
ఆర్‌ఆర్‌ఆర్ (RRR Movie)లో రోమాలు నిక్కబొడుచుకునే పాట+ సన్నివేశం అనగానే చాలామందికి మొదట గుర్తొచ్చేది కొమురం భీముడో సాంగ్.. ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్‌ను చిత్రహింసలు పెడుతున్నా.. అతడు ప్రజలను ఒక్కటి చేసేందుకు ప్రయత్నించడం.. ఈ క్రమంలో ఆయన పలికించే భావోద్వేగాలు.. నెక్స్ట్ లెవల్‌లో ఉంటాయి. ఆ సమయంలో తారక్‌ను చూస్తే ఏదో పూనకం వచ్చినట్లే కనిపించాడంటున్నాడు దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి (S. S. Rajamouli).
తారక్ వల్లే ఈజీ..
జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ ప్రమోషన్లలో రాజమౌళి మాట్లాడుతూ.. కొమురం భీముడో పాట (Komuram Bheemudo Song) షూటింగ్ చాలా ఈజీగా అయిపోయింది. ఎందుకంటే తారక్ (Jr NTR) పోషించిన పాత్ర తాలూకు ఆత్మ అతడిలో ప్రవేశించినట్లుగానే యాక్ట్ చేశాడు. అతడు అద్భుతమైన నటుడని మనందరికీ తెలుసు. ఈ పాటలో మాత్రం మరో స్థాయిలో నటించాడు. తనిచ్చే ఒక్కో ఎక్స్‌ప్రెషన్.. నుదుటిపై కండరాల కదలిక.. అన్నీ పర్ఫెక్ట్‌గా కుదిరాయి.
కొరియోగ్రాఫర్ నైపుణ్యం కూడా..
నేను కేవలం కెమెరాను అతడి ముఖం ముందు పెట్టి పాట ప్లే చేశానంతే.. చివరకు ఆ పర్ఫామెన్స్ అద్భుతంగా వచ్చింది. ఈ విషయంలో కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ (Prem Rakshit)కు కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే! అతడిని ఎలా కట్టేయాలి, గాల్లో ఎలా వేలాడదీయాలి.. ఇలా అన్నింటినీ తను చాలా బాగా కొరియోగ్రఫీ చేశాడు అని మెచ్చుకున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్ విషయానికి వస్తే.. విజయేంద్రప్రసాద్ కథ అందించిన ఈ చిత్రాన్ని ఆయన తనయుడు రాజమౌళి తెరకెక్కించాడు.
వెయ్యికోట్లకు పైనే..
సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా డీవీవీ దానయ్య నిర్మించాడు. రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్, శ్రియా, సముద్రఖని, ఒలీవియా మోరిస్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఎమ్‌ఎమ్ కీరవాణి సంగీతం అందించాడు. 2022 మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దాదాపు రూ.1300 కోట్లకు పైగా రాబట్టింది. ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ (RRR: Behind and Beyond) డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
రాజమౌళి నెక్స్ట్ మూవీ..
ప్రస్తుతం రాజమౌళి.. సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో కలిసి సినిమా చేస్తున్నాడు. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా 2027లో విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే.. అతడు వార్ 2 చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది.
Everyone Knows Tarak Is Good, Fantastic Actor But In #KomuramBheemudo Sequence He's On Different Level 🔥👏🛐 - @ssrajamouli In Japan ❤️.
Goat Actor @tarak9999 🐐❤️🔥.#RRRBehindAndBeyond pic.twitter.com/2yDLhx0Dae— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) April 13, 2025
చదవండి: సమంత 'సిటాడెల్ 2' లేనట్లే.. ప్రకటించిన అమెజాన్