ఆస్కార్ రేసు నుంచి మన సినిమా నిష్క్రమించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించే ఆస్కార్ అవార్డుల కోసం మన దేశం నుంచి 'లాపతా లేడీస్' అనే హిందీ మూవీని పంపించారు. కానీ ఇది ఇప్పుడు షార్ట్ లిస్ట్ కాలేదు. అయితే భారతీయ నేపథ్య కథతో తీసిన 'సంతోష్' అనే సినిమా షార్ట్ లిస్ట్ అయింది. కాకపోతే దీన్ని యూకేకి చెందిన వ్యక్తులు నిర్మించారు.
(ఇదీ చదవండి: సంధ్య థియేటర్‌కి పోలీసులు షోకాజ్ నోటీసు)
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన సినిమా 'లాపతా లేడీస్'. కొత్తగా పెళ్లయిన ఇద్దరు పెళ్లి కూతుళ్లు.. పొరపాటున ఒకరి భర్త బదులు మరొకరి దగ్గరకు వెళ్తే ఏం జరిగింది? అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తీశారు. చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని చెప్పారు. దీంతో ఆస్కార్ రేసులో నిలబెట్టారు. కానీ ఇప్పుడు షార్ట్ లిస్ట్ కాలేకపోయింది.
లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో మన దేశం నుంచి 'అనూజ' షార్ట్ లిస్ట్ అయింది. బట్టల తయారు చేసే పరిశ్రమల్లో పిల్లలతో ఎలాంటి గొడ్డు చాకిరీ చేయిస్తున్నారనే స్టోరీ దీన్ని తెరకెక్కించారు. మరి ఇదేమైనా అవార్డ్ గెలుచుకుంటేదేమో అనేది తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.
(ఇదీ చదవండి: జైలు నుంచి రిలీజ్.. వెంటనే దర్శన్‌పై ప్రేమ బయటపెట్టిన పవిత్ర గౌడ)
ఇకపోతే ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో షార్ట్ లిస్ట్ అయిన సినిమాల విషయానికొస్తే 'టచ్', 'నీక్యాప్', 'వెర్మిగ్లో', 'అర్మాండ్', 'ఫ్రమ్ గ్రౌండ్ జీరో', 'దహోమే', 'హౌ టూ మేక్ మిలియన్స్ బిఫోర్ గ్రాండ్ మా డైస్' తదితరులు పోటీ పడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment