
నాని హీరోగా ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నిర్మాతగా మారారు. సమ్మక్క సారక్క క్రియేషన్స్ ని స్థాపించిన ఆయన ‘ఏఐ అమీనా జరియా రుక్సానా–గులాబీ’ అనే మూవీని ప్రకటించారు. ఈ మూవీ ద్వారా చేతన్ బండి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈ చిత్రానికి కథను అందించడంతో పాటు చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్‌పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రలతో కలిసి శ్రీకాంత్ ఓదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ప్రకటించి, పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘2009లో గోదావరిఖని ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందనున్న అందమైన ప్రేమకథ ‘ఏఐ అమీనా జరియా రుక్సానా–గులాబీ’.
ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించే ఓ అమ్మాయి లోతైన భావోద్వేగాలను ఈ మూవీ చూపిస్తుంది. ఈ చిత్రం ప్రీప్రోడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment