oscar award
-
ఆస్కార్-2025 విన్నింగ్ మూవీస్.. ఏది ఏ ఓటీటీలో?
ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల వేడుక.. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈసారి చాలా సినిమాలు పోటీపడ్డాయి గానీ అంతిమంగా విజేతలు ఎవరనేది తేలిపోయింది. ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ (ద బ్రూటలిస్ట్ సినిమా), ఉత్తమ నటిగా మికీ మ్యాడిసన్ నిలిచింది. ఉత్తమ చిత్రంగా అనోరా ఆస్కార్ పురస్కారం దక్కించుకుంది. మరి ఆస్కార్ గెలుచుకున్న సినిమాల్ని ఏ ఓటీటీలో చూడొచ్చంటే?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)ఆస్కార్స్-2025 విజేతల జాబితా - ఓటీటీ డీటైల్స్ఉత్తమ చిత్రం- అనోరా మూవీ - (అమెజాన్ ప్రైమ్)ఉత్తమ నటుడు- అడ్రియన్ బ్రాడీ (ద బ్రూటలిస్ట్ సినిమా -అమెజాన్ ప్రైమ్)ఉత్తమ నటి - మికీ మ్యాడిసన్ (అనోరా మూవీ- అమెజాన్ ప్రైమ్)ఉత్తమ దర్శకుడు - సీన్ బెకర్ (అనోరా సినిమా - అమెజాన్ ప్రైమ్)ఉత్తమ సినిమాటోగ్రఫీ - ద బ్రూటలిస్ట్ (అమెజాన్ ప్రైమ్)బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ మూవీ - నో అదర్ ల్యాండ్ (అమెజాన్ ప్రైమ్)బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ - ఫ్లో (అమెజాన్ ప్రైమ్)బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ సినిమా - ఐ యామ్ స్టిల్ హియర్ (అమెజాన్ ప్రైమ్)బెస్ట్ ఒరిజినల్ స్కోర్ - ద బ్రూటలిస్ట్ (అమెజాన్ ప్రైమ్)బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ - డ్యూన్ పార్ట్ 2 (అమెజాన్ ప్రైమ్)బెస్ట్ సౌండ్ - డ్యూన్ పార్ట్ 2 (అమెజాన్ ప్రైమ్)బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ - సీన్ బీకర్ (అనోరా మూవీ - అమెజాన్ ప్రైమ్)మిగతా విభాగాల్లో ఎవరెవరికి అవార్డులు?ఉత్తమ సహాయ నటుడు - కీరన్ కల్కిన్ (ఏ రియల్ పెయిన్)ఉత్తమ సహాయ నటి – జో సల్దానా (ఎమిలియా పెరెజ్)బెస్ట్ ఒరిజినల్ సాంగ్ – ఎల్ మల్ (ఎమిలియా పెరెజ్)బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే– కాంక్లేవ్బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – అనోరాబెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ – విక్డ్ (పాల్ టేజ్ వెల్)బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ – అనోరాబెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – విక్డ్ బెస్ట్ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్ – పియర్ ఒలివియర్ పర్సిన్, స్టీఫెన్ గులియన్, మారిలిన్ స్కార్సెల్లి (ది సబ్ స్టాన్స్)బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం- ఐ యామ్ నాట్ ఏ రోబోబెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం- ఇన్ ద షాడో ఆఫ్ సైప్రస్బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం- ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రాఈ ఏడాది ఉత్తమ చిత్రం, నటుడు, నటి, దర్శకుడు.. ఇలా దాదాపు విజేతగా నిలిచిన ప్రతి చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్ లోనే స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా) -
Oscar: ఉత్తమ చిత్రం విభాగంలో పోటీపడుతున్న పది చిత్రాలు
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి సమయం దగ్గర పడింది. 97వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో మొత్తం 23 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేయనున్నారు. మార్చి 2న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఈ వేడుక గ్రాండ్‌గా జరగనుంది. దీంతో ప్రస్తుతం హాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్త సినీ ప్రేమికుల చర్చ ఈ అవార్డుల విజేతలు ఎవరు? అనే టాపిక్‌పై జరుగుతోంది.ముఖ్యంగా ఈ ఆస్కార్ అవార్డ్స్‌లో ప్రధాన విభాగమైన ‘ఉత్తమ చిత్రం’ పై ప్రత్యేక చర్చ జరుగుతోంది. వీరి వీరి గుమ్ముడి పండు... ఆస్కార్ విన్ అయ్యేదెవరు? ఉత్తమ చిత్రం ఏది? అనే తరహాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ విభాగంలో పోటీలో ఉన్న పది చిత్రాల గురించి తెలుసుకుందాం.డ్రగ్ లీడర్ ట్రాన్స్‌జెండర్‌గా మారితే...ఈ ఏడాది అత్యధికంగా 13 నామినేషన్లతో అవార్డ్స్ రేసులో దూసుకెళ్తున్న స్పానిష్ మ్యూజికల్ మూవీ ‘ఎమిలియా పెరెజ్’. ఆస్కార్ చరిత్రలో ఇన్ని నామినేషన్స్ దక్కించుకున్న నాన్–ఇంగ్లిష్ ఫిల్మ్‌గానూ ఈ చిత్రం రికార్డును సృష్టించింది. ఈ మూవీలో ఎమిలియాగా నటించిన ట్రాన్స్‌జెండర్ కార్లా సోఫియా గాస్కాన్‌కు బెస్ట్ యాక్ట్రస్ లీడ్ రోల్ నామినేషన్ దక్కింది. ఓ ట్రాన్స్ జెండర్ ఆస్కార్ నామినేషన్‌ను దక్కించుకోవడం కూడా తొలిసారి.ఇంకా 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లోనూ ఈ చిత్రానికి పది నామినేషన్స్ లభించగా, మూడు అవార్డులు వచ్చాయి. వీటిలో ప్రధానమైన ‘బెస్ట్ మోషన్ పిక్చర్’ (మ్యూజికల్ లేదా కామెడీ) అవార్డు కూడా ఉంది. ఇలా అకాడమీ అవార్డ్స్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్‌లో పదికిపైగా నామినేషన్స్ దక్కించుకున్న సినిమా ‘ఎమిలియా పెరెజ్’ కావడం విశేషం. అంతేకాదు... గత ఏడాది మేలో జరిగిన 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘జ్యూరీ ప్రైజ్, బెస్ట్ యాక్ట్రస్ అవార్డ్స్’ వరించాయి. మరి... ఈ ఆస్కార్ అవార్డ్స్‌లో మొత్తం 13 నామినేషన్స్‌లో ఈ మూవీకి ఎన్ని అవార్డులు వస్తాయో చూడాలి.ఇక కథ విషయానికి వస్తే... ఓ మెక్సికన్ డ్రగ్ లార్డ్ తన ఐడెంటిటీని మార్చాలని ఓ లాయర్‌పై ఒత్తిడి తీసుకువస్తాడు. ఆ లాయర్ సాయంతో ట్రాన్స్ జెండర్‌లా మారిపోతాడు. అలాగే తన భార్యాపిల్లల బాగోగుల బాధ్యతలను కూడా ఆ లాయర్‌కే అప్పగిస్తాడు. నాలుగేళ్ల తర్వాత తిరిగి తన కుటుంబాన్ని కలుసుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలోనే తన భార్య మరొకరితో లైఫ్‌ను లీడ్ చేస్తుందని తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను ఏం చేస్తాడు? అన్నదే కథాంశం.జాక్వెస్ ఆడియార్డ్ ఈ సినిమాను అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. ఎమిలియా పెరెజ్గా కార్లా సోఫియా గాస్కాన్ యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. లాయర్‌గా జోయ్ సల్దానా రోల్ కూడా ఏ మాత్రం తీసిపోనిది. గాస్కాన్‌కు ఉత్తమ నటి విభాగంలో, సల్దానాకు ఉత్తమ సహాయ నటి విభాగంలో, జాక్వెస్ ఆడియార్డ్కు ఉత్తమ దర్శకుడి విభాగంలో ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ దక్కాయి. మరి... ఉత్తమ చిత్రంగా ‘ఎమిలియా పెరెజ్’ ఆస్కార్ అవార్డును ఎగరేసుకుపోతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.సెలబ్రిటీ వయసు తగ్గిపోతే...దర్శకురాలు కోరాలీ ఫార్గెట్ డైరెక్ట్ చేసిన అమెరికన్ మూవీ ‘ది సబ్‌స్టాన్స్’ కలెక్షన్స్ పరంగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో ఓ షో సెలబ్రెటీ వ్యాఖ్యాత ఎలిజబెత్‌గా డెమీ మూర్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ చేసింది. వయసు పెరిగిపోయి, స్క్రీన్ ప్రెజెన్స్ సరిగా లేదనే కారణంతో ఓ షో నుంచి ఎలిజబెత్‌ను ఆ షో ప్రొడ్యూసర్ తొలగిస్తాడు. ఆ కోపంలో ఎలిజబెత్ వేగంగా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటుంది. దారిలో ఓ ప్రమాదం జరిగి, ఓ హాస్పిటల్లో జాయిన్ కావాల్సి వస్తుంది.అక్కడ ఆమెకు ఓ నర్సు ఓ ఇంజెక్షన్ ఇస్తుంది. దీంతో తిరిగి ఎలిజబెత్ యవ్వనంలోకి వస్తుంది. కానీ ఆ నర్సు చేసిన ఇంజక్షన్ పవర్ వారం రోజులు మాత్రమే ఉంటుంది. దీంతో ఎలిజబెత్ మరోసారి ఆ సీరమ్‌ను ఎలా ఇంజెక్ట్ చేసుకోగలిగింది? ఆ సీరమ్ లేకపోవడం వల్ల ఎలిజబెత్ ఆహార్యం ఏ విధంగా మారిపోయింది? అనే థ్రిల్లింగ్ అంశాలను ఈ సినిమాలో చూడొచ్చని హాలీవుడ్ మీడియా చెబుతోంది. ఈ ఏడాది మేలో జరిగిన 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగంలో ‘ది సబ్‌స్టాన్స్’ చిత్రానికి అవార్డులు వచ్చాయి. మరి... ఆస్కార్ ఉత్తమ చిత్రం అవార్డు కూడా ‘ది సబ్‌స్టాన్స్’ కి దక్కుతుందా? చూడాలి.పోప్ ఎన్నికరచయిత రాబర్ట్ హారిస్ నవల ‘కాన్క్లేవ్’ (2016) ఆధారంగా అదే టైటిల్‌తో పీటర్ స్టృగన్ రాసిన స్టోరీ ఆధారంగా ఎడ్వర్డ్ బెర్గర్ డైరెక్షన్ చేసిన పోలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘కాన్క్లేవ్’. యూఎస్ఏ, యూకే బాక్సాఫీస్‌ల వద్ద ఈ మూవీ సూపర్ వసూళ్లను రాబట్టుకోగలిగింది. రాల్ఫ్ ఫియన్నెస్, స్టాన్లీ టుస్సీ, జాన్ లిత్గో, ఇసాబెల్లా రోసెల్లిని ఈ మూవీలోని ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. కేవలం రెండు గంటల నిడివి మాత్రమే ఉండే ఈ మూవీ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది.కథలోని థ్రిల్స్, ట్విస్ట్‌లు ఆడియన్స్‌ను ఆశ్చర్యపరుస్తాయి. థామస్ లారెన్స్ పాత్రలో రాల్ఫ్ ఫియన్నెస్ యాక్టింగ్‌ను ఆడియన్స్‌ను గుర్తుపెట్టుకుంటారు. ఇక స్టోరీ విషయానికి వస్తే... ప్రస్తుత పదవిలో ఉన్న పోప్ జాన్ పాల్ 2 హార్ట్ఎటాక్తో చనిపోతారు. దీంతో నెక్ట్స్ అధికారంలోకి రావాల్సిన పోప్ గురించి ఎన్నిక జరుగుతుంది.ఓ భవనంలో ఈ ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్న ఆసక్తికర అంశాలతో ఈ మూవీ సాగుతుంది. రాజకీయం, నమ్మకం, విశ్వాసం... అనే మూడు ప్రధాన అంశాలతో ఈ మూవీ కథనం నడుస్తుంది. ఈ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో బెస్ట్ స్క్రీన్‌ప్లే అవార్డు వచ్చింది. బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఫిల్మ్, అవుట్ స్టాండింగ్ బ్రిటిష్ ఫిల్మ్’ వంటి అవార్డులు వచ్చాయి. మరి... ఆస్కార్ ఉత్తమ చిత్రం అవార్డు ‘కాన్క్లేవ్’ను వరిస్తుందా?... చూడాలి.డైలాన్ గోస్ ఎలక్ట్రికల్అమెరికన్ ప్రముఖ సింగర్, సాంగ్ రైటర్ బాబ్ డైలాన్ బయోగ్రాఫికల్ మ్యూజికల్ డ్రామా ‘ఎ కంప్లీట్ అన్నోన్’. ఎలిజా వాల్డ్ రాసిన ‘డైలాన్ గోస్ ఎలక్ట్రిక్!’ బుక్ ఆధారంగా ఈ మూవీని డైరెక్ట్ చేశారు జేమ్స్ మాంగోల్డ్. బాబ్ డైలాన్ ఎవరిని స్ఫూర్తిగా తీసుకుని మ్యూజిక్ రంగంలోకి వచ్చారు? ఆయన వృత్తి–వ్యక్తిగత జీవితాల్లో ఎత్తుపల్లాలు... వంటి అంశాల నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. ఈ మూవీలో బాబ్ డైలాన్గా తిమోతి అద్భుతంగా నటించారు. ఎడ్వర్ట్ నార్టన్, ఎల్లే ఫ్యానింగ్, మోనికా బార్భారో, బోయ్డ్ హోల్‌బ్రూక్, స్కూట్ మైక్నైరీ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ మూవీ ఉత్తమ చిత్రంతో పాటు మొత్తంగా 8 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్‌ను దక్కించుకుంది. మరి...ఫైనల్‌గా ఎన్ని అవార్డులు వస్తాయో చూడాలి.ఆసాధారణ పోరాటంఅదృశ్యమైన తన భర్త ఆచూకీ, ఫ్యామిలీ సంరక్షణ కోసం ఓ మహిళ చేసే అసాధారణ పోరాటం నేపథ్యంలో సాగే పోలిటికల్ బయోగ్రాఫికల్ డ్రామా ‘ఐయామ్ స్టిల్ హియర్’. ఈ సినిమాలోని మెయిన్ లీడ్ యూనిస్ పైవా పాత్రలో బ్రెజిలియన్ నటి ఫెర్నాండా టోరెస్ తన నటనతో ఆడియన్స్‌ను కట్టిపడేశారు. ఈ సినిమాలోని ఆమె నటనకు యాక్టింగ్‌లో విభాగంలో ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్ కూడా దక్కింది. అలాగే బెస్ట్ పిక్చర్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగాల్లోనూ ఈ చిత్రానికి నామినేషన్స్ దక్కాయి.ఈ సినిమాను వాల్టెర్ సల్లెస్ డైరెక్ట్ చేశారు. బ్రెజిలియన్ రచయిత మార్సెలో రూబెన్స్ పైవా రాసిన ‘ఐయామ్ స్టిల్ హియర్’ బుక్ ఆధారంగా ఈ సినిమా తీశారు. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే. ఆస్కార్ చరిత్రలో ఓ బ్రెజిలియన్ నిర్మించిన మూవీ ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్ దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఒకవేళ ఈ సినిమాకు అవార్డు వస్తే అది ఆస్కార్ హిస్టరీలో ఓ రికార్డుగా నిలిచిపోతుంది.ఓ ఆర్కిటెక్ట్ వలస జీవితంఆస్కార్ అవార్డ్స్లోని ప్రధాన విభాగాలైన ‘ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు’ నామినేషన్స్‌తో సహా మొత్తం పది నామినేషన్లతో అందరి దృష్టినీ ఆకర్షించింది ‘ది బ్రూటలిస్ట్’ చిత్రం. బ్రాడీ కార్బెట్ డైరెక్షన్‌లోని ఈ పీరియాడికల్ ఫిల్మ్‌లో అడ్రియన్ బ్రోడీ, ఫెలిసిటీ జోన్స్, గై పియర్స్, జో ఆల్విన్లు ప్రధాన పాత్రల్లో నటించారు.కొన్ని కారణాల వల్ల కుటుంబానికి దూరమై, యూరప్ నుంచి అమెరికా వలస వెళ్లిన ఓ ప్రతిభావంతుడైన ఆర్కిటెక్ట్ అక్కడ ఎలాంటి కష్టాలు అనుభవించాడు? ఎలాంటి అవమానాలను ఎదుర్కొని, తిరిగి తన వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని ఎలా పునరుద్ధరించుకోగలిగాడు? తన భార్యను మళ్లీ తిరిగి ఏ విధమైన పరిస్థితుల్లో కలుసుకోగలిగాడు? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఆర్కిటెక్ట్‌గా అడ్రియన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.78వ బ్రిటిష్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్‌లో ఈ చిత్రం నాలుగు అవార్డులను దక్కించుకుంది. అలాగే ఈ ఏడాది జరిగిన 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ప్రధాన విభాగమైన ‘బెస్ట్ మోషన్ పిక్చర్’ అవార్డుతో కలిపి మూడు అవార్డులను గెలుచుకుంది. ఇంకా 2024లో విడుదలైన అమెరికన్ ఫిల్మ్స్ టాప్ టెన్‌లో ‘ది బ్రూటలిస్ట్’ చిత్రం కూడా ఒకటి. మరి... ఈ ‘ది బ్రూటలిస్ట్’ ఆస్కార్ ఉత్తమ చిత్రంగా నిలుస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అనోరా ప్రేమకథ న్యూయార్క్‌లోని క్లబ్లో అనోరా ఓ వేశ్యగా పని చేస్తుంటుంది. సంపన్న కుటుంబానికి చెందిన ఓ అబ్బాయి అనోరాను ఇష్టపడతాడు. అనోరా కూడా ఆ అబ్బాయితో ప్రేమలో పడుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఇంతలో ఈ విషయం మెక్సికోలో ఉన్న అబ్బాయి తండ్రికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనోరా జీవితం ఏ విధంగా ప్రభావితమైంది? అన్నది క్లుప్తంగా ‘అనోరా’ సినిమా కథాంశం. అనోరాగా టైటిల్ రోల్లో మైకీ మాడిసన్ పెర్ఫార్మెన్స్ను ఇరగదీశారు.ఈ నటన ఆమెకు ఆస్కార్ నామినేషన్‌ను కూడా తెచ్చిపెట్టింది. మాడిసన్ నుంచి మంచి నటనను రాబట్టుకున్న ఈ చిత్రదర్శకుడు సీన్ బేకర్‌కు కూడా ఆస్కార్ దర్శకుడి విభాగంలో నామినేషన్ దక్కింది. గత ఏడాది జరిగిన కాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మకమైన ఫామ్ డిఓర్ అవార్డు ఈ అమెరికన్ ‘అనోరా’ సినిమాకు దక్కింది. మరి... ఆస్కార్ ఉత్తమ చిత్రంగా అనోరా అవార్డును గెలిచి, ఔరా... అనిపిస్తుందా? ఏమో చూడాలి.ఇద్దరు మిత్రులుఉత్తమ చిత్రం విభాగంతో పాటు పది నామినేషన్స్‌ను సొంతం చేసుకుంది అమెరికన్ మ్యూజికల్ ఫాంటసీ మూవీ ‘వీకెడ్’ . స్టీఫెన్ స్క్వార్ట్జ్- విన్నీ హోల్జ్మ్యాన్ల స్టేజ్ షో ‘వికెడ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ది విచెస్ ఆఫ్ ఓజ్’ అనే స్టేజీ డ్రామా ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. జాన్.ఎమ్.చు ఈ సినిమాకు దర్శకుడు. సింథి యా ఎరివో, అరియానా గ్రాండే, జోనాథన్ బెయిలీ ఈ సినిమాలో లీడ్ రోల్స్ చేశారు.ఇద్దరు స్నేహితుల మధ్య ఏర్పడిన అపార్థాలు, వారి జీవితాలను ఎలా ప్రభావితం చేశాయి? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఎల్ఫాబాగా సింథియా, గ్లిండాగా అరియానాలు ఇద్దరు మంచి నటనను కనబరిచారు. సింథియాకు ఉత్తమ నటి విభాగంలో నామినేషన్ దక్కగా, అరియానాకు ఉత్తమ సహాయ నటిగా నామినేషన్ దక్కింది. వీరి స్నేహానికి ఆస్కార్ ఉత్తమ చిత్రం అవార్డు వరిస్తుందా? ఆస్కార్ ఓటర్స్‌ను మెప్పించిందా? చూడాలి.స్నేహం కోసం...అమెరికన్ నవలా రచయిత కోల్సన్ వైట్‌హెడ్ రాసిన ‘ది నికెల్ బాయ్స్’ పుస్తకం ఆధారంగా రూపోందిన అమెరికన్ హిస్టారికల్ మూవీ ‘నికెల్ బాయ్స్’. రామెల్ రాస్ డైరెక్ట్ చేశారు. ఏతాన్ హెరిస్సే, బ్రాండన్ విల్సన్ నటించారు. ఉన్నత చదువులు చదవాలనుకున్న ఎల్వుడ్ (ఏతాన్) ఓ శిక్ష కారణంగా కఠినమైన నిబంధనలు ఉన్న ఓ కళాశాలకు వెళ్తాడు. అక్కడ టర్నర్ (బ్రాండన్)తో స్నేహం ఏర్పడుతుంది. ఆ తర్వాత వీరిద్దరి స్నేహం,చదువు, వీరి జీవితాలు ఏమయ్యాయి? అన్నదే ఈ చిత్రకథ. ఈ నికెల్ బాయ్స్ ఆస్కార్ బెస్ట్ పిక్చర్స్‌తో పాటు, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే విభాగంలోనూ నామినేషన్స్ దక్కించుకుంది. పగ... ప్రేమ2021లో వచ్చిన అమెరికన్ ఫిల్మ్ ‘డ్యూన్’కు సీక్వెల్‌గా గత ఏడాది ‘డ్యూన్ పార్టు 2’ వచ్చింది. తిమోతీ, జెండయా, ఫెర్గుసన్ ప్రధాన పాత్రలు పోషించారు. తొలి భాగం తీసిన డెనీ విల్నేవ్యే రెండో భాగాన్ని కూడా డైరెక్ట్ చేశారు. శత్రువుల చేతిలో తండ్రి మరణించిన తర్వాత తల్లి జెస్సికా (రెబెక్కా ఫెర్గూసన్)తో మరో గ్రహానికి వస్తాడు పాల్ అట్రీడియస్ (తిమోతీ). తమ రక్షకుడి కోసం ఆ గ్రహం వాసులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తుంటారు. ఇదే అదునుగా తన కొడుకు అట్రిడియస్యే ఆ రక్షకుడు అని, ఆ గ్రహం వాసులను నమ్మించేందుకు ప్రయత్నిస్తుంది జెస్సికా.కానీ ఇది అట్రీడియస్‌కు ఇష్టం ఉండదు. పైగా చాని(జెండయా)తో ప్రేమలో పడతాడు. ఈ లోపు తన తండ్రిని చంపినవారే, అట్రిడియస్కి మళ్లీ తారసపడతారు. మరి... అట్రిడియస్ పగ తీర్చుకున్నాడా? అన్నది ‘డ్యూన్ 2’ స్టోరీ. ఈ సినిమాకు ఐదు ఆస్కార్ నామినేషన్స్ దక్కాయి. వీటిలో ఉత్తమ చిత్రం విభాగం కూడా ఉంది. ఇక ఫ్రాంక్ హార్బెర్ట్ రాసిన ‘డ్యూన్’ పుస్తకం ఆధారంగా ‘డ్యూన్’ ఫ్రాంచైజీ సైన్స్‌ఫిక్షన్ మూవీస్ రూపోందుతున్న సంగతి తెలిసిందే. ఈ పది చిత్రాల్లో ఆస్కార్ ఉత్తమ చిత్రంగా ఏ మూవీ నిలుస్తుందనే ప్రశ్నకు వచ్చే నెల 2న తెరపడుతుంది. – ముసిమి శివాంజనేయులు -
ఆస్కార్ నామినేషన్స్‌లో ప్రియాంక చోప్రా చిత్రం.. ఏ విభాగంలో అంటే?
ఈ ఏడాది జరగనున్న 97వ ఆస్కార్ నామినేషన్స్‌లో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చిత్రం స్థానం దక్కించుకుంది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్స్‌లో నిలిచింది. తాజాగా ప్రకటించిన ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్‌లో అనూజ చిత్రం పోటీ పడుతోంది. గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే తొమ్మిదేళ్ల బాలిక జీవితంగా ఆధారంగా ఈ మూవీని గునీత్ మోంగా, ప్రియాంక చోప్రా నిర్మాతలుగా తెరకెక్కించారు. దీంతో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో డోవ్ కోట్, ది లాస్ట్ రేంజర్, ది లియోన్, ది మ్యాన్ వు కుడ్నాట్ రిమేన్ సైలెంట్ చిత్రాలతో పోటీపడనుంది. ఈ కేటగిరీలో దాదాపు 180 సినిమాలు పోటీ పడగా..ఈ ఐదు చిత్రాలు నిలిచాయి. కాగా.. ప్రియాంక చోప్రా నిర్మాతగా తెరకెక్కించిన అనూజ షార్ట్ ఫిల్మ్ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. కంగువా, ది గోట్ లైఫ్ చిత్రాలకు నిరాశ.. Short on time, big on talent, here are this year's nominees for Live Action Short Film. #Oscars pic.twitter.com/Wx0TZIpUen— The Academy (@TheAcademy) January 23, 2025 -
వందో ఆస్కార్‌కి నాలుగు వేల కోట్లు!
ఆస్కార్ శతాబ్ది ఉత్సవాల (ఆస్కార్ అవార్డుల వందో వేడుక) సన్నాహాలు మొదలయ్యాయి. 2028లో జరగనున్న ఈ వేడుకల కోసం ఆస్కార్ నిర్వాహకులు ఇప్పట్నుంచే ప్రణాళికలు వేస్తుండటం హాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ‘ఆస్కార్ 100’ పేరిట ఈ వేడుకలు జరగనున్నట్లుగా రోమ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆస్కార్ ప్రతినిధులు వెల్లడించారు. ‘‘ఆస్కార్ 100’ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నాం.ఇందుకోసం 500 మిలియన్ డాలర్ల క్యాంపైన్ (దాదాపు రూ. నాలుగు వేల కోట్లు)ను లక్ష్యంగా పెట్టుకున్నాం. గత ఏడాదిన్నరలో ఇప్పటికే ‘ఆస్కార్ 100’ కోసం వంద మిలియన్ డాలర్లను సేకరించాం. ‘ఆస్కార్ 100’ ఈవెంట్‌ను వినూత్నంగా ప్లాన్ చేస్తున్నాం. ఈ వేడుకల సందర్భంలోనే మరో వంద సంత్సరాల పాటు ఆస్కార్ అవార్డు వేడుకలను ఎలా నిర్వహించాలనే విషయాలను చర్చించుకుని, ఓ అవగాహనకు రావాలనుకుంటున్నాం’’ అని ఆస్కార్ కమిటీ ప్రస్తుత సీఈవో బిల్ క్రామోర్ చెప్పుకొచ్చారు. ఇక 97వ ఆస్కార్ అవార్డుల వేడుకలు వచ్చే ఏడాది మార్చి 2న జరగనున్న విషయం తెలిసిందే. -
భర్త డైరెక్షన్లో ఎమ్మా మరో సినిమా.. మళ్లీ ఆస్కార్ వచ్చేనా?
హాలీవుడ్‌కి చెందిన క్రేజీ కపుల్స్‌లో డేవ్ మెక్ క్యారీ, ఎమ్మా స్టోన్ జోడీ ఒకటి. దర్శక–రచయిత, హాస్య నటుడు డేవ్, నటి ఎమ్మా 2016లో ప్రేమలో పడి, 2020లో పెళ్లి చేసుకున్నారు. 2021లో వీరికో పాప పుట్టింది. వ్యక్తిగత జీవితం జోష్‌గా ఉన్న నేపథ్యంలో గత నెల 10న జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకలో ‘పూర్ థింగ్స్’ చిత్రానికి గాను ఎమ్మా స్టోన్ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. 2016లో ఉత్తమ నటిగా ‘లా లా ల్యాండ్’ చిత్రానికి ఆస్కార్ అందుకున్న ఎమ్మాకి ‘పూర్ థింగ్స్’తో మరో అవార్డు దక్కింది. ఈ చిత్రానికి డేవ్, ఎమ్మా కూడా నిర్మాతలు. రెండోసారి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు అందుకున్న ఆనందంలో ఉన్న ఎమ్మా స్టోన్‌కి మరో మంచి సినిమా ఇవ్వాలని డేవ్ మేక్ క్యారీ ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించాలని కూడా అనుకుంటున్నారట. దర్శకుడిగా డేవ్‌కి ‘బ్రిగ్స్బీ బియర్’ (2017) తొలి చిత్రం. ఆ తర్వాత మరో సినిమాకి మెగాఫోన్ పట్టలేదు. ఇప్పుడు భార్య కోసం మళ్లీ డైరెక్టర్‌గా స్టార్ట్, కెమెరా, యాక్షన్ చెప్పడానికి రెడీ అయ్యారు డేవ్. -
Oscars 2025: 97వ ఆస్కార్ అవార్డుల డేట్ ఫిక్స్
తొంభైఆరవ ఆస్కార్ అవార్డుల వేడుక పూర్తయి నెల రోజులు మాత్రమే అవుతోంది (మార్చి 10న 96వ ఆస్కార్ అవార్డుల వేడుక జరిగింది). కానీ ఆస్కార్ అకాడమీ మాత్రం అప్పుడే 97వ ఆస్కార్ అవార్డుల వేడుకను గురించిన వివరాలను అధికారికంగా ప్రకటించింది. 2025 మార్చి 2న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ అట్మాస్ థియేటర్లో 97వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరపనున్నట్లు ఆస్కార్ నిర్వాహకులు వెల్లడించారు. అలాగే వచ్చే ఏడాది జనవరి 17న ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్ వివరాలను ప్రకటించనున్నట్లుగా కూడా తెలిపారు. ఇక ఈ ఏడాది నవంబరు 17న ఆస్కార్ గవర్నర్స్ అవార్డుల విజేతల ప్రకటన ఉంటుందని, డిసెంబరు 17న ఆస్కార్ షార్ట్‌లిస్ట్ జాబితాను వెల్లడిస్తారని, ఫిబ్రవరి 8తో ఫైనల్ ఓటింగ్ గడువు ముగుస్తుందని సమాచారం. -
ఓటీటీకి ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టిన మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇటీవల ప్రకటించిన 96వ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో ఈసారి 'ఓపెన్ హైమర్' సత్తా చాటింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ప్రధాన విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు క్లాసిక్స్ తీసిన ఇతడు.. తొలిసారి 'ఓపెన్ హైమర్' అనే బయోపిక్ తీశాడు. దాదాపు మూడేళ్ల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. ఇప్పుడు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. దాదాపు ఎనిమిది సార్లు నామినేషన్స్‌లో ఉన్న ఆయన.. తొలిసారి ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అందుకున్నాడు. తాజాగా ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీకి స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. ఆస్కార్‌లో అవార్డులు కొల్లగొట్టిన ఓపెన్ హైమర్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. కానీ రెంటల్ విధానంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ఇక నుంచి జియో సినిమాలో ఉచితంగానే చూసేయొచ్చు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. Keep the awards season spirit alive by binge-watching these cult movies! 🏆✨ Get ready to witness the cinematic phenomenon of Oppenheimer, streaming on #JioCinema March 21 onwards. pic.twitter.com/PUBSIFn94m — JioCinema (@JioCinema) March 18, 2024 -
ఫీల్డ్ ఆఫ్ డ్రీమ్స్ ఫార్మాట్లో ఆస్కార్
ఆస్కార్ అవార్డు వేడుకలను వీలైనంత ఎక్కువమంది వీక్షకులకు చేరువ చేయాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉంటుంది ఆస్కార్ అవార్డు కమిటీ. ఇందులో భాగంగా ఈ ఏడాది ‘ఫీల్డ్ ఆఫ్ డ్రీమ్స్’ ఫార్మాట్‌ను పునరుద్ధరించాలని అనుకుంటోందట. అప్పటి వరకూ జరిగిన అవార్డు వేడుకల్లో ఆస్కార్ గెలుచుకున్న ఐదుగురు స్టార్స్ తాజా వేడుకలో పాల్గొని, విజేతలను ప్రకటించి, అవార్డును ప్రదానం చేయడమే ఈ ఫార్మాట్ ఉద్దేశం. గతంలో (2009) జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకలో ఈ విధానాన్ని పాటించారు. ‘ఫీల్డ్ ఆఫ్ డ్రీమ్స్’ పేరిట అప్పటి అవార్డు వేడుకలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఆ తర్వాత జరిగిన వేడుకల్లో ఈ ఫార్మాట్‌ని ఫాలో కాలేదు. పదిహేనేళ్లకు ఈసారి ఈ విధానాన్ని పునరుద్ధరించాలని కమిటీ భావిస్తోందట. మాజీ ఆస్కార్ విజేతలు తాజా విజేతలను ప్రకటించి, అవార్డును ప్రదానం చేయడం అనేది చూడ్డానికి కనువిందుగా ఉందని 2009లో జరిగిన అవార్డు వేడుకలో పలువురు పేర్కొన్నారు. వీక్షకుల నుంచి కూడా మంచి స్పందన వచ్చిందట. కాగా, కరోనా తర్వాత ఆస్కార్ అవార్డు వేడుకల వీక్షకుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టిందని హాలీవుడ్ అంటోంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ సంఖ్యలో వీక్షకులను రాబట్టడానికి గతంలో సక్సెస్ అయిన ఈ ఫార్మాట్‌ని పునరుద్ధరించాలని కమిటీ భావించిందని హాలీవుడ్ భోగట్టా. అయితే ఈ ‘ఫీల్డ్ ఆఫ్ డ్రీమ్స్’ నటీనటుల విభాగానికి మాత్రమే వర్తిస్తుంది. ఇక ఈ నెల 10న లాస్ ఏంజిల్స్‌లో (భారత కాలమానం ప్రకారం మార్చి 11) ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. మూడేళ్లుగా వ్యాఖ్యాతగా వ్యవహరించిన జిమ్మీ కెమ్మెల్ ఈసారీ ఆ బాధ్యతను నిర్వర్తించనున్నారు. మరి.. వార్తల్లో ఉన్నట్లుగా ‘ఫీల్డ్ ఆఫ్ డ్రీమ్స్’ ఫార్మాట్‌ని కమిటీ రీ విజిట్ చేసిందా? లేదా అనేది ఆ రోజు తెలిసిపోతుంది. -
బాఫ్టాలో మెరిసిన దీపికా పదుకోన్
ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ‘ఒప్పెన్ హైమర్’ చిత్రానికి అవార్డుల పంట పండింది. లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్లో 77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డుల (బాఫ్టా) ప్రదానోత్సవం ఆదివారం రాత్రి జరిగింది. దేశం నుంచి దీపికా పదుకోన్ ఈ వేడుకల్లో పాల్గొని, ‘నాన్ ఇంగ్లిష్’ విభాగంలో ఉత్తమ చిత్రానికి (ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్) అవార్డు అందజేశారు. ఇక ‘భాఫ్టా’లో ‘ఒప్పెన్ హైమర్’ చిత్రం ఏడు విభాగాల్లో పురస్కారాలు అందుకుని సత్తా చాటింది. అవార్డులతో ‘ఒప్పెన్ హైమర్’ టీమ్ ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు, సహాయనటుడు, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ విభాగాల్లో ‘ఒప్పెన్ హైమర్’కి అవార్డులు దక్కాయి. క్రిస్టోఫర్ నోలన్‌కు దర్శకుడిగా దక్కిన తొలి బాఫ్టా అవార్డు ఇది. ఇప్పటికే అత్యధిక గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకున్న ‘ఒప్పెన్ హైమర్’ చిత్రం తాజాగా బాఫ్టాలో ఏడు పురస్కారాలు దక్కించుకుని, వచ్చే నెలలో జరిగే ఆస్కార్ రేసులో 13 విభాగాల్లో పోటీలో ఉంది. ఇక ‘బాఫ్టా’లో ‘ఒప్పెన్ హైమర్’ తర్వాత ‘పూర్ థింగ్స్’ మూవీ అధికంగా ఐదు (కాస్ట్యూమ్, మేకప్, హెయిర్–స్టైలింగ్,ప్రోడక్షన్, స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో) అవార్డులను పొందింది. ఆ తర్వాత ‘ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ సినిమాకి మూడు పురస్కారాలు దక్కాయి. భారతీయత ఉట్టిపడేలా... ‘భాఫ్టా’ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రజెంటర్‌గా వ్యవహరించిన దీపికా పదుకోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొలి భారతీయ నటి దీపికా కావడం విశేషం. ఈ వేదికపై భారతీయత ఉట్టిపడేలా చీరలో మెరిశారు దీపికా పదుకోన్. ‘చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంది’ అనే ప్రశంసలు ఈ బ్యూటీ సొంతమయ్యాయి. ఈ వేడుకలో బ్యాక్ స్టేజీలో దీపికా దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే అంతర్జాతీయ సినీ వేడుకల్లో దీపికా పదుకోన్ పాల్గొనడం ఇది రెండోసారి. గతేడాది జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో దీపిక ప్రజెంటర్‌గా వ్యవహరించారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటను ఆమె ఆస్కార్ వేదికపై పరిచయం చేశారు. -
ఆస్కార్ బరిలో చిన్న సినిమా.. అవార్డ్ దక్కేనా?
కేరళ వరదల నేపథ్యంలో రూపొందించిన చిత్రం 2018. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. చిన్న సినిమాగా వచ్చి భారీ వసూళ్లు సాధించింది. అయితే తాజాగా ఈ చిత్రం భారత్ తరఫున ప్రతిష్టాత్మక ఆస్కార్ రేసులో నిలిచింది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మలయాళంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. (ఇది చదవండి: 2018 మూవీ రివ్యూ) ఆంథోని జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం కేవలం మౌత్ టాక్‌తోనే భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషించారు. 2024 ఆస్కార్ అకాడమీ అవార్డులకు భారతదేశం అధికారిక ఎంట్రీ చిత్రంగా ఎంపిక చేసినట్లు కన్నడ చిత్ర దర్శకుడు గిరీష్ కాసరవల్లి నేతృత్వంలోని జ్యూరీ ప్రకటించింది. నామినేషన్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంటేనే ఈ చిత్రం అవార్డుకు అర్హత సాధిస్తుంది. కాగా.. 96వ ఆస్కార్ వేడుకలు మార్చి 10, 2024న లాస్ ఏంజెల్స్ డాల్బీ థియేటర్లో జరగనున్నాయి. (ఇది చదవండి: ఈ అమ్మాయి ఎవరో తెలుసా?.. ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్!) ఆస్కార్-2023 ఏడాదిలో ఎంట్రీకి ఛెలో షో (2022), కూజాంగల్ (2021), జల్లికట్టు (2020), గల్లీ బాయ్ (2019), విలేజ్ రాక్‌స్టార్స్ (2018), న్యూటన్ (2017), విసరాని (2016) చిత్రాలు ఎంపిక కాగా.. ఏది ఎంపిక అవ్వలేదు. ఇప్పటివరకు మదర్ ఇండియా, సలామ్ బాంబే, లగాన్ చిత్రాలు మాత్రమే ఆస్కార్‌కు నామినేట్ భారతీయ సినిమాలుగా నిలిచాయి. ఆస్కార్ 2023లో ఇండియా సినిమాలు రెండు అవార్డులను గెలుచుకుని చరిత్ర సృష్టించాయి. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ రాగా.. డాక్యుమెంటరీ ఫిల్మ్ ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. కార్తికీ గోన్సాల్వేస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో దక్కించుకుంది. -
నాటు నాటుకి అమెరికన్ యువత స్టెప్పులు
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గౌరవార్థం అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ ఏర్పాటు చేసిన అధికారిక విందు సరదా సంభాషణలతో సందడిగా సాగింది. వైట్‌హౌస్ నార్త్ లాన్లో గురువారం రాత్రి ఈ విందుకు 400 మందికిపైగా అతిథుల్ని ఆహ్వానించారు. పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, ఆనంద్ మహేంద్ర, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తదితరులు ఈ విందుకి హాజరయ్యారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ విందులో అధ్యక్షుడు బైడెన్ ప్రధాని మోదీతో సరదా సంభాషణలతో నవ్వులు పూయించారు. విందులో టోస్ట్ (ఆరోగ్యం కోసం తీసుకునే ఒక పెగ్గు ఆల్కహాల్) సంప్రదాయం గురించి బైడెన్ మాట్లాడుతూ ‘‘మిస్టర్ పీఎం మీరు ఎవరికైనా టోస్ట్ అందించాలనుకుంటే మీ చేతి గ్లాసులో ఆల్కహాల్ లేకపోతే ఎడమ చేత్తో వారికి ఇవ్వాలి. ఈ విషయాన్ని మా తాతయ్య చెప్పేవారు’ అని బైడెన్ అంటే మోదీ చిరునవ్వులు చిందించారు. బైడెన్, మోదీ ఇద్దరూ ఆల్కహాల్ తీసుకోరు. దీంతో అందరూ ఫక్కున నవ్వేశారు. బైడెన్ ఆతిథ్యానికి అతిథులందరూ ఫిదా అయిపోయి పాటలు పాడాలని అనుకుంటారని మోదీ అన్నారు. 2014లో అమెరికాకు వచ్చినప్పుడు నవరాత్రుల సందర్భంగా ఉపవాసం ఉండడంతో ఏమీ తినలేదని, అప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉన్న బైడెన్ తనని బాగా ఆకలేస్తే ఏదో ఒకటి తినాలని ఆప్యాయంగా అడిగేవారని గుర్తు చేసుకున్నారు. తాను తినాలన్న బైడెన్ కోరిక ఇప్పుడు నెరవేరిందన్నారు. అతిధులందరూ ఆరోగ్యం కోసం ఆల్కహాల్ తీసుకోవాలంటూ మోదీ స్వయంగా టోస్ట్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్, అమెరికా మధ్య బంధాల బలోపేతంలో ప్రవాస భారతీయులు పోషిస్తున్న పాత్రను కొనియాడారు. ‘భారతీయులు, అమెరికన్లు ఒకరినొకరు పూర్తిగా తెలుసుకుంటున్నారు. భారత్‌లో పిల్లలు హాలోవిన్ వేడుకల్ని చేసుకుంటూ స్పైడర్ మ్యాన్‌ను చూసి పులకించిపోతూ ఉంటే, అమెరికన్ యువత తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్లో ఆస్కార్ అవార్డు దక్కించుకున్న నాటు నాటు పాటకి స్టెప్పులేస్తున్నారు’అని ప్రధాని పేర్కొన్నారు. అధికారిక విందులో మెనూ..! ప్రధాని కోసం ప్రత్యేకంగా శాకాహారం, తృణధాన్యాలతో చేసిన వంటలను దగ్గరుండి మరీ జిల్ బైడెన్ వడ్డించారు. మారినేటెడ్ మిల్లెట్స్, గ్రిల్డ్ మొక్కజొన్న సలాడ్, పుచ్చకాయ జ్యూస్, అవకాడో సాస్, స్టఫ్డ్ మష్రూమ్స్, క్రీమీ రిసొట్టో, లెమన్ డిల్ యోగర్ట్ సాస్ వంటివి ప్రత్యేకంగా వడ్డించారు. -
అత్యధిక సంఖ్యలో ఆస్కార్లు గెలుచుకున్న టాప్ 10 నటులు
-
ఆస్కార్ తీసుకునే రోజు ఏం జరిగిందో చెప్తూ ఎమోషనల్ అయిన కీరవాణి
-
వరంగల్ స్టూడెంట్ ఇవాళ ఆస్కార్‌ను తీసుకొచ్చాడు: అల్లు అరవింద్
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ప్రపంచాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది లాస్ ఎంజిల్స్ వేదికగా జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ అవార్డ్ దక్కింది. దీంతో టాలీవుడ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రబృందాన్ని ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. హైదరాబాద్‌లోని శిల్పాకళావేదికపై ఆర్ఆర్ఆర్ టీంకు అభినందన సభ నిర్వహించారు. ఈ వేడుకలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ. 'కలలో కూడా కనలేని ఆస్కార్ ఈ రోజు రాజమౌళి టీం వల్ల సాధ్యమైంది. క్షణక్షణం నుంచి మొదలైన కీరవాణి ప్రస్థానం ఈ రోజు ఆస్కార్ అందుకునే స్థాయికి వచ్చింది. వరంగల్‌లో చదువుకుంటున్న ఒక స్టూడెంట్ ఈ రోజు ఎక్కడో ఉన్న ఆస్కార్‌ను తీసుకొచ్చాడు. అతనే చంద్రబోస్. ఈ రోజు తెలుగు సినిమా అంటే అందరూ తిరిగి చూసే స్థాయికి తీసుకొచ్చారు. రాజమౌళి చిత్రబృందం తెలుగు సినిమాస్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది. చంద్రబోస్ మాట్లాడుతూ..' సినీ ఇండస్ట్రీ అంత మమ్మల్ని ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. నా మిత్రుడు కీరవాణి మాటలతో నా జీవిత గమనం మార్చింది. ఆస్కార్ ఎనౌన్స్ చేసేటప్పుడు నేను భయంతో కీరవాణి చెయ్యి పట్టుకున్నా. ఆస్కార్ పట్టుకున్న వెంటనే భారతీయ కీర్తి పతాకాన్ని పట్టుకున్నాననే భావన కలిగింది. ఆస్కార్ అందుకోవడం నా జన్మలో చేసుకున్న అదృష్టం. కీరవాణితో నాది 28 ఏళ్ల అనుబంధం. బాహుబలిలో నాకు అవకాశం రాకున్నా.. ఆర్ఆర్ఆర్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుని సహనంతో ఉండి ఈ పాట రాయడానికి దాదాపు 17 నెలలు పట్టింది.' అని అన్నారు. సంగీత దర్శకుడు ఎంఎం. కీరవాణి మాట్లాడుతూ:.. ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం వెనుక మూల విగ్రహాలు రాజమౌళి, ప్రేమ్ రక్షిత్. నేను చంద్రబోస్ ఉత్సవ విగ్రహాలు మాత్రమే. తెలుగు సినీ పరిశ్రమ ఈరోజు ఒక్కచోట చేరి ఇలా పండుగ చేసుకోవడం సంతోషంగా ఉంది. నా మొట్ట మొదటి పాట చేసింది చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న థియేటర్ అది. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయిన నాకు కృష్ణంరాజు సూర్యనారాయణ రాజు ఇచ్చారు. ఆస్కార్ వల్ల నేను ఎక్సయిటింగ్ అవ్వలేదు. నిజంగా ప్రతిష్టాత్మకమైన అవార్డ్. ఈ పాటకు అందరూ ఎంతో కష్టపడి చేశారు. ఈ సినిమా కోసం ఆస్కార్ మెంబర్స్‌కి షోస్ వేసి చూపించాం. వాళ్లకు నచ్చింది. అందరూ సమిష్టిగా చేసిన కృషికి లభించిన విజయానికి మీరందరు వేడుక చేయడం సంతోషంగా ఉంది.' అని అన్నారు. మంత్రి తలసాని మాట్లాడుతూ..' ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు రావటం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. బాహుబలి సినిమాతో టాలీవుడ్ విశ్వ వ్యాప్తంగా విస్తరించింది. ఆ సినిమాకు కూడా ఆస్కార్ అవార్డ్స్ రావాల్సింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అన్ని విధాలుగా సీఎం కేసీఆర్, ప్రభుత్వం సహకారం అందించింది. ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలు తెలుగులోనూ వస్తున్నాయి. లక్షలాది మందికి అన్నం పెడుతున్న పరిశ్రమ తెలుగు సినిమా. పరిశ్రమకు ఎప్పుడు సహాయం చేయడానికి ముందుంటాం.' అని అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ' ఈరోజు ఆస్కార్ అవార్డు రావడం సినిమా ఇండస్ట్రీకి గర్వకారణం. తెలంగాణ వస్తే సినీ పరిశ్రమ వస్తే ఏమౌతుందోనని అనుకున్నారు. ఉద్యమ సమయంలో కూడా మా పోరాటం పాలకుల మీద కానీ ప్రజల మీదకు కాదని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ భాషను యాసను సినిమాల్లో అవమానించేవారు అని మేము బాధ పడేటోళ్లం. కానీ ఈరోజు గర్వపడుతున్నాం. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలినేదే మా ధ్యేయం. తెలంగాణలో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. అక్కడ షూటింగ్స్ జరుపుకోవడానికి మేము సహకరిస్తాం. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయి.' అని అన్నారు. -
'ఆర్ఆర్ఆర్' టీం..పద్మశ్రీ కంటే గొప్ప అవార్డు తీసుకొచ్చారు: నిర్మాత
‘‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ‘ఆస్కార్’ వంటి ప్రతిష్టాత్మక అవార్డు రావడమంటే ఇండియాకి వచ్చినట్టే. ఇందుకు ప్రతి భారతీయుడు, ముఖ్యంగా ప్రతి తెలుగువారు గర్వించాల్సిన సమయం ఇది’’ అని నిర్మాత కేఎస్ రామారావు అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ–‘‘పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులకంటే గొప్ప అవార్డు తీసుకొచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్‌ని, సాంకేతిక నిపుణులను మనం సన్మానించుకోవాలి.. గౌరవించుకోవాలి. ఎందుకంటే ఇది తెలుగు వారందరికీ దక్కిన గౌరవం. అందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కలిసి ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్‌ని, అవార్డు గ్రహీతలను చాలా గొప్పగా సత్కరించాలి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ వంతుగా ‘ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్’ కార్యవర్గం ఆధ్వర్యంలో నేడు శిల్ప కళావేదికలో సన్మానం చేస్తుండటం చాలా గొప్ప విషయం. ఇందులో ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ కూడా భాగస్వామ్యం అయితే బాగుంటుంది’’ అన్నారు. -
రామ్‌చరణ్ బర్త్‌డే స్పెషల్.. ఆస్కార్ విజేతలకు చిరు సన్మానం
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. 38వ వసంతంలోకి అడుగుపెట్టిన రామ్‌చరణ్‌కు ఈ బర్త్‌డే మరింత ప్రత్యేకం. ఆస్కార్ విజయంతో పాటు త్వరలోనే చరణ్ తండ్రిగా ప్రమోట్ కానున్నాడు. దీంతో ఈ పుట్టినరోజు ఉపాసన మరింత స్పెషల్‌గా నిర్వహించింది. ఈ పార్టీకి రాజమౌళి కుటుంబం, నాగార్జున, వెంకటేశ్, కాజల్ అగర్వాల్, అడివి శేష్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక కొడుకు పుట్టినరోజును పురస్కరించుకొని చిరంజీవి ఆస్కార్(నాటు నాటు)విజేతలను సత్కరించారు. ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి,నిర్మాత డీవీవీ దానయ్య,సంగీత దర్శకుడు కీరవాణి, నాటునాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరలతో పాటు ఆర్ఆర్ఆర్ టీంలోని రమ, శ్రీవల్లి, ఎస్ఎస్ కార్తికేయలకు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువా కప్పి సత్కరించారు. దీనికి సంబంధించిన ఫోటోలను చిరు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజున అయినవాళ్లు, ఆత్మీయుల సమక్షంలో ఆస్కార్ విజేతలను సన్మానించడం నిజంగా ఓ వేడుకలా జరిగిందంటూ చిరంజీవి పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
నాటు నాటు పాటకు అవార్డ్ వస్తుందని ఊహించలేదు: కీరవాణి
‘‘నాటు నాటు’ పాటకు అవార్డులు వస్తాయని నేను ఊహించలేదు. ఆస్కార్ అవార్డు వస్తుందని కలలో కూడా అనుకోలేదు’’ అన్నారు సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి. ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ పాటకు సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ఈ ‘నాటు నాటు’ పాటను కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడగా ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. కాగా ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం గురించి తాజాగా సంగీత దర్శకుడు కీరవాణి స్పందించారు. ఓ తమిళ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీరవాణి చెప్పిన విశేషాల్లో కొన్ని ఈ విధంగా... ► ‘నాటు నాటు’ ఓ కమర్షియల్ సాంగ్... అంతే. ఒక వినూత్నమైన పాటలో మన ప్రతిభను క్లాసికల్ మ్యూజిక్ పరంగా, ఆర్కెస్ట్రాలో కొత్త డిజైనింగ్ కంపోజిషన్, అద్భుతమైన పొయిట్రీ వంటి వాటితో కనబరిచి ఉంటే.. అప్పుడు ఆ పాటకు అవార్డులను ఊహిస్తాం. కానీ ‘నాటు నాటు’ పాట పక్కా ఫాస్ట్ బీట్ కమర్షియల్ నెంబర్. ఆస్కార్‌ని మరచిపోండి.. అసలు ‘నాటు నాటు’ పాటకు నేను ఏ అవార్డునూ ఊహించలేదు. ఈ పాటను రాజమౌళి తీసిన విధానం, ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన విధానానికి మేజర్ క్రెడిట్ దక్కుతుంది. అఫ్కోర్స్ చంద్రబోస్‌కి కూడా. ‘నాటు నాటు వీరనాటు.. నాటు నాటు ఊరనాటు’ అనే ఆ రెండు వాక్యాలు ఒక మంత్రంలాంటివి. వాటిని క్రియేట్ చేసిన చంద్రబోస్ ఆస్కార్ అవార్డుకి అర్హుడు. ఈ పాటను తమిళ, మలయాళం, హిందీ భాషల్లో కూడా చేశాం. అక్కడి రచయితలు కూడా వారి స్థాయికి తగ్గట్లుగా బాగానే కష్టపడ్డారు. కానీ తెలుగు వెర్షన్‌కి మంచి సౌండింగ్, రైమింగ్ కుదిరాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ► ఇక నాకు లభించిన తొలి ఆస్కార్ రామ్‌గోపాల్ వర్మగారు. ఇప్పుడు తీసుకున్నది రెండో ఆస్కార్. కెరీర్ స్టార్టింగ్‌లో నా సంగీత ప్రతిభను గుర్తించమన్నట్లుగా నా మ్యూజిక్ క్యాసెట్స్‌ను కొందరికి షేర్ చేశాను. వాటిని కొందరు డస్ట్‌బిన్‌లో వేశారు. ఇండస్ట్రీకి ఓ స్ట్రేంజర్ వచ్చి నా పాటలు వినండని క్యాసెట్స్ ఇస్తే ఎవరు మాత్రం పట్టించుకుంటారు. కానీ ‘క్షణక్షణం’ సినిమాకు రామ్‌గోపాల్‌వర్మగారు చాన్స్ ఇచ్చారు. ఆయన కెరీర్లో ‘శివ’ ఆస్కార్ రోల్ ప్లే చేస్తే.. నా కెరీర్లో రామ్‌గోపాల్‌వర్మగారు ఆస్కార్ రోల్ ప్లే చేశారు. ‘రామ్‌గోపాల్‌వర్మతో వర్క్ చేస్తున్నాడు కాబట్టి కీరవాణిని మన సినిమాకి తీసుకుందాం’ అంటూ నాకు అవకాశాలు ఇచ్చారు. ► గునీత్ మోంగాగారి (బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్‌లో ఆస్కార్ పొందిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ నిర్మాత)కి ఆస్కార్ వేదికపై మాట్లాడటానికి తగిన సమయం దక్కలేదు. దీంతో ఆమె తన యాక్సెప్టెన్సీ స్పీచ్ తర్వాత సరిగా శ్వాస తీసుకోలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. -
నాటు నాటుకు ఆస్కార్ నా వల్లే వచ్చింది: అజయ్ దేవగన్
ఆర్ఆర్ఆర్ సినిమాకు తన వల్లే ఆస్కార్ వచ్చిందని బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా నటించిన భోళా విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆయన కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్ కపిల్ శర్మ నాటు నాటు ఆస్కార్ గెలవడంతో అజయ్‌కి శభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీరు నటించిన ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ రావడం ఎలా అనిపించిందని కపిల్ శర్మ ప్రశ్నించాడు. చదవండి: అప్పట్లోనే సొంత హెలికాప్టర్, వేల కోట్ల ఆస్తులు.. నటి విజయ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? దీనికి అజయ్ దేవగన్ స్పందిస్తూ నిజానికి నాటు నాటుకు ఆస్కార్ నా వల్లే వచ్చిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అదేలా? అని హోస్ట్ అడగ్గా.. ‘అదే నేను నాటు నాటుకు డాన్స్ చేసి ఉంటే ఎలా ఉండేది. నా డాన్స్ చూసి అకాడెమీ జ్యూరీ మెంబర్స్ ఆస్కార్ ఇచ్చేవారే కాదు’ అంటూ చమత్కిరించాడు. అజయ్ సమాధానం విని అంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు. చదవండి: నాని ‘దసరా’కు షాకిచ్చిన సెన్సార్ బోర్డు, భారీగా కట్స్.. దీంతో అజయ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. షారుఖ్ ఖాన్ తర్వాత అంతటి సెన్స్ ఆఫ్ హ్యుమర్ అజయ్ దేవగన్లోనే ఉంది’, ‘ఒకవేళ అదే పాటకు సన్నీ డియోల్ డాన్స్ చేసి ఉంటే ఎలా ఉండేది.. ఊహించుకోండి’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఆర్ఆర్ఆర్లో అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తండ్రిగా అజయ్ కనిపించారు. To ye Raaz hai #NaatuNaatuSong ko Oscar milne ka 😯 pic.twitter.com/P9GXv4sy7K — Pooran Marwadi (@Pooran_marwadi) March 24, 2023 -
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో చంద్రబోస్ కు ఘన స్వాగతం
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - ప్రేమ్ రక్షిత్
-
ఆస్కార్ అవార్డు చిత్ర నటుడు చెంతకు గున్న ఏనుగు
తమిళ సినిమా: ధర్మపురిలో తల్లికి దూరమై న ఓ పిల్ల ఏనుగును అటవీ శాఖ అధికారులు ఇటీవల ఆస్కార్ అవార్డును గెలుచుకున్న డాక్యుమెంటరీ చిత్ర నటుడు బొమ్మన్‌కు అప్పగించారు. వివరాలు.. ధర్మపురి జిల్లా ఒగెనకల్ సమీపంలోని అడవిలో సంచరించే ఏనుగు నుంచి తప్పిపోయిన పిల్ల ఏనుగు పెన్నాగరం సమీపంలోని ఓ బావిలో పడిపోయిన విషయం తెలిసిందే. సమాచారం తెలుసుకున్న అధికారుల సహాయంతో గున్న ఏనుగును సురక్షితంగా బయటికి తీశారు. దాన్ని తన తల్లి ఏనుగు వద్దకు చేర్చడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే దాని ఆచూకీ కనుగొనడం కష్టమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్కార్ అవార్డును గెలుచుకున్న డాక్యుమెంటరీ చిత్రం ది ఎలిఫెంట్ విస్పరస్ చిత్ర నటుడు బొమ్మన్‌కు ఆ పిల్ల ఏనుగును తనకు అప్పగించవలసిందిగా అటవీ శాఖ అధికారులను కోరాడు. దీంతో అధికారులు ఆ పిల్ల ఏను గును లారీ ద్వారా ముదుమలై అడవి ప్రాంతంలోని ఏనుగుల సంరక్షణ శిబిరానికి చేర్చారు. అక్కడ ఆ పిల్ల వైద్య పరీక్షలు నిర్వహించి బొమ్మ న్కు అప్పగించారు కాగా ఇప్పటికే ఆయన ఆ శిబిరంలో రెండు గున్న ఏనుగులు ఉన్నాయి. -
కీరవాణి టాప్ ఆఫ్ ది వరల్డ్‌తో హైదరాబాద్‌లో జోష్
-
ఆస్కార్ గెలిచిన ఇండియన్ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్.. స్క్రిప్ట్‌రైటర్ ఈ అమ్మాయే!
‘గరిమ పుర ఎవరు?’ అనే ప్రశ్నకు చాలామంది జవాబు చెప్పలేకపోవచ్చు. ఆస్కార్ గెలుచుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ గురించి తెలియని వారు తక్కువ మంది ఉండవచ్చు. 27 సంవత్సరాల గరిమ ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌కు స్క్రిప్ట్‌రైటర్... పంజాబ్‌లోని పటియాలాలో పుట్టిన గరిమ హైస్కూల్ చదువు పూర్తికాగానే కళాశాల విద్య కోసం మహారాష్ట్రలోని పుణెకు వచ్చింది. అక్కడే తనకు ప్రపంచ సినిమాలు, లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలపై ఆసక్తి ఏర్పడింది. ‘సింబియాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా’లో పట్టా పుచ్చుకున్న తరువాత డాక్యుమెంటరీలపై మరింత ఆసక్తి పెరిగింది. డాక్యుమెంటరీలు తీయాలనుకొని ముంబైలో అడుగుపెట్టిన గరిమ ఒక మీడియా సంస్థలో చేరింది. ‘వృత్తి జీవితం బాగానే ఉందిగానీ తాను వచ్చింది ఇందు కోసం కాదు కదా!’ అని ఆలోచించింది. ఎనిమిది నెలల తరువాత ఉద్యోగాన్ని వదులుకొని స్క్రిప్ట్ రైటర్‌గా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ ప్రయత్నాలు ఫలించి వెబ్‌సిరీస్‌కు రాయడం మొదలుపెట్టింది. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘లిటిల్ థింగ్స్’ తో రైటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది గరిమ. పట్టణ ప్రజల జీవనశైలిపై తీసిన ఈ సిరీస్ కోసం తొలిసారిగా ఇతర రచయితలతో కలిసి పనిచేసింది. ఒంటరిగా కూర్చుని, నిశ్శబ్ద వాతావరణంలో రాసే అలవాటు ఉన్న గరిమ ఇతర రచయితలతో కలిసి చర్చలు చేస్తూ రాయాల్సి వచ్చింది. ‘ఇతరులతో కూర్చొని చర్చిస్తూ రాయడం వల్ల మనల్ని మనం ఎంతో మెరుగు పరుచుకోవచ్చు. ఇలా కూడా ఆలోచించవచ్చా అనిపిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే కలానికి కొత్త మెరుపు వస్తుంది’ అంటుంది గరిమ. 2019లో వైల్ట్‌లైఫ్ డైరెక్టర్ గుంజన్ మీనన్ గరిమను డైరెక్టర్ కార్తికీ గోంజాల్వెజ్కు పరిచయం చేసింది. కార్తికీ దగ్గర ఒక మంచి కథ ఉంది. ఆమె మంచి రైటర్ కోసం వెదుకుతోంది. కట్ చేస్తే... 2020లో గరిమను వెదుక్కుంటూ కార్తికీ వచ్చింది. ఇక అప్పటి నుంచి స్క్రిప్ట్ రైటింగ్ పనుల్లోకి దిగింది గరిమ. అయితే ఇదేమీ కాల్పనిక స్క్రిప్ట్ కాదు. నాలుగు గోడల మధ్య ఏకాంతంగా రాసుకునే స్క్రిప్ట్ కాదు. అడవి దారి పట్టాలి. అనాథ ఏనుగుల కళ్లలోకి చూసి మౌనంగా మాట్లాడాలి. వాటిని సొంత పిల్లల్లా ఆదరించిన దంపతుల మనసు పొరల్లోకి వెళ్లాలి. తెలుసుకున్నదానికి సృజన జోడించాలి. ‘30 ఏళ్లు కూడా దాటని ఈ అమ్మాయి ఇంత పనిచేయగలదా?’ అనే సందేహం ఎప్పుడూ కార్తికీ గోంజాల్వెజ్కు రాలేదు. తనపై కార్తికీ పెట్టిన నమ్మకాన్ని గరిమ వృథా చేసుకోలేదు. స్క్రిప్ట్‌కు జవసత్వాలు ఇచ్చింది. ‘కాలం మారింది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల పుణ్యమా అని యువతరం చిత్రపరిశ్రమలోకి వెల్లువలా వస్తోంది. ఇప్పుడు ఒకరి సృజనాత్మక శ్రమను దోచుకోవడం అనేది కష్టం. కష్టపడే వారికి విజయం త్వరగా చేరువయ్యే కాలం ఇది’ అంటోంది గరిమ. అలనాటి పుస్తకాల నుంచి తాజాగా విడుదలైన పుస్తకాల వరకు ఎన్నో పుస్తకాలు చదువుతుంటుంది గరిమ. 1973లో వచ్చిన ఎరిక జోంగ్ ‘ఫియర్ ఆఫ్ ప్లైయింగ్’ పుస్తకం అన్నా, అందులో జోంగ్ రాసిన వాక్యం...‘ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుంది. అయితే అరుదైన ప్రతిభ అనేది మనం ఎంత సాధన చేస్తున్నాం, ఎంత కష్టపడుతున్నాం అనేదానిపైనే ఆధారపడి ఉంటుంది’ అనే వాక్యం అన్నా ఆమెకు చాలా ఇష్టం. చదవండి: హ్యాపీ పేరెంటింగ్: వసపిట్ట పాఠాలు -
చిరంజీవి, రామ్ చరణ్‌లతో అమిత్ షా భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: నటులు చిరంజీవి, రామ్ చరణ్‌లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కలిశారు. అమెరికా నుంచి నేరుగా ఢిల్లీ వచ్చిన రామ్ చరణ్ శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ హోటల్ లో జరిగిన మీడియా సంస్థ సదస్సులో పాల్గొన్నారు. అదే సదస్సులో కేంద్ర మంత్రి అమిత్ షా సైతం పాల్గొన్నారు. సదస్సు అనంతరం అదే హోటల్లో బస చేస్తున్న రామ్ చరణ్ రూమ్ కి వెళ్లిన అమిత్ షా అక్కడ చిరంజీవి, చరణ్ లతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నందుకు గానూ అమిత్‌షా అభినందించి చరణ్‌ను శాలువాతో సత్కరించారు. అనంతరం ట్వీట్ చేసిన కేంద్రమంత్రి అమిత్ షా భారతీయ చిత్రసీమలో ఇద్దరు దిగ్గజాలు చిరంజీవి, రామ్ చరణ్‌లను కలవడం ఆనందంగా ఉందని తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమ.. భారతదేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. -
నాటు నాటు పాటకు డ్యాన్స్ చేయడం ఆనందంగా ఉంది : రామ్ చరణ్
-
‘నాటు నాటు’ కోసం 15 కోట్ల ఖర్చు
-
ఆస్కార్ పై ఎన్టీఆర్ ఫస్ట్ రియాక్షన్
-
గ్రాము గోల్డ్.. రెండు గంటలు.. సూక్ష్మ బంగారు ‘ఆస్కార్’..
సాక్షి, పెద్దాపురం(కాకినాడ జిల్లా): నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా బృందానికి అభినందనలు తెలుపుతూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ అవార్డు గ్రహీత, కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన బంగారు శిల్పి తాళాబత్తుల సాయి సూక్ష్మ ఆస్కార్ అవార్డు ప్రతిమ రూపొందించారు. ఒక గ్రాము బంగారం వినియోగించి 15 మిల్లీ మీటర్ల పొడవుతో ఈ ప్రతిమను రెండు గంటల సమయంలో తయారు చేసి అందరి మన్ననలూ అందుకున్నారు. చదవండి: రాజమౌళితో మాట్లాడటానికి ప్రయత్నించా, కానీ: RRR నిర్మాత -
తెలుగు రచయిత చంద్రబోస్ తో సాక్షి ఎన్నారై ముఖాముఖీ
-
అవ్వాతాతలకు 3న పింఛన్లు..
సాక్షి, అమరావతి: ఆర్బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఏప్రిల్ 1వ తేదీని సెలవు దినంగా ప్రకటించడం, ఆ మరుసటి రోజు ఏప్రిల్ 2 ఆదివారం కావడంతో అవ్వాతాతలకు ఏప్రిల్ 3న పింఛన్లు పంపిణీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ విషయాన్ని పెన్షన్ లబ్ధిదారులకు ముందుగా తెలియజేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ప్రజాభ్యుదయానికి దోహదం చేసే పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు ముసాయిదా బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇటీవల విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఘనవిజయం వెనుక ముఖ్యమంత్రి జగన్ కృషిని మంత్రివర్గం కొనియాడింది. ప్రభుత్వ విశ్వసనీయత, పనితీరుకు ఈ సదస్సు అద్దం పట్టిందని ప్రశంసించారు. సీఎం జగన్‌ను అభినందిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని హర్షధ్వానాలతో ఆమోదించారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ను మంత్రివర్గం అభినందించింది. నూతన పారిశ్రామిక విధానం 2023–27ను కేబినెట్ ఆమోదించింది. మంత్రివర్గ నిర్ణయాలను సమాచార, బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. ► సంక్షేమ వసతి గృహాల్లో (హాస్టళ్లు) విద్యార్ధులకు మెరుగైన సౌకర్యాలు, వసతుల కల్పన, సూక్ష్మస్ధాయిలో పర్యవేక్షణకు అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ల సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకోవాలని నిర్ణయం. సంక్షేమ శాఖల్లో ప్రస్తుతం ఉన్న అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్లను (సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్) క్లస్టర్ల వారీగా నియమించేందుకు గ్రీన్ సిగ్నల్. మూడు మండలాలను ఒక క్లస్టర్‌గా నిర్ణయించి ఏడాది కాలపరిమితితో అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ నియామకం ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ► ప్రభుత్వ హైస్కూళ్లలో నైట్ వాచ్మెన్ల నియామకానికి కేబినెట్ ఆమోదం. మొత్తం 5,388 హైస్కూళ్లలో పేరెంట్స్ కమిటీల ద్వారా వాచ్మెన్ల నియామకం. ఒక్కొక్కరికి నెలకు రూ.6 వేల చొప్పున టీఎంఎఫ్ నుంచి గౌరవ వేతనం చెల్లింపు. పలు ముసాయిదా బిల్లులకు ఆమోదం ► ఆంధ్రప్రదేశ్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబల్ యాక్ట్ –2019 (యాక్ట్ నెంబర్ 30 ఆఫ్ 2020) సవరణలకు సంబంధించిన డ్రాప్ట్ బిల్లుకు కేబినెట్ ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్ ప్లాన్ అండ్ ట్రైబల్ సబ్‌ప్లాన్ (ఆర్ధిక వనరుల ప్రణాళిక, కేటాయింపు మరియు వినియోగానికి సంబంధించి) యాక్ట్ –2013 సవరణల డ్రాప్ట్ బిల్లుకు కేబినెట్ ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ స్టేట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ ఛైర్మన్, సభ్యుల పదవీకాలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ యాక్టు 2019 (యాక్టు 9 ఆఫ్ 2021) సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం. ఛైర్మన్, సభ్యుల పదవీకాలాన్ని మూడు సంవత్సరాల నుంచి రెండేళ్లకు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. పదవీకాలం ముగిసిన తర్వాత అదనంగా మరో రెండేళ్లు పొడిగించేలా తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ పదవీ కాలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ యాక్టు 2019 (యాక్టు 19 ఆఫ్ 2019) సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం. కమిషన్ పదవీ కాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. పదవీకాలం ముగిసిన తర్వాత అదనంగా మరో రెండేళ్లు పొడిగించేలా మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీస్ కమిషన్ యాక్ట్ 1998 సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం. కమిషన్ పదవీ కాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. పదవీకాలం ముగిసిన తర్వాత అదనంగా మరో రెండేళ్లు పొడిగించేలా మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్. ► కేంద్ర ప్రభుత్వ మార్గదర్శక నియమావళిని అనుసరించి వక్ఫ్ రూల్స్ సవరణకు కేబినెట్ ఆమోదం. ► ఏపీ మహిళా కమిషన్ పదవీ కాలానికి సంబం«ధించి ఏపీ వుమెన్ కమిషన్ యాక్ట్ –1998 సవరణలకు కేబినెట్ ఆమోదం. మహిళా కమిషన్ పదవీ కాలాన్ని ఐదు సంవత్సరాల నుంచి రెండేళ్లకు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ► గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు 2022 ఆర్డినెన్స్‌కు బదులుగా ఏపీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాల 2023 బిల్లు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ► ఏపీ కార్ల్– పులివెందులలో అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్ కళాశాలల ఏర్పాటుకు ఆమోదం. ► ది మిల్క్ ప్రొక్యూర్మెంట్ (ప్రొటెక్షన్ ఆఫ్ ఫార్మర్స్) అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సేప్టీ ఆఫ్ మిల్క్ స్టాండర్డ్స్ బిల్లు 2023 ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. బిల్లు ద్వారా పాడి రైతులు, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యం. ► ఆంధ్రప్రదేశ్ మీడియా అక్రిడిటేషన్ రూల్ 2019కు మార్పులు చేస్తూ సమగ్ర నూతన విధానానికి సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. ► జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ యాక్ట్ 1960 సవరణ. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2022 ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. ► ఎయిడెడ్, ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్‌లో బోధన, బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఆర్డినెన్స్ 2022 ప్రతిపాదనలకు ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారంటీ ఆర్డినెన్స్ 2022 స్థానంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారెంటీ బిల్లు 2023కు కేబినెట్ ఆమోదం. ► వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్‌కు నీటి సరఫరా పైప్‌లైన్ కోసం 29.67 ఎకరాలను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. దీంతోపాటు నాలుగులైన్ల రహదారి నిర్మాణానికి అవసరమైన 78.46 ఎకరాల భూమిని కూడా కేటాయింపు ప్రతిపాదనలకు ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వాటర్‌వేస్ బిల్లు 2023 ప్రతిపాదనలకు ఆమోదం. ► మున్సిపల్ యాక్ట్ సవరణలకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు అవసరమైన సవరణలకు కేబినెట్ ఆమోదం. ► అమలాపురం కేంద్రంగా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం. రెండు పట్టణ స్థానిక సంస్థలు, 120 రెవెన్యూ గ్రామాలతో కూడిన 11 మండలాలతో కలిపి మొత్తం 896.16 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటు కానున్న అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ► ఏపీ లెజిస్లేచర్ సెక్రటేరియట్లో సెక్రటరీ జనరల్ పోస్టు భర్తీకి కేబినెట్ ఆమోదం. లోక్‌సభ, రాజ్యసభలో పదవీ విరమణ చేసిన లేదా ప్రస్తుతం సర్వీసులో ఉన్న సెక్రటరీ జనరల్ ఈ పోస్టుకు అర్హులు. ► అనపర్తి, పిడుగురాళ్ల, మైదుకూరు, మైలవరం, ఉదయగిరి, నిడదవోలు మండలాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ భర్తీకి కేబినెట్ ఆమోదం. 18 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. ► ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ 1987 సవరణలకు ఆమోదం. ► రిజిస్ట్రేషన్ సేవలకు ఇ–స్టాంపింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. తప్పుడు రిజిస్ట్రేషన్లను నివారించేలా రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సవరణకు కేబినెట్ ఆమోదం. ► ఎక్సైజ్ చట్టం సవరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ► ఆంధ్రప్రదేశ్ చారిటబుల్, హిందూ రిలీజియస్ ఇనిస్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ 1987 ప్రకారం అన్ని దేవస్ధానాల బోర్డుల్లో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సభ్యుడిగా నియమించాలన్న ప్రతిపాదనకు ఆమోదం. దేవాలయాల్లో క్షురకర్మలు నిర్వహించే నాయీ బ్రాహ్మణులకు నెలకు కనీసం రూ.20 వేలు కచ్చితం కమిషన్ అందించాలన్న ప్రతిపాదనలకు ఆమోదం. కనీసం వంద పనిదినాలు నమోదైన వారికి ఇది వర్తింపు. ► పట్టాదార్ పాస్‌బుక్స్ ఆర్డినెన్స్ 2023 సవరణకు కేబినెట్ ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ డాటెడ్ ల్యాండ్స్ (అప్డేషన్ ఇన్ రీసెటిల్మెంట్ రిజిస్ట్రేషన్) ఆర్డినెన్స్ 2022 లో సవరణలకు కేబినెట్ ఆమోదం. ► మచిలీపట్నంలో 220 గజాల స్థలం మదర్సాకు కేటాయించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఆర్ఆర్ఆర్ బృందానికి అభినందనలు అంతర్జాతీయంగా ఉర్రూతలూగించిన నాటు...నాటు పాట ద్వారా ఆస్కార్ అవార్డు సాధించిన “ఆర్ఆర్ఆర్’’ చిత్ర యూనిట్‌ను మంత్రివర్గం అభినందించింది. సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, దర్శకుడు రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ బృందానికి కేబినెట్ అభినందనలు తెలియచేసింది. -
Oscar Naatu Naatu: రాహుల్.. ధూల్‌పేట్ నుంచి లాస్ ఎంజిల్స్ వరకు(అరుదైన ఫోటోలు)
-
నాటు నాటు పాటకు ఆస్కార్.. రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ ప్రశంసలు
న్యూఢిల్లీ: ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు లభించడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు రాజ్యసభలో ప్రస్తావించారు. నాటు నాటుకు ఆస్కార్ దక్కడం తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపుగా అభివర్ణించారు. దీనిపై మంగళవారం రాజసభలో జీవీఎల్ మాట్లాడుతూ.. ఆస్కార్ అవార్డులు భారతీయ సినిమాకు ముఖ్యంగా తెలుగువారికి ఒక చారిత్రాత్మక గుర్తింపు అని అన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం వాస్తవానికి తెలుగు చిత్రం.. ఆస్కార్ అవార్డు పొందిన ‘నాటు నాటు’ పాట తెలుగు పాట అని రాజ్యసభ సభ్యులందరికీ గుర్తు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా విజయం ఒక్కటి మాత్రమే కాదని, దాని దర్శకుడు రాజమౌళి బాహుబలి లాంటి చిత్రాన్ని కూడా తెరకెక్కించారని, ఇది అంతర్జాతీయ విజయాన్ని సాధించిందని ఎంపీ జీవీఎల్ అన్నారు. రాజ్యసభలో నామినేటెడ్ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి రచయిత అని ప్రశంసించిన ఎంపీ జీవీఎల్.. ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తానికి అభినందనలు తెలిపారు. -
మోదీ వల్లే ఆస్కార్ వచ్చిందని చెప్పుకుంటారేమో: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి స్టెప్పులేసిన ఈ సాంగ్‌ను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ అద్భుతంగా పాడారు. ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ అందడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా యావత్ దేశం నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా బృందానికి తెలంగాణ డిజిటల్ మీడియాడైరెక్టర్ కొణతం దిలీప్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాటను రాసిన చంద్రబోస్‌కు కంగ్రాట్స్ చెప్పారు. అయితే ఆర్ఆర్ఆర్ విడుదల సమయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల వీడియోను ఆయన షేర్ చేశారు. సినిమా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తే కొడతామని, థియేటర్లకు ఎవరూ వెళ్లకొడదని వార్నింగ్ ఇచ్చారు. థియేటర్లు కాల్చేస్తాం అంటూ ఆర్ఆర్ఆర్ చిత్రంపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే సంజయ్ లాంటి మతోన్మాదులు సినిమాపై ఎలాంటి విషయం చిమ్మారో గుర్తుంచుకోవడానికి ఇదే సరైన సమయమని కొణతం దిలీప్ పేర్కొన్నారు. ఇలాంటి ధ్వేషపూరిత వ్యక్తులను దూరంగా ఉంచుదామని అన్నారు. ఈ ట్వీట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘ఇంకేముంది నాటు నాటు పాటకు కూడా మోదీ వల్లే అవార్డు వచ్చిందని ఇలాంటి మతోన్మాద వ్యక్తులు చెప్పుకుంటారేమో’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. Not before long, the SAME Bigot will tell you the Award was given only because of Modi 😂 https://t.co/8Z0hp6FETl — KTR (@KTRBRS) March 13, 2023 -
తెలుగు గీతానికి ఆస్కార్.. మన దేశానికి పురస్కార్: సాయి కుమార్
-
ఓ పక్క నాటు నాటు పాటకు అందలం.. మరో పక్క నీటు నీటు ఆటకు..!
మార్చి 13, 2023.. భారతీయులకు చిరకాలం గుర్తుండి పోయే రోజు ఇది. విశ్వవేదికపై ఈ రోజు రెండు విషయాల్లో భారత కీర్తి పతాకం రెపరెపలాడింది. భారతీయ చిత్ర గీతానికి, మరి ముఖ్యంగా తెలుగు పాట "నాటు.. నాటు (ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాలోని పాట)"కు ఈ రోజున ప్రతిష్టాత్మక ఆస్కార్ (అకాడమీ) అవార్డు దక్కగా.. ఇదే రోజున భారత క్రికెట్ జట్టు వరుసగా రెండో సారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరింది. Back-to-back WTC finals for India 🕺 🕺 pic.twitter.com/8f7EpVUrpW— ESPNcricinfo (@ESPNcricinfo) March 13, 2023 సినిమా, క్రీడా రంగానికి సంబంధించి మరపురానిదిగా మిగిలిపోయే ఈ రోజున యావత్ భారతావణి సంబురాలు చేసుకుంటుంది. ముఖ్యంగా సినిమా అభిమానులు, అందులోనూ తెలుగువారి ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. నాటు.. నాటు పాట ఆస్కార్ గెలవడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. RRR టీమ్‌కు యావత్ సినీ జగత్తు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిత్ర దర్శకుడు రాజమౌళి, కథానాయకులు రామ్‌చరణ్, తారక్‌లతో పాటు నాటు.. నాటుకు బాణీలు సమకూర్చిన ఎంఎం కీరవాణికి, సాహిత్యాన్ని అందించిన చంద్రబోస్‌కు, గాత్రాన్ని అందించిన కాళభైరవ, రాహుల్ సిప్లిగంజ్‌లకు, కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్‌లపై విశ్వవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాటు నాటు పాటకు సగం జీవం పోసింది సంగీతమైతే.. చరణ్, తారక్‌లు తమ అత్యుత్తమ నృత్య ప్రావీణ్యంతో ఈ పాటకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చారని అభామానులు జేజేలు పలుకుతున్నారు. మరోవైపు భారత్ క్రికెట్ జట్టుకు, విశ్వవ్యాప్తంగా ఉన్న టీమిండియా ఫాలోవర్స్‌కు కూడా ఈ రోజు చిరకాలం గుర్తుండి పోతుంది. భారత క్రికెట్ జట్టు వరుసగా రెండో డబ్ల్యూటీసీ ఎడిషన్‌లో (2021-23) ఫైనల్‌కు చేరింది. ప్రస్తుతం ఆసీస్‌తో నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న భారత్.. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే ఫైనల్‌కు చేరుకుంది. ఇవాళ శ్రీలంకపై న్యూజిలాండ్ విజయం సాధించడంతో టీమిండియా దర్జాగా ఫైనల్‌కు చేరింది. డబ్ల్యూటీసీ 2021-23 ఫైనల్ రేసులో భారత్‌తో పోటీ పడిన శ్రీలంకను న్యూజిలాండ్ మాజీ సారధి కేన్ విలియమ్సన్ (121 నాటౌట్) సూపర్ శతకంతో దెబ్బకొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి భారత్ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేయాలనుకున్న లంకేయుల ఆశలపై కేన్ మామ నీళ్లు చల్లాడు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు, తన జట్టుకు అపురూప విజయాన్ని అందించడంతో పాటు శ్రీలంకను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరకుండా అడ్డుకున్నాడు. -
ఆర్ఆర్ఆర్ టీమ్ కి మంత్రి రోజా అభినందనలు
-
రాజమౌళి బృందానికి పీఎం మోదీ అభినందనలు
-
హాట్స్ ఆఫ్ రాజమౌళి ..!
-
పాట రచయిత చంద్రబోస్ స్వగ్రామం చల్లగరిగెలో సంబరాలు
-
ప్రపంచవ్యాప్తంగా తెలుగుచిత్ర రంగానికి గుర్తింపు
-
ఆస్కార్ అవార్డు పొందిన ఆర్ఆర్ఆర్ టీమ్ కి సీఎం జగన్ అభినందనలు
-
ఆస్కార్ విజయంపై చంద్రబోస్ భార్య ఎమోషనల్
-
Oscars 2023: ఆర్ఆర్ఆర్ టీమ్‌కు సీఎం జగన్ అభినందనలు
తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ‘ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటునాటు పాట అవార్డు గెలుచుకోవడం సంతోషం. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడిన ఈ పాట చరిత్ర సృష్టించింది. గ్లోబల్ ప్రేక్షకులను సైతం మంత్రముగ్ధులను చేసిన పాట ఇది. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జెండాను రెపరెపలాడే విధంగా చేసింది. ఇటీవలే శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న భారత సినిమాకు ఈ అవార్డు మరింత ప్రోత్సహకాన్ని ఇచ్చింది’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, భారత్ నుంచి మూడు విభాగాల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్‌కు నామినేషన్స్ దక్కాయి. వీటీలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగం నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటునాటు’ పాట, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగం నుంచి ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ గెలుచుకున్నాయి. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం కేటగిరీలో నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రీత్స్’కు నిరాశ ఎదురైంది. The #Telugu flag is flying higher! I’m filled with pride on a Telugu song, that so beautifully celebrates our folk heritage, being given its due recognition internationally today. @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and @mmkeeravaani have truly redefined excellence! 1/2 https://t.co/jp75mpiZHv — YS Jagan Mohan Reddy (@ysjagan) March 13, 2023 -
‘నాటు నాటు’కు ఆస్కార్… ఆనందంతో ఎగిరి గంతేసిన రాజమౌళి
తెలుగు సినిమా చరిత్ర సృష్టించిన రోజిది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించడంతో ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగిపోతుంది. నాటునాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు ప్రకటించగానే డాల్బీ థియేటర్ దద్దరిల్లిపోయింది. రాజమౌళి, ఆయన భార్య రమ సంతోషంతో భావేద్వేగానికి గురయ్యారు. కార్తికేయ దంపతులతో కలిసి గంతులేశారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఆలింగనం చేసుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు, లైవ్‌లో చూస్తున్న భారతీయులు సైతం ఆనందంతో పులకరించిపోయారు. తెలుగు సినిమా పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం, అవార్డు దక్కించుకోవడం ఇదే తొలిసారి. దీంతో తెలుగువాళ్లతో పాటు భారత సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. -
ఆస్కార్ అవార్డు గెల్చిన నాటు నాటు సాంగ్...ఆనందంతో గంతులేసిన రాజమౌళి దంపతులు
-
ఆస్కార్ అవార్డు గెల్చిన నాటు నాటు సాంగ్... సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అమ్మ నాన్న ఎమోషనల్
-
ఆస్కార్ వేదికపై జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హగ్
-
RRR నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు
-
బెస్ట్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారత్ కు ఆస్కార్
-
అమెరికాలో జూ. ఎన్టీఆర్ సందడి.. తారక్ కొత్త లుక్ చూశారా?
ఆస్కార్ అవార్డు కార్యక్రమం నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ మూవీ టీం అమెరికాలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు వరుసగా హలీవుడ్ మీడియాతో ముచ్చటిస్తున్నారు. వేరుగా వేరుగా ఇంటర్య్వూలు ఇస్తున్న చరణ్, తారక్‌లు అవకాశం వస్తే హాలీవుడ్‌లోనూ నటించేందుకు సిద్ధమేనంటూ ఆ దిశగా తమని తాము ప్రమోట్ చేస్తుకుంటున్నారు. అంతేకాదు తరచూ ఫొటోషూట్లకు ఫోజులు ఇస్తున్నారు. చదవండి: ‘బలగం’ మూవీపై చిరంజీవి రివ్యూ, ఏమన్నారంటే.. ఈ క్రమంలో తాజాగా ఎన్టీఆర్ ఇచ్చిన ఫొటోషూట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇదివరకు ఎన్నడు తారక్‌ను ఇలా చూడలేదంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. సూట్లో తారక్ మాసివ్ క్లాసీ లుక్‌ను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎన్టీతార్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీంతో ఆయన న్యూలుక్ క్షణాల్లో వైరల్‌గా మారింది. బ్లూ కలర్ సూట్‌తో తారక్ చాలా క్లాసీగా, కూల్‌గా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: తొలిసారి విమానం ఎక్కిన గంగవ్వ హడావుడి చూశారా? ట్రెండింగ్‌లో వీడియో కాగా ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు ఒరిజినల్ సాంగ్ కాటగిరిలో ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. మరి ఆదివారం జరిగే ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ ఖాయమంటూ తెలుగు ప్రేక్షకులంతా ధీమా వ్యక్తి చేస్తున్నారు. ఆస్కార్ ఒక్క అడుగు చేరువలో ఉన్న ఆర్ఆర్ఆర్కు ఈ అవార్డు వరిస్తుందా? లేదా? అని భారత ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుని అంతర్జాతీయ వేదికపై సంచలనం సృష్టించింది. View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) -
ఆస్కార్ అవార్డును అమ్ముకోవచ్చా? అమ్మితే ఎంతొస్తుంది?
యావత్ సినీ ప్రపంచం ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డు ఆస్కార్. జీవితంలో ఒక్కసారైనా ఈ అవార్డును ముద్దాడాలని నటీనటులు కలలు కంటారు. మరికొద్ది గంటల్లో ఆస్కార్ 2023 వేడుకలు గ్రాండ్‌గా ప్రారంభం కానున్నాయి. ప్రపంచంలోని నలుమూలల నుంచి ఎన్నో చిత్రాలు ఆస్కార్ అవార్డుల కోసం పోటీ పడుతున్నాయి. అందులో భారత్ నుంచి మన తెలుగు చిత్రం ఆర్ఆర్ఆర్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్లోని నాటునాటు సాంగ్ ఆస్కార్ అవార్డుల కోసం పోటీపడుతుండటంతో మరింత ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆస్కార్ అవార్డులకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. చూడటానికి బంగారంలా మెరిసిపోయే ఆస్కార్ ప్రతిమ నిజానికి బంగారంతో చేసింది కాదు. కాంస్యంతో తయారు చేసి 24 క్యారెట్ బంగారంతో పూత పూస్తారు. ఈ అవార్డు తయారు చేసేందుకు సుమారు 400 డాలర్లు ఖర్చవుతుందని తెలుస్తోంది. కానీ దీన్ని అమ్మితే మాత్రం కేవలం ఒకే ఒక్క డాలర్ వస్తుందట. అదేంటీ? ఇంత ప్రాధాన్యత ఉన్న ఆస్కార్ అవార్డును ఎవరైనా అమ్ముకుంటారా అనే కదా మీ సందేహం. 1950కు ముందు ఓ అమెరికన్ డైరెక్టర్ అమెరికన్ డైరెక్టర్ ఆర్సన్ వెల్స్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆస్కార్ అవార్డును అమ్ముకోలని చూశాడట. ఇందుకు తగ్గట్లే వేలం వేయగా ఏకంగా ఆరున్నర కోట్లు వచ్చాయట. అయితే ఈ విషయం తెలిసి ఆగ్రహించిన అకాడమీ అవార్డ్స్ కమిటీ ఎవరూ ఆస్కార్ అవార్డు అమ్మకుండా ఓ నిబంధన పెట్టింది. ఆస్కార్ విన్నర్స్ తమ అవార్డులను ఇతరులకు అమ్మడానికి వీల్లేదట. తిరిగి అకాడమీ సభ్యులకు ఇచ్చేస్తే… ఒక డాలర్ ఇస్తామనే నిబంధన తెచ్చారు. దీంతో ఒక డాలర్‌కి ఆశపడి ఎవరు అవార్డు అమ్ముకోరు కాబట్టి, ఆస్కార్ అవార్డు అమ్మకాన్ని అలా నిరోధించారు. -
ఆస్కార్ స్టేజ్‌పై నాటు నాటుకు చరణ్, తారక్ డాన్స్? ఎన్టీఆర్ క్లారిటీ
అకాడమీ అవార్డుకు ఒక్క అడుగు దూరంలో ఉంది ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలోని నాటు నాటు ఒరిజినల్ సాంగ్ కాటగిరిలో ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ వస్తుందా? లేదా? అనేది ఒక్క రోజులో తేలనుంది. మార్చి 12న అమెరికాలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. దీంతో అందరి చూపు ఆర్ఆర్ఆర్పైనే ఉంది. అంతేకాదు ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో నాటు నాటు సాంగ్ పర్ఫామెన్స్ కూడా ఉండనుందనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. చదవండి: నేను నోరు విప్పితే.. మీరు ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారో చెప్పనా?: తమ్మారెడ్డి కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, కీరవాణిలు స్టేజ్ఈ పాట పాడుతుండగా.. తారక్, చరణ్‌లు కాలు కదపనున్నారని సమాచారం. తాజాగా దీనిపై ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు. ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో నేపథ్యంలో ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీం అమెరికాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు వరుసగా పలు హాలీవుడ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా లాస్ ఏంజిల్స్‌కు చెందిన KTLA ఛానల్‌తో తారక్ ముచ్చటించాడు. చదవండి: శ్రీవారి సేవలో దిల్ రాజు ఫ్యామిలీ.. వారసుడిని చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నాడో.. ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డు వేదికపై నాటు నాటు పాట పర్ఫామెన్స్పై ప్రశ్న ఎదురైంది. దీనికి తాను ఆస్కార్ అవార్డుల రెడ్ కార్పెట్‌పై పూర్తి ఇండియన్‌గా నడిచి వస్తానని చెప్పుకొచ్చిన తారక్, వేదికపై నాటు నాటు సాంగ్‌కు పర్ఫామెన్స్ చేయడం లేదని తేల్చి చెప్పాడు. కానీ, కీరవాణితో పాటు ఈ పాట పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్‌లు స్టేజ్‌పై నాటు నాటు పాటను పాడనున్నారని స్పష్టం చేశాడు. కాగా ఆర్ఆర్ఆర్ ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గొల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ వంటి అవార్డులను గెలుచుకుంది. -
ఆస్కార్ బరిలో నాటు నాటు.. ఇంతకీ ఈ అవార్డు ప్రత్యేకత ఏంటో తెలుసా?
ఆస్కార్ అవార్డు.. ప్రస్తుతం ప్రపంచ చలన చిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవార్డు ఇది. సినీ రంగంలోని ప్రతిభవంతులకు ఇచ్చే ఈ ప్రతిష్టాత్మక ఆవార్డు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ఏడాదికి గానూ 95వ ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ 2023లో ఇచ్చే ఆస్కార్ అవార్డుల బరిలో తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు చోటు దక్కిన సంగతి తెలిసిందే. దాదాపు 22 ఏళ్ల తర్వాత భారతీయ చిత్రానికి నామినేషన్ దక్కడం విశేషం. అలాంటి అకాడమి అవార్డుకు ఒక్క అడుగు దూరంలో మన తెలుగు సినిమా ఉండటం నిజంగా గర్వకారణం. దీంతో అంతర్జాతీయ స్టేజ్‌పై మన తెలుగు సినిమా పేరు, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణిల పేర్లు మారుమోగుతున్నాయి. మరి అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ అవార్డు ప్రత్యేకత గురించి మీకు తెలుసా? ఇంతకీ ఆస్కార్ అంటే ఏంటి? ఈ అవార్డు ఎలా తయారు చేస్తారు? ఎవరెవరికి.. ఏయే రంగాల వారికి ప్రదానం చేస్తారో ఇక్కడ చూద్దాం! అకాడమీ అవార్డు కాస్తా ఆస్కార్గా ఎలా మారిందంటే? మొదట ఈ అవార్డును అకాడమి అవార్డు అని పిలిచేవారు. దీని పూర్తి పేరు ‘అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్’. ఆ తర్వాత దీనికి ఆస్కార్ అనే పేరు పెట్టారు. ఆ పేరు ఎలా వచ్చిందనేది కచ్చితమైన సమాచారం లేదు. కానీ దీని వెనుక ఓ ఊహాగానం ఉందట. అదేంటంటే ఈ అకాడమీ అవార్డులను ఇచ్చే సంస్థకు మార్గరెట్ హెరిక్ అనే మహిళ సేవలందించారట. విజేతలకు అందించే ఈ అవార్డు ప్రతిమను చూసి ఆమె.. ‘దీని ఆకృతి మా అంకుల్ ఆస్కార్‌లా ఉంది’ అని చెప్పిందట. దీంతో అలా 'ఆస్కార్ అవార్డు' పేరు వచ్చింది. 1939లో ఇదే పేరును అధికారికంగా కూడా స్వీకరించారు. ఈ అవార్డు ప్రతిమను ఎలా తయరు చేస్తారంటే! ఆస్కార్ అవార్డును చూడటానికి బంగారంలా మెరిసిపోతుంది. దీంతో అంతా ఈ అవార్డును బంగారంతో చేస్తారని భావిస్తారు. నిజానికి ఆస్కార్ ప్రతిమలో ఉండేదంతా బంగారం కాదు. దీనిని కాంస్యంతో తయారు చేసి 24 క్యారెట్ బంగారంతో పూత పూస్తారు. ఇక ఈ ప్రతిమను పదమూడున్నర అంగుళాల ఎత్తు అంటే 35 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఎత్తు ఉంటుంది. బరువు మాత్రం దాదాపు నాలుగు కేజీలు (ఎనిమిదిన్నర పౌండ్ల బరువుతో) తయారు చేశారు. దీనికి ఐదు స్పోక్స్ ఉంటాయి. అకాడమీ అవార్డులు అందించే ఐదు ప్రధాన విభాగాలను(నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, రచయితలు) ఇవి సూచిస్తాయి. అయితే ఈ అవార్డు సృష్టికర్త ఎంజీఎం స్టూడియో ఆర్డ్ డైరెక్టర్ కెడ్రిక్ గిబ్బన్స్. ఆయన ఆస్కార్ ప్రతిమను తయారు చేసే సమయంలో డిజైన్ కోసం నటుడు ఎమిలో ఫెర్నాండెజ్‌ను నగ్నంగా నిలబెట్టి ఈ అవార్డు సృష్టించారు. అలా ఆ నటుడు రూపంలో కెడ్రిక్ గిబ్బన్స్ ఆస్కార్ ప్రతిమను డిజైన్ చేశారు. అందుకే ఆస్కార్ ప్రతిమ నగ్నంగా ఉంటుంది. ఇక అవార్డు తయారికి చాలా సమయం పడుతుందట. 50 ఆస్కార్ ప్రతిమలు తయారుచేయాలంటే సాధారణంగా మూడు నెలలు పడుతుంది. మొట్ట మొదటి ఆస్కార్ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం 1929లో మే 16న హాలీవుడ్ లోగల హోటల్ రూజ్వెల్ట్లో జరిగింది. చలన చిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం కోసం నటుడు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, విలియం డెమిలీ కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్‌కు చోటు ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సాంగ్ నామినేట్ అయింది. రీసెంట్గా ఈ జాబితాను ఆస్కార్ నామినేషన్స్ కమిటీ వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 13న అవార్డుల ప్రదానం జరగనుంది. ఇండియా నుంచి మరో రెండు డాక్యుమెంటరీలు స్థానం దక్కించుకున్నాయి. షార్ట్ ఫిల్మ్ విభాగంలో డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విష్పరర్స్, ఆల్ దట్ బ్రీత్స్ ఎంపికయ్యాయి. మొత్తానికి నామినేషన్స్‌లో ఇండియా మూడు చిత్రాలు ఎంపికయ్యాయి. చదవండి: బాలయ్య అనుచిత వ్యాఖ్యలు, ట్రెండింగ్‌లో ‘మెంటల్ బాలకృష్ణ’ హ్యాష్ ట్యాగ్! ఇటివల కొత్త ఇంట్లోకి ప్రవేశం.. తాజాగా లగ్జరీ కారు కొన్న నటి శ్రీవాణి -
ఆస్కార్ రావాలంటే సినిమాకు ఎలాంటి అర్హతలుండాలి..?
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినీ పరిశ్రమను మరో మెట్టుకు ఎక్కించిన ఈ ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే అత్యంత్ర ప్రతిష్టాత్మకమై ఈ అవార్డు రావాలంటే సినిమాకు ఎలాంటి అర్హతుండాలో ఓసారి చూద్దాం.. ఈ ఆస్కార్ అవార్డు కోసం సినిమా ఎదురుకాబోయే చాలా పరీక్షల్లో అర్హత సంపాదించడం అత్యంత ముఖ్యమైంది. ఏ సినిమా అయిన ఆస్కార్ బరిలో ఉండాలంటే.. అది అమెరికాలో గుర్తింపు పొందిన ఆరు ప్రధాన నగరాల్లోని ఏదో ఒక సిటీలో కమర్షియల్ థియేటర్లో రిలీజ్ అవ్వాలి. అంతేకాదు.. కనీసం వారం రోజుల పాటు అక్కడ సినిమా ఆడాలి. రోజుకు కనీసంగా మూడు ఆటల చొప్పున సాయంత్రం షో తప్పకుండా ఉండాలి. ఆస్కార్ అప్లికేషన్ ఫామ్‌లో సినిమా ప్రదర్శించబడినట్లు రిసీట్ కూడా జతచేయాలి. అయితే బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ క్యాటగిరికి ఈ అర్హత అవసరం లేదు. ప్రస్తుత ఏడాదికి ప్రపంచ వ్యాప్తంగా 300లకు పైగా సినిమాలు ఈ అర్హత సాధించినట్లు తెలుస్తోంది. ఇందులో ఇండియా నుంచి ఆర్ఆర్ఆర్, కాంతార, గంగూభాయ్, ది కశ్మీర్ ఫైల్స్, మి వసంత్‌రావ్, రాకేట్రీ లాంటి పలు సినిమాలు అర్హత సాధించాయి. వీటన్నింటిని రిమైండర్ లిస్టుగా పిలుస్తారు. ఇలా రిమైండర్ లిస్టులో ఉన్న సినిమాలన్ని క్యాటగిరీలకు అర్హత సాధించినట్లుగా గుర్తిస్తారు. అయితే ఈ సినిమాలు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ క్యాటగిరి కింద గుర్తించబడవు. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్‌ఫిల్మ్ క్యాటగిరి... ఈ కేటగిరి కోసం ప్రతీ ఒక్క దేశం తమ తరుపున ఒక్క సినిమాను ఆస్కార్ ఎంట్రీ కోసం నామినేట్ చేస్తుంది. ఈసారి దాదాపు 80 దేశాలు ఈ క్యాటగిరి కింద ఒక్కో సినిమాను నామినేట్ చేశాయి. భారత్ తరుపున ఈసారి ఛెల్లో సినిమాను నామినేట్ చేశారు. ఇప్పటికే దాదాపు 10 కేటగిరీలకు సంబంధించిన షార్ట్‌లిస్ట్‌ను డిసెంబర్-21న ప్రకటించింది ఆస్కార్ అకాడమీ. ఇందులో 1. డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్-15 సినిమాలు 2. షార్ట్ డాక్యుమెంటరీ-15 సినిమాలు 3. ఇంటర్నేషనల్ ఫీచర్-15 సినిమాలు 4. మేకప్ అండ్ హేయిర్ స్టైల్-10 సినిమాలు 5. మ్యూజిక్ ఒరిజినల్ స్కోర్- 5 సినిమాలు 6. మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్-15 సినిమాలు 7. షార్ట్ యానేటెడ్ ఫిల్మ్-15 సినిమాలు 8. లైవ్ యాక్షన్-15 సినిమాలు 9. సౌండ్-10 సినిమాలు 10. వీఎఫ్ఎక్స్-10 సినిమాలు ఈ కేటగిరీల్లో ఇండియా నుంచి నాలుగు సినిమాలు ఆస్కార్ అకాడమీ ప్రకటించిన షార్ట్‌లిస్టులో స్థానం సంపాదించుకున్నాయి. ఇందులో 1. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు గాను RRR సినిమా షార్ట్ లిస్టు అయ్యింది. 2. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఛెల్లో సినిమా షార్ట్ లిస్టు అయింది. 3. షార్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో... ఆల్ దట్ బ్రీత్ సినిమాను షార్ట్ లిస్టు చేశారు. 4. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఎలిఫెంట్ విస్ఫర్స్ నామినేట్ అయింది. జనవరి 24న అన్ని కేటగిరీలకు సంబంధించి 5 సినిమాలను అకాడమీ షార్ట్ లిస్టు విడుదల చేయనుంది. ఇక ఒకసారి ఫైనల్ నామినేషన్స్ పూర్తయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆస్కార్ అకాడమీ మెంబర్స్ ఓటింగ్ చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఆస్కార్ అకడామీలో దాదాపు 10 వేల మంది సభ్యులున్నారు. వీరిలో చాలామంది అమెరికాకు చెందినవారే... అయితే ఇందులో ఇండియాకు చెందిన 40మంది ఉన్నారు. అకాడమీకి చెందిన 10వేల మంది సభ్యులు దాదాపు 16 క్రాఫ్ట్‌లకు చెందిన వారై ఉంటారు. వీరి ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్ ఇలా చాలా విభాగాలకు సంబంధించినవారు. వీరు ముందుగా అర్హత సాధించిన 300 సినిమాలను వివిధ కేటగిరీలకు నామినేట్ చేసే ప్రక్రియలో ఓటింగ్ చేస్తారు. చివరికి షార్ట్ లిస్టు అయిన సినిమాలకు వీరు వేసే ఓటే డిసైండింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. వీరిలో చాలామంది అమెరికాకు చెందిన వారు కావడంతో వీరంతా అమెరికాలో బ్లాక్‌బస్టర్ అయిన సినిమాలకు ఓటు వేస్తారనే చర్చ ఉంది. అందుకే సినిమా ప్రమోషన్ చాలా ముఖ్యమైంది. ఇప్పటికే నాటు నాటు పాటకు ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో... RRR సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. అమెరికాలో సైతం చాలామంది RRR సినిమాను ప్రశంసించారు. సినిమా దేవుడిగా పిలిచే స్టీఫెన్ స్పీల్బర్గ్ సైతం తనకు నాటు నాటు పాట బాగా నచ్చిందని చెప్పారు. అందుకే ఈసారి RRR సినిమాకు ఆస్కార్ పక్కా అనే చర్చ జరుగుతోంది. నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు సాధించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంతే కాకుండా షార్ట్ లిస్ట్ చేయకుండానే కొన్ని బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్ లాంటి కేటగిరీలకు డైరెక్ట్‌గా నామినేషన్స్ చేస్తారు. ఇలాంటి కేటగిరీల్లోనూ RRR సినిమాకు ఛాన్స్ ఉందని అంటున్నారు. --ఇస్మాయిల్, ఇన్ పుట్ఎడిటర్, సాక్షి టీవీ -
నాటు నాటుకు డ్యాన్స్ చేశా!
షారుక్ ఖాన్, దీపికా పదుకోన్ జంటగా నటించిన చిత్రం ‘పఠాన్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ హిందీ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. కాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు హీరో రామ్‌చరణ్. ఈ సందర్భంగా ట్విట్టర్లో తనదైన స్టైల్లో రామ్‌చరణ్‌కి కృతజ్ఞతలు చెప్పారు షారుక్ ఖాన్. ‘‘థ్యాంక్యూ సో మచ్. నా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్. మీ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఆస్కార్ అవార్డును ఇండియాకు తీసుకొచ్చినప్పుడు దయచేసి నన్ను తాకనివ్వండి.. లవ్యూ’’ అని ట్వీట్ చేశారు షారుక్. ‘‘తప్పకుండా ఎస్ఆర్కే సార్. ఈ అవార్డు ఇండియన్ సినిమాకు చెందింది’’ అని పోస్ట్ చేశారు చరణ్. కాగా ‘నాటు నాటు..’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించడం పట్ల షారుక్ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. ఉదయం వార్త తెలిసిన వెంటనే ‘నాటు నాటు..’ పాటకు డ్యాన్స్ చేశానని ట్విట్టర్లో వెల్లడించారు. భారత్‌ను గర్వపడేలా చేశారని ప్రశంసించారు. -
జెలెన్స్కీకి ఆస్కార్ అవార్డునే ఇచ్చేశాడు
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీకి ఆస్కార్ అవార్డు దక్కింది. అయితే అది నటనలో కాదు.. పోరాటంలో!. హాలీవుడ్ ప్రముఖ నటుడు సీన్పెన్ తన ఆస్కార్ అవార్డులలో ఒక దానిని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీకి ప్రదానం చేశారు. ఈ మేరకు ఉక్రెయిన్‌ని సందర్శించడానికి వచ్చిన పెన్ ఈ అవార్డుని జెలెన్స్కీకి అందించారు. తాను జెలెన్స్కీని ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేయడానికి ముందు, ఆ తర్వాత కూడా కలిశానని అన్నారు సీన్పెన్. ‘‘ఆయన ఈ యుద్ధం కోసమే పుట్టాడు కాబోలు అన్నారు. అతని అంతులేని ధైర్యం, తెగువకు తాను ఫిదా అయ్యాను’’ అంటూ జెలెన్ స్కీపై ప్రశంసలు గుప్పించారు సీన్పెన్. అతను ఉక్రెయిన్లను ఒకతాటిపైకి తీసుకువచ్చి ఏకీకృతం చేయు విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందన్నాడు పెన్. ఆయన ఉక్రెయిన్ల ప్రతిబింబం అని కొనియాడాడు. అలాగే జెలన్స్కీ పెన్‌కి తమ దేశ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌ను ప్రధానం చేశారు. పెన్ ప్రపంచ స్థాయి నటుడిగానే కాకుండా రాజకీయ క్రియశీలత పరంగా కూడా మంచి పేరు ఉంది ఈ మేరకు ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల సలహాదారు మంత్రి అంటోన్ గెరాష్చెంకో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని అమెరికన్ నటుడి సీన్పెన్ని కలిసిన వీడియోను సోషల్ మాధ్యమంలో పోస్ట్ చేశారు. 62 ఏళ్ల వయసున్న సీన్పెన్.. తన కెరీర్లో ఇప్పటిదాకా ఐదు ఆస్కార్లను ఉత్తమ నటుడు కేటగిరీ కింద అందుకున్నారు. Sean Penn has given his Oscar to Ukraine - @ZelenskyyUa Thank you, sir! It is an honor for us. pic.twitter.com/vx2UfEVTds — Anton Gerashchenko (@Gerashchenko_en) November 8, 2022 (చదవండి: ఇంగ్లండ్, వేల్స్ విదేశీ నివాసితుల్లో అత్యధికులు భారత్‌లో పుట్టిన వారే) -
ఆస్కార్ బరిలో నాని సినిమా.. మూడు క్యాటగిరిల్లో పోటీ
నాని, సాయిపల్లవి, కృతీ శెట్టి కాంబినేషన్లో రూపొందిన ‘శ్యామ్ సింగరాయ్’ ఆస్కార్ పోటీకి వెళ్లింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ పీరియాడికల్ ఫిక్షనల్ డ్రామా గత ఏడాది డిసెంబర్లో విడుదలై, మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందులో శ్యామ్ సింగరాయ్ అనే అభ్యుదయ భావాలున్న బెంగాలీ రచయితగా, ఫిల్మ్ మేకర్‌గా రెండు పాత్రల్లో నాని నటన ప్రేక్షకులను మెప్పించింది. చదవండి: అందాల ఆరబోతలో తప్పేం లేదు: హీరోయిన్ దేవదాసీగా సాయిపల్లవి నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రం మూడు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్‌కి పోటీ పడుతోంది. పీరియాడిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, భారతీయ సంప్రదాయ క్లాసిక్ విభాగాల జాబితాలో నామినేషన్ పరిశీలనకు పంపారు. వచ్చే ఏడాది మార్చిలో 95వ ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. నామినేషన్ జాబితాని జనవరిలో ప్రకటించే అవకాశం ఉంది. మరి.. ‘శ్యామ్ సింగరాయ్’కి మూడు విభాగాల్లోనూ నామినేషన్ దక్కుతుందా? కాని పక్షంలో ఏదో ఒక విభాగంలో అయినా దక్కించుకుంటుందా? అనేది చూడాలి. -
‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్... అనురాగ్ అంచనాలు నిజమైతే!
ఇండియన్ సినిమాకు ఆస్కార్ అన్నది ఒక కల. ప్రతీ ఏటా మనం సినిమాను ఎంపిక చేసి ఆస్కార్ కమిటీకి పంపడం.. వారు మన సినిమాను రిజెక్ట్ చేయడం పరిపాటిగా మారింది. కాని 2023 ఆస్కార్ కు ఇండియా నుంచి వెళ్లే సినిమాను ఎంపిక చేయాల్సి వస్తే గుడ్డిగా ఆర్ ఆర్ ఆర్ ను సెలక్ట్ చేయమంటున్నాడు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్. వచ్చే ఏడాది జరిగే ఆస్కార్ అవార్డ్ ఈవెంట్ కు మన దేశం తరుపున కమిటీ కనుక ఆర్ ఆర్ ఆర్ ను సెలక్ట్ చేసి పంపితే ఉత్తమ విదేశి చిత్రం క్యాటగరీలో ఆస్కార్ అందుకోవడానికి 99 శాతం చాన్స్ ఉందని అభిప్రాయపడ్డాడు. తాప్సీ ప్రధాన పాత్రలో అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన హిందీ చిత్రం ‘దోబారా’. ఆగస్ట్ 19న ఈ చిత్రం విడుదల కాబోతుంది. కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా అనురాగ్ మీడియాతో మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియా నుంచి అధికారిక ఎంట్రీ లభిస్తే.. ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ లభించే అవకాశం ఉందని చెప్పారు. (చదవండి: తాప్సీపై డైరెక్టర్ వల్గర్ కామెంట్స్, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు) హాలీవుడ్‌పై ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రభావితం చేసిందని, అక్కడ తెరకెక్కిన మార్వెల్ మూవీస్ కంటే కూడా ఆర్ఆర్ఆర్ హాలీవుడ్ ఆడియెన్స్ కు బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు అనురాగ్. ఇక వెరైటీ అనే మరో హాలీవుడ్ మ్యాగజైన్ఆస్కార్ బెస్ యాక్టర్ క్యాటగరీస్ లిస్ట్ లో తారక్ కూడా ఎంపిక అయ్యే అవకాశం ఉందంటూ లిస్ట్ బయటపెట్టింది.మొత్తంగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన తర్వాత ఆర్ ఆర్ ఆర్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. -
ఆస్కార్ బరి నుంచి నిష్క్రమించిన కూళంగల్
-
ఆస్కార్స్‌కు ప్రియాంక?
ఇండియన్ సినిమాను ప్రపంచస్థాయిలో పాపులర్ చేస్తున్న నటీనటుల్లో ప్రియాంకా చోప్రా ఒకరు. గతంలో ఓసారి ఆస్కార్ అవార్డులకు అతిథిగా వెళ్లారామె. తాజాగా ఆస్కార్‌ను ఇంటికి తీసుకురావడానికి వెళ్తున్నారని సమాచారం. ప్రియాంకా చోప్రా నటిస్తున్న తాజా చిత్రం ‘ది వైట్ టైగర్’. ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కోసం ఈ సినిమా చేస్తున్నారామె. వచ్చే ఏడాది జరగబోయే ఆస్కార్ వేడుకలో ఈ చిత్రం తరఫున ఉత్తమ సహాయ నటి విభాగంలో ప్రియాంక చోటు దక్కించుకునే అవకాశం ఉందని టాక్. ఈ లిస్ట్‌లో ఆల్రెడీ హాలీవుడ్ స్టార్స్ మెరిల్ స్ట్రీప్స్, క్రిస్టిన్ స్కాట్ థామస్, ఒలీవియా కోల్మన్ ఉండొచ్చని తెలిసింది. మరి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ను ప్రియాంక గెలుచుకుంటారా? వేచి చూడాలి. ఇండో–ఆస్ట్రేలియన్ రచయిత అరవింద్ అడిగి రచించిన ‘ది వైట్ టైగర్స్’ నవలను అదే పేరుతో సినిమాగా రూపొందిస్తున్నారు. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం విడుదలవుతుంది. -
నీ ప్రతిభను బాలీవుడ్ హ్యాండిల్ చేయలేదు
‘‘నువ్వు ఆస్కార్ అవార్డు అందుకున్నప్పుడే బాలీవుడ్ హ్యాండిల్ చేయలేనంత టాలెంట్ నీది అని నిరూపితమైంది రెహమాన్’’ అంటున్నారు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు శేఖర్ కపూర్. ‘‘నా దగ్గరకు సినిమా (హిందీని ఉద్దేశించి) లు రానీయకుండా ఓ గ్యాంగ్ తెగ ప్రయత్నిస్తోంది. నా గురించి లేనిపోని వార్తలు ప్రచారం చేస్తోంది’’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు రెహమాన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెహమాన్ కి మద్దతుగా నిలిచారు శేఖర్ కపూర్. ‘‘రెహమాన్ ఈ సమస్య ఎందుకు ఏర్పడిందో చెప్పనా? నువ్వు ఆస్కార్ సాధించిన సంగీత దర్శకుడివి. ఆస్కార్ గెలవడం అంటే బాలీవుడ్ లో మృత్యువుని ముద్దాడినట్టే. నిన్ను బాలీవుడ్ హ్యాండిల్ చేయలేనంత ప్రతిభ నీలో ఉంది అని అర్థం’’ అని ట్వీట్ చేశారు శేఖర్ కపూర్. దీనికి రెహమాన్ సమాధానమిస్తూ – ‘డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. పేరు పోతే కూడా సంపాదించుకోవచ్చు. కానీ విలువైన సమయాన్ని వృథా చేస్తే మళ్లీ ఎంత ప్రయత్నించినా తిరిగి తెచ్చుకోలేము. అందుకే ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోవద్దు. మనం చేయాల్సిన గొప్ప పనులు ఎన్నో ఉన్నాయి. వాటి మీద దృష్టిపెడదాం’’ అన్నారు. -
కలల కుండీ
ఆశల కలలు.. నింగిలో మొలకెత్తే పూల విత్తనాలు. మట్టినేలపై కూడా విరిసే ఇంద్ర ధనుస్సులు. లేమికి చెరగని చిరునవ్వులు... ఈదురు గాలులకు చెదరని వెదురు తడికెల గదులు. మలీషా కళ్ల నిండా ముంబై పట్టనన్ని కలలు. మోడలింగ్.. డ్యాన్స్.. మంచి లైఫ్.. ఫ్యామిలీకి ఫుడ్. మరో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ స్టోరీ ఉందిక్కడ! ఆ స్టోరీని కుండీలో నాటి వెళ్లాడు ఓ హాలీవుడ్ హీరో. మలీషా జీవితానికి లాక్డౌన్ ఇచ్చిన స్క్రీన్‌ప్లే ఇది! పన్నెండేళ్ల మలీషా ఖర్వాకు మోడలింగ్ అంటే ఇష్టం. ‘ఏముంటుంది అందులో ఇష్టపడటానికి?’ అని అడిగితే.. ‘కెమెరా వైపు చూస్తూ నడుము మీద చేతులు వేసుకుని పోజులు ఇవ్వడం బాగుంటుంది’ అంటుంది నవ్వుతూ మలీషా! తనెక్కడో చూసి ఉండాలి మోడల్స్ అలా చేస్తారని. ఎక్కడైనా చూసి ఉండాలి కానీ, తనింట్లో మాత్రం కాదు. ఎందుకంటే ముంబైలోని బాంద్రాలో ఓ మురికివాడలో తండ్రి, తమ్ముడు సాహిల్ (7)తో పాటు ఒక వెదురు గొట్టాల రేకుల షెడ్డులో ఉంటున్న మలీషా ఇంట్లో టీవీ లేదు. అలాంటి ఇంటికి హాలీవుడ్ నటుడు, డాన్సర్, కొరియోగ్రాఫర్ రాబర్ట్ హాఫ్‌మ్యాన్ వచ్చాడు! డ్యాన్స్ సినిమా ‘ది స్టెప్ అప్ 2: ది స్ట్రీట్స్’ ఫేమ్ అతడు. గత మూడు నెలలుగా ముంబైలోనే ఉంటూ మలీషా ఇంటికి వెళ్లొస్తూ అక్కడ ఉన్నంతసేపు సరదాగా హిందీ నేర్చుకుంటున్నాడు. అతడి వల్ల మలీషాకూ కాస్త ఇంగ్లిష్ వచ్చింది. అయితే రాబర్ట్ ముంబై వచ్చిన పని వేరే. ముందు డ్యాన్సర్, ఆ తర్వాతే నటుడు హాఫ్‌మ్యాన్. తాను నటించిన సినిమాలలో ఎక్కువగా అతడు డ్యాన్సర్ పాత్రలోనే కనిపిస్తాడు. తూర్పు ఐరోపా దేశాల్లో డ్యాన్స్ టీచింగ్ క్లాసుల టూర్ పెట్టుకుని ఫిబ్రవరిలో ముంబైలో దిగాడు హాఫ్‌మ్యాన్. టూర్లో భాగంగా తను ప్లాన్ చేసిన మ్యూజిక్ వీడియో లో నటించడానికి అతడికి మురికివాడల నుంచి కాస్త డ్యాన్స్ తెలిసిన అమ్మాయి కావలసి వచ్చింది. అప్పుడే మలీషా ఖర్వా గురించి అతడికి తెలిసింది. ముంబైలో హాఫ్మ్యాన్కి ఆతిథ్యం ఇచ్చిన అభిమాని అతడిని మలీషా ఇంటికి తీసుకెళ్లింది. ‘‘మలీషాది చక్కటి నవ్వుముఖం. చక్కగా డ్యాన్స్ కూడా చేస్తుందని మా పనమ్మాయి చెప్పింది’’ అని ఆమె చెప్పిన మాట నిజమేననిపించింది మలీషాను చూడగానే. అయితే మ్యూజిక్ వీడియోలోని స్లమ్ పాత్రకు అంతకన్నా తక్కువ ‘వెలుగు’ ఉండే అమ్మాయి కావాలి. మలీషా కజిన్‌ని తీసుకున్నాడు హాఫ్‌మ్యాన్. షూట్ పూర్తయింది. ఈలోపు లాక్డౌన్. చాన్స్ రానందుకు తనేమీ బాధపడలేదు మలీషా. అందుకు కారణం హాఫ్‌మ్యాన్. ‘‘మలీషా.. నువ్వు మోడలింగ్‌కి చక్కగా పనికొస్తావు. అయితే వెంటనే కాదు. ఇంకా కొన్ని రోజులకు. అప్పుడు నువ్వు డ్యాన్స్ కూడా ఇంకా బాగా చేయగలుగుతావు’’ అన్నాడు. ఇంకా కొన్నాళ్లు తను ముంౖ»ñ లోనే ఉంటాడు కాబట్టి తనకు హిందీ నేర్పించమని అడిగాడు. ఆ రేకుల షెడ్డులోనే మలీషా కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని మలీషా చెబుతుంటే ఒక్కో మాటా నేర్చుకున్నాడు. ‘మేరా ఫోన్ ఖరాబ్ హోగయా’ అని మలీషా చెప్పమన్నప్పుడు.. ‘హోగయా’ అనే మాటను సరిగా పలకలేక ఆ అమెరికా ఆయన ‘హోపలా’ అనగానే మలీషా ఎలా పడీ పడీ నవ్విందో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో హాఫ్‌మ్యాన్ అప్లోడ్ చేసిన వీడియోలో చూడొచ్చు. రాబర్ట్ హాఫ్మ్యాన్తో మలీషా మలీషా కోసం అతడే ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను క్రియేట్ చేశాడు. తనే మలీషా ఫొటోలు తీసి అందులో పోస్ట్ చేశాడు. ‘హాయ్, నేను ఉంటున్న చోటును మురికివాడ అని అంతా అంటుంటారు. కానీ ఐ లవ్ మై హోమ్. నా ఫ్యామిలీని పోషించుకోవడం కోసం నేను మోడల్ని కావాలని అనుకుంటున్నాను. ఇదీ నా జర్నీ. నా వయసు 12’ అని ఇన్‌స్టాలో సైడ్ యాంగిల్లో కనిపిస్తూ ఉంటుంది మలీషా. హాఫ్మ్యాన్కు ఒకటే ఆశ్చర్యం. ఇంత ముఖసిరి గల అమ్మాయిని ఇంకా ఎవరూ మోడలింగ్‌కి తీసుకోకపోవడం ఏంటని! బహుశా ఇండియన్స్‌కి చర్మం రంగు మీద ఉన్న పట్టింపు ఇందుకు కారణం కావచ్చునని అనుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లోనైతే మలీషా ఫాలోవర్లు ఆమెను ‘స్లమ్ ప్రిన్సెస్’ అని కీర్తించడం మొదలుపెట్టేశారు. ‘‘మీ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది’’ అని మలీషా తండ్రితో హాఫ్‌మ్యాన్ అన్నప్పుడు ఆయన ముఖం వెలిగిపోయింది. కూతుర్ని మురిపెంగా దగ్గరకు తీసుకున్నాడు. (పైన పన్నెండేళ్ల క్రితం ఆస్కార్ వేడుకలో రుబీనా (9), (కింద) ప్రస్తుతం రుబీనా (21) లాక్‌డౌన్‌కి సడలింపులు రాగానే హాఫ్‌మ్యాన్ తిరిగి టూర్‌కి రెడీ అయ్యారు. ఈలోపు మలీషా ‘వ్లోగింగ్’ (వెబ్సైట్లో ఫొటోలు, వీడియోలు షేర్ చేయడం) కోసం మంచి కెమెరా ఉన్న సెల్‌ఫోన్‌ను గిఫ్టుగా ఇవ్వబోతున్నాడు. అప్పటికే అతడు మలీషా పేరు మీద ‘గోఫండ్‌మి’ అనే వెబ్ పేజీని క్రియేట్ చేశాడు. ఇంతవరకు మలీషాకు 76 వేల రూపాయల విరాళాలు వచ్చాయి. హాఫ్మ్యాన్ని రాబర్ట్ అంటుంది మలీషా. ‘‘నా కలల్ని నిజం చేసుకోడానికి రాబర్ట్ నాకు చాలా హెల్ప్ చేశారు’’ అంటోంది తను. పన్నెండేళ్ల క్రితం రుబీనా బాంద్రాకు సమీపంలోని మురికివాడల మట్టి నుంచే పన్నెండేళ్ల క్రితం రూబినా అలీ అనే మాణిక్యం బయటపడింది. ఎనిమిది కేటగిరీలలో ఆస్కార్ గెలుచుకున్న ‘స్లమ్‌డాక్ మిలియనీర్’ చిత్రంలోని బాలనటిగా రుబీనాకు గుర్తింపు వచ్చింది. ఆ సినిమా దర్శకుడు డ్యానీ బోయల్ ‘జయహో ట్రస్టు’ కింద బాంద్రాలోనే కట్టించి ఇచ్చిన సొంత ఇంట్లో ఇప్పుడు రుబీనా కుటుంబం ఉంటోంది. రుబీనా ప్రస్తుతం (లాక్డౌన్ ముందు వరకు) ఓ మేకప్ స్టూడియోలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తోంది. బాంద్రా మురికివాడలో మలీషా ఉంటున్న ఇల్లు -
దక్షిణ కొరియా సినిమాకు ఆస్కారా?: ట్రంప్
కొలరాడో స్ప్రింగ్స్: దక్షిణ కొరియా తీసిన ‘పారాసైట్స్’సినిమాకు ఆస్కార్ అవార్డు ఇవ్వడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు. ఒక విదేశీ చిత్రానికి అంత గౌరవం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ‘ఈ ఏడాది అకాడమీ అవార్డులు ఘోరంగా ఉన్నాయి..’అని ఆయన వ్యాఖ్యానించారు. కొలరాడో స్ప్రింగ్స్‌లో జరిగిన ఎన్నికల ప్రచారం ర్యాలీలో ట్రంప్ మాట్లాడారు. ‘దక్షిణ కొరియాతో ఉన్న వాణిజ్య సమస్యలు చాలు.. వారికి ఈ ఏడాది ఉత్తమ చిత్రం అవార్డును ఎలా ప్రకటిస్తారు..’అని ప్రశ్నించారు. హాలీవుడ్ అతి పెద్ద వార్షిక బహుమతి ఆస్కార్ గెలుచుకున్న మొదటి ఆంగ్లేతర భాషా చిత్రంగా పారాసైట్స్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. పారాసైట్ సినిమాకు అవార్డు ఇవ్వడం మంచిదా? కాదా? అనేది తనకు తెలియదన్న ట్రంప్ తాను ఆ చిత్రాన్ని చూడబోనని చెప్పకనే చెప్పారు. -
అంత బాగా చేశానా!
‘గల్లీ బాయ్’ సినిమా విడుదలై ఏడాది అవుతోంది. 40 కోట్లు పెట్టి తీస్తే, 240 కోట్లు వచ్చాయి! అందులో అలియా భట్ నటన కోట్ల రూపాయల్ని మించిపోయింది. ఏడాదిగా అందరూ అలియాను ప్రశంసిస్తున్నవారే. ఆస్కార్ అవార్డుల నామినేషన్‌కు ఎంపికై, నామినేషన్‌ను దక్కించుకోక పోయినప్పటికీ.. ‘‘గల్లీ బాయ్ అలియాకు ఆస్కార్ లాంటిదే’ అని అలియాకు అభిమానులు అయినవారు, కానివారు కూడా అంటుంటే అలియా ఆ ‘భారాన్ని’ మోయలేకపోతున్నారు. ‘‘నిజంగా నేను అంత బాగా చేశానా అనిపిస్తోంది. ఇంకొక సందేహం కూడా వస్తోంది. ఈ అభినందనలకు నేను అర్హురాలినేనా అని! నాక్కూడా ఆ సినిమాలో నా పాత్ర నచ్చింది కానీ, ప్రేక్షకులకు మరీ ఇంత బాగా నచ్చడమే నన్ను ఆత్మన్యూనతకు గురి చేస్తోంది’’ అని బుధవారం ముంబై మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అన్నారు అలియా. అలియా సెల్ఫ్ క్రిటిక్. స్వీయ విమర్శ చేసుకుంటారు. ఎవరైనా విమర్శించినా సంతోషంగా స్వీకరిస్తారు. గల్లీ బాయ్‌లో అంత బాగా చేశాక కూడా.. ‘డిడ్ ఐ వర్క్ హార్డ్’ అని తనను తను ప్రశ్నించుకుంటున్నారంటే.. ఇప్పుడు ఆమె చేస్తున్న ‘సడక్ 2’లో మరింత బాగా నటించబోతున్నారనే అనుకోవాలి. -
ఆస్కార్ అవార్డు ఖచ్చితంగా దీనికే
-
‘ఆస్కార్’ ఎంత పని చేసింది!
జీవితమే ఒక సినిమా అంటుంటారు. ఒక్కోసారి జీవితం కూడా సినిమాలా సాగుతుంటుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్నేహ, సుమన్ అనే యువతుల జీవితాలు ఒక్క సినిమాతో మారిపోయాయి. మూడు నెలల క్రితం సెలబ్రిటీ స్టేటస్ అనుభవించిన ఈ ఇద్దరిని ఇప్పుడు పట్టించుకునేవారే కరువయ్యారు. సినీమాయాజాలం ఇదే కామోసు! ఫ్లై (ఊ y) అనే స్వచ్ఛంద సంస్థ 2017లో కాథిఖేరా గ్రామంలో శానిటరీ ప్యాడ్ తయారీ యూనిట్ పెట్టింది. వీటి గురించి ఏమాత్రం అవగాహన లేని గ్రామస్తులు శానిటరీ ప్యాడ్స్ తయారీని వింతగా చూశారు. 28 ఏళ్ల సుమన్, 22 ఏళ్ల స్నేహ ధైర్యంగా ముందడుగు వేశారు. ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్యాడ్స్ తయారీకి వెళ్లేవారు. ఈ ధైర్యమే వారికి సినిమా అవకాశం తెచ్చిపెట్టింది. శానిటరీ ప్యాడ్ తయారీ యూనిట్ ఏర్పాటు, తదనంతర పరిణామాలపై 26 నిమిషాల నిడివితో డాక్యుమెంటరీని ఇరానియన్–అమెరికన్ దర్శకురాలు రేఖ జెహతా బచ్చి తెరకెక్కించారు. ఇందులో సుమన్, స్నేహ నటించారు. ఈ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు దక్కడంతో వీరిద్దరూ అమెరికా వెళ్లి అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని ఈ ఏడాది మార్చిలో సొంతూరికి తిరిగొచ్చిన స్నేహ, సుమన్‌లకు ఘన స్వాగతం లభించింది. వారిని స్వాగతించేందుకు ఊరు మొత్తం కదిలొచ్చింది. మరుసటి రోజుకు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడిపారు. తమ ఊరి పేరును ప్రపంచమంతా మార్మోగిపోయేలా చేశారంటూ వీరిని ఘజియాబాద్ జిల్లా హాపూర్ తాలుకాలోని కాథిఖేరా గ్రామస్తులు పొగడ్తలతో ముంచెత్తారు. కాథిఖేరా గ్రామం పేరు కూడా ప్రసార సాధనాల్లో ప్రముఖంగా కనబడింది. ఆ తర్వాత వీరిద్దరి జీవితం తలకిందులైంది. ఆర్థిక సమస్యలు చట్టుముట్టడం, ఉన్న ఉపాధి కోల్పోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. ‘మేము మంచి సినిమాలో నటించాం. కానీ ఈరోజు మేము ఎక్కడ ఉన్నామో చూసుకుంటే బాధ కలుగుతుంది. ఆస్కార్‌తో తలరాత మారుతుందని అనుకున్నాం కానీ అప్పుల్లో కూరుకుపోతామని ఊహించలేదు. ఎవరో ఒకరు మమ్మల్ని ఆదుకోవాల’ని సుమన్ దీనంగా వేడుకుంటోంది.ఏదో ఒకరోజు ఢిల్లీ పోలీసు దళంలో చేరాలని చేరాలని కలలు కన్న స్నేహ డబ్బుల్లేక కోచింగ్ క్లాసులు మానుకుంది. ‘నెలకు రూ. 2500 ఇచ్చే ఫ్లై సంస్థ నాకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. ఇక నుంచి పనులకు రావొద్దని సంస్థ ప్రతినిధి చెప్పారు. నాకు రావాల్సిన జీతం డబ్బుల గురించి అడిగితే ముందే లక్ష రూపాయలు ఇచ్చామని, ఇక ఇవ్వాల్సిన అవసరం లేదన్నార’ని వాపోయింది. ఆస్కార్ అవార్డు దక్కించుకున్నందుకు సుమన్, స్నేహలకు ఉత్తరప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్.. చెరో లక్ష రూపాయలు రివార్డుగా ఇచ్చారు. గవర్నర్ రామ్‌నాయక్ 50 వేల చొప్పున బహూకరించారు. అయితే ఈ సొమ్ము తమకే చెందుతుందని వాదిస్తూ ఫ్లై సంస్థ తమను ఇబ్బంది పెడుతోందని సుమన్ తెలిపారు.సుమన్, స్నేహ ఆరోపణల్లో వాస్తవం లేదని, చేతులారా వారి జీవితాన్ని వారే దిగజార్చుకున్నారని ఫ్లై సంస్థ వాదిస్తోంది. అమెరికా నుంచి వచ్చిన తర్వాత వీరిద్దరూ పనిని నిర్లక్ష్యం చేశారు. రెండు నెలలుపైగా పనిలోకి రాలేదు. ఆరుగురు మనుషులతో నడిచే చిన్న యూనిట్లో ఇద్దరు పని మానేస్తే ఎంత కష్టమవుతుంది. పనిలోకి చాలాసార్లు చెప్పినా వారు వినిపించుకోలేదని సదరు సంస్థ వివరించింది. మరోవైపు రుతుక్రమంపై అవగాహన పెరగడం, శానిటరీ ప్యాడ్ లభ్యత స్థానికంగా పెరగడంతో వీరు తయారు చేసే వాటిని డిమాండ్ కూడా తగ్గింది. సుమన్, స్నేహల పరిస్థితి ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. వీరిద్దరూ ఎలా గట్టెక్కుతారో చూడాలి! – పోడూరి నాగ శ్రీనివాసరావు సాక్షి వెబ్ డెస్క్ -
ఆస్కార్ గెలిచిన భారతీయ చిత్రం..!
కోట్ల రూపాయల బడ్జెట్‌తో చిత్రాలు తీసే భారతీయ దర్శకనిర్మాతలకు.. కథను పట్టించుకోకుండా కేవలం కండల ప్రదర్శన.. దుమ్ము రేపే విన్యాసాలను నమ్ముకునే హీరోలకు భారీ షాక్ తగిలింది. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలంటేనే అదోలా మొహం పెట్టే వారి దిమ్మతిరిగి పోయే విచిత్రం ఒకటి ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల కార్యక్రమలో చోటు చేసుకుంది. స్త్రీ జీవితంలో ప్రధాన పరిణామమైన రుతుచక్రం ఇతివృత్తంతో రూపొందిన ‘పీరియడ్ : ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ డాక్యూమెంటరీకి ఆస్కార్ అవార్డ్ లభించింది. ప్రముఖ నిర్మాత గునీత్ మోంగా భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న రుతుక్రమ సమస్యల నేపథ్యంలో నిర్మించిన డాక్యుమెంటరీ ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. రేకా జెహ్‌తాబ్చి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పీరియడ్స్ సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలను.. వాటి పట్ల జనాలకున్న అపోహలను.. సమాజం తీరును ఈ డాక్యుమెంటరీలో చూపించారు. ఆస్కార్ అవార్డును అందుకున్న సందర్భంగా రేకా స్టేజ్‌పై ప్రసంగిస్తూ.. ‘ఓ మై గాడ్. మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్య గురించి నేను డాక్యుమెంటరీ తీస్తే దానికి ఆస్కార్ వచ్చింది. నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ‘మేము గెలిచాం. భూమ్మీద ఉన్న అమ్మాయిలందరు దేవతలు. ఇప్పుడు ఈ మాటని స్వర్గం కూడా వింటుంద’ని గునీత్ మోంగా ట్వీట్ చేశారు. WE WON!!! To every girl on this earth... know that you are a goddess... if heavens are listening... look MA we put @sikhya on the map ❤️ — Guneet Monga (@guneetm) February 25, 2019 అయితే ఇప్పటివరకు ఎన్నో భారతీయ చిత్రాలు ఆస్కార్‌కు నామినేట్ అయినప్పటికీ.. అవార్డుల విషయానికి వచ్చేసరికి నిరాశే మిగిలింది. అలాంటిది ఓ డాక్యుమెంటరీ.. అందునా స్త్రీ సమస్య ఇతివృత్తంగా తెరకెకిక్కన చిత్రం ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును గెలిచి చరిత్ర సృష్టించింది. -
మనస్సాక్షే దారి చూపుతుంది!
ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన పాటలు నిత్యం ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటాయి. రెహమాన్‌ను గుర్తు చేస్తూనే ఉంటాయి. పదేళ్ల క్రితం ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రానికిగాను రెండు ఆస్కార్ అవార్డులను అందుకున్నారు రెహమాన్. 81వ ఆస్కార్ వేడుకలో పది అవార్డ్స్‌కు నామినేట్ అయిన ఈ చిత్రం ఎనిమిది అవార్డులను గెలుచుకుంది. అందులో రెహమాన్‌కు రెండు వచ్చాయి. ఈ చిత్రం ఆస్కార్ సాధించి పదేళ్లయిన సందర్భంగా ముంబైలో ఓ వేడుక జరిగింది. ఈ వేడుకలో ఏఆర్ రెహమాన్, ఆయన కుమార్తె ఖతీజాల ఎమోషనల్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. ‘‘ఎన్నో పెద్ద పెద్ద అవార్డులను సాధించిన ప్రముఖ సంగీత దర్శకునిగా మా నాన్నగారు ప్రపంచానికి తెలుసు. మా నాన్న రెండు ఆస్కార్ అవార్డులు సాధించి పదేళ్లు అవుతోంది. ఈ పదేళ్లలో ఆయనలో ఏ మార్పు రాలేదు. అయితే కుటుంబానికి కేటాయించే సమయం తగ్గింది. అయినప్పటికీ మధ్య మధ్య మమ్మల్ని విహారయాత్రలకు తీసుకెళుతూ ఆ లోటు కూడా తెలియకుండా చేస్తున్నారు. మా నాన్నగారు గొప్ప మానవతావాది. ఎందరికో సహాయం చేస్తుంటారు. కానీ వాటిని మాతో కూడా పంచుకోరు’’ అని ఖతీజా అన్నారు. ఆ తర్వాత ‘మాతో పాటు ఇప్పటి యువతీ యువకులు పాటించేలా ఏవైనా సలహాలు ఇస్తారా?’ అని తండ్రిని ఖతీజా అడిగితే ‘‘నిజానికి నాకు సలహాలు ఇవ్వడం నచ్చదు. నేను పెరుగుతున్నప్పుడు మా అమ్మ చెప్పిన విలువలనే మీకు (తన బిడ్డలను ఉద్దేశించి) చెబుతూ వచ్చాను. ఇప్పుడు మీరు మీ హార్ట్‌ని ఫాలో అయ్యే టైమ్ వచ్చింది. జీవితంలో నీ మనస్సాక్షి మీకు మంచి మార్గనిర్దేశకం అవుతుంది. ఆ భగవంతుడు కూడా మీకు దారి చూపించాలని కోరుకుంటున్నాను’’ అని భావోద్వేగంగా బదులిచ్చారు ఏఆర్ రెహమాన్. ఈ వేడుకలో నటుడు అనిల్ కపూర్, రచయిత గుల్జార్ తదితరులు పాల్గొన్నారు. ‘‘పదేళ్ల క్రితమే రెహమాన్ ఆస్కార్ సాధించడం చాలా ఆనందంగా ఉంది’’ అని ఏ పాటకైతే రెహమాన్ అవార్డు సాధించారో ఆ పాటను రచించిన గుల్జార్ అన్నారు. -
ప్రసారం సమాప్తం
ఒక ఆడపిల్ల కదలికలను ప్రేమతోనైనా సరే నియంత్రించడం అత్యాచారం కన్నా ఏం తక్కువ? అది సాహిత్యం అయినా, సన్నివేశం అయినా.. ఇట్సే ‘రేపీ’. మీటూ ఉద్యమం పుణ్యమా అని కొత్తగా కలిగిన ఈ స్పృహతో యు.ఎస్. రేడియో స్టేషన్లు.. డెబ్బై నాలుగేళ్లుగా క్రిస్మస్ సీజన్లో తాము ప్రసారం చేస్తున్న ‘బేబీ, ఇట్స్ కోల్డ్ అవుట్‌సైడ్’ అనే ఆస్కార్ అవార్డు సాంగ్‌ను తమ ప్లే లిస్ట్‌లోంచి ఒకదాని వెంట ఒకటిగా తొలగిస్తున్నాయి. కొన్ని పాటలు, కొన్ని పువ్వులు సీజన్ వచ్చేసిందని ముందే చెప్పేస్తాయి. యు.ఎస్. రేడియో స్టేషన్ల నుంచి ‘బేబీ, ఇట్స్ కోల్డ్ అవుట్‌సైడ్’ అనే హాలీడే సాంగ్ వినిపించిందంటే క్రిస్మస్ సీజన్ మొదలైనట్లే. అయితే ఈ ఏడాది క్రిస్మస్ సీజన్ మొదలైనా.. ఆ పాట ఏ రేడియో స్టేషన్ నుంచీ వినిపించడం లేదు! యు.ఎస్.ను చూసి కెనడా కూడా స్టాప్ చేసింది. ఇంకా మరికొన్ని దేశాల్లోని రేడియో స్టేషన్లు 1944 నాటి ఆ క్లాసిక్ డ్యూయట్‌ను ఈ ‘మీటూ’ టైమ్‌లో ప్లే చెయ్యకపోవడమే క్షేమకరమన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నాయి. బ్రాడ్వే (రంగస్థలి) ఆస్థాన గీత రచయిత ఫ్రాంక్ లోస్సర్ రాసిన ‘బేబీ, ఇట్స్ కోల్డ్ అవుట్‌సైడ్’ ను 1949 హాలీవుడ్ మూవీ ‘నెప్ట్యూన్స్ డాటర్’లోకి తీసుకున్నారు. సినిమాలో ఎస్తర్ విలియమ్స్, రికార్డో మాంటల్బేన్ మధ్య పాటను చిత్రీకరించారు. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’గా ఆస్కార్ అవార్డు’ కూడా పొందిన ఆ పాటకు ఇన్నేళ్లలో అనేక వెర్షన్లు వచ్చాయి. మొన్న మొన్న ఆమెరికన్ గాయని లేడీ గాగా.. రివర్స్ వెర్షన్లో ఆ పాటను తీసుకున్నారు. అసలుపాటలో అతడు ఆమెను వెళ్లకుండా ఆపుతుంటే.. గాగా వీడియోలో ‘బేబీ, ఇట్స్ కోల్డ్ అవుట్‌సైడ్’ (బేబీ, బయట చలిగా ఉంది) అంటూ ఆమె అతడిని వెళ్లకుండా ఆపుతుంటుంది. ఒరిజినల్ పాటను రాసినవారు కానీ, పాటకు యాక్ట్ చేసివారు గానీ ఇప్పుడు లేరు. పాటొక్కటే బతికి ఉంది. ఇప్పుడా పాట కూడా ‘మీటూ’ పెనుగాలులకు రెపరెపలాడుతోంది. ‘మీటూ’కు, ఈ పాటను ఆపేయడానికి సంబంధం ఏంటి? ఏంటంటే.. పాటపై ఎప్పటి నుంచో బలహీనమైన కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. మీటూ ఉద్యమం చురుగ్గా ఉన్న ఈ టైమ్‌లో అవి బలమైన అభ్యంతరాలుగా రూపాంతరం చెందే ప్రమాదం ఉండొచ్చని స్టేషన్ డైరెక్టర్ల అనుమానం. పాటలోని సాహిత్యం, పాట సన్నివేశం.. ‘స్త్రీపై అత్యాచారం జరుపుతున్నట్లుగా’ ఉన్నాయన్నది ఎప్పటి నుంచో ఉన్న ఆరోపణ. ‘సాంగ్ కాదు.. ఇట్సే రేపీ’ అని అప్పట్లోనే ముఖం చిట్లించిన వారున్నారు. పాట ‘కాల్ అండ్ రెస్పాన్స్’ స్టెయిల్లో సాగుతుంది. ఒకరు పాడుతుండగనే, దానికి లింక్‌గా రెండో వారు అందుకోవడం! ఎలాగంటే.. ‘లాయర్ సుహాసిని’ సినిమాలో సుహాసినికి, భానుచందర్‌కి మధ్య ఒక డ్యూయెట్ ఉంటుంది. ‘దివిని తిరుగు మెరుపు లలన’ అంటాడు అతడు. వెంటనే ‘సామజ వరగమనా’ అంటుంది ఆమె. ‘కరుణ కరిగి భువికి దిగిన’ అంటాడు అతడు. ‘సామజ వరగమనా..’ అంటుంది మళ్లీ ఆమె. పాటంతా అంతే.. ఆమె సామజ వరగమనా అనే మాటొక్కటే అంటుంటుంది. ఇలాంటిదే ‘పెళ్లాం ఊరెళితే’ సినిమాలో శ్రీకాంత్, సంగీతల మధ్య డ్యూయెట్. ‘దొండపండు లాంటి పెదవే నీది’ అంటాడు శ్రీకాంత్. ‘అబద్ధం.. అంతా అబద్ధం’ అంటుంటుంది సంగీత. ‘కాల్ అండ్ రెస్పాన్స్’ ఫార్మాట్. ఇప్పుడీ క్రిస్మస్ సాంగ్‌లో.. ‘బేబీ, ఇట్స్ కోల్డ్ అవుట్‌సైడ్’ అని అంటుంటాడు అతడు, ‘నేను వెళ్తాను’ అని ఆమె ఎంత మొత్తుకుంటున్నా వదలకుండా. ‘ఐ రియల్లీ కాంట్ సే’ అని మొదలు పెడుతుంది ఆమె. వెంటనే అతడంటాడు ‘బేబీ ఇట్స్ కోల్డ్ ఔట్‌సైడ్’ అని. విషయం ఏంటంటే.. ఆ సాయంత్రం ఆమె అతడి గదిలో ఉంటుంది. ఇంటికి వెళ్లాలని లేస్తుంటుంది. అతడు లేవనివ్వడు! ఆమెతో ‘గడపాలని’ ఉంటుంది. అందుకే బయట చల్లగా ఉందనీ, ఆ టైమ్‌లో క్యాబ్‌లు దొరకవని, గడ్డకట్టుకుని పోతావనీ, న్యూమోనియా వచ్చి ఛస్తావనీ.. ఏదో ఒకటి చెప్పి అడ్డుకుంటుంటాడు. వెళ్లేందుకు ఆమె హ్యాట్ పెట్టుకుంటుంటే దాన్ని తీసేస్తూ ఉంటాడు. ‘వెళ్లనివ్వు ప్లీజ్..’ అని బతిమాలుకుంటుంటే.. కాలు, చెయ్యి అడ్డుపెడుతుంటాడు. ఇదంతా పాటలా, మాటలా సాగుతుంటుంది కానీ.. సూక్ష్మంగా ఆలోచించేవారికి.. నిజమే, ‘రేపీ’లానే అనిపిస్తుంది. ఒక ఆడపిల్ల కదలికలను ప్రేమతోనైనా సరే నియంత్రించడం అత్యాచారం కన్నా ఏం తక్కువ? ఇంకా.. అతడు ఆమెకు డ్రింక్ ఇస్తుంటాడు. ఆ డ్రింక్ గ్లాస్ అందుకుని ‘ఇందులో ఏం కలిపావు? అని అడుగుతుంది. మాట మార్చి ఏదో చెప్తాడు. ఇంకో చోట.. ‘నో.. నో.. నో..’ అంటుంది. వినకుండా.. ‘దగ్గరికి వస్తే ఏమైనా అనుకుంటావా’ అని ఒంటి మీద చెయ్యి వెయ్యబోతాడు. అతడు పట్టుకోబోవడం, అమె వదిలించుకోబోవడం.. ఇలా ఉంటుంది. ఇప్పటి అతిసున్నిత సమాజానికి సెక్సువల్ అసాల్టే అది. అందుకే యు.ఎస్. రేడియో స్టేషన్లు ‘ఇంతటితో ఈ పాట ప్రసారం సమాప్తం’ అంటున్నాయి. రచయిత ఎంత మంచి ఉద్దేశంతోనైనా రాయొచ్చు. అందులో చెడు ఉద్దేశం ‘పాప్–అప్’ అయి (పైకి లేచి) కనిపిస్తే మాత్రం ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయిన వాళ్లని నిందించడానికి లేదు. పాటనైనా, పుస్తకాన్నైనా తీసుకెళ్లి పొయ్యిలో పడేయాల్సిందే. ఫ్రాంక్ లోస్సర్ మొదట ఈ పాటను తనను, తన భార్యను ఉద్దేశించి రాసుకున్నారు. స్టేజ్ షోలలో ఇద్దరూ కలిసి పాడేవారు. ఆ పాటను ఎం.జి.ఎం. కొనుక్కుని సినిమాలో పెట్టుకుంది. పాటగా విన్నా, పాత్రలతో చూసినా ఆ యుగళగీతాన్ని అప్పుడంతా ఇష్టపడ్డారు. వింటర్ థీమ్‌తో వచ్చింది కాబట్టి క్రమేణా అది ‘క్రిస్మస్ సాంగ్’ అయింది. పాట రచయిత ఫ్రాంక్ లోస్సర్ మాధవ్ శింగరాజు -
ఆస్కార్ దర్శకుడు మెచ్చిన టూలెట్
సినిమా: రెండు సార్లు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న హిరానీ దర్శకుడినే అబ్బురపరచిన తమిళ చిత్రం టూలెట్. అంతే కాదు 100 అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడిన చిత్రం టూలెట్. ఇప్పటికే జాతీయ అవార్డును గెలుచుకున్న ఈ చిత్రం ప్రస్తుతం గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడనుంది. ఇప్పుడు గనుక దర్శకుడు బాలుమహేంద్ర జీవించి ఉంటే చాలా సంతోషపడి ఉండేవారని టూలెట్ చిత్ర దర్శకుడు సెళియన్ అన్నారు. ఛాయాగ్రహకుడైన ఈయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం టూలెట్. ఇంతగా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలను పొందుతున్న టూలెట్ చిత్రం దర్శకుడు సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ గత కొన్నేళ్ల క్రితం వికడన్ పత్రికలో అంతర్జాతీయ స్థాయి ఆసక్తిని రేకెత్తించిన చిత్రాల గురించి ఆర్టికల్ రాశానన్నారు. దీంతో తనకు అలాంటి చిత్రం చేయాలనిపించిందన్నారు. అలా మనం చూస్తున్న అద్దె ఇళ్ల నివాసుల ఇతి వృత్తాన్ని, వారి కష్టాలను సహజత్వంగా తెరపై ఆవిష్కరించిన చిత్రం టూలెట్ అని చెప్పారు. ఈ చిత్రాన్ని రెండు ఆస్కార్ అవార్డులను గెలుసుకున్న ఇరానీ దర్శకుడు ఆస్ఘార్ పర్హాది చూసి చిత్రం చూసిన భావనే లేదని, ఒక వ్యక్తి జీవితాన్ని పక్కనుంచి చూసినట్లు ఉందని ప్రశంసించారన్నారు. హిరానీ చిత్రాలను ఆహా, ఓహో అని పొగడ్తల్లో ముంచెత్తడం చూసిన దర్శకుడు బాలు మహేంద్ర అలా ఇరానీయులు మన చిత్రాలను ప్రశంసించే రోజులు ఎప్పుడు వస్తాయోనని అనేవారన్నారు. ఆయన ఇప్పుడు జీవించి ఉంటే చాలా సంతోషించేవారని అన్నారు. కాగా టూలెట్ చిత్రం ప్రస్తుతం గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో మూడు కేటగిరీలో అవార్డుల కోసం పోటీ పడుతోందని చెప్పారు. గోవా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతున్న తొలి ఇండియన్ చిత్రం ఇదే అవుతుందన్నారు. అవార్డు వివరాలను ఈ నెల 28వ తేదీన వెల్లడిస్తారని చెప్పారు. కాగా వందకు పైగా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడిన టూలెట్ చిత్రాన్ని డిసెంబరులో లేదా జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సెళియన్ తెలిపారు. -
‘న్యూటన్’కు నిరాశ
ఆస్కార్ బరిలో సత్తా చాటలనుకున్న బాలీవుడ్ మూవీ న్యూటన్ కు నిరాశే ఎదురైంది. ఇప్పటి వరకు ఆస్కార్ బరిలో ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం కేటగిరిలో లగాన్, మదర్ ఇండియా, సలాం బాంబే చిత్రాలు మాత్రమే ఫైనల్స్ వరకు వెళ్లాయి. ఈ సారి న్యూటన్ ఆ ఘనత సాదిస్తుందని భావించినా.. నిరాశే ఎదురైంది. 90వ ఆస్కార్ అవార్డ్స్ లో ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరిలో 98 విదేశీ సినిమాలు పోటిలో పడ్డాయి. వీటిలో కేవలం 9 సినిమాలు మాత్రమే ఫైనల్స్ కు చేరాయి. రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన న్యూటన్ కు ఫైనల్స్ లో చోటు దక్కలేదు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియపై తెరకెక్కిన న్యూటన్ సినిమాకు అమిత్ మసూర్కర్ దర్శకుడు. ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం కేటగిరిలో ఫైనల్స్ కు చేరిన చిత్రాలు... ఫెలిసైట్ ఆన్ బాడీ అండ్ సోల్ ఎ ఫెంటాస్టిక్ ఉమెన్ ఇన్ ది ఫేడ్ ది ఇన్ సల్ట్ ఫాక్స్ ట్రాట్ లవ్ లెస్ ది స్క్వేర్ ది వూండ్ -
ఆస్కార్ సంబరం
-
మీకూ నచ్చుతుంది! అంత లేదు : ట్రంప్
మూడుసార్లు ఆస్కార్లు వచ్చాయంటే.. నాలుగోసారీ రావచ్చని అంటున్నారంటే.. ఈమె.. ప్రేక్షకులకు నచ్చిందన్న మాట.ఈమె జీవితంలోని స్కార్ (మరక)లను చూస్తే మీకూ నచ్చుతుంది. టీవీ ముందు ఉన్నారా? ఉంటే, ఉత్తమ నటి కేటగిరీలో ఆస్కార్ అవార్డు ఎవరికి వచ్చిందో మీకు ఈపాటికి తెలిసే ఉంటుంది. లేదా, ఈ క్షణమో, మరుక్షణమో తెలియబోతూ ఉంటుంది. ఇసబెల్లి హూపే (63), రూఫ్ నేగా (35), నేటలీ పోర్ట్మన్ (35), ఎమ్మా స్టోన్ (28).. అండ్.. మెరిల్ స్ట్రీప్ (67).. ఈ ఐదుగురి మధ్య పోటీ ఉంది. మెరిల్ స్ట్రీప్ సీనియర్ నటి. ఆస్కార్ నామినేషన్లలో కూడా ఉత్తమ నటిగా ఆమే సీనియర్! ఇప్పటికి మొత్తం ఇరవైసార్లు ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. మూడు ఆస్కార్లు సాధించారు. ‘అండ్ ది ఆస్కార్ గోస్ టూ..’ అని ఈ ఉదయం కనుక మీకు ఆమె పేరు వినిపించిందంటే ఆ మూడు నాలుగౌతాయి. ఆస్కార్లు మూడు నాలుగవడం, నాలుగు ఐదవడం గొప్ప సంగతే. అయితే అంతకన్నా గొప్పవైన విశేషాలెన్నో మెరిల్ స్ట్రీప్ జీవితంలో ఉన్నాయి! ‘ది డీర్ హంటర్’ చిత్రంతో ఉత్తమ సహాయనటిగా 1979లో తొలిసారి ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు మెరిల్. అయితే ఆ అవార్డు ‘కాలిఫోర్నియా స్వీట్’ చిత్రంలోని మ్యాగీ స్మిత్‌కు వెళ్లిపోయింది. క్రామెర్ వర్సెస్ క్రామెర్ (1980) మెరిల్ తొలి ఆస్కార్ చిత్రం. సోఫీస్ చాయిస్ (1983), ది ఐరన్ లేడీ (2012).. ఆ తర్వాతి ఆస్కార్ చిత్రాలు. ఇవాళ కనుక అవార్డు వస్తే.. ‘ఫ్లారెన్స్ ఫాస్టర్ జంకిన్స్’ ఆమెకు ఆస్కార్ తెచ్చిపెట్టిన నాలుగో చిత్రం అవుతుంది. అంత లేదు : ట్రంప్ ఈ ఏడాది జన వరి 8న కాలిఫోర్నియాలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకలు జరిగాయి. అవార్డు అందుకుంటూ మెరిల్ స్ట్రీ్టప్ యాక్సెప్టెన్స్ స్పీచ్ ఇచ్చారు. మెరిల్.. హిల్లరీ అభిమాని. మరో పన్నెండు రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న హిల్లరీ రాజకీయ విరోధి డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి, అతడి పేరెత్తకుండా తన ప్రసంగంలో విమర్శించారు మెరిల్. ‘ఇతరులను విసిగించి, వేధించి, హింసించడానికి తమ అధికారాన్ని దుర్వినియోగం చేసేవారితో మనం జాగ్రత్తగా ఉండాలి’ అని ఆమె అమెరికన్ ప్రజలను హెచ్చరించారు. వెంటనే ట్రంప్ వైపు నుంచీ ఓ వ్యంగ్యాస్త్రం వచ్చి మెరిల్‌కి తగిలింది. ‘షి ఈజ్ ఏన్ ఓవర్–రేటెడ్ యాక్ట్రెస్’ అని ట్రంప్ కామెంట్ చేశారు. ఓవర్ రేటెడ్ అంటే.. ‘అంత లేదు’ అని! ఏదో ఉడుకుమోత్తనంతో ట్రంప్ అలా అన్నారు కానీ, మెరిల్ స్ట్రీప్ యోగ్యత గల నటి. అందుకే మీడియా ఆమెను ‘ది బెస్ట్ యాక్ట్రెస్ ఆఫ్ హర్ జనరేషన్’ అంటూ ఉంటుంది. నీలో ఉంది : తల్లి పిల్లలకు పోషకాహారం ఒక్కటే సరిపోదు. కాన్ఫిడెన్స్‌ను కూడా పట్టించాలి. మెరిల్ ఇంట్లో పెద్ద పిల్ల. బలంగా ఉంటుంది. బట్, మానసికంగా చిక్కిపోతోంది! ఎవరితోనూ కలవదు. మాట్లాడదు! మామూలుగానైతే తల్లి తల పట్టుకుంటుంది. తండ్రికి చెబుతుంది. మేరీకి కారణం తెలుసు కాబట్టి కంగారు పడలేదు. తనెలా ఉండేదో, తనెలా ఉంటోందో.. కూతురూ అలాగే ఉంటోంది.. ఇట్రావర్ట్లా! మేరీ కమర్షియల్ ఆర్టిస్ట్. ఆర్ట్ డైరెక్టర్. ఎప్పుడూ ఆలోచనల్లో ఉంటుంది. కొత్తగా ఆలోచిస్తూ ఉంటుంది. తండ్రి ఫార్మాస్యూటికల్ ఎగ్జిక్యూటివ్. అతడు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు కానీ ఇంట్లో మాట్లాడడు. రెండు నిశ్శబ్దాల మధ్య మూడో నిశ్శబ్దం అయిపోయింది మెరిల్. అప్పుడు పదేళ్లో, పదకొండేళ్లో ఉంటాయి మెరిల్‌కి. ‘ఇలా రా..’ అని పిలిచింది తల్లి. ‘సీ మెరిల్! యు ఆర్ కేపబుల్, యు ఆర్ గ్రేట్’ అంది. మెరిల్ కళ్లలో వెలుగు! ‘నువ్వెలా ఉండాలనుకుంటే అలా ఉండు. లేజీగా మాత్రం ఉండకు. ఉన్నావని కాదు. ఉండొద్దని’ అంది. మెరిల్ కళ్లలో మెరుపు. ఆ క్షణం నుంచి మెరిల్ ఒక్కమ్మాయి కాదు. ఇద్దరు అమ్మాయిలు. రెండో అమ్మాయి అమ్మ! అమ్మ ఏదైనా.. ‘ఐ యామ్ గ్రేట్’ అనుకునేలా చెబుతుంది. కానీ అందరూ అమ్మలా ఉండరు. అసలేం బాగోదు : క్రిటిక్ ‘గోకీ కిడ్ విత్ గ్లాసెస్ అండ్ ప్రిజ్జీ హెయర్’ అని అంటుంది మెరిల్ గురించి.. ఫిల్మ్ క్రిటిక్ కరీనా లాంగ్వర్త్.. పాత సినిమాలను ముందేసుకుని వాటిల్లో మెరిల్‌ని చూస్తూ! కళ్లద్దాలు పెట్టుకున్న ఉంగరాల జుట్టు ఒంటెలా ఉంటుందట మెరిల్. ఇలాంటివి చాలా విన్నారు మెరిల్.. ఇటీవలి ట్రంప్ ‘ఓవర్–రేటెడ్’ కామెంట్ వరకు. చిన్న స్మైల్.. వాటికి సమాధానం. పన్నెండేళ్ల వయసులో స్కూల్లో పాట పాడే అవకాశం వచ్చింది మెరిల్‌కి. ఎస్టెల్ లీబ్లింగ్ అనే గాయని బయటి నుంచి వచ్చి ఎలా పాడాలో నేర్పించారు. మెరిల్ పాడింది. పాట అర్థం ఏమిటో తెలియకుండానే, పాటలోని భావాన్ని అనుభూతి చెందకుండానే పాడింది. తననే అది నచ్చలేదు! ‘నచ్చనిది ఎంత తేలికైనా దాన్ని చెయ్యకు. న చ్చినది ఎంత కష్టమైనా దాన్ని∙చెయ్యకుండా వదలకు’ అని తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆ తర్వాతెప్పుడూ ఇష్టం లేకుండా ఏ పనీ చేయలేదు మెరిల్. జీవించింది : ప్రొఫెసర్ మెరిల్ అప్పుడప్పుడు కాలేజ్ నాటకాల్లో స్టేజీ ఎక్కేది. అదీ ఆమెకు ఇష్టం లేదు. ఇలా పైకి వెళ్లి, అలా కిందికి వచ్చేసేది. అయితే ఓసారి అలా పైకి వెళ్లినప్పుడు, తిరిగి కిందికి రావాలనిపించలేదు! ఆ ప్లే పేరు ‘మిస్ జూలీ’. అందులో మెరిల్ జూలీ పాత్ర వేసింది. ఒక్క దెబ్బతో మెరిల్ కాలేజీ జూలీ అయిపోయింది. అభినందనలు, ప్రశంసలు, పొగడ్తలు, కొన్ని ప్రేమలేఖలు! కాలేజీ డ్రామా ప్రొఫెసర్ అట్కిన్సన్... మెరిల్ యాక్టింగ్‌కు ముగ్ధుడయ్యాడు. ‘ఆమె స్వీయ నటి’ అన్నాడు. ఆ అభినయం, ఆ డైలాగ్ డెలివరీ.. మెరిల్ జీవించింది’ అన్నాడు. ఫీజు కట్టావా? : డ్రామా స్కూల్ ఎంత స్వీయ నటన అయినా, శాస్త్రీయత అవసరమే కదా. యేల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఎం.ఎఫ్.ఎ. కోర్సులో చేరింది మెరిల్. అతి ఖరీదైన కోర్సు అది. ఫీజుకోసం మెరిల్ రెస్టారెంట్లలో వెయిట్రెస్‌గా పని చేసింది. టైపింగ్ చేసింది. ఏడాదికి పది స్టేజి నాటకాలు వేసింది. తిండీతిప్పలు లేకుండా ఓవర్‌వర్క్ చేసింది. డబ్బులొచ్చాయి. వాటితోపాటే కడుపులో అల్సర్లు కూడా! ఆరోగ్యం పాడైంది. ఒక దశలో ఎం.ఎఫ్.ఎ. మానేసి న్యాయశాస్త్రానికి మారిపోదామని కూడా ప్రయత్నించింది కానీ యాక్టింగ్ అప్పటికే ఆమె ప్రాణం అయింది. ‘ఎ మిడ్సమ్మర్స్ నైట్స్ డ్రీమ్’లోని హెలీనా మొదలు, వీల్‌ఛెయిర్‌లో కదిలే 80 ఏళ్ల వృద్ధురాలి వరకు తను వేసిన ప్రతి పాత్రకూ ప్రాణం పోసింది. స్కూల్ ఆఫ్ డ్రామాలో ఫీజొక్కటే తలనొప్పి కాలేదు మెరిల్‌కి. ‘యాక్టింగ్ ఎక్సర్సైజు’లు ఆమెను బాధించేవి. నేర్పించడానికి వచ్చేవాళ్లు ఒంటిపై ఎక్కడెక్కడో తాకేవారు! అభ్యంతరకరమైన అభినయాల కోసం ఒత్తిడి చేసేవారు. ఇవన్నీ తట్టుకుని, ఇంతకన్నా ‘అప్డేట్’ అయిన ప్రపంచంలోకి వచ్చి పడింది మెరిల్. అది.. సినిమా ప్రపంచం. ముఖం చూడు : నిర్మాత 1977 నాటి ‘జూలియా’ నుంచి 2018లో విడుదలకు సిద్ధమవుతున్న ‘మేరీ పాపిన్స్ రిటర్న్స్’ వరకు సుమారు 60 చిత్రాల్లో నటించారు మెరిల్. టీవీ ఎపిసోడ్లు, స్టేజ్ డ్రామాలు అవన్నీ.. ఇంకో లెక్క. సినిమాల్లోకి వచ్చే వరకు వచ్చేస్తానని అనుకోని మెరిల్, ‘టాక్సీ డ్రైవర్’ (1976) సినిమాలో రాబర్ట్ డెనీరో నటనను చూశాక సినిమాల్లోకి వచ్చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. సినిమాల్లో చిన్న చిన్న డబ్బింగులు చెబుతూ, స్టేజి మీద పెద్ద పెద్ద పాత్రలు వేస్తున్నారు మెరిల్. ఓసారి పెద్ద డబ్బింగ్ చాన్స్ వచ్చింది. ‘కింగ్ కాంగ్’ సినిమాలో ముఖ్యపాత్రకు డబ్బింగ్ చెప్పాలి. నిర్మాత ఆడిషన్ పెట్టించాడు. మెరిల్ ఫెయిలయింది! ‘ఇది ఎంత అగ్లీగా ఉంది! దీన్నెందుకు తెచ్చావ్ నా దగ్గరికి?’’ అని నిర్మాత ఇటాలియన్ భాషలో తన కొడుకుపై చికాకు పడుతున్నాడు. మెరిల్‌కి ఇటాలియన్ వచ్చని అతడికి తెలీదు. ‘నేను ఉండవలసిన దానికన్నా అందంగా లేకపోయినందుకు చింతిస్తున్నారు. కానీ మీకిదే ఎక్కువ’ అని చెప్పి విసురుగా వెళ్లిపోయారు మెరిల్. అక్కడి నుంచి ‘బ్రాడ్వే’కి వెళ్లిపోయారు. రంగస్థలానికి. అలా డ్రామాల్లోంచి డ్రామా ఫిల్మ్ ‘జూలియా’లోకి వచ్చారు మెరిల్. వచ్చేయ్ సినిమాల్లోకి : డెనీరో జూలియాలో మెరిల్ది చాలా చిన్న పాత్ర. జేన్ ఫాండా అనే సీనియర్ నటికి సహనటి. సినిమా రిలీజ్ అయ్యాక.. షూటింగ్లో తను ఒక సీన్లో మాట్లాడిన మాటల్ని, ఆ సీన్లో కాకుండా వేరే సీన్లో విని బిత్తరపోయారు మెరిల్. దేవుడా.. సినిమా అంటే ఇంత దరిద్రంగా ఉంటుందా అని వణికిపోయారు. సినిమాల్లోకి రావాలనుకుని తప్పు చేశాను అనుకున్నారు. అసలు సినిమాలే వద్దనుకున్నారు. అప్పుడు వచ్చాడు రాబర్ట్ డెనీరో ఆమె దగ్గరికి! బ్రాడ్వేలో ‘ది చెర్రీ ఆర్చిడ్’ అనే నాటకంలో మెరిల్ చూసి, ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు. ఓ కొత్త సినిమాలో అతడు నటిస్తున్నాడు. అందులో మెరిల్‌ని తన గర్ల్ ఫ్రెండ్‌గా నటించమని కోరాడు. తన అభిమాన నటుడు అడుగుతుంటే మెరిల్ కాదంటుందా! అలా.. ‘ది డీర్ హంటర్’ అనే యుద్ధ చిత్రంతో మెరిల్ కెరీర్ మలుపు తిరిగి, ఆమెను ఆస్కార్ మెట్ల వరకు తీసుకెళ్లింది. నిన్ను ప్రేమిస్తున్నా : కజాలే కరీనా లాంగ్వర్త్ మాటల్లో.. మెరిల్ది ‘హై లెవల్ స్టార్డమ్’. కానీ ఆమె చాలా సాధారణ జీవితం గడిపారు. ది డీర్ హంటర్ చిత్రం షూటింగ్ సమయంలో ఆమె తన సహ నటుడు జాన్ కజాలేతో ప్రేమలో పడ్డారు. అతడితో సహజీవనం చేశారు. షూటింగ్లో తన పార్ట్ ముగియగానే.. అప్పటికే లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న కజాలే చనిపోయాడు. చనిపోతాడనే తెలిసే మెరిల్ అతడి ప్రేమను అంగీకరించిందేమో! అసలు పేరు : మేరీ లూయీస్ స్ట్రీప్ జననం : 1949 జూన్ 22 జన్మస్థలం : న్యూ జెర్సీ (యు.ఎస్.) తల్లిదండ్రులు : మేరీ, హ్యారీ తోబుట్టువులు : ఇద్దరు తమ్ముళ్లు చదువు : బి.ఎ. (1971); ఎం.ఎఫ్.ఎ. (1975) నటన : 1975 నుంచి ఇప్పటి వరకు నటిగా ప్రత్యేకత : పాత్రలో ఒదిగిపోవడం జీవన సహచరుడు : జాన్ కజాలే (1976–78) భర్త : డాన్ గామర్ (వివాహం 1978) పిల్లలు : అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలు అవార్డులు : లెక్కలేనన్ని! ⇒ మత విశ్వాసాలు మనశ్శాంతిని ఇస్తాయని నమ్ముతారు మెరిల్. అలాగని ప్రార్థనలోని శక్తిని ఆమె అంగీకరించరు! మనిషి తట్టుకుని నిలబడాలి. దేవుడి మీద వాలిపోకూడదు అనేది మెరిల్ ఫిలాసఫీ. రాజకీయంగా ఆమెది వామపక్ష ధోరణి. ఇటీవల ట్రంప్.. వలసల విధానాన్ని కట్టడి చేసినప్పుడు.. ఆమె కాస్త తీవ్రంగానే స్పందించారు. ‘హాలీవుడ్ ఈమాత్రం అయినా నేలపై దోగాడుతూ ఉందంటే బయటి నుంచి వచ్చిన వాళ్ల వల్లనే. వీళ్లందరిన్నీ తన్ని తరిమేస్తే అమెరికాలో ఇక చూడ్డానికి వాలీబాల్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ తప్ప కళలన్నవే ఉండవు’ అన్నారు మెరిల్ స్ట్రీప్. ⇒ ఇంత ధైర్యంగా ట్రంప్‌ని కామెంట్ చేసినందుకైనా ఆస్కార్ కమిటీ మెరిల్‌కి అవార్డు ఇవ్వొచ్చు. ప్రతిమనే ఇవ్వక్కర్లేదు. ప్రత్యేక ప్రశంసాపత్రం ఇచ్చినా చాలు.. ‘రియల్ ఆర్టిస్ట్’ అని! అది ఆమెను గౌరవించడానికి కాదు. ఆస్కార్ తనని తాను గౌరవించుకోడానికి. 1వ ఆస్కార్ 2వ ఆస్కార్ 3వ ఆస్కార్ మార్గరెట్ థాచర్ అంటే మెరిల్‌కి ఇష్టం లేదు. అందుకే ‘ది ఐరన్ లేడీ’ చిత్రంలో థాచర్ పాత్రను వెయ్యడానికి నిరాకరించారు. దర్శకుడు లాయిడ్ నచ్చజెప్పడంతో ఓకే అన్నారు. చివరికి ఆ చిత్రం మెరిల్‌కు ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు అందించింది! 4వ ఆస్కార్ ⇒ ఇవాళ గనుక మెరిల్ స్ట్రీప్‌కు ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు వస్తే.. ఇప్పటికే అత్యధికంగా నాలుగు అవార్డులు గెలుచుకున్న కేథరీన్ హెప్‌బర్న్‌తో సమానం అవుతారు. ⇒ ఎం.ఎఫ్.ఎ. చదువుతున్నప్పుడు, దాన్ని వదిలేసి ‘లా’ చేద్దామనుకున్నారు మెరిల్. ఆలస్యంగా నిద్రలేవడంతో లా ఇంటర్వూ్య టైమ్ దాటిపోయి, ఎం.ఎఫ్.ఎ.లోనే కొనసాగవలసి వచ్చింది. అప్పుడు మెరిల్ టైమ్‌కి నిద్రలేచి ఉంటే, ఇప్పుడు మనకింత మంచి నటి దొరికి ఉండేవారు కాదేమో! ⇒ అవార్డుల ఫంక్షన్లో తన రెండో ఆస్కార్ (ఉత్తమ సహాయ నటిగా) ప్రతిమను బాత్రూమ్లో మర్చిపోయి వచ్చి, మళ్లీ తెచ్చుకున్నారు మెరిల్! – మాధవ్ శింగరాజు -
ట్రంప్‌పై కోపంతో ఆస్కార్‌పై అలిగిన హీరోయిన్
న్యూయార్క్: ఓ ఇరానీ హీరోయిన్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆస్కార్ అవార్డులపై అలకబూనింది. తాను ఆస్కార్ అవార్డు కార్యక్రమానికి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే.. 'ది సేల్స్ మెన్' అనే చిత్రం ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయింది. ఈ చిత్రంలో ఇరానీ నటి 'తారానే అలిదూస్తి' నటించింది. అస్కార్ అవార్డుల కార్యక్రమం అమెరికాలోనే జరిగే విషయం తెలిసిందే. అయితే, ఈ నటికి ట్రంప్ పై తెగ కోపం వచ్చింది. ట్రంప్ ఓ జాతివివక్షుడు అన్నారు. ఇరానీయన్లకు వీసాలు బ్యాన్ అంటూ ప్రకటించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అందులో.. 'ఇరానీయన్లకు వీసా బ్యాన్ ఆలోచన చేసిన ట్రంప్ ఓ జాతివివక్షకుడు. అది సాంస్కృతిక కార్యక్రమం కావొచ్చు.. మరింకేదైనా కావొచ్చు. నేను మాత్రం ఆస్కార్ అకాడమీ అవార్డులు 2017కు వెళ్లడం లేదు. ఆందోళనలో మాత్రం ఉంటాను' అంటూ ఈ అమ్మడు ట్వీట్ చేసింది. -
ఈ హీరోయిన్ మీకు తెలుసా?
మనం చూడని సినిమాల్లో హీరోయిన్ ఈవిడ. మనం చూడాలనుకుంటున్న సమాజానికి హీరోయిన్ ఈవిడ. పేరు రేఖారాణా. ‘వెదురులోకి ఒదిగిందీ.. కుదురులేని గాలి..’ అని రాశారు వేటూరి. ఆ లైను, ఇప్పుడీ అమ్మాయి ఉన్న లైను ఒకటే. ఈ రేఖ.. స్వేచ్ఛారేఖ... స్టేజ్‌పై ఒదిగి... వెండితెర విభిన్నతకు ఒక రేఖాచిత్రం అయింది. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో ఫైనల్‌కు వచ్చిన 5 చిత్రాల పేర్లను ఆస్కార్ కమిటీ రేపు ప్రకటిస్తుంది. రేపు అంటే.. జనవరి 24న. ఆ ఐదు చిత్రాలలో ఏ చిత్రానికి ఆస్కార్ అవార్డు వస్తుందో ఫిబ్రవరి 26న తేలిపోతుంది. ఇందులో మనకేమిటి ఇంట్రెస్ట్? భారతీయ చిత్రం ఏదైనా నామినేట్ అయిందా? లేదు. నామినేషన్ వరకు వెళ్లిన తమిళ చిత్రం ‘ఇంటరాగేషన్’ నాట్–నామినేటెడ్ లిస్ట్‌లో పడిపోయింది. భారతీయ సంతతి నటి ఉన్న కామెరూన్ (మధ్య ఆఫ్రికా) చిత్రం ‘యహా“ అమీనా బిక్తీ హై’ నామినేట్ అయ్యి కూడా ఫైనల్ లిస్ట్ వరకు వెళ్లలేదు. సో... విదేశీ కేటగిరీలో మనకేం చాన్సెస్ లేవు. కానీ ఆశ ఉంది. ఎప్పటికైనా ఆస్కార్ అవార్డును తెచ్చిపెట్టే ఆ ఆశ పేరు.. రేఖా రాణా! ‘యహా“ అమీనా బిక్తీ హై’ చిత్రంలో లీడ్ రోల్ వేసిన అమ్మాయి. రెండు రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చింది. మీడియా ప్రతినిధులను కలుసుకుంది. వెళ్లిపోయింది. రేఖ ఉండేది ఢిల్లీలో. తిరుగుతుండేది విదేశాలలో. ప్రస్తుతం ఉంటున్నది ముంబైలో. మంచి స్టేజ్ ఆర్టిస్ట్. ఈజ్ ఉన్న యాక్ట్రెస్. సామాజిక వ్యంగ్య రేఖ జనాలకు కామెడీ ఎక్కుతుంది. సీరియస్ ఎక్కదు. ఎక్కించాలంటే? సీరియస్‌ని కూడా కామెడీగా చెప్పాలి. ‘ధర్నా’ సీరియస్ విషయం. గవర్నమెంట్ కొమ్ముల్ని వంచే ధర్నా ఇంకా సీరియస్. జనం పోగవుతారు. ట్రాఫిక్ జామ్ అవుతుంది. సామాన్యులు ఇబ్బంది పడతారు. ఇవేకాదు.. ధర్నాలకు ముందు, వెనుక చాలా జరుగుతుంది. అన్నా హజారే ఢిల్లీలో ధర్నాలు చేస్తూ మంచి స్వింగ్‌లో ఉన్నప్పుడు 2012 లో ‘అబ్ హోగా ధర్నా అన్లిమిటెడ్’ అనే బాలీవుడ్ కామెడీ సెటైర్ విడుదలైంది. ఆ చిత్రంలోని నటులు ఎవరి పాత్రలు వారు సీరియస్‌గా పోషించి కామెడీ కుమ్మరించారు. ఒక అమ్మాయి లీడ్ రోల్ వేసింది. సోషల్ సెటైర్లూ వేసింది. ‘సెంటర్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ అయింది. ఫస్ట్ మూవీకే అంత బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఇచ్చింది? ఆ అమ్మాయిలో సహజంగానే సామాజిక స్పృహ ఉంది. అది వర్కవుట్ అయింది! జర్నీ ఆఫ్ లవ్ అండ్ ప్యాషన్ రేఖారాణాలో కొన్ని రాఖీసావంత్ పోలికలు, కొన్ని సన్నీ లియోన్ పోలికలు కనిపిస్తాయి. వాళ్లిద్దరిలోని డైనమిజం కూడా రేఖలో కనిపిస్తుంది. అయితే రేఖ.. వివాదాలకు దూరంగా ఉంటారు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో తన నటనకు మెరుగులు దిద్దుకున్న రేఖ.. మనసా వాచా రంగస్థలానికి దగ్గరగా ఉంటారు. రేఖ వెబ్ సైట్ ఆమెలానే అందంగా ఉంటుంది. వివరంగా ఉంటుంది. స్పష్టంగా ఒక స్టేట్‌మెంట్‌లా ఉంటుంది. అసలు ఆమె జీవిత ధ్యేయం ఏమిటి? దృక్పథం ఏమిటి అన్నది తన సైట్లో రేఖ పెట్టుకున్న మైఖేల్ జాక్సన్ కొటేషన్‌ని బట్టి పట్టుకోవచ్చు. ‘అడుగుజాడల్లో వెళ్లడం కన్నా, దారులు వేసుకుంటూ వెళ్లడంలో నాకు ఆసక్తి ఉంటుంది. జీవితంలో నేను చేయాలనుకున్నదీ ఇదే. నేను చేసే ప్రతి దాంట్లోనూ ఉండేదీ ఇదే’ అనే కొటేషన్ అది. ఈ ఆస్కార్‌కే కాదు, రెండేళ్ల క్రితం కూడా రేఖ నటించిన చిత్రం (తార: ది జర్నీ ఆఫ్ లవ్ అండ్ ప్యాషన్) నామినేషన్‌కి వెళ్లింది. గెలుపు ఓటములకు, సాధ్యాసాధ్యాలకు అతీతంగా ఉంటుంది కనకనే.. ఫలితం ఎలా ఉన్నా రేఖలోని చిరునవ్వు ఎప్పుడూ మాయం కాదు. హేమంత్ నిమిల్ దాస్ దర్శకత్వంలో ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘బ్లాక్ సెప్టెంబర్’లో దక్షిణాది సూపర్‌స్టార్‌గా నటించిన రేఖ.. ప్రస్తుతం ఆ ఉత్సాహంలో ఉన్నారు. అది కాక, రేఖ ఫీచరింగ్ చేస్తూ ‘బౌన్స్’ అనే హిప్హాప్ మ్యూజిక్ వీడియో కూడా రాబోతోంది. తార సినిమా ట్యాగ్‌లైన్ ‘ది జర్నీ ఆఫ్ లవ్ అండ్ ప్యాషన్’ రేఖ నట జీవితానికి కూడా సరిగ్గా సరిపోతుంది. స్వతంత్ర భావ వీచిక ఓ తాండా యువతి. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. తెచ్చిపెట్టుకున్నది కాదు ఆ ‘బోల్డ్నెస్’. తనంతే. తన ఇష్టం వచ్చినట్లు ఉంటుంది. చెయ్యాలనుకున్నది చేస్తుంది. చెప్పాలనుకున్నది చెబుతుంది. ఊరికి ఆ పిల్ల పెద్ద తలనొప్పి అయిపోతుంది. పోదా మరి, ఊరంతటిదీ ఒక దారి, ఈ ఉలిపి కట్టెది ఒక దారి అయితే! భర్తకు కూడా విసుగెత్తి పోతుంది. ఇంట్లోంచి తరిమేస్తాడు. ఊళ్లోంచి తరిమేయిస్తాడు. ఎక్కడా బతకనివ్వడు. తర్వాత ఆ యువతి పడే స్ట్రగులే.. ‘తార’ (2013) చిత్రం. ప్రేమలో, వ్యామోహంలో స్వచ్ఛమైన మనసుతో కొట్టుకుపోయిన ఆ పిల్ల సినీ క్రిటిక్ల మనసు కొల్లగొట్టేసింది. అంతలా ఎలా నటించింది? నేచురల్ ఫైర్. నటన ఆమెకో లవ్ అఫైర్. ధిక్కార, సాధికార సూచిక ‘అబ్ హోగా ధర్నా అన్లిమిటెడ్’లో సామాజిక స్పృహ ఉన్న ఆ అమ్మాయి, ‘తార’లో ఫైర్ కనబరిచిన ఈ అమ్మాయి.. ఇద్దరూ ఒకరే. రేఖారాణా. ఇక 2016లో ఆమె నటించిన మూడో బాలీవుడ్ చిత్రం.. ‘యహా“ అమీనా బిక్తీ హై’ కూడా బాధ్యతగా ఆమె తన భుజం మీద వేసుకున్నదే. రేఖకు నటన ప్యాషన్. ప్రాణం. స్త్రీ ప్రాధాన్యం ఉన్న చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపుతుంది రేఖ. స్త్రీకి ప్రాధాన్యం ఇవ్వడం అంటే.. స్వేచ్ఛకు, సాధికారతకు ప్రాధాన్యం ఇవ్వడం అని రేఖ నమ్మకం. లోకంలోకి రేఖాయానం ‘యహా“ అమీనా.. ’ నిజ జీవిత కథ. హైదరాబాద్‌లో జరిగిన కథ. సినిమాగా రాక ముందు ఇది వన్ యాక్ట్ ప్లే. దేశంలోని చాలా కాలేజీలు ఈ ప్లేని ప్రదర్శించాయి. ఈ నాటకానికి పద్నాలుగు వరకు అవార్డులు వచ్చాయి. అమీనా అనే అమ్మాయి చుట్టూ కథంతా తిరుగుతుంది. అ అమ్మాయి చుట్టూ ఉన్న సమస్యల వలయాల చుట్టూ తిరుగుతుంది. సమాజంలోని మూఢ నమ్మకాలు, నిరక్షరాస్యత, పేదరికం, మానవీయ స్పృహ కొరవడడం.. వీటన్నిటి మధ్య ఒక ఆడపిల్ల జీవితం, ముఖ్యంగా ఒక నిరుపేద ముస్లిం కుటుంబంలోని ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందన్నది థీమ్. ఏ ఆడపిల్లకూ అమీనాకు పట్టిన దౌర్భాగ్యం పట్టకూడదన్నది రేఖ ఆకాంక్ష. ప్రేక్షకులలోకి పరకాయం పువ్వులాంటి మనసున్న ఒక ఆడపిల్ల, అమాయకురాలైన ఒక ఆడపిల్ల.. ఈ పురుషాధిక్య, పురుషాహంకార ప్రపంచంలో మానసికంగా శారీరకంగా గాయపడి, ఎలా తన సున్నితమైన భావాలను కోల్పోతున్నదీ ఈ సినిమా చూసి మాత్రమే మనం తెలుసుకోనక్కర్లేదు. రియల్ లైఫ్‌లో అమీనా లాంటి రీటా, షీలా, షకీలా, చంప.. ఎందరో నిత్యం మన పరిసరాల్లోనే తారసపడుతుంటారు. మరి ‘యహా“ అమీనా బిక్తీ హై’లో రేఖ అభినయించిందేమిటి? మనకు తెలిసిన పాత కథనే.. మళ్లీ ఇలాంటి కథ సమాజంలో రిపీట్ అవకూడదన్న భావన కలిగించేలా రేఖ నటించారు. అందుకే ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్ వరకూ వెళ్ల గలిగింది. రేఖదే క్రెడిట్. మామూలుగా పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లకు మాత్రమే వారి ఇమేజ్‌కి తగ్గ కథలు తయారవుతుంటాయి. రెండు సినిమాలకే రేఖకు ఆ ఇమేజ్ వచ్చేసింది. ‘రెయిన్’ అనే ఇండో–సౌదీ చిత్రం ఆమెకోసం ఇప్పుడు తయారవుతోంది! ‘ఐ యామ్ మాలా’ అనే ఇంకో చిత్రం న్యూయార్క్‌లో రాజ్ రహీ అనే నిర్మాత రెడీ చేస్తున్నారు. ‘మిస్’ల నుంచి మెచ్యూరిటీ సినిమాల్లోకి వచ్చేయాలని రేఖ రంగస్థల నాటి కాలేదు. ఎంపిక చేసుకున్న కథల కోసం మాత్రమే ఆమె రంగస్థలం నుంచి సినిమాల్లోకి వచ్చారు. రేఖ ప్రొఫైల్ చాలా చిన్నది. అవార్డుల్లో మాత్రం చాలా పెద్దది. ఉత్తమ నటిగా ఇంతవరకు ఆమె 24 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ఆమె నటించిన సినిమాలు 92 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నాయి. చిన్న వయసులోనే అంతర్జాతీయ నటి అయిపోయారు రేఖారాణా. కొన్ని బ్యూటీ అవార్డులు కూడా ఆమె జాబితాలో ఉన్నాయి. మిస్ ఢిల్లీ, మిస్ ఫొటోజెనిక్ ఫేస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్.. ఇలా. కానీ వాటన్నిటినీ బాల్య చేష్టలుగా భావిస్తారు రేఖ. ఆమెకు అంబాసిడర్‌గా ఉండడం ఇష్టం. ప్రస్తుతం ‘స్టార్ ఎన్జీవో’ అనే ఒక దక్షిణాఫ్రికా స్వచ్ఛంద సంస్థకు అంబాసిడర్‌గా ఉన్నారు. అక్కడే ‘సేవ్ అవర్ ఉమన్’ అనే క్యాంపెయిన్‌ను కూడా నడుపుతున్నారు. ‘టేక్ కేర్’తో రేఖ టేకాఫ్! రేఖారాణా పుట్టింది న్యూఢిల్లీలో. చదువుకుంది అక్కడి గ్రీన్ ఫీల్డ్ హైస్కూల్లో. డాన్సింగ్, స్విమ్మింగ్, డ్రామా.. ఆమెకు ఇష్టమైన వ్యాపకాలు. ముఖ్యంగా డ్రామాలు. ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్‌లో డిగ్రీ అయ్యాక, యాక్టింగ్ కోసం ఆమె బ్యారీ జాన్ యాక్టింగ్ స్కూల్లో చేరారు. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అయితే ఆమె తీసుకున్న ఈ మలుపు తన కోసం కాదు, సమాజం కోసం. సమాజాన్ని మార్చే తలంపు లేకుంటే ఆమె అసలు నాటకాల్లోకే వచ్చేవారు కాదు. సినిమాల కన్నా డ్రామాలు ఎక్కువ ప్రభావం చూపుతాయని ఇప్పటికీ నమ్ముతున్నారు రేఖారాణా. ఇప్పటికీ అంటే.. రెండు మూడు సినిమాల సక్సెస్ తర్వాత కూడా. 2010లో రేఖ కెరీర్ మొదలైంది. ఆమె నటించిన ‘టేక్ కేర్’ అనే షార్ట్ ఫిల్మ్‌కి సింగపూర్ ఫెస్టివల్లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది! ఇది ఆమె ఊహించనిది! ఆ తర్వాత దినేశ్ ఠాకూర్ ‘జిస్ లాహోర్ నై దేఖ్యా ఓ జామ్యా నై’ సహా అనేక నాటకాల్లో ముఖ్య పాత్రను పోషించారు. నాటకాలతో పాటు ఈ నాలుగేళ్లలో నాలుగు సినిమాలు చేశారు. వాటిల్లో ఒకటి ‘సినిమా స్టార్’. తమిళ చిత్రం. మిగతావి బాలీవుడ్ మూవీలు. దేశంలో స్క్రీన్.. విదేశాల్లో స్టేజ్ ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లోని ప్రతిష్టాత్మక ‘క్రెసెండో ప్రొడక్షన్స్’ దగ్గర రేఖ సంతకం చేసినన సినిమాలు రెండు ఉన్నాయి. మన దగ్గర హిందీ, తమిళ్ వెర్షన్లలో హేమంత్ నీలిమ్ దాస్ డైరెక్ట్ చేస్తున్న ‘ఐ హేట్æ వాలైంటైన్స్ డే’ చిత్రానికి కూడా సైన్ చేశారు. రేఖారాణా నటించిన సినిమాలు రిలీజై వాటంతటవీ ప్రపంచమంతటా తిరుగుతుంటే.. ఆమె మాత్రం రంగస్థల నటిగా దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ ఉండటం.. ఆమెలోని నటనాసక్తికి నిదర్శనం. ఆసక్తి కాదు. భక్తి అనాలి. ఇప్పటి వరకు రేఖరాణా 150 స్టేజ్ షోలు ఇచ్చారు. -
కోవై ఎన్నారైకు ఆస్కార్ అవార్డు
కేకేనగర్: కోయంబత్తూరులోని సాయిబాబా కాలనీకు చెందిన కిరణ్భట్ (41)కు సైన్స్ సాంకేతిక పరిజ్ఞాన విభాగంలో ఆస్కార్ అవార్డు లభించింది. ఈ అవార్డుని ఆయనకు ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్’ మంగళవారం ప్రకటించింది. హాలీవుడ్ చిత్రాలైన అవెంజరస్, స్టార్ వర్సెస్ రాక్ వన్ తదితర చిత్రాల్లో కథా పాత్రల ముఖభావాలను డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో మార్పులు చేసినందుకుగానూ ఈ అవార్డు ఆయనకు దక్కింది. కిరణ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
ఆ సినిమాకు ఆస్కార్ రావల్సింది...
న్యూఢిల్లీ: మొహం నిండా మచ్చలు. కళ్లలో నుంచి దూసుకొస్తున్న తీక్షణమైన చూపులు. కరకు కంఠం. చెమట కారుతున్న అంగీ. రోడ్డు పక్కన లాగుడు రిక్షాను ఆపి, ఆ పక్కనే ఉన్న బండిపై టీ తాగుతున్న వ్యక్తి. అచ్చం 1980వ దశకంలో మరో సినిమాలకు ప్రాణం పోసి ప్రపంచ ఖ్యాతి నార్జించిన ఓంపురిలా ఉన్నాడు. ఆ వ్యక్తి గురించే ఆ పక్కనే ఉన్న ఓ ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటున్నారు. ‘అరే అచ్చం ఓంపురిలాగే ఉన్నాడు కదా!’ అంటూ ఓ మిత్రుడు తోటి మిత్రుడిని ప్రశ్నించగా, ‘అవును కొంత అలాగే కనిపిస్తున్నాడుగానీ, ఓంపురి కలకత్తాకు ఎందుకు వస్తాడు? వస్తే, ఇలా రోడ్డు పక్కన మనలాగా టీ ఎందుకు తాగుతాడు, పైగా లాగుడు రిక్షాతో ఎందుకు కనిపిస్తాడు?!’ అని ఆ మిత్రుడు వ్యాఖ్యానించారు. ఈ మాటలను శ్రద్ధగా విన్న ఆ వ్యక్తి ‘అవును నేను ఓంపురినే’ అంటూ ఆ మిత్రుల సందేహాన్ని తీర్చేందుకు ప్రయత్నించారు. అయితే నమ్మనట్లుగానే ఆ ఇద్దరు మిత్రులు అక్కడి నుంచి కదిలారు. ‘బేచార, ఎంతటి వాడు ఎలా అయిపోయాడు. ఆక్రోష్, అర్ధసత్య, అల్బర్ట్ పింటో కో గుస్సా క్యోం ఆతా హై, జానేబీ దో యారో సినిమాలతో పాటు తమస్ లాంటి టీవీ సీరియళ్లను తీసిన ఓంపురి ఇప్పుడు కోల్‌కతాలో లాగుడు బండి లాగుతున్నాడు. ఎంతటి ఖర్మ!’ అంటూ ఆ టీ బండి వ్యక్తి తన కస్టమర్లతో వ్యాఖ్యానిస్తుండగా ఓంపురి తనలో తాను నవ్వుకుంటూ ఆ లాగుడు రిక్షాను పట్టుకొని తన మానాన తాను వచ్చేశాడు. 1992లో విడుదలైన ‘సిటీ ఆఫ్ జాయ్’ ఇంగ్లీష్ సినిమా షూటింగ్ కోసం కోల్‌కతా వచ్చిన ఓంపురి లాగుడు రిక్షా నేర్చుకోవడం కోసం వారం రోజుల పాటు కోల్‌కతా వీధుల్లో ఇలా కసరత్తు చేస్తుండగా ఓ రోజు ఆయనకు ఈ అనుభవం ఎదురైంది. దాని గురించి ఆయన భార్య నందితా పురి, ఓంపురి ఆత్మకథలో రాశారు. రోలాండ్ జఫే దర్శకత్వం వహించిన ఈ ‘సిటీ ఆఫ్ జాయ్’ సినిమాలో ఓంపురితోపాటు ప్యాట్రిక్ సాయజ్ అనే హాలివుడ్ నటుడు కూడా ప్రధాన పాత్రలో నటించారు. కమర్షియల్‌గా ఈ సినిమా పెద్దగా నడవకపోయినా అప్పుడు ‘న్యూయార్స్ టైమ్స్’ పత్రిక మాత్రం సినిమాలో ఓంపురి నటన గురించి విశేషంగా ప్రశంసించింది. ‘ఈ ఏడాది ఎవరికైనా ఆస్కార్ అవార్డ్ ఇవ్వాల్సి వస్తే మొట్టమొదట ఓంపురికి ఇవ్వాలి’ అని ఆ పత్రిక కొనియాడగా, ఓంపురికి ఆస్కార్ వచ్చి తీరుతుందని తోటి నటుడు ప్యాట్రిక్ సాయజ్ నాడు విలేకరుల సమావేశం వ్యాఖ్యానించారు. ఆస్కార్ అవార్డు రాకపోయినా కనీసం నామినేషన్ వస్తుందని భావించానని ఆ తర్వాత ఓంపురి ఓ సందర్భంలో చెప్పారు. ఆతర్వాత ‘మై సన్ ఆఫ్ ఫెనటిక్, ఈస్ట్ ఈజ్ ఈస్ట్, శ్యామ్ అండ్ మీ’ లాంటి హాలివుడ్ చిత్రాల్లో నటించారు. ‘ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయే మహానటుడు ఓంపురి, అలాంటి నటులు మళ్లీ పుట్టడం మహా అరదు’ అని బాలివుడ్ దర్శకుడు కుందన్ షా వ్యాఖ్యానించారు. -
‘రియో’కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా...
ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రియో ఒలింపిక్స్‌లోభారత బృందానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఇప్పటికే సచిన్, అభినవ్ బింద్రా, సల్మాన్‌ఖాన్ అంబాసిడర్స్‌గా వ్యవహరిస్తున్నారు. తమ ప్రతిపాదనకు రెహమాన్ ఆమోదం తెలుపుతూ లేఖ పంపారని ఐఓఏ తెలిపింది. -
నిర్మాతగా మారిన మ్యూజిక్ లెజెండ్
తన సంగీతంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న స్వర సంచలనం ఏఆర్ రెహమాన్. భారతీయ భాషలన్నింటిలో అద్భుతమైన పాటలు అందించిన రెహమాన్ అంతర్జాతీయ వేదికల మీద కూడా సత్తా చాటాడు. అంతేకాదు గ్రామీ, అకాడమీ అవార్డ్స్ లాంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను సైతం అందుకున్న ఈ సంగీత దర్శకుడు ఇప్పుడు నిర్మాతగాను తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. బాలీవుడ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రెహహాన్ సంగీతంతో పాటు స్వయంగా కథను కూడా అందిస్తున్నాడు. '99 సాంగ్స్' పేరుతో మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను, రెహమాన్ తన ట్విట్టర్లో రిలీజ్ చేశాడు. ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ పోస్టర్ సినిమా మీద మరింత ఆసక్తి కలిగిస్తోంది. With your support & good wishes, I'm pleased to share my movie's first poster! https://t.co/F7KOZ0bRmv— A.R.Rahman (@arrahman) March 9, 2016 -
ఆస్కార్ ముచ్చట్లు
అవార్డ్ మర్చేపోయాడు! ఇరవై మూడేళ్ల తర్వాత దక్కిన తొలి ఆస్కార్‌ను ఎంత అపురూపంగా చూసుకోవాలి? ఉత్తమ నటునిగా ఆస్కార్ అవార్డు దక్కించుకున్న లియొనార్డో డికాప్రియో మాత్రం ఈ బంగారు బొమ్మను మర్చిపోయాడు. సహజంగా పార్టీ ప్రియుడైన డికాప్రియో తన స్నేహితులకు ఆస్కార్ వేడుకల తర్వాత పెద్ద పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీలో హ్యాపీగా గడిపిన ఆయన పార్టీ అయిపోయాక, అందుకున్న ఆస్కార్ ప్రతిమను మర్చిపోయి, కారు ఎక్కేశారు. ఇక కారు స్టార్ట్ అవుతుందనగా సదరు హోటల్ సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చి కారులో ఉన్న డికాప్రియో ఒక చేతితో ష్యాంపైన్ బాటిల్, మరో చేతితో ఆస్కార్ ఇవ్వగానే ఆశ్చర్యపోవడం అందరి వంతైందట. ఇదిలా ఉండగా, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ డికాప్రియోను అభినందించారు. ‘‘ఎట్టకేలకు డికాప్రియో ఉత్తమ నటునిగా ఆస్కార్ అందుకున్నాడు. అతడు ఈ గౌరవానికి అర్హుడు’’ అంటూ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. డికాప్రియోతో కలిసి ‘గ్రేట్ గాట్స్బీ’ అనే హాలీవుడ్ చిత్రంలో నటించారు అమితాబ్. ఆ సమయంలో డికాప్రియోతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారాయన. స్విల్వెస్టర్కు మరో కండల వీరుడి ఓదార్పు! కండలు తిరిగిన నటుడు సిల్వెస్టర్ స్టాలెన్కు ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో నిరాశే ఎదురైంది. దాదాపు 40 ఏళ్ల తర్వాత దక్కిన మూడో నామినేషన్లో కూడా ఆస్కార్ ఆయనను వరించలేదు. 1977లో ‘రాకీ’ తర్వాత ‘క్రీడ్’ చిత్రానికి గానూ ఈ ఏడాది ఉత్తమ సహాయనటుని విభాగంలో పోటీపడ్డారు. అయితే ఈ సారి కూడా ఆయనను ఆస్కార్ వరించలేదు. ‘బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్’ చిత్రానికి గానూ మార్క్ రైలాన్స్ ఈ విభాగంలో ఆస్కార్ అందుకున్నారు. స్టాలెన్ దీని గురించి ఏ కామెంట్ చేయకపోయినా, ఆయన సోదరుడు ఫ్రాంక్ మాత్రం అకాడమీ తీరును దుయ్యబట్టాడు. మార్క్‌కు ఈ అవార్డు ఇవ్వడం ఆస్కార్ అకాడమీ సిగ్గు పడాల్సిన విషయమంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే, కండల వీరుడైన మరో నటుడు ఆర్నాల్డ్ ష్వార్జెనగర్ మాత్రం స్టాలెన్కు బాసటగా నిలిచారు. ‘ఎవరేమన్నా సరే, నాకు మాత్రం నువ్వే బెస్ట్’ అంటూ ట్వీట్ చేశారు ఆర్నాల్డ్. ఇది ఇలా ఉండగా, అకాడెమీని విమర్శించిన ఫ్రాంక్ సైతం ‘‘అవార్డు వచ్చిన మార్క్‌ను విమర్శించాలన్నది నా ఉద్దేశం కాదు. ఈ అవార్డుకు నా సోదరుడు స్టాలెన్ అర్హుడని చెప్పాలనే ఆ వ్యాఖ్యలు చేశా’’ అంటూ వివరణ ఇచ్చారు. అతి తక్కువ ఆదరణ ‘ఆస్కార్ సో వైట్’ అనే విమర్శల నుంచి బయటపడటానికి ఆస్కార్ అకాడమీ ఈ ఏడాది ఆస్కార్ వేడుకలకు హోస్ట్‌గా నల్ల జాతీయుడు క్లిస్ రాక్‌ను వ్యాఖ్యాతగా ఎంపిక చేసింది. కానీ, ఈ చిట్కాలేవీ టీవీ రేటింగ్స్‌ను మాత్రం పెంచలేకపోయాయి. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఆస్కార్ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల 43 లక్షల మంది టీవీల్లో వీక్షించారట. గడిచిన ఎనిమిదేళ్లతో ఇంత తక్కువ వ్యూయర్షిప్ నమోదు కావడం ఇదే తొలిసారి. నీల్ ప్యాట్రిక్ హ్యారిస్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన 87వ ఆస్కార్ వేడుకలను 3 కోట్ల 72 లక్షల మంది చూశారు. అయితే ఈ సారి నల్ల జాతీయులెవరూ నామినేట్ కాకపోవడం కూడా దీనికి కారణమని కొంత మంది సినీ విశ్లేషకులు చెబుతున్నారు. -
ఆస్కార్ అవార్డుకు అన్ని విధాలా అర్హుడు: బిగ్ బి
ముంబై: ఆస్కార్ అవార్డు గెల్చుకున్న హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో(41)కు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అభినందనలు తెలిపారు. డికాప్రియోకు కంగ్రాట్స్ చెప్తూ బిగ్ బి ట్వీట్ చేశారు. ‘ద రెవనెంట్’ చిత్రానికి గానూ డికాప్రియో ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. 'ఆస్కార్ అవార్డు అందుకున్న నా సహ నటుడు, జంటిల్మెన్ లియోనార్డోకు శుభాకాంక్షలు. ఈ అవార్డు తీసుకునేందుకు అన్ని విధాల అర్హుడివి’ అని అమితాబ్ ట్వీట్ చేశారు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను పోస్ట్ చేశారు. 2013లో రిలీజైన ‘ద గ్రేట్ గేట్స్బై’ చిత్రంలో డికాప్రియోతో కలిసి అమితాబ్ నటించారు. -
పాకిస్థాన్ డాక్యుమెంటరీకి ఆస్కార్
లాస్ ఏంజెలెస్: ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారాల్లో పాకిస్థాన్ డాక్యుమెంటరీకి అవార్డు దక్కింది. 88వ అకాడమీ అవార్డుల్లో 'ఏ గాల్ ఇన్ ది రివర్: ది ప్రైస్ ఆఫ్ ఫర్ గివ్ నెస్' ఉత్తమ డాక్యుమెంటరీ-షార్ట్ సబ్జెక్ట్ గా ఎంపికైంది. పాకిస్థాన్ కు చెందిన జర్నలిస్ట్, ఫిల్మ్ మేకర్ షర్మీన్ ఒబైడ్-చినాయ్ ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. పరువు హత్యలు నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఇది తనకు దక్కిన రెండో ఆస్కార్ పురస్కారమని చినాయ్ తెలిపారు. అంతకుముందు 2012లో 'సేవింగ్ ఫేస్'కు ఆమె ఆస్కార్ అవార్డు అందుకున్నారు. పాకిస్థాన్ యాసిడ్ బాధితులకు సంబంధించిన కథాంశంతో 'సేవింగ్ ఫేస్' తెరకెక్కించారు. -
భారత సంతతి నటుడికి ఆస్కార్ అవార్డు
లాస్ ఏంజెలెస్: ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారు. ఫిబ్రవరి 28న ఆస్కార్ అవార్డులు ప్రకటిస్తారు. దీనికంటే ముందు 10 సైంటిఫిక్, టెక్నికల్ అవార్డులను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సెన్సెస్ ప్రదానం చేయనుంది. ఫిబ్రవరి 13న నిర్వహించనున్న ఈ అవార్డుల ప్రదానోత్సవం భారతీయులకు ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకంటే ఈసారి భారత సంతతికి చెందిన నటుడు, నిర్మాత రాహుల్ థక్కర్ అవార్డు అందుకోబోతున్నారు. టెక్నికల్ ఎచీవ్ మెంట్ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేయనున్నట్టు ఆస్కార్ అవార్డ్స్ అధికార వెబ్ సైట్ లో పేర్కొంది. 'గ్రౌండ్ బ్రేకింగ్ డిజైన్'లో అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు ప్రకటించినట్టు తెలిపింది. రాహుల్ థక్కర్, రిచర్డ్ చాంగ్ లకు సంయుక్తంగా ఈ పురస్కారం ప్రదానం చేయనున్నట్టు వెల్లడించింది. -
2016 ఆస్కార్ నామినేషన్స్ ఇవే..
2016 సంవత్సరానికి ఆస్కార్ అవార్డుల ప్రదానానికి రంగం సిద్దమైతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ పురస్కారానికి (88వ అకాడమీ అవార్డ్స్) నామినేషన్లను ఆస్కార్ కమిటీ వెల్లడించింది. లియోనార్డో డికాప్రియో సినిమా 'రెవనెంట్' ఈ ఏడాది అత్యధికంగా 12 విభాగాల్లో నామినేషన్లను సాధించింది. మరో చిత్రం మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్ చిత్రం పది అంశాల్లో పోటీ పడనుంది. ఉత్తమ చిత్రాల బరిలో ది బిగ్ షార్ట్, బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్, బ్రోక్లెన్, మాడ్ మాక్స్:ఫ్రే రోడ్, ది మార్టిన్, ది రెవెనెంట్, రోమ్, స్పాట్ లైట్ చిత్రాలు ఉన్నాయి. ఉత్తమ నటుడి విభాగంలో స్టార్ హీరోలు లియోనార్డో డికాప్రియో, బ్రయాన్ క్రాన్ స్టన్, మాట్ డామన్, మైఖెల్ ఫాస్బెండర్, ఎడ్డిల్ లు పోటీ పడుతున్నారు. ఉత్తమ నటి విభాగంలో కేట్ బ్లాంచెట్, బ్రై లార్సన్, జెన్నిఫర్ లారెన్స్, షార్లెట్ రాంఫ్లింగ్, రోనన్ లు నామినేషన్స్ పొందారు. కాగా టైటానిక్ సుందరి కేట్ విన్స్లెట్ 'స్టీవ్ జాబ్స్ ' సినిమాకు గాను.. ఉత్తమ సహాయ నటి విభాగంలో నామినేషన్ పొందింది. మరో వైపు ఉత్తమ విదేశీ భాషా చిత్రాల విభాగానికి నామినేషన్ దాఖలు చేసిన..మరాఠీ చిత్రం 'కోర్ట్' తుది నామినేషన్లలో చోటు సంపాదించలేక పోయింది. దీంతో ఈ ఏడాది కూడా భారతీయులకు నిరాశే మిగిలింది. ఫిబ్రవరి 28న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సం జరగనుంది. -
ఈవిడగారు పడకపోతే న్యూస్!
కాకతాళీయంగా జరుగుతుందో, నలుగురూ తన గురించి చర్చించుకోవాలని చేస్తారో కానీ... ఏ ఫంక్షన్లో పాల్గొన్నా అక్కడ అమాంతం కిందపడిపోతుంటారు జెన్నీఫర్ లారెన్స్. ఈ పాతికేళ్ల హాలీవుడ్ అందానికి బోల్డంత మంది అభిమానులు ఉన్నారు. ఈవిడగారు కిందపడ్డప్పుడల్లా అభిమానులు తెగ ఫీలైపోతుంటారు. 2013లో ఆస్కార్ అవార్డు అందుకోవడానికి వేదిక మీదకు వెళుతూ జర్రున జారారు జెన్నీఫర్. 2014లోనూ అలానే జరిగింది. కారులోంచి దిగి, రెడ్ కార్పెట్ మీద ఒయ్యారంగా నడుస్తూ అమాంతంగా పడిపోయారు. ఆ తర్వాత ఫ్యాషన్ షోస్‌లో కూడా జెన్నీఫర్ కాలు జారిపడ్డ దాఖలాలు చాలానే ఉన్నాయి. తాజా విషయం ఏమిటంటే... జెన్నీఫర్ నటించిన ‘ది హంగర్ గేమ్స్: మాకింగ్‌జే -పార్ట్ 2’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం ప్రచార కార్యక్రమంలో భాగంగా జెన్నీఫర్ ఎర్ర తివాచీపై నడిచారు. నలుపు రంగు పొడవాటి గౌను, ఎత్తు మడమ చెప్పులు ధరించి జెన్నీఫర్ మెట్లు ఎక్కారు. అంతే.. అడుగు తడబడింది. కిందపడిపోయారు. పడడం ఎలాగూ అలవాటే కనుక వెంటనే లేచి, ఏమీ జరగనట్లు నడుచుకుంటూ వెళ్లిపోయారు జెన్నీఫర్. ఎప్పుడూ పడిపోతుంటారు కాబట్టి, జెన్నీఫర్ పడకపోతే న్యూస్ అని హాలీవుడ్లో జోక్‌లు వేసుకుంటున్నారు. -
ఆస్కార్‌కు 'నిర్భయ' డాక్యుమెంటరీ!
'ఇండియాస్ డాటర్' పేరిట నిర్భయ ఉదంతంపై తీసిన డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు పొందే అర్హత ఉందని ప్రముఖ హాలీవుడ్ కథానాయిక మెరిల్ స్ట్రీప్ పేర్కొన్నారు. అమెరికాలో ఈ డాక్యుమెంటరీ విడుదలైన సందర్భంగా ఆమె శుక్రవారం వీక్షించారు. డాక్యుమెంటరీ రూపకర్తలను ప్రశంసలతో ముంచెత్తారు. ఆస్కార్ బెస్ట్ డాక్యుమెంటరీ కేటగిరిలో దీనికి నామినేషన్ దక్కాలని జరుగుతున్న కాంపెయిన్లో తాను కూడా పాలుపంచుకోనున్నట్టు తెలిపారు. ఢిల్లీలో 23 ఏళ్ల పారా మెడికల్ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా గ్యాంగ్ రేప్ కు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా ప్రతిఘటించి.. అమానుష హింస ఎదుర్కొని.. 13 రోజుల తర్వాత ఆమె చనిపోయింది. ఆమె ధైర్యానికి ప్రతీకగా 'నిర్భయ' పేరుతో ఈ ఉదంతం నిలిచిపోయింది. మహిళలపై దాడులకు వ్యతిరేకంగా ఢిల్లీలో, దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై బ్రిటిష్ చిత్ర రూపకర్త లెస్లీ ఉడ్విన్ ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు, వైద్యులు, పోలీసులు, లాయర్లు, రేపిస్టులను ఈ డాక్యుమెంటరీలో ఇంటర్వ్యూ చేశారు. దీనిలో నిందితుల వాదనలు కూడా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం దేశంలో ఈ డాక్యుమెంటరీని నిషేధించింది. ఈ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు గ్రహిత అయిన మెరిల్ స్ట్రీప్ సంపూర్ణ మద్దతు పలికారు. ఈ డాక్యుమెంటరీని మొదట చూసినప్పుడు నోటమాట రాకుండా అలా కాసేపు ఉండిపోయానని ఆమె పేర్కొన్నారు. -
బాత్రూమ్లో ఆస్కార్... ఇదేం ఆనందం!
ఆ రోజు కేట్ విన్స్లెట్కి నిద్రపట్టలేదు. ఎందుకంటే, ఆ మర్నాడు ఆస్కార్ అవార్డ్ విజేతల ప్రకటన జరుగుతుంది. బంగారు బొమ్మ దక్కుతుందా? పదే పదే ప్రశ్నించుకున్నారు. రాత్రంతా కలత నిద్రతోనే సరిపోయింది. మర్నాడు ఎన్నో ఆశలతో అవార్డ్ ఫంక్షన్‌కు వెళ్లారు. బంగారు బొమ్మను దక్కించుకున్నారు. తెగ ఆనందపడ్డారు. అంతలోనే డీలా పడ్డారు. ఇంట్లో ఆస్కార్ ఎక్కడ పెట్టాలి? అని డైలమాలో పడ్డారు. హాలులోని షోకేస్‌లో పెడితే, వచ్చినవాళ్లంతా అవార్డును తాకుతారు. దొంగిలించే ఆస్కారం కూడా లేకపోలేదు. కష్టపడి తెచ్చుకున్న అవార్డును దొంగలపాలు చేయడమా? ఊహూ.. అయితే ఆస్కార్ అవార్డ్ పదిలంగా ఉండే చోటు ఏది? అని తీవ్రంగా ఆలోచించారు. మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అవార్డుని తీసుకెళ్లి బాత్రూమ్లో పెట్టేశారు. ఇదేం ఆనందం అనుకుంటున్నారా? బాత్రూమ్కు వెళ్లినవాళ్లు ముందు పని కానిస్తారు. ఏ పని చేసినా చేతులు తడి కావడం ఖాయం. ఆ తడి చేతులతో ఆస్కార్‌ని ముట్టుకోరు కదా. ఆ విధంగా ఇంట్లోవాళ్ల బారి నుంచి, ఇంటికొచ్చే అతిథుల బారి నుంచి కూడా ఆస్కార్‌ను కాపాడుకోవచ్చన్నది కేట్ విన్స్లెట్ ఆలోచన. ఇక, దొంగలొచ్చారనుకోండి.. బాత్రూమ్లో విలువైన వస్తువులు ఉంటాయనుకోరుగా.. సో.. ఆస్కార్ సేఫ్‌గా ఉంటుందనుకుని కేట్ మురిసిపోయారు. 2009లో ‘ది రీడర్’ చిత్రానికిగాను ఆస్కార్ గెల్చుకున్నప్పుడు తాను చేసిన ఈ తతంగాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కేట్ విన్స్లెట్ గుర్తు చేసుకున్నారు. -
ఆస్కార్ రేస్‌లో ఆ రెండు చిత్రాలు
భారతీయ సినిమాకు ఆస్కార్ అవార్డు అన్నది ఒక కలగానే మిగిలిపోయింది. అయితే ఆ అవార్డుల ఎంపికలో పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారనే భావనను చాలా మంది వ్య క్తం చేస్తున్నారు. అసలు మంచి చిత్రానికి ఆ స్కార్ అవార్డు కొలమానం కాదని కమలహాస న్ లాంటి నట దిగ్గజాలు అంటుంటారు. అయినా ప్రతిసారి ఆ అవార్డు కోసం ప్రయత్నిస్తూ భారతీయ సినిమా భంగ పడుతూనే ఉంది. ఏదేమయినా మరో సారి ఆ అవార్డు కోసం అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నాయి.విశేషం ఏమిటంటే ఈ దఫా కోలీవుడ్, టాలీవుడ్ చిత్రాలు ఆస్కార్ అవార్డు ల పోటీకి తయారవుతున్నాయి. ఈ రెండు చిత్రాలు విశేష ప్రజాదరణ పొందడంతో పా టు ప్రపంచ సినిమా దృష్టిని తమ వైపు తిప్పుకున్నవే. అందులో ఒకటి భారతీయ సినీ చరి త్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కి వసూళ్లలోనూ చరిత్ర సృష్టించిన బాహుబలి చిత్రం కాగా రెండవది ఎలాంటి చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ లేని అతి తక్కువ కాస్ట్‌తో చాలా చిన్న చిత్రంగా రూపొంది సంచలనాలను న మోదు చేసుకున్న కాక్కముట్టై. నటుడు ధనుష్ వుండర్మార్ ఫిలింస్,దర్శకుడు వెట్రి మారన్ గ్రాస్‌రూట్, ఫాక్స్ స్టూడియో సంస్థలు సం యుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నవ దర్శకు డు మణికంఠ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఇక విఘ్నేశ్, రమేష్ అనే నటనంటే తెలియని చిన్న పిల్లలు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడడంతో పాటు జాతీయ అవార్డులను కొల్లగొట్టిందన్న విషయం తెలిసిందే.ఇక బాహుబలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బ్రహ్మాండానికే బ్రహ్మాండంగా నిలిచిన చిత్రం ఇది.తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన అద్భుత సృష్టి బాహుబలి.అలా అబ్బుర పరచిన ఈ రెండు చిత్రాలు ఆస్కార్ అవార్డుల రేస్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.ఆస్కార్ అవార్డుల నామినేషన్‌కు భారతీయ చిత్రాల ఎంపిక జూరీ బృందానికి ప్రముఖ నటుడు,దర్శకుడు అమోల్ పాలేకర్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఇటీవల ఆయన తన బృందంతో కలిసి హైదరాబాద్ వచ్చి 45 భారతీయ చిత్రాలను పరిశీలించి ఆస్కార్ అవార్డుల నామినేషన్‌కు కొన్ని చిత్రాలను ఎంపిక చేసినట్లు సమాచారం.వాటిలో కోలీవుడ్‌కు సంబంధించి కాక్కముట్టై,టాలీవుడ్ చిత్రం బాహుబలి చిత్రాలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. వీటితో పాటు అమీర్‌ఖాన్ నటించిన పీకే,విశాల్ బరద్వాజ్ చిత్రం హైదర్, ప్రియాంకచోప్రా మేరీకోమ్, నీరజ్ చిత్రం మసాన్ తదితర చిత్రాలు ఉన్నట్లు సమాచారం. 88వ అస్కార్ అవార్డులకు నామినేట్ అయిన చిత్రాల వివరాలను సెప్టెంబర్ 25న అధికారకపూర్వంగా వెల్లడించనున్నారు. -
తమిళ్ స్లమ్ డాగ్ ఒరు కుప్పై క థై
స్లమ్ డాగ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌కు ఆస్కార్ అవార్డులను అందించిన చిత్రం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి తమిళ స్లమ్ డాగ్ చిత్రంగా ఒరు కుప్పై కథై ఉంటుందంటున్నారు ఆ చిత్ర దర్శకుడు కాళి రంగస్వామి. దర్శకులు ఎళిల్, అస్లామ్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఈయనకిది తొలి చిత్రం తన గురువుల్లో ఒకరైన అస్లామ్ నిర్మాతగా మారి తన ఫిలిం బాక్స్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ నృత్య దర్శకుడు దినేష్ కథా నాయకుడిగా పరిచయం అవుతున్నారు. వళక్కు ఎన్ 18/9, ఆదలాల్ కాదల్ చెయ్ వీరే చిత్రాల ఫేమ్ మనీషా యాదవ్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ నృత్య దర్శకుడు దినేష్ నటించిన హీరో పాత్రను దర్శకుడు అమీర్, సముద్రకణి, మిష్కిన్ నటించాలని కోరుకున్నారన్నారు. చిత్ర కథ గురించి చెప్పాలంటే ఒక చిన్న అంశాన్ని ఇంకా చెప్పాలంటే ఒక చెత్త లాంటి విషయాన్ని పద్ధతిగా చేస్తే అది ఎంత దూరం పోతుంది? పరిణామాలు ఎంత తీవ్రంగా మారుతాయి అని చెప్పే కథ ఒరు కుప్పై కథ చిత్రం అన్నారు. నవ దంపతుల మధ్య తలెత్తిన చిన్న సమస్య ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? అన్న అంశాన్ని సహజసిద్ధంగా తెరపై ఆవిష్కరించినట్లు చెప్పారు. ఇది యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రం అని చెప్పారు. కాదల్, కల్లూరి చిత్రాల ఫేమ్ జోష్యా శ్రీధర్ సంగీతాన్ని అంజాదే చిత్రం ఫేమ్ మహేష్ ముత్తుస్వామి చాయాగ్రహణం అందించినట్లు దర్శకుడు వెల్లడించారు. -
లఘు చిత్రంలో రహమాన్
జంట ఆస్కార్ అవార్డులతో ప్రపంచవ్యాప్తంగా పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్న సంగీతదర్శకుడు ఎ.ఆర్. రహమాన్ జీవితం చాలామందికి ఆదర్శం అనే చెప్పాలి. అందుకే ఆయన జీవిత చరిత్రను లఘు చిత్రంగా దర్శకుడు ఉమేష్ అగర్వాల్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి ‘జైహో’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ నెల 25న న్యూయార్క్‌లోని ‘మ్యూజియమ్ ఆఫ్ మూవింగ్ ఇమేజ్’లో ఈ చిత్రాన్ని ప్రద ర్శించనున్నారు. రహమాన్‌తో కలిసి పనిచేసిన మణిరత్నం, శేఖర్‌కపూర్, డానీ బోయల్ ఆయనతో తమ అనుబంధాన్ని, అనుభవాలను ఈ చిత్రంలో వెల్లడించారట! -
ఆస్కార్ బరిలో ‘జల్’
న్యూఢిల్లీ: జాతీయ అవార్డు సాధించిన చిత్రం ‘జల్’ 87వ అస్కార్ అవార్డుల రేస్‌లో నిలిచింది. ఉత్తమ చిత్రం, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరిల్లో ఈ చిత్రానికి నామినేషన్లు దక్కాయి. ఈ సినిమాకి గిరిష్ మాలిక్ దర్శకత్వం వహించగా.. సోనూనిగమ్, బిక్రమ్ ఘోష్ నేపథ్య సంగీతాన్ని అందించారు. -
జూనియర్ రెహ్మాన్ వస్తున్నాడు
పండిత పుత్ర పరమ శుంఠ అన్న ది నాటి నానుడి. పులి కడుపున పులే పుడుతుందన్నది నేటి నానుడిని నిజం చేస్తూ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎఆర్ రెహ్మాన్ వారసుడి సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఒక సారి రెండు ఆస్కార్ అవార్డులను గెలిచి భారత దేశ ప్రతిష్టను పెంచిన ఎఆర్ రెహ్మాన్ 11 ఏళ్ల కొడుకు అమీన్ బాల గాయకుడిగా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నారు. విశేషం ఏమిటంటే ఏ.ఆర్.రెహ్మాన్‌ను సంగీత దర్శకుడిగా పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆయ న వారసుడిని గాయకుడిగా పరిచయం చేయనుండటం విశేషం. ఎస్ మణిరత్నం తాజా చిత్రంలో అమీన్ ఒక పాట పాడనున్నారట. ఈ విషయాన్ని ఇటీవల చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఏ.ఆర్.రెహ్మాన్ స్వయంగా వెల్లడించారు. ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తండ్రి సంగీతంలో తనయుడు పాడనున్నారన్న మాట. నిజం చెప్పాలంటే రెహ్మాన్ కొడుకు అమీన్ ఇంతకు ముందే గాయకుడిగా పరిచయమయ్యారు. రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహించిన హాలీవుడ్ చిత్రం కపుల్స్ రీట్రీట్‌లో నాన్ నెంబర్ అనే పాటను పాడాడు. అదే విధంగా గత ఏడాది చెన్నైలో జరిగిన 10వ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పియానో వాయించి ప్రశంసలందుకున్నాడు. మణిరత్నం ఇప్పుడు తన చిత్రం ద్వారా అమీన్‌ను గాయకుడిగా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేయనున్నారన్నమాట. అయితే అమీన్‌కు నటుడిగానూ పలు అవకాశాలొస్తున్నాయట. ఈ విషయం గురించి రెహ్మాన్ తెలుపుతూ అమీర్‌ను నటింప చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారన్నారు. -
యుక్త వయసును మిస్ అయ్యాను
సంగీతంతో గడుపుతూ యుక్త వయసును మిస్ అయ్యానని ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ అన్నారు. అందువలనే ఆయన ఆస్కార్ అవార్డు గ్రహీతలయ్యారన్నది జగమెరిగిన సత్యం. ఈ సంగీత మాంత్రికుడు మాట్లాడుతూ, ప్రస్తుతం సంగీతానికి బలం వున్న కథా చిత్రాలనే అంగీకరిస్తున్నట్లు తెలిపారు. అలా కాకుంటే తన అభిమానులను కోల్పోవలసి వస్తుందన్నారు. చరిత్ర కథా చిత్రాలకు సంగీతాన్ని అందించిన తరువాత ఇప్పుడు యువకుల చిత్రాలకు పని చేస్తున్నానన్నారు. అయితే చారిత్రక కథా చిత్రాలకు సంగీతం అందించి అలసిపోలేదన్నారు. అలాంటి చిత్రాలకు పని చేస్తునే ఉంటానని చెప్పారు. నిజం చెప్పాలంటే అలాంటి చరిత్ర కథా చిత్రాలకు పని చేస్తున్నప్పుడు కొత్త సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. కొన్ని చిత్రాలకు నేపథ్య సంగీతం మాత్రమే అందించాల్సి వస్తోందన్నారు. కారణం ఆ చిత్రాల్లో పాటలకు చోటుండకపోవడమేనన్నారు. అలాంటి సంగీతం 30, 40 శాతం అభిమానులకే చేరుతుందన్నారు. వినూత్న కథా చిత్రాలకు సంగీతాన్ని అందించడానికి కారణం ఆ పాటలను తెరపై తారలు పాడినట్లే ఫీలింగ్ కలుగుతుండటమేనని పేర్కొన్నారు. మరో విషయం ఏమిటంటే తాను చిన్న వయసులోనే 40 ఏళ్లపైబడిన సంగీత దర్శకులతో గడిపానని చెప్పారు. అందువలన యుక్త వయసును తాను ఎంజాయ్ చేయలేకపోయానన్నారు. అయితే ఇప్పటికీ తాను యువకుడిననే భావనతోనే ఉన్నానని రెహ్మాన్ పేర్కొన్నారు. -
ఆస్కార్ అవార్డుకు ప్రయత్నించలేదు
ఆస్కార్ అవార్డు కోసం తానెప్పుడూ ప్రయత్నించలేదని సంగీతజ్ఞాని ఇళయరాజా పేర్కొన్నారు. శనివారం ఈ రోడ్లో నెలకొల్పిన గ్రంథాలయ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఇళయరాజా మాట్లాడుతూ తాను సంగీత దర్శకుడవ్వాలని చెన్నైకి బయలుదేరినప్పుడు ఒక ఆర్మోనియా పెట్టెతో వచ్చానని గుర్తుచేసుకున్నారు. అయితే ఇప్పుడున్నవారు అలా రావలసిన అవసరం లేదన్నారు. అంతా కంప్యూటర్‌మయం అయ్యిందని అన్నారు. ఇప్పుడు పాటకు సొంతంగా ఆలోచించి ట్యూన్ కట్టాల్సిన అవసరం లేదని కంప్యూటర్లో పొందుపరచిన శబ్దాలను తీసుకుని సమకూర్చుకుని ట్యూన్స్ కడితే మీరు తలాడిస్తారని చురకలేశారు. మరో విషయం ఏమిటంటే సినిమా పాటలు రాయడానికి ప్రసవ వేదన అనుభవిస్తున్నట్లు రచయితలు చెప్పుకుంటున్నారని, నిజానికి ప్రసవ వేదన ఏమిటన్నది కన్నతల్లులకే తెలుసని పాటలురాయడం అనే సులభమైన, సాధారణమైన విషయాన్ని ప్రసవ వేదనతో పోల్చడం సరి కాదని ఇళయరాజా పేర్కొన్నారు. ఈతరం గీత రచయితలు పాటల్లో తన సొంత రచన అధికంగా ఉంటుందని ఈ విషయాన్ని ఈ వేదికపై బహిరంగంగానే చెబుతున్నారని అన్నారు. అయితే ఆ రచయితలెవరన్నది మాత్రం వెల్లడించడం ఇష్టం లేదన్నారు. తన సంగీతాన్ని వింటున్నప్పుడు కలిగే ప్రశాంతత, ఆనందం పుస్తకాల పఠనంలోనూ లభిస్తుందన్నారు. తాను ఆస్కార్ అవార్డుల కోసంప్రయత్నించలేదని తెలిపారు. తన సంగీతానికి గురువులు ప్రేక్షకులేనని అన్నారు. ఏ కాలంలో అయినా సప్త స్వరాలను మీటి సంగీతాన్ని రూపొందించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. వ్యాపార రంగంగా మారడం వలనే తాను సంగీత పాఠశాలను నెలకొల్పలేదని వివరించారు. దేన్నీ విజయంగా భావించరాదన్నారు. అలా భావిస్తే ఒక చట్రంలోకి నెట్టబడుతారని ఇళయరాజా తన మనోభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
ప్రపంచ సెక్సీయెస్ట్ మహిళ జెన్నీఫర్ లారెన్స్
లాస్ ఎంజెల్స్: పురుషులకు చెందిన ఎఫ్హెచ్ఎం పత్రిక ఈ ఏడాది సెక్సీయెస్ట్ మహిళగా ఆస్కార్ అవార్డు గెలిచిన నటి జెన్నిఫర్ లారెన్స్‌ను ఎంపిక చేసింది. బ్రిటన్‌కు చెందిన ఆ పత్రిక 2014 టాప్ 100 హాటెస్ట్ గర్ల్స్ జాబితాను విడుదల చేయగా.. అందులో ప్రథమ స్థానాన్ని ‘సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్’ నటి జెన్నిఫర్ దక్కించుకుంది. తనకు ఈ కిరీటం దక్కడంపై జెన్నిఫర్ ఆనందం వ్యక్తం చేసింది. సెక్సీ అంటే భారీ మేకప్, కచ్చితమైన శరీరాకృతి, జుట్టు కాదని, అది ఆత్మవిశ్వాసమని చెప్పింది. నీకులా నువ్వు సౌకర్యంగా ఉండడం, ఎల్లప్పుడూ దరహాసం, సంతోషమే సెక్సీ అని తెలిపింది. కాగా, రెండో స్థానాన్ని ఇంగ్లిష్ నటి మిషెల్లీ కీగన్ దక్కించుకున్నారు.