సీరియల్ డైరెక్టర్ ఇంట్లో దొంగతనం.. సీసీటీవీ వీడియో | Director Swapna Joshi House Theft CCTV Video Viral | Sakshi
Sakshi News home page

దర్శకురాలి ఇంట్లో చోరీ.. పిల్లి అరవడంతో చివరకు

Published Wed, Aug 28 2024 1:18 PM | Last Updated on Wed, Aug 28 2024 1:23 PM

Director Swapna Joshi House Theft CCTV Video Viral

హిందీలో పలు సీరియల్స్‌తో దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న స్వప్న జోషి ఇంట్లో దొంగతనం జరిగింది. ముంబైలోని అంధేరిలో ఈమె ఓ అపార్ట్‌మెంట్ 6వ ఫ్లోర్‌లో నివసిస్తోంది. మరి ఈమెని ఎన్నాళ్ల నుంచి గమనిస్తున్నాడో ఏమో గానీ రెండు రోజుల క్రితం ఓ దొంగ.. ఈమె ఇంట్లోకి ప్రవేశించాడు. పైపులు పట్టుకుని పైకెక్కి మరీ వచ్చేశాడు.

(ఇదీ చదవండి: సినిమా సూపర్ హిట్.. కానీ అద్దె ఇంట్లోకి స్టార్ హీరోయిన్)

లోపలికి వచ్చిన తర్వాత ఇల్లంతా తిరిగిన దొంగకు పెద్దగా వస్తువులేం కనిపించలేదు. పెంపుడు పిల్లి అరవడంతో స్వప్నతో పాటు ఆమె కుటుంబ సభ్యులు నిద్ర లేచారు. ఇంతలోనే దొంగ.. రూ.6000 ఖరీదు చేసే హ్యాండ్ బ్యాగ్‌ని తీసుకుని వచ్చిన కిటికీ నుంచి కిందకు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ దొంగతనం విషయమై దర్శకురాలు స్వప్న.. అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మరోవైపు స్నప్న స్నేహితుడు అశోక్ పండిట్.. దొంగతనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. 6వ ఫ్లోర్‌లోకి కూడా దొంగ ప్రవేశించాడంటే ఆలోచించాల్సిన విషయమేనని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఇప్పుడీ డైరెక్టర్ ఇంట్లో దొంగతనం వీడియో ఇప్పుడు చర్చనీయాంశమైంది.

(ఇదీ చదవండి: మలయాళ ఇండస్ట్రీలో మరో కుదుపు.. ఒకేసారి 17 మంది రాజీనామా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement