
హాలీవుడ్‌కి చెందిన క్రేజీ కపుల్స్‌లో డేవ్ మెక్ క్యారీ, ఎమ్మా స్టోన్ జోడీ ఒకటి. దర్శక–రచయిత, హాస్య నటుడు డేవ్, నటి ఎమ్మా 2016లో ప్రేమలో పడి, 2020లో పెళ్లి చేసుకున్నారు. 2021లో వీరికో పాప పుట్టింది. వ్యక్తిగత జీవితం జోష్‌గా ఉన్న నేపథ్యంలో గత నెల 10న జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకలో ‘పూర్ థింగ్స్’ చిత్రానికి గాను ఎమ్మా స్టోన్ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. 2016లో ఉత్తమ నటిగా ‘లా లా ల్యాండ్’ చిత్రానికి ఆస్కార్ అందుకున్న ఎమ్మాకి ‘పూర్ థింగ్స్’తో మరో అవార్డు దక్కింది. ఈ చిత్రానికి డేవ్, ఎమ్మా కూడా నిర్మాతలు.
రెండోసారి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు అందుకున్న ఆనందంలో ఉన్న ఎమ్మా స్టోన్‌కి మరో మంచి సినిమా ఇవ్వాలని డేవ్ మేక్ క్యారీ ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించాలని కూడా అనుకుంటున్నారట. దర్శకుడిగా డేవ్‌కి ‘బ్రిగ్స్‌బీ బియర్’ (2017) తొలి చిత్రం. ఆ తర్వాత మరో సినిమాకి మెగాఫోన్ పట్టలేదు. ఇప్పుడు భార్య కోసం మళ్లీ డైరెక్టర్‌గా స్టార్ట్, కెమెరా, యాక్షన్ చెప్పడానికి రెడీ అయ్యారు డేవ్.
Comments
Please login to add a commentAdd a comment