Ram Chanran
-
గేమ్ ఛేంజర్, చావా మధ్య భారీ క్లాష్ తప్పదా..?
-
పదేళ్లు అయినా నా కోసం ఎదురు చూస్తున్నారు: కియారా అద్వానీ
బాలీవుడ్ తారలు ఇప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమపై ఆసక్తి చూపుతున్నారనేది ఎవరు కాదనలేని నిజం. అక్కడి హీరోలు, హీరోయిన్లు, ఇతర నటీనటులు సైతం సౌత్ ఇండియా పరిశ్రమలోని పలు చిత్రాల్లో నటించటానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం దక్షిణాది చిత్రాల అవకాశాలను ఏ మాత్రం వదులుకోవడం లేదు. దీపిక పదుకొనే, కత్రినా కైఫ్, అలియా భట్, కంగనా రనౌత్ వంటి తారలు మన చిత్రాలపై ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఈ కోవలోకి నటి కియారా అద్వానీ చేరింది. బాలీవుడ్లో ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్. అక్కడ క్రేజీ కథానాయికగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తోంది. కాగా నటి కియారా అద్వానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూ పేర్కొంటూ తాను చేసే ఏ విషయంలోనైనా ఓ ప్రత్యేకత ఉండాలని భావిస్తానంది. నటించే చిత్రాల్లో తన పాత్రలు భిన్నంగా ఉండాలని కోరుకుంటానని పేర్కొంది. చిత్రాలపై చాలామంది పెట్టుబడి, శ్రమ ఉంటాయని, అందుకే చిత్రాలు ఎంపికలో ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పింది. తన భర్త సిద్ధార్థ్‌కు చిత్రపరిశ్రమలో మంచి పేరు ఉందని, దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పింది. ఇకపోతే తాను నటిగా రంగ ప్రవేశం చేసి పదేళ్లు అయ్యిందని, ఇప్పుడు కూడా పలువురు తనతో చిత్రాలు చేయడానికి ఎదురు చూస్తూ ఉండడం చాలా ఆనందం కలిగిస్తోందన్నారు. -
#𝐕𝐚𝐫𝐮𝐧𝐋𝐚𝐯 : ఘనంగా వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
రామ్ చరణ్ ని ఫాలో అవుతున్న ప్రభాస్,ఎన్టీఆర్,మహేష్
-
Oscars 2023 Photos: అపురూప క్షణాలు.. అవార్డు ఫంక్షన్లో మెరిసిన తారక్-రామ్‌చరణ్ ( ఫొటోలు)
-
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో చరిత్ర సృష్టించిన 'ఆర్ఆర్ఆర్' (ఫొటోలు)
-
ఆర్ఆర్ఆర్ అరుదైన ఘనత.. ఆ రెండు విభాగాల్లో నామినేట్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్. బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ అవార్డుల పరంపర ఇంకా కొనసాగిస్తోంది. తాజాగా ఆర్ఆర్ఆర్ మరో మైలురాయిని అందుకుంది. గోల్డెన్ గ్లోబ్స్- 2023 అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ ఉత్తమ నాన్ ఇంగ్లీష్ చిత్రం, ఉత్తమ పాటల కేటగిరీలో నామినేట్ అయింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో రెండు విభాగాల్లో నామినేట్ చేయబడింది. నాటు నాటు సాంగ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ కాగా.. ఉత్తమ నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ చిత్రం విభాగంలోనూ నామినేట్ అయింది. ఈ విషయాన్ని గోల్డెన్ గ్లోబ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఉత్తమ చిత్రం - నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ 1.ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ 2.అర్జెంటీనా, 1985 3. క్లోజ్ 4.డెసిషన్ టు లీవ్ 5. ఆర్ఆర్ఆర్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – మోషన్ పిక్చర్ 1.కరోలినా, టేలర్ స్విఫ్ట్- (వేర్ ది క్రాడాడ్స్ సింగ్) 2.సియావో పాపా, (గిల్లెర్మో డెల్ టోరోస్ పినోచియో) 3.హోల్డ్ మై హ్యాండ్( టాప్ గన్: మావెరిక్) 4.లిఫ్ట్ మీ అప్, (బ్లాక్ పాంథర్: వాకండ ఫరెవర్) 5.నాటు నాటు (ఆర్ఆర్ఆర్) Congratulations to the nominees for Best Picture - Non-English Language ✨ All Quiet on the Western Front ✨ Argentina, 1985 ✨ Close ✨ Decision to Leave ✨ RRR#GoldenGlobes pic.twitter.com/DfNs0VQbIs — Golden Globe Awards (@goldenglobes) December 12, 2022 Congratulations to the nominees for Best Song - Motion Picture ✨ "Carolina" - Where The Crawdads Sing ✨ "Ciao Papa" - Guillermo del Toro's Pinocchio ✨ "Hold My Hand" - Top Gun: Maverick ✨ "Lift Me Up" - Black Panther: Wakanda Forever ✨ "Naatu Naatu" - RRR#GoldenGlobes pic.twitter.com/gqG3aWwUjP — Golden Globe Awards (@goldenglobes) December 12, 2022 -
గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన బేబమ్మ..!
-
చరణ్‌కు ఉపాసన అంటే భయమా ? నాన్న అంటే భయమా ?..
Anchor Suma Question To Ram Charan In Acharya Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ 'ఆచార్య'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌లో స్పీడు పెంచింది 'ఆచార్య' చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ శనివారం (ఏప్రిల్ 23) యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఆహ్లాదకరంగా సాగింది. ఈ ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన యాంకర్ సుమ కనకాల అభిమానులు పంపిన ప్రశ్నలను అడగ్గా చిరంజీవి, చరణ్, కొరటాల శివ సమాధానాలిచ్చారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్‌ను సుమ 'ఇంట్లో ఎవరికీ భయపడతారు నాన్నకా? ఉపాసనాకా?' అని ఆసక్తికర ప్రశ్న అడిగింది. దానికి జవాబుగా 'తెలియదు గానీ.. మా నాన్న.. అమ్మ ముందు జాగ్రత్తగా ఉంటారు. నేను కూడా అదే నేర్చుకుని ఉపాసన దగ్గర కాస్త జాగ్రత్తగా ఉంటా. బాబాయికైనా, డాడీకైనా, నాకైనా.. మా అందరికీ బాసు మా అమ్మే.' అని తెలిపాడు రామ్ చరణ్. ఈ సమాధానం విన్న చిరంజీవి 'అది నన్ను చూసి నేర్చుకున్నావ్. సుఖపడతావ్. వాళ్లతో పెట్టుకోవద్దు.' అని నవ్వుతూ పేర్కొన్నారు. చదవండి: ఇంతకుముందు చూడని మెగాస్టార్‌ను చూస్తారు: మెహర్ రమేష్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆచార్య నుంచి కాజల్ సీన్స్ డిలీట్? అదే కారణమా?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఆచార్య. ఇందులో రామ్ చరణ్ సిద్దా అనే కీలక పాత్ర పోషించాడు.కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్గా నటించనుండగా, రామ్‌చరణ్ సరసన పూజా హెగ్డే నటించింది. అయితే రీసెంట్గా విడుదలైన ట్రైలర్లో మెయిన్ లీడ్ హీరోయిన్గా నటించిన కాజల్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. పూజా హెగ్డే మాత్రం రెండు సీన్స్‌లో కనిపించింది. దీంతో అసలు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న సందేహం నెటిజన్లలో కలుగుతుంది. అయితే కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో పూర్తి స్థాయిలో నటించలేదని తెలుస్తోంది. కరోనా రావడంతో తొలుత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ షూటింగ్ ప్రారంభం అయ్యే సమయానికి ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ షూటింగ్లో పాల్గొనలేదు. బ్యాలెన్స్ పార్ట్ కంప్లీట్ చేయమని నిర్మాతలు అడిగినా కాజల్ నో చెప్పడంతో మేకర్స్ అసహనానికి లోనయ్యారని తెలుస్తుంది. దీంతో కావాలనే ట్రైలర్లో కాజల్‌ని చూపించలేదని తెలుస్తుంది. సినిమాలో కూడా కాజల్ సీన్స్‌ని తొలగించారని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. -
ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ పార్టీ (ఫొటోలు)
-
ఆర్ఆర్ఆర్లో 'మల్లి' పాత్ర చేసిన చిన్నారి ఎవరో తెలుసా?
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్ భారీగా వసూళ్లు సాధిస్తూ రికార్డులు కొల్లగొడుతుంది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. జక్కన్న తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల పర్ఫార్మెన్స్కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. వీరిద్దరితో పాటు సినిమాలో చాలా పాత్రలకి మంచి ఆధరణ లభిస్తుంది. వాటిలో ఒకటి మల్లి పాత్ర. గిరిజన బిడ్డైన మల్లిని బ్రిటిష్ దొరసాని తీసుకెళ్లడంతో సినిమా స్టోరీ మొదలవుతుంది. అక్కడి నుంచి కథను ముందుకు నడిపించే కీలక పాత్రలో మల్లి నటన ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? బ్యాక్‌గ్రౌండ్ అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మల్లి పాత్ర పోషించిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు ట్వింకిల్ శర్మ. ఈమెది ఛండీగర్. డాన్స్ ఇండియా డాన్స్ రియాలిటీ షోతో గుర్తింపు పొందిన ఆ అమ్మాయి చాలా టీవీ యాడ్స్‌లో నటించింది. ఫ్లిప్ కార్ట్ యాడ్‌లో ఈమెను చూసిన రాజమౌళి ఆడిషన్‌కు పిలిపించి మల్లి పాత్రకు సెలక్ట్ చేశారట. ఇక ఈ చిత్రంలో ‘నన్ను ఈడ ఇడిసిపోకన్న అమ్మా.. యాదికొస్తాంది’ అంటూ మల్లీ చెప్పే డైలాగ్ ఎంతగానో మెప్పించింది. -
ఆర్ఆర్ఆర్ స్టార్స్ రెమ్యునరేషన్
-
నాట్యం ప్రిరిలీజ్ ఈవెంట్లో మెరిసిన రామ్ చరణ్..
-
RC 15: మరో వివాదంలో డైరెక్టర్ శంకర్..
‘అది నా కథ. నాకు తెలియకుండా కొట్టేశారు’ అంటూ అప్పుడప్పుడూ రచయితలో, దర్శకులో ఆరోపించే విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఓ వివాదం హాట్ టాపిక్ అయింది. ఇది శంకర్ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన వివాదం. రామ్‌చరణ్ (‘ఆర్సీ 15’.. చరణ్‌కి ఇది 15వ సినిమా) హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు ఓ ప్యాన్ ఇండియా మూవీ నిర్మించనున్న విషయం తెలిసిందే. ‘భారతీయుడు 2’ పూర్తి చేశాకే శంకర్ ఈ సినిమా చేయాలని ఆ చిత్రనిర్మాతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయమూ విదితమే. మరోవైపు ‘అపరిచితుడు’ రీమేక్ వివాదం కూడా ఎదుర్కొన్నారు శంకర్. తాజాగా.. రామ్‌చరణ్ సినిమా కోసం తయారు చేసిన కథ తనదేనంటూ చెల్లముత్తు అనే రచయిత దక్షిణ భారత సినీ రచయితల సంఘాన్ని ఆశ్రయించారు. కార్తీక్ సుబ్బరాజ్ దగ్గర దర్శకత్వ శాఖలో చేశారు చెల్లముత్తు. ఇటు రామ్ చరణ్ సినిమా, అటు ‘అపరిచితుడు’ హిందీ రీమేక్ ప్లాన్స్‌తో బిజీగా ఉన్న శంకర్ ‘ఆర్సీ 15’కి కథ తయారు చేసి ఇవ్వమని కార్తీక్ సుబ్బరాజ్‌ని కోరారట. ఆ మేరకు కార్తీక్ ఓ కథ తయారు చేసి ఇచ్చారట. ఆ కథ తనదని చెల్లముత్తు ఆరోపిస్తున్నారు. కార్తీక్, చెల్లముత్తులతో మాట్లాడి, అసలు కథేంటి? కథ ఎవరిది? అనే విషయంలో రచయితల సంఘం త్వరలో తీర్పు వెల్లడిస్తుందని కోలీవుడ్ టాక్. చదవండి : డాక్టర్‌తో డైరెక్టర్ వివాహం.. హాజరైన ప్రముఖులు అల్లు అర్జున్‌తో డ్యాన్స్.. తెగ కష్టపడుతున్న రష్మిక -
‘ఆర్ఆర్ఆర్ ’హవా.. రికార్డు రేటుకి తమిళ్ రైట్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 'బాహుబలి' తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న తొలి సినిమా కావడం, స్వాతంత్ర్య సమరవీరుల పాత్రల్లో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం.. ఇప్పటికే ఫ్రీ రిలీజ్ బిజినెస్‌ని భారీగా జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజం చేస్తూ బుధవారం ఓ కీలక ప్రకటన వెలువడింది. ఆర్ఆర్ఆర్ మూవీ తమిళనాడు థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడెక్షన్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని లైకా ప్రొడెక్షన్స్ ట్విటర్ ద్వారా తెలియజేసింది. ‘బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ తమిళనాడు థియేట్రికల్ హక్కులను దక్కించుకుంచుకున్నామని ప్రకటించడం ఎంతో గర్వంగా ఉంది’అంటూ లైకా ప్రొడక్షన్స్ ట్విట్ చేసింది. అయితే ఈ థియేట్రికల్స్ రైట్స్‌ను పొందడం కోసం లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ మొత్తంలో డబ్బులు చెల్లించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రూ.45 కోట్ల భారీ ధరకు తమిళనాడు థియేట్రికల్స్ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఇంత మొత్తంలో చెల్లించడం పెద్ద ఆశ్యర్యకరమైన విషయమేమి కాదు. , రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి 2’ తమిళనాడులో సుమారు రూ.78 కోట్ల షేర్ వసూలు చేసింది. అందుకే లైకా ప్రొడక్షన్స్ రూ. 45 కోట్లు చెల్లించడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆర్ఆర్పై భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి రూ.45 కోట్లు వసూలు కావడం పెద్ద కష్టమేమీకాదు. We are delighted and proud to announce📢 The Tamil Nadu theatrical rights of THE BIGGEST PAN INDIA FILM #RRRMovie is acquired by us...🔥🌊@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @OliviaMorris891 @thondankani @RRRMovie @DVVMovies #RRR pic.twitter.com/ASZsLLVdNT — Lyca Productions (@LycaProductions) February 17, 2021 -
గడ్డం అడ్డం కాదంటున్న హీరోలు
పోకిరి.. జులాయి.. రఫ్.. రౌడీ.. గడ్డంతో కనిపించే హీరోలు అందుకున్న వెండితెర బిరుదులు ఇవి. మీసాలు గుచ్చకుండా ముద్దాడతావా నన్ను అని హీరోయిన్స్ పాడుకోవడం వల్లో లేక రాముడు మంచి బాలుడు అనే ట్యాగ్ కోసమో మన హీరోలు ఎక్కువ శాతం గడ్డం జోలికి వెళ్లడంలేదు. అయితే ఇప్పుడు క్లీన్ షేవ్‌కు కాలం చెల్లినట్టుంది. ట్రెండ్ మారింది. పాత్ర అడిగితే గడ్డం అసలు అడ్డమే కాదంటున్నారు మన హీరోలు. మీసాలు తిప్పుతున్నారు. గడ్డం దువ్వుతున్నారు. రాబోతున్న సినిమాల్లో సరికొత్త పాత్రల కోసం గడ్డాలు పెంచుతున్న ఈ గడ్డం గ్యాంగ్‌పై ఓ లుక్ వేయండి. చిరు గడ్డం కాదు పీరియాడికల్ సినిమాలంటే కచ్చితంగా పొడవైన జుత్తు, గడ్డంతో కనిపించాల్సిందే. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర కోసం చిరంజీవి గడ్డం పెంచారు. గడ్డంతో కనిపించడం చిరుకు కొత్త కాదు. అయితే ‘సైరా’లో ఎక్కువ గడ్డంతో కనిపించనున్నారు. కోర మీసం అదనం. మీసం తిప్పి బ్రిటీష్ సైనికుల మీద సమర శంఖం పూరిస్తారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుందని టాక్. మాస్ స్టూడెంట్ ‘మహేశ్‌బాబు చూడటానికి ఎలా ఉంటాడు? మిల్క్‌బాయ్‌లా ఉంటాడు’. ‘ఢీ’ సినిమాలో వచ్చే సరదా సంభాషణ ఇది. నిజమే... మహేశ్ మిల్క్‌బాయ్‌లా పాల బుగ్గలతో కనిపిస్తారు. కెరీర్లో ఫస్ట్ టైమ్ ‘మహర్షి’ సినిమా కోసం గడ్డంలో కనిపించనున్నారు. ఇది చాలదా.. ప్రిన్స్ ఫ్యాన్స్ రెట్టించిన ఉత్సాహంతో థియేటర్ గడప తొక్కడానికి. ఈ సినిమాలో స్టూడెంట్ పోర్షన్ వరకూ మహేశ్ గడ్డంలోనే కనిపిస్తారు. మిగతా సన్నివేశాల్లో క్లీన్ షేవ్‌తో కనిపిస్తారు. ‘మహర్షి’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. మళ్లీ పెంచుతున్నారు మీసాలు మెలేయడం ఎన్టీఆర్‌కు కొత్త కాదు. ‘దమ్ము’లో కోర మీసం తిప్పి ప్రత్యర్థి మీద సవాల్ విసిరారు. ‘నాన్నకు ప్రేమతో’లో ఫారిన్ కుర్రాడిలా కొత్త గడ్డంలో అలరించారు. తాజాగా రాజమౌళి తెరకెక్కించే ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్)లో కూడా ఎన్టీఆర్ గడ్డంతోనే కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం గడ్డం పెంచారాయన. రెట్రో లుక్ లవర్‌బాయ్ నాగచైతన్య కూడా గడ్డం గ్యాంగ్‌కి తోడయ్యారు. కెరీర్లో ఎక్కువ శాతం లవర్‌బాయ్‌లా కనిపించిన చైతూ ‘మజిలీ’లో పూర్తి స్థాయి గడ్డంతో కనిపించనున్నారు. పెళ్లి తర్వాత భార్య సమంతతో చేస్తున్న ఫస్ట్ సినిమా ఇది. సాధారణంగా మాస్ సినిమాల్లో మన హీరోలు ఇలా గుబురు గడ్డంతో కనిపిస్తుంటే చైతన్య క్లాస్ లవ్‌స్టోరీలో గడ్డంతో అభిమానులను అలరించనున్నారు. గేర్ మారింది ఈ మధ్య లవ్‌స్టోరీలు, లైట్‌హార్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమాల మీద శ్రద్ధ పెట్టిన శర్వానంద్ గేర్ మార్చారు. సుధీర్‌వర్మ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం గడ్డం పెంచారు. ఇది పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా. ఇందులో శర్వానంద్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఓ పాత్రలో గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారు ఈ యంగ్ హీరో. డాన్ క్యారెక్టర్ వరకూ గడ్డంతో కనిపిస్తారు. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. గళ్ల లుంగీ.. గుబురు గడ్డం ఈ సంవత్సరం ప్రారంభంలోనే గుబురు గడ్డంతో సందడి చేసిన చిట్టిబాబు గుర్తుండే ఉంటాడు. ‘రంగస్థలం’లో రామ్‌చరణ్ పోషించిన పాత్ర ఇది. గళ్ల లుంగీ, గుబురు గడ్డం, అమాయకత్వమే ఈ పాత్ర ఇంతలా గుర్తుండుపోయేలా చేసింది. ప్రస్తుతం చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోనూ చరణ్ గడ్డంతో కనిపించనున్నారు. కానీ ‘రంగస్థలం’ సినిమాలో అంతలా ఉండకపోవచ్చని సమాచారం. అంతకు మించి.. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కొత్త లుక్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నారు. ‘నేను శైలజా’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో చేసే ‘చిత్రలహరి’లో గడ్డంతో కనిపించనున్నారు ధరమ్‌తేజ్. ఇంతకుముందు కనిపించలేదా? అంటే.. కనిపించారు. అయితే ఈసారి అంతకు మించి. ‘చిత్రలహరి’ ఫుల్ ఎంటర్టైన్మెంట్తో కూడిన చిత్రమని సమాచారం. వీళ్లతో పాటు రెండో సినిమా కోసం మెగా అల్లుడు కల్యాణ్ దేవ్, భిన్న కథాంశాలతోప్రేక్షకులను అలరించే శ్రీవిష్ణు కూడా ఫుల్‌గా గడ్డాలు పెంచేశారు. అలాగే ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో విజయ్ దేవరకొండ గుబురు గడ్డంలో కనిపిస్తారని టాక్. ఇంకొందరు హీరోలు కూడా గడ్డం గ్యాంగ్ లిస్ట్‌లో ఉన్నారు. మరి ఈ గుబ్బురు గడ్డాల హీరోలు థియేటర్లో చేయబోయే సందడి కోసం వెయిట్ చేద్దాం. -
మామకు థ్యాంక్స్ చెప్పిన సమంత
చిట్టిబాబుగా రామ్‌చరణ్, లచ్చిమిగా సమంత నటించిన రంగస్థలం సినిమా ఘనవిజయంతో అటు అభిమానులు, ఇటు తారాగణం సంబరపడిపోతున్నారు. ఈ సినిమాపై ప్రముఖులందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా అక్కినేని నాగార్జున ‘రంగస్థలం’పై ట్విటర్ వేదికగా స్పందించారు. చిత్ర యూనిట్‌తో పాటు కోడలు సమంత నటనను ప్రశంసించారు. ‘నీ నటనతో పాత్రకు ప్రాణం పోశావ్..సినిమా ఆసాంతం చిట్టిబాబులా జీవించావ్’ అంటూ రామ్ చరణ్ ను మెచ్చుకున్నారు. ఇక నా ముద్దుల కోడలు సమంత.. పల్లె పడచులా, పక్కింటి అమ్మాయిలా ఎంత సక్కగున్నదో లచ్చిమి.. అంటూ అభినందించారు. అచ్చమైన పల్లె వాతావరణం తెరపై ఆవిష్కరించడంలో సుకుమార్ సక్సెస్ అయ్యాడంటూ ప్రశంసించారు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ మేకర్స్‌కి శుభాకాంక్షలు తెలిపారు. నాగార్జున ఈ మేరకు సమంతకు ట్వీట్ చేశారు. మావయ్య అభినందనల్ని స్వీకరించిన సమంత.. థాంక్యూ మామా అంటూ రీ ట్వీట్ చేశారు. Take a bow #RamCharan💐you were incredible in #Rangasthalam,you just lived the role and ofcourse dear @Samanthaprabhu2 so very proud of you💐💐💐@aryasukku what a beautiful film you made🙏took us back to our roots @MythriOfficial a big congratulations 👍👍👍👍👍 — Nagarjuna Akkineni (@iamnagarjuna) April 12, 2018 Thankyou maama 🤗🤗 https://t.co/PynNXZhouu — Samantha Akkineni (@Samanthaprabhu2) 12 April 2018 -
‘రంగస్థలం’ నన్ను వెంటాడుతోంది
సాక్షి, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం 1985. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ మాస్ లుక్‌లో దర్శనమివ్వనున్నారు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించారు. ఇందులో రామ్‌చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే ఈ సినిమా ఆడియో, మూవీ రిలీజ్ కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నానని మంచు మనోజ్ ట్వీట్ చేశారు. "నా అన్న రామ్ చరణ్ సాంగ్స్ వినిపించిన దగ్గర నుంచి.. రంగస్థలం నన్ను వెంటాడుతోంది. ఆడియో రిలీజ్, మూవీ కోసం వెయిట్ చెయ్యలేకపోతున్నాను." అంటూ మనోజ్ ట్వీట్ చేశారు. మనోజ్ నటించిన ‘ ఒక్కడు మిగిలాడు’ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. Songs of #Rangasthalam are haunting me since my brother #RamCharan made me hear them. Can't wait for the audio & the movie 🙂 release soon 🙂 pic.twitter.com/fZWiRGf6Ls — Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) November 5, 2017 -
పల్లెటూళ్లో ఫారిన్ గోవిందుడు
రామ్‌చరణ్ తెరంగేట్రం చేసి ఏడేళ్లు. ఇప్పటికి ఆయన నటించిన ఏడు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో మగధీర, రచ్చ, నాయక్, ఎవడు... చిత్రాలు 45 కోట్ల రూపాయల షేర్ వసూలు చేశాయి. నేటి హీరోల్లో ఇది రికార్డే. తండ్రిలా మాస్ పల్స్ ప్రకారం నడవడం వల్లే ఈ క్రెడిట్ సాధించి ఉంటారు చరణ్. ప్రస్తుతం ఆయన కృష్ణవంశీ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. బండ్ల గణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘గోవిందుడు అందరివాడేలే’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఫారిన్లో పెరిగి పల్లెటూరికొచ్చిన ప్రవాసాంధ్రునిగా చరణ్ ఇందులో కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో చరణ్ బాబాయ్‌గా శ్రీకాంత్ కనిపిస్తారు. ఆయనకు జోడీగా కమలినీ ముఖర్జీ నటిస్తున్నారు. తమిళ నటుడు రాజ్‌కిరణ్ ఇందులో చరణ్‌కి తాతగా కథకు కీలకమైన పాత్రను పోషిస్తుండటం విశేషం. కన్యాకుమారి, పొలాచ్చిల్లో భారీ షెడ్యూల్ ముగించుకొని ఈ చిత్రం యూనిట్ హైదరాబాద్ చేరుకుంది. ఏప్రిల్ రెండోవారం నుంచి 40 రోజుల పాటు భారీ షెడ్యూల్ జరుపనున్నారు. నేడు చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేశ్ మాట్లాడుతూ ‘‘కుటుంబ బంధాలు, సంప్రదాయాల నేపథ్యంలో సాగే చక్కని వినోదాత్మక చిత్రంగా కృష్ణవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకూ తీసిన సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. కన్నుల పండువగా ఈ చిత్రం ఉంటుందని నమ్మకంగా చెప్పగలను. చరణ్, కాజల్, శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ, రాజ్‌కిరణ్.. ఇలా తారాగణం అంతా ఎంజాయ్ చేస్తూ నటిస్తున్నారు. ఏప్రిల్ రెండోవారం నుంచి హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశాం. రామానాయుడు సినీ విలేజ్‌లో వేసిన ఇంటి సెట్లోనూ, ఆర్ఎఫ్సీలోనూ ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నాం. ఆ తర్వాత విదేశాల్లో పాటల చిత్రీకరణ ఉంటుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: తమన్. -
మహేష్ పేరుతో ముప్పు!
'ప్రతివాడికి నా పేరుతోనే ప్రాబ్లమా?' అంటాడు ఖలేజా సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు. అవును నిజంగానే ఈ అందగాడి పేరుతో ప్రాబ్లం ఉంది(ట). అసలు మహేష్ పేరు చెబితే చాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తుంది. తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోగా వెలుగొందున్న మహేష్ బ్రాండ్ విలువ ఇతర హీరోల కంటే ఎక్కువే. ఆయన చేస్తున్న వాణిజ్య ప్రకటనలే ఇందుకు నిదర్శనం. ఇక మహేష్ పేరు చుట్టూ తిరిగిన సినిమాలు లేకపోలేదు. 'మహేష్' పేరుతోనే రేపు ఓ సినిమా విడుదల కాబోతోంది. 'దూకుడు' నుంచి మహేష్ మానియా కొనసాగుతోంది. ఆయన పేరు బ్రాండ్‌గా చెలామణి అవుతోంది. అయితే మహేష్ పేరుతో ప్రమాదం కూడా పొంచివుంది అంటోంది సెక్యురిటీ టెక్నాలజీ కంపెనీ అయిన మెక్ ఆఫీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ మహేష్ అని తేల్చింది. మెక్ ఆఫీ జరిపిన అధ్యయనంలో ఈ విషయం రుజువయింది. సెలబ్రిటీల పేరుతో సైబర్ స్పేస్‌లో కలిగిస్తున్న నష్టాన్ని బట్టి ఈ అంచనా వేసింది. ప్రముఖుల పేరుతో వైరస్ వ్యాపింపజేయడం ఇంటర్నెట్లో ఇటీవల బాగా ఎక్కువయింది. ఆ మధ్య అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ పేరుతో ఇ-మెయిల్స్‌కు వైరస్లు పంపిన విషయం మనకు తెలిసిందే. ఈ విషయంలో మహేష్ బాబు ఇండియాలో రెండో స్థానంలో ఉన్నారని మెక్ ఆఫీ అధ్యయనం వెల్లడించింది. సైబర్ స్పేస్‌లో నష్టం కలిగించేందుకు హ్యాకర్లు ఎక్కువగా మహేష్ పేరును వాడుకుంటున్నారని వివరించింది. సినిమా సెలబ్రిటీల పేర్లకు కంప్యూటర్లకు నష్టం కలిగించే సమాచారాన్ని జోడించి ఇంటర్నెట్లో వదులున్నారని తెలిపింది. మహేష్ బాబుతో పాటు పలువురు అగ్రహీరోలు, హీరోయిన్ల పేర్లతో ఆన్లైన్లో ముప్పు పొంచివుందని మెక్ ఆఫీ హెచ్చరించింది. దీనికి సంబంధించిన టాప్ టెన్ జాబితాను ప్రకటించింది. రామ్ చరణ్(2), పవన్ కళ్యాణ్(3), జూనియర్ ఎన్టీఆర్(6), అల్లు అర్జున్(7) ఈ లిస్ట్‌లో ఉన్న మిగతా హీరోలు. హీరోయిన్లు అంజలి(4), ఇలియానా(5), అమలాపాల్(8), కాజల్ అగర్వాల్(10) కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆశ్చర్యకరంగా మహేష్ సరసన నేనొక్కడినే..1లో నటిస్తున్న కృతి సనన్ ఈ లిస్ట్‌లో 9 స్థానంలో నిలిచింది. అభిమానించే హీరో పేర్లతో ఆనందమే కాదు హాని కూడా పొంచివుందని మెక్ ఆఫీ అధ్యయం తేటతెల్లం చేసింది. -
'తుఫాను'కు రక్షణ కల్పించండి: హైకోర్టు
తుఫాను, జంజీర్ సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద రక్షణ కల్పించాలని, భద్రతా చర్యలు తీసుకోవాలని డీజీపీ, హోం శాఖలను హైకోర్టు ఆదేశించింది. తమ చిత్రాన్ని అడ్డుకోకుండా చూడాలని జంజీర్ సినిమా నిర్మాతలు నిన్న హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 6న విడుదల కానున్న జంజీర్, తుఫాన్ సినిమాల ప్రదర్శన కేంద్రాలకు తగిన భద్రత కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రిలయన్స్ బిగ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. ‘విభజన’ ఆందోళన వల్ల ఈ సినిమాల ప్రదర్శనకు ఆందోళనకారులు ఇబ్బందులు సృష్టిస్తే, తాము తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని బుధవారం దాఖలు చేసిన పిటిషన్లో ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శిబాశిష్ సర్కార్ ఆందోళన వ్యక్తం చేశారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను ప్రతివాదులుగా చేర్చారు. చట్ట వ్యతిరేక శక్తులు ఈ సినిమాల ప్రదర్శనను అడ్డుకుంటామని ప్రకటించాయన్నారు.