ముంబై/ఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ నాలుగో వేవ్‌పై అధికారిక ప్రకటన లేకపోయినా.. దేశంలో కరోనా కేసులు మాత్రం పెరిగిపోతున్నాయి. తాజాగా ఒక్క మహారాష్ట్రలోనే 3 వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. అదే సమయంలో ఢిల్లీలోనూ 655 కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మహారాష్ట్రలో తాజాగా 3,081 కొత్త కేసులు నమోదు అయ్యాయి. మరణాలు నమోదు కాకపోవడం ఊరట ఇచ్చే అంశం. అలాగే యాక్టివ్ కేసుల సంఖ్య 13, 329కి చేరింది. అదే సమయంలో ముంబైలోనూ కరోనా విజృంభిస్తోంది. తాజాగా రెండు వేలకు చేరువలో కొత్త కేసులు నమోదు అయ్యాయి. బులిటెన్‌లో 1,956 కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర యాక్టివ్ కేసుల సంఖ్యలో ముంబైలనే 9వేల దాకా ఉండడం గమనార్హం.
Maharashtra | 3081 new COVID cases were reported today in the state while 1323 patients were discharged. With zero deaths today, active cases stood at 13,329 pic.twitter.com/d4oUxFF3ee
— ANI (@ANI) June 10, 2022
ఇంకోవైపు ఢిల్లీలోనూ కేసులు కొనసాగుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో 655 కొత్త కేసులు వెలుగు చూశాయి. రెండు మరణాలు నమోదు అయ్యాయి. మరోవైపు తెలంగాణలోనూ కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. తెలంగాణ తాజా బులిటెన్‌లో 155 కేసుల దాకా నమోదు అయ్యాయి. తాజా గణాంకాలతో.. శనివారం కేంద్రం విడుదల చేసే బులిటెన్‌లో కేసులు అత్యధికంగా నమోదు కానున్నాయి.
Delhi reports 655 new #COVID19 cases, 419 recoveries and 2 deaths in the last 24 hours.
— ANI (@ANI) June 10, 2022
Active cases 2008 pic.twitter.com/0rzLDETjar
చదవండి: కరోనా కథ అయిపోలేదు.. డిసెంబర్ వరకు ఇలాగే..: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ
Comments
Please login to add a commentAdd a comment