Dasara Movie
-
గుర్తింపు అవసరం లేదు!
హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో గత ఏడాది మార్చి 30న విడుదలైన ‘దసరా’ చిత్రం హిట్‌గా నిలిచింది. ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కనుంది. నాని కెరీర్‌లోని ఈ 33వ సినిమాను ‘దసరా’ నిర్మాత సుధాకర్ చెరుకూరియే నిర్మించనున్నారు. ‘దసరా’ విడుదలై, ఏడాది పూర్తయిన సందర్భంగా తాజా చిత్రాన్ని శనివారం (మార్చి 30)న అధికారికంగా ప్రకటించింది యూనిట్. ‘లీడర్ కావాలనుకుంటే నీకు గుర్తింపు అవసరం లేదు’ అని అర్థం వచ్చేలా ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ పై ఓ ఇంగ్లిష్ కోట్ ఉంది. ఈ చిత్రం 2025లో విడుదల కానుంది. ఇక ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. అలాగే సుజిత్ డైరెక్షన్లో హీరోగా నాని ఓ సినిమా కమిటైన సంగతి తెలిసిందే. -
Shine Tom Chacko Engagement: లేటు వయసులో పెళ్లికి రెడీ అయిన దసరా విలన్.. ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
ఎంగేజ్మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా?
ప్రముఖ విలన్.. లేటు వయసులో పెళ్లికి రెడీ అయిపోయాడు. చాలారోజుల నుంచి ఓ అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు. ఈ విషయమై కొన్నాళ్లుగా జంటగా ఫొటోలు కూడా వైరల్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు తమ బంధం గురించి వస్తున్న పుకార్లకు తెరదించాడు. తన ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2011 నుంచి నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన షైన్.. హీరో కమ్ విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. లాక్డౌన్ టైంలో మన ఆడియెన్స్ మలయాళ సినిమాలకు బాగా అలవాటు పడ్డారు. అలా ఇతడు కూడా మనకు సుపరిచితుడు అయిపోయాడు. (ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు) గతేడాది నాని 'దసరా' మూవీలో విలన్‌గా నటించిన షైన్ టామ్ చాకో.. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత నాగశౌర్య 'రంగబలి'లోనూ నటించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ 'దేవర'లోనూ నటిస్తున్నాడు. ఇకపోతే గత కొన్నాళ్ల నుంచి తనూజ అనే అమ్మాయితో రిలేషన్షిప్ కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు వీళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఫొటోల్ని కూడా ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. 40 ఏళ్ల షైన్ టామ్ చాకో.. ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. మరో 1-2 నెలల్లో పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే షైన్ టామ్ చాకోకి ఇప్పటికే పెళ్లి అయినట్లు వికిపీడియాలో ఉంది. తబీతా అనే మహిళతో పెళ్లయిందని, వీళ్లకు ఓ బిడ్డ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. మరి ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ) View this post on Instagram A post shared by Shine Tom Chacko (@shinetomchacko_official) -
ఈ ఏడాదిలో తొలి సినిమాతోనే హిట్ కొట్టిన కొత్త డైరెక్టర్లు
ఈ ఏడాది సినిమా డైరీ చివరి పేజీలకు చేరుకుంది. ప్రతి ఏడాది మాదిరే ఈసారి కూడా కొత్త దర్శకులు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపారు. ఈ ఏడాదలో ఎక్కువగా చిన్న చిత్రాలే మెప్పించాయి. ఏడాది తెరపై తొలి సినిమాతోనే విజయం సాధించిన డైరెక్టర్లు ఉన్నారు. నేడు ఓటీటీలు యుగం నడుస్తోంది. దీంతో తెలుగు సినిమాలతో పాటు పర భాష చిత్రాలను కూడా ప్రేక్షకులు చూస్తున్నారు. అలా సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో 2023లో పరిచయం అయిన కొత్త కెప్టెన్లు ఎవరో తెలుసుకుందాం పదండి. మారుతున్న సినీప్రియుల అభిరుచికి తగ్గట్లుగా వైవిధ్యమైన కథలతో వినోదాలు వడ్డించడంలో కొత్త దర్శకులు ఎప్పుడూ ముందే ఉంటారు. అందుకే కొత్త ప్రతిభ తెరపై మెరుస్తుందంటే చాలు.. సినీప్రియులంతా వారి వైపు ఓ కన్నేస్తుంటారు. అలా ఈ ఏడాది మొదటి సినిమాతో హిట్ కొట్టిన దర్శకులు ఎవరో తెలుసుకోండి. దసరా- శ్రీకాంత్ ఓదెల నేచురల్ స్టార్ నాని- కీర్తి సురేష్ జోడిగా నటించిన చిత్రం దసరా... శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 2023 మార్చి 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలంగాణలోని ఓ పల్లెలో జరిగిన కథతో రూపొందిన ఈ సినిమా మార్చి 30న థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నాని కెరీర్‌లోని హిట్ సినిమాల లిస్ట్‌లో చేరింది. నాన్నకు ప్రేమతో, రంగస్థలం చిత్రాలకు డైరెక్టర్ సుకుమార్ టీమ్‌లో శ్రీకాంత్ ఓదెల పనిచేశాడు. అదే సమయంలో దసరా కథను రెడీ చేసిన శ్రీకాంత్.. నిర్మాత సుధాకర్ చెరుకూరికి వినిపించడం ఆపై అది కాస్త నానికి నచ్చడం చకచక పనులు జరిగిపోయాయి. అలా మొదటి చిత్రంతోనే పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేశాడు శ్రీకాంత్. దసరా చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. హాయ్ నాన్న- శౌర్యువ్ నాని సినిమాలతో కొత్త దర్శకులు వెలుగులోకి వస్తుంటారు. ఇదే ఏడాది రెండోసారి కూడా కొత్త డైరెక్టర్ శౌర్యువ్కు నాని అవకాశాన్ని కల్పించాడు. అలా భారీ అంచనాలతో నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హాయ్ నాన్న’. మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్గా నటించగా శ్రుతి హాసన్ , బేబీ కియారా కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌కు చెందిన శౌర్యువ్.. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు. రాజమౌళి సినిమాలు చూస్తూనే డైరెక్షన్ విభాగంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు. హాయ్ నాన్న కథ విషయానికొస్తే.. సాధారణంగా పిల్లల బాధ్యతలు తల్లిదండ్రులు ఇద్దరూ చూసుకుంటారు. కానీ, సింగిల్ పెరెంట్ అయితే పూర్తి బాధ్యత ఒకరే చూసుకోవాలి. ఇందులో నాని పాత్ర అలానే ఉంటుంది. ఎక్కడ ఉన్నా సమయానికి కూతురు దగ్గర ఉంటాడు. కథ అంతా ఇలానే సాగుతుంది. శౌర్యువ్ వద్ద ప్రస్తుతం కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయని. త్వరలో వాటి గురించి చెబుతానని ఆయన ప్రకటించాడు. రోమాంచమ్- జీతూ మాధవన్ (మలయాళం,తెలుగు) కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కువగా మలయాళంలో వస్తుంటాయి. ఈ మధ్య తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా మలయాళం, తమిళ చిత్రాలను ఆదరిస్తున్నారు. ఓటీటీల పుణ్యామాని భాషతో సంబంధం లేకుండా మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే రోమాంచమ్ సినిమా కూడా హిట్ కొట్టింది. ఈ చిత్రం ద్వారానే జీతూ మాధవన్ డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే ఆయన పేరు దేశ వ్యాప్తంగా తెలిసేలా చేసింది. ఫిబ్రవరి 3న మలయాళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టయింది. కామెడీ, హారర్.. రెండూ పూర్తి భిన్నమైన నేపథ్యాలతో మంచి వినోదాన్ని పండించాడు డైరెక్టర్ జీతూ.. ఓయిజా బోర్డుతో ఆట ఆడడం వల్ల 2007లో బెంగళూరులోని ఓ ఇంట్లో ఉన్న ఏడుగురు స్నేహితులు ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నారనేదే ఈ సినిమా సారాంశం. ప్రస్తుతం డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. దాదా- గణేష్ కె. బాబు (తమిళ్) కోలీవుడ్‌లో కెవిన్ హీరోగా నటించిన తమిళ మూవీ దాదా.. ఈ సినిమా బిగ్ హిట్‌గా నిలిచింది. దాదాపు మూడు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 22 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇదే ఏడాదిలో ఫిబ్రవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గణేష్ కె. బాబు డైరెక్టర్‌గా దాదా చిత్రం ద్వారానే పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఇద్దరు ప్రేమికులు పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకుని ఆపై వారిద్దరి మధ్య జరిగిన సంఘర్షణలో వారికి జన్మించిన బిడ్డ తండ్రి వద్దే ఉండిపోతాడు. సుమారు కొన్నేళ్ల తర్వాత ఆ బిడ్డ తల్లి వద్దకు ఎలా చేరిందనేది ఈ చిత్రం. తండ్రి గొప్పతనంతో రూపొందిన రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా దీనికి మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాను డైరెక్టర్ గణేష్ కే బాబు చాలా చక్కగా తెరకెక్కించాడు. చిన్న సినిమా అయినా దాదా కథ నచ్చి తమిళంలో ఉధయనిధి స్టాలిన్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అపర్ణ దాస్ హీరోయిన్గా నటించింది. అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్‌కు పా..పా అనే టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. త్వరలో విడుదల కానుంది. బాయ్స్ హాస్టల్- నితిన్ కృష్ణమూర్తి (కన్నడ,తెలుగు) కన్నడలో ఘనవిజయం సాధించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’. తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ సంస్థలు విడుదల చేశాయి. నితిన్ కృష్ణమూర్తి దర్శకుడిగా ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ప్రజ్వల్, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ప్రధాన పాత్రలు పోషించగా.. రిషబ్ శెట్టి, రష్మీ గౌతమ్, తరుణ్‌భాస్కర్ అతిధి పాత్రల్లో నటించారు. ఆగస్టు 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా సరదాగా, అల్లరిచిల్లరగా గడిపే ఓ బాయ్స్ హాస్టల్లోని కుర్రాళ్లకు ఆ హాస్టల్ వార్డెన్ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడంతో పెద్ద సమస్య ఎదురవుతుంది. ఆ చావును కుర్రాళ్లు యాక్సిడెంట్‌గా మార్చే క్రమంలో ఎదురైన సంఘటనలు ఎంతో సరదాగా ఉంటాయి. -
దసరా డైరెక్టర్ మరోసారి నాని.. ఈసారి వేరే లెవెల్
-
గర్భవతిగా ఉన్న నేను ఆ సీన్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను: పూర్ణ
టాలీవుడ్లో పూర్ణగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ అసలు పేరు షమ్నా కాసిమ్.. దక్షిణ భారత చలనచిత్రంలో ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. మలయాళం ద్వారా కెరీర్ ప్రారంభించిన పూర్ణ అక్కడ షమ్నా కాసిమ్గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత తమిళం, తెలుగులో చెప్పుకోదగ్గ పాత్రల ద్వారా అగ్రతారగా నిలిచింది. పూర్ణ మంచి డ్యాన్సర్ కూడా.. ఇప్పటికే పలు డ్యాన్స్ షోస్ ద్వారా కూడా అభిమానులను సంపాదించుకుంది. సినిమాలే కాకుండా బుల్లితెర ప్రపంచంలో కూడా పూర్ణకు ప్రత్యేకమైన స్థానం ఉంది. తన జీవితంలో కొత్త దశను దాటుతోంది. ఇటీవలే తల్లి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: 40 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయిన శింబు.. అమ్మాయి ఎవరంటే) తన ఇంటికి కొడుకు రాకతో ఆ కుటుంబం సంబరాలు చేసుకుంది. సినిమాలో తన పాత్ర కోసం ఎలాంటి ఛాలెంజ్లనైనా స్వీకరించడానికి ఆమె ఎప్పుడూ సిద్ధంగా ఉందటుంది. ఒకానొక సమయంలో సినిమా కోసం ఆమె జుట్టు కత్తిరించుకోవడం పెద్ద చర్చనీయాంశమైంది. తెలుగులో నాని సినిమా అయిన దసరా షూటింగ్లో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి పూర్ణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో పూర్ణ గర్భవతి కాగా సినిమా విడుదల తర్వాత ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. దసరా సినిమా కోసం వర్షంలో రెండు రోజులు షూటింగ్ జరిగిందని గర్భవతిగా ఉన్న తాను ఎంతో ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది. ఇందులో ఆమెకు సంబంధించిన చాలా సన్నివేశాలు రాత్రివేళల్లోనే జరిగాయని తెలిపింది. దీంతో రెండు రాత్రులు వర్షంలోనే ఉండాల్సి వచ్చిందని పూర్ణ చెప్పింది. ఆ సమయంలో రాత్రి చాలా చలిగా ఉండటంతో చాలా ఇబ్బంది పడ్డానని తెలిపింది. గర్భవతిగా ఉన్న తనకు చాలా చల్లగా ఉన్న నీళ్లు తీసుకోవడం మరింత సమస్యలు తెచ్చిపెట్టిందని చెప్పింది. గర్భవతి అయిన తనకు ఆ సన్నివేశాల్లో నటించడం చాలా కష్టమైందని పేర్కొంది. కానీ అంత కష్టపడ్డా సినిమాలో తను నటించిన కొన్ని సన్నివేశాలు తొలిగించారని పేర్కొంది. వర్షంలో తడిసిన సన్నివేశాలను చిత్రీకరించిన మేకర్స్ ఆపై తాను చాలా ఇబ్బంది పడటం గమనించి వేడినీళ్లు తెప్పించి పూర్ణపై పోస్తూనే ఉన్నారట. సినిమాలోని మరో సన్నివేశం కోసం రాత్రిపూట నిర్మానుష్యమైన రోడ్డులో పరుగెత్తాల్సి వచ్చిందని అప్పుడు వీధికుక్కల అరుపులు విని భయపడ్డానని, అదృష్టవశాత్తూ అవి తనను కరిచలేదని పూర్ణ చెప్పింది. ఆ సన్నివేశంలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా చిత్రీకరించబడిందని పేర్కొంది. కానీ ఆ సమయంలో పెద్దగా గాయాలు ఏం కాలేదని పేర్కొంది. సినిమా షూటింగ్ సమయంలో మేకర్స్ తనకు ఎంతగానో తొడ్పడ్డారని తెలిపింది. వారి సాయంతోనే గర్భవతిగా ఉన్న తాను సురక్షితంగా సినిమా పూర్తి చేశానని పూర్ణ తెలిపింది. -
ఆస్కార్ బరిలో మన 'బలగం'.. టాలీవుడ్ నుంచి ఆ రెండే!
ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా చాటిన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పురస్కారం లభించింది. మరోవైపు ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్‌కు సైతం ఈ అవార్డ్ దక్కింది. ఈ ఏడాది భారత్ నుంచి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో గుజరాతీ చిత్రం ఛెల్లో షో ను పంపిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు ఎలాంటి అవార్డు లభించలేదు. (ఇది చదవండి: ఓటీటీలో సూపర్‌హిట్ లవ్ స్టోరీ.. ఫ్రీగా చూసేయండి!) అయితే వచ్చే ఏడాది జరిగే ఆస్కార్ వేడుక కోసం అప్పుడే సందడి మొదలైంది. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఆస్కార్-2024 ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఏడాదికి ఈ విభాగంలో మన టాలీవుడ్ సినిమాలు బరిలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఆస్కార్ ఎంట్రీ కోసం దాదాపు 22 చిత్రాలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలను ఫిల్మ్ మేకర్ గిరీష్ కాసరవల్లి అధ్యక్షతన 17మంది సభ్యులతో కూడిన ఆస్కార్ కమిటీ చెన్నైలో వీక్షిస్తున్నారు. ఈ చిత్రాలు చూసిన తర్వాతే ఉత్తమ చిత్రం ఎంపిక చేయనున్నారు. ఆస్కార్ ఎంట్రీకి వచ్చిన సినిమాలివే!! దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 22 సినిమాలు అధికారిక ఎంట్రీకి వచ్చినట్లు తెలుస్తోంది. దసరా (తెలుగు), బలగం(తెలుగు), ది స్టోరీ టెల్లర్ (హిందీ), మ్యూజిక్ స్కూల్ (హిందీ), మిస్ ఛటర్జీ వర్సెస్ నార్వే (హిందీ), 12 ఫెయిల్ (హిందీ), ది కేరళ స్టోరీ, విడుదలై పార్ట్-1 (తమిళం), ఘూమర్ (హిందీ), వాల్వి (మరాఠీ), గదర్-2 (హిందీ), అబ్ థో సాబ్ భగవాన్ భరోస్ (హిందీ), బాప్ లాయక్ (మరాఠీ), రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ, జ్విగాటో చిత్రాలు ఉన్నట్లు సమాచారం. (ఇది చదవండి: రైతుబిడ్డకు 26 ఎకరాల పొలం, కోట్ల ఆస్తి? స్పందించిన ప్రశాంత్ తండ్రి) బలగం సినిమాకే ఛాన్స్!! ఈ సారి టాలీవుడ్ నాని సూపర్ హిట్ దసరా, చిన్న సినిమాగా వచ్చి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన బలగం పోటీ పడుతున్నాయి. ఈ సినిమాలన్నీ చూసిన తర్వాతే ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో ఆస్కార్‌కు పంపుతారు. కాగా.. ఇప్పటికే బలగం చిత్రానికి పలు అంతర్జాతీయ అవార్డులు సైతం వరించి సంగతి తెలిసిందే. దీంతో బలగం మూవీ ఆస్కార్ ఎంట్రీకి ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. -
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన ‘కీర్తి సురేష్’.. ఎన్ని కోట్లో తెలుసా?
పాత్రల కోసం మేకోవర్ అయ్యే నటిమణుల్లో కీర్తి సురేష్ ఒకరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కేరళా బ్యూటీ ఆరంభ దశలోనే తెలుగులో ‘మహానటి’ చిత్రంలో దివంగత మహా నటి సావిత్రి నిజజీవిత పాత్రతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. తన అద్భుతమైన అభినయానికి గానూ జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. ఆ తరువాత తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వరుసగా అవకాశాలు వెల్లువెత్తాయి. వాటిలో కొన్ని హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలు, స్టార్స్‌తో జత కట్టిన చిత్రాలు కూడా ఉన్నాయి. కాగా ఆ మధ్య సరైన సక్సెస్ లేక కీర్తీసురేష్ కొంత వెనుకబడ్డారు. దీంతో తెలుగులో అవకాశాలు కొరవడ్డాయి. అయితే తమిళంలో ఇప్పుడు చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అదే విధంగా ఫ్లాపులతో సతమతమవుతున్న కీర్తి సురేష్‌కు ఇటీవల నాని సరసన నటించిన దసరా మంచి విజయాన్ని సాధించి సరికొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఇక తమిళంలో సమీపకాలంలో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నటించిన మామనిదన్ చిత్రం సక్సెస్ అయ్యింది . హిట్స్ ఉత్సాహాన్నే కాదు పారితోషికాన్నీ పెంచుతాయి. కీర్తిసురేష్ ఇందుకు అతీతం కాదు. తన పారితోషికాన్ని ఇప్పుడు భారీగా పెంచేసిందని సమాచారం. ఇంతకు ముందు చిత్రానికి రూ.2 కోట్లు తీసుకుంటున్న ఈ భామ ఇప్పుడు రూ.3 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఈమె తమిళంలో తాజాగా కన్నివెడి అనే లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తున్నారు. ఇవి కాక తఘుతాత, సైరన్ తదితర చిత్రాలు ఈమె చేతిలో ఉన్నాయి. (చదవండి: ఎట్టకేలకు బాలీవుడ్లో అడుగుపెట్టనున్న కీర్తి సురేశ్!) -
దసరా కాంబినేషన్ రిపీట్.. విజయ్ దేవరకొండ కూడా..
-
స్లిమ్ కోసం కసరత్తులు.. హీరోయిన్‌పై దారుణంగా ట్రోల్స్!
ప్రతి మనిషికి జీవితంలో ఎత్తుపల్లాలు సహజమే. ఇక్కడ ఏదీ నిరంతరం కాదు జయాపజయాలు అంతే. అదేవిధంగా విజయాలకు పొంగిపోవడం, అపజయాలకు కుంగిపోవడం సహజమే. ఇక నటి కీర్తిసురేష్ విషయానికొస్తే చాలా తక్కువ సమయంలోనే తానేంటో నిరూపించుకున్నారు. అదేసమయంలో పలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సీనియర్ నటి మేనక నిర్మాత సురేష్ వారసురాలిగా సినీ రంగప్రవేశం చేసిన కీర్తిసురేష్ తమిళంలో ఇదు ఎన్న మాయం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. (ఇది చదవండి: చిట్టి ఓటీటీ ఎంట్రీ.. అలాంటి థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో) ఆ తర్వాత ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిరాశపరిచినా నటిగా కీర్తిసురేష్ మాత్రం మంచి మార్కులే తెచ్చుకున్నారు. ఆ తర్వాత రజిని మురుగన్ చిత్రాలతో విజయాలను అందుకున్న ఈమె తెలుగులో మహానటి చిత్రంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అదేవిధంగా ఆరంభ దశలోనే లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల నాయకిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి పీక్ సమయంలో మరింత స్లిమ్‌గా తయారవడానికి కసరత్తులు చేశారు. ఫలితంగా చాలా దారుణమైన విమర్శలకు గురయ్యారు. కీర్తిసురేష్ ముఖంలో గతంలో ఉన్న గ్లామర్ పోయిందని, ఇక ఈమె చాప్టర్ క్లోజ్ అని దారుణమైన కామెంట్స్‌ను ఎదుర్కొన్నారు. అయితే అలాంటి సమయంలోనూ అదేముఖంతో తమిళంలో సాని కాగితం అనే చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే తెలుగులో ఆ సమయంలో ఆమె నటించిన కొన్ని చిత్రాలు ఆశించిన రీతిలో ఆడలేదన్నది వాస్తవం. ఆ తర్వాత మళ్లీ సరికొత్త అందాలను సంతరించుకున్న కీర్తిసురేష్ ఇప్పుడు వరుసగా సక్సెస్‌లను అందుకుంటున్నారు. ఆ మధ్య తెలుగులో నాని సరసన నటించిన దసరా మంచి విజయాన్ని సాధించగా, తాజాగా తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో జత కట్టిన మామన్నన్ ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇక త్వరలో తెలుగులో చిరంజీవికి చెల్లెలిగా నటించిన బోళాశంకర్ ఆగస్టు 11వ తేదీ రావడానికి ముస్తాబవుతోంది. తమిళంలో జయంరవితో సైరన్, హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం రఘుతాత చిత్రాలు చేతిలో ఉన్నాయి. (ఇది చదవండి: నటికి ఘోర అవమానం.. ఏకంగా ఆ బాడీ పార్ట్స్‌పైనే కామెంట్స్!) -
దసరా సినిమా డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు: సింగర్, నటుడు
సింగర్ శ్రీను శ్రీకాకుళం 3,200కు పైగా పాటలు పాడాడు.. అవన్నీ జానపద గీతాలే! శ్రీకాకుళంలోని మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన ఆయన తనే సొంతంగా పాటలు రాసి పాడతాడు కూడా! అలా ఆయన రాసిన ఓ గీతాన్ని కాస్త అటూఇటుగా మార్చి అల వైకుంఠపురములో చిత్రంలో సిత్తరాల సిరపడుగా తీసుకొచ్చారు. సినిమాల్లోకి రావాలన్న ఆసక్తితో చిన్నతనంలోనే చెప్పాపెట్టకుండా ఇల్లు వదిలి వచ్చేశాడు శ్రీను. తాజాగా ఆయన తన జర్నీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు . '11 ఏళ్ల వయసులోనే ఇల్లు వదిలి వెళ్లిపోయాను. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక సిద్దిపేట బస్టాండ్‌లోనే మూడు రోజులు తిండి లేకుండా గడిపాను. అప్పుడు ఉద్యమం జరుగుతున్న సమయం.. రసమయి బాలకిషన్ పరిచయం కావడంతో ఆయనతో కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను. చాలా సీరియల్స్, సినిమాలకు కూడా పని చేశాను. భీమ్లా నాయక్, సరిలేరు నీకెవ్వడు సినిమాలకు బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్‌గానూ పని చేశాను. కానీ చాలామంది షూటింగ్ పూర్తయ్యాక డబ్బులివ్వకుండా మోసం చేసేవారు. ఈ విషయం చెప్పొచ్చో లేదో తెలియదు కానీ దసరా సినిమా డబ్బులు నాకింతవరకు ఇవ్వలేదు. 23 మంది ఆర్టిస్టులను గోదావరిఖని తీసుకెళ్లి వారం రోజులు అక్కడే ఉన్నాం. షూటింగ్ అయిపోక తిరిగొచ్చాం. కానీ చిత్రయూనిట్ పైసా ఇవ్వకపోవడంతో నేనే ఆర్టిస్టులకు సగం సగం డబ్బులిచ్చాను. దాదాపు రూ.70వేల దాకా ఖర్చయింది. నేను కూడా మొదట్లో జూనియర్ ఆర్టిస్టుగా, సెట్ బాయ్‌గా పని చేశాను. జూనియర్ ఆర్టిస్టులను చాలా చీప్‌గా చూస్తారు. చాలామంది క్యాస్టింగ్ డైరెక్టర్లు వారికిచ్చిన డబ్బులను ఆర్టిస్టులకు సమంగా పంచరు. ఐడీ కార్డు ఉన్న జూనియర్ ఆర్టిస్టులకు రూ.900, ఆ కార్డు లేని వాళ్లకు ఐదారు వందలు, ఒక్కోసారైతే మూడు వందలు కూడా ఇస్తారు. నేను మాత్రం అందరికీ రూ.900 ఇస్తాను' అని చెప్పుకొచ్చాడు సింగర్ శ్రీను. చదవండి: అవును, నేను తండ్రినయ్యా.. ఇకపై కుటుంబానికే సమయం కేటాయిస్తా: ప్రభు దేవా -
టిఫిన్ సెంటర్‌కు స్టార్ హీరోయిన్.. ఎవరూ గుర్తుపట్టలేదు!
మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ టాలీవుడ్లో దూసుకెళ్తోంది. ఇటీవలే నాని సినిమా దసరాతో ప్రేక్షకులను అలరించింది. సింగరేణి బ్యాప్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రంలో కీర్తి సురేశ్ నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం తమిళంలోనూ ఆమె నటించిన మామన్నన్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే ఆడియో రిలీజ్ ఫంక్షన్లోనూ ఆమె పాల్గొన్నారు. (ఇది చదవండి: తమన్నాకు రజినీకాంత్ గిఫ్ట్.. అదేంటో తెలుసా? ) కాగా.. కీర్తి సురేశ్ ప్రస్తుతం మెగాస్టార్ చిత్రం భోళాశంకర్‌లో నటిస్తోంది. తమిళంలో సూపర్‌హిట్ అందుకున్న ‘వేదాళం’కు రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లిలిగా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లోనే జరిగింది. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తుండగా.. చిరుకు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనుంది. ఈ సందర్బంగా హైదరాబాద్‌కు వచ్చిన కీర్తి సురేశ్ సిటీలో చక్కర్లు కొట్టింది. ఎవరూ గుర్తు పట్టకుండా తన ఫ్రెండ్స్‌తో కలిసి గచ్చిబౌలిలోని వరలక్ష్మి టిఫిన్ సెంటర్‌కు వచ్చిన కీర్తి సురేశ్ టిఫిన్ చేశారు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్‌తో కలిసి ఇష్టమైన తందూరీ టీ తాగారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు. బయట ఎవరూ గుర్తు పట్టకుండా మాస్క్ ధరించిన కీర్తి సురేశ్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. (ఇది చదవండి: రామాలయానికి 100 టిక్కెట్లు ఉచితం) -
కీర్తి సురేష్ పెళ్లి పై ఆమే తండ్రి సీరియస్
-
ఈ సినిమాలో అదొక్కటే అద్భుతమైన షాట్: పరుచూరి
నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేశ్ జంటగా నటించిన ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దసరా. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్ల వర్షం కురిపించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా ఈ సినిమా విజయం పట్ల ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నాని నటన అత్యద్భుతంగా ఉందని ప్రశంసించారు. (ఇది చదవండి: లక్షన్నరలో హీరోయిన్ వివాహం.. పెళ్లి చీర రూ.3 వేలు మాత్రమేనట!) పరుచూరి మాట్లాడుతూ.. ' ఈ సినిమా పూర్తిగా నాని- కీర్తి సురేశ్దే. ప్రారంభం నుంచి చివరి వరకూ తన నటనతో ఆశ్చర్యానికి గురిచేశాడు నాని. సాధారణంగా క్యూట్ లుక్‌లో ఉండే నాని ఈ చిత్రంలో ఊర మాస్ లుక్‌లో కనిపించాడు. అందుకే ఈ సినిమా విషయంలో ముందు నానినే మెచ్చుకోవాలి. అలాగే హీరో మిత్రుడిగా దీక్షిత్ శెట్టి అదరగొట్టాడు. ఈ చిత్రంలో అంతర్లీనంగా రామాయణం - మహాభారతం కథలు కనిపించాయి. విలన్ ఒక రావణాసురుడి లాంటి వాడు. అందుకే అతడిని చంపేటప్పుడు రావణకాష్ఠం చూపించారు. సాయికుమార్ పాత్ర చిన్నదే అయినప్పటికీ క్లైమాక్స్‌లో డైలాగ్ విని.. ఇతడే విలనా? అన్న సందేహం కూడా ప్రేక్షకులకు వస్తుంది. అలాంటి ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ను దర్శకుడు శ్రీకాంత్ క్రియేట్ చేశాడు. ఇందులో మరో విచిత్రం ఏమిటంటే.. క్లైమాక్స్‌లో హీరోని అంతం చేయడానికి ఎంతోమంది రౌడీలు వస్తారు. ఆ సమయంలో గ్రామస్థులెవరూ హీరోకు సపోర్ట్ చేయరు. సమాజంలో ఒక వ్యక్తికి భయపడి పేద ప్రజలు ఎలా బతుకుతారో? చెప్పడానికి ఈ సినిమానే ఓ నిదర్శనం. నాకు తెలిసినంతవరకూ ఏదో ఒక గ్రామాన్ని చూసి స్ఫూర్తి పొందే వాళ్లు ఇలాంటి సీన్స్ తీశారు. ఆ గ్రామంలో పెత్తందారు చెప్పిందే అక్కడి ప్రజలు వినాలి అనే రూల్స్ ఉంటాయి. (ఇది చదవండి: ప్యాలెస్‌లో శర్వానంద్ పెళ్లి.. ఒక్క రోజుకు ఎన్ని కోట్ల ఖర్చంటే?) పరుచూరి మాట్లాడుతూ.. 'చిన్నప్పుడు ధరణిపై ఇష్టంగా ఉన్న అమ్మాయి.. ఆ తర్వాత వేరొకరితో పెళ్లి జరుగుతుంది. సూరి (దీక్షిత్ శెట్టి) చనిపోయిన తర్వాత వెన్నెల (కీర్తిసురేశ్)ను వితంతువును చేస్తుంటే.. ధరణి (నాని) అక్కడికి వెళ్లి అదే తాళిని ఆమె మెడలో కడతాడు. అదే ఈ సినిమాలో అద్భుతమైన షాట్. అప్పటి దర్శకులు చేయలేని ధైర్యం ఇప్పుడున్న వాళ్లు చేశారనడానికి నిదర్శనం. విలన్ చనిపోయాక కూడా సినిమా నడుస్తుంది. ధరణి ప్రేమను వెన్నెల ఒప్పుకుందా? అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు దర్శకుడు. చివర్లో ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చి ప్రేక్షకుల ఉత్కంఠకు తెరదించాడు. నాని జీవితంలో ఇది మరిచిపోలేని చిత్రంగా నిలిచింది. అసలు అక్కడ ఉన్నది నానినేనా అనే సందేహం కలుగుతుంది.' అంటూ ప్రశంసించారు. -
ముఖంపై గాయాలతో కీర్తి సురేష్.. వైరలవుతోన్న ఫోటోలు
-
అసలు కీర్తీ సురేశ్‌కు ఏమైంది.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!
మహానటి కీర్తి సురేశ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. సావిత్రి బయోపిక్ మహానటి మూవీతో ఆ పేరే బ్రాండ్‌గా మారిపోయింది. ఇటీవల నేచురల్ స్టార్ నానితో జంటగా నటించిన దసరా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ మూవీ భోళాశంకర్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. (ఇది చదవండి: ఆయన టైం వేస్ట్ చేశారు.. డైరెక్టర్‌పై నాగచైతన్య కామెంట్స్ వైరల్) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న కీర్తి తాజాగా చేసిన పోస్ట్ వైరలవుతోంది. మొహామంతా గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఇంతకీ కీర్తీ సురేశ్‌కు ఏమైందోనని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అసలేం జరిగిందో ఓ లుక్కేద్దాం. అయితే గతేడాది కీర్తీ సురేశ్, సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'సాని కాయిదం'. అరుణ్ మాతీశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 6, 2022న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. తాజాగా ఈ మూవీ రిలీజై ఏడాది పూర్తయిన సందర్భంగా కీర్తి సురేశ్ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. షూటింగ్లో పడిన కష్టాలను వివరిస్తూ ఓ నోట్ రాసుకొచ్చింది. అయితే కీర్తి సురేశ్ డేడికేషన్ చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం మహానటికే ఇలా చేయడం సాధ్యమవుతుందంటూ పోస్టులు పెడుతున్నారు. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్.. అయినా ఒక్క సినిమా సక్సెస్ కాలేదు.. మళ్లీ అదే కథ!) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
ఓటీటీలోకి వచ్చేసిన దసరా... స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ధరణిగా నాని, వెన్నెలగా కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం దసరా. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. తెలంగాణ యాసలో కొనసాగే ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించారు. మార్చి 30న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపింది. నాని కెరీర్లోనే అత్యధికంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. థియేటర్స్‌లో దుమ్మురేపిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే దసరా స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే కదా! ఏప్రిల్ 27 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. అన్నట్లుగానే బుధవారం అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే హిందీలోకి కూడా వస్తే బాగుండని కామెంట్లు చేస్తున్నారు పలువురు నెటిజన్లు. #Dasara on #Netflix 🔥 TUDUM @netflix pic.twitter.com/SyFE1yP92E — Nani (@NameisNani) April 26, 2023 Dharani has arrived!🔥🔥🔥#Dasara is now streaming in Telugu, Tamil, Malayalam and Kannada on Netflix!#DasaraOnNetflix — Netflix India South (@Netflix_INSouth) April 26, 2023 చదవండి: కమల్ హాసన్ నాస్తికుడు, కూతురు శ్రుతిహాసన్‌కు దైవభక్తి ఎక్కువ, అందుకే పచ్చబొట్టు -
ఏప్రిల్ చివరి వారంలో రిలీజవుతున్న సినిమాలు, సిరీస్‌లేంటి?
ఓపక్క ఎండలు మండిపోతున్నాయి. మరోపక్క బాక్సాఫీస్ వద్ద సినిమాలు దంచికొడుతున్నాయి. దసరా, విరూపాక్ష సినిమాల ఫలితాలే ఇందుకు నిదర్శనం. మున్ముందు పట్టపగలే చుక్కలు చూపించేందుకు భానుడు సిద్ధమయ్యాడు. అయితే సినిమా వాళ్లు మాత్రం మా వినోదాత్మక కంటెంట్‌తో ప్రేక్షకులను ఇళ్ల నుంచి థియేటర్‌కు రప్పిస్తామని ధీమాగా చెప్తున్నారు. మరి ఈ వేసవి సెలవుల్లో రిలీజ్ కానున్న కొత్త సినిమాలు ఏంటి? అవి ఏయే రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఓటీటీలో వస్తున్న కొత్త కంటెంట్ ఏంటి? అసలు ఈ వారం థిటయేర్, ఓటీటీలో వస్తున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లేంటో చూసేద్దాం.. ► ఏజెంట్ - ఏప్రిల్ 28 ► పొన్నియన్ సెల్వన్ 2 - ఏప్రిల్ 28 ► రారా పెనిమిటి - ఏప్రిల్ 28 ► శిసు- ఏప్రిల్ 28 ఓటీటీలో సందడి చేసే సినిమాలు/ వెబ్ సిరీస్‌లు.. నెట్‌ఫ్లిక్స్ ► దసరా - ఏప్రిల్ 27 ► కోర్ట్ లేడీ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 26 ► నోవోల్యాండ్ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 27 ► ది గుడ్ బ్యాడ్ మదర్ (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 27 ► ఎకా - ఏప్రిల్ 28 ► బిఫోర్ లైఫ్ ఆఫ్టర్ డెత్ - ఏప్రిల్ 28 అమెజాన్ ప్రైమ్ ► పత్తు తల - ఏప్రిల్ 27 ► సిటాడెల్ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 28 జీ5 ► వ్యవస్థ - ఏప్రిల్ 28 ► యూటర్న్ - ఏప్రిల్ 28 హాట్‌స్టార్ ► సేవ్ ది టైగర్స్ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 27 ► పీటర్ పాన్ అండ్ వెండీ - ఏప్రిల్ 28 బుక్ మై షో ► స్క్రీమ్ 6 - ఏప్రిల్ 26 సోనీలివ్ ► తురముఖమ్ - ఏప్రిల్ 28 -
కాసుల వర్షం కురిపిస్తున్న ‘కాకి’!
సాధారణంగా కొన్ని సినిమాల్లో జంతువులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు దర్శకులు. ముఖ్యంగా పెంపుడు కుక్క, గుర్రం, ఏనుగు లాంటి జంతువులను బేస్ చేసుకొని సినిమాలను తెరకెక్కించారు. వాటిలో చాలా వరకు విజయం సాధించాయి. అంతేకాదు హీరో కంటే ఆ జంతువులకు సంబంధించిన సన్నివేశాలే ప్రేక్షకులను అలరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో మన దర్శకుల కన్ను కాకులపై పడింది. కాకులను బేస్ చేసుకొని సన్నివేశాలను రాసుకుంటున్నారు. అవి ప్రేక్షలను బాగా ఆకట్టుకుంటున్నాయి. కాకి కాన్సెప్ట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన చిత్రాలపై ఓ లుక్కేద్దాం. కాకి కాన్సెప్ట్ అనగానే ఇప్పుడు అందరికి గుర్తొచ్చె సినిమా ‘బలగం’. ఓ మనిషి తదానానంతరం కాకి పిండం ముట్టడం అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు వేణు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మనిషి చనిపోయిన తర్వాత కాకి పిండంను తినకపోవడం గురించి చూపించారు. కథంతా కాకి చుట్టే తిరుగుతుంది. మార్చి 3న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఇక రీసెంట్గా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘విరూపాక్ష’చిత్రంలోనూ కాకికి ఇంపార్టెంట్ రోల్ లభించింది. క్షుద్రపూజల నేపథ్యంలో మిస్టరీ,థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. ఏప్రిల్ 21న విడుదలై పాజిటివ్ టాక్ని సంపాదించుకుంది. ప్రేక్షకులను భయపెట్టడానికి కాకిని చాలా సన్నివేశాల్లో వాడారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో కాకులన్నీ గుంపుగా వచ్చి అగ్నికి ఆహుతి అవ్వడం అనేది సినిమాకి హైలెట్‌గా నిలిచింది. అలాగే ఇటీవల విడుదలైన నాని తొలి పాన్ ఇండియా చిత్రం ‘దసరా’లోనూ కాకిని వాడేశారు. ఈ సినిమాలో కూడా కాకి పిండాన్ని తినకపోవడాన్ని చూపించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో టాలీవుడ్‌కి కాకి సెంటిమెంట్‌గా మారిపోయింది. మరి ఈ కాకుల కాన్సెప్ట్‌తో ఇంకెన్ని చిత్రాలు వస్తాయో చూడాలి. (చదవండి: పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లు వీరే) -
నానీ కొంపముంచిన దసరా...?
-
‘దసరా’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?
నేచురల్ స్టార్ నాని, ‘మహానటి’ కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దసరా’. మార్చి 30న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ధరణిగా నాని, వె న్నెలగా కీర్తి సురేశ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలంగాణలో యాసలో ఈ ఇద్దరు స్టార్స్ చేప్పే డైలాగ్స్, ఊరమాస్ యాక్టింగ్‌తో పాటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పనితీరుపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఫలితంగా ‘దసరా’ నాని కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిపోయింది. (చదవండి: 36 ఏళ్ల వయసులో మళ్లీ మాటలు నేర్పించారు..అమ్మ తర్వాతే ఎవరైనా: సాయి తేజ్) ఇన్నాళ్లు థియేటర్స్‌లో దుమ్ములేపిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో రికార్డులు బద్దలు కొట్టడానికి రెడీ అయింది. దసరా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఓటీటీ సంస్థ ‘దసరా’ విడుదల తేదిని ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ట్వీటర్ వేదికగా తెలియజేసింది. థియేటర్స్‌లో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు మరో వారం రోజుల్లో ఓటీటీలో చూడొచ్చు. It’s time to take out the fireworks because #Dasara is coming early this year! 🚀💥 Dasara is coming to Netflix in Telugu, Tamil, Malayalam and Kannada on the 27th of April! #DasaraOnNetflix pic.twitter.com/fuchUwufRu — Netflix India South (@Netflix_INSouth) April 20, 2023 -
దసరా మూవీ స్టిల్స్ ఫోటో గ్యాలరీ
దసరా మూవీ స్టిల్స్ ఫోటో గ్యాలరీ -
దసరా మూవీపై అల్లు అర్జున్ రివ్యూ.. నానిపై ప్రశంసల వర్షం
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం 'దసరా'. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. సింగరేణి గనుల నేపథ్యంలో ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. ఈ చిత్రంలో నాని, కీర్తి సురేశ్ నటనకు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. టాలీవుడ్ ప్రముఖులు సైతం దసరా మూవీపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ లిస్ట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. దసరా టీం అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ..' దసరా టీమ్ మొత్తానికి నా అభినందనలు. చాలా అద్భుతంగా సినిమా తీశారు. నా సోదరుడు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. కీర్తి సురేశ్ నటనకు ఫిదా అయిపోయా. దసరా చిత్రబృందం అందరూ చాలా బాగా చేశారు. సంతోశ్ అద్భుతమైన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. సత్యన్ కెమెరా పనితనం సూపర్బ్. శ్రీకాంత్ ఓదెల ఆరంగ్రేటం అదిరిపోయింది. నిర్మాతలు, అలాగే సినిమాలో ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. వేసవిలో నిజమైన అసలైన ఎంటర్టైనర్ దసరా.' అంటూ ట్వీట్ చేశారు. కాగా.. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 మూవీతో బిజీగా ఉన్నారు. ఇటీవలే బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు మేకర్స్ పుష్ప-2 గ్లింప్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్‌లో రికార్డ్‌స్థాయిలో దూసుకెళ్తోంది. రెండేళ్ల క్రితం విడుదలైన సంచలన విజయం సాధించిన ‘పుష్ప’సినిమాకు సీక్వెల్‌గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. Big Congratulations to the entire team of #Dasara . Brilliantly made film . Finest performance my brother @NameisNani . Candid performances by @KeerthyOfficial and all the other cast . Wonderful songs & B.Score by @Music_Santhosh garu & excellent camera work by Sathyan garu . The… — Allu Arjun (@alluarjun) April 17, 2023 -
'దసరా' డిలీటెడ్ సీన్.. కీర్తి సురేశ్ దడ పుట్టించేసిందిగా!
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ జంటగా రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ దసరా. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ మూవీలో కీర్తి, నాని నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సినీ ప్రముఖులు సైతం వీరిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఈ సినిమాలో తెలంగాణ అమ్మాయిగా కీర్తి సురేశ్ పాత్రలో జీవించింది. అచ్చ తెలంగాణ యాసలో తన మాటలతో అభిమానులను కట్టిపడేసింది. ఈ చిత్రంలో తనకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం మరో విశేషం. అయితే తాజాగా కీర్తి సురేశ్ తన ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియో తనపాత్రకు తానే డబ్బింగ్ చెబుతూ కనిపించింది. ఈ సీన్ సినిమా నుంచి తొలగించినట్లు కీర్తి వెల్లడించింది. కీర్తి తన ఇన్‌స్టాలో రాస్తూ..' దసరా మూవీలో తొలగించిన సీన్ ఇది. ఆ సీన్‌కు నేనే డబ్బింగ్ చెప్పా. డబ్బింగ్ చెబుతున్నప్పుడు నన్ను చూసి అంతా టెన్షన్ పడ్డారు. డబ్బింగ్ ఒక అద్భుతమైన కళ.' అంటూ పోస్ట్ చేసింది. ఆ వీడియోలో కీర్తి సురేశ్ తెలుగు డబ్బింగ్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అచ్చ తెలుగులో.. అది తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పిన మహానటి అభిమానుల హృదయాలను గెలుచుకుంది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
ఓటీటీలో నాని 'దసరా' మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడో తెలుసా?
నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా దసరా. ఈ సినిమాతోనే శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు. గోదావరి ఖని బొగ్గు గనుల నేపథ్యంలో మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిన సినిమాలో నాని మునుపెన్నడూ కనిపించనంత మాస్ క్యారెక్టర్ లో కనిపించి ఆకట్టుకున్నారు. మొన్నటి వరకు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాని ఈ సినిమాతో మాస్ ఇమేజ్ను సొంతం సంపాదించుకున్నాడు. మార్చి 30న శ్రీరామ నవమి సందర్భంగా విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్‌తో పాటు అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. సుమారు వంద కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టి నిర్మాతలకు భారీ లాభాల్ని మిగిల్చింది. థియేటర్లలో కాసుల వర్షాన్ని కురిపించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యింది. అందుతున్న సమాచారం ప్రకారం.. మే30 నుంచి దసరా సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దాదాపు 22 కోట్లకు దసరా డిజిటల్ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే హిందీ వెర్షన్ హక్కులను మాత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ దక్కించుకుందట. -
నాని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన హీరో!
నేచురల్ స్టార్ నాని తాజాగా నటించిన చిత్రం 'దసరా'. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలైన కొద్ది రోజులకే భారీ వసూళ్లతో దూసుకెళ్లింది. ఈ చిత్రంలో నాని నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ చిత్రంలో మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు నాని. అదేంటో ఓ లుక్కేద్దాం. తాను నటించబోయే తదుపరి చిత్రానికి సంబంధించి నాని ఆసక్తికర ట్వీట్ చేశారు. 'ఈ ఏడాదిని సెలబ్రేషన్స్‌తో ముగిద్దాం' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. నాని కెరీర్లో 30వ చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాను శౌర్యువ్ డైరెక్షన్లో వైరా ఎంటర్టైన్మెంట్స్పై తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21, 2023న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. దసరా మూవీ హిట్ తర్వాత నాని నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో నాని సరసన సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించనున్నట్లు తెలుస్తోంది. 2023 had to end with a celebration 💙 DECEMBER 21st :)#Nani30 pic.twitter.com/pFQTbAXF6e — Nani (@NameisNani) April 15, 2023 -
‘దసరా’పై చిరంజీవి రివ్యూ
నేచురల్ స్టార్ నాని, ‘మహానటి’ కీర్తి సురేశ్ నటించిన తాజా చిత్రం ‘దసరా’. గత నెలలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ధరణిగా నాని, వెన్నెలగా కీర్తి సురేశ్ అదరగొట్టేశాడు. తెలంగాణ యాసలో వీళ్లిద్దరు చెప్పే డైలాగ్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక విమర్శకులు సైతం ‘దసరా’పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మేకింగ్‌పై అందరూ ( ఫైల్ ఫోటో ) తాజగా మెగాస్టార్ చిరంజీవి ‘దసరా’టీమ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. నాని, కీర్తి సురేశ్‌ల నటనతో పాటు శ్రీకాంత్ ఓదెల మేకింగ్ చాలా బాగుందని కితాబిచ్చాడు. ‘డియర్ నాని.. ‘దసరా’ సినిమా చూశాను. చాగా గొప్ప సినిమా ఇది. నీ నటన చాలా అద్భుతంగా ఉంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పనితీరు చాలా బాగుంది. అసలు ఇది శ్రీకాంత్ ఓదెలకు తొలి సినిమా అని తెలిసి ఆశ్చర్యపోయాను. చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. మా మహానటి కీర్తి సురేశ్ యాక్టింగ్ అదిరిపోయింది. దీక్షిత్ శెట్టి కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అదిరిపోయింది. మొత్తంగా టీమంతా కలిసి గొప్ప చిత్రాన్ని ఇచ్చారు’అని చిరంజీవి మెచ్చుకున్నారు. Kudos to the entire team of ‘DASARA’🥰@NameisNani @odela_srikanth @KeerthyOfficial @Dheekshiths@Music_Santosh pic.twitter.com/CciJqkcwrv — Chiranjeevi Konidela (@KChiruTweets) April 13, 2023 -
‘దసరా’ ఎఫెక్ట్.. రెమ్యునరేషన్ పెంచేసిన నాని, ఎంతంటే..
‘దసరా’సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు నాని. పాన్ ఇండియా స్థాయిలో మార్చి 30 విడుదలైన ఈ చిత్రం.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లని సాధించి, నాని కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ‘దసరా’విజయంతో నాని కాన్పిడెన్స్ మరింత పెరిగింది. వైవిధ్యమైన సినిమాలు తీస్తే జనం తప్పకుండా ఆదరిస్తారని అర్థమైంది. అందుకే ఇకపై వైవిధ్యమైన కథలనే ఎంచుకోవాలని నాని డిసైడ్ అయ్యారట. అంతేకాదు దసరా సక్సెస్‌తో తన పారితోషికాన్ని కూడా పెంచేశారట. వాస్తవానికి దసరా చిత్రానికి ముందే నాని తన రెమ్యునరేషన్‌ని పెంచేశాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 20 నుంచి 22 కోట్ల వరకు తీసుకుంటున్నారు. ఇక ‘దసరా’ తో నాని మార్కెట్ వ్యాల్యూ పెరిగిపోయింది. దీంతో తన పారితోషికాన్ని కాస్త పెంచేశాడట. ఇకపై కమిట్ అయ్యే చిత్రాలకు రూ. 25 కోట్ల వరకు పారితోషికంగా తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. దసరా’ రిలీజ్‌కు ముందే కొత్త నిర్మాత మోహన్ చెరుకూరితో తన 30వ చిత్రాన్ని నాని ప్రకటించాడు. నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించబోతున్న మరో చిత్రంలో నటించడానికి కూడా నాని ఓకే చెప్పేశాడు. దీనికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించనున్నాడు. ఈ రెండు చిత్రాలు కాకుండా..ఇకపై కమిట్ అయ్యే సినిమాలకు నాని ఆ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడు. నాని సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. అందుకునే నిర్మాతలు కూడా నాని రెమ్యునరేషన్ కు ఓకే చెప్తున్నారని టాక్ వినిపిస్తోంది. -
చిన్న మిస్టేక్ వచ్చినా ఒప్పుకోని కీర్తి.. బరాత్ డ్యాన్స్ కోసం 25 టేక్స్!
పెళ్లంటే హల్దీ, మెహందీ, సంగీత్.. ఇలా నానా హంగామా ఉంటుంది. అయితే ఈ కార్యక్రమాలన్నీ ఉన్నా లేకపోయినా పెళ్లి వేడుకలో కచ్చితంగా ఉండేది బరాత్. ఇక్కడ క్లాస్ పాటలకు పర్ఫామ్ చేయడం కాదు మాస్ మ్యూజిక్కు స్టెప్పులేయడమే ఉంటుంది. అప్పటిదాకా ఎమోషన్లో ఉన్న వధూవరుల బంధువులు, కుటుంబసభ్యులు కూడా బరాత్ ప్రారంభమవగానే ఒక్కసారిగా అలర్ట్ అవుతారు. పెళ్లికొడుక్కి డ్యాన్స్ వచ్చినా రాకపోయినా ఎలాగోలా గుంపులోకి లాక్కొచ్చి నాలుగు స్టెప్పులేయిస్తారు. కానీ ఈ మధ్య పెళ్లికూతుళ్లను ఎవరూ పిలవకపోయినా సరే వాళ్లే డైరెక్ట్‌గా బరాత్‌లో ఎంటరై తీన్మార్ డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇలాంటి తీన్మార్ డ్యాన్స్ దసరా సినిమాలో కీర్తి సురేశ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసి వారం రోజులవుతున్నా ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా కీర్తి పాప మాస్ డ్యాన్స్ వెనక ఉన్న కష్టాన్ని వెల్లడించాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఈ డ్యాన్స్ బిట్ కోసం కీర్తి 25 టేకులు తీసుకుందని చెప్పాడు. చిన్న మిస్టేక్ వచ్చినా మళ్లీ మొదటి నుంచి చేస్తానని అదే ఎనర్జీతో డ్యాన్స్ చేసేదని పేర్కొన్నాడు. అన్నిసార్లు ఒకే బిట్‌ను, అదే జోష్‌తో చేసిందంటూ కీర్తి డెడికేషన్ ఏ లెవల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక దసరా విషయానికి వస్తే ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు శ్రీకాంత్ ఓదెల. ధరణిగా నాని, వెన్నెలగా కీర్తి సురేశ్ నటించిన ఈ మూవీ మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ ఆడియన్స్‌ను మెప్పించిన ఈ మూవీ వారం రోజుల్లోనే వంద కోట్లు రాబట్టింది. ఈ సంతోషంతో నిర్మాత చెరుకూరి సుధాకర్.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు బీఎమ్‌డబ్ల్యూ కారు బహుమతిగా ఇచ్చాడు. -
దసరా డిలీటెడ్ సీన్: గిదే నీ ఇల్లు... లోపలికి పోవే.. నీ బాంచెనే..
తెలంగాణ యాసకు పట్టం కడుపుతోంది తెలుగు ఇండస్ట్రీ. ఒకప్పుడు విలన్లు, కమెడియన్ల నోటి నుంచి మాత్రమే తెలంగాణ యాసభాష వినిపించేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోలు కూడా ఎట్లైతే గట్లాయే చూస్కుందాం.. అని తెలంగాణ యాసలోనే మాట్లాడుతున్నారు. అలా నాని కూడా దసరాతో చేసిన ప్రయోగం సక్సెసైంది. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తొలి చిత్రంతోనే మంచి మార్కులు పట్టేశాడు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ డ్యాన్స్ అయితే ఇప్పటికీ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి డిలీట్ చేసిన ఓ సన్నివేశాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు. నిన్నే.. అంత కానిదాన్నైపోయినా.. ఆడెవడో వచ్చి తాళి కడతాంటే ఆపేది పోయి ఇంక మీదకెళ్లి తీస్కపో అని చెప్పి నన్ను వదిలించుకున్నవ్, నువ్వసలు తల్లివేనా? అంటూ కీర్తి సురేశ్ డైలాగ్‌తో వీడియో మొదలైంది. అందరూ కూడా నా బతుకును ఎట్ల చేశిర్రో చూశినవా అని అత్త ముందు ఆవేదన వ్యక్తం చేసింది వెన్నెల. వెంటనే ఆమె అత్త వెన్నెలను తన అత్తారింటి ముందుకు తీసుకెళ్లి.. 'గిదే నీ ఇల్లు. ఈడ్నే నీ బతుకు.. నా మాట విని లోపలికి పోవే.. నీ బాంచెనే' అంటూ వెన్నెలను బతిమాలుకుని వెళ్లిపోతుంది. మోడువారిన చెట్టులా అక్కడే నిలబడిపోతుంది వెన్నెల. మరోవైపు ఈ సంభాషణంతా అక్కడే గోడ వెనుక ఉన్న ధరణి(నాని) వింటాడు. ఈ వీడియో చూసిన జనాలు ఇది సినిమాలో ఉంటే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు. -
దసరా మూవీ టీమ్ కి తెలంగాణ దావత్
-
దసరా మూవీ మేకింగ్ వీడియో
-
'దసరా' మూవీ షూటింగ్ ఎలా జరిగిందో తెలుసా? వీడియో రిలీజ్
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'దసరా' మాస్ మేనియా కనిపిస్తుంది. నేచురల్ స్టార్ నాని, కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపుతుంది. విడుదలైన తొలిరోజు నుంచే హిట్ టాక్‌ను తెచ్చుకొని బాక్సాఫీస్ సునామీ సృష్టిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే దసరా 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి అదరగొడుతుంది. నాని కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా వీకెండ్ కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లోనూ దసరా పాటలు, డైలాగ్స్ మోత మోగుతోంది. సినిమా సూపర్ హిట్ కావడంతో రీసెంట్గా కరీంనగర్లో సక్సెస్ మీట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది చిత్ర బృందం. ఇదిలా ఉంటే దసరా మేకింగ్ వీడియోను తాజాగా విడుదల చేశారు. పవ్వ తాగడం, సిల్క్ బార్ దగ్గర్నుంచి క్లైమాక్స్ షాట్స్ వరకు మేకింగ్ వీడియోను వదిలారు. మీరూ చూసేయండి మరి. -
నాని 'దసరా' మాస్ జాతర... డైరెక్టర్‌కి జాక్‌పాట్
-
రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘దసరా’.. టీమ్ మెంబర్స్‌కు గోల్డ్ కాయిన్స్!
నేనురల్ స్టార్ నాని హీరోగా నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన చిత్రం ‘దసరా’. శ్రీరామనవమి సంద్భంగా మార్చి 30న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. రా అండ్ రస్టిక్ స్టోరీతో తెరకెక్కించన ఈ చిత్రంలో నాని ఊరమాస్ లుక్‌లో అదరగొట్టేశాడు. ఫలితంగా తొలి రోజే రూ.38 కోట్ల గ్రాస్ వసూలు చేసి నాని కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిసింది. రెండు రోజుల్లోన్లే రూ. 50 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం.. ఈజీగా వంద కోట్ల క్లబ్‌లోకి చేరుతుందని అంతా భావించారు. అనుకున్నట్లే దసరా సినిమా కేవలం వారం రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అదరగొట్టింది. మార్చి 30న ఈ సినిమా రిలీజ్ అవ్వగా ఏప్రిల్ 5 నాటికి దసరా సినిమా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. నాని కెరీర్లో రూ. 100 కోట్ల వసూళ్లను సాధించిన చిత్రంగా ‘దసరా’ నిలిచింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నానికి జోడిగా కీర్తి సురేశ్ నటించింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. శ్రీకాంత్‌కు కి బీఎండబ్ల్యూ కారు ఇక దసరా విజయం చూసి నిర్మాత చెరుకూరి సుధాకర్ మురిసిపోతున్నాడు. వారం రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్బులోకి చేరడంతో.. తెగ ఆనందపడిపోతున్న నిర్మాత.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు.అలాగే ఈ మూవీ కోసం పనిచేసిన కీ మెంబర్స్ అందరికీ తలో 10 గ్రాముల గోల్డ్ కాయిన్స్ కూడా బహుమతిగా అందజేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Our effort. Your gift 🙏🏼 Cinema wins ♥️#Dasara pic.twitter.com/Rn0VR6nFkL — Nani (@NameisNani) April 5, 2023 -
'దసరా' డైరెక్టర్‌కు 'బీఎండబ్లూ' కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత
టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సినిమా దసరా. నాని, కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది.పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ సత్తాచాటుతుంది. ఇక దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే శ్రీకాంత్ ఓదెల సూపర్ సక్సెస్ అయ్యారు. గతంలో రంగస్థలం సినిమాకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన దసరా సినిమాతోనే డైరెక్టర్‌గా డెబ్యూ ఇచ్చారు. ఇక నిర్మాత చెరుకూరి సుధాకర్ గతంలో పడి పడి లేచే మనసు, ఆడవాళ్లు మీకు జోహార్లు, రామారావు ఆన్ డ్యూటీ’ వంటి సినిమాలు చేసినా కమర్షియల్‌గా అంత సక్సెస్ కాలేదు. ఇప్పుడు దసరాతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందడంతో సంతోషంలో మునిగిపోయిన ఆయన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు ఖరీదైన ‘బీఎమ్‌డబ్లూ’ కార్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. కరీంనగర్లో జరిగిన దసరా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఆయన అందరి ముందే డైరెక్టర్‌కు కారును ప్రజెంట్ చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నాని ఎక్కడ పుట్టినా.. ఇప్పుడు తెలంగాణ బిడ్డే: మంత్రి గంగుల
నాచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రం విజయోత్సవ సభ బుధవారం సాయంత్రం కరీంనగర్ ఎస్సారార్ కళాశాల గ్రౌండ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి గంగుల కమలాకర్ హాజరై మాట్లాడారు. మానేరు నీళ్లు తాగిన మా సిరిసిల్ల బిడ్డ వేణు బలగంతో, పెద్దపెల్లి బిడ్డ శ్రీకాంత్ ఓదెల దసరాతో కరీంనగర్ సత్తా చాటారన్నారు. తెలంగాణ సాధించడం వల్లే మట్టిలోని మాణిక్యాలు బయటకొస్తున్నాయని పేర్కొన్నారు. కాసర్ల శ్యామ్ గొప్ప పాటలు రాస్తూ తెలంగాణ సంస్కృతిని వెలుగులోకి తెస్తున్నారని.. నాని ఎక్కడ పుట్టినా దసరా సినిమా తర్వాత తెలంగాణ బిడ్డయ్యాడని అన్నారు. నాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. కరీంనగర్ ఎనర్జీ అద్భుతంగా ఉందని, ఈవెంట్ సక్సెస్‌కు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్లో అద్భుతమైన అభివృద్ధితోపాటు ప్రకృతి రమణీయత ఆకట్టుకుందని.. త్వరలోనే ఇక్కడ షూటింగ్ కోసం ప్లాన్ చేస్తానన్నారు. దసరా డైలాగ్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. సక్సెస్ మీట్లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, మేయర్ వై.సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణిహరిశంకర్, ఎడిటర్ నవీన్, ప్రముఖ నటుడు దీక్షిత్, దాసర్ల శ్యామ్ పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కరీంనగర్ : ‘దసరా’ చిత్రం విజయోత్సవ సభ (ఫొటోలు)
-
మెగా ట్విస్ట్ బాలయ్య తప్పుకుంటాడా..
-
Telugu Indian Idol 2: ఇండియన్ ఐడల్ 2 షోలో నాని సందడి
దసరా సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో దుమ్మురేపుతున్నారు నాని. అదే జోష్‌తో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 2 వేదిక మీద చార్మింగ్‌గా కనిపించనున్నారు. ఏప్రిల్ 7, 8వ తేదీల్లో ప్రసారమయ్యే ఆహా తెలుగు ఇండియన్ ఐడల్2 ఎపిసోడ్స్‌లో నాని సందడి చేయనున్నాడు. అంతే కాదు, ఈ వేదిక మీద సింగర్ కార్తికేయ నాని మనసు గెలిచారు. హైదరాబాద్‌కు చెందిన కార్తికేయ గళం విన్న నాని మెస్మరైజ్ అయ్యారు. తన తదుపరి చిత్రాల్లో కార్తికేయకు గాయకుడిగా అవకాశం ఇస్తానని మాటిచ్చారు. నాని మాటలు విని 16 ఏళ్ల కార్తికేయ ఆనందానికి అవధుల్లేవు. జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఈ సందర్భంగా పలకరించడం ఆనందంగా ఉందని అన్నారు నాని. తన దసరా ప్యాన్ ఇండియా రేంజ్ సక్సెస్ అయిన సందర్భంగా అందరితోనూ ఆ సంతోషాన్ని పంచుకోవడం హ్యాపీగా ఉందని చెప్పారు నేచురల్ స్టార్. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్2కి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో అభిమానులున్నారు. బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 2. సంగీత ప్రపంచంలో ప్రముఖులైన హిమేష్ రేష్మియా, శ్రేయా ఘోషల్, విశాల్ దడ్లానీ, జీవీ ప్రకాష్ తో పాటు ఎంతో మందిని తమ గళాలతో మెప్పిస్తున్నారు గాయనీ గాయకులు. అటు నేచురల్ స్టార్ నాని, ఇటు ఎస్పీ చరణ్ ముఖ్య అతిథులుగా ఈ వారం స్పెషల్ ఎపిసోడ్ సంగీతాభిమానులకు పండగలా ఉంటుంది. "DHARANI DHUNNESAADANTHE", EE VAARAM TELUGU INDIAN IDOL LO MEE, MAA, MANA NANI...🔥🔥🔥 DON'T MISS THE BLOCKBUSTER ENTERTAINMENT THIS FRI-SAT AT 9PM.#TeluguIndianidol2@NameisNani @charanproducer @MusicThaman @singer_karthik @geethasinger @itsvedhem @southindiamalls pic.twitter.com/q5WQSiBFH1 — ahavideoin (@ahavideoIN) April 4, 2023 -
'దసరా' మూవీ డైరెక్టర్‌తో అఖిల్ నెక్ట్స్ మూవీ ఫిక్స్!
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'దసరా' మాస్ మేనియా కనిపిస్తుంది. విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొడుతుంది. నాని, కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిందీ చిత్రం. రిలీజైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 87 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి వంద కోట్ల క్లబ్‌కి అతి దగ్గర్లో ఉంది. ఇక ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శ్రీకాంత్ ఓదెల తొలి ప్రయత్నంలోనూ సూపర్ సక్సెస్ అయ్యాడు. రంగస్థలంలో సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన దసరా సినిమాతోనే దర్శకుడిగా తన మాస్ మార్క్ చూపించాడు. దీంతో శ్రీకాంత్ ఓదలె నెక్ట్స్ సినిమా ఎవరితో తీయనున్నారనే క్యూరియాసిటీ నెలకొంది. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అక్కినేని అఖిల్‌కు ఇప్పటికే ఆయన కథ చెప్పారని, సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. -
ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న కీర్తిసురేష్ ఊరమాస్ డ్యాన్స్
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న సినిమా దసరా. నాని, కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో దిగ్విజయంగా దూసుకెళుతోంది. ఇక సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రా అండ్ రస్టిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ధరణిగా నాని, వెన్నెలగా కీర్తి సురేష్‌లు నటించారు. వీరి నటనకు ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. డీ గ్లామరస్ రోల్లో కీర్తి ఇందులో జీవించేసింది. ఈ క్రమంలో తాజాగా వెన్నెల పాత్రకు సంబంధించి ఓ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. పెళ్లి కూతురు గెటప్‌లో బరాత్‌లో వెన్నెల చేసే మాస్ డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. ఊరమాస్ స్టెప్పులతో ఇరగదీస్తుందంటూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతుంది. -
ఆ మాట జీవితాంతం వినాలని ఉంది
‘‘దసరా’ సినిమా విడుదల తర్వాత చాలామంది నాని.. ‘దసరా’కి ముందు, ‘దసరా’ తర్వాత అంటున్నారు. నా గత చిత్రాలు ‘భలే భలే మగాడివోయ్, నిన్ను కోరి, జెర్సీ’లకి కూడా ఇదే మాటలు విన్నాను. జీవితాంతం నేను చేసిన ప్రతి సినిమాకి ఈ మాట వినాలని ఉంది (నవ్వుతూ)’’ అని హీరో నాని అన్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తీ సురేష్ జంటగా నటించిన చిత్రం ‘దసరా’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా మార్చి 30న విడుదలైంది. ఈ సందర్భంగా నాని పంచుకున్న విశేషాలు. ► ‘దసరా’ కథని శ్రీకాంత్ చెప్పినప్పుడు అద్భుతంగా ఉందనిపించింది. మంచి సాంకేతిక నిపుణులను తనకు ఇచ్చి, ప్రోత్సహించాలని కథ వినగానే నిర్ణయించుకున్నాను. ఈ సినిమా చేస్తున్నప్పుడే శ్రీకాంత్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని చెప్పాను. ప్రేమ, స్నేహం, పగ.. యూనివర్సల్‌గా కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, మన సంస్కృతిని సెలబ్రేట్ చేసుకునే సినిమా ఏదైనా దొరికితే అది అందరి దగ్గరకి తీసుకెళ్లడం మన బాధ్యత. ‘దసరా’ అలాంటి సినిమానే. అందుకే మిగతా భాషల్లోనూ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులే కాదు.. ఉత్తరాదిలోనూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ► ‘దసరా’ లొకేషన్లో ఎంజాయ్ చేస్తూ చేసిన సన్నివేశం ఏదీ లేదు. దుమ్ము, ధూళి, వేడి మధ్య చాలా కష్టపడి పని చేశాం. అయితే సన్నివేశాలు బాగా వస్తున్నాయనే ఫీలింగ్ షూటింగ్‌లోనే కలిగింది. ఈ సినిమా క్లయిమాక్స్‌ని ప్రేక్షకులతో కలసి థియేటర్లో చూడటానికి చాలా ఆత్రుతగా ఎదురు చూశాం.. మేము అనుకున్నట్టే క్లయిమాక్స్‌కి మంచి స్పందన వస్తోంది. ‘దసరా’ చూసినవారంతా గొప్పగా స్పందిస్తున్నారు. ఫోన్ కాల్స్‌తో పాటు ఎమోషనల్ మెసేజ్‌లు చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ► రామ్‌చరణ్‌కు ‘రంగస్థలం’, అల్లు అర్జున్‌కి ‘పుష్ప’, నాకు ‘దసరా’ అని సోషల్ మీడియాలో వార్తలు రావడం చూశాను. ఆ మాటలకు నటుడిగా ఆనందపడతాను. కానీ తృప్తిపడను. ఎప్పుడైతే మనం తృప్తి పొందుతామో ఆ తర్వాత ప్రయత్నం చేయడంలో అలసత్వం వచ్చేస్తుంది. ఏ సినిమాకీ నేను తృప్తిపడను. ఆనందం మాత్రం ఉంటుంది. ► రస్టిక్ మూవీ చేయాలా? వేరే జానర్ మూవీ చేయాలా? అని నేను ప్లాన్ చేయను. ‘దసరా’ మాస్ సినిమా. పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా విడుదలకు ముందే నేను దాన్నుంచి బయటికి వచ్చేశాను. ఇప్పుడు ఓ సినిమాలో ఆరేళ్ల పాపకి తండ్రిగా చేస్తున్నాను. నటుడిగా వైవిధ్యం చూపిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించేలా సినిమాలు చేయాలనేది నా ఆలోచన. నా కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ‘దసరా, ఎంసీఏ, నేను లోకల్’ ఉన్నాయి. నేను ఏ సినిమానీ జానర్వారీగా చూడను.. కథ నచ్చితే సినిమా చేసేస్తాను. అయితే ఏ జానర్‌ని కూడా రిపీట్ చేయకపోవడాన్ని సౌకర్యంగా భావిస్తాను. ► కొత్త దర్శకులని పరిచయం చేయాలని ప్రత్యేకంగా అనుకోను. కథ నచ్చితే చేస్తాను. అయితే నేను పరిచయం చేసిన దర్శకులు మంచి స్థానాల్లో ఉండటం గర్వంగా ఉంది. ‘దసరా’ తొలి ఆటకి మా అబ్బాయి జున్నుని తీసుకెళ్లాను. నా ఫ్యాన్స్ అరుస్తూ, పేపర్లు విసిరేస్తుంటే.. ఎందుకు అలా చేస్తున్నారో వాడికి అర్థం కాలేదు. పేపర్లు వేస్ట్ అవుతున్నాయంటూ టెన్షన్ పడ్డాడు (నవ్వుతూ). ► ప్రభాస్, మహేశ్గార్లతో పాటు ఇండస్ట్రీలోని చాలామంది ‘దసరా’ని మెచ్చుకుంటూ మెసేజ్‌లు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ‘జెర్సీ, శ్యామ్ సింగరాయ్’ సమయంలో కూడా చిరంజీవి, రామ్‌చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేశ్బాబుగార్లు మెసేజ్ చేశారు. ఇది ఆనందంతో పాటు బాధ్యతని కూడా పెంచుతుంది. నా చిత్రాలను చాలామంది వేరే చిత్రాల బాక్సాఫీసు లెక్కలతో పోలుస్తారు. ప్రతి సినిమాకి ఒక లక్ష్యం ఉంటుంది.. ప్రేక్షకులు దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి మూవీని ప్రత్యేకంగా చూడాలి. -
దసరాపై రాజమౌళి ప్రశంసలు.. శ్రీకాంత్ ఓదెల మెప్పించావయ్యా!
దసరా సినిమా థియేటర్లలో దూసుకుపోతోంది. ఇప్పటివరకు రూ.87 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం త్వరలో వంద కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. నాని, కీర్తి సురేశ్ నటనకు ప్రేక్షకులు థియేటర్లలో విజిల్స్ వేస్తున్నారు. తెలంగాణ యాసతో మాస్ మసాలా మూవీగా మార్చి 30న విడుదలైన దసరా చిత్రానికి ఇప్పుడప్పుడే బ్రేకులు పడేలా లేవు. తాజాగా ఈ సినిమాపై దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసలు కురిపించాడు. 'మాస్ పాత్రల మధ్య హృదయ్నాని హత్తుకునే సున్నితమైన ప్రేమకథను చూపించడంలో శ్రీకాంత్ ఓదెల సక్సెస్ అయ్యాడు. నాని కెరీర్లోనే బెస్ట్ ఫర్ఫామెన్స్ ఇచ్చాడు. కీర్తి అద్భుతంగా నటించింది. ఇతర నటీనటులు కూడా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ అయితే వేరే లెవల్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే! అద్భుత విజయం అందుకున్న దసరా టీమ్ మొత్తానికి హృదయపూర్వక శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశాడు. ఈ సినిమా సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగుతుంది. ధరణిగా నాని, వెన్నెలగా కీర్తి సురేశ్ నటించారు. సత్యన్ సూరన్ సినిమాటోగ్రఫీ అందించగా నవీన్ నూలి ఎడిటర్‌గా పని చేశాడు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. Amidst the rugged landscape and raw characters, Srikanth Odela manages a tender heart touching lovestory. Career best performance by Nani. Keerthy cake walks through her role. Every actor's performance was note worthy. Cinematography is first class. Special mention to the… — rajamouli ss (@ssrajamouli) April 3, 2023 -
నెంబర్ 1 హీరోగా నాని
-
కలెక్షన్లతో దూసుకెళ్తున్న దసరా.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం 'దసరా'. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 30న థియేటర్లలో రిలీజైంది ఈ చిత్రం. విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తొలి రోజే ఏకంగా నైజాంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల రికార్డ్‌ను బ్రేక్ చేసింది. ఈ సినిమా రిలీజైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 87 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కలెక్షన్ల పరంగా చూస్తుంటే త్వరలోనే రూ.100 కోట్ల మార్కును చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దసరా మూవీ ఆదివారం రోజే రూ.16 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. పలు భాషల్లో విడుదలైన దసరాకు అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పోటీ లేకపోవడంతో మరికొన్ని ఇదే జోరు కొనసాగనుంది. కేవలం మూడు రోజుల్లోనే నైజాం (తెలంగాణ)తో పాటు, ఓవర్సీస్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. మరికొన్ని చోట్ల నాలుగో రోజు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. తెలంగాణ నేపథ్యంలో సినిమా తెరకెక్కడం.. ఇక్కడి ప్రజలకు ఈ చిత్రం కనెక్ట్ కావడంతో ఇక్కడ వసూళ్లలో దుమ్ము దులుపుతోంది. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కించారు. -
తెలుగు సినిమాల్లో తెలంగాణ యాస.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ తెలుగు సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా తెలంగాణ యాస, భాష మీద ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. డీజే టిల్లు, ఫిదా, ఇస్మార్ట్ శంకర్, రుద్రమదేవి, రాజన్న వంటి సినిమాలతో సహా ఇటీవల విడుదలైన బలగం దసరా అలాంటి కోవకే చెందుతుంది. ఈ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించడంతోపాటు కమర్షియల్గానూ మంచి విజయం సాధిస్తున్నాయి ఈ క్రమంలో తెలుగు సినిమాల్లో తెలంగాణ యాస కనిపించడంపై మంత్రి కేటీఆర్‌కు ఓ వ్యక్తి మెసెజ్ చేశారు. ‘డియర్ కేటీఆర్ గారు. మీతో రెండు విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. తెలంగాణ యాసలో ఇప్పుడు సినిమాలు రావడం, అవి అద్భుతంగా ప్రజాదరణ పొందడం చూస్తుంటే సంతోషంగా ఉంది. ఉదాహరణకు బలగం, దసరా లాంటి సినిమాలు. ఈ క్రెడిట్ అంతా కేసీఆర్‌కే దక్కుతుంది. మరో విషయం ఏంటంటే నాకు 68 ఏళ్లు.. ఇలాంటి సినిమాలు వస్తాయని కలలో కూడా ఊహించలేదు. తెలుగు సినిమాల్లో తెలంగాణ వారిని విలన్లు, జోకర్స్ గా చూపిచండంతో.. గత 20 ఏళ్ల నుంచి సినిమా థియేటర్లకు వెళ్లడం మానేశాను’ అని డాక్టర్ దండే శ్రీరాములు అనే వ్యక్తి కేటీఆర్‌కు వాట్సాప్ మెసెజ్ చేశారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. సర్ మీ అనుమతితో మీ అభిప్రాయాన్ని నేను ట్వీట్ చేయొచ్చా..? అని అడిగారు. దీనికి శ్రీరాములు కూడా స్పందింస్తూ.. తప్పకుండా సర్. మీరు ట్వీట్ చేస్తే నేను ఎంతో హ్యాపీగా ఫీలవుతాను. మీరు మమ్మల్ని అడగడం మీ మంచితనానికి నిదర్శనం. థాంక్యూ వెరి మచ్ సర్ అంటూ పేర్కొన్నారు. దీనిని కేటీఆర్ ట్విటర్లో షేర్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక రంగంలో పునరుజ్జీవనానికి కారణమైన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒకప్పుడు తెలంగాణ యాసను హేళన చేసిన చోటే.. ఇప్పుడు కీర్తి దక్కుతుంది’ అని కేటీఆర్ తెలిపారు. Messages like this 👇😊 Thanks to KCR Garu for the renaissance on the cultural front A dialect that was ridiculed is now taking centerstage 👍 pic.twitter.com/XuWZBxiYRF — KTR (@KTRBRS) April 1, 2023 -
ఆ సినిమా చూస్తుంటే గర్వంగా ఉంది: మహేశ్ బాబు ప్రశంసలు
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం దసరా. శ్రీరామనవమి సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ రెండు రోజుల్లోనే కలెక్షన్ల సునామీ సృష్టించింది. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు నానిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంపై టాలీవుడ్ ప్రిన్స్ స్పందించారు. దసరా అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరలవుతోంది. మహేశ్ బాబు ట్వీట్ చేస్తూ..' దసరా మూవీ అద్భుతంగా ఉంది. ఈ సినిమా చూసి గర్వపడుతున్నా.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నాని అభిమానులు ఖుషీ అవుతున్నారు. మరోవైపు మహేశ్‌కు ట్వీట్‌కు ధన్యవాదాలు చెబుతూ చిత్ర నిర్మాణ సంస్థ స్పందించింది .సింగరేణి గనుల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే రెండు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నాని మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. So so proud of #Dasara!! Stunning cinema! 🔥🔥@NameisNani @KeerthyOfficial @Dheekshiths @thondankani @odela_srikanth @Music_Santhosh @NavinNooli @sathyaDP — Mahesh Babu (@urstrulyMahesh) March 31, 2023 -
‘దసరా’కు దిమ్మతిరిగే కలెక్షన్స్.. రెండు రోజుల్లో ఎంతంటే?
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టిస్తోంది. మార్చి 30న విడుదలైన ఈ చిత్రం..తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. తెలంగాణ నేపథ్యంలో రా అండ్ రస్టిక్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని ఊరమాస్ నటనతో అదరగొట్టేశాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు నాని, కీర్తి సురేశ్ నటనతో పాటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పనితనంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. (చదవండి: ‘దసరా’మూవీ రివ్యూ) ఫలితంగా కలెక్షన్స్ పరంగా ‘దసరా’ దూసుకెళ్తోంది. తొలి రోజే రూ.38 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు రూ.15 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టి సత్తా చాటింది. మొత్తం రెండు రోజుల్లో దాదాపు రూ.53 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించింది. నైజాం ఏరియాలో ఈ సినిమా రూ. 10.25 కోట్లకు పైగా వసూలు చేసి బ్రేక్ ఈవెన్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఓవర్సీస్లోనూ ‘దసరా’దూసుకెళ్తోంది. రెండు రోజుల్లో అక్కడ 1.2 మిలియన్ డాలర్లను వసూలు చేసి నాని ఖతాలో నయా రికార్డును చేర్చింది. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. కాబట్టి ఈ వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నానికి జోడిగా కీర్తి సురేశ్ నటించింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. #Dasara's MASS RAMPAGE at the Box Office ❤️🔥 53+ CRORES Gross Worldwide in 2 days 💥🔥 - https://t.co/9H7Xp8jaoG#DhoomDhaamBlockbuster Natural Star @NameisNani @KeerthyOfficial @Dheekshiths @odela_srikanth @Music_Santhosh @NavinNooli @sathyaDP @saregamasouth pic.twitter.com/xPi31ks9Ir — SLV Cinemas (@SLVCinemasOffl) April 1, 2023 -
మొదటి రోజే అదరగొట్టిన దసరా.. కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం 'దసరా'. ఈ సినిమా శ్రీరామనవమి సందర్భంగా థియటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేశారు మేకర్స్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా తొలిరోజే కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ రెండు చిత్రాలను దాటేసి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 'దసరా'కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. దసరా విడుదలైన మొదటి రోజే సంక్రాంతి హిట్ సినిమాలను అధిగమించేసింది. ఈ ఏడాది రిలీజైన మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమాకు నైజాంలో 6.21 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాగా.. బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి'కి రూ. 6.10 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ రెండు సినిమాలను దాటేసిన నాని 'దసరా' నైజాంలో ఫస్ట్ డే రూ. 6.78 కోట్ల వసూళ్లు రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు సుమారు రూ.25 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు సినిమా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో మొత్తం కలిపి రూ. 14.22 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు టాక్. నాని కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ నమోదు చేసిన సినిమాగా 'దసరా' రికార్డులకు ఎక్కింది. ఈ సినిమాకు తెలంగాణలో మంచి ఆదరణ లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు దాదాపు రూ.38 కోట్ల వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. -
Dasara Movie : ‘దసరా’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఓటీటీలో నాని దసరా మూవీ..స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే..
నేచరల్ స్టార్ నాని కెరీర్లో తొలిసారి నటించిన పాన్ ఇండియా చిత్రం 'దసరా'. కీర్తిసురేష్ ఇందులో హీరోయిన్గా నటించింది. తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల సక్సెస్ అయ్యాడు. గోదావరి ఖని బొగ్గు గనుల నేపథ్యంలో మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. అటు కీర్తిసురేష్ కూడా మహానటి తర్వాత ఆ స్థాయిలో ఇరగదీసిందని ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.రా అండ్ రస్టిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచే బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే దసరా ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించి క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ దసరా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. రిలీజ్‌కు ముందే భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ డీల్‌ను కుదుర్చుకున్నట్లు సమాచారం.థియేట్రికల్ రన్ ముగిసిన 6-7వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. -
దసరా థియేటర్స్ దద్దరిల్లుతున్నాయి
-
'దసరా' హంగామా.. థియేటర్లో ఊరమాస్ రెస్పాన్స్
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం దసరా. భారీ అంచనాల నడుమ నేడు(గురువారం)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. మార్నింగ్ షో నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతుందీ చిత్రం. నాని మాస్ సీన్స్‌కు కీర్తి సురేష్ యాక్టింగ్ ఆడియెన్స్ మనసు దోచుకుంటుంది. మొత్తానికి బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ వినిపిస్తుంది. ఇక హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సుదర్శన్ థియేటర్లో సందడి చేశారు. ఆ తర్వాత మరో థియేటర్లో నాని, కీర్తిసురేష్‌లు అభిమానుల మధ్య సినిమాను వీక్షించి ఎంజాయ్ చేశారు. ఇక నాని, కీర్తిసురేష్‌లను చూసేందుకు, వాళ్లతో ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. Oora Mass Performance @NameisNani ❤️ Normal story with Best Cinematography , Top Notch BGM 🔥 @Music_Santhosh @KeerthyOfficial Mahanati 🙏@odela_srikanth nachindi anna ni Taking ✨#Dasarareview #dasara #DasaraOnMarch30th #Nani #Sudarshan35MM pic.twitter.com/XyN4AOEZHJ — Rowdy Nani (@Rowdyfan_Nani) March 30, 2023 -
దసరా మూవీ పబ్లిక్ టాక్ వీడియో
-
'చమ్కీల అంగిలేసి'పాటకు చిందేసిన మంచు లక్ష్మీ.. వీడియో వైరల్
'చమ్కీల అంగిలేసి' పాట ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దసరా సినిమాలోని ఈ పాట కొన్ని రోజుల నుంచి ఇన్‌స్టా రీల్స్‌లో దుమ్మురేపుతుంది. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఈ పాటను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా చమ్కీల అంగిలేసి పాటకు మంచు లక్ష్మీ తన కూతురితో కలిసి చిందులేసింది. పింక్ కలర్ చీరలో లిరిక్స్‌కు తగ్గట్లు స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. దసరా చిత్రం విజయవంతం కావాలంటూ బెస్ట్ విషెస్‌ను అందించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా దసరా మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఆకట్టుకుంటుంది. మార్నింగ్ షో నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
Dasara Review: ‘దసరా’మూవీ రివ్యూ
టైటిల్: దసరా నటీనటులు: నాని, కీర్తి సురేశ్, దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మాత: సుధాకర్ చెరుకూరి దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల సంగీతం: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: సత్యన్ సూరన్ ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: మార్చి 30, 2023 వైవిధ్యమైన పాత్రలు అలవోకగా చేసుకుంటూ నేచురల్ స్టార్‌గా ఎదిగాడు నాని. ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్స్‌ని ట్రై చేయడం ఆయనకు అలవాటు. అయితే నానికి ఈ మధ్య కాలంలో మాత్రం సాలిడ్ హిట్ లభించలేదు. చివరి చిత్రం ‘అంటే సుందరానికి..’ బాక్సాఫీస్ వద్ద దారణంగా బోల్తాపడింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న నాని.. ఈ సారి పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాని ఊరమాస్‌గా నటించిన చిత్రం ‘దసరా’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా నిర్వహించడంతో..‘దసరా’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మార్చి 30)విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. కరీంనగర్ జిల్లా వీర్లపల్లి గ్రామంలో జరిగే కథ ఇది. ఆ గ్రామానికి చెందిన ధరణి(నాని), సూరి(దీక్షిత్ శెట్టి) ప్రాణ స్నేహితులు. బొగ్గు రైళ్లను కొల్లగొడుతూ.. వచ్చిన డబ్బుతో ఊర్లోని సిల్క్ బార్కి వెళ్లి మద్యం సేవిస్తూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. ధరణి, సూరిల చిన్నప్పటి స్నేహితురాలు వెన్నెల(కీర్తి సురేశ్) ఓ అంగన్వాడి టీచర్. వెన్నెల అంటే ధరణికి చాలా ఇష్టం. కానీ సూరి కూడా వెన్నెలని ప్రేమించడంతో.. స్నేహం కోసం ధరణి తన ప్రేమను త్యాగం చేస్తాడు. అయితే సిల్క్ బార్లో జరిగిన ఓ గొడవ కారణంగా వీళ్ల జీవితాలు అనుకోని మలుపులు తిరుగుతాయి. ధరణి స్నేహితులపై ఓ ముఠా ఎందుకు దాడి చేసింది? శివన్న(సముద్రఖని), రాజన్న(సాయి కుమార్) రాజకీయ వైరం వల్ల గ్రామంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? చిన్న నంబి (షైన్ టామ్ చాకో)తో ధరణి చేసిన చాలెంజ్ ఏంటి? సూరి ఇష్టపడిన అమ్మాయి వెన్నెలను ధరణి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ధరణి ప్రేమను వెన్నెల అర్థం చేసుకుందా? తన స్నేహితులకు జరిగిన అన్యాయంపై ధరణి ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. తెలంగాణ నెటివిటితో సాగే ఓ రివేంజ్ డ్రామా చిత్రం ‘దసరా’. ఈ తరహా చిత్రాలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి మొన్నటి రంగస్థలం వరకు ఈ తరహా చిత్రాలు చాలానే వచ్చాయి. అయితే ఈ రొటీన్ కథకు సింగరేణి బ్యాక్‌డ్రాప్ పాయింట్‌ని జోడించి రియలిస్టిక్‌గా తెరపై చూపించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. తొలి చిత్రమైనా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను తెరకెక్కించాడు. తను రాసుకున్న ప్రతి పాయింట్‌ని వాస్తవికతకు దగ్గరగా ఉన్నది ఉన్నట్లుగా తెర రూపం ఇచ్చాడు. ఇది రివేంజ్ డ్రామా అయినా.. అంతర్లీనంగా అందమైన ప్రేమ కథతో పాటు స్నేహ బంధం, ఊరి రాజకీయాలు, తెలంగాణ గ్రామ ప్రజల జీవన శైలిని సజీవంగా చూపిస్తూ కథను రక్తి కట్టించాడు. ఫస్టాఫ్ మొత్తం ధరణి, సూరిల స్నేహ బంధం చుట్టూ తిరుగుతుంది. వాటితో పాటు ఊర్లోని సిల్క్ బార్‌పై ఆదిపత్యం కోసం రాజన్న, శివన్న చేసే రాజకీయాలను చూపించారు. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీన్ అదిరిపోతుంది. ఒక్క చిన్న ట్విస్ట్‌తో విరామం పడుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం తన స్నేహితులను అన్యాయం చేసినవారిపై ధరణి ఎలా రివేంజ్ తీసుకున్నాడనేది చూపించారు. అయితే కథనం మొత్తం ఊహకందేలా సాగడం మైనస్. సవతి సోదరులు శివన్న, రాజన్న మధ్య రాజకీయ వైరం అంటూ కథను మొదలు పెట్టిన దర్శకుడు.. ఆ రెండు క్యారెక్టర్ల మధ్య వైరాన్ని మాత్రం బలంగా చూపించలేకపోయాడు. అలాగే ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌లో కథ మొత్తాన్ని సైడ్‌ట్రాక్ పట్టించాడు. కథ స్వభావం రిత్యా ఎమోషన్స్ ఇంకాస్త పండించి ఉంటే బాగుండేది. అయితే దర్శకుడు మాత్రం చాలా నిజాయితీగా చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎవరెలా చేశారంటే.. నాని నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రలోనైనా జీవించడం ఆయనకు అలవాటు. అతని నటన చాలా సహజంగా ఉంటుంది.అందుకే నేచురల్ స్టార్ అయ్యాడు.అయితే ఇప్పటి వరకు నాని చేసిన పాత్రలు ఒకెత్తు.. ధరణి పాత్ర మరో ఎత్తు. తన కెరీర్ బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇచ్చాడు నాని. ధరణి క్యారెక్టర్ కోసం మేకోవర్ అయిన తీరు బాగుంది. ఊరమాస్ పాత్రలో జీవించేశాడు. ఇక వెన్నెలగా కీర్తి సురేశ్ తనదైన నటనతో ఆకట్టుకుంది. తెలంగాణలోని పల్లెటూరి అమ్మాయిగా అద్భుతంగా నటించింది. సినిమా మొత్తం ఈ పాత్ర చుట్టే తిరుగుతుంది. సూరి పాత్రకు దీక్షిత్ శెట్టి న్యాయం చేశాడు. ఇక రాజన్నగా సాయికుమార్, శివన్నగా సముద్రఖని పర్వాలేదపించారు. పూర్ణ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకి ప్రాణం పోసింది ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా. 22 ఎకరాల్లో వేసిన వేసిన విలేజ్ సెట్ అద్భుతం. సినిమా కోసం ఓ పల్లెటూరిని నిజంగానే సృష్టించాడు. సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం, పాటలు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. సత్యన్ సూరన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు చాలా ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘దసరా’ మూవీ స్టిల్స్
-
Dasara: ‘దసరా’మూవీ ట్విటర్ రివ్యూ
నేచురల్ స్టార్ నాని అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘దసరా’ మూవీ ఎట్టకేలకు విడుదలైంది. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దసరా ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది. కీర్తి సురేశ్ హీరోయిన్గా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య నేడు(మార్చి 30) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘దసరా’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. ‘దసరా’కి ట్విటర్లో పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. నాని కెరీర్ బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇచ్చాడని చెబుతున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అదిరిపోయిందట. ఇక శ్రీకాంత్ ఓదెల దర్శకత్వానికి నెటిజన్స్ ఫుల్ మార్కులు ఇస్తున్నారు. #Dasara Overall A Pretty Decent Raw and Rustic Village Drama! Though the pace is mostly slow and a few parts feel stretched out, the drama has worked for the most part with some good sequences and well done climax. Nani’s career best performance. Rating: 2.75-3/5 — Venky Reviews (@venkyreviews) March 29, 2023 Mass batting by @NameisNani anna .. 100cr loading #Dasara #Dasarareview @KeerthyOfficial pic.twitter.com/YtyNnUXE8D — Shiva Yadav (@ShivaKumar0110) March 29, 2023 నాని అన్న మాస్ బ్యాటింగ్ మామూలుగా లేదు.. రూ.100 కోట్లు లోడింగ్ అంటూ చిన్న వీడియోను పోస్ట్ చేశారు. #Dasara 1st half review: Film starts on an interesting note.@NameisNani is Brilliant throughout 🔥 Telangana slang and nativity at it’s best. Intense, gruesome and a shocking interval sequence keeps you glued. #DasaraReview — Santosh R. G (@gsrtSantosh) March 30, 2023 ఈ దశాబ్దంలోనే బెస్ట్ మూవీ. డైరెక్టర్లో అద్భుతమైన స్టఫ్ ఉంది. అయితే సినిమా స్లోగా ఉంది. నాని, కీర్తి నటనతో ది బెస్ట్ అనిపించారు. ది బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ మూవీ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. Done with the show. One of the best movies in decade. Sensational stuff from debut director @odela_srikanth. The best performances from @NameisNani @KeerthyOfficial. Slow paced but it gives you best theatrical experience. Go for it. #Dasarareview #Dasara https://t.co/kxLaYmChkp — Venkat Kondeti (@venkatpazzo) March 29, 2023 ఫస్టాఫ్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది కానీ నాని తనదైన స్టైల్ లో నడిపించాడు. కొన్ని సీన్లు అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. సంతోష్ నారాయణ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా కుదిరింది’అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. #Dasara Best 1st half with a bit dragged screenplay but nani pulled it off in style and kept the film engaged .. Few scene’s will definitely give u goosebumps Santosh Narayan bgm score is like 💥💥💥💥💥💥 No censor issue for us 😎 Uk audience reaction 3/5 Hit ✅ for sure pic.twitter.com/qnVqBGXhmc — Film Buff 🍿🎬 (@SsmbWorshipper) March 29, 2023 One Among Tier1 In USA Oka Debut Director tho intha Hype Generate cheyyadame oka Pedda ACHIEVEMENT ante A Hype ni match chesi 💯% performance ivvadam , output ivvadam Nani Things UNEXPECTED OPENINGS & CLOSING will be TOO @NameisNani 🔥🔥🔥 #Dasara pic.twitter.com/DrkdLL7kyM — Hemanth Kiara (@ursHemanthRKO) March 30, 2023 Excellent first half 👍👍 @NameisNani performance at his best #Dasara is deeply emotional and best interval…. Have #Rangasthalam baseline though — Rakita (@Perthist_) March 30, 2023 A little slow at places but the film rocked..especially pre-climax. All credits to Sathyan Sooryan n Santhosh Narayanan..they peaked. Nani’s best in his career and so does keerthy. #dasara Its DasaRAW! #dasara https://t.co/v7s21NDVsv pic.twitter.com/onaM9MRXYq — Rahul Vijay (@RaWhoolVijay) March 29, 2023 -
‘దసరా’ పాటకు అల్లుడితో కలిసి కీర్తి సురేశ్ తల్లి అదిరిపోయే స్టెప్పులు
‘చమ్కీల అంగీలేసి ఓ వదినే..’ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తోంది. నాని, కీర్తి సురేశ్ నటించిన ‘దసరా’లోని ఈ పాటకు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ పాటకు స్టెప్పులేస్తూ.. వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా కీర్తి సురేశ్ తల్లి, అలనాటి నటి మేనక సైతం ఈ పాటకు కాలు కదిపింది. కూమార్తె మాదిరే అదిరిపోయేలా స్టెప్పులేశారు. View this post on Instagram A post shared by Menaka Suresh (@menaka.suresh) అలాగే కీర్తి సురేశ్ సోదరి భర్త సైతం ‘చమ్కీల అంగిలేసి’ తమిళ వెర్షన్‌కు మేనకతో కలిసి స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక దసరా విషయానికొస్తే.. నాని హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రమిది.శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 30న విడుదల కాబోతుంది. View this post on Instagram A post shared by Nithinnair \nn/ (@dilsewithnithin) -
దసరా మూవీలో సిల్క్ స్మిత పోస్టర్.. ఎందుకంటే!
నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం 'దసరా'. రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. మార్చి 30న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు చిత్రబృందం. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన శ్రీకాంత్ ఓదెల సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దసరా పోస్టర్లో సిల్క్ స్మిత ఫోటో ఉండడంపై ఆయన అభిమానులకు క్లారిటీ ఇచ్చారు. శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. 'నా చిన్నప్పుడు మా తాతకు కాళ్లు విరిగిపోయాయి. తాతా కల్లు తీసుకురామంటే వెళ్లా. కల్లు దుకాణంలో ఫస్ట్ టైమ్ సిల్క్ స్మిత ఫోటో చూశా. అప్పటి నుంచి దాదాపు 15 ఏళ్ల పాటు ఆమెను చూస్తూనే ఉన్నా. ఆ తర్వాత అనిపించింది నాకు. ఆమెలా చేయాలంటే చాలా గట్స్ ఉండాలేమో. ఆమెకు ఫ్యాషనేట్ సినిమాలంటే పిచ్చి అని విన్నాను. చిన్నప్పటి నుంచి నా బ్రెయిన్లో అలా ఉండిపోయింది. అందుకే కల్లు దుకాణం వద్దే సిల్క్ స్మిత ఫోటో పెట్టా.' అని అన్నారు. అయితే కీర్తి సురేశ్‌ను ఈ విషయంపై చాలామంది అడిగారని ఆమె చెప్పుకొచ్చారు. 'Dasara' Mass Jaathara ki sarvam siddham 🔥🔥 Natural Star @NameisNani's #Dasara Grand Release on 30 MARCH 2023 💥💥#EtlaitheGatlaayeSuskundhaam 🤙@KeerthyOfficial @Music_Santhosh @sathyaDP @NavinNooli @sudhakarcheruk5 @SLVCinemasOffl pic.twitter.com/6Fi0YN80A9 — srikanth odela (@odela_srikanth) August 26, 2022 -
ఇప్పటికీ ఆమెనే నా ఫేవరేట్ హీరోయిన్: నాని కామెంట్స్ వైరల్
టాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా ఎదిగి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. కెరీర్లో తొలిసారిగా పాన్ ఇండియా చిత్రం దసరాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత నటి శ్రీదేవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నాని. ఆమెకు ఇప్పుటికీ తాను వీరాభిమానిని అని చెప్పుకొచ్చారు. రామ్ గోపాల్ వర్మ మూవీ క్షణ క్షణం (1991)లో ఆమెను చూడటం తనకు ఇప్పటికీ కలగానే అనిపిస్తుందని అన్నారు. ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ..'తన జీవితంపై శ్రీదేవి ప్రభావం ఎక్కువగా పడింది. ఎందుకంటే నా డ్రీమ్ డేట్ కచ్చితంగా శ్రీదేవినే. కానీ దురదృష్టవశాత్తు ఆమె ఈ రోజు మన మధ్య లేరు. నేను ఎదిగే కొద్దీ శ్రీదేవికి వీరాభిమానిగా మారిపోయా. ఇప్పటికీ కూడా ఆమెకు పెద్ద అభిమానిని. క్షణ క్షణం సినిమాలో ఆమెను చూస్తుంటే ఇప్పటికీ నాకు కలగానే అనిపిస్తోంది.' అని అన్నారు. కాగా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా సినిమాలో నాని ధరణి అనే పాత్రలో కనిపించనున్నారు. ధరణి పాత్ర తన కెరీర్లో మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్‌గా నిలుస్తుందన్నారు నాని. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో మార్చి 30న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ జంటగా నటిస్తోంది. -
నాని ‘దసరా’ప్రీ రిలీజ్ వేడుక (ఫోటోలు)
-
దసరా కోసం నాని పాట్లు...స్ట్రీట్ ఫుడ్ తింటూ
-
బ్రేకప్ చేదుగా ఉంటుంది.. కీర్తి సురేష్ ఆసక్తికర కామెంట్స్
మహానటి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. తాజాగా దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. బొగ్గుగనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ నానికి జోడీగా నటించింది. ఈనెల 30న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీబిజీగా పాల్గొంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ ప్రేమ, బ్రేకప్ గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. బ్రేకప్ చేదుగా ఉంటుందా? మందు చేదుగా ఉంటుందా అని కీర్తిని ప్రశ్నించగా.. ఏమాత్రం ఆలోచించకుండా బ్రేకప్ చేదుగా ఉంటుందని తెలిపింది. అయితే అలాంటి బ్రేకప్ మీ లైఫ్‌లో జరిగిందా అని అడిగితే మాత్రం నవ్వుతూ లేదని చెప్పి తప్పించుకుంది. ఇది విని పక్కనే ఉన్న నాని మహానటి అంటూ కీర్తిని ఆటపట్టించాడు. ప్రస్తుతం కీర్తి చేసిన ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
అవకాశాలు ఇస్తామని నన్ను డ్రైవర్‌గా వాడుకున్నారు: నాని
నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా ఎదిగి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. కెరీర్లో తొలిసారిగా పాన్ ఇండియా చిత్రం దసరాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా హీరో రవితేజతో చేసిన చిట్‌చాట్‌లో తన కెరీర్, జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, అవమానాల గురించి వెల్లడించారు. నాని మాట్లాడుతూ.. 'నా ఫోటో ఆల్భమ్ పట్టుకొని ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగిను. ఎక్కడా కనీసం నన్ను లోపలి కూడా రానివ్వలేదు. చిన్న చిన్న పాత్రలు చేద్దామన్నా ఛాన్సులు రాలేదు. ఆ ప్రయత్నంలో ఉండగానే ఒకరిదిద్దరు కో డైరెక్టర్స్ నన్ను డ్రైవర్ లాగా కూడా వాడుకున్నారు. రకరకాల పనులు చేయించుకున్నారు. చివరకి నా ఎటీఎమ్‌లో పండగలకు బట్టలు కొనుక్కోకుండా దాచుకున్న డబ్బులను కూడా కొట్టేశారు. ఈ స్కాములన్నీ చూశాక ఇంక యాక్టింగ్ మళ్లీ మళ్లీ మోసపోవడం వల్ల కాదని, నటుడిగా ప్రయత్నాలు ఆపేసి ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాను' అని నాని చెప్పుకొచ్చాడు. అష్టాచమ్మా సినిమాతో హీరోగా మారిన నాని ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నాడు. -
'తెలంగాణ యాసలో డైలాగులు పలకడం కష్టం అనిపించింది'
మహానటి... బొద్దుగా కనిపించడానికి ప్రోస్థటిక్ మేకప్. రంగ్ దే... గర్భవతిగా కనిపించడానికి కడుపు చుట్టూ కుషన్ సాని కాయిదమ్... చింపిరి జుత్తు, కమిలిపోయిన చర్మం... ఇప్పుడు ‘దసరా’.. డార్క్ మేకప్. కీర్తీ సురేష్ ఓ ఐదారు సినిమాలు చేస్తే అందులో పైన చెప్పినట్లు లుక్ పరంగాను.. నటన పరంగానూ చాలెంజ్ చేసే పాత్రలే ఎక్కువ. ‘క్యారెక్టర్ కోసం ఎంత కష్టపడితే అంత ఆత్మసంతృప్తి దక్కుతుంది’ అంటారు కీర్తి. నాని, కీర్తి జంటగా శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ‘దసరా’ ఈ 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కీర్తీ సురేష్ చెప్పిన విశేషాలు. మహానటి, రంగ్ దే, సాని కాయిదమ్ (తెలుగులో ‘చిన్ని’) వంటి చిత్రాల్లో చాలెంజింగ్ రోల్స్ చేశారు. ఇప్పుడు ‘దసరా’లో చేసిన వెన్నెల క్యారెక్టర్ పెట్టిన కష్టాల గురించి? వెన్నెల క్యారెక్టర్ ఫిజికల్‌గా కొంచెం కష్టం అనిపించింది. డార్క్ మేకప్‌తో కనిపిస్తాననే సంగతి తెలిసిందే. ఈ మేకప్ వేయడానికి గంట పట్టేది. తీయడానికి ఇంకా ఎక్కువ టైమ్ పట్టేది. చాలా ఓపిక అవసరం. ఇక బొగ్గు గనుల బ్యాక్‌డ్రాప్ కాబట్టి లొకేషన్లో ఒకటే దుమ్ము. ఇలా ఫిజికల్ కష్టాలు చాలానే. ఇక నటనపరంగా చాలెంజ్ ఏంటంటే.. ఈ చిత్రంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయిని కాబట్టి ఇప్పటివరకూ చేసిన పాత్రలకన్నా వ్యత్యాసం చూపించాల్సి వచ్చింది. తెలంగాణ యాసని పట్టుకోగలిగారా? నిజానికి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ కథ చెప్పినప్పుడు నాకస్సలు అర్థం కాలేదు. నాలుగు గంటలు ఓపికగా కథ చెప్పారు. అయినా తికమకగానే అనిపించింది. మరోసారి చెప్పాక అర్థం అయింది. అలాగే తెలంగాణ యాసలో డైలాగులు పలకడానికి కాస్త కష్టం అనిపించింది. కొన్ని రోజులు ఇబ్బందిపడ్డాను. ఆ తర్వాత పట్టుకోగలిగాను. శ్రీకాంత్ ఓదెల అసోసియేట్ శ్రీనాథ్‌కు తెలంగాణ యాస మీద పట్టుంది. ఆయనే నేర్పించారు. అలాగే ఒక ప్రొఫెసర్ చిన్న చిన్న వివరాలను కూడా యాడ్ చేశారు. డబ్బింగ్ చెప్పారా? ఇంతకుముందు క్యారెక్టర్లకు చెప్పినంత త్వరగా చెప్పగలిగారా? నా గత క్యారెక్టర్స్‌కి మూడు రోజుల్లో డబ్బింగ్ పూర్తి చేసేదాన్ని. వెన్నెలకు చెప్పడం అంత సులువు కాదు. ఈ పాత్రకు ఐదారు రోజులు పట్టింది. ఇప్పటివరకు చేసిన పాత్రలకన్నా ‘వెన్నెల’ క్యారెక్టర్‌కే ఎక్కువ శ్రమపడ్డారనుకోవచ్చా? అలా ఏం కాదు. శ్రమ పెట్టిన పాత్రల్లో ఇదొకటి. అయితే ఈ సినిమా చేసేటప్పుడు నాకు చాలా సందర్భాల్లో ‘మహానటి’ గుర్తొచ్చింది. ‘మహానటి’ గుర్తుకు రావడానికి కారణం? జనరల్‌గా ఒక సినిమా చేసినప్పుడు ఒక ఫీల్ ఉంటుంది. ఆ సినిమా పూర్తయినా దానితో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. అన్ని సినిమాలకూ ఇలా జరుగుతుందని చెప్పను. ‘మహానటి’ విషయంలో అలాంటి ఓ కనెక్షన్ ఉండేది. ఇప్పుడు ‘దసరా’కి ఆ ఫీల్ వచ్చింది. అందుకే ‘దసరా’ చేస్తున్నప్పుడు ‘మహానటి’ వైబ్స్ వచ్చాయన్నాను. అంటే.. ఆ సినిమాకి వచ్చినట్లే ‘దసరా’కి కూడా మీకు జాతీయ అవార్డు వస్తుందనుకోవచ్చా? యాక్చువల్‌గా ‘మహానటి’కి అవార్డుని ఆశించలేదు. వచ్చింది... చాలా ఆనందపడ్డాను. ఇప్పుడు ఈ సినిమాకి కూడా అవార్డులు ఎదురు చూడటంలేదు. నేను ఏ సినిమా చేసినా బెస్ట్‌గా చేయాలనుకుంటాను. ఆ సినిమా బాగా ఆడాలని కోరుకుంటాను.. అంతే. ఈ సినిమాలో ‘చమ్కీల అంగీలేసుకొని...’ పాట చాలా పాపులర్ అయ్యింది.. ఇది ముందే ఊహించారా? ఆ పాట వినగానే అన్ని పెళ్లి వేడుకల్లో ఇదే పాట మారుమ్రోగుతుందని అనుకున్నాం. పాటలో ఆ వైబ్రేషన్ ఉంది. లిరిక్స్ చాలా బాగుంటాయి. ట్యూన్ అద్భుతంగా కుదిరింది. పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాం. మేం ఊహించినదానికంటే పెద్ద విజయం సాధించింది. శ్రీకాంత్ ఓదెల గురించి.. ‘దసరా’ కథని శ్రీకాంత్ అద్భుతంగా రాసుకున్నారు. ఏ పాత్ర ఎలా ఉండాలో అయనకి చాలా క్లారిటీ వుంది. నా విషయానికి వస్తే.. కథ, నా పాత్ర, డైరెక్టర్ని అర్థం చేసుకుంటాను. దర్శకుడు నా నుంచి ఎలాంటి నటన కోరుకుంటున్నారో అలా చేస్తాను. కష్టానికి తగిన ప్రతిఫలం అంటారు.. మరి సింపుల్ క్యారెక్టర్లు చేసినప్పుడు తీసుకునే పారితోషకమే చాలెంజింగ్ రోల్స్‌కీ తీసుకుంటారా.. పెంచుతారా? రెమ్యునరేషన్ లెక్కలు వేయను. ఆ లెక్కలు వేసుకుని సినిమా ఒప్పుకోను. ఏదైనా క్యారెక్టర్ ఒప్పుకునే ముందు నాకు లభించే ఆత్మసంతృప్తి గురించి మాత్రమే ఆలోచిస్తాను. ‘దసరా’ పాన్ ఇండియా మూవీ... మామూలుగా పాన్ ఇండియా చిత్రాలకు హీరోలకు భారీ రెమ్యునరేషన్ ఉంటుందంటారు.. మరి ఈ చిత్రానికి మీ రెమ్యునరేషన్... అలా ఒక్క సినిమాకే పెంచేస్తామా? ఈ సినిమాతో పాన్ ఇండియా ప్లాట్ఫామ్లోకి వచ్చాను. అయినా ఒక మంచి సినిమా చేసేటప్పుడు రెమ్యునరేషన్ పట్టింపు కాదు. ఏ సినిమాకైనా ఇంతే. ఆ సినిమా వల్ల నాకెంత ఆనందం, ఆత్మసంతృప్తి లభించాయన్నదే నాకు ముఖ్యం. ‘మహానటి’ తర్వాత మీకు హిందీ నుంచి ఆఫర్స్ వచ్చినా మీరు వెళ్లలేదు.. కారణం? హిందీలో కొన్ని కథలు విన్నాను. అయితే ఆ కథల్లో నాది బలమైన పాత్ర అనిపించలేదు. బాలీవుడ్లో మంచి పాత్రలు వస్తే చేయాలనే ఉంది. కథ కూడా చాలా ముఖ్యం. -
బాలీవుడ్లో ఆ హీరోతో నటించాలని ఉంది: మనసులో మాట చెప్పేసిన కీర్తి
‘మహానటి’ కీర్తి సురేశ్ బాలీవుడ్ తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సిద్ధమైంది. తెలుగుతో పాటు దక్షిణాన అగ్ర నటిగా పేరు తెచ్చుకున్న కీర్తి ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అంటోంది. ఆమె నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దసరా మార్చి 30న విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ముంబై వెళ్లిన కీర్తి అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హిందీ సినిమాలో నటిస్తారా? అని అడగ్గా.. తప్పకుండ చేస్తానంది. చదవండి: పొలిటీషియన్తో పరిణీతి పెళ్లి? క్లారిటీ ఇచ్చిన ఆప్ నేత.. వీడియో వైరల్ బాలీవుడ్ మీ అభిమాన హీరో ఎవరని ప్రశ్నించగా.. షారుక్ ఖాన్‌కు తను పెద్ద ఫ్యాన్‌ని అని సమాధానం ఇచ్చింది. అనంతరం ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే ఎప్పటికీ వదులుకోనని, షారుక్‌తో నటించేందుకు ఆసక్తిగా ఉన్నానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కాగా ‘మహానటి’తో కీర్తి నేషనల్ అవార్డును అందుకుంది. అంతేకాదు ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఆమె అదే జోరును కొనసాగించలేకపోయింది. ఈ మూవీ తర్వాత ఆమె చేసిన సినిమాలన్ని బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టాయి. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్ తర్వాత సర్కారు వారి పాటతో సక్సెస్ అందుకుంది. ఇప్పుడు దసరా మూవీ విజయంపై ఆశలు పెట్టుకుంది. చదవండి: ఇటీవల భార్యకు ఆ హీరో విడాకులు.. ఇప్పుడు మీనాతో రెండో పెళ్లి! నటుడు సంచలన వ్యాఖ్యలు -
నాని 'దసరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే..
నాచురల్ స్టార్ నాని, కీర్తిసురేష్ జంటగా నటిస్తున్న చిత్రం దసరా. రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందుతున్న ఈసినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు ట్రైలర్, పాటలు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. మార్చి 30న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వెన్యూ ఖరారైంది. అనంతపూర్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఈనెల 26న ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటిస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
నాని ‘దసరా’కు షాకిచ్చిన సెన్సార్ బోర్డు, భారీగా కట్స్..
నేచులర్ స్టార్ నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దసరా. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 30 విడుదల కాబోతోంది. ఇంకా విడుదలకు కొద్ది రోజులే ఉండగా ఈ సినిమాకు తాజాగా సెన్సార్ బోర్డ్ షాకిచ్చింది. ఈ మూవీలో భారీ మార్పులు చేయాలని హెచ్చరించిదట. ఈ చిత్రంలోనే అభ్యంతరకర సన్నివేశాలను కట్ చేయాలంటూ పెద్ద జాబితే ఇచ్చింది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న దసరా మూవీకి బోర్డు పలు కండిషన్స్‌తో కూడిన యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. చదవండి: అప్పట్లోనే సొంతంగా హెలికాప్టర్ కొన్న ఏకైక హీరోయిన్ కేఆర్ విజయ.. ఇప్పుడెలా ఉందంటే! ఇందులో సెన్సార్ మొత్తం 36 కట్స్ చెప్పినట్లు ప్రచారం జరుగుతుండగా మరో వైపు 16 కట్స్ మాత్రమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంటర్వెల్ ముందు భాగంలో 20 కట్స్, ఇంటర్వెల్ తర్వాత భాగంలో 16 సీన్లను కట్ చేయాలని సెన్సార్ చూసించినట్లు తెలుస్తోంది. అంతేకాదు అసభ్యకర సంభాషణలకు మ్యూట్ పెట్టాలని, డిస్క్లైమర్(ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం) అనే ఫాంట్ పెంచమని చెప్పింది. అదే విధంగా వైలెన్స్ సన్నివేశాలను సీజీతో కవర్ చేయాలని బోర్డు చిత్ర బృందానికి సూచిందట. చదవండి: అప్పుడే ఓటీటీకి వచ్చేసిన బలగం.. అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్ సెన్సార్ బోర్డు చెప్పినట్టుగా అభ్యంతరక సన్నివేశాలు కట్ చేయగా మూవీ నిడివి 2 గంటల 39 నిమిషాలు ఉంది. కాగా ఈ సినిమా పూర్తి గ్రామీణ ప్రాంతం బ్యాక్‌డ్రాప్‌లో తెలంగాణ యాసతో రావడం కొన్ని పదాలకు ఈ కట్స్ పెట్టాల్సి వచ్చినట్లు చెప్తున్నారు. ఇక నాని తొలిసారి పూర్తిగా ఊరమాస్ పాత్రలో నటించడంతో పాటు ఆయన తొలి పాన్ ఇండియా చిత్రం కావడంతో దసరా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నాని ఇటీవల నటించిన చిత్రాలేవి పెద్దగా విజయం అందుకోలేపోయాయి. ఇక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న నాని ఆశలన్ని దసరాపైనే ఉన్నాయి. సింగరేణి సమీపాన ఉండే వీర్లపల్లి గ్రామం నేపథ్యంలో కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. -
ఆ టైంలో నాపై ట్రోల్స్ చేశారు.. అయినా గర్వంగా ఉంది: కీర్తి సురేశ్
సినీ అభిమానుల గుండెల్లో మహానటిగా పేరు సంపాదించుకుంది కీర్తి సురేశ్. ప్రస్తుతం నానితో కలిసి దసరా సినిమాతో అలరించేందుకు సిద్ధమైంది. అలాగే మూవీ ప్రమోషన్లలో పాల్గొంటూ బిజీ అయిపోయారు కీర్తి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేశ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మహానటి చిత్రాన్ని అంగీకరించినందుకు తనపై చాలా ట్రోల్స్ వచ్చాయని గుర్తు చేశారు. అయితే ఆ సినిమా పూర్తయ్యాకే ఈ విషయం తనకు తెలిసిందన్నారు. తనపై వచ్చిన విమర్శలను పక్కన పెడితే సావిత్రమ్మ పాత్రలో నటించినందుకు చాలా గర్వంగా ఉందన్నారామె. కీర్తి సురేశ్ మాట్లాడుతూ..' మహానటిలో నటించేందుకు మొదట విముఖత వ్యక్తం చేశా.సావిత్రమ్మ పాత్రలో నటించేందుకు చాలా భయమేసింది. కానీ.. దర్శకుడు నాగ్ అశ్విన్ నన్ను ప్రోత్సహించారు. నువ్వు చేయగలవు అనే ధైర్యనిచ్చారాయన. ఆయనకే అంత నమ్మకం ఉంటే.. నేను ఎందుకు భయపడాలి అనుకున్నా. అలానే మహానటి ప్రాజెక్ట్ పూర్తి చేశా. ఆ పాత్రలో నటిస్తున్నందుకు కొంతమంది నన్ను ట్రోల్ చేశారు. ఆ విషయం నాకు తెలియదు. ఆ సినిమా ప్రమోషన్స్‌లో ఉన్నప్పుడు దీనిపై ప్రశ్న ఎదురైంది. అప్పుడు తెలిసింది నాపై ట్రోల్స్ వచ్చాయని. సోషల్‌మీడియాలో నెగెటివిటీపై పెద్దగా ఆసక్తి చూపను. అందుకే నాపై ట్రోల్స్, విమర్శలు రావు. సావిత్రమ్మకు బయోపిక్‌లో నటించడం భయంగా అనిపించింది. ఆమె కుమార్తెతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ఎన్నో సవాళ్లు ఎదురైనా కూడా ఆ పాత్ర చేసినందుకు గర్వపడుతున్నా' అని అన్నారు. నాని, కీర్తి సురేశ్ జంటగా దసరా చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కీర్తి వెన్నెల అనే గ్రామీణ యువతి పాత్రలో నటించారు. ఈ మువీ మార్చి 30న ఇది పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. -
అందరి ముందు ఓ డైరెక్టర్ అవమానించారు: నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని పూర్థి స్థాయి మాస్ లుక్‌లో కనిపించనున్నారు. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా ఉంది. వరుస పెట్టి ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు నాని. కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. కొత్తలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. అందులో ప్రధానంగా ఓ దర్శకుడు అందరి ముందే తనను అవమానించారని చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: ఆ సీన్స్‌లో నిజంగానే మందు కొట్టి నటించారట, నిజమెంత? నాని క్లారిటీ) నాని మాట్లాడుతూ..' కెరీర్ ప్రారంభంలో చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందనేది అర్థం కాదు. సాయం చేయడానికి ఎవరూ లేరు. మనం నేర్చుకుంటున్న సమయంలోనే కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ ఆ తర్వాత సక్సెస్ మనకు సంతోషన్నిస్తుంది. నేను కూడా ఎన్నో సవాళ్లు, తిరస్కరణలు ఎదుర్కొన్నా. మిగిలిన వారితో పోలిస్తే నా ఇబ్బందులు చిన్నవే. నాకంటే ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడిన వాళ్లు కూడా ఉన్నారు. ఎవరెన్ని మాటలు అన్నా నేనెప్పుడూ బాధపడలేదు. కానీ, ఓ దర్శకుడు మాత్రం సెట్లో అందరి ముందు అవమానించాడు. నేను ఎప్పటికీ దర్శకుడిని కాలేనని అన్నాడు. ఆ మాట నన్ను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. అలాంటి ఎన్నో విమర్శలు ఎదుర్కొని ఈ రోజు నేని ఈ స్థాయికి వచ్చా.'అని అన్నారు. -
ముంబైలో కీర్తి.. ఎత్తిన బాటిల్ దించకుండ తాగి షాకిచ్చిన ‘మహానటి’
‘మహానటి’ కీర్తి సురేశ్ ప్రస్తుతం దసరా మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. శ్రీకాంత్ ఒదేల దర్శకత్వంలో నాని హీరోగా పాన్ ఇండియా మూవీ తెరకెక్కిన దసరా మార్చి 30న ఘనంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం దేశంలోని పలు నగరాలను పర్యటిస్తోంది. ఈ క్రమంలో ముంబైలో నిర్వహించిన ప్రమోషన్స్‌లో నాని, కీర్తి సురేశ్, ఇతర మూవీ టీం సభ్యులతో పాటు స్పెషల్ గెస్ట్‌గా రానా దగ్గుబాటి హాజరయ్యాడు. చదవండి: అప్పుడు సో కాల్డ్ అంటూ కామెంట్స్.. ఇప్పుడు ఏకంగా మాజీ ప్రియుడుకి క్రెడిట్.. ఇదిలా ఉంటే ఈ ముంబైలోని ప్రమోషన్స్ ఈవెంట్స్ హీరోయిన్ కీర్తి కల్లు తాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చేతితో పట్టుకోకుండా ఎత్తిన బాటిల్‌ను దించకుండ తాగి అక్కడి వారందరికి షాకిచ్చింది. కీర్తిని అలా చూసి హీరో రానా-నాని అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. కాగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీలో నాని ఊరమాస్ లుక్‌లో కనిపంచనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు సీన్లలో నిజంగానే తాగి నటించినట్లు నాని వెల్లడించాడు. ఏకంగా ఓ సీన్లలో అయితే ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండ తాగానని ఓ ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. చదవండి: జూనియర్‌తో శ్రీదేవి కూతురు జాన్వీ.. ముఖ్య అతిథిగా జక్కన్న.. ఫొటో వైరల్ ఈ క్రమంలో ముంబై ప్రమోషన్స్‌లో భాగంగా హీరోలు నాని, రానాలతో పాటు కీర్తికి కూడా కళ్లు తాగే టాస్క్ ఇచ్చారు హోస్ట్. ఇందులో భాగంగా కీర్తి గుటుక్కున కళ్లు బాటిల్ ఎత్తేసింది. కాగా ‘మహానటి’లో సంప్రదాయంగా కనిపించిన కీర్తి ఈ మధ్య సోషల్ మీడియాలో రెచ్చిపోయి ఫుల్ గ్లామర్ షో చేస్తోంది. ఫొటో షూట్స్‌లో అందాల ప్రదర్శన చేస్తూ తరచూ ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది. కీర్తి ఇలా చూసి ఫ్యాన్స్ అంతా సర్ప్రైజ్ అవుతున్నారు. కీర్తికి ఏమైంది.. ఇలా రెచ్చిపోతుందంటూ తన పోస్ట్స్‌పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. #DhoomDhaam storm in Mumbai as the crazy trio @NameisNani, @KeerthyOfficial & @RanaDaggubati recreate the hookstep of the Mass Song ❤️💃🏾#DhoomDhaam video song out today at 5:04 PM 🔥#Dasara #DasaraOnMarch30th@odela_srikanth @Music_Santhosh @Saregamasouth pic.twitter.com/1E7Q1qGJhm — SLV Cinemas (@SLVCinemasOffl) March 22, 2023 -
ఉగాది కానుకగా.. కొత్త పాటల సందడి
ఉగాది పండగని పురస్కరించుకుని పలు సినిమాల నుంచి పాటలు విడుదలయ్యాయి. ఆ పాటల సందడి విశేషాలు చూద్దాం.. ⇔ రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రావణాసుర’. అభిషేక్ నామా, రవితేజ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. భీమ్స్ సిసిరోలియో స్వరపరచిన ఈ సినిమా నుంచి ‘డిక్కా డిష్యూం..’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటని స్వాతి రెడ్డి యూకే, భీమ్స్, నరేష్ మామిండ్ల ఆలపించారు. ⇔ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తీ సురేష్ జంటగా నటించిన ‘దసరా’ ఈ నెల 30న రిలీజ్ కానుంది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ స్వరపరచిన ‘ధూం ధాం దోస్తాన్..’ అనే వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్, కనకవ్వ, గన్నోర దాసు లక్ష్మి పాలమూరు జంగిరెడ్డి, నర్సన్న, కాసర్ల శ్యామ్ పాడారు. ⇔ అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి. మహేష్ కుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మించారు. ఈ సినిమా నుంచి ‘పుత్తడి బొమ్మ కోవెల కొమ్మ..’ అనే తొలి లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. రధన్ సంగీతం అందించిన ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా, ఎమ్ఎమ్ మానసి పాడారు. ⇔ రాఘవ లారెన్స్ హీరోగా నటించిన చిత్రం ‘రుద్రుడు’. కదిరేశన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మాత ‘ఠాగూర్’ మధు తెలుగులో ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘భగ భగ రగలరా..’ పాటని రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటని పృథ్వీ చంద్ర పాడారు. ⇔ యోగేశ్వర్, అతిథి జంటగా సాయి శివాజీ దర్శకత్వం వహించిన చిత్రం ‘పరారి’. గాలి ప్రత్యూష సమర్పణలో జీవీవీ గిరి నిర్మించిన ఈ సినిమా ఈ 30న రిలీజవుతోంది. ఈ చిత్రం కోసం మహిత్ నారాయణ్ స్వరాలు సమకూర్చి, రాసిన ‘ఏమో ఏమో..’ పాటని నటి విజయశాంతి రిలీజ్ చేశారు. ఈ పాటను సాయి చరణ్, సురభి శ్రావణి పాడారు. -
'దసరా' నుంచి ఊరమాస్ 'ధూమ్ ధామ్ దోస్తాన్' వీడియో సాంగ్ వచ్చేసింది
నాని, కీర్తిసురేష్ జంటగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా దసరా. శ్రీకాంత్ ఓదెల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 30న విడుదల కానుంది. ఇప్పటికే విడుదల ట్రైలర్, పాటలు సినిమాపై ఓ రేంజ్లో బజ్‌ను క్రియేట్ చేశాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఇప్పటికే ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమాలోని ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ అనే వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ముంబైలో జరిగిన ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో హీరో నాని, హీరోయిన్ కీర్తి సురేష్‌లతో రానా, దీక్షిత్ శెట్టి కూడా పాల్గొన్నారు. ‘దసరా’ సినిమాలో నాని ధరణిగా నటిస్తుండగా, కీర్తి సురేష్ వెన్నెలగా కనిపించనుంది. పక్కా విలేజ్ బ్యాక్‌గ్రాండ్‌లో మాస్ ఎంటర్టైనర్లా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం నాని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
ఉగాది స్పెషల్.. నాని, కీర్తిసురేష్ న్యూలుక్ అవుట్
నాని, కీర్తిసురేష్ జంటగా నటిస్తున్న చిత్రం దసరా. ఈనెల 30న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. తాజాగా ఉగాది పర్వదినం సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను వదిలారు. పూరిల్లు ముందు పల్లెటూరి గెటప్‌లో హీరో, హీరోయిన్ల లుక్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే నెట్టింట ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయికుమార్, సముద్రఖని, జరీనా వహబ్, దీక్షిత్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. Dharani, Vennela & entire team of #Dasara wishes everyone a very Happy Ugadi ❤️ Let's celebrate all the new beginnings today and #Dasara on March 30th in cinemas💥@NameisNani @KeerthyOfficial @Dheekshiths @odela_srikanth @Music_Santhosh @Saregamasouth pic.twitter.com/9MUYyGFlRm — SLV Cinemas (@SLVCinemasOffl) March 22, 2023 -
న్యాచురల్ స్టార్ అనే ట్యాగ్ ఇష్టం లేదు: నాని
న్యాచురల్ స్టార్‌గా టాలీవుడ్లో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నాని. ప్రస్తుతం నాని నటించిన దసరా మూవీ మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేశ్ నటించింది. పాన్ ఇండియాగా రాబోతున్న ఈ మూవీపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రబృందం మూవీ ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన నాని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దసరా సినిమాపై శ్రీకాంత్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేశారని నాని అన్నారు. చిత్రబృందం కూడా అందరూ చాలా బాగా సహకరించారని తెలిపారు. దసరాతో నాకు మొత్తం సెట్ అయిపోతుందని నమ్ముతున్నానని.. ఈ ధైర్యంతో మరో పది సినిమాలు ఈజీగా చేయగలనని పేర్కొన్నారు. నాని మాట్లాడూతూ..' నాకు డబ్బు మేనేజ్మెంట్ అసలు తెలీదు. సినిమా కోసం డబ్బు లెక్కచేయను. ఎందుకంటే సినిమా ఇచ్చిందే కదా ఆ డబ్బు. కథ బాగుంటే వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోవడమే నా పని. నెక్ట్స్ సినిమా ఏంటీ అనేదే ఆలోచన. నాచురల్ స్టార్ అనే ట్యాగ్ ఇష్టం లేదు. మన పేరే మనకు పెద్ద బ్రాండ్. ఏ ఇండస్ట్రీలో అయినా కొత్తవారికి సమయం పడుతుంది. నెపోటిజం అనేది కరెక్ట్ కాదు. నాకు డైరెక్షన్ చేయాలనే ఉద్దేశం లేదు. నాకంటూ ఎలాంటి టార్గెట్స్ పెట్టుకోను. కుటుంబం విషయానికొస్తే మా బాబు అర్జున్ కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తా. వాడికి ఇప్పుడు ఆరేళ్లు. నా భార్య కూడా ఒక ప్రేక్షకుడిలాగే నన్ను సపోర్ట్ చేస్తుంది. నా సినీ ప్రయాణంలో ఎక్కడా ఇబ్బంది పడలేదు. కథ కోసం డిఫరెంట్ పాత్రలు చేస్తా. హీరోనే కాకుండా ఏ పాత్రలోనైనా చేస్తా.' అని అన్నారు. -
ఆ సీన్స్‌లో నిజంగానే మందు కొట్టి నటించారట, నిజమెంత? నాని క్లారిటీ
నేచరల్ స్టార్‌గా హీరో నాని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం నాని నటించిన దసరా మూవీ మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. పాన్ ఇండియాగా రాబోతున్న ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మూవీ విడుదల దగ్గర పడుతుండటంతో హీరో నాని, చిత్ర బృందం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఓ చానల్‌తో ముచ్చటించిన నాని దసరా మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు హఠాన్మరణం ఈ సందర్భంగా దసరా కొన్ని సీన్స్ మందు కొట్టి చేశారని టాక్ వినిపిస్తోంది, నిజమెంత అని యాంకర్ నాని ప్రశ్నించారు. దీనికి నాని స్పందిస్తూ.. కథ, పాత్ర డిమాండ్ చేస్తే నటుడు ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవాల్సి ఉంటుందన్నాడు. ‘ఇందులో కొన్ని మందు కొట్టి నటించాలని డైరెక్టర్ చెప్పాడు. నీకేమైనా అభ్యంతరం ఉందా? అని అడిగాడు శ్రీకాంత్. నాకేం అభ్యంతరం లేదు అని చెప్పాను. అందుకే అవసరం ఉన్న సీన్స్ లో నిజంగానే మందు కొట్టి నటించాను” అంటూ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. చదవండి: మోహన్ బాబు బర్త్‌డేలో కొత్త కోడలు మౌనిక సందడి! విష్ణు ఫ్యామిలీ ఎక్కడా? ఆ సీన్స్‌లో కళ్లు ఎర్రగా ఉండాలి.. మందు కొట్టే మ్యానరిజం ఉండాలన్నాడు. అందుకే పాత్ర డిమాండ్ మేరకు నిజంగా మందు తాగాల్సి వచ్చిందని నాని వివరణ ఇచ్చాడు. ఇక దసరా మూవీలో డైరెక్టర్ శ్రీకాంత్ నన్ను కావాల్సినంత గట్టిగా వాడుకున్నాడంటూ నవ్వులు చిందించాడు. కాగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని జోడిగా కీర్తి సురేశ నటించింది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని పూర్థి స్థాయి మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. -
‘దసరా’ టీంకు కీర్తి ఖరీదైన కానుకలు! ఏకంగా 130 మందికి...
‘మహానటి’ మూవీతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకుంది కీర్తి సురేశ్. ఈ సినిమాలో అచ్చం సావిత్రిని అభినయస్తూ మంచి మార్కులు కొట్టేసింది. దీంతో కీర్తి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అయితే అదే క్రేజ్‌ను ఆమె కొనసాగించలేకపోయింది. కథలను ఎంపికలతో తడపబడుతూ స్టార్ ఇమేజ్ను డ్యామేజ్ చేసుకుంది. మహానటి తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించనప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. చదవండి: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ‘మాతృదేవోభవ’ హీరోయిన్.. ఫొటోలు వైరల్ ఇటీవల మహేశ్ బాబు సర్కారు వారి పాటతో మంచి హిట్టు కొట్టిన కీర్తి దసరా మూవీతో ఎలాగైన మరో హిట్ కోట్టాలని ఆసక్తిగా ఎదురు చూస్తుంది. నానికి జోడిగా ఆమె నటించిన దసరా మూవీ ఈ నెల 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కీర్తికి సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. సినిమా షూటింగ్ అయిపోయిన సందర్భంగా కీర్తి దసరా టీంకు ఖరీదైన బహుమతులు ఇచ్చిందట. చదవండి: షాకింగ్: లాకర్లోని రజనీకాంత్ కూతురు ఐశ్వర్య బంగారం, వజ్రాలు చోరీ ఈ మూవీకి పని చేసిన టెక్నీషియన్లకు బంగారు నాణెలు కానుక ఇచ్చినట్లు సమాచారం. దాదాపు 130 మంది టెక్నిషియన్లు ఒక్కొక్కరి కీర్తి గోల్డ్ కాయిన్స్ పచ్చినట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుంతో తెలియాల్సి ఉంది. కానీ కీర్తి గొప్ప మనసు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మహానటి తర్వాత మళ్లీ నటనకు స్కోప్ ఉన్న అలాంటి పాత్ర రావడం, షూటింగ్లో తనకు అన్ని విధాలా సహకరించినందుకు గానూకృతజ్ఞతగా ఈ బంగారు నాణెలు ఇచ్చినట్లు తెలుస్తోంది. -
కీర్తి సురేష్ స్టన్నింగ్ లుక్స్.. అదిరేటి అందాలతో మెరిసిన ముద్దుగుమ్మ (ఫోటోలు)