
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ భారీగా వసూళ్లు సాధిస్తూ రికార్డులు కొల్లగొడుతుంది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. జక్కన్న తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల పర్ఫార్మెన్స్‌కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. వీరిద్దరితో పాటు సినిమాలో చాలా పాత్రలకి మంచి ఆధరణ లభిస్తుంది. వాటిలో ఒకటి మల్లి పాత్ర.
గిరిజన బిడ్డైన మల్లిని బ్రిటిష్ దొరసాని తీసుకెళ్లడంతో సినిమా స్టోరీ మొదలవుతుంది. అక్కడి నుంచి కథను ముందుకు నడిపించే కీలక పాత్రలో మల్లి నటన ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? బ్యాక్‌గ్రౌండ్ అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మల్లి పాత్ర పోషించిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు ట్వింకిల్ శర్మ. ఈమెది ఛండీగర్.
డాన్స్ ఇండియా డాన్స్ రియాలిటీ షోతో గుర్తింపు పొందిన ఆ అమ్మాయి చాలా టీవీ యాడ్స్‌లో నటించింది. ఫ్లిప్ కార్ట్ యాడ్‌లో ఈమెను చూసిన రాజమౌళి ఆడిషన్‌కు పిలిపించి మల్లి పాత్రకు సెలక్ట్ చేశారట. ఇక ఈ చిత్రంలో ‘నన్ను ఈడ ఇడిసిపోకన్న అమ్మా.. యాదికొస్తాంది’ అంటూ మల్లీ చెప్పే డైలాగ్ ఎంతగానో మెప్పించింది.
Comments
Please login to add a commentAdd a comment