RRR Director SS Rajamouli Praises Dasara Movie Team - Sakshi
Sakshi News home page

Dasara Movie: నాని కెరీర్‌లోనే బెస్ట్‌ పర్ఫామెన్స్‌.. దసరాపై జక్కన్న రివ్యూ

Apr 3 2023 5:26 PM | Updated on Apr 3 2023 6:03 PM

SS Rajamouli Praises Dasara Movie - Sakshi

నాని కెరీర్‌లోనే బెస్ట్‌ ఫర్ఫామెన్స్‌ ఇచ్చాడు. కీర్తి అద్భుతంగా నటించింది. ఇతర నటీనటులు కూడా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ అయితే వేరే లెవల్‌. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే! అ

దసరా సినిమా థియేటర్లలో దూసుకుపోతోంది. ఇప్పటివరకు రూ.87 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం త్వరలో వంద కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. నాని, కీర్తి సురేశ్‌ నటనకు ప్రేక్షకులు థియేటర్లలో విజిల్స్‌ వేస్తున్నారు. తెలంగాణ యాసతో మాస్‌ మసాలా మూవీగా మార్చి 30న విడుదలైన దసరా చిత్రానికి ఇప్పుడప్పుడే బ్రేకులు పడేలా లేవు.

తాజాగా ఈ సినిమాపై దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసలు కురిపించాడు. 'మాస్‌ పాత్రల మధ్య హృదయ్నాని హత్తుకునే సున్నితమైన ప్రేమకథను చూపించడంలో శ్రీకాంత్‌ ఓదెల సక్సెస్‌ అయ్యాడు. నాని కెరీర్‌లోనే బెస్ట్‌ ఫర్ఫామెన్స్‌ ఇచ్చాడు. కీర్తి అద్భుతంగా నటించింది. ఇతర నటీనటులు కూడా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ అయితే వేరే లెవల్‌. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే! అద్భుత విజయం అందుకున్న దసరా టీమ్‌ మొత్తానికి హృదయపూర్వక శుభాకాంక్షలు' అని ట్వీట్‌ చేశాడు.

ఈ సినిమా సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగుతుంది. ధరణిగా నాని, వెన్నెలగా కీర్తి సురేశ్‌ నటించారు. సత్యన్‌ సూరన్‌ సినిమాటోగ్రఫీ అందించగా నవీన్‌ నూలి ఎడిటర్‌గా పని చేశాడు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement