దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం ఉధృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బాధితులకు అండగా నిల్చేందుకు ముందుకు వస్తున్నారు ఇండస్ట్రీలోని ప్రముఖ మహిళలు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలోని ఓ 11 మంది ప్రమఖులు ప్రస్తుతం లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి విషయంలో.. నిరూపితమైన నేరస్తులతో ఇక మీదట కలిసి పని చేసేది లేదని తీర్మానించారు. ఇందుకు అనుగుణంగా సోషల్ మీడియా ద్వారా ఓ లేఖను విడుదల చేశారు. అంతేకాక కిరణ్ రావ్, కొంకణా సేన్ శర్మ, నందితా దాస్, మేఘ్న గుల్జార్, నిత్యా మిశ్రా, రీమా కగ్తీ, రుచి నరైన్, అలంక్రితా శ్రీవాస్తవ, గౌరి షిండే, షోనాలి బోసే, జోయా అఖ్తర్ వంటి ప్రముఖులు ఈ లేఖ మీద సంతకం చేశారు.
#metooindia pic.twitter.com/19a6Duj6IR
— Konkona Sensharma (@konkonas) October 14, 2018
ఈ లేఖలో ‘ఓ మహిళగా, చిత్ర పరిశ్రమకు చెందిన వారిగా మేము ‘మీటూ ఉద్యమా’నికి పూర్తి మద్దతు తెలుపుతున్నాము. వేధింపుల గురించి బయటకు వెల్లడించిన వారికి అండగా నిలుస్తాము. వారి ధైర్యాన్ని అభినందిస్తున్నాము. ఇక మీదట పరిశ్రమలో ఒక సురక్షితమైన, వివక్షకు తావులేని వాతావరణాన్ని సృష్టించాడానికి, అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తాము. నిరూపితమైన నేరస్తులతో పని చేయకూడదని నిర్ణయించుకున్నాము. మా సహచరులను కూడా అదే విధంగా చేయమని కోరుతున్నామం’టూ లేఖలో తెలిపారు.
మీటూ ఉద్యమం ఫలితంగా ఇప్పటికే అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు పలు చిత్రాల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment