ఆర్‌ఆర్‌ఆర్‌కు అరుదైన గౌరవం | RRR to be screened at this iconic venue in London: Tollywood | Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌ఆర్‌కు అరుదైన గౌరవం

Nov 5 2024 12:24 AM | Updated on Nov 5 2024 12:24 AM

RRR to be screened at this iconic venue in London: Tollywood

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. దాదాపు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన లండన్‌లోని ఐకానిక్‌ రాయల్‌ ఆల్బర్ట్‌ సినిమా హాల్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ప్రదర్శితం కానుంది. వచ్చే ఏడాది మే 11న ఈ మూవీ స్క్రీనింగ్‌ ఉంటుందని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ యూనిట్‌ ప్రకటించింది. అలాగే ఈ కార్యక్రమంలో రాయల్‌ ఫిల్‌ హార్మోనిక్‌ ఆర్కెస్ట్రాతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణి లైవ్‌ కన్సర్ట్‌ ఇవ్వనున్నారు.

కాగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా 2022 మార్చి 25న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 95వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ విభాగంలో (నాటు నాటు పాటకు గాను) ఎమ్‌ఎమ్‌ కీరవాణి, లిరిక్‌ రైటర్‌ చంద్రబోస్‌ ఆస్కార్‌ అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. పలు అంతర్జాతీయ, జాతీయ అవార్డులు కూడా లభించాయి. కాగా ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ సినిమా ఐకానిక్‌ రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో 2019లో ప్రదర్శితమైన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement