ సంవత్సరం రంజాన్ పండుగ కోసం రూ.33కోట్లు కేటాయింపు. కల్లు గీత కార్మికులు ప్రమాదాలకు గురికాకుండా కొత్త పరికరాల పంపిణీ. కొత్తగా ముదిరాజ్, యాదవ్, కురుమ, మున్నూరు కాపు, పద్మశాలి, లింగాయత్, గంగపుత్రుల కార్పొరేషన్లు ఏర్పాటు. ఆర్థికంగా వెనుకబడిన కులాల సంక్షేమం కోసం వేల్ఫేర్ బోర్డు ఏర్పాటు. ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా 163 రకాల వ్యాధులను చేర్చాం. నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. తీవ్ర వేసవిలో కూడా నిరంతరాయంగా విద్యుత్‌ను అందించాం. అడవులు, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అర్హులైన వారికి రైతుభరోసా ఇస్తాం. అసెంబ్లీలో రైతుభరోసా విధి విధానాలపై చర్చిస్తాం అని అన్నారు. మరోవైపు.. అసెంబ్లీలో భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. భట్టి ప్రసంగానికి సభలో నిరసన నినాదాలు. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని పార్టీ నేతలు భట్టి వ్యాఖ్యలను ఖండించారు. -
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్@ 2.90 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: వాస్తవిక కోణాన్ని ప్రతిబింబిస్తూనే అదనపు ఆదాయ రాబడులు, ఆర్థిక ప్రగతిని దృష్టిలో ఉంచుకుని 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభు త్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు చేసేందుకు సిద్ధమైంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.2,75,890 కోట్లను ప్రతిపాదించిన ప్రభుత్వం దాని కంటే 5 శాతం మేర కేటాయింపుల పెంపుతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నట్లు ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలిసింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో పరిశ్రమలు, ఐటీ, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకంటే ముందు ఉదయం 9 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. రాబడుల్లో సంస్కరణలు అప్పుల భారం పెరిగిపోతున్న నేపథ్యంలో అదనపు ఆదాయాన్ని రాబట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టింది. జీఎస్టీ లీకేజీలు అరికట్టాలని, గనుల రాయల్టీ చెల్లింపు ఎగవేతలను నిరోధించాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ ఏడాదిలో భూముల మార్కెట్ విలువల సవరణ జరిగితే రూ.5 వేల కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. మరోవైపు ఈ బడ్జెట్లో పన్నేతర ఆదాయం కింద భూముల అమ్మకాలను ప్రతిపాదించే అవకాశం కూడా ఉంది. మద్యం రేట్లు పెంచడం, ఎలైట్ షాపుల ఏర్పాటు లాంటి విధాన నిర్ణయాలను తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రూ.15 వేల కోట్ల వరకు ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ఈ పెరిగిన ఆదాయానికి తోడు, ఆర్థిక వృద్ధి కూడా కేటాయింపులకు ఊతమిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని పద్దులూ కీలకమే! ఈసారి బడ్జెట్లో అన్ని శాఖల పద్దులూ భారీగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రుణమాఫీతో కలిపి వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.64 వేల కోట్లు, సాగునీటి శాఖకు రూ.26–28 వేల కోట్లు, విద్యా శాఖకు రూ.21 వేల కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.45 వేల కోట్ల వరకు, సంక్షేమ శాఖలకు రూ.40 వేల కోట్లు, మున్సిపల్ శాఖకు రూ.12 వేల కోట్లు ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి రుణమాఫీకే రూ.31 వేల కోట్లు ఖర్చు కానున్నాయి. అందులో ఇప్పటికే రూ.6 వేల కోట్ల వరకు ఖర్చయింది. ఆగస్టు నెలాఖరు నాటికి మిగిలిన రూ.25 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఇక ఆరు గ్యారంటీలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.53 వేల కోట్లు కేటాయించారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, గృహలక్షి్మ, పథకాలు ఇప్పటికే అమల్లో ఉండగా, మరిన్ని పథకాలు అమలు చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న విధంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటుకు బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించవచ్చని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.20 వేల కోట్లు అవసరం కాగా, అందులో ఏ మేరకు నిధులు ప్రతిపాదిస్తారన్న దానిపై స్పష్టత రాలేదు. సాగునీటి శాఖకు సంబంధించి రూ.9 వేల కోట్లు ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరం కాగా, అప్పులు, వేతనాలు, ఈ ఏడాది పూర్తి చేయాల్సిన ప్రాధాన్యతా ప్రాజెక్టులకు రూ.28 వేల కోట్లు అవసరమపి ఆ శాఖ కోరింది. శాఖల వారీ కేటాయింపులకు తోడు అప్పుల చెల్లింపు, ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, కొత్త ఉద్యోగాల కల్పన కోసం వేతనాలు, సాధారణ వ్యయం, విద్యుత్ సబ్సిడీలు (గృహజ్యోతి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్) తదితర అనివార్య చెల్లింపులు కూడా చేయాల్సి ఉంది. పింఛన్ల పెంపు కష్టమేనా? ఎన్నికలకు ముందు ఆసరా పింఛన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న పింఛన్ ప్రకారం ఏడాదికి రూ.11 వేల కోట్ల నిధులు అవసరమవుతున్నాయి. కాగా హామీ ఇచ్చిన ప్రకారం పెంచితే నెలకు రూ.1,000 కోట్ల చొప్పున ఏడాదికి మరో రూ.12 వేల కోట్లు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్లో పింఛన్ల పెంపు ప్రతిపాదన ఉంటుందా లేదా అన్నది సందేహాస్పదంగా మారింది. అయితే వాస్తవిక కోణంలో బడ్జెట్ రూపకల్పనకు ప్రాధాన్యమిచ్చినందున ఈ ఏడాదికి పింఛన్ల పెంపు ఉండకపోవచ్చనే తెలుస్తోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.45వేల కోట్ల వరకు ప్రతిపాదించే అవకాశముందని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. ఆర్థిక వృద్ధి ఆసరాగా..! పార్లమెంటులో ఇటీవల ప్రవేశపెట్టిన సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం ఈసారి 6.5 నుంచి 7 శాతం వరకు ఆర్థిక వృద్ధి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ స్థాయి వృద్ధి కంటే తెలంగాణ వృద్ధి మరో 2–3 శాతం వరకు ఎక్కువగానే ఉండే అవకాశాలున్నాయి. ఈ వృద్ధికి తోడు రెవెన్యూ రాబడుల్లో చేపడుతున్న సంస్కరణల కారణంగా వచ్చే అదనపు ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఓటాన్ అకౌంట్లో పెట్టిన రూ.2.75 లక్షల కోట్ల బడ్జెట్‌ను మరో రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు పెంచుతూ పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
మాఫీ సంబురాలు
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ అమలుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయమైన గాం«దీభవన్ మొదలు గ్రామ స్థాయిలోని రైతు వేదికల వరకు అన్ని స్థాయిల్లో పార్టీ కేడర్, నాయకులు.. రైతులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామాల స్థాయిలో టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల చిత్రపటాలకు పాలాభిõÙకం చేశారు.నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, టీపీ సీసీ కార్యవర్గం పాల్గొన్నారు. నల్లగొండలో స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ మంత్రి కోమటిరెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. రైతులకు రుణ విముక్తి కల్పించిన ఘనత కాంగ్రెస్‌దేనని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. పైసా పైసా కూడబెట్టి రైతులను రుణ విముక్తి చేస్తున్నామన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ మల్లురవి హాజరయ్యారు. రైతు వేదికల వద్ద కోలాహలం గ్రామాల్లో రైతు వేదికల వద్ద రైతులతో కలిసి కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకున్నారు. క్లస్టర్ స్థాయిలో జరిగిన ఈకార్యక్రమాల్లో రైతులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఇక సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు కూడా రైతులు రైతు వేదికల వద్దకు వచ్చారు. చప్పట్ల ద్వారా ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించారు. రైతు వేదికల వద్ద రుణమాఫీ లబి్ధదారుల జాబితాలు కూడా పెట్టడంతో కాంగ్రెస్ నేతల హడావుడి కనిపించింది. కాగా శుక్రవారం మండల స్థాయిలో రుణమాఫీ సంబురాలు జరగనున్నాయి. శని, ఆదివారాల్లో గ్రామ స్థాయిల్లో జరిగే ర్యాలీల కోసం పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్షీ, యాష్కీల సమక్షంలో.. హైదరాబాద్ గాం«దీభవన్‌లో రైతు రుణమాఫీ సంబురాలు నిర్వహించారు. టపాసులు పేల్చి, డప్పు లు వాయిస్తూ, నృత్యాలు చేస్తూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున కేడర్ వేడుకల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి, రాష్ట్ర మత్స్యకార సొసైటీల సమాఖ్య చైర్మన్ మెట్టు సాయికుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధులు సత్యం శ్రీరంగం, కమల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుయాష్కీ మీడియాతో మాట్లాడుతూ రైతు లకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే తొలిసారని వ్యాఖ్యానించారు. రుణమాఫీ ప్రారంభించిన జూలై 18 రైతుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. -
ఇతర బకాయిలకు జమ చేసుకోవద్దు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకే దఫాలో ఇంత భారీ స్థాయిలో రుణమాఫీ చేసిన చరిత్ర లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. ఆగస్టు నెల దాటకముందే మొత్తం రూ.31 వేల కోట్లు బ్యాంకుల్లో జమ చేస్తామని చెప్పారు. రుణమాఫీ కింద విడుదల చేస్తున్న నిధులను రైతులకు సంబంధించిన ఇతర బకాయిల కింద జమ చేసుకోవద్దని బ్యాంకర్లకు స్పష్టం చేశారు. గురువారం ఉదయం సచివాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు.రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులతో బ్యాంకర్లు మాట్లాడి బకాయిలు రికవరీ చేసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. ప్రభుత్వం ఇచ్చే రూ.2 లక్షలు, బ్యాంకులు రికవరీ చేసే మొత్తం కలుపుకొని రైతులను రుణ విముక్తులను చేయాలని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేతగా తాను రైతు రుణమాఫీ గ్యారెంటీ కార్డుపై సంతకం చేసి ఎన్నికల ప్రచారంలోకి వెళ్లామని గుర్తు చేశారు.ఇచి్చన మాట మేరకు రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. 40 లక్షల బ్యాంకు ఖాతాల నుంచి రూ.31 వేల కోట్ల రైతు రుణాలు ఒకేసారి రికవరీ కావడం ఓ చరిత్ర అని అన్నారు. బ్యాంకర్లను వన్ టైమ్ సెటిల్మెంట్ అడగకుండా పూర్తిగా చెల్లిస్తున్నందుకు బ్యాంకర్లు కూడా రైతుల మాదిరి పండుగ చేసుకోవాలని భట్టి అన్నారు. రుణమాఫీ కాగానే రైతులకు అవసరమైన రుణాలు విరివిగా ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు. దేశం గరి్వంచదగ్గ రోజు: తుమ్మల ఇది దేశం గర్వించదగిన రోజు అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. రుణమాఫీ కోసం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తీవ్రంగా శ్రమించారని తెలిపారు. వర్షాలు మొదలయ్యాయని, రైతు రుణమాఫీ నిధులు సకాలంలో అందితే వ్యవసాయం పండుగలా మారుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.నల్లగొండ జిల్లాకు ఎక్కువ నిధులు గురువారం తొలివిడత కింద రూ.లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తూ విడుదల చేసిన నిధుల్లో అత్యధికం నల్లగొండ జిల్లాకు వెళ్లాయి. ఈ జిల్లాకు చెందిన 78,463 కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.454.49 కోట్లు జమ అయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గం వారీగా తీసుకుంటే అత్యధికంగా ఆందోల్ నియోజకవర్గంలో 19,186 కుటుంబాలకు రూ.107.83 కోట్లు విడుదల అయ్యాయి. -
ప్రజాభిప్రాయమే జీవోగా రైతుభరోసా
సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రజల అభిప్రాయాలనే ప్రభుత్వ ఉత్తర్వులుగా..చరిత్రాత్మక నిర్ణయంగా తీసుకురావడంలో ఎలాంటి సందేహం లేదని, రైతుభరోసా విషయంలో కూడా ప్రజల అభిప్రా యమే జీవోగా రాబోతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రైతుల అభిప్రా యాల మేరకు శాసనసభలో రైతుభరోసా పథకం రూపకల్పనకు చర్చిస్తామని చెప్పారు. సోమ వారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫ రెన్స్ హాల్లో రైతుభరోసా పథకం అమలు కోసం విధివిధానాలపై ఉమ్మడి వరంగల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది.మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క, సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు జిల్లామంత్రులు మంత్రి కొండా సురే ఖ, ధనసరి అనసూయ (సీతక్క), ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రునాయక్, ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, హాజరయ్యారు. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదాదేవి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రైతులు, రైతుసంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతుభరోసా విషయంలో సంపూర్ణంగా ప్రజలు ఏం చెబితే దాన్నే అమ లు చేస్తామన్నారు. అందరి సూచనలు నోట్ చేసు కున్నామని, వాటిని ప్రభుత్వం పరిశీలిస్తుందని, అందరి అభిప్రాయానికి తగినట్టుగా సబ్‌కమిటీ నిర్ణయం తీసుకుంటుందని భట్టి విక్రమార్క చెప్పా రు. వరంగల్ నుంచే ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ రైతు æభరోసా హామీ ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రైతుభరోసాపై అసెంబ్లీలో ఒక రోజంతా చర్చిస్తామని, ఆ తర్వాత అసెంబ్లీలోనే నిర్ణయం తీసుకుంటామని భట్టి పేర్కొన్నారు. రైతుల నోటా..వైఎస్ రాజశేఖరరెడ్డి మాటహన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడిన రైతుల్లో 90శాతం మంది దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పేరు ప్రస్తావించారు. నాడు వైఎస్ వల్లనే ఉచిత విద్యుత్, మద్దతుధర, సబ్సిడీ విత్తనాలు, పంట బీమా వచ్చాయని తెలిపారు. ఆయన కాలంలో వ్యవసాయం పండుగలా సాగిందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వ్యవసాయం గురించి, రైతుల గురించి పట్టించుకున్న ప్రభుత్వం, నాయకులు లేరన్నారు. రైతును రాజును చేయడానికి వైఎస్ కృషి చేశాడని కొనియాడారు. -
నైనీ గనులకు ఒడిశా సర్కారు ఓకే
సాక్షి, హైదరాబాద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఒడిశా రాష్ట్రం అంగుల్ జిల్లాలోని నైనీ బొగ్గు గనిలో బొగ్గు ఉత్పత్తికి పూర్తిగా సహకరిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాంజీ స్పష్టం చేశారు. ఆ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లుకు హామీ ఇచ్చారు. దశాబ్దం కిందట ఆ బొగ్గు గనిని సింగరేణికి కేటాయించినా అక్కడ ఒక్క తట్ట బొగ్గు కూడా ఉత్పత్తి చేయ లేదు.ఇప్పుడు బొగ్గు తవ్వకాలకు అన్ని రకాల అనుమతులు వచి్చన నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ప్రభు త్వ సహకారాన్ని కోరేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సచివాలయంలో మాంజీని కలిసి విజ్ఞప్తి చేశారు. బొగ్గు గని ఆవశ్యకతను తెలంగాణ డిప్యూటీ సీఎం వివరించారు. ఈ మేరకు అన్ని వివరాలతో కూడిన లేఖను ఒడిశా సీఎంకు అందజేశారు. స్పందించిన ఒడిశా సీఎం మోహన్‌చరణ్ మాంజీ.. భూముల బదలాయింపు, విద్యుత్, రహదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తమ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ సమస్య పరిష్కారమైతే తవ్వకాలు: భట్టి నైనీ బ్లాకులో గనుల తవ్వకానికి పారిశ్రామిక, పర్యావరణ అనుమతులు సైతం వచ్చాయని డిప్యూ టీ సీఎం భట్టి ఈ సందర్భంగా తెలిపారు. అటవీ, ప్రైవేటు భూములను సింగరేణికి బదలాయించాల్సిన అంశం పెండింగ్‌లో ఉందని, ఈ సమస్య పరిష్కారమైన వెంటనే సింగరేణి తవ్వకాలను ప్రారంభిస్తుందని వివరించారు. నైనీ బ్లాక్‌లో తవ్వకాలు చేపట్టడం ద్వారా 1,200మందికి ఉపాధితో పాటు పన్నుల రూపంలో రూ.600 కోట్ల వరకు ఒడిశాకు రాయల్టీ రూపంలో ఆదాయం సమకూరుతుందని మాంజీ దృష్టికి తెచ్చారు.ప్రతీ ఏటా ఇక్కడ నుంచి పది మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. బొగ్గు గనుల వద్దనే 2 ్ఠ800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను సింగరేణి ఏర్పాటు చేస్తుందని భట్టి ప్రకటించారు. సమావేశంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, ఇంధన శాఖ ఓఎస్డీ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. -
అందరి మాటతోనే ‘భరోసా’
సాక్షి, ఆదిలాబాద్: ‘రైతు భరోసాను నిర్దిష్టంగా అమలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఈ విషయంలో ఓపె న్ మైండ్‌తో ఉన్నాం. మాకు మేము ఏదో నిర్ణయం తీసుకోవడం లేదు. అందరితో చర్చించి అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలనే సదుద్దేశంతోనే ఉన్నాం. అన్ని జి ల్లాల్లో కేబినెట్ సబ్ కమిటీ పర్యటించి ప్రజాక్షేత్రంలో అభిప్రాయాలు సేకరించి...అసెంబ్లీలో నివేదిక పొందుపరుస్తాం. రైతుభరోసా పేద, బడుగువర్గాలకు న్యాయం చేసేదిగా ఉండాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పరిమితులు ఖరారు కాలేదు. గ్రామం యూనిట్‌గా తీసుకోవాలని ఎక్కువమంది రైతులు సూచిస్తున్నారు.. పోడు రైతులకు సర్కారు సాయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం.’అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని కుమురంభీం కాంప్లెక్స్ సమావేశ మందిరంలో రైతు భరోసా విధివిధానాల ఖరారుపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతుల నుంచి అభిప్రాయాలు, సలహాల ను కేబినెట్ సబ్ కమిటీ సేకరించింది. ఈ కమిటీ చైర్మన్ మ ల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల్లో కీలకమైన రైతుభరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి తీరుతామని డిప్యూటీ సీఎం అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని చెప్పారు. నిజమైన రైతులకే రైతుభరో సా అందించేందుకు అన్నివర్గాల ప్రజల నుంచి అభిప్రాయా లు స్వీకరిస్తున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మరోమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడు తూ ఇంకా ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లోనూ ప్రజల అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలువురు రైతులకు భూమికి సంబంధించి సరైన పత్రాలు కూడా లేవని తెలిపారు. ఇలా అన్ని విషయాల్లోనూ ఆలోచన చేస్తామని చెప్పా రు. ఎకరం భూమి లేకున్నా, ఏదో ఒకవిధంగా సాగు చేస్తు న్న రైతులకు లబ్ధి చేకూర్చాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించి ఆదుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు కోరారు.వైఎస్ అమలు చేసిన కౌలురైతు చట్టాన్ని తీసుకురావాలి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2011లో అమలు చేసిన కౌలు రైతు చట్టాన్ని తీసుకురావాలని రైతులు, రైతు సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సాగుచేస్తున్న వారిలో 30 నుంచి 40 శాతం మంది కౌలురైతులే ఉన్నారని వివరించారు. 95 శాతం ఆత్మహత్య లు కౌలు రైతులవేనని పేర్కొన్నారు. పట్టాదారులకు భరోసా కల్పించి కౌలు రైతులకు న్యాయం చేయాలని మంత్రివర్గ ఉప సంఘాన్ని కోరారు. రైతు భరోసానే కాకుండా మిగతా వాటి విషయంలోనూ కౌలు రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం విధివిధానాలు రూపొందించాలన్నారు. ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాలో పహాణీలు, పోడు భూముల సమస్య కారణంగా మెజారిటీ రైతులు ప్రభుత్వ సాయం పొందలేక పోతున్నారన్నారు. పేద, దళిత, గిరిజన రైతులకు రైతు భరో సా అందించాలని పలువురు కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ప్రత్యేకంగా తీసుకొని పదెకరాలు సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా వర్తింపజేయాలని కోరారు. ఎంపిక చేసిన వారితోనే మాట్లాడించారు ఎంపిక చేసిన రైతులతోనే మాట్లాడిస్తున్నారని నిజమైన రైతులతో మాట్లాడించడం లేదని కొందరు ఆరోపించారు. దీంతో స్పెషల్ రోప్ పార్టీ పోలీసులు ఎంటర్ అయ్యారు. వేదిక ముందు ప్రజాప్రతినిధులకు రక్షణగా ఇటువైపు నుంచి అటు వైపు వరకు కూర్చున్నారు. కాగా రైతులను తాము ఎంపిక చేయలేదని, వ్యవసాయ అధికారులే గుర్తించారని ఖానా పూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. కాగా కేబినెట్ సబ్‌కమిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. -
పేరెంట్స్‌కు హెచ్చరిక జారీ చేసిన సాయిధరమ్ తేజ్
సోషల్ మీడియాలో పిల్లల ఫోటోలు, వీడియోలు షేర్ చేసే పేరెంట్స్ తస్మాత్ జాగ్రత్త అంటున్నాడు మెగా హీరో సాయిధరమ్ తేజ్. 'పిల్లల ఫోటోలు లేదా వీడియోలు పోస్ట్ చేసేటప్పుడు తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే సోషల్ మీడియా మరీ దారుణంగా, భయంకరంగా మారిపోయింది. ఇక్కడ ఉన్న మానవ మృగాలను నియంత్రించడం, అడ్డుకోవడం కష్టమైపోతోంది. కాబట్టి మీ పిల్లల పిక్స్, వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు విచక్షణతో ఆలోచించండి. లేదంటే తర్వాత ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది' అని హెచ్చరిక జారీ చేశాడు.కాగా కొంతమంది తెలుగు యూట్యూబర్స్ తండ్రీకూతుర్ల బంధంపై అసభ్య కామెంట్లు చేశారు. డార్క్ కామెడీ పేరుతో విచ్చలవిడిగా మాట్లాడారు. ఆత్మీయ బంధాన్ని అవమానించేలా వికృత చేష్టలకు దిగారు. తండ్రీకూతుర్ల బంధాన్ని చెడు కోణంలో చూపిస్తూ వారి గురించి అత్యంత నీచంగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సాయిధరమ్ తేజ్ వారిమీద మండిపడుతూ పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని పోస్టు పెట్టాడు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాడు. ఈ ట్వీట్‌పై తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. పిల్లల భద్రతే తొలి ప్రాధాన్యతగా పేర్కొంటూ సోషల్ మీడియాలో చిన్నారులపై అసభ్య కామెంట్లు చేస్తూ వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. To whom so ever it may concern, my kind request to all the parents is to please use some sort of discretion when you post a video or photos of your kids as the world of social media has become ruthless and dangerous and is very difficult to control or stop these animals from…— Sai Dharam Tej (@IamSaiDharamTej) July 7, 2024 Sai dharam tej ki ame ante chala istam https://t.co/dqs5QQ9Y5B pic.twitter.com/sV1byFiksT— Mani #SSMB29 (@PokiriTweet) July 7, 2024 Thank you for raising this critical issue @IamSaiDharamTej garu, Child safety is indeed a top priority. we will ensure that our government takes necessary steps to prevent child abuse and exploitation on social media platforms. Let's work together to create a safer online… https://t.co/OGQ4NN4doh— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) July 7, 2024 i remember a youtuber being jailed for a similar joke few weeks back. https://t.co/Jv8ce4GhGw pic.twitter.com/eFXZXGMS4W— Ab (@thebottlegourd) July 5, 2024 చదవండి: అంబానీ ఇంట సంగీత్.. బాద్షా ఎన్ని కోట్లు తీసుకున్నాడంటే? -
ఉసూరుమనిపించారు.. రాష్ట్ర విభజన అంశాలపై నామమాత్రంగా చర్చ
సాక్షి, అమరావతి: విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా హైదరాబాద్‌లోని ప్రజా భవన్లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం పక్కదారి పట్టింది. కీలకమైన విభజన అంశాలపై కాకుండా ఇతర అంశాలపై అత్యధిక సమయం వెచ్చించడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర విభజన అంశాలపై పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలతో పాటు ఇరు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు శనివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. దాదాపు గంటా నలభై నిమిషాలు సాగిన భేటీలో ఏ విషయంపై కూడా ఓ అంగీకారానికి రాలేదు. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఇరు రాష్ట్రాల మంత్రులతో రెండు కమిటీలు వేయాలని నిర్ణయించి చేతులు దులుపుకున్నారు. మిగిలిన సమయం అంతా డ్రగ్స్, సైబర్ క్రైమ్, మూసీ నది పరిరక్షణ తదితర అంశాలపై కేటాయించడంపై ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించారు. అధికారుల కమిటీ రెండు వారాల్లోగా సమావేశమై చర్చలు జరపనుంది. ఈ కమిటీ స్థాయిలో పరిష్కారం కాని అంశాలపై రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ చర్చిస్తుందని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. మంత్రుల కమిటీ నిర్ణయాలను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించనున్నారు. వీరి స్థాయిలో కూడా ఫలితం తేలకపోతే ఇరు రాష్ట్రాల సీఎంలు మళ్లీ భేటీ అయ్యి చర్చిస్తారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అనంతరం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్‌లు సమావేశ వివరాలను విలేకరులకు వివరించారు.సమావేశంలో ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పలు ప్రశ్నలపై దాటవేతపోలవరం ముంపు మండలాలు, విద్యుత్ బకాయిలు వంటి అంశాలపై చర్చించారా అని ఇరు రాష్ట్రాల మంత్రులను విలేకరులు ప్రశ్నించగా.. భట్టి విక్రమార్క జోక్యం చేసుకుంటూ.. నేరుగా సమాధానం ఇవ్వకుండా అన్ని విషయాలు చర్చించామన్నారు. విలేకరులు మరో ప్రశ్న వేస్తుండగానే సమావేశం ముగించి వెళ్లిపోయారు. అంతకు ముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాళోజీ నారాయణరావు రాసిన ‘నా గొడవ’ పుస్తకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహూకరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి వెంకటేశ్వరస్వామి ఫొటో బహూకరించి, రేవంత్, భట్టిలకు చంద్రబాబు శాలువా కప్పి సత్కరించారు. ఈ సమావేశంలో ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు కందుల దుర్గేష్, సత్యప్రసాద్, బీసీ జనార్ధన్‌రెడ్డి, సీఎస్, ఇతర అధికారులు, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, సీఎస్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర విభజన అంశాలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చర్చలు జరిపానని ఏపీ సీఎం చంద్రబాబు శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇరు రాష్ట్రాలకు మేలు కలుగుతుందనే నమ్మకం ఈ సమావేశం ద్వారా కలిగిందన్నారు. డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా చేయడానికి కలిసి పనిచేస్తాంపదేళ్లుగా పరిష్కారం దొరకని సమస్యలకు ఈ సమావేశంలో పరిష్కారం దొరుకుతుందని అనుకోలేదు. వీటి పరిష్కార మార్గం కోసం కలిసి పని చేయాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవడం కోసం సీఎస్ స్థాయి అధికారులతో కూడిన ఒక కమిటీ, మంత్రుల స్థాయిలో ఇంకో కమిటీ వేశాం. ఇరు రాష్ట్రాల నుంచి ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ రెండు వారాల్లోగా సమావేశం అవుతుంది. ముందుగా అధికారుల స్థాయిలో పరిష్కారమయ్యే అంశాలను చర్చిస్తాం. అక్కడ ఫలితం రాకపోతే ఆ తర్వాత మంత్రుల స్థాయిలో చర్చలు ఉంటాయి. మంత్రుల స్థాయిలో కూడా పరిష్కారం కాకపోతే తిరిగి ముఖ్యమంత్రులు సమావేశమై చర్చిస్తారు. ఈ సమావేశంలో విభజన సమస్యల పరిష్కారంతో పాటు డ్రగ్స్ నిర్మూలన, సైబర్ క్రైమ్‌ను అరికట్టడం వంటి అంశాలపై కీలక నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకొని అందుకోసం ఏడీజీ స్థాయి అధికారులతో ప్రత్యేక కమిటీ వేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఏడీజీ స్థాయి అధికారులతో ఒక కమిటీ వేసి డ్రగ్స్ నిర్మూలనకు సహకరించాలన్న కోరికను అంగీకరించింది. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల నుంచి మత్తు పదార్థాలను అరికట్టడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిసి పని చేస్తున్నాం.– తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపిల్లల స్కూల్ బ్యాగుల్లో గంజాయివిభజన చట్ట సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాయగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వచ్చి సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయం. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బ తినకుండా చర్చలతో సత్వరం పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తాం. ఇరు రాష్ట్రాలు కలసి అభివృద్ధి చెందేలా తరచూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవుతారు. తెలంగాణ కోరిన విధంగా రాష్ట్రంలో గంజాయి సరఫరా నియంత్రణకు ఇప్పటికే చర్యలు చేపట్టాం. ఆరుగురు మంత్రులతో సబ్ కమిటీ వేశాం. ఏపీలో 8వ తరగతి విద్యార్థుల బ్యాగుల్లో కూడా గంజాయి దొరుకుతోంది. ఏపీలో అత్యధికంగా సాగవుతున్న గంజాయి తమ రాష్ట్రానికి వస్తోందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలు హర్షించేలా విభజన సమస్యలను పరిష్కరిస్తాం.– ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ -
బీఆర్ఎస్ గతించిన చరిత్ర
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ గతించిన చరిత్ర అని, ఆ పార్టీకి గత చరిత్ర ఉన్నది కానీ భవిష్యత్తు లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టార్చ్ వేసుకుని ప్రజలు రావడం కాదని, బీఆర్ఎస్ ఎక్కడుందో టార్చ్ వేసుకుని కేసీఆర్ వెదుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అనంతరం.. తన అధికారిక నివాసంలో డిప్యూ టీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించామన్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశామన్నారు. ‘రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎక్కడుంది? టార్చ్‌లైట్ వేసి వెతకాల్సిందే కదా.. లోక్‌సభలో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా లేదు. పార్టీ పుట్టినప్పటి నుంచి 25 ఏళ్లలో ఇంత దీనావస్థ ఎప్పుడూ లేదు..’అని రేవంత్ అన్నారు. బీజేపీ నాయకులు కూడా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు ఇతర రాష్ట్రా ల్లో వారి పార్టీ దీనావస్థను దృష్టిలో ఉంచుకుని మాట్లాడితే బాగుంటుందని సీఎం అన్నారు.కేసీఆర్‌పై ఈటలకు ప్రేమ తగ్గనట్టుంది!బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతున్నారని.. 20 సంవత్సరాలు ఈటల ఎవరితో కలిసి తిరిగారో గుర్తు చేసుకోవాలని రేవంత్ సూచించారు. గతంలో కేసీఆర్ ఫిరాయింపులు ప్రోత్సహించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు, కండువాలు కప్పేటప్పుడు ఈటల ఎప్పుడైనా మాట్లాడారా..? అని ప్రశ్నించారు. అసలు 11 రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టిన విషయమైనా ఈటలకు తెలుసా..? అని నిలదీశారు. ‘ఇప్పటికీ కేసీఆర్‌పై ఈటలకు సానుభూతి ఎందుకు? ఆయనపై ఇంకా ప్రేమ తగ్గనట్లు ఉంది.అయినా వారిద్దరూ ప్రేమించుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వాళ్ల నాయకుడు ఇంకా కేసీఆరే అని ఈటల అనుకుంటున్నట్లున్నారు..’అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, తర్వాత తమ ఫోకస్ అంతా అభివృద్ధిపైనే ఉంటుందని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ అంశాలు ఏఐసీసీ పరిశీలనలో ఉన్నాయని అన్నారు. పదవుల విషయంలో తమకు ఏకాభిప్రాయం ఉందని, ఎందుకు ఆలస్యం అవుతోందో ఏఐసీసీ పెద్దలనే అడగాలని అన్నారు. ఇలావుండగా భద్రాచలానికి సమీపాన ఏపీలో ఉన్న ఐదు గ్రామాలు, దేవుడి మాన్యాలను తెలంగాణలో విలీనం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. -
సింగరేణికే కేటాయించాలి
సాక్షి, న్యూఢిల్లీ: సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగంలో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ (ఎస్సీసీఎల్)లో తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటాలు ఉన్నాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. గనులు, ఖనిజాభివృద్ధి నియంత్రణ చట్టంలోని (ఎంఎండీఆర్) సెక్షన్ 11ఏ/ 17 (ఏ) (2) ప్రకారం వేలం జాబితా నుంచి శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌ను తొలగించాలని, అదే సెక్షన్ ప్రకారం గోదావరి లోయ బొగ్గు నిల్వల క్షేత్రం పరిధిలోని కోయగూడెం, సత్తుపల్లి బ్లాక్–3 గనులనూ సింగరేణికే కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల అవసరాలు తీర్చేందుకు ఈ గనుల కేటా యింపు కీలకమైనందున సింగరేణికే వాటిని కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిసిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సుమారు గంటసేపు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన బొగ్గు గనుల కేటాయింపు, ఐటీఐఆర్ పునరుద్ధరణ, రక్షణ భూముల కేటాయింపు, రాష్ట్ర పునరి్వభజన చట్టంలోని అంశాలపై చర్చించారు. ప్రధానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి వినతులు ఇవీ.. ⇒ హైదరాబాద్–కరీంనగర్ రహదారి, హైదరాబాద్–నాగ్‌పూర్ రహదారి (ఎన్‌హెచ్–44)పై ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మధ్యలో అడ్డుగా ఉన్న రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి. ఆ కారిడార్లతోపాటు హైదరాబాద్‌లో రహదారుల విస్తరణ, రవాణా, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రక్షణ శాఖ పరిధిలో 2,450 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలి. ఆ భూములకు ప్రత్యామ్నాయంగా రావిరాలలో రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్ఐసీ)కు లీజుకిచ్చిన 2,462 ఎకరాలను కేంద్రానికి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం ఉంది. ⇒ 2010లో నాటి యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్, బెంగళూరుకు కేటాయించిన ఐటీఐఆర్ ప్రాంతాల విషయంలో 2014 తర్వాత ముందడుగు పడలేదు. అందుకే హైదరాబాద్‌కు ఐటీఐఆర్ ను పునరుద్ధరించాలి. ⇒ భారత్‌మాల పరియోజన మొదటి దశలో హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం (సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు) జాతీయ రహదారి నిర్మాణ టెండర్ల ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టాలి. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని (చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు) వెంటనే జాతీయ రహదారిగా గుర్తించి దాన్ని కూడా భారత్ మాల పరియోజనలో చేర్చి నిర్మించాలి. ⇒ రాష్ట్రంలో పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలి. (జగిత్యాల–పెద్దపల్లి–కాటారం, దిండి–దేవరకొండ–మల్లెపల్లి–నల్లగొండ, భువనగిరి–చిట్యాల, చౌటుప్పల్ ఆమన్‌గల్–షాద్ నగర్–సంగారెడ్డి, మరికల్–నారాయణపేట రామసముద్ర, వనపర్తి–కొత్తకోట–గద్వాల మంత్రాలయం, మన్నెగూడ–వికారాబాద్–తాండూరు–జహీరాబాద్–బీదర్, కరీంనగర్–సిరిసిల్ల–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం, ఎర్రవల్లి ఎక్స్ రోడ్డు–గద్వాల–రాయచూరు, కొత్తపల్లి–హుస్నాబాద్–జనగాం–హైదరాబాద్, సారపాక–ఏటూరునాగారం, దుద్దెడ–కొమురవెల్లి–యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్ రోడ్డు, జగ్గయ్యపేట–వైరా–కొత్తగూడెం) – రాష్ట్రానికి ఒక ఐఐఎం మంజూరు నిర్ణయం కింద తెలంగాణకు ఇంకా ఐఐఎం మంజూరు చేయలేదు. ఇప్పటికైనా హైదరాబాద్‌కు ఐఐఎం మంజూరు చేయాలి. – తెలంగాణలోని కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి. – ఏపీ పునరి్వభజన చట్టంలో హామీ ఇచ్చినట్లుగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలి. – హైదరాబాద్‌లో సెమీకండక్టర్ ఫ్యాబ్స్‌ను నెలకొల్పేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నందున ఇండియా సెమీకండక్టర్ మిషన్‌లో తెలంగాణను చేర్చాలి. – 2024–25 నుంచి ప్రారంభమవుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలి. – తెలంగాణకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్జీఎఫ్) కింద 2019–20 నుంచి 2023–24 వరకు తెలంగాణకు రావల్సిన రూ. 1,800 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. – రాష్ట్ర పునరి్వభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం బయ్యారంలో వెంటనే ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పే ప్రక్రియను వేగవంతం చేయాలి. -
సమగ్ర నివేదిక సమర్పించండి
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదంపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా ప్రమాదానికి లోనైన యూనిట్–1ను పునరుద్ధరించి విద్యుదుత్పత్తిని పునఃప్రారంభించాలని స్పష్టం చేశారు. మధిరలో జెన్కో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అగ్నిప్రమాదాన్ని తనిఖీ చేయడానికి సోమవారం భోపాల్ నుంచి బీహెచ్ఈఎల్ నిపుణుల బృందం వస్తున్నట్లు అధికారులు ఆయనకు తెలిపారు. ఆ తర్వాతే నష్టంపై పూర్తి అంచనాకు రాగలుగుతామన్నారు. బీటీపీఎస్‌కు రూ.25 కోట్ల నష్టం!జాగ్రత్తలన్నీ తీసుకున్నా పిడుగు పడిందన్న అధికారులు జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ పునరుద్ధరణకు 45 నుంచి 60 రోజులు!మణుగూరు టౌన్: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో శనివారం రాత్రి పిడుగు పడటంతో జరిగిన అగ్ని ప్రమాదంతో రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలంగాణ జెన్కో అధికారులు అంచనాకు వచ్చారు. జెన్కో థర్మల్ విభాగం డైరెక్టర్ బి.లక్ష్మయ్య, సీఈ బి.రత్నాకర్... బీటీపీఎస్ సీఈ బిచ్చన్నతో కలిసి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ పిడుగు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నా పిడుగుపడినట్లు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు గుర్తించామని తెలిపారు. ఇందుకుగల కారణాలపై విచారణ చేపడుతున్నామన్నారు. మరోవైపు 270 మెగావాట్ల ఒకటో యూనిట్‌లోని జనరేటర్ ట్రాన్స్ఫార్మర్, ఇతర పరికరాలు దగ్ధమవగా పునరుద్ధరించడానికి 45 నుంచి 60 రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ను విడదీసే పనిలో నిమగ్నమయ్యారు. తప్పిన భారీ ప్రమాదం.. జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్‌లో 80 వేల లీటర్ల లిక్విడ్ ఆయిల్ ఉండగా పిడుగుపాటుతో దాని బుష్‌ల నుంచి ఆయిల్ లీక్ అయి మంటలు ఎగసిపడ్డాయని అధికారులు చెబుతున్నారు. మంటలు దగ్గరలోని జనరేటర్‌కు వ్యాపించి ఉంటే మొత్తం యూనిట్–1 దగ్ధమై ఊహించలేని ప్రమాదం జరిగేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఇంకా అలక వీడని జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తనకు సమాచారం లేకుండా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను పార్టీలో చేర్చుకోవడంపై కినుక వహించిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ఇంకా అలకపాన్పు వీడలేదు. సంజయ్‌ను పార్టీలో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ పదవిని వదులుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. సమాచారం తెలుసుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,సీనియర్ మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం హైదరాబాద్‌లోని జీవన్‌రెడ్డి నివాసానికి వెళ్లి గంటన్నర పాటు చర్చించారు. చర్చల తర్వాత కూడా ఆయన తన వైఖరి మార్చుకోలేదు. కాంగ్రెస్ పార్టీని తాను వదిలే ప్రసక్తే లేదని, అయితే ఎమ్మెల్సీ పదవికి మాత్రం త్వరలోనే రాజీనామా చేస్తానని జీవన్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. మండలి చైర్మన్‌కు ఫోన్ సంజయ్ చేరిక సమయంలో కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వలేదన్న మనస్తాపంతో ఉన్న జీవన్‌రెడ్డితో కాంగ్రెస్ నాయకత్వం సోమవారం చర్చలు జరిపింది. పార్టీ అధిష్టానం కూడా మాట్లాడింది. అయినా, తన వైఖరిలో మార్పు లేదంటూ జీవన్‌రెడ్డి మంగళవారం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తాను కలుస్తానంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఫోన్ చేశారు. కానీ, తాను అందుబాటులో లేనని, నల్లగొండ వెళుతున్నానని గుత్తా వెల్లడించడంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు బేగంపేటలోని జీవన్‌రెడ్డి నివాసానికి హుటాహుటిన వెళ్లారు. గంటన్నరకు పైగా అక్కడే ఉండి జీవన్‌రెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ తగిన గౌరవం ఇస్తుందని, సీనియారిటీకి ఎక్కడా గౌరవం తగ్గకుండా తాము చూస్తామని నచ్చజెప్పారు. అయితే, మంత్రులతో చర్చల సందర్భంగా జీవన్‌రెడ్డి తన మనసులోని మాటలను వారికి వెల్లడించారని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని, తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలోని తన రాజకీయ ప్రత్యరి్థని పార్టీలో చేర్చుకోవడం ద్వారా తనకు ఏం గౌరవం ఇచి్చనట్టని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో తనది నాలుగు దశాబ్దాల అనుబంధమని, తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని, అయితే ఎమ్మెల్సీ పదవిలో కొనసాగే ఆలోచన ప్రస్తుతానికి లేదని, తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేసినట్టు సమాచారం. జీవన్‌రెడ్డి మా మార్గదర్శకులు: డిప్యూటీ సీఎం భట్టి మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర నేతలతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని పదేళ్లు పార్టీ జెండాను భుజాన మోస్తూ పార్టీ భావజాలాన్ని చట్టసభల్లో వినిపించిన నాయకుడు జీవన్‌రెడ్డి అని అన్నారు. ఆయన మనస్తాపానికి గురైతే తాము కూడా బాధపడతామని వ్యాఖ్యానించారు. జీవన్‌రెడ్డి తమందరికీ మార్గదర్శకులని, ఆయన అనుభవాన్ని ప్రభుత్వాన్ని నడిపేందుకు తప్పనిసరిగా వినియోగించుకుంటామని చెప్పారు. ఆయన సీనియారిటీకి ఎలాంటి భంగం కలిగించకుండా పార్టీ సముచిత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. సీనియర్ నాయకులను వదులుకునేందుకు పార్టీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని జీవన్‌రెడ్డిని తాము కోరామని, ఆయన సానుకూలంగా స్పందించారని భట్టి వెల్లడించారు. చైర్మన్‌ను సమయం ఎందుకు అడిగానో ఆలోచించుకోండి: జీవన్‌రెడ్డి భట్టి, శ్రీధర్‌బాబులతో చర్చలు ముగిసిన అనంతరం జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీతో 40 ఏళ్ల అనుబంధం ఉదని చెప్పారు. జరిగిన పరిణామాలు కొన్ని బాధించాయని వ్యాఖ్యానించారు. తనతో పార్టీ ఇన్చార్జ్ మున్షీ కూడా మాట్లాడారని వెల్లడించారు. శాసనమండలి చైర్మన్ అందుబాటులో లేరని, ఆయన అందుబాటులోకి రాగానే నిర్ణయం చెబుతానని, త్వరలోనే మండలి చైర్మన్ దగ్గరకు వస్తానని అన్నారు. మీరు ఎమ్మెల్సీగా కొనసాగుతారా? రాజీనామా చేస్తారా అని ప్రశ్నించగా, మండలి చైర్మన్ టైం ఎందుకు అడిగానో అర్థం చేసుకోవాలని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదికి ముందే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు ప్రభుత్వం తాజాగా నిధులను విడుదల చేసింది. 2024-2025 ఏడాది మొత్తానికి సరిపడా నిధులు ముందే డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. దీంతో సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, టీచింగ్ మెడికల్ స్టాప్, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఇక.. ఏడాదికి ముందే ప్రభుత్వం స్టైఫండ్ నిధులు విడుదల చేయటంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
వ్యవసాయానికి రూ.1.34 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది వ్యవసాయ రంగానికి రూ.1.34 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) నిర్ణయించింది. 2024–25 రాష్ట్ర స్థాయి రుణ ప్రణాళికను రూ.6.33 లక్షల కోట్లుగా ఖరారు చేసింది. ఇది గత ఏడాది కంటే 161 శాతం అధికం కావడం గమనార్హం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు బుధవారం ఈ రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎస్ఎల్బీసీ సమావేశంలో భట్టి మాట్లాడారు. బ్యాంకర్లకు సామాజిక, మానవీయ కోణం ఉండాలని సూచించారు. బ్యాంకర్లకు పాజిటివ్ ధృక్పథం లేకపోతే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు. నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు. బలహీన వర్గాలకు విరివిగా రుణాలు ఇస్తేనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో తెలంగాణ రూపురేఖలు మారిపోతాయని పేర్కొన్నారు. త్వరలో కొత్త విద్యుత్ పాలసీ వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధితో రాష్ట్రం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడనుందని భట్టి చెప్పారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా పెండింగ్‌లో పెట్టదని హామీ ఇచ్చారు. ఆయిల్ పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందని, రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యుత్ పాలసీని తీసుకురాబోతోందని తెలిపారు. సన్న చిన్నకారు రైతులపై చిన్నచూపు: మంత్రి తుమ్మల వ్యవసాయ రంగానికి సంబంధించి గత సంవత్సరం కంటే రూ.13 వేల కోట్ల రుణాలు అధికంగా మంజూరు చేసినప్పటికీ, సన్న చిన్నకారు రైతుల వాటా అనుకున్నంత మేర లేదని మంత్రి తుమ్మల అన్నారు. రాష్ట్రంలో 73.11 శాతం భూములు వారి చేతిలోనే ఉన్నాయని, వీరికి ఇచ్చే రుణాలను పెంచాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. రాష్ట్రంలో వివిధ బ్యాంకులకు చెందిన 6,415 శాఖల ద్వారా సేవలందిస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 1,874 మాత్రమే ఉన్నాయన్నారు. వాటిని పెంచాల్సిన అవసరం ఉందని తుమ్మల చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ పామ్ సాగుకు బ్యాంకుల నుండి ప్రోత్సాహం కరువైందన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు, ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్ కమల్ ప్రసాద్ పటా్నయక్, నాబార్డు సీజీఎం సుశీల్ చింతల, ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేశ్‌కుమార్, ఎస్బీఐ జనరల్ మేనేజర్ దేబశిష్ మిత్ర తదితరులు పాల్గొన్నారు. రుణాల కేటాయింపులు ఇలా... – 2024–25 వార్షిక రుణ ప్రణాళిక మొత్తం రూ.6,33,777 కోట్లు – ప్రాధాన్య రంగాలకు అడ్వాన్సులు రూ.2,80,550 కోట్లు – వ్యవసాయ రంగానికి రూ.1,34,138 కోట్లు – వ్యవసాయ రంగ కేటాయింపుల్లో పంట రుణాలకు రూ.81,478 కోట్లు. (గతం కంటే 10.95% పెరుగుదల), వ్యవసాయ పెట్టుబడులకు రూ.28,222 కోట్లు, వ్యవసాయ మౌలిక సదుపాయాలకు రూ.5,197 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకు రూ.19,239 కోట్లు – సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు రూ.1,29,635 కోట్లు – గృహ రుణాలు రూ.10,768 కోట్లు – విద్యా రుణాలు రూ.2,706 కోట్లు – ఇతర రంగాలకు రూ.3,301 కోట్లు – 2023–24లో మొత్తం డిపాజిట్లు రూ.7,79,953 కోట్లు (గతం కంటే రూ. 96,547 కోట్లు వృద్ధి) – మొత్తం అడ్వాన్సులు రూ.9,79,058 కోట్లు (గతం కంటే రూ.1,65,162 కోట్ల వృద్ధి) – పంట రుణాలు రూ.64,940 కోట్లు. (లక్ష్యంలో 88.42% మంజూరు) – వ్యవసాయ పెట్టుబడి రుణాలు, అనుబంధ రంగాలు, కార్యక్రమాలకు రూ. 47,935 కోట్లు (లక్ష్యంలో 121.89% ఇచ్చారు) -
వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. వర్షాలు, ఈదురుగాలుల మూలంగా చెట్లు విరిగిపోవడం, స్తంభాలు కూలిపోవడం, విద్యుత్ తీగలు ఊడిప డటం లాంటి ఘటనలు జరుగుతుంటాయని, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండి సమస్య వచి్చన వెంటనే స్పందించాలని సూచించారు. శని వారం సచివాలయంలో ఆయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘ప్రజలు, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ అందుబాటులో ఉంది.సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టండి. లైన్స్ క్లియరెన్స్ (ఎల్సీ) విషయంలో జాగ్రత్త వహించాలి. ఒకేసారి పలు ప్రాంతాల్లో ఎల్సీలు ఇవ్వొద్దు. ఎల్సీ తీసుకునే సమయంలో స్థానిక వినియోగదారులకు ముందస్తు సమాచారం ఇవ్వండి. వర్షాకాలంలో కరెంటు సరఫరా, మరమ్మతులు, పునరుద్ధరణ విషయంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి నుంచి క్షేత్రస్థాయిలోని లైన్మెన్ వరకు అప్రమత్తంగా ఉండాలి. నిరంతరం సమీక్షలు నిర్వహించడంతో పాటు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసుకోండి’అని భట్టి ఈ సమీక్షలో సూచించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం.ఎ.రిజ్వి, ఎస్పీడీసీఎల్ ఎండీ ముషారఫ్ అలీ, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆలోచనల మేరకు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చారని శనివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయాలు, ఆకాంక్షలు పదేళ్లుగా ఆచరణకు నోచుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పాలన మొదలయ్యాక ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారని తెలిపారు. -
ఇండియా కూటమి వస్తే ఇంటి పెద్దకు లక్ష
సాక్షి, హైదరాబాద్: ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ఇంటి పెద్ద బ్యాంకు ఖాతాలో రూ.లక్ష జమ చేస్తామని, మహిళలను మహారాణులుగా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క హామీ ఇచ్చారు. మంగళవారం పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్కోట్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ తన 55 ఏళ్ల పరిపాలనలో ఏనాడూ పూజా కార్యక్రమాలను అడ్డుకోలేదన్నారు.కాంగ్రెస్ సర్కారు ఎప్పుడూ పేదల గురించే ఆలోచిస్తుందని, బీజేపీ మాత్రం పేదలకు రూపాయి కూడా ఇవ్వకుండా అదానీ, అంబానీ వంటి కొద్దిమంది పెద్దలకు మాత్రం రూ.16 లక్షల కోట్ల రుణమాఫీ చేసిందని మండిపడ్డారు. మోదీ 10 ఏళ్ల పాలనలో రూ.100 లక్షల కోట్ల అప్పులు చేసి దేశాన్ని అప్పులకుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయని, అదేవిధంగా అన్ని చోట్లా రిజర్వేషన్లు పెంచుతామని ఇండియా కూటమి చెప్పిందన్నారు. దేశవ్యాప్తంగా ఉచిత ఆరోగ్య బీమాయూపీఏ హయాంలో ఉపాధి హామీ పథకం, ఆహార భద్రత, రూరల్ హెల్త్ మిషన్, భూ సంస్కరణలు చేసినప్పుడు సైతం బీజేపీ నేతలు విమర్శించారని భట్టి గుర్తు చేశారు. ప్రాణాలు లెక్కచేయకుండా సరిహద్దుల్లో కాపలాకాస్తున్న వీర జవాన్ల స్థాయిని మోదీ ప్రభుత్వం దిగజార్చిందని మండిపడ్డారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని, దేశ వ్యాప్తంగా ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు.మద్దతు ధర, రుణమాఫీ కోసం ఢిల్లీలో రైతులు నెలల తరబడి ఆందోళన చేస్తే మోదీ 10 నిమిషాలు కూడా వారి కోసం కేటాయించలేదని భట్టి గుర్తు చేశారు. జనాభా దామాషా ప్రకారం ఈ దేశ సంపద, వనరులు పంపిణీ చేయడమే లక్ష్యంగా రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర, మణిపూర్ నుంచి ముంబై వరకు బస్సు యాత్ర చేసిన విషయాన్ని భట్టి వివరించారు. -
‘ఇండియా’ అధికారంలోకి వస్తే రైతులకు చట్టబద్ధంగా మద్దతు ధర: భట్టి
ఫరీద్ కోట్: ఇండియా కూటమి అధికారంలోకి రాగానే చట్టబద్ధంగా రైతులకు కనీస మద్దతు ధరను అందిస్తామని.. రైతుల కష్టానికి తగిన ఫలితం రాబోయే రోజుల్లో దక్కనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని మొగ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో భట్టి విక్రమార్క పలు సమావేశంలో ప్రసంగించారు.దేశంలో వరి, పత్తి, చెరకు రైతులకు మద్దతు ధర లభించడం లేదు నరేంద్ర మోదీ నల్ల చట్టాలు తెచ్చి వారి ధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు అని ఆరోపించారు. దేశంలోని నిరుద్యోగులకు అప్రెంటిషిప్ హక్కు కల్పిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొస్తామన్నారు. దేశంలోని పట్టభద్రులు, డిప్లమా చేసిన వారందరికీ ఈ హక్కు ఇవ్వబోతున్నామన్నారు.దేశంలోని పబ్లిక్ ప్రైవేటు సెక్టార్లలో సుమారు 30 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఆగస్టు 15 లోపు ఈ ఉద్యోగాలను ఇండియా కూటమి ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలో ఆసుపత్రుల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం అన్నారు. ఒక ఏడాది కాలం పక్కగా తొలి ఉద్యోగం లభిస్తుంది. ఉచిత శిక్షణ అందుతుందన్నారు. కోట్లాదిమంది నిరుద్యోగులకు ఏడాదికి లక్ష రూపాయల నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. నెలకు రూ .8500 వేస్తాం, ప్రస్తుతం ఉపాధి హామీ కూలీలకు లభిస్తున్న రోజువారి కూలీలు రూ. 250 నుంచి రూ. 400కు పెంచుతాం. ఆశ, అంగన్వాడి మహిళల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని తెలిపారు.గత పది సంవత్సరాల కాలంలో మోదీ 25 మందికి సంబంధించిన రూ.16 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేశారు. ఆ విధంగా ఆయన 24 ఏళ్ల పాటు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసేందుకు సరిపడా డబ్బులను వారికి ఇచ్చారు అని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం 25 మందిని కుబేరులను చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాదిమంది దేశ ప్రజల్ని లక్షాధికారులని చేస్తుందని భరోసా ఇచ్చారు.మోదీ, అమిత్ షా ఆందోళనలో ఉన్నారు. అభివృద్ధిని చూసి ఓటు వేయమని మోదీ అడగడం లేదు. మటన్, మందిర్, మంగళసూత్రం, మైనార్టీతో లాంటి అంశాలనే ప్రధాని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ను చూసి బీజేపీ భయపడుతుంది. అందుకే కాంగ్రెస్ నేతల్ని టార్గెట్ చేసి మోదీ విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల్లో ఎస్సీ, ఎస్టీలు ఎందరో చెప్పడం లేదు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రిజర్వేషన్ ప్రకారం పోస్టులు ఇస్తాం. మహిళలకు 50 శాతం జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తాం’’ అని భట్టి విక్రమార్క అన్నారు. -
కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరెంట్ కోతలు లేనే లేవని, పీక్ డిమాండ్‌లోనూ నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్‌శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ నాయకులు కరెంట్ కట్ నాటకానికి తెర తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుందని అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతలు చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పి కొట్టి ఎన్నికల్లో గుణపాఠం చెప్పినా.. వారికి ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. సూర్యాపేటలో, మహబూబ్ నగర్లో కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు పోయిందని సోషల్ మీడియాలో లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన ప్పటి నుంచి నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నా మనీ, ఎక్కడ కరెంట్ కోతలు లేవని పునరుద్ఘాటించారు. ఎక్కడైనా సాంకేతిక కారణాలతో అంతరాయం తలెత్తినా.. వెంటనే విద్యుత్ సిబ్బంది అక్కడ విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారని తెలిపారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజలకు అసౌకర్యం కలి గిస్తే వాటిని కూడా ఉపేక్షించటం లేదనీ. వెంటనే వారిపై శాఖాపరమైన చర్యలు తీసు కుంటున్నట్లు వివరించారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటే కూడా బీఆర్ఎస్ నాయ కులు రాజకీయం చేస్తూ తప్పు పట్టడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ మేరకు భట్టి విక్రమార్క శుక్రవారం హైదరాబాద్‌లో సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే విద్యుత్ వినియోగం పెరిగింది 2022 డిసెంబర్ నుంచి 2023 ఏప్రిల్ వరకు మొత్తం 36, 207 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ నుంచి 2024 ఏప్రిల్ 30 వరకు 38,155 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా చేశా మని భట్టి తెలిపారు. ఒకే రోజున గరి ష్టంగా 15,497 మెగావాట్ల పీక్ డిమాండ్ విద్యుత్ సర ఫరా చేసిన చరి త్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని వెల్లడించారు. ఈ వే సవిలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరడంతో విద్యుత్ డిమాండ్ సహజంగానే పెరిగిందని వివరించా రు. అక్కడక్కడా లోడ్ పెరిగితే ఒక్కోసారి ట్రిప్ అవటం, దీంతో విద్యుత్ సరఫరాలో సాంకేతిక అవాంతరాలు తలెత్తుతున్నా.. వాటిని ఎప్పటికప్పు డు విద్యుత్ సిబ్బంది అధిగమిస్తూ ప్రజలకు అసౌకర్యం లేకుండా సత్వర సేవలు అందిస్తున్నారని తెలిపారు.అంతరాయాలను తగ్గించాం.. ఇదిగో ఆధారం‘గత ఏడాది ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30 వరకు వారం రోజులు మండు టెండలున్నాయి. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు గ్రేటర్ హైదరాబా ద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో 1,369 సార్లు 11 కేవీ లైన్ ట్రిప్ అయ్యాయి. మొత్తం ఆ వారం రోజుల్లో 580 గంటలు విద్యుత్‌కు అంతరాయం వాటిల్లింది. ఇప్పుడు అదే గడిచిన వారంలో కేవలం 272 చోట్ల 11 కేవీ విద్యుత్ సరఫరా ట్రిప్ అయింది. కేవలం 89 గంటలు మాత్రమే అంతరాయం వాటిల్లింది‘ అని భట్టి విక్రమార్క వివరించారు.‘గత ఏడాది అదే వారంలో లెక్కలు చూసుకుంటే అప్పుడు 301 ట్రాన్స్ ఫార్మర్లు ఫెయిలయ్యా యి. ఇప్పుడు కేవలం 193 ట్రాన్స్ ఫార్మర్లు మాత్రమే ఫెయిలయ్యాయి. వాటిని కూడా వెంటనే మార్చి కొత్తవి బిగించి విద్యుత్ పునరుద్ధరించాం. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వం మెరుగైన విద్యుత్ సరఫరా చేస్తుందనడానికి ఇంతకంటే ఏం ఆధారం కావాలి.? అని ప్రశ్నించారు. అప్పట్లో కరెంట్ కోత లేనేలేదని మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు వీటికేం సమాధానం చెబుతారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిలదీశారు.నగరంలో 226 స్పెషల్ టీంలుజీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడైనా విద్యుత్ అంతరాయానికి సంబంధించిన ఫిర్యాదు వచ్చినా వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేకంగా 226 స్పెషల్ వ్యూ ఆఫ్ కాల్ టీమ్ లను ఏర్పాటు చేశామని భట్టి వెల్లడించారు. హైదరాబాద్‌లో ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఎక్కడ ఇబ్బందొచ్చినా వెంటనే పరిష్కరించేందుకు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్విరామంగా పని చేస్తోందని భట్టి విక్రమార్క వివరించారు. -
డిప్యూటీ సీఎం వాహనాన్ని ఆపిన సీపీ..
మహేశ్వరం: తుక్కుగూడ సభకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని పోలీసులు అనుమతించలేదు. డిప్యూటీ సీఎం కాన్వాయ్‌లోని వాహనమని.. సభలోకి వెళ్లేందుకు డయాస్ పాస్ ఉందని డ్రైవర్ చెప్తున్నా వినిపించుకోలేదని తెలిసింది. పైగా డ్రైవర్ శ్రీనివాస్‌పై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి చేయి చేసుకున్నారని..అతడి జేబులోని ఐడీ కార్డును లా క్కుని, వాహనాన్ని నిలిపివేశారని సమాచారం. అరగంట తర్వాత తిరిగి ఆ డ్రైవర్‌ను పిలిపించి, చుట్టూ పోలీసులను నిలబెట్టి ఏసీపీతో కొట్టించారని ఆరోపణలు వచ్చాయి. ఈ దృశ్యాలను చిత్రీ కరిస్తున్న వీడియోగ్రాఫర్, ఇతరుల సెల్ఫోన్లను పోలీసులు లాక్కుని, చేయిచేసుకున్నట్టు తెలిసింది. -
బండ పగలకొడతాం.. సాగునీరు పారిస్తాం! : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
మహబూబ్‌నగర్: ‘బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సంగంబండ రిజర్వాయర్ కింద ఉన్న బండను పగలకొట్టకుండా 15 గ్రామాలకు సాగునీరు అందించడంలో నిర్లక్ష్యం వహించింది.. నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లింపులోనూ మొండిచేయి చూపారు.. బండ పగలకొట్టింటే 25 వేల ఎకరాలకు సాగునీరు అందేది.. పైన రిజర్వాయర్ కింద కాల్వలు పూర్తయినా ఒక బండ పగలగొట్ట లేని చరిత్ర ఆ ప్రభుత్వానిది.. వారి నిర్లక్ష్యం వల్ల నీళ్లు లేక పదేళ్ల పాటు ఈ ప్రాంత రైతులు పంటలను ఎండబెట్టుకోవాల్సి వచ్చింది.. దీంతో 15 గ్రామాల్లో రైతుల పొలాలు ఎండిపోయాయి. సభాముఖంగా హామీ ఇస్తున్నా.. ఈ ప్రాంత రైతుల 19 ఏళ్ల కల నెరవేరబోతుంది.. ఆ బండ పగలగొట్టి సాగునీరు పారిస్తామ’ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం వారు స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి సంగంబండ లో లెవల్ కెనాల్ కింద ఉన్న సంగంబండను పరిశీలించి ప్రజాదీవెన సభలో పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ భీమా ప్రాజెక్టులో అంతర్భాగమైన సంగంబండ రిజర్వాయర్ లెఫ్ట్ లో లెవల్ కెనాల్ కోసం 500 మీటర్ల బండ తొలగి సంగబండ గ్రామానికి చెందిన ముంపు బాధితులకు చెల్లించాల్సిన కూలీ డబ్బులు పదేళ్లుగా నిలిచిపోయాయని, దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెండు నెలల్లో రూ.12 కోట్లు ప్రభుత్వం ముంపు బాధితుల ఖాతాలో జమ చేసిందన్నారు. ఉజ్జెల్లికి రూ.13.34 కోట్లు, కొత్తగార్లపల్లికి రూ.1.19 కోట్లు జమ చేసేందుకు చొరవ తీసుకుంటామన్నారు. నేరడ్గం, ఆర్ఆర్ సెంటర్లు అనుగొండ, గడ్డంపల్లి గ్రామాలకు సైతం అందాల్సిన బెనిఫిట్స్ అందిస్తామన్నారు. పాలమూరు నుంచి వచ్చిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు.. ఈ ప్రాంతంపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది.. పాలమూరు సమస్యలు తెలిసినందుకే జూరాల నుంచి కొడంగల్– నారాయణపేట ప్రాంతాలకు ఎత్తిపోతల ద్వారా కృష్ణా నీళ్లు మళ్లించే పథకానికి రూ.3 వేల కోట్లు వెచ్చించారని చెప్పారు. మక్తల్‌లో కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన ముదిరాజ్ వాకిటి శ్రీహరిని గెలిపించినందుకే ఇక్కడికి వచ్చామని మంత్రులు పేర్కొన్నారు. లక్ష మెజార్టీతో గెలిపించండి! రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరు ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డిని ప్రకటించిందని, వంశీని లక్ష మెజార్టీతో గెలిపిస్తే.. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. వంశీచంద్‌రెడ్డి గెలవక ముందే రూ.వందల కోట్ల నిధులు పాలమూరుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గెలిచాక తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎంపీ చేయని విధంగా వంశీ పనిచేస్తాడనే నమ్మకం ఉందన్నారు. విద్యార్థి విభాగం నుంచి యువజన రాష్ట్ర కాంగ్రెస్, జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన వంశీచంద్‌రెడ్డి సోనియా, రాహుల్‌గాంధీలతో అత్యంత సన్నిహితంగా ఉంటారన్నారు. వంశీచంద్‌రెడ్డికి మక్తల్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఇవ్వాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. రూ.350 కోట్లు మంజూరు చేయండి: వాకిటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గంలో ఏడు లిఫ్టు ఇరిగేషన్లు పునరుద్ధరించేందుకు రూ.350 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రులను కోరారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్లో అభివృద్ధికి సహకరించాలన్నారు. నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకం పేరులో తమ ప్రాంతం పేరు పెట్టాలని కోరడంతో మక్తల్– నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకం మార్చారన్నారు. అలాగే మక్తల్‌లో 33/11 కేవీ సబ్‌స్టేషన్, సంగంబండ దగ్గర సోలార్ ప్లాంట్ ఏర్పాటు, ఊట్కూర్ మండలం పూలిమామిడిలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, దేవరకద్రలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, నాయకులు బాలకృష్ణరెడ్డి, గోపాల్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, హన్మంతు, సురేశ్‌కుమార్, రవికుమార్, గణేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: వీడిన సస్పెన్స్..! లోక్‌సభ అభ్యర్థిగా డీకే అరుణ.. -
ఆ ఎంపీ సీటుపై అయోమయం.. ముగ్గురు మంత్రుల ‘సై’
కాంగ్రెస్ అధిష్టానంకు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక సవాల్‌గా మారిందా?.. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు చెందిన సంబంధికులు సీరియస్‌గా టికెట్ ట్రై చేస్తూ ఉండటంతో ఎవరికి ఇవ్వాలో తెలియక అయోమయ స్థితిలో కాంగ్రెస్ అధిష్టానం ఉందా?.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఏ పార్లమెంటు సెగ్మెంట్లో లేని పోటి అక్కడే ఉండటానికి చాలా ఈక్వేషన్స్ ఉన్నాయా?...కాంగ్రెస్‌కు కొంత తలనొప్పులు తెచ్చిపెడుతున్న ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపికపై ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 17 స్థానాలలో మిగత 13చోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే 13 స్థానాలల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ తలనోప్పిగా మారింది మాత్రం ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపికననే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న రాజకీయాలు అన్నిఇన్ని కావు. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణ రాజకీయలంతా ఖమ్మం చుట్టే తిరిగాయని చెప్పాలి. ఇప్పుడు మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పాలిటిక్స్ ఖమ్మం వైపే టర్న్ అయ్యాయనే చెప్పాలి. ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్ రావుకే మళ్లీ టికెట్ ప్రకటించింది...అయితే బీఆర్ఎస్ లో పెద్దగా పోటి లేకపోవడంతో మళ్లీ నామా కే టికెట్ ఇచ్చారు.. కానీ కాంగ్రెస్‌లో ఆ పరిస్థితితి లేదు. టికెట్ కోసం తీవ్రమైన పోటి ఉండటంతో కొత్త కొత్త ఈక్వేషన్స్ మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ముగ్గురు మంత్రులు సై అంటే సై అంటున్నారు. బయటకు కనిపించకపోయిన టికెట్ ఎపిసోడ్ లో లోలోపల కత్తులు దూసుకుంటున్నారన్న ప్రచారం నడుస్తుంది. ఖమ్మం పార్లమెంట్ టికెట్‌ను ముగ్గురు మంత్రులకు సంబంధించిన వారు పోటి పడుతున్నారు. ఎవరికి వారు తగ్గేదేలేదన్నట్లు టికెట్ కోసం పట్టుపడుతూ ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థి ఎంపిక విషయంలో మల్లగుల్లలు పడుతుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానంను కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కీలకంగా పనిచేసిన కారణంగా పార్లమెంట్ టికెట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ స్తబ్దుగా ఉన్న సమయంలో పొంగులేటి చేరికతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ లో జోష్ పెరిగిందనే వార్తలు అప్పట్లో వినిపించాయి...కేసీఆర్ పై తీవ్రస్తాయిలో విమర్శలు చేస్తు దూకుడు గా ముందుకు వెళ్లారు పొంగులేటి...పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క స్థానంలో కూడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలవనియ్యను. అసెంబ్లీ గేటు తాకనివ్వను అని పొంగులేటి చేసిన శపథం పెద్ద సంచనలనానికే దారీతీసింది. ఎవరినా కదిలించిన పొంగులేటి శపథంపైనే చర్చ జరిగింది. దీంతో గత ఈక్వేషన్స్ ను లెక్కలోకి తీసుకోని టికెట్ తన సోదరుడుకి ఇవ్వాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరుతున్నారు. మరోవైపు డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్కమార్క సతీమణి మల్లు నందిని సైతం తనకే ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు దీంతో భట్టి విక్కమార్క సైతం తన సతీమణికి టికెట్ ఇప్పించేందుకు అధిష్టానంతో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేసి కాంగ్రెస్ అధికారంలోకి రావడం వెనుక కీలకంగా తను పనిచేశానని చెప్పుకుంటు భట్టి విక్కమార్క సైతం టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ నడుస్తుంది. అటు మల్లు నందిని సైతం పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డ వారికే అధిష్టానం ప్రయార్టీ ఇస్తుందనే దీమాతో ఉన్నారు. టికెట్ పై చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఇక జిల్లాకు చెందిన మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కొడుకు తుమ్మల యుగేంధర్ సైతం కమ్మ కోటాలో టికెట్ కోసం ట్రై చేస్తున్నారు..తెరవెనుక చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కమ్మ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు టర్న్ అవ్వడంలో తుమ్మల కీలకంగా వ్యవహరించారన్న ఈక్వేషన్స్ తో వారు కూడ రేసులో ముందు వరుసలో ఉన్నామంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ముగ్గురు మంత్రులు పనిచేశారు...గ్రూపు పాలిటిక్స్ ను పక్కనే పెట్టి అంత ఒక్కటిగా ముందుకు వెళ్లడంతో ఫలితాలు సైతం కాంగ్రెస్‌కు అనుకులంగా వచ్చాయి. సీన్ కట్ చేస్తే పార్లమెంట్ ఎన్నికలకొచ్చేసరికి ఈక్వేషన్స్ మారిపోయాయి. ముగ్గురు మంత్రులకు సంబంధించిన వారు టికెట్ కోసం పోటి పడుతుండటంతో లెక్కలు తప్పుతున్నాయి..ప్రస్తుతం పైకి అందరు కలిసి ఉన్నట్లు కనిపిస్తున్న టికెట్ విషయంలో చాలా సీరియస్‌గా ఎవరికి వారు వారి వారి రూట్లలో ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు వస్తదంటే తమకు వస్తుందని ముగ్గురు దీమాతో ఉన్నారు. ముగ్గురు సీనియర్ నేతలు కావడంతో ముగ్గురు బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ముగ్గురులో అధిష్టానం ఎవరి వైపు మొగ్గుచూపుతుందన్న ఉత్కంఠ కొనసాగుతుంది. రాష్ట్రంలో ఎ పార్లమెంట్ స్థానంకు ఇంత తీవ్రస్తాయిలో పోటి లేదనే చెప్పాలి...అయితే ఒక మంత్రికి సంబంధించిన వారికి టికెట్ ఇస్తే మిగత ఇద్దరు మంత్రులు వారికి సపోర్ట్ చేస్తారా లేదా అన్న ఆసక్తికర చర్చ సైతం నడుస్తుంది. వాస్తవానికి ఖమ్మం పార్లమెంట్ స్థానంకు మొదట నలుగురు మద్య పోటి ఉండేది. కానీ ఇందులో రేణుక చౌదరికి రాజ్యసభ ఖారారు చేయడంతో కొంత పోటి తగ్గింది అది మూడుకు చేరింది. చూడాలి మరి కాంగ్రెస్ అధిష్టానంకే సవాల్‌గా మారిన ఖమ్మం పార్లమెంట్ ఎంపిక విషయంలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి. -
బీఆర్ఎస్ టెంపరరీ పార్టీ
సాక్షి, హైదరాబాద్: ‘‘బీఆర్ఎస్ టెంపరరీ పార్టీ. కొంతకాలం ఉంది. మళ్లీ వస్తుందో లేదో తెలియదు. ఆ పార్టీ అధికారంలో ఉండగా ఎన్నికల కోసమే కరెంట్ ఇచ్చేది. కాంగ్రెస్ అలా కాదు. కొన్ని దశాబ్దాల పాటు అధికారంలో ఉంది. మరికొంతకాలం పాలిస్తుంది. ఎప్పటికీ ఉంటుంది. మాకు బాధ్యతలున్నాయి. ఎన్నికల కోసమే కరెంట్ ఇవ్వం. నిర్ణయాలన్నీ శాశ్వత ప్రాతిపదికతో ఉంటాయి..’’ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉంటాయన్న బీఆర్ఎస్ నేతల ఆరోపణలను ఖండించారు. శనివారం భట్టి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. జీరో బిల్లు రాకుంటే మళ్లీ దరఖాస్తు.. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వాడుతూ, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండి, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారు కరెంట్ బిల్లు వచ్చినా కట్టాల్సిన అవసరం లేదని భట్టి చెప్పారు. అలాంటి వారిని బిల్లు కట్టాల్సిందిగా సిబ్బంది ఏమీ వేధించబోరన్నారు. వారు మళ్లీ ఎంపీడీవో, మున్సిపల్, జీహెచ్ఎంసీ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు సమర్పించాలని, తర్వాత ఈఆర్వో (ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయాల)లో ఆ వివరాలు అందించాలని సూచించారు. ఈ వివరాలను పరిశీలించి, జీరో బిల్లులు జారీ చేస్తామని తెలిపారు. గృహజ్యోతి పథకం కింద 40,33,702 కుటుంబాలకు జీరో బిల్లులు జారీ చేశామన్నారు. గృహజ్యోతి లబ్ధిదారుల ఎంపిక నిరంతరంగా జరుగుతుందని, కొత్త రేషన్‌కార్డుల జారీ తర్వాత అర్హులకు ఈ పథకం వర్తింపజేస్తామని తెలిపారు. కచ్చితంగా ఒకటో తేదీన జీతాలు ఇస్తాం భవిష్యత్తులో కూడా కచ్చితంగా ఒకటో తేదీన ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు ఇస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. పదేళ్లలో బీఆర్ఎస్ సర్కారు రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసి, రాష్ట్రాన్ని నిర్వీ ర్యం చేసిందని మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థను చక్క దిద్దుకునే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంగన్వాడీ లు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఏఎన్ఎంలను ప్రాధాన్య జాబితాలో చేర్చి వేతనా లిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.40 వేల కోట్ల పెండింగ్ బిల్లులను వదిలేసి పోయిందని.. అందులో తొలుత రూ.10 లక్షలలోపు ఉన్న బిల్లులను క్లియర్ చేస్తున్నామని తెలిపారు. యాదాద్రి, భద్రాద్రి.. కాళేశ్వరం లాంటివే.. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలు కాళే శ్వరం పథకం వంటివేనని.. వాటిలో ఉత్పత్తయ్యే విద్యుత్ తెలంగాణకు భారంగా మారుతుందని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే వేల కోట్లు ఖర్చుచేసినందున వాటిని వాడుకోవాలా, వదిలేయాలా అన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రిజర్వాయర్లు, కాల్వలపై సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని, దీనిపై అధ్యయనం చేయిస్తున్నామని చెప్పారు. త్వరలో సంప్రదాయేతర ఇంధన వనరుల పాలసీ తెస్తామన్నారు. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్ డిమాండ్ ఏకంగా 16,500 మెగావాట్లకు చేరే అవకాశం ఉందని.. ఆమేర సరఫరాకు సిద్ధంగా ఉన్నామని భట్టి తెలిపారు. గత రెండేళ్లతో పోల్చితే ఈసారి రాష్ట్ర విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు. అక్రమ నియామకాలపై సమగ్ర నివేదిక కోరాం జెన్కో, ట్రాన్స్‌కోలలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ నియామకాలపై సమగ్ర నివేదిక కోరామని భట్టి వెల్లడించారు. బాధ్యులైన అధికా రులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇక సిరిసిల్ల విద్యుత్ సహకార సొసైటీ(సెస్)ని ఉత్తర డిస్కంలో విలీనం చేసే అంశంపై నివేదిక ఇవ్వాలని ఎన్పీడీసీ ఎల్ సీఎండీని కోరామని చెప్పారు. కొండలు, గుట్టలకు రైతుబంధు ఇవ్వలేం సాగు చేయకపోయినా కొండలు, గుట్టలున్న భూములకు గత ప్రభుత్వం రైతుబంధు ఇచ్చిందని, ఇకపై అలా ఇచ్చేది లేదని భట్టి విక్రమా ర్క స్పష్టం చేశారు. సాగు చేసే రైతులకే ఈ పథకం కింద సహాయం అందుతుందని, సాగు ను ప్రోత్సహించడమే రైతు భరోసా లక్ష్యమని వివరించారు. ఇందిరాక్రాంతి పథం కింద వచ్చే ఐదేళ్లలో పొదుపు సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలనేది టార్గెట్‌గా పెట్టుకున్నా మని చెప్పారు. ఈనెల 12న వడ్డీలేని రుణాల చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. -
విద్యపై ఖర్చు భవితకు పెట్టుబడే
సాక్షి, హైదరాబాద్: విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ఆ శాఖకు చేస్తున్న ఖర్చు భవిష్యత్ తరానికి పెట్టుబడిగా భావిస్తున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఎల్బీ స్టేడియం వేదికగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ వేగవంతం చేసినట్లు వివరించారు. ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల కాలంలోనే వివిధ శాఖలకు సంబంధించి 30వేల ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసి నియామక పత్రాలు అందించామని ఆయన చెప్పారు. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ)తో పాటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, టీఎస్‌పీఎస్సీల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 5192 మంది అభ్యర్థులకు సోమవారం ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఇరవై ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎల్బీ స్టేడియం వేదికగా అధికారం చేపట్టింది. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఉచిత విద్యుత్ పథకం అమలుపై అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తొలిఫైలుపై సంతకం చేశారు. గతేడాది డిసెంబర్ 7న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని చేపట్టింది కూడా ఎల్బీ స్టేడియంలోనే. ఆరు గ్యారెంటీలకు ఇక్కడే సంతకం చేశాం. ఇప్పుడు వరుసగా ఉద్యోగ నియామక పత్రాల పంపిణీని ఎల్బీ స్టేడియం వేదికగానే జరుపుతున్నాం.’’అనిఅన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల ఆకాంక్షలను గాలికి వదిలేసిందనీ, కేవలం వారి కుటుంబ సంక్షేమమే ధ్యేయంగా ఫాంహౌజ్ మత్తులో జోగిందని విమర్శించారు. మిగిలిన వారికి త్వరలో ఇస్తాం కొత్తగా 6546 మంది ఉద్యోగాలకు అర్హత సాధించినప్పటికీ ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో 5192 మంది లెక్చరర్లు, టీచర్లు, కానిస్టేబుళ్లు, మెడికల్ సిబ్బందికి నియామక పత్రాలు ఇస్తున్నట్లు సీఎం వెల్లడించారు. మిగతా వారికి త్వరలోనే అందిస్తామని వివరించారు. ‘గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన వ్యక్తిని నేను. నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదని గుంటూరు, గురజాల కార్పొరేట్ స్కూళ్లలో చదివిన వ్యక్తి ఈ మధ్య విమర్శలు చేస్తున్నాడు. అప్పట్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా బోధన సాగింది. ఇప్పుడు అలా కాదు. అద్భుతమైన ప్రతిభ ఉన్న వారు ఉద్యోగాలు సాధిస్తున్నారు. కొత్తగా నియమితులైన గురుకుల టీచర్లు విద్యార్థులకు అత్యుత్తమంగా బోధించాలి. వారికి పాఠ్యాంశ బోధనతో పాటు సామాజిక స్పృహ కలిగేలా... సంస్కృతీ, సాంప్రదాయాలు, విలువలతో కూడిన జీవితం గడిపేలా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నాలెడ్జ్ సెంటర్: ఉపముఖ్యమంత్రి భట్టి రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఉద్యోగాలకు సిద్దమయ్యే నిరుద్యోగులు నాలెడ్జ్ సెంటర్ల ద్వారా ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు భట్టి వివరించారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియకపోయేదని, కానీ ఇప్పుడు తమ ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్‌ను రూపొందించి త్వరలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్త పాల్గొన్నారు. -
TS: డ్వాక్రా మహిళలకు శుభవార్త
సాక్షి, ఖమ్మం జిల్లా: డ్వాక్రా మహిళలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. త్వరలో డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేయనున్నట్లు మధిర మండలం రొంపిమల్ల రోడ్డు శంకుస్థాపన సభలో ఆయన వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని పేర్కొన్నారు. -
119 నియోజకవర్గాల్లో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లు
ముదిగొండ: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పదిహేను రోజుల్లోగా అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఈ కేంద్రాల్లో నిపుణులైన అధ్యాపకులతో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని వెల్లడించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఉద్యోగ నియామకాల పరీక్షలను లీకేజీలు లేకుండా పారదర్శకంగా చేపడతామని తెలిపారు. డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు బకాయిలు లేకుండా ప్రతినెలా వేతనాలు చెల్లిస్తామని వెల్లడించారు. గత పాలకులు రెసిడెన్షియల్ పాఠశాలలను ఇరుకు భవనాల్లో నడిపించగా, తాము తాజా బడ్జెట్లో సొంత భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించామన్నారు. గత ప్రభుత్వం రూ.7లక్షల కోట్ల అప్పులు చేసి, ఖజానా ఖాళీ చేయగా.. తాము ప్రతీపైసా పోగు చేసి ముందుకు సాగుతున్నామని, ఈ క్రమంలో ఇచ్చింన ప్రతీ హామీ నెరవేరుస్తామని భట్టి వెల్లడించారు. గృహజ్యోతి ప్రారంభం ముదిగొండలోని ఓ ఇంట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ మీటర్ రీడింగ్ తీసి గృహజ్యోతి పథకం ద్వారా జీరో బిల్లు అందజేశారు. ఈనెల నుంచి 200 యూనిట్లు వరకు విద్యుత్‌ను వినియోగించే వారు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈకార్యక్రమంలో ఎన్పిడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి, కలెక్టర్ వీ.పీ.గౌతమ్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
పనుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని, ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను శనివారం మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ విద్యుత్ ప్లాంట్‌కు సంబంధించి ఇప్పటికే రెండుసార్లు అంచనా వ్యయాలు పెంచడంతో బడ్జెట్ భారీగా పెరిగిందని, ఫలితంగా రాష్ట్ర ఖజానాకు భారంగా మారిందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయకపోతే మోయలేని భారంగా పరిణమిస్తుందన్నారు. ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వ సహకారం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని భట్టి విక్రమార్క హామీనిచ్చారు. ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ఉన్న స్కిల్డ్, అన్ స్కిల్డ్ నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశంపై ఆలోచించాలన్నారు. బీహెచ్ఈఎల్ పేరున్న ప్రభుత్వ రంగ సంస్థ అని యాదాద్రి పనులు త్వరగా పూర్తి చేయకపోతే ఆ సంస్థకు చెడ్డపేరు వస్తుందన్న విషయాన్ని సంస్థ అధికారులు, ఇంజనీర్లు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. సెప్టెంబర్ నాటికి 1,600 మెగావాట్ల విద్యుత్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో రెండు యూనిట్ల ద్వారా 1,600 మెగావాట్ల విద్యుత్ పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తామని అధికారులు వివరించారు. 2025 మార్చి నాటికి మొత్తం ఐదు యూనిట్ల ద్వారా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి తెస్తామని అధికారులు మంత్రులకు చెప్పుకొచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న నేపథ్యంలో జీరో పర్సంట్ ధూళి బయటికి వెళ్లకుండా నిర్మాణం జరుగుతుందని అధికారులు వివరించారు. అలాగే స్థానికంగా వినియోగించే నీటిని తిరిగి శుద్ధి చేసి ప్రాజెక్టు అవసరాలకే వినియోగిస్తామని తెలిపారు. రుణాలపై ఆరా.. ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న రుణాలు, వాటి వడ్డీ రేట్ల గురించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. కమర్షియల్ బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ రేటు ఉంటే దానిని తగ్గించాలని కోరే అవకాశం ఉందని చెప్పా రు. స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, సబ్ కాంట్రాక్టులు, ఇతర చిన్నచిన్న పనుల్లో స్థానికులకు అవకాశం కల్పించడం ద్వారా చేయూతనివ్వాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను కోరారు. ప్రస్తుతం పవర్ ప్లాంట్‌లో జరుగుతున్న అన్ని రకాల అభివృద్ధి పనులను వీడియో ప్రజెంటేషన్ రూపంలో మంత్రుల బృందానికి వివరించారు. సమావేశంలో విద్యుత్ శాఖ సీఎండీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, ట్రాన్స్‌కో డైరెక్టర్ అజయ్, పవర్ ప్లాంట్ సీఈ సమ్మయ్య పాల్గొన్నారు.