Oscars
-
ఆస్కార్ బరిలో లాపతా లేడీస్
బాలీవుడ్ చిత్రం ‘లాపతా లేడీస్’కు అరుదైన ఘనత దక్కింది. వచ్చే ఏడాది మార్చిలో లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న 97వ ఆస్కార్ అవార్డ్స్లోని ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ కోసం పోటీ పడేందుకు ‘లాపతా లేడీస్’ చిత్రం బరిలో నిలిచింది. భారతదేశం తరఫున ఈ సినిమాను ఆస్కార్ నామినేషన్ ఎంపిక కోసం పంపిస్తున్నట్లు ‘ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎఫ్ఎఫ్ఐ) సోమవారం ప్రకటించింది.29 చిత్రాలు పరిశీలించి ‘లాపతా లేడీస్’ని ఏకగ్రీవంగా ఇండియా ఎంట్రీగా ఆస్కార్ నామినేషన్‌కి పంపేందుకు ఎంపిక చేసినట్లు ‘ఎఫ్ఎఫ్ఐ’ కమిటీ డైరెక్టర్ ఆర్.జహ్ను బారువా తెలిపారు. కిరణ్‌రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’లో నితాన్షి గోయల్, ప్రతిభా రంతా, స్పర్శ్ శ్రీవాస్తవ్ ప్రధాన పాత్రధారులుగా, రవికిషన్ , ఛాయాకందం ఇతర పాత్రల్లో నటించారు. ఆమిర్‌ఖాన్ , కిరణ్‌రావు, జ్యోతిదేశ్ పాండే నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది సెప్టెంబరులో జరిగిన 48వ టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో తొలిసారి ప్రదర్శించబడి ప్రశంసలు అందుకుంది.ఆ తర్వాత ఈ ఏడాది మార్చి 1న థియేటర్స్‌లో విడుదలై, సూపర్‌హిట్ ఫిల్మ్‌గా నిలిచింది. 1958లో జరిగిన 30వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘మదర్ ఇండియా’, 1989లో జరిగిన 61వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘సలామ్ బాంబే’, 2002లో జరిగిన 74వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘లగాన్ ’ చిత్రాలు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ ను దక్కించుకున్నప్పటికీ అవార్డులను గెలుచుకోలేదు. గత ఏడాది ‘ఎఫ్ఎఫ్ఐ’ ఆస్కార్‌కు పంపిన మలయాళ చిత్రం ‘2018: ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో’ కూడా నామినేషన్ దక్కించుకోలేదు.తాజాగా ‘లాపతా లేడీస్’ ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ ను దక్కించుకుంటే.. 23ఏళ్ల తర్వాత ఈ విభాగంలో ఆస్కార్ నామినేషన్ ను దక్కించుకున్న భారతీయ చిత్రంగా నిలుస్తుంది. వచ్చే ఏడాది జనవరి 17న ఆస్కార్ నామినేషన్ ్సను అధికారికంగా ప్రకటించనున్న సంగతి తెలిసిందే. -
ఆస్కార్ బరిలో 'లాపతా లేడీస్'.. అధికారిక ప్రకటన
హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు తీసిన సినిమా 'లాపతా లేడీస్'. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది. 2025 ఆస్కార్ కోసం మనదేశం నుంచి అధికారికంగా ఎంపికైంది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్)స్పర్ష్ శ్రీ వాత్సవ, నితాన్షి గోయల్, ప్రతిభ ప్రధాన పాత్రలు పోషించారు. 'రేసుగుర్రం' ఫేమ్ రవికిషన్ ఇందులో కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.(ఇదీ చదవండి: 'కల్కి' సినిమాపై గరికపాటి విమర్శలు.. ఏమన్నారంటే?) -
ఇండియన్ లేడీ సినిమాటోగ్రాఫర్.. ఆస్కార్ రేంజ్ వరకు
గత కొన్నేళ్లుగా ఆస్కార్‌కి ఇండియన్ సినిమాలు ఆమడ దూరంలో ఉండేవి. కానీ 'ఆర్ఆర్ఆర్' మూవీ దీన్ని బ్రేక్ చేసింది. నాటు నాటు పాటతో అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. అనంతరం పలు సినిమాలు కూడా ఆస్కార్ నామినేషన్స్ వరకు వెళ్లొస్తున్నాయి. వీటి సంగతి పక్కనబెడితే బెంగళూరుకు చెందిన లేడీ సినిమాటోగ్రాఫర్ ఇప్పుడు ఆస్కార్ అకాడమీ గోల్డ్ రైజింగ్ ప్రోగ్రామ్‌కి ఎంపికైంది.(ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీలీల ఇంతలా మారిపోయిందేంటి?)బెంగళూరుకి చెందిన నేత్ర గురురాజ్.. ప్రస్తుతం లాజ్ ఏంజెల్స్‌లో ఉంటోంది. స్వతహాగా రైటర్, డ్యాన్సింగ్, డైరెక్షన్, ప్రొడక్షన్ డిజైన్ ఇలా చాలా విభాగాల్లో ప్రావీణ్యురాలైన నేత్ర.. కొన్నాళ్ల ముందు సినిమాటోగ్రఫీలో మాస్టర్స్ చేసేందుకు లాస్ ఏంజెల్స్ వెళ్లింది. రీసెంట్గా ఈమె తీసిన 'జాస్మిన్ ఫ్లవర్స్' షార్ట్ ఫిల్మ్.. పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు గెలుచుకుంది.ఈ క్రమంలోనే నేత్ర.. ఇప్పుడు ఆస్కార్ అకాడమీ గోల్డ్ రైజింగ్ ప్రోగ్రామ్‌కి ఎంపికైంది. ప్రపంచం నలుమూల నుంచి ఈ ప్రోగ్రామ్‌కి సెలెక్ట్ అయిన యువ సినిమాటోగ్రాఫర్స్.. రెండు నెలల పాటు అకాడమీ ఆధ్వర్యంలో ప్రొఫెషనల్స్ దగ్గర నుంచి మెలకువలు నేర్చుకుంటారు. ఇలాంటి దాని కోసం మన దేశానికి చెందిన అమ్మాయి ఎంపిక కావడం విశేషం.(ఇదీ చదవండి: డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్) -
ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్
తమిళ చిత్రం ‘పార్కింగ్’కు అరుదైన గౌరవం లభించింది. ఆస్కార్ లైబ్రరీలో ‘పార్కింగ్’ సినిమా స్క్రీన్‌ప్లేకు చోటు దక్కింది. హరీష్ కల్యాణ్, ఎమ్ఎస్ భాస్కర్, ఇందుజా రవిచంద్రన్ లీడ్ రోల్స్‌లో నటించిన తమిళ చిత్రం ‘పార్కింగ్’. రామ్‌కుమార్ బాలకృష్ణన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, సుధన్ సుందరం–కేఎస్ సినీష్ నిర్మించిన ఈ చిత్రం 2023 డిసెంబరు 1న విడుదలై, మంచి విజయం సాధించింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల మెప్పు కూడా పొందింది.తాజాగా ‘పార్కింగ్’ సినిమా స్క్రీన్‌ప్లేకు ఆస్కార్ లైబ్రరీలో శాశ్వతంగా చోటు కల్పిస్తున్నామని ఆస్కార్ మేనేజింగ్ లైబ్రేరియన్ ఫిలిఫ్ గార్సియా నుంచి ఇ–మెయిల్ వచ్చిందని చిత్రనిర్మాత కేఎస్ సినీష్ సోషల్ మీడియాలో పేర్కొని, ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే... ఒకే ఇంట్లో అద్దెకు ఉండే ఐటీ ఉద్యోగి ఈశ్వర్, ప్రభుత్వోద్యోగి ఎస్. ఇళంపరుతి పార్కింగ్ విషయంలో ఈగోలకు పోయి ఒకరికి ఒకరు ఎలా హాని చేసుకున్నారు? ఆ తర్వాత తమ తప్పులను ఎలా తెలుసుకున్నారు? అనే అంశాల నేపథ్యంతో ‘పార్కింగ్’ కథ సాగుతుంది.రూ. 3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ. 15 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లుగా కోలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ తమిళ ‘పార్కింగ్’ సినిమాను తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఓ విదేశీ భాషలోనూ రీమేక్ చేయడానికి చిత్ర దర్శక–నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. -
ఆస్కార్-2024 అవార్డుల వేడుక.. విజేతలు వీళ్లే
ప్రపంచ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులంటే అందరికీ గుర్తొచ్చేది 'ఆస్కార్'. ఎప్పటినుంచి దీని గురించి మనకు తెలుసు. కానీ 'ఆర్ఆర్ఆర్'కి గతేడాది రావడంతో దీని గురించి సగటు సినీ ప్రేక్షకుడికి కూడా తెలిసింది. ఇప్పుడు 96వ ఆస్కార్ అవార్డుల వేడుక అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరుగుతోంది. ఉత్తమ నటుడు, నటి, దర్శకుడు ఎవరు? అలానే ఏయే విభాగాల్లో ఎవరెవరికి అవార్డులు వచ్చాయంటే..? ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్ హైమర్) ఉత్తమ సహాయ నటి: డేవైన్ జో రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్) బెస్ట్ హెయిర్ స్టయిల్ అండ్ మేకప్: నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ (పూర్ థింగ్స్) బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: కార్డ్ జెఫర్‌పన్ (అమెరికన్ ఫిక్షన్) బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జస్టిన్ ట్రైట్, అర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్) బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ది బాయ్ అండ్ ది హిరాన్ ఉత్తమ కాస్టూమ్ డిజైన్: హోలి వెడ్డింగ్టన్ (పూర్ థింగ్స్) బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: జేమ్స్ ప్రైస్, షోనా హెత్ (పూర్ థింగ్స్) ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిల్మ్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉత్తమ సినిమాటోగ్రాఫర్: హెయటే వన్ హోయటేమా (ఓపెన్ హైమర్) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: గాడ్జిల్లా మైనస్ వన్ (తకాషి యమజాకీ, క్యోకో షిబుయా, మకాషి తకషాకీ, తత్సుజీ నోజిమా) ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: ఓపెన్ హైమర్ (జెన్నీఫర్ లేమ్) ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ద లాస్ట్ రిపేర్ షాప్ (బెన్ ఫ్రౌడ్‌ఫుట్, క్రిస్ బ్రోవర్స్) ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: 20 డేస్ ఇన్ మరియూపోల్ ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఓపెన్ హైమర్ (హోయటే, హోయటేమ) ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ద వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్ ఉత్తమ సౌండ్: ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (టార్న్ విల్లర్స్, జానీ బర్న్) ఉత్తమ ఒరిజనల్ స్కోర్: ఓపెన్ హైమర్ (లడ్విగ్ ఘోరన్న్) ఉత్తమ ఒరిజినల్ సాంగ్: వాట్ వజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ మూవీ) ఉత్తమ నటుడు: కిలియన్ మర్ఫీ (ఓపెన్ హైమర్) ఉత్తమ దర్శకుడు: క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్ హైమర్) ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్) ఉత్తమ చిత్రం: ఓపెన్ హైమర్ -
స్టార్ సింగర్ ఆత్మహత్య.. ఆ బాధ తట్టుకోలేక!
ప్రముఖ సింగర్, నటి కోకో లీ(48) మరణించింది. పాప్ సింగర్ అయిన ఈమె.. ఆస్కార్ వేదికపై ప్రదర్శన ఇచ్చిన చైనీస్ అమెరికన్ గా గుర్తింపు తెచ్చుకుంది. హాంకాంగ్ లో పుట్టిన ఈమె.. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి, అక్కడే చదువుకుంది. అనంతరం సొంత దేశానికి తిరిగొచ్చేసి సింగర్ గా కెరీర్ మొదలుపెట్టింది. ఎంతో క్రేజ్ దక్కించుకుంది. అలాంటి ఆమె ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం అభిమానులని కంటతడి పెట్టిస్తోంది. దాదాపు 30 ఏళ్ల పాటు పాప్ సింగర్ కెరీర్ ని కొనసాగిస్తూ వచ్చిన కోకో లీ.. గత కొన్నాళ్ల నుంచి డిప్రెషన్ తో బాధపడుతోంది. ఈ క్రమంలోనే జూలై 2న ఆత్మహత్య ప్రయత్నం చేసింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా, ఆమె కోమాలోకి వెళ్లినట్లు తేలింది. అలా ఆమెని బతికించేందుకు డాక్టర్స్ చాలా కష్టపడ్డారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో కోకో లీ బుధవారం కన్నుమూసింది. ఈ విషయాన్ని ఆమె చెల్లెళ్లు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. (ఇదీ చదవండి: కాలు విరగ్గొట్టుకున్న నవదీప్.. ఆ నటి మాత్రం!) 2001లో కోకో లీ పాడిన.. 'ఏ లవ్ బిఫోర్ టైమ్' సాంగ్ ఉత్తమ ఒరిజినల్ కేటగిరీలో ఆస్కార్ కు నామినేట్ అయింది. ఈ క్రమంలోనే అవార్డుల ప్రదానోత్సవంలో ఈమె స్టేజీ షో ఇచ్చింది. ఈ ఘనత సాధించిన తొలి చైనీస్ అమెరికన్ గా రికార్డు సృష్టించింది. అంతకు ముందు 1996లో సోనీ మ్యూజిక్ తో ఒప్పందం చేసుకున్న మొదటి చైనీస్ గాయనిగానూ నిలిచింది. డిస్నీ 'ములాన్' సినిమాలోని హీరోయిన్ ఫా ములాన్ కు వాయిస్ ఇచ్చింది కూడా ఈమెనే కావడం విశేషం. 90వ దశకంలో పాప్ సింగర్ గా చాలా పేరు తెచ్చుకున్న కోకో లీ.. హాంకాంగ్, మలేసియా, తైవాన్, సింగపూర్, ఆస్ట్రేలియాలో చాలామంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ప్రేమ, విశ్వాసం అని తన చేతుల మీద టాటూలు వేయించుకున్న ఫొటోలని తన ఇన్ స్టాలో చివరగా లీ షేర్ చేసింది. 'మీరు ఒంటరిగా లేరు, నేను మీతో ఉంటాను' అని ఫ్యాన్స్ ని ఉద్దేశించి చివరగా పోస్ట్ పెట్టింది. ఇప్పుడది అది చూసి అందరూ ఎమోషనల్ అవుతున్నారు. I am shocked to learn that #CocoLee passed. Horrible news. What a huge blow to our #Mulan family. 😢💔 She was a vivacious, beautiful and talented artist. My condolences to her family, friends & fans. RIP🙏🏼💔 pic.twitter.com/lf3Bk6a2ml — Ming-Na Wen (@MingNa) July 6, 2023 (ఇదీ చదవండి: 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత ఎవరో తెలుసా?) -
అత్యధిక సంఖ్యలో ఆస్కార్లు గెలుచుకున్న టాప్ 10 నటులు
-
ఆర్ఆర్ఆర్ టీంకు ఎంట్రీ ఉచితం కాదట.. రాజమౌళి ఎంత చెల్లించారంటే!
లాస్ ఎంజిల్స్‌లో జరిగిన 95 ఆస్కార్ వేడుకల్లో టాలీవుడ్ కీర్తిని రెపరెపలాడించిన ఘనత దర్శకధీరుడు రాజమౌళిదే. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. అయితే ఈ వేడుకల్లో రాజమౌళితో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా హాజరయ్యారు. కానీ ఈవెంట్లో పాల్గొనేందుకు ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి ఉచితంగా ఎంట్రీ ఇవ్వలేదని సమాచారం. కేవలం సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్‌తో పాటు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఉచితంగా ప్రవేశం కల్పించినట్లు తెలుస్తోంది. రాజమౌళితో సహా మిగిలిన చిత్రబృంద సభ్యులు కూడా ఈవెంట్లో పాల్గొనేందుకు టికెట్ కొనుగోలు చేయాల్సిందే. ఈ వేడుకల్లో రాజమౌళితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అలాగే ఈ సినిమా హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, ఉపాసన, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ కూడా పాల్గొన్నారు. అయితే ప్రతిష్ఠాత్మకమైన ఈవెంట్లో పాల్గొనేందుకు చిత్రబృందానికి అన్ని టికెట్లను రాజమౌళి కొనుగోలు చేశారు. తాజా నివేదికల ప్రకారం రాజమౌళి ఒక టిక్కెట్ కోసం సుమారు $25 వేల డాలర్లను వెచ్చించారు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.20.6 లక్షలు. అయితే ఈవెంట్లో ఎస్ఎస్ రాజమౌళితో సహా చిత్రబృందాన్ని వెనుక వరుసలో కూర్చోబెట్టినందుకు అకాడమీ విమర్శలపాలైంది. అకాడమీ నిర్వాహకుల తీరు పట్ల నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్కార్ అవార్డ్ గెలిచిన తర్వాత చిత్రబృందం మార్చి 17న హైదరాబాద్‌కు రాగా ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది. కాగా.. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్, పోలీసు అధికారి పాత్రలో రామ్ చరణ్ పాత్రలలో నటించారు. ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగన్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, ఒలివియా మోరిస్, శ్రియా శరణ్ కూడా కీలక పాత్రలు పోషించారు. -
మరో ఆస్కార్‌పై రాజమౌళి గురి.. హాలీవుడ్ రేంజ్లో భారీ స్కెచ్!
ఆర్ఆర్ఆర్ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి రేంజ్ పెరిగిపోయింది. హాలీవుడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. ఇప్పటికే రాజమౌళితో సినిమా తీసేందుకు హాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ సిద్దంగా ఉన్నాడు. హాలీవుడ్ లో సినిమా తీసే ఆలోచన ఉంటే తనని అప్రోచ్ కావాలంటూ రిక్వెస్ట్ కూడా చేశాడు. ఇక ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ వచ్చిన తర్వాత హాలీవుడ్ నిర్మాతలే కాదు...హాలీవుడ్ యాక్టర్స్ రాజమౌళి తో వర్క్ చేసేందుకు రెడీ గా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తన నెక్ట్స్ మూవీ కి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఎప్పుడో కమిట్ అయ్యాడు. అంతే కాదు ఈ సినిమా జోనర్ కూడా ఫిక్స్ అయిపోయింది. టోరెంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ మీడియా ఇంటరాక్షన్ లో జక్కన్న మాట్లాడుతూ.. మహేశ్ తో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ చేయనున్నట్లు తెలిపారు. హాలీవుడ్ లో రేంజ్ లో తెరకెక్కించబోయే ఈ సినిమా కోసం రైటర్ విజయేంద్రప్రసాద్ టీమ్ ఈ మూవీ స్క్రిప్ట్ మీదే వర్క్ చేస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిన ఈ మూవీ ఓపెనింగ్ ఆగస్టులో ఉంటుందట. అప్పటికి మహేశ్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న #ssmb 28మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇక రాజమౌళి-మహేష్ బాబు మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది జూన్ తర్వాత ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉందట. అలాగే ఈసినిమాలో హీరోయిన్ గా ఆస్కార్ వేదిక పై నాటు నాటు పాటని పరిచయం చేసిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ఫైనల్ చేసే ఛాన్స్ ఉందనే మాట బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి టెక్నీషియన్స్...యాక్టర్ కోసం రాజమౌళి హాలీవుడ్ లీడింగ్ క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ వచ్చిన తర్వాత మహేశ్ సినిమా విషయంలో రాజమౌళి ఆలోచన మారిపోయింది. పాన్ వరల్డ్ మూవీగా కాకుండా...హాలీవుడ్ మూవీ గా తెరకెక్కించాలనుకుంటున్నాడు. ఇప్పటికే యాక్షన్ సీక్వెన్స్ కోసం ఓ హాలీవుడ్ టీమ్ తో మాట్లాడిన రాజమౌళి...సిజి వర్క్ కోసం కూడా అక్కడి టీమ్ తోనే డిస్కషన్స్ చేస్తున్నాడట. మహేశ్‌తో తెరకెక్కించే సినిమా కూడా ఆస్కార్ బరిలో దించేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాడు. ముందుగానే ఈ సినిమా బడ్జెట్ లోనే ఆస్కార్ ప్రమోషన్స్ బడ్జెట్ కూడా కలిపేశాడట. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు పక్కన మరో హీరోయిన్ గా హాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ ను తీసుకుంటారనే మాట రాజమౌళి టీమ్ నుంచి వినిపిస్తోంది. ఆస్కార్ దక్కించుకున్నఆర్ఆర్ఆర్ లో కూడా హాలీవుడ్ యాక్టర్ ఒలీవియా మోరిస్ ఓ హీరోయిన్ గా నటించింది. హాలీవుడ్ బ్యూటీ తమ అభిమాన హీరోకి జోడిగా నటిస్తుందని తెలియటంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. -
ఆ క్షణాలను ఎప్పటికీ మరచిపోను
శంషాబాద్: ‘స్టేజీపై కీరవాణి, చంద్రబోస్ నిల్చుని ఆస్కార్ అందుకున్న క్షణాలను ఎన్నటికీ మరచిపోను.. అదే నా బెస్ట్ మూమెంట్’ అని సినీనటుడు జూ.ఎన్టీఆర్ అన్నారు. అమెరికా లాస్ఎంజిల్స్లో జరిగిన ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న ఎన్టీఆర్ బుధవారం తెల్లవారు జామున హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయలో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకున్న అనుభవనం అనిర్వచనీయమైందన్నారు. అందులో భాగస్వామిగా ఉన్నందుకు గర్వపడుతున్నానన్నారు. తెలుగువాడిగా.. భారతీయుడిగా గర్విస్తున్నట్లు పేర్కొన్నారు. ఆస్కార్ ఎంతో బరువుగా ఉందని, మన దేశం ఎంత బరువుగా ఉంటుందో అంతలా ఉందన్నారు. అనంతరం ఆయన ఓపెన్ టాప్ కారులో అభిమానులకు అభివాదం చేస్తూ బయలుదేరారు. -
60 ఏళ్ల వయసులో ఉత్తమ నటిగా ఆస్కార్.. సరికొత్త చరిత్రకు శ్రీకారం
'కలలు కనండి. నిజం అవుతాయనడానికి నేను ఈ అవార్డును ఓ ప్రూఫ్‌గా చూపిస్తున్నాను. మహిళలకు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా మీ ప్రైమ్ టైమ్‌ను మీరు దాటిపోయారు అంటే నమ్మొద్దు. ఈ అవార్డుని నేను మా అమ్మకు... ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ అంకితం ఇస్తున్నాను. ఎందుకంటే వారే నిజమైన సూపర్‌హీరోస్. వీరే లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఎవరూ ఉండి ఉండేవారు కాదు.మా అమ్మగారికి 84 ఏళ్లు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఇప్పుడు మలేసియాలో ఆమె ఈ వేడుకను చూస్తున్నారు. నేను ఈ అవార్డును ఇంటికి తీసుకువస్తున్నాను (కుటుంబ సభ్యులను ఉద్దేశించి). అలాగే నా కెరీర్ హాంకాంగ్‌లో స్టార్ట్ అయ్యింది. అక్కడ నాకు హెల్ప్‌గా ఉన్నవారికి ధన్యవాదాలు. అలాగే నెవర్ గివప్. డానియల్ డ్యూయో, ఏ 24 షూటింగ్ స్టూడియో, ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్..’ నటీనటుల సహాయం లేకపోతే నేను ఇప్పుడు ఇక్కడ ఈ వేదికపై ఉండేదాన్ని కాదు'. – ఉత్తమ నటి, మిషెల్ యో(కాగా, ఈ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న మిషెల్‌యో ఆస్కార్ అందుకున్న తొలి ఆసియా మహిళగా నిలిచారు. అంతేకాదు ఇప్పుడామె వయస్సు 60ఏళ్లు. ) నాకు అవార్డు ఇచ్చిన ఆస్కార్ కమిటీకి, ఇలాంటి ఓ బోల్డ్ ఫిల్మ్‌లో నటించే అవకాశం కల్పించినవారికి ప్రత్యేక ధన్యవాదాలు. ‘ది వేల్’ సినిమాలో భాగమైన వారిని గుర్తు చేసుకోకుండా ఉండలేను. బెస్ట్ యాక్టర్‌గా నాకు అవార్డు రావడాన్ని చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. నటుడిగా నేను 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. కొన్ని సందర్భాల్లో నాకు గుర్తింపు వస్తుందా? అని ఆలోచించాను. అలా ఆలోచించినప్పుడు చాలా కష్టంగా అనిపించింది. కేవలం తిమింగలాలు మాత్రమే లోలోతుల్లో ఈదగలవు. సినిమా ఇండస్ట్రీలో నేనూ అంతే. నాకు హెల్ప్‌గా ఉన్న నా కుటుంబ సభ్యలకు ధన్యవాదాలు. – ఉత్తమ నటుడు బ్రెండెన్ ఫ్రాజెర్ (చెమర్చిన కళ్లతో...) ఈయన కూడా 54 ఏళ్ల వయసులో ఉత్తమ నటుడిగా ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్నారు.) Michelle Yeoh accepts her #Oscar for Best Actress: "For all the little boys and girls who look like me watching tonight, this is a beacon of hope and possibilities. This is proof that dreams do come true." https://t.co/ndiKiHfmID pic.twitter.com/pQN8nHDhCx — Variety (@Variety) March 13, 2023 -
Oscars 2023: ప్చ్.. ఆస్కార్ మిస్ చేసుకున్న భారతీయ చిత్రం ఇదే!
లాస్ ఏంజెల్స్: ఈ ఏడాది ఆస్కార్ బరిలో నిలిచిన భారత డాక్యుమెంటరీ చిత్రానికి నిరాశ ఎదురైంది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం కేటగిరిలో నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రీత్స్’ (All That Breathes) అస్కార్‌ను దక్కించుకోలేకపోయింది. ఈ విభాగంలో అమెరికాకి చెందిన ‘నావాల్నీ’ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలింను అవార్డ్ వరించింది. ఆల్ దట్ బ్రీత్స్ని షానక్ సేన్ దర్శకత్వం వహించారు. ఈ కేటగిరిలో ఇతర నామినీల విషయానికొస్తే.. ఆల్ ది బ్యూటీ అండ్ ది బ్లడ్‌షెడ్, ఫైర్ ఆఫ్ లవ్, ఎ హౌస్ మేడ్ ఆఫ్ స్ప్లింటర్స్ చిత్రాలు ఉన్నాయి. ‘ఆల్ దట్ బ్రీత్’స్ ఈ విభాగంలో నామినేట్ చేసిన రెండవ భారతీయ చిత్రం. గత సంవత్సరం రింటు థామస్, సుష్మిత్ ఘోష్ రాసిన రైటింగ్ విత్ ఫైర్, ఆస్కార్స్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్‌గా ఎంపికైంది. ఆల్ దట్ బ్రీత్స్.. ఢిల్లీలో బర్డ్ క్లినిక్ నడుపుతున్న సౌద్, నదీమ్ అనే ఇద్దరు సోదరుల కథ ఇది. ఈ డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్ సర్క్యూట్లో సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు అనేక అవార్డులను గెలుచుకుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు. -
ఆస్కార్ వేదికపై నల్ల గౌనులో మెరిసిన దీపిక.. ట్విస్ట్ ఏంటంటే..?
వాషింగ్టన్: బాలీవుడ్ స్టార్ దిపికా పదుకొణె ఆస్కార్ వేదికపై సందడి చేశారు. 95వ అకాడెమీ అవార్డుల ప్రధానోత్సవానికి తొలిసారి ప్రెజెంటర్‌గా వెళ్లిన ఆమె రెడ్‌కార్పెట్‌పై నల్ల గౌనులో మెరిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా.. సామాజిక మాధ్యమాల్లో అవి వైరల్‌గా మారాయి. నల్ల రంగు గౌను, వెల్వెట్ గ్లౌస్, డైమండ్ నెక్లెస్‌తో హాలీవుడ్ గ్లామర్ భామలను తలదన్నేలా దీపిక తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. అయితే దిపికా పదుకొణెకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉన్నా.. హాలీవుడ్ మీడియా సంస్థ ఏఎఫ్‌పీతో పాటు గెట్టీ, వోగ్ మెగజీన్ను ఆమెను గుర్తుపట్టలేకపోయాయి. దిపికాను బ్రెజిల్ మోడల్, డిజైనర్ క్యామిలా అనుకొని పొరపడ్డాయి. దీపికా గతంలో కేన్స్ జ్యూరీ, ఫిఫా వరల్డ్ కప్ వేడుకల్లో కూడా సందడి చేశారు. అయినా ఆమెకు, క్యామిలాకు మధ్య వ్యత్యాసాన్ని హాలీవుడ్ సంస్థలు పసిగట్టలేకపోయాయి. View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) View this post on Instagram A post shared by Camila Alves McConaughey (@camilamcconaughey) -
Oscars 2023: మొదలైన ఆస్కార్ సందడి.. ఈ చిత్రానికే తొలి అవార్డ్!
లాస్ ఏంజెల్స్: ఆస్కార్ 2023 వేడుక అమెరికా లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో అట్టహాసంగా ప్రారంభమైంది. సంబరంగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులతో పాటు ఈ ఏడాది నామినేషన్లలో ఉన్న సినిమాల నటీనటులు, సాంకేతిక సిబ్బంది హాజరయ్యారు. విభాగాల వారీగా అవార్డ్లకు ప్రధానోత్సవం జరుగుతోంది. ఇక భారత్ నుంచి ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ ‘నాటునాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. సినీ ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా ఆస్కార్ (అకాడమీ అవార్డ్స్) భావిస్తారు. అందుకే తారలు తమ జీవితంలో ఒక్క సారైన ఈ అవార్డ్‌ను ముద్దాడాలని కోరుతుంటారు. 2023 గాను మొదటి ఆస్కార్ ఉత్తమ యానిమేటెడ్ సినిమా కేటగిరి దక్కించుకుంది. ఉత్తమ యానిమేటెడ్ సినిమాగా గిల్లెర్మో డెల్ టోరో నిర్మించిన 'పినోచియో' చిత్రం నిలిచింది. ఈ ఏడాది మొదటి ఆస్కార్‌ను కైవసం చేసుకున్న రికార్డు సొంతం చేసుకుంది. ఇందులో మరో విషయం ఏంటంటే.. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్‌ను గెలుచుకుని గిల్లెర్మో డెల్ టోరో ఆస్కార్ చరిత్రలో మొదటి వ్యక్తిగా నిలిచారు. చదవండి: Natu Natu Song: ‘నాటు నాటు’కు ఆస్కార్ వస్తుందా? రాదా? కోట్లలో బెట్టింగ్ -
Oscars 2023: ఆస్కారం ఎవరికి ఎక్కువ!.. లైవ్ ఎన్ని గంటలకు?
ఆస్కార్ సంబరానికి సమయం ఆసన్నమైంది. ఈ నెల12న (భారతీయ కాలమానం ప్రకారం 13వ తేదీ) లాస్ ఏంజిల్స్‌లో 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. 23 విభాగాల్లో విజేతలను ప్రకటిస్తారు. ఆస్కార్ రేస్‌లో ఉన్న చిత్రాల్లో ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రం అత్యధికంగా 11 నామినేషన్స్‌ను దక్కించుకుంది. ఆ తర్వాత ‘ది బన్షీష్ ఆఫ్ ఇనిషెరిన్’, ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ చిత్రాలు తొమ్మిది నామినేషన్స్‌తో పోటీలో ఉన్నాయి. కాగా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి వంటి విభాగాలతోపాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌కు నామినేట్ అయిన ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’పాట గురించి కూడా హాలీవుడ్లో జోరుగా చర్చ జరుగుతోంది. అవార్డు దక్కే ఆస్కారం ఎక్కువగా ఎవరికి ఉంది? అంటూ హాలీవుడ్ చేస్తున్న విశ్లేషణలోకి వెళదాం. ఉత్తమ చిత్రం బెస్ట్ మూవీ విభాగంలో ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’, ‘ది బన్షీష్ ఆఫ్ ఇనిషెరిన్’, ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’, ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’, ‘టాప్‌గన్: మ్యావరిక్’, ‘ఎల్విస్’, ‘ది ఫేబుల్‌మ్యాన్స్’, ‘టార్’, ‘ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్’, ‘ఉమెన్ టాకింగ్’ ఇలా మొత్తం పది చిత్రాలు బరిలో ఉన్నాయి. కాగా ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రానికే అవార్డు దక్కే ఆస్కారం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. 28వ క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్, 29వ యాన్యువల్ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డ్స్, 38వ ఫిల్మ్ ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్స్ ప్రదానోత్సవాల్లో ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ ఉత్తమ చిత్రం విభాగంలో విజేతగా నిలిచింది. అలాగే ఇతర విభాగాల్లో 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, 76వ బాఫ్తా అవార్డ్స్‌లో ఈ చిత్రం అవార్డులను సాధించి, ఆస్కార్ కమిటీ దృష్టిని ఆకర్షించింది. చైనా నుంచి అమెరికాకు వలస వచ్చి, లాండ్రీ షాపు పెట్టుకున్న ఓ కుటుంబం అనుకోని ప్రమాదాల నుంచి ఎలా బయటపడింది? అన్నదే ఈ చిత్రకథ. డేనియల్ క్వాన్, డేనియల్ స్కీనెర్డ్ దర్శకత్వంలో ఆంథోనీ రుస్సో, జో రుస్సో, మైక్లరోకా, జోనాథన్ వాంగ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మిచెల్ యోహ్, స్టెఫానీ హ్సు, కే హుయ్ క్వాన్ ముఖ్య తారలు. ఉత్తమ దర్శకుడు ఉత్తమ దర్శకుడి విభాగంలో మార్టిన్ మెక్‌డొనాగ్ (ది బన్షీష్ ఆఫ్ ఇనిషెరిన్) డానియల్ క్వాన్, డానియెల్ స్కీనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్), స్టీవెన్ స్పీల్బర్గ్ (ది ఫేబుల్‌మ్యాన్స్), రూబెన్ ఆస్టాండ్ (ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్) టడ్ ఫీల్డ్ (టార్) పోటీ పడుతున్నారు. కాగా డానియల్ క్వాన్, డానియేల్ స్కీనెర్ట్‌లు ఉత్తమ దర్శకులుగా అవార్డు తీసుకెళ్తారని టాక్. 28వ క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్‌లో క్వాన్, స్కీనెర్ట్ అవార్డు సాధించారు. ఉత్తమ నటుడు ఉత్తమ నటుడి విభాగంలోని అవార్డు కోసం ఆస్టిన్ బట్లర్ (ఎల్విస్), కొలిన్ ఫార్రెల్ (ది బన్షీష్ ఆఫ్ ఇని షెరిన్), బ్రెండన్ ఫ్రాసెర్ (ది వేల్), బిల్ నిగీ (లివింగ్),పాల్ మెస్కల్ (ఆఫ్టర్సన్) పోటీ పడుతున్నారు. అయితే ఎక్కువ పోటీ మాత్రం ‘ఎల్విస్’ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన ఆస్టిన్ బట్లర్, ‘ది వేల్’ చిత్రంతో ప్రేక్షకులను కట్టిపడేసిన బ్రెండెన్ ఫ్రాసెర్ల మధ్య కనిపిస్తోంది. ఇక ఇటీవల జరిగిన క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్టర్‌గా బ్రెండన్ ఫ్రాసెర్ అవార్డును కొల్లగొట్టగా, 80వ గోల్డెన్ గ్లోబ్, 76వ బాఫ్తా అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా ఆస్టిన్ బట్లర్ నిలిచారు. దీన్ని బట్టి ఆస్టిన్ బట్లర్‌కే ఉత్తమ నటుడి అవార్డు దక్కే అవకాశం కనిపిస్తోంది. అమెరికన్ రాక్ అండ్ రోల్ మ్యూజిక్ సింగర్, యాక్టర్ ఎల్విస్ ప్రెస్లీ జీవితం ఆధారంగా రూ΄÷ందిన ‘ఎల్విస్’లో టైటిల్ రోల్లో తన నటనతో వావ్ అనిపించారు ఆస్టిన్ బట్లర్. ఈ చిత్రానికి బాజ్ లుహార్మాన్ దర్శకుడు. ఉత్తమ నటి ఉత్తమ నటి విభాగంలో అవార్డు కోసం పోటీలో ఉన్న ‘అన్నా దె అర్మాస్’ (బ్లాండ్), ‘ఆండ్రియా రైజ్‌బరో’ (టు లెస్లీ), ‘మిషెల్ యో’ (ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్), ‘మిషెల్ విలియమ్స్’ (ది ఫేబుల్‌మ్యాన్స్) లను దాటుకుని ‘కేట్ బ్లాంచెట్’ (టార్) విజేతగా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, బాఫ్తా అవార్డ్స్ ప్రదానోత్సవాల్లో ఉత్తమ నటిగా ‘కేట్ బ్లాంచెట్’ అవార్డులు అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోగల ప్రతిభ ఉన్న ఓ మహిళా సంగీత విద్యాంసురాలు జీవితంలో ఎదుగుతున్న సమయంలో ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఎలాంటి లైంగిక వేధింపులను ఎదుర్కోవలసి వచ్చింది? వాటిని ఆమె ఎలా అధిగమించారు? అన్నదే ‘టార్’ సినిమా కథాంశం. మహిళా విద్వాంసురాలిగా కేట్ బ్లాంచెట్ అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు టాడ్ ఫీల్డ్ దర్శకుడు. ఆస్కార్‌లో భారత్ ఈ ఏడాది దేశం నుంచి మూడు విభాగాల్లో (బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్) నామినేషన్స్ దక్కాయి. ఈ మూడు విభాగాల్లోనూ అవార్డులు రావాలని భారతీయ సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. ఇక బరిలో ఉన్న ఈ మూడు విభాగాల విశేషాల్లోకి వస్తే... నాటు నాటు..కే అవార్డు? ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఐదుపాటలు బరిలో ఉన్నాయి. వీటిలో ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు..’పాటకు అవార్డు వస్తుందని హాలీవుడ్ మీడియా జోస్యం చెబుతోంది. ఇప్పటికే 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో, 28వ క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ సాంగ్’గా ‘నాటు నాటు..’ నిలిచింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ తదితర అవార్డ్స్‌లోనూ అవార్డులు గెల్చుకుంది. కీరవాణి స్వరపరచిన ఈపాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవపాడిన సంగతి తెలిసిందే. ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ‘నాటు నాటు’తోపాటు ‘టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్’లోని ‘అప్లాజ్’, ‘బ్లాక్΄పాంథర్: వకాండ ఫరెవర్’లోని ‘లిఫ్ట్ మీ అప్’, ‘ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’లోని ‘దిస్ ఈజ్ ఏ లైఫ్’, ‘టాప్‌గన్: మ్యావరిక్’ చిత్రం నుంచి ‘హోల్డ్ మై హ్యాండ్’పాటలు నామినేషన్స్ దక్కించుకున్నాయి. ఒకవేళ ‘నాటు నాటు..’పాటకు అవార్డ్ వస్తే భారతీయులకు పండగే పండగ. గాయపడ్డ పక్షుల కోసం... బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో శౌనక్ సేన్ దర్శకత్వం వహించిన ఇండియన్ డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ నామినేషన్ దక్కించుకుంది. గాయపడిన పక్షుల సంరక్షణ కోసం ఢిల్లీకి చెందిన సోదరులు నదీమ్ షెహజాద్, మహమ్మద్ సౌద్ తమ జీవితాలను ఏ విధంగా త్యాగం చేశారు? అన్నదే ఈ డాక్యుమెంటరీ ప్రధాన కథాంశం. గత ఏడాది 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఆల్ దట్ బ్రీత్స్’ గోల్డెన్ ఐ అవార్డును సాధించింది. ఇక ఇదే విభాగంలో అమెరికన్ ‘ఫైర్ ఆఫ్ లవ్’, రష్యా ‘నవల్నీ’, ‘ఎ హౌస్ మేడ్ ఆఫ్ స్పింట్లర్స్’, ‘ఆల్ ది బ్యూటీ అండ్ ది బ్లడ్ షెడ్’ పోటీలో ఉన్నాయి. తప్పిపోయిన ఏనుగు తప్పిపోయిన ఓ ఏనుగును గిరిజన దంపతులు ఏ విధంగా పెంచి పోషించారు? ఈ క్రమంలో వారికి ఆ ఏనుగుతో ఎలాంటి అనుబంధం ఏర్పడింది? అనే అంశాల నేపథ్యంలో భారతీయ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ రూ΄÷ందించిన డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో నామినేషన్ దక్కించుకున్న ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’తోపాటు ‘హాలౌట్’, ‘హౌ డు యు మెసర్ ఎ ఇయర్’, ‘ది మార్తా మిచెల్ ఎఫెక్ట్’, ‘స్ట్రేంజర్ ఎట్ ది గేట్’ పోటీలో ఉన్నాయి. లైవ్‌లో నాటు.. నాటు ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు..’పాటను కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్పాడనున్నారు. ఈపాటకు తాను కూడా లైవ్‌లో పెర్ఫార్మ్ చేయనున్నట్లు ఆమెరికన్ యాక్ట్రస్, డ్యాన్సర్ లారెన్ గాట్లీబ్ వెల్లడించారు. కాగా హిందీలో ‘ఏబీసీడీ’, ‘ఏబీసీడీ 2’ వంటి చిత్రాల్లో నటించారామె. ప్రీ ఆస్కార్పార్టీ అమె రికాలో ప్రీ ఆస్కార్పార్టీ అదిరిపోయే లెవల్లో జరిగింది. ఈపార్టీలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతోపాటు ప్రియాంకా చో్ర΄ా, ప్రీతి జింతా తదితర ప్రముఖులుపాల్గొన్నారు. లైవ్ ఎన్ని గంటలకు అంటే... సోమవారం ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి భారతీయులు ఆస్కార్ అవార్డు వేడుకను వీక్షించవచ్చు. అవార్డు వేడుక లాస్ ఏంజిల్స్‌లో ఆదివారం రాత్రి 8 గంటలకు ఆరంభమయ్యే రెండు గంటల ముందు రెడ్ కార్పెట్ సందడి షురూ అవుతుంది. వేడుక దాదాపు 11 గంటలకు ముగిసే అవకాశం ఉంది. భారతీయ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి వేడుకను వీక్షించవచ్చు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఏబీసీ నెట్వర్క్ (ఏబీసీ టీవీ, ఏబీసీ.కామ్, ఏబీసీ యాప్, యూట్యూబ్) హులు లైవ్ టీవీ, డైరెక్ట్ టీవీ, ఫ్యూబో టీవీ, ఏటీ అండ్ టీ టీవీలో ఆస్కార్ అవార్డుల వేడుకను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు. అయితే కొన్నింటికి సబ్స్క్రిప్షన్ అవసరమవుతుంది. -
Mur Ghurar Duronto Goti: అవును.. గుర్రం ఎగిరింది.. కలా? నిజమా!
‘అవును... గుర్రం ఎగరావచ్చు’ అంటారు. ఈ గుర్రం మాత్రం ఎగరడమే కాదు... యంగ్ డైరెక్టర్ మహర్షి కశ్యప్‌ను కూర్చోబెట్టుకొని బెంగళూరు నుంచి జైపుర్ వరకు తిప్పింది. రేపు ఆస్కార్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా తీసుకువెళ్లవచ్చు... ఆస్కార్ 2023 బరిలో ‘షార్ట్ ఫిల్మ్ ఫిక్షన్’ విభాగంలో మన దేశం నుంచి అస్సామీ షార్ట్ ఫిల్మ్ మర్ గౌరర్ డురొంటో గోటి (ది హార్స్ ఫ్రమ్ హెవెన్) ఎంపికైంది. 27 సంవత్సరాల మహర్షి తుహిన్ కశ్యప్ దీని దర్శకుడు. కథ విషయానికి వస్తే... ఒక పెద్దాయన ఎప్పుడూ పగటి కల కంటూ ఉంటాడు. నగరంలో జరిగే గుర్రపు పందేలలో తన గుర్రం కూడా ఉండాలి. ఆ గుర్రం ఎలాంటిదంటే, మెరుపు వేగంతో పరుగులు తీస్తుంది. ఎప్పుడు గుర్రపు పందేలు జరిగినా తానే విజేత. ‘మీ గుర్రానికి ఎంత బాగా శిక్షణ ఇచ్చారు’ అంటూ అందరూ తనను వేనోళ్లా పొగుడుతుంటారు. ‘ఇంతకీ నా గుర్రం ఏదీ?’ అని వెదుకుతాడు ఆ పెద్దాయన. కానీ ఆ గుర్రం ఊహాల్లో తప్ప వాస్తవప్రపంచంలో కనిపించదు. అక్కడ కనిపించేది తన గాడిద మాత్రమే! ‘కలా? నిజమా! అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఆస్కార్ గురించి వింటూ, చూస్తూ పెరిగాను. ఇప్పుడు నేను ఆస్కార్ బరిలో నిలవడం అనేది గర్వంగా ఉంది’ అంటున్నాడు మహర్షి. కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయిన మహర్షి స్టూడెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ చిత్రాన్ని తీశాడు. సర్రియలిజం, డార్క్ హ్యూమర్లతో కూడిన ఈ కథను చెప్పడానికి సంప్రదాయ కళ ‘ఒజపాలి’ని సమర్థవంతంగా వాడుకున్నాడు దర్శకుడు. ఆరువందల సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న అస్సామీ కళారూపం ‘ఒజపాలి’లో కళాకారులు ఆడుతూ, పాడుతూ, నవ్విస్తూ పురాణాలలో నుంచి కథలు చెబుతుంటారు. ‘ది హార్స్ ఫ్రమ్ హెవెన్’ను ఎక్కువ భాగం క్యాంపస్‌లో చిత్రీకరించారు. కొంత భాగం కోల్‌కతా శివారులలో చిత్రీకరించారు. ఈ చిత్రం కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్, జైపుర్ ఫిల్మ్‌ఫెస్టివల్, ది హిమాలయన్ ఫిల్మ్ ఫెస్టివల్, డీప్ ఫోకస్ స్టూడెంట్ ఫిల్మ్‌ఫెస్టివల్...మొదలైన ఎన్నో చిత్రోత్సవాలకు ఎంపికైంది. తాజాగా బెంగళూరు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్(బీఐఎస్ఎఫ్ఎఫ్)లో ‘బెస్ట్ ఫిల్మ్’ అవార్డ్ అందుకొని ఆస్కార్ బరిలోకి దిగబోతుంది. ఫీచర్ ఫిల్మ్స్‌లా కాకుండా ఒక షార్ట్‌ఫిల్మ్‌ను ఆస్కార్‌కు పంపాలంటే అది ఆస్కార్ – క్వాలిఫైయింగ్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డ్ గెలుచుకోవాలి. మన దేశంలో అలాంటి ఏకైక ఫిల్మ్ ఫెస్టివల్ బీఐఎస్ఎఫ్ఎఫ్. ‘చిత్ర రూపకల్పన అనేది ఎంత క్లిషమైన విషయమో అందులో దిగాక కాని తెలియదు. ప్రతిరోజూ ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉన్నాను. స్వర్గం నుంచి దిగి వచ్చిన గుర్రం మమ్మల్ని ఎన్నో నగరాలు తిప్పింది. భవిష్యత్‌లో ఎన్ని చోట్లకు తీసుకువెళుతుందో తెలియదు’ అంటున్నాడు మహర్షి. కల్లోల ప్రాంతంలో పుట్టి పెరిగిన మహర్షికి ఎనిమిదవ తరగతిలో డైరెక్టర్ కావాలనే కోరిక పుట్టింది. చాలామందిలో ఆతరువాత కాలంలో ఆ కోరిక ఆవిరైపోతుంది. కానీ మహర్షి విషయంలో మాత్రం అది ఇంకా బలపడింది. (క్లిక్: హీరో శింబుకు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత) సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో అడుగు పెట్టిన రోజు తన కలకు రెక్కలు దొరికినట్లుగా సంతోషపడ్డాడు. మహర్షిలో ఉన్న ప్రశంసనీయమైన ప్రత్యేకత ఏమిటంటే.. నేల విడిచి సాము చేయాలనుకోవడం లేదు. తన నేల మీద నడయాడిన కథలనే చిత్రాల్లోకి తీసుకురావాలకుంటున్నాడు. ఉత్తర, దక్షిణ భారతాలతో పోల్చితే వెండి తెర మీద కనిపించిన ఈశాన్య భారత ప్రాంత కథలు తక్కువ. ఇప్పుడు ఆ లోటు మహర్షి కశ్యప్ రూపంలో తీరబోతుంది. ఆస్కార్ ఎంట్రీ అనేది ఆరంభం మాత్రమే! (క్లిక్: 'ఆర్ఆర్ఆర్' సినిమాకు ఆస్కార్ ఎందుకు? హీరో నిఖిల్ కామెంట్స్ వైరల్) ప్రాంతీయ చిత్రాలు రకరకాల కష్టాలు ఎదుర్కొన్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతుంది. అస్సాం అనేది కొత్త కథలకు కేంద్రం కాబోతుంది. – మహర్షి -
Oscars Winners 2022: ఆస్కార్ విజేతలు వీళ్లే
Oscars 2022 Complete Winners List: ఆనందం, ఆగ్రహం, ఆవేదన... ఇవి వ్యక్తపరచడానికి మాటలే అక్కర్లేదు. సైగలు చాలు.. ఆ సైగలే మనసుకి హత్తుకుంటాయి. అలా ఆస్కార్ అవార్డ్ కమిటీని ‘మూగ మనసులు’ మెప్పించాయి. అందుకే ‘కోడా’ని ఉత్తమ చిత్రంగా ప్రకటించింది. ఈ సినిమాలో ఒక్క పాత్రధారి తప్ప మిగతా అన్ని పాత్రలనూ ‘డిఫరెంట్లీ ఏబుల్డ్’ యాక్టర్స్ చేయడం విశేషం. ఈసారి కూడా బెస్ట్ డైరెక్టర్ అవార్డును లేడీ డైరెక్టర్ అందుకోవడం మరో విశేషం. అలనాటి ‘క్యాబరే’ మూవీ ఫేమ్ లిజా మిన్నెలీ ఎంట్రీకి స్టాండింగ్ ఒవేషన్ దక్కడం ఇంకో విశేషం. ఇలా ఎన్నో ఆనందాల మధ్య చిన్న చేదు అనుభవంలా క్రిస్ రాక్ చెంపను విల్ స్మిత్ చెళ్లుమనిపించడం గమనార్హం. భారతీయ కాలమానం ప్రకారం సోమవారం (మార్చి 28) 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరిగింది. ఆ విశేషాలు తెలుసుకుందాం. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా (2020, 2021) పెద్దగా సందడి లేకుండా జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుక ఈసారి కోలాహలంగా జరిగింది. ఉత్తమ చిత్రంగా ‘కోడా’ అవార్డును గెలుచుకోగా, ఉత్తమ నటుడిగా ‘కింగ్ రిచర్డ్స్’ సినిమాకి విల్ స్మిత్ , ఉత్తమ దర్శకురాలిగా ‘ది పవర్ ఆఫ్ ది డాగ్’కి జెయిన్ కాంపియన్ ఆస్కార్‌ను అందుకున్నారు. నామినేట్ అయిన మూడు విభాగాల్లోనూ (బెస్ట్ పిక్చర్, బెస్ట్ అడాపె్టడ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సపోరి్టంగ్ యాక్టర్) ‘కోడా’ చిత్రం అవార్డులను దక్కించుకోవడం విశేషం. ఇక 12 ఆస్కార్ నామినేషన్స్‌ను దక్కించుకున్న ‘ది పవర్ ఆఫ్ ది డాగ్’ కేవలం ఒకే ఒక్క (బెస్ట్ డైరెక్టర్ కేటగిరీ) అవార్డుతో సరిపెట్టుకుంది. పది నామినేషన్లు దక్కించుకున్న ‘డ్యూన్’ చిత్రం ఆరు ఆస్కార్ అవార్డులను చేజిక్కించు కుంది. మరోవైపు బెస్ట్ ఫారిన్ ఫిల్మ్‌గా జపాన్ ఫిల్మ్ ‘డ్రైవ్ మై కార్’ నిలిచింది. కాగా ‘బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో మన దేశం నుంచి రింటూ థామస్ దర్శకత్వం వహించిన ‘రైటింగ్ విత్ ఫైర్’ నామినేషన్ దక్కించుకున్నా ఆస్కార్ తేలేక పోయింది. ఈ విభాగంలో ‘సమ్మర్ ఆఫ్ సోల్’ అవార్డు దక్కించుకుంది. అవార్డు వేడుక నిడివి తగ్గించే క్రమంలో ముందు ప్రకటించినట్లుగానే ఎనిమిది విభాగా (మానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్, ఫిల్మ్ ఎడిటింగ్, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్, మేకప్ అండ్ హెయిర్ స్టయిల్, ఒరిజినల్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్ అండ్ సౌండ్)లకు చెందిన అవార్డులను ముందే అందజేసి, లైవ్ టెలికాస్ట్‌లో చూపించారు. ఇక ఎప్పటిలానే ఎర్ర తివాచీపై అందాల భామలు క్యాట్ వాక్ చేసి ఆకట్టుకున్నారు. వీల్ చైర్లో స్టార్ డాన్సర్ ‘క్యాబరే’ మూవీ ఫేమ్ లిజా మిన్నెలీ ఉత్తమ చిత్రం అవార్డును నటి, గాయని లేడీ గాగాతో కలసి ప్రకటించారు. 50 ఏళ్ల క్రితం ‘క్యాబరే’ మూవీకి ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకున్నారు లిజా. ప్రస్తుతం వీల్ చైర్లో ఉన్న ఆమెను వేదిక మీదకు తీసుకొచ్చారు లేడీ గాగ. ‘‘క్యాబరే’ 50 ఏళ్ల వార్షికోత్సవం జరుపుకుంటోంది. లెజెండ్స్‌తో కలసి పని చేయడం నాకెంత ఇష్టమో మీకు తెలుసా?’’ అంటూ లిజా భుజం మీద గాగ చేయి వేయగా, ‘ఓ బేబీ..’ అన్నారు లిజా. ఇద్దరూ కలిసి ఉత్తమ చిత్రంగా ‘కోడా’ని ప్రకటించారు. వేడుక ప్రాంగణంలో ఉన్న అందరూ లిజాకు మర్యాదపూర్వకంగా నిలబడి చప్పట్లు కొట్టారు. కాగా ఒకప్పుడు తన నటనతో అలరించిన లిజా అనారోగ్య సమస్య వల్ల కొన్నేళ్లుగా వీల్ చెయిర్‌కే పరిమితమయ్యారు. ఈసారీ మహిళా దర్శకురాలే... ‘ది హార్ట్ లాకర్’ సినిమాకు గాను 2010లో దర్శకత్వ విభాగంలో తొలిసారి అవార్డు అందుకున్న డైరెక్టర్‌గా క్యాథరిన్ బిగెలో రికార్డ్‌లో ఉన్నారు. గత ఏడాది (2021) దర్శకత్వ విభాగంలో ‘నొమాడ్ ల్యాండ్’ చిత్రానికిగాను దర్శకురాలు క్లోవ్ జావో అవార్డును అందుకోగా ఈసారి కూడా ఈ విభాగంలో మహిళకే అవార్డు దక్కడం విశేషం. ఈ ఏడాది ఉత్తమ దర్శకురాలిగా జెయిన్ కాంపియన్ ‘ది పవర్ ఆఫ్ ది డాగ్’ చిత్రానికిగాను ఆస్కార్‌ను సొంతం చేసుకున్నారు. ఆస్కార్ అందుకున్న మూడో లైడీ డైరెక్టర్ జెయిన్. అయితే జెయిన్కు ఇది తొలి ఆస్కార్ కాదు. 1994లో వచి్చన ‘ది పియానో’ సినిమాకు బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో ఆమె తొలిసారి ఆస్కార్ అవార్డును అందుకున్నారు. అప్పుడు ఇదే సినిమాకు జెయిన్ కాంపియన్ ఉత్తమ దర్శకురాలిగా నామినేట్ అయినప్పటికీ ఆ ఏడాది ‘ష్లిండర్స్ లిస్ట్’ సినిమాకు స్టీవెన్ స్పీల్బర్గ్ ఆస్కార్ అవార్డును దక్కించుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఆస్కార్ అవార్డును కైవం చేసుకుంది వీళ్లే.. ► ఉత్తమ చిత్రం - చైల్డ్ ఆఫ్ డెఫ్ అడల్ట్స్(CODA) ► ఉత్తమ నటుడు - విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్) ► ఉత్తమ నటి - జెస్సికా చస్టేన్ (ద ఐస్ ఆఫ్ టామీ ఫే) ► ఉత్తమ దర్శకురాలు - జేన్ కాంపియన్ (ది పవర్ ఆఫ్ ద డాగ్) ► ఉత్తమ సహాయ నటి - అరియానా దిబోస్ (వెస్ట్ సైడ్ స్టోరీ) ► ఉత్తమ సహాయ నటుడు - ట్రాయ్ కోట్సర్ (CODA) ► ఉత్తమ సినిమాటోగ్రఫీ - గ్రెగ్ ఫ్రెజర్ (డ్యూన్) ► బెస్ట్ ఒరిజినల్ సాంగ్ - నో టైమ్ టు డై ► బెస్ట్ డాక్యుమెంటరీ ఫియేచర్ - సమ్మర్ ఆఫ్ సోల్ ► బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే- CODA (షాన్ హెడర్) ► బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే - బెల్ఫాస్ట్ (కెన్నత్ బ్రానా) ► బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ - జెన్నీ బీవన్ (క్రూయెల్లా) ► బెస్ట్ ఇంటర్నేషనల్ ఫియేచర్ - డ్రైవ్ మై కార్ (జపాన్) ► బెస్ట్ యానిమేటెడ్ ఫియేచర్ - ఎన్కాంటో ► బెస్ట్ ఒరిజినల్ స్కోర్ - హన్స్ జిమ్మర్ (డ్యూన్) ► బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ - డ్యూన్ (పాల్ లాంబర్ట్, ట్రిస్టన్ మైల్స్, బ్రియన్ కానర్, గెర్డ్ నెఫ్జర్) ► బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ - జో వాకర్ (డ్యూన్) ► బెస్ట్ సౌండ్ - డ్యూన్ (మాక్ రుత్, మార్క్ మాంగిని, థియో గ్రీన్, డగ్ హెంఫిల్, రాన్ బార్ట్లెట్) ► బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - డ్యూన్ (ప్రొడక్షన్ డిజైన్- పాట్రైస్ వెర్మట్, సెట్ డెకరేషన్- జుజానా సిపోస్) ► బెస్ట్ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్ - ద ఐస్ ఆఫ్ ది టామీ ఫే (లిండా డౌడ్స్, స్టెఫనీ ఇన్‌గ్రామ్, జస్టిన్ రాలే) ► బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం: ది లాంగ్ గుడ్‌బై ► బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం: ది విండ్‌షీల్డ్ పైపర్ ► బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం: ద క్వీన్ ఆఫ్ బాస్కెట్‌బాల్ చదవండి: Oscars 2022: ఆస్కార్.. వచ్చినా ఏం లాభం? -
జైభీమ్ చిత్రానికి మరో అరుదైన గౌరవం.. 'ఆస్కార్' ఛానెల్లో
Suriya Jai Bhim Features On The Oscars Official Youtube Channel: మాస్ పాత్రల్లోనే కాకుండా, క్లాస్, వైవిధ్యమైన రోల్స్‌లో అదరగొడుతుంటాడు తమిళ స్టార్ హీరో సూర్య. ఇటీవల సూర్య నటించిన చిత్రం 'జైభీమ్'. సినిమా అంటే మూడు ఫైట్లు, నాలుగు పాటలు, హీరోయిన్‌తో ప్రేమాయణం, ఐటెం సాంగ్‌లు కాదని నిరూపించి, సూపర్ డూపర్ హిట్ కొట్టిన చిత్రం జైభీమ్. సినిమాకు సామాజిక బాధ్యతకు ఉన్న అవినాభావ సంబంధాన్ని మరోసారి తట్టిలేపింది. ఒక ఆడబిడ్డ నిజజీవిత గాథను, పోరాటాన్ని ప్రయోగాత్మకంగా తెరకెక్కించి సత్తా చాటింది. టీజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సూర్య నిర్మించారు. గతేడాది నవంబరులో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. అంతేకాకుండా ఐఎండీబీ రేటింగ్స్‌లో హాలీవుడ్ క్లాసిక్ హిట్ 'ది షాషాంక్ రిడంప్షన్' చిత్రాన్ని అధిగమించి 73 వేలకుపైగా ఓట్లతో 9.6 రేటింగ్ సాధించింది. ఇప్పటివరకూ ఏ సౌత్ సినిమాకు ఇలాంటి రేటింగ్ రాలేదు. అలాగే గోల్డెన్ గ్లోబ్ 2022 పురస్కారానికి కూడా నామినేట్ అయిన సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా కోర్టు డ్రామా కథాశంతో తెరకెక్కిన 'జైభీమ్' చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్) అధికారిక యూట్యూబ్ ఛానెల్లో 'సీన్ ఎట్ ది అకాడమీ' పేరుతో ఈ సినిమాలోని ఓ వీడియోను ఉంచారు. అకాడమీ యూట్యూబ్ వేదికగా ఒక తమిళ చిత్రానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను ఉంచటం ఇదే మొదటిసారి. కాగా అకాడమీ యూట్యూబ్ ఛానెల్లో జైభీమ్ సినిమా వీడియో ఉండటంపై చిత్రబృందంతోపాటు అభిమానులు సంతోషపడుతున్నారు. 'జైభీమ్' ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిందని పండుగ చేసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని 'జస్టిస్ చంద్రు' జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: సూర్య ‘జై భీమ్’ మూవీ ఎలా ఉందంటే..? #Suriya's #JaiBhim scenes uploaded to #Oscars Official YouTube channel.👍👏@Suriya_offl ➡️ https://t.co/AXQwY2av72 pic.twitter.com/QmgFrz827n — Suresh Kondi (@SureshKondi_) January 18, 2022 • #JaiBhim is now the only Tamil Movie to be shown in The Academy #Oscars YouTube channel 🔥💯 Ever Proudful @Suriya_offl na 😇❤️ pic.twitter.com/3JhxVZhX1q — CHENTHUR (@ck__tweetz) January 18, 2022 #JaiBhim getting bigger and bigger 🔥 First Tamil movie scenes to shown in #Oscars utube ❤@Suriya_offl #EtharkkumThunindhavan#VaadiVaasal pic.twitter.com/qJcs0TsIQd — Mass Syed 💥 (@SuriyaFanstren4) January 18, 2022 -
ఆస్కార్ 2022కి వెళ్లనున్న నయనతార మూవీ
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు ‘ఆస్కార్’. ఒక్కసారైనా ఈ అవార్డుని సాధించాలని ప్రతి ఫిల్మ్ మేకర్ కోరుకుంటారు. అలాంటి ఫేమ్ ఉన్న ఈ అవార్డు కార్యక్రమం మార్చి 2022న లాస్ ఎంజెల్స్‌లో జరగనుంది. ఈ అవార్డుకి అంతర్జాతీయ చలనచిత్ర కేటగిరీ తమిళ చిత్రం ‘కూజాంగల్’ ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 15 మంది సభ్యుల జ్యూరీ మన దేశం నుంచి ఆస్కార్ నామినేషన్‌కు వెళ్లదగ్గ మొత్తం 14 సినిమాలను వీక్షించింది. అందులో ఈ సినిమాను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. పీఎస్ వినోద్‌రాజ్ దర్శకుడిగా పరిచయమైన ఈ మూవీని రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నటి నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ నిర్మించారు. విదేశి ఉత్తమ మూవీ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్‌కి పోటీపడుతున్నట్లు సోషల్ మీడియా వేదిక ఈ చిత్ర నిర్మాత విఘ్నేష్ షేర్ చేసుకున్నాడు. ‘‘అండ్ ది ఆస్కార్స్ గోస్ టు..’ అనే పదం వినేందుకు మరో రెండు అడుగుల దూరంలో ఉన్నాం. ఎంతో ఆనందంగా ఉంది’ అని ఈ ఫిల్మ్ మేకర్ తెలిపాడు. చదవండి: ప్రియుడితో కలిసి దేవాలయాలను సందర్శించిన నయనతార There’s a chance to hear this! “And the Oscars goes to …. 🎉🎉🥰🥰🥰🥰 “ Two steps away from a dream come true moment in our lives …. ❤️❤️🥰🥰🥰🥰🥰🥰🥰#Pebbles #Nayanthara @PsVinothraj @thisisysr @AmudhavanKar @Rowdy_Pictures Can’t be prouder , happier & content 💝 pic.twitter.com/NKteru9CyI — Vignesh Shivan (@VigneshShivN) October 23, 2021 -
Oscars 2021: ఉత్తమ చిత్రంగా నో మ్యాడ్ ల్యాండ్
-
ఆస్కార్ 2021: రెడ్ కార్పెట్ మీద హొయలు ఒలికించిన తారలు
-
ఆస్కార్ 2021: అవార్డులు గెలుచుకున్నది వీరే!
ఆస్కార్ అవార్డు.. జీవితంలో ఒక్కసారైనా దీన్ని గెలుచుకోవాలని ఉవ్విళ్లూరే సినీతారలు ఎందరో. అకాడమీ అవార్డు సాధిస్తే ఎవరెస్టు శిఖరం ఎక్కినంత సంబరపడిపోతారు. అలాంటి అత్యంత ప్రతిష్టాత్మక 93వ ఆస్కార్ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి ప్రారంభమైంది.. కోవిడ్ కారణంగా మొట్టమొదటిసారి రెండు ప్రాంతాల్లో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. అటు డోల్బీ థియేటర్లో, మరోవైపు లాస్ఏంజెల్స్లో ఆస్కార్ 2021 అవార్డు విజేతలను ప్రకటిస్తున్నారు. మరోవైపు ప్రేక్షకులు లేకుండా కేవలం సెలబ్రిటీలు మాత్రమే ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఇక అవార్డుల విషయానికి వస్తే.. నో మ్యాడ్ ల్యాండ్ సినిమాను ఉత్తమ చిత్రంగా ప్రకటించగా, ఇదే సినిమాకుగానూ క్లోవే జావోకు ఉత్తమ దర్శకురాలిగా ఆస్కార్ వరించింది. అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే విభాగంలో ది ఫాదర్ చిత్రానికి అవార్డు దక్కింది. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో ఎమరాల్డ్ ఫెన్నెల్‌కు ఆస్కార్ దక్కింది. బెస్ట్ రైటర్స్‌గా క్రిస్ట్ఫర్ హ్యాంప్టన్, ఫ్లోరియన్ జెల్లర్లకు, ఉత్తమ సహాయ నటుడిగా డానియల్ కలూయకు ఆస్కార్ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ సహాయ నటిగా యువాన్ యు జంగ్ (మిన్నారి సినిమా)కు అవార్డును ప్రకటించడంతో దక్షిణ కొరియాలోనే ఆస్కార్ అందుకున్న తొలి నటిగా ఆమె రికార్డులకెక్కారు. ఆస్కార్ విజేతలు.. ఉత్తమ చిత్రం: నో మ్యాడ్ ల్యాండ్ ఉత్తమ నటుడు: ఆంటోని హాప్కిన్స్ (ద ఫాదర్) ఉత్తమ నటి: ఫ్రాన్సెస్ మెక్‌డోర్‌మ్యాండ్ (నో మ్యాడ్ ల్యాండ్) ఉత్తమ చిత్రం ఎడిటింగ్: సౌండ్ ఆఫ్ మెటల్ ఉత్తమ దర్శకురాలు: క్లోవే జావో (నోమ్యాడ్ ల్యాండ్) ఉత్తమ సహాయ నటుడు: డానియెల్ కలువోయా (జుడాస్ అండ్ ది బ్లాక్ మెస్సయా) ఉత్తమ సహాయ నటి: యువాన్ యు–జంగ్(మిన్నారి) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ అండ్ సినిమాటోగ్రఫి: మ్యాంక్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: టెనెట్ ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఐ లవ్ యూ ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: అనదర్ రౌండ్ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: మై ఆక్టోపస్ టీచర్ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: ప్రామిసింగ్ యంగ్ ఉమెన్ ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: ది ఫాదర్ ఉత్తమ సినిమాటోగ్రఫీ: మ్యాంక్ ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: మా రైనీస్ బ్లాక్ బాటమ్ ఉత్తమ క్యాస్టూమ్ డిజైన్: మా రైనీస్ బ్లాక్ బాటమ్ ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: టూ డిస్టెంట్ స్ట్రేంజర్స్ ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: సోల్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: కొలెట్ ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: మ్యాంక్ ఉత్తమ ఒరిజినల్ స్కోర్: సోల్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్: ఫైట్ ఫర్ యూ (జుడాస్ అండ్ బ్లాక్ మెస్సయ్య) చదవండి: ఆస్కార్‌లో మన భారతీయ సినిమాలు -
ఆస్కార్ 2020 అవార్డుల ప్రదానోత్సవం
-
‘ఆస్కార్స్ బాస్’పై లైంగిక ఆరోపణలు
వాషింగ్టన్ : 90వ ఆస్కార్ వేడుకలు జరిగి ఎన్నో రోజులు అవడం లేదు, అప్పుడే ఆ అకాడమీకి చెందిన బాస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అకాడమీ ఆప్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అధ్యక్షుడు జాన్ బైలీపై మూడు లైంగిక వేధింపుల ఫిర్యాదులు నమోదైనట్టు హాలీవుడ్ రిపోర్టర్, వెరైటీ రిపోర్టు చేశాయి. ఈ ఆరోపణలపై విచారణ కూడా ప్రారంభమైందని తెలిపాయి. డైరెక్టర్, సినిమాటోగ్రఫర్ అయిన బైలీ, గత ఏడాది ఆగస్టులో అకాడమీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ‘అమెరికన్ గిగోలో’, , ‘ది బిగ్ చిల్’, ‘గ్రౌండ్ హోగ్ డే’ వంటి సినిమాలకు ఈయన పనిచేశారు. ఈ విషయంపై స్పందించిన అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్.. అన్ని పార్టీలను రక్షించడానికి అకాడమీ ఫిర్యాదులను రహస్యంగా ఉంచుతామని తెలిపింది. తమ ప్రవర్తనా నియమావళి ప్రమాణాల ప్రకారం అకాడమీ సభ్యులకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులను కమిటీ మెంబర్షిప్ సమీక్షిస్తుందని పేర్కొంది. అన్ని సమీక్షలు పూర్తయిన తర్వాత బోర్డు ఆఫ్ గవర్నర్లకు రిపోర్టు చేయనున్నామని చెప్పింది. పూర్తిగా రివ్యూ ముగిసే వరకు దీనిపై ఎలాంటి కామెంట్ చేయమని అకాడమీ వెల్లడించింది. ప్రస్తుతం హాలీవుడ్లో లైంగిక వేధింపులు పెద్ద ఎత్తున్న చర్చనీయాంశమయ్యాయి. హాలీవుడ్ మొఘల్ హార్వే వైన్‌స్టీన్ సెక్స్ స్కాండల్‌కు, హాలీవుడ్ ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ‘మీటూ ఉద్యమం’ కూడా భారీ ఎత్తున్న ప్రచారం జరిగింది. ఈ ఉద్యమం సందర్భంగా వైన్‌స్టీన్‌కు వ్యతిరేకంగా 70 మందికి పైగా ఫిర్యాదులు నమోదుచేశారు. గతేడాది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సస్ నుంచి వైన్‌స్టీన్‌ను తొలగించేశారు. వైన్‌స్టీన్ కంపెనీ కూడా దివాలా తీయబోతుంది. -
ఆస్కార్ ను లైట్ తీసుకున్నారు!
ఈ ఏడాది ఉత్తమ సినిమా, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి.. అంటూ హాలీవుడ్ సినీ రంగంలో అద్భుత ప్రతిభ కనబర్చినవారిని సత్కరించే ఆస్కార్ వేడుకలకు.. టీవీల్లో అత్యధికులు వీక్షించే ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్ గానూ రికార్డుంది. అయితే మూడు రోజుల కిందట జరిగిన 88వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవాన్ని మాత్రం వీక్షకులు లైట్ తీసుకున్నారు. తిప్పికొడితే ప్రపంచ వ్యాప్తంగా 3.6 కోట్ల మంది మాత్రమే ఆస్కార్ ప్రత్యక్ష ప్రసారాల్ని చూశారు! హాలీవుడ్ లోని డాల్బీ థియేటర్ లో అట్టహాసంగా నిర్వహించిన ఆస్కార్ వేడుకలకు కమెడియన్ క్రిస్ రాక్, నటుడు నీల్ ప్యాట్రిక్ హ్యారిస్ లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మొత్తం కార్యక్రమంలో యాంకర్ క్రిస్ రాక్ తప్ప నామినీలుగా నల్లజాతీయులెవరికీ చోటు దక్కకపోవటమే రేటింగ్స్ దారుణంగా పడిపోవడానికి కారణమని తెలుస్తోంది. నిజానికి నల్లజాతి నటులకు నామినేషన్లు దక్కకపోవటంపై మొదటి నుంచే వివాదం రగులుతోంది. అదికాస్తా టీవీ ప్రసారాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. యూఎస్ లోని ఆ వర్గాలకు చెందిన కొన్ని సంస్థలు అస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని బహిష్కరించాలని బహిరంగానే పిలుపిచ్చాయి. దీంతో గత ఎనిమిదేళ్లలోనే అతి తక్కువ వ్యూవర్ షిప్ నమోదయింది. ప్రముఖ సర్వే సంస్థ నెల్సన్ ఈ విషయాలను వెల్లడించింది. 2009లో 37.26 మిలియన్ల మంది ఆస్కార్ అవార్డు ఫంక్షన్ లైవ్ ను టీవీల్లో చూశారు. ఆ కార్యక్రమానికి సంబంధించి అది లోయెస్ట్ వీవర్ షిప్ కాగా ఈ ఏడు అంతకన్నా తక్కువ.. 36.6 మిలియన్ల మంది మాత్రమే చూశారు. అలా చూసిన వారిలోనూ 58 మిలియన్ల మంది ఆరు నిమిషాల్లోపే ఛానెల్ మార్చేశారట!