పెళ్లంటే హల్దీ, మెహందీ, సంగీత్.. ఇలా నానా హంగామా ఉంటుంది. అయితే ఈ కార్యక్రమాలన్నీ ఉన్నా లేకపోయినా పెళ్లి వేడుకలో కచ్చితంగా ఉండేది బరాత్. ఇక్కడ క్లాస్ పాటలకు పర్ఫామ్ చేయడం కాదు మాస్ మ్యూజిక్‌కు స్టెప్పులేయడమే ఉంటుంది. అప్పటిదాకా ఎమోషన్‌లో ఉన్న వధూవరుల బంధువులు, కుటుంబసభ్యులు కూడా బరాత్ ప్రారంభమవగానే ఒక్కసారిగా అలర్ట్ అవుతారు. పెళ్లికొడుక్కి డ్యాన్స్ వచ్చినా రాకపోయినా ఎలాగోలా గుంపులోకి లాక్కొచ్చి నాలుగు స్టెప్పులేయిస్తారు. కానీ ఈ మధ్య పెళ్లికూతుళ్లను ఎవరూ పిలవకపోయినా సరే వాళ్లే డైరెక్ట్‌గా బరాత్‌లో ఎంటరై తీన్మార్ డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
ఇలాంటి తీన్మార్ డ్యాన్స్ దసరా సినిమాలో కీర్తి సురేశ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసి వారం రోజులవుతున్నా ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా కీర్తి పాప మాస్ డ్యాన్స్ వెనక ఉన్న కష్టాన్ని వెల్లడించాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఈ డ్యాన్స్ బిట్ కోసం కీర్తి 25 టేకులు తీసుకుందని చెప్పాడు. చిన్న మిస్టేక్ వచ్చినా మళ్లీ మొదటి నుంచి చేస్తానని అదే ఎనర్జీతో డ్యాన్స్ చేసేదని పేర్కొన్నాడు. అన్నిసార్లు ఒకే బిట్‌ను, అదే జోష్‌తో చేసిందంటూ కీర్తి డెడికేషన్ ఏ లెవల్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక దసరా విషయానికి వస్తే ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు శ్రీకాంత్ ఓదెల. ధరణిగా నాని, వెన్నెలగా కీర్తి సురేశ్ నటించిన ఈ మూవీ మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ ఆడియన్స్‌ను మెప్పించిన ఈ మూవీ వారం రోజుల్లోనే వంద కోట్లు రాబట్టింది. ఈ సంతోషంతో నిర్మాత చెరుకూరి సుధాకర్.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు బీఎమ్‌డబ్ల్యూ కారు బహుమతిగా ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment