ముంబై : హిందీ సిరియల్ నటి దివ్యాంక త్రిపాఠి తాజాగా ట్రోల్స్ బారిన పడ్డారు. కరోనా వైరస్‌పై దివ్యాంకా చేసిన ఓ ట్వీట్ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. కాగా మహారాష్ట్రలో కరోనా ప్రభావం అధికంగా ఉండటంతో అక్కడి విద్యాసంస్థలు, షాపింగ్‌మాల్స్, థియేటర్లను మూసి వేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడం తగ్గించారు. ఈ క్రమంలో ముంబైలోని ట్రాఫిక్‌ను ఉద్ధేశిస్తూ బుల్లితెర నటి దివ్యాంకా.. కరోనా ప్రభావంతో ముంబై రోడ్లన్నీ ఖాళీ అవుతున్నాయని.. దీని వల్ల మెట్రో, వంతెనలు త్వరగా పూర్తి చేయవచ్చని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు దివ్యాంకా వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. (మరో 250 మంది భారతీయులకు కరోనా)
‘ముంబైలో తక్కువ ట్రాఫిక్ ఉన్నందున మెట్రో, వంతెనలు, రోడ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయడానికి అవకాశం ఏర్పడింది. కరోనా మహ్మమ్మారి పోయే సమయానికి మెట్రో, రోడ్డు పనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తవుతాయని ఆశిస్తున్నా’ అంటూ ఓ వీడియో షేర్ చేశారు. అయితే దివ్యాంకా అభిప్రాయాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. కార్మికులు కూడా మనుషులేనంటూ.. వారికి కూడా ఆరోగ్య భద్రత అవసరమేనని విమర్శిస్తున్నారు. ‘ఇంజనీర్లు, నిర్మాణ కార్మికుల జీవితాలు ముఖ్యం కాదా.. ఈ సమయంలో అవసరం లేని, పనికి రాని ట్వీట్’. అంటూ దివ్యాంకపై విరుచుకుపడుతున్నారు. ఇక తాజాగా దీనిపై స్పందించిన దివ్యాంకా తన తప్పును అంగీకరించారు. ఇలా తప్పుగా ట్వీట్ చేసినందుకు ఆమె క్షమాపణలు కోరారు. అలాగే వెంటనే తన పోస్ట్‌ను డిలీడ్ చేశారు. (దారుణం: కరోనా కరోనా అంటూ విచక్షణారహితంగా..! )
అయితే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న తరువాత దివ్యాంకా మరో ట్వీట్ చేశారు."మనమందరం మనుషులం, సాధారణంగా తప్పులు చేస్తూ ఉంటాం. ఈ హింసాత్మక సోషల్ మీడియా ప్రపంచంలో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే.. ఎవరికైనా క్షమించే సామర్థ్యం ఉందా. ప్రతి విషయాన్ని వివాదంగా ఆలోచిస్తే.. అక్కడ మానవత్వం ఎక్కడ ఉంది?’ అంటూ నెటిజన్ల ట్రోల్స్‌ను గట్టిగా తిప్పికొట్టారు. కాగా ఇటీవల జరిగిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2020లో దివ్యాంకా త్రిపాఠి బెస్ట్ టెలివిజన్ యాక్టర్ అవార్డును దక్కించుకున్న విషయం తెలిసిందే. (కరోనా ఎఫెక్ట్: తాజ్ మహల్ మూసివేత)
Comments
Please login to add a commentAdd a comment