ఇలా అయితే మిమ్మల్ని కొనసాగించాల్సిన అవసరం లేదు
జెన్‌కో డైరెక్టర్లు, సీఈలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం
జలవిద్యుత్ కేంద్రాలకు మరమ్మతుల్లో జాప్యంపై తీవ్ర అసంతృప్తి
రాష్ట్రంలో జలవిద్యుత్ కేంద్రాలపై భట్టి సమీక్ష.. ‘సాక్షి’ కథనంపై స్పందన
సాక్షి, హైదరాబాద్: ‘జలవిద్యుత్ కేంద్రాలకు మరమ్మతుల నిర్వహణలో ఎందుకంత కాలయాపన చేశారు? ఇంత సోమరిగా ఉంటే.. మిమ్మల్ని కొనసాగించాల్సిన అవసరం ప్రభు త్వానికి లేదు’అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి పరీవాహకంలోని జలాశయాలకు ఉధృతంగా వరదలు కొనసాగుతున్నా, జలవిద్యుత్ కేంద్రాల్లో పూర్తి సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేసుకోలేకపోతున్నామని మండిపడ్డారు.
జలవి ద్యుత్ కేంద్రాలకు సత్వరం మరమ్మతులు నిర్వ హించి, వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయి లో పునరుద్ధరించాలని ఆదేశించారు. ‘జలకళ ఉన్నా హై‘డల్’’అనే శీర్షికతో ఈ నెల 7న సాక్షిలో ప్రచురించిన కథనంపై స్పందిస్తూ శనివారం ఆయన ప్రజాభవన్‌లో జెన్‌కో డైరెక్టర్లు, సీఈలతో సమీక్ష నిర్వహించారు. ఎగువ జూరాల, దిగువ జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ తదితర జలవిద్యుత్ కేంద్రాలకు మరమ్మతులు నిర్వహించకపోవడంతో.. వరదల సమయంలో పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేసుకొనే అవకాశం చేజారిపోయిందనే అంశాన్ని ఈ కథనం ఎత్తిచూపింది.
మనసుపెట్టి పనిచేయండి..
ఈ నేపథ్యంలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని సమీక్షలో ప్రస్తావిస్తూ.. జెన్‌కో ఉన్నతాధికారుల పనితీరుపై ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వృత్తిపట్ల నిబద్ధతతో, మనసుపెట్టి పనిచేయాలని, నిర్లక్ష్యానికి, అలసత్వానికి తావు ఉండరాదని హెచ్చరించారు. శ్రీశైలం, జూరాల తదితర జలవిద్యుత్ కేంద్రాలకు మర మ్మతుల విషయంలో గతంలో సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడంతో, వరదలు వస్తున్నా పూర్తి సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేసుకోలేక పోతున్నా మని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇకపై నిర్ణయాలు తీసుకోవడంలో ఇలాంటి జాప్యం పునరావృతం కారాదని ఆదేశించారు. విద్యుదు త్పత్తి కేంద్రాల పనితీరు, ఉత్పాదకతపై వారాని కోసారి తనకు నివేదికలను సమర్పించాలని ఆదే శించారు. విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి సమస్య లు ఏర్పడినా తక్షణమే ఇంధన శాఖ ముఖ్య కార్య దర్శి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని కోరా రు. విద్యుత్ కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహి ంచే చీఫ్ ఇంజనీర్ల నుంచి రాతపూర్వకంగా వివర ణ తీసుకుని, తగిన చర్యలు తీసుకోవాలని ఆదే శించారు. విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి అంతరా యం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
‘విద్యుత్’ అంటే నిరంతరం పనిచేయాల్సిన శాఖ..
విద్యుత్ శాఖలో ఉద్యోగమంటే నిరంతరం పని చేయాల్సిన అత్యవసర శాఖలో విధులు నిర్వర్తి స్తున్నామనే అంశాన్ని అన్ని స్థాయిల్లోని అధికా రులు, ఉద్యోగులు గుర్తు పెట్టుకోవాలని భట్టి అన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా నని భరోసా ఇచ్చారు. అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కనీసం 17 రోజుల విద్యుదుత్పత్తికి సరిప డా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండేలా చర్య లు తీసుకోవాలన్నారు. ఇంధన శాఖ ఇన్‌చార్జి ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, జెన్‌కో డైరెక్టర్లు అజయ్, వెంకటరాజం, లక్ష్మయ్య తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment