Laapataa Ladies
-
ఐఐఎఫ్ఏ అవార్డ్స్ నామినేషన్స్.. సత్తా చాటిన లపతా లేడీస్
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ -2025 (IIFA) నామినేషన్స్‌లో బాలీవుడ్ చిత్రాలు సత్తా చాటాయి. తాజాగా ప్రకటించిన ఐఐఎఫ్ఏ నామినేషన్స్‌లో అమిర్ ఖాన్, కిరణ్ రావు తెరకెక్కించిన లపతా లేడీస్ అత్యధిక విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. ఏకంగా తొమ్మిది విభాగాల్లో లపతా లేడీస్ ఎంపికైంది. ఆ తర్వాత భూల్ భూలయ్యా-2, స్త్రీ-2 చిత్రాలు వరుసగా ఏడు, ఆరు విభాగాల్లో పోటీలో నిలిచాయి.ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ వేడుక మార్చిలో జరగనుంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో మార్చి 8, 9 తేదీల్లో ఈవెంట్ నిర్వహించనున్నారు. ఉత్తమ చిత్రం విభాగంలో లాపతా లేడీస్, భూల్ భూలయ్యా- 3, స్త్రీ- 2, కిల్, ఆర్టికల్ 370, షైతాన్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్నాయి. ఉత్తమ దర్శకుడి కేటగిరీలో కిరణ్ రావు, నిఖిల్ నగేష్ భట్, అమర్ కౌశిక్, సిద్ధార్థ్ ఆనంద్, అనీస్ బజ్మీ, ఆదిత్య సుహాస్ ఝంబాలే నిలిచారు. ఉత్తమ నటి కేటగిరీలో నితాన్షి గోయెల్, అలియా భట్, యామీ గౌతమ్, కత్రినా కైఫ్, శ్రద్ధా కపూర్లు పోటీ పడుతుండగా.. ఉత్తమ నటులుగా స్పర్ష్ శ్రీవాస్తవ, రాజ్‌కుమార్ రావు, కార్తీక్ ఆర్యన్, అభిషేక్, బచ్చన్, అజయ్ దేవగన్‌లు నామినేషన్స్ దక్కించుకున్నారు.సపోర్టింగ్ రోల్ విభాగంలో ఛాయా కదమ్, విద్యాబాలన్, జాంకీ బోడివాలా, జ్యోతిక, ప్రియమణి నిలవగా.. రవి కిషన్, అభిషేక్ బెనర్జీ, ఫర్దీన్ ఖాన్, రాజ్‌పాల్ యాదవ్, మనోజ్ పహ్వా మేల్ విభాగంలో పోటీ పడుతున్నారు. బెస్ట్ విలన్ కేటగిరీలో రాఘవ్ జుయల్, ఆర్ మాధవన్, గజరాజ్ రావ్, వివేక్ గోంబర్, అర్జున్ కపూర్ నామినీలుగా నిలిచారు. -
లపతా లేడీస్ అరుదైన ఘనత.. ఏకంగా హాలీవుడ్ చిత్రాలతో పోటీ!
బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్, ఆయన మాజీ భార్య కిరణ్ రావు తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం లపతా లేడీస్. గతేడాది రిలీజైన ఈ సినిమా అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.ప్రతిష్టాత్మక జపాన్ అకాడమీ ఫిల్మ్ ప్రైజ్‌కు లపతా లేడీస్ ఎంపికైంది. ఈ ఏడాది ఈ ప్రైజ్‌కు అర్హత సాధించిన చిత్రాల్లో భారత్ నుంచి ఈ మూవీ నిలిచింది. ఈ హిట్ సినిమా ఏకంగా హాలీవుడ్ భారీ చిత్రాలైన క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్, జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్, పూర్ థింగ్స్, సివిల్ వార్ లాంటి సూపర్ హిట్ సినిమాలతో పోటీపడుతోంది. బెస్ ఇంటర్నేషనల్ మూవీ కేటగిరీ విభాగంలో లపతా లేడీస్‌ను ఎంపిక చేశారు. ఈ ఏడాది మార్చి 14న జరిగే అవార్డుల వేడుకలో ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా విజేతలను ప్రకటిస్తారు. కాగా.. విమర్శకుల ప్రశంసలు పొందిన లపాతా లేడీస్ విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లింది.కాగా.. లపతా లేడీస్ చిత్రాన్ని జియో స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కించారు. అమీర్ ఖాన్ లగాన్ (2001)చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేసిన కిరణ్ రావు తన కెరీర్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం కావడం విశేషం. 2011లో తన ధోబీ ఘాట్ అనే సినిమాతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో నితాన్షి గోయెల్, ప్రతిభా రంతా, రవి కిషన్, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్ కీలక పాత్రల్లో నటించారు.ఓపెన్ హైమర్‌తో ఢీ..కాగా.. గతేడాది ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో 'ఓపెన్ హైమర్' సత్తా చాటింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ లాంటి విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తొలిసారి 'ఓపెన్ హైమర్' అనే బయోపిక్ తీశాడు. దాదాపు మూడేళ్ల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. 2023 జూలై 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. 100 మిలియన్ డాలర్స్ పెడితే.. 1000 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే మన కరెన్సీలో రూ.7700 కోట్లకు పైమాటే. -
నాగచైతన్య పాన్ ఇండియా ప్రాజెక్ట్.. కీలక పాత్రలో లాపతా లేడీస్ నటుడు!
అక్కినేని నాగచైతన్య పెళ్లి తర్వాత తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల షూటింగ్లో చైతూ వంట వండుతున్న వీడియోలు వైరలయ్యాయి. అంతేకాకుండా నమో నమశ్శివాయ అనే రెండో లికరికల్ సింగిల్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు.అయితే ఈ మూవీ తర్వాత చైతూ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో నటించనున్నారు. ఎన్సీ24 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని రూపొందించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పనులు ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మించనున్నారు. విరూపాక్ష మూవీతో హిట్ కొట్టిన కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ మూవీ రానుంది. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించనున్నారు.విలన్‌గా లపట్టా లేడీస్ నటుడు..అయితే ఈ మూవీలో లాపతా లేడీస్ యాక్టర్ స్పార్ష్ శ్రీవాస్తవ నటిస్తారని లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది. అమిర్ ఖాన్- కిరణ్ రావు తెరకెక్కించిన లాపతా లేడీస్ గతేడాది విడుదలైన సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో తన అమాయకమైన నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు శ్రీవాస్తవ. దీంతో నాగ చైతన్య రాబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో శ్రీవాస్తవ విలన్‌గా చేయనున్నారని ఇటీవల ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. కాగా.. గతంలో చైతూ పుట్టిన రోజు సందర్భంగా ఎన్సీ24 మూవీ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ చిత్రంలో చైతూ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తారని కూడా తెలుస్తోంది. ఈ మూవీలో నటీనటులకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
17 ఏళ్ల హీరోయిన్.. తొలి సినిమానే ఆస్కార్ బరిలో.. ఈమెని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
ఆస్కార్‌లో నిరాశ.. లాపతా లేడీస్‌ను సెలక్ట్ చేయడమే తప్పంటున్న డైరెక్టర్
లాపతా లేడీస్.. బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమాకు ఓటీటీ ప్రియులు బ్రహ్మరథం పట్టారు. కాన్సెప్ట్ కొత్తగా ఉందని ఎగబడి చూశారు. అంతేనా? ఏకంగా ఆస్కార్ కోసం మన దేశం నుంచి లాపతా లేడీస్ చిత్రాన్ని పంపించారు. కానీ ఆదిలోనే భంగపాటు ఎదురైంది. ఈ సినిమా షార్ట్ లిస్ట్ కాకపోవడంతో అకాడమీ అవార్డుల రేసులో నుంచి తప్పుకుంది. అయితే ఆస్కార్‌కు ఈ సినిమాను ఎంపిక చేయడమే పెద్ద తప్పంటున్నాడు దర్శకనిర్మాత హన్సల్ మెహతా.మరో ఫెయిల్యూర్ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరోసారి తన వైఫల్యాన్ని చాటిచెప్పింది. ఏయేటికాయేడు సినిమాల ఎంపికలో తప్పటడుగులు వేస్తూ పూర్తిగా వెనకబడుతోంది అని ట్వీట్ చేశాడు. దీనికి పలువురు నెటిజన్లు మద్దతుగా నిలిచారు. కేన్స్, స్పిరిట్, గోల్డెన్ గోబ్స్ వంటి అంతర్జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ సినిమాను పంపించి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఆస్కార్ బరిలో ఇండియన్ సినిమాలు అడ్రస్ లేకుండా పోతున్నాయని కామెంట్లు చేస్తున్నారు.లాపతా లేడీస్లాపతా లేడీస్ విషయానికి వస్తే.. మహిళా డైరెక్టర్ కిరణ్ రావు తీసిన ఈ మూవీ మార్చిలో విడుదలైంది. ప్రతిభ రంత, నితాన్షి గోయల్, స్పర్ష్ శ్రీవాత్సవ, రవి కిషన్, ఛాయా కదమ్ ప్రధాన పాత్రల్లో నటించారు. నాలుగైదు కోట్లతో నిర్మించిన ఈ సినిమా దాదాపు రూ.25 కోట్లు రాబట్టింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. Film Federation of India does it again! Their strike rate and selection of films year after year is impeccable. pic.twitter.com/hiwmatzDbW— Hansal Mehta (@mehtahansal) December 17, 2024చదవండి: రూ.10 టికెట్లో కూర్చుని 'పుష్ప 2' చూశా: నటి సంయుక్త -
మన సినిమా.. ఆస్కార్ రేసు నుంచి ఔట్
ఆస్కార్ రేసు నుంచి మన సినిమా నిష్క్రమించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించే ఆస్కార్ అవార్డుల కోసం మన దేశం నుంచి 'లాపతా లేడీస్' అనే హిందీ మూవీని పంపించారు. కానీ ఇది ఇప్పుడు షార్ట్ లిస్ట్ కాలేదు. అయితే భారతీయ నేపథ్య కథతో తీసిన 'సంతోష్' అనే సినిమా షార్ట్ లిస్ట్ అయింది. కాకపోతే దీన్ని యూకేకి చెందిన వ్యక్తులు నిర్మించారు.(ఇదీ చదవండి: సంధ్య థియేటర్‌కి పోలీసులు షోకాజ్ నోటీసు)బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన సినిమా 'లాపతా లేడీస్'. కొత్తగా పెళ్లయిన ఇద్దరు పెళ్లి కూతుళ్లు.. పొరపాటున ఒకరి భర్త బదులు మరొకరి దగ్గరకు వెళ్తే ఏం జరిగింది? అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తీశారు. చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని చెప్పారు. దీంతో ఆస్కార్ రేసులో నిలబెట్టారు. కానీ ఇప్పుడు షార్ట్ లిస్ట్ కాలేకపోయింది.లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో మన దేశం నుంచి 'అనూజ' షార్ట్ లిస్ట్ అయింది. బట్టల తయారు చేసే పరిశ్రమల్లో పిల్లలతో ఎలాంటి గొడ్డు చాకిరీ చేయిస్తున్నారనే స్టోరీ దీన్ని తెరకెక్కించారు. మరి ఇదేమైనా అవార్డ్ గెలుచుకుంటేదేమో అనేది తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: జైలు నుంచి రిలీజ్.. వెంటనే దర్శన్‌పై ప్రేమ బయటపెట్టిన పవిత్ర గౌడ)ఇకపోతే ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో షార్ట్ లిస్ట్ అయిన సినిమాల విషయానికొస్తే 'టచ్', 'నీక్యాప్', 'వెర్మిగ్లో', 'అర్మాండ్', 'ఫ్రమ్ గ్రౌండ్ జీరో', 'దహోమే', 'హౌ టూ మేక్ మిలియన్స్ బిఫోర్ గ్రాండ్ మా డైస్' తదితరులు పోటీ పడుతున్నాయి. -
సినిమాలు మానేద్దామనుకున్నా.. తనవల్లే..: ఆమిర్ ఖాన్
కరోనా సమయంలో జనజీవనం స్తంభించిపోయింది. ఎంతోమంది బతుకులు ఆగమయ్యాయి. ఉద్యోగాలు ఊడిపోయాయి. రేపనేది ఉంటుందా? లేదా? అన్న సందిగ్ధం.. అంతటా విషాదం.. ఆ పరిస్థితుల్లో తనకు సినిమాలు మానేయాలన్న ఆలోచన వచ్చిందంటున్నాడు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్.కరోనా సమయంలో..అతడి మాజీ భార్య కిరణ్ రావు తెరకెక్కించిన లాపతా లేడీస్ ఆస్కార్ కోసం ‘బెస్ట్ ఫారిన్ ఫిల్మ్’ కేటగిరీలో మన దేశం నుంచి అఫిషియల్ ఎంట్రీగా వెళ్లనుంది. లాపతా లేడీస్‌ను లాస్ట్ లేడీస్‌గా మార్చేసి.. అమెరికాలో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో ఆమిర్ ఖాన్ తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాడు. 'కరోనా సమయంలో పని లేక ఇంట్లోనే కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం గడిపాను. భావోద్వేగానికి లోనయ్యా..ఇంతకాలం బిజీగా ఉండి రిలేషన్షిప్స్కు సరైన సమయం కేటాయించలేదేమో అనిపించింది. ఒకరకంగా చెప్పాలంటే చాలా బాధపడ్డాను, భావోద్వేగానికి గురయ్యాను. ఇక సినిమాలు ఆపేద్దామనుకున్నాను. అప్పుడు కిరణ్.. మరోసారి ఆలోచించుకోమని చెప్పింది. సినిమాలు లేకుండా నేను ఉండలేననే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పింది. దీంతో తిరిగి సినిమాల్లో నటించడానికి సిద్ధమయ్యా' అని ఆమిర్ చెప్పుకొచ్చాడు. -
‘లాస్ట్ లేడీస్’ కోసం మహిళలందరూ సపోర్ట్ చేయాలి: కిరణ్ రావు
‘లాపతా లేడీస్’ పేరు ఇంగ్లిష్‌లో ‘లాస్ట్ లేడీస్’గా మారిపోయింది. స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ రంతా, ఛాయా కందం లీడ్ రోల్స్‌లో నటుడు ఆమిర్ ఖాన్ సతీమణి కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘లాపతా లేడీస్ (తప్పిపోయిన మహిళలు అని అర్థం). ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతిదేశ్ పాండే నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 1న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే వచ్చే ఏడాది అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న 97వ ఆస్కార్ అవార్డ్స్లోని ఉత్తమ విదేశీ చిత్రం నామినేషన్ కోసం ఇండియా అఫీషియల్ ఎంట్రీగా ‘లాపతా లేడీస్’ సినిమాను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసింది. కాగా ‘లాపతా లేడీస్’ అనే హిందీ టైటిల్ అంతగా రిజిస్టర్ కాదేమోనని, ఈ సినిమాకు ఇంగ్లిష్‌లో ‘లాస్ట్ లేడీస్’ అనే టైటిల్ పెట్టి, ఈ సినిమా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే అమెరికాలోని కొన్ని లొకేషన్స్‌లో ‘లాస్ట్ లేడీస్’ సినిమా ప్రత్యేక ప్రదర్శనలు వేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా కిరణ్ రావ్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ– ‘‘లాస్ట్ లేడీస్’ మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రం కాబట్టి మహిళలందరూ మా సినిమాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మంచి సందేశాత్మక చిత్రం కాబట్టి ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తుందన్న నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా కథ విన్న వెంటనే నాకు వినోదాత్మకంగా అనిపించింది. పైగా పలు ముఖ్యమైన అంశాలు ప్రస్తావించడం జరిగింది. మహిళా సాధికారిత, స్వేచ్ఛ, సమానత్వాల కోసం పోరాడుతున్న మహిళలకు పురుషులు సపోర్ట్ చేయడం అనే పాయింట్ కూడా బాగుంది. ఈ సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరించినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు ఆమీర్‌ఖాన్. -
మహిళ తనలోని ఖాళీలను కనుక్కోవాలి!
‘జెండర్‌ని కాదు పితృస్వామ్య వ్యవస్థను సవాల్ చేసేలా సినిమా తీయాలనుకున్నాను’ అన్నారు చిత్ర నిర్మాత, స్క్రీన్ రైటర్, దర్శకురాలు కిరణ్‌రావు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో బుధవారం జరిగిన ‘మంథన్ సమ్వాద్’ చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు ఆమె. ఇటీవల ఆమె దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’ భారతదేశం నుంచి ఆస్కార్‌కి అధికారికంగా నామినేట్ అయిన సందర్భంగా జెండర్ దృష్టి కోణం నుంచి ఎన్నో విషయాలను పంచుకున్నారు.‘‘మహిళలు తమలో అంతర్గతంగా ఉండే ఖాళీలను కనుక్కోవాలనే ఆలోచనను ‘లాపతా లేడీస్’ చిత్రం ద్వారా చెప్పే ప్రయత్నం చేశాను. ఇది నా రెండవ చిత్రం. జెండర్ తేడా లేకుండా అందరి నుంచి మంచి ఆదరణ లభించడం ఎంతో సంతోషంగా ఉంది.మెరుగైన కృషిమహిళల కోసం వారి ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చే విషయంలో రచనల పరంగా కొంత లోటు ఉంది. ఈ లోటు ను భర్తీ చేయడానికి చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. నా మొదటి సినిమా ‘ధోబీ ఘాట్’ నుంచి చాలా నేర్చుకున్నాను. ఆ వర్క్ నెక్ట్స్ సినిమాను మరింత మెరుగ్గా మార్చింది.ఆడ–మగ .. వేరుగా చూడనుఆడవాళ్ల మానసిక వేదనలు, వారికి సంబంధించిన సమస్యలు చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. అయితే, మగవారికి సంబంధించి నవి కూడా అంతకన్నా సెన్సిటివ్ గా ఉండటం చూస్తుంటాం. నేను ఆడ–మగ అని జెండర్ ప్రకారంగా వీళ్లు తక్కువ, వాళ్లు ఎక్కువ అని చెప్పలేను. మగవాళ్లు కూడా మహిళల కోణం నుంచి సెన్సిటివ్ విషయాలను రాయగలరు, చిత్రాలు తీయగలరు. మొన్నామధ్య వచ్చిన ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ను స్త్రీ కోణం నుంచి పురుష దర్శకుడే మనకు పరిచయం చేశారు. నేను ఒంటరితల్లిగా మా అబ్బాయి మనోభావాలను కూడా గమనిస్తుంటాను కాబట్టి ఆడ–మగ అనే ఆలోచనతో కాకుండా మానవత్వం అనే కోణం నుంచే చూస్తాను.పితృస్వామ్యాన్ని సవాల్ చేస్తూ! మహిళల కోణం నుంచి చూస్తే ముఖ్యంగా అమ్మాయిలకు వారి కలలను సాధించుకునే విషయంలో మన దగ్గర కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రధానమైనది పితృస్వామ్య వ్యవస్థ. ఆడపిల్ల సొంతంగా ఎదగడం కన్నా, పెళ్లి చేసేస్తే బాధ్యత తీరుతుంది అనుకుంటారు. ఆ కోణం నుంచి ఈ ‘లాపతా లేడీస్’ కథను చూపించాం. ఇద్దరు నవ వధువులు, భర్తలతో అత్తవారింటికి రైలులో బయల్దేరుతారు. మేలి ముసుగులు నిండా కప్పుకున్న వధువులు ఒక స్టేషన్లో దిగాల్సినది మరోచోట దిగుతారు. వాళ్లిద్దరిని ఇళ్లలోని వారు వెతుకుతుంటారు. ఎవరి కంటా పడకుండా ఒక వధువు తనకై తానుగా ఒక కొత్త ప్రపంచాన్ని ఏర్పరుచు కుంటుంది. మరొక వధువు చుట్టూ ఉన్న పితృస్వామ్యాన్ని సవాల్ చేస్తుంది. బరువైన సామాజిక సమస్యలను ప్రస్తావించిన్పటికీ, హాస్యాన్ని కూడా జత చేయడంతో అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరించాం. వివాహం చేసుకోబోయే యువతులైనా, చదువుకోవడానికి చేసే ప్రయత్నమైనా వాళ్లు ఎదుర్కొనే అనేక రకాల పరిస్థితులు, కొత్త మార్గాన్ని అన్వేషించడానికి, సమస్యలను పరిష్కరించుకునే తీరు ఆలోచింపజేస్తుంది. మహిళలు వయసు పైబడినవారయినా సరే...మగవారిపైన ఆధారపడకుండా ఆర్థిక స్వాతంత్య్రాన్ని పొందాలి. అందుకు తగిన నైపుణ్యాలను పెంచుకోవాలి’’ అని అన్నారు.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ ఫెమినిజం మెరుపు‘లాపతా లేడీస్’ అని టైటిల్ చూసి ఫెమినిజం ఫైర్ ఉంటుంది కాబోలు అనుకోలేరు. కానీ, దాని తాలూకు ఒక మెరుపు కనిపిస్తుంది. అందువల్ల మగవారి నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా కథనం పితృస్వామానికి విరుద్ధమే కానీ ఒక జెండర్‌కు మాత్రమే సంబంధించింది కాదు. నేను వివాహ వ్యవస్థకు అస్సలు వ్యతిరేకం కాదు. నిజానికి పెళ్లయినా, కుటుంబంలో అయినా సరే స్త్రీలు తమలోని ఖాళీలను కనుక్కొనేలా ్ర΄ోత్సహించే విధంగా ఈ కథను చెప్పాలనుకున్నాను. అంతేకానీ ఏదో భారీ విప్లవాన్ని తీసుకొచ్చి సంబంధాలను విచ్ఛిన్నం చేయాలనుకోలేదు.’’ -
ఆస్కార్ అడ్రస్‌కు లాపతా లేడీస్
‘నాకు కుట్లు అల్లికలు, వంట, పాటలు, భజన వచ్చు. అమ్మ నేర్పింది’ అని కొత్త పెళ్లికూతురు అంటే ‘అత్తగారింటికి సొంతగా వెళ్లడం నేర్పలేదా?’ అని అడుగుతుంది ఒక పెద్దావిడ. అత్తగారి ఊరు ఏదో దానికి ఎలా వెళ్లాలో తెలియని స్థితి నుంచి తామేమిటో తమకు ఏం కావాలో తెలుసుకునే చైతన్యం వరకూ సాగే ఇద్దరు పల్లెటూరి నవ వధువుల కథ ‘లాపతా లేడీస్’ ఆస్కార్– 2025కు మన దేశం నుంచి అఫిషియల్ ఎంట్రీగా వెళ్లనుంది. ‘‘సినిమాలు చాలానే ఉన్నాయి. కాని భారతీయతను ప్రతిబింబించే సినిమాగా ‘లాపతా లేడీస్’ ఏకగ్రీవంగా ఎంపికైంది’’ అని కమిటీ తెలిపింది. మహిళా డైరెక్టర్ కిరణ్ రావు తీసిన మహిళా గాథ ఇది.‘పితృస్వామ్యానికి వ్యతిరేక పదం మాతృస్వామ్యం అని చాలామంది అనుకుంటారు. కాని పితృస్వామ్యానికి వ్యతిరేక పదం సమానత్వం. మనకు ఒకరు ఆధిపత్యం వహించే పితృస్వామ్యం వద్దు.. మాతృస్వామ్యం వద్దు... అందరూ సమానంగా జీవించే వ్యవస్థే కావాల్సింది’ అంటుంది కిరణ్ రావు.ఆమె దర్శకత్వంలో మార్చి 2024లో విడుదలైన ‘లాపతా లేడీస్’ ఆస్కార్ కోసం ‘బెస్ట్ ఫారిన్ ఫిల్మ్’ కేటగిరీలో 2025 సంవత్సరానికిగాను మన దేశం నుంచి అఫిషియల్ ఎంట్రీగా వెళ్లనుంది. ‘పతా’ అంటే అడ్రస్. లాపతా అంటే అడ్రస్ లేకపోవడం. లేకుండాపోవడం. సరిగా చె΄్పాలంటే మన దేశంలో పెళ్లయ్యాక ఆడపిల్ల అత్తగారింటికి వెళ్లి తన గుర్తింపును తాను కోల్పోవడం.గుర్తింపు నుంచి తప్పిపొడం... ఆకాంక్షలను చంపుకోవడం... ఇదీ కథ. ఆస్కార్ కమిటీకి ఈ సినిమా నచ్చి నామినేషన్ పొందితే ఒక ఘనత. ఇక ఆస్కార్ సాధిస్తే మరో ఘనత. ‘లాపతా లేడీస్’ నిర్మాత ఆమిర్ ఖాన్ గతంలో నిర్మించి నటించిన ‘లగాన్’కు కొద్దిలో ఆస్కార్ తప్పింది. ఈసారి ఆస్కార్ గెలవడానికి గట్టి అవకాశాలున్నాయని సినిమా విమర్శకులు భావిస్తున్నారు. ముందడుగును అడ్డుకునే కపట నాటకం‘లాపతా లేడీస్’లో ఇద్దరు వధువులు అత్తగారింటికి వెళుతూ తప్పిపోతారు. ఒక వధువు మరో పెళ్లికొడుకుతో తనకు సంబంధం లేని అత్తగారింటికి చేరితే ఇంకో వధువు పారటున వేరే స్టేషన్లో చిక్కుకు΄ోతుంది. రైల్వేస్టేషన్లో ఉన్న వధువుకు తన అత్తగారి ఊరు పేరేమిటో తెలియదు. ఎలా వెళ్లాలో తెలియదు. సొంత ఊరి పేరు చెబుతుంది కానీ భర్త లేకుండా తిరిగి పుట్టింటికి చేరడం తల వంపులని వెళ్లడానికి ఇష్టపడదు.‘మంచి కుటుంబాల నుంచి వచ్చిన ఆడపిల్లలు అలా చేయరు’ అంటుంది స్టేషన్లో క్యాంటీన్ నడుపుతున్న అవ్వతో. అప్పుడా అవ్వ ‘మన దేశంలో ఇదే పెద్ద కపట నాటకం. మంచి కుటుంబాల నుంచి వచ్చిన ఆడపిల్లలు అది చేయకూడదు.. ఇది చేయకూడదు అని అసలు ఏదీ చేయనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటారు’ అంటుంది. అయితే ఆ వధువు వెరవకుండా ఆ స్టేషన్లో ఆ అవ్వతోనే ఉంటూ అక్కడే పని చేసుకుంటూ భర్త కోసం ఎదురు చూస్తూ మెల్లగా ఆత్వవిశ్వాసం నింపుకుంటుంది. మరో వైపు వేరే వరుడితో వెళ్లిన వధువు ఆ అత్తగారింటిలో (వాళ్లంతా అసలు కోడలి కోసం అంటే రైల్వే స్టేషన్లో ఉండిపోయిన కోడలి కోసం వెతుక్కుంటూ ఉండగా) ఆశ్రయం పొంది పై చదువులు చదవడానికి తాను అనుకున్న విధంగా పురోగమిస్తుంది. సినిమా చివరలో ఒక వధువు తన భర్తను చేరుకోగా మరో వధువు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న భర్తను కాదని పై చదువులకు వెళ్లిపోతుంది. ఈ మొత్తం కథలో దర్శకురాలు కిరణ్ రావు ఎన్నో ప్రశ్నలు ప్రేక్షకుల ముందు ఉంచుతుంది. మన దేశంలో స్త్రీలను పరదాలు, ఘోషాలు, ఘూంఘట్ల పేరుతో అవిద్యలో ఉంచి వారికి లోకం తెలియనివ్వకుండా కనీసం తమ వ్యక్తిత్వ చిరునామాను నిర్మించుకోనివ్వకుండా ఎలా పరాధీనంలో (పురుషుడి మీద ఆధారపడేలా) ఉంచుతున్నారో చెబుతుంది. స్త్రీలు స్వతంత్రంగా జీవించగలరు, ఆత్మవిశ్వాసంతో బతగ్గలరు వారినలా బతకనివ్వండి అంటుందీ సినిమా. పెద్ద హిట్నాలుగైదు కోట్లతో నిర్మించిన ‘లాపతా లేడీస్’ దాదాపు 25 కోట్ల రూపాయలు రాబట్టింది. ఒకవైపు థియేటర్లలో ఆడుతుండగానే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయినా జనం థియేటర్లలో చూడటానికి వెళ్లడం విశేషం. చాలా మంచి ప్రశంసలు ఈ సినిమాకు దక్కాయి. రైల్వే స్టేషన్లో అవ్వగా నటించిన ఛాయా కదమ్‌కు, ఇన్స్పెక్టర్గా నటించిన రవికిషన్‌కు మంచి పేరు వచ్చింది. మిగిలిన కొత్త నటీనటులకు కూడా మంచి గుర్తింపు వచ్చింది.భారీపోటీలోఆస్కార్ అఫిషియల్ ఎంట్రీ కోసం చాలా సినిమాలుపోటీ పడ్డాయి. తెలుగు నుంచి కల్కి, హనుమ్యాన్, మంగళవారం ఉన్నాయి. తమిళం నుంచి ‘మహరాజా’, ‘తంగలాన్’ ఉన్నాయి. జాతీయ అవార్డు పొందిన ‘ఆట్టం’ (మలయాళం), కేన్స్ అవార్డు ΄పొదిన ‘ఆల్ వియ్ ఇమేజిన్ యాజ్ లైట్’ కూడా ఉన్నాయి. హిందీ నుంచి ‘యానిమల్’, ‘శ్రీకాంత్’పోటీ పడ్డాయి. కాని ‘లాపతా లేడీస్’లోని అంతర్గత వేదన, మార్పు కోరే నివేదన దానికి ఆస్కార్‌కు వెళ్లే యోగ్యత కల్పించింది. ఇది మాకు దక్కిన గౌరవంఆస్కార్ నామినేషన్ కోసం ఫిల్మ్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ మా ‘లపతా లేడీస్’ సినిమాను ఎంపిక చేయడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ నామినేషన్‌కు మాతో పాటు మరికొన్ని అద్భుతమైన భారతీయ సినిమాలుపోటీ పడ్డాయి. అయితే కమిటీ మా చిత్రాన్ని నమ్మినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఖండాంతరాలు దాటేందుకు, ప్రజల హృదయాలతో కనెక్ట్ కావడానికి సినిమా అనేది శక్తిమంతమైన మాధ్యమం. భారతదేశంలో ‘లాపతా లేడీస్’కు లభించిన ఆదరణ, ప్రపంచ వ్యాప్తంగా కూడా లభిస్తుందని ఆశిస్తున్నాను.– కిరణ్‌రావు -
ఆస్కార్ బరిలో లాపతా లేడీస్
బాలీవుడ్ చిత్రం ‘లాపతా లేడీస్’కు అరుదైన ఘనత దక్కింది. వచ్చే ఏడాది మార్చిలో లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న 97వ ఆస్కార్ అవార్డ్స్లోని ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ కోసం పోటీ పడేందుకు ‘లాపతా లేడీస్’ చిత్రం బరిలో నిలిచింది. భారతదేశం తరఫున ఈ సినిమాను ఆస్కార్ నామినేషన్ ఎంపిక కోసం పంపిస్తున్నట్లు ‘ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎఫ్ఎఫ్ఐ) సోమవారం ప్రకటించింది.29 చిత్రాలు పరిశీలించి ‘లాపతా లేడీస్’ని ఏకగ్రీవంగా ఇండియా ఎంట్రీగా ఆస్కార్ నామినేషన్‌కి పంపేందుకు ఎంపిక చేసినట్లు ‘ఎఫ్ఎఫ్ఐ’ కమిటీ డైరెక్టర్ ఆర్.జహ్ను బారువా తెలిపారు. కిరణ్‌రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’లో నితాన్షి గోయల్, ప్రతిభా రంతా, స్పర్శ్ శ్రీవాస్తవ్ ప్రధాన పాత్రధారులుగా, రవికిషన్ , ఛాయాకందం ఇతర పాత్రల్లో నటించారు. ఆమిర్‌ఖాన్ , కిరణ్‌రావు, జ్యోతిదేశ్ పాండే నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది సెప్టెంబరులో జరిగిన 48వ టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో తొలిసారి ప్రదర్శించబడి ప్రశంసలు అందుకుంది.ఆ తర్వాత ఈ ఏడాది మార్చి 1న థియేటర్స్‌లో విడుదలై, సూపర్‌హిట్ ఫిల్మ్‌గా నిలిచింది. 1958లో జరిగిన 30వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘మదర్ ఇండియా’, 1989లో జరిగిన 61వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘సలామ్ బాంబే’, 2002లో జరిగిన 74వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘లగాన్ ’ చిత్రాలు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ ను దక్కించుకున్నప్పటికీ అవార్డులను గెలుచుకోలేదు. గత ఏడాది ‘ఎఫ్ఎఫ్ఐ’ ఆస్కార్‌కు పంపిన మలయాళ చిత్రం ‘2018: ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో’ కూడా నామినేషన్ దక్కించుకోలేదు.తాజాగా ‘లాపతా లేడీస్’ ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ ను దక్కించుకుంటే.. 23ఏళ్ల తర్వాత ఈ విభాగంలో ఆస్కార్ నామినేషన్ ను దక్కించుకున్న భారతీయ చిత్రంగా నిలుస్తుంది. వచ్చే ఏడాది జనవరి 17న ఆస్కార్ నామినేషన్ ్సను అధికారికంగా ప్రకటించనున్న సంగతి తెలిసిందే. -
ఆస్కార్ బరిలో 'లాపతా లేడీస్'.. అధికారిక ప్రకటన
హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు తీసిన సినిమా 'లాపతా లేడీస్'. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది. 2025 ఆస్కార్ కోసం మనదేశం నుంచి అధికారికంగా ఎంపికైంది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్)స్పర్ష్ శ్రీ వాత్సవ, నితాన్షి గోయల్, ప్రతిభ ప్రధాన పాత్రలు పోషించారు. 'రేసుగుర్రం' ఫేమ్ రవికిషన్ ఇందులో కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.(ఇదీ చదవండి: 'కల్కి' సినిమాపై గరికపాటి విమర్శలు.. ఏమన్నారంటే?) -
అప్పుడు నా కల నిజం అవుతుంది : కిరణ్ రావ్
హిందీ హిట్ ఫిల్మ్ ‘లాపతా లేడీస్’ ఆస్కార్ బరిలో నిలిస్తే తన కల నిజమౌతుందని దర్శక–నిర్మాత కిరణ్ రావ్ అన్నారు. నితాన్షి గోయెల్, ప్రతిభ ప్రధాన పాత్రధారులుగా స్పర్శ్ శ్రీవాస్తవ, రవికిషన్ ఇతర కీలక పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘లాపతా లేడీస్’. ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్, జ్యోతిదేశ్ పాండే నిర్మించిన ఈ చిత్రం 2024 మార్చిలో విడుదలై, సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. మహిళా సాధికారత, సమానత్వం వంటి అంశాలతో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ‘‘ఆస్కార్‌కు ఈ సినిమాని పంపితే నా కల నిజం అవుతుంది. కానీ ఇందుకు కొన్ని విధి విధానాలు ఉన్నాయి. అయితే ఆస్కార్‌కు పంపే సినిమాలను ఎంపిక చేసేవారు మంచి చిత్రాలను ప్రోత్సహిస్తారనే నమ్మకం ఉంది’’ అని కిరణ్ రావ్ పేర్కొన్నారు. మరి... భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఆస్కార్ అవార్డ్స్లోని ఉత్తమ విదేశీ విభాగంలో ‘లాపతా లేడీస్’ ఎంపిక అవుతుందా? అసలు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) కమిటీ ఫైనల్‌గా ఆస్కార్ బరికి ఏ భారతీయ చిత్రాన్ని పంపిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక 97వ ఆస్కార్ వేడుక మార్చిలో జరగనుంది. -
ముత్యాల్లాంటి నవ్వు.. హీరోయిన్ నితాన్షీ మరింత క్యూట్‌నెస్ (ఫొటోలు)