
ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల వేడుక.. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈసారి చాలా సినిమాలు పోటీపడ్డాయి గానీ అంతిమంగా విజేతలు ఎవరనేది తేలిపోయింది. ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ (ద బ్రూటలిస్ట్ సినిమా), ఉత్తమ నటిగా మికీ మ్యాడిసన్ నిలిచింది. ఉత్తమ చిత్రంగా అనోరా ఆస్కార్ పురస్కారం దక్కించుకుంది. మరి ఆస్కార్ గెలుచుకున్న సినిమాల్ని ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)
ఆస్కార్స్-2025 విజేతల జాబితా - ఓటీటీ డీటైల్స్
ఉత్తమ చిత్రం- అనోరా మూవీ - (అమెజాన్ ప్రైమ్)
ఉత్తమ నటుడు- అడ్రియన్ బ్రాడీ (ద బ్రూటలిస్ట్ సినిమా -అమెజాన్ ప్రైమ్)
ఉత్తమ నటి - మికీ మ్యాడిసన్ (అనోరా మూవీ- అమెజాన్ ప్రైమ్)
ఉత్తమ దర్శకుడు - సీన్ బెకర్ (అనోరా సినిమా - అమెజాన్ ప్రైమ్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ - ద బ్రూటలిస్ట్ (అమెజాన్ ప్రైమ్)
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ మూవీ - నో అదర్ ల్యాండ్ (అమెజాన్ ప్రైమ్)
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ - ఫ్లో (అమెజాన్ ప్రైమ్)
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ సినిమా - ఐ యామ్ స్టిల్ హియర్ (అమెజాన్ ప్రైమ్)
బెస్ట్ ఒరిజినల్ స్కోర్ - ద బ్రూటలిస్ట్ (అమెజాన్ ప్రైమ్)
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ - డ్యూన్ పార్ట్ 2 (అమెజాన్ ప్రైమ్)
బెస్ట్ సౌండ్ - డ్యూన్ పార్ట్ 2 (అమెజాన్ ప్రైమ్)
బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ - సీన్ బీకర్ (అనోరా మూవీ - అమెజాన్ ప్రైమ్)
మిగతా విభాగాల్లో ఎవరెవరికి అవార్డులు?
ఉత్తమ సహాయ నటుడు - కీరన్ కల్కిన్ (ఏ రియల్ పెయిన్)
ఉత్తమ సహాయ నటి – జో సల్దానా (ఎమిలియా పెరెజ్)
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ – ఎల్ మల్ (ఎమిలియా పెరెజ్)
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే– కాంక్లేవ్
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – అనోరా
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ – విక్డ్ (పాల్ టేజ్ వెల్)
బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ – అనోరా
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – విక్డ్
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్ – పియర్ ఒలివియర్ పర్సిన్, స్టీఫెన్ గులియన్, మారిలిన్ స్కార్సెల్లి (ది సబ్ స్టాన్స్)
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం- ఐ యామ్ నాట్ ఏ రోబో
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం- ఇన్ ద షాడో ఆఫ్ సైప్రస్
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం- ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా
ఈ ఏడాది ఉత్తమ చిత్రం, నటుడు, నటి, దర్శకుడు.. ఇలా దాదాపు విజేతగా నిలిచిన ప్రతి చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్ లోనే స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా)
Comments
Please login to add a commentAdd a comment