తెలుగు సినిమా చరిత్ర సృష్టించిన రోజిది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించడంతో ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగిపోతుంది. నాటునాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు ప్రకటించగానే డాల్బీ థియేటర్ దద్దరిల్లిపోయింది.
రాజమౌళి, ఆయన భార్య రమ సంతోషంతో భావేద్వేగానికి గురయ్యారు. కార్తికేయ దంపతులతో కలిసి గంతులేశారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఆలింగనం చేసుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు, లైవ్‌లో చూస్తున్న భారతీయులు సైతం ఆనందంతో పులకరించిపోయారు.
తెలుగు సినిమా పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం, అవార్డు దక్కించుకోవడం ఇదే తొలిసారి. దీంతో తెలుగువాళ్లతో పాటు భారత సినీ అభిమానులు ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment