coal problem
-
గుడ్‌న్యూస్: మెరుగుపడ్డ బొగ్గు ఉత్పత్తి
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు ఉత్పత్తి 2021–22 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం పెరిగి 777 మిలియన్ టన్నులుగా (ఎంటీ) ఉన్నట్టు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. వేసవి ఎండల నేపథ్యంలో విద్యుత్‌కు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుండడం గమనార్హం. దీంతో బొగ్గు నిల్వల కొరతపై వార్తలు వస్తున్న క్రమంలో మంత్రి చేసిన ప్రకటనకు ప్రాధాన్యం నెలకొంది. 2020–21 సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి 716 మిలియన్ టన్నులుగా ఉన్నట్టు మంత్రి గుర్తు చేశారు. బొగ్గు సరఫరా 18 శాతం పెరిగి 818 మిలియన్ టన్నులుగా నమోదైంది. బొగ్గు గనుల్లో భద్రతకు సంబంధించి స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. బొగ్గు గనుల్లో భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని చెప్పారు. భద్రతా చర్యల అమలు విషయంలో నిధుల కొరత రాకుండా చూసుకోవాలని కోరారు. గతేడాది అక్టోబర్‌లోనూ బొగ్గు నిల్వలు తగ్గిపోవడం తెలిసిందే. చదవండి: అక్టోబర్ నుంచే దేశంలో బొగ్గు కొరత: ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్ -
జెన్కో వెలుగులు
►ప్రాజెక్టుకు తీరిన బొగ్గు కొరత! ►సీఓడీ తర్వాత 3 నెలలకు ఉత్పత్తి ప్రారంభం ►విద్యుత్ కోతలకు ఇక చెక్ ముత్తుకూరు : మండలంలోని నేలటూరులో దామోదరం సంజీవయ్య 1,600 మెగావాట్ల సూపర్‌క్రిటికల్ థర్మ్‌ల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు సమస్యలు పరిష్కారమయ్యాయి. సీఓడీ ప్రకటించిన మూడు నెలల తర్వాత 1వ యూనిట్ కింద 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించారు. పవర్‌గ్రిడ్ సూ చనల మేరకు విద్యుదుత్పత్తి పెంచుతూ జిల్లాలో వెలుగులు నింపేందుకు సన్నాహాలు చేపట్టారు. దేశంలో మొదటిసారిగా నేలటూరులో ఏపీ జెన్కో సూపర్‌క్రిటికల్ టెక్నాలజీతో ఏడేళ్ల క్రితం బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నేలటూరు, ముసునూరువారిపాళెంలో 1,400 ఎకరాల భూములు సేకరించారు. సేకరించిన భూములకు పరిహారం, తరలించిన నక్కలమిట్ట గ్రామ పునరావాసానికి రూ.100 కోట్లు ఖర్చుచేశారు. భూసేరణ పూర్తై తర్వాత 2009 జులైలో ప్రాజెక్టు పనులు మొదలుపెట్టారు. 48 మాసాల్లో 1వ యూనిట్ కింద 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయాలని భావించారు. స్థానికులకు ఉద్యోగాలు, భూముల పరిహారం జరిగిన ఆందోళనలు, ప్రాజెక్టులో ముఖ్య విభాగాల డిజైన్ల మార్పు, కోర్టుల స్టేల వల్ల నిర్మాణంలో జాప్యం జరిగింది. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 8 వేల కోట్లతో అంచనాలు వేయగా, చివరకు వ్యయం రూ.13వేల కోట్లకు చేరింది. అలాగే, 2013లో విద్యుత్ ఉత్పత్తికి ట్ర యల్న్ ్రనిర్వహించినప్పటికీ పలుమార్లు బాయిలర్‌లో ఏర్పడిన అంతరాయాల వల్ల ఉత్పత్తికి బ్రే క్ పడింది. పదేపదే బాయిలర్ మండించడం, నిలిపివేయడం, మళ్లీ వెలిగించడం వంటి ప్రక్రియలకే 3 లక్షల టన్నుల బొగ్గు ఖర్చైపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 1వ యూనిట్ 800 మెగావాట్లకు సీఓడీ ప్రకటించారు. అయితే, బొగ్గు ఒప్పందం కుదరకపోవడంతో 3 నెలల పాటు ఈ యూనిట్లో ఉత్పత్తి నిలిచిపోయింది. తాజాగా కోల్ ఇండియా ఆదేశాల మేరకు 1వ యూనిట్‌కు మహానది బొగ్గు గనుల నుంచి ఈ ఏడాది 2.5 మిలియన్ టన్నుల బొగ్గు కేటాయిస్తూ ఒప్పందం కుదిరింది. దీంతో ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి తిరిగి ప్రారంభించారు. బుధవారం సాయంకాలానికి 280 నుంచి 300 మెగావాట్ల ఉత్పత్తి జరగవచ్చని అంచనా వేస్తున్నారు. -
ఆర్టీపీఎస్లో సాంకేతిక సమస్యలు
రెండు యూనిట్లలో విద్యుదుత్పాదన నిలిపివేత మరో యూనిట్లో చాలా రోజులుగా నిలిచిపోయిన ఉత్పత్తి రాయచూరు : ఆర్టీపీఎస్లో సాంకేతిక సమస్యలు తలెత్తి రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పాదన స్తంభించింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కోల్సీడింగ్ గేర్ బాక్సులో సమస్య తలెత్తి బొగ్గు సక్రమంగా సరఫరా కాక 1, 2 యూనిట్లు డ్రిప్ అయ్యాయి. అదేవిధంగా 210 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 3, 4,5,6,7 యూనిట్లలో కూడా ఉత్పాదన బాగా తగ్గి సగటున 80 నుంచి 90 మెగావాట్ల ఉత్పాదన జరుగుతోంది. 8వ యూనిట్లో ఈఎస్పీ అమర్చే ప్రక్రియ పూర్తయినా బీహెచ్ఈఎల్ అధికారులు పరీక్ష చేసే ప్రక్రియ పూర్తికాక ఆ యూనిట్లో చాలా రోజులుగా ఉత్పదన ప్రారంభించలేదు. అయితే తుదిపరీక్ష నేడో రేపొ తరువాయి ఇక్క ఉత్పాదన ప్రారంభం కానుంది. 210 మెగావాట్ల మొత్తం 7 యూనిట్లు అలాగే 250 మెగావాట్ల 8వ యూనిట్‌తో కలిపి 1720 ఉత్పాదన చేసే సామర్థ్యముంది. 3,4,5,6,7 యూనిట్లలో 450 నుంచి 500 మెగాట్లు మాత్రమే ఉత్పాదన జరుగుతుండటంతో రాష్ర్తంలో విద్యుత్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడనుంది. 2వ యూనిట్‌ను ఈ ఏడాది వార్షిక మరమ్మత్తులు చేయలేదు. ఇది కూడా డ్రిప్ అయినందువల్ల వార్షిక మరమ్మత్తులు చేపట్టే అవకాశముంది. మొత్తానికి తరచుగా ఏవెవో కారణాలతో ఉత్పాదన ఆగడం వల్ల అటు అధికారులకు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. మరో వైపు ఆర్టీపీఎస్‌ను బొగ్గు సమస్య కూడా వేధిసోతంది. ప్రతి రోజు సగటున ఏడెనిమిది రేకుల బొగ్గు సరఫరా కావాల్సి ఉండగా బుధవారం కేవలం 5 రేకులు, గురువారం కేవలం ఒక రాక్ మాత్రమే సరఫరా అయ్యింది. ప్రస్తుతం 8, 9 వేల మెట్రిక్ టన్నుల బొగ్గులు మాత్రం నిలువ ఉన్నాయి. నిర్దిష్టప్రమాణంలో బొగ్గులు సరఫఱా కాకపోతే ఉత్పాదనపై తీవ్ర ప్రభావం పడనుంది.