అప్పుడు నా కల నిజం అవుతుంది : కిరణ్‌ రావ్‌ | Kiran Rao Talks About Laapataa Ladies Movie | Sakshi
Sakshi News home page

అప్పుడు నా కల నిజం అవుతుంది : కిరణ్‌ రావ్‌

Published Sun, Sep 22 2024 7:55 PM | Last Updated on Sun, Sep 22 2024 8:05 PM

Kiran Rao Talks About Laapataa Ladies Movie

హిందీ హిట్‌ ఫిల్మ్‌ ‘లాపతా లేడీస్‌’ ఆస్కార్‌ బరిలో నిలిస్తే తన కల నిజమౌతుందని దర్శక–నిర్మాత కిరణ్‌ రావ్‌ అన్నారు. నితాన్షి గోయెల్, ప్రతిభ ప్రధాన పాత్రధారులుగా స్పర్శ్‌ శ్రీవాస్తవ, రవికిషన్‌ ఇతర కీలక పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘లాపతా లేడీస్‌’. ఆమిర్‌ ఖాన్, కిరణ్‌ రావ్, జ్యోతిదేశ్‌ పాండే నిర్మించిన ఈ చిత్రం 2024 మార్చిలో విడుదలై, సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. 

మహిళా సాధికారత, సమానత్వం వంటి అంశాలతో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ‘‘ఆస్కార్‌కు ఈ సినిమాని పంపితే నా కల నిజం అవుతుంది. కానీ ఇందుకు కొన్ని విధి విధానాలు ఉన్నాయి. అయితే ఆస్కార్‌కు పంపే సినిమాలను ఎంపిక చేసేవారు మంచి చిత్రాలను ప్రోత్సహిస్తారనే నమ్మకం ఉంది’’ అని కిరణ్‌ రావ్‌ పేర్కొన్నారు. 

మరి... భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఆస్కార్‌ అవార్డ్స్‌లోని ఉత్తమ విదేశీ విభాగంలో ‘లాపతా లేడీస్‌’ ఎంపిక అవుతుందా? అసలు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎఫ్‌ఐ) కమిటీ ఫైనల్‌గా ఆస్కార్‌ బరికి ఏ భారతీయ చిత్రాన్ని పంపిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక 97వ ఆస్కార్‌ వేడుక మార్చిలో జరగనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement