- రెండు యూనిట్లలో విద్యుదుత్పాదన నిలిపివేత
- మరో యూనిట్‌లో చాలా రోజులుగా నిలిచిపోయిన ఉత్పత్తి
రాయచూరు : ఆర్‌టీపీఎస్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తి రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పాదన స్తంభించింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కోల్‌సీడింగ్ గేర్ బాక్సులో సమస్య తలెత్తి బొగ్గు సక్రమంగా సరఫరా కాక 1, 2 యూనిట్లు డ్రిప్ అయ్యాయి. అదేవిధంగా 210 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 3, 4,5,6,7 యూనిట్లలో కూడా ఉత్పాదన బాగా తగ్గి సగటున 80 నుంచి 90 మెగావాట్ల ఉత్పాదన జరుగుతోంది.
8వ యూనిట్‌లో ఈఎస్పీ అమర్చే ప్రక్రియ పూర్తయినా బీహెచ్‌ఈఎల్ అధికారులు పరీక్ష చేసే ప్రక్రియ పూర్తికాక ఆ యూనిట్‌లో చాలా రోజులుగా ఉత్పదన ప్రారంభించలేదు. అయితే తుదిపరీక్ష నేడో రేపొ తరువాయి ఇక్క ఉత్పాదన ప్రారంభం కానుంది. 210 మెగావాట్ల మొత్తం 7 యూనిట్లు అలాగే 250 మెగావాట్ల 8వ యూనిట్‌తో కలిపి 1720 ఉత్పాదన చేసే సామర్థ్యముంది. 3,4,5,6,7 యూనిట్లలో 450 నుంచి 500 మెగాట్లు మాత్రమే ఉత్పాదన జరుగుతుండటంతో రాష్ర్తంలో విద్యుత్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడనుంది.
2వ యూనిట్‌ను ఈ ఏడాది వార్షిక మరమ్మత్తులు చేయలేదు. ఇది కూడా డ్రిప్ అయినందువల్ల వార్షిక మరమ్మత్తులు చేపట్టే అవకాశముంది. మొత్తానికి తరచుగా ఏవెవో కారణాలతో ఉత్పాదన ఆగడం వల్ల అటు అధికారులకు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. మరో వైపు ఆర్‌టీపీఎస్‌ను బొగ్గు సమస్య కూడా వేధిసోతంది. ప్రతి రోజు సగటున ఏడెనిమిది రేకుల బొగ్గు సరఫరా కావాల్సి ఉండగా బుధవారం కేవలం 5 రేకులు, గురువారం కేవలం ఒక రాక్ మాత్రమే సరఫరా అయ్యింది. ప్రస్తుతం 8, 9 వేల మెట్రిక్ టన్నుల బొగ్గులు మాత్రం నిలువ ఉన్నాయి. నిర్దిష్టప్రమాణంలో బొగ్గులు సరఫఱా కాకపోతే ఉత్పాదనపై తీవ్ర ప్రభావం పడనుంది.