![RRR bags Best Picture Non English and Best Song nominations in Golden Globes 2023 - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/12/rr11.gif.webp?itok=r0nG_knF)
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్. బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ అవార్డుల పరంపర ఇంకా కొనసాగిస్తోంది. తాజాగా ఆర్ఆర్ఆర్ మరో మైలురాయిని అందుకుంది. గోల్డెన్ గ్లోబ్స్- 2023 అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ ఉత్తమ నాన్ ఇంగ్లీష్ చిత్రం, ఉత్తమ పాటల కేటగిరీలో నామినేట్ అయింది.
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో రెండు విభాగాల్లో నామినేట్ చేయబడింది. నాటు నాటు సాంగ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ కాగా.. ఉత్తమ నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ చిత్రం విభాగంలోనూ నామినేట్ అయింది. ఈ విషయాన్ని గోల్డెన్ గ్లోబ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఉత్తమ చిత్రం - నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్
1.ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
2.అర్జెంటీనా, 1985
3. క్లోజ్
4.డెసిషన్ టు లీవ్
5. ఆర్ఆర్ఆర్
ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – మోషన్ పిక్చర్
1.కరోలినా, టేలర్ స్విఫ్ట్- (వేర్ ది క్రాడాడ్స్ సింగ్)
2.సియావో పాపా, (గిల్లెర్మో డెల్ టోరోస్ పినోచియో)
3.హోల్డ్ మై హ్యాండ్( టాప్ గన్: మావెరిక్)
4.లిఫ్ట్ మీ అప్, (బ్లాక్ పాంథర్: వాకండ ఫరెవర్)
5.నాటు నాటు (ఆర్ఆర్ఆర్)
Congratulations to the nominees for Best Picture - Non-English Language
— Golden Globe Awards (@goldenglobes) December 12, 2022
✨ All Quiet on the Western Front
✨ Argentina, 1985
✨ Close
✨ Decision to Leave
✨ RRR#GoldenGlobes pic.twitter.com/DfNs0VQbIs
Congratulations to the nominees for Best Song - Motion Picture
— Golden Globe Awards (@goldenglobes) December 12, 2022
✨ "Carolina" - Where The Crawdads Sing
✨ "Ciao Papa" - Guillermo del Toro's Pinocchio
✨ "Hold My Hand" - Top Gun: Maverick
✨ "Lift Me Up" - Black Panther: Wakanda Forever
✨ "Naatu Naatu" - RRR#GoldenGlobes pic.twitter.com/gqG3aWwUjP
Comments
Please login to add a commentAdd a comment