Kiran Rao
-
లపతా లేడీస్ అరుదైన ఘనత.. ఏకంగా హాలీవుడ్ చిత్రాలతో పోటీ!
బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్, ఆయన మాజీ భార్య కిరణ్ రావు తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం లపతా లేడీస్. గతేడాది రిలీజైన ఈ సినిమా అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.ప్రతిష్టాత్మక జపాన్ అకాడమీ ఫిల్మ్ ప్రైజ్‌కు లపతా లేడీస్ ఎంపికైంది. ఈ ఏడాది ఈ ప్రైజ్‌కు అర్హత సాధించిన చిత్రాల్లో భారత్ నుంచి ఈ మూవీ నిలిచింది. ఈ హిట్ సినిమా ఏకంగా హాలీవుడ్ భారీ చిత్రాలైన క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్, జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్, పూర్ థింగ్స్, సివిల్ వార్ లాంటి సూపర్ హిట్ సినిమాలతో పోటీపడుతోంది. బెస్ ఇంటర్నేషనల్ మూవీ కేటగిరీ విభాగంలో లపతా లేడీస్‌ను ఎంపిక చేశారు. ఈ ఏడాది మార్చి 14న జరిగే అవార్డుల వేడుకలో ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా విజేతలను ప్రకటిస్తారు. కాగా.. విమర్శకుల ప్రశంసలు పొందిన లపాతా లేడీస్ విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లింది.కాగా.. లపతా లేడీస్ చిత్రాన్ని జియో స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కించారు. అమీర్ ఖాన్ లగాన్ (2001)చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేసిన కిరణ్ రావు తన కెరీర్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం కావడం విశేషం. 2011లో తన ధోబీ ఘాట్ అనే సినిమాతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో నితాన్షి గోయెల్, ప్రతిభా రంతా, రవి కిషన్, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్ కీలక పాత్రల్లో నటించారు.ఓపెన్ హైమర్‌తో ఢీ..కాగా.. గతేడాది ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో 'ఓపెన్ హైమర్' సత్తా చాటింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ లాంటి విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తొలిసారి 'ఓపెన్ హైమర్' అనే బయోపిక్ తీశాడు. దాదాపు మూడేళ్ల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. 2023 జూలై 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. 100 మిలియన్ డాలర్స్ పెడితే.. 1000 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే మన కరెన్సీలో రూ.7700 కోట్లకు పైమాటే. -
‘లాస్ట్ లేడీస్’ కోసం మహిళలందరూ సపోర్ట్ చేయాలి: కిరణ్ రావు
‘లాపతా లేడీస్’ పేరు ఇంగ్లిష్‌లో ‘లాస్ట్ లేడీస్’గా మారిపోయింది. స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ రంతా, ఛాయా కందం లీడ్ రోల్స్‌లో నటుడు ఆమిర్ ఖాన్ సతీమణి కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘లాపతా లేడీస్ (తప్పిపోయిన మహిళలు అని అర్థం). ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతిదేశ్ పాండే నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 1న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే వచ్చే ఏడాది అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న 97వ ఆస్కార్ అవార్డ్స్లోని ఉత్తమ విదేశీ చిత్రం నామినేషన్ కోసం ఇండియా అఫీషియల్ ఎంట్రీగా ‘లాపతా లేడీస్’ సినిమాను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసింది. కాగా ‘లాపతా లేడీస్’ అనే హిందీ టైటిల్ అంతగా రిజిస్టర్ కాదేమోనని, ఈ సినిమాకు ఇంగ్లిష్‌లో ‘లాస్ట్ లేడీస్’ అనే టైటిల్ పెట్టి, ఈ సినిమా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే అమెరికాలోని కొన్ని లొకేషన్స్‌లో ‘లాస్ట్ లేడీస్’ సినిమా ప్రత్యేక ప్రదర్శనలు వేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా కిరణ్ రావ్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ– ‘‘లాస్ట్ లేడీస్’ మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రం కాబట్టి మహిళలందరూ మా సినిమాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మంచి సందేశాత్మక చిత్రం కాబట్టి ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తుందన్న నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా కథ విన్న వెంటనే నాకు వినోదాత్మకంగా అనిపించింది. పైగా పలు ముఖ్యమైన అంశాలు ప్రస్తావించడం జరిగింది. మహిళా సాధికారిత, స్వేచ్ఛ, సమానత్వాల కోసం పోరాడుతున్న మహిళలకు పురుషులు సపోర్ట్ చేయడం అనే పాయింట్ కూడా బాగుంది. ఈ సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరించినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు ఆమీర్‌ఖాన్. -
చాలామంది తండ్రులు చేసే తప్పే ఇది..! అమీర్ ఖాన్ సైతం..
బాలీవుడ్ దర్శకురాలు, నిర్మాత కిరణ్ రావు సింగిల్ మదర్‌గా పిల్లల పెంపకం విషయంలో ఎదురయ్యే సాధకభాదల్ని గురించి ఓపెన్‌గా మాట్లాడారు. ఇటీవల కరీనా కపూర్‌తో జరిగిన విమెన్స్ వాంట్ వాంట్ అనే చాట్ షోలో కిరణ్ రావు తల్లిదండ్రులిద్దరూ పిల్లల బాధ్యతల్లో పాలుపంచుకోవడంపై చాలా ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు. అంతేగాదు సింగిల్ పేరెంట్‌గా తన అనుభవాన్ని గురించి కూడా చెప్పారు. పిల్లల విషయంలో చాలామంది తండ్రులు చేసే అతి పెద్ద తప్పు గురించి చెప్పడమే గాక అమీర్ ఖాన్ కూడా అంతే అంటూ ఆ షోలో నిజాయితీగా మాట్లాడారు. ఇంతకీ పిల్లల విషయంలో తండ్రులు చేసే తప్పు ఏంటంటే..కిరణ్ రావ్ అమీర్ ఖాన్ దంపతులకు అజాద్ అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. అమీర్ బిజీ షెడ్యూల వల్ల పిల్లలకు తగిన సమయం కేటాయించలేకపోయాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు కూడా. కిరణ్ రావు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ..మేము వివాహం చేసుకుని ఒక్కటైనప్పటికీ అమీర్ చాలా బిజీగా ఉండేవారని అన్నారు. తాము తల్లిదండ్రులుగా మారిన తర్వాత కూడా అతడి తీరులో మార్పులేదు. ఇక తాను ఒక తల్లిగా తల్లిదండ్రులిద్దరూ అందించాల్సిన ప్రేమని కొడుకు ఆజాద్‌కి తానే అందించానని అన్నారు. ఆ సమయంలో అమీర్‌కి ఆజాద్‌కి సమయం కేటాయించడం అనేది ఓ పెద్ద సమస్యాత్మకమైన నిర్ణయంగా ఉండేది. తామిద్దరం కలిసి ఉండటం వల్ల అదంతా నేనే చూసుకున్నాను. ఎప్పుడైతే 2021లో విడాకులు తీసుకున్నామో అప్పుడు ఆజాద్ విషయం సున్నితమైన అంశంగా మారిపోయింది. ఇక అమీర్ కూడా అజాద్ విషయంలో తానేం చేసింది గ్రహించాడు. నిజానికి చాలామంది తండ్రులు ఇలానే ఉంటున్నారు. పిల్లల స్కూల్‌కి సంబంధించిన విషయాలకు దూరంగా ఉంటారు. అదంతా తల్లి బాధ్యత అన్నట్లుగా వదిలేస్తారు. అని భావోద్వేగంగా మాట్లాడారు కిరణ్ రావ్.సింగిల్ పేరెంట్‌గా..తనకు తన కొడుకుతో గడిపే క్షణాలన్నీ మంచిరోజులే అన్నారు. అతడు తనని నవ్వించే యత్నం చేస్తుంటాడని అన్నారు. తనను ఒక్క క్షణం కూడా నిశబ్దంగా ఉండనివ్వడని కొడుకు ఆజాద్ గురించి సంతోషంగా చెప్పుకొచ్చారు. అలాగే ఈ సమయంలో తన తల్లిదండ్రులు తనకు పూర్తి మద్దుతగా నిలిచారని అన్నారు. వారి సహాయంతోనే మరింత సమర్థవంతంగా తన పిల్లవాడిని పెంచగులుగుతన్నాని అన్నారు. అయితే తల్లులు ఎప్పుడూ తండ్రుల్లా వారి బాధ్యతల విషయంలో తప్పించుకోరు. ఒకరకంగా ఇలా.. తల్లి పిల్లల మధ్య స్ట్రాంగ్ అనుబంధం ఏర్పడుతుందన్నారు. అంతేగాదు భవిష్యత్తులో సింగిల్ మదర్లకు వారి పిల్లలే పూర్తి ఆసరాగా ఉండి వారి బాగోగులను చూసుకుంటారని చాలా నమ్మకంగా అన్నారు. అయితే సింగిల్ మదర్ రోల్‌ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నారు. ముఖ్యంగా పిల్లలకు తండ్రి లేని లోటుని కనిపించనీయకుండా జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యం అని కిరణ్ రావ్ చెప్పుకొచ్చారు. కాగా, గతంలో అమీర్ రియా చక్రవర్తితో జరిగిన పోడ్కాస్ట్లో "నా బిజీ షెడ్యూల్ కారణంగా పిల్లల కోసం సమయం కేటాయించలేకపోయాను. అందువల్లే ఇరా, ఇరా డిప్రెషన్‌తో బాధపడిందని అన్నారు. అయితే ఆమె ఇప్పుడు మెరుగ్గా ఉంది. ఇక జునైద్ తన కెరీర్‌ని ప్రారంభించాడు. అతడు కూడా నేను లేకుండానే గడిపాడు. కనీసం ఆజాద్ అయినా అలాకాకుడదని భావించి సమయం కేటాయించే ప్రయత్నం చేస్తున్నా. అయితే నాకు కుటుంబం పట్ల బలమైన అనుభూతి ఉంది, కానీ ప్రేక్షకుల మనసుని గెలుచుకునే హీరో అవ్వాలనే తాపత్రయంలో ఫ్యామిలీకి దూరం అయ్యాను." అని అమీర్ చెప్పారు.(చదవండి: 'తల్లులు' డోంట్ వర్రీ!..ప్రసవానంతరం జస్ట్ 34 రోజుల్లోనే..!) -
మహిళ తనలోని ఖాళీలను కనుక్కోవాలి!
‘జెండర్‌ని కాదు పితృస్వామ్య వ్యవస్థను సవాల్ చేసేలా సినిమా తీయాలనుకున్నాను’ అన్నారు చిత్ర నిర్మాత, స్క్రీన్ రైటర్, దర్శకురాలు కిరణ్‌రావు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో బుధవారం జరిగిన ‘మంథన్ సమ్వాద్’ చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు ఆమె. ఇటీవల ఆమె దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’ భారతదేశం నుంచి ఆస్కార్‌కి అధికారికంగా నామినేట్ అయిన సందర్భంగా జెండర్ దృష్టి కోణం నుంచి ఎన్నో విషయాలను పంచుకున్నారు.‘‘మహిళలు తమలో అంతర్గతంగా ఉండే ఖాళీలను కనుక్కోవాలనే ఆలోచనను ‘లాపతా లేడీస్’ చిత్రం ద్వారా చెప్పే ప్రయత్నం చేశాను. ఇది నా రెండవ చిత్రం. జెండర్ తేడా లేకుండా అందరి నుంచి మంచి ఆదరణ లభించడం ఎంతో సంతోషంగా ఉంది.మెరుగైన కృషిమహిళల కోసం వారి ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చే విషయంలో రచనల పరంగా కొంత లోటు ఉంది. ఈ లోటు ను భర్తీ చేయడానికి చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. నా మొదటి సినిమా ‘ధోబీ ఘాట్’ నుంచి చాలా నేర్చుకున్నాను. ఆ వర్క్ నెక్ట్స్ సినిమాను మరింత మెరుగ్గా మార్చింది.ఆడ–మగ .. వేరుగా చూడనుఆడవాళ్ల మానసిక వేదనలు, వారికి సంబంధించిన సమస్యలు చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. అయితే, మగవారికి సంబంధించి నవి కూడా అంతకన్నా సెన్సిటివ్ గా ఉండటం చూస్తుంటాం. నేను ఆడ–మగ అని జెండర్ ప్రకారంగా వీళ్లు తక్కువ, వాళ్లు ఎక్కువ అని చెప్పలేను. మగవాళ్లు కూడా మహిళల కోణం నుంచి సెన్సిటివ్ విషయాలను రాయగలరు, చిత్రాలు తీయగలరు. మొన్నామధ్య వచ్చిన ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ను స్త్రీ కోణం నుంచి పురుష దర్శకుడే మనకు పరిచయం చేశారు. నేను ఒంటరితల్లిగా మా అబ్బాయి మనోభావాలను కూడా గమనిస్తుంటాను కాబట్టి ఆడ–మగ అనే ఆలోచనతో కాకుండా మానవత్వం అనే కోణం నుంచే చూస్తాను.పితృస్వామ్యాన్ని సవాల్ చేస్తూ! మహిళల కోణం నుంచి చూస్తే ముఖ్యంగా అమ్మాయిలకు వారి కలలను సాధించుకునే విషయంలో మన దగ్గర కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రధానమైనది పితృస్వామ్య వ్యవస్థ. ఆడపిల్ల సొంతంగా ఎదగడం కన్నా, పెళ్లి చేసేస్తే బాధ్యత తీరుతుంది అనుకుంటారు. ఆ కోణం నుంచి ఈ ‘లాపతా లేడీస్’ కథను చూపించాం. ఇద్దరు నవ వధువులు, భర్తలతో అత్తవారింటికి రైలులో బయల్దేరుతారు. మేలి ముసుగులు నిండా కప్పుకున్న వధువులు ఒక స్టేషన్లో దిగాల్సినది మరోచోట దిగుతారు. వాళ్లిద్దరిని ఇళ్లలోని వారు వెతుకుతుంటారు. ఎవరి కంటా పడకుండా ఒక వధువు తనకై తానుగా ఒక కొత్త ప్రపంచాన్ని ఏర్పరుచు కుంటుంది. మరొక వధువు చుట్టూ ఉన్న పితృస్వామ్యాన్ని సవాల్ చేస్తుంది. బరువైన సామాజిక సమస్యలను ప్రస్తావించిన్పటికీ, హాస్యాన్ని కూడా జత చేయడంతో అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరించాం. వివాహం చేసుకోబోయే యువతులైనా, చదువుకోవడానికి చేసే ప్రయత్నమైనా వాళ్లు ఎదుర్కొనే అనేక రకాల పరిస్థితులు, కొత్త మార్గాన్ని అన్వేషించడానికి, సమస్యలను పరిష్కరించుకునే తీరు ఆలోచింపజేస్తుంది. మహిళలు వయసు పైబడినవారయినా సరే...మగవారిపైన ఆధారపడకుండా ఆర్థిక స్వాతంత్య్రాన్ని పొందాలి. అందుకు తగిన నైపుణ్యాలను పెంచుకోవాలి’’ అని అన్నారు.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ ఫెమినిజం మెరుపు‘లాపతా లేడీస్’ అని టైటిల్ చూసి ఫెమినిజం ఫైర్ ఉంటుంది కాబోలు అనుకోలేరు. కానీ, దాని తాలూకు ఒక మెరుపు కనిపిస్తుంది. అందువల్ల మగవారి నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా కథనం పితృస్వామానికి విరుద్ధమే కానీ ఒక జెండర్‌కు మాత్రమే సంబంధించింది కాదు. నేను వివాహ వ్యవస్థకు అస్సలు వ్యతిరేకం కాదు. నిజానికి పెళ్లయినా, కుటుంబంలో అయినా సరే స్త్రీలు తమలోని ఖాళీలను కనుక్కొనేలా ్ర΄ోత్సహించే విధంగా ఈ కథను చెప్పాలనుకున్నాను. అంతేకానీ ఏదో భారీ విప్లవాన్ని తీసుకొచ్చి సంబంధాలను విచ్ఛిన్నం చేయాలనుకోలేదు.’’ -
ఆస్కార్ అడ్రస్‌కు లాపతా లేడీస్
‘నాకు కుట్లు అల్లికలు, వంట, పాటలు, భజన వచ్చు. అమ్మ నేర్పింది’ అని కొత్త పెళ్లికూతురు అంటే ‘అత్తగారింటికి సొంతగా వెళ్లడం నేర్పలేదా?’ అని అడుగుతుంది ఒక పెద్దావిడ. అత్తగారి ఊరు ఏదో దానికి ఎలా వెళ్లాలో తెలియని స్థితి నుంచి తామేమిటో తమకు ఏం కావాలో తెలుసుకునే చైతన్యం వరకూ సాగే ఇద్దరు పల్లెటూరి నవ వధువుల కథ ‘లాపతా లేడీస్’ ఆస్కార్– 2025కు మన దేశం నుంచి అఫిషియల్ ఎంట్రీగా వెళ్లనుంది. ‘‘సినిమాలు చాలానే ఉన్నాయి. కాని భారతీయతను ప్రతిబింబించే సినిమాగా ‘లాపతా లేడీస్’ ఏకగ్రీవంగా ఎంపికైంది’’ అని కమిటీ తెలిపింది. మహిళా డైరెక్టర్ కిరణ్ రావు తీసిన మహిళా గాథ ఇది.‘పితృస్వామ్యానికి వ్యతిరేక పదం మాతృస్వామ్యం అని చాలామంది అనుకుంటారు. కాని పితృస్వామ్యానికి వ్యతిరేక పదం సమానత్వం. మనకు ఒకరు ఆధిపత్యం వహించే పితృస్వామ్యం వద్దు.. మాతృస్వామ్యం వద్దు... అందరూ సమానంగా జీవించే వ్యవస్థే కావాల్సింది’ అంటుంది కిరణ్ రావు.ఆమె దర్శకత్వంలో మార్చి 2024లో విడుదలైన ‘లాపతా లేడీస్’ ఆస్కార్ కోసం ‘బెస్ట్ ఫారిన్ ఫిల్మ్’ కేటగిరీలో 2025 సంవత్సరానికిగాను మన దేశం నుంచి అఫిషియల్ ఎంట్రీగా వెళ్లనుంది. ‘పతా’ అంటే అడ్రస్. లాపతా అంటే అడ్రస్ లేకపోవడం. లేకుండాపోవడం. సరిగా చె΄్పాలంటే మన దేశంలో పెళ్లయ్యాక ఆడపిల్ల అత్తగారింటికి వెళ్లి తన గుర్తింపును తాను కోల్పోవడం.గుర్తింపు నుంచి తప్పిపొడం... ఆకాంక్షలను చంపుకోవడం... ఇదీ కథ. ఆస్కార్ కమిటీకి ఈ సినిమా నచ్చి నామినేషన్ పొందితే ఒక ఘనత. ఇక ఆస్కార్ సాధిస్తే మరో ఘనత. ‘లాపతా లేడీస్’ నిర్మాత ఆమిర్ ఖాన్ గతంలో నిర్మించి నటించిన ‘లగాన్’కు కొద్దిలో ఆస్కార్ తప్పింది. ఈసారి ఆస్కార్ గెలవడానికి గట్టి అవకాశాలున్నాయని సినిమా విమర్శకులు భావిస్తున్నారు. ముందడుగును అడ్డుకునే కపట నాటకం‘లాపతా లేడీస్’లో ఇద్దరు వధువులు అత్తగారింటికి వెళుతూ తప్పిపోతారు. ఒక వధువు మరో పెళ్లికొడుకుతో తనకు సంబంధం లేని అత్తగారింటికి చేరితే ఇంకో వధువు పారటున వేరే స్టేషన్లో చిక్కుకు΄ోతుంది. రైల్వేస్టేషన్లో ఉన్న వధువుకు తన అత్తగారి ఊరు పేరేమిటో తెలియదు. ఎలా వెళ్లాలో తెలియదు. సొంత ఊరి పేరు చెబుతుంది కానీ భర్త లేకుండా తిరిగి పుట్టింటికి చేరడం తల వంపులని వెళ్లడానికి ఇష్టపడదు.‘మంచి కుటుంబాల నుంచి వచ్చిన ఆడపిల్లలు అలా చేయరు’ అంటుంది స్టేషన్లో క్యాంటీన్ నడుపుతున్న అవ్వతో. అప్పుడా అవ్వ ‘మన దేశంలో ఇదే పెద్ద కపట నాటకం. మంచి కుటుంబాల నుంచి వచ్చిన ఆడపిల్లలు అది చేయకూడదు.. ఇది చేయకూడదు అని అసలు ఏదీ చేయనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటారు’ అంటుంది. అయితే ఆ వధువు వెరవకుండా ఆ స్టేషన్లో ఆ అవ్వతోనే ఉంటూ అక్కడే పని చేసుకుంటూ భర్త కోసం ఎదురు చూస్తూ మెల్లగా ఆత్వవిశ్వాసం నింపుకుంటుంది. మరో వైపు వేరే వరుడితో వెళ్లిన వధువు ఆ అత్తగారింటిలో (వాళ్లంతా అసలు కోడలి కోసం అంటే రైల్వే స్టేషన్లో ఉండిపోయిన కోడలి కోసం వెతుక్కుంటూ ఉండగా) ఆశ్రయం పొంది పై చదువులు చదవడానికి తాను అనుకున్న విధంగా పురోగమిస్తుంది. సినిమా చివరలో ఒక వధువు తన భర్తను చేరుకోగా మరో వధువు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న భర్తను కాదని పై చదువులకు వెళ్లిపోతుంది. ఈ మొత్తం కథలో దర్శకురాలు కిరణ్ రావు ఎన్నో ప్రశ్నలు ప్రేక్షకుల ముందు ఉంచుతుంది. మన దేశంలో స్త్రీలను పరదాలు, ఘోషాలు, ఘూంఘట్ల పేరుతో అవిద్యలో ఉంచి వారికి లోకం తెలియనివ్వకుండా కనీసం తమ వ్యక్తిత్వ చిరునామాను నిర్మించుకోనివ్వకుండా ఎలా పరాధీనంలో (పురుషుడి మీద ఆధారపడేలా) ఉంచుతున్నారో చెబుతుంది. స్త్రీలు స్వతంత్రంగా జీవించగలరు, ఆత్మవిశ్వాసంతో బతగ్గలరు వారినలా బతకనివ్వండి అంటుందీ సినిమా. పెద్ద హిట్నాలుగైదు కోట్లతో నిర్మించిన ‘లాపతా లేడీస్’ దాదాపు 25 కోట్ల రూపాయలు రాబట్టింది. ఒకవైపు థియేటర్లలో ఆడుతుండగానే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయినా జనం థియేటర్లలో చూడటానికి వెళ్లడం విశేషం. చాలా మంచి ప్రశంసలు ఈ సినిమాకు దక్కాయి. రైల్వే స్టేషన్లో అవ్వగా నటించిన ఛాయా కదమ్‌కు, ఇన్స్పెక్టర్గా నటించిన రవికిషన్‌కు మంచి పేరు వచ్చింది. మిగిలిన కొత్త నటీనటులకు కూడా మంచి గుర్తింపు వచ్చింది.భారీపోటీలోఆస్కార్ అఫిషియల్ ఎంట్రీ కోసం చాలా సినిమాలుపోటీ పడ్డాయి. తెలుగు నుంచి కల్కి, హనుమ్యాన్, మంగళవారం ఉన్నాయి. తమిళం నుంచి ‘మహరాజా’, ‘తంగలాన్’ ఉన్నాయి. జాతీయ అవార్డు పొందిన ‘ఆట్టం’ (మలయాళం), కేన్స్ అవార్డు ΄పొదిన ‘ఆల్ వియ్ ఇమేజిన్ యాజ్ లైట్’ కూడా ఉన్నాయి. హిందీ నుంచి ‘యానిమల్’, ‘శ్రీకాంత్’పోటీ పడ్డాయి. కాని ‘లాపతా లేడీస్’లోని అంతర్గత వేదన, మార్పు కోరే నివేదన దానికి ఆస్కార్‌కు వెళ్లే యోగ్యత కల్పించింది. ఇది మాకు దక్కిన గౌరవంఆస్కార్ నామినేషన్ కోసం ఫిల్మ్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ మా ‘లపతా లేడీస్’ సినిమాను ఎంపిక చేయడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ నామినేషన్‌కు మాతో పాటు మరికొన్ని అద్భుతమైన భారతీయ సినిమాలుపోటీ పడ్డాయి. అయితే కమిటీ మా చిత్రాన్ని నమ్మినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఖండాంతరాలు దాటేందుకు, ప్రజల హృదయాలతో కనెక్ట్ కావడానికి సినిమా అనేది శక్తిమంతమైన మాధ్యమం. భారతదేశంలో ‘లాపతా లేడీస్’కు లభించిన ఆదరణ, ప్రపంచ వ్యాప్తంగా కూడా లభిస్తుందని ఆశిస్తున్నాను.– కిరణ్‌రావు -
ఆస్కార్ బరిలో 'లాపతా లేడీస్'.. అధికారిక ప్రకటన
హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు తీసిన సినిమా 'లాపతా లేడీస్'. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది. 2025 ఆస్కార్ కోసం మనదేశం నుంచి అధికారికంగా ఎంపికైంది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్)స్పర్ష్ శ్రీ వాత్సవ, నితాన్షి గోయల్, ప్రతిభ ప్రధాన పాత్రలు పోషించారు. 'రేసుగుర్రం' ఫేమ్ రవికిషన్ ఇందులో కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.(ఇదీ చదవండి: 'కల్కి' సినిమాపై గరికపాటి విమర్శలు.. ఏమన్నారంటే?) -
అప్పుడు నా కల నిజం అవుతుంది : కిరణ్ రావ్
హిందీ హిట్ ఫిల్మ్ ‘లాపతా లేడీస్’ ఆస్కార్ బరిలో నిలిస్తే తన కల నిజమౌతుందని దర్శక–నిర్మాత కిరణ్ రావ్ అన్నారు. నితాన్షి గోయెల్, ప్రతిభ ప్రధాన పాత్రధారులుగా స్పర్శ్ శ్రీవాస్తవ, రవికిషన్ ఇతర కీలక పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘లాపతా లేడీస్’. ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్, జ్యోతిదేశ్ పాండే నిర్మించిన ఈ చిత్రం 2024 మార్చిలో విడుదలై, సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. మహిళా సాధికారత, సమానత్వం వంటి అంశాలతో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ‘‘ఆస్కార్‌కు ఈ సినిమాని పంపితే నా కల నిజం అవుతుంది. కానీ ఇందుకు కొన్ని విధి విధానాలు ఉన్నాయి. అయితే ఆస్కార్‌కు పంపే సినిమాలను ఎంపిక చేసేవారు మంచి చిత్రాలను ప్రోత్సహిస్తారనే నమ్మకం ఉంది’’ అని కిరణ్ రావ్ పేర్కొన్నారు. మరి... భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఆస్కార్ అవార్డ్స్లోని ఉత్తమ విదేశీ విభాగంలో ‘లాపతా లేడీస్’ ఎంపిక అవుతుందా? అసలు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) కమిటీ ఫైనల్‌గా ఆస్కార్ బరికి ఏ భారతీయ చిత్రాన్ని పంపిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక 97వ ఆస్కార్ వేడుక మార్చిలో జరగనుంది. -
సుప్రీంకోర్టులో 'లాపతా లేడీస్' చిత్ర ప్రదర్శన
భారత సర్వోన్నత న్యాయస్థానం 75వ వార్షికోత్సవం పురస్కరించుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలను జరుపుకుంటుంది. దీంతో కోర్టు ఆవరణలోని ఆడిటోరియంలో బాలీవుడ్ చిత్రాన్ని నేడు ప్రదర్శించనున్నారు. లింగ సమానత్వం ఇతివృత్తంగా రూపొందించిన 'లాపతా లేడీస్' చిత్రాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రీ సభ్యులు ఈ రోజు సాయంత్రం 4.15 గంటలకు చూడనున్నారు. ఇలాంటి అవకాశం దక్కించుకన్న ఏకైక సినిమాగా లాపతా లేడీస్‌కు దక్కింది.సుప్రీమ్ కోర్టు ఆవరణలో ప్రదర్శిస్తున్న ఈ సినిమా ఈ స్క్రీనింగ్‌కు చిత్ర నిర్మాత, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌తో పాటు చిత్ర దర్శకులు కిరణ్ రావు కూడా హాజరుకానుంది. లింగ సమానత్వం ఇతివృత్తంగా రూపొందిన ఈ సినిమా స్క్రీనింగ్ సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కాంప్లెక్స్‌లోని ఆడిటోరియంలో జరగనుంది. సమాజంలో లింగ సమానత్వం అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి నొక్కిచెప్పడంలో భాగంగా ఈ స్క్రీనింగ్ జరగనుంది. సుప్రీంకోర్టు స్థాపన జరిగిన 75వ సంవత్సరంలో నిర్వహించే కార్యక్రమాలలో భాగంగా ఈ స్క్రీనింగ్ ఉంటుంది. రిజిస్ట్రీ అధికారులను కూడా సినిమాకు ఆహ్వానించారు. ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది.కిరణ్ రావు, అమీర్ ఖాన్, జ్యోతి దేశ్ పాండే 'లాపతా లేడీస్' చిత్రాన్ని నిర్మించారు. మార్చి 1వ తేదీన ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో నితాన్షి గోయెల్, ప్రతిభా రంతా, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్, రవి కిషన్ నటించారు. రామ్ సంపత్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. కొత్తగా పెళ్లయిన ఇద్దరు గ్రామీణ ప్రాంతానికి చెందిన వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 48వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం ప్రదర్శితమై సినీ ప్రేమికుల ప్రశంసలు అందుకుంది. -
ఈనాడులో నా పై చేసిన ఆరోపణలు నిరూపిస్తే.. ఎంవీవీ సత్యనారాయణ సవాల్
-
సినిమా దారుణంగా ఫ్లాప్.. ఆ బాధ్యత నాదే: దర్శకురాలు
లాపతా లేడీస్.. ఓటీటీలో హిట్ బొమ్మ. కానీ బాక్సాఫీస్ దగ్గరే ఫ్లాప్‌గా నిలిచింది. మార్చిలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.27.66 కోట్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఫలితం గురించి దర్శకురాలు కిరణ్ రావు స్పందించింది. 'ఒక రకంగా చెప్పాలంటే ధోబి ఘాట్, లాపతా లేడీస్.. ఈ రెండూ బాక్సాఫీస్ వద్ద మెరుగైన ఫలితాల్ని రాబట్టలేకపోయాయి. బిజినెస్ జరగలేదుపద్నాలుగేళ్ల క్రితం వచ్చిన ధోబి ఘాట్ మూవీకి ఆ కాలంలో ఓ మోస్తరు బిజినెస్ జరిగింది. ఇన్నేళ్ల తర్వాత వచ్చిన లాపతా లేడీస్ ఆ మూవీ కంటే వెనకబడిపోయింది. అంటే ఒకరకంగా ఫ్లాప్ అయినట్లేగా! కలెక్షన్ల పరంగా చూసినా సక్సెస్ కాలేకపోయింది. వందల కోట్లు కాదు కదా కనీసం రూ.30 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఫలితాలు ఇలా రావడానికి పూర్తి బాధ్యత నాదే!' అని చెప్పుకొచ్చింది.ఆ ఓటీటీలో..కాగా లాపతా లేడీస్ విషయానికి వస్తే.. నితన్షి గోయల్, ప్రతిభ రంత, స్పర్ష్ శ్రీవాత్సవ, రవి కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య, దర్శకనిర్మాత కిరణ్‌రావు డైరెక్ట్ చేసింది. కిరణ్ రావు, ఆమిర్ ఖాన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.చదవండి: అశ్విన్ కెరీర్లో శివం భజే నిలిచిపోతుంది: విశ్వక్ సేన్ -
విడాకులు తీసుకున్నా.. కానీ హ్యాపీగానే ఉన్నా: స్టార్ హీరో భార్య
బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఆమిర్ ఖాన్ ఒకరు. కొన్నేళ్ల క్రితం వరకు అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ 'లాల్ సింగ్ చద్దా' ఘోరమైన డిజాస్టర్ కావడంతో తాత్కాలికంగా యాక్టింగ్ పక్కనబెట్టేశాడు. ఇక ఈ మూవీ షూటింగ్ టైంలోనే భార్య కిరణ్ రావ్ నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇది జరిగి దాదాపు మూడేళ్లు అవుతున్నా సరే కిరణ్ ఇంకా ఆ జ్ఞాపకాల్లో ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డివోర్స్ తీసుకున్నా కానీ తను సంతోషంగానే ఉన్నానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)'మనం ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాం. అలానే బంధాలు అనేవి కొత్త రూపు సంతరించుకోవాలి. ఆమిర్ నా జీవితంలోకి రాకముందు నేను చాలా ఏళ్లపాటు ఒంటరిగానే ఉన్నాను. ఆ ఒంటరితనాన్ని నేను ఎంజాయ్ చేశా. కానీ ఇప్పుడు నాకు ఆజాద్ (కొడుకు) తోడుగా ఉన్నాడు. కాబట్టి నేను ఒంటరి కాదు. చాలామంది విడాకులు తీసుకున్నా తర్వాత ఒంటరిగా ఉండలేక సతమతమవుతుంటారు. నాకు ఆ విషయంలో భయం లేదు. ఎందుకంటే ఇరు కుటుంబాలు నాకు ఇప్పటికీ అండగా ఉన్నాయి. చెప్పాలంటే ఇది సంతోషకరమైన విడాకులు' అని కిరణ్ రావ్ చెప్పుకొచ్చింది.కిరణ్ రావ్ ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. 'యానిమల్' రిలీజ్ టైంలో పరోక్షంగా మూవీపై సెటైర్ వేశారు. దీంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈమెకు కౌంటర్ ఇచ్చేశాడు. దీంతో ఈమె సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన 'లాపతా లేడీస్'.. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో బెస్ట్ అని చెప్పొచ్చు. కొత్తగా పెళ్లయిన ఓ అమ్మాయి, భర్త నుంచి తప్పిపోతే ఏం జరిగిందనేదే స్టోరీ. ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు మరోసారి తన విడాకులు గురించి మాట్లాడి వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: 'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
విడిపోయినా కలిసికట్టుగానే.. మాజీ భార్యతో హీరో ఫన్డే
భార్యాభర్తలు విడాకులు తీసుకున్నాక ఒకరి ముఖం మరొకరు చూడటానికే ఇష్టపడరు. అలాంటిది సన్నిహితంగా మెదులుతారా? సమస్యే లేదు! కానీ బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, దర్శకురాలు కిరణ్‌రావు మాత్రం విడిపోయినా సరే దంపతుల్లా కలిసి షికార్లకు, హాలీడే ట్రిప్పులకు వెళ్తున్నారు. వీళ్లను చూసిన వారెవరూ డివోర్స్డ్ కపుల్ అనుకోనే అనుకోరు.వీరిద్దరూ తమ కుమారుడు ఆజాద్‌తో కలిసి జూన్ 30న బయటకు వెళ్లారు. సండేను ఫండేగా ఎంజాయ్ చేసిన వీళ్లు రావ్- ఖాన్ హాలీడే అని రాసుకొచ్చారు. ఫ్రెండ్స్‌తో కలిసి ఓ ఫోటోల కూడా దిగారు. ఇకపోతే ఆమిర్ ఖాన్ ఇటీవలే తన తల్లి జీనత్ హుస్సేన్ 90వ బర్త్‌డే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు. ఈ పుట్టినరోజు వేడుకలు స్పెషల్‌గా ఉండాలని బంధువులు, జీనత్ స్నేహితుల ఇంటికి వెళ్లి మరీ సెలబ్రేషన్స్‌కు ఆహ్వానించాడు. అలా జీనత్ బర్త్‌డే కాస్తా ఆత్మీయ సమ్మేళనంగా మారింది. ఈ వేడుకల్లో ఆమిర్ ఇద్దరు మాజీ భార్యలు కిరణ్ రావు, రీనా దత్తా కూడా ఉన్నారు.చదవండి: ఈ కుర్రాడ్ని గుర్తుపట్టారా? ప్రముఖ నిర్మాత అల్లుడు, టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ -
రెంట్ కోసం ఉద్యోగం చేయాల్సి వచ్చింది.. స్టార్ హీరో మాజీ భార్య!
బాలీవుడ్ డైరెక్టర్ కిరణ్ రావు ఇటీవల లపత్తా లేడీస్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం ఓటీటీలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఏకంగా రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా బ్లాక్‌బస్టర్ మూవీని దాటేసింది. కొద్ది రోజుల్లోనే టాప్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అమిర్ ఖాన్ మాజీ భార్య అయిన కిరణ్ రావు 2010లో ధోబీ ఘాట్ మూవీతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె ఇండస్ట్రీలో తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకున్నారు. ముంబయిలో బతికేందుకు చాలా ఉద్యోగాలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. అధిక జీవన వ్యయాన్ని తట్టుకునేందుకు రెండు, మూడు ఉద్యోగాలు చేశానని వెల్లడించారు.కిరణ్ రావు మాట్లాడుతూ..'ముంబయిలో ఖర్చులు ఎక్కువ కావడంతో చాలా ఉద్యోగాలు చేశా. కేవలం ఇంటి అద్దె కోసమే అడ్వర్టైజింగ్ సంస్థల్లో పనిచేశా. లగాన్ లాంటి ఫీచర్ ఫిల్మ్‌కు పని చేసినప్పుడు నాకు ఎలాంటి డబ్బులు రాలేదు. అడ్వర్టైజింగ్ జాబ్స్‌తో వచ్చే డబ్బుతోనే ముంబయిలో నివసించా. ఆ ఉద్యోగాల వల్లే కంప్యూటర్లు, కారు వంటి ఖరీదైన వస్తువులు కొన్నా. మా నాన్న నుంచి లక్ష రూపాయలకు మొదటి కారు కొన్నా' అని తెలిపింది. కాగా.. కిరణ్ రావు.. హీరో అమిర్ ఖాన్‌కు పెళ్లైన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత వీరిద్దరు విడిపోయారు. -
లపతా లేడీస్ అచ్చం నా సినిమాలా ఉంది: డైరెక్టర్ తీవ్ర ఆరోపణలు
అమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం లపతా లేడీస్. థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి టాక్ రావడంతో ఓటీటీలో దుమ్ములేపుతోంది. ఇటీవలే యానిమల్ చిత్రాన్ని దాటేసి అత్యధిక వ్యూయర్షిప్ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు అమిర్ ఖాన్ కూడా నిర్మాతగా ఉన్నారు. అయితే సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోన్న ఈ సినిమాపై ప్రముఖ డైరెక్టర్, జాతీయ అవార్డ్ గ్రహీత అనంత్ మహదేవన్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. ఈ సినిమాలో సీన్స్ అచ్చం గున్గట్ కే పట్ ఖోల్ లాగే ఉన్నాయని అన్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనంత్ మహదేవన్ మాట్లాడుతూ.. 'లపతా లేడీస్ చూశా.. ప్రారంభం నుంచి సినిమాలో చాలా సీన్స్ ఓకేలా ఉన్నాయి. మా సినిమాలో సిటీకి చెందిన ఓ అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి గ్రామానికి వెళ్తాడు. ఘున్‌ఘట్ రైల్వే స్టేషన్లో వధువును బెంచ్‌పై వేచి ఉండమని చెప్పి బయటికి వెళ్తాడు. ఆ తర్వాత తిరిగి వచ్చి మరో వధువుతో చేరతాడు. ఆ మహిళ ఘున్ఘట్లో ఉన్నందున పోలీసులు ఆమె ఫోటోను చూసే సన్నివేశం నా సినిమాలో ఉంది. ఇందులో పోలీసు పాత్రలో మరొకరు ఉన్నారు అంతే. మిగిలినదంతా సేమ్ టూ సే మ్. అంతే కాకుండా రైల్వే స్టేషన్లో వధువు ముసుగుతో కప్పి ఉన్న సీన్ అంతా మా సినిమాలాగే ఉంది.' అని అన్నారు. కొన్ని నెలల క్రితం వరకు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న ఘున్‌ఘట్ కే పట్ ఖోల్ చిత్రం ఇప్పుడు లేదన్నారు.స్పందించిన రైటర్లపతా లేడీస్ కథ రాసిన బిప్లబ్ గోస్వామి ఈ విషయంపై స్పందించారు. నేను దశాబ్దం క్రితమే ఈ కథ రాశానని తెలిపారు. నా కథ, స్క్రిప్ట్, డైలాగ్స్, క్యారెక్టరజేషన్, సీన్స్ అన్నీ వంద శాతం ఒరిజినల్‌గా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కథను ఎక్కడి నుంచి స్ఫూర్తి పొందలేదని అన్నారు. అంతేకాకుండా అనంత్ మహదేవన్ జీ సినిమాని చూడలేదని వెల్లడించారు. ఈ చిత్రాన్ని 2001లో జరిగిన లపాతా లేడీస్ రైలు ప్రయాణంలో విడిపోయే ఇద్దరు యువ వధువుల కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, కిండ్లింగ్ పిక్చర్స్, జియో స్టూడియోస్ బ్యానర్‌పై అమీర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే నిర్మించారు. ఈ చిత్రం మార్చి 1న థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతోంది. -
కేవలం రూ.4 కోట్ల సినిమా.. నెల రోజుల్లోనే యానిమల్‌ను దాటేసి!
అమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన చిత్రం లపతా లేడీస్. ఈ చిత్ర నిర్మాతల్లో అమిర్ ఖాన్ కూడా ఉన్నారు. ఈ చిత్రం మార్చి 1న థియేటర్లలో రిలీజ్ అయింది. తక్కువ బడ్జెట్‌తో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.20 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకున్న లాపతా లేడీస్ గత నెల 26న ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చింది. ఈ చిత్రానికి హిట్ టాక్ రావడంతో ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్రం సరికొత్త రికార్డ్ సృష్టించింది. సందీప్ రెడ్డి వంగా చిత్రం యానిమల్‌ను అధిగమించింది. కేవలం 30 రోజుల్లోనే రికార్డ్ స్థాయి వ్యూయర్షిప్ను సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం రికార్డు స్థాయిలో 13.8 మిలియన్ వ్యూస్ సాధించింది. కేవలం నెల రోజుల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని కిరణ్ రావు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్నారు.ఇదిలా ఉంటే.. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సందీప్ రెడ్డి, రణ్‌బీర్ కపూర్ చిత్రం యానిమల్ ఇప్పటివరకు కేవలం 13.6 మిలియన్ వ్యూస్ మాత్రమే సాధించింది. జనవరి 26న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన యానిమల్ ఈ మైలురాయిని చేరుకునేందుకు నాలుగు నెలల సమయం పట్టింది. కాగా.. గతేడాది డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన యానిమల్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.కాగా.. లాపతా లేడీస్ చిత్రంలో నితాశీ గోయల్, స్పర్శ్ శ్రీవాత్సవ్, ప్రతిభా రత్న, ఛాయా కదమ్, రవికిషన్ ప్రధాన పాత్రలు పోషించారు. గీతా అగర్వాల్ శర్మ, సతేంద్ర సోనీ, భాస్కర్ ఝా, దావూద్ హుస్సేన్ నటించారు. ఈ సినిమా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో 2023 సెప్టెంబర్‌లోనే ప్రదర్శితమైంది. ఆ తర్వాతనే ఈ ఏడాది మార్చి 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. కాగా.. సందీప్ రెడ్డి వంగా యానిమల్ గురించి గతంలో కిరణ్ రావు మాట్లాడారు. సందీప్ వంగా సినిమాలను ఎప్పుడూ ప్రత్యేకించి విమర్శలు చేయలేదని ఆమె అన్నారు. అతని సినిమాలను నేను చూడలేదు.. అందుకే కామెంట్స్ చేయడం లేదన్నారు. నేను తరచుగా స్త్రీ ద్వేషం, తెరపై మహిళల ప్రాతినిధ్యం గురించి మాట్లాడుతున్నట్లు తెలిపారు. చాలా సార్లు మహిళల గురించి మాట్లాడాను.. కానీ నేను ఏ సినిమా పేరును ప్రస్తావించలేదని వెల్లడించారు. ఎందుకంటే నేను పోరాటం చేసేది సినిమాల గురించి కాదని.. మహిళల సమస్యలపై మాత్రమేనని కిరణ్ రావు పేర్కొన్నారు. -
'స్టార్ హీరోతో లవ్.. పేరెంట్స్ బలవంతం వల్లే పెళ్లి చేసుకున్నా'
లవ్ మ్యారేజ్.. అరేంజ్డ్ మ్యారేజ్.. దాదాపు ఈ రెండే అందరికీ తెలుసు.. అయితే సహజీవనం చేశాకే పెళ్లి చేసుకోమని సీనియర్ నటి జీనత్ అమన్ ఆ మధ్య కొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీన్ని ఇప్పటికే కొందరు పాటిస్తుండగా ఓ బాలీవుడ్ స్టార్ జంట ఎప్పుడో ఫాలో అయింది. ఆమిర్ ఖాన్- కిరణ్ రావు.. వివాహానికి ముందు కలిసున్నారు.పేరెంట్స్ బలవంతం వల్లే..తాజాగా ఓ ఇంటర్వ్యూలో కిరణ్ రావు మాట్లాడుతూ.. నిజాయితీగా చెప్తున్నా.. నేను, ఆమిర్ ఏడాదిపాటు సహజీవనం చేశాము. పేరెంట్స్ బలవంతం వల్ల పెళ్లి చేసుకున్నాం. వివాహం అనే ఇన్స్టిట్యూట్లో భార్యాభర్తలుగా, విడివిడిగానూ పని చేస్తే అది చాలా బాగా వర్కవుట్ అవుతుంది.కోతులుగా ఉన్నప్పుడు..కానీ ఈ పెళ్లి అనేది అమ్మాయిలను ఎంతగా అణిచివేస్తుందనేది మాత్రం ఎవరూ మాట్లాడరు. అమెరికన్ సైకాలిజస్ట్ ఎస్తర్ పెరల్ దీని గురించి అద్భుతమైన పుస్తకం రాశాడు. మనం కోతులుగా జీవించినప్పుడు కలిసున్నాం. తర్వాత కాలక్రమేణా మానవులు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పెళ్లి వల్ల మహిళలపై ఒత్తిడిదానివల్ల మహిళలపై ఒత్తిడి పెరిగింది. కుటుంబాన్ని చూసుకోవాలి. అందరూ కలిసుండేందుకు తోడ్పడాలి. పని చేయాలి. దీనికితోడు అత్తామామ, ఆడపడుచులు సహా భర్త వైపు కుటుంబీకులందరితో టచ్‌లో ఉండాలి. ఇలా ఆ మహిళ దగ్గరి నుంచి ఎన్నో ఆశిస్తూ తనపై ఒత్తిడి పెంచుతారు' అని చెప్పుకొచ్చింది.అప్పుడు పరిచయం మాత్రమేకాగా ఆమిర్.. కిరణ్ రావు 'లగాన్' సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. ఈ మూవీలో ఆమిర్ హీరోగా నటించగా కిరణ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించింది. అప్పుడు పరిచయం మాత్రమే ఏర్పడింది. ఆమిర్ మంగళ్ పాండే, కిరణ్ రావు స్వదేశ్ సినిమా చేస్తున్న సమయంలో కమర్షియల్ యాడ్స్‌కు కలిసి పని చేశారు. డేటింగ్.. పెళ్లిఅప్పుడు వీరి మధ్య ప్రేమ చిగురించింది. అలా 2004లో డేటింగ్ చేయగా 2005లో పెళ్లి చేసుకున్నారు. 2011లో సరోగసి ద్వారా ఆజాద్ అనే కుమారుడికి పేరెంట్స్ అయ్యారు. 2021లో ఆమిర్- కిరణ్ విడిపోయారు.చదవండి: పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్ -
నాకు చాలాసార్లు అబార్షన్ అయింది: స్టార్ హీరో మాజీ భార్య
దర్శకనిర్మాత కిరణ్‌రావు.. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌కు మాజీ భార్య. 2005లో ఆమిర్.. కిరణ్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఐవీఎఫ్- సరోగసి పద్ధతి ద్వారా 2011లో ఆజాద్ అనే కుమారుడు జన్మించాడు. ఏళ్లపాటు అన్యోన్యంగా ఉన్న ఆమిర్ దంపతులు 2021లో విడాకులు తీసుకున్నారు. భార్యాభర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటున్నారు. అప్పుడే ఆజాద్.. తాజాగా కిరణ్ రావు.. పెళ్లి తర్వాత తను ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించింది. దోబి ఘాట్ సినిమా (2011) సమయంలో ఆజాద్ పుట్టాడు. అప్పటికే నేను పిల్లలు కావాలని ఎంతగా ప్రయత్నించానో..! ఆ ఐదేళ్లలో ఎన్నోసార్లు అబార్షన్ అయింది. శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింది. ఒక పిల్లాడు/పాపను పొందడం ఇంత కష్టమా.. అనిపించింది. పదేళ్లు సినీ ఇండస్ట్రీకి దూరం బిడ్డను కనాలని చూస్తున్న నాకు ఐవీఎఫ్- సరోగసి ద్వారా ఆజాద్ జన్మించడంతో సంతోషమేసింది. తల్లిగా తనను ప్రేమగా పెంచాలని డిసైడయ్యాను. తనతో జీవితాన్ని ఆనందంగా గడిపాను. అవి నా జీవితంలోనే ఉత్తమమైన రోజులు. పదేళ్లు సినిమాకు దూరంగా ఉన్నందుకు నాకెలాంటి బాధా లేదు. ఎందుకంటే ఆ రోజుల్ని నేను ఆజాద్‌కి కేటాయించాను అని చెప్పుకొచ్చింది. కాగా కిరణ్ రావు ఇటీవలే లాపతా లేడీస్ సినిమాతో దర్శకురాలిగా రీఎంట్రీ ఇచ్చింది. చదవండి: నూకరాజు- ఆసియా బ్రేకప్? జబర్దస్త్ కమెడియన్ ఏమన్నాడంటే.. -
టాలీవుడ్ డైరెక్టర్ గురించి విన్నా.. ఆ సినిమా తప్పకుండా చూస్తా: కిరణ్ రావు
బాలీవుడ్ డైరెక్టర్ కిరణ్‌రావు పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల లపట్టా లేడీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కిరణ్ రావు టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా యానిమల్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అతని క్రాఫ్ట్ అద్భతంగా ఉంటుందని.. యానిమల్ సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. తన సినిమా లపట్టా లేడీస్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపింది. కిరణ్ రావు మాట్లాడుతూ..'లాపట్టా లేడీస్ సినిమాకు విశేషమైన స్పందన వచ్చింది. మీ అభిమానానికి నా ధన్యవాదాలు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. ఈ రోజుల్లో ప్రేక్షకులు యాక్షన్‌తో కూడిన భారీ చిత్రాలనే ఇష్టపడుతున్నారు. యానిమల్ లాంటి సినిమాను నేను చూడాలనుకుంటున్నా. అది అవసరం. ప్రజలు ఇష్టపడినందున యానిమల్ హిట్‌గా నిలిచింది. సందీప్ రెడ్డి వంగా క్రాఫ్ట్ చాలా బాగుందని విన్నాను. రణబీర్ కపూర్ కూడా మంచి నటుడు. ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నా.' అని అన్నారు. -
నా భర్త మొదటి విడాకులు.. కారణం నేను కాదు: స్టార్ హీరో మాజీ భార్య
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొంతలో కొంత తెలుసు. అప్పట్లో రీనా దత్తా అనే నిర్మాతని పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 16 ఏళ్లపాటు కలిసున్లారు. కానీ ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. ఇది జరిగిన కొన్నేళ్లకు కిరణ్ రావ్ అనే దర్శకురాలితో ఏడడుగులు వేశాడు. అయితే తొలి భార్య నుంచి విడిపోవడానికి రెండో భార్యనే కారణమని చాలామంది విమర్శలు చేశారు. ఇప్పుడు ఈ విషయమై స్వయంగా కిరణ్ రావ్ స్పందించింది. (ఇదీ చదవండి: స్టార్ హీరో సూర్య దంపతుల మొత్తం ఆస్తి అన్ని కోట్లా?) ''లగాన్' షూటింగ్ టైంలోనే నేను-ఆమిర్ కనెక్ట్ అయ్యామని చాలామంది భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. 'స్వేడ్స్' సినిమా చేస్తున్నప్పుడు మళ్లీ కలిశాం. కొన్ని కూల్ డ్రింక్ యాడ్స్ చేస్తూ దగ్గరయ్యాం. 'లగాన్' చేసిన 3-4 ఏళ్ల వరకు మేమిద్దరం కనీసం టచ్‌లో కూడా లేము. ఇంకా చెప్పాలంటే 'లగాన్' షూటింగ్ టైంలో ఒకటో రెండుసార్లు మాట్లాడి ఉంటా అంతే! 2004లో మేము డేటింగ్ మొదలుపెట్టాం. కానీ చాలామంది 'లగాన్' టైంలోనే దగ్గరయ్యామని.. ఆమిర్, రీనాకు విడాకులు ఇచ్చేయాడానికి నేనే కారణమని అంటున్నారు. కానీ అదంతా అబద్ధం' అని కిరణ్ రావు చెప్పుకొచ్చింది. లగాన్ సినిమా 2001లో రిలీజైంది. ఇది వచ్చిన తర్వాత ఏడాది తర్వాత అంటే 2002లో ఆమిర్ ఖాన్.. తన మొదటి భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చేశాడు. 2005లో దర్శకురాలు కిరణ్ రావుని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆమిర్, తన తొలి భార్యకు విడాకులు ఇవ్వడానికి రీనానే కారణమనే విమర్శలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: ఇంతలా ఎప్పుడు నవ్వుకున్నానో గుర్తులేదు: మహేశ్ బాబు) -
ఒకరంటే ఒకరికి గౌరవం.. ఒక్కసారి కూడా గొడవపడలే!
విడాకులెందుకు తీసుకుంటారు? సఖ్యత లేకో, భేదాభిప్రాయాలు రావడం వల్లో, గొడవలు తలెత్తడం వల్లో, ప్రేమ తగ్గిపోవడం వల్లో.. దూరమవుతూ ఉంటారు. కానీ ఈ మాజీ సెలబ్రిటీ జంట మాత్రం మాకసలు గొడవలే లేవని, ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లమంటోంది. స్టార్ హీరో ఆమిర్ ఖాన్, నిర్మాత కిరణ్ రావు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఆమిర్.. రీనా దత్తాను ళ్లి చేసుకుని విడాకులిచ్చాడు. ఇది అతడికి రెండో పెళ్లి. విడాకులు తీసుకునేముందు గొడవ? ఆమిర్-కిరణ్.. సరోగసి ద్వారా 2011లో ఆజాద్ రావుకు తల్లిదండ్రులయ్యారు. అయితే ఏమైందో ఏమోకానీ 2021లో వీరు విడిపోయారు. విడాకులు తీసుకునేముందు గొడవపడ్డారా? అంటే అలాంటిదేం లేదంటోంది కిరణ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నా మాజీ భర్తతో నేను బాగానే ఉంటాను. తల్లిదండ్రులుగా నా కొడుకును మేమిద్దరం బాగా చూసుకుంటాం. చాలామంది పెళ్లి అంటేనే పెద్ద తలనొప్పి అంటుంటారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలంటారు. నేను కూడా అలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాను. మా అనుబంధం అలాంటిది కానీ ఆమిర్, నేను మాత్రం ఎప్పుడూ గొడవపడలేదు. వినడానికి వింతగా అనిపిస్తుందేమో కానీ. నిజంగానే మేము పోట్లాడుకోలేదు. కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు వచ్చావి కానీ ఎన్నడూ గొడవపడలేదు. మేము ఒకరినొకరం ఎంతో గౌరవించుకుంటాం, ఒకరినొకరం ఎంతో అర్థం చేసుకుంటాం. ఒకరు చెప్పేది మరొకరు వింటుంటాం. బహుశా దానివల్లే మా మధ్య ఎలాంటి సమస్యలు ఎదురవలేదు. మా అనుబంధం అలాంటిది. అల్లకల్లోలానికి దారితీసే గొడవలు, చర్చలు ఎప్పుడూ జరగలేదు అని చెప్పుకొచ్చింది. ఇది విన్న నెటిజన్లు.. అలాంటప్పుడు ఎందుకు విడాకులు తీసుకున్నారో? మరి అని సెటైర్లు వేస్తున్నారు. చదవండి: బేబీ బంప్లో మౌనిక.. పిల్లా నువ్వంటే ప్రాణమన్న మనోజ్ -
అమిర్ ఖాన్ మాజీ భార్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
-
విడాకులైతే కలిసి ఉండొద్దా.. మాదంతా ఒకే కుటుంబం: ఆమిర్ మాజీ భార్య
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ పెళ్లి ఇటీవలే ఘనంగా జరిగింది. కూతురు ఇష్టపడ్డవాడితోనే దగ్గరుండి పెళ్లి జరిపించాడు ఆమిర్. ఈ వివాహ వేడుకకు అతడి మాజీ భార్యలు రీనా దత్తా(ఇరా ఖాన్ తల్లి), కిరణ్ రావు హాజరై సందడి చేశారు. అంతా ఒకే కుటుంబంలా కనిపించి కనువిందు చేశారు. తాజాగా కిరణ్.. ఆమిర్, రీనాలతో తన అనుబంధం గురించి మాట్లాడింది. 'నేను జనాలను ఈజీగా కలుపుకుపోతాను. నా కుటుంబం కూడా ఇరా పెళ్లికి హాజరైంది. అందరం కలిసే ఉంటాం.. దీని గురించి మనం మరీ లోతుగా ఆలోచించాల్సిన పని లేదు. మేమంతా ఒక కుటుంబం. మేము ఒక్కచోటకు చేరినప్పుడల్లా అంతా కలిసే భోజనం చేస్తుంటాం. అలాగే ఒకేచోట నివసిస్తుంటాం. మా అత్తయ్య పై ఫ్లోర్లో ఉంటుంది. తనంటే నాకెంతో ఇష్టం. రీనా పక్కింట్లో ఉంటుంది. ఆమిర్ కజిన్ నుజత్ కూడా దగ్గర్లోనే ఉంటుంది. మాకు ఒకరంటే ఒకరికి ఇష్టం. అందుకే ఇలా కలిసుంటాం. రీనా, నుజత్తో బయట చక్కర్లు కొడుతుంటాను కూడా! ఆమిర్‌తో కూడా వెళ్తూ ఉంటాను. పగప్రతీకారంతో విడాకులు తీసుకోలేదు విడాకులైనంత మాత్రాన ఈ ప్రేమానుబంధాలను వదులుకోవాల్సిన అవసరం లేదు. ఆమిర్, నేను పగ ప్రతీకారాలతో విడాకులు తీసుకోలేదు. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ కుటుంబంగా కలిసే ఉన్నాం. ఇలాంటి అనుబంధం లేకపోతే మనల్ని మనమే కోల్పోతాం' అని చెప్పుకొచ్చింది. కాగా ఆమిర్ ఖాన్, కిరణ్ రావు 2005లో పెళ్లి చేసుకున్నారు. సరోగసి ద్వారా 2011లో తనయుడు ఆజాద్ రావు జన్మించాడు. 2021లో వీరు విడాకులు తీసుకున్నారు. చదవండి: నా సినిమా చూడండంటూ కన్నీళ్లు పెట్టుకున్న సోహైల్ బతికే ఉన్నానని ట్విస్ట్ ఇచ్చిన పూనమ్ పాండే.. ఇదంతా ఎందుకు చేసిందంటే? -
'ముందు వెళ్లి మీ భర్తను అడగండి'.. స్టార్ హీరో భార్యకు స్ట్రాంగ్ కౌంటర్!
ఇటీవలే యానిమల్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం యానిమల్ నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రం రిలీజ్ తర్వాత పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. స్త్రీ విద్వేష చిత్రమని చాలామంది ప్రముఖులు సైతం మండిపడ్డారు. అయితే ఈ సినిమాపై అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు సైతం విమర్శలు గుప్పించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. బాహుబలి-2, కబీర్ సింగ్ సినిమాలు సైతం స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపించారు. అయితే తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు చేసిన విమర్శలపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనికి సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆమె పేరును ప్రస్తావించకుండానే చురకలంటించారు. ఒకసారి అమిర్ ఖాన్ నటించిన దిల్ సినిమా చూడాలని ఆమెకు సలహా ఇచ్చాడు. సందీప్ మాట్లాడుతూ.. 'నేను ఆమెకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీరు అమీర్ ఖాన్ని వెళ్లి అడగండి. ఆయన నటించిన దిల్ సినిమాలో దాదాపు అమ్మాయిపై రేప్‌కు ప్రయత్నించే పరిస్థితిని సృష్టించాడు. కానీ ఆ తర్వాత ఆమెనే తప్పు చేసినట్లుగా భావించేలా చేస్తాడు. కానీ చివరికి అతనితోనే ప్రేమలో పడుతుంది. మరీ ఇదంతా ఏమిటి? ఇలాంటివన్నీ తెలుసుకోకుండానే మాపై ఎలా దాడి చేస్తారో అర్థం కావడం లేదు' అని యానిమల్ దర్శకుడు తెలిపారు. కాగా..ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. -
మాజీ భార్యతో జతకట్టిన అమిర్ ఖాన్.. దాదాపు 12 ఏళ్ల తర్వాత!
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది ఆయన నటించిన లాల్ సింగ్ చద్దా అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. అయితే తాజాగా ఆయన ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జియో స్టూడియోస్ సమర్పణలో కిరణ్ రావు దర్శకత్వం వహిస్తున్నా ఈ చిత్రానికి లాపాటా లేడీస్ అనే టైటిల్ ఫిక్స్ చేయగా... దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఆమె దర్శకురాలిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ధోబీ ఘాట్ తర్వాత మరోసారి అమిర్ ఖాన్ తన మాజీ భార్యతో జతకట్టడంపై బాలీవుడ్లో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: ప్రభాస్ కల్కిలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్.. ఇప్పటికే!) కాగా.. ఈ చిత్రంలో నితాన్షి గోయెల్, ప్రతిభా రంతా, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్, రవి కిషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లపాటా లేడీస్ అనే చిత్రాన్ని ఇద్దరు నవ వధువుల మిస్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. 2001లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని అమిర్ ఖాన్, జ్యోతి దేశ్ పాండే నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 5, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. కిరణ్ రావు, అమిర్ ఖాన్ 2005లో వివాహం చేసుకున్నారు. దాదాపు 16 ఏళ్ల వీరి బంధానికి 2021లో ముగింపు పలికారు. (ఇది చదవండి: బాహుబలి తర్వాత అందుకే చేయలేదు: అనుష్క శెట్టి ఆసక్తికర కామెంట్స్!) View this post on Instagram A post shared by Aamir Khan Productions (@aamirkhanproductions) -
అటు మాజీభార్య ఇటు ప్రేయసి.. మధ్యలో ఆమిర్‌ఖాన్!
బాలీవుడ్ మిస్టర్ ఫెర్ఫెక్ట్ అనగానే అందరికీ హీరో ఆమిర్‌ఖాన్ గుర్తొస్తాడు. డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుండేవాడు. అయితే గతేడాది 'లాల్ సింగ్ చద్దా' సినిమాతో దెబ్బ గట్టిగా తగిలింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం దారుణంగా ఫెయిలయ్యేసరికి ఆలోచనలో పడిపోయాడు. కొన్నాళ్లపాటు నటన, సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. అలా అని ఖాళీగా ఏం లేడు. చేతినిండా సినిమాలతో బిజీగానే ఉన్నాడు. (ఇదీ చదవండి: అభిమానుల్ని మోసం చేస్తున్న స్టార్ హీరోలు!) మాజీభార్యతో కలిసి ఆమిర్ ఖాన్.. తొలుత నిర్మాత రీనా దత్తాని పెళ్లి చేసుకున్నాడు. 16 ఏళ్లపాటు కాపురం చేసిన ఈ జంట.. 2002లో విడిపోయింది. 2005లో డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కిరణ్ రావ్ ని పెళ్లి చేసుకున్న ఆమిర్.. ఈమెతోనూ 16 ఏళ్లు సంసారం చేసి 2021లో విడాకులు ఇచ్చేశాడు. రిలేషన్ లో విడిపోయినప్పటికీ.. ఫ్రొఫెషనల్ గా వీళ్లు కలిసే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమిర్ నిర్మాణంలో కిరణ్ ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తోంది. త్వరలో ఇది విడుదల కానుంది. రూమర్ గర్ల్‌ఫ్రెండ్‌తోనూ ప్రస్తుతం ఆమిర్ ఖాన్.. 'దంగల్' ఫేమా ఫాతిమా సనా షేక్ తో రిలేషన్ లో ఉన్నాడని, త్వరలో పెళ్లి చేసుకుంటాడని గత కొన్నాళ్లుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ విషయం పక్కనబెడితే.. ఆమిర్ ఖాన్ ప్రస్తుతం నిర్మిస్తున్న నాలుగు మూవీస్ లోని ఒక దానిలో ఫాతిమా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ సూపర్ హిట్ 'జయజయజయహే' రీమేక్ గా దీన్ని తీస్తున్నారు. ఇది కూడా త్వరలో రిలీజ్ కానుంది. అటు మాజీ భార్య ఇటు ప్రేయసిని ఆమిర్ ఖాన్ భలే బ్యాలెన్స్ చేస్తున్నాడని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: సలార్-కేజీఎఫ్ కనెక్షన్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత) -
ఎవరో గుర్తుపట్టారా? అబ్బే, ఆయన మాత్రం కాదు!
పై ఫొటోలో ఉంది ఎవరో గుర్తుపట్టారా? విలక్షణ నటుడు జగపతిబాబు అనుకుంటే తప్పులో కాలేసినట్లే! మరింకెవరునుకుంటున్నారా? బాలీవుడ్ బడా హీరో ఆమిర్ ఖాన్. తన ప్రొడక్షన్ ఆఫీస్‌లో ఆమిర్ హిందూ సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాలు చేపట్టాడు. మాజీ భార్య కిరణ్ రావుతో కలిసి ఈ పూజ పూర్తి చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమిర్ నుదుటన బొట్టుతో, చేతికి కంకణంతో, అదే చేత్తో కలశం పట్టుకుని కనిపించాడు. ఇది చూసిన నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. 'హిందూ సాంప్రదాయాలను గౌరవించినట్లు సడన్‌గా నాటకం మొదలుపెట్టాడేంటి?', 'నీ సినిమాలు ఫ్లాప్, నువ్వూ ఫ్లాప్.. మళ్లీ కొత్తగా ఇదేంటో', 'ఇండస్ట్రీ నిన్ను బయటకు గెంటేయకుండా ఉండేందుకు ఇలా ప్లాన్ చేశావన్నమాట' అంటూ కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు మాత్రం 'ఆమిర్, కిరణ్.. మీ ఇద్దరినీ మేమెల్లప్పుడూ గౌరవిస్తాం' అని మద్దతుగా నిలుస్తున్నారు. కాగా ఆమిర్-కిరణ్‌లు గతేడాది వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ స్నేహితులుగా మాత్రం ఇద్దరూ కలిసిమెలిసి ఉంటున్నారు. ఇకపోతే ఆమిర్ నటించిన లాల్‌సింగ్ చడ్డా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా చతికిలపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుటుంబానికి సమయం కేటాయించిన ఆయన ఏడాది తర్వాతే సినిమాల్లో నటించనున్నాడు. Guess the man in the pic.. pic.twitter.com/z0QugsVLYx — 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (@Sagar4BJP) December 8, 2022 చదవండి: బ్రేకప్దాకా వెళ్లాను, ఎవరికీ కనిపించకుండా పోదామనుకున్నా: సిరి నన్నెవరూ బ్యాన్ చేయలేదు: రష్మిక మందన్నా -
నా మాజీ భార్యలను వారానికోసారి కలుస్తా: ఆమిర్ ఖాన్
వేడి వేడి పొగలు కక్కే కాఫీ అంటే చాలామందికి ఇష్టం. అలాగే వాడివేడి ప్రశ్నలతో సెలబ్రిటీలను ఉక్కిరిబిక్కిరి చేసే కాఫీ విత్ కరణ్ షో అంటే కూడా ఇష్టపడేవారు ఎందరో! అందుకే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తిగా చేసుకుంది కాఫీ విత్ కరణ్. ప్రస్తుతం ఏడో సీజన్ సక్సెస్‌ఫుల్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో రన్ అవుతోంది. ఈసారి ఈ షోకి లాల్ సింగ్ చద్దా టీం ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ వచ్చారు. వారికి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పిన కరణ్.. వారిని నవ్విస్తూనే మరోపక్క సీక్రెట్స్ గుట్టు లాగాడు. ఈ సందర్భంగా ఆమిర్ మాట్లాడుతూ.. 'తన రిలేషన్షిప్లో ప్రేమ, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ఉన్నాయే తప్ప క్రూరమైన క్షణాలంటూ ఏమీ లేవు. నా మాజీ భార్యలిద్దరి మీద నాకెంతో గౌరవం ఉంది. ఇప్పటికీ మేమంతా ఓ కుటుంబంలా ఉంటాము. మేము ఎంత బిజీగా ఉన్నా వారానికోసారైనా తప్పకుండా అందరం కలుసుకుంటాం. మామధ్య కేరింగ్, ప్రేమాభిమానాలు అలాగే ఉన్నాయి' అని చెప్పుకొచ్చాడు. కాగా ఆమిర్- రీనా 1986 ఏప్రిల్ 18న ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. 16 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత వీరిద్దరూ విడిపోయారు. 2002లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత దర్శకనిర్మాత కిరణ్‌రావును ప్రేమించాడు ఆమిర్. 2005లో వీరు పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ దంపతులకు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఆజాద్ రావు ఖాన్ జన్మించాడు. 2021లో వీరు కూడా విడాకులు తీసుకున్నారు. చదవండి: భర్తకు పాదపూజ చేసిన హీరోయిన్‌పై ట్రోలింగ్, ప్రణీత ఏమందంటే? నటితో అమర్దీప్ నిశ్చితార్థం, వీడియో వైరల్ -
మాజీ భార్యతో కలిసి డైరెక్టర్లకు విందు ఇచ్చిన స్టార్ హీరో..
Aamir Khan Special Dinner To Russo Brothers: కోలీవుడ్ స్టార్ హీరోల్లో ధనుష్ ఒకరు. తమిళ చిత్రపరిశ్రమలోనే కాకుండా తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ధనుష్ తాజాగా నటించిన చిత్రం 'ది గ్రే మ్యాన్'. స్టార్ హాలీవుడ్ డైరెక్టర్లు రూసో బ్రదర్స్ (జో రూసో-ఆంటోనీ రూసో) దర్శకత్వం వహించిన ఈ మూవీ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా జులై 22 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా, అలాగే ధనుష్‌తో కలిసి ఈ మూవీని వీక్షించేందుకు రూసో బ్రదర్స్ ఇండియా వచ్చిన విషయం తెలిసిందే. ఈ హాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు భారతదేశానికి మొట్ట మొదటిసారిగా రావడంతో మంచి ఆతిథ్యం అందించాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్. గురువారం (జులై 21) ఇండియా వచ్చిన ఈ అన్నదమ్ములను స్వయంగా వారి ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక విందు ఇచ్చాడు. ఈ పార్టీలో హీరో ధనుష్‌తోపాటు అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కూడా సందడి చేశారు. అయితే అమీర్-కిరణ్ రావు విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే. వివాహ బంధంతో విడిపోయిన స్నేహితులుగా ఎప్పుడూ కలిసే ఉంటామని అమీర్ చెప్పిన మాటలకు ఈ సంఘటన అద్దం పట్టేలా ఉంది. ఇక ఈ విందులో అతిథులకు ప్రత్యేకమైన గుజరాతీ వంటకాలను రుచి చూపించాడని టాక్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. చదవండి: 36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. ఈ హీరోలకు కమ్‌బ్యాక్ హిట్.. బేబీ బంప్‌తో అలియా భట్ !.. లీకైన ఫొటోలు.. 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్.. View this post on Instagram A post shared by Laal Singh Chaddha (@aamirkhanuniverse) -
విడాకుల తర్వాత కలిసి పార్టీకెళ్లిన మాజీ దంపతులు
విడాకుల తర్వాత మరోసారి కలిసి దర్శనమిచ్చారు ఆమిర్ ఖాన్, కిరణ్‌రావు. ఆ మధ్య తమ కుమారుడు ఆజాద్ రావు ఖాన్ బర్త్‌డేను కలిసి సెలబ్రేట్ చేసిన ఈ మాజీ దంపతులు తాజాగా నిర్మాత కరణ్ జోహార్ బర్త్‌డే పార్టీలో కలిసి దర్శనమిచ్చారు. ఆమిర్ బ్లూ డ్రెస్‌లో రాయల్ లుక్‌లో కనిపిస్తే కిరణ్ రావు సిల్వర్ డ్రెస్సులో ధగధగ మెరిసిపోయింది. రెడ్ కార్పెట్‌పై కలిసి నిలబడ్డ ఈ ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజులివ్వడం గమనార్హం. ఇది చూసిన ఓ అభిమాని అదేంటి? వీళ్లు విడాకులు తీసుకోలేదా? అని ప్రశ్నించాడు. దీనికి ఇతర ఫ్యాన్స్ స్పందిస్తూ.. 'మీరింకా ఎదగాలి బాబూ.. వాళ్లు విడాకులు తీసుకున్నమాట వాస్తవమే. అంతమాత్రానికి ఫ్రెండ్స్‌గా ఉండకూడదా? శత్రువులుగా మిగిలిపోవాలా? కాస్త బుద్ధిపెట్టి ఆలోచించండి', 'విడాకులు తీసుకున్నాక కూడా ఇద్దరూ మాట్లాడుకోవచ్చు. పైగా పిల్లలు ఉన్నప్పుడు వారు స్నేహంగా మెదలడం అత్యవసరం. విడిపోయిన అందరూ బద్ధ శత్రువులు అవుతారనుకోవద్దు' అని సమాధానమిచ్చారు. కాగా గతేడాది ఆమిర్, కిరణ్ విడాకులు తీసుకున్నారు. ఆమిర్ సినిమాల విషయానికి వస్తే అతడు ప్రధాన పాత్రలో నటించిన లాల్ సింగ్ చద్దా ఆగస్టు 11న రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar.fan) చదవండి: కమెడియన్ కిరాక్ ఆర్పీ ఎంగేజ్మెంట్ టాలీవుడ్లో విషాదం, ప్రముఖ నిర్మాత కన్నుమూత -
రెండుసార్లు విడాకులు: తొలిసారి స్పందించిన ఆమీర్ ఖాన్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ గతేడాది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 2021లో కిరణ్ రావు-ఆమీర్‌ఖాన్ విడాకుల వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. డివోర్స్‌పై ఇద్దరూ సైలెంట్‌గానే ఉన్నారు. అయితే తాజాగా తొలిసారి ఆమీర్ ఖాన్ తన విడాకులపై స్పందించాడు. మా విడాకుల గురించి ప్రజలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే సాధారణంగా డివోర్స్ తర్వాత ఒకరిని మరొకరు పట్టించుకోరు. నిజానికి ఒకరిపై మరొకరికి కోపం ఉంటుంది. చదవండి: మాజీ భార్య నుంచి బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్: ఆమీర్ ఖాన్ కానీ మేం మాత్రం అలా కాదు. వివాహ వ్యవస్థకి గౌరవం ఇవ్వాలని కోరుకున్నాం. దాని గురించి ఎంతో చర్చించాం. అందుకే విడిపోయిన తర్వాత కూడా స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకున్నాం. నిజానికి నా ఇద్దరు మాజీ భార్యలతో నాకు ఇప్పటికీ మంచి అనుబంధం ఉండటం నా అదృష్టం. రీనా, కిరణ్, సత్యజిత్ భత్కల్‌తో కలిసి ఓ ఫౌండేషన్ స్థాపించాం. ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ కోసం అందరం కలిసే పనిచేస్తున్నాం. అలాగే మా పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులుగా బాధ్యతను నిర్వహిస్తున్నాం అని చెప్పుకొచ్చారు. కాగా కిరణ్ రావు కంటే ముందే రీనా దత్తాతో 1986లో ఆమీర్ ఖాన్ వివాహం జరిగింది. కానీ 2002లో వీరిద్దరూ విడిపోయారు. అనంతరం 2005లో ఆమీర్ ఖాన్ కిరణ్ రావును పెళ్లాడారు. 15ఏళ్ల వైవాహిక బంధం అనంతరం ఈ జంట విడిపోయింది. చదవండి: బాహుబలి-3పై అప్డేట్ ఇచ్చిన ప్రభాస్, రాజమౌళి -
మాజీ భార్య నుంచి బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్: ఆమీర్ ఖాన్
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం ఆమిర్ ఖాన్ 57వ బర్త్‌డే. ఈ సందర్భంగా ప్రమఖులు సహా నెటిజన్ల నుంచి ఆయనకు బర్త్‌డే విషెస్ అందుతున్నాయి. ఈ నేపథ్యంలో తన మాజీ భార్య కిరణ్ రావు నుంచి ఇటీవలె ఓ బహుమతి అందిందని, అది తన జీవితంలోనే ఉత్తమమైన గిఫ్ట్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రీసెంట్గా కిరణ్‌తో మాట్లాడాను. ఈ క్రమంలో నా లోపాలు, బలహీనతల గురించి ఓ లిస్ట్ తయారు చేయమని చెప్పాను. ఆమె నాకు ఓ 10-12 పాయింట్స్‌తో ఓ జాబితా తయారు చేసి ఇచ్చింది. అది నా లైఫ్‌లోనే బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ అని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు. కాగా 2021లో అమిర్ ఖాన్- కిరణ్ రావు విడిపోయిన సంగతి తెలిసిందే. 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ ఇకపై తాము భార్యాభర్తలం కాదని సోసల్ మీడియా వేదికగా ప్రకటించారు. 'ఇకపై మేం భార్యాభర్తలం కాదు. కానీ ఒకరికొకరం ఫ్యామిలీగా, పేరెంటింగ్ బాధ్యతలను కలసి పంచుకుంటాం’ అని ఆమిర్, కిరణ్ రావులు ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
Aamir Khan- Kiran Rao: కొందరు విడిపోయినా మారరు! కాబట్టి....
Parents Separation: How It Will Affect Children Psychiatrist Suggestions: ‘మనం ఒకరికి ఒకరం సరిపడే భార్యాభర్తలం కాలేకపోయాం. కనీసం పిల్లలకు ఉత్తమంగా నిలిచే తల్లిదండ్రులుగా అయినా ఉందాం’ ఇదీ విడాకులు తీసుకుంటున్న భార్యాభర్తలు మొదటగా ఆలోచించాల్సింది. ఇవాళ రేపు విడాకుల ఆప్షన్‌ను ఎంచుకోవడానికి భార్యాభర్తలు పెద్దగా ఆలోచించడం లేదు. కాని ‘మా ఆలోచనంతా పిల్లల గురించే’ అంటున్నారు. ‘మేము ఒకరికొకరం అక్కర్లేదు. కాని మా పిల్లలకు మేము కావాలి. ఏం చేయమంటారు’ అని నిపుణుల దగ్గరకు సలహా కోసం వస్తుంటారు. వీరితో సమస్య లేదు. సమస్యల్లా ‘ఆమె దగ్గర ఉంటే పిల్లవాడు పాడైపోతాడు’ అని తండ్రి అనుకున్నా ‘అతని దగ్గర అమ్మాయి ఉంటే చదువు అబ్బకుండా పోతుంది’ అని తల్లి అనుకున్నా పరేషాన్ మొదలవుతుంది. సపరేషన్ అంటేనే ఒక పరేషన్. మళ్లీ పిల్లలతో ఆ పరేషాన్ అవసరమా? మాట వినే భార్యాభర్తలు ‘కొందరు భార్యాభర్తలు విడిపోయినా పిల్లల కోసం బుద్ధిగా మాట వింటారు. వీరికి మేము పిల్లలు కోరుకున్నప్పుడల్లా కలిసి కనిపించండి అని సలహా ఇస్తుంటాం. బర్త్‌డే కలిసి చేయండి... స్కూలు యానివర్సరీకి కలిసి వెళ్లండి... స్పోర్ట్స్డేకు వెళ్లండి. వీక్లీ విజిట్స్‌ను అడ్డుకోకండి. పిల్లవాడి ఎదుట తల్లి తండ్రిని, తండ్రి తల్లిని చిన్నబుచ్చే విధంగా మాట్లాడకండి అని చెబుతాం. వారు వింటారు. పెద్దగా సమస్య ఉండదు’ అంటారు సైకియాట్రిస్ట్ డాక్టర్ కల్యాణ చక్రవర్తి. కాని సమస్య అంతా మాట వినని భార్యాభర్తల గురించే. విడిపోయినా మారరు కొందరు భార్యాభర్తలు విడిపోయినా మారరు. విడాకులకు ముందు తిట్టుకుంటారు. విడాకులు అయ్యాక కూడా తిట్టుకుంటారు. ఇది పిల్లల మీద ఎంత మానసిక ఒత్తిడి కలిగిస్తుందో ఆలోచించరు. విజిట్స్‌కు వచ్చినప్పుడు ‘మీ అమ్మ ఇదా నేర్పింది’ అని అంటారు. లేదా ‘మీ నాన్న బుద్ధులే నీకూ వచ్చాయి’ అంటారు. దాంతో తల్లి కరెక్టా తండ్రి కరెక్టా అనేది అర్థం కాక పిల్లల్లో స్పిరిట్ పర్సనాలిటీ వస్తుంది. సమాజాన్ని ఎదుర్కొనే ఆత్మవిశ్వాçసం ఏర్పడదు. ఇంకొందరు మరీ దారుణంగా వ్యవహరిస్తారు. తల్లినో తండ్రినో ఎలాగైనా దూరం చేయాలి అని పిల్లల్ని దాచేయడం.... తల్లి/తండ్రి నీడ పడనంత దూరంగా తీసుకెళ్లిపోవడం... ఆ పిల్లల్లో తల్లి/తండ్రి పట్ల చేదు ఎక్కించడం. ఇది నేరం. పిల్లలకు తల్లి ప్రేమ, తండ్రి ఆప్యాయత దూరం చేసే హక్కు ఎవరికీ లేదు. కొన్నిసార్లు బంధువులు, తాతయ్య అమ్మమ్మ నానమ్మలు కూడా విషం నూరిపోయడానికి చూస్తారు. పిల్లల హితం కోరుకునే తల్లిదండ్రులైతే వీటిని వేటినీ ఎంకరేజ్ చేయకూడదు. విడిపోయాక పాత గాయాలను రేపి పిల్లల మనసు పాడు చేయకూడదు అనుకోవాలి. పిల్లలకు కొత్త జీవితం భార్యాభర్తలు విడిపోయాక పిల్లల దగ్గర నేను గెలవాలి అంటే నేను గెలవాలి అనుకోవడం ప్రమాదం. నేనే మంచి అనిపించుకోవడం కూడా సరి కాదు. ఎవరు మంచో ఎవరు చెడో కేవలం ఆ భార్యాభర్తలకు మాత్రమే తెలుస్తుంది. పిల్లలకు అది చెప్పినా అర్థం కాదు. వాళ్లకు అది అనవసరం కూడా. వాళ్లకు సంబంధించి జీవితంలో పెద్ద నష్టం జరిగిపోయింది తల్లిదండ్రులు విడిపోవడం వల్ల. కాని వారిలో ఒకరిని ఎలాగైనా దూరం చేయాలనుకోవడం ఇంకా నష్టం కలిగించడం. ‘మీరు పిల్లల కోసం ఈగోను తగ్గించుకోవాలి. మంచి తల్లిని మంచి తండ్రిని అనిపించుకోవడానికి చూడాలి. కొత్త జీవితం కోసం మీరు విడిపోయారు. మీ పిల్లలకు కూడా ఒక కొత్త జీవితం ఇద్దాం అనుకోవాలి... అని తల్లిదండ్రులకు సూచిస్తాం’ అంటారు డాక్టర్ కల్యాణ చక్రవర్తి. ఆమిర్ ఖాన్, కిరణ్‌రావులు తమ కుమారుడు ఆజాద్ రావు ఖాన్ పుట్టిన రోజును కలిసి జరపాలని నిశ్చయించుకోవడం మంచి విషయం. పుట్టినరోజునాడు తల్లిదండ్రుల సమక్షంలో ఉండాలని పిల్లలు అనుకుంటారు. ఆ ఆనందం పొందే హక్కు వారికి ఉంది. వారి ప్రపంచం బుజ్జిది. అందమైనది. అమాయకమైనది. అందులో అమ్మా నాన్నలే హీరో హీరోయిన్లు. వారు నిజ జీవితంలో విడిపోయినా ఊహల్లో అప్పుడప్పుడు వాస్తవికంగా కలిసి కనిపిస్తే వారికి ఊరట. ఆ ఊరట కలిగించడం విడాకులు పొందిన ప్రతి భార్యాభర్తల బాధ్యత. పొసగని భార్యాభర్తలు కావడం తప్పు కాదు. కాని మంచి తల్లిదండ్రులు కాకపోవడం మాత్రం ముమ్మాటికీ తప్పే. ఆ తప్పు జరగనివ్వకండి. -
అరె..! ఈ డైరెక్టర్ కొన్న బైక్ భలే క్యూట్‌గా ఉంది కదూ..!
ఒకప్పుడు రారాజుగా వెలిగి, కనుమరుగైన బజాజ్ చేతక్ స్కూటర్లు ఈసారి ఎలక్ట్రిక్ వాహనాలుగా తిరిగొస్తున్నాయి. ఆటోమొబైల్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య,బాలీవుడ్ డైరెక్టర్ కిరణ్ రావు కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ బైక్‌తో సందడి చేశారు. టోపాజ్ బ్లూ కలర్లో ఉన్న చేతక్ బండితో ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో సందడి చేస్తుండగా..నెటిజన్లు కిరణ్ రావు కొనుగోలు చేసిన బజాజ్ చేతక్ లుక్స్ క్యూట్‌గా ఉందని అంటున్నారు. అంతేకాదు బిల్డ్ క్వాలిటీ, రైడ్ ఎబిలిటీ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేందుకు గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. బజాజ్ చేతక్ బైక్ ఫీచర్స్ 3.8కేడబ్ల్యూ పీఎంఎస్ మోటర్, 5బీపీహెచ్,16.2 ఎన్ఎం టారిక్తో అందుబాటులోకి ఉంది. లిథియం అయాన్ బ్యాటరీతో బిల్డ్ చేసిన బజాజ్ చేతక్ బైక్‌కు త్రీ పిన్ చార్జర్ సాకెట్‌తో ఛార్జింగ్ పెడితే 6 నుంచి 7గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇక అదే బ్యాటరీని సింగిల్ ఛార్జ్ చేస్తే 80కిలోమీటర్లు, ఈకో మోడ్‌లో 95 కిలోమీటర్ల వరకు, టాప్ స్పీడ్ 70కిలో మీటర్ల వరకు డ్రైవ్ చేయొచ్చు. మెటల్ బాడీ, ఎల్ఈడీ లైటింగ్, ఇల్యూమినేటెడ్ స్విచ్ గేర్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు, బ్లూటూత్ ఎనేబుల్డ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తో పాటు మరికొన్ని ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. బజాజ్ చేతక్ ధరెంత? బజాజ్ చేతక్ ధర అర్బన్ వేరియంట్‌కు రూ.1.42 లక్షలు, ప్రీమియం వేరియంట్ ధర రూ.1.44 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). అయితే ఈ మోడల్ ధర ఓలా ఎస్ 1,అథర్ 450 ఎక్స్‌తో పాటు ఇతర ఎలక్ట్రిక్ బైక్స్ కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి శుభవార్త.. ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్! -
కొడుకు కోసం మళ్లీ కలిసిన బాలీవుడ్ మాజీ జంట.. ఫొటోలు వైరల్
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు ఈ సంవత్సరం ప్రారంభంలో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ మాజీ జంట తమ కుమారుడు ఆజాద్‌తో కలిసి బయటికి లంచ్‌కి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాదాపు 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంటకు ఓ కుమారుడు ఆజాద్ (9) ఉన్నాడు. ఇటీవల విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత మొదటిసారి ఆదివారం (సెప్టెంబర్ 26న) అందరూ కలిసి లంచ్‌కి బయటికి వచ్చారు. భారీ భద్రత మధ్య వచ్చిన వారు భోజన అనంతరం ఓపికగా ఫోటోలకి స్టిల్స్ ఇచ్చారు. అయితే వీడిపోయిన తర్వాత కూడా అమీర్ ఖాన్ తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’కి ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. అంతేకాకుండా కుమారుడి సంబంధించిన అన్ని విషయాల్లో పాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు గతంలో ప్రకటించారు. కాగా ఇటీవల సినిమా షూటింగ్ లడ్డాఖ్లో జరుగుతున్న సమయంలో ఈ మాజీ జంట అక్కడి స్థానికులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. View this post on Instagram A post shared by Aamir Khan Azerbaijan (@aamir.khan_azerbaijan) చదవండి: బేగంపేట ఎయిర్ పోర్ట్ లో మొక్కలు నాటిన అమీర్ ఖాన్ -
‘తాత కావాల్సిన వయసులో మూడో భార్య కోసం వేట’
భోపాల్: బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్-కిరణ్‌రావుల విడాకుల అంశంపై దేశవ్యాప్తంగా తెగ చర్చ నడుస్తోంది. రెండు వివాహాలు చేసుకున్న ఆమిర్ వైవాహిక జీవితం ఇలా మధ్యలోనే ముగిసిపోవడం.. ఇద్దరు భార్యలకు విడాకులు ఇవ్వడాన్ని పలువురు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకుడు ఒకరు ఆమిర్ ఖాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన లాంటి వల్లే దేశంలో జనాభా పెరుగుతుందని ఆరోపించారు. ఆ వివరాలు.. మధ్యప్రదేశ్ మంద్సోర్ బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా జనాభా పెరుగుదలకు, అసమానతలకు ఆమిర్ ఖానే బాధ్యుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సుధీర్ గుప్తా మాట్లాడుతూ.. ‘‘ఆమిర్ ఖాన్ తన మొదటి భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చాడు.. ఆమెతో కలిగిన ఇద్దరు బిడ్డలను వదిలేశాడు. ఆ తర్వాత కిరణ్ రావ్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెతో ఓ బిడ్డను కన్నాడు. ఇప్పుడు ఆమెకు విడాకులు ఇచ్చాడు. తాత కావాల్సిన వయసులో ఇప్పుడు మూడో భార్య కోసం వెతుకుతున్నాడు. దేశ జనాభాలో అసమానతలకు ఆమిరే కారణం’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ‘‘దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌కు ఎక్కువ భూభాగం.. తక్కువ జనాభా లభించగా.. మనకు అందుకు రివర్స్‌లో జరిగింది. మన దగ్గర జనాభా పెరుగుతుంది తప్ప భూభాగం పెరగడం లేదని.. ఇది ఏమాత్రం మంచిది కాదు’’ అన్నారు సుధీర్ గుప్తా. కాగా తమ 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ఆమిర్ ఖాన్- కిరణ్ రావులు చరమగీతం పాడారు. వీరికి సరోగసీ ద్వారా ఆజాద్ రావు అనే కుమారుడు ఉన్నాడు. కిరణ్ రావుని వివాహం చేసుకోకముందు ఆమిర్, రీనా దత్తాను వివాహం చేసుకోగా వారికి జునైద్ అనే కొడుకు, ఇరా అనే కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆమిర్ ఖాన్, కిరణ్ రావులు విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చిన సంగతి తెలిసిందే. -
Lal Singh Chaddha: ఆమీర్ ఖాన్, కిరణ్ రావుతో చైతూ.. ఫోటో వైరల్
నాగచైతన్య ‘లాల్ సింగ్ చద్దా’సెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆమీర్ ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందుతున్నఈ చిత్రంలో నాగచైతన్య ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. చైతూకు బాలీవుడ్లో ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఆస్కార్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’(1994)కు ఇది హిందీ రీమేక్. కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఈ మూవీ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా సెట్లోని ఫోటోని చిత్ర బృందం పంచుకుంది. అందులో ఆమీర్ ఖాన్, కిరణ్ రావు, దర్శకుడితో నాగచైతన్య ఉన్నారు. సైనికుడి డ్రెస్‌లో ఆమిర్, చైతూ కనిస్తుండటం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కాగా, ఇటీవల ఆమీర్, తన భార్య కిరణ్ రావులు ఇటీవల విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే `లాల్ సింగ్‌చద్దా`కి కిరణ్ రావు ఓ నిర్మాతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తను కూడా సెట్లో ఉండటం విశేషం. మరోవైపు తెలుగు చైతూ నటించిన `లవ్‌స్టోరి` విడుదలకు సిద్ధంగా ఉంది. Grateful #Bala #LaalSinghChaddha pic.twitter.com/hLidCDCcyf — chaitanya akkineni (@chay_akkineni) July 9, 2021 -
‘కళ్లజోడు మొహం బోరుకొట్టే ఆమీర్ విడాకులు!’
ప్రస్తుతం బి-టౌన్లో ఆమీర్ ఖాన్, కిరణ్ రావుల విడాకుల విషయం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమీర్, కిరణ్‌లు రావు తాము విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. దీంతో ఆమీర్ దంగల్ నటి ఫాతిమాతో ఎఫైర్ కారణంగానే కిరణ్ రావుకు విడాకులు ఇస్తున్నాడంటూ సోషల్ మీడియా నెటిజన్లు సైటిరికల్గా ట్రోల్ చేయడం ప్రారంభించారు. అంతేగాక అప్పుడు రినా దత్తాతో 15 ఏళ్లు... ఇప్పుడు కిరణ్ రావుతో 16 ఏళ్లు.. ఎందుకు ఇలా చేశారు ఆమీర్ అంటూ ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సినీ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్కే ఆమీర్-కిరణ్ రావుల విడాలకులపై స్పందించాడు. ఆమీర్ నిజాయితీ పరుడని అందరూ అంటారు, ఆయన నిజాయితీగా విడాకులు ఎందుకు తీసుకుంటున్నారో చెప్పాలంటూ ప్రశ్నించాడు. అంతేగాక కిరణ్ రావు లుక్‌పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేఆర్కే తన యూట్యూబ్‌లో ఛానల్లో ఓ వీడియో షేర్ చేశాడు. ఇందులో ‘ఆమీర్ లాంటి స్టార్ హీరో కిరణ్ రావు లాంటి సాధారణ మహిళను పెళ్లి చేసుకోవడం ఏంటని అప్పుడే అనుకున్న. ఎందుకంటే ఆయన ఓ సూపర్ స్టార్, ఆయన తలుచుకుంటే కత్రినా కైఫ్ వంటి అందమైన హీరోయిన్, ఫాతిమా సనా లాంటి వారిని పెళ్లి చేసుకోవచ్చు. కానీ కళ్లజోడు లేకపోతే కనీసం చూడలేని, సర్వసాధారణమైన కిరణ్ రావును ఆమీర్ పెళ్లి చేసుకున్నాడని విని షాక్ అయ్యా. ఆమీర్ ఆమెనే ఎందుకు పెళ్లి చేసుకున్నాడని బాధపడ్డాను’ అంటూ వ్యాఖ్యానించాడు. అదే విధంగా ఆమీర్ డబ్బు మనిషి కాదని, ఆయన మొదటి భార్య రీనా దత్తకు విడాకులు ఇచ్చేముందు ఎలాంటి భరణం, డబ్బు చెల్లించకుండానే ఆ బంధాన్ని విడిపించుకున్నాడంటూ ఎద్దేవా చేశాడు. ‘ఇప్పడు ఆమీర్‌కు డబ్బు కొరత లేదు. ఆయన ఖచ్చితంగా కిరణ్ రావుకు భరణం చెల్లించాల్సిందే’ అని చెప్పుకొచ్చాడు. అంతేగాక ఇప్పుడు ఆమీర్ నిజాయితీగా అసలు విషయం చెప్పాలన్నాడు. కిరణ్ రావు కళ్లద్దాల మొహం చూడలేకపోతున్నానని, 15 ఏళ్లు ఆమెను చూసి చూసి బోరు కొట్టడం వల్లే విడాకులు తీసుకున్న నిజం ఒప్పుకోవాలంటూ కమల్ ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేశాడు. -
Aamir Khan Divorce: తెరపై కూతురు.... నిజజీవితంలో భార్య!
శుభాకాంక్షలు ఆమిర్... ఫాతిమా... ఈ బంధం అయినా సుదీర్ఘంగా సాగాలి! తెరపై కూతురు.... నిజజీవితంలో భార్య!! మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అంటారు కానీ.. ఏ మాత్రం పర్ఫెక్ట్ కాదు!! ‘సత్యమేవ జయతే’కి హోస్ట్ చేశాడు... కానీ ఫాతిమా కోసం కిరణ్‌ని వదిలేశాడు!! ఫస్ట్ రీనా.. సెకండ్ కిరణ్... ఫాతిమా నం. 3 !! ...గడచిన రెండు రోజులుగా సోషల్ మీడియా నిండా ఇలాంటి వ్యంగ్యాస్త్రాలే. ‘మా పదిహేనేళ్ల వివాహ బంధాన్ని ముగిస్తున్నాం.. విడిపోతున్నాం’ అని ఆమిర్ ఖాన్, కిరణ్ రావు గత శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఊహాగానాలు మొదలయ్యాయి. చాలామంది ఊహల్లో ఉన్న పేరు ‘ఫాతిమా సనా షేక్’. కిరణ్, ఆమిర్; ఫాతిమా, ఆమిర్ ‘దంగల్’ (2016)లో ఆమిర్‌కి కూతురిగా నటించింది ఫాతిమా. ఆ తర్వాత ఆమిర్ నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ (2018) లోనూ నటించింది. ఈ సినిమాలు పూర్తయ్యాక కూడా ఆమిర్, ఫాతిమా టచ్‌లోనే ఉంటున్నారని బాలీవుడ్ కథనం. అవార్డు వేడుకలకు, పెద్దింటి ఫంక్షన్లకు ఇద్దరూ జోడీగా వెళ్లారనే వార్తలు కూడా ఉన్నాయి. ఆమిర్ ఇంటికి ఫాతిమా రాకపోకలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్యా ‘కుఛ్ కుఛ్ హో రహా హై?’ (ఏదో ఏదో జరుగుతోంది) అనే వార్తలు మొదలయ్యాయి. అప్పట్లో ఆ వార్తలను ఫాతిమా ఖండించింది కూడా. ‘‘ఇలాంటివి ఎదుర్కోవడం నాకస్సలు అలవాటు లేదు. నేను ఎప్పుడూ కలవని అపరిచితులు నా గురించి ఏదేదో రాస్తున్నారు. నిజమేంటో వాళ్లకు తెలియదు. అయితే ఆవి చదివినవాళ్లు మాత్రం నా గురించి తప్పుగా అనుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా రాయాలంటే, నన్నే అడిగితే చెబుతాను కదా. నిజాలు తెలియకుండా ఏవేవో ఊహించుకోవడం బాధగా ఉంది. కానీ ఇప్పుడు ఈ వార్తలను విస్మరించడం నేర్చుకుంటున్నాను’’ అని ఫాతిమా పేర్కొన్నారు. అప్పుడు అలా స్పందించిన ఫాతిమా సనా ఇప్పుడు సోషల్ మీడియాలో ‘ఆమిర్‌కి రీల్ లైఫ్‌లో కూతురు... రియల్ లైఫ్‌లో భార్య’ అనే విమర్శలు వినిపిస్తున్నా మౌనంగా ఉండిపోవడం చర్చనీయాంశమైంది. ‘మౌనంగా ఉందంటే అవుననే కదా’ అని కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. భావప్రకటన స్వేచ్ఛ అయితే ఆమిర్–ఫాతిమా మధ్య ఏం ఉందో తెలియకుండా దారుణంగా విమర్శించడం సరి కాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ విమర్శిస్తున్నవారిలో కొందరు మాత్రం ‘భావప్రకటన స్వేచ్ఛ’ను తెరపైకి తెచ్చారు. దానికి ఆమిర్–కిరణ్‌లను కారణంగా చెబుతున్నారు. కొన్నేళ్ళ క్రితం ఓ కార్యక్రమంలో ఆమిర్ మాట్లాడుతూ – ‘‘దేశంలో జరుగుతున్న అల్లర్లు సహించలేనివిగా ఉన్నాయి. అభద్రతా భావం నెలకొని ఉన్న ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండటం పిల్లలకు క్షేమం కాదు.దేశం వదిలి వెళ్లిపోదామా అని నా భార్య కిరణ్ భయం వ్యక్తం చేసింది’’ అనడం చర్చకు దారి తీసింది. ఇప్పుడు ఆమిర్–కిరణ్ విడాకుల వ్యవహారం నేపథ్యంలో.. దేశం పట్ల ఆమిర్‌కి ఏమాత్రం గౌరవం లేదని, అప్పుడు భావప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడాడని నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. ‘‘మాకు కూడా భావప్రకటన స్వేచ్ఛ ఉంది. మేం కూడా మా అభిప్రాయాలను చెబుతున్నాం. ఈ విషయంలో నువ్వు.. కిరణ్.. నీ ప్రియురాలు (ఫాతిమా) మమ్మల్ని ఏమీ చేయలేరు’’ అని ఘాటుగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చ ఆమిర్‌కి తెలియనిది కాదు. కానీ మౌనం వహించారు. మరి.. విమర్శలకు గురవుతున్న ఆమిర్–ఫాతిమా నోరు విప్పితేనే చాలామంది నోళ్లు మూతబడే అవకాశం ఉంది. ఆ సంగతలా ఉంచి.. 56 ఏళ్ల ఆమిర్, 29 ఏళ్ల ఫాతిమా మధ్య నిజంగానే ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే వీరిది మూడు ముడుల బంధం గా మారుతుందా? అనేది కాలమే చెప్పాలి. విఫలమైన వివాహబంధాలు హిందీ పరిశ్రమలో విఫలమైన వివాహ బంధాలు చాలానే ఉన్నాయి. ఆ వివరాలు... ► బాలీవుడ్ ప్రముఖ నటుడు ఓంపురి 1991లో సీమా కపూర్‌ను వివాహం చేసుకున్నారు. కానీ ఎనిమిది నెలలకే వీరు విడాకులు తీసుకుని వేరయ్యారు. ఆ నెక్ట్స్ ‘అన్లైక్లీ హీరో: ద స్టోరీ ఆఫ్ ఓంపురి’ అంటూ తన బయోగ్రఫీ రాసిన జర్నలిస్టు నందితా పురిని 1993లో వివాహం చేసుకున్నారు ఓంపురి. అయితే పెళ్లి చేసుకున్న పదేళ్లకు ఓంపురి, నందిత విడాకులు తీసుకున్నారు. ► నటి పూజా భట్, మనీష్ మఖీజా 2003లో పెళ్లి చేసుకున్నారు. 11 ఏళ్లకు విడాకులు తీసుకున్నారు. ఓంపురి, నందిత; సైఫ్, అమృత ► అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా 1998లో పెళ్లి చేసుకున్నారు. 2017 మే నెలలో విడాకులు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం హీరో అర్జున్ కపూర్‌తో మలైకా ప్రేమలో ఉన్నారని టాక్. వీరిద్దరు త్వరలో వివాహం చేసుకోనున్నారట. ► కరిష్మా కపూర్, అజయ్ దేవగణ్ లవర్స్ అని గతంలో బాలీవుడ్ కోడై కూసింది. తర్వాత ఇద్దరి మనసుల మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్‌తో 2002లో నిశ్చితార్థం జరిగింది. అయితే పెళ్లి జరగలేదు. 2003లో వ్యాపారవేత్త సంజయ్‌ని పెళ్లాడారు కరిష్మా. 2014లో ఇద్దరూ విడిపోవాలనుకున్నారు. 2016కి విడాకులు మంజూరయ్యాయి. ► నటుడు సైఫ్ అలీఖాన్ 1993లో నటి అమృతా సింగ్‌ను పెళ్లాడారు. 2004లో ఇద్దరూ విడిపోయారు. 2012లో హీరోయిన్ కరీనా కపూర్‌తో సైఫ్ ఏడడుగులు వేశారు. ఇంకా హిందీ పరిశ్రమలో ఏడడుగులు వేసి, ఆ తర్వాత విడిపోయిన వారిలో నటుడు యాక్టర్, డైరెక్టర్ ఫర్హాన్– హెయిర్ స్టైలిస్ట్ అధునా భబానీ, రణ్వీర్ షోరే–కొంకణా సేన్ శర్మ, అనురాగ్ కశ్యప్– కల్కీ కొచ్లిన్ తదితరులు ఉన్నారు. మలైకా, అర్బాజ్; హృతిక్, సుజానె; కరిష్మా, సంజయ్ హృతిక్ రోషన్‌కి 26 ఏళ్లకే పెళ్లయింది. 2000లో సుజానే ఖాన్ని పెళ్లాడారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 2013లో విడివిడిగా ఉండటం ఆరంభించిన హృతిక్–సుజానేలకు 2014లో విడాకులు మంజూరయ్యాయి. పిల్లలిద్దరూ తల్లి, తండ్రి దగ్గర ఉంటుంటారు. భార్యాభర్తలుగా తాము విడిపోయినా పిల్లల బర్త్‌డేలు కలిసి చేస్తూ, కలిసి హాలిడే ట్రిప్‌లకు వెళుతూ తల్లితండ్రులుగా పిల్లల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. -
మాది అమీర్, కిరణ్‌ల సంబంధం వంటిది
ముంబై: శివసేన, బీజేపీలది అమీర్‌ఖాన్, కిరణ్ రావుల మధ్య సంబంధం వంటిదని ఎంపీ సంజయ్‌రావుత్ వ్యాఖ్యానించారు. ఇరుపార్టీల మధ్య స్నేహం ఉందని స్పష్టంచేశారు. 15 ఏళ్ల వివాహ బంధానికి చెక్ పెడుతూ విడాకులు తీసుకున్నట్లు ఇటీవలె అమీర్ దంపతులు ప్రకటించారు. ఇద్దరి మధ్య సంబంధం మారిపోయినా, ఇంకా కలిసే ఉన్నట్లు వారిద్దరూ ఓ ప్రకటనలో స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. మరోవైపు బీజేపీ, సేనలు శత్రువులు కాదని ఇటీవల మాజీ సీఎం ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్ రావుత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సోమవారం సంజయ్ మాట్లాడుతూ.. ‘‘అమీర్ ఖాన్, కిరణ్ రావులను చూడండి. (వారి) దారులు విడిపోయాయి. కానీ, వారు స్నేహితులు. ఇక్కడ కూడా అంతే. (మా) మార్గా లు వేరు కానీ, స్నేహం అలాగే ఉంది. రాజకీయాల్లో స్నేహం ఉంటుంది. కానీ మేం (మహారాష్ట్రలో) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని దీని అర్థం కాదు. తేడాలు ఉన్నాయి, కానీ నేను చాలా కాలంగా చెబుతున్నట్లుగా, మేం (సేన, బీజేపీ) భారతదేశం–పాకిస్తాన్ కాదు. సమావేశాలు, చర్చలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మార్గాలు వేరయ్యాయి. రాజకీయాల్లో మా మార్గాలు విడిపోయాయి’’ అని అన్నారు. -
అమీర్-కిరణ్ విడాకులు: నెట్టింట రచ్చ చేస్తున్న ఐరా ఖాన్ పోస్ట్
Aamir Khan Kiran Rao Divorce: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావ్ నుంచి విడాకులు తీసుకున్నట్లు రెండు రోజులు క్రితం ప్రకటించినప్పటి నుంచి .. ఇదే హాట్ టాపిక్‌గా మారింది. నెట్టింట సెటైర్లు, ట్రోలింగ్లతో ఈ విషయంపై రచ్చ మామూలుగా లేదనే చెప్పాలి. తాజాగా అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ తన తండ్రి విడాకులపై స్పందించింది. 15ఏళ్ల తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అమీర్ ఖాన్-కిరణ్ రావ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ విడాకులకు సంబంధించి అమీర్ ఖాన్‌కు యంగ్ హీరోయిన్ ఫాతిమాకు ఎఫైర్ ఉన్న కారణంగానే, వాళ్లిద్దరూ విడిపోయారంటూ నెటిజన్లు వీరిపై ట్రోలింగ్, మీమ్స్‌తో విపరీతంగా ఆటాడేసుకున్నారు. ఈ నేపథ్యంలో అమీర్ కూతురు ఐరా ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఐరా పరోక్షంగా తన తండ్రి అమీర్ విడాకులపై స్పందిస్తూ పోస్ట్ చేసినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. ఆ పోస్ట్‌లో... రేపు తదుపరి సమీక్ష, ఏమి జరగబోతుందో మరి?... అంటూ కామెంట్ చేశారు. అమీర్ విడాకులు అనంతరం ఈ తరహా ఫోటో పోస్ట్ చేయడంతో ఐరా తన తండ్రిని ఉద్దేశించే ఇలాంటి సెటైరికల్ కామెంట్ చేశారని కొందరు భావిస్తున్నారు. ఐరా ఖాన్ అమీర్ మొదటి భార్య రీనా దత్త కూతురు. -
బాలీవుడ్ లో కామన్ అయిపోయిన విడాకులు
-
చేతిలో చెయ్యేసి కిరణ్ రావుతో.. వీడియో షేర్ చేసిన అమీర్
Aamir Khan-Kiran Rao Divorce: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్-కిరణ్ రావు దంపుతులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. కొత్త జీవితం కోసం విడుపోతున్నామని, అయిన తాము కుటుంబంగా కలిసే ఉంటామమని వారిద్దరూ సంయుక్తంగా విడాకుల ప్రకటన చేశారు. దీంతో వారి తీరు చూసి నెటిజన్లు మండిపడ్డారు. అనంతరం అమీర్ ఖాన్, కిరణ్ రావులను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం అమీర్, కిరణ్ రావులకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఆన్లైన్ ఇంటర్వ్యూలో సంతోషంగా చేతిలో చేయ్యి వేసుకుని తాము విడిపోవాలనుకున్నామని చెప్పడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం ఈ వీఇయో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అమీర్ మాట్లాడుతూ కిరణ్ చేయిని తన చేతిలోకి తీసుకున్నాడు. భార్య భర్తలుగా విడిపోయిన మేము ఒకరి ఒకరం తోడుగా ఉంటామని, తాము ఒకే కుటుంబమని వ్యాఖ్యానించాడు. ‘మా విడాకులు ప్రకటన విని మీరంత షాక్ అయ్యుండొచ్చు. ఈ వార్త మీమ్మల్ని బాధపెట్టి ఉండొచ్చు. కానీ మా నిర్ణయంతో మేమీద్దరం చాలా సంతోషంగా ఉన్నామని మీకు చెప్పాలనుకుంటున్నాము. విడాకులు తీసుకున్న మేము ఒకే కటుంబంగా ఉంటాం. దీనివల్ల మా సంబంధంలో మార్పు వచ్చింది కానీ ఎప్పటికీ ఒకరికి ఒకరం తోడుగా ఉంటాం’ అంటూ అమీర్ మాట్లాడుకొచ్చాడు. ఇది చూసి కొంతమంది వీరి నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే మరికొందరూ తమదైన శైలిలో సటైరికల్‌గా స్పందిస్తున్నారు. కాగా లగాన్ మూవీ సమయంలో కిరణ్‌తో ప్రేమలో పడిన అమీర్ 2005లో ఆమెను వివాహం చేసుకున్నాడు. అంతకు ముందు రీనా దత్తాను వివాహం చేసుకున్న అమీర్ తమ 16 ఏళ్ల బంధానికి గుడ్‌బై చెప్పి కిరణ్‌ను వివాహమాడాడు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
వివాహం కంటే విడాకులనే ఎక్కువ సెలబ్రేట్ చేసుకోవాలి: ఆర్జీవీ
Aamir Khan-Kiran Rao Divorce: బాలీవుడ్ స్టార్ కపుల్ అమీర్‌ఖాన్-కిరణ్‌రావు 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. ఈ అనౌన్స్మెంట్ జరిగిన వెంటనే ఇంటర్నెట్లో ట్రోలింగ్ మొదలైంది. నెటిజన్లంతా అమీర్ ఖాన్ విడాకులపైనే చర్చ పెట్టారు. నెగెటివ్ కామెంట్లతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు. ఇక ఈ స్టార్ కపుల్ విడాకులపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. వారిద్దరికీ భవిష్యత్తు మరింత అందంగా, సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే అమీర్ ఖాన్, కిరణ్ రావుని ట్రోల్ చేస్తున్న నెటిజన్ల ఫైర్ అయ్యాడు ఆర్జీవి. వాళ్లకి లేని బాధ మీకేంటని నెటిజన్లను ప్రశ్నించారు. ‘అమీర్-కిరణ్‌రావు ఎలాంటి బాధ లేకుండా విడిపోతే.. మిగతా వాళ్లందరూ ఎందుకు ఇబ్బందిపడుతున్నారు. వాళ్ల గురించి ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు?. ట్రోలర్స్.. వ్యక్తిగత విషయాలపై పిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు. కానీ అమీర్- కిరణ్ జంట మాత్రం వ్యక్తిగతంగా ప్రొఫెషనల్‌గా ఉన్నారు. అమీర్, కిరణ్ రావు భవిష్యత్తులో కూడా సంతోషంగా, ఇంతకుముందు లేని విధంగా ఇకపై మీ జీవితాలు మరింత రంగులమయంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా దృష్టిలో వివాహం కంటే విడాకులనే ఎక్కువ సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే వివాహం అనేది మూర్ఖత్వం, అజ్ఞానంతో ముడిపడిఉన్నది. కానీ విడాకులు అనేది మాత్రం జ్ఞానం, తెలివితో కూడుకున్న పని’ అని ఆర్జీవీ వరుస ట్వీట్స్ చేశారు. If #AamirKhan and #KiranRao have no problem with divorcing each other , why the F…. should anyone else have it in the whole world ? Trollers are trolling it in a stupidly personal way , whereas the couple are being personally professional ! — Ram Gopal Varma (@RGVzoomin) July 3, 2021 I wish u both #AmirKhan and #KiranRao a very RANGEELA life much more COLOURFUL than before ..I believe that a divorce should be celebrated more than a marriage because divorces happen out of knowledge and wisdom …and marriages happen out of ignorance and stupidity — Ram Gopal Varma (@RGVzoomin) July 3, 2021 -
అమీర్-కిరణ్.. మధ్యలో ఆమె!
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావ్ నుంచి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన మరుక్షణమే.. అదొక హాట్ టాపిక్‌గా మారింది. సెటైర్లు, ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లతోనే నిన్నంతా సోషల్ మీడియాలో చర్చ నడించింది. అయితే హాఠాత్తుగా ఫాతిమా సనా షేక్ పేరు తెర మీదకు వచ్చింది. రికార్డుస్థాయిలో ఆమె పేరు హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు ట్విటర్లో పోస్ట్ అయ్యాయి.. ఇంకా అవుతూనే ఉన్నాయి. అమీర్ ఖాన్‌తో యంగ్ హీరోయిన్ ఫాతిమాకు ఎఫైర్ ఉందని, అందుకే వాళ్లిద్దరూ విడిపోతున్నారనేది నెటిజన్స్ ఒపీనియన్. అందుకే వాళ్ల ఫొటోలతో, ఫాతిమాను తెర మీదకు తెచ్చి ఆడుకుంటున్నారు. 29 ఏళ్ల ఫాతిమా.. 56 ఏళ్ల అమీర్‌తో వరుసగా రెండు సినిమాలు చేసింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందని బాలీవుడ్ మీడియా హౌజ్‌లలో పుకార్లు వినిపించాయి. ఆ వ్యవహారాన్ని అమీర్ లైట్ తీసుకోగా.. ఫాతిమా మాత్రం తనకు ఎలాంటి పరిచయం లేని వ్యక్తులు తన గురించి తప్పుగా రాయడం సరికాదని వ్యాఖ్యానించింది కూడా. భావ ప్రకటన స్వేచ్ఛ.. ఇక ఫాతిమాతో అమీర్‌కు లింక్ అంటగట్టడం.. ఈ ఎఫైర్‌ను విడాకులకు ముడిపెట్టడం అంతా భావ స్వేచ్ఛ ప్రకటనలో భాగమేనని పలువురు నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో దేశం పట్ల, దేశభద్రత పట్ల, ప్రభుత్వం పట్ల ఏ మాత్రం గౌరవం లేకుండా వ్యవహరించిన అమీర్ తీరును ఈ సందర్భంగా కొందరు ప్రస్తావిస్తున్నారు. ‘అమీర్ నువ్వు ఎలాగైనా భావ స్వేచ్ఛ ప్రకటన గురించి ఆందోళన వ్యక్తం చేశావో గుర్తుందా? నీ భార్యా దేశం విడిచి వెళ్లాలని ఉందని చేసిన కామెంట్లు గుర్తున్నాయా?.. ఇప్పుడు మా భావ ప్రకటన స్వేచ్ఛను ప్రదర్శిస్తున్నాం. ఈ విషయంలో నువ్వు, నీ భార్య, నీ ప్రియురాలు(ఫాతిమా) .. ఎవరూ కూడా మమ్మల్ని అడ్డుకోలేరు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కూతురు.. ఆ వెంటనే హీరోయిన్ హైదరాబాద్‌లో పుట్టిన ఫాతిమా సనా షేక్.. బాలనటిగా పలు హిందీ చిత్రాల్లో నటించింది. నువ్వు నేను ఒకటవుదాం (2015)తో తెలుగులో నటించిన ఫాతిమా.. 2016లో అమీర్ ఖాన్ ‘దంగల్’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో అమీర్ కూతురిగా నటించిన ఫాతిమా.. ఆ వెంటనే థగ్స్ ఆఫ్ హిందోస్థాన్‌లో జోడిగా నటించింది. ప్రమోషన్స్ ముగిశాక కూడా ఇద్దరూ చాలాకాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ముంబైలో దిగినప్పుడల్లా ఆమె అమీర్ ఖాన్ ఇంటికి వెళ్లడంతో పుకార్లు మరింత బలపడ్డాయి. దీంతో రూమర్లు మొదలయ్యాయి. చివరికి అంబానీ ఇంట జరిగిన పార్టీకి, అవార్డుల వేడుకల దగ్గర కూడా వీళ్లు జోడిగా కనిపించడం.. అప్పటిదాకా యాక్టివ్‌గా కెమెరాలకు కనిపించిన కిరణ్‌రావ్ సైడ్ అయిపోవడంతో ఆ రూమార్లకు మరింత బలం చేకూరింది. Amir khan after every 15 years#AmirKhan #FatimaSanaShaikh pic.twitter.com/oPQzSajFsX — Iamsarcasterr_ (@iamsarcasterr) July 3, 2021 People celebrate the anniversary, these divorce are playing divorce. Aamir Khan did his second divorce#AamirKhan#KiranRao #FatimaSanaShaikh pic.twitter.com/Suvta7K2dG — ❤️ (@Agnostic_Ram) July 3, 2021 During that time #FatimaSanaShaikh didn't realize that i am gonna be next target of #amirkhan wife 😂🤣 pic.twitter.com/hSjsAaCYDp — sarcastic guy (@TheChandler007) July 3, 2021 Mere speculation of this affair by social police, #AamirKhan and #FatimaSanaShaikh aren't officially a couple. But, people started defaming both Aren't we living in morally dead society. pic.twitter.com/JcBYlrJ6j1 — Punologist™ (@Punology1) July 3, 2021 #EtimesPaps#FatimaSanaShaikh spotted in the city (Mumbai). While her memes are trending after #AamirKhanDivorce was announced, do you think it is 'cool' to put her in a spot? Tell us 👇 pic.twitter.com/kFNhJ4MDnT — ETimes (@etimes) July 3, 2021 -
రీనాతో 16 ఏళ్లు.. కిరణ్ రావుతో 15 ఏళ్లు.. ఎందుకిలా చేశావు ఆమిర్!?
వెబ్‌డెస్క్: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్గా పేరొందాడు ఆమిర్ ఖాన్. కుటుంబం మొత్తం సినీ నేపథ్యం ఉన్నదే. తండ్రి తాహిర్ హుస్సేన్ నిర్మాత. అంకుల్ నాసిర్ హుస్సేన్ 70వ దశకంలో బడా నిర్మాతగా, దర్శకుడిగా పేరు పొందాడు. ఇక ఆమిర్ ఖాన్ కజిన్ మన్సూర్ ఖాన్ కూడా దర్శకుడే. అతడి డైరెక్షన్లోనే ‘‘ఖయామత్ సే ఖయామత్ తక్’’తో సినీ హీరోగా అరంగేట్రం చేశాడు ఆమిర్. తొలి సినిమాతోనే.. ‘‘అరె.. పక్కింటి కుర్రాడిలా ఉన్నాడే’’ అనిపించేలా తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. దిల్, దిల్ హై కే మాన్తా నహీ, ఇష్క్, జో జీతా హై వహీ సికిందర్ వంటి సినిమాలతో ఫర్వాలేదనిపించిన ఆమిర్ ఖాన్... 90వ దశకం నుంచి విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్నాడు. రంగీలా, ఇష్క్ వంటి సినిమాల్లో కనిపించిన అతడు.. రాజా హిందుస్థానీతో తొలి ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు. ఇక లగాన్, త్రీ ఇడియట్స్, పీకే వంటి చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లగాన్‌తో నిర్మాణ సంస్థను స్థాపించిన ఆమిర్ ఖాన్.. తారే జమీన్పర్తో డైరెక్టర్‌గానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. కెరీర్లో ఇంతగా విజయవంతమైన ఆమిర్ ఖాన్.. వ్యక్తిగతంగా ముఖ్యంగా వివాహ బంధాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. అది కూడా రెండుసార్లు. పక్కింటి అమ్మాయి రీనాతో ‘ఇష్క్’ తమ పక్కింట్లో ఉండే అమ్మాయిపై మనసు పారేసుకున్నాడు ఆమిర్ ఖాన్. వీలు చిక్కినప్పుడల్లా.. గంటల తరబడి కిటికీలో నుంచే ఆమెను చూసేవాడు. మూగగా ఆరాధించేవాడు. రోజులు గడుస్తున్నాయి. అటువైపు నుంచి పెద్దగా స్పందన లేదు. ఇలా అయితే లాభం లేదనుకున్నాడు ఆమిర్. ఆఖరికి.. ధైర్యం చేసి.. ఒకరోజు రీనా దత్తాకు తన ప్రేమ గురించి చెప్పాడు. ఆమె.. ‘నో’ చెప్పింది. కానీ అతడు వదల్లేదు. పట్టువీడని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్చ్... అయినా రీనా మనసు కరగలేదు. నువ్వంటే నాకూ ఇష్టమే ఆమిర్ గుండె పగిలింది. తను మారదు... ఇక కుదరదులే అని ఆశలు వదిలేసుకున్న సమయంలో... రీనా స్వీట్ షాకిచ్చింది. ‘‘నువ్వంటే నాకూ ఇష్టమే’’ అని సిగ్గుల మొగ్గయింది. ఎగిరి గంతేశాడు ఆమిర్. ఇంకేముంది.. సరదాలు.. సంతోషాలు.. షికార్లు.. షరా మామూలే. రీనాను సర్ప్రైజ్ చేసేందుకు సగటు ప్రేమికుడు వేసే వేషాలన్నీ వేశాడు ఆమిర్. తనను ఇంప్రెస్ చేసేందుకు రక్తంతో ప్రేమలేఖ రాశాడు కూడా. కానీ రీనాకు ఇది అస్సలు నచ్చలేదు. ఇంకోసారి ఇలా చేస్తే.. నీతో మాట్లాడేదే లేదు అని కరాఖండిగా చెప్పేసింది. ప్రేమను నిరూపించుకునేందుకు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని గట్టిగానే హెచ్చరించింది. 2002లో విడిపోయారు ఆమిర్‌కు ఆమెపై ప్రేమతో పాటు గౌరవం కూడా పెరిగింది. పెళ్లి చేసుకోవాలనే నిశ్చయానికి వచ్చారిద్దరూ. 1986లో ఏప్రిల్ 18న వివాహం చేసుకున్నారు. ఈ జంటకు జునైద్ ఖాన్, ఇరా ఖాన్ సంతానం. పదహారేళ్లపాటు ఆమిర్- రీనా కాపురం సాఫీగా సాగిపోయింది. ఆ తర్వాత అభిప్రాయ బేధాలు తలెత్తిన కారణంగా స్నేహ పూర్వకంగానే విడిపోతున్నట్లు ప్రకటించారు. 2002లో వివాహ బంధానికి స్వస్తి పలికారు. నిర్మాతగా మొదటి భార్య.. అసిస్టెంట్ డైరెక్టర్‌తో ప్రేమ! విడాకులు తీసుకున్న తర్వాత కూడా రీనాతో అనుబంధం కొనసాగించాడు ఆమిర్ ఖాన్. ఇద్దరూ కలిసి పానీ ఫౌండేషన్ తరఫున సామాజిక సేవలో భాగమయ్యారు. ఇక లగాన్ సినిమాతో ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించిన ఆమిర్ ఖాన్... నిర్మాతగా వ్యవహరించాలని రీనాను కోరాడు. హీరోను పెళ్లాడినప్పటికీ రీనాకు సినిమాలపై పెద్దగా ఇంట్రస్ట్ లేదు. నిర్మాణ రంగంపై అసలే అవగాహన లేదు. ఆమిర్ కోసం ఆమె.. ప్రేమలో అతడు కానీ.. ఆమిర్ సాయం కోరాడన్న ఒక్క కారణంతో రీనా పెద్ద సాహసమే చేసింది. లగాన్ వంటి నేపథ్యం ఉన్న సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు సిద్ధపడింది. సుభాష్ ఘాయ్(ప్రముఖ ఫిల్మ్ మేకర్)ను కలిసింది. అప్పటి వరకు ల్యాబ్‌లో అడుగుపెట్టని ఆమె.. మన్మోహన్ శెట్టి(ల్యాబ్ యజమాని)ని అడిగి అన్ని వివరాలు తెలుసుకుంది. సినీ నిర్మాణ వ్యవహారాలపై అవగాహన పెంచుకుంది. ఎట్టకేలకు లగాన్‌ను పట్టాలెక్కించింది. అయితే, లగాన్ సినిమా సమయంలోనే ఆమిర్ ఖాన్‌కు రెండో ప్రేమ లభించింది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కిరణ్ రావుతో ఏర్పడ్డ పరిచయం.. ప్రణయం, ఆపై పరిణయానికి దారి తీసింది. ఆమె.. హీరోయిన్ అతిథి రావు హైదరి కజిన్. వీరిద్దరి పూర్వీకులు గద్వాల్(వనపర్తి- తెలంగాణ) సంస్థానానికి చెందిన వారు. 2005లో పెళ్లి బంధంతో ఒక్కటైన కిరణ్- ఆమిర్ సరోగసి పద్ధతిలో ఆజాద్ అనే కుమారుడికి జన్మనిచ్చారు. .కానీ, ఈ బంధం కూడా 15 ఏళ్లకే విడాకుల వరకు వెళ్లింది. తామిద్దరం భార్యాభర్తలుగా విడిపోతున్నామని, ఆజాద్‌కు మాత్రం... తల్లిదండ్రులుగా అన్ని బాధ్యతలు కలిసి నెరవేరుస్తామని శనివారం ప్రకటించారు కిరణ్ రావు- ఆమిర్ ఖాన్ దంపతులు. స్నేహితులుగా కొనసాగుతామని, రీనా దత్తా సీఓఓగా వ్యవహరిస్తున్న పానీ ఫౌండేషన్ వ్యవహారాల్లో కలిసి పనిచేస్తామని సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దీంతో.. సినిమాల్లో మిస్టర్ పర్ఫెక్ట్గా ఉండే నువ్వు ఎందుకిలా చేశావు ఆమిర్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. -
విడాకులు తీసుకున్న హీరో అమీర్ ఖాన్
-
కొత్త జీవితం కోసం విడిపోతున్నాం!
Aamir Khan Kiran Rao Divorce: ‘‘ఈ 15 ఏళ్ల ప్రయాణంలో ఒక జీవితానికి సరిపడా ఆనందాన్ని, అనుభూతులను పంచుకున్నాం. మా బంధం బలపడటానికి కారణం – ఒకరి మీద ఒకరికి ఉన్న నమ్మకం, గౌరవం, ప్రేమ. ఇప్పుడు మేమిద్దరం మా జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ఆరంభించాలనుకుంటున్నాం. ఇక మేం ఎప్పటికీ భార్యాభర్తలం కాదు. అయితే మా బాబు ఆజాద్‌ని కలిసి పెంచుతాం’’ అని శనివారం హిందీ నటుడు–నిర్మాత–దర్శకుడు ఆమిర్ ఖాన్, ఆయన భార్య –నిర్మాత–దర్శ కురాలు కిరణ్ రావు ఓ ప్రకటన విడుదల చేశారు. విడిపోవాలనే నిర్ణయాన్ని ఈ ఇద్దరూ చాలా రోజుల క్రితమే తీసుకున్నారట. ‘‘ఇది కొన్ని రోజుల క్రితం తీసుకున్న నిర్ణయం అయినప్పటికీ విడిపోవడానికి కావల్సినవన్నీ పూర్తి కావడంతో విడివిడిగా జీవితాలను ఆరంభించడానికి ఇది సరైన సమయం అనిపించింది. కుటుంబ సభ్యుల బాధ్యతలు నిర్వర్తించడానికి, వృత్తిపరంగా కలిసి పని చేయడానికి మేం సుముఖంగా ఉన్నాం. అలాగే ‘పానీ’ ఫౌండేషన్ వ్యవహారాలను ఇద్దరం కలిసే చూసుకుంటాం. నిజానికి మా కుటుంబ సభ్యులు, స్నేహితులు మమ్మల్ని అర్థం చేసుకోవడంవల్లే విడిపోవాలనే నిర్ణయం తీసుకోగలిగాం. వారికి ధన్యవాదాలు. ఈ విడాకులు అంతం కాదు. మా కొత్త జీవితానికి ఆరంభం అని అనుకుంటారని భావిస్తున్నాం’’ అని ఆమిర్‌ఖాన్, కిరణ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... ‘లగాన్’ సినిమాలో నటిస్తున్నప్పుడు కిరణ్ రావుని తొలిసారి కలిశారు ఆమిర్ ఖాన్. ఆ సినిమాకు ఆమె దర్శకత్వ శాఖలో చేశారు. అయితే ఆ సినిమా అప్పుడు వీళ్ల మధ్య స్నేహానికి మించిన బంధం ఏదీ ఏర్పడలేదు. ఈ విషయాన్ని ఓ సందర్భంలో ఆమిర్ ఖానే చెప్పారు. అయితే 2002లో ఆమిర్ తన భార్య రీనా దత్తా నుంచి విడాకులు తీసుకున్న సమయంలో ఏదో పని మీద కిరణ్ ఫోన్ చేశారట. ‘‘ఆ రోజు ఆమెతో దాదాపు అరగంట మాట్లాడాను. ఫోన్ పెట్టేశాక ‘ఈమెతో మాట్లాడితే ఇంత ఆనందంగా ఉందేంటి?’ అనిపించింది’’ అని ఆమిర్ ఆ తర్వాత ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఆ తర్వాత ఇద్దరు మనసులూ కలవడం, పెళ్లి వరకూ వెళ్లడం తెలిసిందే. 2005 డిసెంబర్ 28న ఆమిర్, కిరణ్‌ల వివాహం జరిగింది. ఆ తర్వాత అద్దె గర్భం ద్వారా 2011లో వీరికి బాబు పుట్టాడు. ఆమిర్, రీనా దత్తాకి ఒక బాబు జునైద్, పాప ఐరా ఉన్నారు. -
భార్యతో కలిసి పాటలు పాడిన అమీర్
అటు వినోదం, ఇటు సందేశం రెండూ ముఖ్యమేనంటారు బాలీవుడ్ కథానాయకుడు అమీర్ ఖాన్. కేవలం తెర మీద కనిపిస్తే సరిపోదని, తెర వెనుక సాయం కూడా చేయాలంటున్నారు. తాజాగా కరోనా వ్యతిరేక పోరాటంలో శక్తివంచన లేకుండా శ్రమిస్తున్న వారికి నీరాజనాలు అర్పించేందుకు "ఐ ఫర్ ఇండియా" లైవ్ కన్సర్ట్ నిర్వహించారు. ఇందులో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ఎందరో నటీనటులు పాల్గొన్నారు. ఆదివారం రాత్రి ఏడున్నర గంటలకు ఫేస్బుక్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో విలక్షణ హీరో అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ దంపతులు అలనాటి పాటను మనోహరంగా ఆలపించారు. మిస్టర్ పర్ఫెక్షనిస్టు పాట కూడా పర్ఫెక్టుగా పాడారంటూ అభిమానులు ఆశ్చర్యానుభూతులకు లోనవుతున్నారు. కాగా ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను తిండి, పనీ లేక ఇబ్బందులు పడుతున్నవారికి సాయం అందిస్తామని తెలిపారు. (ప్రేమ విషయాన్ని దాచలేదు: హీరో కూతురు) చదవండి: (పిండిలో నోట్ల కట్టలు: ఇది రాబిన్ హుడ్ పనే) -
నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో అమీర్ ఖాన్ వారసురాలు
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మేన కోడలు జాయాన్ మేరీ ఖాన్ నటిగా సినీ ప్రవేశం చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ లాంటి ప్రఖ్యాత సిరిస్ ద్వారా అమీర్ వారసురాలిగా చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నారు. కాగా తాను నటించిన ‘మిసెస్ సీరియల్ కిల్లర్’ నెట్‌ఫ్లిక్స్‌లో శనివారం విడుదలకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రీమియర్ షోను అమీర్ ఇంటి కుటుంబంతో కలిసి వీక్షించారు. ఇంట్లోనే ప్రోజెక్టర్ ద్వారా ఈ షో చూసిన అమీర్.. తన భార్య కిరణ్ రావ్, కూతురు ఇరా ఖాన్‌తో కలిసి చూసేందుకు సూట్‌తో హజరయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇరా తన ఇన్‌స్టాగ్రామలో శనివారం షేర్ చేశారు. (‘ప్రభాస్-అమీర్‌లతో మల్టీస్టారర్ చిత్రం చేయాలి’) View this post on Instagram And it begins! @zaynmarie I love you to bits and I'm so proud of you and happy for you. Quarantine or not, WW3 or not, bad week or great year, we'll always be there to go through it with you. Through the great and the terrible! Fan girlling you at the poster and embarrassing on the red carpet. I'm sorry we weren't physically with you. But I'm sure you could hear the hooting and cheering in Panchgani! Congratulations on the beginning of your career in the film industry🤗❤ . . . #zanyforzayn #hottie #sisterlove #proud #tearsofjoy #celebrate #debut #zaynmariekhan A post shared by Ira Khan (@khan.ira) on May 1, 2020 at 5:01am PDT డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఆమిర్ కూతురు! ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం పంచుకున్నారు. ఈ ఫొటోలకు ‘ఇది ప్రారంభం మాత్రమే. నటిగా నీ కెరీర్‌ను ప్రారంభించావు. ఐ లవ్ యూ జయాన్. నీ మొదటి చిత్రం విడుదలైంది నాకు చాలా సంతోషంగా ఉంది. అంతే కాదు నిన్ను చూస్తే గర్వంగా కూడా ఉంది. ఎలాంటి పరిస్థితులోనైనా నీకు అండగా మేము ఉంటాం. హర్రర్ చిత్రంలో నటన చూసి అభిమానులు నటిగా సినీ పరిశ్రమలోకి రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వనిస్తారని ఆశిస్తున్నాను. నీతో కలిసి ఈ క్షణాన్ని పంచుకోలేనందుకు చాలా బాధగా ఉన్న .. మా మాట వింటున్నావనే అనుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ జయాన్’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. (మన కథ ముగిసింది: నీతూ కపూర్) కాగా హర్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ‘మిసెస్ సీరియల్ కిల్లర్’ శిరీష్ కుందన్ దర్వకత్వం వహించారు. మనోజ్ బాజ్‌పేయి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీయల్ కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో సాగుతుంది. ఇందులో అమీర్ మేన కోడలు జయాన్ కిడ్నాప్‌కు గురయ్యే యువతి పాత్రలో కనిపించనుంది. ఇందులో మోహిత్ రైనా కూడా నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం అమీర్ చందన్ అద్వైత్ చందన్ రూపోందిస్తున్న లాల్ సింగ్ చందన్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. -
కదిలించే కథలు
వంద పదాల సారాన్ని ఒక్క దృశ్యం చూపిస్తుంది. జీవితకాలపు సందేశాన్ని పదిసెకండ్ల ఫిల్మ్ ప్రొజెక్ట్ చేస్తుంది. ఇప్పుడు సెల్యులాయిడ్ తరం కాదు.. సెల్యులర్ టైమ్! ఏదైనా అరచేతి ఫోన్లో ప్రత్యక్షం కావాలి. సెకన్లలో తెలిసిపోవాలి. ఇవ్వాళ్టి మార్కెట్ స్ట్రాటజీ కూడా బ్రివిటీనే. ఈ జనరేషన్ కోరుకుంటున్న ఆ డిమాండ్‌ను అనుసరించే ఫేస్బుక్ ఓ కొత్త ప్రయత్నాన్ని పోస్ట్ చేసింది. దాని పేరే థంబ్స్టాపర్స్. పదిసెకన్లలో కమర్షియల్ యాడ్స్‌ను ప్రమోట్ చేసే సిస్టమ్. ‘‘షార్ట్‌స్టోరీస్ మూవ్ హార్ట్స్’’ పేరుతో వాటిని ప్రదర్శించడం మొదలు పెట్టేసింది కూడా. ప్రముఖ దర్శకురాలు కిరణ్‌రావు తీసిన రెండు షార్ట్‌ఫిల్మ్స్‌తో. ధైర్యం చేయడానికి క్షణం చాలు.. గృహహింసకు వ్యతిరేకంగా కిరణ్‌రావు తీసిన షార్ట్‌ఫిల్మ్‌కి క్యాప్షన్ అది. భర్త చేతిలో శారీరక హింసకు గురైన ఓ గృహిణికి ఒక యువతి ఫోన్ ఇస్తుంది .. 100 నంబర్ డయల్ చేసి. ఒక లిప్తపాటు తాత్సారం చేసి ప్రెస్ బటన్ నొక్కుతుంది ఆ గృహిణి. అప్పుడు వస్తుందీ కాప్షన్.. ధైర్యం చేయడానికి క్షణం చాలు అని. ఇంటి నుంచే మొదలవ్వాలి.. ఇది ఆమె తీసిన ఇంకో షార్ట్‌ఫిల్మ్... జెండర్ డిస్క్రిమినేషన్ మీద. ఒక అమ్మ తన కొడుకు, కూతురికి రెండుగ్లాసుల్లో పాలు పోసి ఇస్తుంది. కూతురి గ్లాస్లో కన్నా కొడుకు గ్లాస్లో పాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని గమనించిన ఆ అబ్బాయి తన గ్లాస్‌లోంచి చెల్లి గ్లాస్‌లోకి పాలు వంపి.. రెండు గ్లాసుల్లో పాలను సమం చేస్తాడు. మార్పు మొదలవడానికి రెండు క్షణాలు చాలు అనే వ్యాఖ్యతో ఈ షార్ట్‌ఫిల్మ్ ముగుస్తుంది. గొంతుచించుకోకుండా నిరసన తెలపొచ్చు.. సిటీబస్‌లో.. నిలబడ్డ ఒక అబ్బాయి తన ముందు సీట్లో కూర్చున్న అమ్మాయి ఛాతీ వంక అదేపనిగా చూస్తూంటాడు. ఆ అమ్మాయి పక్కనే కూర్చున్న ఇంకో అబ్బాయి అది గమనించి తన షర్ట్ కాలర్‌ను ఛాతి కిందకు జారుస్తూ ‘‘ఇప్పుడు చూడు’’అన్నట్టుగా సైగ చేస్తాడు నిలబడ్డ అబ్బాయితో. అంతే అతను గతుక్కుమని చూపు తిప్పుకుంటాడు. ‘‘నాట్ ఆల్ ప్రొటెస్ట్స్ ఆర్ లౌడ్’’ అనే కాప్షన్ వస్తుంది. మాతృత్వానికి జెండర్ లేదు.. రుతుక్రమం గురించి నెట్లో సెర్చ్ చేసి కూతురికి వివరిస్తూంటాడు తండ్రి. ‘‘మదర్‌హుడ్ హాజ్ నో జెండర్’’ అనే మెస్సేజ్‌తో ముగుస్తుంది ఈ షార్ట్‌ఫిల్మ్. సామర్థ్యమే ముఖ్యం జిమ్‌లో.. ఒక స్థూలకాయురాలు.. అలవోకగా శీర్షాసనం వేస్తుంది అందరూ ఆశ్చర్యపోయేలా. అప్పుడు వస్తుంది కాప్షన్ ఎబిలిటీ మ్యాటర్స్ అని. అందమైన లోకం ఒక ట్రాన్స్ ఉమన్ పెట్టుకున్న చెవి జుంకాలు చూసి ‘‘ఎక్కడ కొన్నావ్.. చాలా బావున్నాయ్.. నీ అందాన్ని పెంచేలా’’ అంటూ కితాబిస్తుంది ఓ యువతి. ఆనందంగా ‘థాంక్స్’ చెప్తుంది ఆ ట్రాన్స్ ఉమన్. ‘‘యాన్ ఈక్వల్ వరల్డ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ వరల్డ్’’ అనే వ్యాఖ్యతో ఎండ్ అవుతుంది ఆ షార్ట్‌స్టోరీ. -
ఇండస్ట్రీలో అది సహజం : స్టార్ హీరో భార్య
కిరణ్‌రావ్ ఒకప్పుడు ఆమిర్‌ఖాన్ భార్య. తప్పుగా అనుకోకండి. ఇప్పుడూ ఆమిర్‌ఖాన్ భార్యే. అయితే అంతకుమించిన గుర్తింపునే ఆమె సంపాదించుకున్నారు. ‘ధోబీఘాట్’, ‘దంగల్’ ‘సీక్రెట్ సూపర్‌స్టార్’, ‘తలాష్’ సినిమాలు సూపర్‌హిట్ అయ్యాక, కిరణ్రావ్కి సూపర్‌హిట్ చిత్రాల దర్శక నిర్మాతగా పేరు వచ్చింది. ఏదైనా ఒక దాని మీద ఇండస్ట్రీలో మాటా మాట వచ్చిందంటే.. ‘మనకెందులే’ అని దూరంగా ఉండిపోరు కిరణ్. అది ఆమెకు ఉన్న ఇంకో ఐడెంటిటీ. బాలీవుడ్లో ఇప్పుడొక టాక్ నడుస్తోంది. నెపోటిజం ముందు పుట్టి బాలీవుడ్ తర్వాత పుట్టిందని! నెపోటిజం అంటే బంధుప్రీతి. కొత్తవాళ్లలో ఎంత టాలెంట్ ఉన్నా.. నిర్మాతలు గానీ, డైరెక్టర్లు గానీ.. సొంతవాళ్లనే పైకి తెస్తుంటారని ఒక అభిప్రాయం ఉంది. ‘‘అవును నిజమే’’ అన్నారు కిరణ్! ఏంటి నిజం? అభిప్రాయం ఉండడం నిజం అనా? ‘‘కాదు. బంధుప్రీతి ఉంది అన్న మాట నిజం’’ అని ఆమె అన్నారు. ‘‘ఎక్కడ లేదు చెప్పండి బంధుప్రీతి? అన్నిచోట్లా ఉంది. అలాగే సినిమా ఇండస్ట్రీలోనూ ఉంది. అయితే ఇండస్ట్రీలో మనకు తెలిసినవాళ్లు ఉన్నారని టాలెంట్‌కి పదును పెట్టుకోకుండా ఎవరూ ముందుకు వెళ్లిపోకూడదు. వెళితే ఇబ్బందులు పడతారు. విమర్శలకు నొచ్చుకుంటారు. పిల్లల్ని వాళ్లు కోరుకునేలా తీర్చిదిద్దాలి తప్పితే, వాళ్లు చేయవలసిన వర్క్‌ని కూడా మనమే తీర్చిదిద్దే పని పెట్టుకోకూడదు. చివరికి నిలిచేది మాత్రం టాలెంటే. టాలెంట్ ఉంటే మన తరఫున ఎవరూ మాట్లాడనక్కర్లేదు’’ అన్నారు కిరణ్‌రావ్. -
అందుకే విడాకులు తీసుకున్నా : ఆమిర్ ఖాన్
16 ఏళ్ల వైవాహిక బంధానికి తెరపడినప్పటికీ, తన మాజీ భార్య రీనా దత్తాతో ఇప్పటికీ స్నేహబంధం కొనసాగుతూనే ఉందన్నాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. ఇటీవల.. కరణ్ జోహార్ చాట్ షోలో పాల్గొన్న ఆమిర్ మాట్లాడుతూ.. రీనాకు విడాకులు ఇవ్వడం వెనుక ఉన్న కారణాలు వెల్లడించాడు. ‘రీనాకు విడాకులు ఇచ్చినంత మాత్రాన ఆమెపై నాకు గౌరవం లేనట్లు కాదు. విడిపోయిన సమయంలో మా ఇద్దరితో పాటు కుటుంబ సభ్యులు కూడా చాలా బాధ పడ్డారు. కానీ అభిప్రాయ భేదాలు వచ్చాక కలిసి ఉండటంలో అర్థం లేదు. ఆమెపై నాకున్న ప్రేమ తగ్గిపోయింది. చాలా చిన్న వయసులోనే మాకు పెళ్లి అయింది బహుశా ఈ కారణం వల్లే అలా జరిగిపోయి ఉంటుంది’ అంటూ ఆమిర్ చెప్పుకొచ్చాడు. భార్యాభర్తలుగా విడిపోయామే కానీ స్నేహితులుగా ఎల్లప్పుడూ కలిసే ఉంటామని, సామాజిక కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటామని పేర్కొన్నాడు. కాగా 2002లో రీనాతో విడాకులు తీసుకున్న ఆమిర్ ఖాన్.. మూడేళ్ల అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్ కిరణ్ రావును ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. -
‘వారితో కలిసి పని చేయం’
దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం ఉధృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బాధితులకు అండగా నిల్చేందుకు ముందుకు వస్తున్నారు ఇండస్ట్రీలోని ప్రముఖ మహిళలు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలోని ఓ 11 మంది ప్రమఖులు ప్రస్తుతం లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి విషయంలో.. నిరూపితమైన నేరస్తులతో ఇక మీదట కలిసి పని చేసేది లేదని తీర్మానించారు. ఇందుకు అనుగుణంగా సోషల్ మీడియా ద్వారా ఓ లేఖను విడుదల చేశారు. అంతేకాక కిరణ్ రావ్, కొంకణా సేన్ శర్మ, నందితా దాస్, మేఘ్న గుల్జార్, నిత్యా మిశ్రా, రీమా కగ్తీ, రుచి నరైన్, అలంక్రితా శ్రీవాస్తవ, గౌరి షిండే, షోనాలి బోసే, జోయా అఖ్తర్ వంటి ప్రముఖులు ఈ లేఖ మీద సంతకం చేశారు. #metooindia pic.twitter.com/19a6Duj6IR — Konkona Sensharma (@konkonas) October 14, 2018 ఈ లేఖలో ‘ఓ మహిళగా, చిత్ర పరిశ్రమకు చెందిన వారిగా మేము ‘మీటూ ఉద్యమా’నికి పూర్తి మద్దతు తెలుపుతున్నాము. వేధింపుల గురించి బయటకు వెల్లడించిన వారికి అండగా నిలుస్తాము. వారి ధైర్యాన్ని అభినందిస్తున్నాము. ఇక మీదట పరిశ్రమలో ఒక సురక్షితమైన, వివక్షకు తావులేని వాతావరణాన్ని సృష్టించాడానికి, అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తాము. నిరూపితమైన నేరస్తులతో పని చేయకూడదని నిర్ణయించుకున్నాము. మా సహచరులను కూడా అదే విధంగా చేయమని కోరుతున్నామం’టూ లేఖలో తెలిపారు. మీటూ ఉద్యమం ఫలితంగా ఇప్పటికే అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు పలు చిత్రాల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. -
‘అప్పుడే కిరణ్‌తో ప్రేమలో పడిపోయా’
విలక్షణమైన పాత్రలతో ఆకట్టుకునే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ సినిమాలకు ఇండియాతో పాటు, చైనాలో కూడా మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన పీకే, దబాంగ్ వంటి సినిమాలు చైనా బాక్సాఫీస్‌ను కూడా బద్దలుగొట్టాయి. దీంతో చైనా ఫ్యాన్స్‌కు ఆమిర్‌తో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. అయితే పర్సనల్ విషయాలను ఎక్కువగా షేర్ చేసుకోని ఆమిర్ ఓ చైనీస్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రీనా అంటే ఎంతో గౌరవం ఉంది.. తన వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడిన ఆమిర్.. తన మాజీ భార్య రీనా దత్తా అంటే తనకెంతో గౌరవం ఉందని, ఇప్పటికీ తమ మధ్య మంచి స్నేహ బంధం ఉందని తెలిపారు. ఆమెతో కలిసి పానీ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నానన్నారు. రీనాతో విడాకులు తీసుకున్న మూడేళ్ల తర్వాత కిరణ్ రావు తన జీవితంలోకి వచ్చిందంటూ తన ప్రేమ కథను చెప్పుకొచ్చారు. తను లేని నా జీవితాన్ని ఊహించడం కష్టం... ‘లగాన్ సినిమా సమయంలో కిరణ్‌ని కలిశాను. అప్పటికీ తనొక అసిస్టెంట్ డైరెక్టర్‌గా మాత్రమే నాకు తెలుసు. కానీ ఒకరోజు సడన్‌గా కిరణ్ నుంచి కాల్ వచ్చింది. సినిమాకు సంబంధించి ఏవేవో కొన్ని విషయాలు మాట్లాడింది. అప్పటి వరకు తనతో స్నేహం కూడా లేదు. కానీ ఎందుకో తను ఫోన్ కట్ చేయగానే ఆత్మీయురాల్ని మిస్ అయిన ఫీలింగ్. అందుకే అప్పటి నుంచి తనతో మాట్లాడేందుకు ఎదురుచూసే వాణ్ణి. తనతో మాట్లాడిన ప్రతీసారి ఎంతో సంతోషంగా ఉండేది. ఆ క్రమంలో తనతో ఎప్పుడు ప్రేమలో పడిపోయానో నాకే తెలియదు. అందుకే తనని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. 2005లో మా వివాహం జరిగింది. తనులేని నా జీవితం ఊహించడం ఎంతో కష్టం’ అంటూ ఆమిర్ చిరునవ్వులు చిందించారు. -
టాప్ హీరోకు స్వైన్‌ప్లూ
ముంబై/పుణె: బాలీవుడ్ టాప్ హీరో ఆమిర్‌ఖాన్, ఆయన భార్య కిరణ్రావులకు స్వైన్‌ఫ్లూ బారిన పడ్డారు. దీంతో ఆదివారం సాయంత్రం పుణెలో ఆమీర్‌కు చెందిన పానీ ఫౌండేషన్ నేతృత్వంలో నిర్వహించిన ‘సత్యమేవ జయతే వాటర్ కప్ 2017’ అవార్డుల ప్రదాన కార్యక్రమానికి ఆమిర్‌ఖాన్ హాజరుకాలేకపోయారు. ప్రత్యక్ష వీడియో ద్వారా సదస్సుకు హాజరైనవారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తమకు సోకిన స్వైన్‌ఫ్లూ ఇతరులకు వ్యాపించకూడదనే ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని ఆమిర్ ఖాన్ తెలిపారు. తనకు బదులుగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని స్నేహితుడు షారూఖ్‌ఖాన్‌ను కోరడంతో ఆయన హాజరయ్యారని వెల్లడించారు. సత్యమేవ జయతే వాటర్ కప్ 2017లో భాగస్వాములైన గ్రామాలను ఆయన అభినందించారు. 'ఈ కార్యక్రమానికి రావాలని అనుకున్నాం. కానీ ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో నాకు హెచ్1ఎన్1 వైరస్ సోకిందని తెలిసింది. విశ్రాంతి తీసుకోవాలని, ఎటువంటి పబ్లిక్ ఫంక్షన్లకు వెళ్లరాదని వైద్యులు సూచించారు. డాక్టర్ల సలహామేరకు ఇతరులకు వ్యాపించకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రాలేకపోయాన'ని ఆమిర్ వీడియో ద్వారా తెలిపారు. కిరణ్‌రావు కూడా వీడియోలో ఆయన పక్కనే ఉన్నారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ, పారిశ్రామికవేత్త రాజీవ్ బజాజ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. -
హీరో భార్య ఇంట్లో దొంగలుపడ్డారు
ముంబై: బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ భార్య కిరణ్ రావు ఇంట్లో దొంగతనం జరిగింది. డైమండ్ నెక్లెస్, ఉంగరం సహా దాదాపు 80 లక్షల రూపాయల విలువైన నగలను దోచుకెళ్లారు. కిరణ్ రావు ఇటీవల ఈ విషయాన్ని గుర్తించింది. కిరణ్ రావు బంధువు ఫిర్యాదు మేరకు ఖర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసుకున్నారు. కిరణ్ రావుకు ముంబైలోని బాంద్రాలో ఓ ఇల్లు ఉంది. కాగా ఆమె తన భర్త ఆమిర్‌తో కలసి కార్టర్ రోడ్డులోని అపార్ట్మెంట్లో ఉంటోంది. బాంద్రా ఇంట్లో ఆమె బంధువులు ఉంటున్నారు. ఈ ఇంటి బెడ్రూంలో కిరణ్ దాచిన నగలు మాయమయ్యాయి. ఆమె బంధువు ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి ఇంట్లో పరిశీలించారు. ఇంట్లో పనిచేస్తున్న వారు నగలు కాజేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఐదు రోజుల నుంచి ముగ్గురు పనిమనుషులను విచారిస్తున్నారు. -
షాక్ ఇచ్చిన ఆమిర్ ఖాన్
ముంబై: బాలీవుడు విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ తన మాటలు, నడవడికపై చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా పబ్లిక్ కార్యక్రమాలు, విలేకరుల సమావేశాల్లో ఆచితూచి మాట్లాడతారు. హుందాగా వ్యవహరిస్తుంటారు. ముంబైలో గురువారం 18వ జియో 'మామి' ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో ఆమిర్ ఖాన్ అందరికీ తియ్యటి షాక్ ఇచ్చారు. తన భార్య కిరణ్ రావును ముద్దుపెట్టుకుని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. సినిమాల్లో ముద్దుసీన్లు పండించినా పబ్లిక్ కార్యక్రమాల్లో ఆమిర్ ఖాన్ ఈ విధంగా వ్యవహరించిన సందర్భాలు లేకపోవడంతో అక్కడున్నవారంతా ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. భార్యను ఆమిర్ ఖాన్ ముద్దు పెట్టుకున్న ఫొటోలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. గుబురు గడ్డం, చెవికి పోగు, కళ్లజోడు, నల్లరంగు సూట్ లో మెరిన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్... 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా వివాదంపై స్పందించేందుకు నిరాకరించాడు. మరోవైపు ఆమిర్ ఖాన్ తాజాగా సినిమా 'దంగల్' విడుదలకు సిద్ధమవుతోంది. గురువారం విడుదలైన 'దంగల్' ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో యూబ్యూట్ లో 95 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. -
కశ్మీర్ స్కూల్ కు కిరణ్ రావు థ్యాంక్స్
శ్రీనగర్(జమ్మూకశ్మీర్): బాలనటి జైరా వాసిం చదువుతున్న సెయింట్ పాల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ భార్య కిరణ్ రావు సందర్శించారు. జైరాను తమ సినిమా 'దంగల్'లో నటించేందుకు అనుమతి ఇచ్చినందుకు ప్రిన్సిపాల్ కు ధన్యవాదాలు తెలిపారు. జైరాకు సెలవులు మంజూరు చేయడమే కాకుండా, ఆమెకు చదువుకోసం పర్సనల్ ట్యూటర్ ను ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. అంతకుముందు కిరణ్ రావుకు పాఠశాల విద్యార్థులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. 'దంగల్' సినిమాలో గీతా పొగట్ చిన్ననాటి పాత్రలో జైరా నటిస్తోంది. యూటీవీ మోషన్స్, ఆమీర్ ఖాన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది క్రిస్ మస్ కు ఈ సినిమా విడుదలకానుంది. -
ఆమిర్ ఖాన్ భార్యకు అభినందనలు
హైదరాబాద్: వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆమిర్ ఖాన్‌కు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి బాసటగా నిలిచారు. అసహనంపై చేసిన వ్యాఖ్యలకు ఆమిర్ ఖాన్ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశభక్తిని పెంపొందించే ఎన్నో చిత్రాలలో నటించిన ఆమిర్.. సముచిత స్థానంలో ఉన్నాడని ఆయన తెలిపారు. గత కొన్ని మాసాలుగా తానూ అభద్రతాభావంతో ఉన్నానని జైపాల్ రెడ్డి వెల్లడించారు. పెరుగుతున్న అసహనంపై తన అభిప్రాయాన్ని నిజాయితీగా భర్తకు తెలిపిన కిరణ్ రావును ఆయన అభినందించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె అలా అభిప్రాపయడటం సహజమేనని జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. -
అమీర్‌ఖాన్‌కు నోటీసులు
-
అమీర్‌ఖాన్‌కు నోటీసులు
ముంబై: బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ ఇపుడు చిక్కుల్లో పడ్డారు. పాపులర్ టీవీ షో సత్యమేవ జయతేలో జాతీయ చిహ్నాన్ని (లోగో), అందులో సత్యమేవ జయతే అనే భాగాన్ని కేంద్ప్రభుత్వ అనుమతి లేకుండా సొంత ప్రయోజనాలకు వాడుకున్నారనే ఆరోపణలపై ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. ముంబైకి చెందిన మనోరంజన్ రాయ్ అనే ఆందోళనకారుడు తన లాయర్ ద్వారా ఈ నోటీసులు పంపించారు. విశేష ప్రజాదరణ పొందిన సత్యమేవ జయతే కార్యక్రమానికి యాంకర్ కమ్ నిర్మాతగా వ్యవహరించిన అమీర్‌ఖాన్, ఆయన భార్య, సహనిర్మాత కిరణ్ రావు, దర్శకుడు సత్యజిత్ భక్తల్ ను ఇందులో దోషులుగా పేర్కొన్నారు. జాతీయ చిహ్నాన్ని గానీ, దాంట్లోని ఏదైనా భాగాన్నిగానీ, వ్యక్తిగత, ఆర్థిక ప్రయోజనాలకు వాడుకోవడానికి ఎవరికీ అధికారం లేదని రాయ్ న్యాయవాది మనోజ్ సింగ్ వాదిస్తున్నారు. ఒకవేళ అనుమతి తీసుకుని ఉంటే దానికి సంబంధించిన పత్రాలను చూపించాలని కోరారు. లేదంటే దీనికి సంబంధించి తన క్లయింటు తరఫున చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే దీనిపై స్పందించడానికి అమీర్ ఖాన్, కిరణ్‌రావు తదితరులెవ్వరూ అందుబాటులో లేరు. -
ఆమిర్‌ను మార్చిన వీడియో!
ఒక గంట వీడియో... ఆమిర్ ఖాన్‌ను ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకునేలా చేసింది. ఆ నిర్ణయం ఏంటంటే... ఇక జీవితాంతం ‘వేగన్‌గా ఉండిపోవాలనుకోవడం. కేవలం శాకాహారాన్నే తింటూ, పాల ఉత్పత్తులతో సహా ఏ జంతు ఉత్పత్తులనూ తిననివాళ్లను ‘వేగన్’ అంటారు. కొన్నేళ్లుగా చేపలు, రొయ్యలు.. ఇలా మాంసాహారాన్ని, పాలతో చేసే ఆహారాన్ని తెగ లాగించేసిన ఆమిర్ ఇక జీవితాంతం వాటిని దూరం పెట్టేయనున్నారు. ఈ నెల 14తో ఆయన 50వ పడిలోకి అడుగుపెడుతున్నారు. అందుకే ఇకపై ఆహారం విషయంలో శ్రద్ధ చూపించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన భార్య కిరణ్ రావ్ ఇచ్చిన సలహా మేరకు ‘వేగన్’గా మారారు. కొన్నేళ్లుగా వేగన్‌గా ఉంటున్న కిరణ్ రావ్, భర్తకు సలహా ఇవ్వడంతో పాటు ఓ వీడియో కూడా చూపించారు. గంటసేపు సాగే ఆ వీడియోలో అతి సహజంగా వచ్చే 15 రోగాలు ఎలా ప్రాణాలు తీస్తున్నాయనేది ఓ డాక్టర్ వివరించారు. అది చూసిన తర్వాత మాంసాహారుల కన్నా శాకాహారుల ఆరోగ్యం ఎంత మిన్నగా ఉంటుందో ఆమిర్ తెలుసుకున్నారట. ఈ వీడియోను ఆయన నెల క్రితం చూశారు. పుట్టినరోజు నుంచీ వేగన్‌గా మారాలనుకున్నారు. ఇన్నేళ్లూ మాంసాహారానికి అలవాటుపడిన ప్రాణం కదా.. ఉండగలనా? లేదా అని తనను తాను పరీక్షించుకోవడానికి నెల రోజులుగా శాకాహారమే తీసుకుంటున్నారు. ‘‘చికెన్, మటన్.. ఇలా ఏ బిర్యానీ అయినా నాకిష్టమే. ఓ పట్టు పట్టేవాణ్ణి. పాలతో చేసే మన భారతీయ మిఠాయిలంటే చాలా ఇష్టం. నెయ్యి, పనీర్ అంటే చాలా చాలా ఇష్టం. కానీ, ఇప్పుడు నా ఇష్టాలన్నింటినీ అనిష్టం చేసేసుకున్నా. ఆరోగ్యం కోసం త్యాగం తప్పదని ఫిక్స్ అయ్యా. నాకు టీ బాగా అలవాటు. అందుకే, సోయా పాలతో తయారు చేయించుకుని తాగుతున్నా’’ అని చెప్పారు. ముద్దుల తనయుడు ఆజాద్ రావ్ ఖాన్‌ను కూడా వేగన్లా పెంచాలని ఉందంటున్నారు ఆమిర్. కానీ, ఆ విషయంలో కిరణ్, తానూ ఒత్తిడి చేయమనీ, ఒకవేళ ఆజాద్ మాంసాహారం తినాలకుంటే ఒప్పుకుంటామనీ ఆయన చెప్పారు. -
గంటకు రెండు కోట్లు!
బాలీవుడ్ పాపులర్ కపుల్స్ వాణిజ్య ప్రకటనల్లో నటించడం సర్వసాధారణమే. ఇప్పటిదాకా అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్, సైఫ్ అలీఖాన్-కరీనాకపూర్‌లు బుల్లితెర మీద ప్రకటనలతో సందడి చేశారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ఆమిర్‌ఖాన్-కిరణ్‌రావ్ చేరుతున్నారు. ఇక్కడో ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రకటనలో నటించడానికి వారు కేటాయించింది గంటసేపే! ఆ గంటకు వారు ఎంత మొత్తం తీసుకుంటున్నారో తెలుసా..? అక్షరాలా రెండు కోట్లు! మరి క్రేజీ కపులా... మజాకానా..! -
కంప్లీట్మ్యాన్..ఆమిర్‌ఖాన్
చక్కటి సూట్ వేసుకొని మీటింగ్ నిర్వహిస్తుంటాడు కంపెనీ యజమాని. ఆ ఠీవికి అందరూ ముగ్ధులవుతుంటారు. పురుషుడి ఆత్మవిశ్వాసానికి ప్రతీక అన్నట్టుగా ఉంటుంది ఆ యాడ్! ఇది డెబ్భైల నాటి రేమండ్స్ కంపెనీ యాడ్. భార్యాభర్తలు ఆఫీస్‌కి రెడీ అయి వెహికల్ ఎక్కేస్తారు. భర్త డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. అంతలో ఒక్క నిమిషం అంటూ కారు దిగి ఇంట్లోకి వెళ్తుంది భార్య. ఐదు నిమిషాల తరువాత వచ్చి, కారెక్కి.. మళ్లీ ఒక్క నిమిషం అని కారు దిగి లోపలకు వెళ్తుంది. భర్త కారు దిగి భార్య వచ్చే వరకు పేపరు తిరగేస్తుంటాడు. ఆమె వచ్చాక ఇద్దరూ కార్లో కూర్చుంటారు. ఆమె అన్యమనస్కంగా ఉండటాన్ని అతను గమనిస్తాడు. ఈసారి ఇద్దరూ కారు దిగి ఇంట్లోకి వెళ్తారు. కాసేపటికి భర్త నెలల పసికందును భుజాన వేసుకొని బయటకు వస్తాడు భార్యను ఆఫీస్‌కి పంపడానికి బై చెప్తూ. డ్రైవింగ్ సీట్లో ఉన్న భార్య బిడ్డను వదల్లేనన్నట్టు చూస్తుంటే ‘మరేం పర్లేదు’ అన్నట్లు కళ్లతోనే భరోసా ఇస్తాడు. ఇది రేమండ్స్ ప్రెజెంట్ చేస్తున్న ఇప్పటి కంప్లీట్ మ్యాన్! డెబ్భైల నాటి యాడ్‌కి నేటి యాడ్‌కి ఎంత తేడా! ఇది కాలం మగవాడిలో తెచ్చిన మార్పు. బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్ ఇలాంటి ఆధునిక తండ్రే. దర్శకురాలైన తన భార్య కిరణ్‌రావు పోస్ట్‌ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంటే అప్పటికి నెలల వయసున్న తమ కొడుకు ‘ఆజాద్’ బాధ్యతను ఆమిరే చూసుకున్నాడట. అంతేకాదు ఆజాద్‌ను బడిలో దింప డం, తీసుకురావ డం... రాత్రి కథలు చెప్తూ నిద్రపుచ్చడంకూడా ఇష్టంగా చేస్తాడట. -
మా ఆయన బంగారం
ఒకరికొకరం... అమీర్‌ఖాన్ భార్యను అయినందుకు నేను గర్విస్తున్నాను. అంతమాత్రాన నా సొంత అస్తిత్వాన్ని కోల్పోవాలను కోవడం లేదు. సృజనాత్మకమైన పనుల్లో అమీర్ నన్ను తరచుగా ప్రోత్సహిస్తుంటారు. విలువైన సలహాలు ఇస్తుంటారు. అదృష్టమేమిటంటే మా ఇద్దరి అభిరుచులు ఒకేలా ఉంటాయి. ఇద్దరు వ్యక్తులు బాగా కలిసిపోవడానికి ఇద్దరికీ ఇష్టమైన మాధ్యం ఏదైనా ఉండాలి. మా ఇద్దరి తొలి ప్రాధాన్యం ‘సినిమా’ కాబట్టి మేము బాగా కలిసిపోయాం. రచన కావచ్చు, దర్శకత్వం కావచ్చు... ‘నేను ఫలానా పని చేయాలనుకుంటున్నాను’ అని అంటే ఆయన ఎంతో ప్రోత్సహిస్తారు. అండగా నిలబడతారు. అంతే తప్ప నిరాశ పరిచే మాటలేవీ మాట్లాడరు. ఆయన మాటలతో నాకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ‘‘ఒత్తిడితో పని చేయడం కంటే పని చేయకపోవడమే మంచిది’’ అంటారు ఆయన. నేను ఎప్పుడు ఒత్తిడికి గురైనా ఈ సలహాను ఒకటికి రెండుసార్లు గుర్తు తెచ్చుకుంటాను. మేమిద్దరం భార్యాభర్తలం మాత్రమే కాదు... మంచి స్నేహితులం కూడా. ఒకరిని ఒకరు గౌరవించుకుంటాం. అన్నిట్లోకీ ఆయనలో నాకు బాగా నచ్చేది... హాయిగా నవ్విస్తారు. మనసును తేలికపరుస్తారు. కిరణ్‌రావు, రచయిత్రి - నిర్మాత - దర్శకురాలు -
అసోంలో అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావ్ పుట్టిన రోజు వేడుక
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, దర్శకుడు కరణ్ జోహార్ లు అసోంలోని కజిరంగా జాతీయ పార్క్ ను సందర్శించారు. అమీర్ వెంట ఆయన సతీమణి కిరణ్ రావ్, కుమారుడు ఆజాద్ లు ఉన్నారు. అమీర్ ఖాన్ భార్య కరణ్ జోహార్ పుట్టిన రోజున ఆశ్చర్యం కలిగించే విధంగా అసోం పర్యటనకు ప్లాన్ చేశాను అని అన్నారు. అసోం ప్రజలు చూపించిన ప్రేమ, అందించిన అపూర్వ స్వాగతం తనకు ఆనందం కలిగించింది అని అన్నారు. రైనోలను చూడటానికి అధికారులు తోడుండగా కిరణ్, కరణ్, ఆజాద్ లతో కలిసి జీప్ లో సఫారీకి వెళ్లారు. -
నిన్నటి చిన్నపిల్ల ఖాన్ గారి అమ్మాయి!
ఆమిర్‌ఖాన్, ఆయన భార్య కిరణ్‌రావ్ ముంబైలో రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన దీపావళి పార్టీ... ఇరా ఖాన్ రాకతో మరింత దేదీప్యమానం అయింది! ఆకుపచ్చని చీరలో, చేతికి గాజులు వేసుకుని సంప్రదాయపు చిరునవ్వుతో తన తండ్రి ఇంట్లోకి ప్రవేశించిన ఇరాఖాన్ను, అప్పటికే పార్టీలో కాంతులను విరజిమ్ముతున్న ‘ఎ’లిస్ట్ తారలంతా తలలు తిప్పి చూడడం ఆమె తల్లి రీమా దత్ హృదయాన్ని ఉప్పొంగించే సంగతే కానీ, ఆ పార్టీలో ఆమె ఎక్కడా దర్శనమివ్వలేదు. రీమా, ఆమిర్ మొదటి భార్య. 1986 ఏప్రిల్‌లో వీరి పెళ్లి జరిగింది. పదిహేనేళ్ల తర్వాత 2002 డిసెంబరులో విడిపోయారు. అప్పట్నుంచీ ఇరా, ఆమె సోదరుడు తల్లితోనే ఉంటున్నారు. ప్రతి దీపావళికీ ఇరా తన తండ్రి ఇచ్చే పార్టీకి బాలీవుడ్‌లోని ఇతర ప్రముఖలతో పాటు ఒక అతిథిగా హాజరువుతూనే ఉంటుంది. అయితే ఈసారి ఆమె తన పదహారవ యేట ఒక పరిపూర్ణమైన స్త్రీగా ప్రత్యక్షం అవడం అందరినీ ముగ్ధులను చేసింది. -
'సత్యమేవ జయతే' అమీర్ కు అమెరికా అవార్డు!
'సత్యమేవ జయతే' టెలివిజన్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకున్న అమీర్ ఖాన్ ను అమెరిఆక అబ్రాడ్ మీడియా అవార్డుతో సత్కరించారు. తన కార్యక్రమం ద్వారా సామాజిక సమస్యలను వెలుగులోకి తెచ్చినందుకుగాను అమీర్ ను ఈ అవార్డు వరించింది. అమీర్ తోపాటు అస్కార్ అవార్డునందుకున్న దర్శకుడు కాత్రియాన్ బిగెలో, ఇంటర్నెషనల్ సెంటర్ ఆన్ నాన్ వాయిలంట్ కన్ ఫ్లిక్ట్ (ఐసీఎన్ సీ)లను ఈ అవార్డుతో సత్కరించారు. దేశవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకున్న 'సత్యమేవ జయతే' కార్యక్రమం విదేశాల్లోని ప్రజలను ఆకట్టుకోవడం చాలా ఆనందంగా ఉందిన అని అమీర్ ఖాన్ తెలిపారు. నేను, నాజట్టు కార్యక్రమాన్ని విన్నూత్నంగా అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. అనేక సమస్యల పట్ల అవగాహన ఉంది. సమస్యలకు పరిష్కారం కూడా మావద్ద ఉంది అని అమీర్ అన్నారు. ఎప్పుడూ అవార్డు కార్యక్రమాలకు దూరంగా ఉండే అమీర్ ఖాన్ ఈ అవార్డును అందుకోవడానికి అమెరికా వెళ్లడం విశేషం. అమీర్ ఖాన్ వెంట ఆయన భార్య, దర్శకురాలు కిరణ్ రావు ఉన్నారు. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు వెళ్లనుంది అని ఆయన తెలిపారు.