Lady directors
-
సీరియల్ డైరెక్టర్ ఇంట్లో దొంగతనం.. సీసీటీవీ వీడియో
హిందీలో పలు సీరియల్స్‌తో దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న స్వప్న జోషి ఇంట్లో దొంగతనం జరిగింది. ముంబైలోని అంధేరిలో ఈమె ఓ అపార్ట్మెంట్ 6వ ఫ్లోర్లో నివసిస్తోంది. మరి ఈమెని ఎన్నాళ్ల నుంచి గమనిస్తున్నాడో ఏమో గానీ రెండు రోజుల క్రితం ఓ దొంగ.. ఈమె ఇంట్లోకి ప్రవేశించాడు. పైపులు పట్టుకుని పైకెక్కి మరీ వచ్చేశాడు.(ఇదీ చదవండి: సినిమా సూపర్ హిట్.. కానీ అద్దె ఇంట్లోకి స్టార్ హీరోయిన్)లోపలికి వచ్చిన తర్వాత ఇల్లంతా తిరిగిన దొంగకు పెద్దగా వస్తువులేం కనిపించలేదు. పెంపుడు పిల్లి అరవడంతో స్వప్నతో పాటు ఆమె కుటుంబ సభ్యులు నిద్ర లేచారు. ఇంతలోనే దొంగ.. రూ.6000 ఖరీదు చేసే హ్యాండ్ బ్యాగ్‌ని తీసుకుని వచ్చిన కిటికీ నుంచి కిందకు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఈ దొంగతనం విషయమై దర్శకురాలు స్వప్న.. అంబోలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మరోవైపు స్నప్న స్నేహితుడు అశోక్ పండిట్.. దొంగతనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. 6వ ఫ్లోర్‌లోకి కూడా దొంగ ప్రవేశించాడంటే ఆలోచించాల్సిన విషయమేనని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఇప్పుడీ డైరెక్టర్ ఇంట్లో దొంగతనం వీడియో ఇప్పుడు చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: మలయాళ ఇండస్ట్రీలో మరో కుదుపు.. ఒకేసారి 17 మంది రాజీనామా)A thief broke into Marathi director #SwapnaJoshi's flat by scaling a pipe, stealing Rs 6,000 before being chased out by her son-in-law.More details 🔗 https://t.co/a4nBTjLXmQ pic.twitter.com/ttGshEpUZ3— The Times Of India (@timesofindia) August 27, 2024 -
ఆకాశమే వీళ్ల హద్దు
-
‘వారితో కలిసి పని చేయం’
దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం ఉధృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బాధితులకు అండగా నిల్చేందుకు ముందుకు వస్తున్నారు ఇండస్ట్రీలోని ప్రముఖ మహిళలు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలోని ఓ 11 మంది ప్రమఖులు ప్రస్తుతం లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి విషయంలో.. నిరూపితమైన నేరస్తులతో ఇక మీదట కలిసి పని చేసేది లేదని తీర్మానించారు. ఇందుకు అనుగుణంగా సోషల్ మీడియా ద్వారా ఓ లేఖను విడుదల చేశారు. అంతేకాక కిరణ్ రావ్, కొంకణా సేన్ శర్మ, నందితా దాస్, మేఘ్న గుల్జార్, నిత్యా మిశ్రా, రీమా కగ్తీ, రుచి నరైన్, అలంక్రితా శ్రీవాస్తవ, గౌరి షిండే, షోనాలి బోసే, జోయా అఖ్తర్ వంటి ప్రముఖులు ఈ లేఖ మీద సంతకం చేశారు. #metooindia pic.twitter.com/19a6Duj6IR — Konkona Sensharma (@konkonas) October 14, 2018 ఈ లేఖలో ‘ఓ మహిళగా, చిత్ర పరిశ్రమకు చెందిన వారిగా మేము ‘మీటూ ఉద్యమా’నికి పూర్తి మద్దతు తెలుపుతున్నాము. వేధింపుల గురించి బయటకు వెల్లడించిన వారికి అండగా నిలుస్తాము. వారి ధైర్యాన్ని అభినందిస్తున్నాము. ఇక మీదట పరిశ్రమలో ఒక సురక్షితమైన, వివక్షకు తావులేని వాతావరణాన్ని సృష్టించాడానికి, అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తాము. నిరూపితమైన నేరస్తులతో పని చేయకూడదని నిర్ణయించుకున్నాము. మా సహచరులను కూడా అదే విధంగా చేయమని కోరుతున్నామం’టూ లేఖలో తెలిపారు. మీటూ ఉద్యమం ఫలితంగా ఇప్పటికే అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు పలు చిత్రాల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. -
ఆ ఐదుగురితో డెరైక్షన్ చేస్తానంటున్న సోనమ్!
పులి కడుపున పులే పుడుతుంది. అనిల్ కపూర్ గారాలపట్టి సోనమ్ కపూర్ అదే నిరూపించారు. చాలా తక్కువ సమయంలోనే మంచి నటిగా పేరు తెచ్చుకున్నారామె. అయితే ఆమె దానితోనే సంతృప్తిపడదలచుకోలేదు. మెగాఫోన్ పట్టే ఆలోచనలో కూడా ఆమె ఉన్నారు. ఇంతకీ సోనమ్ ఎప్పుడు డెరైక్టర్ అవుతారు? కథలు రెడీ చేసుకున్నారా? డెరైక్టర్ అయ్యాక ఏయే కథానాయికలతో సినిమాలు తీయాలనుకుంటున్నారు?.. ఆ విషయాలు తెలుసుకుందాం... * కథానాయికగా అడుగుపెట్టే ముందు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దగ్గర సోనమ్ కపూర్ దర్శకత్వ శాఖలో చేశారు. మూడేళ్ల పాటు ఆయన దగ్గర డెరైక్షన్ నుంచి పలు విషయాలు తెలుసుకున్నారు. అంతకు ముందు సింగపూర్‌లో యునెటైడ్ వరల్డ్ కాలేజ్ ఆఫ్ సౌత్-ఈస్ట్ ఏషియాలో థియేటర్లో అండ్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. అక్కడ డెరైక్షన్, రైటింగ్ నేర్చుకున్నారు. * సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘బ్లాక్’ చిత్రానికి సోనమ్ దర్శకత్వ శాఖలో చేశారు. ఆ సినిమా చేస్తున్నప్పుడే భన్సాలీ తన తదుపరి చిత్రం ‘సావరియా’లో హీరోయిన్గా నటించమని సోనమ్‌ని అడిగారు. అప్పుడు ఈ బ్యూటీ దాదాపు 80 కిలోల బరువు ఉండేవారు. ‘సావరియా’లో నటించడం కోసం 35 కిలోలు తగ్గారు. మొదటి చిత్రంతోనే తన అందచందాలు, అభినయంతో అందర్నీ ఆకట్టుకుని, క్రేజీ హీరోయిన్ అయిపోయారు సోనమ్. అక్కణ్ణుంచి వెనక్కి తిరిగి చూసే అవసరం లేకుండా బిజీ బిజీగా సినిమాలు చేస్తున్నారు. * కథానాయికగా బిజీ అయినప్పటికీ డెరైక్షన్ చేయాలనే తన లక్ష్యాన్ని సోనమ్ మర్చిపోలేదు. వీలు కుదిరినప్పుడల్లా రకరకాల కాన్సెప్టులు అనుకుంటున్నారు. కొన్ని కథలు కూడా రాసుకున్నారు. రొమాంటిక్ మూవీస్ అంటే సోనమ్‌కు చాలా ఇష్టం. ఆ తరహా చిత్రాలు, కామెడీ మూవీస్‌ని తెరకెక్కించాలనుకుంటున్నారామె. మరో ఐదు, పదేళ్లల్లో మెగాఫోన్ పట్టుకోవాలనుకుంటున్నారు. * ఓ దర్శకురాలిగా ఏయే కథానాయికలతో సినిమాలు చేయాలో కూడా సోనమ్ ఓ జాబితా రాసుకున్నారు. ఆ జాబితాలో దీపికా పదుకొనె, అనుష్కా శర్మ, పరిణీతి చోప్రా, ఆలియా భట్, స్వర భాస్కర్ ఉన్నారు. ఈ ఐదుగురూ చాలా టాలెంటెడ్ అనీ, ఎలాంటి పాత్రలో అయినా నటింపజేయవచ్చని సోనమ్ అంటున్నారు. ‘‘వీళ్ల పేర్లు చెప్పినంత మాత్రాన మిగతా కథానాయికలు వేస్ట్ అని నా ఉద్దేశం కాదు. అందరూ ప్రతిభావంతులే. అందుకని మిగతావాళ్లతో కూడా సినిమాలు చేస్తా’’ అంటున్నారు సోనమ్. మొత్తం మీద సోనమ్ చెబుతున్న మాటలు చూస్తుంటే డెరైక్షన్ని ఆమె సీరియస్‌గానే తీసుకున్నారని అనిపిస్తోంది. హిందీలో మీరా నాయర్, దీపా మెహతా, ఫరా ఖాన్, నందితా దాస్ వంటి లేడీ డెరైక్టర్స్ ఉన్నారు. భవిష్యత్తులో వీళ్ల జాబితాలో సోనమ్ చేరతారు. అయితే, వాళ్లందరూ వేరు. సోనమ్ వేరు. కమర్షియల్ చిత్రాల కథానాయికగా పేరు తెచ్చుకున్న కేటగిరీలో ఉన్న తార సోనమ్. సో.. సోనమ్ నుంచి ఎలాంటి చిత్రాలు వస్తాయి? నటిగా పేరు తెచ్చుకున్న సోనమ్ దర్శకురాలిగా కూడా భేష్ అనిపించుకుంటారా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.