Divyanka Tripathi
-
ఫారెన్ ట్రిప్‌లో దోపిడికి గురైన ప్రముఖ నటి.. లక్షల డబ్బుతో పాటు
ప్రముఖ నటికి ఫారెన్ ట్రిప్‌లో చేదు అనుభవం ఎదురైంది. పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకుని, కొన్నిరోజులు ఎంజాయ్ చేద్దామని టూర్‌కి వెళ్తే దొంగలు మొత్తం దోచేశారు. పాస్పోర్ట్స్తో పాటు డబ్బులు, విలువైన వస్తువుల్ని పట్టపగలే దొంగతనం చేశారు. ఇప్పుడీ విషయం చర్చనీయాంశమైపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? ఎవరా నటి?యే హై మొహబత్తీన్ అనే సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న దివ్యాంక త్రిపాఠి.. ప్రస్తుతం పలు రియాలిటీ షోల్లో నటిస్తూ బిజీగా ఉంది. 2016లో తోటి నటుడు వివేక దహియాని పెళ్లి చేసుకున్న ఈమె.. తాజాగా పెళ్లి రోజుని సెలబ్రేట్ చేసుకునేందుకు యూరప్ వెళ్లారు. స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్ చేసిన కొన్ని ఫొటోలని ఇన్ స్టాలోనూ పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: రామ్ చరణ్ కొత్త కారు.. దేశంలోనే రెండోది.. ఎన్ని కోట్ల ఖరీదంటే?) అయితే ఫ్లోరెన్స్ అనే ఊరిలో ఓ రోజు ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఉండేందుకు ఇల్లు చూసే క్రమంలోనే ఓ చోటుకి వెళ్లి వచ్చే లోపు కారులో ఉన్న పాస్‌పోర్ట్, విలువైన వస్తువులు, డబ్బులని దొంగలు దోచుకున్నారు. దీంతో నటి దివ్యాంకతో పాటు ఆమె భర్త రోడ్డున పడ్డారు. సమీప పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసినప్పటికీ దొంగతనం జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో తాము ఏం చేయలేమని పోలీసులు చేతులెత్తేశారు.ప్రస్తుతం తాత్కాలిక పాస్పోర్ట్స్ పొందే ప్రయత్నంలో దివ్యాంక-ఆమె భర్త ఉన్నారు. దొంగతనం జరిగిన రోజు ఎంబసీకి వెళ్లగా అది మూసి ఉంది. తాజాగా అక్కడికి వెళ్లి తమ పరిస్థితిని వివరించినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో తిరిగి వీళ్లిద్దరూ స్వదేశానికి తిరిగి రావొచ్చని సమాచారం.(ఇదీ చదవండి: మరో లగ్జరీ ఫ్లాట్ కొనేసిన 'ఆదిపురుష్' సీతమ్మ.. రేటు ఎంతంటే?) -
ప్రముఖ బుల్లితెర నటికి రోడ్డు ప్రమాదం..!
బాలీవుడ్ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి రోడ్డు ప్రమాదానికి గురైంది. యే హై మొహబ్బతీన్ సీరియల్ గుర్తింపు తెచ్చుకుంది. గురువారం ప్రమాదానికి గురైన దివ్యాంకను ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆమెకు చేతి ఎముకలు విరగడంతో శస్త్ర చికిత్స చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె భర్త వివేక్ దహియా వెల్లడించారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఆయన హుటాహుటినా ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ తారలు దివ్యాంక త్రిపాఠి కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. ఆమె భర్త వివేక్ నటికి సంబంధించిన ఎక్స్ రేను సైతం సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ప్రమాదంలో ఆమెకు రెండు ఎముకలు విరిగినట్లు సమాచారం. ఇవాళ శస్త్ర చికిత్స చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. కొద్ది రోజుల క్రితమే గాయం నుంచి కోలుకుంది. దివ్యాంక త్రిపాఠి తన కెరీర్లో పలు సీరియల్స్‌తో పాటు రియాలిటీ షోలలో పాల్గొంది. -
బతికేందుకు చెత్త సేకరించి అమ్మాను: బుల్లితెర నటి
బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి దహియా. యే హై మొహబ్బతేన్ సీరియల్‌తో ఫేమస్ అయింది. ప్రస్తుతం అదృశ్యం అనే సీరియల్లో నటిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దివ్యాంక తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో చాలా ఇబ్బందులు పడినట్లు తెలిపింది. బతకడం కోసం చిన్న చిన్న పనులు చేశానని వెల్లడించింది. దివ్యాంక మాట్లాడుతూ.. ' ప్రతి ఒక్కరూ మీపై మీరే ఆశలు పెంచుకోవాలి. మన లక్ష్యం కోసం ఎప్పటికీ మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. అలాగే ఎల్లప్పుడూ మన మనుగడ కోసం ఏదో ఒకటి చేయాలి. గతంలో నేను టూత్‌పేస్ట్ పెట్టెలను సేకరించి అమ్మేదాన్ని. వాటికి ఒక్కో బాక్స్‌కు రూపాయి ఇచ్చేవారు. అలా సేకరించిన వాటిని భద్రంగా దాచి చెత్త సేకరించే వారికి అమ్మాను. అలా డబ్బు సంపాదించి నా పెట్ డాగ్ కోసం ఆహారం, బిల్లులు చెల్లించేదాన్ని. అప్పట్లో నా సర్వైవల్ కోసం రూ. 2 వేలు వచ్చినా ఫర్వాలేదు. అలా నా రోజువారీ జీవితం ప్రారంభయ్యేది. ఎవరైనా సరే డబ్బు సంపాదన కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక మార్గాన్ని కనుగొనాలి' అంటూ సలహాలు ఇస్తోంది బుల్లితెర భామ .కాగా.. దివ్యాంక ప్రస్తుతం బాలీవుడ్ బుల్లితెరపై అత్యధిక పారితోషికం తీసుకునే నటిమణుల్లో ఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం దివ్యాంక ఈజాజ్ ఖాన్ సరసన అదృష్టమ్ అనే చిత్రంలో నటిస్తోంది. -
ఒకప్పుడు చెత్త ఏరుకుంది ఇప్పుడు లక్షల్లో సంపాదన
-
ఒకప్పుడు చెత్త ఏరుకుంది.. ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్న బ్యూటీ
ఆత్మవిశ్వాసమే విజయానికి తొలి మెట్టు.. ఇక్కడ చెప్పుకునే బుల్లితెర నటి విషయంలో ఇది అక్షరాలా నిజమైంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఆమె మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేసింది. అడిగినదానికి లొంగకపోతే కెరీర్ నాశనం చేస్తామని బెదిరించినా వణికిపోలేదు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా చిన్నాచితకా పనులు చేసింది. చివరికి చెత్త ఏరుకుని రూపాయిరూపాయి కూడబటెట్టింది. నేడు లక్షలు సంపాదిస్తోంది. ఇంతకీ ఆ నటి ఎవరో కాదు.. ప్రముఖ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి.లైఫ్ సెట్ అనుకున్న సమయంలో..దివ్యాంక నటి మాత్రమే కాదు యాంకర్, మోడల్ కూడా! తన కెరీర్ మొదలైందే యాకరింగ్‌తో! తర్వాత ఆమె 2005లో మిస్ భోపాల్‌గా కిరీటం అందుకుంది. 'బనూ మే తేరి దుల్హాన్' సీరియల్‌తో క్లిక్ అయింది. ఎన్నో అవార్డులు అందుకుంది. తర్వాత కూడా కొన్ని సీరియల్స్‌లో మెరిసింది. ఇంక తను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదనుకుంది. కానీ అన్నీ అనుకున్నట్లు జరగవు కదా! మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఛాన్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. నిత్యావసరాలు, ఈఎమ్ఐలు, ఇంకా ఎన్నింటికో డబ్బులు అవసరమయ్యాయి.రోడ్డుపై చెత్త ఏరుతూ..ఎవరో ఏదో ఆఫర్ ఇస్తారని ఎదురుచూస్తూ ఉండేకన్నా.. ఏదో ఒక పని చేయడం మేలనుకుంది. ఐదు వేలు లేదంటే రెండు వేలు ఇచ్చినా కిరాణా సామాను తెచ్చుకోవచ్చనుకుంది. పైగా తనకో పెంపుడు శునకం ఉంది. ఆ వచ్చిన డబ్బుతో దానికి కాస్త తిండిపెట్టవచ్చని ఆలోచించింది. చిన్న పాత్రలిచ్చినా సరే చేస్తానంటూ డైరెక్టర్లను వేడుకుంది. ఈ లోపు రోడ్డుపై చెత్త ఏరడం మొదలుపెట్టింది. అట్టముక్కలను, టూత్‌పేస్ట్ డబ్బాలను ఏరి అమ్ముకుంది. ఒక్క డబ్బాకు ఒక్క రూపాయి ఇచ్చేవాళ్లట. అలా రోజూ చెత్తనంతా సేకరించి దాన్ని అమ్మి డబ్బు సంపాదించింది.అడ్డదారులు తొక్కడం ఇష్టం లేకఅంతకుముందు దాచుకున్న డబ్బుతో ప్రతినెలా ఈఎమ్ఐలు కట్టింది. సరిగ్గా అదే సమయంలో తనకో ఆఫర్ కూడా వచ్చింది. రాత్రికి వస్తానంటే మంచి ఛాన్స్ ఇస్తామన్నారట. అలాంటి అడ్డదారులు తొక్కేబదులు ఇలా సొంతంగా సంపాదించుకోవడమే మేలనుకుంది. తర్వాతి కాలంలో యే హై మొహబ్బతే ధారావాహికలో డాక్టర్ ఇషితా అయ్యర్‌గా ప్రధాన పాత్ర పోషించి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ సీరియల్ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో దివ్యాంక ఒక్క ఎపిసోడ్‌కు రూ.1- 1.5 లక్షలు సంపాదించే స్థాయికి ఎదిగింది.లవ్ బ్రేకప్నాచ్ బలియే 8వ సీజన్ విన్నర్, ఖత్రోన్ కే ఖిలాడీ 11వ సీజన్ రన్నరప్‌గా నిలిచింది. 2017లో ఫోర్బ్స్ సెలబ్రిటీ 100 జాబితాలో చోటు దక్కించుకున్న మొట్టమొదటి బుల్లితెర నటిగా రికార్డుకెక్కింది. కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ ఇబ్బందులు పడింది నటి. సీరియల్ నటుడు శరద్ మల్హోత్రాను ప్రాణంగా ప్రేమించింది. కానీ ఎనిమిదేళ్ల ప్రయాణం తర్వాత ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. 2016లో నటుడు వివేక్ దహియాను పెళ్లాడింది. వీరిని అభిమానులు ముద్దుగా దివేక్ అని పిలుచుకుంటారు.చదవండి: వాళ్ల నాన్నకు చెప్పుకోలేని విషయాలు నాతో షేర్ చేసుకుంటాడు.. అలాంటిది.. -
డైరెక్టర్‌తో రాత్రంతా ఉండాలన్నారు, లేదంటే..: బుల్లితెర నటి
బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. వాళ్లు అడిగినదానికి నో చెప్తే కెరీర్ నాశనం చేస్తారని బెదిరించారని వాపోయింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'ఒక సీరియల్ లేదా షో పూర్తి చేశాక అసలైన కష్టం మొదలవుతుంది. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అప్పుడు నాకు కట్టుకునే బిల్స్, ఈఎమ్ఐ ఇలా చాలానే ఉన్నాయి. చేతిలో డబ్బుల్లేక ఇంకా సరైన ఆఫర్లు రాక తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న సమయంలో ఒక ఆఫర్ వచ్చింది. నువ్వు డైరెక్టర్‌తో ఒక రాత్రంతా ఉన్నావంటే నీకు మంచి అవకాశం ఇస్తాడు అని! కానీ నన్నే ఎందుకిలా అడుగుతున్నారని ప్రశ్నిస్తే నేనొక తెలివైన అమ్మాయినని ఆన్సరిచ్చారు. ఇది మీటూ మూమెంట్ కన్నా ముందే జరిగింది. ఇలాంటి ఆఫర్స్ ఇచ్చేవారు ఇండస్ట్రీలో ఇదంతా సర్వసాధారణం అని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. మీరు దానికి అంగీకరించకపోతే కెరీర్లో పెద్దగా నష్టపోయేదేమీ ఉండదు. కానీ వాళ్లు మాత్రం మన కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరింపులకు దిగుతారు. వారి ఆఫర్లకు, బెదిరింపులకు నేను లొంగను కాబట్టి దీన్నెప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. నా ప్రతిభను చూసే నాకు సీరియల్స్‌లో ఛాన్స్ ఇచ్చారు. నేను నా టాలెంట్‌నే నమ్ముకుంటాను' అని చెప్పుకొచ్చింది. కాగా దివ్యాంక.. 'బనూ మే తేరీ దుల్హాన్' సీరియల్‌తో పాపులారిటీ సంపాదించుకుంది. 'యే హై మొహబ్బతే'లోనూ డాక్టర్ ఇషితా అయ్యర్ భల్లాలా నటించింది. 'నాచ్ బలియే 8'వ సీజన్లో పాల్గొన్న ఆమె ఈ డ్యాన్స్ షోలో విన్నర్‌గా అవతరించింది. 'ఖత్రోన్ కే ఖిలాడీ 11'వ సీజన్లో పార్టిసిపేట్ చేసి రన్నరప్‌గా నిలిచింది. -
కరోనాపై ట్వీట్; ట్రోల్స్ బారిన పడిన నటి
ముంబై : హిందీ సిరియల్ నటి దివ్యాంక త్రిపాఠి తాజాగా ట్రోల్స్ బారిన పడ్డారు. కరోనా వైరస్‌పై దివ్యాంకా చేసిన ఓ ట్వీట్ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. కాగా మహారాష్ట్రలో కరోనా ప్రభావం అధికంగా ఉండటంతో అక్కడి విద్యాసంస్థలు, షాపింగ్‌మాల్స్, థియేటర్లను మూసి వేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడం తగ్గించారు. ఈ క్రమంలో ముంబైలోని ట్రాఫిక్‌ను ఉద్ధేశిస్తూ బుల్లితెర నటి దివ్యాంకా.. కరోనా ప్రభావంతో ముంబై రోడ్లన్నీ ఖాళీ అవుతున్నాయని.. దీని వల్ల మెట్రో, వంతెనలు త్వరగా పూర్తి చేయవచ్చని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు దివ్యాంకా వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. (మరో 250 మంది భారతీయులకు కరోనా) ‘ముంబైలో తక్కువ ట్రాఫిక్ ఉన్నందున మెట్రో, వంతెనలు, రోడ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయడానికి అవకాశం ఏర్పడింది. కరోనా మహ్మమ్మారి పోయే సమయానికి మెట్రో, రోడ్డు పనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తవుతాయని ఆశిస్తున్నా’ అంటూ ఓ వీడియో షేర్ చేశారు. అయితే దివ్యాంకా అభిప్రాయాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. కార్మికులు కూడా మనుషులేనంటూ.. వారికి కూడా ఆరోగ్య భద్రత అవసరమేనని విమర్శిస్తున్నారు. ‘ఇంజనీర్లు, నిర్మాణ కార్మికుల జీవితాలు ముఖ్యం కాదా.. ఈ సమయంలో అవసరం లేని, పనికి రాని ట్వీట్’. అంటూ దివ్యాంకపై విరుచుకుపడుతున్నారు. ఇక తాజాగా దీనిపై స్పందించిన దివ్యాంకా తన తప్పును అంగీకరించారు. ఇలా తప్పుగా ట్వీట్ చేసినందుకు ఆమె క్షమాపణలు కోరారు. అలాగే వెంటనే తన పోస్ట్‌ను డిలీడ్ చేశారు. (దారుణం: కరోనా కరోనా అంటూ విచక్షణారహితంగా..! ) అయితే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న తరువాత దివ్యాంకా మరో ట్వీట్ చేశారు."మనమందరం మనుషులం, సాధారణంగా తప్పులు చేస్తూ ఉంటాం. ఈ హింసాత్మక సోషల్ మీడియా ప్రపంచంలో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే.. ఎవరికైనా క్షమించే సామర్థ్యం ఉందా. ప్రతి విషయాన్ని వివాదంగా ఆలోచిస్తే.. అక్కడ మానవత్వం ఎక్కడ ఉంది?’ అంటూ నెటిజన్ల ట్రోల్స్‌ను గట్టిగా తిప్పికొట్టారు. కాగా ఇటీవల జరిగిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2020లో దివ్యాంకా త్రిపాఠి బెస్ట్ టెలివిజన్ యాక్టర్ అవార్డును దక్కించుకున్న విషయం తెలిసిందే. (కరోనా ఎఫెక్ట్: తాజ్ మహల్ మూసివేత) -
హౌ ఈజ్ ద జోష్.. ట్విటర్లో సంబరాలు!
ఆత్మాహుతికి దాడికి పాల్పడి భారత జవాన్ల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత వైమానిక దళం ప్రతీకారం తీర్చుకుంది. జైషే దళాలపై మెరుపు దాడి చేసి అమర జవాన్లకు ఘనమైన నివాళి అర్పించింది. ఈ క్రమంలో భారత వాయుసేనపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. సామాన్య పౌరులు మొదలు సెలబ్రిటీల దాకా సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు. భారత ప్రతీకార చర్యను ఉటంకిస్తూ ప్రముఖ టీవీ, బాలీవుడ్ నటి దివ్యాంక త్రిపాఠి... ‘ ఈరోజు నిజంగా శుభోదయం! అవునా కాదా? టెర్రరిస్టులనే వణికించినందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ ఇన్‌స్టాలో ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఆమెతో పాటు పలువురు టీవీ నటులు.. ఉడీ ఘటన అనంతరం జరిగిన మెరుపు దాడుల ఆధారంగా తెరకెక్కిన ‘ఉడీ: ద సర్జికల్ స్ట్రైక్స్’ సినిమాలోని ‘హౌజ్ ద జోష్’ అనే డైలాగ్‌ను కోట్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. కాగా పుల్వామా ఉగ్రదాడికి దీటుగా బదులిస్తామన్న భారత్ మాట నిలబెట్టుకుంది. 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న జైషే ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేసింది. 12 మిరాజ్-2000 జెట్ ఫైటర్స్‌తో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్-2 విజయవంతంగా పూర్తి చేసి... దాదాపు 200 నుంచి 300 మంది ఉగ్రవాదలను హతమార్చినట్లు సమాచారం. Howz the josh... High sir.. Salute to the IAF.. For the taking the Action which was required. — sachin shroff (@iamsacchinshrof) February 26, 2019 View this post on Instagram It is a good morning today! Isn't it? Outfit @mad.glam Company @vblitzcommunications Styled by @stylingbyvictor A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) on Feb 25, 2019 at 8:56pm PST Jai hind 🇮🇳 That's the way https://t.co/zSVb8BGIcj — Karanvir Bohra (@KVBohra) February 26, 2019 -
పచ్చగా ఉంటే ఓర్వరా..!!
సాక్షి, ముంబై: ఖయామత్ కి రాత్ సీరియల్లో నటిస్తున్నప్పటి నుంచి వివేక్ దహియాకు భార్యపై ప్రేమ తగ్గిపోయిందా..? అని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తుండడం పట్ల ఆయన స్పందించారు. పచ్చగా కలిసుండే జంటను చూస్తే కొందరు కళ్లలో నిప్పులు పోసుకుంటారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఖయామత్ కి రాత్ సీరియల్లో వివేక్.. కరిష్మా తన్నాతో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీరియల్ షూటింగ్ ప్రారంభమైన నాటి నుంచి వివేక్, అతని భార్య దివ్యాంక త్రిపాఠిల మధ్య ప్రేమ పలుచనైందనీ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. కరిష్మా, వివేక్‌ల మధ్య ఏదో నడుస్తోందనే ఊహాగానాలు మొదలయ్యాయి. వృత్తిలో భాగంగా కాస్త దగ్గరగా ఉంటే చాలు.. లేని పోనివి అంటగట్టాలని చూస్తారని వివేక్ నెటిజన్లపై మండిపడ్డారు. ‘ఖయామత్ కి రాత్’ షోలో వివేక్, కరిష్మా జోడీ హాట్‌గా కనిపించబోతోందని తన భార్య దివ్యాంక కితాబిచ్చింద’ని వివేక్ సంబరపడ్డారు. ‘ఇది చాలదా..! అందరి నోళ్లు మూయించడానికి’ అని చురకలంటించారు. సీరియల్ విశేషాలు చెప్తూ.. ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోందనీ, దాదాపు 100 ఎపిసోడ్లకు పైగా సీరియల్ కొనసాగనుందని తెలిపారు. కాగా, ఖయామత్ కి రాత్ షో స్టార్ ప్లస్‌లో ప్రసారం కానుంది. -
ఆ సీరియల్‌ను ఆపేయండి ప్లీజ్...!!
అభిమాన సీరియల్ అయినంత మాత్రాన మా ఓపికని ఇంతలా పరీక్షించాలా అంటున్నారు.. ‘యే హై మొహబ్బతే’ సీరియల్ ఫ్యాన్స్. ఈ సీరియల్లో ప్రధాన పాత్రలైన రమణ్ బల్లా, డాక్టర్ ఇషితాల పరిచయం.. గొడవలతో మొదలై, రమణ్ కూతురి కోసం వారివురు పెళ్లి చేసుకోవడం వంటి ఆసక్తికర కథనంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఏక్తా కపూర్ నిర్మాణ సారథ్యంలో మొదలైన ఈ సీరియల్లో ఇషితాగా నటించిన దివ్యాంక త్రిపాఠి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. అయితే రాను రాను కథా, కథనాల్లో కొత్తదనం లోపించడంతో ఈ సీరియల్‌ను ఇక ఆపేయాలంటూ అభిమానులు #EndYHM పేరిట ట్విటర్లో ట్రోల్ చేస్తున్నారు. ఇషితా క్యారెక్టర్‌ను అవమానపరుస్తూ.. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీరియల్‌ను ఆదరించాలంటూ దివ్యాంక త్రిపాఠి చేసిన ట్వీట్‌ను వ్యతిరేకిస్తూ తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. Dear Balaji, Please Know why and how you started the show..! 🙄🙄🙄Just because you had a good story in hand don’t keep showing us some idiotic repetitive story.! Your CVs have completely forgotten the roots of the show..! 🤷♀️🤷♀️🤷♀️🤷♀️#EndYHM pic.twitter.com/87vrFBF3I0 — Swetha💫 (@swetha_crazy) May 22, 2018 World is full of bullies. We women can't get affected because of them. We show our worth through our actions that speak louder than words. So is #Ishita who's too high on morality to be bothered by anything smaller. Watch her/my upcoming episodes.#LongLiveYHM#YehHaiMohabbatein — Divyanka T Dahiya (@Divyanka_T) May 25, 2018 -
ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా..?
ఎంతో ముద్దుగా, బొద్దుగా ఉన్న ఫొటోలోని చిన్నారి.. ప్రస్తుతం హిందీ సీరియల్లలో నటిస్తూ ఉత్తమ కోడలు, భార్య అంటే ఇలాగే ఉండాలి అనేంతగా తన నటనతో కట్టిపడేస్తోంది. ఆమె ఎవరో కాదు ఇషిత అలియాస్ దివ్యాంక త్రిపాఠి. ఇద్దరు చిన్నారులతో కూడిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన దివ్యాంక తను ఎక్కడున్నానో గుర్తుపట్టాలంటూ అభిమానుల్ని కోరుతూ.. చిన్ననాటి ఙ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. బనూ మేరీ దుల్హన్తో కెరీర్ ప్రారంభించిన దివ్యాంక యే హై మొహబ్బత్ సీరియల్‌తో బాగా పాపులర్ అయ్యారు. ఈ సీరియల్ మనసు పలికే మౌనగీతం పేరుతో ఓ ప్రముఖ తెలుగు ఛానెల్లో ప్రసారమైంది. ఈ సీరియల్లో ఇషితగా ప్రేక్షకుల మనసు దోచుకుంది దివ్యాంక. ఒక ఇల్లాలిగా.. తన కుటుంబాన్ని, తల్లిగా పిల్లలను సంభాళించుకునే తీరు, మల్టీటాస్కింగ్ ఉమెన్‌గా తను చూపిన ప్రతిభకు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. అయితే తల్లి మినహా మిగిలినవన్నీ ఆమెలోని గుణాలే కాబట్టి.. యే హై మొహబ్బతేలో దివ్యాంక డాక్టర్ ఇషితా భల్లా పాత్రలో సహజంగా ఒదిగిపోయింది. కాబట్టే ఆ పాత్రకు అంత జీవం వచ్చింది. ఆమెకు రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ సాయం చేసే గుణం, సామాజిక స్పృహ కూడా ఎక్కువే. చిన్నపుడు టామ్‌బాయ్‌లా ఉండేందుకు ఇష్టపడిన దివ్యాంక.. ఇప్పుడు మాత్రం సాంప్రదాయ, ట్రెండీ లుక్స్‌తో అదరగొడుతున్నారు. Guess which one is me? Hint...Spot the little #Gunda! BTW, Mummy you baked so many cakes😋 for me then! Miss those days of simple pleasures. A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) on May 7, 2018 at 12:01am PDT -
బ్రేకప్ గురించి చెబుతూ బోరుమన్న నటి!
ముంబై: గత ప్రేమ జ్ఞాపకాలు గుర్తు చేసేసరికి నటి దివ్యాంక త్రిపాఠి కన్నీళ్లు పెట్టుకున్నారు. గతంలో సాగించిన ప్రేమాయణం తన జీవితంలో చీకటి కోణమంటూ ఆమె వ్యాఖ్యానిస్తూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన ప్రోమో వీడియో వైరల్ అవుతోంది. రాజీవ్ ఖండేల్వాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘జజ్ బాత్’లో నటి దివ్యాంక పాల్గొన్నారు. కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత మీ గుండె ఎప్పుడైనా బద్దలైనట్లు అనిపించిందా, ఎక్కువగా బాధపడ్డ సందర్భం ఏంటని రాజీవ్ ఆమెను అడిగారు. ఇక అంతే నటి ఉద్వేగానికి లోనై ఏడ్చేశారు. గతంలో టీవీ నటుడు శరద్ మల్హోత్రా, నటి దివ్యాంక త్రిపాఠిలు గాఢంగా ప్రేమించుకున్నారు. దాదాపు ఎనిమిదేళ్లు ప్రేమాయణం తర్వాత వీరు బ్రేకప్ అయ్యారు. ఈ విషయాన్ని నటి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘ఎనిమిదేళ్లు ముగుస్తున్న సమయంలో నా జీవితం ముగిసి పోతుందనుకున్నా. ఏది నమ్మోలో.. వద్దో తెలియని స్థితి ఎదురైందంటూ’ దివ్యాంక చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. టాక్ షోలో దివ్యాంక భర్త వివేక్ దహియాతో పాల్గొని సందడి చేశారు. 2015లో శరద్‌తో బ్రేకప్ అయ్యాక ఆమె వివేక్ దహియాను వివాహం చేసుకున్నారు. గత రెండేళ్లుగా వీరు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. వీరి అభిమానులు ముద్దుగా ఈ జోడీని ‘దివేక్’అని పిలుచుకోవడం తెలిసిందే. పలు హిందీ సీరియళ్లు, టీవీ షోలతో దివ్యాంక త్రిపాఠి పాపులర్ అయ్యారు. ఆమె తొలి సీరియల్ 'మే తేరి దుల్హాన్' హిట్ కావడం పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. డ్యాన్స్ షో 'నాచ్ బాలియే'లో పాల్గొని విజేతగా నిలిచిన దివ్యాంక.. త్వరలో బాలీవుడ్లో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. -
డెత్ రూమర్స్‌పై స్పందించిన టీవీ నటి
ముంబై: తాను చనిపోయినట్టు సోషల్ మీడియాలో వదంతులు చెలరేగడంతో ప్రముఖ టీవీ నటి దివ్యాంక త్రిపాఠి స్పందించారు. తాను చనిపోలేదంటూ ట్వీట్ చేసి ఈ వదంతులకు ఫుల్స్టాప్ పెట్టారు. 'నేను 'రిప్‌మోడ్' (రెస్ట్ ఇన్ పీస్ మోడ్.. ఆత్మకు శాంతి పొందే స్థితి)లో ఉన్నట్టు వదంతులను ప్రచారం చేస్తున్నారు. నేను బతికే ఉన్నాను. దయ చేసి ఇలాంటి వదంతులతో నా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగించకండి' అంటూ ఆమె ట్వీట్ చేశారు. పలు హిందీ సీరియళ్లు, టీవీ షోలతో దివ్యాంక త్రిపాఠి పాపులర్ అయ్యారు. ఆమె తొలి సీరియల్ 'మే తేరి దుల్హాన్' హిట్ కావడం ఆమెకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. అనంతరం డ్యాన్స్ షో 'నాచ్ బాలియే'లో పాల్గొని విజేతగా నిలిచారు. గత ఏడాది టీవీ సహనటుడు వివేక్ దహియా పెళ్లాడిన ఆమె.. త్వరలో బాలీవుడ్లో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. -
'అందుకే ఆమె పెళ్లికి వెళ్లలేదు'
ముంబై: బుల్లితెర నటీనటులు దివ్యాంక త్రిపాఠి, వివేక్ దహియ పెళ్లికి టెలివిజన్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సన్నిహితులు హాజరయ్యారు. దివ్యాంక వివాహానికి ఆమె సహనటుడు కరణ్ పటేల్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. చాలా సీరియల్స్ లో దివ్యాంక భర్తగా నటించిన కరణ్ పెళ్లికి ఎందుకు రాలేదని అందరూ చెవులు కొరుక్కున్నారు. జూలై 8న భోపాల్ లో దివ్యాంక-వివేక్ పెళ్లి జరిగింది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగానే దివ్యాంక పెళ్లికి రాలేకపోయానని, వేరే కారణాలు ఏమీ లేవని కరణ్ తెలిపాడు. 'దివ్యాంక పెళ్లికి తప్పనిసరిగా వెళ్లాలనుకున్నాను. ఓ టీవీ షో షూటింగ్లో బిజీగా ఉండడంతో వెళ్లలేకపోయాను. నేను ప్రధానపాత్ర పోషిస్తున్నందున షూటింగ్ కు విరామం ఇవ్వడం కుదరలేద'ని కరణ్ వెల్లడించాడు. పెళ్లి హాజరుకాలేకపోయిన అతడు తన భార్య అంకిత భార్గవతో కలిసి రిసెప్షన్ కు వెళ్లాడు. పెళ్లికి వెళ్లకపోవడంతో రిసెప్షన్ తప్పనిసరిగా వెళ్లాలనుకున్నానని కరణ్ చెప్పాడు. ఈద్ పండుగ రోజున షూటింగ్ కు వచ్చేందుకు అతడు ఒప్పుకోకపోవడంతో దివ్యాంక పెళ్లికి వెళ్లేందుకు సెలవు దొరకలేదని బయట ప్రచారం జరుగుతోంది. -
మళ్లీ లవ్ లో పడ్డాడు!
ప్రముఖ టీవీ నటుడు శరద్ మల్హోత్రా మళ్లీ లవ్ లో పడ్డాడు. వర్ధమాన నటి, మిస్ దివా ఫైనలిస్ట్ పూజా బిష్త్ తో నాలుగు నెలలుగా డేటింగ్ చేస్తున్నట్టు వెల్లడించాడు. కామన్ ఫ్రెండ్ ద్వారా 8 నెలల క్రితం తనకు పూజ పరిచయమైందని తెలిపాడు. 'మేమిద్దం పరస్పరం అర్థం చేసుకున్నాం. మా ఇద్దరి మధ్య అన్నివిధాలా సాంగత్యం కుదిరింది. పూజ కలివిడిగా ఉంటుంది. ఎటువంటి డిమాండ్లు చేయదు. ఇప్పటివరకు ఆమె నన్ను ఒక్కమాట కూడా అనలేదు. ఆమెతో డేటింగ్ చేస్తున్నా'ని శరద్ పేర్కొన్నాడు. తామిద్దరం కలిసి షార్ట్ ఫిలిమ్ లో నటిస్తున్నామని 'కసమ్' నటుడు తెలిపాడు. తమ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్టీ బాగా కుదిరిందని చెప్పుకొచ్చాడు. అంతకుముందు దివ్యాంక త్రిపాఠితో శరద్ ప్రేమాయణం సాగించాడు. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ గతేడాది విడిపోయారు. జులైలో పెళ్లి చేసుకునేందుకు దివ్యాంక రెడీ అవుతోంది. కలర్ చానల్ లో 'బాక్స్ క్రికెట్ లీగ్'లో మాజీ ప్రియురాలితో కలిసి అతడు కనిపించాడు.