జెన్‌కో వెలుగులు | Genco lights | Sakshi
Sakshi News home page

జెన్‌కో వెలుగులు

Published Wed, May 20 2015 5:37 AM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM

Genco lights

ప్రాజెక్టుకు తీరిన బొగ్గు కొరత!
సీఓడీ తర్వాత 3 నెలలకు ఉత్పత్తి ప్రారంభం
విద్యుత్ కోతలకు ఇక చెక్

 
ముత్తుకూరు : మండలంలోని నేలటూరులో దామోదరం సంజీవయ్య 1,600 మెగావాట్ల సూపర్‌క్రిటికల్ థర్మ్‌ల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు సమస్యలు పరిష్కారమయ్యాయి. సీఓడీ ప్రకటించిన మూడు నెలల తర్వాత 1వ యూనిట్ కింద 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించారు. పవర్‌గ్రిడ్ సూ చనల మేరకు విద్యుదుత్పత్తి పెంచుతూ జిల్లాలో వెలుగులు నింపేందుకు సన్నాహాలు చేపట్టారు. దేశంలో మొదటిసారిగా నేలటూరులో ఏపీ జెన్‌కో సూపర్‌క్రిటికల్ టెక్నాలజీతో ఏడేళ్ల క్రితం బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నేలటూరు, ముసునూరువారిపాళెంలో 1,400 ఎకరాల భూములు సేకరించారు.

సేకరించిన భూములకు పరిహారం, తరలించిన నక్కలమిట్ట గ్రామ పునరావాసానికి రూ.100 కోట్లు ఖర్చుచేశారు. భూసేరణ పూర్తై తర్వాత 2009 జులైలో ప్రాజెక్టు పనులు మొదలుపెట్టారు. 48 మాసాల్లో 1వ యూనిట్ కింద 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయాలని భావించారు. స్థానికులకు ఉద్యోగాలు, భూముల పరిహారం జరిగిన ఆందోళనలు, ప్రాజెక్టులో ముఖ్య విభాగాల డిజైన్ల మార్పు, కోర్టుల స్టేల వల్ల నిర్మాణంలో జాప్యం జరిగింది.

ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 8 వేల కోట్లతో అంచనాలు వేయగా, చివరకు వ్యయం రూ.13వేల కోట్లకు చేరింది. అలాగే, 2013లో విద్యుత్ ఉత్పత్తికి ట్ర యల్న్ ్రనిర్వహించినప్పటికీ పలుమార్లు బాయిలర్‌లో ఏర్పడిన అంతరాయాల వల్ల ఉత్పత్తికి బ్రే క్ పడింది. పదేపదే బాయిలర్ మండించడం, నిలిపివేయడం, మళ్లీ వెలిగించడం వంటి ప్రక్రియలకే 3 లక్షల టన్నుల బొగ్గు ఖర్చైపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 1వ యూనిట్ 800 మెగావాట్లకు సీఓడీ ప్రకటించారు. అయితే, బొగ్గు ఒప్పందం కుదరకపోవడంతో 3 నెలల పాటు ఈ యూనిట్‌లో ఉత్పత్తి నిలిచిపోయింది.

తాజాగా కోల్ ఇండియా ఆదేశాల మేరకు 1వ యూనిట్‌కు మహానది బొగ్గు గనుల నుంచి ఈ ఏడాది 2.5 మిలియన్ టన్నుల బొగ్గు కేటాయిస్తూ ఒప్పందం కుదిరింది. దీంతో ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి తిరిగి ప్రారంభించారు. బుధవారం సాయంకాలానికి 280 నుంచి 300 మెగావాట్ల ఉత్పత్తి జరగవచ్చని అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement