
దర్శకనిర్మాత కిరణ్‌రావు గురించి బాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌కు మాజీ భార్యగా అందరికీ సుపరిచితమే. 2005లో ఆమిర్.. కిరణ్ రావును రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఐవీఎఫ్- సరోగసి పద్ధతి ద్వారా 2011లో ఆజాద్ అనే కుమారుడు జన్మించాడు. దాదాపు 16 ఏళ్లపాటు అన్యోన్యంగా ఉన్న వీరిద్దరు 2021లో విడాకులు తీసుకున్నారు. భార్యా, భర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటున్నారు. కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటున్నారు. గతేడాది లపతా లేడీస్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు కిరణ్ రావు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ‍్యూకు హాజరైన కిరణ్ రావు తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అమీర్‌ఖాన్‌తో పెళ్లి విషయం గురించి మా తల్లిదండ్రులతో చెప్పితే వారంతా షాక్‌కు గురయ్యారని తెలిపింది. నా పేరేంట్స్ ఆందోళన చెందారని వివరించింది. అంతేకాదు తన నిర్ణయాన్ని మరోసారి ఆలోచించుకోవాలని చెప్పారని వెల్లడించింది. అమీర్ గొప్ప నటుడని.. అతనికున్న పేరు, ప్రతిష్టలతో నీపై ఒత్తిడి ఉంటుందని సూచించారు. అయినప్పటికీ అమిర్ ఖాన్‌ను పెళ్లాడేందుకు నిర్ణయించుకున్నట్లు కిరణ్ రావు తెలిపారు. అమిర్ గొప్ప వ్యక్తి అని ఆమె కొనియాడారు. కాగా.. గతేడాది అమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ పెళ్లికి కిరణ్ రావు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment