ఆ సీరియల్‌ను ఆపేయండి ప్లీజ్‌...!! | Divyanka Tripathi Has A Message For Her Fans | Sakshi
Sakshi News home page

ఆ సీరియల్‌ను ఆపేయండి ప్లీజ్‌...!!

Published Sat, May 26 2018 8:48 PM | Last Updated on Sat, May 26 2018 8:52 PM

Divyanka Tripathi Has A Message For Her Fans - Sakshi

యే హై మొహబ్బతే సీరియల్‌ ప్రధాన పాత్రధారి దివ్యాంక త్రిపాఠి (ఫైల్‌ ఫొటో)

అభిమాన సీరియల్‌ అయినంత మాత్రాన మా ఓపికని ఇంతలా పరీక్షించాలా అంటున్నారు.. ‘యే హై మొహబ్బతే’  సీరియల్‌ ఫ్యాన్స్‌. ఈ సీరియల్‌లో ప్రధాన పాత్రలైన రమణ్‌ బల్లా, డాక్టర్‌ ఇషితాల పరిచయం.. గొడవలతో మొదలై, రమణ్‌ కూతురి కోసం వారివురు పెళ్లి చేసుకోవడం వంటి ఆసక్తికర కథనంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఏక్తా కపూర్‌ నిర్మాణ సారథ్యంలో మొదలైన ఈ సీరియల్‌లో ఇషితాగా నటించిన దివ్యాంక త్రిపాఠి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు‌. అయితే రాను రాను కథా, కథనాల్లో కొత్తదనం లోపించడంతో ఈ సీరియల్‌ను ఇక ఆపేయాలంటూ అభిమానులు #EndYHM పేరిట ట్విటర్‌లో ట్రోల్‌ చేస్తున్నారు. ఇషితా క్యారెక్టర్‌ను అవమానపరుస్తూ.. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీరియల్‌ను ఆదరించాలంటూ దివ్యాంక త్రిపాఠి చేసిన ట్వీట్‌ను వ్యతిరేకిస్తూ తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement