Hindi serials
-
సీరియల్ డైరెక్టర్ ఇంట్లో దొంగతనం.. సీసీటీవీ వీడియో
హిందీలో పలు సీరియల్స్‌తో దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న స్వప్న జోషి ఇంట్లో దొంగతనం జరిగింది. ముంబైలోని అంధేరిలో ఈమె ఓ అపార్ట్మెంట్ 6వ ఫ్లోర్లో నివసిస్తోంది. మరి ఈమెని ఎన్నాళ్ల నుంచి గమనిస్తున్నాడో ఏమో గానీ రెండు రోజుల క్రితం ఓ దొంగ.. ఈమె ఇంట్లోకి ప్రవేశించాడు. పైపులు పట్టుకుని పైకెక్కి మరీ వచ్చేశాడు.(ఇదీ చదవండి: సినిమా సూపర్ హిట్.. కానీ అద్దె ఇంట్లోకి స్టార్ హీరోయిన్)లోపలికి వచ్చిన తర్వాత ఇల్లంతా తిరిగిన దొంగకు పెద్దగా వస్తువులేం కనిపించలేదు. పెంపుడు పిల్లి అరవడంతో స్వప్నతో పాటు ఆమె కుటుంబ సభ్యులు నిద్ర లేచారు. ఇంతలోనే దొంగ.. రూ.6000 ఖరీదు చేసే హ్యాండ్ బ్యాగ్‌ని తీసుకుని వచ్చిన కిటికీ నుంచి కిందకు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఈ దొంగతనం విషయమై దర్శకురాలు స్వప్న.. అంబోలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మరోవైపు స్నప్న స్నేహితుడు అశోక్ పండిట్.. దొంగతనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. 6వ ఫ్లోర్‌లోకి కూడా దొంగ ప్రవేశించాడంటే ఆలోచించాల్సిన విషయమేనని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఇప్పుడీ డైరెక్టర్ ఇంట్లో దొంగతనం వీడియో ఇప్పుడు చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: మలయాళ ఇండస్ట్రీలో మరో కుదుపు.. ఒకేసారి 17 మంది రాజీనామా)A thief broke into Marathi director #SwapnaJoshi's flat by scaling a pipe, stealing Rs 6,000 before being chased out by her son-in-law.More details 🔗 https://t.co/a4nBTjLXmQ pic.twitter.com/ttGshEpUZ3— The Times Of India (@timesofindia) August 27, 2024 -
టీమిండియాలో నో ఛాన్స్.. హిందీ సీరియల్లో నటిస్తున్న శిఖర్ ధావన్!
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ దావన్ ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడుతున్న ధావన్‌ను భారత సెలక్టర్లు పక్కన పెట్టారు. రోహిత్ గైర్హాజరీ నేపథ్యంలో పలు సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన ధావన్.. ఇప్పుడు పూర్తిగా జట్టులోనే చోటు కోల్పోయాడు. దావన్ చివరగా గతేడాది ఆఖరిలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా తరపున ఆడాడు. అనంతరం అతడు స్థానాన్ని యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌తో సెలక్టర్లు భర్తీ చేశారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా దావన్ వ్యవహరించబోతున్నాడు. గత సీజన్లో తమ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన మయాంక్ అగర్వాల్ స్ధానంలో గబ్బర్ను పంజాబ్ నియమించింది. ఈ ఏడాది సీజన్‌కు ముందు మయాంక్ అగర్వాల్‌ను పంజాబ్ విడిచిపెట్టింది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ మార్చి31 నుంచి ప్రారంభం కానుంది. సీరియల్లో నటిస్తున్న ధావన్... కాగా ఐపీఎల్ ఆరంభానికి ముందు ధావన్ ఓ హిందీ ఓ హిందీ సీరియల్లో నటిస్తూ బిజీబీజీగా ఉన్నాడు. జీ ఛానెల్లో ప్రసారమయ్యే హిందీ సీరియల్ ‘కుండలి భాగ్య’లో ఓ పోలీస్ అధికారి పాత్రలో గబ్బర్ కనిపించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ధావన్ పోలీస్ లూక్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇ ధావన్ క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం చాలా ఎక్టివ్‌గా ఉంటాడు. ఎప్పటికప్పుడు డ్యాన్స్, ఇన్‌స్టా రీల్స్‌తో అభిమానులను అలరిస్తూ ఉంటాడు. ఇప్పడు మరో కొత్త రోల్లో అభిమానలను గబ్బర్ అలరించబోతున్నాడు. చదవండి: Virender Sehwag: కుంబ్లేతో గొడవలు.. హెడ్‌కోచ్‌గా నన్ను రమ్మని కోహ్లి కోరాడు View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) -
ట్యూషన్ టీచర్ నాపై లైంగిక దాడికి ప్రయత్నించాడు: నటి
Actress Devoleena Bhattacharjee Revealed About Shocking Incident In Her Childhood: ప్రముఖ హిందీ సీరియల్ నటి దేవొలీనా భట్టాచార్య.. చిన్నతనంలో తనపై జరిగిన లైంగిక దాడిని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యింది. ఇటీవలె ఓ షోలో పాల్గొన్న ఆమె ఓ సందర్భంలో మాట్లాడుతూ..'చిన్నప్పుడు ట్యూషన్‌కు వెళ్తే మ్యాథ్స్ టీచర్ తనతో చాలా తప్పుగా ప్రవర్తించాడని పేర్కొంది. అతనికి చాలా మంచి టీచర్ అని గుర్తింపు ఉండేది. నా ఫ్రెండ్స్ సహా చాలా మంది పిల్లలు ఆయన దగ్గరికే ట్యూషన్‌కు వెళ్లేవారు. అయితే వారం రోజుల తర్వాత నా ఫ్రెండ్స్‌లో ఇద్దరు ట్యూషన్‌కు వెళ్లడం మానేశారు. ఏం జరిగింది అని అడిగినా చెప్పలేదు. ఆ తర్వాత ఓరోజు ఎప్పటిలాగానే నేను ట్యాషన్‌కు వెళ్లాను. అయితే అతను నాపై లైంగిక చర్యకు ప్రయత్నించాడు. వెంటనే ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని అమ్మకి వివరించాను. ఆ తర్వాత ట్యూషన్ టీచర్ ఇంటికి వెళ్లి అతని భార్యతో జరిగిందంతా చెప్పాం. ఆ సమయంలో ఆ టీచర్‌పై పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలనిపించింది. కానీ ఇంట్లో వాళ్లు అలా చేయలేదు. దయచేసి మీ పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పులు గమనిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి. అంతే తప్పా చూసీ చూడకుండా వదిలేయకండి' అంటూ తల్లిదండ్రులకు విఙ్ఞప్తి చేసింది. -
ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో బాలనటుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది. ఛత్తీస్గడ్ రాయ్‌పూర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో అనేక హిందీ టీవీ సీరియళ్లలో నటించిన శివలేఖ్ సింగ్ (14) దుర్మరణం పాలయ్యారు. గురువారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. రాయ్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ ఆరిఫ్ షేక్ అందించిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో శివలేఖ్ అక్కడికక్కడే మరణించగా, అతని తల్లి లేఖ్నా సింగ్, తండ్రి శివేంద్రసింగ్ తోపాటు మరో వ్యక్తి కూడా గాయాలపాలయ్యారు. అయితే తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. కారులో బిలాస్పూర్ నుంచి రాయ్‌పూర్ వైపు వెళుతుండగా వేగంగా వచ్చిన ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం తరువాత పారిపోయిన ట్రక్ డ్రైవర్‌ను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. చత్తీస్‌గడ్‌లోని జంజ్‌గిర్-చంపా జిల్లాకు చెందిన శివలేఖ్ సింగ్ తల్లిదండ్రులతో ముంబైలో నివసిస్తున్నారు. ‘సంకట్ మోచన్ హనుమాన్’, ‘ససురాల్ సియర్ కా’ లాంటి సీరియల్స్‌తోపాటు అనేక టీవీ రియాల్టీ షోలలో శివలేఖ్ కనిపించారు. -
ఆ షోలో నేను నటించట్లేదు: నటి
సోనీ టీవీలో ప్రసారమవుతున్న హిందీ సీరియల్ ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ లో లీడ్ క్యారక్టర్ ‘డయాబెన్’గా తాను నటించబోతున్నట్టు వచ్చిన వార్తలు వట్టి రూమరని నటి విభూతి శర్మ కొట్టిపారేసింది. ఆ సీరియల్‌ను తాను ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదని స్పష్టం చేసింది. డయాబెన్ పాత్రను ఇంతకు ముందు నటి దిశా వకాని పోషించింది. ఆమె గత ఏడాదిన్నరగా మెటర్నిటీ లీవ్‌లో ఉంది. లీవ్ అయిపోయిన తర్వాత నిర్మాతకు ఆమె కొన్ని కండిషన్స్ పెట్టిందనీ, వాటికి నిర్మాత ఒప్పుకోకపోవడంతో ఆమె స్థానంలో విభూతి శర్మను తీసుకున్నట్టుగా ఒక వార్త మీడియాలో షికారు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ.. తనకు సీరియల్స్‌లో నటించే ఉద్దేశం లేదని, ఒకవేళ నటించాల్సి వస్తే నా వయసు, ఆసక్తిని పరిగణనలోకి తీసుకుని అప్పుడు నిర్ణయం తీసుకుంటానని పేర్కొంది. -
సీఐడీలకే డాడీ!
ఈ రోజుల్లో సీఐడీ సీరియల్ హిందీలోనే కాకుండా అన్ని భాషల్లోనూ ప్రసారమవుతోంది. వేల ఎపిసోడ్లుగా వచ్చిన సీఐడి లాంటి సీరియల్స్‌కి అంకురం వేసింది మాత్రం నాటి దూరదర్శన్ సీరియల్ కరమ్‌చంద్. సిల్లీ క్వెశ్చన్స్తో కిట్టీ, ఫన్నీ మ్యానరిజంతో కరమ్‌చంద్ చిన్నచిన్న ఆధారాలతో నేరస్తులను పట్టుకుంటూ చిన్నతెరమీద చేసిన హంగామాయే డిటెక్టివ్ ‘కరమ్‌చంద్.’ డిటెక్టివ్ అంటే నోట్లో పొడవాటి సిగార్ ఉండదు. ఎదుటివారి కళ్లలో వెతికే అనుమానపు జాడలు ఉండవు. అసలు, అప్పటి వరకు నవలల్లో చదివిన కథానాయకుడిలా ఈ డిటెక్టివ్ ఉండనే ఉండడు. ఈ డిటెక్టివ్ కరమ్‌చంద్ చాలా డిఫరెంట్. కేసులను క్యారెట్లలా కరకర నమిలేస్తూ నేరస్తులను అవలీలగా చట్టానికి పట్టిస్తుంటాడు. షెల్ఫ్‌లో మిస్టరీ భర్త చనిపోవడంతో మిసెస్ లోబో లాండ్రీ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు చెడు వ్యసనాల బారిన పడి తల్లిని డబ్బులివ్వమని వేధిస్తూ ఉంటాడు. ఓ రోజు లాండ్రీలో పని చేసే మోహన్ ఇంటికి వెళ్లిపోతానంటే ‘ఇంకా పని మిగిలి ఉంది. షట్టర్ కిందకు దించేసి వెళ్లిపొమ్మ’ని చెబుతుంది లోబో. మరుసటిరోజు ఉదయం మోహన్ వచ్చి చూసేసరికి షట్టర్ కిందకు అలాగే దించి ఉంటుంది, తాళం ఉండదు. ఆశ్చర్యపోయిన మోహన్ ‘మేడమ్, ముందే వచ్చి, బయటకు వెళ్లి ఉంటారు’ అనుకొని పనిలో నిమగ్నమవుతాడు. లాండ్రీ బట్టలు ఇవ్వమని కస్టమర్ సంధ్య, తన కోటు ఇవ్వమని డిటెక్టివ్ కరమ్‌చంద్ అక్కడకు వస్తారు. వారి బట్టల కోసం వెతుకుతుండగా మిసెస్ లోబో షెల్ఫ్‌లో శవమై కనిపిస్తుంది. మిసెస్ లోబోను ఎవరు చంపారన్నది పెద్ద మిస్టరీగా మారుతుంది. కస్టమర్ సంధ్యకి ఆమె మాజీ ప్రియుడు రాసిన ఉత్తరం లాండ్రీ బట్టల్లో ఉండిపోతుంది. ఉత్తరం కోసమై వచ్చిన సంధ్య భర్త తనకేమీ తెలియదన్న లోబోను కొట్టడం వల్ల ఆమె చనిపోయిందన్న విషయాన్ని షోరూమ్‌లో దొరికిన మందుల డబ్బా ఆధారంగా నిరూపిస్తాడు డిటెక్టివ్ కరమ్^è ంద్. నకిలీ పెయింటింగ్ రాజేష్–అంజు భార్యాభర్తలు. వారింటి అల్మారాలో డెడ్‌బాడీ ఉన్నట్టు తెలుస్తుంది. స్క్రూడ్రైవర్ ఆయుధంగా హంతకుడు ఈ ఘాతుకం చేశాడని తెలుసుకుంటాడు కరమ్‌చంద్. అక్కడ దొరికిన స్క్రూ ఆధారంగా కేసు స్టడీ చేస్తాడు. ఆ హాల్లో ఉన్న అత్యంత ఖరీదైన పెయింటింగ్‌ను దొంగిలించి, దాని ప్లేస్‌లో నకిలీ పెయింటింగ్‌ను ఉంచడానికి కబీర్చంద్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టుగా అసలు విషయాన్ని బయటపెడతాడు కరమ్‌చంద్. నేరమూ–శోధన ఇలా అన్నీ నేర కథనాలే. అనుకోకుండా జరిగిన హత్యలు కొన్ని. కావాలని చేసిన హత్యలు మరికొన్ని. మనుషులను మనుషులు చంపుకుంటూ సమాజం నుంచి తప్పించుకు తిరగాలనుకునేవారిని డిటెక్టివ్ కరమచంద్ శోధించి సాధించి ప్రేక్షకుల ముందు నిలబెడతాడు. నేరస్తులను పట్టుకునేవిధానంలో చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ చూపిస్తారు. ఇది చూసిన ప్రేక్షకులు డిటెక్టివ్ తెలివిని మెచ్చుకుంటూ చప్పట్లతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ‘కరమ్‌చంద్’ పేరుతో 1985లో వచ్చిన ఈ డిటెక్టివ్ సీరియల్ దూరదర్శన్ ప్రేక్షకులలో ఆసక్తిని రేపింది. నేరాలను ఎలా శోధిస్తారో, నిందితులను చిన్న చిన్న ఆధారాల ద్వారా ఎలా పట్టుకుంటారో చూపించింది. మొత్తం 50 ఎపిసోడ్లు. కరమ్చంద్ను హీరోని చేసేసింది దూరదర్శన్. అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పంకజ్‌కపూర్ డిటెక్టివ్ పాత్ర పోషిస్తే, బాలీవుడ్ నటి సుస్మితా ముఖర్జీ కిట్టీ పేరుతో అతని సెక్రటరీగా నటించారు. ఈ ఇద్దరినీ ప్రేక్షకులు అమితంగా ప్రేమించారు. ఇలాంటి డిటెక్టివ్‌ను మళ్లీ ఇప్పుడు చూడలేం అంటారు అప్పటి ప్రేక్షకులను పలకరిస్తే. – ఎన్.ఆర్ కరమ్‌చంద్ సీరియల్ ఎంత పెద్ద హిట్ సాధించిందో చెప్పడానికి రెండవ సీజన్నీ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మొదటి భాగం దూరదర్శన్‌లో 1985లో వస్తే, రెండవ సీజన్ 2007లో సోనీ టీవీలో వచ్చింది. సీజన్1లో ఎపిసోడ్ సమయం 25 నిమిషాలు ఉంటే, సీజన్ 2లో సీరియల్ నిడివిని 45 నిమిషాలకు పెంచారు. రెండవ సీజన్లోనూ కరమ్చంద్గా పంకజ్ కపూర్ నటించారు. కిట్టీగా సుచేత ఖన్నా అలరించారు. ‘షటప్ కిట్టీ..!’ డిటెక్టివ్ కరమ్చంద్కి ఒక ఫన్నీ అసిస్టెంట్ ఉంటుంది. ఆమె పేరు కిట్టీ. సిల్లీ క్వెశ్వన్స్తో కరమ్చంద్ను విసిగించడమే పనిగా ఉంటుంది. లేదంటే రహస్యాన్ని ముందే బయట పెట్టేస్తుంది. వర్క్ పట్ల ఆమెకున్న డెడికేషన్ వల్ల కరమ్‌చంద్ చాలా ఓపికగా భరిస్తూ ఉంటాడు. కేసులో కిట్టీ విచిత్రప్రశ్నలను సంధించిన ప్రతీసారి ‘షట్ అప్ కిట్టీ’ అనే మాటను ఈ డిటెక్టివ్ ఉపయోగిస్తుంటాడు. క్యారెట్లు.. నల్లకళ్లద్దాలు డిటెక్టివ్‌కు ఒక మ్యానరిజం ఉండాలని, అందుకు తనదైన మార్క్ ఉండాలని ఆలోచించారు దర్శకుడు పరాశర్. ఆ బాడీలాంగ్వేజ్ ప్రేక్షకుల మదిలో అలాగే నిలిచిపోవాలనీ అనుకున్నారు. అందుకు ఓ పద్ధతిని ఎంచుకున్నారు. కరమ్చంద్ను ‘కాఫీ తాగుతారా’ అని అడిగితే– ‘ఎసిడిటీ రావచ్చు’ అంటాడు. ‘సిగెరెట్..’ అంటూ ఆఫర్ చేస్తే ‘లంగ్స్‌కి ఎఫెక్ట్..’ అంటాడు. అదే సమయంలో నా దగ్గర గాజర్ ఉందిగా అంటూ క్యారెట్ తీసుకొని కరకర నములుతూ ఉంటాడు. కేసులను కూడా ఇలాగే నమిలేస్తా అంటూ క్యారెట్‌తో చూపుతుంటాడు. మిస్టరీ అని చెప్పడానికి సూచనగా కళ్లద్దాల పై నుంచి, పక్కగా చూపులను సారించడం నాటి టెలివిజన్‌కు కొత్త కళను తెచ్చింది. కరమ్‌చంద్ పాత్రకు పంకజ్ కపూర్ వన్నె తెచ్చారు అనేవారంతా. కరమ్‌చంద్ పుణ్యమా అని క్యారెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయేవట. నల్ల కళ్లద్దాల అమ్మకాలు వింటర్లోనూ విపరీతంగా ఉండేవట. పరాశర్‌కి నచ్చిన పంకజ్ కపూర్ కరమ్‌చంద్ క్యారెక్టర్‌కి ముందు ‘హమ్‌లోగ్’ పాత్రధారి అలోక్నాథ్ని, కిట్టీగా సుధీర్ మిశ్రాను అనుకున్నారట. అలోక్నాథ్కి– దర్శకుడు పంకజ్ పరాశర్‌కి ఏవో మనస్పర్ధలు రావడంతో ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయారు. ‘పంకజ్కపూర్ని చూసినప్పుడు నాకు ముందు సినీ నటుడు దిలీప్‌కుమార్ గుర్తుకు వచ్చారు. నా అభిమాన నటుడు సీరియల్లో నటించడానికి వచ్చాడనుకున్నాను. వారానికి 1500 రూపాయలు ఇచ్చే అంగీకారం మీద పంకజ్ ముంబయ్‌కి వచ్చారు’ అని పరాశర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరో విచిత్రమేమంటే ఈ సీరియల్‌కి రచయితగా పంకజ్ప్రకాశ్, దర్శకుడిగా పంకజ్ పరాశర్, నటుడిగా పంకజ్ కపూర్.. ఈ ముగ్గురి పేర్లలో ముందు పంకజ్ అని ఉండడం యాదృచ్ఛికమే. -
టీవీ వచ్చిందోయ్ సీరియల్ తెచ్చిందోయ్
ఒక ఇంట్లో... ‘దీపను కార్తీక్ ఎప్పుడు అర్ధం చేసుకుంటాడో.. భర్త అయ్యుండి మరీ అంత హార్ష్‌గా ఎలా బిహేవ్ చేస్తాడో. ఈ మగాళ్లు ఇంతే’ టీవీలో సీరియల్ చూస్తూ అందులోని కథానాయిక పడే కష్టాలు తనే పడుతున్నంత బాధగా అనుకుంది వంట చేస్తున్న శ్రావణి.మరో ఇంట్లో...‘అసలా సమీర్ కోకిలను చేసుకుంటాడో, సింధును చేసుకుంటాడో. సమీర్ కోకిల జోడీ మాత్రం సూపర్ కదా..’ చాటింగ్‌లో ఫ్రెండ్‌ను అడుగుతోంది కాలేజీ అమ్మాయి కోమలి.వేరే ఇంట్లో...‘పాపం ఆ అమ్ములుకెన్ని కష్టాలే... తల్లిదండ్రులే కాదంటే ఇంక ఆ పిల్ల గతేం కాను?’ కళ్లజోడు తీసి తుడిచి మళ్లీ పెట్టుకుంటూ అంది మనవారిలితో బామ్మ అన్నపూర్ణమ్మ. టీవీ సీరియల్స్‌లో వచ్చే కథలు తమవే అయినట్టు, అందులోని పాత్రలు తమ మధ్యే తిరుగుతున్నట్టు, తమలోనే ఉన్నట్టు ఆవాహన చేసుకుంటోంది. నిన్నటి, నేటి తరం.నట్టింట చేరిన బుల్లిపెట్టెలో వచ్చే వరుస సీరియళ్లను అర్థరాత్రి వరకు వరుసపెట్టి చూస్తూ, వాటి గురించి మాట్లాడుకునే బామ్మలు, భామలు ఇటు అనకాపల్లి నుంచి అటు అమెరికా దాకా ఉన్నారు. ‘ఆ సీరియళ్ల ధ్యాసలో పడి మొగుడికి వేళకింత తిండిపెట్టాలన్న ఆలోచన కూడా పోయింది ఈ ఆడాళ్లకు’ అంటూ మగవాళ్లు కస్సుబుస్సుమన్నా ‘ప్రకటనల గ్యాప్‌లో కాపురాలను కానిచ్చేస్తున్నారు..’ అని కామెడీ మతాబులు పేల్చినా.. సీరియళ్ల ప్రవాహానికి అడ్డుగా నిలిచే శక్తి ఎవ్వరికీ లేదన్నది నేటి టీవీ సీరియళ్ల టీఆర్పి రేటింగ్స్ చూస్తే అర్ధమైపోతుంది. జీళ్లపాకం సీరియల్స్ అని తిట్టుకునే మగవారు సైతం ‘మా కాలక్షేపం ఈ సీరియల్సే’ అని సీన్ మిస్సవ్వకుండా చూస్తున్నవారే ఎక్కువ. అందుకే ఆ సీరియళ్లు వెయ్యిన్నొక్క ఎపిసోడు, రెండువేల రెండో ఎపిసోడు అంటూ రికార్డులు తిరగరాసుకుంటున్నాయి. ఇంతకీ ఈ సీరియల్స్ మన నట్టింట్లో ఎప్పుడు ఎలా అడుగు పెట్టాయి? ఏళ్లపాటు కొనసాగే వీటి ఉనికి ఎన్నేళ్ల క్రితం మొదలయ్యింది తెలుసుకోవడం కూడా ఆసక్తి పుట్టిస్తుంది. నెక్ట్స్ కథనంలో ఏమవుతుందో అనే ప్రేక్షకుడి ఆసక్తే ఈ సిరియల్స్‌కు అసలు సిసలు పెట్టుబడి అవుతోందన్నది ముమ్మాటికీ నిజం. రేడియో నుంచి టీవీకి ధారావాహిక అనేది ముందు అమెరికాలో మొదలైంది. అక్కడి రేడియోలో ‘గైడింగ్ లైట్’ అనే నాటకం 1937 నుంచి 1956 వరకు దాదాపు 19 ఏళ్లపాటు ప్రసారమైంది. దీనిలో చాలా పాత్రలు, భావోద్వేగ బంధాల మధ్య కథనం సాగుతూ ఉంటుంది. టీవీ ప్రాచుర్యంలోకి వచ్చాక అదే నాటకం జూన్ 30, 1952 నుంచి సెప్టెంబర్ 18, 2009వరకు దాదాపు 57 ఏళ్లపాటు సీరియల్‌గా ప్రసారం అయ్యింది. టెలివిజన్ చరిత్రలోనే ఫస్ట్ అండ్ లాంగెస్ట్ రన్నింగ్ డ్రామాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో పేరు సంపాదించుకున్న ఈ సీరియల్ అమెరికా బ్రాడ్కాస్ట్ చరిత్రలోనే విశేషంగా చెప్పుకోదగినది. అంటే అటు రేడియో, ఇటు టీవీ మాధ్యమాలలో ప్రసారమైన ఈ కార్యక్రమం ప్రసార కాలం 72 ఏళ్లు అన్నమాట. దీని విజయంతో యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో సీరియల్ ట్రెండ్ విస్తరించింది. ఇక ఈ సీరియల్స్‌ని మొదట సబ్బుల (సోప్) తయారీదారులు స్పాన్సర్ చేసేవారు. అందుకే వీటికి సోప్ వారు నిర్వహించే ధారావాహిక అనే పేరు వచ్చింది. ఆ తర్వాత్తర్వాత ‘సోప్ ఒపెరా’ పేరు అంతర్జాతీయంగా ఖరారైంది. మన నట్టింట్లో మొదటి అడుగు ఇండియన్ టెలివిజన్‌లో మొట్టమొదటగా అడుగుపెట్టిన డ్రామా సీరీస్ ‘హమ్ లోగ్’. దూరదర్శన్‌లో ఈ సీరియల్ 1984 జూలై 7న ప్రారంభమై 17 డిసెంబర్ 1985 వరకు 154 ఎపిసోడ్లు ప్రసారమైంది. 1980ల నాటి మధ్యతరగతి కుటుంబంలోని నిత్య సంఘర్షణలు, వ్యక్తుల ఆకాంక్షల గురించిన కథనంతో విద్య–వినోదం ప్రధానాంశంగా ఈ సీరియల్ సాగింది. ముఖ్యంగా సామాజికాంశాలైన కుటుంబనియంత్రణ, కుల సామరస్యం, మహిళా సాధికారత, జాతీయ సమైక్యత, కట్నం, మద్యపానం– మత్తు పదార్థాల దుర్వినియోగం .. వంటి అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించే విధంగా ఈ సీరియల్‌ని రూపుదిద్దారు. ఈ కథను మెక్సికన్ టెలివిజన్ సీరీస్ ‘వెన్ కన్‌మిగో (V్ఛn ఛిౌnఝజీజౌ 1975)లోని మూల కథ నుంచి తీసుకొని మనవారి మనోభావాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. 1982లో నాటి కేంద్ర ప్రసార శాఖా మంత్రి వసంత్ సాథే మెక్సికన్ పర్యటనకు వెళ్లి అక్కడ ‘వెన్ కన్‌మిగో’ చూసి ఇండియాలోనూ ఈ తరహా కార్యక్రమం ప్రసారం చేయాలనే ఆలోచన చేశారట. దీంతో రచయిత మనోహర్ శ్యామ్ జోషి, స్క్రిప్ట్ రైటర్, ఫిల్మ్ మేకర్ పి.కుమార్ వాసుదేవ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిల్ బిస్వాస్, హిందీ సినీ నటుడు అశోక్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ‘హమ్‌లోగ్’ సీరియల్ ప్రసారమైంది. ఈ సీరియల్ వచ్చిన 17 నెలల్లో నటుడు అశోక్‌కుమార్‌కు ‘మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటామ’ని 4 లక్షల మంది అమ్మాయిలు ఉత్తరాలు రాశారు. దానిని బట్టి ఈ సీరియల్ ఎంతటి జనాదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు. రెండవ అడుగు ‘ఏ జో హై జిందగీ’ పేరుతో 1984లో కేవలం 67 ఎపిసోడ్స్‌తో హాస్య ధారావాహిక రూపొందింది. భార్యాభర్తలైన రంజిత్‌వర్మ, రేణు వర్మల మధ్య చోటు చేసుకునే ఫన్నీ సందర్భాలను దీంట్లో చూపించారు. ‘హమ్‌లోగ్’ ముగిసిన ఐదు నెలలకు (మే 1986) ‘బునియాద్’ సీరియల్ ప్రారంభమైంది. 1947లో ఇండియా–పాకిస్తాన్ విభజన నాటి సామాజిక స్థితిగతుల ఆధారంగా ఈ కథను నడిపించారు రచయిత కమల్సైగల్. దానికి అందమైన దృశ్యరూపం ఇచ్చారు దర్శకులు రమేష్ సిప్పి, జ్యోతీ స్వరూప్. ఉద్యోగాలు చేసుకునే ఒంటరి మహిళలు ఒకింట్లో పెయింగ్గెస్ట్గా చేరడం, అక్కడ ఎదురయ్యే సమస్యలు, సరదా విషయాలను ‘ఇధర్ ఉధర్’ (1985) లో చూపించారు. ఇదే సీరియల్‌ను తిరిగి 1998లో రెండవ సీజన్‌గా ప్రసారం చేశారు. ఆ తర్వాత సీరియల్స్ ట్రెండ్‌ను ఓ ఊపు ఊపినవి.. అశేష జనాన్ని టీవీల ముందు కట్టిపడేసినవి ఇతిహాసాలైన రామాయణ్ (1987–1988), మహాభారత్ (1989–1990)లు. ఒక ఆధ్యాత్మిక భావనను ఈ రెండు సీరియళ్లు ప్రతి మదిని తట్టిలేపాయి. దేవతలే తమ నట్టింటికి వచ్చి అలనాటి కథను చూపుతున్నట్టు ఫీలయ్యారు జనం. టీవీల ముందు కొబ్బరికాయలు కొట్టి, హారతలు పట్టారు. 1980 నుంచి 90ల కాలంలో బుల్లితెర పై దూరదర్శన్ సీరియల్స్‌కి మహర్దశ పట్టిందని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాతి వరుస క్రైమ్ థ్రిల్లర్ది. ‘కరమ్‌చంద్’, ‘బ్యోంకేశ్ బక్షీ’, జాన్కీ జాసూస్’తో పాటు చారిత్రక నేపథ్యం ఉన్న చంద్రకాంత, చాణక్య, జనం నాడితో ఫీట్లు చేయించిన సర్కస్ .. వంటి సీరియల్స్‌తో ప్రతి ఇంటా బుల్లితెర ఓ అనివార్యమైన వస్తువయ్యింది. మూడవ అడుగు అప్పటివరకు సామాజిక పరిస్థితులు, చారిత్రకాంశాలమీద ఫోకస్‌పెట్టిన సీరియళ్ల కన్ను ఆటపాటలు, పుస్తకాలతో కుస్తీపట్టే పిల్లల వైపు మళ్లింది. ఇది బుల్లితెర వామనుడి మూడవ అడుగుగా చెప్పవచ్చు. బామ్మలు చెప్పిన కథలకు దృశ్యరూపం బుల్లితెర ఆకాశమే హద్ధయ్యింది. మాల్గుడి డేస్, విక్రమ్ బేతాల్, తెనాలి రామకృష్ణ.. వంటి సీరియల్స్ పిల్లలు ఎక్కడున్నా సమయానికి లాక్కొచ్చి కూర్చోబెట్టేవి. పెద్దలనూ టీవీల ముందు నుంచి కదలనిచ్చేవి కావు. ఈ మూడవ అడుగుతో సీరియల్ అన్ని తరాలనూ తన వైపు తిప్పుకుంది. హిందీ సీరియల్స్‌తో నార్త్ టు సౌత్‌ను ఆకట్టుకుంటున్న మన బుల్లితెర ఆ తర్వాత మరాఠీ, గుజారాతీ, బెంగాలి, తమిళ, కన్నడ, ఒడియా, తెలుగు, మలయాళం.. ఇతర అన్ని భాషలలో సీరియళ్లని చూపించడం మొదలుపెట్టింది. (వచ్చేవారం మరికొంత) – నిర్వహణ: నిర్మలారెడ్డి -
ఆ సీరియల్‌ను ఆపేయండి ప్లీజ్...!!
అభిమాన సీరియల్ అయినంత మాత్రాన మా ఓపికని ఇంతలా పరీక్షించాలా అంటున్నారు.. ‘యే హై మొహబ్బతే’ సీరియల్ ఫ్యాన్స్. ఈ సీరియల్లో ప్రధాన పాత్రలైన రమణ్ బల్లా, డాక్టర్ ఇషితాల పరిచయం.. గొడవలతో మొదలై, రమణ్ కూతురి కోసం వారివురు పెళ్లి చేసుకోవడం వంటి ఆసక్తికర కథనంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఏక్తా కపూర్ నిర్మాణ సారథ్యంలో మొదలైన ఈ సీరియల్లో ఇషితాగా నటించిన దివ్యాంక త్రిపాఠి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. అయితే రాను రాను కథా, కథనాల్లో కొత్తదనం లోపించడంతో ఈ సీరియల్‌ను ఇక ఆపేయాలంటూ అభిమానులు #EndYHM పేరిట ట్విటర్లో ట్రోల్ చేస్తున్నారు. ఇషితా క్యారెక్టర్‌ను అవమానపరుస్తూ.. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీరియల్‌ను ఆదరించాలంటూ దివ్యాంక త్రిపాఠి చేసిన ట్వీట్‌ను వ్యతిరేకిస్తూ తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. Dear Balaji, Please Know why and how you started the show..! 🙄🙄🙄Just because you had a good story in hand don’t keep showing us some idiotic repetitive story.! Your CVs have completely forgotten the roots of the show..! 🤷♀️🤷♀️🤷♀️🤷♀️#EndYHM pic.twitter.com/87vrFBF3I0 — Swetha💫 (@swetha_crazy) May 22, 2018 World is full of bullies. We women can't get affected because of them. We show our worth through our actions that speak louder than words. So is #Ishita who's too high on morality to be bothered by anything smaller. Watch her/my upcoming episodes.#LongLiveYHM#YehHaiMohabbatein — Divyanka T Dahiya (@Divyanka_T) May 25, 2018 -
ట్రెయిలర్‌తోనే పడేశారు!
సినిమా చూడ్డానికి ముందు ట్రెయిలర్లు విడుదల చేస్తారు... సినిమా మీద ఆసక్తిని పుట్టించడానికి. అదే పద్ధతిని టీవీవాళ్లూ అనుసరిస్తుంటారు. అయితే అసలు కథ తీయడం కంటే ఈ ట్రెయిలర్లు తీయడమే కష్టం. తక్కువ సమయంలోనే కట్టి పారేయాలి. ఇందులో ఏదో ఉంది అనిపించాలి. హిందీవాళ్లు ఈ విషయం మీద పెద్ద కసరత్తే చేస్తుంటారు. వేరే సీరియళ్లు వచ్చే సమయంలో కొత్తగా మొదలవుతున్న సీరియల్ గురించి చెప్పిస్తారు. సీరియల్లోని పాత్రలు కొత్త సీరియల్ గురించి సందర్భానుసారంగా మాట్లాడుకుంటాయి. ఆ తర్వాత ట్రెయిలర్ వేస్తారు. ఆ ట్రెయిలర్స్ కూడా వినూత్నంగా ఉంటాయి. అయితే మన తెలుగులో ఒకప్పుడు ట్రెయిలర్ల మీద పెద్ద దృష్టి పెట్టలేదు. సీరియల్స్‌లోని సీన్లే వేసేసేవారు. కానీ ఇప్పుడు మనవాళ్లు కూడా ట్రెండు మార్చారు. అందుకు ఉదాహరణ... ‘ఆకాశమంత‘ సీరియల్. ఇటీవలే జెమినీ చానెల్లో మొదలైన ఈ సీరియల్ ట్రెయిలర్‌తోనే కట్టిపడేసింది. పిల్లల పెంపకం గురించి విరుద్ధమైన భావాలు కల ఇద్దరు అక్కాచెల్లెళ్ల కథే ‘ఆకాశమంత’. వాళ్లిద్దరూ తమ అభిప్రాయాలను తమ స్టయిల్లో వెల్లడించడం, పైగా వాళ్లు మంజుల, మేధ లాంటి పాపులర్ నటీమణులు కావడం ఆసక్తిని కలిగించింది. సీరియల్ కోసం ఎదురు చూసేలా చేసింది. మల్టీప్లెక్సులు ప్రేక్షకులకు ఎర వేసి లాగేస్తున్న ఈ సమయంలో... వారిని టీవీలకు కట్టేయడానికి ఆ మాత్రం క్రియేటివిటీని ప్రదర్శించాలి మరి! -
పోలీసులకు టీవీ సిస్టర్స్ రాఖీలు
న్యూఢిల్లీ: హిందీ సీరియళ్ల అభిమానులకు శాస్త్రి సిస్టర్స్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇదే పేరుతో ప్రసారమయ్యే సీరియల్లో అక్కాచెల్లెళ్లు కనిపించే నేహా పెడ్నేకర్ (అల్కానీ), ఇషితా గంగూలీ (అనుష్క), సోనల్ వెంగులూకర్ (దేవయాని), ప్రగతి చౌరాసియా (పియా) శుక్రవారం ఢిల్లీకి వచ్చిన సందర్భంగా పోలీసు అధికారులకు రాఖీలు కట్టారు. ఈ షోలో పెద్ద అక్కగా కనిపించే నేహా మాట్లాడుతూ ఎవరికైనా రాఖీ కడుతున్నప్పుడు అతడు మనకు ఆపత్కాలంలో రక్షణ కల్పిస్తాడనే నమ్మకం కుదురుతుందని చెప్పింది. గత నెల శాస్త్రిసిస్టర్స్ షూటింగ్ ఢిల్లీలో జరిగినప్పుడు పోలీసులు తమకు తగిన భద్రత కల్పించి ఆదుకున్నారని తెలిపింది. ఆపత్కాలంలో నలుగురు తోబట్టువుల ఐక్యమత్యం గురించి శాస్త్రి సిస్టర్స్ వివరిస్తుంది. కాన్పూర్ నుంచి ఢిల్లీ ఉపాధి కోసం ఢిల్లీకి వచ్చాక ప్రేమలు, వేధింపులు, ఇళ్ల వంటి సమస్యలను ఎలా ఎదర్కున్నారో తెలియాలంటే ఈ సీరియల్ చూడాల్సిందే. రక్షాబంధన్ అంటేనే భద్రత గుర్తుకు వస్తుందని, మనదేశానికి ఎంతో సేవ చేస్తున్న పోలీసులతోపాటు సాయుధ దళాలకు శిరసు వంచి వందనం చేయాల్సిందేనని మరో సిస్టర్ సోనల్ చెప్పింది. అన్నట్టు.. శాస్త్రి సిస్టర్స్ కలర్స్ చానెల్లో ప్రసారమవుతోంది.