జల విద్యుత్ కేంద్రాల్లో ఇబ్బందులొస్తే వెంటనే నా దృష్టికి తీసుకురండి
విద్యుత్ కేంద్రాల్లో తలెత్తే సమస్యలపై త్రిసభ్య కమిటీ
కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా జెన్‌కో సీఎండీ నిర్ణయాలు తీసుకోవాలి
భద్రాద్రి యూనిట్–1 ట్రాన్స్‌ఫార్మర్‌పై నిర్ణయం టెక్నికల్ కమిటీదే
సమీక్షలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) అధి కారులకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. జల విద్యుత్ కేంద్రాల్లో సమస్యలు తలెత్తితే తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని, ఈ విషయంలో ఎలాంటి అల సత్వం వహించరాదని స్పష్టం చేశారు. విద్యుత్ కేంద్రాల్లో ఏర్పడే సమస్యలను పరిష్కరించేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు.
క్షేత్ర స్థాయిలో కమిటీ పర్యటించి సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను సిఫారసు చేస్తూ నివేదిక అందజేస్తుందని తెలిపారు. దీని ఆధారంగా జెన్‌కో సీఎండీ నిర్ణయాలు తీసుకోవాలని విద్యుదుత్పత్తిలో అంతరాయాలు లేకుండా పరిష్కరించాల్సి ఉంటుందని సూచించారు. ప్రజాభవన్‌లో బుధవారం భట్టి తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీ డీసీఎల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
భద్రాద్రి థర్మ ల్ విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో కా లిపోయిన యూనిట్–1కి సంబంధించిన జనరేటర్ ట్రాన్స్ ఫార్మర్‌కు మరమ్మతులు నిర్వహించాలా? కొత్త ట్రాన్స్‌ఫా ర్మర్‌ను కొనుగోలు చేయాలా? అనే అంశాన్ని టెక్నికల్ కమిటీ పరిశీలిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తీసు కున్న నిర్ణయాలను అమలు చేసే ముందు తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి తెలియజేసి అనుమతి పొందాలని కోరారు. ఈ విషయంలో విద్యుత్ సంస్థల సీఎండీలు తప్పనిసరిగా ఇంధ న శాఖ కార్యదర్శిని సంప్రదించాలని ఆయన ఆదేశించారు.
మళ్లీ గృహజ్యోతి దరఖాస్తుల స్వీకరణ...
గృహజ్యోతి పథకం కింద అర్హులై ఉండి గతంలో దరఖాస్తు చేసుకోని వారి నుంచి మళ్లీ దరఖాస్తులను స్వీకరించాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. పేదల గృహాలకు ప్రతి నెలా 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ సరఫరాను అమలు చేసే గృహజ్యోతి పథకాన్ని అర్హులందరికీ వర్తింపజేయాలని కోరారు. టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో 227 కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రక్రియ ప్రారంభమైందని, అందులో 113 సబ్ స్టేషన్లకు స్థలాల సమస్య లేదని, మిగతా వాటికి స్థలాలను కలెక్టర్లు కేటాయించాల్సి ఉందన్నారు.
కాళేశ్వరం, ఇతర ఎత్తిపోతల పథకాలకు ఎంత విద్యుత్‌ను వినియోగిస్తున్నారు? అందుకు అవుతున్న ఖర్చు ఎంత? తదితర వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. సమావేశంలో ఇంధన శాఖ ఇన్‌చార్జి కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్ సీఎండీలు ముషర్రఫ్ అలీ, వరుణ్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment