ప్రతిభ గల క్రీడాకారులకు దక్కని చేదోడు
అమలుకు నోచుకోని 74 జీఓ
వరంగల్ స్పోర్ట్స్ : ‘క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటా’ అనేది మాటలకే పరిమితమవుతోం ది. దీన్ని అమలుపర్చడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో దృష్టి సారించడం లేదు. ఫలితంగా ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ప్రయోజనాల్ని పొం దలేకపోతున్నారు. ఇటీవల జిల్లాలోని కేటీపీపీ, జెన్‌కోలలో జరిగిన ఉద్యోగ నియామకాల్లో క్రీడా కోటాను తొలగించారు. ఇదే ధోరణి కొనసాగితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ నోటిఫికేషన్లలో ఎంతమేరకు స్పోర్ట్స్ కోటా అమలవనుందనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నారుు.
ప్రశ్నిస్తే.. గెటౌట్’
జిల్లాలోని చెల్పూర్ కేటీపీపీలో 361 ఉద్యోగాల నియూమకానికి 2013లో జెన్‌కో నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో స్పోర్ట్స్ కోటా ఉంటుందని పొందుపరిచారు. అయితే, ఆ నియామకాలు నిలిచిపోగా.. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం ఇటీవల చేపట్టింది. కొద్దిరోజుల క్రితం తుదిజాబితా వెల్లడించగా.. స్పోర్ట్స్ కోటాలో ఒక్కరికీ ఉద్యోగం రాలేదు. దీన్నిచూసి క్రీడాకారులు సంబంధిత అధికారులను అడిగితే స్పోర్ట్స్ సర్టిఫికె ట్లు పొందుపరచడం కాదు.. క్రీడా సంఘాల కార్యదర్శి లెటర్‌హెడ్‌పై జాతీయ, రాష్ట్రస్థారుులో ఆడినట్లుగా ధ్రువీకరించిన సర్టిఫికెట్లను పొం దుపర్చాలని సూచించడం గమనార్హం. ఈ విషయూన్ని ముందుగా నోటిఫికేషన్‌లో ఎందుకు పేర్కొనలేదని అడిగిన తమకు ‘గెటౌట్’ అనే సమాధానం ఎదురైందని క్రీడా అభ్యర్థులు వాపోయూరు.
క్రీడాపాలసీలు ఏమైనట్టు..
ప్రభుత్వ శాఖలలోని ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియలో క్రీ డాకారులకు ప్రత్యేక కోటా అమలుపై మొదటగా 1977 లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 115 జీవో ను తెచ్చింది. అయితే, తొలిసారిగా ఈ జీఓ ప్రకా రం స్పోర్ట్స్ కోటాలో 1 శాతమే కేటారుుంచారు. ఇక 2012లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జీఓ నంబర్ 74 తీసుకొచ్చారు. దీని ప్రకారం 29 విభాగాల్లో ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగ నియూమకాల్లో రెండు శాతం కేటాయించాల్సి ఉంటుంది. కానీ, అధికారులు, ప్రభుత్వం ఈ జీవో అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం గమనార్హం.
అర్హత ఉండీ ఉద్యోగం కోల్పోయాను
హ్యాండ్‌బాల్‌లో సీనియర్ విభాగంలో సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ స్థాయిలో అనేక టోర్నీల్లో ఆడాను. ఈ సర్టిఫికెట్లతో 2013లో ఏపీ జెన్‌కో ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఫైర్‌మెన్, సెక్యూరిటీ ఉద్యోగాలకు దరఖాస్తు చేశాను. ఆ రెండు పోస్టులకు ఇంటర్ ఉంటే చాలు. అయితే, అధికారుల తీరుతో ఉద్యోగం కోల్పోయాను. - సురేష్, హ్యాండ్‌బాల్ సౌత్‌జోన్ ప్లేయర్, ఆత్మకూరు
కోటాకు చట్టబద్ధత కల్పించాలి
ఉద్యోగాల్లో క్రీడాకారులకు న్యాయం జరగాలంటే స్పోర్ట్స్ కోటాకు రాజ్యాంగపరమైన చట్టబద్ధత కల్పిం చాలి. ఆ దిశగా ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో చట్టాలు రూపొందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. అలాగే, ఉన్నతాధికారులు స్పందించి కొత్త రాష్ట్రంలో ఉద్యోగ నియూమకాల్లో స్పోర్ట్స్ కోటాను అమలుచేయాలి.
- మంచిక అభినవ వినయ్, క్రికెటర్, పరకాల
పేలని తూట.. స్పోర్ట్స్ కోటా!
Published Tue, Mar 8 2016 1:19 AM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM
Advertisement
Advertisement