
నాని ప్రధాన పాత్రలో నటించిన మాస్ మూవీ దసరా. ఈ సినిమాలో నాని ఊరమాస్ లుక్‌లో కనిపించడమే కాకుండా తెలంగాణ యాసలో డైలాగులు వదిలాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగులో ప్రముఖ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి రిలీజ్ చేస్తూ దసరా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నాడు.
'నాని మేకోవర్ ఆకట్టుకుంటోంది. ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న ఓదెల శ్రీకాంత్ తొలి సినిమాతోనే ఇంత ప్రభావం చూపిస్తుండటం మెచ్చుకోదగ్గ విషయం. చివరి షాట్ ఏదైతే ఉందో అది అన్నింటికంటే తోపు' అని ట్వీట్ చేశాడు జక్కన్న. రాజమౌళి ప్రశంసలతో శ్రీకాంత్ ఓదెల ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈమేరకు ట్విటర్‌లో ఆయన స్పందిస్తూ.. 'రాజమౌళి సర్.. మీ ట్వీట్‌కి మైండ్ మొత్తం బ్లాక్ అయ్యింది. అప్పటికెళ్లి మాకు ఇంగ్లీష్‌లో రిప్లై పెడదాం అనుకుంటున్న.. కానీ తెలుగులోనే మాటలు ఒస్తలేవు సర్. కోతి లెక్క గెంతుతున్న! థ్యాంక్ యూ సో మచ్ సర్' అంటూ రిప్లై ఇచ్చాడు.
చదవండి: నాన్న చనిపోయిన బాధ లేదు, ఎక్స్‌పోజింగ్ మొదలుపెట్టావా?
గ్లామర్ కోసం సర్జరీలు.. : సమీరా రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment