Genco
-
కొత్త ఏడాదిలోనూ భారీగా నియామకాలు
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే టీజీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసింది. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి జాబ్ కేలండర్ ప్రకటించింది. పారదర్శకంగా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి ఏడాదిలో 56 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసింది. ప్రతి నెలా ఏదో ఒక నియామక పత్రాలు అందజేస్తున్నాం. నూతన సంవత్సరంలో కూడా పెద్ద ఎత్తున నియామకాలుంటాయి. వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు వస్తాయి..’అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)లో ఏఈ పోస్టులకు ఎంపికైన 315 మంది అభ్యర్థులకు సోమవారం ఆయన నియామక పత్రాలు అందజేశారు. సచివాలయం ఎదుట ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొలువుల కోసం కొట్లాడిన నిరుద్యోగుల ఆశలను గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలకులు అడియాసలు చేశారని విమర్శించారు. కొలువులు లేక నిరాశ నిస్పృహలకు గురైన నిరుద్యోగ యువత ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ఉద్యోగాలు వస్తాయని భావించి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని అన్నారు. వారి ఆశలు వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు, స్వయం ఉపాధి కల్పించేందుకు సీఎం, మంత్రివర్గం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. 9న రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ ప్రకటన దేశ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఈ నెల 9న తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ–2025ని ప్రకటించనున్నామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు తయారు చేశామన్నారు. ఇందుకోసం అదనంగా 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. 2030 నాటికి రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ 22,448 మెగావాట్లకు చేరుకుంటుందని సెంట్రల్ ఎలక్రి్టసిటీ ఆథారిటీ (సీఈఏ) అంచనా వేసిందని, ఆ మేరకు విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. ‘చెమట చుక్కలకు తర్పీదు’లోగో ఆవిష్కరణసింగరేణి సంస్థ రూపొందించిన ‘చెమట చుక్కలకు తర్పీదు’లోగోను డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. దేశ, విదేశాల్లో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలపై కోల్ బెల్ట్ యువతకు అవగాహన కల్పించేందుకు సింగరేణి సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, షబ్బీర్ అలీ, ఇంధన శాఖ ముఖ్య కార్యదిర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, సింగరేణి సీఎండీ ఎన్.బలరాం నాయక్ పాల్గొన్నారు. -
కృష్ణాతీరంలో జెన్కో టౌన్షిప్
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో కృష్ణానది వెంట కొత్త పట్టణం నిర్మాణం కానున్నది. దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం సమీపంలో రూ.928.52 కోట్ల అంచనాతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు బిడ్లను స్వీకరిస్తారు. టెక్నికల్ బిడ్లను వచ్చే నెల 3న, ప్రైస్ బిడ్లను 7న తెరిచి టెండర్లను ఖరారు చేయనున్నారు. సంగమ క్షేత్రంలో కొత్త పట్టణం కృష్ణా నదిలో తుంగపాడు వాగు కలిసే చోట ఈ టౌన్‌షిప్‌ను నిర్మించాలని నిర్ణయించారు. డిజై న్లు, డ్రాయింగ్స్ ప్రకారం మొత్తం 3,52,771.02 చ.మీ.ల విస్తీర్ణంలో టౌన్íÙప్ నిర్మాణం జరుగుతుంది. 2,21,903.67 చ.మీ.ల విస్తీర్ణంలో నివా స గృహసముదాయాలతో లేఅవుట్‌ను తయా రు చేశారు. 75,185 చ.మీ.ల విస్తీర్ణంలో పార్కు లు, మొక్కల పెంపకం, పచ్చిక బయళ్లు, మరో 55,682.35 చ.మీ.ల విస్తీర్ణంలో రోడ్లు, ఇతర సదుపాయాలు ఏర్పాటుచేస్తారు.2025 మార్చి నాటికి 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నది. వేల సంఖ్యలో ఇంజనీరింగ్ అధికారులు, ఉద్యోగులు, ఇతర కార్మి కులు ఇక్కడ రాత్రింబవళ్లు పనిచేయనున్నారు. వీరంతా తప్పనిసరిగా స్థానికంగా నివాసం ఉండాల్సి రావడంతో టౌన్‌షిప్‌ను జెన్కో నిర్మిస్తోంది. ఉన్నతాధికారుల కోసం ‘ఏ’–టైప్‌లో రెండు ఇండిపెండెంట్ క్వార్టర్లను, ‘బీ’–టైప్‌లో 6 ఇండిపెండెంట్ క్వార్టర్లను నిర్మిస్తున్నారు. అధికారులకు ‘డీ’, ‘ఈ’టైప్ క్వా ర్టర్లను, కార్మి కులకు ‘ఎఫ్’టైప్ క్వార్టర్లను కేటాయిస్తారు. ఈ భవనాలు 11 అంతస్తుల ఎత్తు ఉంటాయి. డీ, ఈ–టైప్ క్వార్టర్ల కోసం రెండు భవనాలు ఉంటాయి. వీటిల్లో 360 చొప్పున ఫ్లాట్లు ఉంటాయి. ఎఫ్–టైప్ క్వార్టర్లలో 1,350 ఫ్లాట్లు కలిపి మొత్తం 2,970 ఫ్లాట్లను నిర్మించనున్నారు. సకల సదుపాయాలు టౌన్షిప్లో ఉద్యోగులకు సకల సదుపాయాలు కల్పిస్తారు. అగ్నిమాపక కేంద్రం, ఆస్పత్రి, పాఠశాల భవనాలు, క్లబ్ హౌస్, కమర్షియల్ కాంప్లెక్స్, ఇండోర్ స్టేడియం, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, సెక్యూరిటీ రూమ్స్, మెయింటెనెన్స్ ఆఫీస్, రోడ్లు, డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ పోర్టబుల్ వాటర్ ట్యాంక్స్, ఓవర్ హెడ్ స్టోరేజీ రిజర్వాయర్స్, సెప్టిక్ ట్యాంక్స్, పార్కింగ్ షెడ్స్, పచ్చదనం, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ, తుంగపాడు వాగుపై బ్రిడ్జీ, కాంపౌండ్ వాల్, టౌన్‌షిప్‌కు అప్రోచ్ రోడ్డును ఈ ప్రాజెక్టులో భాగంగా జెన్కో నిర్మిస్తోంది. టౌన్షిప్ నుంచి విడుదలయ్యే మురుగునీటిని శుద్ధి చేయడానికి రోజుకు 1,000 కిలో లీటర్ల శుద్ధి సామర్థ్యంతో సీవరేజీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ను సైతం నిర్మిస్తోంది. కాంట్రాక్టర్‌కు పనులను అప్పగించిన తర్వాత 30 నెలల్లోగా ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుందని టెండర్ నోటిఫికేషన్లో జెన్కో తెలిపింది. -
ప్రైవేట్ విద్యుత్‌తో ప్రజలపై భారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) థర్మల్, హైడల్ విద్యుత్ కేంద్రాల్లో స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి నిర్వహించకపోవడంతో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఇతర మార్గాల్లో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసి భారీగా నష్టపోతున్నాయని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎం.వేణుగోపాల్ రావు తప్పుబట్టారు. ప్రైవేటు విద్యుత్ కొనాల్సి రావడంతో తుదకు రాష్ట్ర ప్రజలపై భారం పడుతోందని పేర్కొన్నారు. జెన్కో ఉత్పాదక సామర్థ్యం తగ్గిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జెన్కో విద్యుత్ కేంద్రాల నిర్వహణ, మరమ్మతులు మెరుగుపరచాలని సూచించారు. ట్రూఅప్ చార్జీలతో పాటు ఎంవైటీ పిటిషన్‌లోని వ్యయాలు అసాధారణంగా, అవాంఛనీయంగా ఉన్నాయని, ప్రజలపై భారంపడకుండా నియంత్రించాలని ఈఆర్సీని కోరారు. 2022–23కి సంబంధించి జెన్కో దాఖలు చేసిన రూ.830.61 కోట్ల ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనలతో పాటు 2024–25 నుంచి 2028–29 మధ్యకాలానికి సంబంధించిన మల్టీ ఇయర్ టారిఫ్ (ఎంవైటీ) పిటిషన్లపై సోమవారం విద్యుత్ నియంత్రణ్ భవన్లో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) బహిరంగ విచారణ నిర్వహించింది. వేణుగోపాల్‌రావుతో పాటు పారిశ్రామిక, వ్యాపార సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను వెల్లడించారు. ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్ రాజు, బండారు కృష్ణయ్యలకు తమ సలహాలు, సూచనలు తెలియజేశారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాలి ‘తక్కువ వ్యవధిలో కీలక పిటిషన్లపై నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. విద్యుత్ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పెట్టుబడిదారీ అనుకూల విధానాలు సామాన్య ప్రజలకు శాపంగా మారుతున్నాయి. విద్యుత్ సంస్థలను నియంత్రించడానికి ఈఆర్సీ తన పరిధిలోని అధికారాలను వినియోగించుకునే విషయంలో వెనుకాడరాదు..’ అని వేణుగోపాల్ రావు సూచించారు. ఫిక్స్డ్ చార్జీలపై ఫ్యాప్సీ అభ్యంతరం విద్యుత్ కేంద్రాల ఫిక్స్డ్ చార్జీలను అసాధారణ రీతిలో పెంచి ప్రతిపాదించడంపై ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆప్ కామర్స్(ఫ్యాప్సీ) ప్రతినిధి రమణ్‌దీప్ సింగ్ అభ్యంతరం తెలిపారు. పలు పారిశ్రామిక సంఘాల తరఫున ఆయన మాట్లాడారు. ‘కొత్తగా నిర్మించిన భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఫిక్స్డ్ చార్జీలు భారంగా మారాయి. దీనితో పోల్చితే పాత విద్యుత్ కేంద్రాలు మెరుగ్గా విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. జెన్కో ప్రతిపాదించిన వివిధ రకాల వ్యయాలు హేతుబద్ధంగా లేవు. జెన్కో వార్షిక నిర్వహణ, పర్యవేక్షణ(ఓఅండ్ఎం) వ్యయం రూ.792 కోట్లు ఉంటే, అందులో రూ.696.98 కోట్లు వేతన సవరణ వాటా ఉంది..’ అని అన్నారు. ఐదేళ్లలో ఆదాయ అవసరాలు రూ.43,713 కోట్లు: జెన్కో వచ్చే ఐదేళ్లలో రుణాలకు వడ్డీల చెల్లింపులకు రూ.4,789 కోట్లు, ఫిక్స్డ్ చార్జీలు రూ.35,931 కోట్లు, అదనపు పెన్షన్ వ్యయాలు రూ.8,205 కోట్లు, మూలధన పెట్టుబడి వ్యయాలు రూ.1,664 కోట్లు, ఇతరత్రాలు కలిపి మొత్తం రూ.43,713 కోట్ల ఆదాయం అవసరం కానుందని జెన్కో తెలియజేసింది. ఆ మేరకు ఆదాయార్జనకు అనుమతిస్తూ ట్రూఅప్, ఎంవైటీ పిటిషన్లను ఆమోదించాలని విజ్ఞప్తి చేసింది. కాగా జెన్కో పిటిషన్లపై పలువురి అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఈ నెల 29లోగా ఈఆర్సీ తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. -
నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తికి భారీ అంతరాయం
సాక్షి, నల్లగొండ జిల్లా: జెన్కో అధికారుల తీరుతో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తికి భారీ అంతరాయం ఏర్పడింది. ఎనిమిది యూనిట్లలో కేవలం ఏడింటిలోనే విద్యుదుత్పత్తి జరుగుతోంది. రెండో యూనిట్ పనిచేయడం లేదు. ఏడాది క్రితం రెండో యూనిట్ రోటర్ స్పైడర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. అయినా నేటికి మరమ్మతులు చేయించకపోవడంతో రెండున్నర నెలలుగా విద్యుదుత్పత్తికి అంతరాయం కలుగుతోంది. మొత్తం ఎనిమిది యూనిట్లలో ఒక్కో యూనిట్లో ప్రతి రోజూ 100 మెగా వాట్ల ఉత్పత్తి జరుగుతుంది. 75 రోజులుగా సాగర్‌లో ఉత్పత్తి కొనసాగుతుండగా.. ఒక్కో రోజు 100 మెగా వాట్ల చొప్పున 750 మెగా వాట్ల నష్టం వాటిల్లుతోంది. అయినా మరమ్మతులు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సాగర్ ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్న సమయంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జపాన్ నుంచి సాంకేతిక పరికరాలు రావాలని అధికారులు సమాధానం చెప్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. -
విద్యుత్ కేంద్రాలపై అలసత్వం వద్దు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) అధి కారులకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. జల విద్యుత్ కేంద్రాల్లో సమస్యలు తలెత్తితే తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని, ఈ విషయంలో ఎలాంటి అల సత్వం వహించరాదని స్పష్టం చేశారు. విద్యుత్ కేంద్రాల్లో ఏర్పడే సమస్యలను పరిష్కరించేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. క్షేత్ర స్థాయిలో కమిటీ పర్యటించి సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను సిఫారసు చేస్తూ నివేదిక అందజేస్తుందని తెలిపారు. దీని ఆధారంగా జెన్కో సీఎండీ నిర్ణయాలు తీసుకోవాలని విద్యుదుత్పత్తిలో అంతరాయాలు లేకుండా పరిష్కరించాల్సి ఉంటుందని సూచించారు. ప్రజాభవన్‌లో బుధవారం భట్టి తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీ డీసీఎల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భద్రాద్రి థర్మ ల్ విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో కా లిపోయిన యూనిట్–1కి సంబంధించిన జనరేటర్ ట్రాన్స్ ఫార్మర్కు మరమ్మతులు నిర్వహించాలా? కొత్త ట్రాన్స్‌ఫా ర్మర్ను కొనుగోలు చేయాలా? అనే అంశాన్ని టెక్నికల్ కమిటీ పరిశీలిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తీసు కున్న నిర్ణయాలను అమలు చేసే ముందు తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి తెలియజేసి అనుమతి పొందాలని కోరారు. ఈ విషయంలో విద్యుత్ సంస్థల సీఎండీలు తప్పనిసరిగా ఇంధ న శాఖ కార్యదర్శిని సంప్రదించాలని ఆయన ఆదేశించారు.మళ్లీ గృహజ్యోతి దరఖాస్తుల స్వీకరణ...గృహజ్యోతి పథకం కింద అర్హులై ఉండి గతంలో దరఖాస్తు చేసుకోని వారి నుంచి మళ్లీ దరఖాస్తులను స్వీకరించాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. పేదల గృహాలకు ప్రతి నెలా 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ సరఫరాను అమలు చేసే గృహజ్యోతి పథకాన్ని అర్హులందరికీ వర్తింపజేయాలని కోరారు. టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో 227 కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రక్రియ ప్రారంభమైందని, అందులో 113 సబ్ స్టేషన్లకు స్థలాల సమస్య లేదని, మిగతా వాటికి స్థలాలను కలెక్టర్లు కేటాయించాల్సి ఉందన్నారు. కాళేశ్వరం, ఇతర ఎత్తిపోతల పథకాలకు ఎంత విద్యుత్‌ను వినియోగిస్తున్నారు? అందుకు అవుతున్న ఖర్చు ఎంత? తదితర వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. సమావేశంలో ఇంధన శాఖ ఇన్చార్జి కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్ సీఎండీలు ముషర్రఫ్ అలీ, వరుణ్ రెడ్డి పాల్గొన్నారు. -
ఇంత సోమరితనమా?
సాక్షి, హైదరాబాద్: ‘జలవిద్యుత్ కేంద్రాలకు మరమ్మతుల నిర్వహణలో ఎందుకంత కాలయాపన చేశారు? ఇంత సోమరిగా ఉంటే.. మిమ్మల్ని కొనసాగించాల్సిన అవసరం ప్రభు త్వానికి లేదు’అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి పరీవాహకంలోని జలాశయాలకు ఉధృతంగా వరదలు కొనసాగుతున్నా, జలవిద్యుత్ కేంద్రాల్లో పూర్తి సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేసుకోలేకపోతున్నామని మండిపడ్డారు.జలవి ద్యుత్ కేంద్రాలకు సత్వరం మరమ్మతులు నిర్వ హించి, వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయి లో పునరుద్ధరించాలని ఆదేశించారు. ‘జలకళ ఉన్నా హై‘డల్’’అనే శీర్షికతో ఈ నెల 7న సాక్షిలో ప్రచురించిన కథనంపై స్పందిస్తూ శనివారం ఆయన ప్రజాభవన్‌లో జెన్కో డైరెక్టర్లు, సీఈలతో సమీక్ష నిర్వహించారు. ఎగువ జూరాల, దిగువ జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ తదితర జలవిద్యుత్ కేంద్రాలకు మరమ్మతులు నిర్వహించకపోవడంతో.. వరదల సమయంలో పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేసుకొనే అవకాశం చేజారిపోయిందనే అంశాన్ని ఈ కథనం ఎత్తిచూపింది. మనసుపెట్టి పనిచేయండి.. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని సమీక్షలో ప్రస్తావిస్తూ.. జెన్కో ఉన్నతాధికారుల పనితీరుపై ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వృత్తిపట్ల నిబద్ధతతో, మనసుపెట్టి పనిచేయాలని, నిర్లక్ష్యానికి, అలసత్వానికి తావు ఉండరాదని హెచ్చరించారు. శ్రీశైలం, జూరాల తదితర జలవిద్యుత్ కేంద్రాలకు మర మ్మతుల విషయంలో గతంలో సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడంతో, వరదలు వస్తున్నా పూర్తి సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేసుకోలేక పోతున్నా మని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇకపై నిర్ణయాలు తీసుకోవడంలో ఇలాంటి జాప్యం పునరావృతం కారాదని ఆదేశించారు. విద్యుదు త్పత్తి కేంద్రాల పనితీరు, ఉత్పాదకతపై వారాని కోసారి తనకు నివేదికలను సమర్పించాలని ఆదే శించారు. విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి సమస్య లు ఏర్పడినా తక్షణమే ఇంధన శాఖ ముఖ్య కార్య దర్శి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని కోరా రు. విద్యుత్ కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహి ంచే చీఫ్ ఇంజనీర్ల నుంచి రాతపూర్వకంగా వివర ణ తీసుకుని, తగిన చర్యలు తీసుకోవాలని ఆదే శించారు. విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి అంతరా యం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ‘విద్యుత్’ అంటే నిరంతరం పనిచేయాల్సిన శాఖ.. విద్యుత్ శాఖలో ఉద్యోగమంటే నిరంతరం పని చేయాల్సిన అత్యవసర శాఖలో విధులు నిర్వర్తి స్తున్నామనే అంశాన్ని అన్ని స్థాయిల్లోని అధికా రులు, ఉద్యోగులు గుర్తు పెట్టుకోవాలని భట్టి అన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా నని భరోసా ఇచ్చారు. అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కనీసం 17 రోజుల విద్యుదుత్పత్తికి సరిప డా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండేలా చర్య లు తీసుకోవాలన్నారు. ఇంధన శాఖ ఇన్చార్జి ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, జెన్కో డైరెక్టర్లు అజయ్, వెంకటరాజం, లక్ష్మయ్య తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. -
అది అగ్గే..కాదు పిడుగే!
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం(బీటీపీఎస్)లో జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన వ్యవహారంలో.. రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ జెన్కోకు, ప్లాంట్ నిర్మాణ సంస్థ బీహెచ్ఈఎల్కు మధ్య వివాదం ముదురుతోంది. ఇది ప్లాంట్‌లో విద్యుదుత్పత్తిపై ప్రభావం చూపి నష్టానికి కారణమవుతోంది. ఇటీవల బీటీపీఎస్‌లోని 270 మెగావాట్ల యూనిట్–1కు సంబంధించిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధమైన విషయం తెలిసిందే.అంతర్గత సమస్య వల్లే ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని జెన్కో దర్యాప్తులో తేల్చగా.. అది పిడుగుపాటుతోనే దగ్ధమైందని బీహెచ్ఈఎల్ చెబుతోంది. 320 ఎంవీఏ (మెగా వోల్ట్స్ యాంపియర్) సామర్థ్యమున్న ఈ జనరేటర్ ట్రాన్స్ఫార్మర్.. మరమ్మతులు సాధ్యం కాని రీతిలో దెబ్బతిన్నదని, మరమ్మతులు చేసినా మళ్లీ కాలిపోతుందని బీహెచ్ఈఎల్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటన జరిగి నెల రోజులు అవుతున్నా జెన్కో, బీహెచ్ఈఎల్ మధ్య వివాదం కొలిక్కిరాకపోవడంతో.. యూనిట్–1 పునరుద్ధరణలో పీటముడి పడింది. రోజూ 6.48 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తికి గండిపడింది. రూ.108 కోట్ల విద్యుత్ నష్టం! ఈఆర్సీ టారిఫ్ ఉత్తర్వుల ప్రకారం.. భద్రాద్రి ప్లాంట్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ.4.30 కాగా.. అందులో ఫిక్స్డ్ చార్జీ రూ.1.94, వేరియబుల్ చార్జీ రూ.2.36గా నిర్ధారించింది. ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి జరిగినా, జరగకపోయినా.. విద్యుత్ కేంద్రం నిర్మాణానికి తీసుకున్న పెట్టుబడి రుణాలను జెన్కో ప్రతినెలా క్రమం తప్పకుండా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన మొత్తాన్నే విద్యుత్ ధరలో ఫిక్స్డ్ చార్జీలుగా గణించి వసూలు చేస్తారు. ప్లాంట్ నుంచి విద్యుత్ కొన్నా, కొనకున్నా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు జెన్కోకు ఫిక్స్డ్ చార్జీలు చెల్లిస్తాయి. అదే సాంకేతిక సమస్యలతో విద్యుదుత్పత్తి నిలిచిపోతే ఫిక్స్డ్ చార్జీల నష్టాన్ని జెన్కోనే భరించాల్సి ఉంటుంది. భద్రాద్రి యూనిట్–1లో 39 రోజులుగా రోజుకు రూ.2.78 కోట్ల విలువైన విద్యుదుత్పత్తి నిలిచిపోగా.. ఇందులో రోజుకు రూ.1.25 కోట్లను ఫిక్స్డ్ చార్జీల రూపంలో జెన్కో నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పటివరకు మొత్తంగా రూ.108.66 కోట్ల విలువైన విద్యుదుత్పత్తికి గండిపడగా.. రూ.49.02 కోట్లను ఫిక్స్డ్ చార్జీల రూపంలో నష్టాన్ని భరించాల్సి వచ్చింది. రోజులు గడిచే కొద్దీ ఈ నష్టం పెరుగుతూ పోతుంది. వెంటనే మరమ్మతులు చేసి యూనిట్–1ను పునరుద్ధరించకపోతే జెన్కోకు రూ.వందల కోట్ల నష్టం తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరమ్మతులకు బీహెచ్ఈఎల్ ససేమిరా.. కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 270 మెగావాట్ల నాలుగు యూనిట్లున్నాయి. జూన్ 29న రాత్రి 7.30 గంటల సమయంలో ప్లాంట్‌లో పిడుగుపడింది. ఆ సమయంలో యూనిట్–1కు సంబంధించిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. అయితే పిడుగుపడిన సమయంలోనే.. యాదృచ్ఛికంగా జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ అంతర్గత లోపాలతో మంటలు రేగి కాలిపోయిందని జెన్కో ఇంజనీర్లు నిర్ధారించి నివేదిక సమరి్పంచారు. అంతర్గత సమస్యలతో కాలిపోయినందున నిర్మాణ సంస్థ బీహెచ్ఈఎల్ తన సొంత ఖర్చుతో పునరుద్ధరిస్తుందని పేర్కొన్నారు.మరోవైపు బీహెచ్ఈఎల్ నిపుణుల కమిటీ మాత్రం పిడుగుపాటు వల్లే జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందంటూ విరుద్ధమైన నివేదిక ఇచ్చింది. ట్రాన్స్ఫార్మర్కు తీవ్ర నష్టం జరిగిందని.. మరమ్మతులు చేసినా, మళ్లీ కాలిపోవడం ఖాయమని పేర్కొంది. కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసుకోవాలని జెన్కోకు సూచించింది. ఈ క్రమంలో మరమ్మతులు ఎవరు చేయాలన్న విషయంలో జెన్కో, బీహెచ్ఈఎల్ మధ్య వివాదం నెలకొంది. దీనితో యూనిట్–1 పునరుద్ధరణ పనుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీహెచ్ఈఎల్ మరమ్మతులకు అంగీకరించకపోవడంతో ప్రైవేటు కాంట్రాక్టర్లతో మరమ్మతులు చేయించేందుకు జెన్కో ప్రయతి్నస్తున్నట్టు తెలిసింది. -
‘శ్రీశైలం విద్యుత్’కు త్వరలో మరమ్మతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనే అతి పెద్దదైన శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రానికి మరమ్మతులు నిర్వహించేందుకు తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) చర్యలు చేపట్టింది. విద్యుదుత్పత్తి సంస్థ స్థాపిత సామర్థ్యం 900 (6 ్ఠ150) మెగావాట్లు కాగా, అందులో 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4వ యూనిట్‌లోని జనరేటర్ స్టేటర్, రోటర్లు గత జూలైలో రెండోసారి కాలిపోయాయి. 2020 ఆగస్టు 20న శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలోని కంట్రోల్ ప్యానెల్స్‌కి డీసీ విద్యుత్‌ను సరఫరా చేసే బ్యాటరీలను మార్చే సమయంలో మంటలు చెలరేగి భారీ అగి్నప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో జెన్కోఇంజనీర్లతోపాటు మొత్తం 9 మంది మృత్యువాతపడగా, విద్యుత్ కేంద్రంలోని కొన్ని యూనిట్లు పూర్తిగా, మరికొన్ని యూనిట్లు పాక్షికంగా కాలిపోయాయి. అప్పట్లో 4వ యూనిట్‌కే అత్యధిక నష్టం జరిగింది. జర్మనీకి చెందిన ప్రముఖ కంపెనీ వైత్ ఆధ్వర్యంలో జెన్కో మరమ్మతులు నిర్వహించి పునరుద్ధరించింది. గతేడాది దాదాపుగా 80 గంటలపాటు విద్యుదుత్పత్తి చేసిన తర్వాత మళ్లీ 4వ యూనిట్లో వాల్ట్ వచ్చి కాలిపోయింది. ఒప్పందం ప్రకారం డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్‌లోనే 4వ యూనిట్ కాలిపోవడంతో సొంత ఖర్చుతో మరమ్మతులు నిర్వహించాలని ‘వైత్’గ్రూపును జెన్కో కోరగా, ఆ సంస్థ నిరాకరించింది. 4వ యూనిట్‌కు ఇతర మరమ్మతులు నిర్వహించడంతోనే ఫాల్ట్ ఏర్పడిందని, దీనితో తమకు సంబంధం లేదని వైత్ గ్రూపు స్పష్టం చేసింది. మరమ్మతులకు మళ్లీ డబ్బులు చెల్లించాలని కోరింది. ఏడాది కాలంగా ఆ కంపెనీతో వివాదం నడవడంతో మరమ్మతుల నిర్వహణ మరుగున పడిపోయింది. కొత్తగా మరోసారి టెండర్లు నిర్వహించి మరమ్మతులు నిర్వహించడానికి జెన్కో యత్నించగా, ఉన్నతాధికారుల నుంచి అనుమతి లభించక ప్రక్రియ ముందుకు సాగలేదు. మరమ్మతులకు రూ.3 కోట్ల దాకా ఖర్చు కానుండగా, అంతకు ఎన్నో రెట్లు విలువ చేసే జల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం లభించనుంది. ఉత్పత్తి వచ్చే ఏడాదే.. రాష్ట్రంలోని కీలకమైన జలవిద్యుత్ కేంద్రాలకు సకాలంలో మరమ్మతులు నిర్వహించకపోవడంతో వాటి ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పడిపోయిన అంశంపై ఈ నెల 21న ‘హైడల్ పవర్ డౌన్! ’శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు ప్రభుత్వం స్పందించి తక్షణమే మరమ్మతులు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో మరమ్మతులు నిర్వహించిన ‘వైత్’సంస్థకు ఇటీవల జెన్కో తుది నోటీసులు జారీ చేసి ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టింది. మళ్లీ కొత్తగా టెండర్లు నిర్వహించడానికి జెన్కో యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. మరమ్మతులు పూర్తై 4వ యూనిట్లో ఉత్పత్తి ప్రారంభం కావడానికి కనీసం మూడు నెలల సమయం పట్టొచ్చని, ఆలోగా కృష్ణా నదిలో వరదలు ముగిసిపోతాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ‘తాజా పర్యావరణ అనుమతులు’ జారీ చేయాలని సిఫారసు చేస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ నిర్ణయం తీసుకుంది. 50 శాతం విదేశీ బొగ్గు, మరో 50శాతం స్వదేశీ బొగ్గుతో కలిపి(బ్లెండ్ చేసి) విద్యుదుత్పత్తి జరిపే టెక్నాలజీ ఆధారంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మిస్తామని గతంలో జెన్కో ప్రతిపాదించింది.ఈ ప్రతిపాదనల ఆధారంగా 2017 జూలై 25న కేంద్రం ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేసింది. అయితే అనుమతులకు విరుద్ధంగా పూర్తిగా స్వదేశీ బొగ్గు ఆధారంగా విద్యుదుత్పత్తి జరిపే టెక్నాలజీతో యాదాద్రి ప్లాంట్‌ను జెన్కో నిర్మిస్తోందని కొందరు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. టెక్నాలజీ మారడంతో నీటి వినియోగం, బూడిద ఉత్పత్తి పెరుగుతుందని ఆరోపించారు.మారిన టెక్నాలజీకి అనుగుణంగా మళ్లీ పర్యా వరణ అనుమతులు పొందాల్సిందేనని 2022 సెపె్టంబర్లో ఎన్జీటీ తీర్పు ఇవ్వగా, జెన్కోకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో యాదాద్రి ప్లాంట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. మళ్లీ పర్యావరణ అనుమతులు పొందేందుకు జెన్కో విశ్వ ప్రయత్నాలు చేసింది. ఈ నెల 8న సమావేశమైన కేంద్ర పర్యావరణశాఖ నిపుణుల మదింపు కమిటీ ఎట్టకేలకు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయాలని సిఫారసు చేసింది. కృష్ణానదిని కలుషితం చేయమని హామీ కృష్ణానదిలో కలిసే తుంగపాడు వాగు యాదా ద్రి ప్లాంట్ మధ్య నుంచి వెళుతుందని, దీని ప్ర వాహానికి ఎలాంటి అడ్డంకులు ఉండరాదని, వాగులో కనీస ప్రవాహం ఉండేలా చర్యలు తీసు కోవాలని నిపుణుల కమిటీ జెన్కోకు సూచించింది. వాగు పరిరక్షణకు ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, వాగుకు ఇరువైపులా 100 మీటర్ల వరకు అటవీశాఖ ఆధ్వర్యంలో గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం బదులిచ్చింది.తుంగపాడు వాగులో కనీస ప్రవాహం ఉండేలా ఎగువన ఉన్న పెద్దచెరువుల నుంచి నీటిని విడుదల చేస్తామని గతంలో నీటిపారుదల శాఖ సైతం హామీ ఇచ్చింది. తుంగపాడు వాగు, కృష్ణానది కలుషితం కాకుండా యాదాద్రి విద్యుత్ ప్లాంట్‌ను జీరో లిక్విడ్ డిశ్చార్జి సిస్టమ్ ఆధారంగా డిజైన్ చేశామని, ఇందుకు యాష్ వాటర్ రికవరీ సిస్టమ్ ఏర్పాటు చేసినట్టు జెన్కో సైతం ఈ నెల 12న లేఖ ద్వారా హామీ ఇచ్చింది.పారిశ్రామిక వ్యర్థ జలాల శుద్ధికి ఆర్వో ఆధారిత ప్లాంట్‌తో పాటు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఇలా శుద్ధి చేసిన జలాలను బూడిద, చెట్ల పెంపకం, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అవసరాలకు వినియోగిస్తామని జెన్కో తెలిసింది. తుంగపాడు వాగులో ఎలాంటి వ్యర్థాలు వదలని స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ షరతుల్లో కొన్ని.... ♦ విద్యుత్ కేంద్రం ప్రహరీ లోపలిభాగంలో స్థానిక అటవీ జాతుల మొక్కలను మూడు వరుసల్లో నాటే కార్యక్రమాన్ని జూన్ 2024లోగా పూర్తి చేయాలి. తుంగపాడు వాగుకు రెండువైపులా 100 మీటర్ల వరకు వచ్చే రెండేళ్లలోగా చెట్ట పెంపకం పూర్తి చేయాలి. విద్యుత్ ప్లాంట్ ప్రహరీ చుట్టూ 2 కి.మీల వరకు దట్టంగా చెట్లు పెంచాలి. స్థానికంగా ఉన్న పాఠశాలల చుట్టూ 10 కి.మీల వరకు చెట్లు పెంచాలి. ♦భూ నిర్వాసితులకు 2025 మార్చిలోగా పరిహార పంపిణీ పూర్తి చేయాలి. ప్రాజెక్టుతో నిర్వాసితులైన కుటుంబాలు, ప్రభావితమైన కుటుంబాల్లోని వ్యక్తులకు ఇచ్చిన హామీ మేర కు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించాలి. ♦బూడిద కోసం భవిష్యత్‌లో అదనపు భూమి కేటాయింపు ఉండదు. సిమెంట్, ఇటుకల తయారీకి 100శాతం బూడిదను వినియోగించుకోవాలి. రవాణాలో బూడిద పరిసర ప్రాంతాల్లో పడి కలుషితం చేయకుండా క్లోజ్డ్ బల్కర్స్లోనే తరలించాలి. ♦పర్యావరణ నిర్వహణ పణ్రాళిక (ఈఎంపీ)లో హామీ ఇచ్చిన మేరకు గడువులోగా రూ.5681.44 కోట్ల మూలధనం, రూ.430 కోట్ల రికరింగ్ నిధులతో పర్యావరణ ప్రణాళిక అమలు చేయాలి. ♦ప్రాజెక్టుకు చుట్టూ 5 కి.మీల పరిధిలో నివసించే జనాభాకు కనీసం రెండేళ్లకోసారి ఎపిడెమియోలాజికల్(అంటురోగాలు) స్టడీ నిర్వహించాలి. స్టడీలో తేలిన అంశాల ఆధారంగా వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. యూనిట్ల నిర్మాణ గడువూ పొడిగింపుతెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) ఆధ్వర్యంలో 4000(5్ఠ800) మెగావాట్ల సామర్థ్యంతో నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం– వీరప్పగూడెం గ్రామాల్లో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఐదు యూనిట్ల నిర్మాణం విషయంలో గడువు పొడిగించినట్టు జెన్కో కేంద్ర పర్యావరణ శాఖకు తెలిపింది.. యూనిట్ గడువు యూనిట్– 1 15.10.2024 యూనిట్–2 15.10.2024 యూనిట్ –3 31.03.2025 యూనిట్–4 31.12.2024 యూనిట్–5 28.02.2025 -
ఇలా అమ్ముకోండి.. అలా కొనుక్కోండి
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లు, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ముగిసిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్కో)లు కరెంటును నేరుగా ఎవరికైనా అమ్ముకొనే అవకాశం కల్పించింది. ఏదైనా జెన్కో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించినప్పుడు డిస్కంలతో పీపీఏ కుదర్చుకుంటుంది. ఇది సాధారణంగా 12 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకూ ఉంటుంది. ఈ ఒప్పందం గడువు ముగిసిన తరువాత కూడా డిస్కంలు అదే రేటుకి అదే జెన్కో ద్వారా విద్యుత్‌ను తీసుకునే వెసులుబాటు ఇప్పటివరకూ ఉంది. ఇప్పుడు కేంద్రం ఈ వెసులుబాటు లేకుండా చేసింది. గడువు ముగిసిన తరువాత కూడా అదే రేటుకి కొంటే జెన్కోలకు నష్టం వాటిల్లుతుందన్నది కేంద్రం చెబుతున్న కారణం. దీంతో జెన్కోలు పీపీఏల గడువు ముగిసిన తరువాత ఇండియన్ ఎనర్జీ ఎక్సే్ఛంజ్ (ఐఈఎక్స్)లోగానీ, ఎక్కువ ధర ఇచ్చే డిస్కంలకు గానీ విద్యుత్‌ను విక్రయించుకోవచ్చు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటును పీపీఏలు ముగిసిన తరువాత విక్రయించేందుకు సెంట్రల్ పూల్ విధానాన్ని కేంద్రం కొత్తగా తీసుకువచ్చింది. కేంద్రానికి చెందిన పదహారు ప్లాంట్లలో విద్యుత్‌ను డిస్కంలు ముందస్తు దరఖాస్తు ద్వారా కొనుక్కొనే అవకాశం కలి్పంచింది. కొనుగోలు ఒప్పందాన్ని కూడా ఐదేళ్లకు పరిమితం చేసింది. పీపీఏలు చేసుకోగా మిగిలిన విద్యుత్‌ను ఐఈఎక్స్‌లో విక్రయిస్తారు. అంతా ఐఈఎక్స్‌లోనే విద్యుత్‌ను అమ్మాలన్నా, కొనాలన్నా ఇప్పుడు జెన్కోలు, డిస్కంలకు ఉన్న ప్రధాన మార్కెట్ ఇండియన్ ఎనర్జీ ఎక్సే్ఛంజ్. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ అనుమతితో 2008 జూన్ 27న ప్రారంభమైన ఐఈఎక్స్ 2017లో స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీగా మారింది. అప్పటినుంచి విద్యుత్ క్రయ విక్రయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. 29 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 55కు పైగా విద్యుత్ పంపిణీ సంస్థలు, 600కుపైగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, 1800కుపైగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, 4,600కు పైగా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు ఐఈఎక్స్‌లో చేరాయి. గత నెలలో ఐఈఎక్స్‌లో 8,469 మిలియన్ యూనిట్ల లావాదేవీలు జరిగాయి. యూనిట్ సగటు ధర రూ.6.89గా ఉంది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ లావాదేవీలకు జెన్కోలు, డిస్కంల నుంచి గరిష్టంగా యూనిట్‌కు 2 పైసలు రుసుమును (ఐఈఎక్స్) వసూలు చేస్తోంది. -
త్వరలో జెన్కోలో 350 ఏఈ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) త్వరలో దాదాపు 350 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), 50 కెమిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్వహణ అవసరాలకు అవసరమైన ఉద్యోగులను భర్తీ చేసుకోవాలని సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య, నోటిఫికేషన్ ప్రకటనపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకటి రెండు నెలల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ విభా గాల్లో ఏఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిసింది. ఇదీ చదవండి: సంపద పెరగాలంటే పరిశ్రమలు రావాలి -
సీఎం జిల్లా వారైతే అనర్హులా.!
సాక్షి, అమరావతి: విదేశీయులు మన దేశంలో కంపెనీలు, పరిశ్రమలు స్థాపిస్తున్నారు. మన రాష్ట్రం నుంచి ఎంతో మంది దేశ, విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ఆ ఊరు, ఈ ఊరు అనే తేడా లేదు. జిల్లా నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు ఎక్కడైనా అర్హత ఉన్న ఎవరైనా చట్టం, నిబంధనల మేరకు ఏదైనా చేయవచ్చు. దీనిని విశ్యవ్యాప్తంగా ఎవరూ కాదనరు. కానీ ఈనాడుకు మాత్రం సీఎం సొంత జిల్లా వారు ఎలాంటి వ్యాపారాలు చేయకూడదని, టెండర్లు దక్కించుకోకూడదన్న అభిప్రాయం నరనరానా జీర్ణించుకుపోయింది. అందుకే వారు వ్యాపారాలకు అనర్హులనేలా కథనాలు అల్లుతోంది. పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చ డానికి సీలేరులో రెండు అదనపు విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో) టెండర్లు పిలిచింది. అత్యంత పారదర్శకంగా బిడ్లు ఆహ్వానించి, రివర్స్ టెండరింగ్ ద్వారా టెండరు ఖరారు చేసింది. కానీ ఇదంతా తప్పన్నట్టు ‘ఈనాడు’ శుక్రవారం ఓ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఆ పత్రిక అధినేత రామోజీరావు పచ్చళ్లు అమ్ముకోవచ్చు.. పత్రికనూ నడుపుకోవచ్చు.. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే కంపెనీకి మాత్రం విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు టెండర్ ఇవ్వకూడదు. వారికి, వారు కొమ్ముకాస్తున్న వారికి ఒక న్యాయం.. సీఎం సొంత జిల్లా వారైతే మరో న్యాయం.. ఇదేం రామోజీ జర్నలిజం. ఏపీ జెన్కో వెల్లడించిన వివరాల ప్రకారం ఈ టెండర్లలో వాస్తవాలు అంశాల వారీగా ఇలా ఉన్నాయి. ఆరోపణ: వైఎస్సార్ జిల్లాకు చెందిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ విద్యుత్ ప్రాజెక్టును కట్టబెట్టింది. ఈ సంస్థ వైఎస్సార్ జిల్లాకు చెందిన వ్యక్తికి సంబంధించినది కావడమే దానికి ఉన్న ఏకైక అర్హత. వాస్తవం: ఏపీ జెన్కో అత్యంత పారదర్శకంగా నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ద్వారానే షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఈ కాంట్రాక్టును కైవసం చేసుకుంది. ఇందులో ఏపీ జెన్కో, ప్రభుత్వం ప్రమేయం ఏమీ లేదు. ఈ కన్సార్టియం భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ప్రతిష్టాత్మక బీహెచ్ఈఎల్తో ఈ ప్రాజక్టు యంత్ర పరికరాల సరఫరాకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఉన్న యూనిట్లకు కూడా బీహెచ్ఈఎల్ యంత్ర పరికరాలు సరఫరా చేసింది. కన్సార్టియంలోని మరో కంపెనీ పీఈఎస్‌కు ఇదివరకే ఈ ప్రాజక్టులో సివిల్ పనులు చేసిన అనుభవముంది. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుని, కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేసింది. ఈ ప్రాజక్టు పనులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 2024కల్లా పూర్తవుతాయి. ఆరోపణ: దిగువ సీలేరులో రెండు అదనపు యూనిట్ల నిర్మాణానికి అయ్యే వ్యయం, జీఎస్టీ, ఆలస్యానికి అయ్యే వడ్డీతో కలిపి రూ. 571 కోట్ల రుణాన్ని గ్రామీణ విద్యుత్ సంస్థ (ఆర్ఈసీ) నుంచి ప్రభుత్వం తీసుకుంది. వాస్తవం: పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి ప్రాజెక్టుల నిర్మాణం కోసం రుణం తీసుకో వడం సర్వసాధారణం. ఇందులో తప్పేముంది? ఆరోపణ: ఇప్పటికే షిర్డీ సాయి, దాని అనుబంధ సంస్థలకు రూ. 92 వేల కోట్ల విలువైన వివిధ విద్యుత్ ప్రాజెక్టులను ప్రభుత్వం కట్టబెట్టింది. వాస్తవం: ఏపీ జెన్కోగానీ, డిస్కంలు గానీ నామినేషన్ పద్ధతిలో ఏ పనులూ ఎవరికీ కేటాయించలేదు. వివిధ ప్రాజెక్టుల కోసం పారదర్శకంగా టెండర్లు నిర్వహించాయి. అర్హతల మేరకు పోటీ బిడ్డింగ్‌లో పాల్గొని ఏ సంస్థ అయినా పనులు దక్కించుకోవచ్చు. ఆరోపణ: ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే కంపెనీకి జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రభుత్వం కట్టబెట్టింది. వాస్తవం: అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్ (గ్లోబల్ టెండర్లు– ఇ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫారం) ద్వారా ఏపీ జెన్కో టెండర్లు పిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జుడిషియల్ కమిషన్ కూడా సమీక్షించి ఈ ప్రాజెక్టు టెండర్లకు ఆమోదం తెలిపింది. రాఘవ ఎంటర్ప్రైజెస్, ఎన్సీసీ, పీఈఎస్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిపి షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ జాయింట్ వెంచర్ సంస్థ బిడ్లు దాఖలు చేసింది. టెండర్లలో కోట్ అయిన అతి తక్కువ మొత్తాన్ని గరిష్టంగా తీసుకుని ఏపీజెన్కో రివర్స్ టెండర్లు నిర్వహించింది. ఈ రివర్స్ టెండరింగ్‌లో షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ తక్కువ మొత్తానికి ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చి కాంట్రాక్టు దక్కించుకుంది. రెండు దశల (సాంకేతిక, ఆర్ధిక) బిడ్డింగ్ ప్రాతిపదికన ప్రాజెక్టును అభివృద్ది చేసేందుకు సంస్థను ఎంపిక చేసింది. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ వల్ల ఏపీ జెన్కోకు దాదాపు రూ.10 కోట్లు ఆదా అయ్యింది. ఆరోపణ: ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన పర్యావరణ, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతులు రాకముందే హడావుడి చేసింది. వాస్తవం: విద్యుత్ కేంద్రం ప్రతిపాదనను ఏపీఈఆర్సీకి ముందే చెప్పారు. ప్రతిపాదనను పరిశీలించి డిస్కంలు, జెన్కో కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకుని కమిషన్ అనుమతి కోసం అప్పుడు పంపాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అనుమతి ఈ నెల 7న వచ్చింది. ఈ ప్రాజెక్టు పెట్టుబడి వ్యయం రూ.1000 కోట్లు దాటనందున కేంద్ర విద్యుత్ ప్రాధికారిక సంస్థ (సీఈఏ) అనుమతి అవసరం లేదు. ఆరోపణ: రెండు కొత్త యూనిట్లు నిర్మించడం వల్ల దిగువ సీలేరు ప్రాజెక్టు నుంచి అదనంగా ఒక్క యూనిట్ విద్యుత్ కూడా ఉత్పత్తి అయ్యే పరిస్థితి లేదు. వాస్తవం: జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి మన గ్రిడ్ అవసరాలకు అనుగుణంగా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు 115 మెగావాట్ల యూనిట్లు ఏటా దాదాపు 1100 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నాయి. దిగువ సీలేరు విద్యుత్ కేంద్రం మొట్టమొదట నిర్మించినప్పుడే ఆరు యూనిట్ల ఏర్పాటుకు కావలసిన ప్రధాన మౌలిక సదుపాయాలు కల్పించారు. దీంతో అదనంగా మరో రెండు 115 మెగావాట్ల యూనిట్లు నిర్మించాలని ఏపీ జెన్కో నిర్ణయించింది. కొత్త యూనిట్లు నెలకొల్పడం వల్ల ఈ విద్యుత్ కేంద్రం గరిష్ట లోడ్ సామర్ధ్యం పెరుగుతుంది. దాంతో మార్కెట్ నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనవలసిన అవసరం తగ్గుతుంది. ప్రతి 115 మెగావాట్ల యంత్రం పీక్ డిమాండ్ సమయంలో సగటున 175 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయగలదు. దీనివల్ల డిస్కంలకు ఏటా 350 మిలియన్ యూనిట్లు విద్యుత్ మార్కెట్లో కొనాల్సిన అవసరం తగ్గి, ఆ మేరకు లాభం చేకూరుతుంది. పీక్ సమయాల్లో మార్కెట్ రేటు యూనిట్‌కు దాదాపు రూ.10 ఉంటోంది. సరాసరి పీక్ లోడ్ విద్యుత్ ధర రూ.8.0 అనుకున్నా ఈ రెండు యూనిట్ల వల్లా ఏటా దాదాపు రూ .280 కోట్లు ఆదా అవుతుంది. -
చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాడు
-
విద్యుత్ వెలుగులు.. ఉత్పత్తిలో ఏపీ జెన్కో రికార్డు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ (ఏపీ జెన్కో) విద్యుత్ ఉత్పత్తిలో రికార్డులు నమోదు చేస్తోంది. మే నెలలో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఏపీ జెన్కో 12 శాతం అధికంగా విద్యుత్ సరఫరా చేసింది. రాష్ట్ర విద్యుత్ డిమాండులో ఏపీ జెన్కో గత ఏడాది మే నెల 33.45 శాతం సమకూర్చగా ఈ ఏడాది అదే నెలలో అంచనాలకు మించి 45.38 శాతం గ్రిడ్‌కు అందించడం గమనార్హం. గత ఏడాది మేనెలలో రాష్ట్ర గ్రిడ్ విద్యుత్ డిమాండు 5947.39 మిలియన్ యూనిట్లు కాగా ఏపీ జెన్కో 1989.37 మిలియన్ యూనిట్లు సమకూర్చింది. ఈ ఏడాది మే నెలలో రికార్డు స్థాయిలో రాష్ట్ర విద్యుత్ డిమాండు 6430.72 మిలియన్ యూనిట్లకు పెరగ్గా ఏపీ జెన్కో 2917.99 మిలియన్ యూనిట్లను రాష్ట్ర అవసరాల కోసం గ్రిడ్‌కు అందించిది. ఏపీ జెన్కో రాష్ట్ర అవసరాల కోసం రాష్ట్ర గ్రిడ్‌కు గత సంవత్సరం మేనెలలో సరఫరా చేసిన విద్యుత్ కంటే ఈ సంవత్సరం మేనెలలో 989.37 మిలియన్ యూనిట్లు అధికంగా సరఫరా చేయడం విశేషం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత అధికంగా విద్యుత్ వినియోగం పెరిగిన సమయంలో సైతం ఏపీ జెన్కో సగటున 45 శాతం పైగా సమకూర్చుతుండటం విశేషం. జెన్కో విద్యుత్ ఉత్పత్తి పెంచడంవల్ల ఆ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ప్రయివేటు ఉత్పత్తి సంస్థలు, ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన భారం తగ్గినట్లే. ఈ మేరకు విద్యుత్ వినియోగదారులపై సర్దుబాటు ఛార్జీల పెంపు భారం తప్పింది. ఇది వినియోగదారులకు ఉపశమనం కలిగించే అంశం. గత వేసవి సీజన్లలో లాగే ఈ ఏడాది మేలో కూడా డిమాండు సాధారణంగా ఉండి ఉంటే ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా వాటా 50 శాతం దాటి ఉండేదని గణాంకాలను బట్టి తేటతెల్లమవుతోంది. ‘సాగర్’ రికార్డు నాగార్జున సాగర్ కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం నలబై ఏళ్లలో ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 287.213 మిలియన్ యూనిట్ల అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేసింది. ప్రాజెక్టు నలబై ఏళ్ల చరిత్రలో ఇదే అత్యధికం కావడం విశేషం. ప్లాంట్లలో ఉద్యోగులు అంకిత భావంతో కృషి చేయడం, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు చక్కటి మార్గదర్శకంతో ప్రోత్సహించడంవల్లే ఏపీ జెన్కో విద్యుదుత్పత్తి పెరిగిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) పెరగడానికి పాటుపడినందుకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ జెన్కో ఛైర్మన్ కె. విజయానంద్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు ఉద్యోగులను అభినందించారు. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (డాక్టర్ ఎన్టీటీపీఎస్) లో ఇటీవల ౖప్రయోగాత్మకంగా ఉత్పత్తి ప్రారంభించి గ్రిడ్‌కు అనుసంధానం చేసిన 800 మెగావాట్ల ఎనిమిదో యూనిట్ వాణిజ్య ఉత్పత్తి (సీఓడీ)కి వచ్చే నెల శ్రీకారం చుడతామని ఎండీ ఉద్యోగులకు తెలిపారు. దీంతో ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల సామర్థం 5810 మెగావాట్ల నుంచి 6610 మెగావాట్లకు పెరుగుతుంది. ఏపీ జెన్కో (థర్మల్, హైడల్, సోలార్ కలిపి) మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 8789.026 మెగావాట్లకు పెరగనుంది. ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు ప్రణాళిక : ఎండీ చక్రధర్ బాబు విద్యుత్ రంగంలో అపార అనుభవం ఉన్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ మార్గదర్శకత్వంలో ఇంధన, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంపూర్ణ సహాయ, సహకారాలతో ఏపీ జెన్కో విద్యుదుత్పత్తి సామర్థ్యం మరింతగా పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నాం. రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల విద్యుత్ డిమాండు పెరుగుతోంది. ఏ రంగం ప్రగతికైనా విద్యుత్ కీలకం. ప్రతి యేటా విద్యుత్ డిమాండు 8 శాతం పెరుగుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విద్యుత్ డిమాండులో అత్యధిక భాగం సాధ్యమైనంత మేరకు పూర్తి స్థాయిలో ఏపీ జెన్కో ద్వారా సమకూర్చేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకం చేశారు. చదవండి: ప్రగతి పథంలో ఆర్టీసీ వారి మార్గదర్శకం మేరకు 5000 మెగావాట్ల సామర్థ్యంగల పంప్డ్ స్టోరేజి ప్లాంట్ల (పీఎస్పీ) ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాం. పీక్ డిమాండు సమయంలో ఉత్పత్తి పెంచడానికి, సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి హఠాత్తుగా పడిపోయినప్పుడు గ్రిడ్‌కు సరఫరా చేసేందుకు పీఎస్పీలు చాలా ఉపయోగపడతాయి. పీక్ డిమాండు సమయంలో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన భారం కూడా వీటివల్ల తప్పుతుంది. ఈ ఆలోచనతోనే అప్పర్ సీలేరులో 1350 మెగావాట్ల పీఎస్పీ నిర్మించాలని ఇప్పటికే కేంద్ర విద్యుత్ మండలి (సీఈఏ) నుంచి అనుమతి తీసుకున్నాం. దీని నిర్మాణానికి టెండరు డాక్యుమెంటును జ్యుడీషియల్ ప్రివ్యూ కమిటీ ఆమోదించింది. రూ. 11,154 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవనున్నాం. -
సింగరేణి @ 4000 మెగావాట్లు !
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ విద్యుదుత్పత్తి రంగంలో తెలంగాణ జెన్కో, ఎన్టీపీసీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రధానంగా కొత్త విద్యుత్ కేంద్రాల స్థాపన ద్వారా తమ థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 4000 మెగావాట్లకు పెంచుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిపిన సింగరేణి సంబురాల్లో సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఈ విషయాన్ని ప్రకటించారు. సింగరేణి సంస్థ ఇప్పటికే మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద 2 వేల ఎకరాల్లో 1,200(2్ఠ600) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్వహిస్తూ, ఏటా రూ.500 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అదే ప్రాంగణంలో మరో 800 మెగావాట్ల కొత్త సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను ఇటీవలే ప్రారంభించింది. 800 మెగావాట్ల మరో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించి థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 2800 మెగావాట్లకు పెంచుకోలని ఈ ఏడాది ప్రారంభంలోనే సంస్థ నిర్ణయం తీసుకుంది. తాజాగా 4000 మెగావాట్లకు థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించడంతో, మరో 1200(2్ఠ600) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను సంస్థ ఏర్పాటు చేయాల్సి ఉండనుంది. 4400 మెగావాట్లకూ పెరిగే అవకాశం.. కొన్నేళ్ల నుంచి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో 600 మెగావాట్ల కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించడం లేదు. దాంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 1600(2్ఠ800) మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్లను సింగరేణి నిర్మించాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే సింగరేణి థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యం 4400 మెగావాట్లకు పెరిగే అవకాశం ఉంది. జెన్కో, ఎన్టీపీసీలకు గట్టి పోటీ.. తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) రాష్ట్రంలో మొత్తం 4042.5 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్వహిస్తుండగా, చివరి దశలో ఉన్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తయితే సంస్థ పూర్తి సామర్థ్యం 8042.5 మెగావాట్లకు పెరగనుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘ఎన్టీపీసీ’ రామగుండంలో 2600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్వహిస్తుండగా, చివరి దశలోని 1600(2్ఠ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తయితే సంస్థ సామర్థ్యం 4200 మెగావాట్లకు పెరగనుంది. అదే సమయంలో 4400 మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యంతో సింగరేణి ఎన్టీపీసీని వెనక్కి నెట్టి రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో ఉండే అవకాశం ఉంది. సౌర విద్యుత్ రంగంలో సైతం.. సింగరేణి సంస్థ భారీగా సౌర విద్యుదుత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 300 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టి, 224 మెగావాట్ల ప్లాంట్ల పనులు పూర్తయి విద్యుదుత్పత్తి జరుగుతోంది. మిగిలిన 76 మెగావాట్ల ప్లాంట్ల పనులు చివరి దశలో ఉన్నాయి. భూపాలపల్లి, మందమర్రి, మణుగూరులో మరో 250 మెగావాట్ల సౌర విద్యత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి సంస్థ సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం 550 మెగావాట్లకు పెంచుకోవాలని నిర్ణయించింది. -
తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. 9 సంవత్సరాలు.. రూ.97,321 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి రూ.97,321 కోట్ల ఖర్చు చేశామని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం విద్యుత్ సౌధ, మింట్ కాంపౌండ్‌లోని టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘విద్యుత్ విజయోత్సవ దినం’కార్యక్రమాల్లో మాట్లాడారు. రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2022–23లో 2140 యూనిట్లుగా, జాతీయ సగటుతో పోలి్చతే 70శాతం అధికంగా నమోదైందని తెలిపారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ అభివృద్ధికి 9 ఏళ్లలో రూ.14,063 కోట్లు ఖర్చు చేశామని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి అన్నారు. వినియోగదారుల సమస్యలను సత్వరంగా పరిష్కరించి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఉద్యోగులకు సూచించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్, ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. చదవండి: ఉగ్రవాదులు టార్గెట్ చేసిన రాష్ట్రాలు ఏవి? -
వచ్చే ఐదేళ్లలో రూ.14,130 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని థర్మల్, హైడల్ విద్యుత్ కేంద్రాలపై తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) రానున్న ఐదేళ్లలో రూ.14,130.37 కోట్లు ఖర్చు చేయనుంది. నిర్మాణంలోని కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల పూర్తికి, ఇప్పటికే వినియోగంలో ఉన్న థర్మల్, హైడల్ విద్యుత్ కేంద్రాల నిర్వహణ, మరమ్మతులకు ఈ మేరకు వ్యయం చేయనుంది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి తాజాగా సమర్పించిన 2024–29 పంచవర్ష పెట్టుబడి ప్రణాళికలో ఈ విషయాన్ని జెన్కో వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో మొత్తం 2,83,836.08 మిలియన్ యూనిట్ల (ఎంయూ) థర్మల్ విద్యుత్, 16,112.84 ఎంయూల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు అంచనా వేసింది. జెన్కో ప్రతిపాదనలపై ఈ నెల 15 వరకు సలహాలు, సూచనలను ఈఆర్సీ ఆహా్వనించింది. జూలై 5న ఉదయం 11 గంటలకు రెడ్‌హిల్స్‌లోని తమ కార్యాలయంలో బహిరంగ విచారణ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. అనంతరం జెన్కో సమర్పించిన పెట్టుబడి వ్యయ ప్రణాళికలకు ఆమోదం తెలిపే అంశంపై నిర్ణయం తీసుకోనుంది. ఎఫ్‌జీడీలు తప్పనిసరి థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, మెర్క్యూరీ వంటి విష వాయువుల కట్టడికి ఫ్లూ–గ్యాస్ డిసల్ఫ్యూరిజేషన్ (ఎఫ్‌జీడీ) ప్లాంట్లను తప్పనిసరిగా నిర్మించాలని 2015లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేటీపీఎస్ 5, 6వ దశల యూనిట్లకు రూ.1,231.04 కోట్లు, కేటీపీపీ 1, 2 దశల యూనిట్లకు రూ.1,325.75 కోట్ల అంచనాలతో ఎఫ్‌జీడీ ప్లాంట్లను నిర్మించనున్నట్టు జెన్కో తెలిపింది. కొత్తగా నిర్మించిన కేటీపీఎస్ 7వ దశ, భద్రాద్రి థర్మల్ కేంద్రాలతో పాటు నిర్మాణంలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఎఫ్‌జీడీల ప్లాంట్లను ఏర్పాటు చేసే పనులను ఇప్పటికే బీహెచ్ఈఎల్కు అప్పగించారు. మణుగూరు, పాల్వంచల్లో భారీ టౌన్‌షిప్‌లు మణుగూరు, పాల్వంచ పట్టణాల్లో తమ సిబ్బంది అవసరాలకు ఈపీసీ విధానంలో సమీకృత టౌన్‌షిప్‌లను జెన్కో నిర్మించనుంది. మణుగూరులోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం వద్ద రూ.635.63 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మించనుంది. అందులో బహుళ అంతస్తుల నివాస క్వార్టర్లు, ఆస్పత్రి భవనం, పాఠశాల భవనం, క్లబ్ హౌస్, అతిథి గృహం, ఇండోర్ స్టేడియం, ఆడిటోరియం, స్టోర్స్ కాంప్లెక్స్, సెక్యూరిటీ ఆఫీస్ బిల్డింగ్, స్టోరేజీ షెడ్, రోడ్లు, డ్రెన్లు, ప్రహరీ గోడల వంటి నిర్మాణాలు ఉండనున్నాయి. కొత్తగూడం పాల్వంచలోని కేటీపీఎస్ 7వ దశ థర్మల్ విద్యుత్ కేంద్రం వద్ద రూ.524 కోట్లతో బహుళ అంతస్తుల రెసిడెన్షియల్ క్వార్టర్లను జెన్కో నిర్మించనుంది. -
హామీలు అమలు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు కావొస్తున్నా, అనేక అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు ద్వైపాక్షిక అంశాలు పరిష్కారానికి నోచుకోలేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వాటన్నింటినీ పరిష్కరించి రాష్ట్రానికి తగిన సహకారం అందించాలని కోరారు. రాష్ట్ర విభజన అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర కేంద్ర మంత్రులకు విన్నవించేందుకు గురువారం రాత్రి ఢిల్లీకి వచ్చిన వైఎస్ జగన్.. శుక్రవారం ఉదయం మోదీతో పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధానికి వినతులు అందజేశారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ పలు దఫాలుగా చర్చలు జరిపి కొంత పురోగతి సాధించినా, కీలక అంశాలన్నీ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రుణ పరిమితి పెంచండి 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద రూ.36,625 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని సీఎం వైఎస్ జగన్ ప్రధానిని కోరారు. రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ చేస్తామంటూ పార్లమెంట్ సాక్షిగా కేంద్రం చెప్పిందని, దీనిపై సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో గత ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు తీసుకుందన్న కారణంతో ఇప్పుడు రాష్ట్ర రుణాల పరిమితులపై ఆంక్షలు విధించారని వివరించారు. ఈ ప్రభుత్వం తప్పు లేకపోయినప్పటికీ నిబంధనల ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారని చెప్పారు. 2021–22లో రూ.42,472 కోట్ల రుణ పరిమితి కల్పించి, తదుపరి కాలంలో దానిని రూ.17,923 కోట్లకు తగ్గించారన్నారు. కోవిడ్ మహమ్మారి సృష్టించిన ఆర్థిక విపత్తు సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని, ఈ విషయంలో జోక్యం చేసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. పోలవరానికి అడ్‌హక్‌గా రూ.10 వేల కోట్లు పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతోందని, ఏపీ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చే దిశగా ప్రాజెక్టు నిర్మాణం సాగిస్తోందని సీఎం.. ప్రధానికి వివరించారు. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తే కొద్ది కాలంలోనే ఇది వాస్తవ రూపంలోకి వచ్చి ప్రజలకు ఫలితాలు అందుతాయన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానా నుంచి రూ.2600.74 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. గత రెండేళ్లుగా ఈ నిధులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ నిర్ధారించిన పోలవరం ప్రాజెక్టు అంచనాలు రూ.55,548 కోట్లను ఆమోదించాలని విన్నవించారు. తాగునీటి సరఫరా అంశాన్ని కూడా పోలవరం ప్రాజెక్టులో భాగంగా చూడాలని, ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్ వారీగా నిబంధనలు సడలించాలని సూచించారు. ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని, ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతుందని తెలిపారు. డీబీటీ పద్ధతిలో ముంపు బాధితులకు ఈ సహాయం అందిస్తే జాప్యాన్ని నివారించవచ్చన్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అడ్‌హక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలని కోరారు. ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన ఇతర అంశాలు ఇలా... ♦ తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రావాల్సిన బకాయిలు అలానే ఉన్నాయి. 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉంది. వీటిని వెంటనే ఇప్పించాలి. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతు బద్ధత పాటించక పోవడంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. దీనివల్ల పీఎంజీకేఏవై కార్యక్రమం కిందకు రాని 56 లక్షల కుటుంబాలకు రాష్ట్రమే సొంతంగా రేషన్ ఇస్తోంది. తద్వారా దాదాపు రూ.5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ విషయంలో ఏపీ చేసిన విజ్ఞప్తి సరైనదేనని నీతి ఆయోగ్ కూడా నిర్ణయించిన నేపథ్యంలో చర్యలు తీసుకోవాలి. కేంద్రం వినియోగించని రేషన్ కోటాను రాష్ట్రానికి కేటాయించాలి. ♦ రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంట్ సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్ను రాయితీలు లభిస్తాయి. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడమే కాకుండా, సేవా రంగం విస్తరిస్తుంది. స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. ♦ రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశాం. ప్రతి జిల్లాలో 18 లక్షల మంది జనాభా ఉన్నారు. కొత్తగా కేంద్రం మంజూరు చేసిన మూడు మెడికల్ కాలేజీలతో కలిపి మొత్తంగా 14 మాత్రమే ఉన్నాయి. మిగిలిన 12 కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేయాలి. ఈ కాలేజీలకు సంబంధించిన పనులు అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయి. వీటికి సంబంధించి కేంద్రం తగిన విధంగా సహాయ పడాలి. ♦ వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. ఈ ప్లాంట్ నిలదొక్కుకోవాలంటే ఖనిజ కొరత లేకుండా ఏపీఎండీసీకి గనులు కేటాయించాలి. విభజన అంశాలపై అమిత్‌షాకు వినతి ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన అంశాలను ప్రస్తావించారు. ప్రత్యేక హోదా, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ఆమోదం వంటి అంశాలపై మాట్లాడారు. తిరుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు అంశం గురించి ప్రస్తావించినట్లు తెలిసింది. పార్లమెంట్లో ఘన స్వాగతం ప్రధాని మోదీ, అమిత్‌షాతో భేటీకై పార్లమెంట్‌కు వచ్చిన సీఎం వైఎస్ జగన్‌కు వైఎస్సార్సీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. రాజ్యసభ, లోక్‌సభ పక్ష నేతలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలతో పాటు ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మార్గాని భరత్, గోరంట్ల మాధవ్, రెడ్డప్ప, తలారి రంగయ్య, పోచ బ్రహ్మానందరెడ్డి, లావు కృష్ణదేవరాయలు, పిల్లి సుభాస్ చంద్రబోస్, ఆర్.కృష్ణయ్య, చింతా అనురాధ, సత్యవతి, గొడ్డేటి మాధవిలు సాదర స్వాగతం పలికారు. జగన్ పార్లమెంట్ భవనంలో లోపలికి వెళుతున్న సమయంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్, పీఎంఓ కార్యాలయ శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌లు పలకరించారు. మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్‌కౌర్ వైఎస్ జగన్‌తో ఫొటో దిగారు. కాగా, శుక్రవారం సాయంత్రం 4 గంటల తర్వాత సీఎం జగన్ ఢిల్లీ నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. -
తాడిచర్ల గనికి ‘భద్రత’ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: గనుల భద్రత విషయంలో ఉత్తమ విధానాలను అవలంభిస్తున్నందుకు తెలంగాణ జెన్కోకు చెందిన తాడిచర్ల–1 బొగ్గు గనికి డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ విభాగం పురస్కారాన్ని అందజేసింది. వార్షిక భద్రత వారోత్సవాల సందర్భంగా ఈ పురస్కారాన్ని తాడిచర్లలో అందుకున్నట్లు జెన్కో బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
అంచనాలకు మించి జల విద్యుదుత్పత్తి
విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో.. జెన్కో కాసుల పంట పండింది. గత ఏప్రిల్ 1 నుంచి ఈ నెల 10 వరకు భారీగా 3849.79 మిలియన్ యూనిట్ల (ఎంయూ) జల విద్యుదుత్పత్తి జరిపింది. సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో.. తెలంగాణ విద్యుదు త్పత్తి సంస్థ (జెన్కో) కాసుల పంట పండించింది. గత ఏప్రిల్ 1 నుంచి ఈ నెల 10 వరకు భారీగా 3,849.79 మిలియన్ యూనిట్ల (ఎంయూ) జల విద్యుదుత్పత్తి జరిపింది. అందులో 480.78 ఎంయూలను గడిచిన పది రోజుల్లోనే ఉత్పత్తి చేయడం విశేషం. గతేడాది మాదిరే మంచి వర్షాలు కురిస్తే 2022–23 ఆర్థిక సంవత్సరంలో 3,718.53 ఎంయూల ఉత్పత్తికి అవకాశముందని జెన్కో అంచనా వేయగా, ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఇప్పటికే 3,849 ఎంయూల ఉత్పత్తి జరగడం గమనార్హం. తొలి అర్ధ వార్షికం ముగిసే (సెప్టెంబర్ చివరి) నాటికే 3,369 ఎంయూల ఉత్పత్తి జరిగింది. 6,000 ఎంయూల ఉత్పత్తికి అవకాశం కృష్ణా బేసిన్‌లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల తదితర జలాశయాల్లో నిల్వ ఉన్న 578 టీఎంసీల జలాలతో 2,052 ఎంయూలు, గోదావరి బేసిన్‌లోని నిజాంసాగర్, పోచంపాడు తదితర జలాశయాల్లో నిల్వ ఉన్న 137 టీఎంసీలతో 138 ఎంయూలు కలిపి మొత్తం 2,190 ఎంయూల జలవిద్యుత్ ఉత్పత్తికి అవకాశముందని జెన్కో అంచనాలు పేర్కొంటున్నాయి. సెప్టెంబర్‌తో నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసినా, ఇంకా విస్తారంగా వర్షాలు కొనసాగుతున్నాయి. జలాశయాలన్నీ నిండి ఉండటంతో విద్యుదుత్పత్తి ద్వారా వచ్చిన నీళ్లను వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తెలంగాణ జెన్కో రికార్డుస్థాయిలో 6,000 ఎంయూల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశముంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో.. 900 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం కలిగిన శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఒక్కొక్కటీ 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6 యూనిట్లు ఉండగా, ఐదు యూనిట్లు మాత్రమే ఉత్పత్తికి లభ్యంగా ఉన్నాయి. రెండేళ్ల కింద జరిగిన అగ్నిప్రమాదంలో కాలిపోయిన ఓ యూనిట్ పునరుద్ధరణ ఇంకా పూర్తికాలేదు. ఇక్కడి నుంచి 100% స్థాపిత సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేయడానికి 45 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో అవసరం. ఇప్పటికే శ్రీశైలంలో నిల్వ ఉన్న 214 టీఎంసీల జలాలతో 1,009 ఎంయూల జల విద్యుదుత్పత్తి చేయొచ్చని జెన్కో అంచనా వేసింది. కొనసాగుతున్న ఇన్‌ఫ్లోను పరిగణనలోకి తీసుకుంటే ఉత్పత్తి మరింత పెరగనుంది. ►815.6 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం కలిగిన నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రంలో 100శాతం ఉత్పత్తి చేసేందుకు 35 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో అవసరం. జలాశయంలో నిల్వ ఉన్న 311 టీఎంసీలతో 987 ఎంయూల జలవిద్యుదుత్పత్తికి అవకాశం ఉంది. డిస్కంలకు భారీ ఊరట తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న డిస్కంలను.. ఈ ఏడాది జల విద్యుత్ కొంత వరకు ఆదుకుంది. చౌక ధరకు లభించే జల విద్యుత్ భారీ మొత్తంలో ఉత్పత్తి కావడంతో డిస్కంలపై విద్యుత్ కొనుగోళ్ల భారం కొంత తగ్గింది. 2022–23లో మొత్తం 3,561 ఎంయూల జలవిద్యుత్ కొనుగోళ్లు చేసేందుకు డిస్కంలకు విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతిచ్చింది. ఇందుకు రూ.1,307 కోట్లను ఫిక్స్డ్ చార్జీలుగా జెన్కోకు చెల్లించాలని ఆదేశించింది. జలవిద్యుత్‌కు వేరియబుల్ చార్జీలేమీ ఉండవు... అంతే వ్యయానికి అదనంగా ఉత్పత్తైన జల విద్యుత్‌ను సైతం డిస్కంలకు జెన్కో సరఫరా చేయాల్సి ఉంటుంది. దీంతో కనీసం రూ.వెయ్యి కోట్లకు పైగా రాష్ట్ర డిస్కంలకు ఆదా కానుంది. -
ఏపీలో విద్యుత్ కొనుగోలుకు సమస్య లేనట్టే..
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ డిస్కమ్‌లు.. జనరేటర్లకు రూ.412 కోట్లు బకాయి ఉన్నట్టు చూపించిన ప్రాప్తి పోర్టల్ తన పొరపాటును సవరించింది. ఈ బకాయిలను ఇప్పటికే డిస్కమ్‌లు చెల్లించేశాయి. ఈ విషయాన్ని ప్రాప్తి పోర్టల్ దృష్టికి ఏపీ అధికారులు తీసుకెళ్లారు. దీంతో ఏపీలో విద్యుత్ కొనుగోలుకు సమస్య ఇక లేనట్టే.. ఎల్పీఎస్-2002 నిబంధనలను ఏపీ డిస్కమ్‌లు ఖచ్చితంగా పాటిస్తున్నాయి. ఆగష్టు 5న జనరేటర్లకు రూ.1407 కోట్లు డిస్కమ్‌లు చెల్లించాయి. ప్రస్తుతం నిబంధనల ప్రకారం డిస్కమ్‌లకు ఎలాంటి బకాయిలు లేవు. ఏపీ అధికారుల సమాచారాన్ని ప్రాప్తి పోర్టల్ అప్డేట్ చేసింది. చదవండి: చంద్రబాబు పాపం.. డిస్కంలకు శాపం విద్యుత్ మార్కెట్లకు స్వల్పకాలిక యాక్సెస్‌పై పరిమితి తొలగించినట్లు ఇంధన శాఖ కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. నిన్న అర్థరాత్రి నుండి యథాతథంగా విద్యుత్ ఎక్స్ఛేంజీలపై ట్రేడింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా 18న 211 మిలియన్ యూనిట్ల డిమాండ్‌ని డిస్కమ్‌లు రీచ్ అయినట్లు తెలిపారు. రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నామని విజయానంద్ పేర్కొన్నారు. -
‘థర్మల్’కు కళ్లెం!.. ఆ మేరకు కేంద్రం ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: థర్మల్ విద్యుత్ కేంద్రాల కనీస విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని మూడేళ్లలో 55 శాతం నుంచి 40 శాతానికి కుదించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. థర్మల్ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. విద్యుత్ కేంద్ర, రాష్ట్ర పరిధిలోని ఉమ్మడి అంశం. అంటే ఏ నిర్ణయమైనా రెండు ప్రభుత్వాల అంగీకారం మేరకు జరగాలి. కానీ కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, తమ అభ్యంతరాలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా విద్యుత్ రంగంలో తన నిర్ణయాలను అమలు చేయాల్సిందిగా బలవంతం చేస్తోందని తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. తన నిర్ణయాలను అమలు చేయని రాష్ట్రాలపై ఆర్థిక పరమైన ఆంక్షలు విధిస్తోందని మండిపడుతున్నాయి. 2025–26 నాటికల్లా.. కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) మార్గదర్శకాల ప్రకారం.. సాంకేతికంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల కనీస ఉత్పత్తి (టెక్నికల్ మినిమమ్) సామర్థ్యం 55 శాతం ఉండాలి. కానీ వచ్చే మూడేళ్లలో దీనిని 40 శాతానికి తగ్గించాలని, థర్మల్ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా సౌర, పవన తరహా పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. కేంద్ర, రాష్ట్రాల, ప్రైవేటు థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ద్వారా సుమారు 58,000 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ ఉత్పత్తిని తగ్గించి ఆ మేరకు పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడం సాధ్యమేనని కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు 2025–26 నాటికి థర్మల్ ఉత్పత్తిని తగ్గించాలని ఆదేశించింది. జెన్కో, సింగరేణి, ఎన్టీపీసీకి నష్టాలే.. రాష్ట్రంలో ఎన్టీపీసీ, సింగరేణి, రాష్ట్ర జెన్కోల యాజమాన్యంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు సాధారణంగా 70–85 శాతం వార్షిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) సామర్ధ్యంతో విద్యుదుత్పత్తి చేస్తాయి. స్థాపిత సామర్థ్యంతో పోల్చితే వాస్తవిక ఉత్పత్తి శాతాన్ని పీఎల్ఎఫ్ అంటారు. ఉదాహరణకు..100 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ సగటున 80 మెగావాట్ల సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తే 80 శాతం పీఎల్ఎఫ్ సాధించిందని సాంకేతిక పరిభాషలో చెబుతారు. కాగా సాధ్యమైనంత అధిక పీఎల్‌ఎఫ్‌తో విద్యుదుత్పత్తి చేస్తేనే జెన్కో, ఎన్టీపీసీ, సింగరేణి వంటి సంస్థలు లాభాలు ఆర్జించగలుగుతాయి. ఈ విధంగా అధిక పీఎల్‌ఎఫ్‌తో ఉత్పత్తి చేసినందుకు గతంలో కేంద్ర ఇంధన శాఖ నుంచి సింగరేణి థర్మల్ ప్లాంట్ పురస్కారాలను సైతం అందుకుంది. ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం కనీస ఉత్పత్తి సామరŠాధ్యన్ని తగ్గించాలని ఆదేశించడం గమనార్హం. కాగా కేంద్రం నిబంధనలను అమలు చేస్తే నష్టాలు తప్పవని జెన్కో, సింగరేణి వంటి సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలపై ఫిక్స్డ్ చార్జీల మోత? విద్యుదుత్పత్తి సంస్థలకే కాదు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లతో పాటు వినియోగదారులకు సైతం కేంద్ర ప్రభుత్వ నిబంధనలు భారంగా మారబోతున్నాయి. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల కనీస జీవిత కాలం 25 ఏళ్లు. పెట్టుబడి రుణాలతో కలిపి వీటి మొత్తం నిర్మాణ వ్యయాన్ని 25 ఏళ్ల కాలంలో రాబట్టుకునేందుకు వీలుగా వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌కు సంబంధించిన స్థిర చార్జీలు (ఫిక్స్డ్ కాస్ట్) నిర్ణయిస్తారు. మొత్తం వ్యయాన్ని ఈ 25 ఏళ్ల గడువులోగా రాబట్టుకోవడానికి వీలుగా జెన్కో, ఎన్టీపీసీ, సింగరేణి వంటి ఉత్పత్తి కంపెనీలు డిస్కంలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకుంటాయి. సాధారణంగా 85 శాతం పీఎల్‌ఎఫ్‌ను ప్రామాణికంగా తీసుకుని ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్‌పై స్థిర చార్జీలను లెక్కిస్తారు. ఈ విధంగా ఒక్కో యూనిట్ థర్మల్ విద్యుత్ స్థిర వ్యయం రూ.2–3 వరకు అవుతోంది. ఇప్పుడు కేంద్ర ఆదేశాల మేరకు కనీస పీఎల్‌ఎఫ్‌ను 40 శాతానికి తగ్గిస్తే.. విద్యుత్ స్థిర చార్జీలు రెట్టింపవుతాయని ,ఇవి వినియోగదారుల నుంచే వసూలు చేస్తారు కాబట్టి భవిష్యత్తులో విద్యుత్ బిల్లులు భారీగా పెరిగిపోక తప్పదని విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్నారు. బొగ్గు వినియోగం ప్రశ్నార్ధకం రాష్ట్రంలో బొగ్గు నిల్వలు అపారంగా ఉన్నాయి. రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గు పూర్తిగా సింగరేణే సమకూరుస్తోంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. ఇక్కడ వేరియబుల్ కాస్ట్ (విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే ముడిసరుకులకు అయ్యే వ్యయం) కూడా కాస్త తక్కువే. కేంద్రం తాజా నిర్ణయంతో ఈ బొగ్గు వినియోగం కూడా ప్రశ్నార్ధకంగా మారుతుందని అంటున్నారు. తగ్గనున్న ప్లాంట్ల జీవిత కాలం... కొత్త విధానం ప్లాంట్ల జీవిత కాలాన్ని కుదిస్తుందన్న అభిప్రాయాన్ని కూడా విద్యుత్ రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. తక్కువ సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసే విధానం వల్ల థర్మల్ ప్లాంట్ల యంత్రాల పనితీరు సామర్థ్యం గణనీయంగా తగ్గుతుందని అంటున్నారు. తెలంగాణ జెన్కో ప్రస్తుతం 4042 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లను కలిగి ఉంది. వచ్చే ఏడాది, రెండేళ్లలో మరో 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. రామగుండంలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న మరో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం మరో కొన్ని నెలల్లో అందుబాటులోకి రానుంది. వీటిద్వారా రాష్ట్రం మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతుందన్న ధీమాతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ పరిస్థితుల్లో కనీస ఉత్పత్తి సామరŠాధ్యన్ని 40 శాతానికి కుదించడం ప్రస్తుత ప్లాంట్లతో పాటు కొత్త ప్లాంట్ల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొంటున్నారు. సంప్రదాయేతర విద్యుత్ మేలు: కేంద్రం థర్మల్ విద్యుత్‌తో పోల్చితే పునరుత్పాదక విద్యుత్ తక్కువ ధరలకు లభిస్తోందని కేంద్రం పేర్కొంటోంది. కాలుష్య కారకమైన థర్మల్ స్టేషన్ల కంటే సంప్రదాయేతర విద్యుత్ మేలని చెబుతోంది. అయితే ఇప్పటికే భారీ వ్యయంతో నిర్మించిన విద్యుత్ ప్లాంట్లు, కొత్తగా ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమవుతున్న ప్లాంట్ల పరిస్థితేంటని రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి. 2020–21లో జెన్కో 72.35 శాతం సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేసింది. గత ఐదేళ్లుగా 72–80 శాతం సామర్థ్యంతో ఉత్పత్తి సాధిస్తోంది. అయితే థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో కోతపెట్టైనా సరే థర్మల్ విద్యుదుత్పత్తిని తగ్గించాలని కేంద్రం పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వల్ల..సంప్రదాయేతర ఇంధన విద్యుత్ సామర్థ్యం ప్రస్తుతం ఉన్నదానికి అదనంగా 30 వేల మెగావాట్లు పెంచాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. -
‘యాదాద్రి ప్లాంట్’ను గడువులోగా పూర్తిచేయాలి
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనుల్లో జాప్యంపై జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని బీహెచ్ఈఎల్ ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. 4,000 మెగావాట్ల యాదాద్రి విద్యుత్ ప్లాంట్ పనులపై శుక్రవారం ఆయన బీహెచ్ఈఎల్ డైరెక్టర్ ఉపేందర్ సింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిలింద్ కోపికర్తో సమీక్ష నిర్వహించారు. కూలింగ్ టవర్లు, కోల్/యాష్ ప్లాంట్ల పనులు నత్తనడకన జరుగుతున్నాయని, వేగం పెంచాలని కోరారు. అలాగే అన్ని యూనిట్లలో పనులు నిరంతరాయంగా జరగాలని, గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కాగా, వచ్చే ఏడాది జూన్ నాటికి యాదాద్రి కేంద్రంలోని రెండు యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభించడంతో పాటు మూడో యూనిట్ సింక్రనైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయనకు బీహెచ్ఈఎల్ డైరెక్టర్ హామీ ఇచ్చారు. -
వారానికోసారి కట్టించేసుకోండి
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.లక్ష కోట్లకు పైగా బకాయి పడ్డ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. జెన్కోలకు ఊరట కలిగేలా డిస్కంల నుంచి వారం వారం పేమెంట్లను స్వీకరించాలని సూచించింది. అయితే ఈ నిర్ణయంతో ఇప్పటికే భారీ రుణభారంతో కష్టనష్టాల్లో ఉన్న డిస్కంలపై మూలిగేనక్కపై తాటిపండు పడ్డట్లేనని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. జెన్కోలకు పెరిగిన ఖర్చులు.. దేశవ్యాప్తంగా నెలకొన్న బొగ్గు సంక్షోభం కారణంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు తగినంత బొగ్గు సరఫరా లేదు. దానికి తోడు బహిరంగ మార్కెట్ (పవర్ ఎక్సే్ఛంజీ)లో విద్యుత్ ధరలు భారీగా పెరిగాయి. కొంతకాలం క్రితం వరకు పీక్ అవర్స్‌లో యూనిట్ ధర రూ.20 వరకు వెచ్చించాల్సి వచ్చేది. ఇది చాలదన్నట్లు దేశీయ బొగ్గులో 10 శాతం విదేశీ దిగుమతి బొగ్గును కలిపి వాడాలని, విదేశీ బొగ్గు సరఫరా ఈ నెల నుంచే మొదలవ్వాలని కేంద్రం నిబంధన విధించింది. ఒకప్పుడు టన్ను బొగ్గు రూ.4వేల నుంచి రూ.7 వేలు ఉండేది. కానీ ఇప్పుడది రూ.19 వేల నుంచి రూ.24 వేలకు పెరిగింది. ఇంత ఖర్చవుతున్నా డిస్కంల నుంచి వస్తున్నది మాత్రం ఆ మేరకు ఉండడం లేదు. దీంతో వారం వారం బిల్లులు వసూలు చేస్తే, విద్యుత్ ఉత్పత్తి ఖర్చులకు వాడుకోవచ్చనేది కేంద్రం భావన. డిస్కంలకు భారమే..అయినా.. కేంద్రం చెప్పిన దాని ప్రకారం..డిస్కంలు విద్యుత్ ఉత్పత్తిదారులకు ప్రొవిజనల్ బిల్లులో కనీసం 15 శాతం ఒక వారంలోగా చెల్లించాలి. ఒకవేళ అలా జరగకపోతే విద్యుత్ జెన్కోలు వారి ఉత్పత్తిలో 15 శాతాన్ని పవర్ ఎక్సే్ఛంజీలకు విక్రయించుకోవచ్చు. పవర్ ప్లాంట్లు సాధారణంగా డిస్కంలతో దీర్ఘకాల (లాంగ్ టెర్మ్) అగ్రిమెంట్ల చేసుకుంటాయి. ఫిక్స్డ్ రేట్లనే కొనసాగిస్తుంటాయి. అయితే దిగుమతుల వల్ల వ్యయాలు పెరిగితే ఆ భారాన్ని డిస్కంలకు బ దిలీ చేయొచ్చు. ఈ లెక్కన విద్యుత్ పంపిణీ సంస్థలపై మరింత ఎక్కువ భారం పడనుంది. నిజానికి రుణభారం వల్ల డిస్కంల నుంచి విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు సరైన సమయంలో చెల్లింపులు జరిగే పరిస్థితి లేదు. ఒకవేళ డిస్కంలు సరైన సమయానికి బిల్లులు చెల్లిస్తే మాత్రం విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు ఊరట కలుగుతుంది. అలాగే డిస్కంలకు కూడా ఊరట కలిగించేలా ఇటీవల కేంద్రం రుణ బకాయిలను 48 నెలల ఇన్స్టాల్మెంట్లలో చెల్లించే వెసులుబాటు కల్పించింది. -
విద్యుత్ సంస్థల్లో బదిలీలు షురూ
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల్లో బదిలీల పర్వం మొదలైంది. ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్కోలలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు ఎండీ బీ శ్రీధర్ శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేశారు. వీటితో ప్రమేయం లేకుండా ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు కే సంతోషరావు, జే పద్మాజనార్థనరెడ్డి, హెచ్ హరనాథరావు కూడా వేర్వేరుగా బదిలీ మార్గదర్శకాలు వెల్లడించారు. వీటి ప్రకారం నేటి (4వ తేదీ) నుంచి బదిలీ ప్రక్రియ మొదలుకానుంది. బదిలీలకు అర్హులైన వారి పేర్ల జాబితాను సంబంధిత కార్యాలయాల్లో శనివారం ప్రదర్శిస్తారు. దీంతో మొత్తం ఎంతమందికి బదిలీలు జరుగుతాయనేది స్పష్టంకానుంది. అందులో ఉన్నవారు డిస్కంల ఉద్యోగులైతే ఈ నెల 9లోగా.. జెన్కో, ట్రాన్స్‌కో ఉద్యోగులైతే ఈ నెల 10లోగా తమ అభ్యర్థనలను సమర్పించాలి. డిస్కంలలో బదిలీలు ఈ నెల 15కల్లా పూర్తికానుండగా, 16కల్లా జెన్కో, ట్రాన్స్‌కోలో చేస్తారు. అయితే, ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు ఈ నెల 23 వరకు గడువిచ్చారు. ట్రాన్స్‌కో, జెన్కోలో మార్గదర్శకాలిలా.. ప్రస్తుత పోస్టులో ఏప్రిల్ 30 నాటికి మూడేళ్ల పనికాలం పూర్తిచేసుకున్న వారు బదిలీకి అర్హులు. అయితే.. ఇదే తేదీకి విద్యుదుత్పత్తి కేంద్రం, కార్పొరేట్ కార్యాలయంలో ఐదేళ్లు పనిచేసిన వారిని బదిలీ చేస్తారు. ఇందులోని మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం మందికి మాత్రమే సీనియారిటీ ప్రకారం బదిలీ జరుగుతుంది. రెండేళ్లు పూర్తిచేసుకున్న వారు తీవ్ర అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలపై సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించి బదిలీ కోరుకోవచ్చు లేదా నిలుపుకోవచ్చు. పరస్పర బదిలీ కావాలనుకునే వారు కనీసం ఏడాది పాటు ఒకేచోట పనిచేసి ఉండాలి. రెండేళ్లు పూర్తిచేసుకున్న వారు ‘రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్’ సౌకర్యాన్ని ఇప్పుడు ఉపయోగించుకుంటే మళ్లీ ఎనిమిదేళ్లకే అర్హులవుతారు. ఏసీబీ, విజిలెన్స్ కేసుల్లో ఉన్నవారు బదిలీలకు అనర్హులు డిస్కంలలో నిబంధనలు ఇలా.. ప్రస్తుత ప్రాంతంలో ఐదేళ్లు, ఒకే పోస్టులో మూడేళ్లు పనిచేసిన వారు బదిలీకి అర్హులు. మొత్తం అర్హుల్లో 100 శాతం మందికి బదిలీ జరుగుతుంది. తీవ్ర అనారోగ్య సమస్యలు, భార్యాభర్తలు బదిలీల నుంచి మినహాయింపు పొందవచ్చు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి రిటైరయ్యే వారిని బదిలీ చేయరు. రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పొందాలంటే రెండేళ్లు, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కోరాలంటే ఏడాదిపాటు ఒకేచోట పనిచేసి ఉండాలి. జనరల్ ట్రాన్స్ఫర్స్ పూర్తయిన తరువాత ఖాళీలను బట్టి అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటారు. ఒకే ఊర్లో సుదీర్ఘకాలం కుదరదు.. విద్యుత్ సంస్థల్లో గతంలో ఒకే ఊరిలో సెక్షన్, డివిజన్ కార్యాలయాలకు బదిలీ అయ్యేవారు. పోస్టులోకి వచ్చి ఎన్నేళ్లు అయ్యిందనే దానిని బట్టి బదిలీ జరిగేది. కానీ, ఇప్పుడలా కుదరదు. ఒక ఊరిలో ఎన్నేళ్లు ఉన్నారనే దానినే తప్ప పోస్టులోకి వచ్చింది లెక్కలోకి తీసుకోరు. దీనివల్ల ఒకే ఊరిలో పదేళ్లు, ఇరవై ఏళ్లు సర్వీసుచేసే అవకాశం ఉండదు. ఈ నిబంధన నుంచి యూనియన్ల నాయకులతో సహా ఎవరికీ మినహాయింపులేదు. డిస్కంలలో బదిలీ పరిధిలోకి వచ్చే వారిలో 20 శాతం మందిని మాత్రమే గతంలో బదిలీ చేసేవారు. కానీ, ఇప్పుడు ఎంతమందికి అర్హత ఉంటే అంతమందినీ బదిలీ చేయనున్నారు. దీనివల్ల గిరిజన ప్రాంతాల్లోనూ, మారుమూల గ్రామాల్లోనూ మగ్గిపోతున్న వారికి ఇతర ప్రాంతాలకు వెళ్లే వెసులుబాటు కలుగుతుంది. పరస్పర ఆమోదంతో బదిలీ కోరుకోవాలంటే పట్టణం నుంచి గ్రామానికి, లేదా గ్రామం నుంచి పట్టణానికి అనుమతిస్తారు. -
విద్యుత్ ఉద్యోగులూ.. ఆందోళనొద్దు
సాక్షి, అమరావతి: ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలలో ఉద్యోగుల జీతాలు తగ్గనున్నాయనే ప్రచారాన్ని విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు కొట్టిపడేశారు. విద్యుత్ ఉద్యోగులకు పే రివిజన్ కమిటీ(పీఆర్సీ) వేశాక జీతాలు తగ్గిస్తారనేది కేవలం అపోహ మాత్రమేనని వారు స్పష్టం చేశారు. ట్రాన్స్‌కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్, జెన్కో ఎండీ శ్రీథర్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మాజనార్దనరెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్.హరనాథరావు, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావులతో పాటు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం వివరాలను సీఎండీలు, జేఏసీ నేతలు ‘సాక్షి’కి వివరించారు. పీఆర్సీ వచ్చే వరకూ ఇవే జీతాలు.. విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులు అనవసర భయాలతో వీఆర్ఎస్ తీసుకోవాల్సిన అవసరం లేదని సీఎండీలు తెలిపారు. పీఆర్సీ వచ్చే వరకూ ఇవే జీతాలు కొనసాగుతాయని, ఆ కమిటీ అధ్యయనం తర్వాత తన నివేదికను ప్రభుత్వానికి ఇస్తుందని, ఆపై ప్రభుత్వ నిర్ణయం మేరకు జీతాలుంటాయని వారు వెల్లడించారు. అలాగే కొత్తగా తీసుకొస్తున్న సర్వీస్ రెగ్యులేషన్స్ వల్ల కూడా జీతాలు తగ్గుతాయనే అనుమానాలున్నాయని, అది పూర్తిగా అవాస్తవమన్నారు. రెగ్యులేషన్స్ ఎప్పుడు అమల్లోకొస్తే ఆ రోజు నుంచి నియమితులైన ఉద్యోగులకే ఆ నిబంధనలు వర్తిస్తాయని, అవి రావడానికి ముందు ఉన్న ఉద్యోగులెవరికీ వాటి వల్ల ఎలాంటి ఇబ్బందులుండవన్నారు. సెక్షన్ 79సీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లయి యాక్ట్ 1948 ప్రకా>రం 1967లో రెగ్యులేషన్స్ రూపొందించారని, ఆపై దాని స్థానంలో ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 వచ్చిందన్నారు. దీనివల్ల పాతది వాడుకునేందుకు వీల్లేదని, ఒక బోర్డు రెగ్యులేషన్లను మరో బోర్డు మార్చేందుకూ అవకాశం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్తగా రెగ్యులేషన్స్ రూపొందిస్తున్నారని వివరించారు. కేసులను ఎత్తివేస్తామన్నారు.. ఉద్యోగుల సంక్షేమమే తమకు తొలి ప్రాధాన్యమని బాలినేని, సజ్జల స్పష్టం చేసినట్టు ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలపై ఉన్న దాదాపు 32 కేసులను తక్షణమే ఎత్తివేస్తామని వారు హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. డీఏ, ఇతర అంశాలపై చర్చించేందుకు వారంలో మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారని చంద్రశేఖర్ వివరించారు. మీటర్ రీడర్లకు పీస్ రేటు(విద్యుత్ బిల్లులపై ఇచ్చే కమీషన్)ను త్వరలో పెంచేందుకు చర్యలు చేపడతామని బాలినేని, సజ్జల హామీ ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్ల రాష్ట్ర కార్యాచరణ కమిటీ(జేఏసీ) గౌరవాధ్యక్షుడు బాలకాశి, యూనియన్ నేతలు తెలిపారు. సచివాలయంలో వారిని కలిసి తమ సమస్యలను విన్నవించగా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. మూడు కంపెనీల సీఎండీలు చర్చించి రేటుపై నిర్ణయం తీసుకోవాలని బాలినేని, సజ్జల ఆదేశించినట్టు జేఏసీ నేతలు చెప్పారు. డిస్కంల పరిధిలో ఉన్న దాదాపు 4,600 మంది రీడర్లకు డిస్కం పరిధిలోనే ఇతర ఉపాధి అవకాశాలు కల్పించే అంశాన్ని కూడా పరిశీలించాల్సిందిగా సీఎండీలకు వారు సూచించినట్టు వివరించారు. -
విద్యుత్ ఉద్యోగులకు టీకాలు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 మహమ్మారి కాలంలో సైతం నిరంతర విద్యుత్ సరఫరా కోసం క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్న ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) విభాగాల ఉద్యోగులు, ఆర్టిజన్లను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించి త్వరితంగా వ్యాక్సినేషన్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను నిర్దేశించారు. ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి విద్యుత్ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ నిర్వహించాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల్లో 30 వేల మంది ఉద్యోగులు, 22 వేల మంది ఆర్టిజన్లు కలిపి మొత్తం 52 వేల మంది ఉన్నారు. పార్ట్‌టైమ్ ఉద్యోగులైన మీటర్ రీడర్లను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య 55 వేలు అవుతుంది. ముఖ్యమంత్రి సూచనల మేరకు ఓఅండ్ఎం ఉద్యోగులు, ఆర్టిజన్లు కలిపి 40 వేల మందికి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా వ్యాక్సినేషన్ నిర్వహించనున్నారు. మిగిలిన విద్యుత్ ఉద్యోగుల వ్యాక్సినేషన్‌కు విద్యుత్ సంస్థలే ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో ఇతర విభాగాల విద్యుత్ ఉద్యోగుల టీకా ఖర్చులను విద్యుత్ సంస్థలే భరించనున్నాయి. ఐదారు రోజుల్లో వ్యాక్సినేషన్: ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు కరోనా బారినపడిన విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లకు ఎంత ఖర్చయినా భరించి కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తున్నామని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. ఐదారు రోజుల్లో విద్యుత్ ఉద్యోగుల వ్యాక్సినేషన్‌ను ప్రారంభించే అవకాశముందని చెప్పారు. -
వరద ప్రాంతాల్లో వంద శాతం విద్యుత్ పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న ఫీడర్ల పరిధిలో వంద శాతం విద్యుత్ పునరుద్ధరణ జరిగినట్టు విద్యుత్ ఉన్నతాధికారులు తెలిపారు. ఉభయగోదావరి జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతోందని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) సీఎండీ నాగలక్ష్మి చెప్పారు. ఇంత త్వరగా విద్యుత్ సరఫరా చేయడం రికార్డు అని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో రెండు రోజులుగా విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. ఈ నెల 13న 134 మిలియన్ యూనిట్ల వాడకం ఉంటే... 15న 150.9 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. అంటే రెండు రోజుల్లోనే 16 ఎంయూలు పెరిగింది. రానురాను ఇంకా డిమాండ్ పెరగొచ్చని డిస్కమ్‌ల సీఎండీలు హరినాథ్‌రావు, నాగలక్ష్మి, పద్మా జనార్దన్‌రెడ్డి నివేదిక పంపారు. జెన్కో అలెర్ట్ డిస్కమ్‌లు ఇచ్చిన క్షేత్రస్థాయి నివేదికపై లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) రాబోయే పరిస్థితిని అంచనా వేసింది. ఈ నెలాఖరుకు రోజుకు 160 ఎంయూల విద్యుత్ డిమాండ్ ఉండే వీలుందని లెక్కగట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రస్తుతం 800 మెగావాట్ల సామర్థ్యం గల ఒక యూనిట్ పనిచేస్తోంది. మరో యూనిట్‌ను ఉత్పత్తిలోకి తేవడానికి అవసరమైన బొగ్గు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మహానది కోల్ ఫీల్డ్స్ (ఎంసీఎల్)తో అధికారులు చర్చించారు. -
పండుగ ప్రోత్సాహకాలు ఇవ్వలేం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లోని ఉద్యోగులకు ఈ ఏడాది దసరా పండుగ ప్రోత్సాహకాలు ఇవ్వలేమని జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎంఏ వజీర్, ప్రాంతీయ అధ్యక్షుడు తఖీ, ఉపాధ్యక్షుడు వి.దానయ్య శుక్రవారం విద్యుత్ సౌధలో ప్రభాకర్‌రావును కలిసి పండుగ ప్రోత్సాహకాలు అందజేయాలని వినతిపత్రం సమర్పించారు. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో సంస్థకు భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని, ఈ ఏడాది పండుగ ప్రోత్సాహకాలు అందజేయలేమని ప్రభాకర్‌రావు వారికి వివరించారు. ప్రతి ఏటా దసరా సందర్భంగా జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు మూలవేతనంపై 7–15 శాతం వరకు ప్రోత్సాహకాలు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. సంస్థ ఆర్థిక పరిస్థితిరీత్యా గతేడాది నుంచి ప్రోత్సాహకాలను నిలిపివేశారు. -
శ్రీశైలం ప్రమాదం : రాత్రంతా ప్రయత్నించాం కానీ..
సాక్షి, హైదరాబాద్ : శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో చోటుచుకున్న ప్రమాదం చాలా దురదృష్టకరమని ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఏడుగురు ఇంజనీర్లుతో పాటు ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని, తాము ఎంతో చింతిస్తున్నామని అన్నారు. సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే అక్కడకు చేరుకున్నామని, సిబ్బందిని కాపాడడం కోసం అనేక ప్రయత్నాలు చేశామని తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రితో కలిసి ఆ రోజు రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించామని కానీ తమ వల్లకాలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ప్రభాకర్‌రావు ప్రమాద వివరాలను వెల్లడించారు. ‘ప్రమాదం అనంతరం విద్యుత్ కేంద్రంలో కరెంట్ పోయింది. దీనితో లోపల అంధకారమయ్యింది. పొగతో ఆక్సిజన్ లభించలేదు. పొగను బయటకు పంపించేందుకు చాలా కష్టపడ్డాం. అయినా దురదృష్టవశాత్తు వారు చనిపోయారు. విద్యుత్ కేంద్రలో ప్రమాదం జరిగితే వెంటనే ఆటోమేటిక్ ట్రిప్ కావాలి. కానీ కాలేదు ఎందుకు ట్రిప్ కాలేదు అనేదానిపై కమిటీ వేశాం. ఇలాంటి సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. పవర్ పోవడంతో వెంటిలేషన్ ఆగిపోయింది, దీనితో ఎమర్జెన్సీ వే కూడా తెరుచుకోలేదు. గత 30 రోజుల నుండి చాలా చక్కగా జరుగుతున్నాయి. రోజుకు 128 మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి జరిగింది గతంలో కూడా ఎన్టీపీసీ లో బాయిలర్ బ్లాస్ట్ అయింది. ఆ ప్రమాదంలో దాదాపు 30 చనిపోయారు. తమిళనాడులో కూడా గతంలో ఇలాంటి సంఘటన జరిగింది. దురదృష్టవశాత్తు మన దగ్గర కూడా జరిగింది దీనిపై కమిటీ వేశామ్. కమిటీ త్వరలోనే నివేదిక ఇస్తారు.ప్రభుత్వం నుండి ఇప్పటికే వాళ్లకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాం. బాధితుల కుటుంబాలకు అండగా ఉంటాం. త్వరలోనే వాళ్ళ కుటుంబాలకు జెన్కో నుంచీ సహాయం అందజేస్తాం. ఇలాంటి సంఘటనలు జరిగిన రాష్ట్రాల్లో ఇంత మొత్తంలో ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదు’అని పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై త్వరలోనే కమిటీ పూర్తి నివేదికను అందిస్తుందని ప్రభాకర్‌రావు తెలిపారు. కాగా మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. -
శ్రీశైలం పవర్ హౌస్‌లోకి రెస్క్యూ టీమ్
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమ జల విద్యుత్ ఉత్పతి కేంద్రంలో చిక్కుకుపోయిన తొమ్మిదిమంది జెన్కో ఉద్యోగులను రక్షించేందుకు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పొగతో పాటు మంటలు అదుపులోకి రాకపోవడంతో గత రాత్రి సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. దీంతో విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. సీఐఎస్ఎఫ్ కమాండెంట్ సిద్ధార్థ రెహ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. అధునాతన పరికరాలతో పవర్ హౌస్‌లోకి వెళ్లిన 35మంది సీఐఎస్ఎఫ్ సభ్యుల బృందం సహాయక చర్యలు మొదలుపెట్టింది. మరోవైపు అదనపు డీజీ సీవీ ఆనంద్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ డీజీపీ విజ్ఞప్తితో సీఐఎస్ఎఫ్ ప్రత్యేక బృందాన్ని పంపింది. ఇవాళ మధ్యాహ్నానికి పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. (చదవండి: జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..) మంటల్లో చిక్కుకున్నవారి వివరాలు 1.DE శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ 2.AE వెంకట్రావు, పాల్వంచ 3.AE మోహన్ కుమార్, హైదరాబాద్ 4.AE ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్ 5.AE సుందర్, సూర్యాపేట 6. ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, ఖమ్మం జిల్లా 7. జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్, పాల్వంచ 8,9 హైదరాబాద్‌కు చెందినా అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్ (చదవండి: గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు) ఏపీ గవర్నర్ దిగ్భ్రాంతి శ్రీశైలం ప్రాజెక్ట్ ఎడమ గట్టు భూగర్భ జల విధ్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూగర్భ జల విధ్యుత్ కేంద్రంలో చిక్కుకున్న తొమ్మిది మంది ఉద్యోగులు క్షేమంగా బయటకు వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రమాద స్థలం వద్ద ఏపీ ఎమ్మెల్యేలు పలువురు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు ప్రమాదం జరిగిన శ్రీశైలం ప్రాజెక్ట్ ఎడమ గట్టు భూగర్భ జల విధ్యుత్ కేంద్రం వద్దకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ను పరిశీలించారు. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. లోపల చిక్కుకుపోయిన 9 మంది క్షేమంగా తిరిగిరావాలని ఆకాక్షించారు. -
జెన్కో ఇంజనీర్ అనుమానాస్పద మృతి
సాక్షి, రాజమండ్రి: జెన్కో ఇంజనీర్ శ్రీనివాస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం స్థానికంగా కలకలం రేపింది. సీలేరులో ఒంటరిగా హోం క్వారంటైన్లో ఉన్న శ్రీనివాస్ అకస్మాత్తుగా తన ఇంట్లో శవమై కనిపించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కాగా గత మూడు రోజులుగా ఫోన్ చేస్తుంటే తన కాల్స్‌కు సమాధానం ఇవ్వకపోవడంతో మృతుడి భార్య పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోస్టుమార్టం రిపోర్ట్స్ రావాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. -
‘కాళేశ్వరా’నికి చౌకగా కరెంట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి 1,500 మెగావాట్ల సౌర విద్యుత్‌ను యూనిట్‌కు రూ.3 లోపు తక్కువ ధరతో విక్రయించేందుకు జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం గోవాలో ఎన్టీపీసీ నిర్వహించిన దక్షిణాది ప్రాంత వినియోగదారుల సమావేశానికి ప్రభాకర్‌రావు హాజరై ఆ సంస్థ సీఎండీ గురుదీప్ సింగ్‌తో చర్చలు జరిపా రు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణ కోసం వచ్చే ఏడాది విద్యుత్ అవసరాలు భారీగా పెరగనున్నాయని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రానికి అదనపు విద్యుత్ సరఫరా చేయాలని ఈ సమావేశంలో గురుదీప్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన యూనిట్‌కు రూ.3 లోపే ధరతో 1,500 మెగావాట్ల సౌర విద్యు త్ విక్రయించేందుకు అంగీకరించారని తెలిపారు. రాష్ట్రంలో భారీగా జరుగుతున్న పునరుత్పాదక విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపుతుండటంతో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదనను తగ్గించేందుకు బ్యాకింగ్ డౌన్ చేయాల్సి వస్తుందని, ఇలాంటి పరిస్థితులతో సూపర్ క్రిటికల్, సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్ల మధ్య పెద్దగా బేధం లేకుండా పోయిందని ఈ సమావేశంలో సీఎండీ అభిప్రాయపడ్డారన్నారు. -
పాల్వంచలో మరో విద్యుత్ ప్లాంట్ !
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లో మరో విద్యుత్ ప్లాంట్ నిర్మించడంపై జెన్కో యాజమాన్యం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన సూపర్ క్రిటికల్ ఆల్ట్రా యూనిట్స్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై గురువారం సర్వే చేపట్టారు. 1966 –78 మధ్య కాలంలో నిర్మించిన కేటీపీఎస్ ఓఅండ్ఎం(720 మెగావాట్ల) ప్లాంట్లలో ఈ ఏడాది డిసెంబర్ 31తో ఉత్పత్తి ఆపేయాల్సి ఉంది. అనంతరం కర్మాగారాన్ని నేలమట్టం చేస్తారు. అయితే ఇక్కడి భౌగోళిక వనరులను ఉపయోగించి ఓఅండ్ఎం కర్మాగారం స్థానంలో మరో ప్లాంట్ నిర్మించే అంశంపై బీహెచ్ఈఎల్, జెన్కో సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సర్వే చేశారు. మూసివేత అనంతరం నేల మట్టం చేయకుండా భవిష్యత్ ప్లాంట్‌కు ఉపయోగకరంగా పనిచేసే నిర్మాణాలను పరిశీలించారు. ముఖ్యంగా కూలింగ్ టవర్ల స్థితిగతులపై అధ్యయనం చేశారు. అయితే, సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ కంటే మెరుగైన టెక్నాలజీతో ప్లాంట్ రూపుదిద్దుకోవడానికి ఇక్కడ భూమితో పాటు బొగ్గు, నీటి వసతులు పుష్కలంగా ఉన్నాయని సర్వే బృందం గుర్తించింది. దీని వల్ల అతి తక్కువ మోతాదులో మాత్రమే కాలుష్యం వెలువడుతుందని చెబుతున్నారు. కొత్త టెక్నాలజీతో నిర్మించే సూపర్ క్రిటికల్ ఆల్ట్రా యూనిట్లను భారత దేశంలోనే మొదటిసారిగా పాల్వంచలో ఏర్పాటు చేయాలని యోచిస్తుండటం విశేషం. ఇప్పటివరకూ యూనిట్లకు మరమ్మతులు వస్తే.. చాలా రోజుల పాటు రాష్ట్ర గ్రిడ్‌కు ఉత్పత్తి నిలిచిపోయేది. అయితే ఆల్ట్రా యూనిట్లకు మరమ్మతులు తక్కువని, ఒకవేళ వచ్చినా చేయడం సులువని అధికారులు చెబుతున్నారు. -
జెన్కోలో మరోసారి రివర్స్ టెండరింగ్
సాక్షి, అమరావతి: రివర్స్ టెండరింగ్‌లో ఏపీ జెన్కో మరో రికార్డు నమోదు చేసింది. బొగ్గు రవాణాలో కీలక పాత్ర పోషించే సూపర్ విజన్ కాంట్రాక్టులో రూ.23.30 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేయగలిగింది. జెన్కో రివర్స్ టెండరింగ్ చేపట్టడం ఈ నెలలో ఇది రెండోది. ఇటీవల ఒడిశాలోని తాల్చేరు నుంచి మహానది కోల్ ఫీల్డ్స్ (ఎంసీఎల్) బొగ్గు చేరవేత కాంట్రాక్టులో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.164 కోట్లు మిగిల్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే రీతిలో సింగరేణి బొగ్గు రవాణా సూపర్ విజన్ కాంట్రాక్టులో సైతం విజయం సాధించింది. తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి నుంచి ఏటా 90 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అందుతుంది. దీన్ని కడపలోని ఆర్టీపీపీ, విజయవాడలోని ఎన్టీటీపీఎస్ ధర్మల్ విద్యుత్ కేంద్రాలకు చేరవేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో బొగ్గు లోడింగ్, రవాణా సమాచారం, తూకం, పరీక్ష కోసం శాంపుల్స్ కలెక్షన్, రైల్వే వ్యాగన్ల ద్వారా వేగంగా ముందుకెళ్లేందుకు ఓ సంస్థను పర్యవేక్షణ కింద తీసుకుంటారు. ఇ–ప్రొక్యూర్మెంట్ ద్వారా పిలిచిన ఈ కాంట్రాక్టుకు టెండర్లు దాఖలు చేసిన వారిలో ఆరు కంపెనీలు మాత్రం అన్ని అర్హతలు సంపాదించాయి. ఇందులో కరమ్‌చంద్ తాపర్ అండ్ బ్రాస్కోల్ సేల్స్ లిమిటెడ్, ఏకెఏ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, లోక్‌నాథ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆనంద్ ట్రాన్స్పోర్ట్స్, నాయర్ కోల్ సర్వీస్ లిమిటెడ్, బీఎస్ఎన్ జోషి కంపెనీలున్నాయి. ఎన్టీటీపీఎస్కు టన్నుకు రూ.32 చొప్పున, ఆర్టీపీపీకి టన్నుకు రూ.34 చొప్పున కోట్ చేసిన నాయర్ కోల్ సర్వీసెస్ ఎల్–1గా నిలిచింది. ఎల్–1 ధరతో రివర్స్ టెండరింగ్ చేపట్టడంతో ఇదే సంస్థ ఎన్టీటీపీఎస్కు టన్నుకు రూ.17.50, ఆర్టీపీపీకి టన్నుకు రూ.23తో సరఫరా చేస్తామని దిగి వచ్చింది. ఈ లెక్కన విజయవాడ థర్మల్ కేంద్రానికి వచ్చే బొగ్గు సూపర్ విజన్ చార్జీలు టన్నుకు రూ.14.50 చొప్పున, లక్ష టన్నులకు రెండేళ్ల కాంట్రాక్టు కాలానికి రూ.14.50 కోట్లు ఆదా అయింది. అదే విధంగా ఆర్టీపీపీలో టన్నుకు రూ.11 చొప్పున 80 లక్షల టన్నులకు రెండేళ్లల్లో రూ.8.80 కోట్లు తగ్గాయి. రెండింట్లో కలిపి మొత్తం రూ.23.30 కోట్ల ప్రజాధనం రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా అయింది. పోటీ బాగా పెరుగుతోంది.. జెన్కో కాంట్రాక్టుల్లో పోటీ పెరుగుతోంది. ఎక్కువ మంది పాల్గొనేలా నిబంధనలను సరళతరం చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల తక్కువ లాభాలతో పనులు చేసే వాతావరణం ఏర్పడుతుంది. ఫలితంగా జెన్కోకు ప్రయోజనం కలుగుతోంది. ఎంసీఎల్ బొగ్గు రవాణా విషయంలోనూ ముందుకొచ్చే ప్రతి ఒక్కరికీ సరిపడా అర్హత ఉండేలా చూశాం. ఇప్పుడు సూపర్ విజన్‌కు కావాల్సిన వాస్తవ అర్హతలే పొందుపరిచాం. రివర్స్ టెండరింగ్‌లోనూ పోటీ బాగా కన్పిస్తోంది. – శ్రీధర్, జెన్కో ఎండీ -
రయ్.. రయ్.. జెన్కో
సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్కో మూడు నెలలుగా విద్యుత్ ఉత్పత్తిలో దూసుకుపోతోంది. గత ఏడాదితో పోలిస్తే ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఐదేళ్లుగా చిక్కి శల్యమైన ఈ సంస్థ ప్రస్తుత ప్రభుత్వ విధానాలతో తిరిగి పుంజుకుంటోంది. గత ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) 50 శాతం కూడా దాటలేదు. కానీ ఈ సంవత్సరం అదే సమయంలో గరిష్టంగా 60 శాతానికి పైగా పీఎల్ఎఫ్ నమోదు చేసింది. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలకు నాణ్యమైన, చౌకైన విద్యుత్ అందించగలుగుతోంది. ఏపీ జెన్కో పురోభివృద్ధిపై జెన్కో వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే పరంపర కొనసాగితే ఈ ఏడాది 80 శాతం పీఎల్‌ఎఫ్‌కు చేరుకోవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఐదేళ్లుగా అంధకారం! గత ఐదేళ్లుగా టీడీపీ సర్కార్ ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లకే పెద్ద పీట వేసిన విషయం తెలిసిందే. డిమాండ్ లేకున్నా, యూనిట్‌కు రూ. 5పైనే చెల్లించి ప్రైవేటు విద్యుత్ కొనుగోలు చేసింది. అయిన వాళ్ల కోసం అడ్డగోలు పీపీఏలను ప్రోత్సహించింది. 2015లో ఏకంగా కమిషన్ చెప్పిన దానికి విరుద్ధంగా 11 వేల మిలియన్ యూనిట్లకు పైచిలుకు ప్రైవేటు విద్యుత్ తీసుకుంది. దానికి యూనిట్‌కు రూ. 6కుపైగా చెల్లించింది. ఈ విధంగా ప్రైవేటు విద్యుత్ కొనుగోలు చేయడంతో ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తికి భారీగా గండి కొట్టారు. రోజూ 105 మిలియన్ యూనిట్ల సామర్థ్యం ఉన్న జెన్కోను సగానికి తక్కువగా పరిమితం చేశారు. దీంతో జెన్కో నిర్వహణ సామర్థ్యం దారుణంగా దెబ్బతింది. నిర్మాణ వ్యయంపై కనీసం అప్పులు కట్టుకోలేని దైన్యస్థితికి చేరింది. జెన్కో ఇప్పటికీ రూ. 20 వేల కోట్ల అప్పుల్లో ఉంది. గత ఐదేళ్లుగా కనీసం ఆ అప్పులపై వడ్డీ కట్టడానికి కొత్తగా అప్పులకు వెళ్లాల్సి వచ్చింది. గత ఏడాది అదికూడా సాధ్యం కాకపోతే విద్యుత్ సంస్థల ఆస్తులు తనఖా పెట్టుకోమని టీడీపీ ప్రభుత్వం ఉచిత సలహా ఇచ్చింది. ఇలా జెన్కోను అంధకారంలోకి నెట్టివేసింది. కొత్త ప్రభుత్వం ప్రోత్సాహంతో.. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ ఏపీ జెన్కో రూపురేఖలు మారిపోతున్నాయి. వీలైనంత వరకు జెన్కో ఉత్పత్తిని పెంచాలని సర్కార్ ఆదేశించింది. దీంతో జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 66.69కి పెరిగింది. దీన్ని 80 శాతం వరకు తీసుకెళ్లాలనే యోచనలో ఉన్నట్లు జెన్కో ఎండీ శ్రీధర్ తెలిపారు. లోడ్ ఫ్యాక్టర్ పెరిగే కొద్దీ ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. ఎక్కువ యూనిట్లు ఉత్పత్తి అయితే, జెన్కో ఆదాయం గణనీయంగా పెరిగే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు బొగ్గు కొరత లేకుండా, నాణ్యమైన బొగ్గు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫలితంగా మూడు నెలల్లోనే జెన్కో థర్మల్ ఉత్పత్తి గణనీయ స్థాయికి చేరుకుంది. ఖరీదైన ప్రైవేట్ ఉత్పత్తికి కళ్లెం వేస్తూ, పవన, సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించాలన్న వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయంతో జెన్కోకు మంచి రోజులొచ్చాయి. మూడు నెలలుగా ప్లాంట్లలో పీఎల్ఎఫ్ పెరగడమే దీనికి తార్కాణం. ఈ పరంపర ఇంకా కొనసాగాల్సిన అవసరం ఉంది. – జెడ్‌వీ.గణేష్,బీసీ విద్యుత్ ఉద్యోగ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
జెన్కోకు ఊరట
సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్లలో నెలకొన్న బొగ్గు సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. బొగ్గు సరఫరా పెంచాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కోరారు. ఆయన జరిపిన సంప్రదింపుల ఫలితంగా 31,500 మెట్రిక్ టన్నులు ఇచ్చేందుకు సింగరేణి అంగీకరించినట్టు జెన్కో వర్గాలు పేర్కొన్నాయి. ఒప్పందం ప్రకారం బొగ్గు సరఫరా చేయాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కోల్ ఇండియా అధికారులతో, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. 5,010 మెగావాట్ల సామర్థ్యమున్న ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు మహానది కోల్ లిమిటెడ్ (ఎంసీఎల్), సింగరేణి (ఎస్సీసీఎల్) సంస్థలు బొగ్గు సరఫరా చేస్తున్నాయి. ఒడిశాలో భరత్‌పూర్‌లోని ఎంసీఎల్ బొగ్గు క్షేత్రంలో జూలై చివరి వారంలో ప్రమాదం జరిగింది. దీంతో అక్కడి కార్మికులు 15 రోజులుగా సమ్మె చేస్తుండటంతో ఉత్పత్తి స్తంభించింది. రోజుకు 70 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం ఉంటే, 45 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే అందుతోంది. థర్మల్ కేంద్రాల వద్ద ప్రస్తుతం రెండు రోజులకు సరిపడా కూడా బొగ్గు నిల్వలు లేకపోవడంతో జెన్కో ఉత్పత్తి పడిపోయింది. అడుగడుగునా సవాళ్లే గత ప్రభుత్వం ప్రైవేటు ఉత్పత్తిని ప్రోత్సహించి ఏపీ జెన్కోను తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. వైఎస్ జగన్ నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం దిద్దుబాటు చర్యల వల్ల థర్మల్ విద్యుత్ సామర్థ్యం అనూహ్యంగా పెరిగింది. గత ఏడాది ఇదే సమయంలో 12,679 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరిగింది. ప్రస్తుతం ఇది 14,062 మిలియన్ యూనిట్లకు పెరిగింది. ఇదిలా ఉండగా డొంకరాయి, దిగువసీలేరు మధ్య విద్యుత్ ఉత్పాదన కోసం ఉద్దేశించిన పవర్ కెనాల్‌కు ఆగస్టు 12న భారీ వరద కారణంగా గండిపడింది. దీనివల్ల 300 నుంచి 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. మహానది కోల్ ఫీల్డ్స్, సింగరేణిలో కుండపోత వర్షాల వల్ల సెప్టెంబర్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం విధించిన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సీ– విద్యుత్ కొనుగోలుకు సరిపడా మొత్తాన్ని బ్యాంకు వద్ద డిపాజిట్ చేయడం) సమస్యను అధిగమించేందుకు సరిపడా నిధులు లేవు. ఈ నేపథ్యంలో కొన్నింటికి ఎల్సీలు తీసుకునేందుకు ప్రభుత్వం రూ.570 కోట్లు మంజూరు చేసిందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి తెలిపారు. పలువురు ఉత్పత్తిదారులకు ఇవ్వాల్సిన బకాయిలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. వెంటాడుతున్న బాబు తీరు గత ఎన్నికల్లో గొప్పలు చెప్పుకునేందుకు అప్పటి టీడీపీ సర్కార్ ఉత్తరాది రాష్ట్రాల నుంచి స్వాప్ (మళ్లీ ఇవ్వాలి) పద్ధతిలో విద్యుత్‌ను తీసుకుంది. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి గతేడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, నవంబర్, డిసెంబర్ నెలల్లో 3,800 మిలియన్ యూనిట్ల విద్యుత్ తీసుకుంది. ఇందుకు బదులుగా ఈ ఏడాది జూన్ నుంచి 1,500 మెగావాట్ల విద్యుత్‌ను తిరిగి చెల్లించాల్సి వస్తోంది. ఇందు వల్ల రాష్ట్రంలో రోజుకు 4 మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడుతోంది. ఏదేమైనా మరో రెండు రోజుల్లో జెన్కో ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని ఏపీ జెన్కో ఎండీ శ్రీధర్ తెలిపారు. బొగ్గు కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. రైతులకు పగటి పూట 9 గంటల విద్యుత్ ఇచ్చే విషయంలో రాజీ ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. -
వివిధ వర్గాల పై గురి..
సాక్షి, భూపాలపల్లి: ఉదయం ఎనిమిది గంటలు దాటితే సూర్యుడు సుర్రుమంటున్నాడు. పది దాటితే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు మాత్రం ఎండలను లెక్కచేయకుండా కులసంఘాలు, కీలక వర్గాలు, యూనియన్ల వారీగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమవుతున్నారు. ఒంటి నుంచి చెమటలు కక్కుతున్నా వెనుకడుగు వేయడం లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రచారానికి నాలుగు రోజులే మిగిలి ఉండడంతో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గాల వారీగా కీలకంగా ఉన్న వర్గాల ఓట్లను ఆకర్షించేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. అన్ని పార్టీల లోక్‌సభ అభ్యర్థులు కీలకమైన వర్గాలతో ములాఖత్ అవుతూ ఓట్లు అడుగుతున్నారు. స్వయంగా పోటీలో ఉన్న అభ్యర్థులే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సుడిగాలి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. భూపాలపల్లిలో సింగరేణి కార్మికులు, రైతుల ఓట్లు కీలకం కాగా ములుగు అసెంబ్లీ పరిధిలో గిరిజనేతరులు, సెటిలర్ల ఓట్ల కోసం పడరాని పాట్లు.. ఫీట్లు చేస్తున్నారు. కార్మికుల చుట్టే రాజకీయం.. భూపాలపల్లి జిల్లాలో కార్మికుల చుట్టూ ఓట్ల కోసం అభ్యర్థులు తిరుగుతున్నారు. వరంగల్ లోక్‌సభ పరిధిలో అధిక ఓట్లు ఉండడం, సింగరేణి, జెన్కో కార్మికులు కీలకం కావడంతో ఈ వర్గాలను ఆకర్షించే పనిలో నేతలు ఉన్నారు. కార్మికుల ఓట్లు 30 వేల వరకు ఉంటే పరోక్షంగా మరో 20 వేల ఓట్ల వరకు ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో ప్రతీ పార్టీకి వీరు కీలకమవుతున్నారు. అన్ని పార్టీల నాయకులు కార్మికుల ఓట్ల కోసం గనుల్లో పర్యటిస్తున్నారు. కార్మికులు షిఫ్ట్‌లు మారే సమయంలో ఓట్లు అభ్యర్థిస్తున్నారు. టీఆర్ఎస్ తరఫున పసునూరి దయాకర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి కార్మికులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి గనుల్లో ఇప్పటికే పర్యటించారు. వీటితో పాటు కేటీపీపీ కార్మికులు కూడా ఎన్నికల్లో కీలకం కానున్నారు. సింగరేణితో పోలిస్తే తక్కువ ఓట్లు ఉన్నప్పటికీ వీరిని కూడా తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్దపల్లి పరిధిలోకి వచ్చే జిల్లాలోని ఐదు మండలాల్లో రైతుల ఓట్లు కీలకంగా మారాయి. ఈ ఐదు మండలాల్లో పెద్ద సంఖ్యలో రైతులు ఉన్నారు. వీరి ఓట్లను ప్రసన్నం చేసుకున్న వారికి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. గిరిజనేతరులు, సెటిలర్లే టార్గెట్ మహబూబాబాద్ ఎంపీ పరిధి కిందకు వచ్చే ములుగు అసెంబ్లీ సెగ్మెంట్లో గిరిజనేతరులు, సెటిలర్ల ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బరిలో ఉన్న పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఎస్టీ రిజర్వ్డ్ పార్లమెంటరీ స్థానంలో కావడంతో ఇప్పుడు అందరి దృష్టి నాన్ ఎస్టీ ఓటర్లపై పడింది. గెలుపోటములు, మెజారిటీ రావాలన్నా ఈ వర్గంపై ఎక్కువ దృష్టి పెట్టాలని ప్రతీ రాజకీయ పార్టీకి తెలుసు. ప్రస్తుతం పోటీలో ఉన్న అందరు అభ్యర్థులు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో ఎస్టీల ఓట్లు ఎలాగోలా అందరికీ పడతాయి. ఎస్టీ ఓట్లు పోటీల ఉన్న అందరూ అభ్యర్థులు చీల్చుకుంటే గిరిజనేతర, సెటిలర్ ఓట్లే కీలకం అవుతాయి. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈ వర్గాలు కీలకంగా మారాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. భూపాలపల్లితో పోలిస్తే ములుగు నియోజకవర్గంలో కమిటీల పేరుతో అన్ని పార్టీలు పోల్ మేనేజ్ మెంట్ చేసేందుకు పథకాలు రచిస్తున్నాయి. ఇదే విధంగా ములుగు నియోజకవర్గంలో గోవిందరావుపేట, మంగపేట, ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురంలో సెటిలర్ల ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లు ఎటు పడుతాయనేది ప్రాధాన అంశంగా మారింది. ప్రచారంలో దూకుడు.. ఎక్కువ ఓట్లు ఉన్న వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు స్వయంగా పర్యటిస్తున్నారు. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్, కాంగ్రెస్ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య భూపాలపల్లిలో కార్మికులను ఓట్లు కోరారు. అదే విధంగా పెద్దపల్లి ఎంపీ పరిధిలోకి వచ్చే ఐదు మండలాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్ నేత ప్రచారం చేస్తున్నారు. ములుగులో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్, టీఆర్ఎస్ తరఫున మాలోత్ కవిత తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. వీరికి మద్దతుగా ఎమ్మెల్యే సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య సెటిలర్లు, గిరిజనేతరుల మద్దతు కోసం శ్రమిస్తున్నారు. టీఆర్ఎస్కు అన్నీ తానై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అండగా నిలుస్తున్నారు. -
బకాయి చెల్లించకుండా బుకాయింపు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ విద్యుత్తు సంస్థలు రూ.5 వేల కోట్లకుపైగా బకాయి పడ్డాయంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ఆరోపణలు అబద్ధమని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. ఏపీ విద్యుత్తు సంస్థలే తెలంగాణకు బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఆ విషయాన్ని పక్కనపెట్టి ‘ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే’తరహాలో ఏపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆయన శుక్రవారం ఇక్కడ విద్యుత్‌సౌధలో మీడియాతో మాట్లాడారు. రెండు వైపుల నుంచి బకాయిలు ఇచ్చిపుచ్చుకోవాల్సి ఉన్నందున చాలాకాలంగా పరిష్కారం కోసం ఆహ్వానిస్తున్నా ఏపీ అధికారులు సహకరించటం లేదన్నారు. సెటిల్మెంట్ కోసం ముందుకు రాకుండా ఇప్పుడేమో తెలంగాణ విద్యుత్తు సంస్థలే బకాయి పడ్డాయని ఆరోపించటం హాస్యాస్పదమన్నారు. ‘ఏపీ డిస్కంల నుంచి తెలంగాణ డిస్కంలకు రూ.1,659 కోట్లు, ఏపీ ట్రాన్స్‌కో నుంచి తెలంగాణ ట్రాన్స్‌కోకు రూ.101 కోట్లు, ఏపీ జెన్కో నుంచి తెలంగాణ జెన్కోకు రూ.3,096 కోట్లు, ఏపీ పవర్ యుటిలిటీస్ నుంచి తెలంగాణ పవర్ యుటిలిటీస్‌కు రూ.929 కోట్లు వెరసి రూ.5,785 కోట్లు రావాల్సి ఉంది. విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రూ.3,379 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం పోను ఏపీ సంస్థలు తెలంగాణ సంస్థలకు రూ.2,406 కోట్లు చెల్లించాల్సి ఉంది. మరో రూ.1,100 కోట్ల వరకు తెలంగాణకు ఏపీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వీటిని మరుగున పడేసి తెలంగాణనే బకాయిపడ్డట్టు తప్పుడు వాదనను తెరపైకి తెచ్చారు. ఈ లెక్కలు బహుశా అక్కడి ప్రభుత్వానికి తెలియకపోవచ్చు. అధికారులకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయలోపం ఉన్నట్టుంది. తెలిసి ఉంటే ప్రభుత్వ వాదన అలా ఉండదు కదా’అని ప్రభాకరరావు అన్నారు. ఎన్సీఎల్టీని ఎందుకు ఆశ్రయించినట్టో... వాస్తవాలను పక్కన పెట్టి ఏపీ జెన్కో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించటం విడ్డూరంగా మారిందని ప్రభాకర్‌రావు అన్నారు. దివాలా తీసిన సమయంలో ఈ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి లెక్కలు సరిచేసుకునేందుకు వాటి ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ నిర్వహిస్తారని, మరి తెలంగాణ విద్యుత్తు సంస్థలను ఏపీ స్వాధీనం చేసుకోవాలని చూస్తోందా... అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఈ బకాయిలకు సంబంధించి సెటిల్ చేసుకునేందుకు రావాలంటూ ఇప్పటికే ఏడెనిమిది లేఖలు రాశామని, తాను స్వయంగా ఏపీ అధికారులతో మాట్లాడానని, కానీ అక్కడి నుంచి స్పందన లేదని ఆరోపించారు. ఏపీ అధికారులు ముందుకొస్తే 24 గంటల్లో పరిష్కరించుకునేందుకు తాము సిద్ధమని, ఆ తర్వాత తాము చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించేందుకు కూడా సిద్ధమన్నారు. ఏపీ తెలంగాణకు చెల్లించేది డబ్బు... తెలంగాణ ఏపీకి చెల్లించాల్సింది డబ్బు కాదా... డబ్బుకు కూడా రంగు, రుచి, వాసన వేర్వేరుగా ఉంటాయని ఏపీ అధికారులు భావిస్తున్నట్టున్నారంటూ ఎద్దేవా చేశారు. -
తెలంగాణ ‘పవర్’ ప్రభాకర్‌రావు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వశాఖలో పదవీ విరమణ వయసు 58 ఏళ్లు. సేవలను గుర్తించి కొంత కాలం పొడిగించినా మరో ఐదేళ్లు మించి కొనసాగే అవకాశం అరుదుగా వస్తుంది. దీంతో ఒక వ్యక్తి ప్రభుత్వశాఖలో పనిచేసే సగటుకాలం 40 ఏళ్లు. కానీ ఒకే శాఖలో ఉద్యోగం సాధించి అంచెలంచెలుగా వివిధ హోదాల్లో పనిచేస్తూ ఏకంగా 50 ఏళ్ల పాటు కొనసాగుతూ రికార్డు సృష్టించారు జెన్కో–ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని విజయవంతంగా పరిష్కరించి, నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో ముఖ్య భూమిక పోషించిన ప్రభాకర్‌రావు విద్యుత్ సంస్థలో చేరి ఈ నెల 10 నాటికి 50 ఏళ్లవుతోంది. అకౌంట్స్ ఆఫీసర్ నుంచి.. ఏపీ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డులో (ఏపీఎస్ఈబీ)లో అసిస్టెంటు అకౌంట్స్ ఆఫీసర్‌గా 1969 ఫిబ్రవరి 10న ప్రభాకర్‌రావు విధుల్లో చేరారు. 1992లో ఏపీఎస్ఈబీ ఫైనాన్షియల్ అడ్వైజర్, చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్‌గా నియామకమయ్యారు. 1998లో బోర్డు మెంబర్ (అకౌంట్స్)గా నియమితులయ్యారు. ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు కాని వారిని బోర్డు మెంబర్‌గా నియమించడం అదే ప్రథమం. 1999లో ఏపీఎస్ఈబీ జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంలుగా విడిపోయింది. అప్పుడు ప్రభాకర్‌రావు ఏపీ ట్రాన్స్‌కో డైరెక్టర్ (ఫైనాన్స్)గా నియమితులయ్యారు. ప్రభుత్వంతో విభేదాలు రావడంతో 2002లో డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. మరో ఏడేళ్ల సర్వీసు ఉండగానే ఉద్యోగాన్ని వదిలేశారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక ప్రభాకర్‌రావును మళ్లీ జెన్కో డైరెక్టర్ (ఫైనాన్స్)గా నియమించారు. 2009లో రోశయ్య సీఎం అయ్యాక ప్రభాకర్‌రావును జెన్కో జేఎండీగా నియమించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం అయ్యాక కూడా అదే పదవిలో కొనసాగారు. 2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ జెన్కో సీఎండీగా నియామకమయ్యారు. తర్వాత ట్రాన్స్‌కో సీఎండీగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఈ రెండింటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లోటును పూడ్చిన ఘనత... మాములుగా ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ పోస్టులను ఐఏఎస్‌లకు ఇస్తారు. సంస్థ ఉద్యోగి అయితేనే సాధక బాధకాలు తెలుస్తాయనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నాన్ ఐఏఎస్ అయిన ప్రభాకర్‌రావుకు జెన్కో సీఎండీగా బాధ్యతలు అప్పగిస్తూ మొదటి నిర్ణయం తీసుకున్నారు. ఆయన బాధ్యతలు తీసుకున్న నాడు తెలంగాణ విద్యుత్ రంగం సంక్షోభంలో ఉంది. పరిశ్రమలకు పవర్ హాలిడేలు, గృహ విద్యుత్‌కు గంటల తరబడి కోతలు, వ్యవసాయానికి 4 గంటల వరకు కరెంటే అందేది. ఆ కరెంటూ తక్కువ సామర్థ్యం కూడినది కావడంతో మోటార్లు కాలిపోయేవి. ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయేవి. రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్ కొరత 2,700 మెగావాట్లు. ఆ లోటు ఎలా పూడుతుందో తెలియని పరిస్థితి. సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని ప్రభాకర్‌రావు నూటికి నూరుపాళ్లు నిలబెట్టారు. తెలంగాణ ఏర్పడిన ఆరో నెల నుంచే (2014, నవంబర్ 20) కోతలు ఎత్తివేశారు. 24 గంటల విద్యుత్‌సరఫరా ప్రారంభించారు. అప్ప ట్నుంచే రైతులకు 9 గంటల విద్యుత్ అందింది. 2018 జనవరి 1 నుంచి దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలోని 23 లక్షల పంపుసెట్లకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నారు. ఇటు నిదానంగా నడుస్తున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల పనులను ప్రభుత్వం వేగం చేసింది. కొత్త విద్యుత్ ప్లాంట్లు నిర్మించింది. దక్కించుకున్న అవార్డులు విద్యుత్ రంగంలో అద్వితీయమైన కృషికి పలు అవార్డులు ప్రభాకర్‌రావు అందుకున్నారు. ‘ఎకనామిక్ టైమ్స్ అవార్డు–2018’, ‘సీబీఐపీ ప్రత్యేక గుర్తింపు అవార్డు–2018’ పొందారు. తెలంగాణ విద్యుత్ రంగం–పంపిణీలో మార్పులు, నిర్వహణపై ‘స్కోచ్ గోల్డ్ అవార్డు–2018’, తెలంగాణ ప్రభుత్వం మేడే సందర్భంగా ప్రదానం చేసిన ‘టీఎస్ జెన్కో, టీఎస్ ట్రాన్స్‌కో బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు’, విద్యుత్ రంగంలో విశేష కృషికి గాను ‘డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు అవా ర్డు–2016’ను ఆయన అందుకున్నారు. విద్యుత్ రంగంలో ప్రతిభ కనబరచినందుకుగాను ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ పవర్ యుటిలిటీస్’ నుంచి ‘ఇండియా పవర్ అవార్డు–2013’, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ, హైదరాబాద్ నుంచి ‘ఎక్స్‌లెన్సీ ఇన్ అకౌంటెన్సీ అండ్ ఫైనాన్స్’ అవార్డులు అందుకున్నారు. -
50 ఏళ్లుగా వెలుగులు పంచుతూ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు గురువారంతో విద్యుత్ శాఖలో 50 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకున్నారు. 1969 జనవరి 10న ఆయన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్‌గా ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు (ఏపీఎస్ఈబీ)లో ఉద్యోగప్రస్థానం ప్రారంభించారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణ విద్యుత్ సంస్థల్లో కీలక హోదాల్లో సేవలందించారు. విద్యుత్ రంగంలో ఆయన సేవలు, విశేషానుభవాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రంలో.. రాష్ట్ర ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీగా బాధ్యతలు అప్పగించారు. ఐఏఎస్ అధికారులు కాదని ఈ పదవిని ఏరికోరి ప్రభాకర్ రావుకు కట్టబెట్టారు. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరతను అధిగమించి 24 గంటల విద్యుత్ సరఫరా అందించడంలో కీలకపాత్ర పోషించారు. వ్యవసాయానికి తొలుత 9 గంటల నిరంతర విద్యుత్, ఆ తర్వాత 24 గంటల విద్యుత్ సరఫరా వంటి కేసీఆర్ నిర్ణయాలను విజయవంతంగా అమలు చేయడంలో సఫలమయ్యారు. రాష్ట్రంలో కొత్త విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం, విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థల సామర్థ్యం పెంపు పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు మొత్తం విద్యుత్ శాఖను పరుగులు పెట్టించారు. రికార్డు సమయంలో విద్యుదుత్పత్తి కేంద్రాలు, సబ్–స్టేషన్లు, లైన్ల నిర్మాణాన్ని పూర్తి చేసి పీజీసీఎల్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రశంసలు అందుకున్నారు. విద్యుత్ రంగంలో చేసిన విశేష కృషికి గానూ.. గతేడాది ఎకనమిక్ టైమ్స్, సీబీఐపీ, స్కోచ్ పురస్కారాలను అందుకున్నారు. 2017లో బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు ఫర్ ట్రాన్స్‌కో, జెన్కో, విద్యుత్ రంగంలో విశేష కృషికి గానూ 2016లో బూర్గుల రామకృష్ణారావు పురస్కారాన్ని అందుకున్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ పవర్ యుటిలిటీస్ 2013లో ఆయనకు ఇండియా పవర్ అవార్డును అందజేసింది. ఈ సందర్భంగా విద్యుత్ ఇంజనీర్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వర్ణోత్సవ కేక్‌ను ఆయనతో కట్ చేయించారు. కార్యక్రమంలో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావు, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు పాల్గొని ఆయన్ను అభినందించారు. -
ఉద్యోగుల కృషి వల్లే విజయాలు
సాక్షి, హైదరాబాద్: సగటు విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం విద్యుత్ ఉద్యోగుల సమష్టి కృషి వల్లే సాధ్యమైందని ట్రాన్స్‌కో, జెన్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి.ప్రభాకర్‌రావు అన్నారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ (టీఈఈ) 1104 రూపొందించిన పవర్‌మెన్–2019 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం మింట్‌కాంపౌండ్‌లో జరిగింది. దీనికి టీఈఈ 1104 రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.పద్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయిబాబు అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 24 గంటల విద్యుత్‌ను రాష్ట్ర ప్రజలందరికీ అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను యూనియన్ల వారీగా పరిశీలించి బోర్డులో చర్చించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీనిచ్చారు. అలాగే రైతులు, వినియోగదారులు కష్టాలు పడకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించడం శుభపరిణామమని చెప్పారు. ఏ విభాగంలో లేని జీతాలు: శ్రీనివాస్‌గౌడ్ సీఎం కేసీఆర్, ప్రభాకర్‌రావుల సలహాలు, సూచనలతో తెలంగాణ మొత్తం గర్వపడేలా విద్యుత్ సమస్యను అధిగమించామని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఏ డిపార్టుమెంటులో లేని జీతాలు సీఎం చొరవతో విద్యుత్ ఉద్యోగులు అందుకుంటున్నారని చెప్పారు. అనంతరం టీఈఈ యూనియన్, ఇతర యూనియన్లు రూపొందించిన క్యాలెండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఎస్ఎస్పీడీసీల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి, టీఎస్ఎన్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్‌రావు, ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి పాల్గొన్నారు. -
యాభై ఏళ్ల వెలుగులకు తెర!
సాక్షి, హైదరాబాద్: తీవ్ర కాలుష్యాన్ని వెదజల్లుతుండటంతోపాటు ఆర్థికంగా భారంగా మారిన కొత్తగూడెం థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం (కేటీపీఎస్)లోని పాత విద్యుదుత్పత్తి యూనిట్లను మూసివేసేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) చర్యలు ప్రారంభించింది. 1,750 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్న 11 యూనిట్లు కేటీపీఎస్‌లో ఉండగా.. అందులో మొత్తం 720 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 8 యూనిట్లను దశల వారీగా మూసివేసేందుకు లాంఛనాలు మొదలుపెట్టింది. అర్ధ శతాబ్దపు వెలుగులు.. కేటీపీఎస్ తొలి దశ కింద 1966లో రెండు 60 మెగావాట్ల (2్ఠ60) యూనిట్లు, రెండో దశ కింద 1967లో రెండు 60 మెగావాట్ల (2్ఠ60) యూనిట్లు, మూడో దశ కింద 1974, 1975ల్లో రెండు 120 మెగావాట్ల్ల (2్ఠ120) యూనిట్లు, నాలుగో దశ కింద 1977, 1978లలో రెండు 120 మెగావాట్ల (2్ఠ120) యూనిట్లను నిర్మించారు. అర్ధ శతాబ్ద కాలం పాటు ఉమ్మడి ఏపీ, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వెలుగులు అందించిన ఈ కేంద్రాలకు ప్రస్తుతం కాలం చెల్లింది. వీటి నుంచి విద్యుదుత్పత్తి జరపడానికి అధిక మొత్తంలో బొగ్గు మండించాల్సి వస్తుండటంతో వ్యయం తడిసి మోపెడవుతోంది. మరోవైపు తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యాన్ని వెదజల్లుతుండటంతో పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 60 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడో యూనిట్ నుంచి ఏడాది కిందే జెన్కో విద్యుదుత్పత్తిని నిలిపివేసింది. ఈ నేపథ్యంలో 720 మెగావాట్ల కేటీపీఎస్ తొలి నాలుగు దశల్లో నిర్మించిన మొత్తం యూనిట్లను అధికారికంగా మూసివేసేందుకు జెన్కో ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ విద్యుత్ కేంద్రాలు వెలువరుస్తున్న కాలుష్యంపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)తో అధ్యయనం జరిపించి నివేదిక రూపొందించాలని జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు విద్యుత్ సౌధలో నిర్వహించిన ఓ సమీక్షలో అధికారులను ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా దశలవారీగా ప్లాంట్ల మూసివేతకు చర్యలు తీసుకోనున్నారు. కేంద్ర విద్యుత్ సంస్థ (సీఈఏ)కు గతంలో ఇచ్చిన హామీ మేరకు 2019 మార్చిలోగా ఈ విద్యుత్ ప్లాంట్లను జెన్కో మూసివేయాల్సి ఉంది. నెలాఖరులో 7వ దశ ప్రారంభం ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న 800 మెగావాట్ల (1్ఠ800) కేటీపీఎస్ 7వ దశ విద్యుత్ ప్లాంట్ నుంచి నెలాఖరులోగా విద్యుదుత్పత్తిని ప్రారంభించేందుకు జెన్కో సన్నాహాలు చేస్తోంది. సూపర్ క్రిటికల్ బాయిలర్ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ కొత్త విద్యుత్ కేంద్రం అందుబాటులోకి వస్తున్నందున గతంలో సీఈఏకి ఇచ్చిన హామీ మేరకు 720 మెగావాట్ల పాత విద్యుత్ కేంద్రాల్ని మూసేస్తామని ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. తొలుత 60 మెగావాట్ల యూనిట్‌ను మూసేస్తామన్నారు. కేటీపీఎస్ తొలి 4 దశలకు సంబంధించిన 720 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను మూసేస్తే, 5వ దశ కింద 1997–98 లో నిర్మించిన రెండు 250 మెగావాట్ల యూనిట్లు (2్ఠ250), 6వ దశ కింద 2011లో నిర్మించిన 500 మెగావాట్ల యూనిట్ (1్ఠ500) మిగలనుంది. ఏడో దశలోని 800 (1్ఠ800) మెగావాట్ల యూనిట్ జతకానుంది. పాత యూనిట్ల మూత, కొత్త యూనిట్ నిర్మాణం తర్వాత కేటీపీఎస్ సామర్థ్యం 1,800 మెగావాట్లకు చేరనుంది. -
జెన్కో చేతికే హైడల్ ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదులపై కొత్త జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)కు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషీ ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా, గోదావరిపై జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలను నీటిపారుదలశాఖకు అప్పగిస్తూ 2010 మార్చి 11న నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు (జీవో 21)ను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జెన్కో చేతికి తుపాకులగూడెం ప్లాంట్! తెలంగాణ ఆవిర్భావం తర్వాత జెన్కో ఆధ్వర్యంలో దిగువ జూరాల, పులిచింత జల విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులు చేపట్టగా, ఇప్పటికే దిగువ జూరాల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. పులిచింతల విద్యుదుత్పత్తి కేంద్రం పనులూ చివరి దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే జెన్కో చేతిలో జలవిద్యుత్ కేంద్రాల నిర్మాణానికి సంబంధించిన పనులు ఉండవు. మరోవైపు దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరిపై తుపాకులగూడెం వద్ద బ్యారేజీతోపాటు 240 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని నిర్మించాలని వ్యాప్కోస్ సంస్థ డీపీఆర్‌లో సిఫారసు చేసింది. అలాగే గోదావరిపై తుమ్మిడిహెట్టి, ఎల్లంపల్లి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, దుమ్ముగూడెం రిజర్వాయర్ల పనులను జరుపుతుండటంతో వాటికి అనుసంధానంగా జల విద్యుత్ కేంద్రా ల నిర్మాణానికి ఉన్న అవకాశాలపై ప్రభుత్వం అధ్యయనం జరుపుతోంది. నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో డ్యామ్‌లను, జెన్కో ఆధ్వర్యంలో జల విద్యుదుత్పత్తి కేంద్రాలను నిర్మిస్తున్నారు. జల విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం, డిజైన్ల రూపకల్పన, నిర్వ హణలో జెన్కో అనుభవాన్ని కలిగి ఉంది. అయితే గోదావరిపై కొత్త జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణ పనులు చేపట్టేందుకు ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన ఉత్తర్వులు జెన్కోకు అడ్డుగా మారాయి. ఈ నేప థ్యంలో పాత ఉత్తర్వులను సవరించి తుపాకులగూడెం జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను తమకు అప్పగించాలని జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వం అభిప్రాయంగా కోరగా నీటిపారుదలశాఖ శాఖ సానుకూలంగా స్పందించింది. జల విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను జెన్కోకు అప్పగించాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీంతో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
రెండో మెరిట్ జాబితాతో ఏఈ పోస్టులు!
♦ విద్యుత్ సంస్థలకు సుప్రీంకోర్టు అనుమతి ♦ 239 మిగులు పోస్టుల భర్తీకి మార్గం సుగమం ♦ త్వరలో 1,000 ఏఈ పోస్టుల భర్తీకి ఉమ్మడి ప్రకటన సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ విద్యుత్ ఇంజనీర్ పోస్టుల భర్తీలో మెరిట్ అభ్యర్థులకు భారీ ఊరట లభించింది. రాష్ట్రంలోని 4 విద్యుత్ సంస్థల్లో మిగిలిన 239 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టులను రెండో మెరిట్ జాబితాతో భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండో మెరిట్ జాబితాతో మిగిలిన పోస్టుల భర్తీకి ఇంధన శాఖ జారీ చేసిన సర్క్యులర్ చెల్లుబాటు కాదంటూ రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను గురువారం కొట్టేసింది. కేసు నేపథ్యమిది.. జెన్కోలో 856, ట్రాన్స్‌కోలో 206, ఎన్పీడీసీఎల్లో 164, ఎస్పీడీసీఎల్లో 201 ఏఈ పోస్టులు కలిపి 1,427 పోస్టుల భర్తీకి గతేడాది విద్యుత్ సంస్థలు నియామక ప్రకటనలు జారీ చేశాయి. ఒక్కో అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ సంస్థల్లో ఎంపికై ఏదో ఓ సంస్థలో చేరడంతో టీఎస్ఎన్పీడీసీఎల్లో 164 ఏఈ పోస్టులకు 107, ట్రాన్స్‌కోలో 206 పోస్టులకు 59, టీఎస్ఎస్పీడీసీఎల్లో 201 పోస్టులకు 73 పోస్టులు ఖాళీగా మిగిలాయి. ట్రాన్స్‌కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్లో 239 పోస్టులను రెండో జాబితా తో భర్తీ చేయాలని ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేయగా నిరుద్యోగులు హైకోర్టులో సవాల్ చేశారు. 1997 జనవరి 22న అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.89 ప్రకారం భర్తీ చేయడానికి వీల్లేదని నిరుద్యోగుల వాదనతో కోర్టు ఏకీభవిస్తూ గతేడాది ఆగస్టు 29న ఉత్తర్వులిచ్చింది. ఇంధన శాఖ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. సుప్రీంకోర్టు స్పందిస్తూ.. 4 విద్యుత్ సంస్థల్లో ఏఈ పోస్టుల భర్తీకి ఒకేసారి వేర్వేరు ప్రకటనలివ్వడం, పరీక్షలు నిర్వహించడంతో మెరిట్ గల అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారని, దీంతో ప్రత్యేక పరిస్థితులు తలెత్తాయని వ్యాఖ్యానించింది. మిగిలిపోయిన పోస్టుల భర్తీలో జీవో నం.89 వర్తింపజేయాల్సిన అవసరం లేదని, రెండో జాబితాతో భర్తీకి విద్యుత్ సంస్థలు చర్యలు తీసుకోవచ్చని తాజా తీర్పులో పేర్కొంది. తొలుత 239 పోస్టుల భర్తీ తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్లో 1,000 ఏఈ పోస్టుల భర్తీకి త్వరలో ఉమ్మడి ప్రకటన జారీ చేయాలని యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం 239 పోస్టులను తొలుత భర్తీ చేస్తామని, తర్వాత ఏఈ పోస్టుల ఖాళీలను గుర్తించి నియా మక ప్రకటన ఇస్తామని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. -
'జెన్కో' కొలువు జయించానిలా..
పబ్లిక్ పరీక్షలైనా.. పోటీ పరీక్షలైనా.. మౌఖిక పరీక్షలైనా.. మరే ఎగ్జామ్ అయినా.. సిలబస్‌లోని సబ్జెక్టులపై పట్టుంటే విజయం నల్లేరుపై నడకే! లక్ష్య సాధన లాంఛనమే!! భీమవరానికి చెందిన మేడూరి కల్యాణ్ దీనికి చక్కని ఉదాహరణ. అకడమిక్ పరీక్షల తోపాటు పోటీ పరీక్షల్లోనూ ఆయన ఇదే సూత్రం ఆధారంగా అత్యుత్తమ మార్కులు పొందాడు. ఇప్పుడు ‘ఏపీ జెన్కో ఏఈ ఎగ్జామ్–2017’లో ఏకంగా స్టేట్ సెకండ్ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. తన చదువు కోసం అడిగినవన్నీ సమకూర్చిన తండ్రి (కార్పెంటర్) నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. సర్కారు నౌకరీ సాధించి ఆయనకు గర్వకారణంగా నిలిచాడు. లక్షల్లో వేతనం వచ్చే ప్రైవేట్ జాబ్ కన్నా ఆత్మసంతృప్తినిచ్చే ప్రభుత్వ ఉద్యోగమే మిన్న అనే భావనతో అనుకున్నది సాధించాడు. ఏపీ జెన్కో ఏఈ ఎగ్జామ్ –2017’లో ఏకంగా స్టేట్ సెకండ్ ర్యాంకు కల్యాణ్ సక్సెస్ స్టోరీ తన మాటల్లోనే... స్టార్ట్ 1.. 2.. 3 ఆంధ్రప్రదేశ్ పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీజెన్కో)లో.. అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టుల భర్తీకి ప్రకటన (ఈ ఏడాది మార్చిలో) జారీ అవుతుందని తెలిసి.. నెల రోజుల ముందుగా ప్రిపరేషన్ మొదలుపెట్టాను. టాప్ లెవలే టార్గెట్: ఈ పరీక్షలో మంచి మార్కులు సాధించి టాప్ ర్యాంక్ సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఖాళీల సంఖ్య తక్కువగా ఉండటంతో ఉద్యోగం పొందాలంటే టాప్‌లో నిలవాలని నిర్ణయించుకున్నా. ‘వ్యూ’హం ఇదీ..: పరీక్షను 100 మార్కులకు నిర్వహించారు. ఇందులో టెక్నికల్ అంశాలకు 70 మార్కులు; ఆప్టిట్యూడ్‌కు 30 మార్కులు కేటాయించారు. టెక్నికల్ విభాగం కోసం నోటిఫికేషన్‌లోని సిలబస్‌లో పేర్కొన్న అన్ని అంశాలనూ క్షుణ్నంగా చదివా. ‘సాక్షి’ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఏపీజెన్కో ప్రీవియస్ పేపర్లను విశ్లేషించాను. వాటిలో థియరీ ప్రశ్నలు ఎక్కువ వచ్చినట్లు గమనించి.. ప్రతి సబ్జెక్టునూ పరిపూర్ణంగా అధ్యయనం చేశా. తర్వాత గేట్, ఐఈఎస్, ఇస్రో థియరీ ప్రశ్నలను సాధన చేశాను. ఈ వ్యూహం ఫలించింది. వీడియోలతో సందేహాల నివృత్తి ఆప్టిట్యూడ్ విభాగం కోసం తొలుత ‘ఏపీజెన్కో’తోపాటు టీఎస్జెన్కో ప్రీవియస్ పేపర్లనూ పరిశీలించాను. వాటిలోని ప్రశ్నలకు సంబంధించిన టాపిక్లనే ప్రధానంగా ప్రిపేర్ అయ్యాను. రోజూ వివిధ దినపత్రికల్లో వచ్చిన మాదిరి ఆప్టిట్యూడ్ ప్రశ్నలకు సమాధానాలను సాధన చేశాను. ఏదైనా అంశం అర్థంకాకపోతే దాన్ని యూట్యూబ్ వీడియోల సాయంతో అవగాహన చేసుకున్నాను. ప్రిపరేషన్లో భాగంగా ఎస్సెస్సీ–జేఈ, సీఐఎల్ ప్రీవియస్ పేపర్లు కూడా ప్రాక్టీస్ చేశాను. మాక్ టెస్టులతో మెళకువలు ఎన్నో మాక్ టెస్టులకు హాజరయ్యాను. తద్వారా పరీక్షల్లో టైమ్ మేనేజ్మెంట్ ప్రాముఖ్యత తెలిసొచ్చింది. కచ్చితత్వమూ అలవడింది. కొత్త టాపిక్‌లు, ట్రిక్స్ తెలిశాయి. ఒక టాపిక్/సబ్జెక్టు చదవడం పూర్తయిన తర్వాత టెస్ట్ సిరీస్‌లు అటెంప్ట్ చేశాను. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు సాధ్యమైనన్ని ఎక్కువ మాక్ టెస్టులు రాయాలి. ప్రకటన నుంచి పరీక్ష వరకు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఎగ్జామ్ నిర్వహించే రోజు వరకూ.. అందుబాటులో ఉండే సమయం ఎంతో విలువైంది. అందువల్ల దాన్ని ప్రణాళికాబద్దంగా సద్వినియోగం చేసుకున్నాను. రోజూ ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు గంట సేపు వివిధ దినపత్రికల్లో వచ్చిన ఆప్టిట్యూడ్ ప్రశ్నలను సాధన చేశాను. తర్వాత సాయంత్రం ఐదు గంటల వరకు టెక్నికల్ సబ్జెక్టులు చదవడం; టెస్ట్ సిరీస్‌లు అటెంప్ట్ చేయడం; ముఖ్య పాయింట్లు, ఫార్ములాలు నోట్స్ రూపంలో రాసుకోవడం; గుర్తుపెట్టుకోవడం కష్టం అనిపించే సూత్రాలను కాగితంపై రాసుకొని గోడకు అంటించి క్రమంతప్పకుండా మననం చేసుకోవడం ద్వారా పరీక్షకు పక్కాగా సంసిద్ధమయ్యాను. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రీవియస్ టెక్నికల్ పేపర్లను సాల్వ్ చేసేవాణ్ని. రెండు వారాల ముందు పరీక్షకు రెండు వారాల సమయం ఉందనగా వీలైనన్ని ఎక్కువ మాక్ టెస్టులకు హాజరయ్యాను. చివరి వారంలో.. అప్పటిదాకా చదివిన అంశాలన్నింటినీ రివైజ్ చేసుకున్నాను. రిఫరెన్స్ బుక్స్ ఇస్రో ప్రీవియస్ పేపర్లు; సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లోని ఏపీ, టీఎస్ జెన్కో ప్రీవియస్ పేపర్లు. చిన్న పొరపాటుతో ఫస్ట్ ర్యాంక్ కోల్పోయా పోటీ పరీక్షల్లో ఒక్క మార్కు తేడాతో అవకాశం తారుమారవుతుంది. కాబట్టి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్లు సిలబస్‌లోని అన్ని సబ్జెక్టులనూ ఆమూలాగ్రం చదవాలి. చిన్న పొరపాటు కూడా దొర్లకుండా చూసుకోవాలి. ఓఎంఆర్ షీట్లో ఆన్సర్లు బబ్లింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఒక ప్రశ్నకు నాకు సమాధానం తెలిసినా.. అనుకోకుండా వేరే ఆప్షన్‌ను బబుల్ చేశాను. దీంతో ఫస్ట్ ర్యాంక్ మిస్సైంది. మిత్రులతో చర్చించండి ఈ పరీక్షలో ఎక్కువ శాతం థియరీ ప్రశ్నలకే సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అందువల్ల వాటిని కచ్చితంగా, షార్ట్ కట్లో రాసేందుకు వీలున్న పద్ధతులపై మీలాగే పరీక్షకు ప్రిపేర్ అయ్యే స్నేహితులతో చర్చించాలి. తద్వారా కొత్త మెథడ్స్, ట్రిక్స్ తెలుసుకోవచ్చు. ఎగ్జామ్ హాల్లో ఆందోళన వద్దు పరీక్షలో తొలుత నిమిషం లోపు వ్యవధిలో సమాధానం గుర్తించగల ప్రశ్నలు అటెంప్ట్ చేయాలి. తర్వాత.. నిమిషం వ్యవధిలో; అనంతరం ఒకటీ రెండు నిమిషాల వ్యవధిలో ఆన్సర్ చేయగల ప్రశ్నలు పరిశీలించాలి. చివరికి సమస్యాత్మక ప్రశ్నల జోలికి వెళ్లాలి. తద్వారా అనవసర ఆందోళనలకు గురయ్యే ఆస్కారం ఉండదు. పరీక్షను ప్రశాంతంగా పూర్తి చేయొచ్చు. ప్రొఫైల్ తండ్రి: మేడూరి వీవీఎస్ఎన్ మూర్తి (కార్పెంటర్); తల్లి: ఎంఎల్ ప్రసన్న(గృహిణి). అకడమిక్ ప్రొఫైల్: ఎస్సెస్సీలో 526/600 మార్కులు ఇంటర్లో 957/1000 మార్కులు; బీటెక్‌లో9.1/10; ఎంటెక్ (మెకానికల్) 9.61/10 (ఐఐటీ గువాహటి). అచీవ్మెంట్లు: బీటెక్ ఫస్టియర్‌లో ఫస్ట్ ర్యాంక్; ‘గేట్’లో 1473 ర్యాంక్; ఎంటెక్‌లో ఉండగా ‘ఆప్టిమైజేషన్ ఆఫ్ బేరింగ్స్’పై జర్నల్ పేపర్ పబ్లిష్ అయింది. ఏపీ జెన్కో పరీక్షలో 100 కు 84 మార్కులతో సెకండ్ ర్యాంక్. -
సబ్‌స్టేషన్ నిర్మాణాల వేగం పెంచండి
ట్రాన్స్‌కో, జెన్కో అధికారులకు హరీశ్ రావు ఆదేశం సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో సబ్స్టేషన్ల నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని నీటి పారుదల శాఖా మంత్రి టి.హరీశ్‌రావు విద్యుత్ శాఖ అధికారులను కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం షెడ్యూల్ కన్నా ముందే పూర్తి చేసేందుకు విద్యుత్ సంస్థల సహకారం, తోడ్పాటు అవసరమన్నారు. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల పరిధిలోని సబ్స్టేషన్లు, విద్యుత్ టవర్లు, హెచ్‌టీ విద్యుత్ లైన్ల నిర్మాణానికి సంబంధించి తొలిసారి మంత్రి హరీశ్‌రావు ట్రాన్స్ కో, జెన్ కో, నీటి పారుదల శాఖ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన విద్యుత్ సంబంధిత పనులను ప్యాకేజీల వారీగా సమీక్షించారు. 2018 మార్చి లోగా 10 సబ్ స్టేషన్లు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇకపై ప్రతి నెలా మొదటి మంగళవారం ఆయా పనుల పురోగతిపై సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. ఈ సమీక్షకు ఈఎన్సీ మురళీధర్, ట్రాన్స్‌కో డైరెక్టర్ సూర్యప్రకాశ్, జెన్కో డైరెక్టర్ వెంకటరాజం, ఎత్తిపోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, సీఈలు నల్లా వెంకటేశ్వర్లు, హరిరామ్, ఓఎస్డీ దేశ్‌పాండేలు పాల్గొన్నారు. -
ఆర్టీపీపీ మనుగడపై నీలినీడలు
► డిమాండ్ లేదనే పేరుతో యూనిట్లు నిలిపివేస్తున్న జెన్కో నవ్యాంధ్ర రాష్ట్రంలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాల మనుగడ కష్ట సాధ్యంగా మారింది. డిమాండ్ లేదనే పేరుతో రన్నింగ్‌లో యూనిట్లు నిలిపేస్తున్నారు. ప్రైవేట్ కంపెనీల చేతులోనడుస్తోన్న సోలార్, విండ్ పవర్‌ను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆర్టీపీపీ మనుగడపై జెన్కో యజమాన్యం చర్యలు తీసుకోక పోతే త్వరలోనే థర్మల్ స్టేషన్ మూసి వేసే ప్రమాదం ఉందని స్పష్టం అవుతోంది. ఎర్రగుంట్ల: జిల్లాలోని ఎర్రగుంట్ల మండల పరిధిలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో ఐదు యూనిట్లకు గాను ఒక్కోదానిలో 210 మెగావాట్ల చొప్పున 1050 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. అయితే ఏపీజెన్కో యజమాన్యం థర్మల్ స్టేషన్‌కు విద్యుత్ జనరేషన్ కాస్ట్ అధికంగా వస్తుందని నిలుపుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఆర్టీపీపీలో ఉన్న 1,2,3,4,5 యూనిట్లకు గాను, 1,5 యూనిట్లును ఓవరాలింగ్ పేరుతో నిలిపేశారు. థర్మల్ స్టేషన్‌ను నీరుగార్చడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని కార్మిక సంఘాలు దుయ్యబడుతున్నాయి. ఆర్టీపీపీ మాదిరిగానే విజయవాడలో ఉన్న ఎస్డీఎస్టీపీఎస్( శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్), నెల్లూరులో ఉన్న డీఎన్టీటీపీఎస్( డాక్టరు నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్)లలో యూనిట్లను నిలిలిపి వేసి ఉత్పత్తిని పూర్తిగా తగ్గించారు. ఎస్డీఎస్టీపీఎస్ లో 7 యూనిట్లకు గాను 1760 మెగావాట్ల విద్యుత్ ఉత్పతి జరగాల్సింది. ఇప్పుడు ఇందులో 3 యూనిట్లు నిలిపినట్లు సమాచరం.డీఎన్టీటీపీఎస్లో 2 యూనిట్లు ఉండగా ఒక్కోదానిలో 800 మెగావాట్ల ఉత్పతి జరగాల్సి ఉండగా ఒక యూనిట్‌ను నిలిపేశారు. ప్రసుతం అక్కడ 500 మెగావాట్లు మాత్రమే ఉత్పతి చేస్తున్నారు. ఆర్టీపీపీలో 3 రోజులు సరిపడా బొగ్గు నిల్వలు. ఆర్టీపీపీలో ప్రస్తుతం 3 రోజులు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఆర్టీపీపీకి సింగరేణి, తాల్చేరు బొగ్గు క్షేత్రాల నుంచి బొగ్గు వస్తుంటుంది. ఇప్పడు సింగరేణి నుంచి బొగ్గు సరఫర తగ్గింది. కేవలం ఒరిస్సా నుంచి మాత్రమే వస్తోంది. గతంలో లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉండేవి. కానీ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ విషయంపై ఆర్టీపీపీ సీఈ ఏమంటున్నారంటే.. ఈ విషయంపై ఆర్టీపీపీ చీఫ్ ఇం జినీర్ శ్రీరాములును వివరణ కో రగా ఆర్టీపీపీలో 5 యూనిట్లకు గాను 1,5 యూనిట్లను ఓవరాలింగ్ వల్ల నిలుపుదల చేసినట్లు తెలిపారు. 2,3,4 యూనిట్ల నుంచి 160 మెగా వాట్లు ఉత్పత్తి చేస్తున్నామన్నారు. బొగ్గు నిల్వలు ప్రస్తుతం 35 వేల టన్నులు మాత్రమే ఉన్నాయని. ఇవి కేవలం 3 రోజులకు సరిపోతాయన్నారు. రోజూ బొగ్గు వ్యాగన్లు వస్తున్నాయని చెప్పారు. – శ్రీరాములు ( ఆర్టీపీపీ చీఫ్ ఇంజనీరు, ఎర్రగుంట్ల) -
యాదాద్రి ప్లాంట్‌కు ఓకే
-
యాదాద్రి ప్లాంట్‌కు ఓకే
- షరతులతో కూడిన పర్యావరణ అనుమతులు - కేంద్రానికి నిపుణుల కమిటీ సిఫార్సు - రూ.25 వేల కోట్లు... 4,000 ఉద్యోగావకాశాలు సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) నిర్మించ తలపెట్టిన 4,000 మెగావాట్ల (5’800) యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్కేంద్రానికి షరతులతో కూడిన పర్యావరణ అనుమతులివ్వాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) సిఫార్సు చేసింది. ఏప్రిల్ 26న జరిగిన ఈఏసీ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ తాజాగా బయట పెట్టింది. దీంతో ప్లాంట్ నిర్మాణానికి ప్రధాన అడ్డంకి తొలగినట్టయింది. రూ.25,099.42 కోట్ల అంచనా వ్యయంతో జెన్కో నిర్మిస్తున్న ఈ విద్యుత్కేంద్రం నిర్మాణంలో ప్రత్యక్షంగా 150 మందికి, పరోక్షంగా 5,000 మందికి ఉపాధి, ఉగ్యోగావకాశాలు లభించనున్నాయి. నిర్మాణం పూర్తయ్యాక ప్రత్యక్షంగా 2,000, పరోక్షంగా మరో 2,000 మందికి ఉపాధి లభిస్తుంది. ప్లాంట్‌కు పర్యావరణ అనుమతుల విషయంలో ఈఏసీ పలు షరతులు విధించింది. అలాగే ‘బూడిద శాతం 30కి మించకుండా, రైల్వే లైన్ ద్వారానే సింగరేణి సంస్థ బొగ్గును సరఫరా చేయాలి. రైల్వే లైన్‌కు భూ సేకరణ కోసం ఎవరినీ నిర్వాసితులను చేయొద్దు. ప్రాజెక్టు నిర్మాణానికి భూగర్భ జలాలను వినియోగించరాదు.’ అన్న అంశాలపై జెన్కో నుంచి రాతపూర్వక హామీ కోరింది. ఈఏసీ విధించిన ఇతర షరతులు... ► వీర్లపాలెంలోని మాడచెలు ప్రాంతం నుంచి కృష్ణా నదిలోకి సహజ నీటి ప్రవాహ వ్యవస్థను సంరక్షిస్తామంటూ జెన్కో రాతపూర్వక హామీ ఇవ్వాలి ► 50కి.మీ. దూరంలో ఎక్కడైనా మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీపీ) ఉంటే ప్లాంట్ అవసరాలకు ఆ నీటినే వాడాలి ► ప్లాంట్ మధ్యలో నుంచి వెళ్తున్న వాగుకు రెండు వైపులా 100 మీటర్ల స్థలాన్ని చెట్ల పెంపకానికి కేటాయించాలి. హెక్టారుకు 2,500 మొక్కలు పెంచాలి ► ప్రాజెక్టు కింద స్థలాలు కోల్పోయే ప్రజల నైపుణ్యాలను గుర్తించి వారికి జీవనోపాధి కల్పించేందుకు దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలి. దీనిపై అనుమతులు జారీ తర్వాత మూడు నెలల్లో ప్రణాళికను జెన్కో సమర్పించాలి ► ప్రాజెక్టు పరిసరాల్లో ఆధునిక సూక్ష్మ, సేంద్రియ సాగు, సేంద్రియ ఎరువుల ప్రోత్సాహానికి చర్యలు తీసుకోవాలి ► కార్పొరేట్ సామాజిక బాధ్యత అమలులో మహిళా సాధికారతను దృష్టిలో పెట్టుకోవాలి. వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఏర్పాటు చేయాలి ► యువతకు కంప్యూటర్ శిక్షణ అందించేందుకు పాఠశాలలో కంప్యూటర్లు, కంప్యూటర్ శిక్షకుడి ఏర్పాట్లు చేయాలి ► స్వచ్ఛ భారత్ అభియాన్ కింద అన్ని బయో టాయిలెట్లకు నీటి సదుపాయం కల్పించాలి. -
ఏపీ వాటా తెలంగాణ పరం
సాక్షి, అమరావతి : హైదరాబాద్ విద్యుత్ సౌధాలో వాటాను వదులుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఆస్తులు, అప్పులపై రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం పరిష్కారం కాకుండానే ఆస్తులన్నీ అప్పగించాలనే నిర్ణయం విద్యుత్ సిబ్బందికి విస్మయం కలిగిస్తోంది. తెలంగాణకు భయపడి విలువైన ఆస్తులు వదులుకోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆరు అంతస్తుల్లో విద్యుత్ సౌధా నిర్మించారు. రాష్ట్ర విభజన తర్వాత దీన్ని ఏపీ, తెలంగాణ పంచుకోవాల్సి ఉంది. భౌగోళికంగా తెలంగాణలో ఉండటం వల్ల ఇది ఆ రాష్ట్రానికే చెందే వీలుంది. అయితే, ఏపీ వాటా కింద తెలంగాణ కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఆస్తుల విలువ కట్టకపోవడం వల్ల ఎంతమొత్తం ఇవ్వాలనేది ఇంకా నిర్థారణ కాలేదు. ప్రస్తుతం విద్యుత్ సౌధాలో రెండు రాష్ట్రాల జెన్కో, ట్రాన్స్‌కో కార్యాలయాలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. పదేళ్ళ పాటు ఏపీ ఇక్కడ తమ ఆఫీసులను నిర్వహించుకునే హక్కు కూడా ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్ సంస్థలను విజయవాడకు తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. మే నెలాఖరుకు అన్ని శాఖలను గుణదలకు తీసుకెళ్ళేందుకు ఏపీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కార్యాలయాలు ఖాళీ చేసినప్పటికీ ఆస్తుల పంపకం జరిగే వరకూ ఏపీ ఆఫీసులకు తాళాలు వేసి, తమ ఆధీనంలో ఉంచుకోవాలని ఏపీ విద్యుత్ సంస్థలు భావించాయి. దీనిపై తెలంగాణ అధికారులు తీవ్ర అభ్యంతరం లేవనెత్తినట్టు తెలిసింది. తాళాలు వేసుకుని పోతే ఆ గదుల్లో ఎలుకలు చనిపోతాయని, దీంతో పక్కన ఉన్న తమ గదుల్లోనూ భరించలేని వాసన వస్తుందని ఏపీకి తెలిపారు. తాళాలు వేసుకుని వెళ్ళే పరిస్థితే వస్తే ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్ళనీయమని హెచ్చరించినట్టు తెలిసింది. దీంతో తెలంగాణ అధికారులతో ఏపీ అధికారులు చర్చలు జరిపారు. మొత్తం బిల్డింగ్ తమకు ఇవ్వాలని, ఆస్తుల పంపకం తేలే వరకూ నెలకు రూ.2 లక్షలు అద్దె చెల్లిస్తామని తెలంగాణ ప్రతిపాదించింది. దీనికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే ఇప్పటికే తెలంగాణ రూ.4,800 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించలేదని, అద్దె మాత్రం చెల్లిస్తుందా? అని ఏపీ విద్యుత్ సిబ్బంది పెదవి విరుస్తున్నారు. అయినా ఆరు అంతస్తుల భవనాన్ని కేవలం రూ.2 లక్షల అద్దెకే ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఖైరతాబాద్ ప్రాంతంలో ఒక్కో ఫ్లోర్ కనీసం రూ.25 లక్షల అద్దె పలుకుతుందని, ఆరు అంతస్తులకు దాదాపు రూ.1.50 కోట్ల వరకూ అద్దె వచ్చే వీలుందని చెబుతున్నారు. ప్రభుత్వ తీరుపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
ఆ అధికారం ఈఆర్సీకి లేదు
⇒ సుమోటోగా టారిఫ్ ⇒ జారీ చేయడంపై ట్రాన్స్‌కో సీఎండీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు విద్యుత్ టారిఫ్ పెంపు ప్రతిపాదనలు సమర్పించని పక్షంలో సుమోటో (తమంతట తాము)గా నిర్ణయం తీసుకుంటామని హెచ్చరిస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) లేఖ రాయడాన్ని తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో), విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో)ల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు తీవ్రంగా తప్పుపట్టారు. గత నెల 11న ఈఆర్సీ డిస్కంలకు రాసిన లేఖపై ఆయన స్పందిస్తూ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సుమోటోగా విద్యుత్ టారిఫ్‌పై నిర్ణయం తీసుకోవడానికి ఈఆర్సీ ఏమీ ప్రభుత్వం కానీ, కోర్టు కానీ కాదని స్పష్టం చేశారు. ఈఆర్సీకి అలాంటి అధికారాలు లేవన్నారు. వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్), టారిఫ్ ప్రతిపాదనలను డిస్కంలు సమర్పించిన తర్వాతే విద్యుత్ టారిఫ్‌పై నిర్ణయం తీసుకునే అధికారం ఈఆర్సీకి ఉందని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏఆర్‌ఆర్‌లు, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించడంలో జాప్యం జరిగిందని, ఏ ఈఆర్సీ ఇలాంటి నోటీసులు జారీ చేయలేదన్నారు. ఉజ్వల్ డిస్కం యోజన (ఉదయ్) పథకంలో డిస్కంల చేరికతో పాటు పెద్ద నోట్ల రద్ద కారణాలతో టారిఫ్ ప్రతిపాదనల సమర్పణలో జాప్యం జరిగిందన్నారు. విద్యుత్ టారిఫ్ పెంపు ప్రతిపాదనలను ఇప్పటికే డిస్కంలు సీఎం కేసీఆర్‌కు సమర్పించాయని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టంచేశారు. ఛత్తీస్‌గఢ్ పీపీఏకూ అనుమతి అక్కర్లేదు ఛత్తీస్‌గఢ్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి (పీపీఏకు) తెలంగాణ రాష్ట్ర ఈఆర్సీ ఆమోదించాల్సిన అవసరం లేదని ప్రభాకర్ రావు తేల్చి చెప్పారు. నిబంధనల మేరకు ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఆమోదిస్తే సరిపోతుందన్నారు. ఉత్తర, తూర్పు, పశ్చిమ విద్యుత్ గ్రిడ్ల (న్యూ గ్రిడ్)తో దక్షిణ గ్రిడ్ అనుసంధానం కోసం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిర్మిస్తున్న వార్ధా (మహారాష్ట్ర)– డిచ్ పల్లి– మహేశ్వరం 765 కేవీ డబుల్ సర్క్యూ ట్ కారిడార్ నిర్మాణం పూరై్తన వెంటనే ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు ప్రారం భిస్తామన్నారు. -
విద్యుత్ ‘ఉద్యోగుల’ క్రమబద్ధీకరణను పరిశీలించండి
-
విద్యుత్ ‘ఉద్యోగుల’ క్రమబద్ధీకరణను పరిశీలించండి
ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో, డిస్కంలలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ విద్యుత్ ఉద్యోగులందరినీ దశల వారీగా క్రమబద్ధీకరించేందుకు ఉన్న అవకా శాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కె.చం ద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. విద్యుత్ ఉద్యోగ సంఘాలు తక్షణమే సమ్మె పిలుపును ఉపసంహరించుకుని శుక్ర వారం విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డితో చర్చల కు రావాలని పిలుపుని చ్చారు. విద్యుత్ ఉద్యోగుల సమ స్యలపట్ల ప్రభుత్వం తొలి నుంచీ సానుకూ లంగా స్పందిస్తోందని, ఏ సమస్య ఉన్నా చర్చల ద్వారా పరిష్కరించు కునే అవకాశముందని, సమ్మెలు అవసరం లేద న్నారు. రాజకీయ కారణాలతో చేసే సమ్మెలో భాగస్వాములు కారాదని సూచిం చారు. సమ్మె ఉపసంహరణ ప్రకటన జరిగిన వెంటనే ఉద్యోగ సంఘాల నాయకులను చర్చ లకు పిలవాలని మంత్రి జగదీశ్‌రెడ్డిని సీఎం ఆదేశించారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలని సూచించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు సంతోషంగా, సంతృప్తిగా ఉం డాలని, ఆరోగ్యకరమైన తెలంగాణ లక్ష్యమని సీఎం చెప్పారు. విద్యుత్ శాఖ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై గురువారం తన అధికారిక నివాసం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యో గుల డిమాండ్లను ట్రాన్సకో, జెన్కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు, ఇతర అధికారులు ముఖ్య మంత్రి దృష్టికి తెచ్చారు. సబ్ స్టేషన్లు, లైన్లు, విద్యుత్ ప్లాంట్లు, కార్యాలయాల నిర్వహణ లాంటి కీలక విభాగాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సేవలందిస్తున్నారని, వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలనే డిమాండ్ ఉందని ముఖ్యమంత్రికి విన్నవించారు. దీనిపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తక్కువ వేతనాలతో విద్యుత్ శాఖకు ఏళ్లుగా సేవలందిస్తున్నారని, అనుభవం కూడా గడించారన్నారు. అందువల్ల వారి డిమాండ్‌ను మానవతా కోణంలో పరిశీలించి దశలవారీగా రెగ్యులరైజ్ చేయాలని సీఎం పేర్కొన్నారు. దీనికి విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గతంలో విద్యుత్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేత నాలు భారీగా పెంచామని, అదే తరహాలో అన్ని సమస్యలు పరిష్కరిం చేందుకు ప్రభు త్వం సానుకూలంగా ఉందని సీఎం ప్రకటిం చారు. సమావేశంలో జగదీశ్‌రెడ్డి, విద్యుత్ శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా, సీఎంవో కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
నేడు కేంద్ర విద్యుత్ మంత్రితో కేసీఆర్ భేటీ
భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి అనుమతులపై చర్చ సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆది వారం ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం కానున్నారు. కొత్తగూడెం జిల్లా మణుగూరులో తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) ఆధ్వర్యంలో నిర్మిం చతలపెట్టిన 1080 మెగావాట్ల సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతుల జారీ అంశంపైసీఎం ఈ భేటీలో చర్చించనున్నా రు. భద్రాద్రి ప్లాంట్‌ను సబ్‌క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించేందుకు ప్రత్యేక సడలింపులు ఇవ్వాలని కేంద్ర విద్యుత్ మంత్రికి విజ్ఞప్తి చేయనున్నారని తెలిసింది. -
‘భద్రాద్రి’కి దారి చూపండి!
- పర్యావరణ అనుమతులు నిరాకరిస్తే రాష్ట్రానికి భారీ నష్టం - కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు జెన్కో లేఖ సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిర్మించతలపెట్టిన 1080 (4్ఠ270) మెగావాట్ల భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఇటీవల కేంద్ర పర్యా వరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి త్వ శాఖ(ఎంఓఈఎఫ్) అనుమతులు నిరాకరిం చడంపై రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) తక్షణమే స్పందించింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ(ఎంఓపీ) పాలసీకి విరుద్ధంగా సబ్ క్రిటికల్ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న భద్రాద్రి విద్యుత్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతుల జారీని పరిశీలించలేమని పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ నెల 4న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 13వ పంచవర్ష ప్రణాళిక కాలం (2017-22)లో కేవలం సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లను మాత్రమే అనుమతించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రానికి భారీ నష్టం జరగనుందని జెన్కో యాజమాన్యం స్పందించింది. ఈ ప్లాంట్ నిర్మాణానికి ఇప్పటికే రూ.1000 కోట్ల వ్యయం చేశామని, ఈ దశలో ప్లాంట్ నిర్మాణాన్ని విరమించుకోవడం సాధ్యం కాదని తెలిపింది. భద్రాద్రి ప్లాంట్‌కు పర్యావ రణ అనుమతులను జారీ చేయాలని కోరుతూ జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు తాజాగా పర్యా వరణ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీ కారణంతో ప్లాంట్‌కు అనుమతినివ్వలేమన్న నిర్ణయం సరికాదన్నా రు. వివిధ రాష్ట్రాల్లో ప్రైవేటు, ప్రభుత్వ రంగా ల్లో 36 సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తున్నారని, ఇవన్నీ 13వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే పూర్తి అవుతాయన్నారు. అరుునా, ఒక్క భద్రాద్రి విషయంలోనే అనుమతి నిరాకరించడం సరికాదన్నారు. -
క్రీడాభివృద్ధికి జెన్కో కృషి
టీఎస్ జెన్కో డైరెక్టర్ సి.రాధాకృష్ణ ఇంటర్ ప్రాజెక్ట్స్ క్రీడా విజేతలకు బహుమతులు అందజేత పాల్వంచ : టీఎస్ జెన్కో విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు యాజమాన్యం ప్రత్యేకంగా కృషి చేస్తోందని జెన్కో డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) సి.రాధాకృష్ణ అన్నారు. స్థానిక టీఆర్సీ ఇండోర్ స్టేడియంలో మూడు రోజులుగా సాగుతున్న టీఎస్ జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్స్ క్రీడా పోటీలు గురువారం రాత్రి ముగిశాయి. ఈ పోటీల్లో షటిల్ బ్యాడ్మింటన్ టీం ఈ వెంట్లో కేటీపీఎస్ ఓఅండ్ఎం ప్రథమ, కేటీపీపీ(భూపాలపల్లి) ద్వితీయ, కేటీపీఎస్ 5వ దశ తృతీయ స్థానంలో నిలిచాయి. క్యారమ్స్ టీం ఈ వెంట్లో విద్యుత్ సౌధ (హైదరాబాద్) ప్రథమ, కేటీపీపీ ద్వితీయ, కేటీపీఎస్ 5వ దశ తృతీయ, టెన్నికాయిట్ టీం ఈవెంట్లో కేటీపీఎస్ 5వ దశ ప్రథమ, కేటీపీపీ ద్వితీయ, కేటీపీఎస్ ఓఅండ్ఎం తృతీయ, చెస్‌లో కేటీపీఎస్ ఓఅండ్ఎం ప్రథమ, కేటీపీఎస్ 5వ దశ ద్వితీయ, శ్రీశైలం తృతీయ, టేబుల్ టెన్నిస్‌లో కేటీపీఎస్ ఓఅండ్ఎం ప్రథమ, కేటీపీపీ ద్వితీయ, విద్యుత్ సౌధ తృతీయ, టేబుల్ టెన్నిస్ పురుష విభాగంలో కేటీపీఎస్ ఓఅండ్ఎం ప్రథమ, కేటీపీఎస్ 5వ దశ ద్వితీయ, కేటీపీపీ తృతీయ స్థానాల్లో నిలిచాయి. మహిళా క్రీడల్లో సీహెచ్.అనంత లక్ష్మి చాంపియన్‌షిప్ సాధించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజేతలకు ట్రోఫీలను డైరెక్టర్ రాధాకృష్ణ అందజేశారు. ఈ పోటీలకు కె.హిజ్కియరాజ్, బి.వీరునాయక్, వి.జాకబ్, ఎస్కె.సోందు, బి.సత్యనారాయణ, ఎన్.వెంకటేశ్వర్లు, వంశీ, వెంకట్ రిఫరీలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో సీఈలు వి.మంగేష్‌కుమార్, పి.రత్నాకర్, స్పోర్ట్స్ ఆఫీసర్ లోహిత్ ఆనంద్, వై.వెంకటేశ్వర్లు, డి.సారయ్య, నరసింహారావు, అనుమంతరామ పాల్గొన్నారు. (30కెజిఎం272) : అనంతలక్ష్మికి ట్రోఫీ అందిస్తున్న డైరెక్టర్ రాధాకృష్ణ (30కెజిఎం273) : విజేతలకు బహుమతులు అందిస్తున్న రాధాకృష్ణ -
జెన్కో బొగ్గు రవాణా పేరిట దోపిడీ
వరంగల్ : జెన్కో నిర్వహణలోని కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్‌కు జరుగుతున్న బొగ్గు రవాణాలో కోట్ల రూపాయాలు దోచుకుం టున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు ఆరోపించారు. హన్మకొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2010లో కాకతీయ థర్మల్ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభం అయ్యిందన్నారు. బొగ్గును స్థానిక భూపాలపల్లి గనుల నుంచి తీసుకోకుండా నాణ్యత పేరుతో గోదావరిఖని నుంచి తెప్పించడం వల్ల రవాణా చార్జీలతో బొగ్గు ధర పెరిగి ఉత్పత్తి వ్యయంపై భారం పడుతోందన్నారు. ఇది కేవలం కాంట్రాక్టర్లకు దోచిపేట్టేందుకే కోల్ డైరెక్టర్, పవర్ స్టేషన్ ఎస్ఈలు ఈ పద్ధతిలో కొనుగోలు చేస్తున్నారని అన్నారు. దీంతో పాటు ఉప్పల్ స్టేషన్లో బొగ్గును నీటితో కడగడం వల్ల ప్రతి రోజు 200 టన్నుల బరువు అదనంగా కాంట్రాక్టర్‌కు కలసి వస్తోందన్నారు. ఎక్కువ వచ్చిన బొగ్గును సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇటుక బట్టీలకు అమ్ముకునేందుకు లారీల్లో తరలిస్తుం టే కరీంనగర్ జిల్లా మానకొండూరులో పోలీసులు పట్టుకొని సీజ్ చేశారని అన్నారు. ఈ బొగ్గు రవాణా కాంట్రాక్టు కాంగ్రెస్ నేత గండ్ర రమణారెడ్డి కుటుంబానిదే కావడం వల్ల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోందన్నారు. అధికార పార్టీ నేతలకు సైతం భారీ మొత్తంలో ముడుపులు చెల్లించడం వల్ల ఈ దోపిడీని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకపోవడం లేదన్నారు. ఇప్పటి వరకు బొగ్గు రవాణా, కొనుగోలు, తదితర విషయాల్లో సుమారు రూ.1500 కోట్ల వరకు దళారులు, కాంట్రాక్టర్లు, అధికారులు కలసి పంచుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీ సీఐడీ, సెంట్రల్ విజిలెన్స్‌తో విచారణ జరిపించాలని సీఎం కేసీఆర్‌కు, జెన్కో సీఎండీకి ఫిర్యాదు చేస్తామన్నారు. మిషన్ కాకతీయ పనుల్లో అవినీతి జరిగిందని అనేదానికి ఇటీవల ఐదుగురు ఇంజనీర్ల సస్పెన్షన్లే రుజువని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క అన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకొని తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూ రు అశోక్‌కుమార్, నాయకులు ఆక రాధాకృష్ణ, చాడా రఘునాథరెడ్డి, హన్మకొండ సాంబయ్య, రహీం, మార్గం సారం గం, తాళ్లపల్లి జయపాల్ తదితరులు పాల్గొన్నారు. l అధికార పార్టీ నాయకులకు వాటాలు l బొగ్గు అక్రమ రవాణా చేస్తున్న కాంట్రాక్టర్ l ఆరేళ్లలో రూ.1500కోట్లు లూటీ l టీyీ పీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు -
జెన్కో ఇంటర్ ప్రాజెక్టు క్రీడలు ప్రారంభం
పాల్వంచ (ఖమ్మం) : మూడు రోజుల పాటు జరగనున్న జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్ బాల్ బ్యాడ్మింటన్, చెస్ క్రీడా పోటీలు సోమవారం ఖమ్మం జిల్లా పాల్వంచలో ప్రారంభమయ్యాయి. కేటీపీఎస్ సెంట్రల్ ఆఫీస్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను కేటీపీఎస్ ఓఅండ్ఎం సీఈ వి.మంగేష్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాపతాకాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. పోటీల్లో ఆర్టీపీఎస్(రామగుండం), శ్రీశైలం, కేటీపీపీ(భూపాలపల్లి), జూరాల, కేటీపీఎస్ ఓ అండ్ఎం, కేటీపీఎస్ 5,6 దశల టీంలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో 5, 6 దశల సీఈ పి.రత్నాకర్, జెన్కో స్పోర్ట్స్ ఆఫీసర్ లోహిత్ ఆనంద్, డిప్యూటీ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎస్ఈ వి.కిషన్, స్పోర్ట్స్ సెక్రటరీ టి.వీరస్వామి, వైటీఎంకే.రాజు, కట్టా శ్రీధర్, బి.రామారావు, పీలే శ్రీనివాస్, రిఫరీలు బాలరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
యాష్‌పాండ్‌కు మరో రెండు ఔట్లెట్లు
సీఆర్డీఏకు జెన్కో బూడిద ముత్తుకూరు : నేలటూరులోని ఏపీజెన్కో ప్రాజెక్టు యాష్‌పాండ్(బూడిద బావి)కి మరో రెండు ఔట్లెట్లు మంజూరైనట్లు ప్రాజెక్టు ఇంజనీర్లు బుధవారం తెలిపారు. ప్రస్తుతం రెండు ఔట్లెట్ల ద్వారా ద్రవ రూపంలో చేరే బూడిదతో యాష్‌పాండ్ ఓ వైపు పూర్తిగా నిండిపోయింది. దీంతో చెరువు మధ్య వరకు పైపును పొడిగించి బూడిద విడుదల చేయాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు రూ.2.75 కోట్లతో మరో రెండు ఔట్లెట్లు, పైపులైన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. నూతన రాజధానిలో నిర్మించనున్న రోడ్లకు జెన్కో ప్రాజెక్టు బూడిద తరలించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వివరించారు. -
జెన్కోపై క్రిమినల్ చర్యలు
పర్యావరణ అనుమతి లేకుండా ‘భద్రాద్రి’ నిర్మాణంపై ఎన్జీటీ ఆగ్రహం సాక్షి, హైదరాబాద్ : పర్యావరణ అనుమతి లేకుండా ఖమ్మం జిల్లా మణుగూరులో 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినందుకు తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) పీసీబీని ఆదేశించింది. వాటర్ యాక్ట్, ఎయిర్ యాక్ట్‌లతో పాటు పర్యావరణ చట్టం-1989 సెక్షన్లు 15, 16, 17 కింద 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలంది. పర్యావరణ అనుమతులు లేకుండా భద్రాద్రి విద్యుత్ కేంద్ర పనులు ప్రారంభించడంపై అభ్యంతరం తెలుపుతూ హ్యూమన్‌రైట్స్ ఫోరం (హెచ్ఆర్ఎఫ్) సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 11న ఎన్జీటీ ఈ మేరకు తీర్పునిచ్చింది. బాధ్యులైన అధికారులపై ఇంతవరకు పీసీబీ (రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి) చర్యలు తీసుకోకపోవడం తమకు తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగించిందని తీర్పులో ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. పర్యావరణ చట్ట ఉల్లంఘనల విషయంలో జెన్కో నిర్వహణాధికారు (ఎగ్జిక్యూటివ్)లే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు జారీ చేసేవరకు ప్రాజెక్టు నిర్మాణ పనులపై జెన్కో యథాతథా స్థితిని కొనసాగించాలని పేర్కొంది. ఇప్పటికే చేపట్టిన నిర్మాణాలను ధ్వంసం చేసేందుకు ఆదేశించాలని పిటిషనర్ చేసిన విజ్ఞప్తిని ఎన్జీటీ తోసిపుచ్చింది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణంపై పడే ప్రభావంపై సరైన అధ్యయనం సాధ్యమా? కాదా? అన్న అంశంపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల మదింపు కమిటీ(ఈఏసీ) నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఒక వేళ జెన్కోకు వ్యతిరేకంగా ఈఏసీ నిర్ణయం వెలువడితే కేంద్ర పర్యావరణ శాఖ సరైన ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. పర్యావరణ అనుమతిపై 8 వారాల్లో నిర్ణయాన్ని తీసుకోవాలని గడువు విధించింది. -
జెన్కోలో సమ్మెలపై నిషేధం
-సమ్మె నోటిసు నేపథ్యంలో ఎస్మా ప్రయోగం హైదరాబాద్ అత్యవసర సేవల నిర్వహణ చట్టం(ఎస్మా) నిబంధనల కింద తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో)లో అన్ని రకాల సమ్మెలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉండిపోయిన 34 డిమాండ్లను పరిష్కరించకపోతే జూన్ 15వ తేదీ నుంచి విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు నిరవదిక సమ్మెలోకి దిగుతారని హెచ్చరిస్తూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగ సంఘాల సమాఖ్య రెండు రోజుల కింద విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు సమ్మె నోటిసులు అందజేశాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం జెన్కోలో సమ్మెలపై నిసేధం విధిస్తే ఉత్తర్వులు జారీ చేసింది. -
భద్రాద్రి పవర్ ప్లాంట్‌కు ‘గ్రీన్’ ట్రబుల్!
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా మణుగూరులో 1080 (270గీ4) మెగావాట్ల సామర్థ్యంతో తలపెట్టిన భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం విషయంలో తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) తీవ్ర చిక్కుల్లో పడింది. ఈ ప్లాంట్ నిర్మాణానికి జెన్కో పర్యావరణ అనుమతులు కోరితే మంజూరు చేయవద్దని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తాజాగా ఆదేశించింది. ఈ ప్లాంట్‌కి పర్యావరణ అనుమతులు జారీ చేయవద్దని సోమవారం జరిగిన విచారణలో ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని ఇంధన శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వివాదాల నేపథ్యం... భద్రాద్రి విద్యుత్ ప్లాంట్‌ను ‘సబ్ క్రిటికల్’ బాయిలర్ టెక్నాలజీతో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్తో జెన్కో ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం అతి తక్కువ సమయంలో.. మార్చి 2015 నుంచి 32 నెలల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలి. నాలుగు యూనిట్లలో తొలి యూనిట్‌ను 24 నెలల్లోనే పూర్తి చేయాల్సి ఉండగా.. తర్వాత మూడు నెలలకో ప్లాంట్ చొప్పున మొత్తం 32 నెలల్లో నాలుగు ప్లాంట్లు నిర్మించాలి. ఇప్పటికే ఏడాది పూర్తయింది. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఈ ప్లాంట్‌ను నిర్మించడం పట్ల తొలుత కేంద్ర పర్యావరణ శాఖ అభ్యంతరం తెలిపింది. అధునాతన సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి మారాలని, లేకుంటే కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నుంచి ప్రత్యేక అనుమతులు పొందాలని షరతులు విధించింది. అయితే రాష్ట్రంలో విద్యుత్ కొరత నేపథ్యంలో అతితక్కువ కాలంలో నిర్మించాలన్న ఉద్దేశంతో అందుబాటులో ఉన్న సబ్ క్రిటికల్ బ్రాయిలర్లతో ఈ ప్లాంట్‌ను నిర్మిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. మరోవైపు పర్యావరణ అనుమతులు పొందకుండానే గతేడాది ఈ ప్లాంట్ నిర్మాణ పనులను జెన్కో ప్రారంభించడంతో ఓ స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదుపై స్పందించిన ఎన్జీటీ ప్రాజెక్టు పనులను నిలుపుదల చేస్తూ స్టే విధించింది. స్టేను ఉల్లంఘించి జెన్కో పనులను కొనసాగించడంతో కేంద్ర పర్యావరణ శాఖతో ఎన్జీటీ విచారణ జరిపించింది. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిందని కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుడు ఎన్జీటీకి నివేదించారు. దీంతో తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయవద్దని గత నెల 7న ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. ఈ నెల 5, 6వ తేదీల్లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ ఢిల్లీలో సమావేశమై దేశంలో నిర్మించనున్న కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు పర్యావరణ అనుమతులు జారీ చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటుంది. ఈ సమావేశంలోనే భద్రాద్రి ప్లాంట్‌కి కూడా అనుమతుల అంశాన్ని పరిశీలించే విధంగా కేసు విచారణను ఈ నెల 17 నుంచి ముందుకు జరపాలని జెన్కో చేసిన విజ్ఞప్తి పట్ల ఎన్జీటీ సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు సోమవారం ఎస్జీటీ విచారణ జరిపింది. డిసెంబర్ 14న పనులు ఆపేశామని, ఈ విషయంలో పర్యావరణ మంత్రిత్వ శాఖ తప్పుడు నివేదిక సమర్పించిందని జెన్కో వాదించింది. ఈ విషయాన్ని అఫిడవిట్ రూపంలో సమర్పిస్తే తామే స్వయంగా విచారణ జరిపించి వాస్తవాలు తేలుస్తామని ఎన్జీటీ పేర్కొంది. అప్పటి వరకు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయవద్దని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించినట్లు తెలిసింది. -
అయ్యో పాపం జెన్కో
► రికార్డు స్థాయిలో పతనమైన ఉత్పత్తి సామర్థ్యం ► 2015-16లో 73.21 శాతానికి పడిపోయిన వైనం ► గత 13 ఏళ్లలో ఇదే అత్యల్పం ► జెన్కో ఉత్పత్తి లక్ష్యం 17,076 మిలియన్ యూనిట్లు ► ఉత్పత్తి చేసింది మాత్రం 15,123 మిలియన్ యూనిట్లే ► జెన్కోకు రూ.800 కోట్ల ఆదాయానికి గండి ► వినియోగదారులపై రూ.600 కోట్ల అనవసర భారం ► విద్యుత్‌కు ప్రైవేటు వైపు మొగ్గు చూపడమే కారణం సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు విద్యుత్‌పై ప్రేమ కొంపముంచింది. రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) ఉత్పత్తి సామర్థ్యం(పీఎల్ఎఫ్) ‘రికార్డు’ స్థాయిలో పతనమైంది. చౌకగా లభించే జెన్కో విద్యుత్ కాదని అధిక ధరలతో ప్రైవేటు విద్యుత్‌ను ఇష్టారాజ్యంగా కొనుగోలు చేయడంతో సంస్థ కుంగిపోయింది. 2012-13లో 84.2 శాతంగా ఉన్న జెన్కో పీఎల్ఎఫ్.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014-15లో 80.31 శాతానికి తగ్గింది. 2015-16లో మరింత పతనమై 73.21 శాతానికి దిగజారింది. వ్యవసాయ సంక్షోభంతో ఏడాదిన్నరగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పడిపోయింది. అయినా.. ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లను కొనసాగించడానికి ప్రభుత్వ రంగ సంస్థ జెన్కోలో ఉత్పత్తిని తగ్గించేశారు. దీంతో జెన్కో పీఎల్ఎఫ్ రికార్డు స్థాయిలో పతనమైంది. 2003-04 నుంచి 2015-16 మధ్య వరకు 13 ఏళ్ల పీఎల్ఎఫ్ గణాంకాలను పరిశీలిస్తే అత్యల్ప పీఎల్ఎఫ్ ఇదే కావడం గమనార్హం. ఉత్పత్తి తగ్గడంతో జెన్కో రూ.800 కోట్ల ఆదాయాన్ని కోల్పోగా.. అధిక ధరలు గల ప్రైవేటు విద్యుత్ వల్ల వినియోగదారులపై సుమారు రూ.600 కోట్లకు పైగా అదనపు భారం పడింది. పీఎల్ఎఫ్ అంటే..? ఓ విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తి చేసే విద్యుత్ సామర్థ్యంతో పోల్చితే వాస్తవంగా జరిపిన విద్యుదుత్పత్తి శాతాన్ని ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్)గా పరిగణిస్తారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడానికి 6000-7000 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. 600 మెగావాట్ల కాకతీయ-2 థర్మల్ కేంద్రం నిర్మాణం పూర్తికావడంతో మూడు నెలల కింద తెలంగాణ జెన్కో ప్లాంట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 2282.5 మెగావాట్ల నుంచి 2882.5 మెగావాట్లకు పెరిగింది. రాష్ట్రానికి కావాల్సిన మిగిలిన విద్యుత్ ను కేంద్రం, ప్రైవేటు కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నారు. జెన్కో విద్యుత్ ధర యూనిట్‌కు సగటున రూ.4 వరకు ఉండగా..తాత్కాలిక ఒప్పందాలతో ప్రైవేటు కంపెనీల నుంచి యూనిట్‌కు రూ.5.90-6.10 వరకు చెల్లించి విద్యుత్ కొనుగోళ్లు జరుపుతున్నారు. వరుస కరువుతో వ్యవసాయం కుదేలై ఏడాదిన్నరగా విద్యుత్ డిమాండూ తగ్గిపోయింది. విద్యుత్ వినియోగంలో వ్యవసాయ రంగ వాటా 30 శాతం ఉంటుందని అంచనా. ఏడాదికేడాది 8 శాతం విద్యుత్ డిమాండ్ పెరుగుతుందనే అంచనాలతో ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ల కోసం ప్రభుత్వం తాత్కాలిక, మధ్య కాలిక ఒప్పందాలు కుదుర్చుకుంది. డిమాండ్ అంచనాలు తలకిందులు కావడంతో అదనపు విద్యుత్‌ను వదులుకోవడం అనివార్యంగా మారింది. దీంతో ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లను కొనసాగించేందుకు జెన్కోలో ఉత్పత్తిని తగ్గించారు. ఎడాపెడా జెన్కో ప్లాంట్లను బ్యాక్ డౌన్ చేయడంతోనే సంస్థ పీఎల్ఎఫ్ 73.21 శాతానికి పతనమైంది. జనంపై రూ.600 కోట్ల భారం ఒకసారి ప్రైవేటు కంపెనీలతో తాత్కాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అనివార్య పరిస్థితిలో ఆ విద్యుత్‌ను వదులుకోవాల్సి వస్తే సదరు కంపెనీలకు డిస్కంలు విద్యుత్ ధరలో 20 శాతాన్ని పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన యూనిట్‌కు రూ.1.20 పెనాల్టీ చెల్లించి ప్రైవేటు విద్యుత్‌ను వదులుకోవచ్చు. ప్రైవేటు విద్యుత్ వదులుకొని అంతే మొత్తంలో జెన్కో నుంచి రూ.4 చొప్పున విద్యుత్ కొనుగోళ్లను కొనసాగిస్తే మొత్తం వ్యయం (పెనాల్టీతో కలిపి) యూనిట్‌పై రూ.5.20కు మించదు. అయితే జెన్కో విద్యుత్‌ను వదులుకుని ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లను కొనసాగించడంతో యూనిట్ విద్యుత్ ధర రూ.8కు పెరిగింది. అదేలానంటే.. జెన్కో విద్యుత్ వదులుకున్నందుకు ఆ సంస్థకు డిస్కంలు రూ.2 చొప్పున స్థిర చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ప్రైవేటు విద్యుత్ ధర రూ.6 కలిపితే మొత్తం యూనిట్ ధర రూ.8కి చేరింది. అంటే జెన్కోతో పోల్చితే ప్రైవేటు విద్యుత్ ధరలు యూనిట్‌పై రూ.2.80 అధికం అన్నమాట! పీపీఏల్లో ఉండే వెసులుబాటు ప్రకారం పెనాల్టీ లేకుండా 15 శాతం విద్యుత్‌ను వదులుకోవచ్చు. కేవలం 85 శాతం విద్యుత్‌కే పెనాల్టీ వర్తిస్తుంది. ఈ నిబంధనను సైతం పరిగణలోకి తీసుకుంటే మరో 20 పైసలు కలిసొస్తుంది. దీన్ని కూడా కలుపుకుంటే ప్రైవేటు విద్యుత్‌కు అదనంగా యూనిట్‌పై రూ.3 చెల్లించినట్టే! ఈ లెక్కన ఏడాది కాలంలో దాదాపు 2 వేల మిలియన్ యూనిట్ల జెన్కో విద్యుత్‌ను బ్యాక్ డౌన్ చేయడం వల్ల యూనిట్‌కు రూ.3 చొప్పున వినియోగదారులపై రూ.600 కోట్లకు పైగా అనవసర భారం పడింది. తాజాగా రూ.2 వేల కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు డిస్కంలు ప్రతిపాదించడం వెనుక అధిక ధరలతో ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లే కారణమన్న ఆరోపణలున్నాయి. రూ.800 కోట్ల ఆదాయానికి గండి రాష్ట్రంలోని ప్లాంట్ల నుంచి 2015-16లో 17,076 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేయాలని జెన్కో లక్ష్యంగా పెట్టుకోగా .. కేవలం 15,123 మిలియన్ యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. లక్ష్యంతో పోల్చితే 2 వేల మిలియన్ యూనిట్ల లోటు నమోదైంది. యూనిట్ విద్యుత్‌కు రూ.4 ధర చొప్పున లెక్కగట్టినా జెన్కో ఏడాది కాలంలో రూ.800 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఉమ్మడి రాష్ట్రంతో పోల్చితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జెన్కో ఉత్పత్తి సామర్థ్యం భారీగా పతనం కావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో బొగ్గు లోటు, ఉద్యమాలు, సమ్మెలు విద్యుదుత్పత్తికి ఆటంకాన్ని కలిగించేవి. సకల జనుల సమ్మె వల్ల 2013-14లో అత్యల్పంగా 74.5 శాతం పీఎల్ఎఫ్ నమోదైంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రికార్డు స్థాయిలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేసింది. అయినా విద్యుదుత్పత్తి సామర్థ్యం రికార్డు స్థాయికి పడిపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యుత్ డిమాండ్ లేని వేళల్లో తాము రూ.2-3కే యూనిట్ విద్యుత్‌ను విక్రయిస్తున్నా .. తెలంగాణ డిస్కంలు మాత్రం యూనిట్‌కు రూ.6 వరకు అధిక ధరలు చెల్లించి విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నాయని ఇండియా ఎనర్జీ ఎక్స్ఛేంజీ సంచలన ఆరోపణ చేసింది. విద్యుత్ చార్జీల పెంపుపై ఇటీవల ఈఆర్సీ నిర్వహించిన బహిరంగ విచారణలో ఆ సంస్థ ప్రతినిధులు హాజరై విద్యుత్ కొనుగోళ్లలో డిస్కంలు పాటిస్తున్న మెరిట్ ఆర్డర్‌పై థర్డ్ పార్టీ ఆడిట్ జరిపించాలని డిమాండ్ చేశారు. చౌకగా లభించే జెన్కో, ఎనర్జీ ఎక్స్ఛేంజీ విద్యుత్‌ను కాదని ఖరీదైన విద్యుత్‌ను కొనుగోలు చేయడం వెనక మతలబు ఏమిటని పారిశ్రామికవేత్తలు, నిపుణులు ప్రశ్నిస్తున్నారు. -
జెన్కో సొమ్ము ‘బొగ్గు’ పాలు
నాణ్యతలేని బొగ్గు, అధిక ధరలు, రవాణా లోపాలపై కాగ్ మొట్టికాయలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఇంధన నిర్వహణ లోపాలను కాగ్ ఎత్తిచూపింది. 2010-15 మధ్య బొగ్గు నాణ్యతలో లోపాలతో రూ. 2,082.44 కోట్లు, అధిక ధరతో అదనపు బొగ్గు కొనుగోళ్లతో రూ.170 కోట్లు, మండకుండా మిగిలిన బొగ్గును బూడిద పాలు చేసి రూ.66.73 కోట్లు, బొగ్గు రవాణాలో లోపాలతో సుమారు రూ.20 కోట్లను జెన్కో యాజమాన్యం దుబారా చేసిందని స్పష్టం చేసింది. బొగ్గు కొనుగోలు చేసి బిల్లులో పేర్కొన్న ‘స్థూల కెలోరిఫిక్ విలువ(జీసీవీ)’కు, విద్యుత్ కేంద్రంలో వినియోగించినప్పుడు వచ్చిన ‘జీసీవీ’కి వ్యత్యాసం అధికంగా ఉందని.. దాంతో 2010-15 మధ్య ఏకంగా రూ.2,082.44 కోట్ల విలువైన 76.02 లక్షల టన్నుల బొగ్గును అదనంగా వినియోగించాల్సి వచ్చిందని కాగ్ ఆక్షేపించింది. బొగ్గులోని మండే సామర్థ్యాన్నే కెలోరిఫిక్ విలువ అంటారు. దీన్నే బొగ్గు నాణ్యతగా పరిగణించి ధరను నిర్ణయిస్తారు. కేంద్ర విద్యుత్ పరిశోధన సంస్థ (సీపీఆర్ఐ) మార్గదర్శకాల ప్రకారం బిల్లు చేసినప్పటితో పోలిస్తే... వినియోగ సమయంలో బొగ్గు జీసీవీ విలువ వ్యతాస్యం 150 కిలో కేలరీస్/కేజీలోపు మాత్రమే ఉండాలి. కానీ పలు విద్యుత్ కేంద్రాల్లో ఈ వ్యత్యాసం ఏకంగా 300-500 జీసీవీ వరకూ ఉందని కాగ్ స్పష్టం చేసింది. బొగ్గు నాణ్యతలో భారీ వ్యత్యాసమున్నట్లు జెన్కో యాజమాన్యం అంగీకరించినట్లు తెలిపింది. ఇక కేంద్ర ప్రభుత్వ నూతన బొగ్గు విధానం 100 శాతం బొగ్గు సరఫరాకు హామీ ఇచ్చినా... బొగ్గు అవసరమైనప్పుడు కేంద్రాన్ని సంప్రదించకుండా జెన్కో అధిక ధరతో బొగ్గు కొనుగోళ్లు చేసిందని కాగ్ ఎత్తిచూపింది. తద్వారా 2011-12 నుంచి 2014-15 మధ్య రూ.170.56 కోట్లను అదనంగా ఖర్చు చేసిందని తప్పుబట్టింది. జెన్కో విద్యుత్ కేంద్రాల వద్ద 2010-15 మధ్యకాలంలో రూ.66.73 కోట్లు విలువ చేసే 3.53 లక్షల టన్నుల బొగ్గు బూడిద పాలైంది. విద్యుత్ కేంద్రంలో మండిపోకుండా ఫ్లైయాష్, బాటమ్ యాష్‌లో మిగిలిపోయిన బొగ్గు పరిమాణం అధికంగా ఉందని కాగ్ తేల్చింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో 20 మెగావాట్ల క్యాప్టివ్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో భాగంగా సలహాలు, సివిల్ పనుల కోసం సింగరేణి సంస్థ రూ.4.35 కోట్లను ఖర్చు చేసిందని... కానీ ఆ ప్రాజెక్టు నిర్మాణ ఆలోచనను విరమించుకుందని కాగ్ పేర్కొంది. 78 శాతం పెరిగిన విద్యుదుత్పత్తి వ్యయం ఐదేళ్లలో జెన్కో విద్యుత్ కేంద్రాల విద్యుదుత్పత్తి వ్యయం 78% పెరిగిందని కాగ్ తేల్చింది. 2010-11లో రూ.2.01గా ఉన్న యూనిట్ విద్యుదుత్పత్తి వ్యయం 2014-15 నాటికి రూ.3.58కి పెరిగిపోయిందని పేర్కొంది. విద్యుదుత్పత్తి ధరలో ఇంధనం (బొగ్గు) ధర కీలకం కావడం వల్ల ప్రభావం పడుతోం దని వెల్లడించింది. 2014-15 మధ్య ఉత్పత్తి చేసిన విద్యుత్‌లో 84% బొగ్గు ఆధారితమేనని పేర్కొంది. -
పేలని తూట.. స్పోర్ట్స్ కోటా!
ప్రతిభ గల క్రీడాకారులకు దక్కని చేదోడు అమలుకు నోచుకోని 74 జీఓ వరంగల్ స్పోర్ట్స్ : ‘క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటా’ అనేది మాటలకే పరిమితమవుతోం ది. దీన్ని అమలుపర్చడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో దృష్టి సారించడం లేదు. ఫలితంగా ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ప్రయోజనాల్ని పొం దలేకపోతున్నారు. ఇటీవల జిల్లాలోని కేటీపీపీ, జెన్కోలలో జరిగిన ఉద్యోగ నియామకాల్లో క్రీడా కోటాను తొలగించారు. ఇదే ధోరణి కొనసాగితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ నోటిఫికేషన్లలో ఎంతమేరకు స్పోర్ట్స్ కోటా అమలవనుందనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నారుు. ప్రశ్నిస్తే.. గెటౌట్’ జిల్లాలోని చెల్పూర్ కేటీపీపీలో 361 ఉద్యోగాల నియూమకానికి 2013లో జెన్కో నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో స్పోర్ట్స్ కోటా ఉంటుందని పొందుపరిచారు. అయితే, ఆ నియామకాలు నిలిచిపోగా.. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం ఇటీవల చేపట్టింది. కొద్దిరోజుల క్రితం తుదిజాబితా వెల్లడించగా.. స్పోర్ట్స్ కోటాలో ఒక్కరికీ ఉద్యోగం రాలేదు. దీన్నిచూసి క్రీడాకారులు సంబంధిత అధికారులను అడిగితే స్పోర్ట్స్ సర్టిఫికె ట్లు పొందుపరచడం కాదు.. క్రీడా సంఘాల కార్యదర్శి లెటర్‌హెడ్‌పై జాతీయ, రాష్ట్రస్థారుులో ఆడినట్లుగా ధ్రువీకరించిన సర్టిఫికెట్లను పొం దుపర్చాలని సూచించడం గమనార్హం. ఈ విషయూన్ని ముందుగా నోటిఫికేషన్లో ఎందుకు పేర్కొనలేదని అడిగిన తమకు ‘గెటౌట్’ అనే సమాధానం ఎదురైందని క్రీడా అభ్యర్థులు వాపోయూరు. క్రీడాపాలసీలు ఏమైనట్టు.. ప్రభుత్వ శాఖలలోని ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియలో క్రీ డాకారులకు ప్రత్యేక కోటా అమలుపై మొదటగా 1977 లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 115 జీవో ను తెచ్చింది. అయితే, తొలిసారిగా ఈ జీఓ ప్రకా రం స్పోర్ట్స్ కోటాలో 1 శాతమే కేటారుుంచారు. ఇక 2012లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జీఓ నంబర్ 74 తీసుకొచ్చారు. దీని ప్రకారం 29 విభాగాల్లో ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగ నియూమకాల్లో రెండు శాతం కేటాయించాల్సి ఉంటుంది. కానీ, అధికారులు, ప్రభుత్వం ఈ జీవో అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. అర్హత ఉండీ ఉద్యోగం కోల్పోయాను హ్యాండ్‌బాల్‌లో సీనియర్ విభాగంలో సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ స్థాయిలో అనేక టోర్నీల్లో ఆడాను. ఈ సర్టిఫికెట్లతో 2013లో ఏపీ జెన్కో ఇచ్చిన నోటిఫికేషన్లో ఫైర్‌మెన్, సెక్యూరిటీ ఉద్యోగాలకు దరఖాస్తు చేశాను. ఆ రెండు పోస్టులకు ఇంటర్ ఉంటే చాలు. అయితే, అధికారుల తీరుతో ఉద్యోగం కోల్పోయాను. - సురేష్, హ్యాండ్‌బాల్ సౌత్‌జోన్ ప్లేయర్, ఆత్మకూరు కోటాకు చట్టబద్ధత కల్పించాలి ఉద్యోగాల్లో క్రీడాకారులకు న్యాయం జరగాలంటే స్పోర్ట్స్ కోటాకు రాజ్యాంగపరమైన చట్టబద్ధత కల్పిం చాలి. ఆ దిశగా ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో చట్టాలు రూపొందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. అలాగే, ఉన్నతాధికారులు స్పందించి కొత్త రాష్ట్రంలో ఉద్యోగ నియూమకాల్లో స్పోర్ట్స్ కోటాను అమలుచేయాలి. - మంచిక అభినవ వినయ్, క్రికెటర్, పరకాల -
ఏఈఈ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
♦ కోర్టుకెంత మంది వచ్చారో అన్ని పోస్టులు పక్కన పెట్టండి ♦ పోస్టుల భర్తీ ప్రక్రియ తుది తీర్పునకు లోబడే... ♦ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కోలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల (ఏఈఈ) పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే హైకోర్టును 22 మంది అభ్యర్థులు ఆశ్రయించిన నేపథ్యంలో అన్ని పోస్టులను భర్తీ చేయకుండా పక్కన పెట్టాలని అధికారులను ఆదేశించింది. అంతేకాక ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ మొత్తం ఈ వ్యాజ్యాల్లో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయిలతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగాల భర్తీ నిబంధనలకు సవరణలు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులతో పాటు తదనుగుణంగా జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ చల్లా నర్సింహారెడ్డి, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది డాక్టర్ లక్ష్మీ నర్సింహ వాదనలు వినిపిస్తూ, ఉద్యోగ నిబంధనలకు సవరణలు చేసిన విద్యుత్ సంస్థలు తెలంగాణను ఉత్తర, దక్షిణ జోన్లుగా విభజించాయని.. ఈ రెండు జోన్లలో ఏదో ఒక జోన్లో జన్మించిన లేదా ఆరేళ్లకు మించి విద్యాభ్యాసం చేసిన వారిని మాత్రమే స్థానికులుగా పరిగణిస్తారని తెలిపారు. ఉద్యోగాల భర్తీలో 70శాతం స్థానికులకు, 30 శాతం స్థానికేతరులకు అవకాశం ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారని, లోతుగా విశ్లేషిస్తే ఆ 30 శాతం పోస్టులకు కూడా తెలంగాణ అభ్యర్థులే అర్హులవుతారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. ఎలా చూసినా 100 శాతం పోస్టులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికే పరిమితం అవుతున్నాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. గత విచారణ సమయంలో పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగించవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, గతంలో తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సడలిస్తూ, పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగించుకోవచ్చునని స్పష్టంచేసింది. ఎంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారో అన్ని పోస్టులను భర్తీ చేయకుండా పక్కన పెట్టాలని ఆదేశించింది. -
‘భద్రాద్రి’కి పర్యావరణ వివాదం
పర్యావరణ అనుమతి లేకుండానే థర్మల్ విద్యుత్ ప్లాంట్ పనులు చేపట్టడంపై కేంద్రం సీరియస్ తమ శాస్త్రవేత్తతో తనిఖీ జరిపించిన కేంద్ర పర్యావరణ శాఖ ప్రాజెక్టు స్థలంలో పరిశీలన.. నిబంధనల ఉల్లంఘన జరిగిందని నిర్ధారణ చాలా వరకు పనులు ప్రారంభమయ్యాయని వెల్లడి ప్లాంట్ నిర్మాణ స్థలానికి సమీపంలో చెరువు ఉందని గుర్తింపు జెన్కోపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రానికి నివేదిక’ సాక్షి, హైదరాబాద్: జెన్కో చేపట్టిన భద్రాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పర్యావరణ అనుమతుల వివాదంలో చిక్కుకుంది. పర్యావరణ అనుమతి లేకుండానే చకచకా ప్రాజెక్టు పనులు నిర్వహిస్తుండడంపై కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సీరియస్ అయింది. కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలతో ఆ శాఖ శాస్త్రవేత్త పి.కరుపయ్య గత నెల 9వ తేదీన ప్లాంట్ నిర్మాణ ప్రాంతంలో తనిఖీ జరిపి నివేదిక సమర్పించారు. పర్యావరణ అనుమతి లేకుండా థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించారని, నిబంధనలను ఉల్లంఘించారని ఆయన ధ్రువీకరించారు. దీనికి సంబంధించి జెన్కోపై తగిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారు. కాలం చెల్లిన టెక్నాలజీతో.. ఖమ్మం జిల్లా మణుగూరు, పినపాక మండలాల్లోని రామానుజవరం, ఎద్దులబయ్యారం, సీతారామపురం గ్రామాల పరిధిలో 1,080 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని జెన్కో చేపట్టింది. సబ్ క్రిటికల్ బాయిలర్ సాంకేతికతతో 270 మెగావాట్ల సామర్థ్యం గల 4 యూనిట్లను నిర్మిస్తోంది. అయితే కాలం చెల్లిన సబ్ క్రిటికల్ బాయిలర్ టెక్నాలజీతో కొత్త థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వకూడదని కేంద్ర విద్యుత్ శాఖ గతంలోనే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భద్రాద్రి థర్మల్ ప్లాంట్‌ను ఆధునిక సూపర్ క్రిటికల్ పరిజ్ఞానంతో నిర్మించాలని జెన్కోకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సూచించింది. లేకుంటే కేంద్ర విద్యుత్ శాఖ నుంచి ప్రత్యేక అనుమతి పొందాలనే షరతు విధిస్తూ... గత జూన్ 23న ఈ ప్రాజెక్టు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్(టీవోఆర్)ను ఆమోదించింది. ఇంకా పర్యావరణ అనుమతి జారీ చేయలేదు కూడా. అయినప్పటికీ జెన్కో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించడంతో... ఓ స్వచ్ఛంద సంస్థ జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో కేంద్ర పర్యావరణ శాఖ తమ శాస్త్రవేత్తతో తనిఖీ జరిపించింది. ఆయన ప్రాజెక్టు స్థలంలో పరిశీలన జరిపి కేంద్రానికి నివేదిక సమర్పించారు. నివేదికలో పేర్కొన్న పలు అంశాలు.. - గతేడాది అక్టోబర్ నుంచే భదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ పనులను ప్రాజెక్టు యాజమాన్యం ప్రారంభించింది. - తనిఖీ నిర్వహించిన సమయంలో ప్రాజెక్టు స్థలంలో కార్మికులు ఎక్కువ సంఖ్యలో కనిపించలేదు. కొంత మంది మాత్రం ప్రాజెక్టు సైట్‌తో పాటు యంత్ర సామగ్రి నిల్వ ఉంచే గోదాంలో కనిపించారు. అన్ని రకాల భారీ యంత్రాలు, వాహనాలు, వస్తు సామగ్రిని ప్రాజెక్టు స్థలం వద్ద నిల్వ ఉంచారు. - మెయిన్ పవర్ హౌస్‌తో పాటు టౌన్‌షిప్‌కు సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మెయిన్ పవర్ హౌస్ వద్ద అంతర్గత రోడ్లు, సబ్‌స్టేషన్ వద్ద సివిల్ పనులు, సైట్ ఆఫీస్ నిర్మాణం, ఫౌండేషన్ పనులు, బాయిలర్ హౌస్, చిమ్నీ, స్విచ్‌యార్డు పనులు చకచకా జరుగుతున్నాయి. - ప్రాజెక్టు స్విచ్‌యార్డు ఏరియాకు వెనుక భాగంలో మణుగూరు-ఏటూరునాగారం రోడ్డుకు సమాంతరంగా ఓ చెరువు గుర్తించాం. ఈ చెరువుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను గానీ, ఈ చెరువు భూముల వినియోగంపై కానీ ప్రాజెక్టు యాజమాన్యం ఎలాంటి సమాచారాన్ని తనిఖీ సమయంలో ఇవ్వలేకపోయింది. సమీప వ్యవసాయ భూమి నుంచి వస్తున్న నీటి ప్రవాహమే ఇదని ప్రాజెక్టు యాజమాన్యం చెప్పిన మాటలు నమ్మశక్యంగా లేవు. చెరువుతో పోల్చితే వ్యవసాయ భూములు లోతైన ప్రాంతంలో ఉన్నాయి, ఆ భూములు, చెరువుకు మధ్య మణుగూరు-ఏటూరునాగారం రోడ్డు అడ్డుగా ఉంది. ఈ అంశాన్ని కేంద్ర పర్యవరణ శాఖ పరిశీలించాలి. - ప్రాజెక్టుకు కావాల్సిన బొగ్గు, నీటి కేటాయింపులు ఇంకా జరగలేదు. -
‘యాదాద్రి విద్యుత్’కు కేంద్రం ఆమోదం!
ప్రాజెక్టు సూచన నిబంధనలను ఆమోదించిన పర్యావరణ శాఖ పర్యావరణ అనుమతుల జారీకి మార్గం సుగమం ఆ తర్వాతే ప్రారంభం కానున్న ప్రాజెక్టు నిర్మాణ పనులు 2018లోగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్లలో యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతుల జారీకి మార్గం సుగమమైంది. 4000(5ఁ800) మెగావాట్ల భారీ విద్యుదుత్పత్తి సామర్థ్యంతో తెలంగాణ జెన్కో తలపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాటించాల్సిన సూచన నిబంధనలను(టర్మ్ ఆఫ్ రిఫరెన్స్-టీవోఆర్)ను తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. శుక్రవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ జెన్కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డి.ప్రభాకర్ రావు నేతృత్వంలో డెరైక్టర్(ప్రాజెక్టులు) రాధాకృష్ణ, చీఫ్ ఇంజనీర్ అజయ్ బృందం ఈ సమావేశంలో పాల్గొని కేంద్ర పర్యావరణ శాఖ విధించే షరతులకు లోబడి ప్రాజెక్టు నిర్మాణాన్ని జరుపుతామని అంగీకరించడంతో టీఓఆర్‌ను ఆమోదించాలని నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి గతంలో జరిగిన రెండు సమావేశాల్లో ఈ ప్రాజెక్టు టీవోఆర్‌ను ఆమోదించేందుకు పర్యావరణ నిపుణుల కమిటీ అంగీకరించలేదు. వాస్తవానికి గత అక్టోబర్ 29న జరిగిన సమావేశంలో ఏకంగా ఈ ప్రాజెక్టును మరో ప్రాంతానికి తరలించాలని లేక ప్రాజెక్టు డిజైన్‌నే మార్చే అంశాన్ని పరిశీలించాలని తెలంగాణ జెన్కో యాజమాన్యానికి సూచిం చింది. ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలం మధ్యలో నుంచి కృష్ణా నదిలోకి ప్రవహిస్తున్న ‘అన్నమేరు వాగు’ వెళ్తుండడమే ఇందుకు కారణం. అయితే, దీనిపై నిపుణుల కమిటీ.. ఓ ఉప కమిటీని క్షేత్ర స్థాయి పర్యటనకు పంపించింది. ఈ ఉప కమిటీ క్షేత్ర స్థాయి పర్యటన జరిపి ప్రాజెక్టు నిర్మించేందుకు షరతులతో కూడిన అనుమతులు జారీ చేయాలని సిఫారసు చేసింది. ప్రధానంగా ప్రాజెక్టు నిర్మాణం వల్ల అన్నమేరు వాగు కలుషితం కాకుండా సంరక్షించేందుకు రక్షణ గోడల నిర్మాణంతో పాటు ఇతర సాంకేతిక షరతులను విధిం చింది. ఈ షరతులను జెన్కో యాజమాన్యం అంగీకరించినా కూడా గత డిసెంబర్ 18న జరిగిన సమావేశంలో విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని నిపుణుల కమిటీ ఆమోదించకుండా నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఎట్టకేలకు శుక్రవారం జరిగిన మూడో సమావేశంలో ప్రాజెక్టు నిర్మాణ టీవోఆర్‌ను ఆమోదించడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులను కోరుతూ త్వరలో జెన్కో యాజమాన్యం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకోనుంది. ఇదే నిపుణుల కమిటీ ఈ ప్రతిపాదనలను పరిశీలించి అనుమతుల జారీ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాతే ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. 2018 ముగిసేలోగా దామరచర్ల విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
విద్యుత్ ఏఈ నోటిఫికేషన్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో), విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)లలో అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టుల భర్తీకి గురువారం వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ట్రాన్స్‌కో, జెన్కోతో పాటు డిస్కంల నుంచి 1,427 ఏఈ పోస్టుల భర్తీకి నియామక ప్రకటనలు రావాల్సి ఉండగా.. గురవారం ట్రాన్స్‌కోలో 206, జెన్కోలో 856, ఎన్పీడీసీఎల్లో 164 ఏఈ పోస్టుల భర్తీకి ఆయా సంస్థల సీఎండీలు డి.ప్రభాకర్‌రావు, వెంకట నారాయణ నోటిఫికేషన్లు జారీ చేశారు. ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఆయా కేటగిరీల్లోని పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు అభ్యర్థుల వయో పరిమితిని పదేళ్ల వరకు సడలించారు. జెన్కో పోస్టులకు అభ్యర్థులు అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష నవంబర్ 14న జరగనుంది. ట్రాన్స్‌కో ఏఈ పోస్టుల కోసం అక్టోబర్ 6 నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 29న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్)లో 201 ఏఈ(ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి ఒకటి రెండు రోజుల్లో నియామక ప్రకటనలు విడుదల చేసే అవకాశం ఉంది. ఓపెన్ కేటగిరీ పోస్టులూ తెలంగాణ అభ్యర్థులకే.. ఓపెన్ కేటగిరీ పోస్టులను తెలంగాణ అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు. లోకల్ కేటగిరీ పోస్టులకు సంబంధిత జోన్ పరిధిలోని జిల్లాల అభ్యర్థులే అర్హులు కాగా.. ఓపెన్ కేటగిరీ పోస్టులకు జోన్లతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఏ ప్రాంత అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్లు జెన్కో: www.genco.telangana.gov.in, http://tsgenco.cgg.gov.in ట్రాన్స్‌కో: ww.transco.telangana.gov.in, http://tstransco.cgg.gov.in ఎన్పీడీసీఎల్: www.tsnpdcl.in -
తాత్కాలిక కొలువుల పందేరం!
♦ విద్యుత్ సంస్థల్లో ‘తాత్కాలికం’ పేరిట అడ్డగోలు నియామకాలు ♦ కాంట్రాక్టు టెక్నికల్ అసిస్టెంట్లుగా ఇంజనీర్లకు ఉద్యోగాలు ♦ నోటిఫికేషన్లు, రాత పరీక్షలు లేకుండా నేరుగా ఉత్తర్వులు ♦ జీతాలు నేరుగా చెల్లిస్తుండటంతో భవిష్యత్తులో క్రమబద్ధీకరించే అవకాశం ♦ ట్రాన్స్‌కో, జెన్‌కోల్లో దొడ్డిదారిలో 50 మందికిపైగా కొలువులు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ ప్రకటన లేదు.. ఏ పరీక్షా లేదు.. రిజర్వేషన్లు అంతకన్నా లేవు.. రోస్టర్ పాయింట్ల లేనే లేవు. అసలు నిబంధనల ఊసే లేదు.ఉన్నత స్థాయిలో పైరవీలతో నేరుగా ఉద్యోగ నియామకాలు జరిగిపోతున్నాయి. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ‘తాత్కాలికం’ పేరిట దొడ్డిదారిలో కొలువులు ఇస్తున్నారు. కాంట్రాక్టు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల పేరుతో పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ పట్టభద్రులను నియమిస్తున్నారు. 50 మంది నియామకం.. విద్యుత్ సౌధ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో ప్రధాన కార్యాలయాల పరిధిలో ఇప్పటి వరకు 50 మంది ఇంజనీర్లను కాంట్రాక్టు టెక్నికల్ అసిస్టెంట్ల పేరుతో తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. అధికార పార్టీ ముఖ్య నేతలు, పలువురు మంత్రుల సిఫారసుతో వీరికి ఉద్యోగాలు ఇచ్చారు. జెన్కోలో 30 మందికి, ట్రాన్స్‌కోలో 20 మందికి టెక్నికల్ అసిస్టెంట్ పేరుతో ఉద్యోగావకాశాలు కల్పించినట్లు చర్చ జరుగుతోంది. వీరిలో కొందరిని 6 నెలలు, మరికొందరిని ఏడాది కాలానికీ ఉద్యోగాల్లోకి తీసుకున్నప్పటికీ.. కాలపరిమితి తీరిన ప్రతీసారి పొడిగించే అవకాశాలు ఉన్నాయి. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లను సైతం ఖాతరు చేయకుండా నియామకాలు చేసేశారు. నియామకాలు ఎంత అడ్డగోలుగా జరిగాయో.. వేతనాలను సైతం అంతే అశాస్త్రీయంగా నిర్ణయించారు. పోస్టులు, అర్హతలు ఒకేలా ఉన్నా.. సిఫారసు చేసిన నేతల స్థాయినిబట్టి జీతాలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్య నేతలు సిఫారసు చేస్తే.. గరిష్టంగా రూ.35 వేలు.. మిగిలిన వారికి రూ.30 వేలు, రూ.25 వేలు, కనిష్టంగా రూ.20 వేల జీతం నిర్ణయించారు. తాత్కాలిక ఉద్యోగులైనా రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా విద్యుత్ సంస్థలే నేరుగా జీతాలు చెల్లిస్తుండడం అనుమానాలు కలిగిస్తోంది. పెద్ద పోస్టుల భర్తీలోనూ విద్యుత్ సంస్థలు ప్రతిభకు పాతరేశాయి. ఇటీవల తెలంగాణ జెన్కో కాంట్రాక్టు లా ఆఫీసర్ పేరుతో ఓ న్యాయవాదిని ఎలాంటి ఉద్యోగ ప్రకటనా లేకుండా నేరుగా నియమించడం గమనార్హం. ఒకవైపు ఏఈ, సబ్ ఇంజనీర్ల నియామకాల కోసం విద్యుత్ సంస్థలు కసరత్తు చేస్తూనే.. మరోవైపు తాత్కాలిక పద్ధతుల్లో ఇంజనీర్లను నియమించుకోవడం చర్చనీయాంశమైంది. ఏఈ, ఎస్ఈల రిక్రూట్మెంట్లలో సైతం పైరవీలకు ఆస్కారముందని, కొందరు ఇప్పటికే వసూళ్లకు తెరలేపడంతో ఇటీవల విద్యుత్ శాఖ నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది. వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులపై ఫిర్యాదు చేయాలని అభ్యర్థులకు సూచించింది. కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాల కోసం సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు(జీవో ఎంఎస్ నం.94) ♦ రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రత్యేక రోస్టర్‌ను మెయింటెయిన్ చేయాలి. ♦ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, వికలాంగులకు రిజర్వేషన్లు అమలు చేయాలి. ♦ రెగ్యులర్ నియామకాలు జరిపే నియామక సంస్థే కాంట్రాక్టు నియామకాలకు బాధ్యత వహించాలి. ఉద్యోగ నియామక ప్రకటన జారీతో పాటు ప్రతిభ ఆధారంగా నియామకాలు చేయాలి. -
‘విద్యుత్’ భర్తీ వేర్వేరుగానే!
ఇంజనీర్ పోస్టుల భర్తీకి ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల నుంచి ప్రత్యేక నోటిఫికేషన్లు హైదరాబాద్: రాష్ట్రంలోని ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల పరిధిలోని విద్యుత్ ఇంజనీర్ల పోస్టులను.. ఎవరికి వారే భర్తీ చేసుకోవాలని నిర్ణయించాయి. రాష్ట్ర ఇంధన శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 2,681 ఇంజనీర్ పోస్టుల భర్తీకి గత నెల 27న ప్రభుత్వం అనుమతించింది. ఈ పోస్టుల భర్తీ చేపట్టడంపై రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆసక్తి కనబరిచినా... విద్యుత్ సంస్థల యాజమాన్యాలు దానికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాత విధానాన్నే అనుసరిస్తూ... ఈ పోస్టుల భర్తీని ఆయా విద్యుత్ సంస్థలకే కట్టబెట్టింది. విధివిధానాలపై తర్జనభర్జన: ‘విద్యుత్’ ఇంజనీర్ పోస్టుల భర్తీ విధివిధానాలపై స్పష్టత లేకపోవడంతో నోటిఫికేషన్ల జారీకి మరికొంత సమయం పట్టనుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా జోనల్ విధానం కొనసాగింపుపై తర్జన భర్జన జరుగుతోంది. జోనల్ విధానం కొనసాగింపు వైపే విద్యుత్ సంస్థల యాజమాన్యాలు మొగ్గు చూపుతున్నాయి. ఇక ఆర్టికల్ 371డీ ఆధారంగా విద్యుత్ సంస్థల్లో లోకల్, నాన్‌లోకల్ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. ఇప్పుడు దీనిని కొనసాగించడంపైనా సందిగ్ధత నెలకొంది. మరోవైపు 10 శాతం ఏఈ పోస్టులను ప్రస్తుతం సర్వీసులో ఉన్న సబ్ ఇంజనీర్లలో అర్హులైన వారికి పదోన్నతులు ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త ఏఈల నియామకాలు, సబ్ ఇంజనీర్లకు ఏఈలుగా పదోన్నతులు ఒకేసారి ఇస్తే భవిష్యత్తులో సీనియారిటీ సమస్యలు ఉండవు. కానీ దీనిపైనా ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంల పనితీరుకు అనుగుణంగా వేర్వేరు సిలబస్‌ల ఆధారంగా నియామక పరీక్షలు నిర్వహించాలనే ప్రతిపాదన కూడా ఉంది. అయితే దీనిపై విద్యుత్ ఇంజనీర్ల సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. నిర్వహణ బయటి సంస్థలకు.. ఇంజనీర్ పోస్టుల భర్తీ విధివిధానం ఖరారు, నోటిఫికేషన్ల జారీ వరకే విద్యుత్ సంస్థలు పరిమితం కానున్నాయి. నియామక పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఎప్పటిలాగే మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రాని(ఎంసీహెచ్ఆర్డీ)కి అప్పగించనున్నారు. పరీక్షా పత్రాలను జేఎన్టీయూహెచ్ తయారు చేయనుంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఎంసీహెచ్ఆర్డీ... విద్యుత్ సంస్థలకు అందజేస్తే, వారికి నియామక పత్రాలు జారీ చేస్తామని అధికారవర్గాలు తెలిపాయి. -
ఏపీ ఉద్యోగులు ఏపీకే!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన కసరత్తు ఊపందుకుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల తుది కేటాయింపుల్లో స్థానికతను ప్రామాణికంగా తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ ఈ నెల 6న జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి తెలంగాణ విద్యుత్ సంస్థలు కసరత్తును ప్రారంభించాయి. ట్రాన్స్‌కో, జెన్కోల సీఎండీ డి.ప్రభాకర్‌రావు నేతృత్వంలో మంగళవారం విద్యుత్‌సౌధలో ఉద్యోగుల కేటాయింపుల కమిటీ సమావేశమై చర్చింది. సమావేశంలో తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల యాజమాన్యాలు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ‘ఆంధ్రప్రదేశ్ స్థానికత’ గల ఉద్యోగులను ఆ రాష్ట్రానికి పంపేందుకు చర్యలు ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ‘ఏపీ స్థానికత’ గల ఉద్యోగుల తుది జాబితాలను విద్యుత్ సంస్థలు సిద్ధం చేశాయి. ఈ జాబితాలను మంగళవారం రాత్రి నుంచి సంబంధిత సంస్థల వెబ్సైట్లలో ఉంచనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తుది జాబితాల ప్రకారం తెలంగాణ ట్రాన్స్‌కోలో 262 మంది, టీ జెన్కోలో 600 మంది, తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్)లో 539 మంది ఏపీ స్థానికత గల ఉద్యోగులు పనిచేస్తున్నారు. తెలంగాణ స్థానికత కలిగి ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను సైతం తెలంగాణకు కేటాయించాలని ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. ఉద్యోగుల తుది కేటాయింపులపై చర్చించి నిర్ణయం తీసుకుందాని ఏపీ విద్యుత్ శాఖ అధికారులను పలుమార్లు సమావేశానికి పిలిపించినా స్పందన రాలేదని తెలంగాణ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. కనీసం తెలంగాణ స్థానికత కలిగి ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను తెలంగాణకు పంపాలని లేఖ రాసినా ఏపీ ప్రభుత్వం ఒప్పుకోలేదని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
బొగ్గుకూ పైసల్లేవ్!
* ఆర్థిక సంక్షోభంలో రాష్ట్ర జెన్కో * సొంత అవసరాలకు వెయ్యి కోట్ల అప్పు * బొగ్గు కొనుగోళ్ల బకాయిలు రూ.1,800 కోట్లు * సర్కారుకు ఫిర్యాదు చేసిన సింగరేణి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జెన్కో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందా? రూ.42 వేల కోట్లతో భారీగా కొత్త విద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తున్న జెన్కో కనీసం బొగ్గు కొనుగోలుకు డబ్బులు చెల్లించలేని దీనస్థితిలో ఉందా? సంస్థ ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే విస్మయం కలిగిస్తోంది. సింగరేణి సంస్థ నేరుగా ప్రభుత్వానికే ఫిర్యాదు చేయడంతో జెన్కో డొల్లతనం బయటపడింది. బొగ్గు కొనుగోళ్లకు సంబంధించి బకాయిపడిన రూ.1800 కోట్లు చెల్లించాలంటూ జెన్కోకు పలుమార్లు లేఖలు రాసిన సింగరేణి.. చివరకు దీనిపై రాష్ర్ట ఆర్థిక శాఖకే లేఖ రాసింది. తమ బకాయిలు ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. దీంతో ఈ వ్యవహారం ఉన్నతాధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జెన్కో ప్రభుత్వ కార్పొరేషన్ కావడంతో ఆర్థిక లావాదేవీలు, ఆదాయవ్యయాలన్నీ ఆ సంస్థ పరిధిలోనే ఉంటాయి. దీంతో తాము చేసేదేమీ లేదంటూ ఆర్థిక శాఖ అధికారులు ఈ లేఖను పక్కనబెట్టారు. అయితే బొగ్గుకు డబ్బులు చెల్లించలేని విపత్కర పరిస్థితిలో జెన్కో ఉందా అనేది ఆర్థిక శాఖలో చర్చనీయాంశమైంది. విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలు, విద్యుత్ చౌర్యం, బిల్లుల ఎగవేత, విద్యుత్ సబ్సిడీ తదితర కారణాలతో డిస్కంలు ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయాయి. కానీ విద్యుదుత్పత్తి, అమ్మకాల ద్వారా లాభాలను ఆర్జించాల్సిన జెన్కో కూడా బొగ్గు బకాయిలను చెల్లించకపోవ డం ప్రభుత్వవర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. నిర్వహణ ఖర్చులు, రోజువారీ అవసరాలకు ఆ సంస్థ ఇటీవల రూ.1000 కోట్లు అప్పు తెచ్చుకోవడం గమనార్హం. గ్రామీణ విద్యుదీకరణ సంస్థ(ఆర్ఈసీ) నుంచి వర్కింగ్ కాపిటల్‌గా ఈ రుణాన్ని సమకూర్చుకుంది. వాస్తవానికి జెన్కోకు డిస్కంల నుంచి రావాల్సిన బకాయిలున్నాయి. ఏపీలోని రెండు డిస్కంల నుంచి రూ.1660 కోట్లు, తెలంగాణలోని ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ నుంచి రూ. 550 కోట్లు రావాల్సి ఉంది. కానీ అంతకంతకు సర్దుబాటు వ్యయం కూడా ఉండటంతో సంస్థ చిక్కుల్లో పడింది. అందుకే సింగరేణికి ఇవ్వాల్సిన బకాయిలను పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త విద్యుత్ ప్రాజెక్టులన్నింటికీ జెన్కో ప్రైవేటు సంస్థల రుణాలపైనే ఆశలు పెట్టుకుంది. కొత్త ప్లాంట్లకు రూ.24 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ఆర్ఈసీ ఇటీవలే అంగీకరించింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ) కూడా రూ.15 వేల కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దీంతోపాటు ప్రభుత్వం ఈక్విటీగా సమకూర్చే రూ.3000 కోట్లను జెన్కో వినియోగించుకోనుంది. ఈ లెక్కన జెన్కో రుణాలు, ప్రభుత్వ ఈక్విటీపైనే ఆధారపడ్డట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో సంస్థ ఆర్థిక పరిస్థితిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. -
జెన్కో వెలుగులు
►ప్రాజెక్టుకు తీరిన బొగ్గు కొరత! ►సీఓడీ తర్వాత 3 నెలలకు ఉత్పత్తి ప్రారంభం ►విద్యుత్ కోతలకు ఇక చెక్ ముత్తుకూరు : మండలంలోని నేలటూరులో దామోదరం సంజీవయ్య 1,600 మెగావాట్ల సూపర్‌క్రిటికల్ థర్మ్‌ల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు సమస్యలు పరిష్కారమయ్యాయి. సీఓడీ ప్రకటించిన మూడు నెలల తర్వాత 1వ యూనిట్ కింద 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించారు. పవర్‌గ్రిడ్ సూ చనల మేరకు విద్యుదుత్పత్తి పెంచుతూ జిల్లాలో వెలుగులు నింపేందుకు సన్నాహాలు చేపట్టారు. దేశంలో మొదటిసారిగా నేలటూరులో ఏపీ జెన్కో సూపర్‌క్రిటికల్ టెక్నాలజీతో ఏడేళ్ల క్రితం బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నేలటూరు, ముసునూరువారిపాళెంలో 1,400 ఎకరాల భూములు సేకరించారు. సేకరించిన భూములకు పరిహారం, తరలించిన నక్కలమిట్ట గ్రామ పునరావాసానికి రూ.100 కోట్లు ఖర్చుచేశారు. భూసేరణ పూర్తై తర్వాత 2009 జులైలో ప్రాజెక్టు పనులు మొదలుపెట్టారు. 48 మాసాల్లో 1వ యూనిట్ కింద 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయాలని భావించారు. స్థానికులకు ఉద్యోగాలు, భూముల పరిహారం జరిగిన ఆందోళనలు, ప్రాజెక్టులో ముఖ్య విభాగాల డిజైన్ల మార్పు, కోర్టుల స్టేల వల్ల నిర్మాణంలో జాప్యం జరిగింది. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 8 వేల కోట్లతో అంచనాలు వేయగా, చివరకు వ్యయం రూ.13వేల కోట్లకు చేరింది. అలాగే, 2013లో విద్యుత్ ఉత్పత్తికి ట్ర యల్న్ ్రనిర్వహించినప్పటికీ పలుమార్లు బాయిలర్‌లో ఏర్పడిన అంతరాయాల వల్ల ఉత్పత్తికి బ్రే క్ పడింది. పదేపదే బాయిలర్ మండించడం, నిలిపివేయడం, మళ్లీ వెలిగించడం వంటి ప్రక్రియలకే 3 లక్షల టన్నుల బొగ్గు ఖర్చైపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 1వ యూనిట్ 800 మెగావాట్లకు సీఓడీ ప్రకటించారు. అయితే, బొగ్గు ఒప్పందం కుదరకపోవడంతో 3 నెలల పాటు ఈ యూనిట్లో ఉత్పత్తి నిలిచిపోయింది. తాజాగా కోల్ ఇండియా ఆదేశాల మేరకు 1వ యూనిట్‌కు మహానది బొగ్గు గనుల నుంచి ఈ ఏడాది 2.5 మిలియన్ టన్నుల బొగ్గు కేటాయిస్తూ ఒప్పందం కుదిరింది. దీంతో ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి తిరిగి ప్రారంభించారు. బుధవారం సాయంకాలానికి 280 నుంచి 300 మెగావాట్ల ఉత్పత్తి జరగవచ్చని అంచనా వేస్తున్నారు. -
మూడేళ్లు దాటితే స్థాన చలనమే
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల సాధారణ బదిలీల కసరత్తు ప్రారంభమైంది. ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలో పనిచేస్తున్న ఉద్యోగుల సాధారణ బదిలీలకు ఆయా సంస్థల యాజమాన్యాలు పచ్చ జెండా ఊపాయి. ఇంజనీరింగ్, అకౌంట్స్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ తదితర విభాగాల్లో ఒకే చోట మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులందరికీ బదిలీలు వర్తించనున్నాయి. ఈ నెల 15లోగా ఈ ఉత్తర్వులు జారీ కానున్నాయి. స్థాన చలనం పొందిన ఉద్యోగులు 22వ తేదీలోగా రిలీవ్ కావాల్సి వుండనుంది. 15వ తేదీ తర్వాత బదిలీలపై మళ్లీ నిషేధం అమలులోకి రానుంది. అయితే, క్రమ శిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న ఉద్యోగుల విషయంలో మాత్రం సడలింపులుంటాయి. ఈ మేరకు ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలు ఉత్తర్వులు జారీ చేశాయి. ప్రస్తుతం అప్రధాన స్థానాల్లో పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత గల స్థానాలు కేటాయించాలని, ప్రాధాన్యత గల స్థానాల్లో పనిచేస్తున్న వారికి అప్రధాన పోస్టింగ్‌లు ఇవ్వాలని ఈ బదిలీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడేళ్లు, ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగుల బదిలీల్లో డిస్కంలు వేర్వేరు విధానాన్ని అనుసరించనున్నాయి. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను వారి స్థాయిని బట్టి సాధ్యమైనంత వరకు ప్రస్తుత సబ్ డివిజన్/డివిజన్/సర్కిల్ పరిధిలోనే మరో చోటకు బదిలీ చేయనున్నారు. ఐదేళ్లు దాటితే మాత్రం మరో డివిజన్/సర్కిల్‌కు వెళ్లక తప్పదు. మూడేళ్ల సర్వీసు పూర్తి చేస్తే... సబ్ ఇంజనీర్/ఏఈ/ఏఈఈ/ఏడీఈలను అదే సబ్ డివిజన్లో మరో పోస్టుకు బదిలీ చేస్తారు. విజ్ఞప్తిపై మరో సబ్ డివిజన్‌కు పంపిస్తారు. సర్కిల్ ఎస్ఈ ఆధ్వర్యంలో ఈ బదిలీలు జరుగుతాయి. ఏఈఈ(సివిల్), ఏఏఓలు అంతకు పై స్థాయి అధికారుల బదిలీలను నేరుగా సంస్థల యాజమాన్యాలు జరుపుతాయి. ఐదేళ్లు పూర్తి చేసుకుంటే.. సబ్ ఇంజనీర్/ఏఈ/ఏఈఈ/ఏడీఈలను ఒక డివిజన్ నుంచి మరో డివిజన్‌కు బదిలీ చేస్తారు. సర్కిల్ ఎస్ఈ పర్యవేక్షణలో ఈ బదిలీలు జరగుతాయి. సర్కిల్ బయటకు బదిలీ కోరుకుంటే సంస్థ యాజమాన్యమే నేరుగా బదిలీ జరపనుంది. ఏఈఈ(సివిల్), ఏఏఓల అంతకు పై స్థాయి అధికారులను మరో సర్కిల్‌కు సంస్థ యాజమాన్యమే బదిలీ చేయనుంది. -
పల్లెలకూ 24 గంటల విద్యుత్
ఐదేళ్లలో 6,800 మెగావాట్ల అదనపు విద్యుత్: జగదీశ్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లలో 6,800 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా జెన్కో పని చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాలకు సైతం 24 గంటల విద్యుత్‌సరఫరా చేయాలని కృతనిశ్చయంతో వున్నామన్నారు. నిరంతర విద్యుత్ కోసం ప్రవేశపెట్టిన ‘అందరికీవిద్యుత్’ పథకం కింద తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసే విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. గురువారం గువాహటి (అస్సాం)లో నిర్వహించిన రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సదస్సులో జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను 9 గంటలకు పెంచే యోచనలో వున్నామని మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఏటా 10.67 మిలియన్ టన్నుల బొగ్గు కేటాయింపులు ఉన్నప్పటికీ 2019-20 నాటికి బొగ్గు అవసరాలు 46.5 మిలియన్ టన్నులకు పెరుగుతాయని, ఈ మేరకు అదనపు బొగ్గును కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 2,965 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను ప్రైవేటు రంగంలో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
జెన్కోకు 24 వేల కోట్లు
కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం కోసం ఆర్ఈసీ రుణం సీఎం సమక్షంలో ఎంవోయూపై సంతకాలు నిధుల సమీకరణ లక్ష్యం నెరవేరింది: సీఎం కేసీఆర్ హైదరాబాద్: కొత్త విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంకోసం తెలంగాణ జెన్కోకు రూ.24 వేల కోట్ల రుణం ఇవ్వడానికి కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్ఈసీ) అంగీకరించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. శనివారం ఉగాది పర్వదినాన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో సీఎం క్యాంప్ ఆఫీసులో ఆర్ఈసీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ రాజీవ్ శర్మ, తెలంగాణ జెన్కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డి. ప్రభాకర్‌రావు ఈ ఎంవోయూపై సంతకం చేశారు. 6,280 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణానికి ఈ నిధులను ఖర్చు చేస్తారు. 800 మెగావాట్ల కొత్తగూడెం థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏడో దశ, 1,080 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టనున్న మణుగూరులోని భద్రాద్రి పవర్ ప్రాజెక్టు, నల్లగొండ జిల్లా దామరచెర్లలో నిర్మించనున్న 4,400 మెగావాట్ల పవర్ ప్లాంట్లకు ఆర్ఈసీ ఈ నిధులను సమకూర్చుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిన మేరకు ఆర్ఈసీ ఇచ్చే రుణానికి.. మిగతా రాష్ట్రాలు చెల్లిస్తున్న వడ్డీ రేటు కంటే 0.5 శాతం తగ్గించేందుకు ఆర్ఈసీ చైర్మన్ రాజీవ్‌శర్మ అంగీకరించారు. దీన్ని ప్రత్యేక కేసుగా పరిగణిస్తామన్నారు. జెన్కోపై రూ.600 కోట్ల ఆర్థిక భారం తగ్గింపు.. వడ్డీ రేటు తగ్గింపుతో తెలంగాణ జెన్కోపై రూ.600 కోట్ల ఆర్థిక భారం తగ్గుతుంది. ఆర్ఈసీ ఇచ్చే రూ.24 వేల కోట్లతో పాటు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) ఈ ప్లాంట్ల నిర్మాణానికి రూ.15 వేల కోట్లు ఇచ్చేందుకు ఇప్పటికే అంగీకరించింది. దీంతో పాటు జెన్కో రూ.3,000 కోట్లు వీటికి వెచ్చించనుంది. దీంతో కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి మొత్తంగా రూ.42 వేల కోట్ల నిధులు సమకూరినట్లయింది. ఎంవోయూపై సంతకాల అనంతరం సీఎం మాట్లాడుతూ.. విద్యుత్ ప్రాజెక్టుల బృహత్తర లక్ష్యాన్ని చేరుకునేందుకు నిధులతో పాటు మౌలిక సదుపాయాలు, టౌన్షిప్ అభివృద్ధి, విద్యుత్ ప్లాంట్లకు నీటి సరఫరా, బొగ్గు సరఫరాకు రైల్వే ట్రాక్.. ఇలాంటివెన్నో అధిగమించాల్సి ఉందన్నారు. ఆర్ఈసీ, పీఎఫ్సీ, జెన్కో నిధుల లభ్యతతో కీలకమైన పెట్టుబడి లక్ష్యం నెరవేరిందన్నారు. అవసరమైన భూముల సేకరణ రెండో ప్రధానమైన అంశమని అన్నారు. ఖమ్మం జిల్లా మణుగూరులోని భద్రాద్రి పవర్ ప్లాంట్‌కు 1,134 ఎకరాల భూములు సేకరిస్తున్నామని.. పర్యావరణ అనుమతులు త్వరలోనే వస్తాయని తెలిపారు. బీహెచ్ఈఎల్ పనులు కూడా ప్రారంభించిందని చెప్పారు. కేటీపీఎస్ విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న 800 మెగావాట్ల ప్లాంటుకు సరిపడేంత భూమి అందుబాటులో ఉందన్నారు. మిగతా 4,400 మెగావాట్ల ప్లాంట్లకు.. నల్లగొండ జిల్లాలో పది వేల ఎకరాల భూములు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్లాంట్లకు 4.6 టీఎంసీల నీటిని పక్కనే ఉన్న కృష్ణా నది నుంచి తీసుకుంటామన్నారు. ఎన్టీపీసీ నిర్మించాల్సిన 4,000 మెగావాట్ల ప్రాజెక్టుకు సంబంధించి రామగుండంలో 1,600 మెగావాట్ల ప్లాంటు నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. మిగతా 2,400 మెగావాట్ల ప్లాంట్లను ఎన్టీపీసీ దామరచర్ల ప్రాంతంలోనే నిర్మించనున్నట్లు తెలిపారు. దీంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా దామరచర్ల ప్రాంతం అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ప్రాంతంగా అవతరిస్తుందని అన్నారు. నల్లగొండ జిల్లాకు ఈ వెలుగుల ఘన కీర్తి దక్కుతుందన్నారు. ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, ఆర్ఈసీ ఫైనాన్స్ డెరైక్టర్ అజిత్ అగర్వాల్, టెక్నికల్ డెరైక్టర్ పీజే థక్కర్, చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ ఎన్.వెంకటేశన్, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మిగులు భూముల్లో.. మినీ సోలార్
గద్వాల : సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు నడిగడ్డ కేంద్రబిందువుగా మారనుంది. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన మిగులు భూముల్లో జెన్కో ఆధ్వర్యంలో ఒక మెగావాట్ విద్యుదుత్పత్తి సామర్థ్యంతో మినీ సోలార్ ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్మించనుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం మేరకు సాగునీటి శాఖ ఇంజనీర్లు జిల్లాలోని ప్రాజెక్టుల వద్ద ఉన్న మిగులు భూముల వివరాలను ప్రాజెక్టుల సీఈ ఖగేందర్‌కు పంపించారు. ప్రాజెక్టులకు అవసరమైన భూములను మినహాయించి మిగతా భూ వివరాలతో ప్రభుత్వానికి నివేదించారు. ఈ ప్రక్రియ ముందుకు సాగితే నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంతో పాటు జిల్లాలో ఉన్న కోయిల్‌సాగర్, భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల వద్ద జెన్కో ఆధ్వర్యంలో త్వరలోనే మినీ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం అంచనా మేరకు మిగులు భూముల్లో వంద మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. గుర్తించిన భూములివే.. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజర్వాయర్ల వద్ద ఉన్న 360 ఎకరాలు, కోయిల్‌సాగర్ వద్ద 45 ఎకరాలు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(ఎంజీఎల్‌ఐ) వద్ద వందెకరాలు, భీమా ప్రాజెక్టు లిఫ్టుల వద్దనున్న 80 ఎకరాల్లో ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకునే విధంగా నీటి పారుదలశాఖ అధికారులు ఈఎన్సీ ద్వారా ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ప్రభుత్వం నుంచి జెన్కోకు చేరడమే మిగిలి ఉంది. జూరాల ప్రాజెక్టు వద్ద చేపట్టిన ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ కేంద్రం గత నాలుగేళ్లుగా విజయవంతంగా విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకుని మిగతా ప్రాజెక్టుల వద్ద మినీ సోలార్ వి ద్యుత్ ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయిం చారు. జూరాల ప్రాజెక్టు వద్ద ఇంకా 50 ఎకరాల మిగులు భూమిని గుర్తించినప్పటికీ ఇక్కడ పర్యాటక కేంద్రం ఏర్పాటుతో పాటు ప్రాజెక్టు అవసరాలకు ఉపయోగిం చుకుంటామని నివేదికలో పేర్కొన్నారు. భూములను గుర్తించి నివేదిక పంపాం : - ఖగేందర్, ప్రాజెక్టుల సీఈ జిల్లాలో జూరాల, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, భీమా ప్రాజెక్టుల వద్ద ఉన్న భూమిని మినీ సోలార్ ప్రాజెక్టుల అవసరాలకు వినియోగించుకునేందుకు 585 ఎకరాలను గుర్తించారు. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక పంపించాం. జూరాల ప్రాజెక్టు వద్ద గుర్తించిన 50 ఎకరాలను పర్యాటక అవసరాలకు మినహాయించాం. -
రూ. 39,000 కోట్లతో కొత్త కాంతులు
* ప్లాంట్ల నిర్మాణ అంచనాలతో టీ సర్కారుకు జెన్ కో నివేదిక * మణుగూరు, కొత్తగూడెంపై ప్రత్యేకంగా దృష్టి * విదేశీ బొగ్గును వినియోగించే యోచన * భూసేకరణే ప్రధాన అవరోధం * మిగతా విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి కొనసాగుతున్న పరిశీలన సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్మించ తలపెట్టిన కొత్త థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు రూ.39 వేల కోట్లు ఖర్చవుతాయని జెన్కో లెక్కగట్టింది. స్థానికంగా బొగ్గు లభ్యం కాకపోతే... మొత్తం విదేశీ బొగ్గుతోనే ఈ కొత్త ప్రాజెక్టులను నిర్వహించాలని యోచిస్తోంది. అయితే ప్రాజెక్టులన్నింటికీ భూసేకరణే ప్రధాన అవరోధంగా మారనున్నట్లు భావిస్తోంది. ఈ మేరకు కొత్త ప్లాంట్లకు అంచనా వ్యయంతో పాటు యూనిట్ల నిర్మాణానికి ఎంత విస్తీర్ణంలో భూములు అవసరం? అందుబాటులో ఉన్నదెంత? అదనంగా ఏ మేరకు భూసేకరణ చేపట్టాలి? ఎంత మేరకు నీరు, బొగ్గు అవసరం? అనే వివరాలతో తాజా నివేదికను రాష్ట్ర ఇంధన శాఖకు సమర్పించింది. భారీగా నిధులు అవసరం.. జెన్కో అంచనాల ప్రకారం కొత్తగా ప్రతిపాదించిన మణుగూరు థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం రూ.7,020 కోట్లు కావాలి. కొత్తగూడెం థర్మల్ ప్రాజెక్టులో నిర్మించనున్న ఏడో యూనిట్‌కు రూ. 5,200 కోట్లు, తర్వాత చేపట్టనున్న కాకతీయ థర్మల్ ప్లాంట్ మూడో దశ, రామగుండం, సత్తుపల్లి ప్రాజెక్టులకు రూ. 26,780 కోట్లు అవసరం. ఇక అవసరమైన భూమిని పరిశీలిస్తే... కొత్తగూడెంలో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణానికి మొత్తం 460 ఎకరాలు కావాల్సి ఉంది. ప్రస్తుతం పాల్వంచలో ఉన్న కేటీపీపీ పరిసరాల్లోనే 230 ఎకరాలు అందుబాటులో ఉంది. అదనంగా మరో 230 ఎకరాల భూమి సేకరించాలి. ఈ మేరకు ప్రతిపాదనలను జెన్కో ఇప్పటికే పాల్వంచ ఆర్డీవోకు అందజేసింది. ఈ ప్లాంటు నిర్వహణకు 25 క్యూసెక్కుల నీరు అవసరం. బూర్గంపాడు సమీపంలో గోదావరి నుంచి ప్రస్తుతమున్న 25 కిలోమీటర్ల పైపులైన్ ద్వారా ఈ నీటిని సరఫరా చేసుకునే వీలుంది. ఇక ఈ యూనిట్‌కు ఏడాదికి 4.72 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం. ఎక్కువ నాణ్యత ఉండే విదేశీ బొగ్గును వాడితే.. 2.70 మిలియన్ టన్నులు సరిపోతుందని అంచనా. దేశీయంగా సరిపడేంత బొగ్గు లభ్యం కాని పక్షంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకుని.. 440 కిలోమీటర్ల దూరంలోని కాకినాడ పోర్టు నుంచి రవాణా చేసుకునే వీలుందని జెన్కో నివేదికలో పొందుపరిచింది. సగం దేశీయ బొగ్గు, సగం విదేశీ బొగ్గు వినియోగించే ప్రతిపాదనలతో పాటు పూర్తిగా విదేశీ బొగ్గును వాడుకునేలా... రెండు విధాలుగా ప్రాజెక్టు రిపోర్టులను సిద్ధం చేసింది. ఇక మణుగూరు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులో మొత్తం 1080 మెగావాట్ల ఉత్పత్తికి నాలుగు 270 మెగావాట్ల యూనిట్లను స్థాపించనున్నారు. మొత్తం 1,031 ఎకరాల భూమి అవసరమని జెన్కో గుర్తించింది. ఇటీవలే భూసేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించి రూ. 51 కోట్లను జెన్కో ఇప్పటికే రెవెన్యూ విభాగానికి డిపాజిట్ చేసింది. మణుగూరు ప్లాంట్‌కు 40 క్యూసెక్కుల నీరు అవసరం. ప్రాజెక్టుకు అవసరమైన 3.40 మిలియన్ టన్నుల విదేశీ బొగ్గును దిగుమతి చేసుకుని, కాకినాడ పోర్టు నుంచి 500 కిలోమీటర్లు రవాణా చేసుకోవాల్సి ఉంటుందని జెన్కో నివేదికలో పేర్కొంది. బీహెచ్ఈఎల్కు పనులు.. మణుగూరు, కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని ప్రభుత్వం ఈపీసీ విధానంలో బీహెచ్ఈఎల్కు అప్పగించింది. ఒప్పందం ప్రకారం కేవలం 30 నెలల వ్యవధిలోనే మణుగూరు ప్లాంట్ నిర్మాణానికి బీహెచ్ఈఎల్ అంగీకరించింది. నిర్మాణానికి సంబంధించిన ధరలతో పాటు యంత్రాలు, ప్లాంటుకు సంబంధించిన సాంకేతిక అంశాలపై జెన్కో నియమించిన కమిటీ బీహెచ్ఈఎల్ మధ్య చర్చలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. పాల్వంచ, మణుగూరు, పినపాక మండలాల్లో భూ సేకరణ ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి కీలకంగా మారనుంది. భూసేకరణ పూర్తయ్యేందుకు కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పడుతుందని రెవెన్యూ యంత్రాంగం అంచనా వేస్తోంది. దీంతో జెన్కో ఆశించిన సమయంలో ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయా.. లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.